NOTA
-
ఈసీ అఖిలపక్షంలో ట్విస్ట్.. నోటాను వ్యతిరేకించిన కాంగ్రెస్
హైదరాబాద్, సాక్షి: స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పంచాయితీ ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను అధికార కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే భేటీ ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా.. పంచాయితీ ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టాలని ఈసీ ప్రతిపాదన చేసింది. దీనికి కాంగ్రెస్ తప్ప.. అన్ని రాజకీయ పార్టీల దాదాపుగా సానుకూలంగానే స్పందించాయి. నోటాతో ఎన్నిక ఖర్చు ఎక్కువ అని, ఒకవేళ నోటాతో ఎన్నిక నిర్వహించినా సెకండ్ లార్జెస్ట్ పార్టీనే విజేతగా ప్రకటించాలని కాంగ్రెస్ ఈసీని కోరింది. నోటాపై అభిప్రాయం సేకరణలో బీఆర్ఎస్ సానుకూలంగా స్పందించింది. ఏకగ్రీవానికి.. బెదిరింపులు, బలప్రదర్శన చేసే అవకాశం ఉందని ఈసీకి తెలిపింది. అలాగే.. కొత్త మండలాల వివరాలను రాజకీయ పార్టీలకు ఇవ్వాలని ఈసీని కోరింది. ఇక.. సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున అభిప్రాయం ఇప్పుడే చెప్పలేమని పేర్కొంది. అలాగే.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం లేదని గుర్తు చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాలని స్పష్టం చేసింది. నోటాతో ఎన్నిక ఉండాలని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పిందని సీపీఎం గుర్తు చేసింది. అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే రీ-ఎలక్షన్ కరెక్ట్ కాదు. ఎన్నిక కండక్ట్ చేయడం అవసరం.. నోటాకు ఎక్కువ ఓట్లు అనేది తర్వాత చర్చ అని వామపక్ష పార్టీ అభిప్రాయపడింది. ఇక.. తెలంగాణ టీడీపీ తమ అభిప్రాయాన్ని రెండు మూడు రోజుల్లో చెప్తామనగా, సింగిల్ అభ్యర్థిగా అయినా నోటా ఉండాలని జనసేన పార్టీ ఈసీకి విజ్ఞప్తి చేసింది.ఇదీ చదవండి: స్థానిక సంస్థల్లో ‘నోటా’ ఎందుకంటే.. -
TG: స్థానిక సంస్థల్లో అభ్యర్థిగా ‘నోటా’!
హైదరాబాద్, సాక్షి: స్థానిక సంస్థల ఎన్నికల్లో ‘నోటా’ బటన్ అంశాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్‌గా పరిశీలిస్తోంది. ఈ మేరకు ఇవాళ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశంలో ఈ అంశాన్ని చర్చించనున్నట్లు సమాచారం. దీంతో ఏకగ్రీవాలు ఉంటాయా? ఉండవా? అనే దానిపై ఇవాళ ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉండనుంది. ట్రయల్ ప్రతిపాదికన పంచాయితీ ఎన్నికల్లో ‘నోటా’ను నామమాత్రపు అభ్యర్థిగా ఈసీ పెట్టాలనుకుంటోంది. అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పడితే.. ఆ స్థానంలో మళ్లీ ఎన్నిక నిర్వహించాలని భావిస్తోంది. అయితే ఇప్పటికే ఈ పద్ధతిని పలు రాష్ట్రాలు పాటిస్తున్నాయి. తాజా నిర్ణయం అమలైతే.. ఒకే ఒక్క నామినేషన్ దాఖలైన పరిస్థితుల్లో అక్కడ నోటా కూడా ఉంటుంది. అభ్యర్థికి ఓటు వేయడం ఇష్టం లేకపోతే.. ఓటర్లు నోటా బటన్ నొక్కొచ్చు. అంతే తప్ప ఏకగ్రీవాలు ఉండకూడదనే అంశంపై ఇవాళ్టి సమావేశంలో చర్చించబోతున్నారు. దీంతో రాజకీయ పార్టీల నుంచి స్పందన ఎలా ఉండనుందా? అనే ఉత్కంఠ నెలకొంది. సాధారణంగా.. పంచాయితీ ఎన్నికల్లో వార్డుమెంబర్లు, సర్పంచ్ పదవులు చాలా చోట్ల ఏకగ్రీవాలు అవుతుంటాయి. ఇవన్నీ వేలంపాట తరహాలోనే ఉంటున్నాయనే ఫిర్యాదుల నేపథ్యంలోనే.. ఇప్పుడీ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఇక.. పంచాయతీ ఎన్నికల నిర్వహణ, ఓటర్ల తుదిజాబితా ఖరారుపై ఈసీ ఇవాళ్టి సమావేశంలో చర్చించనుంది. మరోవైపు ఎన్నికల సంఘంతో పాటు ఇటు ప్రభుత్వం కూడా తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై ఫోకస్ పెంచింది. న్యాయ పరమైన చిక్కులు తలెత్తకుండా జాగ్రత్త పడుతోంది. మరో నాలుగు రోజుల్లో రిజర్వేషన్లు ఫైనల్ చేసే యోచనలో ఉంది ప్రభుత్వం. -
నోటాకు బాగానే నొక్కారు
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇష్టం లేకుంటే నోటాపై నొక్కి ఓటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. ఈ ఎన్నికల్లో పలువురు ఓటర్లు నన్ ఆఫ్ ది అ»ౌ(నోటా)కు ఓటు వేశారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను కాకుండా కొంతమంది తెలిసో, తెలియకో ఈవీఎంలపై నోటా బటన్ నొక్కారు. దీంతో విజయవాడ పార్లమెంటరీ పరిధిలో భారీగానే నోటా ఓట్లు పోలయ్యాయి. పోటీలో ఉన్న వైఎస్సార్ సీపీ, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పారీ్టల మినహా ఇతర రాజకీయ పారీ్టలు, స్వతంత్ర అభ్యర్థులకు పోలైన ఓట్ల కంటే నోటాకు పడిన ఓట్లే అధికం కావడం విశేషం. దేశంలో 2013 నుంచి.. కేంద్ర ఎన్నికల సంఘం 2013 నుంచి నోటాను ప్రవేశపెట్టింది. అభ్యర్థులు నచ్చక చాలా మంది ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో పోలింగ్ శాతం తగ్గుతోంది. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఎన్నికల్లో ప్రతి ఓటరూ భాగస్వామి కావాలనే లక్ష్యం నెరవేరడం లేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం నోటాను అమలులోకి తెచ్చింది. అభ్యర్థులు ఇష్టం లేకున్నా ఓటర్లు పోలింగ్ బూత్‌కు వచ్చి నోటాకు ఓటు వేయడం ద్వారా పోలింగ్ శాతం పెరుగుతోంది. జిల్లాలో నోటాకు పడిన ఓట్లు ఇలా 👉ఎన్టీఆర్ జిల్లాలో నోటాకు ఈసారి ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు పడ్డాయి. ఈవీఎంలు, సర్వీసు ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లను పరిగణనలోకి తీసుకుంటే విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో 7,719 ఓట్లు నోటాకు పడ్డాయి. వీటికంటే పార్లమెంటరీ స్థానానికి నోటా ఓట్లు అధికంగా పోలవడం విశేషం. పార్లమెంటరీ స్థానానికి 9,193 మంది నోటాకు ఓటు వేశారు. 👉విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 17 మంది పోటీ చేశారు. వీరిలో నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చిన వారు 14 తొమ్మిది మంది ఉండటం గమనార్హం. టీడీపీ, వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ పార్టీలు మినహా మిగిలిన వారందరికీ నోటా కంటే తక్కువగానే ఓట్లు నమోదయ్యాయి. 👉 విజయవాడ ‘పశి్చమ’ నుంచి 15 మంది పోటీ చేశారు. వీరిలో వైఎస్సార్ సీపీ, బీజేపీ, సీపీఐ అభ్యర్థులు మినహా మిగిలిన 12 మంది అభ్యర్థులకు నోటా ఓట్లు 1,236 కంటే తక్కువే వచ్చాయి. ఈ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యరి్థకి కేవలం 39 ఓట్లు మాత్రమే వచ్చాయి. 👉 విజయవాడ ‘సెంట్రల్’ నుంచి 20 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో వైఎస్సార్ సీపీ, టీడీపీ, సీపీఎం, ఆంధ్రరాష్ట్ర ప్రజాశాంతి, బహుజన సమాజ్ పార్టీ మినహా మిగిలిన వారికి నోటా ఓట్లు 951 కంటే తక్కువ ఓట్లే వచ్చాయి. 15 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువగానే నమోదయ్యాయి. ఈ నియోజకవర్గంలో ఒక స్వతంత్ర అభ్యరి్థకి అత్యంత తక్కువగా 37 ఓట్లు పోలయ్యాయి. 👉 విజయవాడ ‘తూర్పు’ నుంచి 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో వైఎస్సార్, టీడీపీ, కాంగ్రెస్, బహుజన సమాజ్, ఆల్ ఇండియా జైహింద్ పార్టీ మినహా మిగిలిన 10 మంది అభ్యర్థుల కంటే నోటాకే అధికంగా ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ నోటాకు 1,049 మంది ఓటు వేశారు. 👉 నందిగామ నియోజకవర్గం నుంచి తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీ∙అభ్యర్థులు మినహా మిగిలిన ఐదుగురు అభ్యర్థులకు నోటా ఓట్లు 928 కంటే తక్కువ ఓట్లే వచ్చాయి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యరి్థకి బహుజన సమాజ్‌వాదీ పార్టీ కంటే తక్కువ ఓట్లు పోలవ్వడం విశేషం. 👉జగ్గయ్యపేట నియోజకవర్గంలో 13 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్ పారీ్టల మినహా మిగిలిన పది మంది అభ్యర్థులకు నోటా ఓట్లు 773 కంటే అతి తక్కువ ఓట్లు పడ్డాయి. ఈ నియోజకవర్గంలో ఒక స్వతంత్ర అభ్యరి్థకి 11 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. 👉మైలవరం నుంచి 12 మంది బరిలో నిలిచారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ, ఒక స్వతంత్ర అభ్యర్థి మినహా మిగిలిన ఎనిమిది మంది అభ్యర్థులకు నోటా ఓట్లు 1,598 కంటే తక్కువగా పడటం గమనార్హం. 👉 తిరువూరు నియోజకవర్గంలో 12 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ మినహా మిగిలిన తొమ్మిది మంది అభ్యర్థులకు నోటా ఓట్లు 1,184 కంటే తక్కువగా వచ్చాయి. -
లక్ష మందికిపైగా నోటాకే ఓటేశారు
సాక్షి, మంచిర్యాల డెస్క్: తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నోటాకు 1,04,244 ఓట్లు పోల్ అయ్యాయి. వీటిలో 1,583 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో సరైనవారు లేరని ఓటర్లు భావించిస్తే.. నోటాకు ఓటువేసే అవకాశం ఎన్నికల సంఘం 2013 నుంచి కల్పించింది. ఈవీఎంలో అభ్యర్థుల గుర్తుల తర్వాత చివరిగా నోటా గుర్తు ఉంటుంది. చాలాచోట్ల రిజిస్టర్ పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు కూడా ఓట్లు సాధించడంలో నోటా కంటే వెనుకబడ్డారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల తర్వాత నోటాకు ఓట్లు పడగా నాలుగో స్థానంలో నిలవడం గమనార్హం. మల్కాజిగిరి నియోజకవర్గంలో అత్యధికంగా 13,206 ఓట్లు నోటాకు పడగా, అత్యల్పంగా జహీరాబాద్ నియోజకవర్గంలో 2,933 ఓట్లు పడ్డాయి. పోస్టల్ ఓట్లలో కూడా మల్కాజిగిరిలో అత్యధికంగా 160 ఓట్లు వచ్చాయి. -
లోక్‌సభ ఎన్నికల్లో నోటా సంచలనం
ప్రజాస్వామ్యంలో నచ్చిన వ్యక్తిని ప్రజా ప్రతినిధిగా ఎన్నుకునే హక్కు ప్రతీ ఓటర్‌కు ఉంది. అలాగే.. ఏ అభ్యర్థి నచ్చకుంటే నోటా(None Of The Above)కు ఓటేయొచ్చు. ఇందుకోసమే 2013లో నోటాను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. అయితే ఈ సార్వత్రిక ఎన్నికల్లో నోటా సరికొత్త రికార్డు సృష్టించింది.మధ్యప్రదేశ్ ఇండోర్ పార్లమెంట్ స్థానంలో ఈసారి ఏకంగా నోటాకు లక్షన్నరకు పైగా ఓట్లు పడ్డాయి. విశేషం ఏంటంటే.. ఇక్కడ బీజేపీ అభ్యర్థి శంకర్ లాల్వానీ 9,90,698 ఓట్లు పోల్‌కాగా, రెండో స్థానంలో నోటా ఓట్లు(1,72,798) ఉన్నాయి. మూడో స్థానంలో బీఎస్సీ అభ్యర్థి సంజయ్ సోలంకీ 20,104 ఓట్లతో నిలిచారు.విచిత్రం ఏంటంటే.. కాంగ్రెస్ తమ ఓట్లను నోటాకే ఓటేయాలని ప్రచారం చేయడం. ఎందుకంటే కాంగ్రెస్ తరఫున ఇక్కడ నామినేషన్ వేసిన అక్షయ్ కంటీ బామ్.. చివరి నిమిషంలో తన నామినేషన్ విత్‌డ్రా చేసుకుని బీజేపీలో చేరారు. ఇది కాంగ్రెస్‌కు పెద్ద షాకే ఇచ్చింది. ఈ పరిణామంపై ఇక్కడి నుంచి ఏడుసార్లు నెగ్గిన అభ్యర్థి, లోక్‌సభ మాజీ స్పీకర్ సుమిత్రా మహాజన్ సైతం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.ఇక్కడి నుంచి ప్రత్యామ్నాయ అభ్యర్థిని బరిలో నిలపాలని కాంగ్రెస్ భావించినా.. అందుకు మధ్యప్రదేశ్ హైకోర్టు అంగీకరించలేదు. దీంతో అనివార్యంగా పోటీ నుంచి వైదొలగింది. అయితే బరిలో నిలిచిన వాళ్లకు మద్దతు ఇవ్వకుండా.. నోటాకు ఓటేయాలని ప్రచారం చేసింది కాంగ్రెస్. తద్వారా తమ పార్టీ అభ్యర్థిని లాక్కెల్లిన బీజేపీకి నోటా ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని ప్రయత్నించింది.నోటా చరిత్ర తిరగేస్తే..2019లో బీహార్ గోపాల్‌గంజ్(ఎస్సీ)లో 51,660 నోటా ఓట్లు పడ్డాయి. ఇది నియోజకవర్గంలో పోలైన మొత్తం ఓట్లలో 5 శాతంఅక్కడ జేడీయూ అభ్యర్థి డాక్టర్ అలోక్ కుమార్ సుమన్ 5,68,160 ఓట్లతో గెలుపొందారు.2014 సార్వత్రిక ఎన్నికల్లో తమిళనాడు నీలగిరిలో 46, 559 నోటా ఓట్లు పడ్డాయి. -
NOTA: నోటా.. కోరల్లేని పులి!
దశాబ్దం క్రితం దేశ ఎన్నికల్లో వినూత్న ప్రయోగానికి తెరలేచింది. పోటీలో ఉన్న అభ్యర్థులు, పార్టీల్లో ఎవరూ నచ్చకపోతే ఏం చేయాలనే ఓటర్ల సందిగ్దతకు తెరదించుతూ ఎల్రక్టానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)లో ప్రత్యామ్నాయం లభించింది. అదే ‘నోటా’. బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చలేదని చెప్పే బటన్. అయితే దీన్ని ఎంచుకుంటున్న ఓటర్ల సంఖ్య అంతంతే ఉంటోంది. అభ్యర్థులపై వ్యతిరేకత ఉన్నా నోటాకు వేసే ఓట్లతో ఫలితాలపై ఎలాంటి ప్రభావం ఉండకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీంతో ఇది కోరల్లేని పులిగా మారిందనేది విశ్లేషకుల వాదన. ఇండోర్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకుని షాకివ్వడం, దాంతో నోటాకే ఓటేయాలని పార్టీ పిలుపునివ్వడం తెలిసిందే. దాంతో నోటా మరోసారి చర్చల్లోకి వచి్చంది... ప్రయోజనం.. ప్చ్! పారీ్టలు ఎన్నికల్లో నేరచరితులు, కళంకితులైన అభ్యర్థులను నిలబెట్టకుండా చూడటమే లక్ష్యంగా పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబరీ్టస్ (పీయూసీఎల్) అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. పోటీలో ఉన్నవారెవరూ ఓటర్లకు నచ్చని పక్షంలో తాము ఎవరికీ ఓటువేయాలనుకోవడం లేదని చెప్పేందుకు బ్యాలెట్ పేపర్లు/ఈవీఎంలలో తగిన ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తూ 2013 సెపె్టంబర్లో కోర్టు తీర్పు వెలువరించింది. అలా ఈవీఎంలలోకి నోటా బటన్ వచ్చి చేరింది. ఈవీఎం బ్యాలెట్ యూనిట్‌లోని 16 బటన్లలో చివరి ఆప్షన్‌గా నోటా ఉంటుంది. దీనికి కూడా ప్రత్యేకంగా ఇంటూ (గీ) మార్కు కూడా కేటాయించారు. 2013లో జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నోటా గుర్తును తొలిసారి ప్రవేశపెట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో దీనికి మరింత ప్రాచుర్యం లభించింది. గత ఐదేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో కలిపి నోటాకు 1.29 కోట్ల ఓట్లొచ్చాయి. అయినా కళంకితులకు టికెట్లిచ్చే విషయంలో పారీ్టల తీరులో మార్పేమీ రాలేదు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న నేరచరితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అయితే ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం నోటాకు ఎక్కువ ఓట్లు పడుతుండటం విశేషం!ఆ పవర్ ఇస్తేనే...ప్రస్తుత నిబంధనల ప్రకారం నోటాకు అభ్యర్థులందరి కంటే ఎక్కువ ఓట్లొచి్చనా ఎన్నికపై ఎలాంటి ప్రభావమూ ఉండదు. ఆ ఓట్లన్నింటినీ పక్కనపెట్టి అభ్యర్థుల్లో ఎక్కువ ఓట్లు వచి్చన వారే విజేత అవుతారు. అలా నోటా కేవలం అభ్యర్థులపై ఓటర్లు అసమ్మతిని వ్యక్తం చేసే ఆప్షన్‌గా మిగిలిపోతోంది. అలాగాక నోటాకే ఎక్కువ ఓట్లు పోౖలైతే తిరస్కరణకు గురైన అభ్యర్థులు మళ్లీ పోటీ చేయకుండా నిషేధించాలి. అప్పుడే పారీ్టలు నేరచరితులను పక్కన పెడతాయి’’ అని యాక్సిస్ ఇండియా చైర్మన్ ప్రదీప్ గుప్తా అభిప్రాయపడ్డారు. నోటాకు నిర్దిష్ట శాతానికి మించి ఓట్లు పోలైతే అభ్యర్థులను మార్చడం, మళ్లీ ఎన్నిక నిర్వహించడం వంటి మార్గాలను నిపుణులు సూచిస్తున్నారు. 👉 ఏడీఆర్ డేటా ప్రకారం ఎన్నికల్లో నోటాకు 0.5 శాతం నుంచి 1.5 శాతం మేర ఓట్లు పోలయ్యాయి. 👉 2019 లోక్‌సభ ఎన్నికల్లో నోటాకు ఏకంగా 1.06 శాతం ఓట్లు రావడం విశేషం! 👉 లోక్‌సభ ఎన్నికల చరిత్రలో నోటాకు లక్షద్వీప్‌లో అతి తక్కువగా 100 ఓట్లే పడ్డాయి. 👉 బిహార్‌లోని గోపాల్‌గంజ్ ఎస్సీ రిజర్వుడ్ స్థానంలో నోటాకు అత్యధికంగా 51,660 ఓట్లు వచ్చాయి. 👉 2018 ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా నోటాకు 1.98 శాతం ఓట్లు దక్కాయి. 👉 మహారాష్ట్రలోని లాతూర్ రూరల్ అసెంబ్లీ స్థానంలో నోటాకు అత్యధికంగా 27,500 ఓట్లు పడ్డాయి. మొత్తం ఓట్లలో ఇవి ఏకంగా 13 తం! అక్కడ 67 శాతం ఓట్లతో గెలిచిన ధీరజ్ దేశ్‌ముఖ్ తర్వాత నోటాకే రెండో స్థానం దక్కడం విశేషం. 👉 ఇటీవలి ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో 20 స్థానాల్లో నోటా మూడో స్థానంలో నిలిచింది! 👉 మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 47 స్థానాల్లో గెలిచిన అభ్యర్థి సాధించిన మెజారిటీ కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పడ్డాయి! 👉 క్రిమినల్ కేసులున్న ముగ్గురికి మించి అభ్యర్థులు పోటీ చేసే రెడ్ అలర్ట్ నియోజకవర్గాల్లో 2018 నుంచి నోటాకు 27.77 లక్షల ఓట్లు పోలయ్యాయి. -
నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓటింగ్ వస్తే.. ఏమవుతుందో తెలుసా?
ఢిల్లీ: ఎన్నికల్లో కొంతమంది పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులకు కాకుండా.. నోటా గుర్తుకు ఓటు వేస్తుంటారు. ఇటీవల ఇండోర్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థి లేకుండా పోయారు.ఇండోర్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి లేకపోవడంతో బీజేపీకి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. దీంతో ఈ రోజు (సోమవారం) జరుగుతున్న నాలుగో దశ ఎన్నికల్లో కార్యకర్తలు, ప్రజలు నోటా గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నోటాకు ఓటు వేసి బీజేపీకి గుణపాఠం చెప్పాలని అన్నారు.నిజానికి నోటా గుర్తుకు 99 శాతం మంది ఓటు వేసి, ఒక్కరు అక్కని పోటీ చేస్తున్న అభ్యర్థికి ఓటు వేసినా.. ఆ అభ్యర్థే విజేతగా నిలుస్తారని మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రావత్ పేర్కొన్నారు. అయితే ఒక నియోజక వర్గంలో నోటాకు 50 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు.. అక్కడి అభ్యర్థిని అక్కడి ప్రజలు ఎన్నుకోవడానికి సుముఖత చూపడం లేదని దానిపైన ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉందని అన్నారు. దీనివల్ల పార్లమెంటు, ఎన్నికల కమిషన్లపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. -
'నోటాకు ఓటు వేయండి': ఇండోర్ ఓటర్లకు కాంగ్రెస్ విజ్ఞప్తి
ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు విస్తృతంగా జరుగుతున్న తరుణంలో ఇండోర్ లోక్‌సభ అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయడానికి అభ్యర్థి లేకుండా పోయారు.మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా అక్షయ్ కాంతి బామ్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఈయన ఇప్పుడు ఊహించని విధంగా, తన నామినేషన్‌ను వెనక్కు తీసుకున్నారు. ప్రస్తుతం ఆ స్థానంలో వేరొక అభ్యర్థిని నియమించడానికి కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటిషన్ వేసినప్పటికీ ఫలితం లేకపోయింది.ఇండోర్‌లో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థి లేకపోవడంతో బీజేపీకి గుణపాఠం చెప్పాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. దీంతో సోమవారం జరగబోయే నాలుగో దశ ఎన్నికల్లో కార్యకర్తలు, ప్రజలు నోటా గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నోటాకు ఓటు వేసి బీజేపీకి గుణపాఠం చెప్పాలని అన్నారు.నోటాకు ఓటు వేయాలని ప్రజలొక విజ్ఞప్తి చేస్తూ.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి సజ్జన్ వర్మ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ఓటర్ల పరంగా మధ్యప్రదేశ్‌లో అతిపెద్ద నియోజకవర్గమైన ఇండోర్ నియోజకవర్గాన్ని 35 ఏళ్లలో (1989 నుంచి) కాంగ్రెస్ గెలవలేదు, అయితే అభ్యర్థిని కూడా నిలబెట్టలేకపోవడం ఇదే మొదటిసారి.इंदौर में लोकतंत्र की हत्या के खिलाफ गांधी प्रतिमा पर आयोजित प्रदर्शन में सम्मिलित हुआ। इंदौर का मतदाता पढ़ा लिखा और जागरूक है, नोटा के साथ अपना जवाब देगा।#Indore #NOTA pic.twitter.com/NMf5FbeIux— Sajjan Singh Verma (@sajjanvermaINC) May 11, 2024 -
ఇక్కడ కాంగ్రెస్ ప్రచారం ‘నోటా’కే..
ఇండోర్ (మధ్యప్రదేశ్): లోక్‌సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా తమ పార్టీ అభ్యర్థులకు, కూటమి అభ్యర్థులకు ఓటేయాలని అభ్యర్థిస్తున్న కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మాత్రం నోటాకే ఓటేయాలని ఓటర్లను కోరుతూ ప్రచారం నిర్వహిస్తోంది. ఇక్కడ తాము నిలబెట్టిన అభ్యర్థి చివరి నిమిషంలో పోటీ నుంచి బీజేపీలో చేరడమే ఇందుకు కారణం.ఇండోర్ బీజేపీ సిట్టింగ్ ఎంపీ శంకర్ లాల్వానీకి పోటీగా అక్షయ్ కాంతి బామ్‌ను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. అయితే ఆయన నామినేషన్ ఉపసంహరణకు చివరి రోజున కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. నామినేషన్ విత్‌డ్రా చేసుకని కాషాయ పార్టీలోకి చేరారు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నియోజకవర్గానికి నాలుగో దశలో మే 13న పోలింగ్ జరగనుంది.“గత మున్సిపల్, అసెంబ్లీ ఎన్నికల్లో ఇండోర్ ఓటర్లు బీజేపీకి భారీ విజయాన్ని అందించారు. అయినప్పటికీ, కాషాయ పార్టీ తమ అభ్యర్థి బామ్‌ను అన్యాయంగా ప్రలోభపెట్టి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఓటర్లు నోటాకు ఓటేసి బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలి’’ అని కాంగ్రెస్ సీనియర్ నేత శోభా ఓజా పీటీఐతో అన్నారు.తమ పార్టీ ఏ అభ్యర్థికీ మద్దతివ్వదని, బీజేపీని శిక్షించేందుకు ఓటర్లకు నోటా అవకాశం ఉందని ఎంపీ కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ అన్నారు. అయితే నోటాకు ఓటేయాలని ప్రచారం చేయడం ద్వారా కాంగ్రెస్ ప్రజాస్వామ్యంలో 'ప్రతికూల వ్యూహాలను' అవలంభిస్తోందని బీజేపీ అభ్యర్థి లాల్వానీ అన్నారు. -
నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే?: ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు శుక్రవారం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల్లో నోటాకు(నన్ ఆఫ్ ది అబో) ఎక్కువ ఓట్లుపోలైతే ఆ ఎన్నికను రద్దు చేసి.. మళ్లీ ఎలక్షన్స్ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అదే విధంగా నోటా కంటే తక్కువ ఓట్లు పొందిన అభ్యర్ధులు మళ్లీ అదే నియోజకవర్గంలో అయిదేళ్ల వరకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆదేశించాలని పిటిషన్ కోరింది.నోటాను ‘కల్పిత అభ్యర్థి’గా పేర్కొంటూ సమర్థవంతమైన రిపోర్టింగ్/ ప్రచారాన్ని కల్పించేలా నిబంధనలను రూపొందించాలని కోరింది. వక్త, రచయిత శివ్ ఖేరా దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వాజ్యంపై సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్ధివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించింది. ఖేరా తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణ వాదిస్తూ.. సూరత్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరించబడం, ఇతర అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడంతో ఎలాంటి ఎన్నికలు లేకుండానే బీజేపీ అభ్యర్థి విజేతగా ప్రకటించిన సందర్భాన్ని ప్రస్తావించారు.సూరత్‌లో మరో అభ్యర్ధి లేనందున, అందరూ ఒకే అభ్యర్థి విజేతగా ప్రకటించారు. అయితే పోటీలో ఒకే అభ్యర్థి ఉన్నప్పటికీ, ఎన్నికల నిర్వహించాల్సి ఉండేదని తెలిపారు. ఓటరుకి అభ్యర్ధి నచ్చకపోతే నోటాకు ఓటేసేవాడని పేర్కొన్నారు. మంచి అభ్యర్థులను నిలబెట్టేలా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావడమే నోటా ఉద్దేశ్యమని చెప్పారు. ఒక నియోజకవర్గంలో దాదాపు అన్ని అభ్యర్థులు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్న సందర్భాల్లో ఓటరు నోటాకు ఓటు వేసే అవకాశాలు ఉంటాయని, ఓటరు చేతిలో నోటా శక్తివంతమైన ఆయుధంగా పేర్కొన్నారు.నోటాను చెల్లుబాటు అయ్యే అభ్యర్థిగా పరిగణించడంలో భారత ఎన్నికల సంఘం విఫలమైందన్నారు. ప్రజాస్వామ్యంలో నాటా అవసరమని నొక్కి చెప్పారు. దీనిపై సీకజేఐ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పందిస్తూ.. ఇది ఎన్నికల ప్రక్రియకు సంబంధించినదని పేర్కొంటూ.. పిటిషన్‌పై స్పందించాలంటూ ఈసీకి నోటీసులు జారీ చేసింది. -
నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో ‘నోటా’కు ఎన్ని ఓట్లు?
భారతదేశ ఎన్నికల వ్యవస్థలో ఓటర్లు ఏ అభ్యర్థినీ ఇష్టపడని పక్షంలో ఏమి చేయాలనే దానిపై గతంలో చర్చ జరిగింది. ఈ నేపధ్యంలోనే 2013 ఎన్నికల్లో నోటా ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. 2013 తర్వాత రెండు సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఆ ఎన్నికల్లో నోటా ఆప్షన్ ప్రవేశపెట్టారు. అయితే నోటాపై ఓటర్ల స్పందన ఎలా ఉందనే ప్రశ్న ప్రతీ ఎన్నికల సందర్భంలోనూ అందరి మదిలో తలెత్తుతుంది. దీనిని తెలుసుకునేందుకు ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ ఎన్నికల ఫలితాలలో నోటా వినియోగం గురిచం పరిశీలించినప్పుడు పలు ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. డిసెంబరు 3న ఓట్ల లెక్కింపు పూర్తియిన నాలుగు రాష్ట్రాల డేటాను అనుసరించి చూస్తే.. మూడు రాష్ట్రాల్లో, ఒక శాతం కంటే తక్కువ మంది ఓటర్లు మాత్రమే నోటాను ఎంచుకున్నారని స్పష్టమైంది. మధ్యప్రదేశ్‌లో నమోదైన 77.15 శాతం ఓటింగ్‌లో 0.98 శాతం మంది ఓటర్లు మాత్రమే నోటాను ఎంచుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లో 1.26 శాతం మంది ఓటర్లు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)లో నోటా బటన్‌ను నొక్కారు. తెలంగాణలో 0.73 శాతం మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. తెలంగాణలో 71.14 శాతం ఓటింగ్ నమోదైంది. రాజస్థాన్‌లో 0.96 శాతం మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు. ఆ రాష్ట్రంలో 74.62 శాతం ఓటింగ్ జరిగింది. ‘నోటా’ ఆప్షన్ వినియోగం గురించి కన్స్యూమర్ డేటా ఇంటెలిజెన్స్ కంపెనీ ‘యాక్సిస్ మై ఇండియా’కు చెందిన ప్రదీప్ గుప్తా మాట్లాడుతూ నోటా అనేది ఎన్నికల్లో .01 శాతం నుంచి గరిష్టంగా రెండు శాతం వరకు ఉపయోగితమవుతోంది. భారతదేశంలో అమలవుతున్న ‘ఫస్ట్-పాస్ట్-ది-పోస్ట్’ సూత్రం గురించి ఆయన ప్రస్తావిస్తూ.. ఈ విధానంలో ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. అటువంటి పరిస్థితిలో ఓటర్లు.. ఎన్నికల్లో అభ్యర్థులెవరూ తమకు నచ్చలేదని భావించినప్పుడు వారు నోటాకు ఓటు వేయవచ్చు. అయితే నోటా ఆప్షన్‌ను ప్రజలు సక్రమంగా వినియోగించుకుంటేనే జనం నాడి తెలుస్తుందని, ప్రయోజనం ఉంటుందని, లేనిపక్షంలో అది లాంఛనప్రాయం అవుతుందని ప్రదీప్ గుప్తా అన్నారు. ఇది కూడా చదవండి: సీఎం రేసులో బాబా బాలక్‌నాథ్?.. అధిష్టానం నుంచి పిలుపు! -
స్వతంత్రుల కన్నా ఎక్కువగా 'నోటా'కు ఓట్లు!
సాక్షి, ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో నోటాకు ఓటేసిన వారి సంఖ్య ఈ ఎన్నికల్లో కాస్త తగ్గింది. చట్టసభలకు ప్రజాప్రతినిధులను ఎన్నుకోవడంలో ఓటు హక్కు కీలకమైనది. ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటింది. కానీ.. ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో అభ్యర్థులందరూ అందరికీ ఆమోదయోగ్యులై ఉండాలని ఏమీ లేదు. గతంలో నచ్చని అభ్యర్థులు బరిలో ఉన్న చోట్ల ఓటర్లు ఎవరికో ఒకరికి ఓటు వేయడం, మరికొందరు ఓటింగ్‌కు దూరంగా ఉండడం జరిగేది. అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఈవీఎం బ్యాలెట్లలో నోటా(నన్ ఆఫ్ ద ఎబోవ్) బటన్ తీసుకొచ్చారు. ఇది కేవలం ఓటరుకు ఐచ్ఛికం మాత్రమే. అభ్యర్థులు ఎవరూ సరైన వారు లేరని భావించిన పక్షంలో నోటాకు ఓటు వేయవచ్చు. అత్యధికంగా నోటాను వినియోగించుకున్నా పోలైన ఓట్లలో మెజార్టీ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. 2014అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పది నియోజకవర్గాల్లో 17,095 మంది ఓటర్లు నోటా బటన్ నొక్కారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 20,254 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఈ ఎన్నికల్లో 17,327 మంది నోటాకు ఓటేశారు. బోథ్ నియోజకవర్గంలో అత్యధికంగా నోటాకు వేశారు. ఇలా ఈవీఎంల్లోకి.. 2013లో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ కేసులో సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఆధారంగా నోటాను ప్రవేశపెట్టారు. దీన్ని భావ వ్యక్తీకరణలో అంతర్భాగంగానే పరిగణించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. తొలిసారిగా ఢిల్లీ, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 2013 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో నోటా ఐచ్ఛికాన్ని ప్రవేశపెట్టారు. అన్ని గుర్తులకంటే చివరలో నోటా గుర్తు ఉంటుంది. ఈ గుర్తును అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ సంస్థ రూపొందించింది. బోథ్: బోథ్ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థులు, చిన్న పార్టీల అభ్యర్థులు సాధించిన ఓట్ల కన్నా నోటాకు ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. నోటాకు 2565 మంది నోటాను వినియోగించుకున్నారు. బీఎస్పీ అభ్యర్థి జంగుబాపుకు 2044 ఓట్లు, బీసీపీ పార్టీ అభ్యర్థి ఆడె సునీల్ నాయక్‌కు 677, ఆర్జేపీ అభ్యర్థి హీరాజీకి 1388, డీఎస్పీ అభ్యర్థి ఉమేష్‌కు 1011, జీజీపీ అభ్యర్థి బాదు నైతంకు 596, స్వతంత్ర అభ్యర్థులు భోజ్యా నాయక్‌కు 878, ధనలక్ష్మికి 1231 ఓట్లు పోల్ అయ్యాయి. ఇవి చదవండి: తూర్పున కాంగ్రెస్, పశ్చిమాన కమలం, మధ్యలో బీఆర్ఎస్.. -
పోస్టల్ బ్యాలెట్‌లోనూ వీడని 'నోటా' ఓట్లు!
సాక్షి, ఆదిలాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, సర్వీస్ ఉద్యోగులకు సంబంధించిన పోస్టల్ బ్యాలెట్‌లోనూ నోటాకు ఓట్లు పోలయ్యాయి. ఆదివారం వెల్లడించిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో విద్యావంతులు సైతం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను కాదని నోటాకు ఓటేశారు. ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 3073 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. ఇందులోనూ ఎమ్మెల్యేగా విజయం సాధించిన బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ స్పష్టమైన అధిక్యతను కనబర్చారు. ఆయనకు 1140 ఓట్లు రాగా, బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్నకు 595 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి కంది శ్రీనివాస రెడ్డికి 961 ఓట్లు పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ అభ్యర్థి రెండో స్థానంలో నిలువడం గమనార్హం. కాగా నోటాకు 10మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. బోథ్ నియోజకవర్గంలో మొత్తం 1700 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలవ్వగా బీజేపీ అభ్యర్థి సోయం బాపూరావుకు అత్యధికంగా 718 ఓట్లు వచ్చాయి. ఎమ్మెల్యేగా గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్ జాదవ్‌కు 495 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి అడే గజేందర్‌కు 371 ఓట్లు పోలయ్యాయి. తొమ్మిది మంది నోటాకు ఓటేయడం గమనార్హం. ఇవి కూడా చదవండి: స్వతంత్రుల కన్నా ఎక్కువగా 'నోటా'కు ఓట్లు! -
నోటా.. తూటా..! అభ్యర్థులు నచ్చకపోతే దీనికే ఓటా..!?
సాక్షి, రంగారెడ్డి/వికారాబాద్: ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కలి్పస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం కలి్పంచింది. ఇందులో భాగంగా ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్)లో బరిలో ఉన్న అభ్యర్థుల గుర్తుతో పాటు నోటా ఆప్షన్‌ను ఏర్పాటు చేసింది. పోటీలో ఉన్న అభ్యర్థులకు ఓటు వేయడం లేదు అనే ఆప్షన్‌ను ఈవీఎంలలో అభ్యర్థుల గుర్తుతో పాటు నోట అనే బటన్‌ను పొందుపర్చారు. ఆ బటన్ నొక్కితే ఓటు ఏ పారీ్టకి పడదు. కానీ ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లే లెక్క. గెలుపోటములపై ప్రభావం! నోటాకు పడే ఓట్లు తూటా కంటే బలమైనవిగా మారాయా..? అభ్యర్థుల ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయా..? అంటే అవుననే సమాధానం వస్తోంది. గతంలో పలు నియోజకవర్గాల్లో వెల్లడించిన ఫలితాల్లో నోటాకు పడే ఓట్లు గెలుపోటములను శాసించే శక్తిగా మారాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి కేవలం 78 ఓట్లతో గెలుపొందారు. నోటాకు 1,139 ఓట్లు పోలయ్యాయి. నోటాకు బదులు అభ్యర్థులకు ఈ ఓట్లు పోలై ఉంటే గెలుపోటముల ఫలితం మరోలా ఉండేది. 2018 ఎన్నికల్లో నోటాకు పోలైన ఓట్లు.. ► పరిగిలో మొత్తం 2,29,436 ఓట్లకు గాను 1,75,371 ఓట్లు అభ్యర్థులకు.. నోటాకు 1,381 పడ్డాయి. ఇక్కడ 13 మంది అభ్యర్థులు పోటీ చేయగా ఆరుగురికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ► తాండూరు నియోజకవర్గంలో 2,01,917 ఓట్లు ఉండగా అభ్యర్థులకు 1,56,436 ఓట్లు, నోటాకు 787 పోలయ్యాయి. 13 మంది పోటీ చేయగా ఏడుగురు అభ్యర్థులకు నోటాకు పడిన ఓట్ల కంటే తక్కువ పోలయ్యాయి. ► కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం 2,01,941 ఓట్లకు గాను అభ్యర్థులకు 1,65,559, నోటాకు 1,472 పోలయ్యాయి. 15మంది అభ్యర్థులు పోటీ చేయగా పది మందికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ► వికారాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2,07,222 ఓట్లు ఉండగా 1,53,722 ఓట్లు అభ్యర్థులకు, నోటాకు 1,531 పోలయ్యాయి. 13 మంది అభ్యర్థులు పోటీ చేయగా లేడుగురికి నోటాకు పోలైన ఓట్ల కంటే తక్కువ వచ్చాయి. ► చేవేళ్ల నియోజకవర్గంలో 2,24,230 ఓట్లకు గాను 1,77,197 ఓట్లు అభ్యర్థులకు, నోటాకు 1,469 పోలయ్యాయి. నియోజకవర్గం నుంచి పది మంది పోటీ చేయగా ఐదుగురు అభ్యర్థులకు నోటా కంటే తక్కువ పోలయ్యాయి. -
ఎన్నికల్లో నోటాను మీటే ఓట్లు ఎన్సో తెలియాలంటే..? వేచుండాల్సిందే!
సాక్షి, మెదక్/సంగారెడ్డి: ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చకపోయినా గతంలో ఓటర్లు ఎవరికో ఒకరికి ఓటు వేసేవారు. కొంత కాలంగా అభ్యర్థులపై తమ అయిష్టతను తెలియజేసేందుకు ఎన్నికల సంఘం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్‌లో ‘‘నోటా’’ ఆప్షన్‌ను జత చేసింది. దీంతో ఓటర్లు నోటా ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 12 మంది అభ్యర్థులు బరిలో నిలబడ్డారు. బీఆర్ఎస్ నుంచి పద్మాదేవేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి ఉపేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి ఆకుల రాజయ్య, బీఎస్పీ నుంచి దూడ యాదేశ్వర్, జనతా పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, ఇతర పార్టీలు, స్వతంత్రులు బరిలో నిలిచారు. వారిలో పద్మాదేవేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందగా, ఉపేందర్‌రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. కాగా బీజేపీ అభ్యర్థి ఆకుల రాజయ్య డిపాజిట్ కోల్పోయారు. ఇక మిగతా వారి సంగతి అంతంత మాత్రమే. ఈ ఎన్నికల్లో 899 పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి మొత్తం 1,68,911 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అందులో 2263 మంది నోటాకు ఓటేసి అభ్యర్థులపై తమ నిరసన తెలిపారు. ఎన్నికల సమయంలో వివిధ శాఖల ద్వారా అత్యవసర సేవలు అందించే అధికారులకు కేటాయించే 899 పోస్టల్ బ్యాలెట్లలో 49 ఓట్లు చెల్లకుండా పోగా, 3 ఓట్లు నోటాకు పడడం గమనార్హం. ఇప్పటికీ ‘‘నోటా’’ అనే మీట ఉందనే విషయం చాలా మంది ఓటర్లకు తెలియదు. అందువల్లే నోటాకు ఓట్లు తక్కువగా పడుతున్నాయని విద్యావంతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటును నోటాకు కాకుండా సరైన నాయకుడికి వేసి అభివృద్ధికి దోహద పడాలని మేధావులు సూచిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో నోటాను మీటే ఓట్లు ఎన్సో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ఇవి చదవండి: మాటకు మాట! దూషణల పర్వంగా ప్రచారం!! -
నోటా (నన్ ఆఫ్ ది అబో) గురించి మీకు తెలుసా..!?
సాక్షి, మెదక్: నోటా (NOTA) ఈ పదం ఎక్కువగా ఎన్నికల సమయంలో వినపడుతూ ఉంటుంది. ఈవీఎం మిషన్లపై చివరగా ఉండే ఈ నోటా గురించి చాలామందికి పెద్దగా తెలియకపోవచ్చు. తెలిసిన వారు కొందరు దీనిని ఉపయోగిస్తారు. రాజకీయాలు భ్రష్టుపట్టిపోయాయి.. నానాటికీ తీసికట్టుగా మారిపోతున్నాయి. ఓటు వేసేందుకు సరైన వారు ఒక్కరూ కనిపించడం లేదని అనుకునే వారి కోసం ఈ ‘నోటా’ మీటను కేంద్ర ఎన్నికల సంఘం తీసుకొచ్చింది. ఎన్నికల్లో నిలబడిన వ్యక్తుల్లో మనం ఓటు వేసేందుకు అర్హత లేతదని గుర్తిస్తే ఈవీఎంలపై ఉన్న నోటా బటన్‌ను నొక్కుతున్నారు. ఎన్నికల సంఘమైతే దానిని ప్రవేశపెట్టింది సరే.. మరి దానిని ఎవరైనా వినియోగిస్తున్నారా? అంటే.. అవుననే సమాధానం వస్తుంది. దీనిని ప్రవేశ పెట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ప్రతి ఎన్నికల్లో నోటా బటన్‌ను నొక్కే వారి సంఖ్య ప్రతీ ఎన్నికల సమయంలో పెరుగుతూ వస్తుంది. నోటా (‘నన్ ఆఫ్ ది అబో) అంటే.. ‘పైన నిలబడిన వ్యక్తుల్లో ఎవరూ కాదు’ అని అర్థం. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులలో ఎవరూ నచ్చలేదని చెప్పేందుకు ఎన్నికల సంఘం దీనిని తీసుకొచ్చింది. పోలింగ్ శాతం పెంచడం, ఓటర్లు తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పే అవకాశం కల్పించడమే దీని ఉద్దేశం. తెలంగాణలో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలామంది నోటాను ఎంచుకున్నారు. నోటా ప్రభావం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎక్కువగానే ఉంది. ఎన్నికలు జరిగిన ప్రతీసారి నోటాకు పడుతున్న ఓట్ల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. ఎంతలా అంటే.. పలుచోట్ల అభ్యర్థుల తలరాతను మార్చేంతలా ఉంది. గెలిచిన అభ్యర్థికి వచ్చిన ఆధిక్యం కంటే నోటాకు పోలైన ఓట్లే ఎక్కువ.. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో మూడు వేలకు పైగానే ఓట్లు పడ్డాయంటే అర్థం చేసుకోవచ్చు. సుప్రీం కోర్టు సూచనతో.. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నోటాను ఎన్నికల సంఘం అమల్లోకి తీసుకువచ్చింది. అభ్యర్థులెవరూ నచ్చకపోతే తిరస్కరించే అవకాశం ఓటరుకు ఉండాలని పలు స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సేవా విభాగాలు ఏళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తున్న తరుణంలో నోటాను అందుబాటులోకి తీసుకురావాలని ఎన్నికల సంఘం 2009లో తొలిసారిగా సుప్రీం కోర్టుకు చెప్పింది. ప్రభుత్వం దీనిని వ్యతిరేకించినప్పటికీ పలు సంస్థలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. దీంతో నోటాను అమల్లోకి తీసుకురావాలని సుప్రీం కోర్టు 2013 సెప్టెంబర్ 27న తీర్పును వెలువరించింది. ఎప్పటి నుంచో ఉన్న తిరస్కరణ ఓటు.. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు నచ్చకుంటే తిరస్కరణ ఓటు వేసే హక్కును భారత రాజ్యాంగం ఎప్పుడో కల్పించింది. ప్రజా ప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 49(ఓ) కింద ఓటర్లు ఈ హక్కును వినియోగించుకునే వీలుంది. పోలింగ్ బూత్‌లోని ప్రిసైడింగ్ అధికారి దగ్గర దీనికోసం 17–ఏ ఫారం తీసుకుని ఫలానా అభ్యర్థిని తిరస్కరిస్తున్నానని తెలుపుతూ సంతకం లేదా వేలి ముద్ర వేసి బ్యాలెట్ పెట్టెలో వేయవచ్చు. రహస్య బ్యాలెట్ విధానానికి ఇది విరుద్ధమని, ఓటరు భద్రత దృష్ట్యా ఇది సరైన పద్ధతి కాదని వ్యతిరేకత ఉండేది. ఈవీఎంలు అందుబాటులోకి రావడంతో ఎన్నికల సంఘం నోటాను అమలు చేసింది. పెరుగుతున్న ఆదరణ.. 2014, 2018లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం కల్పించడంతో నోటాకు ఓటు వేసే వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే ఓటర్లు నోటా బటన్‌ను నొక్కేస్తున్నారు. 2014లో తొలిసారిగా నోటాను బ్యాలెట్ షీట్లో చేర్చారు. ఆ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నోటాకు 14,899 ఓట్లు పోలైతే, 2018లో 20,739 ఓట్లు పోలయ్యాయి. 2018 ఎన్నికల్లో పలువురు అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు రావడం విశేషం. సిద్దిపేట నియోజవర్గంలో ఏడుగురు అభ్యర్థులకు, మెదక్‌లో 8 మంది, నారాయణఖేడ్‌లో 6, అందోల్‌లో 5, నర్సాపూర్‌లో 3, జహీరాబాద్‌లో 10, సంగారెడ్డిలో 10, పటాన్చెరులో 11, దుబ్బాకలో 11, గజ్వేల్‌లో 9, హుస్నాబాద్ నియోజకవర్గంలో 11 మందికి నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. ఇవి చదవండి: 'కార్యకర్తలను కాపాడుకుంటా..' : మంత్రి హరీశ్‌రావు -
TS Election 2023: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం.. 'నోటా' కు ఎక్కువ ఓట్లు వస్తే..!?
సాక్షి, నల్గొండ: ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం.. ప్రతి ఒక్కరూ ఓటు వెయ్యాలి. మరి తమ నియోజకవర్గ పరిధిలో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవ్వరూ నచ్చకపోతే ఏం చేయాలి. ఎవరికో ఒకరి ఓటు వేయకుండా తమ నిరసనను వ్యక్తం చేయడం ఎలా..? దీనిపై 2003వ సంవత్సరంలోనే పలు స్వచ్ఛంద సంస్థలు సుప్రీం కోర్టును ఆశ్రయించాయి. అనేక వాదోపవాదనలు జరిగిన తరువాత ‘నోటా’ (నన్ ఆఫ్ ద ఎబౌ)ను ఈవీఎంలలో చేర్చాలని సుప్రీం సూచించింది. 2014 ఎన్నికల నుంచి ఎన్నికల సంఘం ఈవీఎంలలో ‘నోటా’ను చేర్చింది. బరిలో ఉన్న వారెవ్వరూ నచ్చకపోతే నోటా మీట నొక్కవచ్చు. అయితే జిల్లాలో జరిగిన రెండు అసెంబ్లీ, ఒక పార్లమెంట్ ఎన్నికలో నోటాకు 1 శాతానికి మించి ఓట్లు పడకపోవడం గమనార్హం. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. 2014 నుంచి అమల్లోకి వచ్చిన నోటాకు ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న 12 నియోజకవర్గాల్లో పోలైన ఓట్లలో కేవలం 0.2 నుంచి 0.4 శాతమే. 2018 ఎన్నికల్లో 0.5 నుంచి 0.8 శాతం వరకు ఓట్లు వచ్చాయి. ఒక వేళ నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే దాని తర్వాత స్థానంలో నిలిచిన వారు గెలిచినట్లు ప్రకటించే అవకాశం ఉందని అధికారవర్గాలు చెపుతున్నాయి. ఇతర దేశాల్లో ఇలా.. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాలు నోటాను అమలు చేస్తున్నాయి. ► బెల్జియం, ప్రాన్స్, యూఎస్ఏలో ఈవీఎంల మీద నోటాను అమలు చేస్తున్నారు. ► కొలంబియా, స్పెయిన్, బ్రెజిల్, గీస్, పిన్లాండ్, స్వీడన్, ఉక్రెయిన్, చీలి వంటి దేశాలు ఓట్ ఆఫ్ రిజెక్ట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ► మన పొరుగున ఉన్న బంగ్లాదేశ్ 2008 నుంచి నోటాను అమలు చేస్తుండగా పాకిస్తాన్ 2013 నుంచి నోటాను అమలు చేస్తోంది. -
ఉప ఎన్నికలో నోటాకి సెకండ్ ప్లేస్
ముంబై: దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో దెబ్బ పడింది కాంగ్రెస్‌కే. హర్యానా, తెలంగాణల్లో రెండు స్థానాలను పొగొట్టుకుంది. అందులో ఒకటి బీజేపీ, మరొకటి టీఆర్ఎస్(బీఆర్ఎస్) వశం అయ్యాయి. ఇక మహారాష్ట్ర అంధేరీ(తూర్పు) నియోజకవర్గం నుంచి శివసేన ఉద్దవ్ థాక్రే వర్గం నుంచి రుతుజా రమేష్ లాట్కే.. 66వేల ఓట్ల మార్జిన్‌తో ఘన విజయం సాధించారు. శివసేన ఎమ్మెల్యే రమేష్ లాట్కే ఈ మే నెలలో మరణించారు. దీంతో అంధేరీ(తూర్పు) స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే కాంగ్రెస్, ఎన్సీపీల మద్దతు మాత్రమే కాదు.. బీజేపీ సైతం ఇక్కడ తమ అభ్యర్థిని దింపకపోవడంతో.. రుతుజాకి బాగా కలిసొచ్చింది. ఈ క్రమంలో..ఈ ఉప ఎన్నికలో అంధేరీ ఓటర్లు భలే సర్ప్రైజ్ ఇచ్చారు. రుతుజాతో పాటు ఈ ఉప ఎన్నికల్లో ఆరుగురు అభ్యర్థులు బరిలోకి దిగారు. ఆ ఆరుగురు అభ్యర్థుల కంటే నోటాకే ఎక్కువగా ఓట్లు పోలయ్యాయి. ఇప్పటివరకు దేశంలో జరిగిన ఉప ఎన్నికల్లో ఇలా.. అభ్యర్థుల(ప్రధాన పార్టీ అభ్యర్థులు కాదు) కంటే నోటాకు ఎక్కువ ఓట్లు పోల్ కావడం గమనార్హం. అంటే రుతుజా తర్వాత నోటా ఓట్లే రెండు స్థానంలో నిలిచాయన్నమాట. రుతుజా లాట్కే.. గతంలో బృహణ్‌ముంబై మున్సిపల కార్పొరేషన్లో క్లర్క్‌గా పని చేశారు. రాజీనామా అనంతరం ఆమె ఉప ఎన్నికల బరిలో దిగారు. త్వరలో ముంబై స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతుండడంతో.. థాక్రే వర్గంలో ఈ విజయం జోష్‌ను నింపింది. మరోవైపు ప్రజలు తమవైపే ఉన్నారనడానికి ఈ ఫలితమే నిదర్శనమని మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రే ప్రకటించుకున్నారు. ఇదీ చదవండి: ప్చ్.. కారు హవాను తక్కువగా అంచనా వేశాం! -
హుజురాబాద్ ఉప ఎన్నిక: వజ్రం, రోటీమేకర్, నోటాకు భారీగానే ఓట్లు
సాక్షి, హైదరాబాద్: ఉప ఎన్నిక ఫలితాల్లో నోటాకు 1,036 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో 2,867 ఓట్లు వచ్చాయి. అప్పుడు బీజేపీ అభ్యర్థి పుప్పాల రఘుకు 1,683 ఓట్లు వచ్చాయి. అప్పుడు నోటా కంటే తక్కువగా ఉన్న బీజేపీ ఇప్పుడు అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంది. చదవండి: కాంగ్రెస్‌లో కాక రేపుతున్న ‘హుజురాబాద్’ ఫలితం వజ్రం: ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కంటె సాయన్న 1,942 ఓట్లు సాధించి మూడు ప్రధాన పార్టీల తర్వాత నాలుగో స్థానంలో నిలిచారు. రోటీమేకర్: ప్రజా ఏక్తా పార్టీ నుంచి పోటీ చేసిన సిలివేరు శ్రీకాంత్ 1,913తో ఐదోస్థానం సంపాదించారు. ఉంగరం: స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన బుట్టెంగారి మాధవరెడ్డి కేవలం 36 ఓట్లతో అందరి కంటే ఆఖరు స్థానంలో నిలిచారు. చదవండి: హుజురాబాద్ ఫలితాలు: వెక్కి వెక్కి ఏడ్చిన టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు? పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ హవా.. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్లో అధికార టీఆర్ఎస్ హవా కొనసాగింది. 777 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు గాను, 455 ఓట్లు టీఆర్ఎస్కు, 242 ఓట్లు బీజేపీకి, కాంగ్రెస్‌కు 2 పోల్ కాగా.. 48 ఓట్లు చెల్లలేదు. -
నోటాపై మీ అభిప్రాయమేంటి: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: గత కొన్ని సంవత్సరాలుగా దేశ వ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలు జరిగినా నోటా అంశం వెలుగులోకి వస్తుంది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో మనకు ఎవరూ నచ్చకపోతే నోటాకు ఓటు వేయవచ్చు. చాలా సార్లు బరిలో నిలిచిన వారికంటే నోటాకే అధికంగా ఓట్లు వచ్చిన సందర్భాలున్నాయి. ఇటువంటి పరిస్థితి వస్తే.. మరోసారి ఎన్నికలు జరిపి కొత్తవారిని ఎన్నుకోవాలని.. అప్పుడే నోటాకు విలువ ఉంటుందనే వాదనలు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దీనిపై కీలక వ్యాఖ్యలు చేసింది. నోటా విషయంలో అభిప్రాయం ఏంటో తెలపాల్సిందిగా సుప్రీంకోర్టు.. కేంద్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల బరిలో నిల్చున్న అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. ఆ ఎన్నికను రద్దు చేయాల్సిందిగా కోరుతూ.. బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ గతంలో సుప్రీంకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై నేడు విచారణ జరిగింది. ప్రధాన న్యాయమూర్తి ఎస్ ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రమసుబ్రమణియన్తో కూడిన బెంచ్ సోమవారం ఈ పిల్‌ని విచారిందింది. ఈ నేపథ్యంలో నోటాపై అభిప్రాయాలను తెలియాజేయాల్సిందిగా బెంచ్.. కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘాన్ని కోరింది. విచారణ సందర్బంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ప్రస్తుతం ఓటర్లకు కేవలం అభ్యర్థులను తిరస్కరించే అవకాశం మాత్రమే ఉందని.. కానీ దీన్ని కూడా ఓటుగా గుర్తించాలని కోరారు. ప్రసుత్తం నోటాకు 99 శాతం ఓట్లు వచ్చి.. అభ్యర్థికి ఒక్కశాతం ఓట్లు వచ్చినా అతడిని విజేతగా ప్రకటిస్తున్నారని.. దీన్ని మార్చాలని విజ్ఞప్తి చేశారు. నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. మరోసారి ఎన్నికలు జరిపి కొత్త వారిని ఎన్నుకోవాలని.. అప్పుడే నోటాకు ప్రయోజనం ఉంటుందని వెల్లడించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు దీనిపై అభిప్రాయం తెలపాల్సిందిగా కేంద్రాన్ని కోరింది. నోటా నేపథ్యం... ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు అవకాశం కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తుతోపాటు నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్) ను ఏర్పాటు చేశారు. ఎవరికైనా ఓటు వేయాలంటే సదరు అభ్యర్థికో, పార్టీకో ఓ గుర్తు వుంటుంది. ఆ గుర్తుకు ఓటర్లు ఓటు వేస్తూ ఉంటారు. అయితే, ఈ దఫా మాత్రం ఇప్పుడు పోటీలో వున్నవాళ్ళెవరికీ నేను ఓటు వేయడం లేదు అనే ఆప్షన్‌ను ఈవీఎంలలో పొందుపరిచారు. ఆ బటన్ నొక్కితే సదరు ఓటరు ఓటు ఎవరికీ పడదు. కానీ ఓటు హక్కును నోటా వినియోగించుకున్నట్టే. ఇలాంటి అవకాశం ఇప్పటికే చాలా దేశాల్లో ఓటర్లకు అందుబాటులో ఉండగా, అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో మాత్రం కాస్త ఆలస్యంగా ఇటీవలే అందుబాటులోకి వచ్చింది. ‘నోటా’ను అందుబాటులోకి తేవాలనుకుంటున్నట్లు ఎన్నికల కమిషన్ 2009లో తొలిసారిగా సుప్రీంకోర్టుకు చెప్పింది. ప్రభుత్వం దీనికి వ్యతిరేకించినా, పౌర హక్కుల సంస్థ పీయూసీఎల్ దీనికి మద్దతుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఎట్టకేలకు ఎన్నికల్లో ‘నోటా’ను అమలులోకి తేవాలంటూ సుప్రీంకోర్టు 2013 సెప్టెంబర్ 27న రూలింగ్ ఇచ్చింది. చదవండి: ఒకే అభ్యర్థి బరిలో ఉంటే ‘నోటా’కు ఆస్కారం లేదు -
‘గ్రేటర్’ తీర్పు: కారుకు బ్రేక్.. కమలానికి షాక్
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. ఆయా పార్టీల ఆధిక్యతలపై స్పష్టమైన ప్రభావం చూపింది. ఎక్కువ స్థానాలు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన టీఆర్ఎస్ దాదాపు 17 చోట్ల స్వల్ప తేడాలతో విజయానికి దూరమైంది. బీజేపీ స్వల్ప తేడాతో ఓడిన స్థానాల్లోనూ నోటాకు ఎక్కువ ఓట్లు పడడం ఆ పార్టీ అభ్యర్థుల భవితవ్యాన్ని తలకిందులు చేసింది. ఇలా స్వల్ప తేడాతో ఓడిన స్థానాల్లో పరాజయానికి కారణాలపై ఆయా పార్టీలు విశ్లేషించుకునే పనిలో పడ్డాయి. అయితే.. బీఎన్‌రెడ్డి నగర్లో 32 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ ⇔ బంజారాహిల్స్ డివిజన్లో టీఆర్ఎస్కు 10,227, బీజేపీకి 9,446 ఓట్లు వచ్చాయి. నోటాకు 805 ఓట్లు వచ్చాయి. 126 చెల్లని ఓట్లు ఉన్నాయి. బీజేపీ 781 ఓట్లతో తేడాతో ఓడిపోయింది. ఇక్కడా నోటాకు 805 ఓట్లు రావడం బీజేపీ ఓటమిపై ప్రభావాన్ని చూపింది. ⇔ మచ్చబొల్లారం డివిజన్లో టీఆర్ఎస్కు 12,089, బీజేపీకి 12,055 ఓట్లు వచ్చాయి. కేవలం 34 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు. ఇక్కడా నోటాకు 302 ఓట్లు పడడం కూడా టీఆర్ఎస్కు కలిసివచ్చింది. బీజేపీ ఓటమి పాలైంది. అభ్యర్థి పరాజయం పొందగా.. అది కూడా డమ్మీ అభ్యర్థిగా నిలిచిన ఆమె కుమారుడికి 39 ఓట్లు పడడంతో ఆమె విజయం తారుమారైంది. ఈ విధంగానే చాలాచోట్ల నోటా, చెల్లనిఓట్లు అభ్యర్థులు పరాజయం పొందిన ఓట్లకు ఎక్కువగా, సమంగా ఉండడం కూడా ఆయా పార్టీ నేతలను మథనపడేలా చేశాయి. బీఎన్‌రెడ్డి నగర్, మల్కాజిగిరి, అడిక్‌మెట్, హస్తినాపురం, వినాయక్‌నగర్, రాంగోపాల్‌పేట, రాంనగర్, మూసాపేట, రామంతాపూర్, వనస్థలిపురం, జూబ్లీహిల్స్, మంగళ్‌హాట్, సైదాబాద్, గచ్చిబౌలి, అమీర్‌పేట, హబ్సిగూడ, కవాడిగూడలలో స్వల్ప ఓట్ల తేడాతో టీఆర్ఎస్ పరాజయం పాలైంది. కొన్ని డివిజన్లలో ఇలా.. ⇔ మల్కాజిగిరి డివిజన్లో గెలిచిన బీజేపీ అభ్యర్థికి 8,361 ఓట్లు పోల్ కగా.. కేవలం 172 ఓట్ల తేడాతో ఓడిపోయిన టీఆర్ఎస్ అభ్యర్థికి 8,188 ఓట్లు పోలయ్యాయి. విచిత్రమేమిటంటే మెజారిటీ 172 ఓట్లను మించి ఇక్కడా నోటాకు 245 ఓట్లు పడడంతో టీఆర్ఎస్ అభ్యర్థికి భంగపాటుగా మారింది. ⇔ వినాయక్‌నగర్ డివిజన్లో బీజేపీకి 9,972 ఓట్లు, టీఆర్ఎస్కు 9,685 ఓట్లు పోలయ్యాయి. 287 ఓట్ల తేడాతో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోగా ఆ అంకెకు సమానంగా అంటే 287 ఓట్లు నోటాకు పోలయ్యాయి. ఇలా నోటా ఓట్లు అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ⇔ వనస్థలిపురం డివిజన్లో బీజేపీ అభ్యర్థికి 9,214 ఓట్లు, టీఆర్ఎస్కు 8,513 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్‌కు 1374, టీడీపీకి 772, ఇండిపెండెంట్ అభ్యర్థులకు 119 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 259 ఓట్లు పడగా, చెల్లని ఓట్లు 269 ఉన్నాయి. ఇక్కడా టీఆర్ఎస్ అభ్యర్థి 702 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ⇔ హస్తినాపురం డివిజన్లో బీజేపీకి 8036, టీఆర్ఎస్కు 7,757 ఓట్లు వచ్చాయి. కేవలం 279 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయారు. నోటాకు 247 ఓట్లు పడగా, 458 చెల్లని ఓట్లు ఉన్నాయి. ఈ లెక్కన చూసుకుంటే ఇటు నోటాకు ఓట్లు వేయకపోయినా, అటు చెల్లని ఓట్లు లేకుండా పరిగణనలోకి వచ్చి ఉంటే 279 ఓట్లు ఈజీగా తమ అభ్యర్థి ఖాతాలో చేరిపోయి ఉండేవని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి. ⇔ అడిక్‌మెట్ డివిజన్లో బీజేపీకి 7,830, టీఆర్ఎస్కు 7600 ఓట్లు వచ్చాయి. కేవలం 239 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి పరాభవం పొందారు. గెలుపును ప్రభావితం చేసిన 239 ఓట్ల కన్నా ఎక్కువగా నోటాకు 265 ఓట్లు పోలవడంతో ఓడిన పార్టీ అభ్యర్థులు నైరాశ్యంలో మునిగిపోయారు. ⇔ రాంనగర్ డివిజన్లో బీజేపీకి 9,819, టీఆర్ఎస్కు 9291 ఓట్లు పోలయ్యాయి. 528 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోయారు. ఇక్కడా నోటాకు 215, చెల్లని ఓట్లు 307 వరకు అంటే మొత్తం 522 ఓట్లు అభ్యర్థులకు పనికిరాకుండా పోయాయి. ⇔ సైదాబాద్ డివిజన్లో బీజేపీకి 10,621, టీఆర్ఎస్కి 9,710 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 188, చెల్లని ఓట్లు 370 ఉన్నాయి. ఇక్కడా టీఆర్ఎస్ అభ్యర్థి 911 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడా స్థానిక సమస్యల బాగా ప్రభావితం చేశాయి ⇔ గచ్చిబౌలి డివిజన్లో బీజేపీకి 10,602, టీఆర్ఎస్కు 9,467 ఓట్లు వచ్చాయి. నోటాకు 207 ఓట్లు పడ్డాయి. 562 చెల్లని ఓట్లు ఉన్నాయి. ఇక్కడ సైతం టీఆర్ఎస్ అభ్యర్థి 1,135 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ⇔ రామంతాపూర్ డివిజన్లో బీజేపీకి 10,033, టీఆర్ఎస్కు 9,378 ఓట్లు పోలయ్యాయి. నోటాకు 225 ఓట్లు వచ్చాయి, 310 చెల్లని ఓట్లు ఉన్నాయి. ఇక్కడా టీఆర్ఎస్ అభ్యర్థి 705 ఓట్లతో పరాజయం పొందారు. ⇔ హబ్సిగూడ డివిజన్లో బీజేపీకి 10,803, టీఆర్ఎస్కు 9,4356 ఓట్లు వచ్చాయి. నోటాకు 218 ఓట్లు వచ్చాయి. 426 చెల్లని ఓట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా టీఆర్ఎస్ అభ్యర్థి 1147 ఓట్లతో ఓడిపోయారు. ⇔ ఇక ఎంఐఎం విషయానికొస్తే అత్యల్ప మెజారిటీ (1583 ఓట్లు) గెలిచింది జంగమ్మేట్లోనే. ఇక్కడా ఎంఐఎంకు 10,629 ఓట్లు, బీజేపీకి 9046 ఓట్లు పడ్డాయి. మెజారిటీ 1583ఓట్లు ఎంఐఎంకు వచ్చాయి. నోటాకు 66, చెల్లని ఓట్లు 756 వచ్చాయి. ముస్లిం ప్రాబల్యం ఎక్కువగా ఉన్నా బీజేపీ అభ్యర్థి రాణించడంతో మెజారిటీ తగ్గిందని ఆ పార్టీ లెక్కలు వేసుకుంది. కారును ముంచిన వరద ప్రాంతాలివే.. నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రేటర్‌తో పాటు శివారులోని చాలా ప్రాంతాలు జలమయ్యాయి. ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. అధికార పార్టీ నేతలు సహాయక చర్యల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో చైతన్యపురి, హబ్సిగూడ, రామంతాపూర్, చంపాపేట, నాగోలు, సరూర్‌నగర్, గడ్డి అన్నారం, హయత్‌నగర్, వనస్థలిపురం, లింగోజీగూడ, హస్తినాపురం, మన్సూరాబాద్, మైలార్‌దేవ్‌పల్లి, జీడిమెట్లలో బీజేపీ విజయకేతనం ఎగరవేసింది. -
ఏడు లక్షల ఓట్లతో.. తేల్చిచెప్పారు!
పట్నా: టీ-20 మ్యాచ్‌లా ఉత్కంఠ రేపిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ సాధారణ మెజార్టీతో తిరిగి అధికారం నిలబెట్టుకుంది. బీజేపీ అత్యధిక స్థానాలు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. తాజాగా ముగిసిన ఎన్నికల్లో బిహారీలు పెద్ద ఎత్తున ‘నోటా’ వైపు మొగ్గుచూపారు. ఏడు లక్షలకు పైగా ఓటర్లు ‘నోటా’కు ఓకే చెప్పారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 7,06,252 (1.7 శాతం) మంది ఓటర్లు ‘నోటా’కే జై కొట్టారు. బిహార్‌లో 7.3 కోట్ల మంది ఓటర్లు ఉండగా కేవలం 4 కోట్ల మంది (57.09శాతం) మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. నువ్వా నేనా అన్నట్టు సాగినా ఎన్నికల్లో చాలా మంది అభ్యర్థులు ‘నోటా’ కన్నా తక్కువ ఓట్ల మెజార్టీతో గెలిచారు. హోరాహొరీగా జరిగిన పోరులో చాలా చోట్ల అభ్యర్థుల గెలుపోటములపై ‘నోటా’తీవ్ర ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. 2013 నుంచి నోటా ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. ఈవీఎంలలో చివరన దీన్ని పొందుపరుస్తున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకుంటే ‘నోటా’ గుర్తును ఎంచుకోవచ్చు. పోటీ చేస్తున్న అభ్యర్థుల కన్నా నోటా గుర్తుకి ఎక్కువ ఓట్లు వస్తే మళ్లీ ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు నిరాకరించడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. (చదవండి: నితీష్ సీఎం అయితే మాదే క్రెడిట్: శివసేన) -
ఒకే అభ్యర్థి బరిలో ఉంటే ‘నోటా’కు ఆస్కారం లేదు
సాక్షి, అమరావతి: స్థానిక ఎన్నికల్లో ఒకే అభ్యర్థి బరిలో ఉన్న చోట ‘నోటా’కు ఏ మాత్రం అవకాశం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఒకే అభ్యర్థి బరిలో ఉంటే ఆ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించాల్సిందేనని తెలిపింది. ఎన్నికలు జరిగినప్పుడు మాత్రమే ‘నోటా’ను ఉపయోగించుకోవచ్చునంది. ఒకే అభ్యర్థి ఎన్నికల బరిలో ఉన్నప్పుడు ‘నోటా’ను వినియోగించుకోవడానికి నిబంధనలు అనుమతించడం లేదని స్పష్టం చేసింది. ఈ విషయంలో తగిన నిబంధనలు రూపొందించేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించాలని పిటిషనర్‌కు వెసులుబాటునిచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులిచ్చింది. స్థానిక ఎన్నికల్లో ఒకే అభ్యర్థి పోటీలో ఉన్న చోట నోటాను వినియోగించుకునే అవకాశాన్ని ఓటర్లకు ఇవ్వాలంటూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన బీవీ భద్ర నాగశేషయ్య, మరొకరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. -
స్థానికంలోనూ 'నోటా'
పశ్చిమగోదావరి, ఏలూరు (మెట్రో): స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఎన్నికల బ్యాలెట్ పత్రాల్లో నోటాకు చోటు కల్పించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈ మేరకు బ్యాలెట్ పత్రాలు సిద్ధమవుతున్నాయి. దీంతో ఇది పెద్ద తలనొప్పేనని నాయకులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఏప్రిల్‌లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల్లో ఈ నోటాకు కొన్ని ప్రధాన పార్టీల కన్నా ఎక్కువ ఓట్లు రావడమే దీనికి కారణం. ఇప్పటివరకు ఈవీఎంలలో మాత్రమే నోటాకు చోటు ఉండేది. ఇప్పుడు బ్యాలెట్ పత్రాలలోనూ ఇది ప్రత్యక్షం కానుంది. అభ్యర్థుల ఎన్నికల గుర్తులు తరువాత ఈ నోటా గుర్తు ఉంటుంది. పోటీ చేసే వారు ఎవరూ నచ్చకపోతే ఈ గుర్తుకుఓటు వేయొచ్చు. ఇప్పటివరకు గత్యంతరం లేక ఎవరో ఒకరి వైపు ఓటర్లు మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు నోటా ఉండడంతో దానిని ఉపయోగించుకోవడం వల్ల తమకు ఇబ్బందేనని నాయకులు చెబుతున్నారు. ఇది ఒక్కోసారి జయాపజయాలను నిర్దేశించే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. గత ఎన్నికల్లో ప్రధాన పార్టీలకంటే ఎక్కువగా ♦ గత సార్వత్రిక ఎన్నికల్లో నోటాకు పోలైన ఓట్లను పరిశీలిస్తే జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల కంటే ఎక్కువ వచ్చాయి. దీంతో ఆ పార్టీల అభ్యర్థులు కంగుతిన్నారు. నియోజకవర్గాల వారీగా నోటాకు పోలైన ఓట్లు ఇలా.. ♦ కొవ్వూరులో 2165, నిడదవోలులో 1693, ఆచంటలో 1453, పాలకొల్లులో 1170, నరసాపురంలో 1143, భీమవరంలో 1492, ఉండిలో 1885, తణుకులో 1885, ఉంగుటూరులో 2321, దెందులూరులో 2546, ఏలూరులో 1524, గోపాలపురంలో 3998, పోలవరంలో 6004, చింతలపూడిలో 3477 ఓట్లు నోటాకు పోలయ్యాయి. -
తొలిసారి పంచాయతీ బరిలో నోటా
సాక్షి, నిడదవోలు (పశ్చిమ గోదావరి): పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే కులాల వారీగా ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల గుర్తింపు ప్రక్రియను పూర్తిచేశారు. ఓటర్ల అభ్యంతరాలు స్వీకరించి తప్పొప్పులు సరిచేశారు. జిల్లాలోని అన్ని పంచాయతీ కార్యాలయాల్లో గ్రామసభలను పూర్తిచేసి అభ్యంతరాలను స్వీకరించడంతో పాటు వాటిని పరిష్కరించేలా క్షేత్రస్థాయి సిబ్బంది చర్యలు తీసుకుని ఓటర్ల తుది జాబితాలను ప్రచురించారు. ఈసారి తొలిసారిగా స్థానిక ఎన్నికల్లో ‘నోటా’ విధానం ప్రవేశపెడుతుండటం మరింత ఆసక్తిని రేపుతోంది. నోటాకు అధిక ఓట్లు పోలయితే రీపోలింగ్ పెట్టాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. జిల్లాలో 909 గ్రామ పంచాయతీలుండగా 9,930 వార్డుల్లో 25,50,916 మంది ఓటర్లున్నారు. రెండు బ్యాలెట్లతో నిర్వహణ పంచాయతీ ఎన్నికలు రెండు బ్యాలెట్లతో నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. పాత పద్ధతిలోనే బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరగనున్నాయి. బ్యాలెట్ పత్రాలు కొనుగోలు చేయాలని, ముద్రణకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు వచ్చాయి. పంచాయతీ ఎన్నికల్లో రెండు రంగుల బ్యాలెట్లు ఉంటాయి. సర్పంచ్‌కు గులాబీ రంగు బ్యాలెట్, వార్డు సభ్యులకు తెలుగు రంగు బ్యాలెట్ పత్రాలను కేటాయించారు. జిల్లా స్థాయి కమిటీ అనుమతితో ఎంపిక చేసిన కేంద్రంలో వచ్చేనెల బ్యాలెట్ ముద్రణ జరుగుతుంది. అభ్యర్థుల ఖర్చు పెంపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల దరావతు, ఎన్నికల వ్యయ పరిమితి పెరగనుంది. దరావతు 150 శాతం నుంచి 1000 శాతం పెంచేలా ప్రతిపాదనలు చేశారు. 10 వేల కన్నా తక్కువ జనాభా ఉన్న పంచాయతీలో సర్పంచ్‌కు రూ.20 వేలు, వార్డు సభ్యుడికి రూ.3 వేలు ఖర్చు చేయాల్సి వుండగా ప్రస్తుత సర్పంచ్ రూ.32 వేలు, వార్డుసభ్యుడు 4,800 వరకు ఖర్చు చేయవచ్చు. 10 వేల పైబడి జనాభా ఉన్న పంచాయతీల్లో సర్పంచ్ రూ.40 వేలు, వార్డు సభ్యుడు రూ.5 వేలుగా ఉన్న ఎన్నికల వ్యయాన్ని ఇకపై సర్పంచ్‌కు రూ.64 వేలు, వార్డు సభ్యుడు రూ.8 వేలకు పెంచాలన్న ప్రతిపాదన ఉంది. రిజర్వేషన్లపై తర్జనభర్జన 2013లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 39.99 శాతం, ఎస్సీలకు 18.30 శాతం, ఎస్టీలకు 8.50 శాతం కోటాను అమలు చేశారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసిన నేపథ్యంలో దానికి అనుగుణంగా మార్పులు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి నూతన ప్రభుత్వ నిర్ణయం వెలువడాల్సి వుంది. రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఆసక్తిగా మారింది. కాగా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాల్లో 13 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. దీంతో పల్లెల్లో పార్టీ మరింత బలంగా ఉంది. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మద్దతు పలికిన సర్పంచులు గెలవడంతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఈ సారి క్లీన్‌స్వీప్ చేయడం ఖాయమని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కులాల వారీగా ఆర్థిక స్థోమతను బట్టి ఆయా గ్రామాల్లో అభ్యర్థులు ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. అభ్యంతరాలు పరిష్కరించాం జిల్లాలో ఉన్న పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వనరులు, వసతులు పరిశీలించి ఎంపిక పూర్తి చేశాం. పంచాయతీ కార్యాలయాల్లో తుది ఓటర్లు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాలను ప్రకటించాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల కులగణ అంతా పారదర్శకంగా చేశాం. ఆయా వర్గాలకు ఉన్న ఓట్ల శాతాన్ని బట్టి రిజర్వేషన్లు ఉండడంతో చాలా జాగ్రత్తగా పూర్తిచేశాం. ప్రభుత్వం రిజర్వేషన్లపై తీసుకున్న నిర్ణయం ఆధారంగా ఎన్నికలు పక్కాగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. – రోళ్లకంటి విక్టర్, జిల్లా పంచాయతీ అధికారి, ఏలూరు -
కాంగ్రెస్, బీజేపీ ఓట్లకన్నా నోటా ఓట్లే ఎక్కువ
సాక్షి, అమరావతి: రాష్ట్ర జాతీయ పార్టీలకు లభించిన ఓట్లకంటే నోటా (నన్ ఆఫ్ ది ఎబవ్) ఓట్లే అధికంగా నమోదయ్యాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో నోటా ఓట్ల శాతాన్ని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమైంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు నోటా స్థాయిలో కూడా ఓట్లు పడలేదు. లోక్‌సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి కేవలం 1.29 శాతం ఓట్లు రాగా, మరో జాతీయ పార్టీ బీజేపీకి 0.96 శాతం ఓట్లు లభించాయి. అదే లోక్‌సభ నియోజకవర్గాల్లో నోటాకు మాత్రం 1.49 శాతం ఓట్లు నమోదయ్యాయి. అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలైన ఓట్లను పరిశీలించినా ఈ రెండు జాతీయ పార్టీల కన్నా నోటాకే ఎక్కువ ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు అసెంబ్లీ స్థానాల్లో 1.17 శాతం ఓట్లు రాగా.. బీజేపీకి 0.84 శాతం ఓట్లు లభించాయి. నోటాకు మాత్రం 1.28 శాతం ఓట్లు నమోదయ్యాయి. మరో పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు వైఎస్సార్సీపీ ఓట్లను చీల్చాలనే కుట్రతో బీఎస్పీ అభ్యర్థులను రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దింపారు. ఆ పార్టీకి కూడా నోటాకు వచ్చిన ఓట్ల శాతంలో సగం కూడా లేకపోవడం గమనార్హం. ఆ పార్టీకి రాష్ట్రంలోని లోక్‌సభ స్థానాల్లో కేవలం 0.26 శాతం ఓట్లు, అసెంబ్లీ స్థానాల్లో 0.28 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. జాతీయ పార్టీలైన సీపీఎం, సీపీఐలకు సైతం నోటా ఓట్లలో సగం కూడా రాలేదు. ఆ రెండు పార్టీలు జనసేనతో సీట్ల సర్దుబాటు చేసుకుని పోటీ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ స్థానాల్లో సీపీఐకి కేవలం 0.11 శాతం ఓట్లు రాగా, సీపీఎంకు 0.32 శాతం ఓట్లు వచ్చాయి. -
ముగ్గురి జాతకాన్ని మార్చిన నోటామీట!
సాక్షి, హైదరాబాద్: ‘నోటా’ముగ్గురు అభ్యర్థుల జాతకాన్ని తారుమారు చేసింది. బరిలో నిలిచిన అభ్యర్థుల భవితవ్యాన్ని ఈ చెల్లని ఓటు మార్చేసింది. పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చనప్పుడు (నన్ ఆఫ్ ది అబోవ్) ఓటర్లు ‘నో’చెప్పే ఆయుధం నోటా. ఈ ఓటు తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులకు చమటలు పట్టించింది. జహీరాబాద్, భువనగిరి, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాల్లో మెజార్టీకన్నా..నోటా మీటకే ఎక్కువ ఓట్లు పడ్డాయి. జహీరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ స్వల్ప ఓట్ల తేడాతో సమీప కాంగ్రెస్ అభ్యర్థి మదన్‌మోహన్‌రావుపై గెలుపొందారు. కేవలం 6,229 ఓట్లతో మదన్ మోహన్ ఓడిపోయారు. ఇక్కడ నోటాకు ఏకంగా 11,140 ఓట్లు పడ్డాయి.అలాగే, భువనగిరిలోను సేమ్ సీను చోటు చేసుకుంది. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అతి స్వల్ప అంటే 5,219 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్‌ను ఓడించారు. ఈ స్థానంలో నోటాకు 12,029 ఓట్లు వచ్చాయి. మల్కాజిగిరి లోక్‌సభ సెగ్మెంట్‌లోను నోటాకు భారీగా ఓట్లు పడ్డాయి. ఏకంగా 17,895 ఓట్లు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి ఎనుమల రేవంత్‌రెడ్డి 10,919 ఓట్లతో టీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖరరెడ్డిని ఓడించారు. నోటాకు పోలయిన ఓట్లలో కొన్ని తమకు పడినా గెలిచే వాళ్లమన్న బెంగ పరాజితులకు పట్టుకుంది. స్వల్ప ఓట్లతో ఓడిపోవడం ఒక ఎత్తయితే.. మెజార్టీ ఓట్లను ప్రభావితం చేసే స్థాయిలో నోటాకు పడడం వారిని కుంగదీసింది. 2014 ఎన్నికల్లో తొలిసారి ఈవీఎంలలో ఈ ఆప్షన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రవేశపెట్టింది. ఇలా నోటా ఆయుధం ఎలా ఉంటుందో అభ్యర్థులకు తెలిసివచ్చింది. వరంగల్‌లో అత్యధికం.. ఇందూరులో అత్యల్పం వరంగల్ పార్లమెంటరీ స్థానంలో నోటాకు అనూహ్యరీతిలో ఓట్లు పోలయ్యాయి. ఏకంగా 18,801 ఓట్లు రావడం విస్మయానికి గురిచేస్తోంది. ఈ నియోజకవర్గంలో ప్రధాన ప్రత్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా లేకపోవడంతోనే తటస్థ ఓటర్లు నోటావైపు మొగ్గు చూపినట్లు కనిపిస్తోంది. అలాగే, అతిపెద్ద నియోజకవర్గమైన మల్కాజిగిరిలోను నోటాకు గణనీయంగా ఓట్లు వచ్చాయి. 17,895 ఓట్లు రావడంతో ఇక్కడ అభ్యర్థుల భవితవ్యాన్ని ప్రభావితం చేసింది. ఇక దేశంలోనే అత్యధిక అభ్యర్థులు బరిలో నిలిచిన నిజామాబాద్‌లో మాత్రం ఓటర్లు పరిణితితో వ్యవహరించారు. అక్కడ రాష్ట్రంలోనే అత్యల్పంగా అంటే కేవలం 2,031 ఓట్లు మాత్రమే నోటాకు వచ్చాయి. ఈ సెగ్మెంట్లో 185 మంది పోటీపడ్డ సంగతి తెలిసిందే. -
‘నోటా’కు ఆదరణ!
ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజాతీర్పు వెల్లడై విజేతలెవరో, కానివారెవరో నిర్ధారణయింది. ఇవి మాత్రమేకాదు... తరచి చూస్తే వాటిల్లో ఇతరేతర ఆసక్తికర అంశాలు కూడా అనేకం ఉంటాయి. అందులో వెల్లువెత్తిన ఆకాంక్షలతోపాటు ఆగ్రహం, ఆవేదన, నిరసన, తిరస్కారం వంటివి కూడా కనిపిస్తాయి. ఈవీఎంలపై పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లతోపాటు చివరిలో ‘పైన పేర్కొన్న ఎవరూ సమ్మతం కాదు’(నన్ ఆఫ్ ద అబౌ–నోటా) అని చెప్పడానికి అదనంగా బటన్ ఏర్పాటు చేయాలని 2013లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈసారి ఎన్నికల్లో ఆ ‘నోటా’కు భారీయెత్తున 64 లక్షల ఓట్లు పోలయ్యాయని వచ్చిన కథనం గమనించదగ్గది. ‘నోటా’ గురించి సుప్రీంకోర్టులో పౌరహక్కుల ప్రజాసంఘం(పీయూసీఎల్) ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసినప్పుడు అప్పటి యూపీఏ ప్రభుత్వం చేసిన వాదన గుర్తు తెచ్చుకోవాలి. ఓటు హక్కు అనేది పౌరులకు ప్రాథమిక హక్కు కాదని, అది చట్టపరమైన హక్కు మాత్రమేనని వాదించింది. కానీ సుప్రీంకోర్టు ఆ వాదనను తోసి పుచ్చింది. ఎన్నికల్లో ఓటేయడం అనేది రాజ్యాంగంలోని 19(1)(ఎ) అధికరణ హామీ ఇస్తున్న భావ ప్రకటనా స్వేచ్ఛలోనూ, 21వ అధికరణ హామీ ఇస్తున్న జీవించే హక్కులోనూ, వ్యక్తిగత స్వేచ్ఛ లోనూ భాగమని తెలియజేసింది. అయితే ‘నోటా’కు అభ్యర్థులకు మించి ఓట్లు పడితే ఏం చేయా లన్న అంశంపై సర్వోన్నత న్యాయస్థానం చెప్పలేదు. చెప్పి ఉంటే జనాగ్రహం ‘నోటా’లో వెల్లువెత్తి పదే పదే ఎన్నికలు పెట్టే దుస్థితి ఏర్పడేది. ప్రజలెదుర్కొంటున్న పలు రకాల ఇబ్బందులు, వారికుండే సమస్యలు ఎన్నికల ప్రచార ఘట్టంలో ప్రస్తావనకొస్తే పాలకులకు తమ లోటుపాట్లు తెలిసివస్తాయి. కొత్తగా ప్రభుత్వంలో కొచ్చేవారికి వాటిపై దృష్టి పెట్టాలన్న ఆలోచన కలుగుతుంది. మౌలిక సదుపాయాలు కొరవడటం, అధిక ధరలు, ఉపాధి లేమి, వ్యవసాయ సంక్షోభం తదితర అంశాలు ప్రస్తావనకు రావడం లేదు. ప్రజల అవగాహనకు అందని రీతిలో ప్రత్యర్థులపై ఇష్టానుసారం నిందారోపణలు చేయడం, దూషించడం ముదిరిపోయింది. తాజా సార్వత్రిక ఎన్నికలను అధ్యయనం చేసిన ప్రజాతంత్ర సంస్కరణల సంఘం(ఏడీఆర్) దేశంలోని ప్రజాస్వామ్య ప్రక్రియపై పౌరుల్లో ఒకవిధమైన నైరాశ్య భావన ఏర్పడుతున్నదని, అందువల్లే ఎన్నికల సమయంలో ఉండే ఉద్వేగమూ, ఉత్సాహమూ ఈసారి కొడిగట్టిన సూచనలు కనబడ్డాయని తెలిపింది. ఓటర్లలో 46.8 శాతంమంది మెరుగైన ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యమిస్తే, ఆ తర్వాత వైద్యం, మంచినీటి సదుపాయం గురించి మాట్లా డారని... వీటిని ప్రధాన పార్టీలేవీ ప్రస్తావించకపోవడాన్ని ఎత్తిచూపారని వివరించింది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో ఓటేసినవారి శాతం గతంతో పోలిస్తే స్వల్పంగానైనా పెరిగింది. 2014లో అది 66.4 శాతం ఉంటే... ఈసారి అది 66.6 శాతానికి చేరుకుంది. కానీ ఎన్నికల సమయంలో ఒకరిని మించి ఒకరు ప్రసంగాలు చేయడం... ఆ తర్వాత తమ గోడు పట్టించుకోకపోవడం మామూలేనన్న అభిప్రాయం ఎక్కువమందిలో ఏర్పడుతోంది. తెలుగుదేశం పార్టీ 2014 మేనిఫెస్టోలో 600కు పైగా హామీలిచ్చింది. కానీ వాటిల్లో వేళ్లపైన లెక్కించదగ్గ సంఖ్యలోనైనా వాగ్దానాలను అమలు చేయలేక పోయింది. అయిదేళ్లు గడిచి మళ్లీ ఎన్నికలొచ్చేసరికి వీటన్నిటిపైనా జనం ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో పార్టీ వెబ్సైట్ నుంచి ఆ మేనిఫెస్టోనే గల్లంతు చేసింది. పూర్తి స్థాయిలో రుణ మాఫీ చేస్తామని చెప్పి ఇప్పుడు పాక్షిక మాఫీ గురించి మాత్రమే మాట్లాడుతున్నారేమని చంద్రబాబు నాయుడును ప్రశ్నిస్తే అప్పట్లో ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. నేనెప్పుడు చెప్పానంటూ దబా యించారు. ఇలా అవసరాన్నిబట్టి మాట మార్చడం, ఇష్టానుసారం పాలించడం, ఎన్నికలు ముంచు కొస్తున్నాయనేసరికి ఏదో ఒకటి చేసినట్టు కనబడాలని ఆదరా బాదరాగా ఏదో పథకం పేరిట వివిధ వర్గాలకు డబ్బు వెదజల్లడం ఆంధ్రప్రదేశ్‌లో బాహాటంగా చేశారు. ఇలాంటి పనులు సహజంగానే నాయకులపై అపనమ్మకాన్ని పెంచుతాయి. ఆగ్రహం తెప్పిస్తాయి. ప్రత్యామ్నాయం ఉన్నచోట ఇలాంటి నేతలకు జనం గట్టిగానే బుద్ధి చెబుతారు. ఆ పరిస్థితి లేదనుకున్నప్పుడు ఓటేయడంపైనే అనాసక్తి ఏర్పడుతుంది. కొందరు ‘నోటా’కు వేసి తమ నిరసన తెలియజెప్పాలనుకుంటారు. బిహార్‌లో ఈసారి 8 లక్షలమంది ‘నోటా’కు ఓటేశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆ రాష్ట్రంలోనే ‘నోటా’కు అధికంగా ఓట్లు పడ్డాయి. అక్కడున్న 40 స్థానాల్లో జేడీ(యూ)–బీజేపీ కూటమికి 33 స్థానాలు జనం కట్టబెట్టినా వారిలో చెప్పుకోదగ్గ స్థాయిలో అసంతృప్తి ఉన్నదని ఈ పరిణామం చెబుతోంది. ఆరు నెలలక్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాదని కాంగ్రెస్‌కు పట్టంగట్టిన రాజస్తాన్ ఓటర్లు ఈ సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి బీజేపీవైపు మొగ్గు చూపారు. ఆ రాష్ట్రంలోని 25 స్థానాలనూ ఆ పార్టీ చేజిక్కించుకుంది. కానీ అక్కడ ‘నోటా’కు పడిన ఓట్లు 3.27 లక్షలు! ఈ రెండు రాష్ట్రాల్లోనూ సీపీఐ, సీపీఎం, బీఎస్పీ వంటి పార్టీల కంటే ‘నోటా’కే అధికంగా ఓట్లు పడ్డాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇదే స్థితి పంజాబ్, హర్యానావంటిచోట్ల ఉంది. నేతల బూటకపు వాగ్దానాలు మాత్రమే కాదు... ఓటర్ల జాబితా రూపొందించడం దగ్గర నుంచి అడుగడుగునా అవక తవకలు తప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం నేతలు టెక్నాలజీ సాయంతో తమ పార్టీకి వ్యతిరేకులనుకున్నవారి ఓట్లు తొలగించడం, నకిలీ ఓటర్లతో జాబితాలు నింపడం వంటి అక్ర మాలకు పాల్పడ్డారని ఇటీవలికాలంలో బయటపడింది. ఓటర్ల జాబితా రూపకల్పనలో అవకతవక లకు పాల్పడినా, వాటిని తారుమారు చేయడానికి ప్రయత్నించినా కఠినంగా శిక్షించేలా...ఎన్నికల సమయంలో చేసే వాగ్దానాలను ఉల్లంఘించిన∙పార్టీలను అభిశంసించేలా చర్యలు తీసుకుంటే కొంతవరకైనా ఎన్నికల ప్రక్రియ గాడిన పడుతుంది. అలాగే నేతల వదరుబోతు ప్రసంగాలపై కఠి నంగా వ్యవహరించడం అవసరం. ఇవన్నీ అమలైనప్పుడే ఎన్నికలంటే ప్రజల్లో కలిగే ఏవగింపును, నిరాసక్తతతను నివారించడం సాధ్యమవుతుంది. -
అప్పట్లో ‘నోటా’దే అత్యధికం
సాక్షి, భైంసా : ‘నోటా’... ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవరు కూడా నచ్చకుంటే ఓటరు నిరభ్యంతరంగా తన వ్యతిరేకతను తెలిపేందుకు ఎన్నికల సంఘం ఈవీఎంలో ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన ఏర్పాటే నోటా. అభ్యర్థులెవరూ నచ్చకుంటే ఓటరు ఈవీఎంలో ఈ ‘నోటా’ బటన్ నొక్కి తన తీర్పునివ్వొచ్చు. ఇంత ప్రాధాన్యమున్న ‘నోటా’ మీటతో ఆదిలాబాద్ జిల్లాకు ప్రత్యేక సంబంధం ఉంది. ఎలాగంటే.. 2014లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఆ ఎన్నికల్లో ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలో నోటా ఓట్లు 17,041 వచ్చాయి. అప్పట్లో తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఆదిలాబాద్ లోక్‌సభ స్థానంలోనే నోటా ఓట్లు అత్యధికంగా రావడం ఓ సంచలనంగా మారింది. ఆదిలాబాద్ లోక్‌సభ స్థానం పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో మొత్తం 10,47,024 ఓట్లు పోలవగా, నోటాకు 17041 ఓట్లు వచ్చాయి. అవగాహన లేకపోవడం వల్లే! విద్యావంతులు, ఉద్యోగులు, మేధావులు రాజకీయాల్లోని అవినీతి, అక్రమాలు, నాయకుల నేరచరిత్ర, అభ్యర్థుల గుణగణాలపై అవగాహన ఉండి ప్రశ్నిస్తారు. అంటే, మేధావి వర్గమే ఎన్నికల్లో నోటా వినియోగించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ, 2014 ఎన్నికల్లో నోటాకు రాష్ట్రంలోనే అత్యధికంగా ఓట్లు రావడం కేవలం ఓటర్ల అవగాహనరాహిత్యం వల్లే కావొచ్చని భావించారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థానంలో షెడ్యూల్ తెగలు, సామాజికవర్గానికి కేటాయించిన ఆసిఫాబాద్, బోథ్, ఖానాపూర్ నియోజకవర్గాల్లోనూ నోటా ఓట్లు అధికంగా నమోదయ్యాయి. రాజకీయచైతన్యం, అక్షరాస్యత అంతగాలేని గిరిజనులు అవగాహన లేమితో నోటా బటన్ నొక్కి ఉంటారని నిపుణులు నాడు అభిప్రాయపడ్డారు. -
అందరి ‘నోటా’ వింటున్న మాట
సాక్షి, శ్రీకాకుళం: మాటలు మార్చేవారు కొందరు... ప్రలోభాలు పెట్టేవారు ఇంకొందరు... నేర చరిత్ర కలిగినవారు మరికొందరు... ఇటువంటి లక్షణాలు కలిగిన రాజకీయ పార్టీల నేతలను ఓటర్లు నోటా రూపంలో తిరస్కరిస్తున్నారు. జిల్లాలో పది అసెంబ్లీ స్థానాలకుగాను 2014 సార్వత్రిక ఎన్నికల్లో 8,998 ఓట్లు, శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి 6,133 ఓట్లు నోటాకు పడ్డాయి. ఈ విధానం తక్కువ మెజారిటీతో గెలిచిన అభ్యర్థులు, అక్కడ ఓడిన అభ్యర్థుల తలరాతను మార్చేసింది. ఈ దఫా నోటా ఓట్లు కూడా పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. అలాగైతే పోటీలో నిలిచిన అభ్యర్థుల భవిత నోటా ఓటుపై ఆధారపడి ఉంది. ► ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవ్వరూ నచ్చకపోతే, ఓటు ఎవ్వరికి వేయాలన్న సందిగ్ధంలో చాలా మంది పోలింగ్ కేంద్రానికి రావడం మానేస్తున్నారు. ఆ సందేహాన్ని వీడుతూ అందర్ని పోలింగ్ కేంద్రానికి రప్పించేందుకు 2014లో ఎన్నికల సంఘం ఈవీఎంల్లో కొత్తగా ఒక బటన్‌ను పరిచయం చేసింది. దాని పేరు నోటా. అంటే ‘నన్ ఆఫ్ ది ఎబౌ’ (పై వారిలో ఎవ్వరూ లేరు) ఈవీఎంలో చివరి బటన్‌ను నోటాకు కేటాయించారు. అర్హులైన అభ్యర్థులు లేరని ఓటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేందుకు నోటా మీటను ఉపయోగించుకుంటున్నారు. పరిచయమైన తొలి సంవత్సరం ఎన్నికల్లోనే నోటాను లక్షల మంది ఓటర్లు వినియోగించుకున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో జిల్లాలో అసెంబ్లీ స్థానాల వారీగా పడిన నోటా ఓట్లు అసెంబ్లీ స్థానం నోటా ఓట్లు ఇచ్ఛాపురం 951 పలాస 934 టెక్కలి 770 పాతపట్నం 928 శ్రీకాకుళం 1,106 ఆమదాలవలస 665 ఎచ్చెర్ల 749 నరసన్నపేట 819 రాజాం 694 పాలకొండ 1,382 2009 ఎన్నికల్లోనే అనుకున్నా... వాస్తవానికి 2009 ఎన్నికల్లోనే నోటాను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఎన్నికల సంఘం తొలిసారి సుప్రీం కోర్టుకు వివరించింది. అప్పటి ప్రభుత్వం దీనిని వ్యతిరేకించినా, పౌరహక్కుల సంస్థ, పీయూసీఎల్ దీనికి మద్దతుగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ఎట్టకేలకు ఎన్నికల్లో నోటాను అమలులోకి తీసుకురావాలంటూ 2013 పెప్టెంబర్ 27న సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో 2014 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా నోటా బటన్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 1.1 శాతం అంటే 60 లక్షల మంది ఓటర్లు నోటాకు ఓటు వేశారు. ఆ తర్వాత పలు అసెంబ్లీ స్థానాల ఎన్నికల్లో నోటాకు ఓటే వేసే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. దీంతో పోటీలో నిలిచిన అభ్యర్థులకు, రాజకీయ పార్టీలకు కలవరం ఎక్కువైంది. కొన్ని ప్రాంతాల్లో ఓడిన, గెలిచిన అభ్యర్థుల మధ్య ఉన్న ఓట్లు తేడా కంటే నోటా ఓట్లు ఎక్కువగా పోలవుతుండటం గమనార్హం. పక్కనే తెలంగాణాలో నోటా ఓట్లు పెరిగాయి. 2014 ఎన్నికల్లో 1.25 లక్షల మంది నోటా ఓట్లు పోలవ్వగా, ఇటీవల జరిగిన ఎన్నికల్లో 2.2 లక్షల ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓటింగ్ శాతంలో నోటా ఏడో స్థానంలో ఉంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నోటా ఓటు జిల్లాలో పడింది. శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం పరిశీలిస్తే, నోటాకు 0.54 శాతం ఓట్లు పడ్డాయి. అంటే పోలైన ఓట్లలో నోటాకు 6,133 ఓట్లు పడ్డాయి. నోటాకి ఎందుకు వేయాలి.. ఆలోచించండి నోటాను విలువైన ఓటుగా పరిగణిస్తున్నామని ఎన్నికల సంఘం చెప్పింది. అభ్యర్థుల ఓట్లు కంటే ఎక్కువ నోటాకి వస్తే, తర్వాత స్థానంలో ఉన్న అభ్యర్థిని విజేతగా ప్రకటించాలని ఈసీ నిర్ణయించింది. కాని అభ్యర్థుల కంటే నోటా ఓట్లు ఎక్కువ పోలైతే, మరోసారి ఎన్నికలు నిర్వహించి, ఆ అభ్యర్థులు కాకుండా వేరే వారిని నిలపాలన్న డిమాండ్ ఊపందుకుంది. ఆ ఎన్నికల ఖర్చంతా ఆ రాజకీయ పార్టీలే భరించేలా చట్టాన్నీ చేయాలని పౌర సంఘాలు కోరుతున్నాయి. ఈ నేపథ్యంలో 2014 ఎన్నికల తర్వాత పోలైన ఓట్ల జాబితాల్లో నోటాని చేర్చి ఎన్నికల సంఘానికి ఆయా జిల్లాల నుంచి పంపించారు. అయితే నోటా విలువైన ఓటు కాదని ఆ వివరాలు విడిగా పంపించాలని, రాష్ట్ర ఎన్నికల సంఘాల కార్యాలయం నుంచి జిల్లా ఎన్నికల అధికారులకు, రిటర్నింగ్ అధికారులకు సమాచారం రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. తమ అభిప్రాయాన్ని తెలియజేసేందుకు నోటాను ఒక విలువైన ఓటుగా భావించిన ఓటరు కంగుతిన్నారు. దీనిపై నిరసన వ్యాఖ్యలు వినిపించాయి. అందుకే ఓటుహక్కును ఏ విధంగాను దుర్వినియోగం చేయకుండా ఉన్న అభ్యర్థుల్లో మంచి అభ్యర్థికి ఓటు వేస్తే, ప్రజాస్వామ్య వ్యవస్థలో పెనుమార్పులు వచ్చే అవకాశం ఉన్నాయి. ఓటుహక్కు వినియోగించుకోవాలి. ఓటుహక్కు వజ్రాయుధం వంటిది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల్లో ఎవ్వరూ సమర్థుల్లో.. మంచివారో.. ప్రజలకు మేలు చేసేవారెవరు వంటి గుణగణాలు పరిశీలించాలి. ఇవేమీ నచ్చకుంటే నోటాకు ఓటు వేయొచ్చు. అయితే దీనివల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఈ విధానం కేవలం వ్యతిరేకత చూపించడానికే పనికొస్తుంది. ప్రజాస్వామ్యంతో ఓటుతోనే ప్రగతి సాధించాలి. అందుకే ప్రతిఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలి, ప్రలోభాలకు దూరంగా ఉండాలి. – కూన అచ్యుతరావు, అసిస్టెంట్ ప్రొఫెసర్, బీఆర్‌ఏయూ -
ఎవరూ నచ్చలేదు..
మంచిర్యాలటౌన్: ఎన్నికల్లో తమకు నచ్చిన అభ్యర్థులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేందుకు ఓటు ఆయుధమైతే.. అభ్యర్థుల్లో ఎవరూ నచ్చలేదని తమ అభిప్రాయాన్ని వ్యక్తపర్చేందుకు ‘నోటా’తో అవకాశం కలిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా 20,255 మంది ‘నోటా’ నొక్కి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో తమకు ఎవరూ నచ్చలేదని స్పష్టం చేయడం విశేషం. గతంలో ఎన్నికల్లో గెలిచిన వారిలో ఎవరు మనకు సేవ చేస్తారో, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తారో వారికి మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం ఉండేది. అప్పుడు ఎన్నికల్లో పోటీచేసే వారు ప్రజల మధ్య నుంచి వచ్చినవారే ఉండడంతో దానిపై ప్రజలు అంతగా పట్టించుకోలేదు. ఇక రోజులు మారుతున్న కొద్దీ చాలా మంది రాజకీయాల్లోకి రావడం, ఎన్నికల్లో పోటీ చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలన్న రాజ్యాంగం కల్పించిన హక్కు ఓ వైపు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చక ఎవరికి ఓటు వేయాలో తెలియని పరిస్థితిలో ఎవరో ఒకరికి ఓటు వేసే సంస్కృతికి ఎన్నికల సంఘం స్వస్తి పలికింది. దీంతో 2014లో జరిగిన ఎన్నికల్లో నోటా (నన్ ఆప్ ది ఎబోవ్)ను ప్రవేశపెట్టింది. ‘పైన తెలిపిన అభ్యర్థులు ఎవరూ నాకు నచ్చలేదు’ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే అవకాశాన్ని ఓటర్లకు కల్పించింది. దీంతో ప్రజల్లోనూ తమ కు నచ్చని అభ్యర్థికి ఇక తాము ఓటు వేయాల్సిన అవసరం లేదని, ఎవరూ నచ్చలేదని ‘నోటా’కు వేసే అవకాశం కలగడంతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ముందుకు వస్తున్నారు. స్వతంత్రులు, పలు పార్టీల నేతలకు నోటాకు వచ్చిన ఓట్లు కూడా ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల అభ్యర్థులకు రాకపోవడం గమనార్హం. గతం కంటే పెరిగిన నోటా ఓట్లు మన దేశంలో నోటాను తొలిసారిగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రవేశపెట్టారు. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు ఎవరూ తమకు నచ్చలేదని తెలిపేందుకు ప్రవేశపెట్టిన నోటాను ప్రజలు ఆదరించారు. 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో నోటాకు ప్రజలు పట్టం కట్టారు. ప్రధాన పార్టీలు, స్వతంత్రులు, చిన్న పార్టీల నాయకులకు కనీసం రాని ఓట్లు నోటాకు వచ్చాయంటే, నోటా ప్రభావం ఏమేర చూపిందో అర్థమవుతోంది. నోటా వల్ల ఓటింగ్ శాతం పెరిగినట్లుగా కనబడుతున్నా, అభ్యర్థులకు వచ్చే ఓట్లు మాత్రం తగ్గిపోతున్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నోటాకు 2,715 ఓట్లు మొన్నటి ఎన్నికల్లో వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆత్రం సక్కు చేతిలో కేవలం 171 ఓట్లతో ఓడిపోయారు. నోటాకు వచ్చిన ఓట్లలో కొన్నింటిని కోవ లక్ష్మి సాధించినా విజయం వరించేదేమో! 2014లో ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాలకు 17,905 నోటాకు రాగా, 2018లో 20,255 ఓట్లు నోటాకు వచ్చాయి. గత ఎన్నికల కంటే 3,160 ఓట్లు నోటాకు పెరిగాయి. ఉద్యోగస్తులు సైతం పోస్టల్ బ్యాలెట్లో వారికి ఏ అభ్యర్థి నచ్చలేదంటూ 2014 ఎన్నికల్లో నోటాకు 67 మంది ఓటు వేయగా, ఈసారి ఎన్నికల్లో 187 మంది నోటాను వినియోగించుకున్నారు. -
ఉమ్మడి ఆదిలాబాద్‌లో నోటాకు పెరిగిన ఓట్లు
మంచిర్యాలటౌన్: ఎన్నికల్లో తమకు నచ్చిన అభ్యర్థులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకునేందుకు ఓటు ఆయుధమైతే.. అభ్యర్థుల్లో ఎవరూ నచ్చలేదని తమ అభిప్రాయాన్ని వ్యక్తపర్చేందుకు ‘నోటా’తో అవకాశం కలిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఏకంగా 20,255 మంది ‘నోటా’ నొక్కి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో తమకు ఎవరూ నచ్చలేదని స్పష్టం చేయడం విశేషం. గతంలో ఎన్నికల్లో గెలిచిన వారిలో ఎవరు మనకు సేవ చేస్తారో, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్తారో వారికి మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం ఉండేది. అప్పుడు ఎన్నికల్లో పోటీచేసే వారు ప్రజల మధ్య నుంచి వచ్చినవారే ఉండడంతో దానిపై ప్రజలు అంతగా పట్టించుకోలేదు. ఇక రోజులు మారుతున్న కొద్దీ చాలా మంది రాజకీయాల్లోకి రావడం, ఎన్నికల్లో పోటీ చేయడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. దీంతో ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలన్న రాజ్యాంగం కల్పించిన హక్కు ఓ వైపు, ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు నచ్చక ఎవరికి ఓటు వేయాలో తెలియని పరిస్థితిలో ఎవరో ఒకరికి ఓటు వేసే సంస్కృతికి ఎన్నికల సంఘం స్వస్తి పలికింది. దీంతో 2014లో జరిగిన ఎన్నికల్లో నోటా (నన్ ఆప్ ది ఎబోవ్)ను ప్రవేశపెట్టింది. ‘పైన తెలిపిన అభ్యర్థులు ఎవరూ నాకు నచ్చలేదు’ తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే అవకాశాన్ని ఓటర్లకు కల్పించింది. దీంతో ప్రజల్లోనూ తమకు నచ్చని అభ్యర్థికి ఇక తాము ఓటు వేయాల్సిన అవసరం లేదని, ఎవరూ నచ్చలేదని ‘నోటా’కు వేసే అవకాశం కలగడంతో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు ముందుకు వస్తున్నారు. స్వతంత్రులు, పలు పార్టీల నేతలకు నోటాకు వచ్చిన ఓట్లు కూడా ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల అభ్యర్థులకు రాకపోవడం గమనార్హం. గతం కంటే పెరిగిన నోటా ఓట్లు మన దేశంలో నోటాను తొలిసారిగా 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రవేశపెట్టారు. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు ఎవరూ తమకు నచ్చలేదని తెలిపేందుకు ప్రవేశపెట్టిన నోటాను ప్రజలు ఆదరించారు. 2014, 2018 శాసనసభ ఎన్నికల్లో నోటాకు ప్రజలు పట్టం కట్టారు. ప్రధాన పార్టీలు, స్వతంత్రులు, చిన్న పార్టీల నాయకులకు కనీసం రాని ఓట్లు నోటాకు వచ్చాయంటే, నోటా ప్రభావం ఏమేర చూపిందో అర్థమవుతోంది. నోటా వల్ల ఓటింగ్ శాతం పెరిగినట్లుగా కనబడుతున్నా, అభ్యర్థులకు వచ్చే ఓట్లు మాత్రం తగ్గిపోతున్నాయి. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో నోటాకు 2,715 ఓట్లు మొన్నటి ఎన్నికల్లో వచ్చాయి. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోవ లక్ష్మి తన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆత్రం సక్కు చేతిలో కేవలం 171 ఓట్లతో ఓడిపోయారు. నోటాకు వచ్చిన ఓట్లలో కొన్నింటిని కోవ లక్ష్మి సాధించినా విజయం వరించేదేమో! 2014లో ఉమ్మడి జిల్లాలోని 10 నియోజకవర్గాలకు 17,905 నోటాకు రాగా, 2018లో 20,255 ఓట్లు నోటాకు వచ్చాయి. గత ఎన్నికల కంటే 3,160 ఓట్లు నోటాకు పెరిగాయి. ఉద్యోగస్తులు సైతం పోస్టల్ బ్యాలెట్లో వారికి ఏ అభ్యర్థి నచ్చలేదంటూ 2014 ఎన్నికల్లో నోటాకు 67 మంది ఓటు వేయగా, ఈసారి ఎన్నికల్లో 187 మంది నోటాను వినియోగించుకున్నారు. ఉమ్మడి జిల్లాలో వచ్చిన నోటా ఓట్లు నియోజకవర్గం 2014లో 2018లో సిర్పూర్ 1,752 1,579 చెన్నూరు 1,609 2,135 బెల్లంపల్లి 769 2,598 మంచిర్యాల 1,472 1,394 ఆసిఫాబాద్ 2,829 2,715 ఖానాపూర్ 2,421 2,776 ఆదిలాబాద్ 850 1,149 బోథ్ 2,242 2,275 నిర్మల్ 1,360 1,367 ముథోల్ 1,791 2,267 మొత్తం 17,095 20,255 -
ఖమ్మంలో.. నోటాకు మూడో స్థానం
ఖమ్మం, మయూరిసెంటర్: ఖమ్మం నియోజకవర్గంలో ఓటర్లు ఈ ఎన్నికల్లో భిన్నంగా ఆలోచించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులను సైతం కాదని నోటా వైపు మొగ్గు చూపారు. ఖమ్మం నియోజకవర్గంలో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా టీఆర్ఎస్ నుంచి పువ్వాడ అజయ్‌కుమార్, టీడీపీ నుంచి నామ నాగేశ్వరరావు, బీజేపీ నుంచి ఉప్పల శారద, బీఎల్పీ నుంచి పాల్వంచ రామారావు పోటీ చేయగా పోటీ అంతా టీఆర్ఎస్, టీడీపీల మధ్యనే జరిగింది. నియోజకవర్గంలో పోస్టల్ బ్యాలెట్, ఈవీఎంలలో పోలైన ఓట్లు 2,06,428. మొదటి నుంచి గట్టి పోటీదారులుగా ఉన్న పువ్వాడ అజయ్‌కుమార్ 1,02,760 ఓట్లు సాధించగా, నామ నాగేశ్వరరావు 91,769 ఓట్లు సాధించారు. వీరిద్దరు మినహా ఇతర పార్టీల అభ్యర్థులు కనీస ఓట్లను కూడా సాధించలేకపోయారు. మిగిలిన ప్రధాన పార్టీల అభ్యర్థులను వెనక్కి నెట్టి నోటా నియోజకవర్గంలో మూడవ స్థానంలో నిలిచింది. నోటా దెబ్బకి బీజేపీ, బీఎల్పీ అభ్యర్థులు 4, 6 స్థానాలల్లో నిలిచారు. ఇక బీఎస్పీ, పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పార్టీల అభ్యర్థులు సైతం కనీస ఓట్లను పొందలేకపోయారు. అయితే నోటాకు ఖమ్మం నియోజకవర్గంలో గతం కంటే ఈ దపా ఓట్లు పెరిగాయి. 2014 ఎన్నికల్లో 1,408 మంది పోటీలో ఉన్న అభ్యర్థులు సరైనవారు కాదని నోటాకు ఓటు వేయగా, ఈసారి 3,513 మంది నోటాను నొక్కి పోటీలో ఉన్న అభ్యర్థులు సరైన వారు కాదని భావించారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులు పలువురు నోటాను ఎంచుకున్నారు. ఖమ్మం నియోజకవర్గంలో 19 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నోటాకు పోలయ్యాయి. దీంతో ఎన్నిక ఎన్నికకు నోటాకు ఆదరణ పెరుగుతుంది. నోటాకు ఉన్న ఆదరణ ప్రధాన పార్టీల అభ్యర్థులకు కూడా దక్కడం లేదని నియోజకవర్గ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. -
అఫిడవిట్ రూపంలో వాగ్దానాలు
ఎన్నికల హోరు ముగి సింది. పోటీలో వాగ్దానాల జడివాన గుర్తులు కూడా ఇక కనిపించవు. ఆ వాగ్దానాలు గెలిచిన పార్టీ చేసినవే అయినా, ఓడిన పార్టీ చేసినవయినా, లేక గెలిచిన అభ్యర్థి లేదా ఓడిన అభ్యర్థి చేసిన వాగ్దానాలయినా సరే వాటికి విలువ ఉండాలి కదా. రాజకీయ పార్టీలు కొన్ని వాగ్దానాలు చేస్తాయి. అభ్యర్థులు కూడా వాగ్దానాలు చేస్తూ ఉంటారు. తమను ఎన్నుకున్న ప్రజలకు ఏమీ చేయలేకపోతున్నామని గెలిచిన అభ్యర్థులు అధికార పార్టీలోకి జంప్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది ఎంత అవినీతికరమైన పనో చెప్పలేం. కనీసం ఫిరాయింపు నిషేధ చట్టం ప్రయోగించడానికి కూడా రాజకీయ నాయకులు ముందుకు రావడం లేదు. పదవుల ఆశ చూపి ఫిరాయింపులు చేయడం ఎందుకు అవినీతికరమైన నేరం కాదో ఆ నాయకులు చెప్పాలి. పదవికోసం తనను నిలబెట్టిన పార్టీకి, ఎన్నుకున్న ప్రజలకు ఏ విధంగా ద్రోహం చేశారో వారే వివరణ ఇచ్చుకోవాలి. ఫిరాయించినా, ఫిరాయించకపోయినా ప్రజాప్రతినిధులకు తమను ఎన్నుకున్న ఓటర్ల పట్ల బాధ్యత ఉంటుందని మరవడానికినీ వీల్లేదు. నిజానికి వాగ్దానాలు చేసి ఓడిన అభ్యర్థి కూడా మళ్లీ రాజకీయాల్లో ఉండదలచుకుంటే, మరోసారి బరిలో నిలబడదలచుకుంటే అయిదేళ్లపాటు నియోజకవర్గంలో ఉండి సేవలు చేసి ప్రజాభిమానం చూరగొనాలి. అంతేకాదు. తను ఏ సేవలు చేస్తానని వాగ్దానం చేశాడో, ఆ సేవలు వారికి అందించడానికి ఒక నాగరికుడిగా, నాయకుడిగా కృషి చేయాలి. ఈ ఎన్నికల పోరాటంలో మూడింట రెండువంతుల స్థానాలు గెలిచిన తెలంగాణ రాష్ట్రసమితి కొత్త తెలంగాణ రాష్ట్రానికి రెండో ప్రభుత్వాన్ని ఇవ్వబోతున్నది. చేసిన వాగ్దానాలన్నింటినీ అమలుచేసి తీరతానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ప్రతిపక్ష స్థానాలకు పరిమితమైన కూటమి కూడా తమ వాగ్దానాలలో అధికార పార్టీ చేసిన వాగ్దానాలతో సమానమైనవి ఏవైనా ఉంటే వాటి అమలుకు కృషి చేయవలసి ఉంటుంది. పోటీ చేసే అభ్యర్థుల పూర్తి సమాచారాన్ని తెలుసుకునే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. శాసనసభకు పోటీచేస్తున్న మాజీ ముఖ్యమంత్రి సమాచారం దేశం మొత్తానికి తెలియజేయాలి. శాసనసభ ఏదో ఒక నియోజకవర్గానికి పరిమితం కాదు. మొత్తం రాష్ట్రానికి చెందినది. కనుక అందులో సభ్యులుగా ఉండదలచుకున్న వారి నేర చరిత్ర, ఆర్థిక స్థాయి, చదువు సంధ్యల గురించి ప్రతి ఓటరుకు, ప్రతి పౌరుడికీ తెలియవలసిందే అని 2002లో సుప్రీంకోర్టు నిర్దేశిం చింది. ప్రతి అభ్యర్థితో ఈ సమాచారం ఇప్పించేం దుకు ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సవరణ చేయాలని సూచించింది. కానీ అందరూ కలిసి అప్పటి బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ సంకీర్ణం ద్వారా సవరణ చట్టం తెచ్చి, సుప్రీంకోర్టు ఏమి చెప్పినా సరే ఆ సమాచారం ఇవ్వనవసరం లేదన్నారు. మళ్లీ సుప్రీంకోర్టు ఈ సవరణ రాజ్యాంగ విరుద్ధమని కొట్టి వేసింది. అప్పటినుంచి పౌరులందరికీ ఈ సమాచారం ఒక హక్కుగా లభిస్తున్నది. కానీ పౌరుల బాధ్యత ఏమిటి? పార్టీల బాధ్యత ఏమిటి? పార్టీలయితే నేరగాళ్లను ఎన్నికలలో నిలబెట్టకూడదు. ఒకవేళ నిలబెట్టినా జనం వారికి ఓట్లేయకూడదు. ఈ నేరగాళ్లు చేసిన వాగ్దానాలను ఓటర్లు నమ్మాలా? లేక ఈ నేరగాళ్లను నిలబెట్టిన పార్టీ చేసిన వాగ్దానాలను నమ్మాలా? వారికే ఓటు వేయాలా? ఇదే జనం ముందున్న సంది గ్ధత. పోటీలో ఉన్న రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులూ నేరచరితులే అయితే, వారిమీద కేసులు ఇంకా నడుస్తూ ఉండి ఉంటే వారికే ఓటు వేయడం న్యాయమా? నోటా మీట నొక్కవలసిందేనా? అప్పుడు నోటానే గెలిస్తే ఏమవుతుంది? మళ్లీ ఎన్నికలు జరుగుతాయా? జరిగితే మళ్లీ వీళ్లే పోటీ చేస్తే ఏం చేయాలి? చేసిన వాగ్దానాలను నెరవేర్చారా లేదా? అనే సమాచారం కూడా ఈ నేతలు ఇవ్వాలి. సొంతంగా తామే ఇవ్వాలి. అదీ అఫిడవిట్ రూపంలో ఇవ్వాలి. నేను లేదా నా పార్టీ గతసారి ఎన్నికల్లో ఈ వాగ్దానాలు చేశాం అని ఒక కాలంలో రాసి, దాని పక్క కాలంలో అమలు చేశాను లేదా చేయలేదు అని కూడా రాయాలి. ఒకవేళ వాగ్దానాలు అమలు చేయకపోతే ఆ విషయం కూడా జనానికి తెలియజేయాలి. ఎన్నికల కమిషన్ అధికారులు దీన్ని పరిశీలించి అమలు చేసిన, చేయని హామీల వివరాలు జనానికి తెలియజేయాలి. ఈ మార్పు వల్ల వాగ్దానాల అమలు ప్రాతిపదిక మీద ఓటర్లకు ఓటు వేసే అవకాశం, అధికారం ఏర్పడుతుంది. అభ్యర్థులు కూడా వాగ్దానాలు అమలు చేతగాక పోతే. మళ్లీ పోటీ చేయడానికి సిగ్గు పడే స్థితి వస్తుంది. పార్టీ వాగ్దానాలను లెక్క గట్టి అమలుకానివి ఎత్తి చూపి, ఇదీ వీరి స్థితి అని నిలదీసి ఓడించే అవకాశం వస్తుంది. వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, కేంద్ర మాజీ సమాచార కమిషనర్ ఈ-మెయిల్: professorsridhar@gmail.com -
మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో విజయ్ దేవరకొండ
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. అర్జున్ రెడ్డి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో తెలుగుతో పాటు ఇతర భాషల మీద కూడా దృష్టి పెడుతున్నాడు. ఇప్పటికే నోటా సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన విజయ్, బాలీవుడ్ లోనూ త్వరలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం విజయ్ దేవరకొండ మరో తమిళ సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్ ఆసక్తికర చిత్రాలను తెరకెక్కిస్తున్న డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ శ్రీ కార్తీక్ ను దర్శకుడి పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో విజయ్ హీరోగా నటించనున్నాడు. ఈ సినిమాలో ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణతో పాటు యోగిబాబులు నటించనున్నారు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో అధికారిక ప్రకటన వెలుడనుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ సినిమాతో పాటు క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమాలో నటిస్తున్నాడు. -
పెరుగుతున్న ‘నోటా’ కోటా
మెదక్ అర్బన్: ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు నచ్చకపోతే ఓటర్లు నచ్చలేదని తెలియచేసేందుకు 2014 ఎన్నికల్లో భారత ఎన్నికల సంఘం అవకాశాన్ని కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)లపై అభ్యర్థి గుర్తుతో పాటు నోటా ( నన్ ఆఫ్ ది ఎబోవ్) అనే ఆప్షన్‌ను ఏర్పాటు చేసింది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటిసారిగా ఎన్నికల కమిషన్ నోటాను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులకు ప్రతీ ఓటు విలువైనదే. నోటా రావడానికి ముందు పోటీ చేసిన అభ్యర్థులు నచ్చకుంటే ఓటు హక్కును వినియోగించుకునేవారు కాదు. జిల్లాలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో మెదక్, నర్సాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 3,32,742 ఓట్లు పోలయ్యాయి. దీంట్లో నోటాకు మెదక్ నియోజకవర్గంలో 1,602 నర్సాపూర్ నియోజకవర్గంలో 1,228 ఓట్లు పోలయ్యాయి. 2,830 మంది ఓటర్లు నోటాను నొక్కి పోటీ చేస్తున్న అభ్యర్థి ఎవరూ తమకు నచ్చలేదని స్పష్టం చేశారు. అధికారులు నోటా గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించి ఓటర్లు ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాలకు రావాలని, అభ్యర్థులు నచ్చని పక్షంలో తిరస్కరించవచ్చని అవగాహన కల్పించారు. 2014 ఎన్నికల్లో మెదక్ నియోజకవర్గంలో ఎక్కువగా నోటా ఓట్లు పోలయ్యాయి. నోటాను ఎంత ఎక్కువ మంది వాడితే పోటీలోఉన్న అభ్యర్థులు అంత మంది ఓటర్లకు నచ్చనట్లు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. అభ్యర్థులు ఎవరూ నచ్చనట్లయితే తిరస్కరించే అవకాశం ఓటరుకు ఉండాలని పలు స్వచ్ఛంద సంస్థలు, సా మాజిక సేవా విభాగాలు కోరుతూ వస్తున్న తరుణంలో నోటాను అందుబాటులోకి తీసుకురావా లని ఎన్నికల సంఘం 2009లో మొదటిసారిగా సుప్రీం కోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించినా పలుసంస్థలు, ప్రజాసంఘాలు మ ద్దతు ప్రకటించాయి. ఈ పరిస్థితుల మధ్య నోటా ను అమలులోకి తీసుకురావాలని సుప్రీం కోర్టు 2013 సెప్టెంబరు 27న తీర్పును వెలువరించింది. 2014 ఎన్నికల్లో.. పోలైన ఓట్లు నోటా ఓట్లు మెదక్ 1,57,572 1,602 నర్సాపూర్ 1,75,170 1,228 భద్రత దృష్ట్యా వెనక్కి.. వాస్తవానికి అభ్యర్థులు ఎవరూ ఓటర్లకు నచ్చకుంటే తిరస్కరణ ఓటు హక్కును భారత రాజ్యా ంగం ఎప్పుడో కల్పించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 49 (ఓ) కింద ఓటర్లు ఈ హక్కును వినియోగించుకునే వీలుంది. పోలింగ్‌బూత్‌లోని ప్రిసైడింగ్ అధికారి వద్దకు వెళ్లి దీనికి కోసం 17–ఏ ఫారంను తీసుకొని ఫలానా అభ్యర్థిని తిరస్కరిస్తున్నట్లు పేర్కొంటూ సంతకం లేదా వేలిముద్ర వేసి బ్యాలెట్ బాక్స్‌లో వేసే అవకాశం ఉండేది. రహస్య ఓటింగ్‌కు ఇది విరుద్దమని ఓటరు భద్రత దృష్ట్యా ఇది సరైంది కాదన్న వ్యతిరేకత ఉండేది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లు (ఈవీ ఎం)లు అందుబాటులోకి రావడంతో నోటాను ఎన్నికల సంఘం మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లో మెదక్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో ఎంత మంది నోటాను వినియోగించుకుంటారనే విషయం ఆసక్తికరంగా మారింది. ఓటు హక్కుపై ప్రస్తుతం యువతతో పాటు ప్రతి ఒక్కరికి అవగాహన ఉండటం, పోటీ చేస్తున్న రాజకీయ నాయకుల గురించి అంతా తెలిసి ఉండటంతో నోటాను వినియోగించేందుకు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. -
ఓటు వజ్రాయుధం (పాట)
పల్లవి : ఓటమ్మా... నీకు దండమే నా మాట వింటవా ఓటమ్మా చరణం 1 : ప్రజాస్వామ్యానికి నీవు ప్రతిరూపమే...ఓటమ్మా ఐదేళ్లకోసారి నీవు ఓట్ల పండుగై వస్తున్నావÐమ్మా అందరినొకసారి పలుకరిస్తవే నీవు నీ పండుగైపోయాక మాటాడవెందుకే ఓటమ్మా – ఓటమ్మా... నీకు చరణం 2 : రాముని చేతిలో బాణం.. నీవమ్మా విష్ణు చేతిలో చక్రములే తిరుగుతున్నావు నోటుకు, మత్తుకు, కులాల కుంపట్ల మధ్య నీవు వజ్రాయుధమే నీవు ఓటమ్మా అమ్ముడు పోకే ఓటమ్మా – ఓటమ్మా...నీకు చరణం 3 : అంబేద్కరూ కలం చేత నీవు జ్ఞానమై వెలిగిన ఓటమ్మా ఈ జగతిలో బ్రహ్మాస్త్రం నీవు ఓటేసే మహాశయులారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుదాము ఆలోచించి ఓటు వేయీ నీవు అప్పుడే ఓటమ్మా ఎల్లకాలం ఉంటుంది – ఓటమ్మా...నీకు – పానుగంటి నాగన్న, జానపద కళాకారుడు, వెంకటాపురం, వనపర్తి -
ప్రజాస్వామిక నిరసన.. నోటా!
(సాక్షి వెబ్ ప్రత్యేకం) దశాబ్దం కిందట పురుడుపోసుకున్న ఒక ఆలోచన. ఐదేళ్ల కిందట అమలుకు నోచుకున్న ఒక ఆయుధం. ప్రజాస్వామిక పద్ధతిలో నిరసనకు కల్పించబడిన హక్కు. నిరసనకు జనం చేతిలో ఆయుధం. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులెవరూ నచ్చనప్పుడు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించడానికి తెరమీదకొచ్చిన సరికొత్త మీట. అదే నోటా. నన్ ఆఫ్ ది అబౌ (నోటా). రాజకీయ పార్టీల తరఫున పోటీ చేస్తున్న వారితో పాటు స్వతంత్రులుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులెవరికీ ఓటు వేయడం ఇష్టంలేనప్పుడు, పోటీ చేస్తున్న వారెవరూ నచ్చలేదని తెలియజెప్పే ఒక ప్రజాస్వామిక ఆయుధం. పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ (పీయూసీఎల్)కు కేంద్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు ఇందుకు సంబంధించి కీలకమైన తీర్పు వెల్లడించింది. 27 సెప్టెంబర్ 2013 రోజున సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కేంద్ర ఎన్నికల సంఘం 11 అక్టోబర్ 2013 నుంచి నోటాను ప్రవేశపెట్టింది. నోటా అమలు చేస్తున్న వాటిల్లో మనది 14 వ దేశం. నోటాకూ ఒక గుర్తు ఓటర్లలో అక్షరాస్యత తక్కువగా ఉండటం, ఓటర్లలో అవగాహన లేకపోవడం వంటి కారణంగా ఆయా రాజకీయ పార్టీలకు కేటాయించినట్టే నోటాకూ ఒక గుర్తు ఉండాలని ప్రజాసంఘాలు, సామాజిక కార్యకర్తల నుంచి పెద్దఎత్తున డిమాండ్ వచ్చింది. దాంతో నోటాకూ ఒక గుర్తు కేటాయించాలని 2015 లో ఎన్నికల సంఘం తీర్మానించింది. అహ్మదాబాద్‌కు చెందిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడి) రూపొందించిన గుర్తును నోటాగా కేటాయిస్తూ ఎన్నికల సంఘం 18 సెప్టెంబర్ 2015 న ఆదేశాలు జారీ చేసింది. . ఈవీఎంలలో అభ్యర్థుల పేర్లు, వాటిపక్కన గుర్తు లు ఉన్నట్టుగా చూపించే చిత్రంపై ఇంటూ మార్క్ తో అడ్డంగా కొట్టివేసినట్టుగా చూపించేదే నోటా గుర్తు. ఈ ప్రజాస్వామిక నిరసన హక్కు ఓటర్లకు ఆయుధంగా ఉపయోగపడుతుందా? ఓటర్లు ఆశించిన లక్ష్యం నెరవేరుతుందా? అంటే కాదనే చెప్పాలి. ఎందుకంటే ఏదైనా ఒక నియోజకవర్గంలో పోటీ చేసిన అభ్యర్థులకన్నా నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ప్రజల ప్రజాస్వామిక నిరసన ఫలిస్తుందా? అంటే అలా జరగదు. నోటాకు అత్యధికంగా ఓట్లు నమోదైనప్పటికీ ఆ తర్వాత క్రమంలో అత్యధిక ఓట్లు వచ్చిన అభ్యర్థిని గెలిచినట్టుగా ప్రకటిస్తారు. అయితే, నోటా ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు అలాంటి సందర్భాలు ఎదురుకాలేదు. అలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే మళ్లీ ఎన్నికలకు వెళ్లాలన్న డిమాండ్‌పైన చర్చకు ఆస్కారం కలుగుతుంది. నోటా ప్రవేశపెట్టినప్పటి నుంచి కొందరు దానికి ఓటు వేయడం గమనించాం. ఇప్పుడు కొందరు నోటాకు ఓటు వేయాలంటూ ప్రచారం కూడా మొదలుపెట్టారు. ఎన్నికల్లో అదీ ఒక గుర్తే... దానికి ప్రచారం చేయొచ్చా? చేయరాదా ? అన్నింటిలాగే నోటాకూ ప్రచారం చేయొచ్చు. అలా చేస్తున్న వారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది కూడా. తొలిసారి ఇవే రాష్ట్రాల్లో 2013లో చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మిజోరాంలతో పాటు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి నోటా ఉపయోగించారు. (ఢిల్లీ శాసనసభకు ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు జరిగాయి), అప్పట్లో ఈ రాష్ట్రాల్లో 1.85 శాతం ఓట్లు నోటాకు నమోదయ్యాయి. సరిగ్గా ఐదేళ్ల తర్వాత ఆ నాలుగు రాష్ట్రాలకు మళ్లీ ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇకపోతే, 2014 సాధారణ ఎన్నికల్లో 1.1 శాతం ఓట్లు నోటాకు నమోదయ్యాయి. ఒక్కో ఎన్నికలో ఒక్కో తీరులో ఓట్లు నోటాకు పోలయ్యాయి. 2014 లో కొన్ని రాష్ట్రాలు హర్యానా, జార్ఘండ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిస్సా, అరుణాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో నోటాకు (2.02 శాతం) పడిన ఓట్లు పెరిగాయి. 2015 లో ఢిల్లీ, బీహార్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీలో 0.40 శాతం నోటాకు పోలైతే బీహార్‌లో మాత్రం 2.49 శాతం నమోదయ్యాయి. 2016లో అసోం, పశ్చిమ బెంగాల్, కేరళ, పాండిచ్చేరి, తమిళనాడు ఎన్నికల్లో మొత్తంగా 1.6 శాతం ఓట్లు నోటాకు మీటపై పడ్డాయి. అక్టోబర్ 2013 నుంచి మే 2016 మధ్య కాలంలో దేశంలో జరిగిన ఎన్నికల ఓటింగ్ సరళిని విశ్లేషించినప్పుడు... గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లోనే నోటాకు ఎక్కువ ఓట్లు నమోదుకావడం గమనార్హం. ప్రత్యేకించి ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాల్లో నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి. లండన్ కింగ్స్ కాలేజీకి చెందిన గరిమా గోయల్ తన పరిశోధనా పత్రంలో ఈ విషయం వెల్లడించినట్టు ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ పేర్కొంది. గిరిజనులు ప్రత్యేకంగా ఎక్కడయితే తమ కమ్యూనిటికి ప్రాతినిథ్యం ఉండటం లేదో ఆ ప్రాంతాల్లో ఎక్కువగా నోటాకు నమోదవుతున్నట్టు వెల్లడైంది. అలాగే, వామపక్ష తీవ్రవాద ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనూ ఈ పరిస్థితి కనిపిస్తోంది. గడ్చిరోలీ, జార్గ్రామ్, కల్యాణ్ (రూరల్), జగన్నాథ్‌పూర్, చాత్ర, ఉమర్కోట్, ఛత్తర్పూర్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా నోటాకు ఓట్లు నమోదయ్యాయి. లోక్‌సభ నియోజకవర్గాల విషయానికొస్తే 2014 ఎన్నికల్లో బస్తర్, నీల్గిరీస్, నబరంగ్‌పూర్ నియోజకవర్గాల్లో ఎక్కువగా వచ్చాయి. ఈ ప్రాంతాల్లో వామపక్ష తీవ్రవాద ప్రభావం అధికంగా ఉన్న విషయం తెలిసిందే. ఇకపోతే, ఎక్కడైతే ప్రధాన రాజకీయ పక్షాలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య ముఖాముఖి పోటీ ఉందో ఆ ప్రాంతాల్లో కూడా నోటాకు వచ్చిన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు కొన్ని గణాంకాలు సూచిస్తున్నాయి. అందుకు కారణంగా ప్రధాన రాజకీయ ప్రత్యర్థులైన ఈరెండు పార్టీలకు వ్యతిరేకంగా ఇవి నమోదవుతున్నాయన్న వాదన వినిపిస్తున్న వారూ ఉన్నారు. మొత్తంమీద ఏ నియోజకవర్గంలో చూసిన 1 నుంచి 3 శాతంకు మించి నోటాకు ఓట్లు పడలేదు. నోటా ప్రవేశపెట్టిన తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఎక్కువ ఓట్లు నోటాకొస్తాయని అంచనా వేశారు. పైగా పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్యత ఎక్కువ ఉంటుంది. పైగా రాజకీయాల్లో నేర చరిత కలిగిన వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో పట్టణ ప్రాంతాల్లో నోటాకు ఎక్కువ ఓట్లు పడుతాయని అంచనాకు రావొచ్చు. కానీ అందరి అంచనాలకు పట్టణ ప్రాంతాలకన్నా గ్రామీణ ప్రాంతాల్లోనే నోటాకు ఎక్కువ ఓట్లు నమోదవుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం తక్కువగా ఉండటం గమనార్హం. నోటా ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు వచ్చిన ఫలితాల సరళిని బట్టి ‘‘పై వారెవరికీ ఓటు వేయదలచుకోలేదని’’ (నోటాకు వేస్తున్న) చెప్పే వారి సంఖ్య అంతగా ఉండటం లేని కారణంగా నోటా పెద్ద చర్చనీయాంశం కాలేదు. ఈ రకమైన ప్రజాస్వామిక నిరసన ఒక సాధనంగా మాత్రమే మిగిలిపోతోంది. అందుకే ‘‘నన్ ఆఫ్ ది అబో’’ (నోటా) తరహాలో యాంత్రికమైన సాధనంగా కాకుండా ‘‘ రైట్ టు రిజెక్ట్ ’’ (తిరస్కరించే హక్కు) ఉండాలని కోరుతున్నవాళ్లూ ఉన్నారు. నోటా స్థానంలో అభ్యర్థిని పూర్తిగా తిరస్కరించే హక్కు (రైట్ టు రిజెక్ట్) కల్పించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో ఒక ప్రజాప్రయోజన వాజ్యం దాఖలైంది. తెలంగాణలో నోటా తీరు 2014 అసెంబ్లీ ఎన్నికల్లో (ఉమ్మడి రాష్ట్రంలో జరిగాయి) తెలంగాణలోని 119 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 1,51,731 ఓట్లు నోటాకు పడ్డాయి. అంటే ప్రతి నియోజకవర్గంలో సగటున 1275 ఓట్లు నోటాకు నమోదయ్యాయన్నమాట. రెండు వేలు ఆ పైన నోటాకు ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు 11 ఉన్నాయి. అలాగే వెయ్యి నుంచి రెండు వేల మధ్యన నోటాకు పోలైన నియోజకవర్గాలు 67 ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో అత్యధికంగా నోటా ఓట్లు పోలయ్యాయి. ఇకపోతే, పోస్టల్ బ్యాలెట్ల తీరు పరిశీలించినప్పుడు 19 నియోజకవర్గాల్లో నోటాకు ఒక్క ఓటు కూడా పడలేదు. పది అంతకన్నా ఎక్కువ ఓట్లు నోటాకు పోలైన నియోజకవర్గాలు 13 ఉన్నాయి. అత్యధికంగా తాండూరులో పోలైన పోస్టల్ బ్యాలెట్లలో అత్యధికంగా 25 మంది నోటాకు ఓటు వేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధికంగా, అత్యల్పంగా నోటాకు ఓట్లు నమోదైన పది నియోజకవర్గాలు -
అభ్యర్థి నచ్చకుంటే ‘నోటా’ ఉందిగా..
బంజారాహిల్స్: ఓటరుగా నమోదు చేసుకోవడంలో చూపిన ఉత్సాహం పోలింగ్ రోజు వినియోగిస్తేనే దానికి సార్థకత. ఐదేళ్ల పాటు మన మంచీచెడులను చూసే నేతలను ఎన్నుకునే ఈ క్రతువులో ఓటు అనే ఆయుధమే ప్రజా అస్త్రం. ఈ వజ్రాయుధాన్ని వినియోగించుకోకుంటే మనం విజయవంతమైనట్టే. అందుకే ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి. మెరుగైన సమాజం కోసం ఓటు వేసి బాధ్యతను నెరవేర్చుకోవాలి. ఒకవేళ మీకు ఏ అభ్యర్థి కూడా నచ్చకపోతే నోటా అనే మరో ఆప్షన్ ఉందనే విషయం మర్చిపోకూడదు. నేను ప్రతి ఎన్నికల్లోనూ తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగింకుంటాను. మీరు కూడా తప్పనిసరిగా ఓటు వేయండి. ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత శక్తిమంతమైన ఆయుధం ఏదైనా ఉందంటే అది ఓటు మాత్రమే. – తనీష్, సినీ నటుడు -
ఎవరూ.. నచ్చలేదు
కొత్తూరు : నోటాకు పోలయ్యే ఓట్లు తూటాల కంటే బలమైనవి. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం, ప్రమాదం ఉంది. ఎన్నికల సంస్కరణల్లో భాగంగా జాతీయ ఎన్నికల కమిషన్ ఈవీఎం యంత్రాలపై నోటా(పై అభ్యర్థుల్లో ఎవరూ నచ్చలేదు) ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. అయితే, నోటాకు పోలవుతున్న ఓట్ల సంఖ్య రానురానూ పెరుగుతూ వస్తోంది. కొన్ని సెగ్మెంట్లలో గత ఎన్నికల్లో కొందరు అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. 2014లో కల్వకుర్తి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారిపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డి కేవలం 78 ఓట్లతో గెలుపొందారు. అయితే, ఈ నియోజకవర్గంలో నోటాకు 1,139 ఓట్లు పోలవడం గమనార్హం. నోటాకు బదులు అభ్యర్థులకు ఈ ఓట్లు పోలై ఉంటే గెలుపోటముల ఫలితం మరోలా ఉండేది. గత ఎన్నికల్లో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 22 మంది అభ్యర్థులు పోటీ చేయగా 14 మందికి, ఎల్బీనగర్లో 30 మంది అభ్యర్థులు పోటీ చేస్తే 24 మంది అభ్యర్థులకు నోటాకు పోలైన ఓట్ల కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. 2014 ఎన్నికల్లో నోటాకు పోలైన ఓట్లు.. ►షాద్‌నగర్ నియోజకవర్గంలో 1,93,094 ఓట్లు ఉండగా అభ్యర్థులకు 1,54,985 ఓట్లు, నోటాకు 846 ఓట్లు పోలైయ్యాయి. 15 మంది అభ్యర్థులు పోటీ చేయగా 8 మందికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ►కల్వకుర్తి నియోజకవర్గంలో 1,99,714 ఓట్లు ఉండగా 1,61,799 ఓట్లు అభ్యర్థులకు, నోటాకు 1,139 ఓట్లు పోలయ్యాయి. ఈ నియోజకవర్గం నుంచి 11 మంది బరిలో దిగగా ముగ్గురికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ►చేవేళ్ల నియోజకవర్గంలో 2,05,757 ఓట్లకు 1,62,571 ఓట్లు అభ్యర్థులకు, నోటాకు 1,226 ఓట్లు పోలయ్యాయి. నియోజకవర్గం నుంచి మొత్తం 14 మంది పోటీచేయగా 5 మంది అభ్యర్థులకు నోటాకు పోలైన ఓట్ల కంటే తక్కువ రావడం గమనార్హం. ►శేరిలింగంపల్లి నియోజకవర్గంలో 5,91,281 ఓట్లకు అభ్యర్థులకు 28,294 ఓట్లు, నోటాకు 2,053 ఓట్లు పోలయ్యాయి. ఈ నియోజకవర్గం నుంచి 22 మంది పోటీచేయగా 14 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ►రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 3,87,355 ఓట్లకు 2,29,586 ఓట్లు అభ్యర్థులకు, నోటాకు 1,332 పోలయ్యాయి. 24 మంది అభ్యర్థులు పోటీ చేయగా 14 మందికి నోటాకు పోలైన ఓట్ల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ► మహేశ్వరం నియోజకవర్గంలో 4,03,729 ఓట్లలో అభ్యర్థులకు 2,17,679 ఓట్లు, నోటాకు 1,394 ఓట్లు వేశారు. నియోజకవర్గం నుంచి 22 మంది పోటీ చేయగా 15 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ► ఎల్బీనగర్ నియోజకవర్గంలో 5,29,717 ఓట్లు ఉండగా అభ్యర్థులకు 2,50,852 ఓట్లు, నోటాకు 2241 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ 30 మంది అభ్యర్థులు బరిలో దిగారు. 24 మందికి నోటాకు పోలైన ఓట్ల కంటే తక్కువగా వచ్చాయి. ►ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 2,30,388 ఓట్లు ఉండగా అభ్యర్థులకు 1,81,443 ఓట్లు, నోటాకు 768 ఓట్లు పోలయ్యాయి. 27 మంది అభ్యర్థులు పోటీ చేయగా 17 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. ►పరిగిలో మొత్తం 2,11,875 ఓట్లకు 1,50,178 ఓట్లు అభ్యర్థులకు, నోటాకు 1,301 ఓట్లు నోటాకు పడ్డాయి. ఇక్కడ పది మంది బరిలో దిగగా ఐదుగురికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ► తాండూరు నియోజకవర్గంలో 1,89,216 ఓట్లకు అభ్యర్థులకు 1,33,324 ఓట్లు, నోటాకు 1,302 ఓట్లు పోలైయ్యాయి. పది మంది పోటీ చేయగా ముగ్గురికి నోటా కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి. ►కొడంగల్ నియోజకవర్గంలో మొత్తం 1,97,649 ఓట్లకు అభ్యర్థులకు 1,38,300 ఓట్లు, నోటాకు 1,135 ఓట్లు పోలయ్యాయి. 8 మంది పోటీ చే యగా ఒకరికి నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. ►వికారాబాద్ నియోజకవర్గంలో మొత్తం 1,95,951 ఓట్లు ఉండగా 1,37,901 ఓట్లు అభ్యర్థులకు, నోటాకు 1,040 ఓట్లు పోలయ్యాయి. 13 మంది అభ్యర్థులు పోటీ చేయగా 7 మందికి నోటాకు పోలైన ఓట్ల కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. -
నచ్చలేదా... నోటా నొక్కుడే
సాక్షి,సదాశివనగర్(ఎల్లారెడ్డి):ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నచ్చకపోతే తిరస్కరణ ఓటు వేసే అధికారాన్ని కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్లకు ప్రత్యేక అవకాశాన్ని కల్పించింది.ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థులు గుర్తులతో పాటు నోటా(నన్ ఆఫ్ ది ఎబవ్)ను ఎర్పాటు చేశారు. సాధారణంగా ఓటర్లు పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరో ఒకరికి ఓటు వేసే విధానం చాలా కాలంగా అమలులో ఉంది. 2014 సాధారణ ఎన్నికల నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఓటర్లకు ఎవరూ నచ్చకపోతే వారి అభిప్రాయాన్ని తెలపడం కోసం ఈవీఎంలలో నోటాను పొందుపర్చారు. నోటా మీటను నోక్కితే ఆ ఓటు పోలింగ్‌లో ఉన్న ఆభ్యర్ధుల్లో ఎవరికీ చెందదు. అయితే ఓటరు తన ఓటు హక్కును వినియెగించుకున్నట్లు అవుతుంది. ఇలాంటి ఆవకాశం వివిధ దేశాల్లో ఓటర్లకు చాలా కాలాంగా ఆందుబాటులో ఉండగా భారత్‌లో గత సాధారణ ఎన్నికల నుంచి ఆమలులోకి తెచ్చారు. నోటాను ఆమలులోకి తేవాలనుకుంటున్నట్లు ఎన్నికల కమీషన్ 2009లో తొలిసారి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు నివేదించింది. అప్పట్లో ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించినా పౌర హక్కుల సంస్థ పీయూసీయల్ దీనికి మద్ధతుగా ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసింది. ఎట్టకేలకు నోటాను అమలు చేయాలని సుప్రీం కోర్టు 2013 సెప్టెంబర్ 27న తీర్పు ఇచ్చింది. దీంతో నచ్చకపోయినా ఎవరికో ఒకరికి ఓటు వేయాల్పిన అవరసవం లేకుండా నోటా నోక్కి అభ్యర్థులు ఎవరూ తనకు నచ్చలేదని ఓటరు తన అభిప్రాయాన్ని చెప్పే అవకాశం లభించింది. 2013లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, మిజోరాం, ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతానికి జరిగిన ఎన్నికల్లో నోటాను తోలిసారి అమలులోకి తెచ్చారు. ఆ తర్వాత 2014లో నోటా ఎర్పాటు చేయగా అప్పట్లో దేశవ్యాప్తంగా 1.1 శాతం ఓట్లు నోటాకు పడ్డాయి. -
అలాగైతే నోటానే!
సాక్షి,ఉట్కూర్ (మక్తల్): సమాజంలో మార్పును తీసుకవచ్చి జాతి భవిష్యత్‌ను మార్చగల సత్తా యువతకే ఉంది. వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో ప్రలోభాలకు లొంగకుండా మంచి అ«భ్యర్థులను ఎన్నునకునేందుకు తమ ఓటు హక్కు వినియోగిస్తామని పలువురు యువతీయువకులు చెబుతున్నారు. పోటీ చేసే వారిలో సరైన అభ్యర్థులు లేకపోతే ‘నోటా’కే ఓటు వేస్తామని మండలంలోని యువత అంటున్నారు. నోటుకు కాదు – నేతలను చూద్దాం, మనిషిని కాదు – నేతల మనసును చూద్దాం, అవినీతిని కాదు– నిజాయితీని గెలిపిద్దామని ప్రతిన బూనడమే కాకుండా ఇతరులకు కూడా అవగాహన కల్పిస్తామని చెబుతున్నారు. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే తిరష్కరణ ఓటు వేసే అవకాశాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ ఓటర్లకు కల్పించింది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో అభ్యర్థుల గుర్తుతో పాటు నోటా(నన్ ఆఫ్ ది ఎబోవ్) మీట ఏర్పాటు చేశారు. దీనిపై పలువురు యువత అభిప్రాయాలు ఇలా ఉన్నాయి. సుస్థిర పాలన అందించే పార్టీకే.. రాష్ట్రంలో సుస్థిర, సుపరిపాలన అందించడమే కాకుండా యువతకు ఉద్యోగావకాశాలు, ఉపాధి కల్పించి ప్రణాళికబద్ధంగా పరిపాలించే పార్టీకే ఓటు వేయడానికి ప్రాధాన్యత ఇస్తా. ఈ విషయమై నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక అభ్యర్థులందరినీ పరిశీలించి మంచి వారిని గుర్తిస్తా. – సాదతుల్లా ఖాన్, ఊట్కూర్ విద్యాభివృధ్దికిపాటుపడే వ్యక్తికే ఓటు ఎమ్మెల్యేగా పోటీ చేసే వ్యక్తి స్థానిక సమస్యలపై పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి. పాఠశాలల్లో మౌలిక వసతులు, ఉపా«ధ్యాయులు లేక విద్యార్థులకు చదువు నామమాత్రంగా అందుతుంది. విద్యాభివృద్ధికి పాటుపడే వ్యక్తికి ఓటు వేస్తా. – అబ్దుల్ రషీద్, నగిరి ఊట్కూర్ సాగు నీరందించే వారికే ఓటు మండలంలో పంట పొలాలు ఎడారులుగా మారుతుండడంతో రైతులు వలసలు పోతున్నారు. వలసలను నివారించి ఎత్తిపోతల పథకం ద్వారా పంట పొలాలకు సాగునీరందించాలి. ప్రభుత్వంతో ఒప్పించి వ్యవసాయ అభివృద్ధికి పాటు పడే వ్యక్తికే ఓటు వేస్తా. – సి.ఆనంద్ కుమార్, ఊట్కూర్ అవినీతిని అరికట్టే వ్యక్తి కావాలి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల్లో అవినీతి రాజ్యమేలుతోంది. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు దక్కడం లేదు. అవినీతిని పూర్తిస్థాయిలో అరికట్టే అ«భ్యర్థి ఎన్నిక కావాల్సి ఉంది. అలాంటి అభ్యర్థిని గుర్తించి నా ఓటు వేస్తా. – శాంతికుమార్రెడ్డి, ఊట్కూర్ -
సత్తా చూపిన నోటా
సాక్షి బెంగళూరు: ఉప ఎన్నికల ఫలితాల్లో ‘నోటా’ సత్తా చాటింది. పై అభ్యర్థుల్లో ఎవరికీ కాదు.. అనే ఆప్షన్‌కు ఓటర్లు పెద్దసంఖ్యలో మద్దతు పలికారు. దీనికి పలు కారణాలు ప్రచారంలో ఉన్నాయి. మరో ఆరు నెలల్లో లోక్‌సభకు ఎన్నికలు ఉండగా మళ్లీ ఉప ఎన్నికలు ఎందుకని చాలామంది తమ నోటా ద్వారా ప్రశ్నించారు. మండ్య పార్లమెంట్ నియోజకవర్గంలో అత్యధికంగా 15,480 ఓట్లు నోటాకు పడటం విశేషం. కాగా జమఖండి అసెంబ్లీ నియోజకవర్గంలో తక్కువగా 724 ఓట్లు పడ్డాయి. ఇంకా నాలుగేళ్లకు పైగా పదవీకాలం ఉండటంతో రెండు విధానసభ ఉ ప ఎన్నికలోనూ నోటాకు అంతగా ప్రాధాన్యం ఇవ్వలేదు. తమకు అభ్యర్థులు నచ్చకపోయినా నోటాకు ఓటు వేసి ఉంటారని ప్రచారం సాగుతోంది. ఏ నియోజకవర్గంలో ఎన్ని నోటా ఓట్లు ♦ మండ్య – 15,480 ♦ శివమొగ్గ – 10,687 ♦ బళ్లారి – 12,413 ♦ రామనగర – 2,909 ♦ జమఖండి – 724. -
‘నోటా’పై స్పందించిన విజయ్..యాటిట్యూడ్ మారదంటూ పోస్ట్!
పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం ఈ సినిమాలు దేనికవే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. విజయ్ దేవరకొండ ఈ సినిమాలతో అంచలంచెలుగా ఎదుగుతూ తిరుగులేని ఫామ్‌ను సంపాదించుకున్నాడు. ‘గీతాగోవిందం’తో వంద కోట్ల క్లబ్‌లోకి చేరుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇక విజయ్ దేవరకొండ టైమ్ నడుస్తుంది.. తనను ఎవరూ ఆపలేరు అనుకునే సమయంలో ‘నోటా’ విడుదలైంది. తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్ చేసిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు అంతగా రుచించలేదు. కేవలం విజయ్ ఉన్నాడన్న ఒక్క కారణంతోనే ఈ సినిమాపై తెలుగునాట హైప్ క్రియేట్ అయింది. అయితే సినిమా మాత్రం ఇక్కడి ప్రేక్షకులకు ఎక్కలేదు. ‘నోటా’ను విమర్శకులు కూడా ఏకిపారేశారు. ఈ సినిమా ఒకవేళ విజయం సాధిస్తే అది కేవలం విజయ్ గొప్పతనమే అవుతుందని రివ్యూలు చెప్పేశాయి. అయినా అంతా తానై భుజాన మోసినా ‘నోటా’ మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఇక దీనిపై విజయ్ ట్విటర్లో స్పందిస్తూ ఓ పోస్ట చేశాడు.‘ నా మీద ప్రేమతో సినిమా చూసేవారికి, పక్కవారు ఫెయిల్ అయితే ఆనందపడి సెలబ్రేట్ చేసుకునే వారికి’.. అంటూ మొదలుపెట్టి.. ‘ ‘నోటా’ ను చేసినందుకు గర్వపడుతా. దీని ఫెయిల్యూర్‌కు పూర్తిగా నాదే బాధ్యత. ఈ చిత్రాన్ని ప్రేమించిన ప్రేక్షకుల అందరి ప్రేమను నేను తీసుకున్నాను. అలాగే ఈ సినిమాపై వచ్చిన అసంతృప్తి, విమర్శలను సీరియస్‌గా తీసుకున్నాను. వాటిని పరిశీలించాను. నా వైపు ఉన్న తప్పులను సరిచేసుకున్నాను. కానీ, నా యాటిట్యూడ్ మాత్రం మారదు. ఓ విజయమో, అపజయమో ఓ రౌడీని తయారు చేయలేదు పడగొట్టలేదు. ఎప్పుడైతే నీకు ఎదురైన సమస్యను వదిలేస్తావో, చూసి ఆగిపోతావో అప్పుడు నువ్వు మారినట్టు. రౌడీ అంటే కేవలం గెలవడమే కాదు.. విజయం కోసం పోరాడటం.. రౌడీలు అయినందుకు గర్వపడదాం. ఫైట్ చేస్తూ ఉందాం. గెలుస్తే గెలుస్తాం లేదా నేర్చుకుంటాం. నా ఫెయిల్యూర్‌ను ఎంజాయ్ చేస్తున్న వారికిదే సమయం.. ఇప్పుడే పండగ చేస్కోండి. వెంటనే తిరిగి వస్తా!.’ అంటూ తనలోని యాటిట్యూడ్‌ను చూపించాడు విజయ్. టాక్సీవాలా, డియర్ కామ్రేడ్ సినిమాలతో విజయ్ ప్రస్తుతం బిజీగా ఉన్నాడు. Idi paristhiti. pic.twitter.com/1500Qsh4TG — Vijay Deverakonda (@TheDeverakonda) October 9, 2018 -
‘నోటా’ తొలిరోజు వసూళ్లెంతంటే..?
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం నోటా. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిన ఈ సినిమాను ఆనంద్ శంకర్ దర్శకత్వంలో జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటుతోంది. అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో సంచలనం సృష్టించిన విజయ్, మరోసారి భారీ వసూళ్లతో సత్తా చాటాడు. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన నోటా ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు 14 కోట్ల వసూళ్లు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 7 కోట్ల వసూళ్లు సాధించిన నోటా, తమిళ నాడులో 2.6 కోట్లు, కర్ణాటకలో 1.55 కోట్లు, అమెరికాలో 1.85 కోట్లు ఇతర ప్రాంతాల్లో 1.2 కోట్ల వసూళ్లు సాదించింది. విజయ్ సరసన మెహరీన్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో నాజర్, సత్యరాజ్‌లు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
‘నోటా’ మూవీ రివ్యూ
టైటిల్ : నోటా జానర్ : పొలిటికల్ డ్రామా తారాగణం : విజయ్ దేవరకొండ, సత్యరాజ్, నాజర్, మెహరీన్ సంగీతం : సామ్ సీయస్ దర్శకత్వం : ఆనంద్ శంకర్ నిర్మాత : జ్ఞానవేల్ రాజా అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలతో సెన్సేషనల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం నోటా. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించాడు. అరిమనంభి, ఇరుముగన్ సినిమాలతో తమిళనాట దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్న ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాతో విజయ్ కోలీవుడ్‌కు కూడా పరిచయం అవుతుండటంతో నోటా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాల నోటా అందుకుందా..? ఈ సినిమాతో విజయ్ తన హిట్ ట్రాక్‌ను కంటిన్యూ చేశాడా..? కథ ; వరుణ్ (విజయ్ దేవరకొండ) ముఖ్యమంత్రి వాసుదేవ్(నాజర్) కొడుకు. రాజకీయాలంటే గిట్టని వరుణ్ లండన్‌లో వీడియో గేమ్ డిజైనర్ గా పనిచేస్తుంటాడు. ఇండియాలోని కొన్ని అనాథాశ్రమాలకు మహేంద్ర (సత్యరాజ్) సహకారంతో సాయం చేస్తుంటాడు. ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేసే వరుణ్ అనుకోకుండా సీఎం కుర్చీలో కూర్చోవాల్సి వస్తోంది. తండ్రి వాసుదేవ్ ఓ కేసు విషయంలో విచారణ ఎదుర్కోవాల్సి రావటంతో రాజకీయాలతో సంబంధంలేని వరుణ్ ని అధికార పీఠం మీద కూర్చోపెట్టి వెనకుండి అంతా నడిపించాలని భావిస్తాడు వాసుదేవ్. కానీ ఆ కేసులో వాసుదేవ్‌కు శిక్షపడటం, బెయిల్‌పై తిరిగి వస్తుండగా వాసుదేవ్ మీద హత్యా ప్రయత్నం జరగటంతో వరుణ్ సొంతంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. తండ్రి మీద జరిగినట్టుగానే తన మీద ఇతర కుటుంబ సభ్యుల మీద దాడులు జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. దీని వెనుక వేల కోట్లకు సంబంధించిన లావాదేవీలు ఉన్నాయని ఇంటిలిజెన్స్ వర్గాలు చెపుతాయి. అదే సమయంలో కోలుకున్న వాసుదేవ్.. వరుణ్ అధికారంలో ఉండేందుకు తనను మోసం చేస్తున్నాడని భావించి పార్టీని తన కంట్రోల్లోకి తెచ్చుకునే ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. రాజకీయాలతో ఏ మాత్రం సంబంధం లేని వరుణ్ ఈ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాడు.? మాజీ ముఖ్యమంత్రి వాసుదేవ్ మీద హత్యా ప్రయత్నం చేసింది ఎవరు.? చివరకు వరుణ్ రాజకీయ నాయకుడిగానే కొనసాగాడా.. లేదా? అన్నదే మిగతా కథ. నటీనటులు ; సినిమాకు ప్రధాన బలం విజయ్ దేవరకొండ. ఒక్కో సినిమాలో ఒక్కో డిఫరెంట్ క్యారెక్టర్‌తో అభిమానులకు షాక్ ఇస్తున్నాడు విజయ్. సినిమా అంతా తన భుజాల మీదే నడిపించాడు. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో డిఫరెంట్ లుక్, క్యారెక్టరైజేషన్‌తో మెప్పించాడు. రౌడీ సీఎం పాత్రలో పర్ఫెక్ట్ గా సూట్ అయ్యాడు. ఎమోషనల్ సీన్స్‌లో విజయ్ నటన సూపర్బ్. మరో ప్రధాన పాత్రలో సత్యరాజ్ ఆకట్టుకున్నాడు. హీరోకు ప్రతీ విషయంలో సాయం చేసే పాత్రలో ఆయన ఒదిగిపోయారు. మరో కీలక పాత్రలో నాజర్ జీవించారు. పార్టీ నాయకుడిగా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నాజర్ నటన సినిమాకు మరో బలం. హీరోయిన్ మెహరీన్‌ది దాదాపు అతిధి పాత్రే. ఇతర పాత్రల్లో సంచన నటరాజన్, ప్రియదర్శి, ఎంఎస్ భాస్కర్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. విశ్లేషణ : ఓ పొలిటికల్ డ్రామాకు విజయ్ దేవరకొండ లాంటి నటుణ్ని ఎంచుకోవటం సాహసం అనే చెప్పాలి. అయితే దర్శక నిర్మాతలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని విజయ్ నిలబెట్టుకున్నాడు. తానే ప్రధాన బలంగా మారి సినిమాను నడిపించాడు. హీరోను ప్లేబాయ్‌ల పరిచయం చేస్తూ సినిమాలు మొదలు పెట్టిన దర్శకుడు ఆనంద్ శంకర్.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు కథ ప్రారంభించాడు. వెంటనే వరుణ్ పాత్ర సీఎం కావటం తరువాత రాజకీయ పరిణామాలతో ఫస్ట్ హాఫ్ గ్రిప్పింగ్‌గా సాగుతుంది. విజయ్ నటన, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్, ఇంటర్వెల్ బ్యాంగ్ ఇలా ఫస్ట్ హాఫ్ సూపర్బ్ అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్‌ను అదే స్థాయిలో తెరకెక్కించటంలో దర్శకుడు తడబడ్డాడు. ద్వితీయార్థంలో అక్కడక్కడ కథనం నెమ్మదించటం కాస్త ఇబ్బంది పెడుతుంది. ఇటీవల కాలంలో తమిళ రాజకీయల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలో కథను తయారు చేసుకున్న దర్శకుడు తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఇంకొన్ని మార్పులు చేసి ఉంటే బాగుండనిపిస్తుంది. భారీ థ్రిల్స్‌ను ఆశించిన ప్రేక్షకులను క్లైమాక్స్ కూడా నిరాశపరుస్తుంది. సినిమాకు ప్రధాన బలం సామ్ సీయస్ మ్యూజిక్. పాటలు పరవాలేదనిపించినా సామ్ అందించిన నేపథ్య సంగీతం ప్రతీ సీన్‌ను మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; విజయ్ దేవరకొండ నటన నేపథ్య సంగీతం డైలాగ్స్ మైనస్ పాయింట్స్ ; క్లైమాక్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
నన్ను వదిలేయండి ప్లీజ్
‘‘మొన్ననే ‘గీత గోవిందం’ సినిమా ప్రమోషన్స్.. ఇప్పుడు ‘నోటా’ ప్రమోషన్స్. ఇటు తెలుగు అటు తమిళ్ ప్రమోషన్స్‌తో చాలా అలసిపోయాను. శుక్రవారంతో ఈ ప్రమోషన్స్‌కి స్వస్తి చెబుతా. సినిమాలు చేయాలనుకున్నాను. కానీ మరీ నిద్ర లేని రాత్రులు గడిపేంత బిజీ అవ్వాలనుకోలేదు. అయినా ఇది చాలా మంచి అనుభూతినిస్తోంది’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. ఆయన హీరోగా, మెహరీన్ కథానాయికగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నోటా’. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చెప్పిన విశేషాలు... ► రాజకీయాలంటే ఇష్టం లేని ఒక సాధారణ వ్యక్తిని తీసుకెళ్లి ఎన్నికల్లో పోటీ చేయాలని దింపుతారు. అప్పుడు రాజకీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే ‘నోటా’ కథ. రియలిస్టిక్‌గా ఉంటుంది. వాస్తవానికి దగ్గరగా ఉండే నటనంటే నాకూ ఇష్టమే. ఇందులో కొన్ని సొసైటీలో జరిగిన సంఘటనలున్నాయి. ‘నోటా’ని ఎంకరేజ్ చేయాలన్నది మా సినిమా ఉద్దేశం కాదు. టైటిల్‌కి యాప్ట్‌గా ఉంటుందని పెట్టాం. ► ‘నోటా’ కథ విన్నప్పుడు తమిళ రాజకీయాల గురించి తెలియదు. కథ వినగానే కనెక్ట్ అయ్యా. ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయని మా సినిమా చూశాక ప్రేక్షకులు తెలుసుకుంటారు. ఈ సినిమా తెలంగాణలోని ఓ పార్టీకి సపోర్ట్‌గా ఉంటుందని చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదు. వివాదం చేసేకొద్దీ మా చిత్రానికి కలెక్షన్లు ఇంకా పెరుగుతాయి (నవ్వుతూ). అయినా వివాదాల్లోకి నన్ను ఎందుకు లాగుతున్నారో తెలియడం లేదు. నన్ను వదిలేయండి ప్లీజ్. ► నటుడిగా బిజీ కాకపోతే రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా వెళదామని గతంలోనే బ్యాకప్ ఆప్షన్ పెట్టుకున్నా. జనరల్‌గా సినిమా రిలీజయ్యాక పైరసీ చేయడం కామన్. అయితే ‘గీత గోవిందం’ 2.30 గంటలు లీక్ అయింది. ప్రేక్షక్షులు థియేటర్‌కి రారేమో? అనుకున్నా. ‘ట్యాక్సీవాలా’ కూడా లీక్ అయింది. ఈ రెండు సినిమాల కోసం ఏడాదిన్నర్ర పనిచేశా. ఇలా లీక్ చేస్తే సినిమా చేసి ఏం లాభం? అనిపించింది. ► తమిళ్లో మంచి సినిమాలు చేస్తున్నారని మనవాళ్లు అంటున్నారు. కానీ, తెలుగులో ‘అర్జున్‌రెడ్డి, రంగస్థలం, మహానటి..’ వంటి ఎన్నో మంచి సినిమాలొస్తున్నాయి. మంచి నటీనటులు, రైటర్లు, డైరెక్టర్లు ఉన్నారు. పెద్ద బడ్జెట్‌తో సినిమాలు గ్రాండ్‌గా ఉంటున్నాయి. చక్కటి సంప్రదాయాలను ప్రోత్సహిస్తున్నారు అని తమిళ ప్రేక్షకులు అంటుంటే చాలా ఆనందంగా ఉంది. ► ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనే ప్రొడక్షన్ స్టార్ట్ చేశా. ‘పెళ్ళిచూపులు’ సినిమా హిట్ అవుతుందని నేను, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నమ్మకంగా ఉన్నాం. మా నమ్మకం నిజమైంది. మా అంత బలమైన నమ్మకంగా ఉన్నవారు దొరికితే సినిమా స్టార్ట్ చేస్తా. ► ప్రస్తుతం క్రాంతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నా. ఇంకో ద్విభాషా చిత్రం చేయాల్సి ఉంది. ‘నోటా’ విడుదల తర్వాత నిర్ణయం తీసుకుంటా. ఇటీవల వైరల్ అవుతున్న ఫొటోల్లో మీతో కలిసి ఉన్న ఫారిన్ అమ్మాయి ఎవరు? అనే ప్రశ్నకు.. ‘ఆ ఫొటోల్లో ఉన్నది నేనే. వేరే ఎవరో అని చెప్పను. తను ఓ మంచి అమ్మాయి’ అని నవ్వేశారు. -
‘నోటా’పై ఓయూ జేఏసీ నేత పిటిషన్!
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ హీరో ‘విజయ్ దేవరకొండ’ నటించిన ‘నోటా’ సినిమాకు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటూ సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్‌రెడ్డి సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కలిసిన విషయం తెలిసిందే. మంగళవారం కూడా నోటా సినిమాను నిలిపివేయాలని తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశారు. కాగా నోటా అనే పదాన్ని సినిమా టైటిల్‌గా వాడటాన్ని తప్పుపడుతూ ఓయూ జేఏసీ నేత కైలాస్ నేత ఈ బుధవారం హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. నోటా అనే పదాన్ని వాడే ముందు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరని హైకోర్టుకు తెలిపారాయన. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున చిత్రాన్ని, ఎన్నికల సంఘం వీక్షించి అభ్యంతర సన్నివేశాలు ఉంటే తొలిగించిన తర్వాతే చిత్రం విడుదలకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇది రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా కాబట్టి ఓటర్లను ఎక్కువ ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని, ఎన్నికల సంఘం సినిమా చూసిన తర్వాతే విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఈ గురువారం పిటిషన్ విచారణకు రానుంది. -
వారసత్వంపై విజయ్ దేవరకొండ కామెంట్స్
అర్జున్ రెడ్డి హీరోతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. గీత గోవిందం సినిమాతో 100 కోట్ల క్లబ్లోచేరిన ఈ యంగ్ హీరో ఈ శుక్రవారం నోటా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో కోలీవుడ్‌లోనూ అడుగుపెడుతున్నాడు విజయ్. అందుకే తెలుగుతో పాటు కోలీవుడ్ లో కూడా ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా నిర్వహిస్తున్నాడు. తమిళనాట వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్న విజయ్ పలు ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నాడు. ఓ తమిళ జర్నలిస్ట్ సినీరంగంలో వారసత్వంపై అడిగిన ప్రశ్నకు హుందాగా సమాధానం ఇచ్చాడు. ‘సినిమా అంటే వ్యాపారం కూడా.. ఎవరూ ఊరికే డబ్బులు పెట్టరు. నిర్మాత తను పెట్టిన ఖర్చును తిరిగి ఎలా రాబట్టుకోవాలో లెక్కలేసుకొనే సినిమా చేస్తాడు. అందుకే వారసులైతే ఫ్యాన్స్ కారణంగా సినిమా కొంత సేఫ్ అవుతుంది. కొత్త వారితో తీస్తే రిస్క్ ఎక్కువ’ అంటూ వారసత్వంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. అంతేకాదు ఇండస్ట్రీలో బయటి వ్యక్తులు నిలదొక్కుకోవటం చాలా కష్టమన్న విజయ్, తన లాంటి ఒకరిద్దరు మాత్రమే సక్సెస్ కాగలుగుతారని అది తమ అదృష్టమని తెలిపాడు. సినీరంగంలోకి రావాలనకున్నప్పుడు తన తండ్రి తనని ఈ విషయంపై హెచ్చరించాడని తెలిపాడు. ‘సినిమా హీరో కావడం కన్నా సివిల్స్ పాస్ అవ్వడం ఈజీ ప్రతీ ఏటా 400 మంది అవకాశం ఉంటుంది. కానీ సినిమాల్లో ప్రూవ్ చేసుకోవటం అంతా ఈజీ కాద’ని చెప్పారని తెలిపాడు. -
అభిమానులకు విజయ్ దేవరకొండ సందేశం
నోటా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విజయ్ దేవరకొండ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా సందేశాన్ని ఇచ్చాడు. తన ఫ్యాన్స్‌ను రౌడీస్ అంటూ పిలుచుకునే ఈ యంగ్ హీరో సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్‌పై స్పందించాడు. ఈ మేరకు అభిమానులకు ఓ లేఖ రాశాడు. ‘ప్రియమైన రౌడీస్ సినిమా, జీవితం, రౌడీ కల్చర్, యాటిట్యూడ్‌లతో మనం మనలా ఉండేందుకు మనం ఓ మార్పు తీసుకువస్తున్నాం. అదే సమయంలో మనం సోషల్ మీడియా పరంగా కూడా కొత్త ట్రెండ్ తీసుకురావాలి. మీలో చాలా మంది ప్రేమతో నా ఫొటోను డీపీగా పెట్టుకుంటున్నారు. అయితే దీని కారణంగా మీ కొంత మందిలో వాదనలకు దిగుతున్నారు. నేను అలాంటివి చేయను అందుకే మీరు కూడా చేయోద్దు. నేను సాధించిన విజయాలు నా స్వశక్తి తోనే సాధించా.. అందుకే ఇతర గురించి నేను పట్టించుకోను. అందుకే మిమ్మల్ని ద్వేశించే వారు కూడా ఆనందంగా ఉండాలని కోరుకోండి. నేను మీకు ఎప్పటికీ మంచి సినిమాలు, మంచి దుస్తులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తాను. ఆన్లైన్ వివాదాలు చూడటం నాకు ఇష్టంలేదు’ అంటూ ఓ ట్వీట్ చేశాడు విజయ్ దేవరకొండ. As we grow in numbers, it's time we set our own rules. We are young and can make this change - You and Me. pic.twitter.com/vxlOEaoS4l — Vijay Deverakonda (@TheDeverakonda) 3 October 2018 -
వందలమందైనా బేఫికర్
సాక్షి, హైదరాబాద్ : ఇప్పటి వరకు ఈవీఎంలలో ఓటు వేస్తే ఎవరికి పడిందో ఓటర్లకు తెలిసేది కాదు. త్వరలో రాష్ట్రంలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటరు తాను వేసిన ఓటు ఎవరికి పడిందో కూడా ఏడు సెకన్లపాటు తెరపై తెలుసుకోవచ్చు. ఇందుకు ఓటు వేసే ఈవీఎంలతోపాటు వీవీప్యాట్ మెషీన్లను వినియోగిస్తున్నారు. ఓటరు ఈవీఎంలో ఓటు వేశాక తాను ఏ అభ్యర్థికి ఓటు వేసిందీ, బ్యాలెట్లో సీరియల్ నంబర్‌తో సహా తెలుస్తుంది. అలాగే ఈసారి నోటాతోసహా 384 మంది అభ్యర్థులు బరిలో ఉన్నా ఈవీఎంలను వినియోగించవచ్చని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్‌కుమార్ తెలిపారు. మంగళవారం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో విక్టరీ ప్లేగ్రౌండ్‌లో రాజకీయ పార్టీల ప్రతినిధులు, దివ్యాంగులకు ఈవీఎంలు, వీవీప్యాట్లపై అవగాహన కల్పించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరైన ఈ కార్యక్రమంలో వారితో మాక్ పోలింగ్ నిర్వహించారు. అనంతరం రజత్‌కుమార్ మాట్లాడుతూ... రాష్ట్రంలో తొలిసారిగా వినియో గిస్తున్న వీవీప్యాట్లపై అందరికీ అవగాహన కల్పిస్తామన్నారు. 19 వేలకు పైగా పోలింగ్ లొకేషన్లలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహి స్తామన్నారు. అత్యాధునిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈవీఎం–ఎం3లను టాంపరింగ్ చేసే అవకాశం లేదని, ఎలాంటి అపోహలు అవసరం లేదని స్పష్టం చేశారు. ఈవీఎంల్లో సమస్యలున్నవి ఒక శాతం కంటే తక్కువే అన్నారు. వీవీప్యాట్లలో 8 నుంచి 9 శాతం వరకు ఇబ్బందులుండగా, అవి సాంకేతిక కారణాలతోనో లేక çసరైన జాగ్రత్తలు తీసుకోనందునో జరిగి ఉండవచ్చని పేర్కొంటూ బీఈఎల్ ఇంజనీర్లు కారణాలు పరిశీలిస్తున్నారని చెప్పారు. అవసరమైతే అదనపు వీవీప్యాట్లు తెప్పిస్తామన్నారు. కాంగ్రెస్ నేత మర్రి శశిధర్‌రెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసరావులతో పాటు బీజేపీ, టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐ, ఎంఐఎంల ప్రతినిధులు అవగాహన కార్యక్రమంలో, మాక్ పోలింగ్‌లో పాల్గొన్నారు. వారు వేసిన ఓట్లు సరిగ్గా పడటంతో సంతృప్తి వ్యక్తం చేశారు. అవగాహన వాహనాల ప్రారంభం... ఈవీఎం, వీవీప్యాట్ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా మిగతా రాష్ట్రంలో 95 శాతం పూర్తయిందని రజత్‌కుమార్ తెలిపారు. మరో రెండు రోజుల్లో అంతటా పూర్తవుతుందన్నారు. ఈ సందర్భంగా 19 వాహనాలకు లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ వాహనాలు నగరంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తాయని, వీటిల్లో కొన్ని దివ్యాంగుల కోసం కేటాయించినట్లు తెలిపారు. ఇదే కాక ప్రతివార్డులో ఓటరు అవగాహన కోసం ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ‘వీవీప్యాట్’సమయం పెంచాలి... వీవీప్యాట్‌లో తాము ఎవరికి ఓటు వేసింది తెలుసుకునేందుకు 7 సెకన్ల సమయం చాలదని, దాన్ని పెంచాలని కోరినట్లు మర్రి శశిధర్‌రెడ్డి మీడియాకు తెలిపారు. అవసరమైతే దీని కోసం సుప్రీంకోర్టుకు కూడా వెళతామన్నారు. ఓటరు జాబితాలో పొరపాట్లున్నాయని సీఈఓ దృష్టికి తెచ్చామని చెప్పారు. ముందస్తుకు సంబంధించి ఇప్పటికే సుప్రీం కోర్టులో కేసు వేయడాన్ని ప్రస్తావిస్తూ, విచారణ సమయంలో అదనపు సమాచారాన్ని అందజేస్తామన్నారు. ఎక్కడైనా సాంకేతిక సమస్యలతో పోలింగ్ ఆగితే ఆ మేరకు అదనపు సమయమిస్తామని రజత్‌కుమార్ తెలిపినట్లు టీడీపీ ప్రతినిధి వనం రమేశ్ తెలిపారు. ఓటింగ్ మెషీన్ల పనితీరు, వీవీప్యాట్లపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి 42 ప్రాంతాల్లో శాశ్వత కేంద్రాలను, 3 సంచార వాహనాలను వినియోగించనున్నట్లు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ దాన కిషోర్ తెలిపారు. మూడొందల మంది పోటీలో ఉన్నా.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వినియోగించనున్న ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్)లతో ఓటరు తాను ఎవరికి ఓటు వేసిందీ చూసుకునే సదుపాయంతోపాటు, కొత్త సాంకేతికతతో బరిలో వంద మందికి పైగా అభ్యర్థులున్నా ఈవీఎంలను వినియోగింవచ్చు. ఇప్పటి వరకు 64 మంది అభ్యర్థుల వరకే ఈ సదుపాయం ఉండేది. అంతకంటే ఎక్కువమంది అభ్యర్థులు పోటీలో ఉంటే పేపర్ బ్యాలెట్ అవసరమయ్యేది. ఈసారి వినియోగిస్తున్న ఎం–3 ఈవీఎంల్లో ఒక కంట్రోల్ యూనిట్‌కు సంబంధించి ఒక బ్యాలెట్ యూనిట్ నుంచి మరో బ్యాలెట్ యూనిట్‌కు అనుసంధానం చేసే అవకాశం ఉండటంతో గరిష్టంగా 24 బ్యాలెట్ యూనిట్లను అనుసంధానం చేయవచ్చు. తద్వారా నోటాతో సహా 384 మంది వరకు పోటీలో ఉన్నా ఈవీఎంలను వినియోగించవచ్చని అధికారులు వివరించారు. స్వల్ప తేడాతో గెలుపోటములు ప్రభావితమయ్యేప్పుడు అభ్యర్థుల ఫిర్యాదుల మేరకు లెక్కించడానికి ఇవి ఉపకరిస్తాయని తెలిపారు. ఏదైనా పోలింగ్ కేంద్రంలో అవకతవకలు జరిగాయని అభ్యర్థి ఫిర్యాదు చేసినా లెక్కించేందుకు ఉపకరిస్తాయన్నారు. -
సినిమాలు చూసి ఓటు వేయరు : విజయ్ దేవరకొండ
‘‘నోటా’ లాంటి వైవిధ్యమైన సినిమా తీసినందుకు జ్ఞానవేల్ రాజాగారికి థ్యాంక్స్. ‘పెళ్ళి చూపులు’ సినిమా చూసినప్పుడు విజయ్ కోసం ఓ కథ రాయాలనుకున్నా. ‘అర్జున్ రెడ్డి, గీత గోవిందం’, ఇప్పుడు ‘నోటా’.. ఇవన్నీ చూస్తుంటే మంచి కథతో విజయ్ దగ్గరికి వెళ్లాలని డిసైడ్ అయ్యాను. తప్పకుండా ఒక మంచి స్క్రిప్ట్‌తో వెళతా’’ అని డైరెక్టర్ కొరటాల శివ అన్నారు. విజయ్ దేవరకొండ, మెహరీన్ జంటగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నోటా’. స్టూడియో గ్రీన్ çపతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘నోటా పబ్లిక్ మీట్’లో దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ– ‘‘ఇంత పవర్ఫుల్ సినిమా తీసిన ఆనంద్ శంకర్‌కి ఆల్ ది బెస్ట్. మొదటి సినిమా నుంచి ఆనంద్ చూపిస్తున్న వేరియేషన్స్ బాగున్నాయి. విజయ్‌కి అరుదైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కింది’’ అన్నారు. జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ– ‘‘గీత గోవిందం’ సినిమాను తమిళనాడులో రిలీజ్ చేసాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. నాన్ ‘బాహుబలి’ రికార్డులను కొల్లగొట్టిన సినిమా ‘గీత గోవిందం’. ఇలాంటి రికార్డులను సాధించడం ఒక్క విజయ్‌కే దక్కింది. ఇక్కడ తనకి హార్డ్ కోర్ ఫాన్స్ ఉన్నట్లే తమిళనాడులోనూ ఉన్నారు’’ అన్నారు. ‘‘నోటా’ సినిమా చాలా బాగుంటుంది. చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు మెహరీన్. ‘‘ఒక్కో సినిమాలో ఒక్కో రకమైన పాత్రలో కనిపించే విజయ్ బయట చాలా హానెస్ట్‌గా ఉంటాడు’’ అన్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘నోటా’ సినిమా రిలీజ్ ఆపేయాలని అఫిడవిట్లు పెడుతున్నారు. ఎలక్షన్స్ టైమ్‌లో సినిమా వస్తుండటంతో ఈ సినిమా చూసి అందరూ నోటా బటన్ నొక్కేస్తారని, తెలంగాణలో ఒక పార్టీకి ఫేవర్‌గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఎలాంటి ఇష్యూస్ ఈ సినిమాలో లేవు. అయినా సినిమా చూసి ఓటు వేసే పరిస్థితిలో ప్రజలు లేరు. ఏం చేయాలో వాళ్లకు తెలుసు. కౌంట్ డౌన్ మొదలైంది.. 5న థియేటర్స్‌లో కలుద్దాం’’ అన్నారు. -
నోటా సినిమాను నిలిపివేయాలి
హైదరాబాద్: నోటా సినిమాను నిలిపివేయాలని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. నోటా సినిమా ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు. యువతపై ప్రభావం చూపుతుందని తాము భావిస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇది ఎన్నికల కోడ్‌కు విరుద్ధమని అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ..నోటా ట్రైలర్ ఓటర్ను ప్రభావితం చేసేలా ఉందన్నారు. ఎన్నికల సంఘం నోటా ప్రివ్యూ చూసిన తర్వాతనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరగకుండా ఈసీ జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. టీఆర్ఎస్ స్పందించలేనంత మాత్రాన కాంగ్రెస్ మాట్లాడకూడదంటే ఎలా అని ప్రశ్నించారు. -
నిర్మాతగా మారిన ‘రౌడీ’
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా మారిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ తన పరిధిని మరింతగా విస్తరించేందుకు రెడీ అవుతున్నాడు. తన అభిమానులను ప్రేమగా రౌడీస్ అనిపిలుచుకునే విజయ్ ఇప్పటికే రౌడీ పేరుతో ఓ ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించిన ఈ యంగ్ హీరో తాజాగా నిర్మాణరంగంలోకి అడుగుపెడుతున్నాడు. కింగ్ ఆఫ్ ది హిల్ పేరుతో కొత్త బ్యానర్‌ను ప్రారంభించాడు విజయ్. ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న నోటా తోనే నిర్మాణ రంగంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు విజయ్ దేవరకొండ. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న నోటా సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా నిర్మిస్తుండగా ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ యంగ్ సీయంగా కనిపిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్గా నటించారు. ఈ సినిమా అక్టోబర్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. -
నా సినిమా ఆపాలని చూస్తున్నారు: విజయ్ దేవరకొండ
యంగ్ హీరో విజయ్ దేవరకొండ, మెహ్రీన్ జంటగా నటించిన నోటా సినిమా విడుదల దగ్గరవుతుండడంతో చిత్ర బృందం ప్రమోషన్స్ పనులను మరింత వేగవంతం చేసింది. పబ్లిక్ మీట్ పేరిట సభలు నిర్వహిస్తూ చిత్రానికి మరింత బూస్ట్ ఇస్తున్నారు. సోమవారం హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో పబ్లిక్ మీట్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి దర్శకులు నాగ్ అశ్విన్, వంశీ పైడిపల్లి, కొరటాల శివ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. జ్ఞానవేల్ రాజా నిర్మాతగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా, సామ్.సి.సుందర్ సంగీతం అందించారు. నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ ‘విజయ్ నటించిన గీత గోవిందం సినిమా తమిళనాడులో రిలీజ్ చేసాం. మాములు రెస్పాన్స్ రాలేదు. నాన్ బాహుబలి రికార్డులను కొల్లగొట్టిన సినిమా గీత గోవిందం. ఏ హీరోకి ఇలాంటి రికార్డులను సాధించడం సాధ్యం కాలేదు. ఒక్క విజయ్‌కే అది దక్కింది.’ అన్నారు దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ ‘ఇలాంటి డిఫెరెంట్ సినిమా తీసినందుకు నిర్మాత జ్ఞానవేల్ రాజా గారికి చాలా థాంక్స్. ఇక విజయ్ గురించి చెప్పాలంటే పెళ్లి చూపులు చూసినప్పుడు ఒక స్క్రిప్ట్ రాయాలనుకున్నాను. ఆ తర్వాత అర్జున్ రెడ్డి, గీత గోవిందం.. ఇప్పుడు నోటా ఇవన్నీ చూస్తుంటే మంచి స్క్రిప్ట్‌తో విజయ్ దగరికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను. తప్పకుండా ఒక మంచి స్క్రిప్ట్‌తో వస్తాను. ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ‘ఆదివారం ఏపీలో ఫస్ట్ పబ్లిక్ మీట్ అయ్యింది. రెస్పాన్స్ మాములుగా లేదు. ఇప్పుడు అంతకు మించిన రెస్పాన్స్ ఇక్కడుంది. ఈ సినిమా రిలీజ్ ఆపేయాలని చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎలక్షన్స్ టైంలో సినిమా వస్తుండడంతో ఈ సినిమా చూసి అందరు నోటా బటన్ నొక్కేస్తారని, తెలంగాణలో ఒక పార్టీకి ఫేవర్‌గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. అలాంటి ఇష్యూస్ ఈ సినిమాలో లేవు. కంప్లీట్ డిఫరెంట్ స్టోరీ ఇది. నోటా సినిమా మీ అందరికి నచ్చుతుందని అనుకుంటున్నా’ అన్నారు. -
పబ్లిక్‌మీట్‌లో నోటా చిత్ర బృందం
-
ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాసేలా ‘నోటా’!
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘నోటా’ సినిమా విడుదలకు ఆటంకాలు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాకు వ్యతిరేకంగా సినీ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్‌రెడ్డి సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కలిశారు. ‘నోటా’ చిత్రంలో అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయని, ఇది ఒక రాజకీయ పార్టీకి కొమ్ముకాసేవిధంగా తెరకెక్కించారని కేతిరెడ్డి ఫిర్యాదు చేశారు. తెలంగాణ సచివాలయంలో ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన అనంతరం కేతిరెడ్డి మీడియా పాయింట్ వద్ద విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. ఈ చిత్రాన్ని మొదట ఎన్నికల కమిషనర్, డీజీపీ చూసిన తర్వాతే విడుదలకు అనుమతి ఇవ్వాలని కోరారు. ఎన్నికల సమయం కావడంతో ‘నోటా’ సినిమా ప్రభావం ఉంటుందన్నారు. ఈ సినిమా వల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే అవకాశముంటుందని ఆయన పేర్కొన్నారు. ‘నోటా’ అన్న ఈ సినిమా టైటిల్ కూడా వివాదాస్పదం అయ్యే అవకాశముందని చెప్పారు. ఇలాంటి టైటిల్ ఈసీ నిబంధనలకు విరుద్ధమని ఆయన చెప్పారు. వరుస విజయాలతో జోరుమీదున్న విజయ్ దేవరకొండ ఈ నెల 5వ తేదీన ‘నోటా’ సినిమా విడుదల కానుంది. -
‘నోటా’ సందడి
-
ఓవర్‌నైట్ స్టార్‌ని కాదు
రిషి, ప్రశాంత్, డా. అర్జున్ రెడ్డి దేశ్‌ముఖ్, విజయ్ ఆంటోని, విజయ్ గోవింద్... ఇప్పుడీ పేర్లు చాలా పాపులర్. ఎందుకంటే ఇవన్నీ విజయ్ దేవరకొండ పేర్లు. ఇన్ని పేర్లా? అనుకోరని తెలుసు. ఎందుకంటే ఇప్పటి వరకూ విజయ్ దేవరకొండ చేసిన సినిమాలు చూసినవాళ్లకు ఇవి ఈ యువ హీరో చేసిన పాత్రల పేర్లని తెలుస్తుంది. ఆ పాత్రల్లో విజయ్ దేవరకొండ కనిపించలేదు. ఓన్లీ క్యార్టెక్టర్ మాత్రమే కనిపించింది. అంత బాగా నటించారు. ఇప్పుడు ‘నోటా’లో శీను పాత్రలో కనిపించబోతున్నారు విజయ్. ఈ నెల 5న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండతో స్పెషల్ టాక్. ఓవర్‌నైట్ మీరు ఎక్కడికో వెళ్లిపోయారనిపిస్తోంది. విజయ్: ఓవర్‌నైట్ అని ఎందుకంటారో? నేను ఎప్పటినుంచో కష్టాలు పడుతున్నా. రెండేళ్లు ఖాళీగా తిరిగితే ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ అవకాశం వచ్చింది. అక్కణ్ణుంచి కొట్టుకుంటూ కొట్టుకుంటూ వస్తుంటే ఇప్పుడు కూర్చున్నా. మీ అందరికీ నేను ‘పెళ్ళి చూపులు’ సినిమా నుంచి తెలుసు. చాలా మందికి ‘అర్జున్‌రెడ్డి’ నుంచే తెలుసు. అందుకే త్వరగా స్టార్ అయ్యాననే భావన వారిలో ఉంటుంది.యాక్చువల్లీ నాక్కూ డా అలా అనిపిస్తుందనుకోండి. ఇదంతా చాలా తొందరగా అయిపోయిందేమోనని! ‘నోటా పోస్టర్స్ చూస్తుంటే పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ అని తెలుస్తోంది. ‘నోటా’ అంటే ఏంటో తెలుసు. కానీ తమిళ్ ఇంత త్వరగా ఎలా నేర్చుకున్నారు? పొద్దున్నే, సాయంత్రం కూర్చుని చదువుకుంటూ చదువుకుంటూ కష్టపడి నేర్చుకున్నా. రానానో, నాగచైతన్యనో కలిసినప్పుడు మీకు తమిళ్ వచ్చు కదా? అంటే చిన్నప్పుడు చెన్నైలోనే ఉన్నాం కదా... వచ్చు అంటారు. వీరికేమో సులభంగా తమిళ్ వచ్చేసింది.. మనమేమో కష్టపడాలి అనుకున్నా. ‘పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి, గీత గోవిందం’ సినిమాలతో రకరకాల అభినందనలు అందుకుని ఉంటారు. ఈ చిత్రాల్లో మీరు అన్ని షేడ్స్ చూపించారు. ఇది పెద్ద భారం. నెక్ట్స్ సినిమా ఏది సైన్ చేసినా ఎలా ఉంటుందో? ఏంటో? అని. ‘నోటా’ సినిమాకి సైన్ చేసేటప్పుడు మీకు అలా అనిపించిందా? భారం మనం ఎత్తుకుంటే ఫీల్ అవుతాం. ఎత్తుకోకుంటే ఏం లేదు. నాపై నమ్మకంతో టిక్కెట్ కొనుక్కుని కూర్చున్నోళ్లు.. నా నటన, నా సినిమాల్ని ఎంజాయ్ చేయాలనుకుంటారు. నా సినిమాల్లో క్వాలిటీ బాగాలేకుంటే నాకే నచ్చదు. ఆడియన్స్‌ని వదిలేయండి. నాకే చిరాకు లేస్తుంటుంది. కరెక్ట్ మ్యూజిక్ పడకపోతే, లైట్లు కరెక్టుగా లేకపోతే, క్యాస్టింగ్ పర్ఫెక్ట్గా లేకుంటే నాకే ఇరిటేషన్ వస్తుంటుంది. అందుకే సినిమాల సెలెక్షన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. ఇలాంటి విషయాలు మీరు డైరెక్టర్‌కి చెబుతారా? యా. నాకు ఏదైనా కరెక్ట్ అనిపించకపోతే డైరెక్ట్‌గా వెళ్లి చెబుతా. ఇలాంటి చర్చలవల్లే ఏదైనా బెటర్ అవుతుంది. సినిమాలనే కాదు.. లైఫ్‌లో కూడా గుడ్డిగా ఏదీ చేయకూడదు. ఏదైనా ఓ డౌట్ ఉంటే అవతలివాళ్లతో మాట్లాడాలి. మనం కన్విన్స్ అవ్వాలి.. లేదా అవతలి వాళ్లని కన్విన్స్ చేయాలి. ఏదైనా చర్చించుకోవడం అవసరం. సినిమా సినిమాకి ఎవరైనా పైకి వెళ్లాలనుకుంటారు. ఇంకా అద్భుతం చేసి చూపించాలని. ‘నోటా’ సినిమాతో మీరు.. అదే కొలమానం అయితే ‘నోటా’సినిమాతో ఇంకా పైకే వెళ్లా. నటన పరంగానూ, మల్టీపుల్ లాంగ్వేజెస్ పరంగానూ.. తమిళ్లో కూడా ఇది మన సినిమా అని వాళ్లు యాక్సెప్ట్ చేయగలగాలి. అలా మేం చేయగలిగాం. హిందీ వాళ్లకి మనకంటే అప్పర్‌హ్యాండ్ ఏంటంటే పాపులేషన్. దేశంలో హిందీ మాట్లాడేవాళ్లు ఎక్కువ. హిందీతో పోల్చితే తెలుగు మాట్లాడేవాళ్లు తక్కువ. కోటి మంది సినిమా చూస్తే వందకోట్లు వసూలు చేస్తుంది సినిమా. మూడు కోట్లమంది చూస్తున్నారంటే 300 కోట్లు ఏ సినిమా అయినా ఈజీగా వసూలు చేస్తుంది. హాలీవుడ్ సినిమాలకి ప్లస్ ఏంటంటే ప్రపంచం మొత్తం ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు. దాని తర్వాత హిందీ వాళ్లకి బిగ్గెస్ట్ పాపులేషన్. ఆ తర్వాత తెలుగువాళ్లం. మన తర్వాత తమిళ్. మనమందరం హిందీ, తమిళం, మలయాళం సినిమాలు చూస్తున్నాం. వాళ్లు మన సినిమాల్ని విపరీతంగా చూస్తున్నారు. ‘గీత గోవిందం’ సినిమాని తమిళ్లో డబ్బింగ్ కూడా చేయించలేదు. కానీ, సబ్ టైటిల్స్‌తో విపరీతంగా చూశారు. ఎందుకంటే ఒక ఎమోషన్.. ఒక పెర్ఫార్మెన్స్.. మ్యూజిక్.. ‘ఇంకేం ఇంకేం కావాలే’ తెలుగు సాంగ్. దేశం మొత్తం ఆ పాట ఎందుకంత హిట్ అయ్యిందంటే మ్యూజిక్. ఓ కథకి బారియర్ ఉండదు. పక్క రాష్ట్రాల్లో నేను సినిమాని ప్రమోట్ చేయలేదు. ఏ ఎఫర్ట్ పెట్టలేదు. అయినా వాళ్లు ఆదరిస్తున్నారు. మీరు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు కానీ, మీకు ఇంకా కరెక్టయిన పాత్రలు పడలేదేమో? మీ సక్సెస్‌ని చూసి పేరెంట్స్ ఎలా ఫీల్ అవుతుంటారు? నా పేరెంట్స్ కంప్లీట్లీ హ్యాపీ. ఓ శాటిస్ఫ్యాక్షన్. పేరెంట్స్‌కి బిగ్గెస్ట్ ఆనందం ఏంటంటే పిల్లల సక్సెస్‌ని చూడటం.. పిల్లలు సెటిల్ అవ్వడం చూడటం.. మనం యంగ్ ఏజ్‌లో సక్సెస్ అయితే వాళ్లు దాన్ని కొంచెం ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. ముసలివాళ్లయ్యాక సక్సెస్ అయితే ఏముంటుంది? పూజలు, హాస్పిటల్స్ అంటూ తిరగడం తప్ప. యంగ్ ఏజ్‌లో సక్సెస్ అయితే నువ్వూ ఎంజాయ్ చేస్తావు. మేమూ ఎంజాయ్ చేస్తాం. నువ్వు పెద్దయ్యాక సక్సెస్ అయితే మనం కాదు నీ పిల్లలు ఎంజాయ్ చేస్తారు. మనం 40–45 ఏజ్‌లో సక్సెస్ అయితే మన పిల్లలు ఎంజాయ్ చేస్తారు మనం చేయలేం. అది నాకు చాలా ఇంపార్టెంట్. మా పేరెంట్స్ రిలాక్స్ అయిపోవాలి.. కంఫర్టబుల్‌గా బతకాలి. అది యంగ్ ఏజ్‌లోనే కావాలి ఎలాగైనా అనే మోటివేషన్ నాలో ఉండేది. గత ఆరేడు నెలల్లో నేను ఇంట్లో చాలా తక్కువగా ఉన్నా. షూటింగ్ కోసం చెన్నై, హైదరాబాద్.. తిరుగుతున్నా. షూటింగ్ నుంచి నేను లేట్‌నైట్ ఇంటికొచ్చే సరికి పడుకుండిపోయేవాళ్లు. ఈ ఇంటర్వ్యూకి వస్తుంటే అమ్మ, నాన్నలను చూశా. చాలా హ్యాపీగా ఉన్నారు. బిగ్ హగ్ ఇచ్చి, ముద్దులు పెట్టి గో అండ్ టేక్ కేర్ అన్నారు. వారి కళ్లలో ఆ గర్వం కనిపించింది. దాంతో నేను చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఇది వాళ్లకు ఇవ్వగలిగాననే సంతృప్తి చాలు. మీరు చాలామంది డైరెక్టర్లతో పనిచేశారు. ‘నోటా’ డైరెక్టర్ ఆనంద్ శంకర్‌గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది? ఆనంద్కీ, తరుణ్ భాస్కర్‌కి వర్కింగ్ స్టైల్లో ఓ పోలిక ఉంది. వాళ్ల ప్లానింగ్ ఎలా ఉంటుందంటే.. ప్రీ లంచ్.. ఆఫ్టర్ లంచ్.. నైట్ .. ఏ సన్నివేశాలు ఎలా తీయాలనే క్లారిటీ ఉంటుంది. టెకి ్నకల్ అంశాలపై చక్కని పట్టుంది. కొన్ని సినిమాల సన్నివేశాలు తీసేటప్పుడు పదిసార్లు తీసుకుని ఎడిటింగ్ రూంలో కూర్చుని ఫైనల్‌గా ఏది కావాలో అది తీసుకుంటారు. వీళ్లు ఏంటంటే కావాల్సింది మాత్రమే తీసుకుంటారు. దాని వల్ల మన పని తక్కువ అవుతుంది, షూటింగ్ డేస్ తక్కువ అవుతాయి. ప్రొడక్షన్ ఖర్చు కూడా. ఏది కావాలంటే అది పర్ఫెక్ట్గా వచ్చేవరకు ఐదు సార్లయినా తీసుకోవచ్చు. దానివల్ల ఎటువంటి ప్రెజర్ అనిపించదు. పక్కా ప్రణాళికతో ఉంటారు. సరదా మనుషులు. సెన్సాఫ్ హ్యూమర్ ఉంది. మా సెట్స్ చాలా రిలాక్సింగ్‌గా ఉంటాయి. జోకులు వేసుకుంటూ నవ్వుకుంటుంటాం. పని ఒత్తిడి ఉండి, మనుషులతో ఒత్తిడి ఉంటే పనిచేయడం కష్టంగా ఉంటుంది. వీళ్లు అలా కాదు. పనివరకే సీరియస్. ఆ తర్వాత ఫుల్ ఫన్. చివరికి షాట్ అయిపోగానే కెమెరామెన్ కూడా. కె.రవిచంద్రన్ అని ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరామెన్స్ ఉన్నారు. వాళ్లబ్బాయి సంతాన కృష్ణన్ ఈ చిత్రానికి కెమెరా చేశారు. యంగ్‌బాయ్. పాతికేళ్లు కూడా ఉండవు. మేమంతా యంగ్ బంచ్ కావడంతో సెట్స్‌లో చాలా ఫన్ ఉండేది. మంత్రి కేటీఆర్‌కి మీరు చాలా క్లోజ్. ఆయన మిమ్మల్ని ఓపెన్‌గానే అభినందిస్తుంటారు. రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా? రామ్ అన్నతో (కేటీఆర్) నాకు ఉన్నది ఫ్రెండ్షిప్ అనుకుంటారు. ఆయనంటే నాకు చాలా గౌరవం. ఆయన ఓ బాధ్యతగల మంత్రి. ఓ లీడర్.. ఓ యాక్టర్‌గా ఆయన నన్ను అభినందిస్తుంటారు. నేను చేసేవి ఆయనకు ఇష్టం.. ఓ లీడర్‌గా ఆయన చేసేవి నాకు ఇష్టం. దాన్ని నేను ఫ్రెండ్షిప్ అనుకోవడం తప్పు. నేనెప్పుడూ ఏదీ ఆయన్ని అడగను. నేను ‘ఫిల్మ్‌ఫేర్’ అవార్డు ఇచ్చేద్దామనుకున్నప్పుడు.. మన స్టేట్ నుంచి వచ్చినవాడు మన రాష్ట్రం కోసం ఏదో చేస్తుండు అనుకున్నాడు.వాళ్లేం చేశారు వీళ్లేం చేశారని ఓ పౌరుడిగా మనం కంప్లైంట్ ఇస్తుంటాం. నువ్వు ఏం చేశావన్నది ముఖ్యం. మనవైపు నుంచి చేస్తున్నానని వచ్చారు. నేను ఆయన్ని ఎందుకు ఇష్టపడతానంటే.. జనరల్‌గా రాజకీయాలంటే.. కెమెరాలుంటే ఓ చెట్టు నాటి తర్వాత ఎవరి పనుల్లోకి వారు వెళ్లిపోతారు. మా ఇంట్లో ఆయన, నేను ఉన్నప్పుడు ఏ కెమెరా లేదు.. దీని గురించి నేను ఇప్పటి వరకూ ఎక్కడా మాట్లాడలేదు. మన సిటీ అది. చెట్లను చూసుకోవాలి కదా. ఎక్కడికి పోయినా వీవర్ల గురించి మాట్లాడతారు. విజయ్.. నువ్వు చేనేత వస్త్రాలు వేసుకోవాలి. నిన్ను ఇంత మంది ఫాలో అవుతున్నారు కదా అంటారు. ఆయన వారంలో ఏదో ఓ రోజు వేసుకుంటారట. ప్రతి బుధవారం నువ్వు వేసుకో అన్నారు. కెమెరా లేకున్నా ఆయన భవిష్యత్ గురించి బ్రాడ్మైండెడ్గా ఆలోచిస్తారు కాబట్టే ఇష్టం. మీ పబ్లిక్ ఇమేజ్‌ని మీరు ముందుకు తీసుకెళ్లే ఆలోచన ఉందా? తీసుకెళ్లొచ్చు. ఐ మైట్ అన్నదానికి నన్ను హోల్డ్ చేయకండి. చేయాలిరా అవసరం ఉంది అని నాకు అనిపిస్తే చేస్తా. మీరు ఇంత తొందరగా దూసుకొచ్చేసి మొత్తం బాక్సాఫీసులో అందరూ విజయ్ దేవరకొండ.. విజయ్ దేవరకొండ అంటుంటే మీకేమైనా కొంచెం అసౌకర్యంగా ఉంటుందా? ఇదివరకు ఉన్న యాక్టర్స్‌తో మూవ్ అవుతున్నప్పుడు ఎప్పుడైనా అనిపించిందా? నేను యాక్ట్ర్స్తో ఎప్పుడూ మూవ్ అవ్వలేదు. నేను కలిసే కొంతమంది యాక్టర్లు ఎవరంటే రానా. ఆయనెప్పుడూ కూల్‌గా ఉంటారు. మా ప్రొడ్యూసర్లు మన సినిమా ఇంత కలెక్ట్ చేసింది అంత కలెక్ట్ చేసిందని పంపిస్తుంటే.. సార్.. ఇవన్నీ నాకొద్దు. మీరే చూసుకోండి అని చెప్పాను. 100కోట్లు అంటూ పోస్టర్స్‌ని రానాగారు పంపించి ఎగై్జట్‌మెంట్‌తో కంగ్రాట్స్ చెప్పారు. ‘ఎవడే సుబ్రమణ్యం’ నుంచి నానీతో ప్రయాణం చేస్తున్నా కాబట్టి కొంచెం కంఫర్ట్‌గా ఫీలవుతా. ‘ఎవడే సుబ్రమణ్యం’ డైరెక్టర్ నాగి (నాగ్ అశ్విన్), మేం కలిసినప్పుడు సినిమా గురించి చాలా తక్కువ మాట్లాడుకుంటాం. డైరెక్టర్లు తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా.. ఇలాంటివాళ్లు నాకు పర్సనల్‌గా బాగా కనెక్ట్ అయ్యారు. మా ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కూడా నాగి, స్వప్నాదత్.. వీళ్లందరూ ఉంటారు. సినిమాలకన్నా కూడా మా పర్సనల్ బాండ్ ఎక్కువ. తారక్, బన్నీ అన్నలను కలిసా. ప్రొఫెషనల్‌గా వాళ్లకి నా వర్క్ నచ్చింది. ఇంటికి పిలిచి అభినందించి ప్రోత్సహిస్తుంటారు. పక్క రాష్ట్రాల్లోకెళ్లినప్పుడు ఆ క్రేజ్ ఎలా ఉంటుంది? అది హైదరాబాదా? చెన్నైనా? అన్నది అర్థం కాదు. చుట్టూ చేరి ‘తలైవా తలైవా’ (నాయకుడు) అని అరిచేస్తుంటారు. వాళ్లు ఎవరినైనా ఇష్టపడితే అలాగే పిలుస్తుంటారు. మీకు స్పెషల్‌గా ఓ బిరుదు కాయిన్ చేయాలి. ఎందుకంటే.. రొమాంటిక్ రోల్స్ చేస్తారు. పంచ్ కొట్టే పాత్రలు చేస్తారు. ‘నోటా’ చిత్రంలో ఓ డిఫరెంట్ రోల్ చేశారు. కాబట్టి మీకు అన్ని షేడ్స్ ఉండే పేరు కావాలి. మధ్యలో అందుకుంటూ... ‘రాజాది రాజా’ ఆ టైప్ ఏమైనా పెట్టుకోనా? రాజాది రాజా విజయ్ దేవరకొండ అలా.. దేవాది దేవా విజయ్ దేవరకొండ మస్తుగుంది. (నవ్వుతూ). ఇట్లాంటిది ఏమైనా పెట్టుకుందాం. మనకు ఈ స్టార్.. ఆ స్టార్ వద్దు. కొత్తగా పెట్టుకుందాం. కొత్త ట్రెండ్ స్టార్ట్ చేద్దాం. మిమ్మల్ని మంచి ఆంధ్ర సినిమాలో చూడాలి. అండీ అనే యాసలో మీరు మాట్లాడాలి. నేను అలా మాట్లాడితే కామెడీగా ఉంటుందేమో. వీడు మిమిక్రీ చేస్తుండ్రా అని జనాలకి అనిపించొద్దు. జెన్యూన్‌గా, మంచిగా అనిపించాలి. లేదంటే కోపమొస్తుంది. ‘డియర్ కామ్రేడ్’ సినిమాలో విజయవాడ యాసలో చేస్తున్నా. చాలా మంది అమ్మాయిలు మీకు ఫ్యాన్స్ ఉంటారు కదా. రీసెంట్ ఫిల్మ్స్ తర్వాత మీ క్రేజ్ చూసి మనసులు పారేసుకుంటున్న అమ్మాయిలు కూడా ఉన్నారనుకుంటా? ఉండి ఉంటారేమో! (నవ్వుతూ).. దాని గురించి నేనేం చెప్పగలను. ఇట్స్ నైస్. ఇట్స్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఇప్పుడు నేను ఓ బ్యాంక్‌లో పనిచేస్తుంటే ఇద్దరు ముగ్గురు కొలీగ్స్‌కి నచ్చేవాడినేమో? యాక్టర్‌గా ఉన్నా కాబట్టి ఇంత పెద్ద స్క్రీన్‌పై ప్రపంచమంతా చూస్తున్నారు కాబట్టి ఎక్కువ మంది ఇష్టపడుతుంటారు. ఐ థింక్ ఇట్స్ పార్ట్ ఆఫ్ ది జాబ్. అదే ఊర్లో ఉండి పొలం చూసుకుంటుంటే.. నేను, నా బర్రెలు ఇదే.. నేను ఓ యాక్టర్‌ని. రోజూ నన్ను చూస్తుంటారు. నా మాటలు వాళ్లకి రీచ్ అవుతుంటాయి కాబట్టి ఇదంతా అశాశ్వతమే. – ఇంటర్వ్యూ: స్వప్న, సాక్షి టీవీ -
తమిళ బిగ్‌బాస్‌లో తెలుగు హీరో
ఇప్పటికే తెలుగు బిగ్ బాస్‌లో సందడి చేసిన టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ.. ఇప్పుడు తమిళ బిగ్‌బాస్‌లో అడుగు పెడుతున్నాడు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన ద్విభాష చిత్రం ‘నోటా’ ప్రమోషన్ కోసం విజయ్ తమిళ బిగ్‌బాస్ షోకు వెళ్లాడు. లోకనాయకుడు కమల్ హాసన్ అక్కడి బిగ్‌బాస్ రియాలిటీ షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ షోకు వెళ్లి.. అక్కడ స్టేజ్ పై తన సినిమాను ప్రమోట్ చేసుకునే అవకాశం విజయ్ దేవరకొండకే దక్కింది. అక్టోబర్ 5న విడుదల కానున్న ‘నోటా’ సినిమాను తమిళ బిగ్‌బాస్ లో ప్రమోట్ చేసుకున్నాడు ఈ సెన్సెషన్ స్టార్. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదల కానుంది. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. -
‘నోటా’ సెన్సార్‌పై విజయ్ కామెంట్!
టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ రాజకీయ నేపథ్య కథతో తెరకెక్కుతున్న నోటా చిత్రంతో ప్రేక్షకులముందుకు రానున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్‌కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తాజాగా సెన్సార్‌కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అక్టోబర్ 5న విడుదల కానున్న ఈ మూవీ తమిళ్ వర్షెన్కు ‘యూ’ సర్టిఫికేట్ లభించింది. అయితే తెలుగు వర్షెన్కు సంబంధించిన సెన్సార్ సభ్యులు ఏ సర్టిఫికేట్ ఇస్తారో అంటూ సెటైరికల్ కామెంట్ చేశాడు విజయ్ దేవరకొండ. ‘తమిళ్లో ‘ఏ’ సర్టిఫికేట్ అనుకుంటే ‘యూ’ వచ్చింది.. మరి నాకు ఇష్టమైన తెలుగు సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇస్తుందో చూడాలి’ అంటూ ట్వీట్ చేశాడు. గతంలో ‘అర్జున్ రెడ్డి’ సమయంలో సెన్సార్ విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ‘నోటా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 30న విజయవాడ, అక్టోబర్ 1న హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు మేకర్స్. ఇటీవలే గీతగోవిందంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన విజయ్.. ‘నోటా’తో మళ్లీ సందడి చేయనున్నాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. We go U 😳 Even I voted A. Let's see what my favourite Telugu Censorboard will give me 🤔#MaranaWaiting https://t.co/TBDNMnfo2a — Vijay Deverakonda (@TheDeverakonda) September 28, 2018 -
నోటాతో మనసులు గెలవాలి
సినిమా: నోటా చిత్రం విడుదల కోసం ‘మరణ వెయిటింగ్’(ఆతృతగా ఎదురుచూడటం)లో ఉన్నానని ఆ చిత్ర కథానాయకుడు విజయ్‌దేవరకొండ వ్యాఖ్యానించారు. తెలుగులో పెళ్లి చూపులు, అర్జున్‌రెడ్డి, గీతగోవిందం చిత్రాలతో అనూహ్య క్రేజ్ సంపాదించుకున్న ఈయన తమిళంలో హీరోగా పరిచయం అవుతున్న తొలి చిత్రం ఇది. స్టూడియో గ్రీన్ పతాకంపై జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న (తమిళం, తెలుగు)ద్విభాషా చిత్రం నోటా. సంజనా నటరాజన్ హీరోయిన్గా నటిస్తున్న ఇందులో సత్యరాజ్, నాజర్, ఎంఎస్.భాస్కర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అరిమానంబి, ఇరుముగన్ చిత్రాల ఫేమ్ ఆనంద్‌శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శ్యామ్.సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం గురువారం మధ్యాహ్నం స్థానిక సాలిగ్రామంలోని ప్రసాద్‌ల్యాబ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కథానాయకి సంజనా నటరాజన్ మాట్లాడుతూ ఒక లఘు చిత్రంలో నటించి ఆ తరువాత వెబ్ సీరీస్‌లో నటిస్తున్న తనను కనుగొని ఈ చిత్రం ద్వారా కథానాయకిగా అవకాశం కల్పించిన దర్శకుడు ఆనంద్శంకర్కు, నిర్మాత జ్ఞానవేల్ రాజాకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. చిత్ర దర్శకుడు ఆనంద్‌శంకర్ మాట్లాడుతూ చిత్ర స్క్రిప్ట్ సిద్ధం అయిన తరువాత ఇందులో హీరో ఎవరన్న ప్రశ్న ఎదురైందన్నారు. కారణం ఇందులో హీరోతో పాటు ఇతర నటీనటులకు నటనకు అవకాశం ఉంటుందన్నారు. ఆ సమయంలో తెలుగులో పెళ్లిచూపులు, అర్జున్‌రెడ్డి అంటూ వెరైటీ చిత్రాలతో విజయవంతమైన చిత్రాలతో నమ్మకమైన హీరోగా విజయ్ దేవరకొండ ఎదుగుతున్నారన్నారు. విజయ్‌దేవరకొండను నోటా చిత్రం ద్వారా తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేస్తే బాగుంటుందని భావించానన్నారు. అందుకు నిర్మాత జ్ఞానవేల్‌రాజా పచ్చజెండా ఊపడంతో విజయ్‌దేవరకొండను కలిసి కథ చెప్పానన్నారు. అలా ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లిందని తెలిపారు. చిత్ర కథానాయకుడు విజయ్‌దేవరకొండ మాట్లాడుతూ ఈ చిత్ర తొలి పాత్రికేయుల సమావేశంలో ఎణ్ణిత్తుణిక్కరుమమ్ అనే తిరుక్కురల్ వ్యాఖ్యలను బట్టి పడుతూ కూర్చున్నానని అన్నారు. అయితే ఇప్పుడు తిరుక్కురల్‌ను అప్పజెప్పేస్థాయికి వచ్చానన్నారు. ఈ చిత్రం గురించి ట్విట్టర్లలో తరచూ మరణ వెయిటింగ్ అని పోస్ట్ చేశారని, అదే విధంగా ఈ చిత్ర విడుదల కోసం తానూ మరణ వెయిటింగ్లో ఉన్నానని పేర్కొన్నారు. నోటా చిత్రం ద్వారా తమిళ ప్రేక్షకుల మనసులను గెలవాలని ఆశ పడుతున్నానని అన్నారు. విజయ్‌దేవరకొండ తిరుక్కురల్‌లోని ఒక వచనాన్ని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. Tamil Nadu, Telugu Rashtralu, Kerala, Karnataka & Rest of the World. Theatre la Sandhikkalaam.#MaranaWaiting#NOTAonOct5. https://t.co/eCR3XoS2t0 — Vijay Deverakonda (@TheDeverakonda) 27 September 2018 -
పబ్లిక్ మీట్
‘‘అర్జున్ రెడ్డి, గీతగోవిందం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘నోటా’. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. మెహరీన్ కథానాయిక. అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అందులో భాగంగా విజయవాడ, హైదరాబాద్‌లలో భారీ పబ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ 30న విజయవాడ, అక్టోబర్ 1న హైదరాబాద్‌లో ఈ మీటింగులకు ‘ది నోటా పబ్లిక్ మీట్’ అని పేరు పెట్టారు. నాజర్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన పొలిటికల్ డ్రామా ఇది. మెహరీన్ ఇందులో జర్నలిస్ట్ పాత్రలో నటించారు. ‘‘ఇటీవల రిలీజైన ‘నోటా’ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. -
మాటల తూటా
‘అర్జున్ రెడ్డి, గీత గోవిందం’ సినిమాలతో సూపర్ సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు హీరో విజయ్ దేవరకొండ. తన లేటెస్ట్ మూవీ ‘నోటా’లో యువ రాజకీయ నేతగా కనిపించనున్న సంగతి తెలిసిందే. సినిమాలో పదవీ బాధ్యతలు ఎప్పుడు తీసుకున్నారో థియేటర్లో తెలిసే సమయం ఆసన్నమైంది. విజయ్ దేవరకొండ, మెహరీన్ కౌర్ జంటగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ, తెలుగు ద్విభాషా పొలిటికల్ థ్రిల్లర్ ‘నోటా’. ఈ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు విజయ్. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమాను అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో మెహరీన్ జర్నలిస్ట్‌గా కనిపించనున్నారు. ‘గీత గోవిందం’లో కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్లో కనిపించిన విజయ్ దేవరకొండ ‘నోటా’లో అందుకు పూర్తి భిన్నంగా కనిపించనున్నారు. వాడి వేడి డైలాగ్స్‌తో ఈ చిత్రం ఉత్కంఠభరితంగా సాగుతుందట. నాజర్, సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకు సంగీతం: శ్యామ్ సీ.యస్, కెమెరా: శాంతన్ కృష్ణన్. -
‘నోటా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ రాజకీయ నాయకుడిగా నటిస్తున్న సినిమా నోటా. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. తెలుగు వర్షన్ రచయిత, నిర్మాతల మధ్య వివాదంతో ఈ సినిమా రిలీజ్‌పై సందిగ్ధత నెలకొంది. అయితే తాజా చిత్రయూనిట్ సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించారు. అక్టోబర్ 5న నోటా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్‌కు సూపర్బ్ రెస్సాన్స్ వస్తోంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజ నిర్మిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్నారు. -
విజయ్ దేవరకొండ ‘నోటా’పై వివాదం
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న ‘నోటా’ చిత్రంపై వివాదం చోటు చేసుకుంది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని జ్ఞానవేల్ రాజ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ మూవీ తెలుగు రచన హక్కుల విషయంలో వివాదం చోటు చేసుకుంది. ఒప్పందాన్ని అతిక్రమించి తనను చిత్రం నుంచి తొలిగించారని రచయిత శశాంక్ వెన్నలకంటి పోలీసులను ఆశ్రయించాడు. చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజాపై చెన్నై పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశాడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న నోటాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇటీవల రిలీజ్ అయిన టీజర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. తెలంగాణలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఈ మూవీ టైటిల్‌పై కూడా వివాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఏదో ఒక పార్టీకి కాకుండా నోటాకు ఓటెయ్యమనేలా ప్రేరేపించేలా ఈ మూవీ టైటిల్ ఉందని సోషల్ మీడియా వేదికగా కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. విజయ్ దేవరకొండ పొలిటికల్ లీడర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ 4న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
విజయ్ దేవరకొండ సినిమాలో టాప్ డైరెక్టర్
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. టాక్సీవాలా చిత్రాన్ని ఇప్పటికే పూర్తి చేసిన విజయ్.. బైలింగ్యువల్ సినిమాగా తెరకెక్కుతున్న నోటాతో పాటు డియర్ కామ్రేడ్ సినిమాల్లో నటిస్తున్నారు. త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న నోటాకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇటీవల రిలీజ్ అయిన టీజర్‌కు సూపర్బ్ రెస్సాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఈ సినిమాలో దర్శకుడు మురుగదాస్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. నోటా దర్శకుడు ఆనంద్ శంకర్.. మురుగదాస్ దగ్గర దర్శకత్వం శాఖలో పనిచేశారు. ఇప్పుడు తన గురువునే డైరెక్ట్ చేస్తుండటంపై ఆనంద్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ దేవరకొండ పొలిటికల్ లీడర్‌గా నటిస్తున్న ఈ సినిమాలో మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్నారు. -
రాజ్యసభ ఎన్నికల్లో ‘నోటా’ తొలగింపు
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజ్యసభ, శాసన మండలి ఎన్నికలకు సంబంధించిన బ్యాలెట్ పేపర్లలో నోటా(నన్ ఆఫ్ ది ఎబో– పై వారు ఎవరూ కాదు) గుర్తును తొలగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మంగళవారం ప్రకటించింది. రాజ్యసభ ఎన్నికల బ్యాలెట్ ఆప్షన్లకు నోటా వర్తించదని స్పష్టంచేస్తూ ఆగస్టు 21న సుప్రీంకోర్టు తీర్పునివ్వడం తెల్సిందే. లోక్‌సభ, శాసనసభ వంటి ప్రత్యక్ష ఎన్నికల్లో మాత్రమే నోటాను వినియోగించాలని కోర్టు సూచించింది. రాజ్యసభ ఎన్నికల్లో నోటాకు చోటు కల్పిస్తూ ఈసీ ఇచ్చిన నోటిఫికేషన్‌కు సవరణలు సూచిస్తూ సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌ల బెంచ్ తీర్పు చెప్పింది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్ల కోసం మాత్రమే ‘నోటా’ అని కోర్టు వ్యాఖ్యానించింది. -
విజయ్ దేవరకొండ నోటా ట్రైలర్ రిలీజ్
-
‘ముఖ్యమంత్రి పదవా.. మ్యూజికల్ చైర్స్ ఆటా?’
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ నోటా. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో జోరు పెంచారు చిత్రయూనిట్. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్‌హిట్ తరువాత తెరకెక్కుతున్న నోటాతో విజయ్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. విజయ్ సరసన మెహరీన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకుడు. బుధవారం స్నీక్‌పీక్ పేరుతో 30 సెకన్ల టీజర్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ ఈ రోజు (గురువారం) ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య విజయ్ దేవరకొండను తమిళ ఇండస్ట్రీకి ఆహ్వానిస్తూ నోటా తమిళ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. అదే సమయంలో తెలుగు ట్రైలర్‌ను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు చిత్రయూనిట్. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈసినిమాలో విజయ్ దేవరకొండ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నాడు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్ 4న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
నోటా : రాజకీయ నేతగా రౌడీ
సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ థ్రిల్లర్ మూవీ నోటా. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం లాంటి సూపర్హిట్ల తరువాత తెరకెక్కుతున్న ఈ సినిమాతో విజయ్ కోలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకుడు. త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు చిత్రయూనిట్. తాజాగా స్నీక్‌పీక్ పేరుతో ఓ 30 సెకన్ల టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్లో విజయ్ పబ్‌లో ఎంజాయ్ చేసే కుర్రాడిగా తరువాత ఓ రాజకీయనేతగా రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించాడు. ఈ నెల 6 సాయంత్రం 4 గంటలకు అఫీషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను అక్టోబర్ 4న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
నోటా : డిఫరెంట్ లుక్‌లో విజయ్ దేవరకొండ
-
రాజకీయాలంటే చిరాకంటోన్న ‘అర్జున్ రెడ్డి’
నాకు రాజకీయాలంటే చిరాకు. కానీ, ఒకవేళ నేనే రాజకీయాలు చేయదలచుకుంటే ఇలానే చేస్తాను అంటున్నారు విజయ్ దేవరకొండ. ‘గీత గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ సినిమా ‘నోటా’. మెహరీన్ కథానాయిక. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ్, తెలుగు భాషల్లో రూపొందింది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా ఈ సినిమా నిర్మించారు. పాలిటిక్స్‌లో తిరుగుబాటు చేసిన ఓ యంగ్ పొలిటీషియన్‌గా ఈ చిత్రం కథ ఉండబోతోందని సమాచారం. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని సోమవారం రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను ఈనెల 6న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం పేర్కొంది. నాజర్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్.సి. -
రాజ్యసభ ఎన్నికల్లో ‘నోటా’కు నో: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో ‘నోటా’ను ప్రవేశపెడుతూ కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన నోటిఫికేషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇలాంటి చర్యలు అవినీతి, ఫిరాయింపులను ప్రోత్సహిస్తాయని పేర్కొంది. నోటా విధానం ప్రత్యక్ష ఎన్నికలకే పరిమితమని, నైష్పత్తిక ప్రాతిపదికన నిర్వహించే పరోక్ష ఎన్నికలకు అనుమతించబోమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని బెంచ్ స్పష్టం చేసింది. ‘ఓటింగ్ ప్రక్రియలో నోటా వాడకాన్ని విశ్లేషించినట్లయితే..గోప్యతకు తావులేని రాజ్యసభ ఎన్నికల్లో ఆ విధానం చెడు ప్రభావం చూపుతుంది. ఒక వ్యక్తి ఒకటే ఓటు కలిగి ఉన్నా, అది చాలా విలువైనది. ఓటు విలువను నిర్ధారించేందుకు ప్రత్యేక ఫార్ములా ఉంది. ఎన్నికైన వ్యక్తి ఒక రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తాడు కానీ, ఒక నియోజక వర్గానికి కాదు. నోటాను అనుమతిస్తే ఫిరాయింపులు మరింత పెరుగుతాయి. పరోక్ష ఎన్నికల్లో దాన్ని అమలుచేస్తే ప్రజాస్వామ్య పవిత్రత దెబ్బతినడమే కాకుండా, అవినీతి, ఫిరాయింపు భూతాలు పురివిప్పుతాయి’అని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది. -
మీకెందుకు అనవసరంగా ఇబ్బందులు?
న్యూఢిల్లీ: ప్రత్యక్ష ఎన్నికల్లో వ్యక్తిగత ఓటరు కోసం ఉద్దేశించిన నోటాను రాజ్యసభ ఎన్నికల్లోనూ వినియోగించడంపై కేంద్ర ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. నోటా వినియోగాన్ని ప్రశ్నిస్తూ గుజరాత్ మాజీ కాంగ్రెస్ చీఫ్ శైలేశ్ పర్మార్ వేసిన ఓ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం.. ఈసీకి ఈ ప్రశ్న వేసింది. ‘ఓ రాజ్యాంగబద్ధమైన సంస్థ.. రాజ్యాంగవ్యతిరేక చర్యలో ఎందుకు భాగస్వామి కావాలి? రాజ్యభ ఎన్నికల్లో ఓ ఎమ్మెల్యే ఓటేయకపోతే అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశముంది. కానీ నోటాను ప్రవేశపెట్టడం ద్వారా ఆ వ్యక్తి ఓటేయకుండా మీరు (ఈసీ) ఎలా ప్రోత్సహిస్తారు. ఓటు వేయాలా వద్ద అనేది సభ్యుడి విచక్షణ. ఎన్నికల సంఘం నోటా ఆప్షన్ ఇవ్వకూడదు. రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహిరంగ బ్యాలట్ ఓటింగ్ ద్వారా అవినీతికి జరకుండా క్రాస్ ఓటింగ్‌కు ఆస్కారం లేకుండా చేయవచ్చు. మీరెందుకు అనవసరంగా ఇబ్బందులు కొనితెచ్చుకుంటారు’ అని పేర్కొంది. దీనిపై అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ కూడా.. రాజ్యసభ ఎన్నికల్లో నోటా ఉండాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ‘ఓ పార్టీ మరో పార్టీతో ముందుస్తు అవగాహన ఆధారంగా ఓటు వేస్తుంది. పార్టీ విప్ జారీ చేస్తే ఎమ్మెల్యే కట్టుబడి ఉండాల్సిందే. అలాంటప్పుడు నోటాకు అర్థమేముంద’ ని పేర్కొన్నారు. కాంగ్రెస్ తరపున అభిషేక్ మనుసింఘ్వీ వాదనలు కూడా విన్న ధర్మాసనం తీర్పును రిజర్వులో పెట్టింది. -
రైలు ప్రయాణంలో చేదు అనుభవం
తమిళసినిమా: సినిమా తారలను ముఖ్యంగా హీరోయిన్లు సగటు ప్రేక్షకుడికి కలల రాణులు. కార్లు, బంగ్లాలు, సమాజంలో వారికున్న పేరు ఇత్యాధి వారి జీవన విధానాలు సామాన్యుడిని అబ్బురపరుస్తాయి. అయితే పీత కష్టాలు పీతవి అన్న సామెత మాదిరి హీరోయిన్గా పేరు సంపాదించుకున్న హీరోయిన్లు ఒక్కోసారి అనుకోని ఇబ్బందులను ఎదుర్కోకతప్పదు. నటి మెహరీన్ కూడా ఇటీవల అలాంటి ఇక్కట్లనే ఎదుర్కొంది. ఈ బ్యూటీ టాలీవుడ్లో యువ స్టార్స్ సరసన నటిస్తూ మంచి పేరు తెచ్చుకుంటోంది. కోలీవుడ్‌లో నోటా అనే చిత్రంలో నాయకిగా నటిస్తోంది. అర్జున్‌రెడ్డి చిత్రం ఫేమ్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటిస్తున్నారు. దీంతో తెలుగు, తమిళ చిత్రాల షూటింగ్ అంటూ విమానాల్లోనే తిరిగేస్తున్న మెహరీన్ నోటా చిత్రం షూటింగ్లో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి చెన్నై రావడానికి ఫ్లైట్ టికెట్ దొరకపోవడంతో రైలు ప్రయాణం చేయడానికి సిద్ధమైంది. అయితే నిర్మాతలు తన కోసం బుక్ చేసిన బెర్త్‌ను అప్పటికే ఒక వ్యక్తి ఆక్రమించుకోవడం, అతను పుల్గా మద్యం తాగి ఉండడంతో నటి మెహరీన్ భయంతో వణికిపోయింది. చాలా సమయం అలానే రైలులో నిలబడే ప్రయాణం చేసింది. ఆ తరువాత పరిస్థితిని నిర్మాతకు ఫోన్ చేసి చెప్పడంతో ఆయన ఒక కారులో తన మనుషులను పంపి ఆమెను అదే కారులో చెన్నైకి తీసుకురావడానికి ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని నోటా చిత్ర వర్గాలు తెలిపాయి. నిజం చెప్పాలంటే సెలబ్రిటీలకు రైలు ప్రయాణమే కాదు, ఫ్లైట్ ప్రయాణాల్లోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే నడిగర్ సంఘ నిర్వాహకులు హీరోహీరోయిన్ల ప్రచారంలో తగిన భద్రత కల్పించాలని నిర్మాతలకు సూచిస్తున్నారు. అయినా నటి మెహరీన్‌కు ఎదురైన లాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. -
మ్యూజిక్ వీడియోలో ‘అర్జున్ రెడ్డి’
వరుస సినిమాలతో ఫుల్ ఫాంలో ఉన్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ త్వరలో ఓ మ్యూజిక్ వీడియోలో సందడి చేయనున్నారు. టాక్సీవాలా, గీత గోవిందం, నోటా, కామ్రేడ్ సినిమాలు చేస్తున్న విజయ్ ఇంత బిజీ షెడ్యూల్లోనూ మ్యూజిక్ వీడియోలో నటించేందుకు అంగీకరించాడు. భానుశ్రీ తేజ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వీడియోకు సౌరభ్, దుర్గేష్‌లు సంగీతమందిస్తున్నారు. ఈ మ్యూజిక్ వీడియోను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు. ఈ వీడియోలో విజయ్ సరసన బెంగాళీ మోడల్ మాళవిక బెనర్జీ ఆడిపాడనుంది. ఇప్పటికేషూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వీడియో ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారు. -
బ్యాలెట్‌కు 8 గుర్తులే
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. పోలింగ్‌లో కీలకమైన బ్యాలెట్ పేపర్ల ముద్రణకు రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాల అధికారులను ఆదేశిం చింది. గ్రామ పంచాయతీల సంఖ్యకు అను గుణంగా ముందుగానే బ్యాలెట్ పేపర్లను ముద్రించుకుని సిద్ధంగా ఉండాలని సూచిం చింది. ఒక బ్యాలెట్ పేపరులో గరిష్టంగా ఎనిమిది గుర్తులు ఉండాలని స్పష్టం చేసింది. ఏడుగురు అభ్యర్థులతో పాటు నోటా గుర్తును ముద్రించాలని పేర్కొంది. పోటీలో ఉండే వారు ఏడుగురి కంటే ఎక్కువ మంది ఉంటే రెండు బ్యాలెట్ పేపర్లు ముద్రించాలని స్పష్టం చేసింది. పోటీలో ఉండే అభ్యర్థుల గుర్తుల చివరలో నోటా ఉండాలని సూచించింది. రెండు బ్యాలెట్ పేపర్లు ఉంటే రెండో బ్యాలెట్ చివరలో నోటా ముద్రిస్తారు. సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల పోలింగ్ బ్యాలెట్ పేపర్లలో కూడా ఇవే నిబంధనలు వర్తిస్తాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల పంచా యతీ అధికారులను ఆదేశించింది. బ్యాలెట్ పేపర్ల ముద్రణ విషయంలోనూ పోటీలో ఉండే అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. ముద్రణకు ఆర్డర్ ఇచ్చే సమయంలో ఇద్దరు పోటీలో ఉండేవి 10 శాతం ఉండాలని పేర్కొంది. ముగ్గురు పోటీలో ఉండేవి 17 శాతం, నలుగురు ఉండేవి 25 శాతం, ఐదుగురు ఉండేవి 17 శాతం, ఆరుగురు ఉండేవి 11 శాతం, ఏడుగురు ఉండేవి 8 శాతం, ఎనిమిది మంది ఉండేవి 4 శాతం, తొమ్మిది మంది ఉండేవి 3 శాతం, పది మంది ఉండేవి 2 శాతం, 11 మంది ఉండేవి ఒక శాతం ముంద్రించి సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. ఇదే పద్ధతిలో 20 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా పోలింగ్‌కు ఇబ్బంది లేకుండా బ్యాలెట్ పేపర్లు ముద్రించాలని సూచించింది. -
‘డియర్ కామ్రేడ్’ అంటున్న అర్జున్ రెడ్డి
అర్జున్ రెడ్డి సినిమాతో ఒక్కసారిగా క్రేజీ హీరోగా మారిపోయాడు విజయ్ దేవరకొండ. ఒక్క సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విజయ్, ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. రేపు (మే 9న) రిలీజ్ అవుతున్న మహానటిలో కీలక పాత్రలో నటించిన విజయ్ దేవరకొండ, మరో సినిమా టాక్సీవాలా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలతో పాటు తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘నోటా’ సినిమా రెగ్యులర్ షూటింగ్‌ను ఈ మధ్యే ప్రారంభించాడు. నోటా చిత్రం సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు విజయ్. పెళ్లిచూపులు సినిమాకు నిర్మాతగా వ్యవహరించిన యాష్ రంగినేని నిర్మాణంలో భరత్ కమ్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమాలో విజయ్ లీడ్ రోల్లో నటించనున్నాడు. ఈ సినిమాకు డియర్ కామ్రేడ్ అనే టైటిల్‌ను ఫైనల్ చేసిట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ త్వరలో సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించనున్నారు. -
నేనే డబ్బింగ్ చెబుతా : విజయ్ దేవరకొండ
తమిళసినిమా: తమిళం నేర్చుకుని తన చిత్రానికి తానే డబ్బింగ్ చెబుతానని తెలుగు యువ నటుడు విజయ్ దేవరకొండ తమిళ ప్రేక్షకులకు మాట ఇచ్చారు. ఈయనిప్పుడు నోటా చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయం అవుతున్నారు. తమిళం, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కేఈ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్నారు. మెహ్రీన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం ఇటీవలే హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సందర్భంగా గురువారం సాయంత్రం తేనాంపేటలోని నక్షత్ర హోటల్లో చిత్ర యూనిట్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి టైటిల్‌ను ప్రకటించారు. నిర్మాత జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ దర్శకుడు ఆనందశంకర్తో ఒక చిత్రం చేయాలని భావించానని మంచి కథ లభించడంతో చిత్రాన్ని తెరకెక్కిస్తునట్టు చెప్పారు. తెలుగు చిత్రం అర్జున్‌రెడ్డి తమిళ రీమేక్ హక్కులను దర్శకుడు బాలా పొందారని, ఆ చిత్రం తెలుగు వెర్షనే చెన్నై, చెంగల్పట్టు ఏరియాల్లో రూ.3కోట్లు వసూలు చేసిందని తెలిపారు. చిత్ర హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ దర్శకుడు ఆనందశంకర్ చెప్పిన కథ విని ఇలాంటి కథే తనకు సూట్ అవుతుందని భావించి చిత్రానికి అంగీకరించానని తెలిపారు. ఈ చిత్రం కోసం తమిళ భాషను నేర్చుకుని తన పాత్రకు తానే డబ్బింగ్ చెబుతానని తమిళ ప్రేక్షకులకు మాట ఇస్తున్నానని విజయ్ దేవరకొండ అన్నారు.