diamond
-
వజ్రం మరో వజ్రాన్ని కోస్తుంది!
ఆభరణం చాలా రోజులు బీరువాలో ఉంచితే కొద్దిగా మసకబారినట్లు అనిపిస్తుంది. ఆభరణం ధగధగలాడాలంటే ధరించే ముందు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ధరించిన తర్వాత తిరిగి భద్రపరిచేటప్పుడు ఎటువంటి చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం. 👉ఆభరణాన్ని (బంగారు ఆభరణం, వజ్రాల ఆభరణం ఏదైనా) ధరించే ముందు వెల్వెట్ క్లాత్ లేదా మెత్తని నూలు వస్త్రంతో సున్నితంగా తుడవాలి. 👉దుమ్ము పట్టేసినట్లనిపిస్తే వేడి నీటితో శుభ్రం చేయాలి. ఇది చాలా అరుదుగా మాత్రమే చేయాలి. ఓపెన్ సెట్టింగ్ వజ్రాల ఆభరణాన్ని వేడి నీటిలో ఒకసారి ముంచి తీసి వెంటనే టిష్యూ పేపర్‌తో తేమ వదిలే వరకు సున్నితంగా తుడవాలి. ఇది ఇతర రంగు రాళ్లేవే లేకుండా అన్నీ వజ్రాలే ఉన్న ఆభరణానికి మాత్రమే వర్తిస్తుంది. ఇతర రాళ్లు పొదిగిన ఆభరణాలను వేడి నీటిలో ముంచరాదు. 👉క్లోజ్డ్ సెట్టింగ్ వజ్రాల ఆభరణాన్ని నీటిలో ముంచకూడదు. నీటిలో ముంచినట్లయితే కొంతనీరు వజ్రానికి బంగారానికి మధ్యలో చేరుతుంది. ఆ నీటిని తొలగించడం కష్టం. మరీ ఎక్కువగా నీరు పట్టినప్పుడు వజ్రాన్ని తీసి మళ్లీ చేయించుకోవడమే మార్గం. కాబట్టి క్లోజ్డ్ సెట్టింగ్ వజ్రాల ఆభరణం మీద పట్టిన దుమ్మును వదిలించాలంటే టిష్యూ పేపర్ లేదా వెల్వెట్ క్లాత్‌తో తుడవాలి. అంతేకాదు, ఆభరణాలను తరచూ నీటితో శుభ్రం చేస్తుంటే బంగారం కరిగిపోతుంది. 👉ఏ ఆభరణాన్నయినా (పూర్తి బంగారు ఆభరణాలు, రాళ్లు పొదిగిన ఆభరణాలు, వజ్రాల ఆభరణాలు) తెల్లటి ప్లాస్టిక్ బాక్సుల్లోనే పెట్టాలి. 👉 వెల్వెట్ క్లాత్కి రంగును వదిలే స్వభావం ఉంటుంది. దీర్ఘకాలం వెల్వెట్ క్లాత్ మధ్య ఉంచితే వెల్వెట్ క్లాత్ రంగు ప్రభావం ఆభరణం మీద పడుతుంది. 👉వజ్రాల ఆభరణాలు ఒక బాక్సులో ఒక్కటి మాత్రమే ఉండాలి. వజ్రం గట్టిగా ఉంటుంది. కోసే గుణం కూడా ఉంటుంది. కాబట్టి ఒక స్టోన్ కారణంగా మరొక స్టోన్ కోతకు గురయ్యే ప్రమాదం ఉంటుంది. -
వజ్రాల ధగధగలపై చీకట్ల ముసురు!
సూరత్ అంటే ముందుగా అందరికి గుర్తొచ్చేది వజ్రాలే. ప్రపంచంలోని 90 శాతం వజ్రాలను సూరత్‌లోనే ప్రాసెస్ చేస్తారు. దీనికోసం ఇక్కడ ఏకంగా 5000 కంటే ఎక్కువ ప్రాసెస్ యూనిట్స్ ఉన్నాయి. ఇందులో సుమారు ఎనిమిది లక్షల మందికిపైగా పాలిషర్స్ ఉపాధి పొందుతున్నారు. అయితే గత కొన్నేళ్లుగా సూరత్‌లో వజ్రాల వ్యాపారం తీవ్రంగా దెబ్బతింది.వజ్రాల వ్యాపారం దెబ్బతినడానికి కారణం▸ఉక్రెయిన్, రష్యా యుద్ధం తరువాత యూరోపియన్ యూనియన్ దేశాలు, జీ7 దేశాలు దిగుమతులను నిషేధించడం. ▸కరోనా మహమ్మారి తరువాత విధించిన లాక్డౌన్ వల్ల ఎగుమతులు మందగించడం.▸పాశ్చాత్య దేశాల నుంచి డిమాండ్ తగ్గిపోవడం, ఆర్ధిక వ్యవస్థలు మందగించడం.▸ల్యాబ్‌లో తాయారు చేసిన వజ్రాలకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోవడం. ఎందుకంటే సహజమైన వజ్రాల కంటే ల్యాబ్‌లో తయారైన వజ్రాల ధరలు కొంత తక్కువగానే ఉంటాయి. ఇది డైమండ్ మార్కెట్ మీద ప్రభావం చూపిస్తుంది.కటింగ్, పాలిషింగ్ వంటి వాటికోసం 30 శాతం రఫ్ డైమండ్లను భారత్.. రష్యా నుంచి దిగుమతి చేసుకునేది. అయితే కరోనా, ఇతర కారణాల వల్ల చాలా దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో వజ్రాల వ్యాపారం మందగించిందని ఇండియన్ డైమండ్ ఇన్స్టిట్యూట్ ప్రెసిడెంట్ దినేష్ నవాడియా పేర్కొన్నారు.ఆర్థిక మాంద్యం కారణంగా సుమారు వెయ్యి పాలిషింగ్ యూనిట్స్ మూతపడ్డాయి. దీంతో సుమారు రెండు లక్షలమంది ఉపాధి కోల్పోయారు. ఉపాధి కోల్పోవడంతో గత 16 నెలల్లో సుమారు 65 మంది ఆత్మహత్య చేసుకున్నట్లు, డైమండ్ పాలిషర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్టేట్ డైమండ్ వర్కర్స్ యూనియన్ నేతలు పేర్కొన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన తరువాత.. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేక, కుటుంబాలను పోషించలేకే ఈ ఆత్మహత్యలు చేసుకుంటున్నట్లు వెల్లడించారు.ఇదీ చదవండి: అంబానీ చెప్పిన మూడు విషయాలు ఇవే..బంగారం, వజ్రాల వ్యాపారం దేశ ఆర్ధిక వ్యవస్థ పెరగడానికి దోహదపడుతోంది. 2022లో ఈ వ్యాపారం దేశ జీడీపీ దాదాపు ఏడు శాతం దోహదపడింది. అయితే 2024 ఆర్ధిక సంవత్సరంలో రత్నాలు, ఆభరణాల ఎగుమతులు గణనీయంగా తగ్గాయి. ఈ ఎగుమతుల విలువ 1.87 లక్షల కోట్లు. -
11 వేల వజ్రాలతో రతన్ టాటా చిత్రం
సూరత్: రతన్ టాటా తన 86వ ఏట ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. ఆయనకు భారతరత్న ఇవ్వాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. మన దేశానికి అమూల్యమైన రత్నం మాదిరిగా నిలిచిన రతన్ టాటాకు గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఒక వ్యాపారి వజ్రాలతో రతన్ టాటాకు నివాళులు అర్పించారు.ఉన్నత వ్యక్తిత్వం కలిగిన రతన్ టాటాను దేశంలోని ఏ ఒక్కరూ మరచిపోలేరు. సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి విపుల్భాయ్ 11 వేల అమెరికన్ వజ్రాలతో రతన్ టాటా చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రం రూపకల్పనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్వతహాగా కళాకారుడైన విపుల్.. రతన్ టాటా చిత్రాన్ని తీర్చిదిద్దేందుకు అమెరికన్ డైమండ్స్ వినియోగించారు. ఈ వైరల్ వీడియో సోషల్ మీడియాలోని వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో పలువురు షేర్ చేస్తున్నారు. सूरत में एक व्यापारी ने 11000 अमेरिकन डायमंड की मदद से बनाया रतन टाटा जी का डायमंड पोट्रेट💎 pic.twitter.com/2Q8QMJJfwy— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) October 12, 2024ఇది కూడా చదవండి: డెంగ్యూకు టీకా.. బీహార్‌లో తుది ట్రయల్స్ -
కనకదుర్గమ్మకు వజ్ర కిరీటం సమర్పించిన అజ్ఞాత భక్తుడు (ఫొటోలు)
-
మరోసారి తెరపైకి ‘గోల్కొండ వజ్రం’
సాక్షి, హైదరాబాద్: ‘అసలు సిసలైన వజ్రం కావాలంటే గోల్కొండ గనుల్లోనే దొరకాలి’ఇది ఒకప్పుడు ప్రపంచం మాట. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విస్తరించిన గోల్కొండ గనుల్లో లభించే వజ్రాలకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. వజ్రం అనగానే గుర్తుకొచ్చే ‘కోహినూర్’ఇక్కడ దొరికిందే. ఇప్పుడు మరోసారి గోల్కొండ వజ్రాల అంశం తెరపైకి వచ్చింది. బ్రిటిష్ రాజకుటుంబం నగల కలెక్షన్లలో భాగంగా ఉన్న 18వ శతాబ్దం నాటి అరుదైన నెక్లెస్ నవంబర్‌లో వేలానికి వస్తోంది.వేలం నిర్వహణలో ఖ్యాతిగాంచిన సోథెబైస్ జెనీవాలో దీనిని వేలం వేస్తోంది. మూడు వరుసలతో ఉన్న ఈ నెక్లెస్‌లో దాదాపు 500 వజ్రాలున్నాయి. అవి ప్రఖ్యాత గోల్కొండ గనుల నుంచి సేకరించినవే అయ్యి ఉంటాయంటూ తాజాగా వేలం నిర్వహణ సంస్థ సోథేబైస్ ప్రకటించింది. ఈ నెక్లెస్‌కు వేలంలో 2.8 మిలియన్ డాలర్ల గరిష్ట ధర పలుకుతుందని వేలం సంస్థ అంచనా వేస్తోంది. గోల్కొండ వజ్రాల స్వచ్ఛత ఆధారంగా వాటికి వేలం పాటల్లో అధికంగా ధరలు పలుకుతాయి. దీంతో ఇప్పు డు మరోసారి గోల్కొండ వజ్రాలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా గోల్కొండ వజ్రాలు ప్రజలను విపరీతంగా అకట్టుకుంటున్నాయి.కోహినూర్‌తో..గోల్కొండ వజ్రాలకు అంతగా ఖ్యాతి రావటానికి కోహినూర్ వజ్రం ప్రధాన భూమిక పోషించింది. ప్రపంచం మొత్తానికి రెండున్నర రోజుల పాటు భోజన ఏర్పాట్లు చేసినందుకు ఎంత ఖర్చవుతుందో కోహినూర్ వజ్రం విలువ అంత ఉంటుందని మొఘల్ చక్రవర్తులు వ్యాఖ్యానించారట. గత పదేళ్లలో కొల్లాపూర్, నారాయణపేటలో జీఎస్ఐకి ముడి వజ్రాలుండే కింబర్లైట్ డైక్స్ లభించాయి. ఈ ప్రాంతాల్లో వజ్రాలుంటాయనటానికి ఇది ఓ ఆధారం. మూసీ పరీవాహకంలో కూడా వజ్రాలు భూగర్భంలో ఉన్నాయని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. బ్రిటిష్ పాలన కాలంలో గుంతకల్ సమీపంలోని వజ్రకరూరులో భారీ వజ్రాల గని తవ్వారు. ఇప్పటికీ అక్కడ 90 మీటర్ల లోతుతో భారీ గుంత నీటితో నిండి ఉంటుంది. » కుతుబ్‌షాహీల కాలంలో వజ్రాల వ్యాపారం ముమ్మరంగా సాగింది. విస్తారంగా గనులు తవ్వి వజ్రాలు వెలికితీశారు. దాదాపు లక్ష మంది కార్మికులు ఈ గనుల్లో పనిచేసేవారట. » ఈ గనులు స్థానిక సుబేదారుల అధ్వర్యంలో రోజువారీగా లీజుకు తీసుకొని హైదరాబాద్‌లోని వ్యాపారులు వజ్రాలు వెలికి తీసేవారు. ఒక క్యారెట్ కంటే ఎక్కువ బరువు తూగే వజ్రం లభిస్తే రాజుకు చెందుతుంది అన్న విధానం అమలులో ఉండేది. అలా కుతుబ్‌షాహీలు చాలా విలువైన, పెద్ద సైజు వజ్రాలు సొంతం చేసుకున్నారు. » గోల్కొండ వజ్రాల్లో నైట్రోజన్, బోరాన్ ఉండదు. ఈ కారణంగా వజ్రం అధిక కాంతివంతంగా ఉంటుంది. » కోహినూర్ తర్వాత అతిపెద్ద వజ్రం నిజాం జాకబ్ వజ్రమే. ఇది 420 క్యారెట్ బరువు ఉండేది. » గోల్కొండ గనుల నుంచి 12 మిలియన్ క్యారెట్ల వజ్రాలు తవ్వారని బ్రిటిష్ కాలంలో నిపుణులు అంచనా వేశారు. ఇప్పటికీ గోల్కొండ గనుల ప్రాంతంలో చిన్నసైజు వజ్రాలు లభిస్తూనే ఉన్నాయి. » గోల్కొండ డైమండ్స్ అన్నీ ఇప్పుడు యూరోపియన్ రాజకుటుంబాల సేకరణలో భాగంగా ఉన్నాయి. వాటిలో కొన్ని ఇరాన్ ట్రెజరీలో ఉన్నాయి. ఒకటి రెండు నైజాం కలెక్షన్లలో ఉన్నాయిటైప్ టూ ఏ కేటగిరీ..» అసలైన వజ్రం స్వచ్ఛతకు మారుపేరుగా ఉంటుందని, ‘గోల్కొండ వజ్రాలు కన్నీళ్లంత స్వచ్ఛమైనవి’అని నిపుణులు చెబుతారు. వజ్రాల వ్యాపారంలో టైప్ టూ ఏ కేటగిరీని అత్యంత అరుదైన, స్వచ్ఛమైనదిగా భావిస్తారు. అందుకే గోల్కొండ వజ్రాలను ఆ కేటగిరీకి చెందినవిగా పేర్కొంటారు. కాకతీయుల కాలంలో గోల్కొండ వజ్రాలను వెలికితీయటం ప్రారంభించారు. ప్రస్తుతం కర్ణాటకలోకి రాయచూరు నుంచి ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ వరకు ఉన్న ప్రాంతాన్ని గోల్కొండ గనులుగా పరిగణిస్తారు. కృష్ణానది పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వజ్రాలు లభించేవి. ఈ వజ్రాలు అధికంగా ఉన్న ప్రాంతాలను తన పరిధిలో ఉంచుకునేందుకు నిజాం తహతహలాడేవాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని భూభాగాన్ని అప్పట్లో నిజాం ఆంగ్లేయుల పరం చేశాడు. ఆ సమయంలో ప్రస్తుతం ఆంధ్రాప్రాంతంలో ఉన్న పరిటాల ప్రాంతాన్ని నిజాం తన పరిధిలోకి వచ్చేలా చేసుకున్నాడు. అక్కడ వజ్రాలు అధికంగా లభిస్తుండటమే దీనికి కారణం. ప్రస్తుతం తెలంగాణలో భాగంగా ఉన్న మునగాలను నిజాం సర్కారు బ్రిటిష్ పరిధిలోకి మార్చింది. రాష్ట్రాల పునరి్వభజన సమయంలో భౌగోళికంగా ఈ తీరు సరిగ్గా లేకపోవటంతో పరిటాలను ఆంధ్రప్రదేశ్‌కు, మునగాలను తెలంగాణకు కేటాయించారు. ఇప్పటి వరకు వేలంలో అత్యధిక ధరకు అమ్ముడైన మూడు ప్రధాన వజ్రాలు 2008: విట్టెల్స్‌బాచ్ డైమండ్ - 23.7 మిలియన్ డాలర్లు 1995: ఓర్లోవ్ డైమండ్ - 20.7 మిలియన్ డాలర్లకు 1995: జాకబ్ డైమండ్ - 13.4 మిలియన్ డాలర్లుప్రధాన గోల్కొండ వజ్రాల నమూనాలుప్రజలు సందర్శించేందుకు వీలుగా కొన్ని ప్రధాన గోల్కొండ వజ్రాలకు నమూనాలు రూపొందించారు. » లండన్ నేచురల్ హిస్టరీ మ్యూజియంలో కోహినూర్ నకలు వజ్రం ఉంది » మాస్కోలోని క్రెమ్లిన్ ఆర్మరీలో ఓర్లోవ్ డైమండ్ నమూనా ఉంది » టెహరాన్స్ నేషనల్ మ్యూజియంలో దరియా–ఇ–నూర్ వజ్రం నమూనా ఏర్పాటు చేశారు. -
తుగ్గలిలో రైతు కూలీకి ఖరీదైన వజ్రం లభ్యం
-
తారల తలుక్కు..మోడల్స్ ర్యాంప్ వాక్ (ఫొటోలు)
-
రైతు పొలంలో ‘వజ్రం’ పండింది
సాక్షి, కర్నూలు: జిల్లాలో భారీ వర్షాలు పడటంతో వజ్రాల వేట మళ్లీ మొదలైంది. తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాలు బయటపడుతున్నాయి. పొలం పనులకు వెళ్లిన రైతుకు వజ్రం దొరికింది. 12 లక్షల రూపాయల నగదు, 5 తులాల బంగారం ఇచ్చి ఓ వజ్రాల వ్యాపారి కొనుగోలు చేశారు. కొందరు వ్యాపారులు ఏజెంట్లను నియమించుకొని ప్రతి ఏటా కోట్లాది రూపాయల్ని సంపాదిస్తున్నారు. రైతులు, కూలీలకు దొరికే వజ్రాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి.. వారు ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారన సమాచారం.సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు..కాగా, కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెరతోపాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్ఎంపీ తండా గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలోని భూమి పొరల్లో కింబర్లైట్ పైప్‌లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది.వజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే..మన దేశంలో డైమండ్ మైనింగ్ మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఉంది. అక్కడ భూమిలోని రాళ్లను తవ్వితీసి వజ్రాల తయారీ ప్రక్రియ చేపడతారు. వజ్రకరూర్, తుగ్గలి, జొన్నగిరి ప్రాంతాల్లోని భూగర్భంలో 150 మీటర్ల లోతున వజ్రాలు ఉంటాయి. భూమిలో వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత వెదరింగ్ (వికోశీకరణ) వల్ల అంటే ఎండకు ఎండి, వర్షానికి తడిసి పగిలిపోతాయి. వర్షాలు, వరదలు వచ్చినపుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడా దొరుకుతుంటాయి. వాగులు, వంకల ద్వారా కూడా వజ్రాలు నీటిలో కొట్టుకుని ఇతర ప్రాంతాలకు చేరతాయి. అలా చెల్లాచెదురైన వజ్రాలే ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లభిస్తున్నాయి. -
బొట్స్వానా గనిలో 2,492 క్యారెట్ల వజ్రం
గబొరోన్(బొట్స్వానా): ఆఫ్రికా దేశం బొట్స్వానా గనిలో అతిపెద్దదిగా భావిస్తున్న వజ్రం లభ్యమైంది. తమ గనుల్లో ఇంతటి భారీ వజ్రం దొరకడం ఇదే మొదటిసారని బొట్స్వానా ప్రభుత్వం తెలిపింది. దీని బరువు 2,492 కేరట్లని వివరించింది. కెనడాకు చెందిన లుకారా డైమండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నడిచే కరోవె గనిలో ఈ అరుదైన ముడి వజ్రం లభించింది. ఎక్స్‌రే సాంకేతికతను ఉపయోగించి అధిక నాణ్యతతో, చెక్కు చెదరకుండా ఉన్న ఈ వజ్రాన్ని కనుగొన్నట్లు లుకారా తెలిపింది. ఇంత పెద్ద వజ్రం లభించడం వందేళ్లలో ఇదే మొదటిసారని పేర్కొంది. గతంలో 1905లో దక్షిణాఫ్రికాలోని ఓ గనిలో కల్లినాన్ డైమండ్ బయటపడింది.3,106 కేరట్లున్న ఆ భారీ వజ్రాన్ని 9 భాగాలు చేశారు. వాటిలో కొన్ని భాగాలను బ్రిటిష్ రాజవంశీకుల ఆభరణాల్లో వాడారు. అంతకుపూర్వం, 1800లో బ్రెజిల్లో అతిపెద్ద బ్లాక్ డైమండ్ దొరికింది. అయితే, ఇది భూ ఉపరితలంలోనే లభించింది. ఇది ఉల్కలో భాగం కావొచ్చని నమ్ముతున్నారు. బొట్స్వానా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రాల ఉత్పత్తిదారు. మొత్తం 20 శాతం వరకు వాటా బొట్స్వానా గనులదే. ఇటీవలి సంవత్సరాల్లో ఇక్కడి గనుల్లో భారీ వజ్రాలు లభించాయి. 2019లో కరోవె గనిలోనే 1,758 కేరట్ల సెవెలో వజ్రాన్ని తవ్వి తీశారు. దీనిని ఫ్రాన్సుకు చెందిన ప్రఖ్యాత ఫ్యాషన్ సంస్థ లూయిస్ విట్టన్ కొనుగోలు చేసింది. అయితే, ధరను వెల్లడించలేదు. కరోవె గనిలోనే 1,111 కేరట్ల లెసెడి లా రొనా అనే డైమండ్ లభ్యమైంది. దీనిని, బ్రిటిష్ ఆభరణాల సంస్థ 2017లో 5.30 కోట్ల డాలర్ల(సుమారు రూ.440 కోట్లు)కు దక్కించుకుంది. -
ఉద్యోగులకు 10 రోజుల ‘సెలవు’.. కానీ ట్విస్ట్ తెలిస్తే..
దేశ వజ్రాల పరిశ్రమలో సంక్షోభం నెలకొంది. మాంద్యం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లలో పాలిష్ చేసిన వజ్రాలకు డిమాండ్ తగ్గింది. దీంతో దని పేర్కొంటూ సూరత్‌కు చెందిన ఒక ప్రముఖ వజ్రాల తయారీ సంస్థ ఏకంగా 50,000 మంది ఉద్యోగులకు 10 రోజులపాటు 'సెలవు' ప్రకటించింది.ప్రపంచంలో అతిపెద్ద సహజ వజ్రాల తయారీదారైన కిరణ్ జెమ్స్ కంపెనీ ఆగస్టు 17 నుంచి 27 వరకు 10 రోజులు 'సెలవు' ప్రకటించింది. "మా 50,000 మంది ఉద్యోగులకు 10 రోజుల సెలవు ప్రకటించాం. దీని కోసం కొంత మొత్తం కోత విధించినప్పటికీ, ఉద్యోగులందరికీ ఈ కాలానికి జీతం చెల్లిస్తాం. మాంద్యం కారణంగా ఈ సెలవులను ప్రకటించవలసి వచ్చింది'' అని కిరణ్ జెమ్స్ చైర్మన్ వల్లభాయ్ లఖానీ వార్తా సంస్థ పీటీఐకి చెప్పారు.ప్రపంచంలోని దాదాపు 90 శాతం వజ్రాలను ప్రాసెస్ చేసే స్థానిక వజ్రాల పరిశ్రమను మాంద్యం దెబ్బతీసిందన్న లఖానీ అభిప్రాయాలతో సూరత్ డైమండ్ అసోసియేషన్ అధ్యక్షుడు జగదీష్ ఖుంట్ ఏకీభవించారు. "కిరణ్ జెమ్స్ ఇలా సెలవు ప్రకటించడం (ఉద్యోగులకు) ఇదే మొదటిసారి. ఇంతవరకు మరే ఇతర సంస్థ కూడా ఇటువంటి చర్య తీసుకోనప్పటికీ, మాంద్యం పాలిష్ చేసిన వజ్రాల అమ్మకాలను తగ్గించింది" అని ఖుంట్ అన్నారు.పాలిష్ చేసిన వజ్రాలు అత్యధికం ఎగుమతి చేస్తున్నందున అంతర్జాతీయ కారకాలు వజ్రాల అమ్మకాన్ని ప్రభావితం చేస్తాయని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయెల్-పాలస్తీనా ఉద్రిక్తతలను కొన్ని కారకాలుగా ఆయన పేర్కొన్నారు. ఈ కారకాలతో 2022లో దాదాపు రూ. 2,25,000 కోట్లున్న వజ్రాల పరిశ్రమ టర్నోవర్ నేడు రూ. 1,50,000 కోట్లకు తగ్గిందన్నారు. సూరత్‌లో దాదాపు 4,000 డైమండ్ పాలిషింగ్, ప్రాసెసింగ్ యూనిట్లు దాదాపు 10 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధిని కల్పిస్తున్నాయని ఆయన చెప్పారు. -
జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్ మేక లాకెట్టు వైరల్! ఏకంగా 546 వజ్రాలతో..!
పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో పతకాలు ఎలా ఉన్నా..ఎన్నో స్ఫూర్తిదాయకమైన కథలు, కదిలించే కన్నీటి గాథలు, అద్భుతాలు ఉన్నాయి. వాటి తోపాటు ఓ క్రీడాకారిణి ధరించిన లాకెట్టు నెట్టింట్ హాట్‌టాపిక్‌గా మారింది. నిజానికి బరిలోకి దిగే క్రీడాకారులు ఫ్యాషన్ లాకెట్టులు అంతగా ధరించరు. మహా అయితే నెక్కు ఉండే తేలికపాటి గొలుసులు ధరస్తారంతే..కానీ ఈ అమెరికన్ జిమ్నాస్ట్ మాత్రం వెరీ స్పెషల్. ఎందుకుంటే తనను ఏ జంతువుతో హేళన చేశారో దాన్నే లాకెట్‌గా డిజైన్ చేయించుకుని మరీ ఫ్యాషన్‌కు సరికొత్త పాఠాలు నేర్పింది. 2013 నుంచి ఓటమి ఎరుగని ఆల్‌రౌండ్ ఛాంపియన్. జిమ్నాస్టిక్స్ సరిహద్దులను చెరిపేసిన క్రీడాకారిణి జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్. ఈ 27 ఏళ్ల జిమ్నాస్ట్ గురువారం స్వర్ణం గెలుచుకుని, తన కెరీర్లో 39వ పతకాన్ని సాధించింది. దీంతో ఆమె రెండోవ ఒలింపిక్స్ ఆల్ రౌండర్ టైటిల్‌ని, వరుసగా తొమ్మిదొవ ఒలింపిక్ పతకాన్ని గెలుచుకున్న జిమ్నాస్ట్‌గా రికార్డు సృష్టించింది. ఈ పారిస్ 2024 ఒలింపిక్‌లో రెండో బంగారు పతాకాన్ని గెలుచుకున్న వెంటనే తాను ధరించిన మేక లాకెట్టుతో కెమెరాకు ఫోజులిచ్చింది. అంతేగాదు ఆమె ఈ గెలుపుతో మొత్తం ఆరు ఒలింపిక్ బంగారు పతకాలను గెలుచుకున్న జిమ్నాస్ట్‌గా 120 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టి చరిత్ర సృష్టించింది. ఆ సందర్భంగా తన లాకెట్టుని ప్రదర్శించింది. "ఇది చిన్న మేక లాకెట్టు కావొచ్చు. కానీ ఈ మేకును అందరూ ఇష్టపడుతారు. అందరూ నన్ను మేక అంటూ పిలిచి హేళన చేశారు. అసలు దాన్నే లాకెట్టుగా చేసుకుని ధరించి ప్రత్యేకంగా ఉండాలనిపించి. అంతేగాదు ద్వేషించేవారు ద్వేషిస్తూనే ఉంటారు. వాళ్లు నన్ను అలా ఆ జంతువు పేరుతో పిలవడాన్ని ప్రత్యేకంగా భావించానే గానీ నెగిటివ్‌గా తీసుకోలేదు. అదీగాక తన వద్ద స్టఫ్డ్ మేక కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. బహుశా వారు దాన్నే గుర్తు చేస్తున్నారని అనుకున్నా". అంటూ సోషల్ మీడియా పోస్ట్‌లో రాసుకొచ్చింది. ఇదిలా ఉండగా, కాలిఫోర్నియా జ్యువెలరీ కంపెనీ బైల్స్ అభ్యర్థన మేరకు ఈ మేక లాకెట్టుని తయారు చేసినట్లు తెలిపింది. దీన్ని దాదాపు 546 వజ్రాలతో అలంకరించినట్లు వెల్లడించింది. ఇది త్రిమితీయ కళాఖండం అని, జిమ్నాస్టిక్స్‌లో ఆమె అసామాన ప్రతిభ, ఖచ్చితత్వం, అంకితభావం, పట్టుదల తదితరాలను ఇది ప్రతిబింబిస్తుందని సోషల్ మీడియా పోస్ట్‌లో జ్యువెలరీ కంపెనీ పేర్కొంది. (చదవండి: రాజుల కాలం నాటి చీరలకు జీవం పోస్తున్న నందిని సింగ్!) -
ది డైమండ్.. ఇకపై అందరి నేస్తం..
