Pink Diamond
-
ప్రకృతి అద్భుతం.. వెల కూడా అదే రేంజ్!
జెనీవా: ప్రకృతిలోని నిజమైన అద్భుతం అది. అందుకే వెల కూడా అదే స్థాయిలో రాబట్టింది. మంగళవారం స్విట్జర్లాండ్ జెనీవాలో క్రిస్టీస్ సంస్థ నిర్వహించిన వేలంపాటలో రికార్డుస్థాయిలో దాదాపు రూ.231 కోట్ల ధర($28.8 millions) పలికింది ఫార్చూన్ పింక్. అత్యంత అరుదైన రత్నం ఇది. ఆసియాకు చెందిన ఒక వ్యక్తి దీనిని సొంతంచేసుకున్నారు. ఆ వ్యక్తి వివరాలు వెల్లడించేందుకు క్రిస్టీస్ జ్యువెలరీ విభాగపు అధినేత మాక్స్ ఫావ్కెట్ నిరాకరించారు. అయితే.. పదిహేనేళ్ల కిందట బ్రెజిల్ గనుల్లో ఆ వజ్రాన్ని సేకరించినట్లు తెలిపారు. ఇక ఇక్కడో ఆసక్తికర విషయం ఏంటంటే.. ప్రపంచంలోనే మొట్టమొదటి పింక్ డైమండ్ ఇండియాలోని గోల్కొండ గనుల్లో 16వ శతాబ్ధంలో బయటపడ్డాయి. ఆపై ఆఫ్రికా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, రష్యా గనుల్లో వీటిని గుర్తించారు. న్యూయార్క్, షాంగై, సింగపూర్, తైవాన్ తర్వాత జెనీవాలో పింక్ డైమండ్స్ వేలం నిర్వహిస్తున్నారు. -
రికార్డ్ ధర పలికిన అరుదైన ‘పింక్’ వజ్రం.. ఎంతంటే?
హాంకాంగ్: అరుదుగా లభించే గులాబీ(పింక్) వజ్రాన్ని వేలం వేయగా రికార్డ్ స్థాయిలో ధర పలికింది. గులాబీ రంగులో ధగ ధగా మెరిసిపోతున్న ఈ వజ్రాన్ని శుక్రవారం హాంకాంగ్‌లో వేలం వేశారు. ఈ వేలంలో 58 మిలియన్ డాలర్లు(రూ.480 కోట్ల) ధర పలికింది. క్యారెట్ పరంగా వేలంలో ఈ స్థాయి అత్యధిక ధర పలకడం ప్రపంచ రికార్డు. 11.15 క్యారెట్లు ఉన్న ఈ విలియమ్సన్ పింక్ స్టార్ డైమండ్ అంచనా ధర 21 మిలియన్ డాలర్లు(రూ.173.5 కోట్లు) కాగా, రెట్టింపు ధరను మించి పలికింది. ప్రముఖ సంస్థ ‘సదబీస్’ దీన్ని వేలం వేసింది. రెండు ప్రపంచ ప్రఖ్యాత పింక్ వజ్రాల వరుసలో ఈ వజ్రానికి ‘విలియమ్సన్ పింక్ స్టార్ డైమండ్’ అనే పేరు వచ్చింది. 23.60 క్యారెట్ల మొదటి విలియమ్సన్ డైమండ్‌ను తన వివాహ వేడుకలో (1947) బ్రిటన్ రాణి ఎలిజబెత్-2 కానుకగా అందుకొన్నారు. 59.60 క్యారెట్ల రెండో పింక్ స్టార్ డైమండ్ 2017 వేలంలో రూ.588 కోట్ల (71.2 మిలియన్ డాలర్లు) రికార్డు ధరకు అమ్ముడుపోయింది. ఇదీ చదవండి: 15 నిమిషాల రైడ్‌కు రూ.32 లక్షలు ఛార్జ్ చేసిన ఉబర్ -
అతిపెద్ద వజ్రం..
లేత గులాబీ రంగులో మెరిసిపోతున్న ఈ రాయిని చూశారా. అది మామూలు రాయి కాదు. అరుదైన పింక్ డైమండ్. దాని ఖరీదు వందలు లేదా వేల కోట్లు ఉండొచ్చని భావిస్తున్నారు. అత్యంత విలువైన ఈ వజ్రం అంగోలాలో బయటపడింది. లులో గనుల్లోని తవ్వకాల్లో బయటపడ్డ ఈ 170 క్యారట్ల పింక్ డైమండ్ ‘ద ల్యూలో రోస్’300 ఏళ్లలో దొరికిన అతిపెద్ద వజ్రంగా లుకాపా డైమండ్ కంపెనీ చెబుతోంది. చారిత్రాత్మకమైన టైప్ ఐఐఏకు చెందిన ఈ వజ్రం అరుదైనది, అత్యంత సహజమైనది కూడా. ఇది అంగోలాను ప్రపంచవేదిక మీద ప్రత్యేకస్థానంలో నిలబెడుతుందని లులో గనుల్లో భాగస్వామి అయిన అంగోలన్ ప్రభుత్వం చెబుతోంది. దాన్ని కట్ చేసి, పాలిష్ చేస్తే.. సగం రాయి పోయినా సగం వజ్రం ఉంటుందని, అది రికార్డు స్థాయి ధరకు అమ్ముడవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 2017లో హాంగ్‌కాంగ్ ప్రభుత్వం 59.6 కేరెట్ల పింక్‌స్టార్ వజ్రాన్ని 71.2 మిలియన్ డాలర్లు అంటే... దాదాపు రూ.570 కోట్ల రూపాయలకు అమ్మింది. అదే అత్యంత ఖరీదైన వజ్రంగా చర్రితలో మిగిలిపోయింది. ఇక 170 కేరెట్ల ‘లులో రోస్’వందలు కాదు.. వేల కోట్లు పలుకుతుందని ప్రభుత్వం భావిస్తోంది. -
Shilpa Yarlagadda: పింక్ రింగ్ శిల్ప!
తాజాగా టైమ్ మ్యాగజీన్ కవర్ ఫోటో మీద ప్రిన్స్ హారీ మేఘనా మెర్కెల్ జంట ఆకర్షణీయంగా కనిపించింది. అయితే వీరిద్దరూ ధరించిన డ్రెస్‌లు, ఆభరణాలలో ముఖ్యంగా మెర్కెల్ వేలికి తొడిగిన ‘డ్యూయెట్ పింక్ డైమండ్ రింగు’ ప్రత్యేకంగా ఉండడంతో చూపరుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఒక మహిళ మరొకరికి మద్దతు ఇస్తోంది అని చెప్పే ‘పింక్ వాగ్దానం’కు గుర్తుగా ఈ రింగును రూపొందించినట్లుగా ఆ ఉంగరాన్ని డిజైన్ చేసిన సంస్థ ‘శిఫాన్’ చెబుతోంది. రింగు బాగా పాపులర్ అవ్వడంతో రింగును రూపొందించిన డిజైనర్ శిల్పా యార్లగడ్డ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. శిల్ప పేరు తెరమీదకు రావడానికి ఒక పింక్ డైమండ్ రింగేగాక, చిన్న వయసులోనే డైమండ్ జ్యూవెలరీ స్టార్టప్‌ను ప్రారంభించి విజయవంతమైన ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తూ, తనకు వచ్చిన లాభాల్లో కొంత భాగాన్ని ఔత్సాహిక ఎంట్రప్రెన్యూర్లను ప్రోత్సహించడానికి వినియోగించడం మరో కారణం. ఒక పక్క తన చదువు ఇంకా పూర్తికాలేదు. కానీ తను ఒక సక్సెస్ ఫుల్ ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తూ.. తనలాంటి ఎంతోమందికి చేయూతనివ్వడమే లక్ష్యంగా పనిచేస్తోంది శిల్పా యార్లగడ్డ. శిఫాన్ అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో పెరిగిన శిల్పా యార్లగడ్డ భారత సంతతికి చెందిన అమ్మాయి. శిల్ప హైస్కూల్లో ఉన్నప్పుడు నాసా, మైక్రోసాఫ్ట్ రీసెర్చ్‌లలో ఇంటర్న్‌షిప్ చేసింది. అప్పుడు కంప్యూటర్ సైన్స్ చదవాలనుకుంది. ఈ క్రమంలోనే హార్వర్డ్ యూనివర్సిటీలో ఎమ్ఐటీ మొదటి ఏడాది చదివేటప్పుడు.. తన చుట్టుపక్కల ఉన్న జ్యువెలరీ సంస్థలన్నీ పురుషులే నిర్వహించడం చూసేది. ఈ రంగంలోకి మహిళలు కూడా అడుగుపెట్టాలి అని భావించి... వివిధ రకాల ఆభరణాలను ఎలా తయారు చేయాలి? తక్కువ ఖర్చులో మన్నిక కలిగిన ఆభరణాల తయారీ ఎలా... అనే అంశాలపై గూగుల్‌లో త్రీవంగా వెతికేది. త్రీడీ ప్రింటింగ్ ద్వారా తక్కువ ఖర్చులో అందమైన జ్యూవెలరీ తయారు చేయవచ్చని తెలుసుకుని స్నేహితులతో కలిసి 2017లో డైమండ్స్‌కు బాగా పేరున్న న్యూయార్క్‌లో ‘శిఫాన్’ పేరిట జ్యూవెలరీ స్టార్టప్‌ను ప్రారంభించింది. శిఫాన్ ప్రారంభానికి ‘అన్‌కట్ జెమ్స్’ సినిమా కూడా శిల్పకు ప్రేరణ కలిగించింది. వజ్రాలతో తయారు చేసిన సింగిల్ పీస్ జ్యూవెలరీని విక్రయించడం ప్రారంభించింది. 2 018లో ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో స్టైలిస్ట్ నికోల్ కిడ్మ్యాన్స్ క్లైంట్ శిఫాన్ సంస్థ రూపొందించిన రింగ్ ధరించి రెడ్ కార్పెట్‌పై నడవడంతో అప్పుడు శిఫాన్కు మంచి గుర్తింపు వచి్చంది. అప్పటి నుంచి శిఫాన్ డైమండ్ జ్యూవెలరీ విక్రయాలు పెరిగాయి. డ్యూయెట్ హూప్స్.. గతేడాది నవంబర్‌లో ‘డ్యూయెట్ హూప్స్’ పేరుమీద రెండో జ్యూవెలరీని ప్రారంభించింది శిల్పా యార్లగడ్డ. ఆదర్శవంతమైన దంపతుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పింక్ డైమండ్ రింగును అందుబాటులోకి తీసుకొచ్చారు. పింక్ డైమండ్ రింగు స్పైరల్ ఆకారంలో అడ్జెస్టబుల్‌గా ఉంటుంది. మొదట ఒక పెద్ద సైజులో డైమండ్, దాని తరువాత చిన్న డైమండ్ ఉండడం ఈ రింగు ప్రత్యేకత. ఈ మోడల్ రింగును ఆమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా సతీమణి మిషెల్ ఒబామా, టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ ధరించడంతో ఆ మోడల్ బాగా పాపులర్ అయింది. అయితే ఈ పింక్ రింగును అమ్మగా వచ్చే ఆదాయంలో యాభై శాతం డబ్బును ‘స్టార్టప్ గర్ల్ ఫౌండేషన్’కు శిల్ప అందిస్తోంది. ఇప్పటికే పెప్పర్, ఇటెర్నెవా, కిన్షిప్, సీ స్టార్ వంటి కంపెనీలకు నిధులు సమకూర్చింది. కాగా పింక్ రింగ్ ధర 155 డాలర్ల నుంచి 780 డాలర్లు ఉండడం విశేషం. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ ఫైనలియర్ చదువుతోన్న శిల్ప తన చదువు పూర్తయ్యాక పూర్తి సమయాన్ని శిఫాన్ కోసం కేటాయించనుంది. కాలం తిరిగి రాదు జ్యూవెలరీ తయారీ పరిశ్రమ మహిళలకు సంబంధించినది. కానీ ఈ పరిశ్రమలన్నీ పురుషులే నిర్వహిస్తున్నారు. అందుకే ఈ రంగంలో ఎక్కువమంది మహిళలు రావాలనుకున్నాను. ఈ క్రమంలోనే స్టార్టప్ గర్ల్ ఫౌండేషన్లకు నిధులు సమకూర్చి ప్రోత్సహిస్తున్నాను. ఒక పక్క చదువుకూంటూ మరోపక్క ఒక కంపెనీ స్థాపించి దాని ఎదుగుదలకు కృషిచేయడం సవాలుతో కూడుకున్నది. కానీ ‘జీవితంలో ఏదైనా తిరిగి తెచ్చుకోవచ్చు గానీ కరిగిపోయిన కాలాన్ని వెనక్కు తెచ్చుకోలేం’ అని ఒకరిచి్చన సలహా నా మనస్సుకు హత్తుకోవడంతో ఈ రెండూ చేయగలుగుతున్నాను. చదవండి: Mystery: న్యోస్ సరస్సు.. రాత్రి రాత్రే ఆ ఊళ్లన్నీ శ్మశానాలైపోయాయి! -
వైరల్: ‘‘ది సాకురా’’ పింక్ డైమండ్ ఖరీదు తెలుసా?
హాంగ్‌కాంగ్: వేలం పాటలో వజ్రాలకు అత్యధిక ధర పలకడం తెలిసిందే. అయితే తాజాగా పర్పుల్-పింక్ డైమండ్ ‘ది సాకురా’ను హాంగ్‌కాంగ్‌లో వేలం వేయగా 213 కోట్లు పలికింది. 15.81 క్యారెట్ల ఈ డైమండ్‌ను ఆసియాలోని ఓ బడా వ్యాపారి సొంతం చేసుకున్నట్లు సమాచారం. ‘ది సాకురా’ తో పాటు, గుండె ఆకారంలో ఉన్న మరో 4.2 క్యారెట్ల గులాబీ వజ్రాల ఉంగరాన్ని 6.6 మిలియన్ డాకర్లకు ‘ది స్వీట్ హార్ట్’ పేరుతో వేలం వేశారు. కాగా ‘ది సాకురా’ పింక్ డైమండ్ 29.3 మిలియన్ డాలర్లు పలికింది. జెనీవాలో గత నవంబర్‌లో ‘ది సాకురా’ అనే 14.8 క్యారెట్ల పర్పుల్-పింక్ డైమండ్ ‘ది స్పిరిట్ ఆఫ్ ది రోజ్’ వేలంలో 27 మిలియన్ డాలర్లకు అమ్ముడుపోయింది. అలాగే దోషనివారణ ఓవల్ రత్నం "ది స్పిరిట్ ఆఫ్ ది రోజ్" 23-38 మిల్లియన్ డాలర్లు పలికినట్లు అంచనా. కాగా దీనిపై క్రిస్టీ వేలం సంస్థ స్పందిస్తూ.."ఈ రోజు ఆభరణాల వేలం చరిత్రలో మరో ముఖ్యమైన అధ్యాయాన్ని ‘‘ది సాకురా’’ నమోదు చేసింది. వేలంలో రికార్డ్ స్థాయిలో పలికిన ధర పట్ల మేము చాలా సంతోషిస్తున్నాం. అలాగే అత్యుత్తమ పింక్ వజ్రాలను అందించే క్రిస్టీ సంప్రదాయాన్ని కొనసాగిస్తాం." అని ఓ ప్రకటనలో తెలిపారు. (చదవండి: సెకండ్ వేవ్: మళ్లీ 2 లక్షలు దాటిన కరోనా కేసులు) -
‘పింక్ డైమండ్’ పిల్‌ను తోసిపుచ్చిన హైకోర్టు
సాక్షి, అమరావతి: తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ మనుగడ విషయంలో తగిన విచారణకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను హైకోర్టు మంగళవారం తోసిపుచ్చింది. పింక్ డైమండ్ విషయంలో ఇప్పటికే సుప్రీం కోర్టు కమిటీలు రెండు నివేదికలు ఇచ్చాయని, అందువల్ల దీనిపై మళ్లీ విచారణకు ఆదేశించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది. చదవండి: నేడు పోలవరంపై కీలక భేటీ ఈ మేరకు సీజే జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పింక్ డైమండ్ విషయంలో విచారణకు ఆదేశించాలని కోరుతూ టీడీపీ అధికార ప్రతినిధి విద్యాసాగర్ పిల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ అప్పటి ప్రధానార్చకులు రమణ దీక్షితులు, అప్పటి ఈవోలు ఐవైఆర్ కృష్ణారావు, ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారు. సాయిరెడ్డి తదితరులను ప్రతివాదులుగా చేర్చడంపై కోర్టు అభ్యంతరం తెలిపింది. -
పింక్ డైమండ్ పగిలిపోయే ఆస్కారం లేదు
సాక్షి, తిరుపతి : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలక మండలిలో జరుగుతున్న పరిణామాలపై చర్చించేందుకు చిత్తూరు జిల్లా తిరుపతిలో పీఠాధిపతులు సమావేశమయ్యారు. అనంతరం శ్రీ విద్యాగణేషానంద భారతీ స్వామి మీడియాతో మాట్లాడుతూ.. టీటీడీ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. టీటీడీ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు లేవనెత్తిన అంశాలపై టీడీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. స్వామివారి సన్నిధిలో ఉన్న పింక్ డైమండ్ పగిలిపోయే ఆస్కారమే లేదని స్వామీజి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం టీటీడీలో తలెత్తుతున్న వివాదాలు, అనంతరం చోటుచేసుకుంటున్న పరిణామాలతో శ్రీవారి భక్తులు సైతం ఆందోళన చెందుతున్నారని విద్యాగణేషానంద భారతీ స్వామి తెలిపారు. -
ఎవరిని కాపాడాలనుకుంటున్నారు?
సాక్షి, హైదరాబాద్ : కళియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి నగలు, పింక్ డైమండ్ వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని వీహెచ్‌పీ అధికార ప్రతినిధి రావినుతల శశిధర్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... టీటీడీ మాజీ చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ రమణకుమార్‌పై తీవ్రంగా మండిపడ్డారు. రమణకుమార్ ఎవరిని కాపాడాలని ప్రయత్నిస్తున్నారని, తన హయంలో ఆరోపణలు వస్తే ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్నించారు. రమణకుమార్ మీడియా ప్రకటనను చూస్తే అధికారుల నిర్లక్ష్యం కనబడుతుందని ఆరోపించారు. ఈ విషయంపై సీఎం చంద్రబాబు సమాధానం చెప్పకుండా రిటైర్డ్ అధికారులతో ఎందుకు మట్లాడిస్తున్నారని నిలదీశారు. ఎవరో చెప్పిన మాటలు విని నివేదికలు తయారు చేసే అధికారులు టీటీడీలో ఉన్నారా ప్రశ్నించారు. ఈ విషయంపై వెంటనే సీబీఐ విచారణ జరిపిస్తే అసలు విషయాలు బయటకి వస్తాయని శశిధర్ అన్నారు. -
శ్రీవారి ఆభరణాల వ్యవహారంలో కోత్త కోణం
-
‘పింక్ డైమండ్‌పై రమణ దీక్షితులు ఫిర్యాదు చేశారు’
సాక్షి, చిత్తూరు: పింక్ డైమండ్‌పై రమణ దీక్షితులే తనకు ఫిర్యాదు చేశారని టీటీడీ మాజీ చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్ రమణకుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పిక్ డైమండ్‌పై ఫిర్యాదు చేసి.. రమణ దీక్షితులు తనను పక్కదారి పట్టించారని అన్నారు. పింక్ డైమండ్‌పై రమణ దీక్షితులు ఇచ్చిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్నానని, అందుకే తన రిపోర్టులో ఆ విషయం ప్రస్తావించానని తెలిపారు. రమణ దీక్షితులు ఆరోపణలో వాస్తవం లేదని జస్టిస్ జగన్నాథరావు కమిటీ నివేదికలో తేలిపోయిందన్నారు. బంగారు డాలర్ల విచారణ భాగంలోనే పింక్ డైమండ్ విషయం బయటపడిందన్నారు. గతంలో బొక్కసానికి సంబంధించిన రెండు తాళాలు డాలర్ శేషాద్రి వద్దే ఉండేవని, తన రిపోర్టులో ఆయన దగ్గర తాళాలు ఉండకూడదని పేర్కొన్నానట్లు తెలిపారు. దీంతో తాను ఇచ్చిన రిపోర్టు ఆధారంగా ఆభరణాల భద్రత విషయంలో చాలా మార్పులు చేశారని తెలిపారు. శ్రీ వారి నగలను ఆలయంలో జమాలజీ ల్యాబ్ ఏర్పాటుచేసి లెక్కగట్టారన్నారు. తాను ఇంతవరకూ పింక్ డైమండ్‌ని చూడలేదన్నారు. అదేవిధంగా రమణ దీక్షితులు టీటీడీకి ఇచ్చిన విరాళాన్ని తన అకౌంట్లో వేసుకునే వారని ఆయన ఆరోపించారు. ఈ విషయాన్ని అప్పటి ఈవో రమణాచారి దృష్టికి తీసుకెళ్లామని, అయితే ఈవో ఆయన్ని మందలించి వదిలేశారని రమణ కుమార్ చెప్పారు. ప్రస్తుత పరిణామాలపై సీబీఐ విచారణ చేయించాలని ఆయన కోరారు. -
విజిలెన్సు నివేదికలో వందల కోట్ల విలువైన డైమండ్
-
టీటీడీ విజిలెన్సు నివేదికలో ‘వజ్రం’
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుమల శ్రీవారికి కానుకల రూపంలో అందిన ఆభరణాల్లో రూ.వందల కోట్ల విలువ చేసే పింక్ డైమండ్ ఉన్నట్లు విజిలెన్సు రికార్డులు చెబుతున్నాయి. 2008 జూలై 28న అప్పటి టీటీడీ చీఫ్ విజిలెన్సు అధికారి రమణకుమార్ బంగారు డాలర్ల గల్లంతుపై విచారణ జరిపి ఈవోకి అందజేసిన నివేదికలో దీని గురించి ప్రస్తావించారు. ఈ భారీ వజ్రం ముక్కలై ఉన్నట్లు ఆయన తన నివేదికలో పొందుపరిచారు. దీన్నిబట్టి చూస్తే మంగళవారం టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్‌యాదవ్, ఈవో అనిల్కుమార్సింఘాల్లు స్వామి వారి ఆభరణాల్లో అసలు వజ్రమే లేదని చెప్పిన మాటలు అబద్ధమని స్పష్టమవుతోంది.సీఎం చంద్రబాబుతో భేటీ అనంతరం వారు ఈ వ్యాఖ్యలు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీవారికి ఉన్న భారీ వజ్రం ఒకటి దేశం దాటి పోయిందనీ, ఇటీవలే అది జెనీవాలో వేలానికి వచ్చిందని ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. దీనికితోడు డిసెంబరు 8న శ్రీవారి పోటులో తవ్వకాలు జరిగాయనీ, నిధుల కోసమే ఇవి జరిగినట్లు దీక్షితులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. దీన్నిబట్టి తిరుమల ఆలయంలో గుట్టుగా నిధుల వేట జరుగుతోందనీ, రూ.కోట్ల విలువైన ఆభరణాలకు భద్రత లేదన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. 16వ శతాబ్దంలో ఒక వజ్రం..: ఎస్వీ యూనివర్సిటీ చరిత్ర విభాగం ప్రొఫెసర్ దేవిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. 16వ శతాబ్దంలో శ్రీవారికి ఒక విలువైన వజ్రం ఉండేది. పోర్చుగీసు దేశం నుంచి వచ్చిన యాత్రికుడు జాక్వోస్ డీ కౌట్రే స్పానిష్ భాషలో రచించిన తిరుమల యాత్రా విశేషాల్లో ఈ వజ్రం గురించి వివరించాడని సుబ్రహ్మణ్యంరెడ్డి చెబుతున్నారు. కౌట్రే తిరుమల ఆలయాన్ని చూసి వేంకటేశ్వర స్వామి ప్రతిమకు విలువైన ఆభరణాలు అలంకరించబడి ఉండటం, అందులో విలువైన వజ్రం ఉన్న వడ్డాణాన్ని చూసినట్లు పేర్కొన్నారని ప్రొఫెసర్ వివరించారు. నివేదికలో ఏముంది? 2008లో ఐదు గ్రాముల బరువున్న స్వామి వారి బంగారు డాలర్లు 300 పైగా గల్లంతయ్యాయన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అప్పట్లో సీవీ ఎస్‌వోగా ఉన్న రమణకుమార్ ఈ వ్యవహారంపై విచారణ జరిపి 2008 జూలై 28న ఈవోకి నివేదిక ఇచ్చారు. సదరు నివేదికలో గల్లంతైన డాలర్ల విలువ రూ.15.40 లక్షలుగా పేర్కొంటూ, కేసు వివరాలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా తన నివేదికలో పింక్ డైమండ్ గురించి పేర్కొన్నారు. కొన్నేళ్ల కిందట వందల కోట్ల విలువ గల ఈ వజ్రం ముక్కలైనట్లు గుర్తించామని వివరించారు. దీన్నిబట్టి చూస్తే శ్రీవారి ఆభరణాల్లో విలువైన వజ్రం ఉన్నట్లు విశదమవుతోంది. దీనికి చైర్మన్, ఈవోలు ఏం సమాధానం చెబుతారోనన్నది ఉత్కంఠగా మారింది. 16వ శతాబ్దం నుంచి ఏఏ ఆభరణాలు స్వామివారికి కానుకలుగా అందాయో చెప్పడమే కాకుండా వాటిని ప్రజల సందర్శనార్థం ఉంచాలనీ, అప్పుడే టీటీడీ అధికారుల పారదర్శకత స్పష్టమవుతుందని భక్తులు అభిప్రాయపడుతున్నారు. -
లేని వజ్రాన్ని తెమ్మంటే ఎలా?: పుట్టా
సాక్షి, అమరావతి: శ్రీవారికి చెందిందిగా ప్రచారంలో ఉన్న గులాబీ వజ్రం అసలు లేనేలేదని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ అన్నారు. తిరుమల ఆలయంలో నగల మాయం, అర్చకుల తొలగింపు, విబేధాలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో జరిగిన ఈ భేటీకి టీటీడీ ఈవో సింఘాల్ సహా ఇతర ఉన్నతాధికులు హాజరయ్యారు. (చదవండి: చంద్రబాబు పదేపదే అదే చెప్పారు: సింఘాల్) ‘‘శ్రీవారి ఆభరణాల రికార్డుల్లో గులాబీ వజ్రం అనేది లేనేలేదు. రికార్డుల్లో లేని వజ్రాన్ని తీసుకురమ్మంటే ఎలా? ఎక్కడి నుంచి తెస్తాం? అసలు రమణదీక్షితులు ఇన్నాళ్లూ ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇప్పుడే ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు?’’ అని టీటీడీ చైర్మన్ ప్రశ్నించారు. కొద్దిరోజులుగా జరుగుతోన్న వ్యవహారాలపై సీఎం వివరాలు అడిగారని, అన్ని విషయాలూ సవివరంగా చెప్పామని, రమణదీక్షితులుగానీ మరొకరుగానీ చేస్తున్న ఆరోపణల్లో ఏ ఒక్కటీ నిజం లేదని పుట్టా స్పష్టం చేశారు. టీటీడీ ఈవో సింఘాల్ సైతం మీడియాతో మాట్లాడుతూ.. ఆగమశాస్త్రం ఒప్పుకుంటే శ్రీవారి ఆభరణాలను ప్రదర్శిస్తామని అన్నారు. వేంకటేశ్వరుడికి చెందిన గులాబీ వజ్రంతోపాటు కొన్ని ఆభరణాలు కనిపించకుండా పోయాయని, పోటు(వంటశాల)ను మూసివేసి స్వామివారిని పస్తులు ఉంచారని శ్రీవారి ఆలయం మాజీ ప్రధానార్చకులు రమణదీక్షితులు ఇటీవల చేసిన ఆరోపణలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఆమధ్య జర్మనీలో వేలం వేసిన గులాబీ వజ్రం శ్రీవారిదే అయి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు కూడా. -
సీఎం పదేపదే అదే చెప్పారు: టీటీడీ ఈవో
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానంలో నగల మాయం వ్యవహారం, అర్చకుల మధ్య విబేధాలు తదితర పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం టీటీడీ ముఖ్యులతో కీలక సమావేశం నిర్వహించారు. అమరావతిలోని తాత్కాలిక సచివాలయంలో భేటీ అనంతరం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మీడియాతో మాట్లాడారు. వివాదాలకు సంబంధించి సీఎం ఏం చెప్పారో వివరించారు.. (చదవండి: లేని వజ్రాన్ని తెమ్మంటే ఎలా?: పుట్టా) సీఎం గట్టిగా చెప్పారు: ‘‘టీటీడీలో అన్ని పనులూ చట్టప్రకారం, ఆగమశాస్త్ర నియమాల ప్రకారం జరుగుతున్నాయి. నిధులు ఎక్కడా దుర్వినియోగం కాలేదని చెప్పగలుగుతున్నాం. ఇకపోతే సమావేశంలో సీఎంగారు మాకు పదేపదే ఒకే విషయాన్నిగుర్తుచేశారు. వేంకటేశ్వరస్వామి ఆలయ పవిత్రతకు ఎక్కడా భంగం వాటిల్లకుండా, భక్తుల మనోభావాలు గాయపడకుండా చూసుకోవాలని చెప్పారు. అదేసమయంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగొద్దని ఆదేశించారు. ఆయా రోజులకు సంబంధించి స్వామివారి కైంకర్యాల వేళల్లో ఎలాంటి మార్పులు చేయలేదని మేం సీఎంకు వివరించాం’’ అని సింఘాల్ తెలిపారు. ఆగమ శాస్త్రం ఒప్పుకుంటే ప్రదర్శిస్తాం: 1952 నుంచి శ్రీవారి ఆభరణాలకు సంబంధించిన రికార్డులు ఉన్నాయని టీటీడీ ఈవో చెప్పారు. ‘‘2011 జనవరి 20న టీటీడీ వేసిన రిటైర్డ్ జడ్జీల కమిటీ కూడా ఆభరణాలన్నీ ఉన్నాయని తేల్చింది. కానీ శ్రీకృష్ణ దేవరాయల ఆభరణాలు యేవో ఆ కమిటీ తేల్చలేకపోయింది. ప్రతి ఏడాది ఆభరణాల తనిఖీ జరుగుతూనే ఉంటుంది. ఒక్క మిల్లీ గ్రాము అటూ ఇటైనా రికార్డుల్లోకి వస్తాయి. శ్రీవారి ఆభరణాల జాబితా ఇప్పటికే ఇచ్చాం. ఆగమ శాస్త్రం ఒప్పుకుంటే శ్రీవారి ఆభరణాలను ప్రదర్శించడానికి మేం సిద్ధంగా ఉన్నాం. ప్రచారంలో ఉన్నట్లు గులాబీ వజ్రం ఏదీ లేదు. రూబీ మాత్రమే ఉంది. అదికూడా భక్తులు విసిరిన నాణేలు తగిలి పగిలిపోయింది’’ అని అనిల్ కుమార్ సింఘాల్ వివరించారు. కాగా, సీఎంతో భేటీకి ముందు ఈవో మీడియాకు ఏం చెప్పారో, సమావేశం తర్వాత కూడా అదే చెప్పడం గమనార్హం. తద్వారా శ్రీవారి నగల మాయంపై వస్తున్న ఆరోపణలపై చంద్రబాబు ఎలాంటి చర్యలుగానీ, విచారణగానీ చేపట్టబోవడంలేదని తెలుస్తున్నట్లు రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి. -
రూ.250 కోట్ల వజ్రం కోసం.. రంగంలోకి ఇంటర్‌పోల్
జోహన్నెస్‌బర్గ్: ఒక్క వజ్రం ఆచూకీ ప్రపంచదేశాల పోలీసులకు సవాల్‌గా మారింది. ఫ్రాన్స్, లెబనాన్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా, దుబాయ్, రష్యా ఇలా పలు దేశాల పోలీసులు చోరికి గురైన రూ.250 కోట్ల విలువైన పింక్ వజ్రాన్ని కనిపెట్టేందుకు మల్లగుల్లాలు పడుతున్నారు. నిందితులు పెద్ద స్ధాయికి చెందిన వ్యాపారస్ధులు కావడం, వారు ఒకరిపై మరొకరు ఆరోపణలు గుప్పించుకుంటుండటం కేసు దర్యాప్తును మరింత క్లిష్టతరం చేస్తోంది. తాజాగా ఈ కేసులో నలుగురు భారతీయ ఆఫ్రికన్లు జునైద్ మోతీ, అబ్బాస్ అబూబకర్ మోతీ, అష్రఫ్ కాకా, సలీం బొబట్‌లకు ఇంటర్‌పోల్ రెడ్ నోటీసులు జారీ చేసింది(ఇంటర్‌పోల్ రెడ్ నోటీసులు జారీ చేస్తే ఆ వ్యక్తిని ప్రపంచంలో ఎక్కడున్నా అరెస్టు చేసి తరలిస్తారు). దీంతో వారు నోటీసులను నిలిపివేయాలంటూ ప్రిటోరియా హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే వీరు ఫ్రాన్స్, లెబనాన్, జింబాబ్వే, దుబాయ్ కోర్టుల్లో వజ్రానికి సంబంధించి విచారణను ఎదుర్కొంటున్నారు. ఏం జరిగింది.. కొన్నేళ్ల క్రితం రష్యాకు చెందిన టెలికమ్యూనికేషన్ టైకూన్, వజ్రాల వ్యాపారితో పింక్ డైమండ్‌ను రూ.250 కోట్లకు అమ్మడానికి నలుగురు భారతీయ ఆఫ్రికన్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒప్పందం ముగిసే సమయంలో ఇరువురూ ఒకరిపై మరొకరు ఆరోపణలకు దిగారు. వజ్రం తమ దగ్గరలేదంటే తన దగ్గరలేదంటూ ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు. అది చాలక కోర్టుల్లో ఒకరిపై మరొకరు దొంగతనం కేసులు వేసుకున్నారు. కొత్త కథ తెరపైకి.. తమతో పాటు బిజినెస్ నడిపిన మాజీ భాగస్వామి అలిబెక్ ఇస్సేవ్ అనే వ్యక్తిపై నలుగురు భారత ఆఫ్రికన్లు ఆరోపణలు చేశారు. ప్రిటోరియా కోర్టులో ఈ మేరకు వాంగ్మూలం ఇచ్చారు. ఇస్సేవే అసలు దోషి అని, అతనే వజ్రాన్ని అపహరించాడని చెప్పారు. తమపై ఇంటర్‌పోల్ జారీ చేసిన రెడ్ నోటీసుపై స్టే ఇవ్వాలని కోర్టును అభ్యర్థించారు. మరో వ్యాపారి తెరపైకి.. అంతర్జాతీయ వజ్రాల వ్యాపారి సైల్లా మౌస్సా తాజాగా చేసిన వ్యాఖ్యలు కొత్త దుమారాన్ని రేపుతున్నాయి. 2003లో పింక్ డైమండ్‌ను తన నుంచి నలుగురు భారత ఆఫ్రికన్లు అపహరించుకుపోయారని ఆయన వ్యాఖ్యానించారు. అసలు ఆ పింక్ డైమండ్ తనదేనని ఆయన అంటున్నారు. అయితే, దీనిపై మాట్లాడిన నలుగురు భారతీయ ఆఫ్రికన్లలో ఒకరైన కాకా.. తమకు పడిన బాకీని చెల్లించేందుకు పింక్ డైమండ్‌ను మౌస్సానే ఇచ్చారని చెప్పారు. కాగా, ఇంటర్‌పోల్ జారీ చేసిన నోటీసులు ఇంతవరకూ తమకు చేరలేదని దక్షిణాఫ్రికా పోలీసులు తెలిపారు. -
మగువ మెచ్చే వజ్రం..
పింక్ కలరంటే అమ్మాయిలకు ఎంతి ష్టమో.. అలాంటిది అదే రంగులో ఉన్న వజ్రాన్ని వారు వదిలిపెడతారా.. మగువలు మెచ్చే వజ్రంగా చెబుతున్న ఈ 8.41 క్యారెట్ల పింక్ డైమండ్‌ను అక్టోబర్ 7న హాంగ్‌కాంగ్‌లో వేలం వేయనున్నారు. అంతకుముందు దీన్ని లండన్‌లో ప్రదర్శనకు పెడతారు. అరుదైనదిగా భావిస్తున్న ఈ గులాబీ రంగు వజ్రం రూ.100 కోట్లకు పైగానే పలుకుతుందని అంచనా.