లండన్: మనదేశంలో చోర్‌బజార్‌లు ఉంటాయి. అక్కడ అమ్మే సరుకులన్నీ ఒరిజినల్‌గా కనపడే నకిలీ వస్తువులే. అయితే నకిలీదని కొన్న ఓ వస్తువు అసలుదని తేలితే.. జాక్‌పాట్ కొట్టినట్టే కదూ! లండన్‌లో ఓ మహిళకు సరిగ్గా ఇలాగే జరిగింది. వివరాల్లోకెళ్తే.. డెబ్రా గడ్డర్డ్ (55) అనే మహిళ 33 ఏళ్ల కిందట ఓ బూట్ బజార్(స్మగుల్ గూడ్స్ విక్రయించే సంత)లో రూ.925 చెల్లించి ఓ గాజు ఉంగరం కొనుగోలు చేసింది. ఎప్పుడో ముచ్చటపడి కొనుక్కున్న ఆ ఉంగరంలో మిలమిలా మెరిసే గాజు.. గాజు కాదని, 26.27 క్యారెట్ల వజ్రమని తాజాగా తేలింది.
వెయ్యి రూపాయలు కూడా ఖర్చుచేయకుండా కొన్న ఉంగరం విలువ ఇప్పుడు ఏకంగా 4,70,000 పౌండ్స్ (భారత కరెన్సీలో రూ.4.33 కోట్లు) అని తెలియడంతో గడ్డర్డ్ ఆనందానికి హద్దే లేకుండాపోయింది. ఆ వజ్రపు ఉంగరాన్ని విక్రయించగా వచ్చే మొత్తాన్ని తన తల్లి కోసం ఖర్చు చేస్తానని చెప్పింది. డెబ్రా గతంలో సామాజిక కార్యకర్తగా పనిచేశారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడం ఆమెకు అలవాటు. తన చారిటీ ద్వారా 20 మంది చిన్నారులకు సాయమందించింది. బహుశా.. ఆమె మంచితనమే ఈ విధంగా మేలు చేసిందేమో.
Comments
Please login to add a commentAdd a comment