Presidential election results
-
సింగపూర్ కొత్త అధ్యక్షుడిగా భారత సంతతి షణ్ముగరత్నం
సింగపూర్: భారత సంతతికి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త థర్మన్ షణ్ముగరత్నం(66) సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి ఎన్జీ కోక్ సాంగ్‌పై ఆయన గెలుపొందారు. దేశంలో 2011 తర్వాత అధ్యక్ష ఎన్నికలు జరగడం ఇదే మొదటిసారి. షణ్ముగరత్నంపై ఇద్దరు చైనా సంతతి నాయకులు పోటీకి దిగారు. ఆయన ఏకంగా 70.4 శాతం ఓట్లతో ఘన విజయం సాధించారు. తద్వారా సింగపూర్‌కు తొమ్మిదవ అధ్యక్షుడిగా ఎన్నికైనట్లయ్యింది. ప్రస్తుత అధ్యక్షుడు హలిమా యాకోబ్ పదవీ కాలం సెప్టెంబర్ 13న ముగియనున్నది. అనంతరం థర్మన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆరేండ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. షణ్ముగరత్నం సింగపూర్‌లో జన్మించారు. 2001లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయన పూర్వీకులు తమిళనాడుకు చెందినవారు కావడం విశేషం. ఫాదర్ ఆఫ్ పాథలజీ ఇన్ సింగపూర్‌గా పేరుగాంచిన కే షణ్ముగరత్నం థర్మన్ తండ్రి. -
US presidential election 2020 Case: ట్రంప్ అరెస్ట్.. విడుదల
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ చరిత్ర సృష్టించారు. ఫొటో సహా పోలీసుల రికార్డుల్లోకి ఎక్కిన తొలి మాజీ అధ్యక్షుడయ్యారు. 2020 అధ్యక్ష ఎన్నికల సమయంలో జార్జియాలో ఫలితాల తారుమారుకు యత్నించారన్న ఆరోపణల కేసులో ట్రంప్(77) గురువారం జార్జియాలోని ఫుల్టన్ కౌంటీ జైలులో అధికారుల ఎదుట లొంగిపోయారు. ఈ సమయంలో అధికారులు మగ్ షాట్ తీశారు. అమెరికా చరిత్రలో మాజీ అధ్యక్షుడి మగ్ షాట్ తీయడం ఇదే మొదటిసారి. ఆరడుగుల 3 అంగుళాల ఎత్తు, 97 కిలోల బరువు, స్ట్రాబెర్రీ రంగు జుట్టు, నీలం కళ్లు..అంటూ ట్రంప్ వివరాలను జైలు అధికారులు నమోదు చేశారు. ఆయనకు ఖైదీ నంబర్ పి01135809 కేటాయించారు. 22 నిమిషాల సేపు జైలులో గడిపిన ట్రంప్ రెండు లక్షల డాలర్ల బెయిల్ బాండ్‌పై విడుదలయ్యారు. అంతకుముందు, విమానంలో అట్లాంటా ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ట్రంప్‌ను భారీ బందోబస్తు మధ్య ఫుల్టన్ కౌంటీ కోర్టుకు తీసుకొచ్చారు. ఫెడరల్, రాష్ట్ర అధికారులు నమోదు చేసిన వివిధ నేరారోపణలకు గాను ట్రంప్ ఈ ఏడాదిలో ఇప్పటి వరకు నాలుగుసార్లు లొంగిపోయారు. మగ్ షాట్ తీయడం మాత్రం ఇదే తొలిసారి. మగ్ షాట్ ఫొటోను ట్రంప్ తన సొంత ‘ట్రూత్ సోషల్’తోపాటు ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్ చేశారు. ఎన్నికల్లో జోక్యం..ఎన్నటికీ లొంగను అంటూ వ్యాఖ్యానించారు. ఫుల్టన్ కౌంటీ జైలు అధికారులు విడుదల చేసిన ట్రంప్ మగ్ షాట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. విడుదలైన అనంతరం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. తానెలాంటి తప్పు చేయలేదని చెప్పుకున్నారు. అమెరికాకు ఇది చెడు దినమని వ్యాఖ్యానించారు. -
కోర్టుకు హాజరైన ట్రంప్..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారని అభియోగాలను ఎదుర్కొంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం కోర్టుకు హాజరయ్యారు. ఈ విషయంలో తాను నిర్దోషినని తనకే పాపం తెలీదని చెప్పారు. ఇండియన్ అమెరికన్ మహిళా న్యాయమూర్తి మోక్సిలా ఎ ఉపాధ్యాయ ఎదుట ట్రంప్ హాజరయ్యారు. రాజకీయ ప్రత్యర్థులే ఈ కేసులో ఇరికించారని ట్రంప్ పేర్కొన్నారు. 2020లో జరిగిన ఎన్నికల్లో బైడెన్ విజయం సాధించినప్పటికీ దానిని అధికారికంగా వెల్లడించకుండా 2021 జనవరిలో ట్రంప్ మద్దతుదారులు క్యాపిటల్ భవనంపై దాడికి పాల్పడ్డారంటూ అభియోగాలు నమోదయ్యాయి. ట్రంప్ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య కోర్టు హాలు వెనుక తలుపులోంచి లోపలికి ప్రవేశించారు. ఎవరీ ఉపాధ్యాయ ?: న్యాయమూర్తి మోక్సిలా ఎ ఉపాధ్యాయ గుజరాత్లో జన్మించారు. ఆమె చిన్నతనంలో తల్లిదండ్రులు అమెరికా వెళ్లిపోవడంతో కన్సస్‌లో పెరిగారు. -
ముర్ముకు ఉపరాష్ట్రపతి వెంకయ్య అభినందనలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఢిల్లీలోని ముర్ము తాత్కాలిక నివాసంలో ఆమెను మర్యాదపూర్వకంగా కలిసిన వెంకయ్య నాయుడు 15 నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, జి.కిషన్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు, మత నాయకులు, బ్రహ్మ కుమారీస్ నిర్వాహకులు కూడా ముర్మును కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ముర్ము నివాసంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై కళాకారులు ప్రదర్శనలు ఇచ్చారు. -
Draupadi Murmu: నిరాడంబరతే ఆభరణం
పుట్టింది వెనకబడ్డ ఒడిశా రాష్ట్రంలో. అందులోనూ, దేశంలోకెల్లా అత్యంత వెనకబడ్డ జిల్లాలో. ఎలాంటి సౌకర్యాలకూ నోచని అత్యంత కుగ్రామంలో. అది కూడా అత్యంత వెనకబడిన సంతాల్ గిరిజన కుటుంబంలో. అలా అత్యంత అట్టడుగు స్థాయి నుంచి మొదలైన ద్రౌపదీ ముర్ము జీవన ప్రస్థానం అత్యున్నతమైన రాష్ట్రపతి పీఠం దాకా సాగిన తీరు ఆద్యంతం ఆసక్తికరం. సౌకర్యాల లేమిని అధిగమించడంలో ఎంతటి అసమాన పట్టుదల కనబరిచారో వ్యక్తిగత జీవితంలో ఎదురైన పెను విషాదాలను తట్టుకోవడంలోనూ అంతకు మించిన మనో నిబ్బరం చూపారామె. అన్నింటికీ మించి ఎదిగిన కొద్దీ అంతకంతా ఒదిగుతూ వచ్చారు. వినమ్రతకు పర్యాయ పదంలా నిలిచారు. నెలకు కేవలం 10 రూపాయలతో కాలేజీ జీవితం గడుపుకున్నప్పుడు ఎంత నిరాడంబరంగా ఉన్నారో, 2021లో జార్ఖండ్ గవర్నర్‌గా పదవీ విరమణ చేశాక కూడా అంతే నిరాడంబరత ప్రదర్శించారు. స్వస్థలానికి తిరిగొచ్చి భర్త కట్టించిన సాదాసీదా ఇంట్లోనే మామూలు జీవితం గడిపారు. అంతటి నిగర్వి ముర్ము. జార్ఖండ్ గవర్నర్‌గా కూడా వివాదరహితంగా బాధ్యతలను నిర్వర్తించిన సౌమ్యురాలు. అధికార కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన ఆమెకు విపక్షాల ఓట్లు కూడా గణనీయంగా పడేందుకు గిరిజన నేపథ్యంతో పాటు ఈ ప్రవర్తన కూడా కారణమైంది. ద్రౌపదీ ముర్ము ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా ఉపర్బేడ గ్రామంలో 1958 జూన్ 20వ తేదీన జన్మించారు. ఆమె తండ్రి బిరంచి నారాయణ్ తుడు. పట్టుదలతో స్కూలు చదువు, తర్వాత భువనేశ్వర్‌లో కాలేజీ చదువు పూర్తి చేశారు. తర్వాత జూనియర్ అసిస్టెంట్‌గా జీవితం మొదలు పెట్టారు. స్కూల్ టీచర్‌గా, రాయ్‌రంగాపూర్‌లోని శ్రీ అరబిందో ఇంటెగ్రల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేశారు. 1997లో బీజేపీలో చేరారు. రాయ్‌రంగాపూర్ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2000లో చైర్పర్సన్ అయ్యారు. బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షురాలిగా, తర్వాత బీజేపీ–బీజేడీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. 2015లో జార్ఖండ్ తొలి మహిళా గవర్నర్ అయ్యారు. పేరు: ద్రౌపది ముర్ము పుట్టిన తేదీ: జూన్ 20, 1958 పుట్టిన ఊరు: ఉపర్బేడ, మయూర్భంజ్, ఒడిశా వయస్సు: 64 ఏళ్లు తండ్రి: బిరంచి నారాయణ్ తుడు రాజకీయ పార్టీ: బీజేపీ చదువు: రమాదేవి విమెన్స్ యూనివర్సిటీ నుంచి బీఏ చేపట్టిన పదవులు: జార్ఖండ్ గవర్నర్, ఒడిశా రాష్ట్ర మత్స్య, పశుసంవర్థక, వాణిజ్యం, రవాణా శాఖలు సంతానం: ఇతిశ్రీ ముర్ము (బ్యాంకు ఉద్యోగి) భర్త: శ్యాం చరణ్ ముర్ము (2014లో మృతి) తీరని విషాదాలు... ముర్ము వ్యక్తిగత జీవితంలో తీరని విషాదాలున్నాయి. బ్యాంక్ ఉద్యోగి అయిన శ్యామ్ చరణ్ ముర్మును ఆమె పెళ్లాడారు. వారికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. 2009–15 మధ్య కేవలం ఆరేళ్ల వ్యవధిలో భర్తతో పాటు ఇద్దరు కొడుకులను, తల్లిని, సోదరుడినీ కోల్పోయారు. ఈ విషాదం తనను ఆధ్యాత్మిక బాట పట్టించిందని 2016లో దూరదర్శన్ ఇంటర్వ్యూలో గుర్తుకు తెచ్చుకున్నారు. ‘‘అప్పట్లో పూర్తిగా కుంగిపోయి తీవ్ర డిప్రెషన్లోకి వెళ్లాను. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. అప్పుడే బ్రహ్మకుమారీల ఆశ్రమాన్ని సందర్శించాను. నా కుమార్తె కోసం జీవించాలని నిర్ణయించుకున్నాను’’ అని చెప్పారు. ముర్ము చరిత్ర సృష్టించారు అత్యున్నత పదవికి ఎన్నికైన గిరిజన బిడ్డగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారు. ఆమె గొప్ప రాష్ట్రపతిగా పేరు సంపాదిస్తారు. ఆమె పేదలు, అణగారిన వర్గాల ఆశారేఖగా ఉద్భవించారు. 130 కోట్ల మంది దేశ ప్రజలు ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’జరుపుకుంటున్న వేళ గిరిజన బిడ్డ రాష్ట్రపతి పదవికి ఎన్నిక కావడం గొప్ప విషయం. మారుమూల కుగ్రామంలో జన్మించిన ముర్ము సాధించిన విజయాలు దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకం. ముర్ముకు మద్దతుగా నిలిచిన ఎంపీలు, ఎమ్మెల్యేలకు మోదీ కృతజ్ఞతలు. – ప్రధాని నరేంద్ర మోదీ నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు నా అభినందనలు, శుభాకాంక్షలు. – రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రజా జీవితంలో ద్రౌపది ముర్ము సంపాదించిన అనుభవం, అందించిన నిస్వార్థ సేవలు, ప్రజా సమస్యలకు ఆమెకున్న అవగాహన దేశానికి ఉపయోగడపతాయి. ద్రౌపది ముర్ముకు మనస్ఫూర్తి అభినందనలు. – ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదుపరి రాష్ట్రపతిగా ముర్ము ఎన్నిక దేశానికి గర్వకారణం. ఎన్నో అవాంతరాలు ఎదుర్కొని అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ముర్ముకు అభినందనలు. –హోంమంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ద్రౌపది ముర్ముకు అభినందనలు. దేశాధినేతగా ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను ఆమె కాపాడుతారన్న నమ్మకం ఉంది. – బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నా తండ్రి పీఏ సంగ్మా ఇప్పుడు జీవించి ఉంటే ద్రౌపది ముర్ము విజయాన్ని చూసి ఎంతగానో సంతోషించేవారు. ముర్ముకు నా అభినందనలు. –మేఘాలయ సీఎం కాన్రాడ్ సంగ్మా రాష్ట్రపతి ఎన్నికలో నెగ్గిన ముర్ముకు నా అభినందలు. భయం, పక్షపాతానికి తావులేకుండా రాజ్యాంగ పరిరక్షణకు ఆమె కృషి చేస్తారని ఆశిస్తున్నా. – యశ్వంత్ సిన్హా 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు అభినందనలు. భవిష్యత్తులో మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా. –రాహుల్ గాంధీ -
Draupadi Murmu: గిరిజన ఘన మన... అధినాయకి
న్యూఢిల్లీ: గిరిజన ముద్దుబిడ్డ ద్రౌపదీ ముర్ము కొత్త చరిత్ర లిఖించారు. సంతాల్ ఆదివాసీ తెగకు చెందిన ఆమె భారత 15వ రాష్ట్రపతిగా తిరుగులేని మెజారిటీతో ఎన్నికయ్యారు. తద్వారా దేశ తొలి గిరిజన రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు. స్వాతంత్య్ర అమృతోత్సవ సంబరాలను రెట్టింపు చేశారు. స్వాతంత్య్రానంతరం జన్మించిన తొలి రాష్ట్రపతిగానే గాక ఇప్పటిదాకా ఆ పదవి చేపట్టిన వారిలో అత్యంత పిన్న వయస్కురాలిగా కూడా నిలిచారు. అధికార ఎన్డీఏ తరఫున బరిలో దిగిన ముర్ము గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో దాదాపు మూడింట రెండొంతల మెజారిటీతో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వారసురాలిగా 25వ తేదీ సోమవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రతిభా పాటిల్ తర్వాత ఈ పదవి అధిష్టించనున్న రెండో మహిళ ముర్ము. దేశవ్యాప్తంగానే గాక ప్రపంచం నలుమూలల నుంచీ ముర్ముకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె గొప్ప రాష్ట్రపతిగా నిలుస్తారని, దేశ గౌరవాన్ని సమున్నతంగా నిలుపుతారని ప్రధాని నరేంద్ర మోదీ విశ్వాసం వెలిబుచ్చారు. బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో కలిసి ముర్ము నివాసానికి వెళ్లి ఆమెను అభినందించారు. ఓటమిని అంగీకరిస్తున్నట్టు ప్రత్యర్థి సిన్హా ప్రకటించారు. ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతిగా తనదైన ముద్ర వేస్తారని ఆశాభావం వెలిబుచ్చారు. ప్రతి రౌండూ ముర్ముదే రాష్ట్రపతి ఎన్నికకు జూలై 18న పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఎలక్టోరల్ కాలేజీ సభ్యులైన ఎన్నికైన పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు పార్లమెంట్ హౌస్‌తో పాటు దేశవ్యాప్తంగా తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గురువారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ హౌస్‌లోని 63వ నంబర్ గదిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. తొలుత పార్లమెంటు సభ్యుల ఓట్లు లెక్కించారు. అనంతరం అక్షర క్రమంలో రాష్ట్రాలవారీగా ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించారు. అంతా ఊహించినట్టుగానే కౌంటింగ్ ప్రారంభం నుంచే సిన్హాపై ముర్ము నిర్ణాయక ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చారు. ప్రతి రౌండ్లోనూ దాదాపు మూడింట రెండొతుల ఓట్లతో దూసుకెళ్లారు. మూడో రౌండ్లోనే 50 శాతం ఓట్లు దాటేసి విజయానికి అవసరమైన మెజారిటీ మార్కు సాధించారు. అప్పటికి మరో 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఓట్ల లెక్కింపు మిగిలే ఉంది. చివరిదైన నాలుగో రౌండ్ కౌంటింగ్ ముగిశాక ముర్ము విజయాన్ని చీఫ్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించిన రాజ్యసభ సెక్రెటరీ జనరల్ పీసీ మోదీ అధికారికంగా ప్రకటించారు. ఆమెకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం సర్టిఫికెట్ అందజేయనుంది. ► మొత్తం 776 మంది ఎంపీలు, 4,033 మంది ఎమ్మెల్యేలు కలిపి ఎలక్టోరల్ కాలేజీలో 4,809 మంది సభ్యులున్నారు. వీరిలో4,754 మంది ఓటేశారు. వారి మొత్తం ఓట్ల విలువ 10,72,377. ► వాటిలో ముర్ము 64.03 శాతం ఓట్లు సాధించగా సిన్హా 36 శాతంతో సరిపెట్టుకున్నారు. ముర్ముకు 6,76,803 పోలవగా సిన్హాకు 3,80,177 పడ్డాయి. ► 2,824 మంది ప్రజాప్రతినిధులు ముర్ముకు, 1,877 మంది సిన్హాకు ఓటేశారు. ► 15 మంది ఎంపీలతో పాటు మొత్తం 53 మంది ఓట్లు చెల్లకుండా పోయాయి. ► ఎంపీల ఓట్లలో 540 (72.19 శాతం) ముర్ముకే పడ్డాయి. సిన్హాకు 208 మంది ఓటేశారు. ► గిరిజన బిడ్డ అయిన ముర్ముకు విపక్షాలకు చెందిన పలువురు గిరిజన, ఎస్సీ ప్రజాప్రతినిధులు కూడా జైకొట్టారు. ► 17 మంది ఎంపీలతో పాటు దాదాపు 125 మందికి పైగా విపక్ష ఎమ్మెల్యేలు ముర్ముకు ఓటేసినట్టు తేలింది. ► అస్సాంలో 22 మంది ఎమ్మెల్యేలు, మధ్యప్రదేశ్‌లో 20, మహారాష్ట్రలో 16, గుజరాత్లో 10, జార్ఖండ్‌లో 10, బిహార్‌లో 6,, ఛత్తీస్‌గఢ్‌లో 6, గోవాలో నలుగురు చొప్పున విపక్ష ఎమ్మెల్యేలు ముర్ముకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ చేశారు. ► ముర్ముకు యూపీ, మహారాష్ట్ర, ఏపీల నుంచి ఆమెకు అత్యధిక ఓట్లు వచ్చాయి. సిన్హాకు పశ్చిమబెంగాల్, తమిళనాడు నుంచి అత్యధిక ఓట్లు పడ్డాయి. ► ఆంధ్రప్రదేశ్, సిక్కింలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలంతా, నాగాలాండ్‌లో మొత్తం ఎమ్మెల్యేలూ ముర్ముకే ఓటేయడం విశేషం! ► కేరళ నుంచి దాదాపుగా అన్ని ఓట్లూ సిన్హాకే పడ్డాయి. -
రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం
-
రూం నెం.63లో మిస్టర్ బాలెట్ బాక్స్
ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల నేపథ్యంలో దేశమంతా సర్వత్రా ఆసక్తి నెలకొంది. ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హాలలో ఎవరు నెగ్గుతారనేదానిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఈ క్రమంలో.. పార్లమెంట్ రూం నెంబర్ 63 వద్ద భద్రత కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారు. ► పార్లమెంట్ హౌజ్‌తో సహా దేశంలోని మొత్తం 31 ఓటింగ్ కేంద్రాల నుంచి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు మంగళవారం సాయంత్రం కల్లా పార్లమెంట్‌కు చేరుకున్నాయి. ► ఈ బ్యాలెట్ బాక్సులను ‘మిస్టర్ బాలెట్ బాక్స్’గా పిలుస్తుంటారు. ► రూమ్ నెంబర్ 63 పార్లమెంట్ స్ట్రాంగ్ రూమ్. అందుకే ఈ గదిలోనే మిస్టర్ బాలెట్ బాక్స్‌ను ఉంచారు. ఇక్కడే ఉదయం 11 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ మొదలవుతుంది. కాబట్టి, ఆ రూమ్‌ను, చుట్టుపక్కల ప్రాంతాన్ని సైలెంట్ జోన్‌గా ప్రకటించారు. ► రాజ్యసభ సెక్రెటరీ జనరల్ పీసీ మోదీ.. రాష్ట్రపతి ఎన్నికలకు చీఫ్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించారు. కాబట్టి, ఆయన ఆధ్వర్యంలోనే కౌంటింగ్ మొదలవుతుంది. ► ముందుగా ఎంపీల ఓట్లను లెక్కిస్తారు. ఆపై రాజ్యసభ సెక్రెటరీ దగ్గరుండి ట్రెండ్‌ను ప్రకటిస్తారు. ఆ తర్వాతే ఆల్ఫాబెట్ క్రమంలో రాష్ట్రాల ఓట్లను లెక్కిస్తారు. మళ్లీ ఒకసారి ట్రెండ్ మధ్యలో చెప్తారు. చివరాఖరికి రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలను.. విజేతను ప్రకటిస్తారు. ► ప్రతీ బ్యాలెట్ బాక్స్‌కు ‘మిస్టర్ బాలెట్ బాక్స్’ కింద ఈ-టికెట్ జారీ చేస్తుంది ఎన్నికల సంఘం. ► రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసేది ఎంపీలు, ఎమ్మెల్యేలు. కానీ, వాళ్లంతా ప్రజాప్రతినిధులై ఉండాలి. అంటే.. నామినేటెడ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఓటు హక్కు ఉండదన్నమాట. ► ఈసారి ఎన్నికల్లో దాదాపు 99 శాతం మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారని ఈసీ వెల్లడించింది. ► మొత్తం 4,809 ఎలక్టోర్స్.. 778 ఎంపీలు, ,4,033 ఎమ్మెల్యేలు ఓటేశారు. అనారోగ్యంతో కొందరు ఓటేయలేదు. ► గత రాష్ట్రపతి ఎన్నికల్లో మొత్తం 10,69,358 ఓట్లకుగానూ రామ్‌నాథ్ కోవింద్‌కు 7,02,044 ఓట్లు పోలయ్యాయి. ప్రత్యర్థి మీరా కుమార్‌కు 3,67,314 ఓట్లు వచ్చాయి. -
Droupadi Murmu: ముర్ము కోసం ఆ ఊరిలో పండుగ
ఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ కోసం సర్వం సిద్ధమైంది. భారత దేశానికి పదిహేనవ రాష్ట్రపతి ఎవరు అవుతారనే సస్పెన్స్ మరికొన్ని గంట్లలో వీడిపోతుంది. బరిలో ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హా ఉండగా.. విజయావకాశాలు ముర్ముకే ఎక్కువగా కనిపిస్తున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఈ క్రమంలో.. దేశవ్యాప్తంగా సంబురాలకు ఎన్డీయే కూటమి సిద్ధమవుతోంది. పలు రాష్ట్రాల్లో విజయోత్సవాలకు బీజేపీ అంతా సిద్ధం చేసింది. తీపి వంటకాలు, ప్రత్యేక నృత్యాల కార్యక్రమాలకు ఏర్పాటు చేసింది కూడా. అయితే ద్రౌపది ముర్ము స్వగ్రామం ఒడిశా రాయ్రంగ్పూర్లో మాత్రం పండుగ వాతావరణం కాస్తంత ఎక్కువే నెలకొంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం ఖాయమని భావిస్తోంది రాయ్‌రంగ్‌పూర్ గ్రామం. అందుకే 20వేలకు పైగా స్పెషల్ లడ్డూలు తయారు చేయించారు ఆ ఊరి పెద్దలు. అంతేకాదు.. కోయ డ్యాన్సులతో బాణాసంచాలతో సంబురాలకు సర్వం సిద్ధం చేశారు. ఇక ఆమె చదివిన పాఠశాలలో కోలాహలం మామూలుగా లేదు. ఆమె దేశానికి సేవ చేసే అవకాశం రావడం గర్వంగా ఉందని ఆ స్కూల్ మాజీ హెడ్ మాస్టర్, ముర్ముకు పాఠాలు నేర్పిన బిశ్వేశ్వర్ మోహంతి తెలిపారు. తమ స్కూల్లో చదివి రాష్ట్రపతి కాబోతున్నందుకు విద్యార్థులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకుని చదువుతామంటూ చెప్తున్నారు వాళ్లలో కొందరు. ద్రౌపది ముర్ము గనుక విజయం సాధిస్తే.. దేశానికి తొలి గిరిజన రాష్ట్రపతిగా నిలుస్తారు. Odisha | Locals in Rairangpur prepare laddu ahead of the counting of votes for the Presidential election tomorrow. NDA's Presidential candidate Droupadi Murmu resides in Rairangpur. pic.twitter.com/vMhLQwfuGe — ANI (@ANI) July 20, 2022 ఇదిలా ఉంటే.. జులై 18వ తేదీన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ జరగ్గా.. ఇవాళ(గురువారం) పార్లమెంట్ హౌజ్‌లోని రూం నెంబర్ 63లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులు ఇక్కడికి చేరుకున్నాయి. కౌంటింగ్ నేపథ్యంలో రూమ్ నెంబర్ 63ని సైలెంట్ జోన్‌గా ప్రకటించారు కూడా. రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి -
Presidential Election 2022: ద్రౌపది ముర్ము ఘన విజయం
Presidential Election 2022 Result Live: అప్డేట్స్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. 07:50 మూడో రౌండ్లోనూ ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉన్నారు. మూడు రౌండ్లలో కలిపి ఆమె సగానికి పైగా ఓట్లు సాధించారు. ద్రౌపది ముర్ముకు 5,77,777 ఓట్ల విలువ యశ్వంత్ సిన్హాకు 2,61, 062 ఓట్ల విలువ పోలైంది. 05:30 రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము భారీ అధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్లోనూ ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్లో పది రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓట్లను లెక్కించారు. 1,138 ఓట్లు చెల్లుబాటు కాగా.. వాటి మొత్తం విలువ 1,49,575.. ఇందులో ద్రౌపది ముర్ముకు1,05,299 విలువగల 809 ఓట్లు. యశ్వంత్ సిన్హాకు 44,276 విలువ గల 329 ఓట్లు పడ్డాయి. ద్రౌపది ముర్ముకు పోలైన ఓట్లు చూస్తుంటే అంచనాలకు మించి మెజార్జీతో గెలిచే అవకాశం కనిపిస్తోంది.. 75 శాతానికిపైగా ఓట్లు సాధించనున్నట్లు తెలుస్తోంది. రాత్రి 8 గంటల వరకు ఓట్ల లెక్కింపు కొనసాగే అవకాశం ఉంది 03: 00PM రాష్ట్రపతి ఎన్నికలో ఎంపీ ఓట్ల లెక్కింపు ముగిసింది. కాసేపట్లో ఎమ్మెల్యేల ఓట్లు లెక్కించనున్నారు. ద్రౌపది ముర్ముకు 62 శాతానికి పైగా ఓట్లు రావచ్చని అంచనా వేస్తున్నారు. 02: 50PM రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి రౌండ్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 540 ఎంపీ ఓట్లు రాగా.. సిన్హాకు 208 ఎంపీ ఓట్లు పడ్డాయి. ఓటు విలువ ముర్ముకు 3,78,00 ఉండగా , యశ్వంత్ సిన్హాకు 1,45,600 గా ఉంది. చెల్లని ఎంపీ ఓట్లు 15గా తేలాయి. మొత్తం 4809 ఓటర్లలో 776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సోమవారం జరిగిన ఎన్నికలో దాదాపు 99 శాతం మంది ఓటేశారు. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా పోటీపడిన విషయం తెలిసిందే. కాగా ముర్ముకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 1:50PM కొనసాగుతున్న రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు 11:00AM రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం పార్లమెంట్ భవనంలో మొదలైన కౌంటింగ్ రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు దేశానికి 15వ రాష్ట్రపతి ఎవరవుతారో మరికొద్దిసేపట్లో తేలిపోనుంది. రాష్ట్రపతి ఎన్నికలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. పార్లమెంట్ హౌస్‌లోని 63వ నంబర్ గదిలో గురువారం ఉదయం 11 గంటలకు లెక్కింపు ప్రారంభం అయ్యింది. అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్ బాక్సులను పార్లమెంట్ హౌస్‌లో లెక్కిస్తున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24న ముగియనుంది. నూతన రాష్ట్రపతి ఈ నెల 25న ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు యశ్వంత్ సిన్హా పోటీ చేసిన సంగతి తెలిసిందే. ముర్ము విజయం సాధించడం లాంఛనమేనని రాజకీయ పండితులు తేల్చిచెబుతున్నారు. -
పోరాటం ముగియలేదు: ట్రంప్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై తన పోరాటం ఇంకా ముగియలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. స్వింగ్ స్టేట్స్లో అక్రమాలకు సంబంధించి ట్రంప్ తరఫున వేసిన ఒక వ్యాజ్యాన్ని తాజాగా సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో ఆయన ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అందువల్లనే తాను ఓడిపోయానని ట్రంప్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. పెన్సిల్వేనియా, మిషిగన్, జార్జియాల్లో తానే గెలిచానని ట్రంప్ వాదిస్తున్నారు. ‘అమెరికా చరిత్రలోనే అత్యంత అవినీతిమయ ఎన్నికలు’ అని ఆదివారం ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. ‘ఇంత అవినీతి, ఇన్ని అక్రమాలు జరిగిన ఎన్నికల్లో ఫలితాలను ఎలా నిర్ధారిస్తారు?’ అని మరో ట్వీట్లో ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాలను కోర్టుల్లో సవాలు చేసేందుకు వీలైన సమయం తన బృందానికి లభించలేదని ఒక ఇంటర్వ్యూలో ఆరోపించారు. ‘మాకు చాలా తక్కువ సమయం ఇచ్చారు. అయినా, మేం వదల్లేదు. చాలా అక్రమాలను వెలికితీసాం’ అని వ్యాఖ్యానించారు. చనిపోయిన వారి పేరుపై కూడా ఓట్లు వేశారని ఆరోపించారు. మరోవైపు ట్రంప్‌కు మద్దతుగా వారాంతంలో ఆయన మద్దతుదారులు వాషింగ్టన్లో నిరసన ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ట్రంప్ మద్దతుదారులకు, ట్రంప్‌ను వ్యతిరేకించేవారికి మధ్య శనివారం సాయంత్రం చెదురుముదురు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘర్షణలకు సంబంధించి 23 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైట్‌హౌస్‌ని శానిటైజ్ చెయ్యండి.. వైట్‌హౌస్‌ను పరిశుభ్రంగా శానిటైజ్ చెయ్యాలని కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ అధికారులకి ఆదేశాలు జారీ చేశారు. అధ్యక్షుడు ట్రంప్ తన వ్యక్తిగత సిబ్బందితో వైట్ హౌస్ వీడడానికి, బైడెన్ ప్రమాణ స్వీకారం చేశాక రావడానికి మధ్య అయిదు గంటల సమయం ఉంటుందని, ఆ సమయంలోనే వైట్‌హౌస్ అంతా పరిశుభ్రం చేయాలంటూ బైడెన్ ఆదేశించారని వైట్‌హౌస్ అధికారి కేట్ ఆండర్సన్ బ్రోయర్ వెల్లడించారు. -
నేడే యూఎస్ ఎలక్టోరల్స్ సమావేశం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా నవంబర్ ఎన్నికలో గెలుపొందిన ఎలక్టోరల్స్ సోమవారం సమావేశమై అధినేతను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే ఎలక్టోరల్స్‌లో మెజార్టీ వచ్చినందున డెమొక్రాటిక్ అ«భ్యర్థి జో బైడెన్ ఎంపిక లాంఛనమేనని నిపుణులు భావిస్తున్నారు. ఒకపక్క ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తానే విజేతనంటూ పట్టిన పట్టు వీడకపోవడం, ఎలక్టోరల్స్‌ను తనకే ఓట్ వేయాలని కోరడం, సుప్రీంకోర్టును ఆశ్రయించినా నిరాశ ఎదురవడం, రాజధానిలో వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు చేరడం వంటి పరిస్థితుల్లో ఎలక్టోరల్ కాలేజీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఎలక్టోరల్ కాలేజీ అంటే..? అమెరికాలో ప్రతీ రాష్ట్రానికి జనాభా ఆధారంగా ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల్ని కేటాయిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాపులర్ ఓట్లు ఎన్ని వచ్చినప్పటికీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వారే అధ్యక్ష పీఠం దక్కించుకుంటారు. బ్యాలెట్ పత్రాల ద్వారా అధ్యక్షుడు, ఉపాధ్యక్షులకు ఓటు వేస్తారు. దేశం మొత్తమ్మీద 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉంటే 270, అంత కంటే ఎక్కువ వచ్చిన వారే విజేత. ఈ సారి బైడెన్‌కు 306 ఓట్లు, ట్రంప్ 232 ఓట్లు వచ్చాయి. అధ్యక్షుడిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల్ని డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీలే నామినేట్ చేస్తాయి. వారి ఎంపిక విధానం ప్రతీ రాష్ట్రానికి మారిపోతుంది. ఓటు ఎవరికి వేయాలి ? ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ తమ రాష్ట్రంలో అత్యధికంగా పాపులర్ ఓట్లు సాధించిన అభ్యర్థికే వారు ఓటు వేసి తీరాలి. ఎవరైనా అలా ఓటు వెయ్యడానికి నిరాకరిస్తే వెంటనే పార్టీకి ఆ ప్రతినిధిని మార్చే అధికారం ఉంటుంది. 2016 ఎన్నికల్లో ఏకంగా 10 మంది ప్రతినిధులు ఇతర పార్టీ అభ్యర్థికి ఓటు వెయ్యడానికి ప్రయత్నాలు చేసినా అవి కొనసాగలేదు. ఈ సారి కూడా అలా ఎవరైనా మొరాయిస్తారేమోరేనన్న ఉత్కంఠ నెలకొంది. వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా నవంబర్ ఎన్నికలో గెలుపొందిన ఎలక్టోరల్స్ సోమవారం సమావేశమై అధినేతను ఎన్నుకోనున్నారు. ఇప్పటికే ఎలక్టోరల్స్‌లో మెజార్టీ వచ్చినందున డెమొక్రాటిక్ అ«భ్యర్థి జో బైడెన్ ఎంపిక లాంఛనమేనని నిపుణులు భావిస్తున్నారు. ఒకపక్క ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తానే విజేతనంటూ పట్టిన పట్టు వీడకపోవడం, ఎలక్టోరల్స్‌ను తనకే ఓట్ వేయాలని కోరడం, సుప్రీంకోర్టును ఆశ్రయించినా నిరాశ ఎదురవడం, రాజధానిలో వేలాది మంది ట్రంప్ మద్దతుదారులు చేరడం వంటి పరిస్థితుల్లో ఎలక్టోరల్ కాలేజీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఎలక్టోరల్ కాలేజీ అంటే..? అమెరికాలో ప్రతీ రాష్ట్రానికి జనాభా ఆధారంగా ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల్ని కేటాయిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పాపులర్ ఓట్లు ఎన్ని వచ్చినప్పటికీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వారే అధ్యక్ష పీఠం దక్కించుకుంటారు. బ్యాలెట్ పత్రాల ద్వారా అధ్యక్షుడు, ఉపాధ్యక్షులకు ఓటు వేస్తారు. దేశం మొత్తమ్మీద 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉంటే 270, అంత కంటే ఎక్కువ వచ్చిన వారే విజేత. ఈ సారి బైడెన్‌కు 306 ఓట్లు, ట్రంప్ 232 ఓట్లు వచ్చాయి. అధ్యక్షుడిని ఎన్నుకునే ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల్ని డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీలే నామినేట్ చేస్తాయి. వారి ఎంపిక విధానం ప్రతీ రాష్ట్రానికి మారిపోతుంది. ఓటు ఎవరికి వేయాలి ? ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఏ పార్టీకి చెందిన వారైనప్పటికీ తమ రాష్ట్రంలో అత్యధికంగా పాపులర్ ఓట్లు సాధించిన అభ్యర్థికే వారు ఓటు వేసి తీరాలి. ఎవరైనా అలా ఓటు వెయ్యడానికి నిరాకరిస్తే వెంటనే పార్టీకి ఆ ప్రతినిధిని మార్చే అధికారం ఉంటుంది. 2016 ఎన్నికల్లో ఏకంగా 10 మంది ప్రతినిధులు ఇతర పార్టీ అభ్యర్థికి ఓటు వెయ్యడానికి ప్రయత్నాలు చేసినా అవి కొనసాగలేదు. ఈ సారి కూడా అలా ఎవరైనా మొరాయిస్తారేమోరేనన్న ఉత్కంఠ నెలకొంది. జనవరి 6న కాంగ్రెస్ ఉభయ సభల సమావేశంలో ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను లెక్కిస్తారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ ఓటింగ్‌పై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేస్తే ప్రతినిధుల సభ, సెనేట్ ప్రత్యేకంగా సమావేశమై చర్చిస్తుంది. ఆ తర్వాత విజేతను ప్రకటిస్తారు. కొత్త అధ్యక్షుడు జనవరి 20న ప్రమాణ స్వీకారం చేస్తారు. -
వైట్‌హౌస్ నుంచి వెళ్లాల్సిందే
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌ను వీడి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అ««ధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆయనకి ఎదురు దెబ్బ తగిలింది. జార్జియా, మిషిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల్ని నిలిపివేయాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు శామ్యూల్ అలిటో, క్లారెన్స్ థామస్‌లు శుక్రవారం కొట్టేశారు. అవకతవకలు జరిగాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. సోమవారం సమావేశం కానున్న ఎలోక్టరల్ కాలేజీ బైడెన్‌ను ఎన్నుకుంటే ఇక ట్రంప్ వైట్‌హౌస్‌ను వీడాల్సి ఉంటుంది. దేశాన్నే ఇరుకున పెట్టారు : ట్రంప్ సుప్రీం కోర్టు తీర్పు దేశాన్నే ఇరుకున పెట్టేలా ఉందంటూ ట్రంప్ మండిపడ్డారు. ఇలాంటి తీర్పు ఇవ్వడం న్యాయాన్ని అవమానిం చడమేనన్నారట్వీట్ చేశారు. వ్యాక్సినేషన్‌కు సర్వం సిద్ధం అగ్రరాజ్యంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అనుమతి ఇవ్వడంతో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ‘‘తొమ్మిది నెలల్లో సురక్షితమైన, సామర్థ్యమైన వ్యాక్సిన్‌ను రూపొందించాం’’ అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని నిర్మూలించే రోజులు దగ్గర పడుతున్నాయన్న ట్రంప్ ఈ వ్యాక్సిన్ లక్షలాది మందికి ప్రాణం పోస్తుందని అన్నారు. వ్యాక్సిన్ వినియోగానికి ఎఫ్‌డీఏ అనుమతినివ్వడం తనని ఉద్వేగానికి గురి చేసిందని ట్రంప్ అన్నారు. వ్యాక్సిన్‌పై విశ్వాసం ఉంచండి: బైడెన్ కరోనా వ్యాక్సిన్‌పై ఎలాంటి సందేహాలు పెట్టుకోనక్కర్లేదని, పూర్తి విశ్వాసంతో వ్యాక్సిన్ వేయించుకోవాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు లోను కాకుండా శాస్త్రవేత్తలు నాణ్యమైన టీకాను రూపొందించారని చెప్పారు. ఎఫ్‌డీఏ కమిషనర్ డాక్టర్ స్టీఫెన్ హన్పై వైట్‌హౌస్ ఒత్తిడి తీసుకురావడంతో ఫైజర్‌కు అనుమతులు లభించాయన్న ఆరోపణలున్న నేపథ్యంలో బైడెన్ వ్యాక్సిన్‌పై ఎలాంటి అనుమానాలు ఉండక్కర్లేదన్నారు. కరోనాతో అతలాకుతలమవుతున్న దేశాన్ని అన్ని విధాల ఆదుకోవడానికి శాస్త్రవేత్తలు ఎంతో శ్రమకోర్చి ఈ వ్యాక్సిన్‌ను రూపొందించారని చెప్పారు. వ్యాక్సిన్ తయారీలో పాల్గొన్న వారందరినీ అభినందించారు. -
భారతీయ అమెరికన్ మహిళకు కీలక పదవి
వాషింగ్టన్/మంగళూరు: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ భారతీయ అమెరికన్ మహిళకు కీలక బాధ్యతలు అప్పగించారు. కాబోయే ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా మాలా అడిగ(47)ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. విద్యా సంబంధ విషయాల్లో కాబోయే ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు మాలా సహకరిస్తారు. ప్రస్తుతం ఆమె బైడెన్ 2020 ప్రచార కార్యక్రమానికి సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా, బైడెన్‌కు సీనియర్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. మాలా గతంలో బైడెన్ ఫౌండేషన్‌కు హయ్యర్ ఎడ్యుకేషన్, మిలటరీ ఫ్యామిలీస్ విభాగం డైరెక్టర్‌గా పనిచేశారు. అంతకుముందు, ఒబామా హయాంలో ఎడ్యుకేషనల్, కల్చరల్ బ్యూరోలో డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఫర్ స్టేట్ హోదాలో బాధ్యతలు నిర్వర్తించారు. మరికొన్ని కీలక నియామకాలను కూడా బైడెన్ శనివారం ప్రకటించారు. యూనివర్సిటీ ఆఫ్ షికాగో లా స్కూల్లో జూరిస్ డాక్టర్ డిగ్రీ, మిన్నెసొటా యూనివర్సిటీలో పబ్లిక్ హెల్త్‌లో పీజీ చేశారు. అయెవాలోని గ్రిన్నెల్ కాలేజీలో స్పానిష్‌లో బీఏ డిగ్రీ చదివారు. ఉడుపిలో మూలాలు: జిల్ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా మాలా అడిగను నియమించడంపై ఆమె సొంత రాష్ట్రం కర్ణాటక ఉడుపి జిల్లా కక్కుంజే గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు. వాస్క్యులర్ సర్జన్లో నైపుణ్యాలు పెంచుకునేందుకు ఆమె అమెరికా వెళ్లారు. మాలా తల్లిదండ్రులు డాక్టర్ రమేశ్ అడిగ, డాక్టర్ జయ అడిగ. రమేశ్ కుటుంబానికి చెందిన సూర్యనారాయణ కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్‌ను స్థాపించగా, అరవింద్ అడిగ 2008 మ్యాన్ బుకర్ ప్రైజ్ విజేతగా నిలిచారు. మాలాకు భర్త చార్లెస్, కుమార్తె ఆషా ఉన్నారు. గత ఏడాది బెంగళూరులోని జరిగిన కార్యక్రమానికి మాలా కుటుంబంతో కలిసి హాజరయ్యారని ఆమె మేనత్త నిర్మలా ఉపాధ్యాయ్ తెలిపారు. అమెరికా అధ్యక్ష భవనంలో సీనియర్ స్టాఫర్‌గా నియామకం కాబోతున్నట్లు శనివారం మాలా తనకు తెలిపినట్లు నిర్మలా చెప్పారు. బబ్బరిఅనకట్టే గ్రామంలోని పూర్వీకుల ఇంటిని ఆమె సందర్శించారనీ, కక్కుంజే గ్రామంలోని ఆలయంలో పూజలు చేశారన్నారు. -
అధికార మార్పిడికి అడ్డంకులు
మొండివాడు రాజుకంటే బలవంతుడు ఈ సామెత డొనాల్డ్ ట్రంప్‌కి అతికినట్టుగా సరిపోతుంది ట్రంప్ పట్టిన పట్టు వీడడం లేదు. అధికార మార్పిడికి అంగీకరించడం లేదు తానే గెలిచానని పూటకో ప్రకటన చేస్తున్నారు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కోర్టు తలుపులు తట్టారు అధికారాల అప్పగింత సజావుగా సాగకపోతే అమెరికాపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇప్పుడిదే చర్చ జరుగుతోంది. వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, తానే గెలిచానంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చేస్తున్న ప్రకటనలతో అధికార బదలాయింపు ప్రక్రియపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. అ«ధికార మార్పిడికి అంగీకరించకుండా మొండిగా వ్యవహరిస్తున్న ట్రంప్ ఎన్నికలు భద్రంగా, పారదర్శకంగా జరిగాయని పేర్కొన్న ఎన్నికల అధికారి క్రిస్టోఫర్ క్రెబ్స్‌ను సస్పెండ్ చేశారు. కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ కాలం గడిపేస్తున్నారు. అధ్యక్షుడి ఎన్నికను జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ (జీఎస్ఏ) అధికారికంగా గుర్తించాలి. అప్పుడే అధికారాల బదలాయింపు ప్రారంభమవుతుంది. ట్రంప్ ఓటమి అంగీకరించకపోవడంతో ఆ విభాగం చీఫ్‌ఎమిలి మర్ఫీ అధికార మార్పిడికి సంబంధించిన పత్రాలపై సంతకాలు చేయలేదు. దీంతో ఈ ప్రక్రియ మరింత జటిలంగా మారింది. అమెరికాలో ఫలితాలు వెలువడ్డాక కాబోయే అధ్యక్షుడి దగ్గరకు ప్రస్తుత అధ్యక్షుడు స్వయంగా వెళ్లి అభినందించి వస్తారు. అప్పట్నుంచే అధికార మార్పిడి మొదలవుతుంది. ట్రంప్ ఏం చేస్తారు ? ఎన్నికల్లో బైడెనే గెలిచినప్పటికీ వచ్చే ఏడాది జనవరి 20 వరకు ట్రంపే అధ్యక్షుడిగా కొనసాగుతారు. అందుకే ఆయన ఎవరి మాటా వినడం లేదు. కరోనా విజృంభణతో దేశ ఆర్థిక, ఆరోగ్య వ్యవస్థలు కునారిల్లాయి. పలు ఉగ్ర సంస్థలు అమెరికాపై గురి పెట్టి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ట్రంప్ అధికార మార్పిడికి సహకరించాలని రిపబ్లికన్ పార్టీలోనూ డిమాండ్లు వినిపిస్తున్నాయి. ట్రంప్ ఇంకా కాలయాపన చేస్తే కరోనా మరణాలు పెరిగిపోతాయని బైడెన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పన్ను ఎగవేత, పరువు నష్టం కేసులు ఉండడంతో ట్రంప్ దిగిరాక తప్పదని డెమొక్రట్లు ధీమాగా ఉన్నారు. యంత్రాంగం కసరత్తు సంక్లిష్టం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన వారు పాలనా యంత్రాంగంపై పట్టు సాధిం చడం సంక్లిష్టంగా సాగే ప్రక్రియ. అందుకు రాజ్యాంగం వారికి రెండు 3 నెలలు గడువు ఇచ్చింది. ప్రభుత్వంలో 100కి పైగా ఆపరేటింగ్ ఏజెన్సీలు, వాటికి సబ్ ఏజెన్సీలు ఉన్నాయి. వాటి పనితీరుని కొత్త అధ్యక్షుడు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రెసిడెన్షియల్ ట్రాన్సిషన్ యాక్ట్ ప్రకారం కాబోయే అధ్యక్షుడి బృందానికి, కార్యాలయానికి అవసరమైన స్థలం కేటాయించాలి. 4 వేల రాజకీయ పదవుల్ని భర్తీ చేయాలి. వాటిలో 1,200 పదవులకు సెనేట్ ఆమోద ముద్ర పడాలి. ప్రభుత్వ యంత్రాంగం కూర్పుకి కావల్సిన కోటి డాలర్ల నిధులు ఇవ్వాలి. ఇవన్నీ జరగకుంటే జాతీయ భద్రతకి, ప్రజా జీవనానికి పెను సవాళ్లు ఎదురవుతాయని సెంటర్ ఫర్ ప్రెసిడెన్షియల్ ట్రాన్సిషన్ డైరెక్టర్ మాక్స్ అభిప్రాయపడ్డారు. అధికార మార్పిడిలో జాప్యంతోనే 9/11 దాడులు ? అమెరికాపై 2001, సెప్టెంబర్ 11 దాడులకి ప్రధాన కారణం అధికార బదలాయింపులో జాప్యమేనని దాడులపై ఏర్పాటైన కమిషన్ గట్టిగా చెప్పింది. 2000 ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి అల్ గొరె, రిపబ్లికన్ అభ్యర్థి జార్జ్ డబ్ల్యూ బుష్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఫ్లోరిడా ఫలితంపై వివాదం నెలకొనడంతో అధికార మార్పిడి ప్రక్రియ ఆలస్యమైంది. జాతీయ భద్రతకు సంబంధించి ముఖ్యమైన అధికారుల్ని నియమించడంలో బుష్ ప్రభుత్వానికి తగినంత సమయంలో లేకపోవడం వల్లే 2001, సెప్టెంబర్ 11న దాడులు జరిగాయని కమిషన్ విశ్లేషించింది. -
బైడెన్ గెలుపును ఇకనైనా ఒప్పుకో..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ ఘన విజయం సాధించారని, ఈ ఫలితాన్ని ఇక ఎవరూ మార్చలేరని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తేల్చిచెప్పారు. ఎన్నికల్లో ఓడిపోయిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన పంతాన్ని వీడాలని సూచించారు. బైడెన్ గెలుపును ఒప్పుకోవాల్సిన సమయం వచ్చిందని హితవు పలికారు. బైడెన్ గెలుపును అధికారికంగా అంగీకరించకుండా ట్రంప్ మొండికేస్తున్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, అందుకే తాను ఓడిపోయానని ఆరోపిస్తున్నారు. న్యాయ పోరాటం సాగిస్తానని ప్రకటించారు. ఎన్నికల్లో బైడెన్ గెలిచారన్న విషయం ఇప్పటికే స్పష్టమైందని ఒబామా తాజాగా వ్యాఖ్యానించారు. -
ఎన్నికల్లో నేనే గెలిచాను
వాషింగ్టన్: ఓటమిని అంగీకరించబోనని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడడం ప్రారంభమైనప్పటి నుంచీ, ఎన్నికల్లో, కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వచ్చిన ట్రంప్.. రెండు రోజుల క్రితం మాత్రం ఒక్కసారి ఓడిపోయినట్లు అంగీకరించారు. తాజాగా సోమవారం మళ్లీ, ‘నేనే గెలిచాను’ అని ట్వీట్ చేశారు. అధికార వర్గాలు ఎన్నికల ఫలితాలను మరోలా చెబుతున్నాయని పేర్కొంటూ ట్విట్టర్ ఈ ట్వీట్‌ను తప్పుబట్టింది. మెజారిటీకి అవసరమైనవి 270 ఎలక్టోరల్ ఓట్లు కాగా.. ఈ ఎన్నికల్లో బైడెన్‌కు 306, ట్రంప్‌నకు 232 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయని యూఎస్ ప్రధాన మీడియా పేర్కొంది. ట్రంప్ ఓటమిని ఖాయం చేసిన పెన్సిల్వేనియాతో పాటు నెవాడ, మిషిగన్, జార్జియా, అరిజోనాల్లో ఎన్నికల ఫలితాలను సవాలు చేస్తూ కోర్టులో కేసులు వేశారు. విస్కాన్సిన్‌లోనూ రీకౌంటింగ్ చేపట్టాలని డిమాండ్ చేశారు. అయితే, తన ఆరోపణలను రుజువుచేసే ఎలాంటి ఆధారాలను కూడా ట్రంప్ చూపడం లేదు. -
ట్రంప్ మద్దతుదారుల హింసాకాండ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారీగా అక్రమాలు జరిగాయని, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌నకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ వేలాది మంది ఆయన మద్దతుదారులు, అభిమానులు వీధుల్లోకి వచ్చారు. వాషింగ్టన్ శివార్లలో మిలియన్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (మాగా) మార్చ్ పేరిట నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకున్నారు. అధ్యక్షుడిగా మళ్లీ ట్రంప్ గెలిచినట్లు ప్రకటించాలని నినాదాలు చేశారు. మరో నాలుగేళ్లు ట్రంప్, ఎన్నికల దొంగతనం ఆపండి అంటూ నినదించారు. ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. జో బైడెన్ వర్గీయులపై హింసాకాండకు పాల్పడ్డారు. నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తన ఓటమిని ట్రంప్ ఇంకా అంగీకరించడం లేదు. శనివారం ట్రంప్ మద్దతుదారులు ఫ్రీడం ప్లాజా నుంచి నిరసన ర్యాలీ ప్రారంభించారు. రాత్రి దాకా శాంతియుతంగానే ఉన్నప్పటికీ తర్వాత సహనం కోల్పోయారు. బైడెన్ మద్దతుదారులతో ఘర్షణకు దిగారు. వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌కు కొంత దూరంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ట్రంప్ అభిమానుల దాడిలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. నల్లజాతి ప్రజల హక్కుల ఉద్యమ కార్యకర్త అయిన అతడిని వెనుకనుంచి కత్తితో పొడిచారు. అధికారులు యువకుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ట్రంప్ అభిమానుల దాడిలో మరో ఇద్దరు పోలీసు అధికారులు సైతం గాయపడ్డారు. ట్రంప్, బైడెన్ మద్దతుదారులు కొన్ని నిమిషాలపాటు ఒకరినొకరు కొట్టుకున్నారు. ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేశాక పరిస్థితి అదుపులోకి వచ్చింది. బైడెన్ అభిమానులు సైతం ట్రంప్ మద్దతుదారులపై కోడిగుడ్లు విసిరినట్లు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది. ట్రంప్‌నకు సంబంధించిన ప్రచార సామగ్రిని వారు దహనం చేసినట్లు తెలిపింది. ట్రంప్, బైడెన్ వర్గీయుల ఘర్షణకు సంబంధించి ఇప్పటివరకు 20 మందిని అరెస్టు చేసినట్లు వాషింగ్టన్ డీసీ మెట్రోపాలిటన్ పోలీసు విభాగం వెల్లడించింది. తనకు మద్దతుగా జరుగుతున్న ర్యాలీలను మీడియా తొక్కిపెడుతోందని, ప్రజలకు వాస్తవాలు తెలియనివ్వడం లేదని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఓటమిని ఒప్పుకున్న ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరించకుండా ఇన్నాళ్లూ మొండిగా వ్యవహరించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు కాస్త దిగొచ్చారు. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ గెలిచారని చెప్పారు. తద్వారా తొలిసారిగా తన ఓటమిని ఒప్పుకున్నారు. ఈ మేరకు ఆయన తాజాగా ట్వీట్ చేశారు. అయితే, ఎన్నికల్లో రిగ్గింగ్ జరగడం వల్లే బైడెన్ విజయం సాధించారని ట్రంప్ ఆక్షేపించారు. ఫేక్ న్యూస్ మీడియా దృష్టిలో మాత్రమే బైడెన్ అధ్యక్షుడిగా నెగ్గాడని ఎద్దేవా చేశారు. చెడ్డ పేరున్న రాడికల్ లెఫ్ట్ కంపెనీ ఓట్ల లెక్కింపు ప్రక్రియలో పాల్గొందని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి పరిశీలకులను అనుమతించలేదని తప్పుపట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలను డెమొక్రాట్లు చోరీ చేశారని మరోసారి మండిపడ్డారు. ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయని, తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు అందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించడంలో మాత్రం విఫలమవుతున్నారు. బైడెన్ 306.. ట్రంప్ 232 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి జార్జియా, నార్త్ కరోలినా రాష్ట్రాల ఫలితాలు కూడా వచ్చాయి. జార్జియాలో డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, నార్త్ కరోలినాలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. అలస్కాలో విజయంతో ఇప్పటికే ట్రంప్ 217 ఎలక్టోరల్ ఓట్లు సాధించిన విషయం తెలిసిందే. తాజాగా నార్త్ కరోలినాలో గెలుపుతో తన ఎలక్టోరల్ ఓట్ల సంఖ్యను 232కి పెంచుకున్నారు. ఇప్పటికే మేజిక్ మార్క్ 270ని సునాయాసంగా దాటేసిన బైడెన్.. తాజాగా జార్జియాలో గెలుపుతో 306 ఎలక్టోరల్ ఓట్లతో వైట్‌హౌజ్‌లోకి వెళ్లనున్నారు. జార్జియాలో బైడెన్, నార్త్ కరోలినాలో ట్రంప్ గెలుపొందారని అమెరికాలో ప్రధాన మీడియా సంస్థలు పేర్కొన్నాయి. జార్జియాలో గెలుపుతో బైడెన్ మరో రికార్డు సాధించారు. గత 28 ఏళ్లుగా ఊరిస్తూ వచ్చిన జార్జియాను డెమొక్రటిక్ పార్టీ ఖాతాలో వేశారు. గత 28 ఏళ్లుగా అక్కడ డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి గెలుపొందలేదు. -
వైట్‌హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా క్లెయిన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ పాలనా అధికారుల నియామకంపై గట్టి కసరత్తు చేస్తున్నారు. చాలా ఏళ్లుగా తనకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న రాన్ క్లెయిన్కు అత్యంత శక్తిమంతమైన పదవిని అప్పగించారు. వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా ఆయనను నియమిస్తూ బుధవారం బైడెన్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అంటే అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అగ్రరాజ్య అధ్యక్షుడు రోజు వారీ కార్యక్రమాల్ని చూడాలి. ఆయనను అధ్యక్షుడి గేట్ కీపర్ అని పిలుస్తారు. ప్రభుత్వం ఎదుర్కోబోయే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే ఇతర సిబ్బంది నియామకంలో కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ‘‘నేను, రాన్ గత ఎన్నో ఏళ్లుగా కలిసి పనిచేశాం. 2009లో అమెరికా చరిత్రలోనే అత్యంత భయంకరమైన ఆర్థిక మాంద్యం నుంచి దేశాన్ని గట్టెక్కించాం. 2014లో ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిని కూడా మేము కలిసి కట్టుగా అధిగమించాం. వైట్ హౌస్ పదవికి ఆయనను మించిన వారు లేరు’’ అని బైడెన్ ట్రాన్సిజన్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రాన్ క్లెయిన్కున్న అపారమైన అనుభవం, అత్యంత సమర్థతతో ఇద్దరం కలిసి దారుణమైన పరిస్థితుల్లో ఉన్న దేశాన్ని గట్టెక్కిస్తామని బైడెన్ ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు వార్షిక ఆదాయం 4 లక్షల డాలర్ల కంటే తక్కువగా ఉన్న వారికి పన్ను పెంచబోమని కమలా హ్యారిస్ హామీ ఇచ్చారు. ధనవంతుల దగ్గర్నుంచి పన్ను వసూలు చేస్తామని ఒక ట్వీట్లో స్పష్టం చేశారు. అలాస్కాలో ట్రంప్ విజయం అమెరికా అధ్యక్ష పదవిని విడిచిపెట్టేది లేదని చెబుతున్న డొనాల్డ్ ట్రంప్ అలాస్కా రాష్ట్రంలో నెగ్గారు. దీంతో ఆయన ఖాతాలోకి మరో మూడు ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. అలాస్కా విజయంతో ట్రంప్ ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 217కి చేరుకుంది. ట్రంప్‌కి 56.9శాతం ఓట్లు వస్తే, అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు 39.1శాతం ఓట్లు వచ్చాయి. 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లకు గాను బైడెన్‌కు ఇప్పటికే 279 ఓట్లు లభించాయి. అలాస్కా సెనేట్ స్థానంలో రిపబ్లికన్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. దీంతో 100 స్థానాలున్న సెనేట్‌లో ఆ పార్టీ బలం 50కి చేరుకుంది. బైడెన్‌కి తోడుగా ప్రపంచదేశాధినేతలు ఒకవైపు ట్రంప్ ఓటమిని అంగీకరించకుండా, అధికార బదలాయింపు ప్రక్రియ క్లిష్టరతమౌతోన్న వేళ, కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన బైడెన్‌కి ప్రపంచ దేశాధినేతలు కరోనా మహమ్మారి, వాతావరణ మార్పు, ఇతర విషయాలపై సహకరిస్తామని మద్దతు తెలుపుతున్నారు. ఉత్తర కొరియాతో అణ్వాయుధ ఉద్రిక్తతలను తగ్గించడానికి, దక్షిణ కొరియాతో కలిసి పనిచేస్తానని జోబైడెన్ తెలిపినట్లు దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే –ఇన్ తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భద్రతని పెంపొందించడానికి దక్షిణ కొరియాతో భాగస్వాములమౌతామని బైడెన్ తెలిపారు. ఇరు దేశాల మధ్య అణ్వాయుధ ఉద్రిక్తతల నివారణకు ట్రంప్ కాలంలో కృషి జరిగిందని, దాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిన అవసరం ఉందని మూన్ అన్నారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా బైడెన్‌ని కోరినట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ తెలిపారు. అమెరికాతో సంబంధాలను బలోపేతం చేసుకోవాలని సూచించినట్లు జపాన్ ప్రధాని యోషిహిడే సుగా తెలిపారు. -
ట్రంప్ ఓటమి భారత్‌కు మంచిదేనా!?
సాక్షి, న్యూఢిల్లీ : అమెరికాలో డెమోక్రట్ల అభ్యర్థి జో బైడన్ విజయం సాధించడానికి బిహార్ ఎన్నికల ఫలితాలకు ఏమైనా సంబంధం ఉంటుందా ? అమెరికా అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఓ పక్క కొనసాగుతుండగానే బిహార్‌లో ఆఖరి విడత పోలింగ్ జరిగింది. ఆ సందర్భంగా నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేలో నితీష్ కుమార్ నాయకత్వంలోని జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఓడిపోతుందని, ఆర్జేడీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని తేలిందంటే అమెరికా ఎన్నికల ప్రభావం ఉన్నట్లేగదా! అని కొంతమంది ట్విటర్లో ప్రశ్నిస్తున్నారు. (టార్గెట్ బైడెన్ వయా చైనా!) బిహార్ ఆఖరి విడత పోలింగ్ రోజున అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతూనే ఉందని, డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్ల మధ్య ‘నువ్వా, నేనా’ అన్నట్లుగా హోరాహోరీ పోరు నడుస్తోంది. అలాంటప్పుడు అమెరికా ఎన్నికల ఫలితాలు బిహార్ పోలింగ్‌పై ఉండే ఆస్కారమే లేదు. కాకపోతే అమెరికాలోని భారతీయుల్లో మోదీ అభిమానులు, విధేయులు ఎక్కువ మంది ఉన్నందున వారి ఓటు బ్యాంక్‌ను కొల్లగొట్టడం ద్వారా తిరిగి అధికారంలోకి రావాలని ఆశించి ట్రంప్ బోల్తా పడ్డారు. (వైట్‌హౌస్ నుంచి వెళ్దాం: ట్రంప్‌తో భార్య మెలానియా) అమెరికాలో ‘హౌడీ మోడీ, భారత్‌లో నమస్తే ట్రంప్’ పేరిట ఇరువు దేశాధినేతలు ప్రజలనుద్దేశించి మాట్లాడడం వెనక ఎన్నికల వ్యూహం ఉందనడంలో సందేహం లేదు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగడానికి కొన్ని రోజుల ముందర, నవంబర్ 3వ తేదీన అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రలు అనూహ్యంగా భారత్‌కు వచ్చి ‘2ప్లస్2’ చర్చల్లో భారత్‌తో భారీ రక్షణ ఒప్పందం కుదుర్చుకోవడం తెల్సిందే. ప్రవాస భారతీయ ఓట్లను ఆకర్షించడం కోసం ట్రంప్ చేసిన ఆఖరి ప్రయత్నంగా దాన్ని పేర్కొనవచ్చు. బైడన్, కమలా హ్యారిస్లకు ఓటేసిన ప్రవాస భారతీయులందరిని భారత వ్యతిరేకులుగా మోదీ విధేయులు సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తున్నారు. వాస్తవానికి మోదీ విధేయులైన భారతీయులు కూడా అమెరికా ఎన్నికల్లో విడిపోయినట్లు, వారిలో ఎక్కువ మంది బైడెన్‌కు ఓటేయగా, తక్కువ మంది ట్రంప్‌కు వేసినట్లు అమెరికా ముందస్తు ఎన్నికల సందర్భంగా పలు మీడియా సంస్థలు నిర్వహించిన పోల్ సర్వేల్లో చెప్పారు. వచ్చే తరం ప్రవాస భారతీయులకు హెచ్ 1 బీ వీసాలు రాకపోయినా, వచ్చినా తమకు సంబంధం లేదని, తమకు పన్నులు తగ్గితే చాలనుకున్న మోదీ విధేయుల్లో ఓ వర్గం ట్రంప్‌కు ఓటేయగా, బైడెన్ అధికారంలోకి వస్తే భారతీయులపై శ్వేత జాతీయులు దాడులు తగ్గుతాయని, పైగా ప్రవాస భారతీయులుకు హెచ్ 1 బీ వీసాలు పెరగుతాయని భావించిన మోదీ విధేయుల్లో మరో వర్గం బైడెన్‌కు ఓటేశారు. బైడెన్ వస్తే అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత్‌ను కాకుండా పాకిస్థాన్‌కు మద్దతు ఇస్తారంటూ మత విద్వేషకుల్లో ఓ వర్గం చేసిన ప్రచారం కూడా వారి ముందు పనిచేయలేదు. బైడెన్ కూడా అంతర్జాతీయ వ్యవహారాల్లో పాకిస్థాన్‌కు మద్దతిస్తానని చెప్పలేదు. కశ్మీర్ విషయంలో తన వైఖరి ఏమిటో చెప్పాల్సి వచ్చినప్పుడు తాను కశ్మీరీల పక్షమని బైడెన్ తెలిపారు. అంతమాత్రాన అది పాకిస్థాన్‌కు మద్దతివ్వడం ఎంతమాత్రం కాదు. (‘యునైటెడ్ స్టేట్స్’కు అధ్యక్షుడిని..!) డొనాల్డ్ ట్రంప్ ఓడిపోవడం వల్ల భారతీయులుగానీ, ప్రవాస భారతీయులు బాధ పడాల్సిన అవసరం లేదని, ప్రవాస భారతీయులకుగానీ, భారతీయులకుగానీ జో బైడెన్ వల్ల ఎక్కువ ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని, ఆయన ప్రవాస భారతీయులకిచ్చిన హామీలను మరచిపోరాదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు భరోసా ఇస్తున్నారు. అయితే బైడెన్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే అమెరికాలోని కొన్ని చట్టాలను సవరించాలి. అందుకు అవసరమైన బలం సెనేట్‌లో బైడెన్‌కు లేదు. అలాంటప్పుడు అయన తన హామీలను ఎల నెరవేరుస్తారన్నది మరికొందరి విశ్లేషకుల అనుమానం. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. (ద్వైపాక్షిక బంధాలు బలపడతాయ్) -
బంధాలు బలోపేతం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో అనిశ్చితికి ఎట్టకేలకు తెరపడింది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం సొంతం చేసుకున్నారు. అధ్యక్షుడి హోదాలో శ్వేతసౌధంలో అడుగుపెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. జగమొండి డొనాల్డ్ ట్రంప్ నాలుగేళ్ల పాలనలో ఇతర దేశాలతో అమెరికా సంబంధాల విషయంలో గణనీయమైన మార్పులే సంభవించాయి. కొన్ని దేశాలతో సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇక జో బైడెన్ ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ఇతర దేశాలతో సాన్నిహిత్యం పెంచుకోవడం తమ ఎజెండాలోని కీలక అంశమని ఆయన ఎన్నికల ప్రచారంలో పలుమార్లు స్పష్టం చేశారు. దెబ్బతిన్న సంబంధాలను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. అందుకే ప్రపంచ దేశాలన్నీ అమెరికా కొత్త అధ్యక్షుడి విధాన నిర్ణయాలు ఎలా ఉంటాయన్న దానిపై దృష్టి పెట్టాయి. చైనాపై సానుకూల ధోరణి! ప్రపంచ సూపర్ పవర్‌గా ఎదగాలని తహతహలాడుతూ తమకు పక్కల్లో బల్లెంలా మారిన చైనాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారాలు మిరియాలు నూరారు. ఆ దేశంలో పలు అంక్షలు విధించారు. కరోనా వైరస్ పుట్టుకకు, వ్యాప్తికి చైనాయే కారణమని దూషించారు. వాణిజ్య యుద్ధానికి తెర తీశారు. ట్రంప్ ఇంటిముఖం పడుతుండడంతో పరిస్థితులు మారిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. చైనా విషయంలో అమెరికా నాయకత్వం సానుకూల ధోరణి కనబరిచే అవకాశం ఉందంటున్నారు. బైడెన్ గెలుపును చైనాలో మెజారిటీ జనం స్వాగతిస్తున్నారట! ఇక ఎన్ని భేదాభిప్రాయాలున్నా ఇండియాతో స్నేహాన్ని అమెరికా వదులుకోలేని పరిస్థితి. ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాకు చెక్ పెట్టాలన్నా, అంతర్జాతీయ ఉగ్రవాదంపై యుద్ధం చేయాలన్న అమెరికాకు ఇండియా అండ కావాల్సిందే. కశ్మీర్, మైనారిటీల విషయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలపై జో బైడెన్ అసంతృప్తి వ్యక్తం చేసిన మాట నిజమే అయినా ఇండియా విషయంలో ఆయన వ్యతిరేకంగా వెళ్లలేరని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ భారత సంతతి మహిళ కావడం ఇండియాకు కొంత కలిసొచ్చే అంశమే. ఉత్తర కొరియాతో స్నేహమే దూర్త దేశం అని అమెరికా ఒకప్పుడు అభివర్ణించిన ఉత్తర కొరియాతో సంబంధాలు మెరుగుపర్చుకునేందుకు డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నించారు. ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌తో పలు సందర్భాల్లో సమావేశమయ్యారు. ఇరువురు నేతలు కొన్ని ఒప్పందాలపై సంతకాలు కూడా చేశారు. ట్రంప్ ప్రయత్నాలను బైడెన్ కొనసాగించే పరిస్థితి కనిపిస్తోంది. రష్యాపై మరిన్ని ఆంక్షలు? అమెరికాకు రష్యా నుంచి పెద్ద ముప్పు ఉందని జో బైడెన్ ఇటీవలే వ్యాఖ్యానించారు. బైడెన్ పాలనలో తమ దేశంలో మరిన్ని ఒత్తిళ్లు, ఆంక్షలు తప్పకపోవచ్చని రష్యా నాయకత్వం అనుమాని స్తోంది. 2016లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రష్యా అండతోనే డొనాల్డ్ ట్రంప్ గెలిచారన్న విమర్శలు ఇప్పటికీ వినిపిస్తున్నాయి. బైడెన్ హయాంలో అమెరికా–రష్యా సంబంధాలు బలహీనపడే అవకాశాలున్నాయి. ఊపిరి పీల్చుకున్న ఇరాన్ ట్రంప్ పాలనలో అమెరికాకు ఇరాన్ బద్ధవ్యతిరేకిగా మారిపోయింది. అమెరికా విధించిన ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దిగజారింది. అగ్రరాజ్యం ఆదేశాల మేరకు ఇతర దేశాలు ఇరాన్‌తో సంబంధాలను తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇరాన్లో జనరల్ ఖాసీం సులేమానీని అమెరికా హతమార్చడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ట్రంప్ ఓడిపోయి, బైడెన్ గెలవడంతో ఇరాన్ ఊపిరి పీల్చుకుంది. బైడెన్ చొరవతో తమ దేశంపై ఆంక్షలు తొలగిపోతాయని, ఆర్థిక వ్యవస్థ గాడిన పడుతుందని ఇరాన్ ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు జర్మనీ, ఈజిప్టు, ఇజ్రాయెల్, కెనడా వంటి దేశాలతో అమెరికాకు మంచి సంబంధాలే ఉన్నాయి. -
ఆ కల తీరుతుందా?
ప్రపంచ దేశాలపై అమెరికా పట్టు నిలుపుకోవాలంటే భారత్‌తో స్నేహసంబంధాలు కొనసాగించడం అగ్రరాజ్యానికి అత్యంత అవసరం. రక్షణ రంగంలో ఒబామా అనుసరించే విధానాలే బైడెన్ కొనసాగించనున్నారు. ఉగ్రవాదం పాక్ భూభాగంపై ఉగ్రవాదుల్ని పెంచి పోషించడానికి ఆయన ఏ మాత్రం అంగీకరిం చరు. ఉగ్రవాదం అంశంలో పాక్‌పై ఒత్తిడి గట్టిగానే కొనసాగిస్తారన్న ఆశాభావంతో భారత్ ఉంది. చైనాతో వైఖరి వాస్తవాధీన రేఖ వెంబడి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న నేపథ్యంలో అమెరికా, చైనా మధ్య సంబంధాలు భారత్‌కి కీలకం. ట్రంప్ భారత్‌కే మద్దత పలుకుతూ చైనాపై కస్సుబుస్సులాడుతూనే ఉన్నారు. కానీ బైడెన్ నుంచి ఆ స్థాయి మద్దతు లభించదని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇండో ఫసిఫిక్ ప్రాంతంలో ఒక దేశం నుంచి మరొక దేశానికి ముప్పు ఉండకూడదన్న వైఖరినే ఆయన పాటించే అవకాశాలున్నాయి. మానవ హక్కులు మానవ హక్కుల ఉల్లంఘన అంశంలో భారత్ పట్ల కొత్త అధ్యక్షుడి వైఖరి ఎలా ఉంటుందో ఇప్పట్నుంచి అంచనా వెయ్యలేని పరిస్థితైతే ఉంది. మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తోందంటూ పాకిస్తాన్‌పై బైడెన్ గుర్రుగానే ఉన్నారు. మరోవైపు కశ్మీర్లో 360 ఆర్టికల్ రద్దుని ఉపాధ్యక్షురాలుగా ఎన్నికైన కమల మొదట్నుంచి వ్యతిరేకిస్తున్నారు. వీసా విధానం హెచ్–1బీ వీసా విధానం, ఉద్యోగాల కల్పన అంశంలో బైడెన్ విధానాలు భారత్‌కు సానుకూలంగా మారే అవకాశాలున్నాయి. అమెరికా ఫస్ట్ నినాదంతో ట్రంప్ హెచ్–1బీ వీసాలపై కఠిన ఆంక్షలు విధించారు. అయితే బైడెన్ వాటిని సరళతరం చేస్తానని ఇప్పటికే హామీ ఇచ్చారు. అంతేకాదు చట్టవిరుద్ధంగా ఉండే వలసదారులకి అమెరికా పౌరసత్వం కల్పిస్తానని ఎన్నికల హామీ కూడా ఉంది. అదే జరిగితే 5 లక్షల మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం లభిస్తుంది కమలా హ్యారిస్ పాత్ర వివిధ అంశాలపై కమలకు స్పష్టమైన అభిప్రా యాలున్నాయి. అవన్నీ భారత్‌తో సంబంధాల్లో ప్రభావాన్ని చూపిస్తాయి. మరోసారి పోటీ చేయబోనని బైడెన్ చెప్పడంతో అధ్యక్షురాలయ్యే వ్యూహంతో కమలా అడుగులు వేస్తారు. ఆమె మూలాలు భారత్‌తో ముడిపడి ఉండడంతో మన దేశానికి కలిసొచ్చే అంశంగా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘2020 నాటికి అమెరికా, భారత్ ప్రపంచంలోనే అత్యంత సన్నిహిత దేశాలుగా అవతరించాలి. అప్పుడే ప్రపంచం హాయిగా ఉంటుంది. ఇదే నా కల — 2006లో ఓ ఇంటర్వ్యూలో బైడెన్ -
ట్రంప్ మెలానియా విడాకులు?
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పరాభవం వెంటాడుతున్న సమయంలోనే డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత జీవితంలో అంతకంటే ఎక్కువ నష్టం జరిగే ప్రమాదం కనిపిస్తోంది. ట్రంప్ భార్య మెలానియా ట్రంప్ ఆయనకు విడాకులు ఇవ్వాలని భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ట్రంప్ వైట్ హౌస్‌ని విడిచిపెట్టిన వెంటనే మెలానియా కూడా ఆయనకి శాశ్వతంగా గుడ్ బై కొట్టేస్తారని బ్రిటీష్ టాబ్లాయిడ్ డెయిలీ మెయిల్ ఒక కథనాన్ని ప్రచురించింది. 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ఎప్పుడెప్పుడు ముగింపు చెబుదామా అని మెలానియా నిముషాలు లెక్కబెడుతున్నట్టుగా ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలు ఒమరోసా న్యూమ్యాన్ చెప్పిన ట్టుగా డెయిలీ మెయిల్ వెల్లడిం చింది. ‘‘ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి ఎప్పుడు వైదొలుగుతారా అని మెలానియా నిముషాలు లెక్కబెడుతోంది. ఆయన పదవి నుంచి దిగిపోగానే విడాకులు ఇవ్వడానికి ఆమె సిద్ధంగా ఉన్నారు. వారిద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదు. అవసరం కోసం ఇద్దరూ అలా కాలం గడిపేస్తున్నారు’’ అని ఒమరోసా తెలిపారు. చాలా కాలంగా విభేదాలు! అమెరికాలో అధ్యక్షుడికి భార్య ఉండడం అంటే అత్యంత గౌరవమైన అంశం. ఆ దేశంలో ఫస్ట్ లేడీకి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఎప్పట్నుంచో విభేదాలున్నప్పటికీ అధ్యక్ష పదవిలో ఉండగా మెలానియా ఆయనకు విడాకులు ఇచ్చి అవమాన పరచాలని అనుకోలేదని, ఇప్పుడు ట్రంప్ ఓడిపోవడంతో ఆయన వైట్ హౌస్ వీడిన వెంటనే మెలానియా కూడా ఆయన నుంచి విడిపోతారని ఆ కథనం వెల్లడించింది. ట్రంప్ అధ్యక్షుడు అయిన వెంటనే మెలానియా శ్వేతసౌధానికి రాలేదు. ట్రంప్ వెళ్లిన 5నెలలకు వైట్హౌస్కొచ్చారు. తమ కుమారుడు బారెన్ స్కూలింగ్ కోసమే ఆమె వైట్ హౌస్‌కి రాలేదన్న వార్తలు వచ్చాయి. కానీ అదే సమయంలో ట్రంప్‌కున్న ఆస్తిపాస్తుల్లో తనకి, తన కుమారుడు సమాన వాటా కావాలంటూ మెలానియా ఒప్పందం కుదుర్చు కున్నారని, అది కుదిరాక శ్వేతసౌధానికి ఆమె వచ్చారని ట్రంప్ అనుచరుడు స్టీఫెన్ ఓల్కాఫ్ వెల్లడించారు. వారి పడక గదులు వైట్ హౌస్‌లో వేర్వేరు అంతస్తుల్లో ఉన్నాయని గతంలో వార్తలొచ్చాయి. చదవండి: ‘నిజంగానే ఓడిపోయావు, దాన్ని అంగీకరించు’ -
తులసేంద్రపురంలో సంబరాలు
సాక్షి, చెన్నై : తమిళ సంతంతికి చెందిన కమలా హ్యారిస్ అమెరికాకు తొలి మహిళా ఉపాధ్యక్షురాలుగా ఎన్నిక కావడంతో ఆమె పూర్వీకుల గ్రామంలో సంబరాలు మిన్నంటాయి ఇంటింటా రంగోళిలతో కమలా హ్యారిస్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. తమకు దీపావళిముందే వచ్చిసిందన్నట్టుగా ఆనందోత్సాహాల్లో మునిగారు. కమలా హ్యారిస్ పూర్వీకం తమిళనాడు లోని తిరువారూర్ జిల్లా మన్నార్‌కుడి సమీపంలోని తులసేంద్రపురం గ్రామం. ఆమె తల్లి తరపు తాత ముత్తాలు ఇక్కడి వారే. అమెరికా ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థిగా కమలాహ్యారిస్ పేరు ప్రకటించిన రోజు నుంచి ఈ గ్రామంలో ఎదురు చూపులు పెరిగాయి. కమలా హ్యారిస్ తమ ఇంటి బిడ్డగా భావించిన గ్రామస్తులు ఆమె విజయకేతనం ఎగుర వేయాలని కాంక్షిస్తూ ఆ గ్రామంలోని గ్రామంలోని ధర్మశాస్త ఆలయంలోప్రతి రోజూ పూజలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అమెరికా ఎన్నికల్లో తొలి మహిళా ఉపాధ్యక్షురాలుగా కమలా హ్యారిస్ విజయకేతనం ఎగుర వేయడంతో ఆ గ్రామస్తుల ఆనందానికి అవదులు లేవు. ఆదివారం ఆ గ్రామంలోని ధర్మశాస్త ఆలయంలో విశిష్టపూజలు జరిగాయి. గ్రామంలో కమలా హ్యారిస్ చిత్ర పటాలతో ప్లకార్డులు, చిన్న చిన్న హోర్డింగ్‌లు హోరెత్తాయి. ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ఇంటింటా ముగ్గులు వెలిశాయి. బాణా సంచాల్ని పేల్చారు. స్వీట్లు పంచి పెట్టి ఆనందం వ్యక్తం చేశారు. ఇక, అమెరికా ఉపాధ్యక్షురాలి హోదాలో ఒక్క సారైనా పూర్వీక గ్రామానికి రావాలని కమలా హ్యారిస్‌కు గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. కమలా హ్యారిస్ తమిళనాడు కు సీఎం పళని స్వామి, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం నేత దినకరన్‌లు శుభాకాంక్షలు తెలియజేశారు డాక్టర్ సరళగోపాలన్ మొక్కులు తీర్చిన చిన్నమ్మ చెన్నై బీసెంట్ నగర్లో ఉన్న కమలా హ్యారిస్ చిన్నమ్మ డాక్టర్ సరళగోపాలన్ ఆనందానికి అవదులు లేవు. బీసెంట్ నగర్‌లోని వర సిద్ధి వినాయకుడి ఆలయంలో 108 కొబ్బరి కాయల్ని ఆదివారం కొట్టి, మొక్కులు తీర్చుకున్నారు. కమలా హ్యారిస్ చెన్నైకు వచ్చినప్పుడు ఇక్కడి వరసిద్ధి వినాయకుడి ఆలయానికి వెళ్లి కొబ్బరి కాయ కొట్టే వారు అని ఈసందర్భంగా సరళ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో తన కోసం ఆలయంలో కొబ్బరి కాయ కొట్టాలని కమలా సూచించారని, అందుకే ఆమె తరపున మొక్కును తీర్చుకున్నట్టు తెలిపారు. కమలా హ్యారిస్ మేన మామ గోపాలన్ బాలచంద్రన్ పేర్కొంటూ, తమ కుటుంబమంతా ఎంతో ఆనందంగా ఉందన్నారు. అవ్వా తాతల్ని చూసేందుకు ఇది వరకు చెన్నైకు పలు మార్లు కమలా వచ్చారని, అలాగే, చండీగర్‌కు కూడా వెళ్లేవారని గుర్తు చేశారు. -
బైడెన్‌కే పట్టాభిషేకం
-
నమ్మకాన్ని నిలబెట్టుకుంటా: బైడెన్
సాక్షి, వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో తన గెలుపు అమెరికన్ల విజయమని జో బైడెన్ అన్నారు. డెమొక్రాట్ల విజయోత్సవ సభలో ఆయన ప్రసంగించారు. అమెరికన్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని తెలిపారు. ‘‘అమెరికన్ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. అమెరికా చరిత్రలో ఇదొక నూతన అధ్యాయం. 7.4 కోట్ల మంది అమెరికన్లు డెమొక్రాట్లకు ఓటేశారు. అమెరికన్లు తమ భవిష్యత్ కోసం ఓటేశారు. మీరు నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. ప్రజాస్వామ్య బద్ధంగానే పరిపాలన చేస్తా. ప్రత్యర్ధులు మన శత్రువులు కాదు.. వారు కూడా అమెరికన్లే. అమెరికాకు కొత్త రోజులు రాబోతున్నాయి. కమలా హ్యారిస్ అద్భుత నాయకురాలు. అమెరికాలో వర్ణవివక్ష లేకుండా అభివృద్ధి చేసుకుందాం’’ అని పేర్కొన్నారు. (చదవండి: బైడెన్‌కే పట్టాభిషేకం) ప్రజాస్వామ్యాన్ని కాపాడారు: కమలాహారిస్ అమెరికన్లు ప్రజాస్వామ్యాన్ని కాపాడారని అమెరికా మొదటి మహిళా ఉపాధ్యక్షురాలిగా పదవిని చేపట్టనున్న కమలా హ్యారిస్ అన్నారు. ‘‘అమెరికా చరిత్రలో నూతన అధ్యాయం. ఉపాధ్యక్ష ఎన్నికల్లో నా గెలుపు మహిళా లోకం విజయం. అమెరికా ప్రజలు తమ గళాన్ని గట్టిగా వినిపించారని’’ ఆమె పేర్కొన్నారు. (చదవండి: చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్) -
చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్
వాషింగ్టన్: చాలామంది భారతీయుల ఎదురు చూపులు ఫలించాయి. భారత సంతతి మహిళ కమలా హ్యారిస్ అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఒక మహిళ, ఒక ఆసియన్ అమెరికన్‌కు ఈ పదవికి దక్కడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంటే కమలా హ్యారిస్ కొత్త చరిత్ర సృష్టించినట్లే. ఆమె ఇంతకుముందే ఎన్నో ఘనతలు సాధించారు. శాన్ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీ పదవిని అధిరోహించిన తొలి మహిళగా ఆమె కీర్తిగడించారు. అలాగే కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా సేవలందించిన మహిళగానూ రికార్డుకెక్కారు. ► కమలా హ్యారిస్ 1964 అక్టోబర్ 20న ఒక్లాండ్‌లో జన్మించారు. ► ఆమె తల్లి తమిళనాడులోని సంప్రదా య కుటుంబానికి చెందినవారు. తండ్రి జమైకా దేశస్తుడు. ► వాషింగ్టన్ డీసీలోని హోవార్డ్ యూనివ ర్సిటీలో కమల చదువుకున్నారు. ► యూసీ హేస్టింగ్స్ కాలేజీలో న్యాయ విద్య అభ్యసించారు. ► అలమెండా కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ కార్యాలయంలో ఎనిమిది సంవత్స రాలు పనిచేశారు. ప్రధానంగా చిన్నా రులపై జరిగే హింసకు సంబంధించిన కేసులను విచారించారు. ► కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పని చేస్తున్నప్పుడు బరాక్ ఒబామా దృష్టిలో పడ్డారు. అనంతరం డెమొక్ర టిక్ పార్టీలో చేరారు. కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎన్నికయ్యారు. -
యువ సెనేటర్ నుంచి వృద్ధ ప్రెసిడెంట్ దాకా..
వాషింగ్టన్: ఐదు దశాబ్దాలుగా అమెరికా రాజకీయాల్లో కొనసాగుతున్న జో బైడెన్(77) కల ఎట్టకేలకు నెరవేరింది. అధ్యక్ష ఎన్నికల్లో ఆయన డొనాల్డ్ ట్రంప్‌పై ఘన విజయం సాధించారు. అధ్యక్షుడిగా శ్వేతసౌధంలో అడుగు పెట్టబోతున్నారు. అమెరికా చరిత్రలో పిన్నవయస్కులైన సెనేటర్లలో ఒకడిగా రికార్డు సృష్టించిన బైడెన్ ఇప్పుడు అత్యంత వృద్ధ అధ్యక్షుడిగా మరో రికార్డు నెలకొల్పబోతున్నారు. ఆయన గతంలో ఆరుసార్లు సెనేటర్‌గా ఎన్నికయ్యారు. 1988, 2008లో అధ్యక్ష పదవి కోసం పోటీపడినప్పటికీ డెమొక్రటిక్ పార్టీలోనే విజయం సాధించలేకపోయారు. మూడో ప్రయత్నంలో అనుకున్నది సాధించారు. బరాక్ ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బైడెన్ రెండు పర్యాయాలు ఉపాధ్యక్షుడిగా సేవలందించారు. ► జో బైడెన్ 1942లో పెన్సిల్వేనియాలో ఓ క్యాథలిక్ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆయన అసలు పేరు జో రాబినెట్ బైడెన్ జూనియర్. ► యూనివర్సిటీ ఆఫ్ డెలావర్‌లో చదివారు. ► 1968లో సైరకాస్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పొందారు. ► మొదటిసారిగా 1972లో డెలావర్ రాష్ట్ర సెనేటర్‌గా ఎన్నికయ్యారు. అప్పుడాయన వయసు 29 సంవత్సరాలు. ► దేశంలో పిన్నవయస్కుడైన సెనేటర్‌గా గుర్తింపు పొందారు. ► సెనేట్‌లో అత్యంత తక్కువ ఆస్తులు కలిగిన సెనేటర్‌గా కూడా ఆయన అప్పట్లో పేరుగాంచారు. ► 1972లో జరిగిన కారు ప్రమాదంలో బైడెన్ మొదటి భార్య, 13 నెలల వారి కుమార్తె నవోమీ మరణించారు. ► బైడెన్ 1977లో జిల్ జాకబ్స్‌ను రెండో పెళ్లి చేసుకున్నారు. ► వారికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు జన్మించారు. ఒక కుమారుడు బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించాడు. -
అమెరికా: బైడెన్‌కే పట్టాభిషేకం
వాషింగ్టన్: అత్యంత ఉత్కంఠ రేకెత్తించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాటిక్ అభ్యర్థి జోసెఫ్ రాబినెట్ బైడెన్ జూనియర్(77)నే చివరికి విజయం వరించింది. ఆయన అమెరికా సంయుక్త రాష్ట్రాల 46వ అధ్యక్షుడిగా శ్వేతసౌధంలో అడుగు పెట్టేందుకు మార్గం సుగమమైంది. ఉపాధ్యక్ష పదవిని చేపట్టనున్న తొలిమహిళగా, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ రికార్డుసృష్టించనున్నారు. శనివారం జరిగిన ఓట్ల లెక్కింపులో సొంత రాష్ట్రం పెన్సిల్వేనియా రాష్ట్రంలో జో బైడెన్ విజయం సాధించారు. ఈ గెలుపుతో ఆయనకు మరో 20 ఎలక్టోరల్ ఓట్లు దక్కాయి. ఎలక్టోరల్ కాలేజీలోని 538ఓట్లకుగాను మ్యాజిక్ ఫిగర్ 270 కాగా, 284 ఓట్లు బైడెన్ ఖాతాలో జమయ్యాయి. జార్జియా(16,) నార్త్ కరోలినా(15) అలాస్కా(3) వంటి రాష్ట్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది. ఈ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ తుది ఫలితాలపై ఎటువంటి ప్రభావం చూపదు. దీంతో బైడెనే తదుపరి అధ్యక్షుడని సీఎన్ఎన్, వాషింగ్టన్ పోస్ట్ తదితర ప్రముఖ వార్తా సంస్థలు ప్రకటించాయి. ‘జోసెఫ్ ఆర్.బైడెన్ జూనియర్ అమెరికా 46వ అధ్యక్షుడిగా శనివారం ఎన్నికయ్యారు. దేశంలో సాధారణ రాజకీయ పరిస్థితులను నెలకొల్పుతాననీ, ఆరోగ్యం, ఆరి్థక సంక్షోభాలను ఎదుర్కొంటున్న సమయంలో జాతీయ ఐక్యతను సాధిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ట్రంప్ హయాంలో వైట్ హౌస్‌లో నాలుగేళ్ల పాటు సాగిన గందరగోళానికి ఆయన ముగింపు పలికారు’ అని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది. అధ్యక్షుడిగా ఎన్నికైనట్లు తెలిసిన వెంటనే బైడెన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘అమెరికా, ఈ గొప్ప దేశానికి నాయకత్వం వహించడానికి నన్ను ఎన్నుకోవడం గౌరవంగా భావిస్తున్నా. మీరు నాకు ఓటేసినా వేయకున్నా అందరు అమెరికన్లకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తా. నా లక్ష్యం చాలా కష్టమైంది. అయినప్పటికీ నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతా’ అని పేర్కొన్నారు. ‘ఈ ఎన్నికలు జో బైడెన్ కంటే నా కంటే కూడా దేశానికే ఎక్కువ అవసరం. ఇవి అమెరికా ఆత్మ గౌరవానికి సంబంధించినవి. అందుకోసం మనం పోరాడుదాం. లక్ష్యం సాధించేందుకు అందరం కలిసి పనిచేయడం ప్రారంభిద్దాం’ అని కమలా హ్యారిస్ ట్విట్టర్లో పేర్కొన్నారు. గోల్ఫ్ క్లబ్‌కు ట్రంప్ ఇప్పటి వరకు ఎన్నికల్లో అక్రమాలంటూ పలు ఆరోపణలు చేస్తున్న ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కథ ముగిసిట్లేనని భావిస్తున్నారు. శనివారం ట్రంప్..వర్జీనియా రాష్ట్రం స్టెర్లింగ్‌లో ఉన్న తన సొంత ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్‌కు వెళ్లిపోయారు. ఈ ఓటమితో అమెరికా చరిత్రలో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత రెండో విడత ఎన్నిక కాలేని మూడో అధ్యక్షుడిగా ఆయన చరిత్రకెక్కారు. గడిచిన 25 ఏళ్లలో 1992లో జార్జి హెచ్. బుష్ తర్వాత ఇలా పరాజయం మూటగట్టుకున్న ఏకైక అధ్యక్షుడు కూడా ట్రంప్‌నే. బోసిపోయిన వైట్‌హౌస్ ఎన్నికల ఫలితాల ప్రభావం అధ్యక్షభవనంపై పడింది. సాధారణంగా అక్కడ కనిపించే హడావుడి ఒక్కసారిగా మాయమైంది. శ్వేతసౌధం లాన్లలో మాత్రమే కొద్దిపాటి మీడియా సిబ్బంది కనిపించారు. బైడెన్ మద్దతు దారులు రాజధాని వాషింగ్టన్‌తోపాటు, న్యూయార్క్, షికాగో, అట్లాంటా తదితర ప్రాంతాల్లో వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాం«దీ, కెనడా ప్రధానమంత్రి ట్రూడో తదితరులు బైడెన్, కమలాహ్యారిస్లను అభినందించారు. ఎన్నికల్లో అక్రమాలంటూ మరోసారి ట్రంప్ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ శనివారం మరోసారి ట్రంప్ ఆరోపణలు చేశారు. ‘పెన్సిల్వేనియా లాంటి చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాల్లోకి మా పరిశీలకులను రానివ్వలేదు. లోపల ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు వీల్లేకుండా చేశారు. జరక్కూడనివి జరిగిపోయాయి. చట్టబద్ధమైన పారదర్శకత కనిపించలేదు. రాత్రికి రాత్రే ఫలితాలు మారిపోయాయి. అక్కడ ఏం జరిగిందో తెలియదు’అని పేర్కొన్నారు. వాస్తవానికి భారీ మెజారిటీతో మేమే ఈ ఎన్నికల్లో గెలిచాం అంటూ ప్రకటించుకున్నారు. ‘అధ్యక్ష పదవి తనదే నంటూ జోబైడెన్ చెప్పుకోవడం తప్పు. అలా నేను కూడా చెప్పుకోగలను. ఎన్నికల ఫలితాలపై కోర్టుల్లో వేసిన పిటిషన్లపై ఇప్పుడిప్పుడే ప్రొసీడింగ్ మొదలయ్యాయని పేర్కొన్నారు. ఎన్నికల రోజున రాత్రి 8 గంటల తర్వాత కూడా అక్రమంగా వేల సంఖ్యలో ఓట్లను స్వీకరించారన్నారు. ట్రంప్ ట్వీట్లను ట్విట్టర్ సంస్థ ఫ్లాగ్ చేసి చూపింది. వాషింగ్టన్లో వైట్‌హౌస్ వద్ద సంబరాలు -
బైడెన్ గెలుస్తాడు, కానీ ట్రంపిజం ఓడినట్టా?
అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ ఎన్నికైనట్టే. కానీ అంతకంటేముందు పోటాపోటీ రాష్ట్రాలైన జార్జియా, ఆరిజోనా, పెన్సిల్వేనియాల్లో నిరసనలు, వ్యాజ్యాలు, తిరిగి లెక్కింపులతో కూడిన సుదీర్ఘ, గందరగోళ, తీవ్రమైన నాటకాన్ని మాత్రం ఆయన ఎదుర్కోక తప్పదు. అయినప్పటికీ అమెరికా ఎన్నికల చరిత్రలో ఏ అభ్యర్థికీ రానన్ని ఓట్లు ఆయన గెలుచుకున్నాడు. కాబట్టి ఆయన అత్యున్నత గౌరవానికి పూర్తి అర్హుడు. కాకపోతే ఒక అమర్యాదకర పరాజితుడైన డోనాల్డ్ ట్రంప్ నుంచి ఒక విషపూరిత పాత్రను ఆయన వచ్చే ఏడాది జనవరి 20న వారసత్వంగా అందుకోవాల్సి ఉంటుంది. రెండుగా చీలిపోయిన, ద్వేషంతో నిండిపోయిన, అపనమ్మకాలతో నిలబడిన సమాజాన్ని ఆయన ముందుండి నడపాల్సి ఉంటుంది. పదకొండు విశ్వవిద్యాలయాలకు చెందిన సామాజిక శాస్త్రవేత్తలు ఎదుటి పక్షం మీద విషం చిమ్మే ఈ ధోరణి సమాజానికి తీవ్ర హానికరమని ప్రతిష్టాత్మక సైన్స్ పత్రికలో రాశారు. సులభంగా విభేదాలు రెచ్చగొట్టగలిగే అంశాలతో ఎదుటి పక్షం వారిని రాక్షసులుగా చిత్రిస్తూ, తమ పక్షం వారి అభిప్రాయాలను బలపరుస్తూ పెరిగిన భావోద్వేగ గుర్తింపు రాజకీయాలు– అంతటా సర్వోన్నతంగా ఉండాలనుకునే శ్వేతజాతీయులను ఒకవైపు, వలస జీవులు, ఆఫ్రికన్ అమెరికన్లు, ఇతర తెగల మనుషులు, లైంగిక పరమైన మైనారిటీలను మరోవైపు నిలిచేట్టు చేసి, అమెరికా నేల మీద వ్యాప్తిలో ఉన్న ఎరుపు, తెలుపు, నీలం జాతుల గాథ ప్రకారం అమెరికాను మరోసారి చీలేట్టు చేసింది. ఇక ఇప్పుడు అమెరికా స్పష్టంగా ఉదారవాదులు, సంప్రదాయవాదులుగా, అమెరికాను తిరిగి గొప్పగా చేయాలనేవాళ్ళు, అలా చేయడం అంటే శ్వేతజాతిని సర్వోన్నతం చేయడం అని అర్థం చేసుకునేవాళ్ళుగా, నగరవాసులు, గ్రామీణులుగా, ధని కులు పేదలుగా విభజించబడి ఉంది. ఇరుపక్షాలు ఎదుటివారిని నిందించే, ఒకరి ఓటమి ఇంకొకరి గెలుపుగా మారిపోయే ఈ ఆటలో ఓటమి అనేది కలలో కూడా ఊహించలేనిది, దాని పరిణామాలు ఉనికికి సంబంధించినవి. అందుకే తాను బైడెన్ చేతిలో ఓడిపోతే అమెరికాను వదిలిపెట్టడమేనని ట్రంప్ అంటాడు. కానీ ఆయన అలాంటి పని చేయడని మనకు తెలుసు. కాకపోతే తన ఓటమి ద్వారా తన ఊహాత్మక రియాల్టీ షోకు తాను మరింత స్టార్ అని అనిపించుకుంటాడు. కానీ ఇప్పటికే ప్రత్యర్థులను శత్రువులుగా చూడకూడదని బైడెన్ ట్విట్టర్ ద్వారా కోరాడు. కానీ ట్రంప్ మాత్రం ఇంకా లక్షల ఓట్లు లెక్కించాల్సి ఉండగానే తాను గెలిచానని చెప్పుకోవడం, ఆయన మద్దతుదారులు లెక్కింపు కేంద్రాలను స్తంభింపచేయడంతో మునిగిపోయి బైడెన్ మాటలను ఎవరూ చెవికి ఎక్కించుకోలేదు. 2016లో హిల్లరీ క్లింటన్ కచ్చితంగా గెలుస్తుందని అంచనాలు ఉన్న సమయంలో ట్రంప్ గెలిచి ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాడు. దాన్ని బలహీన ప్రత్యర్థి ఉండటంతో ఏదో తప్పిదారి జరిగిన విషయంగా అమెరికా వ్యవస్థ దులిపేసుకుంది. కానీ అధికారం చేపట్టి తన వ్యాఖ్యలు, నిర్ణయాలతో ట్రంప్ అమెరికా ఎలా ఉంటుంది అనుకుంటామో అలా ఉండకుండా అంతర్జాతీయ పరిశీలకులను నివ్వెరపోయేలా, ఒక ఇబ్బందిగా దులిపేసుకునేలా చేశాడు. కొంతమంది అభివర్ణిస్తున్నట్టుగా ట్రంపిజం అనేది ఒక అధివాస్తవిక విరామం కాదని ఈ ఎన్నికలు తేటతెల్లం చేశాయి. ప్రాంతీయవాద, రక్షణాత్మక, జాతి వివక్షపూరిత, స్త్రీద్వేషంతో కూడిన నేటి అమెరికాకు ఇవి ప్రతిబింబం. విదేశీయులుగా మనం కలిసే అవకాశం ఉన్న అమెరికన్లు దీన్ని ప్రజాకర్షక, అహేతుక ఎత్తుగా కొట్టిపారేయవచ్చు. కానీ సుమారు సగం మంది అమెరికన్లు ట్రంప్‌లో తమను తాము చూసుకుంటున్నారు. బైడెన్ గెలుపు ద్వారా అమెరికా జీవితం పునఃప్రతిష్టితమవుతుందని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. కానీ అలా ఏం జరగదు. కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో వైఫల్యం, తెల్లవారుజామున మూడు గంటలకు అహేతుకమైన ట్వీట్లు చేయడం, తన ఆత్మస్తుతి ధోరణి– ఇవన్నీ ఉన్నప్పటికీ అమెరికన్లు ట్రంపిజంను తిరస్కరించలేదు. కాబట్టి విశ్లేషకుల అభిప్రాయం తప్పు. ట్రంప్ 50 శాతం ఓట్లు సాధించారు. ఈసారి బైడెన్ అధ్యక్షుడిగా గెలిచినా, డొనాల్డ్ ట్రంప్ దేనికోసం నిలబడ్డాడో అది ఎటూ పోదు. ఇప్పుడు అమెరికాలో చూస్తున్నదే ఇండియాలో కనబడుతోంది. పూర్తి భిన్నమైన, రాజకీయ ఎన్నికల వ్యవస్థ ఉన్నప్పటికీ భారత్ కూడా సుమారు అమెరికా మాదిరిగానే దాదాపు అవే కారణాలతో చీలిపోయి ఉంది. పాలకులు రాజ్యాం గపరమైన పౌర జాతీయవాదం నుంచి తప్పుకొని హిందీ, హిందూ, హిందుస్థాన్ బాట పట్టి మతపరమైన జాతీయవాదాన్ని నెలకొల్పడానికి యత్నిస్తున్నారు. అమెరికాలో జాతి, గుర్తింపు అనేవి రాజకీయ పెట్టుబడిగా మారిపోయినట్టుగానే మతం, కులం అనేవి భారత బహుళ ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. సామాజిక మాధ్యమాలు ద్వేషపూరిత మెదళ్లను అతిగా మేపుతూ వారి అభిప్రాయాలను మరింత బలపరుస్తున్నాయి. చపలచిత్తం, తక్షణ ఉద్వేగాలతో కూడిన నిర్ణయాలతో ఇరు దేశాల ప్రభుత్వాలు తడబడినట్టు అయ్యింది. పెద్దనోట్ల రద్దు, నిరుద్యోగం, కోవిడ్ మహమ్మారిని ఎదుర్కోవడంలో నిర్వహణ వైఫల్యం ఇక్కడ, తాలిబాన్లకు లొంగిపోవడం, ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి నిష్క్రమించడం, కరోనాను ఎదుర్కోవడంలో నిర్వహణ వైఫల్యం అక్కడ దీనికి ఉదాహరణలు. ఇరు దేశాలు ప్రపంచ యవనిక మీద ఒక నైతిక ఉన్నతిని ప్రతిష్టించుకుని ఉన్నాయి. మహాత్మాగాంధీ అహింసాయుత స్వాతంత్య్ర పోరాటం వల్ల మనమూ, అవకాశాల పుట్టినిల్లు, ప్రజాస్వామ్య మానవ హక్కుల ఛాంపియన్లుగా వాళ్లూ ప్రపంచ దేశాల దృష్టిలో ఈ ఉన్నతిని అనుభవిస్తున్నాయి. కానీ ఇరు దేశాల్లోనూ విషపూరిత దేశీయ రాజకీయాల వల్ల ఈ నైతిక ఉన్నతికి తీవ్రంగా దెబ్బ పడింది. 2020 ఎన్నికల్లో అమెరికా దీని నుంచి గాయపడి అయినా బయటపడనుంది. అలాంటి ధోరణులే వ్యాపిస్తున్న ఇండియాకు మాత్రం ఇది ఒక హెచ్చరిక. – శశి థరూర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత -
ట్రంప్ క్యాంపులో చీలికలు?
వాషింగ్టన్: అధికారం చేపట్టినప్పటి నుంచి తరచూ వివాదాల్లో చిక్కుకుపోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తన సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల ప్రక్రియపై విచ్చలవిడి విమర్శలకు దిగడం, కౌంటింగ్ ప్రక్రియ నిలిపివేతకు న్యాయస్థానాల్లో కేసులు, కౌంటింగ్ సాగుతూండగానే తాను గెలిచినట్లుగా ప్రకటించుకోవడం వంటి వాటిపై రిపబ్లికన్ పార్టీ నేతలు పలువురు గుర్రుగా ఉన్నారు. దీంతో ట్రంప్ చర్యలకు పార్టీ తరఫు నుంచి తగిన మద్దతు లేదు సరికదా.. రిపబ్లికన్ల నేతగా మరోసారి ఎన్నుకునే అవకాశాలూ మృగ్యమవుతున్నాయి. సెనేట్‌లో ట్రంప్ మద్దతుదారుగా ఇప్పటివరకూ వ్యవహరించిన మిచ్ మెక్కానెల్ ఇప్పటికే ఓట్ల లెక్కింపు జరుగుతూండగానే గెలిచినట్లు ట్రంప్ ప్రకటించడాన్ని పరోక్షంగా ఆక్షేపించారు. ‘‘గెలిచానని చెప్పుకోవడం వేరు. ఓట్ల లెక్కింపు పూర్తి కావడం వేరు’’అని కెంటకీ నుంచి గెలుపొందిన మిచ్ స్పష్టం చేశారు. ట్రంప్‌పై తమ వ్యతిరేకతను స్పష్టం చేసిన వారిలో మిచ్ ఒక్కరే లేరు. ఫ్లారిడా సెనేటర్, ఇటీవలే ట్రంప్ ర్యాలీలో ప్రసంగాలు చేసిన మార్కో రూబియో ట్విట్టర్ వేదికగా ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం చెప్పుకోవాల్సిన అంశం. ‘‘చట్టబద్ధంగా పోలైన ఓట్ల లెక్కింపులో జాప్యం జరగడం మోసం కాదు’’అని ట్వీట్ చేశారు. చట్టబద్ధ ఓట్లు లెక్కిస్తే నాదే గెలుపు ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ ట్రంప్ ఆరోపణలు చేశారు. చట్టబద్ధమైన ఓట్లనే లెక్కిస్తే తనదే గెలుపన్నారు. వైట్‌హౌస్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ఈ ఎన్నికల్లో నిజాయతీగా గెలవలేరని డెమొక్రాట్లకు తెలుసు. అందుకే భారీగా అవకతవకలకు, అక్రమాలకు పాల్పడ్డారు. లక్షలాదిగా గుర్తు తెలియని మెయిల్ ఇన్ ఓట్లు వేయించారు. దీనికి సంబంధించి నా దగ్గర చాలా ఆధారాలున్నాయి’ అని తెలిపారు. నిజాయతీతో కూడిన ఎన్నికలు, నిజాయతీతో కూడిన లెక్కింపు కోరుకుంటున్నామన్నారు. ‘చట్టబద్ధ ఓట్లు లెక్కిస్తే తేలిగ్గా గెలుపు సాధిస్తా. అక్రమ ఓట్లను లెక్కిస్తే ఫలితాలను తారుమారు చేస్తున్నట్లే. ఆలస్యంగా వచ్చిన ఓట్లను లెక్కించాలనుకుంటే మేం ప్రతిఘటిస్తాం. కానీ, చాలా ఓట్లు ఆలస్యంగా వచ్చాయి’ అని ట్రంప్ అన్నారు. ఎన్నికల ఫలితాల విశ్లేషకులు, ప్రముఖ టెక్ సంస్థలు, మీడియా.. డెమొక్రాట్ల పక్షాన నిలబడి ఓటర్లను మభ్యపెట్టాయని ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. ప్రసారం చేయని ఏబీసీ, సీబీఎస్, ఎన్బీసీ శ్వేతసౌధంలో ట్రంప్ మీడియా సమావేశాన్ని ఏబీసీ, సీబీఎస్, ఎన్బీసీ వంటి వార్తా చానళ్లు పట్టించుకోలేదు. ట్రంప్వ్యాఖ్యలపై సీఎన్ఎన్కు చెందిన ఆండర్సన్ కూపర్.. తన సమయం ముగిసిందని తెలిసి వెనక్కి తిరిగి వెళ్తున్న ఊబకాయం తాబేలు వంటి వాడంటూ ట్రంప్‌నుద్దేశించి వ్యాఖ్యానించారు. అక్రమాలు జరగలేదని అందరూ భావిస్తుండగా ట్రంప్ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తుండటం వల్లే ఆ సమావేశాన్ని తాము ఆపేశామని ఎన్బీసీకి చెందిన లెస్టర్ హోల్ట్ చెప్పారు. భారీగా దొంగ ఓట్లు పడ్డాయనేందుకు ఎలాంటి సూచనలు కనిపించడం లేదని, ఇది ట్రంప్ చేస్తున్న ఆరోపణ అని సీబీఎస్ కరస్పాండెంట్ నాన్సీ కోర్డెస్ చెప్పారు. అధ్యక్షుడు చేస్తున్న తప్పును సరి చేసేందుకే తాము ట్రంప్ కార్యక్రమాన్ని ప్రసారం చేయలేదని ఎంఎస్ఎన్బీసీ వ్యాఖ్యాత బ్రియాన్ విలియమ్స్ అన్నారు. ‘మాకు తెలిసినంత వరకు చట్ట విరుద్ధమైన ఓట్లు ఏమీ లేవు. మాకు తెలిసిన ప్రకారం ట్రంప్‌కు గెలుపు కూడా లేదు అని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు జాప్యం అవుతుండటంతో ట్రంప్ అసహనంతో ఉన్నట్లు కనిపిస్తోందన్నారు. -
అడుగు దూరం.. దూసుకెళ్తున్న బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష పదవి రేసులో జో బైడెన్ (77) మరింత ముందుకు దూసుకెళ్తున్నారు. ఆయన గెలుపు ఇక లాంఛనమే కానుంది. హోరాహోరీ పోరులో ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్‌నకు అత్యంత కీలకమైన జార్జియా, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఫలితాలు ప్రతికూలంగా ఉన్నాయి. శుక్రవారం వెలువడిన ఫలితాలను బట్టి ఇక్కడ బైడెన్‌ది పైచేయిగా ఉంది. జార్జియాలో 50 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో ట్రంప్ ఉండగా, ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇక్కడ బైడెన్ 1,579 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చారు. అదేవిధంగా, పెన్సిల్వేనియాలో ట్రంప్ కంటే బైడెన్ 5,587 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ కూడా బుధవారం వరకు ట్రంప్ 70 వేల పైచిలుకు ఓట్లతో ముందంజలో ఉండటం గమనార్హం. నెవడాల్లోనూ బైడెన్ హవానే కొనసాగుతోంది. ప్రస్తుత ఫలితాలను బట్టి బైడెన్‌కు 264 ఎలక్టోరల్ ఓట్లు, ట్రంప్‌కు 214 ఓట్లు వచ్చాయి. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లకు గాను 270 ఓట్లు సాధించిన వారికే అధ్యక్ష పీఠం దక్కనుంది. జార్జియా, పెన్సిల్వేనియాల్లో ఓటమి పాలైతే మళ్లీ ఎన్నికయ్యేందుకు ట్రంప్‌కు దారులు మూసుకుపోయినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. 2016 ఎన్నికలతో పోలిస్తే ఈసారి అధ్యక్ష అభ్యర్థి బైడెన్‌కు 41 లక్షల ఓట్లు అంటే 1.3 శాతం ఓట్లు అధికంగా పడ్డాయి. కాలిఫోర్నియా, న్యూయార్క్ వంటి రాష్ట్రాల్లో ఇంకా 60 లక్షల ఓట్లను లెక్కించాల్సి ఉన్నందున బైడెన్ ఆధిక్యం మరింతగా పెరిగేందుకు అవకాశాలున్నాయని వాషింగ్టన్ పోస్ట్ అంచనా వేస్తోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో కొన్నిసార్లు పరిస్థితులు ఇబ్బందికరంగా మారతాయని, వాటిని తట్టుకునేందుకు కొంచెం ఓపిక అవసరమవుతుందని విజయానికి చేరువలో ఉన్న జో బైడెన్ వ్యాఖ్యానించారు. బైడెన్‌కు సీక్రెట్ సర్వీస్ రక్షణ ప్రస్తుత పరిణామాలను అంచనా వేసిన అమెరికా నిఘా విభాగం అధికారుల బృందాలు జో బైడెన్‌కు రక్షణ కల్పించేందుకు విల్మింగ్టన్, డెలావర్‌కు తరలివెళ్లినట్లు సమాచారం. అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందే వారికి అమెరికా సీక్రెట్ సర్వీస్ భారీగా భద్రత కల్పిస్తుంది. కాబోయే అధ్యక్షుడికి విమాన ప్రయాణాల సమయాల్లో కూడా ఈ విభాగం అదనపు రక్షణ చర్యలు తీసుకుంటుంది. గత వారం నుంచే బైడెన్ వెంట సీక్రెట్ సర్వీస్ బృందం ఒకటి రక్షణగా ఉంటున్నట్లు అమెరికా మీడియా అంటోంది. ఎన్నికల రోజున బైడెన్ వాహన కాన్వాయ్కి కూడా భద్రత కల్పించినట్లు తెలుస్తోంది. భద్రతా విభాగం స్పందించడం కాస్త ఆలస్యమైనా ఈ పరిణామాన్ని తాము ముందుగానే ఊహించామని ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల్లో ప్రత్యర్థి జో బైడెన్ ముందంజలో ఉన్నప్పటికీ వెంటనే ట్రంప్ ఓటమిని అంగీకరించేందుకు సిద్ధంగా లేరని పరిశీలకులు అంటున్నారు. కాగా, పెన్సిల్వేనియా, మిషిగన్, జార్జియా, నెవడాల్లో పోలింగ్‌లో అవకతవకలు జరిగాయంటూ ట్రంప్ అనుచరులు కోర్టుల్లో కేసులు వేశారు. ఈ పరిణామాలపై బైడెన్ ప్రతినిధి ఒకరు స్పందించారు. ‘జూలై 19న మేం చెప్పిన విధంగానే, అమెరికా ప్రజలు ఈ ఎన్నికల్లో అంతిమ నిర్ణయం తీసుకుంటారు. అధ్యక్ష భవనంలో దొంగచాటుగా తిష్ట వేసే వారిని అడ్డుకునే సమర్థత అమెరికా ప్రభుత్వానికి ఉంది’ అని ఆయన పేర్కొన్నారు. 120 ఏళ్లలో అత్యధిక ఓటింగ్ ఈ ఎన్నికల్లో ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ జరిగింది. గత 120 ఏళ్ల రికార్డులన్నీ తిరగరాసేలా ఓటర్లు తమ ఓటు హక్కు విని యోగించుకున్నట్టు అమెరికా ఎలక్షన్ ప్రా జెక్టు వెల్లడించింది. ఈసారి ఎన్నికల్లో 23.9 కోట్ల మందికి ఓటు హక్కు ఉండగా వారిలో 16 కోట్ల మంది ఓటు వేశారు. 1900 ఎన్నికల తర్వా త ఈ స్థాయిలో ఓటర్లు తమ హక్కుని విని యోగించుకోవడంఇదే తొలిసారి. జార్జియాలో రీకౌంటింగ్ ట్రంప్, బైడెన్ల మధ్య ఓట్ల తేడా స్వల్పంగా ఉండటంతో జార్జియాలో రీకౌంటింగ్ చేపట్టనున్నారు. ఇక్కడ బైడెన్‌కు 1,579 ఓట్ల స్వల్ప మెజారిటీ లభించినా ఇద్దరు అభ్యర్థులకు చెరో 49.4 శాతం ఓట్లు పడ్డాయి. మరో 4,169 ఓట్లను లెక్కించాల్సి ఉంది. జార్జియా చట్టాల ప్రకారం ఇద్దరు అభ్యర్థుల ఓట్లలో 0.5 శాతం ఓట్ల తేడా ఉంటే వారి కోరిక మేరకు రీకౌంటింగ్ జరపొచ్చు. రిపబ్లికన్ పార్టీ కంచుకోటగా ఉన్న జార్జియాలో సైనిక సిబ్బంది, ఇతరుల ఓట్లు మరో 9వేల వరకు రావాల్సి ఉన్నందున ఫలితాలపై ప్రభావం చూపొచ్చు. గతంలో ఇక్కడ జరిగిన రీ కౌంటింగ్‌తో ఫలితాలు మారలేదనీ, తాజా రీకౌంటింగ్తో కొత్త పరిణామాలకు తావుండదని భావిస్తున్నారు. అంతా గందరగోళం అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఎవరు ఏ రాష్ట్రంలో ముందంజలో ఉన్నారో స్పష్టంగా చెప్పలేని పరిస్థితి. దీనికి ప్రధాన కారణం అక్కడ మీడియా సంస్థలే. ఒక్కో చానెల్ ఒక్కో అంకెలు చూపిస్తూ ప్రపంచ దేశాల ప్రజల్ని అయోమయానికి గురి చేస్తున్నాయి. అసోసియేట్ ప్రెస్, ఫాక్స్ న్యూస్ బైడెన్ 264 ఎలక్టోరల్ ఓట్లు సాధించారని, మేజిక్ ఫిగర్ 270కి ఆరు ఓట్లు దూరంలో ఉన్నారని చెబుతున్నాయి. ఇక మిగిలిన మీడియా బైడెన్‌కి 253 ఎలక్టోరల్ ఓట్లు వచ్చినట్టుగా చెబుతున్నాయి. 11 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న అరిజోనా రాష్ట్రం విషయంలో ఏర్పడిన గందరగోళం ఎన్నికల తీరుతెన్నుల్ని అర్థం చేసుకోలేనట్టుగా మారింది. అమెరికాలో ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక స్వయంప్రతిపత్తి సంçస్థ లేదు. అమెరికాలో ఏ ఎన్నికలు జరిగినా ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వాలే ఎన్నికల నిర్వహణ బాధ్యతని తీసుకుంటాయి. ఈ సారి కరోనా ప్రభావంతో 68% ఓట్లు ముందస్తుగా పోస్టల్ బ్యాలెట్ రూపంలో వేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కించాలంటే ఓటరు సంతకం, సాక్షి సంతకాలు, చిరునామా కచ్చితంగా పరిశీలించాలి. ఆ తర్వాత కౌంటింగ్ మిషన్లలో సమాచారాన్ని నిక్షిప్తం చేయాలి. దీంతో ఓట్ల లెక్కింపు ఆలస్యం అవుతోంది. ఫీనిక్స్‌లో ట్రంప్, బైడెన్ మద్దతుదారుల వాగ్వాదం పొమోనాలో ఇంకా లెక్కించాల్సిన సంచులకొద్దీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు -
మార్కెట్‌కు బైడెన్ జోష్
ముంబై: అందరూ అనుకున్నట్లుగానే అమెరికా అధ్యక్ష పోటీలో జో బైడెన్ ముందంజలో కొనసాగుతుండడం స్టాక్ మార్కెట్లకు జోష్‌నిచ్చింది. భారత సేవల రంగం ఏడునెలల తర్వాత మెరుగైన గణాంకాలను ప్రకటించడంతో ఇన్వెస్టర్లకు దేశ ఆర్థిక రికవరీ పట్ల మరింత విశ్వాసం పెరిగింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐల పెట్టుబడుల పరంపర కొనసాగడం, రూపాయి 40 పైసలు బలపడటం, అంచనాలకు అనుగుణంగా కంపెనీల క్యూ2 ఫలితాల ప్రకటన పెట్టుబడిదారులకు మరింత ఉత్సాహాన్నిచ్చాయి. అలాగే అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల ట్రేడింగ్ సెంటిమెంట్‌ను మరింత బలపరిచింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ముగిసేవరకు మార్కెట్లో విస్తృత స్థాయి కొనుగోళ్లు జరిగాయి. ఒక్క రియల్టీ తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. మెటల్ షేర్ల పట్ల అధిక ఆసక్తి చూపారు. దీంతో సూచీలకు వరుసగా నాలుగోరోజూ లాభాల ముగింపు ఖరారైంది. సెన్సెక్స్ 724 పాయింట్లు పెరిగి 41,340 వద్ద, నిఫ్టీ 212 పాయింట్ల లాభంతో 12,120 వద్ద స్థిరపడ్డాయి. ఇరు సూచీలకిది ఎనిమిది నెలల గరిష్ట ముగింపు కావడం విశేషం. ఈ నాలుగు రోజుల్లో సెన్సెక్స్ 1,727 పాయింట్లు, నిఫ్టీ 478 పాయింట్లను ఆర్జించాయి. తద్వారా ఈ ఏడాదిలో నమోదైన నష్టాలను పూడ్చుకోగలిగాయి. సెన్సెక్స్ సూచీలో మొత్తం 30 షేర్లు లాభాల్లో ముగిశాయి. ఆరుశాతం పెరిగిన ఎస్బీఐ షేరు ఎస్బీఐ షేరు గురువారం బీఎస్ఈలో 6 శాతం లాభపడింది. రెండో త్రైమాసికంలో మెరుగైన పనితీరుతో బ్యాంకు ఆకర్షణీయమైన ఫలితాలను ప్రకటించింది. క్యూ2 ఫలితాలు మార్కెట్‌ను మెప్పించడంతో షేరు రూ.214 వద్ద ప్రారంభమైంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఇన్వెస్టర్లు షేరు కొనుగోళ్లకు తెరతీశారు. ఒకదశలో ఏడుశాతం ఎగిసిన రూ.221 స్థాయికి చేరుకుంది. చివరికి ఆరుశాతం లాభంతో రూ.218 వద్ద ముగిసింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.10,397 కోట్లు పెరిగి రూ.1.95 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ‘‘ఊహించినట్లుగానే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ ముందంజ ఈక్విటీ మార్కెట్లకు కలిసొచ్చింది. అమెరికా ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్ఓఎంసీ) వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులేకుండా యథాతథ కొనసాగింపును ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. అంచనాలకు అనుగుణంగా కంపెనీల క్వార్టర్ ఫలితాలు, ఈక్విటీ మార్కెట్లో ఎఫ్ఐఐల పెట్టుబడుల కొనసాగింపు భారత మార్కెట్‌ను లాభాల్లో నడిపిస్తున్నాయి’’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ విభాగపు అధిపతి వినోద్ నాయర్ అభిప్రాయపడ్డారు. ఇన్వెస్టర్ల సంపద రూ.2.78 లక్షల కోట్లు అప్ సూచీలు భారీ ర్యాలీతో గురు వారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ. 2.78 లక్షల కోట్లను సంపదను ఆర్జించారు. మార్కెట్లో విస్తృత స్థాయిలో కొనుగోళ్లతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 162 లక్షల కోట్లకు ఎగసింది. -
వివాదాల పరిష్కారానికి 3మార్గాలు
అమెరికాలో ఎన్నికల సందర్భంగా ఏర్పడే వివాదాల పరిష్కారానికి అమెరికన్ పార్లమెంటరీ వ్యవస్థలో తగిన ఏర్పాట్లు ఉన్నాయి. కోర్టు కేసుల ద్వారా పరిష్కరించుకోవడం వీటిల్లో ఒకటి మాత్రమే. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ద్వారా అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు అమెరికా రాజ్యాంగం అనుమతిస్తుంది. ఈ మూడు మార్గాలపై సంక్షిప్తంగా... 2020 ఎన్నికల్లో డెమొక్రాట్లు అధికులు మెయిల్ ద్వారా ఓట్లు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇది రిపబ్లికన్ల కంటే ఎక్కువ సంఖ్యలో ఉంది. పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఎన్నికల రోజు వరకూ ఈ మెయిల్ ఇన్ బ్యాలెట్ల లెక్కింపు జరగలేదు. విస్కాన్సిన్లో ఇరువురు అభ్యర్థుల మధ్య అంతరం చాలా తక్కువగా ఉండటంతో బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అంశంపై వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది. రాష్ట్రాల్లో దాఖలైన వేర్వేరు కేసులన్నీ చివరకు అమెరికా సుప్రీంకోర్టు ముందుకు విచారణకు వస్తాయి. 2000లో రిపబ్లికన్ అభ్యర్థి జార్జ్ డబ్ల్యూ బుష్ ఫ్లోరిడాలో డెమొక్రటిక్ అభ్యర్థి అల్‌గోర్‌పై గెలిచింది ఇలాంటి కోర్టు కేసు సాయంతోనే. అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇటీవలే మరణించిన నేపథ్యంలో ట్రంప్ అమీ కోనీ బారెట్‌ను ప్రధాన న్యాయమూర్తిగా నియమించిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. బారెట్ నియామకం కూడా 6– 3 ఆధిక్యంతో జరగడం ట్రంప్‌కు అనుకూలించే అంశమని నిపుణుల అంచనా. చట్టాన్ని సక్రమంగా వాడుకోవాలన్నదే తమ అభిమతమని, అందుకే ఓటింగ్‌ను నిలిపివేయాలని కోరుతూ సుప్రీంకోర్టుకు వెళతామని ట్రంప్ ఇటీవలే వ్యాఖ్యానించారు. ఎలక్టోరల్ కాలేజీ ద్వారా... అమెరికా రాజ్యాంగం ప్రకారం మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో కనీసం 270 సాధించిన వారికి అధ్యక్ష పీఠం దక్కుతుంది. ఈ ఏడాది డిసెంబర్ 14న ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు సమావేశమై అధ్యక్షుడి కోసం ఓట్లు వేయనున్నారు. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్లు రెండూ జనవరి 6న సమావేశమై ఈ ఓట్లను లెక్కించి విజేతను ప్రకటిస్తాయి. సాధారణ పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాల గవర్నర్లు ఫలితాలను నిర్ధారించి ఆ సమాచారాన్ని కాంగ్రెస్‌కు అందిస్తూంటారు. అయితే ఎన్నికలు పోటాపోటీగా జరిగిన రాష్ట్రాల్లో గవర్నర్, అసెంబ్లీలు రెండు వేర్వేరు ఫలితాలను ఇస్తే ఏమవుతుందన్నది ఇటీవలి కాలంలో విశ్లేషకులు కొందరు ప్రశ్నిస్తున్నారు. పెన్సిల్వేనియా, మిషిగన్, విస్కాన్సిన్, నార్త్ కరోలినాల్లో గవర్నర్లు డెమొక్రటిక్ పార్టీకి చెందిన వారు. అసెంబ్లీలన్నీ రిపబ్లికన్ల నియంత్రణలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎవరి మాటకు విలువ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇలాంటి పరిస్థితి ఏర్పడే అవకాశం లేదని పలువురు చెబుతున్నప్పటికీ, 2000, 1876లలో ఇదే రకమైన వివాదాలు ఏర్పడిన విషయాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైతే సెనేట్ రిపబ్లికన్ల చేతుల్లో ఉండగా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో డెమోక్రాట్ల ఆధిక్యత కొనసాగుతోంది. అయితే జనవరి 3న ప్రమాణ స్వీకారం చేసే కొత్త కాంగ్రెస్ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను లెక్కించనుండటం గమనార్హం. ఈ నేపథ్యంలో రెండు సభలు ఫలితాల విషయంలో అంగీకారానికి రాలేకపోతే ఏమవుతుందన్నది ఓ శేష ప్రశ్న. చట్ట ప్రకారం చూస్తే ఆయా రాష్ట్రాల కార్యనిర్వాహక వర్గం ఆమోదించిన ఎలక్టర్ల మాటే చెల్లుబాటు అవుతుంది. కానీ దీనిపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పటివరకూ ఈ అంశం న్యాయస్థానాల పరీక్షకు గురికాని నేపథ్యంలో పరిస్థితి మరింత ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కొన్ని రాష్ట్రాల ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల లెక్కింపు నిలిచిపోతే అప్పుడు కూడా విజయానికి 270 ఓట్లు కావాలా? లేక లెక్కించిన ఓట్లలో ఆధిక్యత వస్తే సరిపోతుందా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితి ఏర్పడితే పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం మినహా మరో మార్గం ఉండదు. కంటింజెంట్ ఎన్నికలు... ఎలక్టోరల్ ఓట్లలో ఏ పార్టీ అభ్యర్థికీ తగిన మెజార్టీ రాకపోతే అది కాస్తా అమెరికన్ రాజ్యాంగంలోని 12వ సవరణ ప్రకారం కంటింజెంట్ ఎన్నికలకు దారితీస్తుంది. ఇందులో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. సెనేట్ ఉపాధ్యక్షుడిని ఎంపిక చేస్తుంది. ఈ కంటింజెంట్ ఎన్నికల్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లోని ప్రతి రాష్ట్ర ప్రతినిధి బృందానికి ఒక్కో ఓటు లభిస్తుంది. ప్రస్తుతం 50 రాష్ట్రాల్లో ఇరవై ఆరు రిపబ్లికన్ల నియంత్రణలో ఉన్నాయి. డెమోక్రాట్లకు 22 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్క రాష్ట్రంలో ఇరువురికీ సమానమైన ప్రాభవం ఉంది. ఇంకో రాష్ట్రంలో ఏడుగురు డెమోక్రాట్లు, ఆరుగురు రిపబ్లికన్లు, ఒక లిబరటేరియన్ ఉన్నారు. ఎలక్టోరల్ ఓట్లు ఇరు పార్టీల అధ్యక్ష అభ్యర్థులకు 269 చొప్పున వచ్చినప్పుడు మాత్రమే ఈ కంటింజెంట్ ఎన్నికలు జరుగుతాయి. అయితే ఏ వివాదమైనా జనవరి 20లోపు ముగియాల్సిందే. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం ఆ రోజుతో అధ్యక్షుడి పదవీ కాలం ముగుస్తుంది. ఒకవేళ ఆ రోజుకు కూడా కొత్త అధ్యక్షుడిపై నిర్ణయం జరగకపోతే స్పీకర్ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం డెమోక్రాటిక్ పార్టీకి చెందిన నాన్సీ పెలోసీ స్పీకర్‌గా ఉన్నారు. -
కోర్టుకెక్కిన ట్రంప్ మద్దతుదారులు
వాషింగ్టన్: జార్జియా, విస్కాన్సిన్, పెన్సిల్వేనియా, మిషిగాన్ రాష్ట్రాల్లో ఓట్ల కౌంటింగ్‌ను సవాల్ చేస్తూ ట్రంప్ మద్దతుదారులు కోర్టులో పిటిషన్లు వేశారు. గడువు ముగిసిన తర్వాత వచ్చిన మెయిల్ ఇన్ ఓట్లను లెక్కించవద్దని, కౌంటింగ్‌లో అక్రమాలు జరిగాయంటూ ఆ పిటిషన్లలో పేర్కొన్నారు. స్వింగ్ రాష్ట్రాల్లో అక్రమాలు జరిగాయని మళ్లీ ఓట్ల లెక్కింపు చేపట్టాలంటూ ట్రంప్ మద్దతుదారులు ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. న్యాయస్థానంలో సవాళ్లు ఇవీ.. జార్జియా: ఈ రాష్ట్రంలో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారు. 16 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్న జార్జియాలో అత్యంత కీలక రాష్ట్రం కావడంతో ఓట్ల లెక్కింపుని వెంటనే నిలిపివేయాలని ట్రంప్ అనుచరులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. విస్కాన్సిన్: విస్కాన్సిన్లో విజయం సాధించడంతో జో బైడెన్ శ్వేత సౌధానికి మరింత చేరువయ్యారు. 10 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో ఓట్లను మళ్లీ లెక్కించాలని ట్రంప్ వర్గం పిటిషన్ వేసింది. దీనిపై నవంబర్ 17లోగా కోర్టు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పెన్సిల్వేనియా: 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో ట్రంప్ అధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ రాష్ట్రంలో ఆలస్యంగా కౌంటింగ్ కేంద్రాలకు వచ్చే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించవద్దంటూ ట్రంప్ మద్దతుదారులు కోర్టుకెక్కారు. ఈ రాష్ట్రంలో ఇంకా 10 లక్షల ఓట్లను లెక్కించాల్సిన పరిస్థితి ఉంది. నవంబర్ 12 వరకు పోస్టల్ బ్యాలెట్లను స్వీకరించడానికి గడువు పెంచడంపై ట్రంప్ వర్గం తీవ్ర అసహనంతో ఉంది. మిషిగాన్: ఈ రాష్ట్ర్రంలో ఇంచుమించుగా ఓట్ల లెక్కింపు పూర్తయ్యాక ట్రంప్ అనుయాయులు కోర్టుకెక్కారు. 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న ఈ రాష్ట్రంలో ట్రంప్ కంటే బైడెన్ 3శాతం అధికంగా ఓట్లను సాధించారు. ఈ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియకి సంబంధించి కోర్టుకెక్కినా పెద్దగా ఉపయోగం ఉండదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. పోలింగ్‌కు ముందే వివాదాలు ఈ సారి అమెరికా అధ్యక్ష ఎన్నికలు వివాదాల చుట్టూనే తిరుగుతున్నాయి. కరోనా సంక్షోభం కారణంగా ముందస్తు ఓటింగ్, మెయిల్ ఇన్ ఓటింగ్ ప్రక్రియలు ఆది నుంచి వివాదాన్ని రేపుతున్నాయి. మెయిల్ ఇన్ ఓటింగ్‌లో అవకతవకలకు ఆస్కారం ఉందని ట్రంప్ శిబిరం ఆరోపిస్తోంది. పోలింగ్‌కు ముందే ఈ ప్రక్రియను సవాల్ చేస్తూ 44 రాష్ట్రాల్లో 300కి పైగా కేసులు నమోదయ్యాయి. -
అడుగు దూరంలో బైడెన్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతూనే ఉంది. దేశాధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారని స్పష్టంగా తెలిసేందుకు మరికొంత సమయం పట్టనుంది. అయితే, మేజిక్ మార్క్ 270కి అత్యంత చేరువలోకి వచ్చిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ విజయం లాంఛనమేనని ఆయన మద్దతుదారులు భావిస్తున్నారు. మరోవైపు, కౌంటింగ్ కొనసాగుతున్న పలు కీలక రాష్ట్రాల్లో ఆధిక్యతలో కొనసాగుతున్నందున తుది ఫలితం తమకే అనుకూలంగా వస్తుందని రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బృందం ఆశాభావంతో ఉంది. ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం 264 ఎలక్టోరల్ ఓట్లతో అధ్యక్ష పీఠానికి డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ అడుగు దూరంలో నిలిచారు. మేజిక్ మార్క్ 270 కి ఆయన కేవలం ఆరు ఓట్ల దూరంలో ఉన్నారు. ముఖ్యమైన విస్కాన్సిన్, మిషిగాన్ రాష్ట్రాల్లో విజయం సాధించడం బైడెన్‌కు అనుకూలించింది. మరోవైపు, ట్రంప్ కేవలం 214 ఎలక్టోరల్ ఓట్లతో ఫినిషింగ్ లైన్‌కు చాలా దూరంలో ఉన్నారు. కానీ, ఫలితాలు వెలువడాల్సిన రాష్ట్రాలు తన ఖాతాలోనే పడుతాయని, దాంతో విజయం తనకే దక్కుతుందని ట్రంప్ నమ్మకంతో ఉన్నారు. జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కరొలినా, నెవడా, అలస్కాల్లో ఫలితాలను ప్రకటించాల్సి ఉంది. 11 అరిజోనా ఎలక్టోరల్ ఓట్లు ఉన్న అరిజోనా ఫలితాన్ని పలు మీడియా సంస్థలు ఇంకా నిర్ధారించలేదు. ‘సీఎన్ఎన్’ సంస్థ అరిజోనాను మినహాయించి బైడెన్ సాధించిన ఎలక్టోరల్ ఓట్లు 255 అని పేర్కొంది. అరిజోనాలో కౌంటింగ్ ముగియలేదని, 86% కౌంటింగ్ అనంతరం, బైడెన్ 68 వేల మెజారిటీతో ఉన్నారని పేర్కొంది. కానీ, మెజారిటీ మీడియా సంస్థలు మాత్రం అరిజోనాను బైడెన్ ఖాతాలో వేసి, ఆయన గెల్చుకున్న ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 264 అని పేర్కొన్నాయి. పెన్సిల్వేనియా.. జార్జియాలో.. 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న పెన్సిల్వేనియాలో 91% ఓట్ల కౌంటింగ్ పూర్తయిన తరువాత ట్రంప్ 1,35,671 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఇక్కడ 71% పోస్టల్ ఓట్ల కౌంటింగ్ పూర్తయింది. ఇంకా, 7.63 లక్షల ఓట్లను లెక్కించాల్సి ఉంది. అలాగే, నార్త్ కరోలినాలో 95% కౌంటింగ్ ముగిసిన తరువాత ట్రంప్‌నకు 77,337 ఓట్ల మెజారిటీ ఉంది. ఇక్కడ ఉన్న ఎలక్టోరల్ ఓట్ల సంఖ్య 15. 16 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న జార్జియాలో 96% కౌంటింగ్ అనంతరం ట్రంప్ మెజారిటీ 18,586కి తగ్గింది. ఇక్కడ ఇంకా 90, 735 ఓట్లను లెక్కించాల్సి ఉంది. 6 ఎలక్టోరల్ ఓట్లు ఉన్న నెవడాలో 86% కౌంటింగ్ తరువాత బైడెన్ 8వేల స్వల్ప ఆధిక్యతలో ఉన్నారు. తాను ఆధిక్యతలో ఉన్న రాష్ట్రాలతో పాటు, బైడెన్ ఆధిక్యతలో ఉన్నవాటిలో ఒక్క రాష్ట్రాన్నైనా చేజిక్కించుకుంటే.. ట్రంప్‌నకు విజయం సాధ్యమవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. విజయం దక్కని పక్షంలో.. కోర్టులో తన పోరాటాన్ని కొనసాగించాలని ట్రంప్ నిర్ణయించారు. అందులో భాగంగానే, ఇప్పటికే పలు రాష్ట్రాల్లోని కోర్టుల్లో ఆయన కేసులు వేశారు. కౌంటింగ్‌ను నిలిపేసేలా ఆదేశాలివ్వాలని ఆయన కోర్టులను అభ్యర్థించారు. ఈ దిశగా సుప్రీంకోర్టులోనూ ఆయన కేసు వేశారు. పోరాటం ఇంకా ముగియలేదని, తాము రేసులోనే ఉన్నామని రిపబ్లికన్ పార్టీ నేషనల్ కమిటీ అధ్యక్షురాలు రొన్నా మెక్‌డేనియల్ చెప్పారు. ‘ఈ వారాంతానికి ఈ దేశానికి అధ్యక్షుడుగా మరో నాలుగేళ్లు ట్రంపే ఉంటారని స్పష్టమవుతుంది’ అని ట్రంప్ ప్రచార బృందంలోని జేసన్ మిల్లర్ వ్యాఖ్యానించారు. ‘కౌంటింగ్ మొత్తం ముగిసి, పూర్తి ఫలితాలు వెలువడిన తరువాతనే నేను విజేతగా భావిస్తాను. అమెరికా అధ్యక్షుడిగా నిష్పక్షపాతంగా నేను వ్యవహరిస్తాను’ అని బుధవారం బైడెన్ వ్యాఖ్యానించారు. విస్కాన్సిన్లో ఇద్దరు అభ్యర్థులకు వచ్చిన ఓట్లలో తేడా 1 శాతం లోపే ఉంది. అందువల్ల రీకౌంటింగ్‌కు డిమాండ్ చేసే చట్టబద్ధ అవకాశం ట్రంప్‌నకు ఉంది. కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించే అవకాశం తమకు ఇవ్వలేదని ఆరోపిస్తూ.. మిషిగన్‌లో కౌంటింగ్ నిలిపేయాలని ట్రంప్ ప్రచార బృందం స్థానిక కోర్టులో కేసు వేసింది. కోర్టులో తొలి విజయం ఎన్నికల వివాదాల్లో ట్రంప్ తొలి విజయం సాధించారు. ‘పరిశీలకులను ఆరు అడుగుల లోపు నుంచి కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు అనుమతించాలి’ అని పెన్సిల్వేనియాలోని కామన్వెల్త్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ తీర్పు వచ్చిన వెంటనే.. ‘పెన్సిల్వేనియాలో న్యాయపరంగా భారీ విజయం’ ట్రంప్ ట్వీట్ చేశారు. ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్‌ను కూడా పరిశీలిస్తామని పెన్సిల్వేనియాలో ట్రంప్ ప్రచార మేనేజర్ స్టెపిన్ తెలిపారు. షికాగోలో బైడెన్ మద్దతుదారుల నిరసన -
మూడోరోజూ ముందుకే...
ముంబై: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే మొగ్గుచూపారు. దీంతో మార్కెట్ ముచ్చటగా మూడోరోజూ లాభాలను మూటగట్టుకుంది. అంతర్జాతీయ మార్కెట్ల లాభాల ట్రేడింగ్ సూచీలకు దన్నుగా నిలిచింది. దేశీయ ఈక్విటీలను కొనేందుకు ఎఫ్ఐఐలు ఆసక్తి చూపడం ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చింది. అధిక వెయిటేజీ రిలయన్స్‌తో పాటు ఐటీ షేర్ల అండతో సెన్సెక్స్ 355 పాయింట్ల లాభంతో 40,616 వద్ద ముగిసింది. నిఫ్టీ 95 పాయింట్లను ఆర్జించి 11,900 పైన 11,909 వద్ద స్థిరపడింది. వరుస మూడు ట్రేడింగ్ సెషన్లలో సెనెక్స్ 1,003 పాయింట్లను ఆర్జించగా, నిఫ్టీ 266 పాయింట్లు పెరిగింది. ఇంట్రాడేలో ఫార్మా, ఐటీ, ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ, మీడియా రంగాల షేర్లు లాభపడ్డాయి. రియల్టీ, మెటల్, ఫైనాన్స్ షేర్లు నష్టాలను చవిచూశాయి. 617 పాయింట్ల రేంజ్లో కదలాడిన సెన్సెక్స్.... అంతర్జాతీయ మార్కెట్లను అనుసరిస్తూ బుధవారం మార్కెట్ లాభాలతో మొదలైంది. అమెరికా అధ్యక్ష పదవి పోరులో ఊహించినట్లుగానే బైడెన్ ముందంజలో ఉన్నాడనే వార్తలతో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఉదయం సెషన్లో సెన్సెక్స్ 432 పాయింట్లు పెరిగి 40,693 గరిష్టాన్ని తాకింది. నిఫ్టీ 117 పాయింట్లను ఆర్జించి 11,929 వద్ద ఇంట్రాడే హైని తాకింది. మిడ్ సెషన్లో లాభాల స్వీకరణ జరగడంతో సూచీలు వెనకడుగు వేశాయి. అయితే యూరప్ మార్కెట్ల పాజిటివ్ ప్రారంభం ఇన్వెస్టర్లకు విశ్వాసాన్నిచ్చింది. అలాగే చివరి గంట కొనుగోళ్లు కూడా సూచీల లాభాల ముగింపునకు కారణమయ్యాయి. ‘‘యూఎస్ ఎన్నికల ఫలితాలపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఈక్విటీల్లో అనిశ్చితి కొనసాగుతూనే ఉంటుంది. ఓట్ల లెక్కింపులో మోసం చేయటానికి కుట్ర చేస్తున్నారని, దీనిపై తాము సుప్రీంకోర్టుకు వెళతామని ట్రంప్ ప్రకటించడంతో యూరప్ మార్కెట్లు ఆరంభలాభాల్ని కోల్పోయిన విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితుల్లో కొనుగోళ్లకు దూరంగా ఉండటమే మంచిది’’ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ దీపక్ జెసానీ తెలిపారు. సన్‌ఫార్మా షేరు 4 శాతం జంప్: సన్‌ఫార్మా షేరు బుధవారం బీఎస్ఈలో 4 శాతం లాభపడింది. ప్రోత్సాహకరమైన క్యూ2 ఫలితాల ప్రకటన షేరును రెండోరోజూ లాభాల బాట పట్టించింది. ఒకదశలో 6.81 శాతం పెరిగి రూ.518 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. చివరికి 4 శాతం లాభంతో రూ.504 వద్ద స్థిరపడింది. నవంబర్ 14న దీపావళి మూరత్ ట్రేడింగ్ దీపావళి పండుగ రోజున ప్రత్యేకంగా గంటపాటు మూరత్ ట్రేడింగ్‌ను నిర్వహిస్తామని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఎక్సే్ఛంజీలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఈ ఏడాది నవంబర్ 14 న దీపావళి పండుగ జరగనుంది. అదేరోజు సాయంత్రం 6:15 గంటల నుంచి 7:15 మధ్య ఈ ముహూరత్ ట్రేడింగ్ నిర్వహిస్తామని స్టాక్ ఎక్సే్ఛంజీలు వివరించాయి. హిందూ పంచాంగం ప్రకారం బ్రోకర్లకు, వ్యాపారులకు కొత్త సంవత్సరం దీపావళి రోజున ప్రారంభం అవుతుంది. నవంబర్ 16న (సోమవారం) బలిప్రతిపద పండుగ సందర్భంగా ఎక్సే్ఛంజీలకు సెలవు ప్రకటించారు. దీంతో మార్కెట్లు తిరిగి నవంబర్ 17న ప్రారంభమవుతాయి. -
వెనిజువెలా ఎన్నికల్లో మదురో ఘనవిజయం
కారకస్: వెనిజువెలాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో సోషలిస్ట్ నేత నికోలస్ మదురో(55) ఘనవిజయం సాధించారు. జాతీయ ఎన్నికల కౌన్సిల్ ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో యునైటెడ్ సోషలిస్ట్ పార్టీ ఆఫ్ వెనిజువెలాకు చెందిన మదురో 68 శాతం ఓట్లను దక్కించుకున్నారు. దాదాపు 46.1 శాతం పోలింగ్ నమోదైన ఈ ఎన్నికల్లో మదురోకు 58 లక్షల ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి హెన్రీ ఫాల్కన్కు 18 లక్షల ఓట్లు పోలయ్యాయి. తాజా విజయంతో మరో ఆరేళ్లపాటు మదురో వెనిజువెలాకు అధ్యక్షుడిగా కొనసాగనున్నారు. ఫలితాల ప్రకటన అనంతరం అధ్యక్ష భవనం వద్ద గుమిగూడిన మద్దతుదారుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘ఇది చరిత్రాత్మక విజయం. ఈ ఎన్నికల్లో వెనిజువెలా గెలిచింది. శాంతి గెలిచింది. ప్రజాస్వామ్యం గెలిచింది. వెనిజువెలాలో అతిపెద్ద, శక్తిమంతమైన రాజకీయ శక్తిగా మనం చాలాకాలం ఉంటాం. వాళ్లు నన్ను చాలా తక్కువగా అంచనా వేశారు. నేను నియంతనని ప్రతిపక్షాల చేసే విమర్శలు నన్ను బాధపెట్టవు. వెనిజువెలా ఆర్థికవ్యవస్థను అమెరికా, కొలంబియా దేశాల మద్దతు ఉన్న మాఫియాలు తీవ్రంగా దెబ్బతీశాయి. రాబోయే రెండేళ్లలో ఆర్థికవ్యవస్థను మెరుగుపర్చడంపై దృష్టిసారిస్తాం’ అని పేర్కొన్నారు. వెనిజువెలాతో అనుసరిస్తున్న యుద్ధవైఖరిని అమెరికా పునఃసమీక్షించాలని మదురో విజ్ఞప్తి చేశారు. 2013, మార్చి 5న అప్పటి దేశాధ్యక్షుడు హ్యుగో చావెజ్ మరణంతో మదురో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు. కాగా, ఈ ఎన్నికల్ని బహిష్కరించిన ప్రతిపక్షాలు మరోసారి పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నాయి. మదురో ప్రభుత్వం ఎన్నికలకు ముందు, పోలింగ్ సందర్భంగా తీవ్రమైన అవకతవకలకు, ఉల్లంఘనలకు పాల్పడిందని రెండో స్థానంలో నిలిచిన హెన్రీ ఫాల్కన్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్‌కేంద్రాల సమీపంలో ‘రెడ్ టెంట్ల’ను ఏర్పాటుచేశారనీ, సంక్షేమ పథకాలకు అవసరమైన ‘ఫాదర్ల్యాండ్ కార్డు’లను మదురో మద్దతుదారులు అక్కడ స్కాన్ చేశారని వెల్లడించారు. కాగా, మదురో విజయంపై మయామీ, మ్యాడ్రిడ్‌లో వలసదారులు నిరసన తెలిపారు. వెనిజువెలాలో ఎన్నికలు జరిగిన తీరు సిగ్గుచేటనీ, ఈ ప్రభుత్వాన్ని తాము గుర్తించబోమని అమెరికా, యూరోపియన్ యూనియన్(ఈయూ)తో పాటు 17 పొరుగుదేశాలు తేల్చిచెప్పాయి. తాజాగా మదురో విజయం నేపథ్యంలో వెనిజువెలా జీడీపీలో 25 శాతం ఆదాయాన్ని సమకూరుస్తున్న చమురురంగంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరిన్ని ఆంక్షలు విధించే ప్రమాదముందని విశ్లేషకులు భావిస్తున్నారు. -
రామ్‌నాథ్ కోవింద్ ఘన విజయం
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ఎన్నికల ఫలితాల్లో అనుకున్నట్లే జరిగింది. రామ్‌నాథ్ కోవింద్‌కే పట్టం కట్టారు. తొలి నుంచి భారీ ఆధిక్యంతో దూసుకెళ్లిన ఎన్డీఏ అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్.. యూపీఏ అభ్యర్థిగా మీరాకుమార్‌పై ఘన విజయం సాధించారు. కోవింద్‌కు 65.65, మీరాకుమార్‌కు 34.34 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇక రామ్‌నాథ్‌కు వచ్చిన ఓట్ల విలువ 7,02, 644 కాగా, మీరాకుమార్‌కు వచ్చిన ఓట్లు విలువ 3,67, 314. ఈనెల 25న దేశ 14వ రాష్ట్రపతిగా కోవింద్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక ఎన్నికల్లో విజయం సాధించిన కోవింద్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు కోవింద్ గెలుపుతో బీజేపీ నేతలు సంబరాలు జరుపుకుంటున్నారు. కోవింద్ ప్రొఫెల్... వివాద రహితుడిగా, పేద బడుగు బలహీన వర్గాల పక్షపాతిగా పేరొందిన కోవింద్ 1945 అక్టోబర్ ఒకటో తేదీన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ దెహత్ జిల్లా డేరాపూర్‌లో జన్మించారు. కామర్స్‌లో డిగ్రీ పూర్తిచేసి... కాన్పూర్ యూనివర్సిటీ నుంచి న్యాయవాద పట్టా పుచ్చుకున్నారు. తర్వాత సివిల్ సర్వీసెస్‌కు వెళ్లాలన్న ఆశతో ఢిల్లీ చేరుకున్నారు. మూడో ప్రయత్నంలో సివిల్స్‌కు ఎంపికయ్యారు. అయితే ఐఏఎస్ రాకపోవడంతో... న్యాయవాదిగా స్థిరపడిపోయారు. ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో 16 ఏళ్లపాటు అడ్వకేట్‌గా పనిచేశారు రామ్‌నాథ్ కోవింద్. రెండుచోట్లా కేంద్ర ప్రభుత్వ కౌన్సిల్‌గా సేవలందించారు. పేద, బడుగు బలహీన వర్గాలకు ఉచితంగా న్యాయసేవలు అందించేవారు. దేశసేవపై ఉన్న మక్కువతో తొలుత సంఘ్ పరివార్‌లో చేరారు రామ్‌నాథ్ కోవింద్. ఢిల్లీలో స్థిరపడిన తర్వాత డేరాపూర్‌లోని తన పాత ఇంటిని ఆర్ఎస్ఎస్కే రాసిచ్చారు. 1991లో బీజేపీలో చేరిన కోవింద్... బీజేపీ నుంచి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి రెండుసార్లు పోటీచేసి ఓటమిపాలయ్యారు. తర్వాత బీజేపీ దళిత మోర్చా అధ్యక్షులుగా, బీజేపీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. 1994లో తొలిసారి ఎగువసభకు ఎంపికైన కోవింద్... రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యులుగా సేవలందంచారు. 1994 నుంచి 2006 వరకూ రాజ్యసభ ఎంపీగా... పలు పార్లమెంటరీ కమిటీల్లో సభ్యులుగా, ఒక కమిటీకి ఛైర్మన్‌గానూ పని చేశారు. ఐక్యరాజ్యసమితిలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి.. 2002లో ఐరాస సాధారణ అసెంబ్లీలో ప్రసంగించారు. 2015 ఆగస్టు 16న బీహార్ గవర్నర్‌గా నియమితలైన కోవింద్... ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపికయ్యేవరకూ ఆ పదవిలో కొనసాగారు. రామ్‌నాథ్ కోవింద్ భార్య పేరు సవితా కోవింద్. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. -
ఏపీలో ఓట్లన్నీ కోవింద్‌కే, ఆధిక్యమెంత!?
రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఎన్డీఏ అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్, యూపీఏ అభ్యర్థిగా మీరాకుమార్ తలపడ్డ ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 11 గంటలకు మొదలైంది. తొలుత పార్లమెంటు హౌస్‌లో ఏర్పాటుచేసిన బ్యాలెట్ బాక్సును లెక్కిస్తున్నారు. మొదట ఎంపీల ఓట్లను లెక్కించిన అనంతరం రాష్ట్రాల నుంచి వచ్చిన బాక్సులను ఆంగ్ల వర్ణమాల క్రమంలో లెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిరౌండ్లో అరుణాచల్‌ప్రదేశ్, అసోం, ఆంధ్రప్రదేశ్ బ్యాలెట్ బాక్సుల కౌంటింగ్ పూర్తయింది. రామ్‌నాథ్‌కు 4,79,585, మీరాకుమార్‌కు 2,04,594 ఓట్లు విలువ రాగా, ఏపీలో మాత్రం రామ్‌నాథ్‌కే ఓట్లన్నీ పోలయ్యాయి. మొత్తం నాలుగు టేబుళ్లపై 8 రౌండ్ల పాటు కౌంటింగ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 గంటలకల్లా ఫలితాలు ప్రకటించే అవకాశముంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్ గెలుపు ఖాయమని వినిపిస్తోంది. ఎన్టీయేకు సంపూర్ణ మెజారిటీ ఉండటంతో కోవింద్ సునాయసంగా రాష్ట్రపతి కాబోతున్నారని తెలుస్తోంది. 776 మంది ఎంపీలు, 4,120 మంది ఎమ్మెల్యేలతో మొత్తం 4,895మంది అర్హులైన ప్రజాప్రతినిధుల్లో 99శాతం మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఇది రికార్డు పోలింగ్. ఈ పోలింగ్‌లో ఎన్డీయే అభ్యర్థి కోవింద్‌కు ఎంత ఆధిక్యం వస్తుందన్న దానిపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొని ఉంది. కోవింద్‌కు దాదాపు 70శాతం ఓట్లు లభించవచ్చునని భావిస్తున్నారు. ఏదైనా అద్భుతం, అనూహ్యం జరిగితే ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి మీరాకుమార్ విజయం సాధించవచ్చునని అంటున్నారు. -
రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నేడే
న్యూఢిల్లీ: యావత్ భారతావని ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఎన్డీఏ అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్, యూపీఏ అభ్యర్థిగా మీరా కుమార్ తలపడ్డ ఈ ఎన్నికల కౌంటింగ్ గురువారం ఉదయం 11 గంటలకు మొదలవుతుందని రిటర్నింగ్ అధికారి, లోక్‌సభ సెక్రటరీ జనరల్ అనూప్ మిశ్రా తెలిపారు. తొలుత పార్లమెంటు హౌస్‌లో ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్సును లెక్కిస్తామని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రాల నుంచి వచ్చిన బాక్సులను ఆంగ్ల వర్ణమాల క్రమంలో లెక్కించనున్నట్లు మిశ్రా తెలిపారు. నాలుగు టేబుళ్లపై 8 రౌండ్ల పాటు కౌంటింగ్ కొనసాగుతుందని వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకల్లా ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందన్నారు.