Shilpa Yarlagadda: పింక్‌ రింగ్‌ శిల్ప! | Prince Harry and Meghan Markle Duet Pinky Ring Creator Shilpa Yarlagadda | Sakshi
Sakshi News home page

Shilpa Yarlagadda: పింక్‌ రింగ్‌ శిల్ప!

Published Sun, Sep 19 2021 6:33 AM | Last Updated on Sun, Sep 19 2021 2:13 PM

Prince Harry and Meghan Markle Duet Pinky Ring Creator Shilpa Yarlagadda - Sakshi

శిల్పా యార్లగడ్డ, జ్యూయెలరీ పరిశ్రమ నిర్వాహకురాలు

తాజాగా టైమ్‌ మ్యాగజీన్‌ కవర్‌ ఫోటో మీద ప్రిన్స్‌ హారీ మేఘనా మెర్కెల్‌ జంట ఆకర్షణీయంగా కనిపించింది. అయితే వీరిద్దరూ ధరించిన డ్రెస్‌లు, ఆభరణాలలో ముఖ్యంగా మెర్కెల్‌ వేలికి తొడిగిన ‘డ్యూయెట్‌ పింక్‌ డైమండ్‌ రింగు’ ప్రత్యేకంగా ఉండడంతో చూపరుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక మహిళ మరొకరికి మద్దతు ఇస్తోంది అని చెప్పే ‘పింక్‌ వాగ్దానం’కు గుర్తుగా ఈ రింగును రూపొందించినట్లుగా ఆ ఉంగరాన్ని డిజైన్‌ చేసిన సంస్థ ‘శిఫాన్‌’ చెబుతోంది. రింగు బాగా పాపులర్‌ అవ్వడంతో రింగును రూపొందించిన డిజైనర్‌ శిల్పా యార్లగడ్డ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది.

శిల్ప పేరు తెరమీదకు రావడానికి ఒక పింక్‌ డైమండ్‌ రింగేగాక, చిన్న వయసులోనే డైమండ్‌ జ్యూవెలరీ స్టార్టప్‌ను ప్రారంభించి విజయవంతమైన ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తూ, తనకు వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని ఔత్సాహిక ఎంట్రప్రెన్యూర్‌లను ప్రోత్సహించడానికి వినియోగించడం మరో కారణం. ఒక పక్క తన చదువు ఇంకా పూర్తికాలేదు. కానీ తను ఒక సక్సెస్‌ ఫుల్‌ ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తూ.. తనలాంటి ఎంతోమందికి చేయూతనివ్వడమే లక్ష్యంగా పనిచేస్తోంది శిల్పా యార్లగడ్డ.

 శిఫాన్‌
అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో పెరిగిన శిల్పా యార్లగడ్డ భారత సంతతికి చెందిన అమ్మాయి. శిల్ప హైస్కూల్లో ఉన్నప్పుడు నాసా, మైక్రోసాఫ్ట్‌ రీసెర్చ్‌లలో ఇంటర్న్‌షిప్‌ చేసింది. అప్పుడు కంప్యూటర్‌ సైన్స్‌ చదవాలనుకుంది. ఈ క్రమంలోనే హార్వర్డ్‌ యూనివర్సిటీలో ఎమ్‌ఐటీ మొదటి ఏడాది చదివేటప్పుడు.. తన చుట్టుపక్కల ఉన్న జ్యువెలరీ సంస్థలన్నీ పురుషులే నిర్వహించడం చూసేది. ఈ రంగంలోకి మహిళలు కూడా అడుగుపెట్టాలి అని భావించి... వివిధ రకాల ఆభరణాలను ఎలా తయారు చేయాలి?  తక్కువ ఖర్చులో మన్నిక కలిగిన ఆభరణాల తయారీ ఎలా... అనే అంశాలపై గూగుల్‌లో త్రీవంగా వెతికేది.

త్రీడీ ప్రింటింగ్‌ ద్వారా తక్కువ ఖర్చులో అందమైన జ్యూవెలరీ తయారు చేయవచ్చని తెలుసుకుని స్నేహితులతో కలిసి 2017లో డైమండ్స్‌కు బాగా పేరున్న న్యూయార్క్‌లో ‘శిఫాన్‌’ పేరిట జ్యూవెలరీ స్టార్టప్‌ను ప్రారంభించింది. శిఫాన్‌ ప్రారంభానికి ‘అన్‌కట్‌ జెమ్స్‌’ సినిమా కూడా శిల్పకు ప్రేరణ కలిగించింది. వజ్రాలతో తయారు చేసిన సింగిల్‌ పీస్‌ జ్యూవెలరీని విక్రయించడం ప్రారంభించింది. 2

018లో ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో స్టైలిస్ట్‌ నికోల్‌ కిడ్‌మ్యాన్స్‌ క్లైంట్‌ శిఫాన్‌ సంస్థ రూపొందించిన రింగ్‌ ధరించి రెడ్‌ కార్పెట్‌పై నడవడంతో అప్పుడు శిఫాన్‌కు మంచి గుర్తింపు వచి్చంది. అప్పటి నుంచి శిఫాన్‌ డైమండ్‌ జ్యూవెలరీ విక్రయాలు పెరిగాయి.
 
డ్యూయెట్‌ హూప్స్‌..

గతేడాది నవంబర్‌లో ‘డ్యూయెట్‌ హూప్స్‌’ పేరుమీద రెండో జ్యూవెలరీని ప్రారంభించింది శిల్పా యార్లగడ్డ. ఆదర్శవంతమైన దంపతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పింక్‌ డైమండ్‌ రింగును అందుబాటులోకి తీసుకొచ్చారు. పింక్‌ డైమండ్‌ రింగు స్పైరల్‌ ఆకారంలో అడ్జెస్టబుల్‌గా ఉంటుంది. మొదట ఒక పెద్ద సైజులో డైమండ్, దాని తరువాత చిన్న డైమండ్‌ ఉండడం ఈ రింగు ప్రత్యేకత. ఈ మోడల్‌ రింగును ఆమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్‌ ఒబామా, టెన్నిస్‌ దిగ్గజం సెరెనా విలియమ్స్‌ ధరించడంతో ఆ మోడల్‌ బాగా పాపులర్‌ అయింది.

అయితే ఈ పింక్‌ రింగును అమ్మగా వచ్చే ఆదాయంలో యాభై శాతం డబ్బును ‘స్టార్టప్‌ గర్ల్‌ ఫౌండేషన్‌’కు శిల్ప అందిస్తోంది. ఇప్పటికే పెప్పర్, ఇటెర్నెవా, కిన్‌షిప్, సీ స్టార్‌ వంటి కంపెనీలకు నిధులు సమకూర్చింది. కాగా పింక్‌ రింగ్‌ ధర 155 డాలర్ల నుంచి 780 డాలర్లు ఉండడం విశేషం. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్‌ ఫైనలియర్‌ చదువుతోన్న శిల్ప తన చదువు పూర్తయ్యాక పూర్తి సమయాన్ని శిఫాన్‌ కోసం కేటాయించనుంది.
 
కాలం తిరిగి రాదు
జ్యూవెలరీ తయారీ పరిశ్రమ మహిళలకు సంబంధించినది. కానీ ఈ పరిశ్రమలన్నీ పురుషులే నిర్వహిస్తున్నారు. అందుకే ఈ రంగంలో ఎక్కువమంది మహిళలు రావాలనుకున్నాను. ఈ క్రమంలోనే స్టార్టప్‌ గర్ల్‌ ఫౌండేషన్‌లకు నిధులు సమకూర్చి ప్రోత్సహిస్తున్నాను. ఒక పక్క చదువుకూంటూ మరోపక్క ఒక కంపెనీ స్థాపించి దాని ఎదుగుదలకు కృషిచేయడం సవాలుతో కూడుకున్నది. కానీ ‘జీవితంలో ఏదైనా తిరిగి తెచ్చుకోవచ్చు గానీ కరిగిపోయిన కాలాన్ని వెనక్కు తెచ్చుకోలేం’ అని ఒకరిచి్చన సలహా నా మనస్సుకు హత్తుకోవడంతో ఈ రెండూ చేయగలుగుతున్నాను.
చదవండి: Mystery: న్యోస్‌ సరస్సు.. రాత్రి రాత్రే ఆ ఊళ్లన్నీ శ్మశానాలైపోయాయి!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement