indian orgin woman
-
USA Presidential Elections 2024: ఆ రికార్డుపై కమలా హారిస్ కన్ను
వారం పది రోజుల కిందటి దాకా ఏకపక్షంగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసును కమలా హారిస్ ఒక్కసారిగా ఆసక్తికరంగా మార్చేశారు. డెమొక్రాటిక్ పార్టీ అభ్యరి్థగా అధ్యక్షుడు బైడెన్ ఉన్నంతకాలం ఆయనపై అన్ని విషయాల్లోనూ ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన రిపబ్లికన్ ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ఇప్పుడామె ముచ్చెమటలే పట్టిస్తున్నారు! బైడెన్ తప్పుకున్నాక తాజా సర్వేలన్నింటిలోనూ హారిస్ దూసుకుపోతున్నారు. కొన్నింటిలోనైతే ట్రంప్‌ను దాటేశారు కూడా. ఇటు తల్లి నుంచి ఆసియా, అటు తండ్రి నుంచి నల్లజాతి మూలాలుండటం హారిస్‌కు భారీ అడ్వాంటేజ్‌గా మారుతున్నట్టు కనిపిస్తోంది. అమెరికాలో ప్రబల శక్తులుగా ఉన్న ఈ రెండు వర్గాల ఓట్లూ ఆమెకే పడటం ఖాయమంటున్నారు. ఆగస్టు 19–21 తేదీల మధ్య జరిగే డెమొక్రాట్ల జాతీయ సదస్సులో హారిస్ అభ్యరి్థత్వానికి ఆమోదముద్ర పడటం లాంఛనమే. అదే ఊపులో ట్రంప్‌ను ఓడిస్తే 248 ఏళ్ల అమెరికా చరిత్రలో తొలి అధ్యక్షురాలిగా, ఆ ఘనత సాధించిన మొదటి ఆసియా మూలాలున్న నేతగా, నల్ల జాతి మహిళగా... ఇలా ఆ దేశ చరిత్రలోనే అరుదైన పలు రికార్డులను హారిస్ సొంతం చేసుకుంటారు. అంతేకాదు, ఉపాధ్యక్ష పదవిలో ఉంటూ అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన ఐదో అమెరికన్‌గా కూడా నిలుస్తారు. 150 ఏళ్ల విరామం తర్వాత జార్జ్‌బుష్ 1836లో ఉపాధ్యక్షుడు మారి్టన్ వాన్ బురెన్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత మళ్లీ ఉపాధ్యక్షుడు నేరుగా అధ్యక్షుడు కావడానికి ఏకంగా 150 ఏళ్లు పట్టింది! 1988లో నాటి ఉపాధ్యక్షుడు జార్జ్ హెచ్.డబ్లు్య.బుష్ అధ్యక్షుడు అయ్యారు. చివరగా ఆ ఘనత సాధించిన నేత ఆయనే. ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ కూడా గతంలో బరాక్ ఒబా మా హయాంలో ఉపాధ్యక్షునిగా చేశారు! కానీ 2016లో ఒబామా తర్వాత డెమొక్రాట్ల తరఫున బైడెన్‌కు కాకుండా హిల్లరీ క్లింటన్‌కు అధ్యక్ష అభ్యరి్థత్వం దక్కింది. అయితే ఆమె ట్రంప్ చేతిలో ఓటమి చవి చూశారు. 2020లో ట్రంప్‌ను హోరాహోరీ పోరులో బైడెన్ ఓడించడం, అధ్యక్షుడు కావ డం తెలిసిందే. 1988 తర్వాత తొలిసారిగా ఉపాధ్యక్ష పదవిలో ఉంటూ నేరుగా ప్రెసిడెంట్ అయిన తొలి నేతగా రికార్డు సొంతం చేసుకునే దిశగా కమలా హారిస్ వడివడిగా దూసుకెళ్తున్నారు.నేరుగా పదోన్నతి నలుగురికే.. అమెరికా చరిత్రలో ఇప్పటిదాకా 49 మంది ఉపాధ్యక్షులుగా పని చేశారు. వారిలో పదిహేను మంది ఆ తర్వాత కాలంలో అధ్యక్షులు కూడా అయ్యారు. అయితే ఉపాధ్యక్ష పదవిలో ఉంటూనే ఎన్నికల బరిలో నెగ్గి అధ్యక్షులు అయింది మాత్రం కేవలం నలుగురే. ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నది అమెరికా రెండో అధ్యక్షుడు జాన్ ఆడమ్స్. ఆయన 1789 నుంచి1796 దాకా దేశ తొలి ఉపాధ్యక్షునిగా ఉన్నారు. 1796లో ఆ పదవిలో ఉంటూనే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆయన చేతిలో ఓటమి చవిచూసిన థామస్ జెఫర్సన్ అప్పటి నియమాల ప్రకారం ఉపాధ్యక్ష పదవి చేపట్టారు. ఎందుకంటే అప్పట్లో ఉపాధ్యక్ష అభ్యర్థి అంటూ విడిగా ఉండేవారు కాదు. అధ్యక్ష రేసులో రెండో స్థానంలో నిలిచిన నేతే ఉపాధ్యక్షుడు అయ్యేవారు. తర్వాత నాలుగేళ్లకు జెఫర్సన్ ఉపాధ్యక్ష పదవిలో ఉంటూనే అధ్యక్ష ఎన్నికల్లో గెలిచారు. ఆయన ఓడించింది ఎవరినో తెలుసా? నాటి అధ్యక్షుడు ఆడమ్స్‌నే! ఒక్కోపార్టీ నుంచి ఆ రెండు పదవులకూ విడిగా అభ్యర్థులు నిలబడటం పందొమ్మిదో శతాబ్దం తొలినాళ్లలో మొదలైంది. → అమెరికా చరిత్రలో ఉపాధ్యక్షులుగా ఉంటూ నేరుగా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగి గెలిచిన నేతలు నలుగురు. వారు జాన్ ఆడమ్స్, థామస్ జెఫర్సన్, మారి్టన్ వాన్ బురెన్, జార్జ్ హెచ్.డబ్లు్య.బు‹Ù. → ఎనిమిది మంది ఉపాధ్యక్షులు అప్పటి అధ్యక్షుల మృతి కారణంగా ఆ పదవిని చేపట్టారు. వారు జాన్ టైలర్, మిలార్డ్ ఫిల్మోర్, ఆండ్రూ జాన్సన్, చెస్టర్ ఆర్థర్, థియోడర్ రూజ్ వెల్ట్, కాల్విన్ కూలిడ్జ్, హారీ ట్రూమాన్, లిండన్ జాన్సన్. → గెరాల్డ్ ఫోర్డ్ మాత్రం ఉపాధ్యక్షునిగా ఉంటూ, నాటి అధ్యక్షుడు రాజీనామా చేయడంతో ఆ పదవి చేపట్టారు. → ఇద్దరు ఉపాధ్యక్షులు మాజీలయ్యాక, అంటే పదవీకాలం ముగిసిన కొన్నాళ్ల తర్వాత అధ్యక్ష ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు. వారిలో ఒకరు రిచర్డ్ నిక్సన్ కాగా రెండోవారు ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్. ళీ హారీ ట్రూమన్, చెస్టర్ ఆర్థర్ ఉపాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోపే అధ్యక్షులయ్యారు! → థామస్ హెండ్రిక్స్, విలియం కింగ్ ఉపాధ్యక్షులు అయిన ఏడాదిలోపే మరణించారు. → జార్జ్ క్లింటన్, జాన్ కాల్హన్ వరుసగా రెండుసార్లు ఉపాధ్యక్షులుగా వేర్వేరు అధ్యక్షుల హయాంలో పని చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒకప్పుడు రెస్టారెంట్లో పని:.. ఇప్పుడు లక్షల కోట్ల టెక్ కంపెనీ సీఈవో
పట్టుదలకు మారు పేరు ఆమె. విజయానికి కేరాఫ్ ఎడ్రస్ భారత సంతతికి చెందిన యామిని రంగన్. రెస్టారెంట్లో సర్వర్‌గా కరియర్‌ను ప్రారంభించిన యామిని ఈరోజు రూ. 2.11లక్షల కోట్లకు పైగా విలువైన కంపెనీగా సీఈవోగా సేవలందిస్తున్నారు. ఈఏడాది టాప్ 100 టెక్ మహిళల్లో చోటు సంపాదించుకున్నారు. యామిని రంగన్ యుఎస్‌లోని అతిపిన్న వయస్కురాలైన అత్యుత్తమ వ్యాపార కార్య నిర్వాహకులలో ఒకరు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చాలనే లక్ష్యంతో తక్కువ కాలంలోనే ఆమె ఎన్నో పేరు ప్రఖ్యాతులు, సంపదను కూడబెట్టుకున్నారు. ఆమె అద్భుతమైన సక్సెస్ స్టోరీ.. నెట్ వర్త్ గురించి తెలుసుకుందాం. టెక్ ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన సీఈవీల్లో ఒకరుగా ఉన్నారు యామిని. భారతదేశంలోని కుగ్రామంనుంచి వచ్చి పిన్న వయసులో గ్లాస్ సీలింగ్‌ను బ్రేక్ చేసి తానేంటో నిరూపించుకుంది. మల్టీ బిలియన్ డాలర్ల టెక్ కంపెనీకి నాయకత్వం వహించే కొద్దిమంది మహిళల్లో ఒకరుగా పేరు తెచ్చుకోవడం విశేషం. (వరుణ్ లావణ్య ఎంగేజ్మెంట్: బేబీ బంప్‌తో ఉపాసన, డ్రెస్ ఖరీదెంతో తెలుసా?) హబ్స్పాట్ కంపెనీలో చేరి రెండేళ్లు పూర్తి కాకముందే సీఈవోగా బాధ్యతలు చేపట్టిన ఘనత ఆమెది. జనవరి 2020 నుండి ఆగస్టు 2021 వరకు చీఫ్ కస్టమర్ ఆఫీసర్‌గా, సెప్టెంబర్ 2021 నుండి ఇప్పటి వరకు సీఈవోగా సేవలందిస్తున్నారు. 25.66 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో కంపెనీ దిన దినాభివృద్ది చెందుతోంది. 2023లో యామినీ రంగన్ నికర విలువ దాదాపు 32 మిలియన్ డాలర్లు. 21 ఏళ్ల వయస్సులో, చాలా పరిమితమైన నగదుతో యామిని ఇండియా వదిలి భయం భయంగా అమెరికాకు పయనమైంది. జీవితం అంత సులభం కాదని ఆమె వెంటనే గ్రహించింది. యూఎస్‌లో జీవించడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో యామిని అద్దె చెల్లించిన తర్వాత ఆమె జేబులో మిగిలింది. కేవలం 150 డాలర్లు మాత్రమే. దీంతో ఉద్యోగం సంపాదించడం ఒక్కటే మార్గమని నిర్ణయించుకుంది. అలా అట్లాంటాలోని ఫుట్‌బాల్ స్టేడియం రెస్టారెంట్లో ఫుడ్, డ్రింక్స్ అందించడం తొలి ఉద్యోగమని యామిని ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తానెప్పుడూ స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటాననీ, అందుకే తల్లిదండ్రుల వద్దకు తిరిగి వెళ్లి డబ్బు అడగడానికి ఇష్టపడ లేదని చెప్పారు. యామిని యూఎస్‌లో మాస్టర్స్ చేయడానికి ముందు కోయంబత్తూరులో బీటెక్, తరువాత బెర్కిలీ నుంచి ఎంబీఏ పట్టా పుచ్చుకుంది. (డిజిటల్ చెల్లింపుల్లో ఇండియా రికార్డ్: విశేషం ఏమిటంటే!) సుదీర్ఘ కెరీర్లో సాప్, లూసెంట్, వర్క్‌డే, డ్రాప్‌బాక్స్ లాంటి ఐటీ దిగ్గజ కంపెనీల్లో నిచేశారు. 2019లో శాన్ ఫ్రాన్సిస్కోలో వ్యాపారంలో అత్యంత ప్రభావవంతమైన మహిళగా ప్రశంసలందుకున్నారు. ఇద్దరు అబ్బాయిలకు తల్లినని తన ట్విటర్ బయోలో రాసుకున్నారు యామిని. Meet HubSpot’s brand new AI-powered tools: content assistant & ChatSpot. Excited to make our CRM even easier and faster for our customers - check out https://t.co/93aEEFFr5A to learn more https://t.co/55h5JZ67kn — Yamini Rangan (@yaminirangan) March 6, 2023 -
అమెరికా పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా భారత సంతతి మహిళ
Indian-origin professor Neeli Bendapudi: భారత సంతతికి చెందిన ప్రొఫెసర్ నీలి బెండపూడి అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ అధ్యక్షురాలిగా నియమితులైన తొలి మహిళగా చరిత్ర సృష్టించారు. అయితే ఆమె విశాఖపట్నంలో జన్మించి, ఉన్నత చదువుల కోసం 1986లో అమెరికాకు వచ్చిన బెండపూడి ప్రస్తుతం కెంటకీలోని లూయిస్విల్లే విశ్వవిద్యాలయంలో మార్కెటింగ్ ప్రొఫెసర్‌గానూ, ప్రెసిడెంట్‌గానూ విధులు నిర్వర్తిస్తున్నారు. (చదవండి: అదో విచిత్రం!...సముద్రం పై కదిలే కాంతి చుక్కలు!!) ఈ మేరకు పెన్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ నీలి బెండపూడిని తదుపరి అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా పేర్కొన్నట్లు పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్శిటీ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు ఆమె అకాడమీలో దాదాపు 30 సంవత్సరాలుగా మార్కెటింగ్ విభాగంలో బోధించడమే కాక కాన్సాస్ విశ్వవిద్యాలయంలో అత్యున్నత అధికారిగా, ఎగ్జిక్యూటివ్ వైస్ ఛాన్సలర్‌గా, యూనివర్సిటీ ఆఫ్ కాన్సాస్‌లో స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్‌గా, ఓహియో స్టేట్ యూనివర్శిటీలో ఇనిషియేటివ్ ఫర్ మేనేజింగ్ సర్వీసెస్ వ్యవస్థాపక డైరెక్టర్‌గా సేవలందించారు. పైగా ఆమె తన వృత్తిని విద్యార్థుల విజయానికి అంకితం చేసింది. అయితే ఆమె వచ్చే ఏడాది 2022లో పెన్ స్టేట్ 19వ ప్రెసిడెంట్‌గా సేవలందించనున్నారు. ఈ మేరకు నీలి బెండపూడి మాట్లాడుతూ.."పెన్ స్టేట్ ఒక ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం. ఈ అత్యుత్తమ విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందితో కలిసి పనిచేయడాన్ని నెనెంతో గర్వంగా భావిస్తున్నా. అంతేకాదు పెన్ స్టేట్ యూనివర్సిటీని కొత్త శిఖరాలకు చేరుకునేలా పనిచేయడమే నా ధ్యేయం" అని అన్నారు. (చదవండి: అక్కడ చెట్లను తొలగిస్తే.... బహుమతులు ఇస్తారట!) -
Shilpa Yarlagadda: పింక్ రింగ్ శిల్ప!
తాజాగా టైమ్ మ్యాగజీన్ కవర్ ఫోటో మీద ప్రిన్స్ హారీ మేఘనా మెర్కెల్ జంట ఆకర్షణీయంగా కనిపించింది. అయితే వీరిద్దరూ ధరించిన డ్రెస్‌లు, ఆభరణాలలో ముఖ్యంగా మెర్కెల్ వేలికి తొడిగిన ‘డ్యూయెట్ పింక్ డైమండ్ రింగు’ ప్రత్యేకంగా ఉండడంతో చూపరుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక మహిళ మరొకరికి మద్దతు ఇస్తోంది అని చెప్పే ‘పింక్ వాగ్దానం’కు గుర్తుగా ఈ రింగును రూపొందించినట్లుగా ఆ ఉంగరాన్ని డిజైన్ చేసిన సంస్థ ‘శిఫాన్’ చెబుతోంది. రింగు బాగా పాపులర్ అవ్వడంతో రింగును రూపొందించిన డిజైనర్ శిల్పా యార్లగడ్డ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. శిల్ప పేరు తెరమీదకు రావడానికి ఒక పింక్ డైమండ్ రింగేగాక, చిన్న వయసులోనే డైమండ్ జ్యూవెలరీ స్టార్టప్‌ను ప్రారంభించి విజయవంతమైన ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తూ, తనకు వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని ఔత్సాహిక ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించడానికి వినియోగించడం మరో కారణం. ఒక పక్క తన చదువు ఇంకా పూర్తికాలేదు. కానీ తను ఒక సక్సెస్ ఫుల్ ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తూ.. తనలాంటి ఎంతోమందికి చేయూతనివ్వడమే లక్ష్యంగా పనిచేస్తోంది శిల్పా యార్లగడ్డ. శిఫాన్ అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో పెరిగిన శిల్పా యార్లగడ్డ భారత సంతతికి చెందిన అమ్మాయి. శిల్ప హైస్కూల్లో ఉన్నప్పుడు నాసా, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్‌లలో ఇంటర్న్‌షిప్ చేసింది. అప్పుడు కంప్యూటర్ సైన్స్ చదవాలనుకుంది. ఈ క్రమంలోనే హార్వర్డ్ యూనివర్సిటీలో ఎమ్ఐటీ మొదటి ఏడాది చదివేటప్పుడు.. తన చుట్టుపక్కల ఉన్న జ్యువెలరీ సంస్థలన్నీ పురుషులే నిర్వహించడం చూసేది. ఈ రంగంలోకి మహిళలు కూడా అడుగుపెట్టాలి అని భావించి... వివిధ రకాల ఆభరణాలను ఎలా తయారు చేయాలి? తక్కువ ఖర్చులో మన్నిక కలిగిన ఆభరణాల తయారీ ఎలా... అనే అంశాలపై గూగుల్‌లో త్రీవంగా వెతికేది. త్రీడీ ప్రింటింగ్ ద్వారా తక్కువ ఖర్చులో అందమైన జ్యూవెలరీ తయారు చేయవచ్చని తెలుసుకుని స్నేహితులతో కలిసి 2017లో డైమండ్స్‌కు బాగా పేరున్న న్యూయార్క్‌లో ‘శిఫాన్’ పేరిట జ్యూవెలరీ స్టార్టప్‌ను ప్రారంభించింది. శిఫాన్ ప్రారంభానికి ‘అన్‌కట్ జెమ్స్’ సినిమా కూడా శిల్పకు ప్రేరణ కలిగించింది. వజ్రాలతో తయారు చేసిన సింగిల్ పీస్ జ్యూవెలరీని విక్రయించడం ప్రారంభించింది. 2 018లో ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో స్టైలిస్ట్ నికోల్ కిడ్మ్యాన్స్ క్లైంట్ శిఫాన్ సంస్థ రూపొందించిన రింగ్ ధరించి రెడ్ కార్పెట్‌పై నడవడంతో అప్పుడు శిఫాన్కు మంచి గుర్తింపు వచి్చంది. అప్పటి నుంచి శిఫాన్ డైమండ్ జ్యూవెలరీ విక్రయాలు పెరిగాయి. డ్యూయెట్ హూప్స్.. గతేడాది నవంబర్‌లో ‘డ్యూయెట్ హూప్స్’ పేరుమీద రెండో జ్యూవెలరీని ప్రారంభించింది శిల్పా యార్లగడ్డ. ఆదర్శవంతమైన దంపతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పింక్ డైమండ్ రింగును అందుబాటులోకి తీసుకొచ్చారు. పింక్ డైమండ్ రింగు స్పైరల్ ఆకారంలో అడ్జెస్టబుల్‌గా ఉంటుంది. మొదట ఒక పెద్ద సైజులో డైమండ్, దాని తరువాత చిన్న డైమండ్ ఉండడం ఈ రింగు ప్రత్యేకత. ఈ మోడల్ రింగును ఆమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్ ఒబామా, టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ధరించడంతో ఆ మోడల్ బాగా పాపులర్ అయింది. అయితే ఈ పింక్ రింగును అమ్మగా వచ్చే ఆదాయంలో యాభై శాతం డబ్బును ‘స్టార్టప్ గర్ల్ ఫౌండేషన్’కు శిల్ప అందిస్తోంది. ఇప్పటికే పెప్పర్, ఇటెర్నెవా, కిన్షిప్, సీ స్టార్ వంటి కంపెనీలకు నిధులు సమకూర్చింది. కాగా పింక్ రింగ్ ధర 155 డాలర్ల నుంచి 780 డాలర్లు ఉండడం విశేషం. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ ఫైనలియర్ చదువుతోన్న శిల్ప తన చదువు పూర్తయ్యాక పూర్తి సమయాన్ని శిఫాన్ కోసం కేటాయించనుంది. కాలం తిరిగి రాదు జ్యూవెలరీ తయారీ పరిశ్రమ మహిళలకు సంబంధించినది. కానీ ఈ పరిశ్రమలన్నీ పురుషులే నిర్వహిస్తున్నారు. అందుకే ఈ రంగంలో ఎక్కువమంది మహిళలు రావాలనుకున్నాను. ఈ క్రమంలోనే స్టార్టప్ గర్ల్ ఫౌండేషన్లకు నిధులు సమకూర్చి ప్రోత్సహిస్తున్నాను. ఒక పక్క చదువుకూంటూ మరోపక్క ఒక కంపెనీ స్థాపించి దాని ఎదుగుదలకు కృషిచేయడం సవాలుతో కూడుకున్నది. కానీ ‘జీవితంలో ఏదైనా తిరిగి తెచ్చుకోవచ్చు గానీ కరిగిపోయిన కాలాన్ని వెనక్కు తెచ్చుకోలేం’ అని ఒకరిచి్చన సలహా నా మనస్సుకు హత్తుకోవడంతో ఈ రెండూ చేయగలుగుతున్నాను. చదవండి: Mystery: న్యోస్ సరస్సు.. రాత్రి రాత్రే ఆ ఊళ్లన్నీ శ్మశానాలైపోయాయి! -
రోదసిలో తెలుగు ఖ్యాతి
హ్యూస్టన్: వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్వేస్, వర్జిన్ గెలాక్టిక్ స్పేస్ టూరిజం కంపెనీ వ్యవస్థాపకుడు, బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ లేటు వయసులో అపూర్వమైన సాహస యాత్ర విజయవంతంగా పూర్తిచేశారు. అంతరిక్ష పర్యాటకానికి బాటలు వేస్తూ సొంత స్పేస్‌షిప్‌లో రోదసిలోకి ప్రయాణించి క్షేమంగా తిరిగి వచ్చారు. ఈ యాత్రలో 71 ఏళ్ల బ్రాస్నన్‌తోపాటు తెలుగు బిడ్డ శిరీష బండ్లతో సహా ఐదుగురు పాలుపంచుకున్నారు. వర్జిన్ గెలాక్టిక్ సంస్థకు చెందిన స్పేస్‌షిప్ ‘వీఎస్ఎస్ యూనిటీ–22’తో కూడిన ట్విన్ ఫ్యూజ్‌లేజ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఆదివారం అమెరికాలోని న్యూమెక్సికో రాష్ట్రంలో ఎడారిలో ఏర్పాటు చేసిన ‘స్పేస్‌పోర్టు అమెరికా’ నుంచి ఆదివారం ఉదయం 10.40 గంటలకు నింగిలోకి దూసుకెళ్లింది. వాతావరణం అనుకూలించకపోవడంతో 90 నిమిషాలు ఆలస్యంగా ఈ యాత్ర ప్రారంభమయ్యింది. బ్రాన్సన్ భార్య, కుటుంబ సభ్యులతో సహా 500 మందికిపైగా జనం ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించారు. 8.5 కిలోమీటర్లు(13 కిలోమీటర్లు) ప్రయాణించాక ఫ్యూజ్‌లేజ్ ఎయిర్‌క్రాఫ్ట్ నుంచి ‘వీఎస్ఎస్ యూనిటీ–22’ విడిపోయింది. వెంటనే అందులోని రాకెట్ ఇంజన్ ప్రజ్వరిల్లింది. బ్రాన్సన్తోపాటు మరో ఐదుగురు ప్రయాణిస్తున్న ఈ సబ్ ఆర్బిటాల్ టెస్టుఫ్టైట్ భూమి నుంచి 55 మైళ్లు (88 కిలోమీటర్లు) నింగిలో ప్రయాణించి, రోదసిలోకి ప్రవేశించింది. అందులోని ఆరుగురు (ఇద్దరు పైలట్లు, నలుగురు ప్రయాణికులు) కొన్ని నిమిషాలపాటు భారరహిత స్థితిని అనుభూతి చెందారు. అనంతరం స్పేస్‌షిప్ తిరుగుప్రయాణం మొదలుపెట్టింది. భూవాతావరణంలోకి ప్రవేశించి, తన చుక్కానులను గ్లైడింగ్‌లుగా మార్చుకొని భూమిపైకి అడుగుపెట్టింది. రన్‌వేపై సురక్షితంగా ల్యాండయ్యింది. మొత్తం గంటన్నరలో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. బెజోస్ కంటే ముందే.. రోదసిలోకి వెళ్లడానికి ఇదొక అందమైన రోజు అంటూ ఆదివారం ఉదయం బ్రాన్సన్ ట్వీట్ చేశారు. స్పేస్ టూరిజంలో తన ప్రత్యర్థి అయిన ఎలాన్ మస్క్‌తో కలిసి దిగిన ఫొటోను పోస్టు చేశారు. వచ్చే ఏడాది నుంచి రోదసి పర్యాటక యాత్రలకు శ్రీకారం చుట్టాలని వర్జిన్ గెలాక్టిక్ కంపెనీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఔత్సాహికుల నుంచి తగిన రుసుము వసూలు చేసి, రోదసిలోకి తీసుకెళ్లి, క్షేమంగా వెనక్కి తీసుకొస్తారు. ఇందులో భాగంగా ‘వీఎస్ఎస్ యూనిటీ–22’లో యాత్ర చేపట్టారు. కేవలం గంటన్నరలో రోదసిలోకి వెళ్లి రావొచ్చని వర్జిన్ గెలాక్టిక్ సంస్థ నిరూపించింది. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సైతం స్పేస్ టూరిజం దిశగా అడుగులు వేస్తున్నారు. ఆయన ఈ నెల 20న సొంత రాకెట్ షిప్లో రోదసి యాత్ర చేపట్టనున్నారు. బెజోస్ కంటే ముందే రోదసిలోకి వెళ్లాలన్న సంకల్పమే బ్రాన్సన్ను ఈ యాత్రకు పురికొల్పినట్లు సమాచారం. బ్రాన్సన్ వర్జిన్ గెలాక్టిక్ కంపెనీని 2004 నెలకొల్పారు. రోదసి యాత్ర కోసం ఇప్పటికే 600 మందికిపైగా ఔత్సాహికులు ఈ కంపెనీ వద్ద రిజర్వేషన్లు చేసుకోవడం గమనార్హం. ఒక్కొక్కరు 2,50,000 డాలర్ల (రూ.1.86 కోట్లు) చొప్పున చెల్లించారు. మొదట టిక్కెట్ బుక్ చేసుకున్నవారిని వచ్చే ఏడాది ప్రారంభంలో రోదసిలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది. 17 సంవత్సరాల కఠోర శ్రమ తమను ఇంతదూరం తీసుకొచ్చిందని బ్రాన్సన్ పేర్కొన్నారు. యాత్ర అనంతరం ఆయన తన బృంద సభ్యులకు అభినందనలు తెలిపారు. సొంత స్పేస్‌షిప్‌లో రోదసి యాత్ర చేసిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. 70 ఏళ్లు దాటిన తర్వాత రోదసిలోకి వెళ్లిన రెండో వ్యక్తిగా మరో రికార్డు నెలకొల్పారు. 1998లో 77 ఏళ్లు జాన్ గ్లెన్ రోదసి యాత్ర చేశారు.. శిరీష అంతరిక్షయాత్ర రాష్ట్రానికి గర్వకారణం ఏపీ గవర్నర్, ఏపీ సీఎం ప్రశంసలు సాక్షి, అమరావతి: గుంటూరులో జన్మించిన బండ్ల శిరీష అంతరిక్షయాత్రను విజయవంతంగా పూర్తిచేసుకోవడంపై ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో శుభాకాంక్షలు తెలిపారు. ఆమె అంతరిక్షయాత్ర రాష్ట్రానికి గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. ఆమె భవిష్యత్‌లో మరింత ఉన్నతస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. మన శిరీష రికార్డు ఏరోనాటికల్ ఇంజనీర్ శిరీష బండ్ల(34) రోదసిలో ప్రయాణించిన మూడో భారత సంతతి మహిళగా రికార్డు సృష్టించారు. ఈ యాత్రలో తాను భాగస్వామి కావడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఆమె జూలై 6న ట్వీట్ చేశారు. రోదసి యాత్రను ప్రజలకు సైతం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్న వర్జిన్ గెలాక్టిక్ కంపెనీలో పని చేస్తుండడం తనకు గర్వకారణమని పేర్కొన్నారు. శిరీష బండ్ల ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలో జన్మించారు. ఆమెకు నాలుగేళ్లు ఉన్నప్పుడు తల్లిదండ్రులు అమెరికా వెళ్లి, స్థిరపడ్డారు. శిరీష హ్యూస్టన్‌లో పెరిగారు. భారత సంతతికి చెందిన కల్పనా చావ్లా, సునీతా విలియమ్స్ గతంలో అంతరిక్ష యాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ ఇప్పటిదాకా అంతరిక్షంలోకి వెళ్లిన ఏకైక భారతీయుడిగా రికార్డుకెక్కారు. -
అమెరికాలో అత్యున్నత పదవిలో భారతీయురాలు
వాషింగ్టన్: దాదాపు 20లక్షల మంది అమెరికా ప్రభుత్వ సిబ్బంది వ్యవహారాలను పర్యవేక్షించే ‘ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ (ఓపీఎం)’ విభాగానికి మహిళా అధినేతగా భారతీయ మూలాలున్న కిరణ్ అహూజా వ్యవహరించనున్నారు. 49 ఏళ్ల కిరణ్ అహూజాను ఓపీఎం హెడ్‌గా ఎంపికచేస్తూ అధ్యక్షుడు బైడెన్ గతంలోనే నామినేట్ చేశారు. అయితే, ఈ నామినేషన్‌పై సెనేట్‌లో మంగళవారం హోరాహోరీ ఓటింగ్ జరిగింది. ఓటింగ్‌లో 50–50 ఓట్లు పడ్డాయి. దీంతో ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ తన నిర్ణయాత్మక ఓటు హక్కును వినియో గించుకున్నారు. కిరణ్‌కు మద్దతుగా ఓటేశారు. దీంతో కిరణ్ పదవి ఖరారైంది. కీలకమైన ఓటింగ్లలో ఉపాధ్యక్షురాలి హోదాలో కమలా హ్యారిస్ ఇలా తన ఓటును వినియోగిం చుకోవడం ఏడాదికాలంలో ఇది ఆరోసారి కావడం విశేషం. ‘ప్రజాసేవలో, దాతృత్వ కార్యక్రమాల్లో కిరణ్‌కు రెండు దశాబ్దాల కుపైగా అపార అనుభవముంది. గతంలో నాటి అధ్యక్షుడు బరాక్ ఒబామా హయాంలోనూ కిరణ్ ఓపీఎంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. ఇకమీదట ఆమె ఓపీఎం అధినేతగా అద్భుత పనితీరు కనబరుస్తారు’ అని సెనేటర్ డ్యానీ ఫెయిన్స్టెయిన్ కీర్తించారు. -
ఐరాసకు అరోరా ఎందుకీ ఆకాంక్ష
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ ఐదేళ్ల పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగుస్తుంది. అంతకు రెండు నెలల ముందే అక్టోబర్‌లో ఆ పదవికి ఎన్నికలు జరుగుతాయి. అనుభవజ్ఞుడైన 71 ఏళ్ల గ్యుటెరస్ మళ్లీ పోటీ చేస్తే కనుక మళ్లీ గెలిచే అవకాశాలే ఎక్కువ. అయితే అంతటి అత్యున్నతస్థాయి పదవికి తాను పోటీ చేయబోతున్నట్లు ఏ మాత్రం అనుభవం లేని అరోరా ఆకాంక్ష అనే 34 ఏళ్ల మహిళ హటాత్తుగా ప్రకటించారు! ‘గెలుస్తానా.. లేదా తర్వాతి సంగతి. నేనైతే పోటీ చేస్తాను’ అంటున్నారు. అంతేకాదు, ఐక్యరాజ్య సమితి డబ్బంతా మీటింగ్‌లకు, పేపర్వర్క్లకు ఎలా వృథా అవుతోందో చెబుతూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు! చూస్తుంటే సమితి ప్రధాన కార్యదర్శి అభ్యర్థిగా ఒక సాధారణ మహిళ అయిన ఆకాంక్ష ఎన్నికల ప్రచారం మొదలైనట్లే ఉంది! అరోరా ఆకాంక్షకు తన ఇంటిపేరుతో ‘అరోరా’ అని పిలిపించుకోవడమే ఇష్టం. గతంలో నాలుగేళ్లు ఆమె ఐక్యరాజ్య సమితిలోనే ఒక కంపెనీ తరఫున ఆడిటర్‌గా పని చేశారు. అది తప్ప దౌత్యవేత్తగా ఆమెకు ఏ అనుభవమూ లేదు. ఇప్పుడు సమితికే చీఫ్‌గా పోటీ పడటానికి సిద్ధం అయ్యారు! ‘‘ఒకప్పటి శరణార్థుల మనవరాలిని. కష్టం అంటే ఏమిటో నాకు తెలుసు. కనుక దేశాల కష్టాలను గట్టెక్కించే ఈ పదవికి నేను అర్హురాలిననే అనుకుంటున్నాను’’ అని ఆమె చెబుతున్నారు. ప్రచారం కోసం ఆమె ఎక్కువగా తన సొంత పొదుపు నుంచే ఖర్చుచేయబోతున్నారు. ఆ మొత్తం 30 వేల డాలర్లు. రూపాయల్లో సుమారు 22 లక్షలు. అరోరా కెనడా పౌరురాలు. పుట్టింది ఇండియాలో. 2022–26 పదవీ కాలానికి జరిగే సమితి ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసేందుకు ఆమోదం కోసం ఈ నెల 17నే ఆమె తన దరఖాస్తు పత్రాన్ని సమితికి సమర్పించారు. ఆ వెంటనే ‘‘పేద దేశాల కోసం ఏదైతే చేయాలో దాన్ని చేయడం లో సమితి విఫలమయింది’’ అనే వ్యాఖ్యతో తన ప్రచారాన్ని కూడా ప్రారంభించారు! పోటీకి ఆమె పేరును ఏదో ఒక దేశం ప్రతిపాదించాలి. 193 దేశాలు సభ్యులుగా ఉన్న సమితి నుంచి ఇంతవరకూ అలాంటి సమర్థన ఏదీ రాలేదు. పోటీ చేయలేకపోయినా, పోటీ చేయాలన్న ఆమె ప్రయత్నం వైపు మాత్రం ప్రపంచ దేశాల తలలన్నీ తిర గనయితే తిరిగాయి. చిన్న దేశాలను సమితి చిన్న చూపు చూస్తోందని అరోరా ఆరోపణ. ఏటా సమితికి వచ్చే 56 బిలియన్ డాలర్ల రాబడిలో డాలరుకు 29 సెంట్లు మాత్రమే సకారణంగా ఖర్చువుతుండగా, మిగతా అంతా సమావేశాలకు, నివేదికల తయారీకి వృథా అవుతోందన్నది ఆమె చేస్తున్న మరో ఆరోపణ. అందుకే తను ఎంపికైతే ఇలాంటి దుర్వినియోగం జరగకుండా చూస్తానని ఆమె హామీ ఇస్తున్నారు. ‘అయినా సరే, తను గెలుస్తుంది అని ఎలా అనుకుంటోంది..’ అని పరిహసించేవాళ్ల ఉండొచ్చు. అయితే ఆమెను సమర్థించేవారూ లేకపోలేదు. ‘ఫియర్లెస్’ అని కొందరు. ‘ఎందుకు పోటీ చేయకూడదు?’ అని ఇంకొందరు. దీనికి భిన్నంగా.. ‘75 ఏళ్ల చరిత్ర గల ఐక్యరాజ్య సమితి ఏ పరిస్థితుల్లో ఏర్పడిందో ఈమెకు ఏం తెలుసు?’ అనేవారు ఎలాగూ ఉంటారు. సమితి లో శాశ్వత సభ్యత్వం గల దేశాలైన బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా, అమెరికాలు వీటో చేస్తే ఏ నిర్ణయమైనా వీగిపోక తప్పని స్థితిలో ఈమె వచ్చి ఏం మారుస్తుంది అని మరో మాట! అవేవీ పట్టించుకోవడం లేదు ఆరోరా. రానున్న ఒకటి రెండు నెలల్లో ఆమె సమితి రాయబారులను కలిసి తన లక్ష్యం ఏమిటో వివరించే ఆలోచనలో కూడా ఉన్నారు. ఒకప్పటి ఆమె సహోద్యోగుల నుంచి కూడా అరోరాకు మద్దతు లభిస్తోంది. ‘నాకేమీ గెలుపు వ్యూహాలు, రాజకీయ ధ్యేయాలు లేవు. సమితి పనితీరును మెరుగు పరిచేందుకు నిజాయితీగా పోటీలోకి దిగుతున్నాను’’ అని చెబుతున్నారు అరోరా. ∙∙ న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయానికి దగ్గర్లోనే నివాసం ఉంటున్నారు అరోరా ఆకాంక్ష. ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం. జీతాన్ని పొదుపుగా వాడుకుంటారు. తల్లిదండ్రులూ ఆమెతోనే ఉంటారు. సమితికి పోటీ చేసే విషయంలోనూ వారు ఆమె వైపే ఉన్నారు. అరోరాకు హ్యారీపొట్టర్ నవలలంటే ఇష్టం. ఒత్తిడుల నుంచి అవి ఆమెను సేద తీరుస్తాయట. ఆమె వార్డ్రోబ్ నిండా అన్నీ ముదురు వర్ణాల దుస్తులే. సమితి ఫీల్డ్ వర్క్ మీద 2017లో ఉగాండా వెళ్లినప్పుడు అక్కడి నుంచి తెచ్చుకున్న ఆరు సూట్లు కూడా వాటిల్లో ఉన్నాయి. ఉగాండా వెళ్లినప్పుడు అక్కడ ఆమె చూసిన ఘోరం గురించి ఇక్కడ చెప్పాలి. అరోరా హర్యానాలో జన్మించారు. తర్వాత కొంతకాలం సౌదీ అరేబియాలో పెరిగారు. తల్లిదండ్రులిద్దరూ వైద్యులే. తొమ్మిదో యేట నుంచి 18 ఏళ్ల వయసు వరకు అరోరా ఇండియాలోని బోర్డింగ్ స్కూల్లో చదివారు. తర్వాత కెనడా వెళ్లి అక్కడ డిగ్రీ పూర్తి చేశారు. అక్కడే ఒక ప్రేవేట్ కంపెనీలో ఆడిటర్‌గా చేరారు. ఆ కంపెనీ తరఫున 2016 లో ఐక్యరాజ్య సమితిలో ఉద్యోగం రాగానే ఎగిరి గంతేసి చేరిపోయారు. ఐక్యరాజ్య సమితి అంటే అంత గొప్ప ఆమెకు. అయితే ఆ గొప్ప లోపలికి వెళ్లాక కనిపించలేదు! తర్వాతి ఏడాది వేసవిలోనే అరోరాకు ఉగాండా వెళ్లే అవకాశం వచ్చింది. అక్కడో చిన్నారి.. ఆకలి బాధ తట్టుకోలేక బురద ముద్దల్ని తినడం ఆమె మనసును కలచి వేచింది. ఆ దృశ్యం ఆమె మనసులో అలా ఉండిపోయింది. డ్యూటీకి తిరిగొచ్చాక సమితిలోని తన సీనియర్ ఆఫీసర్‌తో ఆ సంగతి ని ఆమె ఎంతో ఆవేదనగా చెప్పినప్పుడు ఆ ఆఫీసర్ స్పందించిన తీరు ఆమెను మరింతగా బాధించింది. ‘బురద మంచిదేలే. ఐరన్ ఉంటుంది’ అని అన్నారట! అది తట్టుకోలేక పోయారు అరోరా. క్రమంగా సమితిలోని అలక్ష్యాలు, సమితి నిరాదరణలు ఒక్కోటీ ఆమె కంటబడటం మొదలైంది. ఆ అనుభవాలన్నీ ఇప్పుడు ఆమెను సమితి ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసేందుకు బలంగా ప్రేరేపిస్తున్నాయి. అరోరా గెలుస్తారా లేదా అనేది పక్కన పెడితే పోటీ చేయాలన్న ఆలోచననే ఒక గెలుపుగా భావించాలని ఆమెను సమర్థించేవారు అంటున్నారు. -
‘అరోరా ఆకాంక్ష’.. రికార్డు సృష్టించనుందా?!
న్యూయార్క్: ఐక్యరాజ్య సమితి అధ్యక్ష పదవి కోసం భారత సంతతికి చెందిన మహిళ బరిలో నిలిచారు. ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) ఆడిట్ కోఆర్డినేటర్‌గా పనిచేస్తున్న అరోరా ఆకాంక్ష(34) అధ్యక్ష బరిలో నిలిచినట్లు వెల్లడించారు. ప్రస్తుత ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్‌గా వ్యవహరిస్తున్న ఆంటోనియో గుటెరస్ పదవీకాలం త్వరలో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రపంచంలోనే అత్యున్నత దౌత్యవేత్త పదవికి తాను పోటీ చేస్తున్నట్లు అరోరా గత నెలలోనే తెలిపారు. ఇందుకు సంబంధించి ఈ నెలలో ‘‘అరోరాఫర్ఎస్జీ’’ పేరిట ఆమె ప్రచారం సైతం ప్రారంభించారు. ఇక అధ్యక్ష బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించిన అరోరా ఆకాంక్ష ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. తాజాగా రెండున్నర నిమిషాల నిడివి ఉన్న ప్రచార వీడియోను విడుదల చేశారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం లోపల నడుస్తూ అరోరా ఈ వీడియోను తీశారు. గడిచిన 75 సంవత్సరాలుగా ఐక్యరాజ్య సమితి ప్రపంచానికి ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చలేదని.. శరణార్థులను రక్షించలేదని ఆమె ఆరోపించారు. అందుకే ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌గా తాను పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ఒకవేళ అరోరా గనక ఈ పదవి చేపడితే.. ఐక్యరాజ్య సమితి 75 ఏళ్ల చరిత్రలో సెక్రటరీ జనరల్ పదవి చేపట్టిన మొదటి మహిళగా ఆమె రికార్డు సృష్టిస్తారు. కాగా, ప్రస్తుత సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ మరోసారి అధ్యక్షుడిగా కొనసాగాలని భావిస్తున్నారు. ఆయన మొదటి విడత పదవీకాలం ఈ ఏడాది డిసెంబర్ 31తో ముగుస్తుంది. కొత్త సెక్రటరీ జనరల్ 2022 జనవరి 1న బాధ్యతలు స్వీకరిస్తారు. 2017 జనవరి 1న గుటెరస్ సెక్రటరీ జనరల్‌గా ప్రమాణం చేశారు. మరోసారి అధ్యక్షుడిగా పని చేయాలని గుటెరస్ ఆశిస్తున్నారు. ఇక అరోరా ఆకాంక్ష విషయానికి వస్తే ఆమె టొరంటోలోని యార్క్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్టడీస్‌లో డిగ్రీ పట్టా అందుకున్నారు. కొలంబియా యూనివర్సిటీ నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ చేశారు. భారతదేశంలో జన్మించిన అరోరా ఆకాంక్షకు ఓసీఐ కార్డ్ వుంది. అలాగే కెనడా పౌరురాలిగా ఆ దేశ పాస్‌పోర్ట్ కలిగివున్నారు. చదవండి: భారత్ సేవలకు సెల్యూట్: యూఎన్ చీఫ్ డ్యాషింగ్ అడ్వైజర్ -
భారతీయ అమెరికన్ మహిళకు కీలక పదవి
వాషింగ్టన్/మంగళూరు: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ భారతీయ అమెరికన్ మహిళకు కీలక బాధ్యతలు అప్పగించారు. కాబోయే ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా మాలా అడిగ(47)ను నియమిస్తున్నట్లు ప్రకటించారు. విద్యా సంబంధ విషయాల్లో కాబోయే ప్రథమ మహిళ జిల్ బైడెన్‌కు మాలా సహకరిస్తారు. ప్రస్తుతం ఆమె బైడెన్ 2020 ప్రచార కార్యక్రమానికి సీనియర్ పాలసీ అడ్వైజర్‌గా, బైడెన్‌కు సీనియర్ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు. మాలా గతంలో బైడెన్ ఫౌండేషన్‌కు హయ్యర్ ఎడ్యుకేషన్, మిలటరీ ఫ్యామిలీస్ విభాగం డైరెక్టర్‌గా పనిచేశారు. అంతకుముందు, ఒబామా హయాంలో ఎడ్యుకేషనల్, కల్చరల్ బ్యూరోలో డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ ఫర్ స్టేట్ హోదాలో బాధ్యతలు నిర్వర్తించారు. మరికొన్ని కీలక నియామకాలను కూడా బైడెన్ శనివారం ప్రకటించారు. యూనివర్సిటీ ఆఫ్ షికాగో లా స్కూల్లో జూరిస్ డాక్టర్ డిగ్రీ, మిన్నెసొటా యూనివర్సిటీలో పబ్లిక్ హెల్త్‌లో పీజీ చేశారు. అయెవాలోని గ్రిన్నెల్ కాలేజీలో స్పానిష్‌లో బీఏ డిగ్రీ చదివారు. ఉడుపిలో మూలాలు: జిల్ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా మాలా అడిగను నియమించడంపై ఆమె సొంత రాష్ట్రం కర్ణాటక ఉడుపి జిల్లా కక్కుంజే గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తు న్నారు. వాస్క్యులర్ సర్జన్లో నైపుణ్యాలు పెంచుకునేందుకు ఆమె అమెరికా వెళ్లారు. మాలా తల్లిదండ్రులు డాక్టర్ రమేశ్ అడిగ, డాక్టర్ జయ అడిగ. రమేశ్ కుటుంబానికి చెందిన సూర్యనారాయణ కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్‌ను స్థాపించగా, అరవింద్ అడిగ 2008 మ్యాన్ బుకర్ ప్రైజ్ విజేతగా నిలిచారు. మాలాకు భర్త చార్లెస్, కుమార్తె ఆషా ఉన్నారు. గత ఏడాది బెంగళూరులోని జరిగిన కార్యక్రమానికి మాలా కుటుంబంతో కలిసి హాజరయ్యారని ఆమె మేనత్త నిర్మలా ఉపాధ్యాయ్ తెలిపారు. అమెరికా అధ్యక్ష భవనంలో సీనియర్ స్టాఫర్‌గా నియామకం కాబోతున్నట్లు శనివారం మాలా తనకు తెలిపినట్లు నిర్మలా చెప్పారు. బబ్బరిఅనకట్టే గ్రామంలోని పూర్వీకుల ఇంటిని ఆమె సందర్శించారనీ, కక్కుంజే గ్రామంలోని ఆలయంలో పూజలు చేశారన్నారు. -
భారత సంతతి రీసెర్చర్ హత్య
వాషింగ్టన్: భారత సంతతి పరిశోధకురాలిని దుండగులు హత్య చేసిన టెక్సాస్ రాష్టంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్సాస్ రాష్ట్రంలోని ప్లానో నగరంలో నివసిస్తోన్న 43 ఏళ్ల సర్మిస్త సేన్ ఆగస్టు 1న చిషోల్మర్ ట్రైల్ పార్క్ సమీపంలో జాగింగ్ చేస్తుండగా.. హత్యకు గురయ్యారు. ఆమె మృతదేహం లెగసీ డ్రైవ్, మార్చమన్ వే సమీపంలోని క్రీక్ ప్రాంతంలో లభ్యమయినట్లు పోలీసులు వెల్లడించారు. సర్మిస్త సేన్ ఫార్మసిస్ట్‌గా పని చేస్తున్నారు. మాలిక్యూలర్ బయాలజీ విభాగంలో, క్యాన్సర్ రోగుల కోసం పని చేశారు. ఆమెకు ఇద్దరు కుమారులు. ఈ క్రమంలో పోలీసులు ఈ కేసుతో సబంధం ఉన్న ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిని 29 ఏళ్ల బకారి అభియోనా మోన్‌క్రీప్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడు కొల్లీన్ కౌంటీ జైలులో నిర్బంధంలో ఉన్నట్లు అమెరికా పోలీసులు తెలిపారు. (మైక్రోసాఫ్ట్ ‘టిక్‌టాక్’ షో!) సర్మిస్త హత్య జరిగిన సమయంలోనే.. మైఖేల్ డ్రైవ్‌లోని 3400 బ్లాక్‌లోని ఓ ఇంటిలోకి ఎవరో చొరబడ్డారని పోలీసులు తెలిపారు. బకారిని కూడా దోపిడి నేరం కింద అరెస్ట్ చేశారు. దాంతో సర్మిస్త హత్యతో అతడికి సంబంధం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం బకారిని విచారిస్తున్నారు. సర్మిస్త అథ్లెట్ కావడంతో ప్రతిరోజు తన కుమారులు లేవడానికి ముందే జాగింగ్ చేయడానికి వచ్చేదని పోలీసులు తెలిపారు. సర్మిస్త మరణం ఆమె కుటుంబ సభ్యులను ఎంతో కలిచి వేసింది. ఆమె చాలా మంచిదని.. పరిచయం అయిన ప్రతి ఒక్కరిని తన చిరునవ్వుతో కట్టిపడేసేదని సర్మిస్త కుటుంబ సభ్యులు తెలిపారు. గొప్ప వారికే ఎందుకు ఇలా జరుగుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
తప్పతాగి విమానంలో గొడవ చేసిన మహిళ..
లండన్ : తప్పతాగి విమాన సిబ్బందినే కాక.. తోటి ప్రయాణికులను కూడా ఇబ్బందులకు గురి చేసిన ఓ భారత సంతతి మహిళకు లండన్ కోర్టు ఆరు నెలల శిక్ష విధించింది. వివరాలు.. కిరణ్ జాదవ్(41) అనే మహిళ ఈ ఏడాది జనవరిలో స్పెయిన్‌లోని టెనెరిఫే నుంచి బ్రిటన్‌కి ప్రయాణిస్తుంది. బోర్డింగ్‌కు నాలుగు గంటల ముందే కిరణ్ దాదాపు 6 - 8 బీర్లు.. విమానంలో మరో 6 గ్లాసుల వైన్ తాగింది. అంతటితో ఆగక మరింత మద్యం ఇవ్వాల్సిందిగా సిబ్బందిని కోరింది. కానీ వారు అందుకు నిరాకరించడంతో నానా యాగి చేసింది. కింద కూర్చుని బిగ్గరగా నవ్వుతూ, ఏడుస్తూ.. ముందు సీటులో కూర్చున్న వ్యక్తిని పట్టుకుని గందరగోళం సృష్టించింది. ఆ సమయంలో విమానంలో ఉన్న ఓ ఆఫ్ డ్యూటీ పోలీసధికారి కిరణ్‌ని కంట్రోల్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ ఆమె అతడిని బూతులు తిట్టడం ప్రారంభించింది. విమానం ల్యాండ్ అయ్యే సమయంలో కాస్తా ఎగుడుదిగుడుగా ఉండటంతో విమానం కుదుపులకు గురయ్యింది. దాంతో కిరణ్ ‘మనం చనిపోబోతున్నాం’ అంటూ గొడవ చేయడం ప్రారంభించింది. విమానం ల్యాండ్ అయిన వెంటనే సిబ్బంది ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ శుక్రవారం (నిన్న) జరిగింది. విమానంలో తప్ప తాగి ఇతర ప్రయాణికులను ఇబ్బందులకు గురి చేసినందుకు గాను లండన్ కోర్టు కిరణ్ జాదవ్‌కు 6 నెలల జైలు శిక్ష విధించింది. -
అమెరికాలో భారత మహిళ విజయభేరి
వాషింగ్టన్: అమెరికాలోని మేరీల్యాండ్ రాష్ట్రంలో జరిగిన కీలక స్థానిక ఎన్నికల్లో భారత సంతతి ముస్లిం మహిళ విజయభేరి మోగించింది. వలసదారుల వ్యతిరేకత, ముస్లిం వ్యతిరేకత అత్యధికంగా ఉండే మేరీల్యాండ్ రాష్ట్రంలో 23 ఏళ్ల రహీలా అహ్మద్ అద్భుతమైన విజయాన్ని నమోదుచేసింది. రహీలా తండ్రి భారత్‌కు చెందినవారు, కాగా తల్లి పాకిస్థాన్ మహిళ. మేరీల్యాండ్‌లోని ప్రిన్స్ జార్స్ కౌంటీ స్కూల్ బోర్డ్ ఎన్నికల్లో 15శాతం భారీ మెజారిటీతో సుదీర్ఘకాలం కొనసాగుతున్న సిస్టం అడ్మినిస్ట్రేటర్‌పై రహీలా విజయం సాధించింది. 2012లోనూ ఆమె ఈ ఎన్నికల్లో పోటీచేసినప్పటికీ విజయం సాధించలేదు. ఆమె కౌంటీలో 80శాతం ఆఫ్రికన్-అమెరికన్ సంతతి ఉన్నప్పటికీ ఈ అద్భుత విజయాన్ని సాధించడం గమనార్హం. ఆమెకు రిపబ్లికన్ నేషనల్ కమిటీ మాజీ చైర్మన్ మైఖేల్ స్టీల్ సైతం మద్దతు పలికారు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ గెలిచిన సమయంలో హిజాబ్ ధరించి ముస్లిం మహిళ అయిన తాను గెలుపొందడం అమెరికాలో భిన్నత్వానికి తావు ఉందని చాటుతోందని, అమెరికా డ్రీమ్ ఇంకా సజీవంగానే ఉందని రహీలా అహ్మద్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.