![Telangana Congress Party Denied EC Nota Proposal In Local Body Elections](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/Nota_congress.jpg.webp?itok=gw_7h_EC)
హైదరాబాద్, సాక్షి: స్థానిక సంస్థల ఎన్నికల కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. పంచాయితీ ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టాలన్న ప్రతిపాదనను అధికార కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. దీంతో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే భేటీ ముగిసింది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా.. పంచాయితీ ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టాలని ఈసీ ప్రతిపాదన చేసింది. దీనికి కాంగ్రెస్ తప్ప.. అన్ని రాజకీయ పార్టీల దాదాపుగా సానుకూలంగానే స్పందించాయి. నోటాతో ఎన్నిక ఖర్చు ఎక్కువ అని, ఒకవేళ నోటాతో ఎన్నిక నిర్వహించినా సెకండ్ లార్జెస్ట్ పార్టీనే విజేతగా ప్రకటించాలని కాంగ్రెస్ ఈసీని కోరింది.
నోటాపై అభిప్రాయం సేకరణలో బీఆర్‌ఎస్ సానుకూలంగా స్పందించింది. ఏకగ్రీవానికి.. బెదిరింపులు, బలప్రదర్శన చేసే అవకాశం ఉందని ఈసీకి తెలిపింది. అలాగే.. కొత్త మండలాల వివరాలను రాజకీయ పార్టీలకు ఇవ్వాలని ఈసీని కోరింది. ఇక.. సుప్రీం కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున అభిప్రాయం ఇప్పుడే చెప్పలేమని పేర్కొంది. అలాగే.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం లేదని గుర్తు చేసింది. పంచాయతీ ఎన్నికల నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాలని స్పష్టం చేసింది.
నోటాతో ఎన్నిక ఉండాలని సుప్రీంకోర్టు ఇప్పటికే చెప్పిందని సీపీఎం గుర్తు చేసింది. అభ్యర్థి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే రీ-ఎలక్షన్ కరెక్ట్ కాదు. ఎన్నిక కండక్ట్ చేయడం అవసరం.. నోటాకు ఎక్కువ ఓట్లు అనేది తర్వాత చర్చ అని వామపక్ష పార్టీ అభిప్రాయపడింది. ఇక.. తెలంగాణ టీడీపీ తమ అభిప్రాయాన్ని రెండు మూడు రోజుల్లో చెప్తామనగా, సింగిల్ అభ్యర్థిగా అయినా నోటా ఉండాలని జనసేన పార్టీ ఈసీకి విజ్ఞప్తి చేసింది.
ఇదీ చదవండి: స్థానిక సంస్థల్లో ‘నోటా’ ఎందుకంటే..
Comments
Please login to add a commentAdd a comment