‘వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. మన ప్రేమ కూడా అలాగే’ అంటూ ఒక ప్రకటనలో ప్రియురాలి వేలికి ఉంగరం తొడుగుతూ ప్రియుడు చెప్పిన డైలాగ్ ఒక తరం మహిళలందరినీ కట్టి పడేసింది. ఆ ప్రకటనలో మహిళ ధరించిన వజ్రపుటుంగరం మహిళాలోకం మదిని దోచుకుంది. ‘వజ్రపుటుంగరం, పైగా అంతపెద్ద వజ్రంతో’ అని ఆ ప్రకటన మగవాళ్ల హార్ట్‌బీట్ పెంచింది కూడా... అదంతా ఒకప్పుడు. భూగర్భం నుంచి తవ్వి తీస్తే తప్ప వజ్రం దొరకని రోజుల్లో. ఇప్పుడు మ్యాన్‌మేడ్ డైమండ్స్ నగరంలోని ఆభరణాల మార్కెట్‌ను శాసిస్తున్నాయి. ఎల్జీడీ, ఎకో ఫ్రెండ్లీ డైమండ్, మ్యాన్‌మేడ్ డైమండ్... పిలిచే పేరు ఏదైనా అది వజ్రమే. సిటీ ఆఫ్ పెరల్స్‌గా పేరు తెచ్చుకున్న హైదరాబాద్ నగరం... ఇప్పుడు మ్యాన్‌మేడ్ డైమండ్ ఆభరణాల హబ్‌గా మారుతోంది. ఇప్పుడు నగరంలో జరిగే వేడుకల్లో ఎంగేజ్మెంట్ రింగ్, చెవి దిద్దులు, గాజుల్లోనూ ప్రధానంగా ఈ వజ్రాలే ఉంటున్నాయి. నగరంలో మ్యాన్‌మేడ్ వజ్రాల శకం మొదలైంది. ఈ వజ్రాలు హైదరాబాద్ ఆభరణాల మార్కెట్‌ని ముంచెత్తబోతున్నాయి.– వాకా మంజులారెడ్డిఇది మేధో వజ్రం..ల్యాబ్ గ్రోన్ డైమండ్స్... హై ప్రెజర్ హై టెంపరేచర్ (హెచ్‌పీహెచ్‌టీ), కెమికల్ వేపర్ డిపాజిషన్ (సీవీడీ) అనే రెండు ప్రక్రియల్లో తయారవుతాయి. చిన్న ఉదాహరణ ఏమిటంటే... కోడిగుడ్డు నుంచి పిల్ల బయటకు రావడానికి కోడి 21 రోజులు గుడ్డు మీద పొదగడం అనేది ప్రకృతి సహజమైన ప్రక్రియ. కోడి గుడ్లను కరెంటు బల్బు వేడితో పొదిగించడం మనిషి సాంకేతికతతో కనిపెట్టిన ప్రత్యామ్నాయ మార్గం. ఈ ప్రక్రియలో కోడితో పని ఉండదు, కోడి గుడ్డు ఉంటే చాలు. ఇలాంటిదే లాబ్‌లో పెరిగే వజ్రం కూడా. కార్బన్ సీడ్ ద్వారా లాబ్‌లో వజ్రాన్ని తయారు చేయగలిగిన సాంకేతికత మనిషి సొంతమైంది. సైంటిస్ట్‌లు, జెమ్మాలజిస్ట్ల సంయుక్త పర్యవేక్షణలో డైమండ్ గ్రోయింగ్ గ్రీన్హౌస్లో ఈ వజ్రాలు తయారవుతాయి. అదే వేడి– అంతే ఒత్తిడికార్బన్.. వజ్రంగా మారే ప్రక్రియ అంతా భూగర్భంలోనే జరుగుతుంది. ఇప్పటి వరకూ మనకు తెలిసిన వజ్రం పుట్టుక ఇది. కార్బన్ సీడ్ని లోహపు పలకం మీద ఉంచి ఐదు వేల డిగ్రీల ఫారన్హీట్తోపాటు తగినంత ఒత్తిడిని కలిగించడం, మీథేన్ వాయువుతో వ్యాక్యూమ్ చాంబర్లో కెమికల్ వేపర్ అందించడం ద్వారా పది – పన్నెండు వారాల్లో అచ్చమైన అసలు సిసలైన వజ్రం తయారవుతుంది. భూగర్భం నుంచి తవ్వి తీసిన డైమండ్‌ని మైన్డ్ డైమండ్ అని, డైమండ్ గ్రోయింగ్ గ్రీన్హౌస్లో రూపొందిన డైమండ్‌ని మ్యాన్‌మేడ్ డైమండ్ అని వర్గీకరించవచ్చు. వజ్రం పుట్టుకలో ఉన్న రెండు రకాలివి. వజ్రం చేతికి వచి్చన తర్వాత గ్రేడింగ్, కటింగ్ వంటి ప్రక్రియలన్నీ రెండింటిలోనూ ఒకే రకంగా ఉంటాయని చెబుతున్నారు హైదరాబాద్‌కు చెందిన జెమ్మాలజిస్ట్ జియా.సామాన్యుల చెంతకు...వజ్రాల పరిశ్రమలు థర్మల్ కండక్టివిటీ, కటింగ్ టూల్స్, హీట్ సింక్స్ వంటి తమ పారిశ్రామిక అవసరాలకు కూడా మ్యాన్‌మేడ్ డైమండ్స్ మీదనే ఆధారపడుతున్నాయి. వజ్రాల పరిశ్రమ కూడా మనుషుల ఆరోగ్యం, ప్రాణాలకు ముప్పు వాటిల్లని నైతికమార్గంలో తయారవుతున్న వజ్రంగా మ్యాన్‌మేడ్ డైమండ్నే గుర్తిస్తోంది. ఒకప్పుడు సంపన్నులకే పరిమితమైన వజ్రం ఇకపై సామాన్యుల చెంతకు చేరనుంది. హైదరాబాద్ నగరవాసుల్లో కొనుగోలు శక్తి పెరిగింది. మ్యాన్‌మేడ్ డైమండ్ కాంతులు యువకుల వేళ్లను మెరిపిస్తున్నాయి, యువతుల చెవులకు సప్తవర్ణ కాంతులను అద్దుతున్నాయి.ఈకో ఫ్రెండ్లీ..భూగర్భంలో రూపుదిద్దుకున్న వజ్రాన్ని సేకరించే క్రమంలో వెలువడే కర్బన ఉద్గారాలు పర్యావరణానికి హాని కలిగిస్తాయి. గనుల పరిసరాల్లోని వాళ్ల ఆరోగ్యం మీద కూడా దు్రష్పభావాన్ని చూపిస్తాయి. మైనింగ్ ప్రక్రియలో పాల్గొనే వ్యక్తుల ప్రాణాలను కూడా ఫణంగా పెట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మ్యాన్‌మేడ్ డైమండ్స్‌ని ఈకో ఫ్రెండ్లీ డైమండ్స్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రకృతి ప్రేమికులు, పర్యావరణ కార్యకర్తలు ఈకో ఫ్రెండ్లీ డైమండ్స్నే ప్రోత్సహిస్తున్నారు.ఫోర్ సీలే ప్రామాణికం..కట్, క్లారిటీ, కలర్, క్యారట్... ఇవి నాలుగూ డైమండ్‌కి ప్రామాణికాలు. ఈ నాలుగు ప్రామాణికతల పట్టిక ల్యాబ్ డైమండ్లోనూ ఉంటుంది. కాబట్టి పర్యావరణానికి, మనుషుల ఆరోగ్యానికి హాని కలిగించని వజ్రాలకు యూఎస్, యూకేలు ఇప్పటికే అధికారిక ఆమోదాన్నిచ్చాయి. గతేడాది భారత ప్రభుత్వం కూడా తన ఆమోదాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. పర్యావరణహితమైన జీవనశైలిని కోరుకునే వాళ్లు ఈ డైమండ్స్కే ప్రాధాన్యం ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్. విదేశాల నుంచి దిగుమతులను నిలువరిస్తూ దేశీయ అవసరాలకు తగినంత ఉత్పత్తిని పెంచడం ద్వారా ధరను అందుబాటులోకి తీసుకురావడంతో దేశీయ నిపుణులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారామె. ఫ్లాలెస్ వజ్రాలివి! క్వాలిఫైడ్ జెమ్మాలజిస్టుగా నా పాతికేళ్ల అనుభవంలో నేను గుర్తించిదేమిటంటే... ఫ్లాలెస్ డైమండ్స్ మ్యాన్మేడ్లోనే వస్తున్నాయి. భూగర్భంలో కార్బన్ వజ్రంగా మారే క్రమంలో వజ్రంలో ఇన్‌క్లూజన్స్(ధూళి రేణువులు చేరి చుక్కలు, సన్నని గీతలుగా కనిపించడం) ఏర్పడుతుంటాయి. వందలో ఒకటి – రెండు మాత్రమే ఫ్లాలెస్ వజ్రాలుంటాయి. మ్యాన్‌మేడ్ డైమండ్స్‌లో సగానికి పైగా ఫ్లాలెస్ క్వాలిటీతో ఉంటున్నాయి. కార్బన్ వజ్రంగా మారడానికి ఏర్పాటు చేసిన గ్రీన్‌హౌస్‌లు స్వచ్ఛమైన వాతావరణాన్ని కలిగి ఉండడం కూడా ఇందుకు కారణం అని చెప్పవచ్చు. ఒకప్పుడు వజ్రం అంటే భూగర్భం నుంచి తవ్వి తీసినది మాత్రమే కావడంతో లభ్యత తక్కువగా ఉండేది. ఇప్పుడు మార్కెట్ అవసరాలకు తగినన్ని వజ్రాలు తయారవుతున్నాయి. ధర విషయానికి వస్తే... మైనింగ్ ఖర్చులు కలుపుకుని ధర నిర్ణయించాల్సి ఉంటుంది కాబట్టి మైన్డ్ డైమండ్ ధర ఎక్కువగా ఉంటుంది. మైనింగ్ ఖర్చులు లేకపోవడంతో మ్యాన్‌మేడ్ డైమండ్స్ ధర మైన్డ్ డైమండ్‌తో పోలిస్తే తక్కువగా ఉంటోంది. అదే క్వాలిటీతో ధర తక్కువలో లభిస్తుండడంతో వజ్రాన్ని ధరించాలనే వారి కల సులువుగా నెరవేరుతోంది. – జియా, జెమ్మాలజిస్ట్, హైదరాబాద్ -
రూ. 29వేల కోట్ల వజ్రం.. ఎవరిదగ్గరుంటే వారు చనిపోతారట!
బ్రిటీష్ వారితో సహా విదేశీ ఆక్రమణదారులు భారతదేశాన్ని దోచుకోకుండా ఉండి ఉంటే.. ప్రపంచంలోనే సుసంపన్నమైన దేశంగా భారత్ ఖ్యాతి గడించేది. ఎంతోమంది విదేశీయులు భారదేశంలోని రాజుల మీద, దేవాలయాల మీద దాడి చేసి ఎన్నో విలువైన వస్తువులను దోచుకెళ్లారు. ఇలా దోచుకెళ్లిన వాటిలో ఒకటి 'హోప్ డైమండ్' అని పిలువబడే వజ్రం.నిజానికి ఖరీదైన వజ్రం అంటే కోహినూర్ వజ్రమే గుర్తొస్తుంది, హోప్ డైమండ్ అనే మరో ఖరీదైన వజ్రం కూడా ఉందని బహుశా చాలామందికి తెలియకపోవచ్చు. ఇక్కడ చిత్రం ఏమిటంటే.. ఈ వజ్రం ఎవరి దగ్గర ఉంటుందో.. వారంతా అకాల మరణం చెందుతారని ఓ నమ్మకం ఉంది. ఈ కారణంగానే దీన్ని శాపగ్రస్త వజ్రంగా పిలుస్తారు.గుంటూరులోని కొల్లూరు గనుల నుంచి ఈ వజ్రం వెలికితీసినట్లు కొంతమంది, ఇతర వజ్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని వజ్రకరూర్‌లోని కింబర్లైట్ ప్రాంతాల నుంచి తీసి ఉండొచ్చని కొందరు పరిశోధకులు చెబుతున్నారు. మొత్తం మీద ఇది ఆంధ్రప్రదేశ్‌లో దొరికినట్లు స్పష్టమవుతోంది.17వ శతాబ్దంలో ఈ వజ్రం బయటపడినప్పటి నుంచి చాలాసార్లు చేతులు మారినట్లు సమాచారం. మొదట్లో ఈ వజ్రాన్ని ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ ఓ ముడి పదార్థంగానే కొనుగోలు చేసారు. ఆ తరువాత రాజ కుటుంబాలు దాన్ని దక్కించుకున్నాయి. ఆ తరువాత ఫ్రాన్స్‌కు చెందిన లూయిస్ XIV, న్యూయార్క్ నగరానికి చెందిన హ్యారీ విన్స్టన్ దీన్ని సొంతం చేసుకున్నారు. ఈ తరువాత ఈ వజ్రాన్ని 1958లో వాషింగ్టన్‌లోని స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్కు విరాళంగా ఇచ్చేసారు.ఫ్రెంచ్ రత్నాల వ్యాపారి జీన్-బాప్టిస్ట్ టావెర్నియర్ దీన్ని భారతదేశంలోని ఓ హిందూ దేవాలయం నుంచి దొంగలించినట్లు ఓ కథ కూడా ప్రచారంలో ఉంది. దేవాలయంలోని వజ్రం కనుక.. ఆ ఆలయంలో పూజారులు వజ్రం పోయిందని, ఆ వజ్రం తీసుకున్న వ్యక్తులను శపించారు. ఈ కారణంగానే ఇది ఎవరి దగ్గర ఉంటే వారు అకాలమరణం చెందుతున్నారని, చివరకు స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్కు విరాళంగా ఇచ్చేసారు.1839లో హెన్రీ ఫిలిప్ హోప్ అనే వ్యక్తి ఈ వజ్రాన్ని మొదట సేకరించడంతో.. దానికి అతనిపేరే పెట్టారు. స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ వారి ప్రకారం.. ఈ వజ్రం 16 తెల్లని వజ్రాల మధ్యలో ఓ లాకెట్టు మాదిరిగా ఉంది. చికాగో డైమండ్ కొనుగోలుదారుల ప్రకారం.. హోప్ డైమండ్ విలువ 350 మిలియన్ డాలర్ల వరకు ఉంటుందని సమాచారం. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ రూ. 29,19,52,67,500. -
కర్నూలులో వజ్రాల వేట
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు, అనంతపురం జిల్లాల సరిహద్దుల్లో వజ్రాల నిక్షేపాలు ఉన్నాయనే విషయాన్ని జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండలాల్లోని తుగ్గలి, జొన్నగిరి, పగిడిరాయి, కొత్తపల్లి, పెరవలి, అగ్రహారం, హంప, యడవలి, మద్దికెరతోపాటు అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలంలోని గంజికుంట, తట్రకల్లు, రాగులపాడు, పొట్టిపాడు, కమలపాడు, గూళపాళ్యం, ఎన్ఎంపీ తండా గ్రామాల్లో తరచూ వజ్రాలు లభ్యమవుతున్నాయి. ఈ ప్రాంతంలోని భూమి పొరల్లో కింబర్లైట్ పైప్‌లైన్ ఉందని గనులు భూగర్భ శాఖ నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే తొలకరి జల్లులు కురిసే జూన్‌లో తుగ్గలి, మద్దికెర మండలాల్లో వజ్రాల అన్వేషణ కొన్నేళ్లుగా ముమ్మరంగా సాగుతోంది. ఈ ఏడాది మే మొదటి వారంలోనే వర్షాలు కురిశాయి. ఆ వెంటనే వజ్రాన్వేషణ మొదలైంది. ఈ ప్రాంతంలోని పొలాలన్నీ జనంతోనే నిండిపోయాయి. కర్నూలు, నంద్యాలతో పాటు అనంతపురం, కడప, చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి వజ్రాన్వేషకులు తరలివచ్చారు. ఒక్కొక్కరు వారం, పది, పదిహేను రోజులపాటు ఇక్కడే మకాం వేస్తున్నారు. ఓ వైపు వజ్రాల కోసం జనాలు పొలాల్లో తిరుగుతుంటే.. వజ్రాన్వేషకులు తిరగడం వల్ల పొలం గట్టిబారి వ్యవసాయానికి ఇబ్బందిగా ఉంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు రైతులు తమ పొలాల్లోకి ఎవరూ రావొద్దని విజ్ఞప్తి బోర్డులు తగిలిస్తున్నారు.ఇతర దేశాలతో పోలిస్తే నాణ్యమైన వజ్రాలువజ్రాల మైనింగ్ కోసం వజ్రకరూర్‌లో వజ్రాల ప్రక్రమణ కేంద్రాన్ని 1969లో ఏర్పాటు చేశారు. వజ్రాన్వేషణపై ఇది పెద్దగా దృష్టి సారించలేదు. ఆ తర్వాత ఓ ఆస్ట్రేలియన్ కంపెనీ వచ్చి కొద్దికాలం పాటు సర్వే చేసి తిరిగి వెళ్లింది. ఆఫ్రికాతో పాటు చాలా దేశాలతో పోలిస్తే ఇక్కడి వజ్రాలు చాలా నాణ్యమైనవి, విలువైనవి. అందుకే వీటి వెలికితీతపై ప్రత్యేక దృష్టి సారిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పలువురు కోరుతున్నారు.వజ్రాలు ఎలా లభ్యమవుతాయంటే..మన దేశంలో డైమండ్ మైనింగ్ మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఉంది. అక్కడ భూమిలోని రాళ్లను తవ్వితీసి వజ్రాల తయారీ ప్రక్రియ చేపడతారు. వజ్రకరూర్, తుగ్గలి, జొన్నగిరి ప్రాంతాల్లోని భూగర్భంలో 150 మీటర్ల లోతున వజ్రాలు ఉంటాయి. భూమిలో వాతావరణ మార్పులు జరిగినప్పుడు అవి బయటకు వస్తాయి. ఆ తర్వాత వెదరింగ్ (వికోశీకరణ) వల్ల అంటే ఎండకు ఎండి, వర్షానికి తడిసి పగిలిపోతాయి. వర్షాలు, వరదలు వచ్చినపుడు ఆ రాళ్ల ముక్కలు పొలాల్లో అక్కడక్కడా దొరుకుతుంటాయి. వాగులు, వంకల ద్వారా కూడా వజ్రాలు నీటిలో కొట్టుకుని ఇతర ప్రాంతాలకు చేరతాయి. అలా చెల్లాచెదురైన వజ్రాలే ఇప్పుడు కర్నూలు, అనంతపురం జిల్లాల్లో లభిస్తున్నాయి.‘సీమ’లో ఏజెంట్ల తిష్టవర్షాకాలం వస్తే జనాలు ఎలా తరలివస్తారో.. వజ్రాల వ్యాపారులు కూడా గుత్తి, గుంతకల్లు, జొన్నగిరి, పెరవలిలో మకాం వేసి వజ్రాల కొనుగోలుకు ప్రయత్నిస్తారు. ఇందుకోసం వజ్రాలు లభ్యమయ్యే గ్రామాల్లో ఏజెంట్లను సైతం నియమించుకుంటున్నారు. వజ్రం దొరికిందనే సమాచారం వస్తే ఏజెంట్లు వాలిపోతారు. వజ్రం దొరికిన వారిని వ్యాపారుల వద్దకు తీసుకెళ్లి రేటు కుదురుస్తారు. వజ్రం విలువైనదైతే వ్యాపారులే వారి వద్దకు వెళ్తారు. వ్యాపారుల మధ్య పోటీ పెరిగితే బహిరంగ వేలం వేస్తారు. వజ్రం నాణ్యత (క్యారెట్)ను బట్టి రూ.20 వేల నుంచి రూ.20 లక్షల వరకు కొనుగోలు చేస్తారు. జిల్లా చరిత్రలో 2022లో లభించిన 30 క్యారెట్ల వజ్రమే అత్యంత విలువైంది. ఈ ఏడాది ఇప్పటికే 9 వజ్రాలు లభ్యమయ్యాయి. గతేడాది సరైన వర్షాలు లేవు. అయినప్పటికీ 18 వజ్రాలు దొరికాయి. ఇక్కడ వజ్రాలను స్థానిక వ్యాపారులకే విక్రయిస్తారు. ఇక్కడి వ్యాపారులు అంత నమ్మకం సాధించారు. చెప్పిన ధర చెప్పినట్టు ఇస్తారు. అదే ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇస్తే దానిని స్వాధీనం చేసుకుని పైసా కూడా ఇవ్వరనే అభిప్రాయంతో వారు అధికారులకు చెప్పకుండా విక్రయిస్తారు.విదేశాల్లో ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలుఆఫ్రికా, అంగోలా, కాంగోతో పాటు చాలా దేశాల్లో ఇదే తరహాలో వజ్రాలు లభిస్తాయి. వాటిని అల్యూవియల్ డైమండ్స్ అంటారు. అక్కడ ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుంది. వజ్రాలు లభించిన వారు నేరుగా ఆ కేంద్రానికి వచ్చి చూపిస్తారు. వజ్రాల నాణ్యత ఆధారంగా కొంత మొత్తం చెల్లిస్తారు. వజ్రాలను లీగల్‌గా ప్రభుత్వం ప్రక్రియను పూర్తి చేసి విక్రయిస్తుంది. కర్నూలు జిల్లాలో ఏటా సగటున 50–60 వజ్రాలు లభిస్తున్నాయి. అలాగే వజ్రకరూరు ప్రాంతంలో కూడా ఏటా 30–40 వజ్రాలు లభిస్తాయి. అంటే ఈ రెండు జిల్లాల్లో ఏటా వంద వజ్రాలు లభిస్తున్నాయి. మైనింగ్ చేస్తే రూ.వందల కోట్ల విలువైన సంపద ప్రభుత్వానికి లభించే అవకాశం ఉంది.ఈ ఏడాది లభ్యమైన వజ్రాల వివరాలు👉 ఈ నెల 8న చెన్నంపల్లిలో రూ.3.96 లక్షల విలువ చేసే వజ్రం లభించింది.👉 మే 20న రామాపురంలో రూ.50 వేల విలువైప వజ్రం దొరికింది.👉 మే 21న మద్దికెర మండలం మదనంతపురంలో రూ.6.50 లక్షల విలువైన వజ్రం లభ్యమైంది.👉 మే 22న ఇదే గ్రామంలో దొరికిన వజ్రాన్ని రూ.18 లక్షలు, 10 తులాల బంగారం చెల్లించి వ్యాపారి కొనుగోలు చేశారు.👉 మే 23న జొన్నగిరిలో రూ.15 వేలు, పగిడిరాయిలో రూ.12 వేల విలువ చేసే వజ్రాలు లభించాయి. 👉 మే 24న జొన్నగిరిలో దొరికిన వజ్రాన్ని రూ.6.20 లక్షలు నగదు, 5 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేశారు.👉 మే 25న జొన్నగిరిలో దొరికిన వజ్రాన్ని రూ.1.20 లక్షల నగదు, జత కమ్మలు ఇచ్చి కొనుగోలు చేశారు.👉 తాజాగా తుగ్గలి మండలం గుండాలతండాకు చెందిన వ్యక్తికి మంగళవారం ఓ వజ్రం లభ్యమైంది. స్థానిక వజ్రాల వ్యాపారి రూ.లక్ష నగదు, అర తులం బంగారం ఇచ్చి దానిని కొనుగోలు చేశారు.ఐదోసారి వచ్చావానొస్తే మా ఊరోళ్లంతా రైలెక్కి గుత్తిలో దిగి జొన్నగిరికి వస్తాం. నేను ఇక్కడికి ఐదేళ్ల నుంచి వస్తున్నా. వచ్చి వారమైంది. ఐదేళ్లలో ఒక్క వజ్రం కూడా దొరకలేదు. తిండీ తిప్పలకు ఇబ్బందిగా ఉంది. మాతో పాటు వచ్చిన కొంతమందికి వజ్రాలు దొరుకుతున్నాయి. మాకు ఆశ చావక వెతుకుతున్నాం.– ఈరయ్య, రామాపురం, వినుకొండ, పల్నాడు జిల్లా వజ్రాన్ని గుర్తు పడతాంమాది కలికిరి. హైదరాబాద్‌లోని స్నేహితుడు, నేను కలిసి మూడు రోజుల క్రితం ఇక్కడికి వచ్చాం. దొరికితే వజ్రం. లేదంటే కాలక్షేపంగా ఉంటుందని వచ్చాం. మేం బంగారం నగలు తయారు చేస్తాం. వజ్రం ఎలా ఉంటుందో సులువుగా గుర్తుపడతాం.– రామాంజులాచారి, కలికిరి, అన్నమయ్య జిల్లాఒక చిన్న వజ్రం దొరికినా చాలుమా ఊళ్లో పనుల్లేవు. వజ్రాలు దొరికాయని పేపర్లు, టీవీల్లో వచ్చింది. ఖాళీగా ఉండలేక ఇక్కడికి వచ్చాం. నాతో పాటు మా ఊరోళ్లు పదిమంది వచ్చారు. వజ్రాలు వెతుకుతున్నాం. కొన్ని రాళ్లు మెరుస్తున్నాయి. అవి వజ్రాలు కాదంటున్నారు. కొద్దిరోజులు చూస్తాం. చిన్న వజ్రం దొరికినా కష్టం తీరకపోతుందా అనే ఆశతో చూస్తున్నాం.– లక్ష్మక్క, గార్లదిన్నె మండలం, అనంతపురం జిల్లా -
Kurnool Diamond: కర్నూలు జిల్లాలో రైతుకు దొరికిన వజ్రం
కర్నూలు: తొలకరి చినుకులు పడగానే కర్నూలు జిల్లా మద్దికెర, తుగ్గలి మండలాల్లో వజ్రాల వేట మొదలవుతోంది. దూర ప్రాంతాల నుంచి జనం వచ్చి ఇక్కడ వజ్రాలు వెతుకుతూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. రైతులు తమ పొలాలు సాగు చేసేటప్పుడు కూడా వజ్రాలు లభ్యమవుతుంటాయి. శనివారం మద్దికెర మండలం హంప గ్రామంలో ఓ రైతు పొలం పనులు చేస్తుండగా రూ.5లక్షలు విలువైన వజ్రం దొరికింది. అలాగే మదనంతపురం గ్రామానికి చెందిన మరో రైతుకు రూ.15 లక్షలు విలువైన వజ్రం లభించింది. ఈ రెండు వజ్రాలను పెరవలి గ్రామానికి చెందిన వ్యాపారులు కొనుగోలు చేసినట్లు సమాచారం. -
Vajrakarur: వజ్రాల వేట ప్రారంభం
వజ్రకరూరు మండల పరిసర ప్రాంతాల్లో వజ్రాల వేట ప్రారంభమయ్యింది. తొలకరి వర్షాలు ప్రారంభం కావడంతో స్థానికులతో పాటు ఉమ్మడి అనంతపురం జిల్లాలోని వివిధ ప్రాంతాలు, కర్నూల్, కడప, కర్ణాటక, తెలంగాణ తదితర ప్రాంతాల నుంచి శనివారం వందల సంఖ్యలో ప్రజలు తరలివచ్చి వజ్రాలు వెతకడం ప్రారంభించారు. పలువురు కార్లలో వచ్చి వజ్రాలు వెతకడం కనిపించింది. చంటి బిడ్డలనుసైతం ఎత్తుకుని వచ్చి వజ్రాలు వెతకడం విశేషం. దీంతో ఆ ప్రాంతం జాతరను తలపించింది. ఇక్కడ లభించే చిన్న వజ్రమైనా రూ. లక్షల్లో విలువ చేస్తుంది. ఏటా ఈ ప్రాంతంలో 20 నుంచి 40 దాకా వజ్రాలు లభ్యమవుతాయని సమాచారం. -
'పుష్పవజ్రమా'..! అదెలా ఉంటుంది అనుకుంటున్నారా?
పుష్పవజ్రమా? అదెలా ఉంటుంది అనుకుంటున్నారా? గని నుంచి తవ్వి తీయకపోయినా, అచ్చంగా వజ్రంలాగానే ఉంటుంది. చైనీస్ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పూలతో వజ్రాన్ని తయారు చేశారు. గులాబీల మాదిరిగా కనిపించే ఎర్రని పీయనీ పూల నుంచి వేరుచేసిన కార్బన్ అణువులతో మూడు కేరట్ల వజ్రాన్ని తయారు చేయడంలో సఫలీకృతులయ్యారు.ఈ వజ్రం తయారీ కోసం హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన లువోయాంగ్ నగరంలోని నేషనల్ పీయనీ గార్డెన్స్ నుంచి సేకరించిన పూలను ఉపయోగించారు. కృత్రిమ వజ్రాల తయారీకి ప్రసిద్ధి చెందిన లువోయాంగ్ ప్రామిస్ కంపెనీకి చెందిన శాస్త్రవేత్తలు ఈ అరుదైన ఘనతను సాధించారు. పూలతో వజ్రాన్ని తయారుచేయాలని సంకల్పించినట్లు లువోయాంగ్ ప్రామిస్ కంపెనీ చెప్పడంతో ఆ కంపెనీకి కావలసిన పీయనీ పూలను సరఫరా చేసేందుకు నేషనల్ పీయనీ గార్డెన్ అంగీకరించింది.బయోజెనిక్ కార్బన్ ఎక్స్‌ట్రాక్టింగ్ టెక్నాలజీతో ఈ పూల నుంచి కార్బన్ అణువులను వేరుచేసి, వాటిని అత్యధిక ఉష్ణోగ్రత వద్ద అత్యధిక పీడనకు గురిచేయడం ద్వారా ఈ వజ్రాన్ని తయారు చేయగలిగామని లువోయాంగ్ ప్రామిస్ కంపెనీ సీఈవో వాంగ్ జింగ్ తెలిపారు. ఈ వజ్రం విలువను మూడు లక్షల యువాన్లుగా (రూ.35.19 లక్షలు) అంచనా వేస్తున్నట్లు ఆయన చెప్పారు.ఇవి చదవండి: వరల్డ్ ఫేమస్ లోకల్ టాలెంట్! గాయత్రి దేవరకొండ.. -
ఓటు వేశారు.. డైమండ్ రింగ్ గెలుచుకున్నారు!
దేశంలో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. పలు రాష్ట్రాలలో మంగళవారం మూడో విడత పోలింగ్ జరిగింది. ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎన్నికల సంఘం పలు చర్యలు తీసుకుంటుంది. ఇదే కోవలో మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఓటర్లను ప్రోత్సహించేందుకు ప్రత్యేక బహుమతులను అందించారు.భోపాల్‌లోని పలు పోలింగ్ కేంద్రాలలో లాటరీ పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ లాటరీ పథకంలో ఉదయం 11 గంటలకు జరిగిన మొదటి డ్రాలో యోగేష్ సాహు డైమండ్ రింగ్ గెలుచుకున్నారు. తరువాత మధ్యాహ్నం 2, 5 గంటలకు మరో రెండు డ్రాలు జరిగాయి. దీని తర్వాత బంపర్ డ్రా కూడా జరిగింది.లోక్‌సభ ఎన్నికల రెండవ దశలో ఓటింగ్ శాతం తగ్గిన నేపధ్యంలో ఓటర్లను ప్రోత్సహించడానికి భోపాల్‌లోని పలు పోలింగ్ బూత్‌లలో ఎన్నికల సంఘం లాటరీ పథకాన్ని ప్రారంభించింది. ఓటు హక్కును వినియోగించుకున్న వారికి ఆకర్షణీయమైన బహుమతిని అందజేస్తామని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.భోపాల్ ఎన్నికల చరిత్రలో తక్కువ ఓటింగ్ నమోదవుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో ఇక్కడ ఓటింగ్ శాతం పెరిగేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చొరవ చూపింది. ఈ నేపధ్యంలో 65.7 శాతం పోలింగ్ నమోదయ్యింది. ఎన్నికల సంఘం నిర్వహించిన లక్కీ డ్రాలో ముగ్గురు ఓటర్లకు వజ్రాల ఉంగరాలు లభించగా, మరికొంతమందికి మిక్సర్లు, వాటర్ కూలర్లు లభించాయి. కొందరు టీ షర్టులను గెలుచుకున్నారు. -
నీతా అంబానీ లగ్జరీ కార్లు, డైమండ్ నగలు (ఫోటోలు)
-
భారీగా తగ్గనున్న చాక్లెట్లు, వాచీల ధర..! మరిన్నింటిపై ప్రభావం.. కారణం..
యూరప్‌లోని నాలుగు దేశాల కూటమి యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ)తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) కుదుర్చుకుంది. దీని ప్రకారం వచ్చే 15 ఏళ్లలో దేశంలోకి రూ.8.3 లక్షల కోట్ల కచ్చిత పెట్టుబడులకూ హామీ లభించింది. తద్వారా పది లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరగనుంది. ఈ ఒప్పందంతో ప్రధానంగా స్విస్ వాచీలు, పాలిష్ చేసిన వజ్రాలు, చాక్లెట్లు, బిస్కెట్లు, గోడ గడియారాల వంటివి ప్రస్తుతం కంటే తక్కువ ధరలకే కొనుగోలు చేసే అవకాశం రానుంది. ఈఎఫ్‌టీఏలో స్విట్జర్లాండ్, ఐస్లాండ్, లిక్టన్స్టైన్, నార్వే సభ్య దేశాలుగా ఉన్నాయి. ఇవి ఐరోపా సమాఖ్యలో భాగం కాదు. స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటైన సమాఖ్య. కెనడా, చిలీ, చైనా, మెక్సికో, కొరియా వంటి 40 భాగస్వామ్య దేశాలతో ఈఎఫ్టీఏ ఇప్పటివరకు 29 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది. ఎఫ్‌టీఏలో పెట్టుబడుల హామీకీ చట్టబద్దత లభించడం ఇదే తొలిసారి. ఈ ఒప్పందం అమల్లోకి రావడానికి ఏడాది సమయం పట్టే అవకాశం ఉందని తెలిసింది. ఉపయోగాలివే.. దేశీయంగా తయారవుతున్న ఉత్పత్తులన్నింటినీ, సుంకాలు లేకుండా ఈఎఫ్టీఏ దేశాల్లో విక్రయించుకోవచ్చు. ప్రాసెస్ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకూ సుంకాల్లో రాయితీలు లభిస్తాయి. మన ఉత్పత్తులపై ఈ ఏడాది జనవరి నుంచే స్విట్జర్లాండ్ సుంకాలను తొలగించింది. భారత్ కూడా ఈఎఫ్టీఏ ఉత్పత్తుల్లో 95.3 శాతానికి మినహాయింపు ఇస్తోంది. అక్కడ నుంచి బంగారం మనదేశంలోకి అధికంగా దిగుమతి అవుతున్నా, కస్టమ్స్ సుంకం (15%) విషయంలో మినహాయింపు ఇవ్వలేదు. బౌండ్‌రేటు (అత్యంత అనుకూల దేశాలుగా పరిగణించి ఇచ్చేది)ను మాత్రం 1% తగ్గించి, 39%గా ఉంచింది. ఐరోపా సమాఖ్యకు చేరేందుకు భారత కంపెనీలు స్విట్జర్లాండ్‌ను బేస్‌గా వినియోగించుకోవచ్చు. ప్రెసిషన్ ఇంజినీరింగ్, హెల్త్ సైన్సెస్, పునరుత్పాదక ఇంధనం, వినూత్నత-పరిశోధనల్లో సాంకేతిక సహకారం సులువవుతుంది. మారనివి ఇవే.. డెయిరీ, సోయా, బొగ్గు, వ్యవసాయ ఉత్పత్తులను మాత్రం మినహాయింపుల జాబితాలో చేర్చలేదు. అందువల్ల వీటికి సుంకాల్లో రాయితీలు అమలు కావు. ఇదీ చదవండి: విద్యుత్ వాహనాలతో వాతావరణ కాలుష్యం..! స్విట్జర్లాండ్ నుంచి భారత్ ఎక్కువగా బంగారం (12.6 బి.డాలర్లు), యంత్రాలు (409 మి.డాలర్లు), ఔషధాలు (309 మి.డాలర్లు), కోకింగ్ అండ్ స్టీమ్ కోల్ (380 మి.డాలర్లు), ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్లు, ఆర్థోపెడిక్ అప్లియెన్సెస్ (296 మి.డాలర్లు), వాచీలు (211.4 మి.డాలర్లు), సోయాబీన్ ఆయిల్ (202 మి.డాలర్లు) చాక్లెట్లు (7 మి.డాలర్లు) తదితర వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. రసాయనాలు, రత్నాభరణాలు, కొన్ని రకాల టెక్స్టైల్స్, దుస్తులను మనదేశం ఎగుమతి చేస్తోంది. -
ఫండే: ఈ ఖనిజం ధరెంతో మీకు తెలుసా!
మన జీవితంలో మనం ఎన్నోరకాల, ఎంతో ఖరీదైన వస్తువల ధరలను విని ఉంటాం. అవసరమైతే ఆ వస్తువులను చూసుంటాం. అత్యంత ఖరీదైన ఆ వస్తువులలో బంగారం, ప్లాటినమ్ అనుకుంటే పొరబడినట్లే. మరి వాటన్నింటికన్నా మరింత ఖరీదైన వస్తువు(ఖనిజం) గురించి మీకు తెలుసా..! ఇక అదేంటో చూద్దాం. అత్యంత ఖరీదైన ఖనిజాలు బంగారం, ప్లాటినమ్ అని చాలామంది అనుకుంటారు. వీటన్నింటి కంటే అత్యంత ఖరీదైన ఖనిజం ఫ్రాంకియమ్. దీని ధర ఒక గ్రాముకు 100 కోట్ల డాలర్లు (రూ.8229 కోట్లు) ఉంటుంది. ఇవి కూడా చదవండి: ఫండే: పర్వతమే హోటల్! కాదు.. అదొక 'హిల్థ్రిల్'!! -
వజ్రాలు వైఢూర్యాలతో డిజైన్ చేసిన జాకెట్..అంబానీ కూతురుగా ఆ మాత్రం ఉండాల్సిందే (ఫొటోలు)
-
కాలికి ధరిస్తే కళ్లు పట్టేస్తున్నాయి..
అందమైన పాదాలను అంటిపెట్టుకునే అందియలు అమ్మాయిలకు అత్యంత ఇష్టం అందుకే, పట్టీలు వారి అలంకరణలో ఎప్పుడూ ప్రత్యేకతను నింపుకుంటాయి. ఈ ఆధునిక యుగంలో అమ్మాయిలు పట్టీలు పెట్టుకోవడం లేదు అనే నిన్నటి తరం నిరాశను దూరం చేస్తూ... ఆంకిల్స్ పేరుతో వచ్చి కొత్తగా చేరిపోయాయి. వాటితో పాటు బంగారు, వెండి, డైమండ్ ఆభరణాలలోనూ, ఇమిటేషన్ జ్యువెలరీలోనూ సగం పాదాన్ని కప్పేస్తున్నట్టుగా ఉండే పట్టీల డిజైన్లు ఎన్నో వచ్చాయి. సందర్భానికి తగినట్టు అలంకరించుకోవడానికి వేటికవి ప్రత్యేకతను కలిగి ఉంటున్నాయి. కాలికి ధరించేవే అయినా కళ్లనూ పట్టేస్తున్నాయి. మొఘలాయ్ రాణివాసపు హంగు కాలి అందియలలోనూ కనిపిస్తుంది. పెళ్లి పల్లకీ, రాజు రాణీ, నెమళ్లు, పువ్వుల డిజైన్లతో ఆకట్టుకుంటున్న పట్టీలు నేటితరం అమ్మాయిలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పూసలు, రత్నాలు వరసలుగా అల్లుకుపోయిన పూసలు కాలి పట్టీలుగా అమరి ఆధునికతనూ, సంప్రదాయతకు మేళవింపుగా ఉన్నాయి. పెద్ద పెద్ద రత్నాలు వీటిలో విశేషంగా అమరిపోయాయి. ఆధునికత... స్నేక్, రౌండ్ స్టైల్లో ఉండే బంగారు, వెండి ఆంక్లెట్ మోడ్రన్ స్టైల్‌కి అదనపు హంగుగా అమరుతున్నాయి. ఇవి చదవండి: ఇదేందయ్యా ఇది..! డెస్టినేషన్ వెడ్డింగ్.. వేరే లెవల్! -
కృత్రిమ వజ్రాలు తయారీ.. లాభనష్టాలు ఎవరికంటే..
వజ్రం అంటే దాదాపు అందరికీ కోహినూర్ వజ్రం గుర్తొస్తుంది. భూమిలోపల కొన్ని ఏళ్ల తరబడి చోటు చేసుకున్న రసాయన చర్య ఫలితంగా వజ్రం పుట్టుకొస్తుంది. వజ్రాన్ని కార్బన్ ఘన మూలకంగా భావించొచ్చు. అందులోని పరమాణువులు స్ఫటికాల ఆకారంలో కనిపిస్తాయి. దీంతో వజ్రం గట్టిగా ఉంటుంది. ఇతర ఏ పదార్థాల్లో లేని ఉష్ణవాహకత సామర్థ్యం వజ్రంలో ఉంటుంది. సహజంగా దొరికే వజ్రాల వయసు 1 బిలియన్ నుంచి 3.5 బిలియన్ సంవత్సరాలు ఉంటుంది. భూమిలో 150 నుంచి 250 కిలోమీటర్ల లోపలికి తవ్వితే కానీ వజ్రాలు లభ్యం కావు. అలాంటి సహజ వజ్రాలకు పోటీగా ఇప్పుడు కృత్రిమ వజ్రాలను తయారుచేస్తున్నారు. తాజాగా యాంట్వెర్ప్ వరల్డ్ డైమండ్ సెంటర్ (ఏడబ్ల్యూడీసీ) నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ల్యాబ్ గ్రోన్ డైమండ్ల మార్కెట్ వాటా 2016లో 1% నుంచి 2024లో 20%కి పెరిగినట్లు తేలింది. 2030లో అది భారీ వృద్ధిని సాధిస్తుందని అంచనా వేసింది. కృత్రిమ వజ్రం ఎలా తయారు చేస్తారంటే.. న్యూయార్క్‌లోని జనరల్ ఎలక్ట్రిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో 1954లో తొలిసారి ల్యాబ్ గ్రోన్ డైమండ్‌ను సృష్టించారు. తరువాత అనేక పరిశోధనలు చేసి వాటి తయారీ వేగం పెంచడానికి రెండు పద్ధతులు కనుగొన్నారు. అందులో ఒకటి అధిక పీడనం, అధిక ఉష్ణం(హెచ్‌పీహెచ్‌టీ) రెండోది రసాయన ఆవిరి నిక్షేపణ(సీవీడీ). ఈ రెండు పద్ధతులకు సీడ్ తప్పనిసరి. అంటే ఏదైనా ఇతర డైమండ్లోని కొంత భాగం సీడ్‌గా పని చేస్తుంది. అధిక పీడనం, అధిక ఉష్ణం పద్ధతిలో సీడ్, స్వచ్ఛమైన గ్రాఫైట్ కార్బన్‌ను ఒక చోట ఉంచుతారు. వాటిని దాదాపు 1500 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేస్తారు. అలాగే పీడనాన్ని కలిగిస్తారు. దాంతో కార్బన్ డైమండ్గా రూపాంతరం చెందుతుంది. రసాయన ఆవిరి నిక్షేపణ విధానంలో కార్బన్ రిచ్ గ్యాస్ నింపిన ఛాంబర్లో సీడ్‌ను ఉంచి 800 డిగ్రీల సెల్సియస్ వద్ద వేడి చేస్తారు. దాంతో కార్బన్ డైమండ్గా మారుతుంది. నాణ్యత ఎలా ఉంటుందంటే.. భూమిలో నుంచి తవ్వి తీసిన వజ్రాల్లాగే ల్యాబ్ వజ్రాలను డైమండ్ టెస్టర్‌తో పరీక్షిస్తారు. వాటిలోని కార్బన్ మిశ్రమం, ఉష్ణవాహకత ఇంచుమించు సహజ వజ్రాల్లానే ఉంటాయి. దృఢంగా ఉండటంతోపాటు, గీతలు పడవు. కిందపడినా పగిలిపోవు. సహజంగా వజ్రాన్ని ఎలా కోస్తారో వీటిని కూడా అలాగే కోయాల్సి ఉంటుంది. యంత్రాల్లో వినియోగించే కొన్ని లోహాలు గట్టిదనం లేక విరిగిపోతుంటాయి. అటువంటి చోట కృత్రిమ వజ్రాలనే వాడుతున్నారు. కృత్రిమ వజ్రాలతో పనిముట్లు కూడా తయారు చేస్తున్నారు. విద్యుత్ తయారీ రంగంలోనూ స్వచ్ఛమైన సింథటిక్ డైమండ్లను విరివిగా ఉపయోగిస్తున్నారు. హైపవర్ లేజర్ డయోడ్స్లో వాటిని ఉష్ణవాహకాలుగా వినియోగిస్తున్నారు. డిమాండ్ ఎలా ఉందంటే.. సహజంగా అరుదుగా దొరికే వాటిపై ఉన్న వ్యామోహం కృత్రిమంగా దొరికే వాటిపై ప్రజలకు ఉండదు. పురాతన వజ్రం అనగానే ధనికులు కోట్లు కుమ్మరించి కొనుగోలు చేస్తుంటారు. కృత్రిమం అనగానే చిన్నచూపు చూస్తారు. నేటి రోజుల్లో వివాహ శుభకార్యాలకు బంగారం కొనడం సర్వ సాధారణమైంది. దాంతో భిన్నంగా ఉండాలని కొందరు వజ్రాల ఉంగరం, వజ్రాల నగల కొనుగోళ్లపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇదీ చదవండి: త్వరలో భారత మొబైల్ ఫోన్ బ్రాండ్ మధ్య తరగతి ప్రజలు కూడా కనీసం ఓ డైమండ్ ఉంగరమైనా సరే కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. ఇలాంటి వారు కృత్రిమ వజ్రాలు ఎంపిక చేసుకుంటే ఖర్చు కలిసి వస్తుందని తయారీదారులు చెబుతున్నారు. అయితే సహజ వజ్రాలతో పోలిస్తే చాలా తక్కువగా ఉన్న కృత్రిమ వజ్రాల ధర భవిష్యత్తులో మరింత తగ్గిపోవచ్చనే ఊహాగానాలున్నాయి. దాంతో కొనడానికి వెనకడుగు వేస్తున్నారు. -
ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల భవనాన్ని ప్రారంభించిన మోదీ
సూరత్: ప్రపంచంలోనే అతిపెద్ద భవనం "సూరత్ డైమండ్ బోర్స్"ను ప్రధాని నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు. ప్రధాని మోదీ రెండు రోజుల గుజరాత్ పర్యటనలో భాగంగా సూరత్‌లో నేడు పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రోడ్ షో నిర్వహించారు. సూరత్ ఎయిర్‌పోర్టు టెర్మినల్‌ను కూడా ప్రారంభించారు. సూరత్‌లో రూ.3400 కోట్లతో 35.54 ఎకరాల స్థలంలో నిర్మించిన ఈ భవనం వజ్రాల వ్యాపారానికి ప్రపంచ కేంద్రంగా మారనుంది. డైమండ్ బోర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటర్కనెక్టడ్ భవనం. దాదాపు 4500 కార్యాలయాలను కలిగి ఉన్న ఈ భవనం.. పెంటగాన్‌లో ఉన్న భవనం కంటే పెద్దది కావడం విశేషం. Gujarat: Prime Minister Narendra Modi inaugurates the Surat Diamond Bourse It will be the world’s largest and modern centre for international diamond and jewellery business. It will be a global centre for trading both rough and polished diamonds as well as jewellery. The… pic.twitter.com/2bEz3J3RGv — ANI (@ANI) December 17, 2023 సూరత్‌లో నిర్మించిన ఈ భవనం ప్రపంచంలోనే అతి పెద్ద డైమండ్ ట్రేడింగ్ సెంటర్‌గా మారనుంది. రత్నాల రాజధానిగా పేరొందిన సూరత్‌లోనే 90 శాతం వజ్రాలు తయారవుతాయి. దాదాపు 65,000 మంది డైమండ్ నిపుణులకు ఈ ట్రేడింగ్ సెంటర్ ఒకటే వేదికగా మారనుంది. దీంతో దేశంలో డైమండ్ ట్రేడింగ్ ఒకే గొడుగు కిందకు తెచ్చినట్లవుతుంది. 15 అంతస్తులు ఉన్న ఈ డైమండ్ భవనం 35 ఎకరాల స్థలంలో నిర్మించారు. ఇందులో 4500 కార్యాలయాలు ఉన్నాయి. ఇది తొమ్మిది దీర్ఘచతురస్రాల ఆకారాలను కలిగి ఉంటుంది. ఇవన్నీ ఒకే కేంద్ర భవనంతో కలిపి ఉంటాయి. ఈ భవనం 6,20,000 చదరపు మీటర్ల స్థలంలో నిర్మించినట్లు నిర్మాణ సంస్థ వెల్లడించింది. పార్కింగ్ స్థలం 20 లక్షల చదరపు అడుగుల మేర ఉంటుందని తెలిపింది. నిర్మాణం పూర్తి కావడానికి నాలుగేళ్లు పట్టినట్లు పేర్కొంది. ఇదీ చదవండి: పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు