లేత గులాబీ రంగులో మెరిసిపోతున్న ఈ రాయిని చూశారా. అది మామూలు రాయి కాదు. అరుదైన పింక్ డైమండ్. దాని ఖరీదు వందలు లేదా వేల కోట్లు ఉండొచ్చని భావిస్తున్నారు. అత్యంత విలువైన ఈ వజ్రం అంగోలాలో బయటపడింది. లులో గనుల్లోని తవ్వకాల్లో బయటపడ్డ ఈ 170 క్యారట్ల పింక్ డైమండ్ ‘ద ల్యూలో రోస్’300 ఏళ్లలో దొరికిన అతిపెద్ద వజ్రంగా లుకాపా డైమండ్ కంపెనీ చెబుతోంది.
చారిత్రాత్మకమైన టైప్ ఐఐఏకు చెందిన ఈ వజ్రం అరుదైనది, అత్యంత సహజమైనది కూడా. ఇది అంగోలాను ప్రపంచవేదిక మీద ప్రత్యేకస్థానంలో నిలబెడుతుందని లులో గనుల్లో భాగస్వామి అయిన అంగోలన్ ప్రభుత్వం చెబుతోంది. దాన్ని కట్ చేసి, పాలిష్ చేస్తే.. సగం రాయి పోయినా సగం వజ్రం ఉంటుందని, అది రికార్డు స్థాయి ధరకు అమ్ముడవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 2017లో హాంగ్‌కాంగ్ ప్రభుత్వం 59.6 కేరెట్ల పింక్‌స్టార్ వజ్రాన్ని 71.2 మిలియన్ డాలర్లు అంటే... దాదాపు రూ.570 కోట్ల రూపాయలకు అమ్మింది. అదే అత్యంత ఖరీదైన వజ్రంగా చర్రితలో మిగిలిపోయింది. ఇక 170 కేరెట్ల ‘లులో రోస్’వందలు కాదు.. వేల కోట్లు పలుకుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment