Lakshman
-
డబ్బుల కోసం తల్లిదండ్రుల హత్య
నర్సాపూర్: డబ్బుల కోసం తల్లిదండ్రులను హత్య చేశాడో కిరాతకుడు. వారు నిద్రిస్తున్న సమయంలో గొంతునులిమి చంపి.. అనంతరం మృతదేహాలను పెట్రోల్‌పోసి తగులబెట్టాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్‌లో చోటుచేసుకుంది. తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి కథనం ప్రకారం.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం సాదుల్లానగర్‌కు చెందిన చాకలి కిష్టయ్య (75), నర్సమ్మ (70) దంపతులు. గ్రామంలో ఉన్న భూమిని అమ్మగా వచ్చిన డబ్బును పిల్లలకు సమానంగా ఇచ్చారు. తన వాటా కింద వచ్చిన రూ.4 లక్షలను చిన్న కుమారుడు లక్ష్మణ్ ఫైనాన్స్‌లో కారు రుణం కోసం చెల్లించాడు. అయినా రుణం తీరలేదు. ఫైనాన్స్ వాయిదాలు చెల్లించేందుకు అతను పలుమార్లు తల్లిదండ్రులను డబ్బు కావాలని ఒత్తిడి చేయగా.. కొంత డబ్బు ఇచ్చారు. ఈ క్రమంలో గత నెలలో మళ్లీ డబ్బుల కోసం ఒత్తిడి చేయగా తల్లిదండ్రులు నిరాకరించారు. దీంతో ఎలాగైనా వారిని హతమార్చి వారి వద్ద ఉన్న బంగారు నగలు తీసుకోవాలన్న దురాశతో హత్యకు పథకం రచించాడు.గుమ్మడిదల మండలం బొంతపల్లిలో నివాసం ఉంటున్న లక్ష్మణ్.. గత నెల 17న సాదుల్లానగర్‌కు వెళ్లి తల్లిదండ్రులను మరుసటి రోజు తనతో పాటు కారులో తాను నివాసం ఉంటున్న బొంతపల్లికి తీసుకెళ్లాడు. మర్నాడు డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను మరోసారి అడిగినా వారు నిరాకరించడంతో కోపంతో లక్ష్మణ్ అదేరోజు రాత్రి నిద్రిస్తున్న తల్లిదండ్రులను గొంతు నులిమి చంపాడు. తల్లి వద్ద ఉన్న 3 తులాల నగలు తీసుకున్నాడు. అనంతరం మృతదేహాలను కారులో తీసుకుని నర్సాపూర్ చెరువు వద్దకు తెచ్చి శవాలపై పెట్రోల్ పోసి తగలపెట్టి వెళ్లిపోయాడు. వాట్సాప్ గ్రూపుల్లో పోలీసుల ప్రచారం: గుర్తు తెలియని జంట శవాలు దొరికిన విషయాన్ని వాట్సాప్ గ్రూప్‌ల ద్వారా తమ సిబ్బంది ప్రచారం చేశారని డీఎస్పీ వెంకట్‌రెడ్డి చెప్పారు. రెండు శవాలు దొరికిన విషయం సాదుల్లానగర్ గ్రామస్తులకు తెలియడంతో వారు అనుమానంతో లక్ష్మణ్‌ను నిలదీయగా అసలు విషయం బయటకు వచి్చందని డీఎస్పీ వివరించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
ఫోన్ ట్యాపింగ్‌లో కీలక వ్యక్తుల అరెస్టు ఎప్పుడు: ఎంపీ లక్ష్మణ్
సాక్షి,హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో దోషులకు శిక్ష పడేవరకు బీజేపీ పోరాటం చేస్తుందని, ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు. తెలంగాణ చరిత్రలో రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండాలంటే ఫోన్ ట్యాపింగ్ సీబీఐకి అప్పగించాల్సిందేననన్నారు. ఫోన్‌ట్యాపింగ్ కేసులో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వద్ద శుక్రవారం జరిగిన ధర్నాలో లక్ష్మణ్ మాట్లాడారు. ‘కాంగ్రెస్ మోసాన్ని గ్రహించి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మరోసారి ప్రజలు పట్టం కడ్తారు. తెలంగాణలో కాంగ్రెస్ కంటే అత్యధిక ఎంపీ సీట్లు సాధిస్తాం. కేసీఆర్ అవినీతిని అసెంబ్లీ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి పదే పదే ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాళేశ్వరం, ధరణి పేరుతో దోచుకున్నదాన్ని కక్కిస్తాం అన్నారు. కేసీఆర్ అవినీతి, కుంభకోణాల మీద రేవంత్ రెడ్డి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. అధికారాన్ని శాశ్వత పరుచుకునేందుకు నిఘా వ్యవస్థను కేసీఅర్ దుర్వినియోగం చేశారు. ఉప ఎన్నికల్లో ఓటర్లను కొనుగోలు చేయడానికి, ప్రత్యర్ధులను దెబ్బ కొట్టడానికి ఫోన్ ట్యాపింగ్ వాడారు. అరెస్ట్ అయిన వాళ్ళు వాంగ్మూలం ఇచ్చినా మిగిలిన వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. టెలికాం రెగ్యులేటరీ నిబంధనలకు భిన్నంగా, కేంద్రం అనుమతి లేకుండా కేసీఆర్ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది.తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడినని చెప్పుకున్న రేవంత్‌రెడ్డి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కేసీఆర్ లోపాయికారీ ఒప్పందం చేసుకుందా..? రేవంత్ రెడ్డికి ఏ మాత్రం పౌరుషం ఉన్నా.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నిందితులను శిక్షించాలి. రేవంత్ రెడ్డి కుర్చీ కోసం అధిష్టానానికి లొంగిపోతారా స్పష్టం చేయాలి. బీజేపీ సీనియర్‌నేత బీఎల్ సంతోష్ మీద కేసీఆర్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టింది. లిక్కర్ కేసు నుంచి కవితను తప్పించడం కోసమే బీజేపీ నేతలపై కేసులు పెట్టడం దుర్మార్గం. బీఆర్ఎస్ నీచ రాజకీయాలకు పాల్పడింది. బీఆర్ఎస్ నేతలను ఏ మాత్రం కాపాడినా రేవంత్ రెడ్డికి కూడా అదే గతిపడుతుంది’అని లక్ష్మణ్ హెచ్చరించారు. -
‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
టైటిల్ : కృష్ణమ్మనటీనటులు: సత్యదేవ్, మీసాల లక్ష్మణ్, నందగోపాల్, కృష్ణ తేజ రెడ్డి, అతిర, అర్చన అయ్యర్, రఘు కుంచె తదితరులునిర్మాత: కొమ్మలపాటి కృష్ణదర్శకత్వం: గోపాలకృష్ణసమర్పణ : కొరటాల శివసంగీతం: కాలభైరవవిడుదల తేది: మే 10, 2024‘కృష్ణమ్మ’కథేంటంటే..ఈ సినిమా కథంతా 2003-2015 మధ్యకాలంలో జరుగుతుంది. విజయవాడలోని వించిపేటకు చెందిన భద్ర(సత్యదేవ్), కోటి(మీసాల లక్ష్మణ్), శివ(కృష్ణ తేజరెడ్డి) అనే ముగ్గురు అనాధలు మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి ఒకరికొకరు అన్నట్లుగా బతుకుతారు. ఓ కేసు విషయంలో చిన్నప్పుడే జైలుకెళ్లిన శివ..బయటకు వచ్చాక నేరాలు చేయడం తప్పని భావించి ప్రిటింగ్ ప్రెస్ పెట్టుకుంటాడు. భద్ర, కోటి మాత్రం గంజాయి దందా, చిన్న చిన్న నేరాలు చేస్తూ జీవితం గడుపుతుంటారు. వించిపేటలోనే హాస్టల్లో ఉంటూ ప్రింటింగ్ ప్రెస్‌లో పని చేస్తున్న మీనా(అతిర)తో శివ ప్రేమలో పడతాడు. మరోవైపు భద్ర అదే కాలనీలో ఉంటున్న పద్మ(అర్చన అయ్యర్)తో ప్రేమలో పడతాడు. అనాధ అయిన కారణంగా భద్ర ప్రేమను పద్మ తండ్రి ఒప్పుకోరు. మరోవైపు మీనా.. భద్రను సొంత అన్నయ్యలా భావిస్తుంది. మీనా రాకతో అనాధలైన ఈ ముగ్గురికి ఓ ఫ్యామిలీ దొరుకుతంది. భద్ర, కోటి నేరాలు చేయడం మానేసి ఆటో నడుపుకుంటారు. అంతా హ్యాపీగా ఉన్న సమయంలో వీరికి అత్యవసరంగా మూడు లక్షల రూపాయలు కావాల్సి వస్తోంది. దానికి కోసం చివరగా ఓ నేరం చేద్దామనుకుంటారు. అయితే అనుకోకుండా ఈ ముగ్గురు పోలీసులకు పట్టుపడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు ఈ ముగ్గురు చేసిన నేరం ఏంటి? వీరిపై నమోదైన కేసు ఏంటి? ఈ ముగ్గురిలో ఒకరు ఎలా చనిపోయారు? ఎవరు చంపారు? సీఐ పాండా వెంకట సుబుద్ది వీరిని నమ్మించి ఎలా మోసం చేశాడు? స్నేహితుడి కోల్పోయిన భద్ర.. తన పగను ఎలా తీర్చుకున్నాడు? తదితర విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. రివెంజ్ డ్రామా సినిమాలు తెలుగు తెరకు కొత్తకాదు. చేయని నేరానికి హీరోకి శిక్ష పడడం.. బయటకు వచ్చాకా రివెంజ్ తీర్చుకోవడం.. ఈ కాన్సెప్ట్ బోలెడు సినిమాలు వచ్చాయి. కృష్ణమ్మ కథ కూడా ఇదే. ఈ రివేంజ్ డ్రామాకి స్నేహబంధం యాడ్ చేసి..డిఫరెంట్‌గా చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు గోపాల కృష్ణ. కానీ కథతో పాటు కథనం కూడా రొటీన్‌గా ఉండడంతో.. ఏదో పాత సినిమా చూశామనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమాలో వచ్చే ట్విస్టులు ముందే ఊహించొచ్చు. రా అండ్ రస్టిక్ పేరుతో హీరోకి గెడ్డం పెంచడం.. స్లమ్ ఏరియాల్లో జీవించడం.. స్మగ్లింగ్.. ఇవన్నీ గత సినిమాల్లో చూసినట్లుగానే అనిపిస్తుంది. ఫ్రెండ్షిప్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ కాలేదు. ఫస్టాఫ్‌లో అసలు కథే ఉండదు. హీరో, అతని స్నేహితుల పాత్రల పరిచయానికే ఎక్కువ సమయం తీసుకున్నాడు. ఆ తర్వాత ఒకే సమయంలో ఇద్దరి ప్రేమకథలు చూపించారు. శివ పాత్ర లవ్‌స్టోరీ కాస్త ఆసక్తికరంగా అనిపించినా.. భద్ర లవ్‌స్టోరీ మాత్రం కథకి అతికినట్లుగా అనిపిస్తుంది. ఏదో హీరో అన్నాక.. హీరోయిన్ ఉండాలి.. ఓ లవ్‌స్టోరీ ఉండాలి అని పద్మ పాత్రను క్రియేట్ చేసినట్లుగా ఉంటుంది. ఆ పాత్రకి సరైన ముగింపు కూడా లేకపోవడం గమనార్హం. ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంకాస్త ఆసక్తికరంగా రాసుకుంటే బాగుండేది. సెకండాఫ్‌లో కథంతా సీరియస్ మూడ్‌లో కాస్త ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఈ ముగ్గురిపై పెట్టిన దొంగ కేసు ఏంటి అనేది తెలిసిన తర్వాత కథపై ఆసక్తి సన్నగిల్లుతుంది. తర్వాత ఏం జరుగుతుందనేది ఈజీగా తెలిసిపోతుంది. స్నేహితుడిని చంపినందుకు హీరో తీర్చుకునే రివెంజ్ కూడా సినిమాటిక్‌గా అనిపిస్తుంది. క్లైమాక్స్ చాలా సింపుల్‌గా ఉంటుంది.ఎవరెలా చేశారంటే..సత్యదేవ్ మంచి నటుడే అందులో నో డౌట్. కానీ ప్రతి సినిమాకు ఒకే లెవల్ ఎక్స్ప్రెషన్స్.. డైలాగ్ డెలివరీ కూడా ఒకేలా ఉండడంతో ఆయన నటనలో కొత్తదనం కనిపించడం లేదు. ఈ చిత్రంలో కాస్త డిఫరెంట్‌గా ట్రై చేశాడు. కానీ అది పూర్తిగా వర్కౌట్ కాలేదు. విజయవాడ స్లాంగ్‌లో మాట్లాడానికి ట్రై చేశాడు కానీ తెరపై కాస్త ఎబ్బెట్టుగా అనిపించింది. యాక్షన్ సీన్స్‌లో పర్వాలేదు. ఎమోషనల్ సన్నివేశాల్లో చక్కగా నటించాడు. నడి రోడ్డుపై స్నేహితుడు చనిపోయినప్పుడు సత్యదేవ్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అలా గుర్తిండిపోతుంది. ఇక హీరో స్నేహితులు కోటిగా మీసాల లక్ష్మణ్, శివగా కృష్ణతేజ చక్కగా నటించారు. హీరోయిన్గా నటించిన అతిరా రాజ్‌కి ఇది తొలి సినిమా అయినా.. తెరపై చాలా సహజంగా నటించింది. అర్చన అయ్యర్ పాత్ర నిడివి తక్కువే అయినా ఉన్నంతలో బాగానే నటించింది. నందగోపాల్, రఘు కుంచెతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు.సాంకేతికంగా సినిమా పర్వాలేదు. కాలభైరవ పాటలు గుర్తుపెట్టుకునేలా ఉండవు కానీ.. బీజీఎం ఓకే. ఎడిటింగ్ ఇంకా షార్ప్‌గా ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాత విలువలు బాగున్నాయి. -
కవలలకు కన్నీటి ‘పరీక్ష’
పెగడపల్లి(ధర్మపురి)/నిజామాబాద్ రూరల్: ఒకవైపు పదో తరగతి పరీక్ష.. మరో వైపు కన్నతండ్రి మరణం.. పుట్టెడు దుఃఖంలోనూ కవల బిడ్డలు పదో తరగతి పరీక్షకు హాజరయ్యారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన గాజె చంద్రయ్య–లక్ష్మి దంపతులకు మొదటి సంతానంలో కూతురు జన్మించింది. రెండో సంతానంగా ఇద్దరు కవలలు రామ్, లక్ష్మణ్ జన్మించారు. వీరు స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నారు. వీరి తండ్రి చంద్రయ్య నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో పురుగు మందు తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందాడు. కాగా, మృతుని కుమారులు మంగళవారం పదో తరగతి హిందీ పరీక్షకు హాజరు కావలసి ఉంది. చదువుకు ఆటంకం కలగొద్దని బంధువులు, కుటుంబ సభ్యులు నచ్చజెప్పి రామ్, లక్ష్మణ్‌లను పెగడపల్లి మండల కేంద్రంలోని పరీక్ష కేంద్రానికి తీసుకొచ్చారు. పుట్టెడు దుఃఖంతోనే కవల సోదరులు పరీక్ష రాశాక తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. విషాదాన్ని దిగమింగి.. నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం కేశాపూర్ గ్రామానికి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం బైక్ అదుపుతప్పి తాళ్ల కొత్తపేట్, మల్లారం వద్ద ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ రెడ్డిని స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని కుమారుడు ధనుష్ తీవ్ర దుఃఖంతోనే మంగళవారం శివాజీనగర్‌లోని శ్రీనూతన వైశ్య ఉన్నత పాఠశాలలో హిందీ పరీక్షకు హాజరయ్యాడు. పరీక్ష అనంతరం తండ్రి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. -
ఎన్నికల ముందే కాంగ్రెస్ కాడి ఎత్తేసింది : ఎంపీ లక్ష్మణ్
-
బీఆర్ఎస్తో పొత్తు.. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ పొత్తుపై వస్తున్న ఊహాగానాలకు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెరదించారు. ఢిల్లీలో ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో పార్టీకి ఎలాంటి పొత్తులు ఉండవని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ కాళ్ల బేరానికి వచ్చినా ఆ పార్టీతో పొత్తు ఉండదని వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని తాను పార్లమెంటరీ బోర్డు సభ్యుని హోదాలో చెబుతున్నానన్నారు. రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని, బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు తమతో టచ్‌లో ఉన్నారని లక్ష్మణ్ తెలిపారు. బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ రహస్య ఒప్పందం చేసుకున్నాయన్నాయని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై కాంగ్రెస్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కవిత కేసులో విచారణ జరుగుతోందన్నారు. ఆంధ్రలో పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 17 సీట్లలో బీజేపీ పోటీ చేస్తుంది : కిషన్‌రెడ్డి రాష్ట్రంలోని మొత్తం 17 ఎంపీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తుందని బీజేపీ తెలంగాణ చీఫ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. పార్టీ విజయసంకల్ప యాత్రలు మంగళవారం నుంచి ప్రారంభమవనున్న సందర్భంగా సోమవారం ఆయన హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. యాత్ర రథాలను స్వయంగా నడిపారు. అనంతరం మాట్లాడుతూ ‘రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది. ప్రధాని మోదీ నేతృత్వంలో ఈ ఎన్నికల్లో గతం కంటే ఎక్కువ ఎంపీ సీట్లు సాధిస్తాం. 20 నుంచి మార్చి 2 వరకు విజయ సంకల్ప యాత్రలు జరుగుతాయి. సమిష్టి నాయకత్వంలో, పార్టీ జెండా కింద యాత్రలు కొనసాగుతాయి. యాత్రల్లో భాగంగా రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు ఉంటాయి. అన్ని సామాజిక వర్గాలను కలుస్తాం. హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో సైతం బీజేపీ గెలవడం ఖాయం’ అని చెప్పారు. ఇదీ చదవండి.. ఆ ఎంపీ స్థానం నుంచే పోటీ.. ఈటల ఆసక్తికర వ్యాఖ్యలు -
నీ ముఖానికి నువ్వు హీరో ఏంటి..?
-
దుబాయి నుంచి వచ్చి.. భార్య ప్రియుడిపై.. పక్కా ప్లాన్‌తో రాత్రికి రాత్రే..
కరీంనగర్: భార్యతో వివాహేతర సంబంధం నెరుపుతున్నాడని తెలుసుకున్న భర్త దుబాయి నుంచి వచ్చి యువకుడిని హత్య చేశాడు. ఈ సంఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మల్యాలలో సంచలనం సృష్టించింది. గ్రామస్తులు, చందుర్తి సీఐ కిరణ్‌కుమార్ తెలిపిన వివరాలు. మల్యాలకు చెందిన పడిగెల నరేశ్(27) అదే గ్రామానికి చెందిన వివాహిత(32)తో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తెలిసిన వివాహిత బావ కుమారుడు లక్ష్మణ్ దుబాయ్‌లో ఉంటున్న ఆమె భర్త మల్లేశంకు తెలిపాడు. ఈనెల 3వ తేదీన గల్ఫ్ నుంచి వచ్చిన మల్లేశం ఇంటికిరాకుండా ఎక్కడో తలదాచుకున్నాడు. నరేశ్‌ను చంపేందుకు అదును కోసం ఎదురుచూస్తున్నాడు. బుధవారం రాత్రి నరేశ్ సదరు వివాహిత ఇంట్లోకి వెళ్లడం గమనించిన బావ కొడుకు లక్ష్మణ్ ఆమె భర్త మల్లేశంకు సమాచారం అందించాడు. మల్లేశం మాస్కులు ధరించి బైక్‌పై ఇంటికి చేరుకుని.. భార్యతో ఇంట్లో ఉన్న యువకుడిపై కత్తితో దాడి చేశాడు. మంచం పై నుంచి కింద పడ్డ నరేశ్‌పై పదే..పదే కత్తితో దాడి చేయగా తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే హత్యకు పాల్పడ్డ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య విషయం తెలుసుకున్న చందుర్తి సీఐ కిరణ్‌కుమార, పలువురు ఎస్సైలు బుధవారం అర్ధరాత్రి ఘటన స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. మల్లేశం కోసం పరిసర ప్రాంతాల్లో గాలించారు. హత్య జరిగేందుకు మరో నలుగురు సహకరించారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వేములవాడ డీఎస్పీ నాగేంద్రచారి గురువారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి సీఐ కిరణ్‌కుమార్ వివరించారు. సాయంత్రం విందు.. అర్ధరాత్రి హత్య.. పడిగెల నరేశ్‌కు అదే గ్రామానికి చెందిన వివాహితతో ఐదేళ్ల క్రితమే వివాహేతర సంబంధం ఏర్పడింది. అదే సమయంలో వివాహిత కుటుంబ సభ్యులకు, యువకుడి మధ్య గొడవలు జరుగడంతో నరేశ్ దుబాయి వెళ్లాడు. అక్కడే ఐదేళ్లపాటు ఉన్నాడు. గత ఆగస్టు 29న ఇంటికొచ్చిన నరేశ్ తిరిగి సదరు వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఇది గమనించిన వివాహిత భర్త అన్నలతోపాటు వారి కుమారుడు ఈ విషయాన్ని గల్ఫ్‌లో ఉంటున్న మల్లేశంకు తెలిపారు. ఈనెల 3న దుబాయి నుంచి ఇండియా వచ్చిన మల్లేశం బంధువుల ఇంట్లో తలదాచుకున్నాడు. ముందస్తు పథకం ప్రకారం వివాహిత కుటుంబ సభ్యులు బుధవారం యువకుడి ఇంట్లోనే విందు చేసుకున్నారు. తర్వాత యథావిధిగా ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు. బంధువుల ఇంట్లో తలదాచుకున్న మల్లేశంను అదే సమయంలో స్వగ్రామానికి పిలిపించుకున్నారు. ఇది తెలియని యువకుడు రాత్రి అందరూ పడుకున్న సమయంలో వివాహిత వద్దకు వెళ్లాడు. గమనించిన లక్ష్మణ్ తన చిన్నాన్న మల్లేశంకు ఫోన్ చేయడంతో బైక్‌పై వచ్చి యువకుడిపై దాడి చేసి హత్యకు పాల్పడ్డాడు. అనుమానితులను విచారిస్తున్న పోలీసులు.. ఈ హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్న మల్లేశం పరారీకాగా.. అనుమానం ఉన్న ముగ్గురితోపాటు వివాహితను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. హత్యకు సహకరించిన వారి వివరాలను కాల్‌డాటా ఆధారంగా సేకరిస్తున్నట్లు సమాచారం. వారం క్రితమే హత్యకు పథకం రచించినట్లు తెలిసింది. పోలీసుల లుక్ఔట్ నోటీసు.. యువకుని హత్యలో ప్రధాన నిందితునిగా భావిస్తున్న మల్లేశ దుబాయి నుంచి ఈనెల 3న ఇండియాకు వచ్చాడు. హత్య చేసేందుకు ముందుగానే తిరిగి దుబాయి వెళ్లేందుకు సిద్ధమై.. రాత్రి 11 గంటల ప్రాంతంలో హత్యచేసి ఎయిర్‌పోర్టుకు అదే రాత్రి వెళ్లిపోయాడన్న ప్రచారంతో పోలీసులు లుక్ఔట్ నోటీస్ జారీ చేసినట్లు తెలిసింది. -
చిత్తూరు కుర్రాడితో శ్రీలంక యువతి ఫేస్బుక్ ప్రేమ.. విమానమెక్కి..!
వి.కోట(చిత్తూరు జిల్లా): ఫేస్బుక్లో పరిచయమైన శ్రీలంకకు చెందిన ఓ యువతిని చిత్తూరు జిల్లా యువకుడు ప్రేమ వివాహం చేసుకున్న ఘటన శనివారం వెలుగులోకి వచి్చంది. వివరాల్లోకి వెళితే... వి.కోట మండలంలోని ఆరిమాకులపల్లి గ్రామానికి చెందిన లక్ష్మణ్‌కు ఆరేళ్ల కిందట ఫేస్బుక్లో శ్రీలంక దేశం కొలంబోలోని బొలగుండుకు చెందిన విఘ్నేశ్వరితో పరిచయమైంది. వీరి పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. ఈ నేపథ్యంలో విఘ్నేశ్వరి ఈ నెల 8వ తేదీ టూరిస్ట్ వీసా తీసుకుని ఇండియా వచ్చింది. ఈ నెల 20వ తేదీ లక్ష్మణ్, విఘ్నేశ్వరి వి.కోటలోని సాయిబాబా మందిరంలో వివాహం చేసుకున్నారు. ఆరిమాకులపల్లి గ్రామంలోని లక్ష్మణ్ ఇంట్లో ఉంటున్నారు. విఘ్నేశ్వరి టూరిస్ట్ వీసా గడువు ఆగస్టు 6వ తేదీతో ముగియనుందని సమాచారం. ఈ విషయం తెలుసుకున్న వి.కోట పోలీసులు లక్ష్మణ్, విఘ్వేశ్వరిలను చిత్తూరు ఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించినట్లు తెలిసింది. -
శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు
-
తెలంగాణ నుంచి మరొకరికి కేంద్రమంత్రి పదవి..?
-
తెలంగాణలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారు
-
కేసీఆర్ పై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఫైర్
-
కేసీఆర్ శైలి తెలంగాణకు నష్టం చేకూర్చేలా ఉంది: లక్ష్మణ్
-
RSS చీఫ్ ను విమర్శించే అర్హత కేటీఆర్ కు లేదు : ఎంపీ లక్ష్మణ్
-
నాకు పదవి ఇవ్వాల్సిందే..
పంజగుట్ట(హైదరాబాద్): ‘టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నా.. రూ.కోట్లు పార్టీ అభివృద్ధికి ఖర్చు చేశా.. కానీ ఇప్పటివరకు ఏ నాయకుడు నన్ను గుర్తించలేదు.. ఏ పదవీ ఇయ్యలేదు.. వెంటనే నాకు ఏదో ఓ పదవి ఇవ్వాలి’అని కోరుతూ టీఆర్ఎస్ నాయకుడు ఒకరు సోమవారం ప్రగతిభవన్ ముందు ఆత్మహత్యకు యత్నించాడు. అక్కడే విధుల్లో ఉన్న పోలీసులు అడ్డుకుని అతన్ని స్టేషన్‌కు తరలించారు. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా నాగపురం గ్రామానికి చెందిన లక్ష్మణ్ ముదిరాజ్ 2001 నుంచి టీఆర్ఎస్లో పనిచేస్తున్నారు. పార్టీ అభివృద్ధి కోసం రూ.కోట్లు ఖర్చు చేసినట్లు లక్ష్మణ్ తెలిపారు. కానీ, పార్టీ నుంచి తనకు ఎలాంటి లబ్ధి చేకూరకపోగా ప్రస్తుతం నిరుద్యోగిగా మిగిలిపోయానని ఆవేదన వ్యక్తంచేశారు. దీంతో సోమవారం మధ్యాహ్నం 12:15గం.కు ప్రగతిభవన్ ముందుకు వచ్చి తన వెంట తెచ్చుకున్న డీజిల్ ఒంటిపై పోసుకున్నారు. అక్కడే బందోబస్తులో ఉన్న పోలీసులు గుర్తించి వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. స్టేషన్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించి సాయంత్రం వరకు దీక్ష చేయడంతో పోలీసులు అతనికి కౌన్సెలింగ్ ఇచ్చి విడుదల చేశారు. -
హారర్ కథా చిత్రం
రుషి లక్ష్మణ్, ఉమేశ్, సాయికుమార్, జాకీష్రాఫ్, షీనారాయ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘సినిమా కథా చిత్రం’. రామ్‌ఫిలిమ్స్ పతాకంపై మదన్ మోహన్ నాయుడు, జి.తిమ్మారెడ్డి గౌడ్ నిర్మించిన ఈ చిత్రానికి రామ్ మధుసూదన్ దర్శకుడు. తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టి.రామసత్యనారాయణ, సాయివెంకట్, మోహన్ గౌడ్లు పాల్గొన్నారు. రామ్ మధుసూదన్ మాట్లాడుతూ– ‘‘గతంలో నేను తెరకెక్కించిన ‘వంశం’ చిత్రానికి 13 అవార్డులు వచ్చాయి. లేటెస్ట్గా రుషిని హీరోగా పరిచయం చేస్తూ ‘సినిమా కథా చిత్రం’ చేశాను. హారర్ కథతో ఈ చిత్రం తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు. -
నిర్మాత లక్ష్మణ్ కుమారుడి నిశ్చితార్థ వేడుక
-
నిశ్చితార్థ వేడుకలో ప్రభాస్, విజయ్‌ల సందడి
ప్రముఖ నిర్మాత లక్ష్మణ్ కుమారుడు ఉజ్వల్ నిశ్చితార్థ వేడుక ఆదివారం ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకల్లో రెబల్ స్టార్ ప్రభాస్, విజయ్ దేవరకొండ సందడి చేశారు. వైట్ షర్ట్, కళ్లజోడుతో వచ్చిన ప్రభాస్ నవ్వుతూ అందరిని పలకరించాడు. అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు, సూపర్‌స్టార్ మహేష్ బాబు సతీమణీ నమ్రత తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ సమ్మె: తీవ్ర ఉద్రిక్తత, లక్ష్మణ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో శనివారం బీజేపీ బస్ భవన్ ముట్టడికి యత్నించడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ ఎత్తున బీజేపీ కార్యకర్తలు, ఆర్టీసీ కార్మికులు బస్ భవన్ వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పోలీసులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ని, ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డిని అరెస్ట్ చేశారు. దాంతో ఓ ఆర్టీసీ కార్మికుడు చెట్టు ఎక్కి నిరసన తెలిపాడు. ధర్నా నేపథ్యంలో బస్ భవన్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ స్థంభించడంతో జనాలు ఇబ్బంది పడ్డారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే.. ప్రగతి భవన్‌ను కూడా ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇన్ని రోజులుగా కార్మికుల సమస్యలు పరిష్కరించని ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని స్పష్టం చేశారు. బీజేపీ ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడి.. వారికి న్యాయం జరిగేవరకు అండగా ఉంటుందని తెలిపారు. కార్మికుల సమస్యలపై స్పందించకపోతే.. కేసీఆర్ పాలనను స్తంభింపచేస్తామని లక్ష్మణ్ హెచ్చరించారు. -
ఆర్టీసీ ఉద్యోగ సంఘాలకు బీజేపీ మద్దతు
-
కాంగ్రెస్‌లో జోష్ లేదు.. బీజేపీలో హోష్ లేదు
సాక్షి, హైదరాబాద్: ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్’అని చెప్పే ప్రధాని తెలంగాణకు మొండిచేయి (హాథ్) ఇచ్చారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. బుధవారం కంటోన్మెంట్ ఏరియాలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశానికి హాజరై ప్రసంగించారు. తెలంగాణలో రూ.80వేల కోట్లతో చేపడుతున్న కాళేశ్వరం, లేదా రూ.40వేల కోట్లతో చేపడుతున్న పాలమూరు ఎత్తిపోతల పథకాల్లో ఏదైనా ఒకదానికి జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానికి కేసీఆర్ విజ్ఞప్తి చేసినా స్పందించలేదన్నారు. పన్నుల్లో రాష్ట్ర వాటా మినహా కేంద్రం రాష్ట్రానికి ఒక్క రూపాయి కూడా అదనంగా ఇవ్వలేదన్నారు. ఈ నేపథ్యంలో 2019లో కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వాన్ని నిర్ణయించే స్థాయిలో మనముంటే రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయన్నారు. కేసీఆర్ నేతృత్వంలోని కూటమి 70 నుంచి 100 ఎంపీ సీట్లు సాధించి దేశంలో కీలకం కాబోతుందన్నారు. దీంతో ఢిల్లీలో ఏర్పడబోయే ప్రభుత్వాన్ని మనమే నిర్ణయిస్తామన్నారు. అఖిలేష్ సహా పలు ప్రాంతీయ పార్టీ ల నేతలు కేసీఆర్‌తో టచ్‌లో ఉన్నారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో చేపట్టే ప్రాజెక్టులకు అవసరమైన రక్షణ, రైల్వే భూములు కావాలని ఏళ్ల తర బడి అడుగుతున్నా కేంద్రం స్పందించడం లేదన్నారు. ప్యాట్నీ–తూముకుంట, ప్యారడైజ్–సుచిత్ర మార్గాల్లో ఫ్లై ఓవర్ల కోసం 100 ఎకరాల రక్షణ భూములకు బదులుగా 500 ఎకరాలు ఇస్తా మని చెప్పినా బదలాయించడం లేదన్నారు. గాంధీభవన్‌లో అటెండర్లే మిగులుతారు టీఆర్ఎస్లోకి వస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేల వలసలు చూస్తుంటే.. గాంధీభవన్‌లో అటెండ ర్లే మిగిలే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. తన నియోజకవర్గం పరిధిలో 20వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణానికి స్థలం ఉందని, ఆ మేరకు సీఎం సహకారంతో త్వరలోనే నిర్మాణం చేపడతామన్నారు. ‘సీఎం హమారా.. పీఎం హమారా’అన్న నినాదంతో కేంద్రంలో టీఆర్ఎస్ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామన్నారు. కేసీఆర్ కడుపున పులిబిడ్డ కేటీఆర్ పుడితే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కడుపున పప్పు పుట్టాడన్నారు. విజన్ ఉన్న నేత కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు తామంతా గర్వపడుతున్నామన్నారు. భారీ మెజారిటీతో సికింద్రాబాద్ ఎంపీని గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇస్తామన్నారు. సభలో హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్సీ ప్రభాకర్, టీఆర్ఎస్ సెక్రెటరీ జనరల్ కేశవరావులు ప్రసంగించారు. మేయర్ బొంతు రామ్మోహన్ సహా పలువురు పార్టీ ప్రముఖులు పాల్గొన్నారు. రాహుల్, మోదీ తప్పితే నేతలు లేరా? పార్లమెంట్ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ మధ్యే సాగుతున్నాయి అన్నట్లుగా ఆయా పార్టీల నేతలు పదే పదే చెబుతున్నారని.. దేశంలో రాహుల్, మోదీ తప్పితే నేతలే లేరా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ రెండు పార్టీల మధ్య పోటీ బోఫోర్స్, రఫేల్‌గా మారిందన్నారు. కాం గ్రెస్‌లో జోష్ లేదని, బీజేపీలో హోష్ లేదని ఎద్దేవా చేశా రు. 71 ఏళ్లలో ఒకట్రెండు ఏళ్లు మినహా ఈ 2 పార్టీలే దేశాన్ని ఏలాయని, అయినా నేటికీ చాలా గ్రా మా లు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయన్నారు. లచ్చన్న సవాలు హాస్యాస్పదం బీజేపీ అధ్యక్షుడు లచ్చన్న (లక్ష్మణ్) మరోసారి తనపై సవాలు విసురుతుండటం హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ అన్నారు. బీజేపీ నేతలు జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇలాంటి సవాలే విసిరి అభాసు పాలయ్యారని అన్నారు. అప్పట్లో బీజేపీ ప్రాతినిధ్యం వహిస్తున్న ముషీరాబాద్, అంబర్‌పేట, గోషామహల్, ఉప్పల్, ఖైరతాబాద్ స్థానాల్లోనూ టీఆర్ఎస్ కార్పొరేటర్లు గెలిచారన్నారు. ముషీరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్‌కు వచ్చిన మెజారిటీ ఓట్లు కూడా లక్ష్మణ్‌కు రాలేదని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా బీజేపీ సీనియర్ నేత దత్తాత్రేయ ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానంలో భారీ మెజారిటీతో గెలవబోతున్నామని కేటీఆర్ అన్నారు. తెలంగాణ నుంచి కేవలం దత్తాత్రేయకు మాత్రమే కేంద్ర కేబినెట్లో స్థానం దక్కగా, ఏడాదిలోనే అవమానకర రీతిలో ఆయనను పదవి నుంచి తొలగించారని అన్నారు. -
సుగుణాకర్‌రావుకు బీజేపీ బీఫాం
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్–మెదక్–ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి, న్యాయవాది పి.సుగుణాకర్‌రావును పార్టీ తరపున పోటీలో నిలపాలని నిర్ణయించినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా ఆయనకు బీఫాం కూడా అందజేసినట్లు ఆయ న వెల్లడించారు. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యల పట్ల, నిరుద్యోగుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి బలమైన అభ్యర్థి సుగుణాకర్‌రావుతో పోటీ చేయిస్తున్నామన్నారు. విద్యావంతులు తమ మొదటి ప్రాధాన్య ఓటును సుగుణాకర్‌రావుకు వేసి గెలిపించాలని కోరారు. స్వతంత్రులుగా రణజిత్ మోహన్, రవి! బీజేపీ రాష్ట్ర నాయక త్వం మొదటి నుంచీ సుగుణాకర్‌రావును పోటీలో నిలపా లని శ్రద్ధ చూపుతున్న నేప థ్యంలో పార్టీనే నమ్ముకుని, ఉద్యోగాన్ని వదులుకుని పనిచేస్తున్న తనకు పార్టీ మద్దతు ఇవ్వాలని రణజిత్ మోహన్ పట్టుబట్టారు. ఎడ్ల రవి కూడా తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ వర్గాలను కోరారు. రణజిత్‌మోహన్ ఆర్ఎస్ఎస్ వర్గాల నుంచి కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటు కోసం పార్టీ వర్గాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నించారు. కానీ పార్టీ గురు వారం బీఫాంను సుగుణాకర్‌రావుకు ఇవ్వడం తో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని రణజిత్‌మోహన్ ప్రకటించారు. మరోవైపు ఎడ్ల రవి కూడా బరిలో నిలిచే అవకాశముంది. -
‘టీటీడీ అక్రమాలపై విచారణ జరిపించాలి’
సాక్షి, హైదరాబాద్ : పవిత్ర పుణ్య క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ ఆంధ్ర - తెలంగాణ బీజేపీ నేతలు మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. టీటీడీలో అక్రమాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని తెలిపారు. వీటి వెనక రాజకీయ ప్రమేయం ఉందని ఆరోపించారు. గత నెల టీటీడీలో టికెట్ల కుంభకోణం వెలుగు చూసినప్పటికి ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదని లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్ను ఆదేశించాల్సిందిగా గవర్నర్‌ను కోరామని మంత్రి దత్తాత్రేయ తెలిపారు. ఈవోకు పూర్తి స్థాయిలో బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేశారు. టీటీడీలో జరుగుతున్న అక్రమాల వల్ల భక్తులకు తిరుమల దేవస్థానం పట్ల నమ్మకం సన్నగిల్లుతుందనిదత్తాత్రేయ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తిరుమలలో జరిగిన అన్యాయాలు, అక్రమాలపై తాను చర్యలు తీసుకున్నట్లు మాజీ డీజీపీ దినేష్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం వెలుగు చూసిన టికెట్ల కుంభకోణంపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఈ నెల 15న తెలంగాణలో అమిత్‌షా పర్యటన