హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో విధులు నిర్వరిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ శుక్రవారం స్ప్రహ తప్పి పడిపోయాడు. వడదెబ్బ కారణంగానే అతడు స్ప్రహ తప్పి పడిపోయినట్లు సమాచారం. సహచరులు వెంటనే స్పందించి అతడిని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు.