
హైదరాబాద్: కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలపై ఎటువంటి కుట్ర, కక్ష లేదని బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మరోసారి స్పష్టం చేశారు. ఈరోజు(శుక్రవారం) బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి ఎంపీ లక్ష్మణ్ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. ‘ డీఎంకే ప్రాంతీయ సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయంతం చేస్తోంది. అందులో భాగంగా కేంద్ర పై విషయ ప్రచారం మొదలెట్టింది. కేంద్రానికి దక్షిణాది రాష్ట్రాలపై ఎటువంటి కుట్ర లేదు. డీఎంకే ముసుగులో కాంగ్రెస్ పార్టీ, బీ అర్ ఎస్ పార్టీ లు ఉన్నాయి. దక్షిణాదిలో బీజేపీ బలపడటం చూసి ఈ మూడు పార్టీలు భయపడుతున్నాయి. ఏపీలో ఎన్డీఏ, పుదుచ్చేరి లో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్నాయి. కర్ణాటకలో గాల్లో దీపంలా సిద్దరామయ్య ప్రభుత్వం ఉంది.డీఎంకే ఆధ్వర్యంలో జరిగే అఖిల పక్షం మీటింగ్ కి రేవంత్, కేటీఆర్ పోటీ పడి హాజరు అయ్యేందుకు సిద్ధమయ్యారు. రేవంత్ ఇచ్చిన 420 హామీల పై అఖిల పక్షం మీటింగ్ పెట్టాలి.
హామీలపై కాంగ్రెస్ ను నిలదీయాల్సిన బీ అర్ ఎస్ కాంగ్రెస్ తో కలిసి అఖిల పక్షం మీటింగ్ కి హాజరు అవ్వడం ఏంటీ?, డిలిమిటేషన్ రాజ్యాంగ బద్దంగా జరిగే ప్రక్రియ. దీనికి రాజకీయాలు అంటగడతార?, బ్రిటిష్ నినాదం విభజించు - పాలించు ను కాంగ్రెస్ అనుసరిస్తుంది. గతంలో అధికార దుర్వినియోగం తో కాంగ్రెస్ బలవంతపు కుటుంబ నియంత్రణ చేపట్టింది. జనాభా తగ్గుదల పై కాంగ్రెస్ కు మాట్లాడే అర్హత లేదు ? , డిలిమిటేషన్ తో ఎస్సీ ఎస్టీలకు సీట్లు పెరుగుతాయి. మహిళలకు 33శాతం సీట్లు దక్కనున్నాయి
మహిళలకు ప్రాధాన్యత ఇవ్వొద్దని రేవంత్ అనుకుంటున్నారా? , కాంగ్రెస్ దొంగ ఏడుపులు ఏడుస్తూ.....జనాభా లెక్కలు అడ్డుకోవాలని చూస్తోంది. దేశాన్ని ఇండియా - పాకిస్తాన్ మాదిరిగా విభజించినట్టు సౌత్, నార్త్ అంటూ ప్రజలను మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న కాంగ్రెస్.. రేవంత్ 20 - 20 రాజకీయాలు చేయాలని మాట్లాడుతున్నారు. 20 - 20 మ్యాచ్ లో ఎన్నైనా అబద్ధాలు అడొచ్చా?, మొన్న జరిగిన ఢిల్లీ t20 లో మిమ్మల్ని డకౌట్ చేశారు. Mlc ఎన్నికల్లో రేవంత్ డాకౌట్ అయ్యారు. ఎటువంటి మ్యాచ్ జరిగిన మోదీ సెంచరీలు మోత మోగిస్తున్నారు’ అని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment