చిత్ర పరిశ్రమలో చాలామంది హీరోలు వారు చేసిన సాయాన్ని చెప్పుకోరు. ఇందులో ప్రథమంగా వినిపించే పేరు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు అని వెంటనే ఎవరైనా చెప్తారు. ఇప్పుడు తాజాగా ఆ లిస్ట్‌లో విజయ దేవరకొండ చేరిపోయారు. తన ఫౌండేషన్ ద్వారా ఎందరో జీవితాల్లో వెలుగులు నింపిన విజయ్ ఎప్పుడూ తను చేసిన సాయాన్ని చెప్పుకోలేదు. అయితే తాజాగా ఆహా తెలుగు ఓటీటీలో ప్రసారం అవుతున్న ఇండియన్ ఐడల్ 3లో విజయ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు తాము విజయ్ నుంచి సాయం పొందినట్లు తెలుపుతూ ఎమోషనల్ అయ్యారు.
విజయ్ సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు. ముఖ్యంగా లాక్‌డౌన్‌లో తన ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి సాయం చేశారు. పేదలకు నిత్యవసర సరకులను అందజేశారు. గతేడాదిలో ఖుషి సినిమా సమయంలో కూడా 100 కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున రూ. కోటి రూపాయలు అందచేసి తన మంచి మనసును చాటుకున్నారు. ఇండియన్ ఐడల్ 3లో గెస్ట్‌గా విజయ్ దేవరకొండ వెళ్లారు. ఆయన గొప్ప మనసు గురించి చెబుతూ ఓ ట్రాన్స్‌జెండర్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
'నేను ఒక ట్రాన్స్‌జెండర్‌ని సర్. మీకు థ్యాంక్స్ చెప్పాలని రెండేళ్లుగా ఎదురుచూస్తున్నా. మేము భిక్షాటనతోనే జీవిస్తాం. కానీ, కోవిడ్ సమయంలో లాక్‌డౌన్ వల్ల మేము ఇంటికే పరిమితం అయ్యాం. అప్పుడు మాకు మూడు పూటల తినేందుకు ఆహారం కూడా లేదు. అలాంటి సమయంలో సోషల్ మీడియా ద్వారా విజయ్ దేవరకొండ ఫౌండేషన్ గురించి తెలుసుకుని నాకు సాయం చేయాలని ధరఖాస్తు చేసుకున్నాను. కొన్ని నిమిషాల్లోనే నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ సమయంలో నాతో పాటు మరో 18 మంది ట్రాన్స్ జెండర్స్‌కు మీరు సాయం చేశారు.
ఆ తర్వాత నా కుటుంబానికి కూడా సాయం అందించారు. అప్పుడు నాకు అనిపించిన మాట కనిపించని దేవుడు ఎక్కడో లేడు.. మీలోనే ఉన్నాడని అనిపించింది.' అంటూ ఆ ట్రాన్స్ జెండర్ కన్నీరు పెట్టుకున్నారు. ఆ సమయంలో విజయ్ కూడా రియాక్ట్ అయ్యారు. అది నా ఒక్కడి వల్లే సాధ్యం కాలేదు. ఎంతో మంది రూ. 500, రూ.1000 తమకు తోచిన వరకు ఇచ్చారు. అలా వారందరి వల్లనే ఇది సాధ్యమైంని ఆయన అన్నారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.
'మిడిల్ క్లాస్ ఫండ్స్' పేరుతో విరాళాలు
లాక్‌డౌన్ సమయంలో మధ్యతరగతి కుటుంబాలకు సహాయం చేసే లక్ష్యంతో దేవరకొండ ఫౌండేషన్ స్థాపించబడింది. ఫౌండేషన్‌కు సుమారు రూ. 2 కోట్ల నిధులు వచ్చాయి. అందులో విజయ్ దేవరకొండ నుంచి కోటి రూపాయలు విరాళం ఇచ్చారు. 'మిడిల్ క్లాస్ ఫండ్స్' పేరుతో ఆయన విరాళాలు సేకరించి చాలా కుటుంబాలకు అండగా నిలిచారు. ఆ సమయంలో సుమారు 10వేలకు పైగా కుటుంబాలకు విజయ్ సాయం చేశారు.
Thanks cheppakarledhu, if you're fine, it's enough - @TheDeverakonda
The man with a golden heart ❤️#VijayDeverakonda pic.twitter.com/HArOPAcGOZ— Suresh PRO (@SureshPRO_) July 9, 2024
Comments
Please login to add a commentAdd a comment