కమలహాసన్ టైటిల్‌లో జయంరవి | ayam Ravi Film has Kamal Haasan's Title !! | Sakshi
Sakshi News home page

కమలహాసన్ టైటిల్‌లో జయంరవి

Published Mon, Sep 5 2016 1:01 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM

కమలహాసన్ టైటిల్‌లో జయంరవి

కమలహాసన్ టైటిల్‌లో జయంరవి

తమిళసినిమా: తనీఒరువన్,భూలోకం,మిరుదన్ ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు జయంరవి. విభిన్న కథా చిత్రాలను ఎంచుకుంటూ నటిస్తున్న ఈయన తాజాగా మూడు చిత్రాలకు కమిట్ అయ్యారు. వాటిలో రోమియో జూలియట్ చిత్రం ఫేమ్ లక్ష్మణన్ దర్శకతంలో మరోసారి నటిస్తున్న చిత్రం బోగన్. హన్సికనే నాయకిగా నటిస్తున్న ఈ చిత్రం నిర్మాణంలో ఉంది.
 
  కాగా తదుపరి మిరుదన్ వంటి విజయ వంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శక్తి సౌందర్‌రాజన్‌తో మరో చిత్రానికి జయంరవి రెడీ అవుతున్నారు. దీన్ని జపక్ ఇందోశ్ నిర్మించనున్నారు. బోగన్ చిత్రాన్ని పూర్తి చేసిన తరువాత జయంరవి ఈ చిత్రానికి సిద్ధం అవుతున్నారు. కాగా ఈ చిత్రానికి ఇంతకు ముందు భారతీరాజా దర్శకత్వంలో కమలహాసన్ నటించిన రోమాంటిక్ థ్రిల్లర్ కథా చిత్రం టిక్ టిక్ టిక్ టైటిల్‌ను నిర్ణయించారు.
 
  ఆ చిత్ర నిర్మాత అనుమతి పొందే ఈ టైటిల్‌ను తమ చిత్రానికి పెట్టినట్లు దర్శకుడు శక్తి సౌందర్‌రాజన్ తెలిపారు. కాగా కోలీవుడ్‌లో స్పేస్ నేపథ్యంలో రూపొందనున్న తొలి చిత్రంగా టిక్ టిక్ టిక్ ఉంటుందని ఆయన చెప్పారు. ఇక పోతే దీనితో పాటు జయంరవి దర్శకుడు విజయ్ కాంబినేషన్‌లో కూడా ఒక చిత్రం చేయనున్నారు. ఈ చిత్రం వినాయకచవితి సందర్భంగా సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement