సాక్షి, హైదరాబాద్: ఉప ఎన్నిక ఫలితాల్లో నోటాకు 1,036 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో 2,867 ఓట్లు వచ్చాయి. అప్పుడు బీజేపీ అభ్యర్థి పుప్పాల రఘుకు 1,683 ఓట్లు వచ్చాయి. అప్పుడు నోటా కంటే తక్కువగా ఉన్న బీజేపీ ఇప్పుడు అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంది.
చదవండి: కాంగ్రెస్‌లో కాక రేపుతున్న ‘హుజురాబాద్’ ఫలితం
వజ్రం: ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కంటె సాయన్న 1,942 ఓట్లు సాధించి మూడు ప్రధాన పార్టీల తర్వాత నాలుగో స్థానంలో నిలిచారు.
రోటీమేకర్: ప్రజా ఏక్తా పార్టీ నుంచి పోటీ చేసిన సిలివేరు శ్రీకాంత్ 1,913తో ఐదోస్థానం సంపాదించారు.
ఉంగరం: స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బుట్టెంగారి మాధవరెడ్డి కేవలం 36 ఓట్లతో అందరి కంటే ఆఖరు స్థానంలో నిలిచారు.
చదవండి: హుజురాబాద్ ఫలితాలు: వెక్కి వెక్కి ఏడ్చిన టీఆర్‌ఎస్ అభ్యర్థి గెల్లు?
పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్‌ఎస్ హవా..
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్‌లో అధికార టీఆర్‌ఎస్ హవా కొనసాగింది. 777 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గాను, 455 ఓట్లు టీఆర్‌ఎస్‌కు, 242 ఓట్లు బీజేపీకి, కాంగ్రెస్‌కు 2 పోల్ కాగా.. 48 ఓట్లు చెల్లలేదు.
Comments
Please login to add a commentAdd a comment