అమెరికా చరిత్రలో ఉపాధ్యక్షులుగా ఉంటూ అధ్యక్షులు అయింది నలుగురే
హారిస్ గెలిస్తే ఐదో నేత అవుతారు
అగ్రరాజ్యాధినేతగా తొలి మహిళ అవుతారు
ఆసియా మూలాలున్న నేతగా, నల్లజాతి మహిళగా పలు రికార్డులు సొంతం అవుతాయి
వారం పది రోజుల కిందటి దాకా ఏకపక్షంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసును కమలా హారిస్ ఒక్కసారిగా ఆసక్తికరంగా మార్చేశారు. డెమొక్రాటిక్ పార్టీ అభ్యరి్థగా అధ్యక్షుడు బైడెన్ ఉన్నంతకాలం ఆయనపై అన్ని విషయాల్లోనూ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ఇప్పుడామె ముచ్చెమటలే పట్టిస్తున్నారు! బైడెన్ తప్పుకున్నాక తాజా సర్వేలన్నింటిలోనూ హారిస్ దూసుకుపోతున్నారు.
కొన్నింటిలోనైతే ట్రంప్‌ను దాటేశారు కూడా. ఇటు తల్లి నుంచి ఆసియా, అటు తండ్రి నుంచి నల్లజాతి మూలాలుండటం హారిస్‌కు భారీ అడ్వాంటేజ్‌గా మారుతున్నట్టు కనిపిస్తోంది. అమెరికాలో ప్రబల శక్తులుగా ఉన్న ఈ రెండు వర్గాల ఓట్లూ ఆమెకే పడటం ఖాయమంటున్నారు. ఆగస్టు 19–21 తేదీల మధ్య జరిగే డెమొక్రాట్ల జాతీయ సదస్సులో హారిస్ అభ్యరి్థత్వానికి ఆమోదముద్ర పడటం లాంఛనమే.
అదే ఊపులో ట్రంప్‌ను ఓడిస్తే 248 ఏళ్ల అమెరికా చరిత్రలో తొలి అధ్యక్షురాలిగా, ఆ ఘనత సాధించిన మొదటి ఆసియా మూలాలున్న నేతగా, నల్ల జాతి మహిళగా... ఇలా ఆ దేశ చరిత్రలోనే అరుదైన పలు రికార్డులను హారిస్ సొంతం చేసుకుంటారు. అంతేకాదు, ఉపాధ్యక్ష పదవిలో ఉంటూ అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన ఐదో అమెరికన్‌గా కూడా నిలుస్తారు.
150 ఏళ్ల విరామం తర్వాత జార్జ్‌బుష్
1836లో ఉపాధ్యక్షుడు మారి్టన్ వాన్ బురెన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత మళ్లీ ఉపాధ్యక్షుడు నేరుగా అధ్యక్షుడు కావడానికి ఏకంగా 150 ఏళ్లు పట్టింది! 1988లో నాటి ఉపాధ్యక్షుడు జార్జ్ హెచ్.డబ్లు్య.బుష్ అధ్యక్షుడు అయ్యారు. చివరగా ఆ ఘనత సాధించిన నేత ఆయనే. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కూడా గతంలో బరాక్ ఒబా మా హయాంలో ఉపాధ్యక్షునిగా చేశారు! కానీ 2016లో ఒబామా తర్వాత డెమొక్రాట్ల తరఫున బైడెన్‌కు కాకుండా హిల్లరీ క్లింటన్‌కు అధ్యక్ష అభ్యరి్థత్వం దక్కింది. అయితే ఆమె ట్రంప్ చేతిలో ఓటమి చవి చూశారు. 2020లో ట్రంప్‌ను హోరాహోరీ పోరులో బైడెన్ ఓడించడం, అధ్యక్షుడు కావ డం తెలిసిందే. 1988 తర్వాత తొలిసారిగా ఉపాధ్యక్ష పదవిలో ఉంటూ నేరుగా ప్రెసిడెంట్ అయిన తొలి నేతగా రికార్డు సొంతం చేసుకునే దిశగా కమలా హారిస్ వడివడిగా దూసుకెళ్తున్నారు.
నేరుగా పదోన్నతి నలుగురికే..
అమెరికా చరిత్రలో ఇప్పటిదాకా 49 మంది ఉపాధ్యక్షులుగా పని చేశారు. వారిలో పదిహేను మంది ఆ తర్వాత కాలంలో అధ్యక్షులు కూడా అయ్యారు. అయితే ఉపాధ్యక్ష పదవిలో ఉంటూనే ఎన్నికల బరిలో నెగ్గి అధ్యక్షులు అయింది మాత్రం కేవలం నలుగురే. ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నది అమెరికా రెండో అధ్యక్షుడు జాన్ ఆడమ్స్. ఆయన 1789 నుంచి1796 దాకా దేశ తొలి ఉపాధ్యక్షునిగా ఉన్నారు.
1796లో ఆ పదవిలో ఉంటూనే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆయన చేతిలో ఓటమి చవిచూసిన థామస్ జెఫర్సన్ అప్పటి నియమాల ప్రకారం ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. ఎందుకంటే అప్పట్లో ఉపాధ్యక్ష అభ్యర్థి అంటూ విడిగా ఉండేవారు కాదు. అధ్యక్ష రేసులో రెండో స్థానంలో నిలిచిన నేతే ఉపాధ్యక్షుడు అయ్యేవారు. తర్వాత నాలుగేళ్లకు జెఫర్సన్ ఉపాధ్యక్ష పదవిలో ఉంటూనే అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. ఆయన ఓడించింది ఎవరినో తెలుసా? నాటి అధ్యక్షుడు ఆడమ్స్‌నే! ఒక్కోపార్టీ నుంచి ఆ రెండు పదవులకూ విడిగా అభ్యర్థులు నిలబడటం పందొమ్మిదో శతాబ్దం
తొలినాళ్లలో మొదలైంది.
→ అమెరికా చరిత్రలో ఉపాధ్యక్షులుగా ఉంటూ నేరుగా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగి గెలిచిన నేతలు నలుగురు. వారు జాన్ ఆడమ్స్, థామస్ జెఫర్సన్, మారి్టన్ వాన్ బురెన్, జార్జ్ హెచ్.డబ్లు్య.బు‹Ù.
→ ఎనిమిది మంది ఉపాధ్యక్షులు అప్పటి అధ్యక్షుల మృతి కారణంగా ఆ పదవిని చేపట్టారు. వారు జాన్ టైలర్, మిలార్డ్ ఫిల్మోర్, ఆండ్రూ జాన్సన్, చెస్టర్ ఆర్థర్, థియోడర్ రూజ్ వెల్ట్, కాల్విన్ కూలిడ్జ్, హారీ ట్రూమాన్, లిండన్ జాన్సన్.
→ గెరాల్డ్ ఫోర్డ్ మాత్రం ఉపాధ్యక్షునిగా ఉంటూ, నాటి అధ్యక్షుడు రాజీనామా చేయడంతో ఆ పదవి
చేపట్టారు.
→ ఇద్దరు ఉపాధ్యక్షులు మాజీలయ్యాక, అంటే పదవీకాలం ముగిసిన కొన్నాళ్ల తర్వాత అధ్యక్ష ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. వారిలో ఒకరు రిచర్డ్ నిక్సన్ కాగా రెండోవారు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్. ళీ హారీ ట్రూమన్, చెస్టర్ ఆర్థర్ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోపే
అధ్యక్షులయ్యారు!
→ థామస్ హెండ్రిక్స్, విలియం కింగ్ ఉపాధ్యక్షులు అయిన ఏడాదిలోపే మరణించారు.
→ జార్జ్ క్లింటన్, జాన్ కాల్హన్ వరుసగా రెండుసార్లు ఉపాధ్యక్షులుగా వేర్వేరు అధ్యక్షుల హయాంలో పని చేశారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment