బండి ముందుకు-గుర్రం వెనక్కు | BJP leader Lakshman comments on state government | Sakshi
Sakshi News home page

బండి ముందుకు-గుర్రం వెనక్కు

Published Tue, Jun 20 2017 2:22 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బండి ముందుకు-గుర్రం వెనక్కు - Sakshi

బండి ముందుకు-గుర్రం వెనక్కు

రాష్ట్ర సర్కారు తీరుపై బీజేపీ నేత లక్ష్మణ్‌ ఎద్దేవా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన ‘బండి ముందుకుృ గుర్రం వెనక్కు’అన్న చందంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులకు గురవుతున్నార న్నారు. రైతులకు రుణమాఫీ కాకపోవడంతో కొత్తగా రుణాలు అందడం లేదని, నకిలీ విత్తనాల సరఫరా జోరుగా సాగుతున్నదని, ఇలాంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకోకపోవడం తో నిరుద్యోగ యువత దిక్కుతోచని స్థితిలో ఉందన్నారు. సోమవారం ఆయన పార్టీ నాయకులు చింతా సాంబమూర్తి, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌తో కలసి విలేకరుల తో మాట్లాడుతూ, సమైక్యపాలనలో జరిగిన అన్యాయాలు నేటికీ కొనసాగుతున్నాయని అన్నారు. గ్రూప్‌ృ2 పరీక్షల విషయంలో పలు అనుమానాలు వ్యక్తమవు తుండడంతో విద్యార్థులు తమ భవిష్యత్‌పై ఆందోళన చెందుతు న్నారన్నారు.  

రాష్ట్రంలో అధికారంలోకి...
రాష్ట్రంలో బీజేపీలో చేరేందుకు ప్రజలు ముందుకు రావడం హర్షణీయమని లక్ష్మణ్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన పేర్కొన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో సంగారెడ్డి జిల్లా సదాశివ పేటకు చెందిన కోడూరి శరత్‌చంద్ర ఆధ్వ ర్యంలో పెద్దసంఖ్యలో యువకులు కాంగ్రెస్‌ నుంచి బీజేపీలో చేరిన సందర్భంగా వారిని లక్ష్మణ్‌ పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీనా యకులు ఎన్‌. శ్రీవర్థన్‌రెడ్డి, దాసరి మల్లేశం, ఆకుల విజయ, గోదావరి, గుండగోని భరత్‌గౌడ్, వేణుమాధవ్, అంజిరెడ్డి, సంగారెడ్డి బీజేపీ అధ్యక్షుడు కాసాల బుచ్చి రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement