రూ.18లక్షల వజ్రం.. మింగేసిన శునకం
లండన్: ప్రేమగా పెంచుకునే బుజ్జి కుక్క.. ఆ యజమానురాలిని కంగారుపెట్టించిం ది.రెండ్రోజుల పాటు నిద్ర లేకుండా చేసిం ది. బ్రిటన్‌లోని దెవాన్‌లో యాంగీకొల్లిన్స్(51) ఒక రోజు గోళ్లను శుభ్రం చేసుకునేం దుకు చేతివేలికున్న పెళ్లి ఉంగరాన్ని తీసి కిచెన్‌లో పెట్టింది. ఆ వజ్రపుటుంగరం విలువ సుమారు రూ.18 లక్షలు. తీరా తన పని పూర్తయ్యాక వెళ్లి గదిలో చూస్తే ఉంగరం కనిపించలేదు.
కొల్లిన్స్‌కు కాళ్లలో వణుకు మొదలైంది. వెతికితే నేలపై వంగిపోయిన ఉంగరం కని పిం చింది. కానీ, దానికున్న విలువైన వజ్రం మాయం. గది అంతా వెతికింది. ఫలి తం లేదు. అక్కడున్న శునకాన్ని చూసి.. అదే మింగి ఉంటుందనే భావిం చిం ది. ఇక అప్పటి నుంచీ శునకం ఎప్పుడు విసర్జనకు వెళ్లినా పరీక్షిస్తూ కూర్చుం ది. రెండ్రోజుల తర్వాత వజ్రం శునకం మలవిసర్జన ద్వారా బయటకొచ్చింది.