పాల్వంచ రూరల్ : మిస్ ఫైరింగ్ ఘటనలో ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్ ఒకరు సస్పెన్షన్‌కు గురయ్యాడు. కేటీపీఎస్ ఓఅండ్‌ఎంలో ఈనెల ఒకటిన ఉదయం ఎస్‌పీఎఫ్ కానిస్టెబుల్ విధులు ముగించుకుని తన వద్ద ఉన్న తుపాకీని విధుల్లో చేరే మరో కానిస్టేబుల్‌కు అందిస్తుండగా ప్రమాదవశాత్తు మిస్‌ఫైర్ అయింది. ఈ ఘటనపై ఆదేరోజున స్థానిక ఎస్‌పీఎఫ్ ఉన్నతాధికారులకు సమాచారం అందింది. మిస్‌ఫైర్‌కు కారణమైన కానిస్టేబుల్ నాయుడును ఐదు రోజుల అనంతరం సస్పెండ్ చేస్తూ ఎస్‌పీఎఫ్ డీజీ ఆదేశాలు జారీ చేశారు. ఈమేరకు కేటీపీఎస్ ఎస్‌పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ శామ్యూల్ జాన్ గురువారం తెలిపారు. ఈ విషయమై కేటీపీఎస్ సీఈ లక్ష్మయ్యను వివరణ కోరగా కానిస్టేబుల్ సస్పెన్షన్ విషయం వాస్తవేమనని చెప్పారు.