spf constable
-
Constable: తుపాకీతో కాల్చుకుని ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య
విశాఖపట్నం: బంగారంలాంటి ఉద్యోగం.. సంతోషకరమైన కుటుంబం.. ఏం కష్టమొచ్చిందో.. తెల్లవారుజామున విధుల్లో ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ ఎస్ఆర్ఎల్ రైఫిల్‌ను గుండెకు గురి పెట్టుకుని కాల్చుకున్నాడు. క్షణాల్లోనే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. ఈ ఘటన మొత్తం బ్యాంక్‌లోని సీసీ కెమెరాల్లో రిక్డాయింది. కానిస్టేబుల్ ఆత్మహత్య దృశ్యాలు ప్రతీ ఒక్కరి మనసును కలచివేశాయి. విధులు ముగించుకుని ఇంటికొస్తాడనుకున్న భర్త మరణవార్త తెలియడంతో భార్య గుండె పగిలిపోయింది. బ్యాంకులో రక్తపు మడుగులో విగత జీవిగా పడి ఉన్న భర్తను చూసి ఆమె కన్నీరుమున్నీరుగా విలపించింది. తల్లి ఎందుకు రోదిస్తుందో తెలియని వయసులో చిన్నారులు పడిన వేదనను చూసిన వారి హృదయాలు ద్రవించిపోయాయి. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పాలవలస శంకరరావు(37) విధి నిర్వహణలో ఎస్ఎల్ఆర్ గన్‌తో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పోలీస్ వర్గాల్లో సంచలనం రేపింది. వివరాలివీ.. విజయనగరం జిల్లా వంగర మండలం కొట్టిశ గ్రామానికి చెందిన పాలవలస శంకరరావు(37) భార్య శ్రావణి, కుమారుడు కిశోర్‌చంద్రదేవ్(6) కుమార్తె జ్ఞానవిత(3)తో కలసి మద్దిలపాలెంలో నివాసం ఉంటున్నారు. 2010 బ్యాచ్‌కు చెందిన శంకరరావు(3908) స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ద్వారకానగర్‌లో జ్యోతి బుక్ డిపో గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో చెస్ట్‌గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గురువారం ఉదయం 5.55 గంటల సమయంలో తన వద్ద ఉన్న ఎస్ఎల్ఆర్ గన్‌తో గుండైపె గురి పెట్టుకుని ముందుకు వంగి కాల్చుకున్నారు. ఈ శబ్దం విన్న తోటి ఉద్యోగులు వెంటనే వచ్చే చూసే సరికి శంకరరావు రక్తపు మడుగుల్లో పడి ఉన్నాడు. మృతి చెందినట్లు గుర్తించిన ఉద్యోగులు వెంటనే అధికారులు సమాచారం ఇచ్చారు. ద్వారకా ఏసీపీ రాంబాబు, సీఐ ఎస్.రమేష్, ఎస్ఐ ధర్మేంద్రతో పాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు హూటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు. భార్యకు సమాచారం ఇవ్వడంతో ఆమె పిల్లలతో ఘటనా స్థలం వద్దకు చేరుకుని రక్తపు మడుగులో ఉన్న భర్త మృతదేహన్ని చూసి కన్నీరుమున్నీరైంది. క్లూస్ టీం వేలి ముద్రలు సేకరించింది. సీఐ ఎస్.రమేష్ సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై ఏసీపీ ఆధ్వర్యంలో సీఐ దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై అన్ని కోణాల్లో విచారిస్తున్నారు. అయితే ఆర్థిక వ్యవహారాలే ఆయన ఆత్మహత్య కారణమై ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం కుట్టిసా గ్రామానికి ఆయన మృతదేహాన్ని తరలించారు. ఆర్థిక ఇబ్బందులే ఆత్మహత్యకు కారణమా? సీతమ్మధార: స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కానిస్టేబుల్ పాలవలస శంకరరావు ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు అన్వేషిస్తున్నారు. రెండు నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో ఆయన బాధపడుతున్నట్లు గుర్తించిన పోలీసులు.. ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. 2010లో పోలీస్ ఉద్యోగంలో చేరిన శంకరరావు హైదరాబాద్‌లో పనిచేశాడు. తర్వాత భద్రాచలంలో మూడేళ్లు పనిచేసి.. విశాఖపట్నానికి బదిలీపై వచ్చారు. ఇక్కడ ఐదేళ్లుగా పనిచేస్తున్నారు. మద్దిలపాలెంలో నివాసం ఉంటున్న శంకరరావు.. క్రికెట్ బెట్టింగ్తో పాటు ఇతర వ్యవహారాల కోసం అప్పులు చేసినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. ఈ క్రమంలోనే తోటి స్నేహితుడు వద్ద రూ.3.5 లక్షల వరకు అప్పు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా.. విజయగనరం జిల్లా వంగర మండలం కుట్టిశలో శంకరరావు దహన సంస్కారాలు పూర్తయ్యాయి. అతని అంత్యక్రియల కోసం పోలీస్ అధికారులు రూ.20 వేలను కుటుంబ సభ్యులకు అందజేశారు. -
పోలీస్ దొంగయ్యాడు
సాక్షి, ఆత్మకూరు రూరల్: ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా ఉండాల్సిన వాడు దొంగగా మారాడు..చోరీలను అరికట్టాల్సిన ఉండగా తానే దొంగతనాలు చేశాడు. పలు దొంగతనాల్లో నేరుగా పాల్గొని చివరకు ఆత్మకూరు పోలీసుల చేత చిక్కి ఊసలు లెక్కిస్తున్నాడో పోలీసు. ఆత్మకూరు డీఎస్పీ వెంకటరావు విలేకరుల సమావేశంలో ఆదివారం తెలిపిన మేరకు వివరాలిలా.. ప్రకాశం జిల్లా దోర్నాలకు చెందిన షేక్ మస్తాన్ వలి శ్రీశైలం ప్రాజెక్ట్ సంరక్షణ విధుల్లో ఉండే స్పెషల్ ప్రొటక్షన్ ఫోర్స్‌లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఆత్మకూరు పట్టణంలోని కేజీ రోడ్డు లో చక్రం హోటల్ సమీపంలోనున్న ఆమరాన్ బ్యాటరీ విక్రయ కేంద్రంలో చోరీ జరిగింది. ఈ చోరీలో రూ.1,20,000 విలువైన బ్యాటరీలు చోరికి గురయ్యాయి. ఆత్మకూరు సీఐ శివనారాయణ ఆధ్వర్యంలో ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ తదితరులు దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులు సీసీ కెమెరాల్లోని ఫుటేజీ పరిశీలించి చోరీ జరిగిన రోజు ఆత్మకూరు పట్టణంలో వెనుక అద్దంపై ఇంగ్లీషు అక్షరం ‘ఎస్’ చిత్రించిన స్కార్పియో అనుమానాస్పదంగా తిరిగినట్లు గుర్తించారు. ఈ ఆధారంతో పరిశోధన ప్రారంభించగా, ఆ వాహనం దోర్నాల పట్టణానికి చెందినదిగా ధ్రువీకరించారు. స్కార్పియో యజమాని షేక్ మస్తాన్ వలి బ్యాటరీలను దొంగిలించినట్లు నిర్ధారించుకున్నారు. నిందితుడు మస్తాన్ వలితో పాటు ఆరోజు స్కార్పియో డ్రైవర్ షేక్ మహమ్మద్ హుసేన్‌లను శనివారం సాయంత్రం భానుముక్కల మలుపు వద్ద చోరీలకు ఉపయోగించిన ఏపీ 27 బీఈ 3399 స్కార్పియోతో సహా అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు చోరీకి గురైన బ్యాటరీలు, గతంలో దొంగిలించిన రెండు లారీ టైర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు గతంలో దోర్నాల పరిధిలో పలు ద్విచక్రవాహనాలను కూడా చోరీ చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిసింది. నిందితులపై కేసు నమోదు చేసి జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో హాజరు పరచగా జడ్జి రిమాండ్‌కు ఆదేశించారు. నిందితుల అరెస్టులో కీలక పాత్ర పోషించిన హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసులు, హోంగార్డులు అమీర్ హంజ, కృష్ణా రెడ్డిలకు సీఐ శివనారాయణ స్వామి రివార్డ్ అందజేశారు. సీఐ శివనారాయణ, ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్‌లను డీఎస్పీ అభినందించారు. -
మరో 485 కానిస్టేబుల్ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: పోలీస్‌శాఖలో మరో 485 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థికశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, నాగార్జునసాగర్ డ్యాం, ప్రముఖ దేవాలయాలకు భద్రత కల్పిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) విభాగంలో ఈ పోస్టుల భర్తీ జరుగనుంది. ఇప్పటికే పోలీస్‌శాఖలోని సివిల్, ఏఆర్, బెటాలియన్ విభాగాల్లో 18 వేల పోస్టులు.. ఆర్టీసీ, ఫైర్, జైళ్లు తదితర విభాగాల్లో మరో 4 వేల పోస్టుల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. అదే నోటిఫికేషన్లో ప్రస్తుతం మంజూరైన 485 ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. -
శ్రీవారి ఆలయ మహాద్వారం వద్ద ఘర్షణ
తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఆదివారం దారుణం చోటు చేసుకుంది. ఆలయ మహాద్వారం వద్ద ఎస్పీఎఫ్ కానిస్టేబుల్... ప్రైవేట్ సెక్యూరిటీ సంస్థకు చెందిన వ్యక్తికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఆ క్రమంలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్‌పై ప్రైవేట్ సెక్యూరిటీ దాడి చేశాడు. దాంతో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ తలకు తీవ్రంగా గాయమైంది. సహాచర సిబ్బంది వెంటనే స్పందించి అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రాధమిక చికిత్స అనంతరం అతడిని తిరుపతిలోని అశ్వనీ ఆసుపత్రికి ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. ఈ సంఘటన జరిగిన సమయంలో టీటీడీ ఈవో డి.సాంబశివరావు కూతవేటు దూరంలోనే ఉన్నారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే సదరు సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. మరికొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబసభ్యులు తిరుమల శ్రీవారి ఆలయానికి వస్తున్న సమయంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి. తిరుమలలో నారా లోకేష్, బ్రహ్మాణీ దంపతుల గారల పట్టి దేవాన్ష్ అన్నప్రసన నేడు శ్రీవారి ఆలయంలో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుతోపాటు ఆయన కుటుంబ సభ్యులు... నందమూరి బాలకృష్ణ ఆయన కుటుంబ సభ్యులు నేడు తిరుమల రానున్నారు. అలాగే బ్రహ్మోత్సవాల సమయం కూడా కావడంతో తిరుమలలో రద్దీ బాగా పెరిగింది. -
భార్యను చంపి మిత్రుడి సహాయంతో పూడ్చి..
-
వడదెబ్బతో స్పృహతప్పిన ఎస్పీఎఫ్ కానిస్టేబుల్
హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో విధులు నిర్వరిస్తున్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ లక్ష్మణ్ శుక్రవారం స్ప్రహ తప్పి పడిపోయాడు. వడదెబ్బ కారణంగానే అతడు స్ప్రహ తప్పి పడిపోయినట్లు సమాచారం. సహచరులు వెంటనే స్పందించి అతడిని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
మిస్ ఫైరింగ్ ఘటనలో కానిస్టేబుల్ సస్పెన్షన్
పాల్వంచ రూరల్ : మిస్ ఫైరింగ్ ఘటనలో ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ ఒకరు సస్పెన్షన్‌కు గురయ్యాడు. కేటీపీఎస్ ఓఅండ్‌ఎంలో ఈనెల ఒకటిన ఉదయం ఎస్పీఎఫ్ కానిస్టెబుల్ విధులు ముగించుకుని తన వద్ద ఉన్న తుపాకీని విధుల్లో చేరే మరో కానిస్టేబుల్‌కు అందిస్తుండగా ప్రమాదవశాత్తు మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనపై ఆదేరోజున స్థానిక ఎస్పీఎఫ్ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. మిస్‌ఫైర్‌కు కారణమైన కానిస్టేబుల్ నాయుడును ఐదు రోజుల అనంతరం సస్పెండ్ చేస్తూ ఎస్పీఎఫ్ డీజీ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు కేటీపీఎస్ ఎస్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శామ్యూల్ జాన్ గురువారం తెలిపారు. ఈ విషయమై కేటీపీఎస్ సీఈ లక్ష్మయ్యను వివరణ కోరగా కానిస్టేబుల్ సస్పెన్షన్ విషయం వాస్తవేమనని చెప్పారు. -
ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ వీరంగం
చిత్తూరు: శ్రీకాళహస్తిలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్(ఎస్పీఎఫ్) కానిస్టేబుల్ వీరంగ సృష్టించాడు. దైవ దర్శనంలో భాగంగా ఆలయానికి వచ్చిన భక్తుడు గంగాధర్ ను ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ మునిప్రసాధ్ తలపై బలంగా లాఠీతో మోదాడు. దీంతో ఆ భక్తుడు సృహతప్పిపోవడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భక్తుడు గంగాధర్ స్వస్థలం అనంతపురం జిల్లా ధర్మవరం.