రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నేడే | Voting in presidential election ends, result on July 20 | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నేడే

Published Thu, Jul 20 2017 4:00 AM | Last Updated on Tue, Sep 5 2017 4:24 PM

Voting in presidential election ends, result on July 20

న్యూఢిల్లీ: యావత్‌ భారతావని ఆసక్తిగా ఎదురుచూస్తున్న రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఎన్డీఏ అభ్యర్థిగా రామ్‌నాథ్‌ కోవింద్, యూపీఏ అభ్యర్థిగా మీరా కుమార్‌ తలపడ్డ ఈ ఎన్నికల కౌంటింగ్‌ గురువారం ఉదయం 11 గంటలకు మొదలవుతుందని రిటర్నింగ్‌ అధికారి, లోక్‌సభ సెక్రటరీ జనరల్‌ అనూప్‌ మిశ్రా తెలిపారు.

తొలుత పార్లమెంటు హౌస్‌లో ఏర్పాటు చేసిన బ్యాలెట్‌ బాక్సును లెక్కిస్తామని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్రాల నుంచి వచ్చిన బాక్సులను ఆంగ్ల వర్ణమాల క్రమంలో లెక్కించనున్నట్లు మిశ్రా తెలిపారు. నాలుగు టేబుళ్లపై 8 రౌండ్ల పాటు కౌంటింగ్‌ కొనసాగుతుందని వెల్లడించారు. సాయంత్రం 5 గంటలకల్లా ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement