ఫామ్‌హౌజ్‌లో చేస్తేనే వ్యవసాయమా?
హైదరాబాద్ : వరంగల్ ఉప ఎన్నికల్లో ప్రజలు టీఆర్ఎస్‌కు గుణపాఠం చెపుతారని బీజేఎల్పీ నేత డాక్టర్ లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ ప్రశ్నించే తత్వాన్ని అణిచివేస్తున్న టీఆర్ఎస్‌ను ప్రజలు అణచివేస్తారని అన్నారు.
పేదోళ్లపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, ఫామ్‌హౌజ్‌లో చేస్తేనే వ్యవసాయమా అని లక్ష్మణ్ సూటిగా ప్రశించారు. చిన్న, సన్నకారు రైతులు చేసేది వ్యవసాయం కాదా అంటూ ఆయన ప్రశ్నలు సంధించారు. జీహెచ్‌ఎంసీ డి లిమిటేషన్ ప్రక్రియ దారుసలాంలో జరిగితే టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని లక్ష్మణ్ విమర్శించారు.