
సాక్షి, హైదరాబాద్: పోలీస్‌శాఖలో మరో 485 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థికశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, నాగార్జునసాగర్ డ్యాం, ప్రముఖ దేవాలయాలకు భద్రత కల్పిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్) విభాగంలో ఈ పోస్టుల భర్తీ జరుగనుంది.
ఇప్పటికే పోలీస్‌శాఖలోని సివిల్, ఏఆర్, బెటాలియన్ విభాగాల్లో 18 వేల పోస్టులు.. ఆర్టీసీ, ఫైర్, జైళ్లు తదితర విభాగాల్లో మరో 4 వేల పోస్టుల భర్తీకి పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. అదే నోటిఫికేషన్‌లో ప్రస్తుతం మంజూరైన 485 ఎస్‌పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment