చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్‌ | Kamala Harris has made history as the first woman elected to be vice president in the US | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన కమలా హ్యారిస్‌

Published Sun, Nov 8 2020 5:02 AM | Last Updated on Sun, Nov 8 2020 9:05 AM

Kamala Harris has made history as the first woman elected to be vice president in the US - Sakshi

వాషింగ్టన్‌: చాలామంది భారతీయుల ఎదురు చూపులు ఫలించాయి. భారత సంతతి మహిళ కమలా హ్యారిస్‌ అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలిగా పగ్గాలు చేపట్టబోతున్నారు. ఒక మహిళ, ఒక ఆసియన్‌ అమెరికన్‌కు ఈ పదవికి దక్కడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అంటే కమలా హ్యారిస్‌ కొత్త చరిత్ర సృష్టించినట్లే. ఆమె ఇంతకుముందే ఎన్నో ఘనతలు సాధించారు. శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీ పదవిని అధిరోహించిన తొలి మహిళగా ఆమె కీర్తిగడించారు. అలాగే కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా సేవలందించిన మహిళగానూ రికార్డుకెక్కారు.

► కమలా హ్యారిస్‌ 1964 అక్టోబర్‌ 20న ఒక్లాండ్‌లో జన్మించారు.
► ఆమె తల్లి తమిళనాడులోని సంప్రదా య కుటుంబానికి చెందినవారు. తండ్రి జమైకా దేశస్తుడు.
► వాషింగ్టన్‌ డీసీలోని హోవార్డ్‌ యూనివ ర్సిటీలో కమల చదువుకున్నారు.
► యూసీ హేస్టింగ్స్‌ కాలేజీలో న్యాయ విద్య అభ్యసించారు.
► అలమెండా కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్నీ కార్యాలయంలో ఎనిమిది సంవత్స రాలు పనిచేశారు. ప్రధానంగా చిన్నా రులపై జరిగే హింసకు సంబంధించిన కేసులను విచారించారు.
► కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా పని చేస్తున్నప్పుడు బరాక్‌ ఒబామా దృష్టిలో పడ్డారు. అనంతరం డెమొక్ర టిక్‌ పార్టీలో చేరారు. కాలిఫోర్నియా సెనేటర్‌గా ఎన్నికయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement