
అవును.. లిస్ట్‌లో ఉన్నవాళ్లు ఎవరూ నచ్చలేదు. అందుకే విజయ్ దేవరకొండ సింపుల్‌గా నోటా అనేశారు. అంటే.. ఏంటో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థులు నచ్చకపోతే ‘నన్ ఆఫ్ ది ఎబౌ’ అనే అప్షన్ ఒకటుంటుంది. అదే నోటా. ఆ బటన్ నొక్కితే చాలు.. ఆ ఓటర్ ఓటు ఎవరికీ పడదు. ఇంతకీ ఎన్నికలు రావడానికి ఇంకా చాలా టైముంది కదా.
ఇప్పుడు నోటా గురించి చెప్పడం, అది కూడా విజయ్ దేవరకొండ ఓటు వేసినట్లు వేలు చూపడం ఏంటీ అనుకుంటున్నారా? మరేం లేదు. విజయ్ దేవరకొండ, మెహరీన్ జంటగా ‘ఇంకొక్కడు’ ఫేమ్ ఆనంద్ శంకర్ దర్శకత్వంలో స్టూడియో గ్రీత పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా నిర్మిస్తున్న చిత్రానికి ‘నోటా’ అనే టైటిల్‌ని ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి సంగీతం: సి.ఎస్. శ్యామ్, కెమెరా: శాంత, ఆర్ట్: కిరణ్.