Job notification
-
బాబుంటే జాబు రాదంతే.. జాబ్ క్యాలెండర్ హామీ ఉందా?
-
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8 నెలలు గడిచినా నో జాబ్ కేలండర్
-
TG: వైద్యారోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్య శాఖలో మరో 371 పోస్టుల భర్తీని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. ఈ మేరకు రాష్ట్ర మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. పోస్టుల్లో 272 నర్సింగ్ ఆఫీసర్లు, 99 స్టాఫ్ ఫార్మాసిస్ట్ పోస్టులున్నాయి.కాగా గత నెలలో 2,050 నర్సింగ్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ 2050 పోస్టులకు అదనంగా 272 పోస్టులతో అనుబంధ నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో మొత్తంగా 2,322 నర్సింగ్ ఆఫీసర్లు, 99 ఫార్మాసిస్టు పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు అయింది. అర్హులైన వారు ఈ నెల 14 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అనుమతిచ్చింది.. నవంబర్ 17న ఆన్లైన్లో రాత పరీక్ష నిర్వహించనున్నారు. -
ఆరు వేల పోస్టులతో మరో నోటిఫికేషన్: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. త్వరలోనే రాష్ట్రంలో ఐదు లేదా ఆరు వేల పోస్టులతో మరో డీఎస్సీని నిర్వహిస్తామని భట్టి విక్రమార్క వెల్లడించారు.కాగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో డీఎస్సీ పోస్టోపోన్ చేయాలని అక్కడక్కడా ధర్నాలు, వినతులు చూస్తున్నాం. డీఎస్సీ ఆలస్యమైతే మరింత నష్టం జరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు అందరం చూశాం. డీఎస్సీ పరీక్షకు అభ్యర్థులు హాజరు అవ్వండి. త్వరలోనే ఐదు లేదా ఆరు వేల పోస్టులతో మరో డీఎస్సీని నిర్వహిస్తాం. ఈసారి పరీక్షల కోసం ఇప్పటికే రెండు లక్షల మంది అభ్యర్థులు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు’ అని తెలిపారు.ఎవరు ఆందోళన చెందవద్దు. మీరు అందరూ ఉద్యోగాలు తెచ్చుకుని స్థిరపడాలనేదే మా ఆశ. కొన్ని నెలల తర్వాత మళ్లీ అవకాశం వస్తుంది. మీ భవిష్యత్‌ని కాంక్షించే ప్రభుత్వం ఇది. రాష్ట్రం తెచ్చుకుందే ఉద్యోగాల కోసం. ఈ రాష్ట్రం సర్వతోముభివృద్ధి జరగాలి ఇక్కడ వనరులు ఇక్కడే ఉపయోగపడాలి అని తెలంగాణ ఇచ్చింది. అందుకే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 30,000 మందికి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చింది.పదేళ్లు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రూప్-1 నిర్హహించలేదు, ఉద్యోగ నియామకాలు చేపట్టలేదు. మేము రాగానే టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి ఉద్యోగాల నియామకాలు చేపట్టాం. ఎన్నికలు సమీపించాయి, అయినప్పటికీ కూడా ఆ సమయంలో ప్రకటన చేసి కావాలని ఆలస్యం చేస్తే కూడా మేము, అదనపు పోస్టులు కలిపి 11,000 ఉపాధ్యాయ ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత, విద్యావ్యవస్థ మీద దృష్టి సారిస్తే దాదాపు 16,000 పోస్టులు కాళీగా ఉన్నట్లు తెలిసింది. నిర్లిప్తతంగా ఉన్న విద్యా వ్యవస్థని గాడిలో పెట్టడంలో భాగంగా డీఎస్సీని త్వరిత గతిన పూర్తి చేయాలని నోటిఫికేషన్ ఇచ్చి ముందుకు పోతున్నాం అని తెలిపారు. -
ఏపీ: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్ న్యూస్
సాక్షి, విజయవాడ: ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్‌న్యూస్ అందించింది. నాలుగు ఉద్యోగ నోటిఫికేషన్లను ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు విడుదల చేసింది. 37 ఫారెస్ట్ రేంజ్ అధికారి పోస్టులకు, అయిదు స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు, నాలుగు ఫిషరీస్ డెవలప్మెంట్ అధిరారి పోస్టులకు, మూడు ఎలక్ట్రికల్ ఎన్స్పెక్టర్ల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ వివరాలు ►37 ఫారెస్ట్ రేంజ్ అధికారి పోస్టులకు నోటిఫికేషన్...ఏప్రియల్ 15 నుంచి మే 5 వరకు ధరఖాస్తుల స్వీకరణ. ►అయిదు స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్...ఏప్రియల్ 18 నుంచి మే 8 వరకు ధరఖాస్తుల స్వీకరణ. ►నాలుగు ఫిషరీష్ డెవలప్మెంట్ అధికారి పోస్టులకు నోటిఫికేషన్.. ఏప్రియల్ 23 నుంచి మే 13 వరకు ధరఖాస్తులకు అవకాశం. ►మూడు ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ పోస్టులకు నోటిఫికేషన్.. మార్చ్ 21 నుంచి ఏప్రియల్ 10 వరకు ధరఖాస్తుల స్వీకరణ. చదవండి: యువతరానికి దిక్సూచి ‘భవిత’ -
టీడీపీ వింత జాబ్ నోటిఫికేషన్..
-
గుడ్‌న్యూస్! తెలంగాణలో 1,520 ఉద్యోగాలకు నోటిఫికేషన్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సర్కార్ ఉద్యోగార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 1,520 మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల నియామకానికి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 25 ఉదయం 10.30 గంటల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించనున్నట్టు నియామక బోర్డు నోటిఫికేషన్లో పేర్కొంది. సెప్టెంబర్ 19 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. నోటిఫికేషన్‌లోని ముఖ్యమైన వివరాలు.. ► అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర నర్సెస్, మిడ్వైఫ్ కౌన్సిల్ గుర్తింపు పొందిన సంస్థలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ (మహిళ) ట్రైనింగ్ కోర్సు పాసై ఉండాలి. లేదంటే ఇంటర్ ఒకేషనల్ మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఫిమేల్) ట్రైనింగ్ కోర్సును అభ్యసించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాది పాటు క్లినికల్ ట్రైనింగ్ చేసి ఉండాలి. ► అభ్యర్థుల వయసు 2023 జులై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్, ఎన్సీసీ సర్టిఫికెట్ ఉన్నవారికి మూడేళ్లు చొప్పున వయో పరిమితిలో సడలింపు. ► హెల్త్ అసెస్టెంట్ పోస్టులకు ఎంపికైన వారికి వేతన స్కేలు నెలకు రూ.31,040- 92,050 అప్లికేషన్ ఫీజు వివరాలు.. ► ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు రూ.500. దానికి అదనంగా ప్రాసెసింగ్ ఫీజు రూ.200ల చొప్పున చెల్లించాలి. ► ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్/దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లతో పాటు 18-44 ఏళ్లు కలిగిన నిరుద్యోగ కేటగిరీ అభ్యర్థులకు ప్రాసిసింగ్ ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ► హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, నిజామాబాద్‌లను ప్రాథమికంగా పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారు. -
గ్రామ, వార్డు సచివాలయాల్లో 14,000 పోస్టులు.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న 14 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి మరో విడత నోటిఫికేషన్ జారీకి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈసారి ఉద్యోగ నియామక రాత పరీక్షలను పూర్తి స్థాయి ఆన్లైన్ విధానంలో చేపట్టాలని యోచిస్తోంది. దీనిపై వచ్చే వారం రోజుల్లో తుది నిర్ణయం తీసుకోనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 1.34 లక్షల కొత్త ప్రభుత్వ ఉద్యోగాలను ఒకేసారి మంజూరు చేయడంతో పాటు కేవలం నాలుగు నెలల వ్యవధిలో వాటిని భర్తీ చేసిన విషయం తెలిసిందే. 2019 జూలై – అక్టోబర్ మధ్య మొదటి విడతగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం భారీగా నియామక ప్రక్రియ నిర్వహించింది. అప్పట్లో మిగిలిపోయిన ఉద్యోగాలకు 2020 జనవరిలోనే రెండో విడత నోటిఫికేషన్ జారీ చేసి, కరోనా సమయంలో కూడా ఆ ఏడాది సెప్టెంబర్‌లో రాత పరీక్షలు నిర్వహించి నియామకాలు పూర్తి చేసింది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న, ఇంకా మిగిలిపోయిన ఉద్యోగాల భర్తీకి ఇప్పుడు మరో విడత.. మూడో నోటిఫికేషన్ జారీకి ఏర్పాట్లు చేస్తోంది. గత రెండు విడతల మాదిరే.. ఈ సారి కూడా ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖకు అప్పగించింది. అయితే, గత రెండు విడతల్లో ఉద్యోగ నియామక రాత పరీక్షలను పూర్తి స్థాయి ఆఫ్‌లైన్ (ఓఎమ్మార్ షీట్– పేపర్, పెన్ను) విధానంలో నిర్వహించగా.. ఈ విడతలో మాత్రం ఆన్లైన్ విధానంలో నిర్వహణకు పంచాయతీ రాజ్ శాఖ కసరత్తు చేస్తోంది. మూడో విడతలో పలు మార్పులు – గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 20 రకాల కేటగిరి ఉద్యోగులు పని చేస్తున్నారు. ఎనర్జీ అసిస్టెంట్ల కేటగిరి ఉద్యోగాలు మినహా మిగిలిన 19 కేటగిరి ఉద్యోగాల భర్తీ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో జరిగే రాత పరీక్షల ద్వారా భర్తీ చేస్తున్నారు. – తొలి, రెండో విడతల నోటిఫికేషన్ల సమయంలో ఈ 19 కేటగిరి ఉద్యోగాల భర్తీకి 14 రకాల రాత పరీక్షల ద్వారా నియామక ప్రక్రియ కొనసాగింది. గ్రేడ్– 5 పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు ఉద్యోగాలకు కలిపి ఉమ్మడిగా ఒకే రాత పరీక్ష నిర్వహించారు. గ్రేడ్ – 2 వీఆర్వో, విలేజ్ సర్వేయర్ ఉద్యోగాలకు ఉమ్మడిగా మరో రాత పరీక్ష నిర్వహించారు. మిగిలిన 12 కేటగిరి ఉద్యోగాలకు వేర్వేరుగా 12 రకాల రాత పరీక్షలు నిర్వహించారు. – ప్రస్తుతం మూడో విడతలో 19 కేటగిరి ఉద్యోగాలకు వేర్వేరుగా 19 రకాల పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. గ్రేడ్– 5 పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు, గ్రేడ్ – 2 వీఆర్వో, విలేజ్ సర్వేయర్ ఉద్యోగాలకు కూడా వేర్వేరుగా పరీక్షలు జరిగే అవకాశం ఉంది. భవిష్యత్‌లో.. ఆయా కేటగిరి ఉద్యోగాల్లో తక్కువ సంఖ్యలో ఖాళీలు ఏర్పడినప్పుడు కూడా.. మరో కేటగిరి ఉద్యోగ ఖాళీల గురించి వాటి భర్తీని ఆలస్యం చేసే అవకాశం లేకుండా ఒక్కొక్క దానికి వేరుగా పరీక్షల నిర్వహణ మంచిదని అధికారులు ఈ దిశగా నిర్ణయం తీసుకుంటున్నారు. 8 లక్షల దరఖాస్తులు అంచనా.. – వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 2019లో రికార్డు స్థాయిలో 1.34 లక్షల కొత్త శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు ఒకేసారి మంజూరు చేసిన అనంతరం మొదటిసారి ఆ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినప్పుడు.. అప్పట్లో రికార్డు స్థాయిలో 21.69 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అప్పట్లో జరిగిన రాత పరీక్షలకు 19 లక్షల మందికి పైగా హాజరయ్యారు. – మొదటి విడత నోటిఫికేషన్లో గ్రేడ్– 5 పంచాయతీ కార్యదర్శి, వార్డు అడ్మిని్రస్టేటివ్ సెక్రటరీ, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీసు ఉద్యోగాలకు కలిపి ఉమ్మడిగా నిర్వహించిన రాత పరీక్షలకు ఏకంగా 12.54 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. – 2020 రెండో విడత జారీ చేసిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగ నోటిఫికేషన్‌కు కూడా దాదాపు 9 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, అప్పట్లో నిర్వహించిన పరీక్షలకు 7.69 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. – ప్రస్తుతం మూడో విడత జారీ చేసే నోటిఫికేషన్‌కు సంబంధించి దాదాపు 8 లక్షల మందికి పైగా నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. – మూడో విడత ఆన్లైన్ విధానంలో రాత పరీక్షలు నిర్వహించినా, ఒక్కో విడతకు 40 వేల మంది దాకా పరీక్షలు రాసే వసతులు రాష్ట్రంలో ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు. తక్కువ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే కొన్ని కేటగిరి ఉద్యోగాలకు ఒకే రోజు ఉదయం, సాయంత్రం వేర్వేరు çపరీక్షలు జరపడం ద్వారా 20 రోజుల్లో పరీక్షల ప్రక్రియను పూర్తి చేయవచ్చని భావిస్తున్నారు. మొదటి విడత నోటిఫికేషన్ సమయంలో తొమ్మిది రోజులు, రెండో విడత ఏడు రోజుల పాటు రాత పరీక్షలు నిర్వహించామని అధికారులు చెప్పారు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్.. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీతో పాటు వీలైనంత త్వరగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖతో పాటు వివిధ శాఖలు ఇందుకు సంబంధించిన కసరత్తును వేగవంతం చేశాయి. కేటగిరీల వారీగా ఉద్యోగాలకు సంబంధించి ఆయా శాఖలు రోస్టర్– రిజర్వేషన్ల వారీగా ఖాళీల వివరాలకు తుది రూపు ఇస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రక్రియ ముగియగానే, ఫిబ్రవరిలో నోటిఫికేషన్ జారీకి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. -
Telangana: గ్రూప్–4లో 8,039 పోస్టులే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని గ్రూప్–4 ఉద్యోగాల భర్తీపై గందరగోళం మరింత పెరిగింది. ప్రకటించిన తేదీనాటికి పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో ఆందోళనలో ఉన్న అభ్యర్థులకు.. డిసెంబర్ 30న అర్ధరాత్రి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వెబ్సైట్లో పెట్టిన పూర్తిస్థాయి నోటిఫికేషన్లో పోస్టుల సంఖ్య తక్కువగా ఉండటం అయోమయంగా మారింది. నిజానికి డిసెంబర్ ఒకటిన టీఎస్పీఎస్సీ 9,168 గ్రూప్–4 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటించింది. కానీ 8,039 పోస్టులతోనే పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల చేయడం గమనార్హం. వాయిదాతో గందరగోళం మొదలై..: టీఎస్పీఎస్సీ డిసెంబర్ ఒకటిన శాఖల వారీగా ఖాళీలను ప్రకటించింది. కేటగిరీల వారీగా పోస్టుల వివరాలతో డిసెంబర్ 23న పూర్తిస్థాయి నోటిఫికేషన్ ఇచ్చి, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభిస్తామని తెలిపింది. కానీ ఆ రోజున పూర్తిస్థాయి నోటిఫికేషన్ రాలేదు. దరఖాస్తుల స్వీకరణ చేపట్టలేదు. మరోవైపు ఇతర ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు విడుదల అవుతూ వచ్చాయి. దీనితో అభ్యర్థుల్లో గందరగోళం మొదలైంది. టీఎస్పీఎస్సీ 30న అర్ధరాత్రి దాటాక 8,039 ఖాళీలతో పూర్తి నోటిఫికేషన్‌ను వెబ్సైట్లో పెట్టి.. దరఖాస్తుల నమోదు ఆప్షన్‌ను ఇచ్చింది. పంచాయతీరాజ్‌లో తగ్గిన పోస్టులు: టీఎస్పీఎస్సీ వెబ్‌నోట్‌లో ప్రకటించిన పోస్టులతో పోలిస్తే ఇప్పుడు 1,129 ఉద్యోగాలు తగ్గిపోయాయి. కొన్ని విభాగాల పోస్టుల సంఖ్యలో స్వల్పంగా మార్పులు జరిగినా.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో ఏకంగా 1,208 పోస్టులు తగ్గాయి. వాస్తవానికి గతేడాది సీఎం అసెంబ్లీలో వెల్లడించిన జాబితా ప్రకారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ పరిధిలో 1,245 ఖాళీలు ఉన్నాయి. ఇప్పుడు టీఎస్పీఎస్సీ పూర్తిస్థాయి నోటిఫికేషన్లో ఈ శాఖలో 37 పోస్టులు మాత్రమే చూపారు. మొత్తంగా 1,129 కొలువులు తగ్గాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు, జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సరైన సమాచారం, రోస్టర్ వివరాలు ఇవ్వకపోవడంతో టీఎస్పీఎస్సీ ఆ మేరకు పోస్టులు తగ్గించి నోటిఫికేషన్ విడుదల చేసినట్టు అధికారవర్గాలు చెప్తున్నాయి. టీఎస్పీఎస్సీ ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. చదవండి: TSPSC: మరో నాలుగు నోటిఫికేషన్లు.. 806 కొలువులు -
‘సంక్షేమ’ కొలువుల్లో డీఈడీలు గల్లంతు!.. మార్పులపై తీవ్ర అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: వసతిగృహ సంక్షేమాధికారి (హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్) కొలువుల భర్తీ ప్రక్రియ డీఈడీ అభ్యర్థులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పోస్టుమెట్రిక్ హాస్టళ్లతోపాటు ప్రీ–మెట్రిక్ హాస్టళ్లలో కూడా పోస్టులు భర్తీ చేస్తున్న ప్రభుత్వం.... విద్యార్హతలను డిగ్రీ–డీఈడీ స్థాయికి పెంచిన అంశాన్ని ప్రకటించకపోవడంపట్ల అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన నియామకాలు మొదలు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఎస్పీఎస్సీ చేపట్టిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–2 కేటగిరీలో డీఈడీ లేదా బీఈడీలకు అవకాశం కల్పించింది. తాజాగా పెద్ద సంఖ్యలో ఉద్యోగాల భర్తీ సమయంలో అర్హతల మార్పు చేపట్టడంతో డీఈడీ చేసిన లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పది కేటగిరీల్లో 581 పోస్టులు... రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కొలువుల జాతరలో భాగంగా 80 వేల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో కేటగిరీల వారీగా సంబంధిత నియామక సంస్థలు ఉద్యోగ ప్రకటనలు జారీ చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ నెల 23న గిరిజన సంక్షేమం, వెనుకబడిన తరగతుల సంక్షేమం, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమం, రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖల పరిధిలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–1, గ్రేడ్–2, హాస్టల్ వార్డెన్ గ్రేడ్–1, గ్రేడ్–2, మ్యాట్రన్ గ్రేడ్–1, గ్రేడ్–2 కేటగిరీల్లో 581 ఉద్యోగాలకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా గిరిజన సంక్షేమం, బీసీ సంక్షేమ శాఖల పరిధిలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్–2 కేటగిరీలో 544 పోస్టులున్నాయి. పోస్టులపరంగా ఈ సంఖ్య చాలా పెద్దది కావడంతో అభ్యర్థుల్లో ఉత్సాహం రెట్టించింది. తీరా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యాక రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఉన్న డీఈడీ అభ్యర్థులు తెల్లముఖం వేశారు. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ ప్రకారం 5 కేటగిరీల్లోని 549 పోస్టులకు కేవలం డిగ్రీ బీఈడీ అభ్యర్థులే దరఖాస్తు చేసుకోవాలి. అలాగే మరో రెండు కేటగిరీల్లోని 10 గ్రేడ్–1 పోస్టులకు డిగ్రీ–బీఈడీ తప్పనిసరి. కేవలం వికలాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ పరిధిలోని 8 కొలువులకే డీఈడీ అభర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. టీఎస్పీఎస్సీ నిర్ణయంతో తీవ్ర అన్యాయానికి గురయ్యామంటూ డీఈడీ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అర్హతల్లో మార్పులు చేసి తమకు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: పుస్తకం.. ఓ బహుమానం -
TS: సంక్షేమ శాఖల్లో 581 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: వివిధ సంక్షేమ శాఖల్లో 581 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. వసతిగృహ సంక్షేమాధికారి గ్రేడ్–1, గ్రేడ్–2, మ్యాట్రన్ గ్రేడ్–1, గ్రేడ్–2, వార్డెన్ గ్రేడ్–1, గ్రేడ్–2 శిశు గృహాల్లో మహిళా సూపరింటెండెంట్ పోస్టులకు ఉమ్మడి ప్రకటన విడుదల చేసింది. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ప్రకటనను టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వివరించింది. అభ్యర్థుల నుంచి దరఖాస్తులను 2023 జనవరి 6 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్లు వెల్లడించింది. చదవండి: ఆదిలోనే అడ్డంకులు!.. వాయిదా పడ్డ గ్రూప్-4 ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ -
ఆదిలోనే అడ్డంకులు!.. వాయిదా పడ్డ గ్రూప్-4 ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–4 కొలువుల భర్తీ ప్రక్రియకు ఆదిలోనే అడ్డంకులు మొదలయ్యాయి. ఈ కొలువులకు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆకస్మికంగా వాయిదా పడగా.. పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను సైతం విడుదల చేయకపోవడంతో అభ్యర్థుల్లో అయోమయం నెలకొంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని 25 విభాగాల్లో గ్రూప్–4 కేటగిరీలోని 9,168 ఉద్యోగాల భర్తీకి సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ఈనెల 1న వెబ్ నోట్ (ప్రాథమిక ప్రకటన)ను విడుదల చేసింది. ఈ క్రమంలో డిసెంబర్ 23వ తేదీన వెబ్సైట్లో పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచనున్నట్లు ప్రకటించిన కమిషన్.. 23వ తేదీ నుంచి 2023–జనవరి 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నట్లు ఆ వెబ్‌నోట్‌లో వెల్లడించింది. దీంతో అభ్యర్థులంతా దరఖాస్తుల భర్తీ, శిక్షణకు సన్నద్ధమవుతున్న తరుణంలో ఆకస్మికంగా దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు శుక్రవారం టీఎస్పీఎస్సీ ప్రకటించింది. మరోవైపు జిల్లాల వారీగా ఉద్యోగ ఖాళీలు, రిజర్వేషన్లు, విద్యార్హతలు, రోస్టర్ ఆధారిత సమాచారంతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను విడుదల చేయకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. సాంకేతిక కారణాలంటూ.. సాంకేతిక కారణాల వల్ల గ్రూప్–4 ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ తేదీలను మార్పు చేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ శుక్రవారం ఒక వెబ్‌నోట్‌ను విడుదల చేసింది. ఈనెల 30వ తేదీ నుంచి 2023 జనవరి 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపింది. ఈ ఉద్యోగాలకు అవసరమైన అర్హత సమాచారాన్ని వెబ్సైట్లో చూసి నిర్దేశించిన ప్రొఫార్మా ఆధారంగా ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించాలని స్పష్టం చేసింది. ఈ క్రమంలో పూర్తిస్థాయి నోటిఫికేషన్‌పై స్పష్టత ఇవ్వనప్పటికీ, నిర్దేశించిన తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని వివరించింది. కాగా, గ్రూప్–4 ఉద్యోగాలకు సంబంధించి ప్రాథమిక ప్రకటనలో కేవలం శాఖల వారీగా ఉద్యోగ ఖాళీల సంఖ్య మాత్రమే ఉంది. పూర్తిస్థాయి నోటిఫికేషన్లో జిల్లాల వారీగా ఖాళీలు, ఎవరెవరు అర్హులు, రిజర్వేషన్ల వారీగా పోస్టులు.. తదితర పూర్తిస్థాయి సమాచారం ఉంటుంది. అయితే పూర్తిస్థాయి నోటిఫికేషన్ విడుదల కాకపోవడం.. సాంకేతిక కారణాల వల్ల ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ వాయిదా వేయడంతో ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. తదుపరి ఏమవుతుందో..? తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత అత్యధిక పోస్టులతో గ్రూప్–4 ఉద్యోగాల భర్తీ ప్రకటించడం ఇదే మొదటిసారి. మరోవైపు అన్ని ప్రభుత్వ శాఖల్లో దాదాపు 80 వేల ఉద్యోగాల భర్తీ చేపడుతుండగా.. ఈ ఖాళీల్లో గ్రూప్–4 కొలువుల సంఖ్య 12 శాతం ఉంటుంది. ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్న వేళ నిరుద్యోగులు అత్యంత ఉత్సాహంతో సన్నద్ధమవుతుండగా టీఎస్పీఎస్సీ ఇలా అర్ధంతరంగా దరఖాస్తుల స్వీకరణను వాయిదా వేయడం, పూర్తిస్థాయి ప్రకటన విడుదల చేయకపోవడంతో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయోనని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు శాఖల వారీగా సరైన సమాచారం అందకుండానే ఉద్యోగాల భర్తీకి ప్రాథమిక ప్రకటన విడుదల చేశారనే సందేహాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారు. -
గుడ్‌న్యూస్! తెలంగాణాలో మరో భారీ నోటిఫికేషన్.. పరీక్ష ఎప్పుడంటే?
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ల నియమాకానికి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 1,395 జూనియర్ లెక్చరర్లతోపాటు 40 లైబ్రేరియన్, 91 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్ట్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంటాయని టీఎస్పీఎస్ఈ తెలిపింది. డిసెంబర్ 16 నుంచి జనవరి 6వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అర్హులైన అభ్యర్తులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. జూన్ లేదా జూలైలో పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించింది. కాగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. జూనియర్ లెక్చరర్ల పోస్టులకు విడుదలైన తొలి నోటిఫికేషన్ ఇదే కావడం గమనార్హం. 1100 జూనియర్ లెక్చరర్ పోస్టులకు ఉమ్మడి రాష్ట్రంలో 2008లో చివరగా నోటిఫికేషన్ విడుదలైన విషయం తెలిసిందే. చదవండి: స్టూడెంట్ లీడర్ టు మాస్ లీడర్.. సివిల్ సప్లయ్ చైర్మన్‌గా సర్దార్ -
గురుకులాల్లో కొలువులు 12,000.. అతి త్వరలో నోటిఫికేషన్లు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మరిన్ని ప్రభు త్వ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. ఇప్పటికే పోలీసు, గ్రూప్స్ కొలువులకు నోటిఫికేషన్లు జారీకాగా.. తాజాగా గురుకులాల్లో 12 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) చర్యలు చేపట్టింది. ఈ నెల మూడో వారంలోగా నోటిఫికేషన్లు విడుదల కానున్నట్టు ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రాష్ట్రంలో ఇప్పటికే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు 17వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి నియామకాల ప్రక్రియను వేగంగా కొనసాగిస్తోంది. గ్రూప్–1, గ్రూప్–4 పోస్టులతో పాటు పలు శాఖల్లో ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నోటిఫికేషన్లు ఇచ్చింది. ఇప్పుడు గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వరుసగా నోటిఫికేషన్లు వస్తుండటం, భారీగా ఉద్యోగాల భర్తీ చేపడుతుండటంతో నిరుద్యోగుల్లో ఉత్సాహం కనిపిస్తోంది. పెరిగిన కొలువులు.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ(టీటీడబ్ల్యూఆర్ఈఐఎస్), తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీఎంఆర్ఈఐఎస్), మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్)ల పరిధిలో 9,096 పోస్టుల భర్తీకి గతంలోనే ఆమోదం వచ్చింది. వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఇప్పటికే గురుకుల నియామకాల బోర్డుకు చేరాయి. తాజాగా మరో 3వేల పోస్టుల భర్తీకి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. వీటికి ఆర్థిక శాఖ అనుమతులు జారీచేసిన వెంటనే భర్తీ ప్రక్రియ మొదలుకానుంది. దీనితో మొత్తంగా ఉద్యోగ ఖాళీలు 12 వేలకు పెరిగాయి. 12వేలకు పెరిగిన కొలువులు సీఎం ప్రస్తుతం ఆమోదించిన పోస్టులన్నీ కొత్త విద్యా సంస్థల్లోనివే. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా 33 బీసీ గురుకుల పాఠశాలలు, 15 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను ప్రారంభించింది. మరోవైపు 119 బీసీ గురుకుల పాఠశాలలు, మైనార్టీ సొసైటీ పరిధిలో 97 పాఠశాలలు జూనియర్ కాలేజీలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. ఇలా కొత్తగా ప్రారంభించిన, అప్‌గ్రేడ్ చేసిన పాఠశాలల్లో బోధన కేటగిరీలో 3వేల కొలువుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏకకాలంలో నోటిఫికేషన్లు గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగ ఖాళీలకు ఏకకాలంలో నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు సంబంధించి అంతర్గత పరిశీలన దాదాపు పూర్తి కావచ్చింది. 9,096 పోస్టులకు సంబంధించి గురుకుల సొసైటీలు ఇప్పటికే టీఆర్‌ఈఐఆర్‌బీ (ట్రిబ్)కు సమర్పించగా.. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్లు, ఇతర అంశాలపై లోతుగా పరిశీలన చేపట్టింది. దీనికితోడు ఇప్పుడు మరో 3వేల పోస్టుల భర్తీకి ఆమోదం వచ్చింది. వీటికి ఆర్థికశాఖ ఓకే చెప్పగానే అన్నిపోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్లు ఇస్తే నియామకాల ప్రక్రియ సులభతరం అవుతుందని ట్రిబ్ అధికారులు భావిస్తున్నారు. కాస్త ఆలస్యమైనా పెద్ద సంఖ్యలో పోస్టుల భర్తీతో నిరుద్యోగులకు సైతం ఉత్సాహం వస్తుందని అంటున్నారు. చాలా వరకు బోధన పోస్టులే.. గురుకులాల్లో భర్తీ చేయనున్న 12వేల పోస్టుల్లో చాలా వరకు టీజీటీ (ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్), పీజీటీ (పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్) పోస్టులే ఉన్నాయి. ఈ రెండు కేటగిరీల్లో పోస్టుల భర్తీకి ఏకకాలంలో నోటిఫికేషన్ ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. వీటితోపాటు ప్రిన్సిపల్, జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్, పీఈటీ, ఫిజికల్ డైరెక్టర్ తదితర కేటగిరీలకు వరుసగా ప్రకటనలు జారీ చేయనున్నట్టు అధికారులు చెప్తుతున్నారు. మొత్తంగా ఈనెల మూడో వారం నాటికి నోటిఫికేషన్ల జారీ మొదలయ్యే అవకాశం ఉందని వివరిస్తున్నారు. -
Group 4 Notification: 9,168 కొలువులకు నోటిఫికేషన్.. పరీక్ష విధానం ఇదే!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధమైంది. మొత్తంగా 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎస్పీఎస్సీ ఇంత భారీ సంఖ్యలో గ్రూప్స్ కొలువుల భర్తీకి ప్రకటన వెలువరించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇందులో 25 ప్రభుత్వ విభాగాల పరిధిలో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డు ఆఫీసర్ కేటగిరీల పోస్టులు ఉన్నాయి. ఆన్లైన్లో దరఖాస్తులు: గ్రూప్–4 పోస్టులకు ఈ నెల 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 12వ తేదీ వరకు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్పీఎస్సీ తెలిపింది. శాఖల వారీగా ఉద్యోగ ఖాళీలపై స్పష్టత ఇచ్చింది. ఆయా పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, కేటగిరీల వారీగా ఖాళీలు, వేతన స్కేల్, వయో పరిమితి తదితర వివరాలతో కూడిన పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ను ఈ నెల 23న కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని తెలిపింది. ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందని.. దీనిని వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మే నెలలో నిర్వహిస్తామని వెల్లడించింది. అన్నీ జూనియర్ అసిస్టెంట్ కేటగిరీవే.. తాజాగా గ్రూప్–4 కేటగిరీలో భర్తీ చేయనున్న ఉద్యోగాలన్నీ జూనియర్ అసిస్టెంట్ స్థాయికి సంబంధించినవే. ఇందులో నాలుగు కేటగిరీలు ఉన్నాయి. జూనియర్ అకౌంటెంట్ కేటగిరీలో 429 పోస్టులు, జూనియర్ అసిస్టెంట్ కేటగిరీలో 6,859 పోస్టులు, జూనియర్ ఆడిటర్ కేటగిరీలో 18 పోస్టులు, వార్డ్ ఆఫీసర్ కేటగిరీలో 1,862 పోస్టులు ఉన్నాయి. -
Telugu Top News: మార్నింగ్ హైలైట్ న్యూస్
1. AP: సీఎం జగన్ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు.. హోంగార్డులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీపికబురు అందించారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా పోలీసు నియామకాల్లో హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు పోలీసు నియామక ప్రక్రియ నిబంధనలు సవరించి మరీ హోంగార్డులకు రిజర్వేషన్లు కల్పించడం విశేషం. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. శాఖల వారీగా గ్రూప్–4 పోస్టుల వివరాలివే.. ఆ రెండు శాఖల్లోనే ఎక్కువ ఖాళీలు.. రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 9,168 గ్రూప్–4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టుల వివరాలు, ఏఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి వంటి వివరాలు ఇలా ఉన్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. AP: పోలీసు ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్.. పోస్టుల వివరాలు ఇవే.. పోలీసు ఉద్యోగార్థులకు శుభవార్త! 6,511 పోలీసు ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ కానుంది. ఏటా 6,500 నుంచి 7 వేల వరకు పోలీసు ఉద్యోగాలను భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొద్ది నెలల క్రితం పోలీసు శాఖను ఆదేశించిన విషయం తెలిసిందే. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. ముందస్తు మేఘాలు! అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్ దృష్టి శాసనసభకు ముందస్తు ఎన్నికలు ఉండవని, నిర్దేశిత సమయంలోనే జరుగుతాయని సీఎం కె.చంద్రశేఖర్‌రావు పలు సందర్భాల్లో చెప్పారు. కానీ.. రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్లు, సొంత జాగాలో నివాసాలు, దళితబంధు లాంటి పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ముఖ్యమంత్రి దృష్టి సారించడం, కొలువులు భర్తీ చేయాలని నిర్ణయించడం..‘ముందస్తు’కు సంకేతాలేనన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. ఎన్నికలే లక్ష్యంగా బాబు డేంజర్ గేమ్.. ఇంకెన్ని దారుణాలు చూడాలో.. ఈ రాష్ట్రం ఏమైపోయినా పర్వాలేదు... నా చంద్రబాబు అధికారంలో ఉంటే చాలనుకుంటాడు రామోజీరావు. అందుకే... ‘బాబు మాట– బంగారం మూట’ అనే రీతిలో నారా వారు చెప్పే పచ్చి అబద్ధాలను కూడా పతాక శీర్షికల్లో అచ్చేస్తుంటాడు. కాస్తయినా ఇంగితజ్ఞానం, పత్రికగా కొంతైనా సామాజిక బాధ్యత ఉండాలి కదా? తన పాఠకులకే కాదు... ఈ రాష్ట్ర ప్రజలకు కూడా జవాబుదారీ అనే స్పృహ అక్కర్లేదా? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. US midterm elections results 2022: ఫలితమూ మధ్యంతరమే అమెరికాలో ఇటీవల జరిగిన మధ్యంతర ఎన్నికలతో లాభపడింది ఎవరు? హోరాహోరీగా తలపడిన వైరిపక్షాలు డెమొక్రాట్లు, రిపబ్లికన్లు తమ లక్ష్యాన్ని చేరాయా అంటే కచ్చితంగా లేదనే చెప్పాలి.డెమొక్రాట్లకు చావు తప్పి కన్ను లొట్టబోతే, రిపబ్లికన్లు నిక్కుతూ నీలుగుతూ మునిగిపోయే నావనుంచి చివరి నిమిషంలో బయటపడి అతికష్టం మీద ఊపిరి పీల్చుకున్నారు. అంతో ఇంతో జనాలే లాభపడ్డారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. Neena Rao: విజేత తల్లి ప్రతి బిడ్డా ప్రత్యేకమే. మీ బిడ్డ పదిలో ఒకరు కాకపోవచ్చు. పదిమంది చేసినట్లు చేయకపోవచ్చు. మీకు పుట్టింది ఐన్‌స్టీన్ కావచ్చు. బిల్ గేట్స్ కూడా కావచ్చు. బిడ్డ మేధాశక్తిని గ్రహించండి. బిడ్డకు ఏమివ్వాలో తెలుసుకోండి. మీ బిడ్డ విజేతగా నిలుస్తాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. మాదాపూర్ గుర్తుందా.. మళ్లీ అదే తరహా డెవలప్మెంట్ అక్కడ మొదలైంది! ‘అభివృద్ధిని ముందుగా ఊహించిన వాళ్లే ఫలాలను అందుకుంటారు’ స్థిరాస్తి రంగంలో ఇది అక్షర సత్యం. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీల రాకతో మొదలైన మాదాపూర్ అభివృద్ధి.. 2007లో రియల్ బూమ్‌తో చుట్టూ 20 కి.మీ. వరకూ విస్తరించింది. సేమ్ ఇదే తరహా డెవలప్మెంట్ ఉత్తర హైదరాబాద్‌లో మొదలైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. వాషింగ్టన్ సుందర్ సరికొత్త చరిత్ర.. 12 ఏళ్ల రికార్డు బద్దలు ఆక్లాండ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో 7 వికెట్ల తేడాతో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా రాణించినప్పటికీ.. బౌలర్లు మాత్రం మరోసారి పూర్తిగా తేలిపోయారు. ఇక ఇది ఇలా ఉండగా.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. టాలీవుడ్లో మాస్ జాతర.. పూనకాలు తెప్పిస్తారట! టికెట్లు బాగా తెగాలంటే మాస్ ప్రేక్షకులు రావాలి. అందుకే ఏడాదికి రెండొందల సినిమాలు వస్తే.. వాటిలో తొంభై శాతం మాస్ సినిమాలే ఉంటాయి. ఆ మాస్ బొమ్మ (సినిమా) బాగుంటే ఇక మాస్ ప్రేక్షకులకు పండగ... వసూళ్లతో బాక్సాఫీస్‌కి పండగ. ప్రస్తుతం తెలుగులో రూపొందుతున్న ‘మాస్ బొమ్మ’లపై ఓ లుక్కేద్దాం... పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
Group 4 Notification: శాఖల వారీగా గ్రూప్–4 పోస్టుల వివరాలివే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 9,168 గ్రూప్–4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం లభించిన విషయం తెలిసిందే. అయితే ఈ పోస్టుల వివరాలు, ఏఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి వంటి వివరాలు చూద్దాం.. ఆర్థికశాఖ అనుమతించిన గ్రూప్–4 పోస్టుల వివరాలివే.. 1) జూనియర్ అకౌంటెంట్లు: 429 ఆర్థికశాఖ: 191 (డైరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్స్–35, డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్–156) మున్సిపల్ శాఖ: 238 (సీడీఎంఏ–224, హెచ్ఎండీఏ–14) 2) జూనియర్ అసిస్టెంట్లు: 6,859 ► వ్యవసాయశాఖ: 44 (డైరెక్టర్ కార్యాలయం–2, కోఆపరేటివ్ రిజి్రస్టార్–4, అగ్రికల్చర్ కమిషనర్–4, హారి్టకల్చర్ వర్సిటీ–34, పశుసంవర్థక శాఖ–2, మత్స్యశాఖ–2) ► బీసీ సంక్షేమశాఖ: 307 (డైరెక్టర్ కార్యాలయం–7, జ్యోతిబాపూలే గురుకుల సొసైటీ–289, బీసీ సహకార సమాఖ్య–11) ► పౌర సరఫరాలశాఖ: 72 (డైరెక్టర్ కార్యాలయం–25, లీగల్ మెట్రాలజీ–1, సివిల్ సప్లైస్ కార్పొరేషన్–46) ► ఇంధనశాఖ: 2 (చీఫ్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం) ► అటవీ, పర్యావరణ శాఖ: 23 (పీసీసీఎఫ్ కార్యాలయం) ► ఆర్థిక శాఖ: 46 (డైరెక్టర్ ఆఫ్ వర్క్స్, అకౌంట్స్) ► సాధారణ పరిపాలన శాఖ: 5 (పౌరసంబంధాల శాఖ కమిషనర్ కార్యాలయం) ► వైద్య, ఆరోగ్యశాఖ: 338 (టీవీవీపీ కార్యాలయం–119, ఆయుష్ కమిషనర్–10, డ్రగ్స్ కంట్రోల్–2, వైద్య విద్య–125, ప్రజారోగ్య శాఖ–81, ఐపీఎం–1) ► ఉన్నత విద్యాశాఖ: 742 (కళాశాల విద్య కమిషనరేట్–36, ఇంటరీ్మడియట్ కమిషనర్–68, సాంకేతిక విద్య కమిషనర్–46, ఓపెన్ యూనివర్సిటీ–26, జేఎన్యూఎఫ్ఏ–2, జేఎన్టీయూ–75, కాకతీయ వర్సిటీ–10, మహాత్మాగాందీ–4, ఉస్మానియా–375, పాలమూరు–8, తెలుగు యూనివర్సిటీ–47, ఆర్జీయూకేటీ–31, శాతవాహన–8, తెలంగాణ వర్సిటీ–6) ► హోంశాఖ: 133 (డీజీపీ–88, జైళ్లశాఖ–18, అగ్ని మాపకశాఖ–17, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్–8, సైనిక్ వెల్ఫేర్–2) ► పరిశ్రమలశాఖ: 7 (కమిషనరేట్–4, మైన్స్, జియాలజీ–3) ► సాగునీటి శాఖ: 51 (భూగర్భజల శాఖ–1, ఈఎన్సీ–పరిపాలన–50) ► కార్మికశాఖ: 128 (ఉపాధి, శిక్షణ శాఖ–33, కార్మిక కమిషనర్–29, బాయిలర్స్ డైరెక్టర్–1, ఫ్యాక్టరీస్–5, ఇన్‌స్రూెన్స్ మెడికల్ సరీ్వసెస్–60) ► మైనార్టీ సంక్షేమశాఖ: 191 (మైనార్టీ సంక్షేమ డైరెక్టర్–06, మైనార్టీ గురుకులాలు–185) ► పురపాలకశాఖ: 601 (సీడీఎంఏ–172, టౌన్‌ప్లానింగ్–03, పబ్లిక్ హెల్త్ ఈఎన్సీ–2, జీహెచ్ఎంసీ–202, హెచ్ఎండీఏ–50, హెచ్ఎండబ్ల్యూఎస్–167, కుడా–05) ► పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ: 1,245 (కమిషనర్ పరిధిలో–1,224, ఈఎన్సీ (జనరల్ అండ్ పీఆర్)–11, ఈఎన్సీ మిషన్ భగీరథ–10) ► ప్రణాళికశాఖ: 02 (అర్థగణాంక శాఖ డైరెక్టర్–02) ► రెవెన్యూ శాఖ: 2,077 (స్టాంపులు, రిజి్రస్టేషన్లు–40, భూపరిపాలన శాఖ–1,294, వాణిజ్య పన్నులు–655, దేవాదాయ–09, ఎక్సైజ్–72, సర్వే సెటిల్మెంట్–7) ► ఎస్సీ అభివృద్ధి శాఖ: 474 (కమిషనర్ ఎస్సీల అభివృద్ధి శాఖ–13, ఎస్సీ సహకార కార్పొరేషన్–115, ఎస్సీ గురుకులాలు–346) ► మాధ్యమిక విద్యాశాఖ: 97 (డీఎస్ఈ–20, వయోజన విద్య–2, గ్రంథాలయాలు–9, మోడల్ స్కూళ్లు–14, టీఎస్ఈడబ్ల్యూఐడీసీ–9, టీఎస్‌ఆర్‌ఈఐఎస్–39, జిల్లా గ్రంథాలయాల సంస్థ–4) ► రోడ్డు, రవాణాశాఖ: 20 (రవాణా కమిషనర్–11, ఈఎన్సీ ఆర్అండ్బీ–09) ► గిరిజన సంక్షేమ శాఖ: 221 (సీఈ ట్రైబల్ వెల్ఫేర్–04, కమిషనర్ ట్రైబల్ వెల్ఫేర్–11, జీసీసీ–65, ట్రైకార్–08, ఎస్టీ గురుకులాలు–132, టీసీఆర్‌అండ్‌టీఐ–1) ► మహిళాశిశు సంక్షేమశాఖ: 18 (జువెనైల్ వెల్ఫేర్–09, వికలాంగ, వయోవృద్ధుల సంక్షేమం–03, మహిళాశిశు సంక్షేమం–06) ► యువజన, సాంస్కృతికశాఖ: 13 (భాష సంస్కృతి–02, ఎన్సీసీ–11) 3) జూనియర్ ఆడిటర్: 18 (డైరెక్టర్ స్టేట్ ఆడిట్) 4) వార్డ్ ఆఫీసర్: 1,862 (మున్సిపల్ శాఖ) చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-4 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ -
నిరుద్యోగులకు శుభవార్త.. గ్రూప్-4 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రూప్–4 ఉద్యోగ నియామకాలకు లైన్‌క్లియర్ అయింది. మొత్తం 9,168 గ్రూప్–4 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించిన నియామక ప్రక్రియను చేపట్టాలని రాష్ట్ర పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)ని ఆదేశించింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల్లోని 80 వేల ఉద్యోగాల భర్తీ చేపడతామన్న ప్రభుత్వం ఇప్పటికే 50 వేల ఉద్యోగ నియామకాలకు అనుమతులు ఇచి్చంది. కొన్నింటికి నోటిఫికేషన్లు కూడా జారీ అయ్యాయి. ఇందులో అత్యధికం పోలీసుశాఖకు సంబంధించిన పోస్టులు ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కువగా ఉన్నవి గ్రూప్–4 ఉద్యోగాలే. మరో 9,096 పోస్టులు గురుకుల నియామకాల బోర్డు పరిధిలో ఉన్నాయి. శాఖల వారీగా ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన 9,168 గ్రూప్–4 ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆయా ప్రభుత్వ శాఖలు ముందుగా టీఎస్పీఎస్సీకి ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. శాఖల వారీగా మంజూరు చేసిన పోస్టులకు సంబంధించి రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లకు అనుగుణంగా ఈ ప్రతిపాదనలు సమర్పిస్తారు. ఆ ప్రతిపాదనలను టీఎస్పీఎస్సీ పూర్తిస్థాయిలో పరిశీలిస్తుంది. అన్ని అంశాలు లోపాలకు తావులేకుండా ఉన్నట్టు సంతృప్తి చెందిన తర్వాత పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ప్రస్తుతం గ్రూప్–4 కేటగిరీలో భర్తీకి అనుమతించిన మొత్తం 9,168 పోస్టులకు ఒకే నోటిఫికేషన్ వెలువనున్నట్టు సమాచారం. ఈ పోస్టుల్లో వివిధ ఉద్యోగాలు కలిపి సగానికిపైగా మున్సిపల్, రెవెన్యూ శాఖల పరిధిలోనే ఉండటం గమనార్హం. గ్రూప్–4 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు ఇక సాధన మొదలుపెట్టి కొలువు దక్కించుకునేందుకు కృషి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రా>వు శుక్రవారం ట్విట్టర్ వేదికగా పిలుపునిచ్చారు. విధుల వారీగా పోస్టుల లెక్కలివీ.. 1) జూనియర్ అకౌంటెంట్లు: 429 2) జూనియర్ అసిస్టెంట్లు: 6,859 3) జూనియర్ ఆడిటర్: 18 (డైరెక్టర్ స్టేట్ ఆడిట్) 4) వార్డ్ ఆఫీసర్: 1,862 (మున్సిపల్ శాఖ) మొత్తం పోస్టులు : 9,168 -
నిరుద్యోగులకు సీఎం జగన్ దీపావళి కానుక
సాక్షి, అమరావతి: దీపావళి పండగ వేళ నిరుద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గుడ్‌న్యూస్ అందించారు. 6,511 పోలీస్ నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి త్వరలో నోటిఫికేషన్ విడుదల కానుంది. ► రిజర్వ్ విభాగంలో ఎస్సై పోస్టులు-96 ►సివిల్ విభాగంలో ఎస్సై పోస్టులు-315 ►ఏపీ స్పెషల్ పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ పోస్టులు-2520 ►సివిల్ విభాగంలో కానిస్టేబుల్ పోస్టులు-3580 ►మొత్తం=6511 -
నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ నోటిఫికేషన్ విడుదల
ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. రాష్ట్రంలోని అటవీశాఖకు సంబంధించి ఎనిమిది ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పోస్టులు, అలాగే సర్వే ల్యాండ్ రికార్డ్స్ విభాగంలోని ఎనిమిది కంప్యూటర్ డ్రాఫ్ట్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి హెచ్.అరుణ్‌కుమార్ అక్టోబర్ 17న తెలిపారు. కాగా, ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ పోస్టులకు నవంబర్ 15 నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తు చేయవచ్చునని పేర్కొన్నారు. కంప్యూటర్ డ్రాఫ్ట్‌మెన్ పోస్టులకు నవంబర్ 10 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసేందుకు అవకాశం ఉందని వెల్లడించారు. ఇతర వివరాలకు psc.ap.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని కోరారు. -
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో 10 లక్షల ఉద్యోగాలు!
న్యూఢిల్లీ: నిరుద్యోగితపై ఆందోళన పెరుగుతున్న నేపథ్యంలో పోస్టుల భర్తీపై కేంద్రం మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఖాళీ పోస్టుల వివరాలు ఇవ్వాలంటూ ప్రభుత్వ రంగ సంస్థలకు (పీఎస్‌యూ) సూచించింది. వాటిని సత్వరం భర్తీ చేసేందుకు మార్గదర్శ ప్రణాళికను రూపొందించుకోవాలని ఆదేశించింది. ఎంట్రీ స్థాయితో పాటు సీనియర్ లెవెల్ ఖాళీల వివరాలను కూడా కేంద్రం అడిగినట్లు ఒక పీఎస్‌యూ సీనియర్ అధికారి తెలిపారు. డిసెంబర్ వరకు గుర్తించిన ఎంట్రీ–లెవెల్ ఖాళీలను వచ్చే ఏడాది ఆగస్టు–సెప్టెంబర్ కల్లా భర్తీ చేయాలని ఆదేశాలు వచ్చినట్లు వివరించారు. చదవండి: ఆ కారు క్రేజ్ వేరబ్బా, రెండేళ్లు వెయిటింగ్.. అయినా అదే కావాలంటున్న కస్టమర్లు! సాధారణంగా నిర్దిష్ట మార్గదర్శకాలకు అనుగుణంగా పారదర్శక విధానంలో నియామకాలు చేపట్టాల్సి ఉండటం, దేశవ్యాప్తంగా అభ్యర్థులు పాల్గొనడం వంటి అంశాల కారణంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో హైరింగ్ ప్రక్రియకు కాస్త ఎక్కువ సమయమే పడుతుందని ఆయన పేర్కొన్నారు. అధికారిక గణాంకాల ప్రకారం 2021 ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 255 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు (సీపీఎస్ఈ) ఉన్నాయి. వీటిలో 177 సంస్థలు లాభాల్లో ఉన్నాయి. ఇవి 2021 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.89 లక్షల కోట్ల లాభాలు నమోదు చేశాయి. వచ్చే ఏడాదిన్నర వ్యవధిలో యుద్ధప్రాతిపదికన 10 లక్షల మంది ఉద్యోగుల రిక్రూట్మెంట్ చేపట్టాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ వివిధ శాఖలు, విభాగాలకు జూన్‌లో ఆదేశించారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) ఖాళీల భర్తీ కోసం కేంద్ర ఆర్థిక శాఖ గత నెలలోనే ఆయా బ్యాంకులు, ఆర్థిక సంస్థల చీఫ్‌లతో సమావేశమైంది. దీంతో బ్యాంకులు రిక్రూట్మెంట్ కోసం ప్రకటనలు జారీ చేయడం కూడా మొదలుపెట్టాయి. 2012–13లో పీఎస్బీల్లో 8.86 లక్షల మంది ఉద్యోగులు ఉండగా 2020–21 నాటికి ఇది 7.80 లక్షలకు తగ్గింది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్: ఊహించని షాక్.. తలలు పట్టుకుంటున్న ఐటీ కంపెనీలు! -
డిగ్రీ అర్హతతో 5,008 పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
బ్యాంకు కొలువుల అభ్యర్థులకు..శుభవార్త! దేశంలోని అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఐదువేలకుపైగా జూనియర్ అసోసియేట్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. రెండు దశల రాత పరీక్ష ద్వారా నియామకాలు ఖరారు చేయనుంది. దీనికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో.. ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్ నోటిఫికేషన్ వివరాలు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానంతో పాటు విజయానికి ప్రిపరేషన్ గైడెన్స్.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతి ఏటా క్రమం తప్పకుండా క్లరికల్, పీవో (ప్రొబేషనరీ ఆఫీసర్), స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతోంది. కాబట్టి ఐబీపీఎస్, ఎస్ఎస్సీ వంటి పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు అదే ప్రిపరేషన్‌తో.. ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ ఉద్యోగాలకు కూడా పోటీ పడొచ్చు. ఐదు వేలకుపైగా పోస్టులు ఎస్బీఐ మొత్తం 5,008 జూనియర్ అసోసియేట్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో హైదరాబాద్ సర్కిల్లో 225 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. అర్హతలు ►నవంబర్ 30,2022 నాటికి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి. ►వయసు: ఆగస్ట్ 1, 2022 నాటికి 18–28 ఏళ్లుగా ఉండాలి. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. తొలిసారి ప్రాంతీయ భాషల్లో ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్ తాజా నోటిఫికేషన్లో ప్రధానంగా ప్రస్తావించాల్సిన అంశం.. తొలిసారిగా పరీక్షలను ్ర΄ాంతీయ భాషల్లో నిర్వహించనుండడం. తెలుగు సహా మొత్తం ఇరవై భాషల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమకు ఆసక్తి ఉన్న భాషలో పరీక్షకు హాజరు కావచ్చు. హైదరాబాద్ సర్కిల్లో పరీక్ష రాయాలనుకునే వారు తెలుగు లేదా ఉర్దూ మీడియంలను ఎంచుకునే అవకాశముంది. రెండు దశల రాత పరీక్ష ఎస్బీఐ జూనియర్ అసోసియేట్ పోస్టులకు రెండు దశల రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ముందుగా ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. అందులో సాధించిన ఉత్తీర్ణత, కటాఫ్ లిస్ట్ ఆధారంగా..తదుపరి దశలో జరిపే మెయిన్ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంతిమంగా మెయిన్‌లో చూపిన ప్రతిభ ఆధారంగానే నియామకాలు ఖరారు చేస్తారు. స్థానిక భాష పరీక్ష అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యే మాధ్యమాన్ని దరఖాస్తు సమయంలోనే తెలియజేయాల్సి ఉంటుంది. దాని ఆధారంగానే పరీక్ష పేపర్ మాధ్యమం ఉంటుంది. మాతృ భాష కాకుండా.. వేరే భాషలో పరీక్ష రాసిన అభ్యర్థులకు.. మెయిన్ ఎగ్జామ్ తర్వాత స్థానిక భాష పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ 100 మార్కులు ఎంపిక ప్రక్రియలో తొలి దశ రాత పరీక్ష.. ప్రిలిమినరీ. మూడు విభాగాలుగా ఆన్లైన్లో మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు–30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలు–35 మార్కులకు ప్రిలిమ్స్ పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం 60 నిమిషాలు. పరీక్ష పూర్తిగా ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ మినహా మిగతా విభాగాలకు సంబంధించి.. అభ్యర్థులు తమ రాష్ట్రానికి చెందిన లేదా తాము దరఖాస్తు చేసుకున్న రాష్ట్రానికి సంబంధించిన ప్రాంతీయ భాషలో పరీక్ష రాయొచ్చు. 200 మార్కులకు మెయిన్ తొలిదశ రాత పరీక్ష ప్రిలిమినరీలో చూపిన ప్రతిభ ఆధారంగా 1:10 నిష్పత్తిలో (ఒక్కో పోస్ట్‌కు పది మందిని చొప్పున) తదుపరి దశ మెయిన్ ఎగ్జామ్‌కు ఎంపిక చేస్తారు. ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో ఉండే మెయిన్ పరీక్ష మొత్తం నాలుగు విభాగాల్లో 200 మార్కులకు జరుగుతుంది. జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్ ఇంగ్లిష్ 40 ప్రశ్నలు–40 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–50 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–60 మార్కులకు ఉంటాయి. పరీక్ష సమయం 2గంటల 40 నిమిషాలు. మెయిన్ ఎగ్జామ్‌లోనూ అభ్యర్థులు జనరల్ ఇంగ్లిష్ మినహా మిగతా విభాగాలను తమకు ఆసక్తి, అర్హత ఉన్న ప్రాంతీయ భాషలో హాజరయ్యే అవకాశం ఉంది. నవంబర్‌లో పరీక్ష.. సన్నద్ధత ఇలా ఎస్బీఐ నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం–ప్రిలిమినరీ పరీక్ష నవంబర్‌లో జరుగనుంది. మెయిన్ మాత్రం ఈ ఏడాది డిసెంబర్ లేదా వచ్చే ఏడాది జనవరిలో నిర్వహించే అవకాశం ఉంది. అంటే..ప్రిలిమ్స్‌కు గరిష్టంగా రెండు నెలలు, మెయిన్స్‌కు మూడు లేదా నాలుగు నెలల సమయం అందుబాటులో ఉంటుంది. అభ్యర్థులు ముందుగా ప్రిలిమినరీ పరీక్ష తేదీ వరకు.. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలో ఉన్న సబ్జెక్ట్‌లకు ప్రిపరేషన్ సాగించాలి. ఆ తర్వాత పూర్తిగా మెయిన్స్‌పై దృష్టి పెట్టాలి. మెయిన్ పరీక్షలో మాత్రమే ఉన్న జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్, కంప్యూటర్ ఆప్టిట్యూడ్ విభాగాలకు ప్రత్యేక సమయం కేటాయించాలి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ అభ్యర్థుల ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరిశీలించే విభాగం ఇది. ఇందులో రాణించాలంటే.. బేసిక్ గ్రామర్‌పై అవగాహన ఉండాలి. అదేవిధంగా ఇడియమ్స్, సెంటెన్స్ కరెక్షన్, వొకాబ్యులరీ, సెంటెన్స్ రీ అరేంజ్మెంట్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్‌పై పట్టు సాధించాలి. జనరల్ ఇంగ్లిష్ నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం, వాటిలో వినియోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిపై దృష్టి పెట్టాలి. న్యూమరికల్ ఎబిలిటీ పరీక్షలో మరో కీలక విభాగం ఇది. మెయిన్‌లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగానికి సరితూగే విభాగంగా దీన్ని పేర్కొనొచ్చు. ఇందులో ప్రధానంగా అర్థమెటిక్ అంశాలు (పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభ–నష్టాలు, నంబర్ సిరీస్, బాడ్‌మాస్ నియమాలు)పై పట్టు సాధించేలా ్ర΄ాక్టీస్ చేయాలి. వీటితో΄ాటు డేటాఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్లనూ సాధన చేయాలి. రీజనింగ్ ఈ విభాగం ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ ఉంటుంది. ఇందులో మంచి మార్కుల సాధనకు కోడింగ్–డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్, సిలాజిజమ్ విభాగాలను బాగా ప్రాక్టీస్ చేయాలి. జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్ మెయిన్‌లోనే ఉండే ఈ విభాగంలో రాణించాలంటే.. బ్యాంకింగ్ రంగంలో తాజా పరిణామాలు, విధానాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్ రంగంలోని అబ్రివేషన్లు, పదజాలం, విధులు, బ్యాంకులకు సంబంధించిన కొత్త విధానాలు, కోర్ బ్యాంకింగ్‌కు సంబంధించిన చట్టాలు, విధానాలు, రిజర్వ్ బ్యాంకు విధులు వంటి వాటిపై అవగాహన పెంచుకోవాలి. జనరల్ అవేర్‌నెస్‌లో.. కరెంట్ అఫైర్స్, స్టాక్ జనరల్ నాలెడ్జ్ కోణంలోనూ ఎకానమీ, ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. కంప్యూటర్ ఆప్టిట్యూడ్ కంప్యూటర్ నాలెడ్జ్‌ను పరీక్షించే ఉద్దేశంతో మెయిన్‌లో మాత్రమే ఉండే విభాగం ఇది. ఈ విభాగానికి సంబంధించి ప్రధానంగా కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీ బోర్డ్ షాట్ కట్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ సంబంధిత అంశాల(సీపీయూ, మానిటర్, హార్డ్ డిస్క్ తదితర) గురించి తెలుసుకోవాలి. గత ప్రశ్న పత్రాల సాధన అభ్యర్థులు గత ప్రశ్న పత్రాల సాధన, మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం ఉపయుక్తంగా ఉంటుంది. ఫలితంగా ఏ టాపిక్కు ఎంత వెయిటేజీ ఉందో తెలుస్తుంది. అంతేకాకుండా సమాధానాలను సరి చూసుకోవడం ద్వారా తాము ఇంకా అవగాహన ΄÷ందాల్సిన అంశాలపై స్పష్టత లభిస్తుంది. మాక్ టెస్ట్‌లకు హాజరవడం వల్ల టైమ్ మేనేజ్మెంట్ కూడా అలవడుతుంది. ఇలా ఇప్పటి నుంచే మెయిన్ ఎగ్జామినేషన్ దృక్పథంతో చదివితే.. ప్రిలిమ్స్‌లో సులువుగా నెగ్గడానికి, ఆ తర్వాత మెయిన్‌లో రాణించడానికి అవకాశం ఉంటుంది. ముఖ్య సమాచారం ►దరఖాస్తు విధానం: ఆన్లైన్లో. ►ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 27, 2022 ►ప్రిలిమినరీ పరీక్ష తేదీ: నవంబర్, 2022లో ►మెయిన్ పరీక్ష తేదీ: డిసెంబర్ 2022 లేదా జనవరి 2023లో ►పూర్తి వివరాలకు వెబ్సైట్: https://bank.sbi/careers, https://www.sbi.co.in/careers -
Harish Rao: గురుకులాల్లో ఉద్యోగాలు భర్తీ చేస్తాం
మణికొండ/సాక్షి, హైదరాబాద్: గురుకులాల్లో త్వరలోనే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని, కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీక రిస్తామని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్స వాన్ని పురస్కరించుకుని గురువారం ఆయన హైద రాబాద్ శివారు నార్సింగి మున్సిపాలిటీ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల బాలికల పాఠశాలలో మందుబిళ్లలను పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే టి. ప్రకాశ్‌గౌడ్‌తో కలసి మంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హరీశ్‌రావు మాట్లా డుతూ విద్యార్థులు బాగా చదువుకుని అన్ని రంగాల్లో రాణించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరి స్థితిని నెలవారీగా సమీక్షించాలని, స్థానిక పీహెచ్సీ వైద్యులు తప్పనిసరి గురుకులాలను సందర్శించా లని ఆదేశించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో గురుకులాల సంఖ్యను 298 నుంచి 923కు పెంచామని వివరించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని గురుకులాలను జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేశామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, గురుకు లాల కార్యదర్శి రోనాల్డ్‌రాస్, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేత మహంతి, నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ డి.రేఖయాదగిరి పాల్గొన్నారు. తక్కువ ఖర్చుతో పేదలకు వైద్యం అందించాలి కార్పొరేట్ ఆస్పత్రులు కూడా వీలైనంత తక్కువ ఖర్చుతో పేదలకు మెరుగైన వైద్యం అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సూచించారు. గురువారం బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రి లో హ్యూగో రోబోటిక్స్ అసిస్టెడ్ సిస్టం ప్రారంభించిన మంత్రి మాట్లాడుతూ.. ప్రజారోగ్యంపై ప్రభు త్వం ఏటా రూ.1,000 కోట్లు ఖర్చు చేస్తోందని తెలి పారు. ఆరోగ్యశ్రీ కేసులు ఎక్కువగా తీసుకో వా లని కేర్ ఆస్పత్రికి సూచించారు. రోబోటిక్స్ టెక్నా లజీ అందిపుచ్చుకోవడం వల్ల రికవరీ శాతం పెరిగి, రోగి ఆస్పత్రిలో ఉండే సమయం, ఖర్చు తగ్గుతా యన్నారు. కార్యక్రమంలో కేర్ బంజారాహిల్స్ ప్రసూతి విభాగం అధిపతి డాక్టర్ మంజుల అన గాని, ఆస్పత్రి గ్రూప్ చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ నిఖిల్ మాథుర్, మెడికల్ డైరెక్టర్ డాక్టర్ గోపాల్, డాక్టర్ పి. వంశీ కృష్ణ, ఆస్పత్రి సీవోవో డాక్టర్ నీలేశ్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ పూర్తి చేశారా.. మీకోసమే.. 4,300 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారా.. పోలీస్ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్నారా.. అయితే మీకు మరో చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది! సాయుధ దళాలు, ఢిల్లీ పోలీస్ విభాగంలో.. సబ్ ఇన్స్పెక్టర్ కొలువు మీ ముంగిట నిలిచింది! కేంద్ర ప్రభుత్వ నియామక సంస్థ .. స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ).. తాజాగా ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్–కేంద్ర సాయుధ పోలీస్ దళాలు) లో.. సబ్ ఇన్స్పెక్టర్(ఎస్ఐ)పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఎస్ఎస్సీ తాజా నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్ గైడెన్స్.. తెలుగు రాష్ట్రాల్లో పోలీస్ ఉద్యోగార్థుల సంఖ్య లక్షల్లోనే ఉంటోంది. వీరు డిగ్రీ నుంచే తమ లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తుంటారు. అలాంటి వారికి ఎస్ఎస్సీ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ మరో చక్కటి అవకాశంగా చెప్పవచ్చు. ఎస్ఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఢిల్లీ పోలీస్‌తోపాటు సీఏపీఎఫ్లో మొత్తం 4,300 ఎస్ఐ పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. ఇందులో సీఏపీఎఫ్లో 3960 పోస్టులు ఉండగా.. ఢిల్లీ పోలీసు విభాగంలో 340 ఖాళీలు ఉన్నాయి. అర్హతలు ►విద్యార్హత: ఆగస్ట్ 30, 2022 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. ►వయసు: జనవరి 1, 2022 నాటికి 20–25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది. ►వేతన శ్రేణి: రూ.35,400–రూ.1,12,400 శారీరక ప్రమాణాలు ►ఎస్ఎస్సీ ఢిల్లీ పోలీస్, సీఏపీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్‌లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు విద్యార్హతలు, వయో పరిమితితో΄ాటు నిర్దేశిత శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి. ►పురుష అభ్యర్థులు కనీసం 170 సెంటీ మీటర్లు; మహిళా అభ్యర్థులు 157 సెంటీ మీటర్ల ఎత్తు ఉండాలి. అదే విధంగా పురుష అభ్యర్థులకు నిర్దేశిత ఛాతీ కొలతలు తప్పనిసరి. మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ సబ్–ఇన్స్పెక్టర్ పోస్ట్‌ల భర్తీకి ఎస్ఎస్సీ మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తుంది. ముందుగా పేపర్–1 పేరుతో రాత పరీక్ష, ఆ తర్వాత ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ పేరిట దేహదారుఢ్య పరీక్షలు, అనంతరం పేపర్–2 పేరుతో మరో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ మూడు దశల్లోనూ విజయం సాధించి మెరిట్ జాబితాలో నిలిచిన వారికి చివరగా మెడికల్ టెస్ట్ ఉంటుంది. ఆ నివేదిక ఆధారంగా తుది నియామకాలు ఖరారు చేస్తారు. పేపర్–1 ఇలా తొలి దశగా నిర్వహించే పేపర్–1ను నాలుగు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 50 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ 50 ప్రశ్నలు–50 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు–50 మార్కులు, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ 50 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష ఉంటుంది. రాత పరీక్ష ఆన్లైన్ విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటాయి. పరీక్షకు కేటాయించిన సమయం రెండు గంటలు. రెండో దశ ఫిజికల్ ఎండ్యూరెన్స్ పేపర్–1లో నిర్దిష్ట కటాఫ్ మార్కులు సాధించిన వారితో మెరిట్ జాబితా రూ΄÷ందిస్తారు. వీరికి రెండో దశలో దేహ దారుఢ్య పరీక్షలు నిర్వహిస్తారు. పలు ఫిజికల్ ఈవెంట్లలో అభ్యర్థులు తమ ప్రతిభ చూపాల్సి ఉంటుంది. అవి.. వంద మీటర్లు, 1.6 కిలో మీటర్ల పరుగు పందెం; లాంగ్ జంప్, హై జంప్; షాట్‌పుట్. వంద మీటర్ల పరుగును 16సెకన్లలో, 1.6కిలో మీటర్ల పరుగును 6.5 నిమిషాల్లో పూర్తి చేయాలి. 3.65 మీటర్ల దూరంతో లాంగ్ జంప్ చేయాలి. 1.2 మీటర్ల ఎత్తులో హై జంప్ చేయాలి. 16 ఎల్బీస్ బరువును 4.5 మీటర్ల దూరం విసరాలి. హై జంప్, లాంగ్ జంప్, షాట్ పుట్లకు సంబంధించి గరిష్టంగా మూడు అవకాశాలు ఇస్తారు. మహిళా అభ్యర్థులకు ఈవెంట్లు ఇలా వంద మీటర్ల పరుగును 18 సెకన్లలో; 800 మీటర్ల పరుగును నాలుగు నిమిషాల్లో; 2.7 మీటర్ల లాంగ్ జంప్, 0.9 మీటర్ల హై జంప్ ఈవెంట్లు ఉంటాయి. వీరికి కూడా లాంగ్ జంప్, హై జంప్ ఈవెంట్లలో గరిష్టంగా మూడు అవకాశాలు ఇస్తారు. అదే విధంగా వీరికి షాట్ పుట్ నుంచి మినహాయింపు ఉంటుంది. 200 మార్కులకు పేపర్–2 ►ఫిజికల్ ఈవెంట్లలో విజయం సాధించిన వారికి తదుపరి దశలో పేపర్–2 ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ అనే ఒకే విభాగంలో 200 ప్రశ్నలు–200 మార్కులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. ►పేపర్–1, పేపర్–2 రెండూ ఆబ్జెక్టివ్ విధానంలోనే బహుళైచ్ఛిక ప్రశ్నలతో ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు చొప్పున నెగెటివ్ మార్కింగ్ నిబంధన విధించారు. ►ఆన్లైన్ విధానంలో నిర్వహించే రెండు పేపర్లలోనూ పొందిన మార్కులను నార్మలైజేషన్ విధానంలో క్రోడీకరించి.. నిర్దిష్ట కటాఫ్ నిబంధనల మేరకు మెరిట్ జాబితా రూపొందిస్తారు. పరీక్షలో విజయానికి పోలీస్ ఉద్యోగాల అభ్యర్థులు ఎక్కువగా దేహ దారుఢ్యంపైనే కసరత్తు చేస్తుంటారు. కాని రాత పరీక్షలో విజయం కూడా ఎంతో కీలకంగా నిలుస్తోంది. జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ నాలెడ్జ్ అభ్యర్థుల్లోని సామాజిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడిగే విభాగం ఇది. ఇందులో రాణించాలంటే.. భారత దేశ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, రాజ్యాంగం, శాస్త్రీయ పరిశోధనలు వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ఇటీవల కాలంలో ప్రాధాన్యం సంతరించుకుంటున్న సమకాలీన అంశాలపై అవగాహన పెంచుకోవాలి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఇందులో రాణించేందుకు వెర్బల్, నాన్–వెర్బల్ రీజనింగ్ అంశాలపై పట్టు సాధించాలి. స్పేస్ విజువలైజేషన్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, అనాలజీస్, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనాలిసిస్, విజువల్ మెమొరీ, అబ్జర్వేషన్, క్లాసిఫికేషన్స్, నంబర్ సిరిస్, కోడింగ్–డీకోడింగ్ నంబర్ అనాలజీ, ఫిగరల్ అనాలజీ, వర్డ్ బిల్డింగ్, వెన్ డయాగ్రమ్స్ వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఈ విభాగంలో రాణించాలంటే.. ప్యూర్ మ్యాథ్స్‌తో΄ాటు అర్థ గణిత అంశాలపై దృష్టి పెట్టాలి. డెసిమల్స్, ఫ్రాక్షన్స్, నంబర్స్, పర్సంటేజెస్, రేషియోస్, ప్రపోర్షన్స్, స్క్వేర్ రూట్స్, యావరేజస్, ప్రాఫిట్ అండ్ లాస్, అల్జీబ్రా, లీనియర్ ఈక్వేషన్స్, ట్రయాంగిల్స్, సర్కిల్స్, టాంజెంట్స్, ట్రిగ్నోమెట్రీలపై పట్టు సాధించాలి. ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ అండ్ లాంగ్వేజ్ పేపర్–1లో మాత్రమే ఉండే ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో రాణించడానికి అభ్యర్థులు.. బేసిక్ గ్రామర్‌పై అవగాహన ఏర్పరచుకోవాలి. అదే విధంగా యాంటానిమ్స్, సినానిమ్స్, మిస్–స్పెల్ట్ వర్డ్స్, ఇడియమ్స్, ఫ్రేజెస్, యాక్టివ్/ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ అండ్ ఇన్‌డైరెక్ట్ స్పీచ్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూటషన్స్, ప్యాసేజ్ కాంప్రహెన్షన్లను ప్రాక్టీస్ చేయాలి. 200 మార్కులతో ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ అండ్ లాంగ్వేజ్ పేరుతో నిర్వహించే పేపర్–2లో రాణించడానికి అభ్యర్థులు.. ఫ్రేజెస్, సెంటెన్స్ ఫార్మేషన్, సెంటెన్స్ కంప్లీషన్, ప్రెసిస్ రైటింగ్, వొకాబ్యులరీలపై పట్టు సాధించాలి. కమాండెంట్ స్థాయికి సబ్–ఇన్స్పెక్టర్గా కొలువు దీరిన వారు సర్వీస్ నిబంధనలు, ప్రతిభ ఆధారంగా కమాండెంట్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. తొలుత ఇన్స్పెక్టర్గా, ఆ తర్వాత అసిస్టెంట్ కమాండెంట్‌గా, అనంతరం డిప్యూటీ కమాండెంట్, కమాండెంట్ హోదాలకు చేరుకునే అవకాశం ఉంది. ముఖ్య సమాచారం ►దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేయాలి. ►దరఖాస్తులకు చివరి తేది: ఆగస్ట్ 30,2022 ►ఆన్లైన్ దరఖాస్తు సవరణ అవకాశం: సెప్టెంబర్ 1 ►ఆన్లైన్ పరీక్ష తేదీ: నవంబర్‌లో ►తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, నెల్లూరు, చీరాల, విజయనగరం, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ►పూర్తి వివరాలకు వెబ్సైట్: https://ssc.nic.in -
TS: ఉద్యోగ నోటిఫికేషన్లో ట్విస్ట్.. అభ్యర్థులకు షాక్!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ప్రకటన లేకుండా ఉద్యోగ అర్హత నిబంధనల్లో మార్పులు చేయటం మహిళా అభ్యర్థులకు ఇబ్బందిగా మారింది. ఉద్యోగం రావటం, రాకపోవటం సంగతి అటుంచితే కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేని స్థితి ఏర్పడింది. అయితే, రవాణాశాఖలోని అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) 113 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. మల్టీజోన్–1లో 54, మల్టీజోన్–2లో 59 పోస్టులు భర్తీ చేయనున్నట్టు పేర్కొంది. వీటిలో మహిళలకు 41 పోస్టులు రిజర్వ్ చేసింది. మెకానికల్ ఇంజినీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిగ్రీ, లేదా తత్సమాన విద్యార్హత, మూడేళ్ల ఆటోమొబైల్ ఇంజనీరింగ్ డిప్లొమాలను విద్యార్హతలుగా ఖరారు చేసింది. ఈనెల 5 నుంచి సెప్టెంబరు ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో పేర్కొంది. ఇంతవరకు బాగానే ఉంది. నోటిఫికేషన్ వెలువడ్డ తేదీ నాటికి మహిళా అభ్యర్థులు కూడా కచ్చితంగా హెవీ మోటార్ వెహికిల్ డ్రైవింగ్ లైసెన్సు పొంది ఉండాలని నిబంధన విధించింది. ఇక్కడే చిక్కొచ్చి పడింది. గతంలో ఈ పోస్టుకు ఈ నిబంధన లేదు. మహిళలకు మినహాయింపు ఉండటంతో చాలామంది ఆ లైసెన్సు తీసుకోలేదు. దీంతో ఇప్పుడు వారెవరూ దరఖాస్తు చేసుకునే అవకాశం లేకుండా పోయింది. కనీసం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ వరకు లైసెన్సు తీసుకుని ఉండేలా నిబంధన మార్చాలని మహిళా అభ్యర్థులు కోరుతున్నారు. ఆ లైసెన్సు తీసుకోవటానికి తగు సమయం ఇవ్వాలని, తరువాతే దరఖాస్తులు ఆహ్వానించాలని కోరుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు కొందరు అభ్యర్థులు విజ్ఞప్తి చేయడంతో, ఆ మేరకు సడలింపు ఇస్తే బాగుంటుందని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దానికి సానుకూలంగా నిబంధన మార్చాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇది కూడా చదవండి: బల్దియాపై పిడుగు -
TS: 1,326 పోస్టులతో మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు మరో శుభవార్త అందించింది. ఇప్పటికే పలు నోటిఫికేషన్లు విడుదల చేసిన ప్రభుత్వం మరో నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 1,326 డాక్టర్ పోస్టులకు సర్కార్ నోటిఫికేషన్‌ను బుధవారం రిలీజ్ చేసింది. తాజా నోటిఫికేషన్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్స్-751 పోస్టులు, ట్యూటర్ పోస్టులు-357, సివిల్ అసిస్టెంట్ సర్జన్ జనరల్ పోస్టులు-211, సివిల్ అసిస్టెంట్ సర్జన్ ప్రివెంటివ్ మెడిసిస్ పోస్టులు-7 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు జూలై 15 నుంచి ఆగస్టు 15 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఇది కూడా చదవండి: అక్టోబర్ 16న గ్రూప్–1 ప్రిలిమ్స్ -
TSSPDCL: జేఎల్‌ఎంల పోస్టులకు పదేళ్ల ‘వయో’ సడలింపు లేదు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) భర్తీ చేయనున్న జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం) పోస్టులకు 10 ఏళ్ల గరిష్ట వయోపరి మితి సడలింపును వర్తింపజేయడం లేదు. విద్యుత్ స్తంభాలను ఎక్కి అత్యంత ప్రమాదకర పరిస్థితిలో విధులు నిర్వహించే జూనియర్ లైన్మెన్కు శారీరక దారుఢ్యం అత్యంత ఆవశ్యకమని, అందువల్ల ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి సడలింపు ఇవ్వరాదని టీఎస్ఎస్పీడీసీఎల్ నిర్ణయించింది. 1,000 జేఎల్ఎం, 201 సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 70 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి సంస్థ ఈ నెల 9న సంక్షిప్త ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. కాగా అసిస్టెంట్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్ పోస్టుల కు మాత్రం 10 ఏళ్ల గరిష్ట వయోపరి మితి సడలింపును వర్తింపజేయనున్నట్టు సంస్థ ఉన్నతాధికారవర్గాలు తెలిపాయి. జేఎల్ఎం, సబ్ ఇంజనీర్ జిల్లా స్థాయి పోస్టులే కొత్త జోనల్ విధానం ప్రకారం ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. జేఎల్ఎం, సబ్ ఇంజనీర్ పోస్టులను జిల్లా స్థాయి పోస్టులుగా వర్గీకరించి భర్తీ చేస్తున్నారు. దీంతో ఆయా జిల్లాల స్థానికత గల అభ్యర్థులకే 95 శాతం పోస్టులు దక్కనున్నాయి. ఐటీఐ (ఎలక్ట్రికల్)తో పాటు అప్రెంటిస్ పూర్తి చేసిన అభ్యర్థులు జేఎల్ఎం పోస్టులకు అర్హులు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా చేసిన వారు సబ్ ఇంజనీర్ పోస్టులకు అర్హులు కానున్నారు. డిస్కం స్థాయి పోస్టులుగా ఏఈ అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి బుధవారం నోటిఫికే షన్ వెలువడింది. గురువారం నుంచి వచ్చే నెల 3 వరకు దరఖాస్తులను స్వీకరించను న్నారు. జూలై 17న రాత పరీక్ష జరగనుంది. ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ కలిగి ఉండి 18–44 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు మరో ఐదేళ్లు, శారీర క వికలాంగులకు మరో 10 ఏళ్ల గరిష్ట వయోపరిమితి సడలింపు వర్తించనుంది. ఏఈ పోస్టుల ను కొత్త జోనల్ విధా నం కింద టీఎస్ఎస్పీడీసీఎల్ పరిధిలోని పోస్టులుగా విభ జించారు. సంస్థ పరిధిలోని 16 జిల్లాల అభ్యర్థులు 95% పోస్టుల కోసం పోటీపడడానికి అర్హులు. ఏఈ పోస్టుల నోటిఫికేషన్‌ను సంస్థ వెబ్సైట్ https://tssouthernpower.cgg.gov.in లో చూడవచ్చు. జేఎల్ఎం, సబ్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి గురువారం నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. -
పది రోజుల్లో వైద్య పోస్టుల నోటిఫికేషన్!
సాక్షి, హైదరాబాద్: వైద్యపోస్టుల భర్తీకి సన్నాహాలు జరుగుతున్నాయి. రాత పరీక్ష ఉన్న స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎం పోస్టులసిలబస్ తయారీ వేగంగా జరుగుతోంది. ఇందుకోసం వైద్య, నర్సింగ్ అధికారులతో ప్రత్యేక కమిటీలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే సిలబస్ కొంత కొలిక్కి వచ్చినట్లు తెలిసింది. డాక్టర్ పోస్టులకు కౌన్సెలింగ్ మాత్రమే ఉంటుంది కాబట్టి సిలబస్ అవసరం లేదు. పోస్టింగ్‌పై∙ఆప్షన్లు అడుగుతారు. ఆ ప్రకారమే వారికి పోస్టింగు లు ఖరారు చేస్తారు. ఈ నేపథ్యంలో స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎం పోస్టుల కోసం సిలబస్ తయారీ పూర్తయ్యాక వారం పది రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. సిలబస్ తయారీలో సవాళ్లు.. రాష్ట్రంలో మొత్తం 12,755 వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేస్తారు. వాటిల్లో డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, ఏఎన్ఎం పోస్టుల వంటి 10 వేలకు పైగా పోస్టులను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) భర్తీ చేస్తుంది. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను మాత్రం టీఎస్పీఎస్సీ భర్తీ చేయనుంది. అయితే వీటికి సంబంధించిన సిలబస్‌ను మాత్రం సంబంధిత వైద్య వర్గాలే తయారు చేస్తున్నాయి. కాగా ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు సంబంధించిన సిలబస్ తయారీ సవాల్‌గా మారింది. దాదాపు 20 ఏళ్ల క్రితం తయారు చేసిన సర్వీస్ రూల్స్‌ను మార్చడం కీలకాంశంగా మారింది. ఈ కాలంలో వైద్య రంగం కొత్త పుంతలు తొక్కింది. అనేక కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ల్యాబ్ టెక్నీషియన్లలో దాదాపు 30 రకాల విభాగాలు, కోర్సులు వచ్చాయి. కార్డియో టెక్నీషియన్, ఈసీజీ టెక్నీషియన్, న్యూరోకు సం బంధించి టెక్నీషియన్ ఇలా వివిధ కొత్త యం త్రాలకు సం బంధిత టెక్నీషియన్లు వచ్చారు. వాటికి కోర్సులు కూడా వచ్చాయి. ఇలా 30 రకాల కోర్సు లు చేసిన వారందరూ అర్హులు కాబట్టి వేర్వేరు కోర్సులకు వేర్వేరు సిలబస్ తయారు చేయాల్సి ఉంటుంది. పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు వైద్యశాఖలో పోస్టులను ప్రకటించిన తర్వాత స్టాఫ్ నర్సు, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్ఎం పోస్టుల కోసం అభ్యర్థులు పెద్దసంఖ్యలో సిద్ధమవుతున్నా రు. తాము చదివిన పుస్తకాలను మరోసారి తిరగేస్తున్నారు. మార్కెట్లో ఉన్న పోటీ పరీక్షలపుస్తకాలను కూడా కొనుగోలు చేసి చదువుతున్నారు. ఐదేళ్ల తర్వాత పరీక్షలు జరగనున్న 4,722 స్టాఫ్ నర్సు పోస్టుల కోసం 20 వేలమంది పోటీ పడే అవకాశముందని భావిస్తున్నారు. 1,520 ఏఎన్ఎం పోస్టుల కోసం 6 వేలమంది, 2 రెండు వేల వరకున్న ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు 8 వేల మంది పోటీ పడతారని వైద్యవర్గాలు అంచనా వేస్తున్నాయి. -
TSPSC Groups: గ్రూప్-1,2,3,4 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీకోసం..
సాక్షి, హైదరాబాద్: చాలా కాలం నుంచి ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూసిన నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. అలాగే భారీ సంఖ్యలో కొలువుల భర్తీకి రంగం సిద్ధం చేసింది. త్వరలోనే టీఎస్పీఎస్సీ ద్వారా గ్రూప్-1, 2, 3, 4 నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. గ్రూప్-1లో 503 ఉద్యోగాలను, గ్రూప్-2లో 582 పోస్టులను, అలాగే గ్రూప్-3లో 1373 పోస్టులు, గ్రూప్-4లో 9,168 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. ఇలాంటి పోటీపరీక్షలకు గతంలో జరిగిన పరీక్షల ప్రీవియస్ పేపర్స్ చూస్తే.. అభ్యర్థికి ఏఏ సబ్జెక్ట్‌లలో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయి అనే విషయంపై ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంది. గ్రూప్స్ పరీక్షలకు ప్రీపేర్ అవుతున్న అభ్యర్థుల కోసం గత పరీక్షల పాత ప్రశ్నప్రత్రాలను (Previous Question Papers) www.sakshieducation.com అందిస్తోంది. గ్రూప్-1,2,3,4 ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి -
50 వేల మందికి శిక్షణ
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ కల్పనలో పోలీస్ శాఖ కీలకంగా పనిచేస్తోంది. యువతకు నిర్దిష్టమైన ప్రణాళికతో ఫ్రీ కోచింగ్ సెంటర్ల ఏర్పాటుతో వారి ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేస్తోంది. ఈ క్రమంలో తాజా నోటిఫికేషన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50వేల మం దికిపైగా అభ్యర్థులకు శిక్షణ ఇవ్వాలని భావిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో గతంలో 5,800 మందికి ముందస్తు కోచింగ్ ఇవ్వగా 1,300 మందికి పోలీస్ శాఖలో ఉద్యోగాలు లభించాయి. వరంగల్ పరిధిలో 2 వేల మందికిగాను 324 మందికి కొలువులు వచ్చాయి. పోలీస్ శాఖలో 18 వేలకుపైగా పోస్టులను భర్తీ చేయనున్న నేపథ్యంలో మరోసారి కీలకపాత్ర పోషించ బోతోంది. నగర కమిషనరేట్ పరిధిలోని 5 జోన్లలో వెయ్యి మంది చొప్పున శిక్షణ ఇప్పించాలని కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. మహిళా అభ్యర్థులు ఎన్‌రోల్‌మెంట్‌ను బట్టి వారికి ప్రత్యేకంగా సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇండోర్, ఔట్ డోర్ శిక్షణ ఇవ్వనున్నారు. ఇండోర్‌లో రాత పరీక్ష కోసం ఆయా సబ్జెక్టులపై నిష్ణాతులైనవారితో క్లాసులు నిర్వహించి, ప్రతివారం టెస్టులు పెట్టనున్నారు. ఔట్‌డోర్‌లో ఫిజికల్ టెస్టుల కోసం ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఎన్రోల్మెంట్కు స్పందన భారీగా ఉంటే స్క్రీనింగ్ కూడా అదే స్థాయిలో నిర్వహించి 5 వేల మందిని ఎంపిక చేసి కోచింగ్ ఇవ్వాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. సైబరాబాద్‌లో షురూ.. ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్ భద్రతలో కీలకపాత్ర పోషిస్తున్న సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర రెండు రోజుల క్రితమే శిక్షణ కార్యక్రమం ప్రారంభించారు. శంషాబాద్ జోన్లో 2 వేల మందికి శిక్షణ ఇస్తున్నారు. మిగిలిన జోన్లలోనూ ఎన్‌రోల్‌మెంట్‌ను బట్టి ట్రైనింగ్ కార్యక్రమాలు ఇవ్వాలని సీపీ భావిస్తున్నట్టు కమిషనరేట్ వర్గాలు వెల్లడించాయి. గతంలో ఇచ్చిన కోచింగ్‌లోనూ సత్ఫలితాలు వచ్చినట్టు అధికార వర్గాలు స్పష్టం చేశాయి. రాచకొండలోనూ ఏర్పాట్లు రాచకొండ కమిషనరేట్‌లోనూ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించేందుకు సీపీ మహేశ్ భగవత్ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసింది. యూపీఎస్సీలో అనేకమంది అభ్యర్థులకు మార్గదర్శకులుగా వ్యవహరించి, అద్భుత ఫలితాలు సాధించిన అధికారిగా మంచి గుర్తింపు పొందిన ఆయన పోలీస్ ఉద్యోగాల భర్తీలోనూ ప్రముఖ పాత్ర పోషించనున్నారు. యువతకు వాట్సాప్, ఇతర మాధ్యమాల ద్వారా గైడ్ చేస్తున్నారు. మూడు జోన్ల పరిధిలో ఎన్రోల్మెంట్ నిర్వహించి ప్రత్యేక క్యాంపుల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్టు తెలిసింది. అటు జిల్లాల్లోనూ... ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు, సూర్యాపేట నుంచి నిజామాబాద్ వరకు అన్ని జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో జిల్లాకు వెయ్యి మంది చొప్పున ముందస్తు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. గతంలో రామగుండం, వరంగల్, ఖమ్మం, కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ కమిషనరేట్లలో ఇచ్చిన శిక్షణ మంచి ఫలితాలు ఇచ్చింది. ఈసారి యువత భారీస్థాయిలో పోటీ పడుతుండటంతో ముందస్తు శిక్షణ స్పందన అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. -
త్వరలోనే పోలీసు ఉద్యోగ ఉచిత శిక్షణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో పోలీసు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిరుద్యోగ యువతకు రాచ కొండ పోలీస్ కమిషనరేట్ తరుఫున ప్రీ రిక్రూట్మెంట్ ఉచిత శిక్షణను ప్రారంభించ నున్నట్లు రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పోలీసు ఉద్యోగం సాధించాలన్నారు. గురువారం ఆయన అంబర్‌పేటలోని సీఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో డాగ్స్ కెన్నెల్, మెటార్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. లా అండ్ ఆర్డర్ పోలీసులకు సహకరిస్తూ సమాజంలో శాంతి భద్రతలను కాపాడటంలో సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ (ఏఆర్) పోలీసుల పాత్ర కీలకమైనదని, వారి సంక్షేమమే తొలి ప్రాధాన్యమన్నారు. పీఎస్ఓ డ్యూటీలు, బందోబస్త్, వీఐపీ సెక్యూరిటీ తదితర అంతర్గత భద్రతలో వీరి పాత్ర కీలకమని పేర్కొన్నారు. విధుల పట్ల నిబద్ధతతతో ఉంటూ శారీరక, మానసిక ధృడత్వాన్ని పెంచుకోవాలని సూచించారు. ఏఆర్ విభాగంలో ఎక్కువ సంఖ్యలో మహిళలు చేరడం అభినందనీయమన్నారు. వివిధ విభాగాల్లో మహిళా సిబ్బంది తమ సామర్థ్యాలను ప్రదర్శించేందుకు తగిన సహకారాన్ని అందిస్తామని, త్వరలోనే మహిళా పెట్రోలింగ్ బృందాలను ప్రవేశపెట్టనున్నామని ఈ సందర్భంగా సీపీ వెల్లడించారు. అనంతరం 15 రోజులుగా కొనసాగతున్న వార్షిక డీ–మొబిలైజేషన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ సీపీ సుధీర్ బాబు, డీసీపీ క్రైమ్స్ యాదగిరి, డీసీపీలు సన్‌ప్రీత్ సింగ్, రక్షిత కే మూర్తి, సలీమా, అడిషనల్ డీసీపీలు ఎం శ్రీనివాస్, షమీర్ తదితర పోలీసు అధికారులు పాల్గొన్నారు. -
ఉద్యోగ నియామకాలకు రెడీ.. సర్కారు అనుమతులివ్వగానే ..
సాక్షి, హైదరాబాద్: ఉద్యోగ ఖాళీల భర్తీకి ప్రభుత్వం అనుమతిచ్చిన వెంటనే వడివడిగా నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్పష్టం చేసింది. ఈ దిశగా పకడ్భందీ ఏర్పాట్లు సైతం చేసుకుంటున్నట్లు వివరించింది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ బి.జనార్ధన్‌రెడ్డి, సభ్యులు రమావత్ ధన్సింగ్, బండి లింగారెడ్డి, కోట్ల అరుణకుమారి, కారెం రవీందర్‌రెడ్డి, అరవెల్లి చంద్రశేఖర్‌రావు, ఆర్.సత్యనారాయణ, కార్యదర్శి అనితా రామచంద్రన్ మంగళవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలిశారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ 2020–21 వార్షిక నివేదికను సమర్పించారు. ఉద్యోగ నియామకాలకు సంబంధించి తీసుకుంటున్న చర్యలను గవర్నర్‌కు కమిషన్ చైర్మన్ జనార్థన్‌రెడ్డి వివరించారు. 3 నోటిఫికేషన్లు... 4 పరీక్షలు... ఏప్రిల్ 2020 నుంచి మార్చి 2021 వరకు టీఎస్పీఎస్సీ 149 ఖాళీల భర్తీకి 3 నోటిఫికేషన్లు జారీ చేసింది. మొత్తంగా 119 ఖాళీల భర్తీకిగాను 4 పరీక్షలు నిర్వహించింది. మొత్తం 10630 మంది అభ్యర్థులు ఈ పరీక్షలు రాశారు. పెండింగ్‌లో ఉన్న నోటిఫికేషన్ల తాలూకు చర్యలు తీసుకుని 2370 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. శాఖాపరమైన పరీక్షలకు 1,26,381 మంది అభ్యర్థులు హాజరు కాగా, 53,886 మంది అర్హత సాధించారు. చదవండి: CM KCR: అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ వరాల వర్షం -
18,334 పోస్టుల భర్తీకి పోలీస్ శాఖ రంగం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన 18,334 పోస్టుల భర్తీకి పోలీస్ శాఖ రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు నోటిఫికేషన్ అనుమతి నిమిత్తం ప్రతిపాదనను ప్రభుత్వానికి పంపించింది. ప్రభుత్వం వారంలో గ్రీన్‌సిగ్నల్ ఇస్తే.. ఆ తర్వాత ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదే జరిగితే తాజా ఉద్యోగాల భర్తీలోనూ పోలీస్ శాఖనే ముందు నోటిఫికేషన్ ఇచ్చినట్లవుతుంది. ఇక ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలో తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్, సివిల్, ఆర్మ్డ్(ఏఆర్), కమ్యూనికేషన్ విభాగాల్లో భర్తీ ఉండనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 1,500కు పైగా సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పోస్టులను పోలీస్ శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. నూతన జిల్లాలు, రేంజ్‌లను దృష్టిలో పెట్టుకొని సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులను ప్రతిపాదించినట్లు సమాచారం. ఇక మిగిలినవన్నీ కానిస్టేబుల్ పోస్టులు కాగా, వాటిని ఆర్మ్డ్ రిజర్వ్(ఏఆర్), టీఎస్ఎస్పీ, కమ్యూనికేషన్ విభాగాల్లో నియామకానికి ప్రతిపాదించినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే 28,000 పోస్టుల భర్తీ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు పోలీస్ శాఖ దాదాపు 28,000 పోస్టులను భర్తీ చేసింది. సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్, స్టేట్ స్పెషల్ పోలీస్(టీఎస్ఎస్పీ), పోలీస్ కమ్యూనికేషన్, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ (పీటీవో) విభాగాల్లోని కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ల భర్తీని మూడు నోటిఫికేషన్ల ద్వారా భర్తీ చేశారు. తాజాగా 18,334 పోస్టుల్లో 80 శాతం కానిస్టేబుల్, 20 శాతం సబ్ఇన్స్పెక్టర్ పోస్టులు ఉండనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన జిల్లాలు, కొత్త సర్కిల్, పోలీస్స్టేషన్లకు మరింత మంది సిబ్బందిని కేటాయించేందుకు ఈ నియామకాలు చేపట్టనున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. స్థానికంగానే అధికం... ప్రస్తుతం భర్తీ చేయాలనుకున్న పోలీస్ పోస్టులు 60 శాతానికి పైగా లోకల్ కేడర్లోనే భర్తీ కానున్నాయి. గతంలో పోలీస్ శాఖలో నాలుగు రేంజ్‌లు ఉండేవి. తాజాగా రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం.. 7 రేంజ్‌లు ఏర్పడ్డాయి. అలాగే రాష్ట్రంలో నూతన జిల్లాలు ఏర్పడి.. కొత్త పోలీస్ స్టేషన్లు, సర్కిల్ ఆఫీస్‌ల ఏర్పాటుతో స్థానికంగా సిబ్బంది అవసరం పెరిగింది. ఈ నేపథ్యంలో సివిల్, ఏఆర్ (ఆర్మ్డ్ రిజర్వ్) కేటగిరీలో ఎక్కువ పోస్టులు భర్తీ చేయనున్నారు. స్పెషల్ పోలీస్, కమ్యూనికేషన్ విభాగంలోని కానిస్టేబుల్, ఎస్ఐ ర్యాంక్ పోస్టులు రాష్ట్రస్థాయి పోస్టులుగా ఉంటాయి. దీంతో ఈ పోస్టుల సంఖ్య తక్కువ ఉండే అవకాశం ఉంది. ఇదిలాఉండగా, స్థానికత ఆధారంగా జరిగే మొట్టమొదటి నియామక ప్రక్రియ కూడా ఇదే కావడం గమనార్హం. జిల్లాల్లో కోచింగ్ సెంటర్లు... రాబోతున్న నోటిఫికేషన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రీ రిక్రూట్మెంట్ కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని రాష్ట్రవ్యాప్తంగా కమిషనర్లు, ఎస్పీలను డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి ఆదేశించారు. నిరుద్యోగ యువతను ప్రోత్సహించేలా ఈ సెంటర్లు ఉండాలని ఆయన సూచించారు. రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ విభాగంతో సమన్వయం చేసుకొని ఈ కోచింగ్ సెంటర్లు ఏర్పాటు ఉండాలని డీజీపీ సూచించారు. ఈ మేరకు అన్ని జిల్లాలు, కమిషనరేట్‌లో ఉచిత ప్రీ రిక్రూట్మెంట్ కోచింగ్ సెంటర్లను ఏర్పాటుచేయడం వేగవంతం చేశారు. -
కరువు తీరా కొలువులు..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఈ మేరకు బుధ వారం ఉదయం శాసనసభలో ప్రత్యేక ప్రకటన చేశారు. 91,142 పోస్టులను భర్తీ చేస్తామని, ఇం దులో 80,039 ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు ఇస్తామని.. మిగతా 11,103 పోస్టుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ప్రకటించారు. దేశంలో ఎక్కడా లేనట్టుగా స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు లభించేలా రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులతో సగర్వంగా ‘లోకల్’కోటాను అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ల జారీ ప్రక్రియను బుధవారమే మొదలుపెడుతున్నట్టు తెలిపారు. ఉమ్మడి ఏపీ విభజనతో ముడిపడిన షెడ్యూల్ 9, 10 వివాదం కూడా పరిష్కారమైతే.. మన రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ రంగ కార్పొరేషన్లలో మార్పుచేర్పులు చేసుకోవటం ద్వారా మరో 25 వేల వరకు కొత్త ఖాళీలను సృష్టించి, భర్తీ చేసుకుందామని చెప్పారు. ఉద్యోగాల భర్తీ విషయాన్ని మంగళవారం వనపర్తి సభలో ప్రకటించి ఉండొచ్చని.. కానీ సంప్రదాయాలను గౌర వించాలన్న ఉద్దేశంతో అసెంబ్లీలోనే ప్రకటిస్తున్నా నని తెలిపారు. శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే.. పిడికెడు మందితో ఉద్యమాన్ని మొదలుపెట్టి.. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం దేశ చరిత్రలోనే ప్రత్యేక ఘట్టం. రెండు దశల ఉద్యమాలు దశాబ్దాల పాటు సాగాయి, 1969 ఉద్యమంలో పదో తరగతి విద్యార్థిగా ఉంటూ సిద్దిపేటలో రిజర్వు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్న. సమైక్య పాలనలో అంతులేని వివక్షతో తెలంగాణ సమాజం నలిగిపోయింది. 2014లో రాష్ట్రం ఏర్పడేదాకా ఆ బాధను అనుభవిస్తూనే ఉన్నం. ఆకలి చావులు, ఆత్మహత్యలు, వలస లు.. ఉద్యోగాలు రాక ఆవేదనతో యువత తుపాకు లు పట్టిన పరిస్థితి, రైతులను పాతాళానికి తొక్కిన ప్రపంచ బ్యాంకు ఆంక్షల సందర్భాన్ని కూడా చూశాం. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో ప్రభు త్వ భూములు అమ్మి నిధులను వేరే ప్రాంతా నికి తరలిస్తున్నా.. తెలంగాణ నేతలు పదవుల కోసం నోరు మూసుకున్న తీరు అందరికీ తెలుసు. చివరికి శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న నేను తెలంగాణ కోసం పిడికెడు మందితో ఉద్యమాన్ని ప్రారంభించిన. దేవుడి దయ, ప్రజల దీవెన, న్యాయమైన పోరాటం, ప్రజల్లో నెలకొన్న ఆర్తి కలిసి..14, 15 ఏళ్ల సుదీర్ఘ ఘర్షణ తర్వాత రాష్ట్రం ఏర్పాటైంది. తెలంగాణ తనను తాను ఆవిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని నేను అప్పుడే చెప్పిన. దాన్ని సాధించే క్రమంలో అడ్డుపుల్లలు వేసే మిగతా పార్టీల ఆగడాలను దాటుకుని ముందుకు సాగినం. వేరే పార్టీలకు రాజకీయాలంటే ఓ గమ్.. కానీ టీఆర్ఎస్కు రాజకీయాలంటే ఓ టాస్క్, పవిత్ర కర్తవ్యం. ఇప్పుడు అడ్డం పొడుగు మాట్లాడుతున్న వారు ఉద్యమంలో ఎక్కడున్నరో ప్రజలకు తెలుసు. మా ఏకాగ్రతను దెబ్బతీసే వ్యక్తులను.. ఏనుగు వెళ్తుంటే చిన్నచిన్నవి అరుస్తుంటయని వదిలిపెట్టినం. ఎక్కడ చూసినా.. నీళ్లు, పంటలు వృథాగా సముద్రంలోకి పోతున్న నీటిని రక్షించుకునేందుకు ఇంకా కొట్లాడుతున్నం. ఇప్పటికే పెద్ద మొత్తంలో నీటిని తెచ్చుకోగలిగినం. ఏప్రిల్, మే నెలల్లో కూడా నిజాంసాగర్‌ను నింపుకోగలుగుతున్నం. పుష్కలంగా నీళ్లుండటంతో వాగుల్లో కూడా నీళ్లు వదలాలన్న కొత్త డిమాండ్ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం కొనలేక వెల్లకిలాపడేంత స్థాయిలో పంటలు పండించగలుతున్నం. రోడ్లన్నీ కల్లాలవుతున్నయి. తెలంగాణ రూపాయి తెలంగాణలోనే ఖర్చయ్యేలా చేసుకున్నం. విభజన వివాదాలతో.. విద్యుత్ ఉద్యోగుల పంపకాల్లో వివాదం సుప్రీం కోర్టు దాకా పోయింది. 9, 10 షెడ్యూళ్ల పంచాయితీ ఇంక తెగలే. కాలుకు పెడితే మెడకు, మెడకు పెడితే కాలుకు.. అంతా గందరగోళం చేస్తున్నరు. మూసీ వరదల తర్వాత మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆధ్వర్యంలో జంట జలాశయాలు నిర్మించడంతో సమస్య తీరింది. ఇంత మేలు చేసినందుకు విశ్వేశ్వ రయ్య గౌరవార్ధం ప్రస్తుతం వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉన్న ప్రాంతంలో అప్పట్లో నిజాం రాజు ఓ విందు ఏర్పాటు చేసిండు. అక్కడ కూర్చుని మాట్లాడేటప్పుడు మంచి పంటల కోసం వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలని నిజాంకు మోక్ష గుండం సూచించారు. నిజాం అప్పటికప్పుడే కూర్చున్న చోటనే విశ్వవిద్యాలయం ఏర్పాటు చేద్దామని ఆర్డర్ ఇచ్చి 5 వేల ఎకరాలు కేటాయిం చాడు. అలా రూపొందించిన వ్యవసాయ విశ్వవిద్యాలయంలో వాటా కావాలని ఏపీ వాళ్లు అడుగుతున్నరు. ఉస్మానియా యూనివర్సిటీ భూమిలో ఏర్పాటు చేసిన ఆర్టీసీ ఆస్పత్రిలో కూడా వాటా అడుగుతున్నరు. ఏపీ వారివి అర్థరహిత వాదనలు అనటానికి ఇవే నిదర్శనం. కేంద్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా విభజన పేచీని పరిష్కరించదు. సీనియారిటీని తేల్చే బాధ్యత ఏపీకి ఉండటంతో మనం దానిపై ఆధారపడకతప్పని పరిస్థితి. ఏపీనేమో ఉద్యోగుల సీనియారిటీ ఎటూ తేల్చదు. చివరికి మనం వెయ్యిదాకా సూపర్ న్యూమరరీ పోస్టులు ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది. ఇలా ఎన్నో గోసలు అనుభవించుకుంటూ వచ్చినం. 1919లో ముల్కీ రూల్స్ ఏర్పడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డా ముల్కీని, పెద్ద మనుషుల ఒప్పందాన్ని తుంగలో తొక్కారు. తెలంగాణకు అన్యాయం జరిగింది. ఎవరి నుంచి మనం విడిపోయినమో, రేపు వారి నుంచే ప్రమాదం ఉండే అవకాశం ఉన్నందున.. రక్షణ కావాల్సి ఉందని గట్టిగా నిర్ణయించుకున్నం. ఆగమాగం కాకుండా పటిష్టంగా రూల్స్ తయారుచేసి రాష్ట్రపతి ఉత్తర్వుల కోసం శాసనసభలో తీర్మానం చేసి పంపినం. కేం ద్రం దాన్ని ఆమోదించకుండా ఏడాది వరకు పెం డింగ్‌లో పెట్టింది. నేనే చివరకు రాష్ట్రపతిని, ప్రధా నిని నాలుగైదు సార్లు కలిసి వివరించి.. కొందరు అధికారులను ఢిల్లీలో పెట్టి 95 శాతం లోకల్ కోటాతో రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులు సాధించినం. దుర్మార్గపు కాంట్రాక్టు విధానం సమైక్య పాలకులు కాంట్రాక్టు ఉద్యోగాలని చెప్పి ఘోరంగా వ్యవహరించారు. చాలీచాలని జీతాలతో అర్ధాకలికి వదిలేశారు. మేం ఆ ఘోరాన్ని తుదముట్టిస్తూ.. ఒక్క కరెంటు డిపార్ట్‌మెంటులోనే 22,722 మందిని రెగ్యులరైజ్ చేసినం. ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వమని నిరూపించుకున్నం. ఈరోజు దేశంలో అత్యధిక వేతనం పొందుతున్నది తెలంగాణ ఉద్యోగులే. తెలంగాణ పతార (పరపతి) ఎంతుందంటే.. 40 ఏళ్ల తెలంగాణ బాండ్లు కూడా హాట్‌కేకుల్లా అమ్ముడుపోతయి. చాలా రాష్ట్రాల కంటే తక్కువ అప్పులున్న రాష్ట్రం తెలంగాణనే. కడుపు, నోరు కట్టుకుని అవినీతి రహిత పాలనతో ఇదంతా సాధించాం. ఖజానాపై రూ.7 వేల కోట్ల భారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 371–డి ప్రకారం రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులు జారీ అయ్యాయి. దాని ప్రకారం దేశంలో స్థానికులకు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో 95% రిజర్వేషన్ సాధించిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. మొత్తం ప్రత్యక్ష నియామక ఖాళీలు 91,142 ఉన్నాయని తేలింది. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ పోగా.. నేరుగా భర్తీచేయాల్సిన ఖాళీలు 80,039 ఉన్నట్టు తేలింది. వీటి భర్తీతో రాష్ట్ర ఖజానాపై ఏటా సుమారు రూ.7,000 కోట్లు అదనపు భారం పడుతుంది. అయినా ప్రభుత్వం ఈ సాహసోపేత నిర్ణయం తీసుకుంది. 7 జోన్లు, 33 జిల్లాల వారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టడం వల్ల రాష్ట్రంలోని మారుమూలప్రాంతాల్లో ఉద్యోగ ఖాళీలు, సిబ్బంది కొరత సమస్యలు తీరుతాయి. 95 శాతం స్థానికులకే.. ఆంధ్రాతో ఉద్యోగుల వివాదం పరిష్కారం కాకున్నా.. కొత్తగా 1.56 లక్షల పోస్టులు నోటిఫై చేసి 1,33,942 పోస్టులు భర్తీ చేసినం. మిగతా వాటి ప్రాసెస్ నడుస్తోంది. గతంలో ఏకంగా 20 శాతం నాన్‌లోకల్ కోటా అని పెట్టి తెలంగాణ ఉద్యోగాలను కొట్టేశారు. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల మేరకు జీవోలు జారీ చేసి.. కొత్త జోన్లు, కొత్త జిల్లాల ప్రకారం ఉద్యోగాలను పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఆ ప్రక్రియలో ఇచ్చిందే 317 జీవో. అదేదో అర్థంకాక.. నెత్తి కత్తిలేని కొందరు దీనిపై కోర్టును ఆశ్రయించి ఆగమాగం చేశారు. మేం కఠినంగానే అమలు చేసినం. ఎక్కడివారు అక్కడ సర్దుకున్నరు. పదోన్నతులు ఇచ్చేసినం, టీచర్లవేవో పెండింగులో ఉంటే అవి కూడా చేయాలని ఆదేశాలిచ్చినం. ప్రగతిపథంలో అద్భుతాలు సాధించాలంటే.. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బంది ప్రేమభావంతో, మనస్ఫూర్తిగా పనిచేయాలి. ఇప్పటికే తెలంగాణలో ఆ ఫలితాలు సాధించాం. తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్ వంటి తయారీ రంగం అద్భుతంగా ఉన్న రాష్ట్రాలను తోసిరాజని.. పర్‌క్యాపిటా జీఎస్డీపీలో తెలంగాణ దేశంలో నంబర్‌వన్ స్థానంలో ఉందంటే అదే కారణం. ఆంధ్రా సృష్టించే అర్థరహితమైన వివాదాలను ఎదుర్కొంటూ, కేంద్రం వివక్ష వైఖరిని భరిస్తూ ఇవన్నీ సాధించినం. సీఎం ప్రసంగంపై ఉత్కంఠ నిరుద్యోగులకు వరం ఇవ్వబోతున్నామని.. బుధవారం ఉదయం శాసనసభలో తన ప్రసంగాన్ని వీక్షించాలని మంగళవారం వనపర్తి సభలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. చాలా మంది ప్రజలు, ముఖ్యంగా యువత బుధ వారం ఉదయం అసెంబ్లీ సమా వేశాల ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించారు. సీఎం కేసీఆర్ బుధవారం ఉదయం శాసనసభ మొదలవుతూనే.. ప్రత్యేక ప్రకటన రూపంలో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపడతామని ప్రకటించారు. ఈ సంద ర్భంగా గంటసేపు సుదీర్ఘంగా ప్రసంగించారు. తెలంగాణ ఉద్యమం నుంచి విభజన సమస్యల దాకా ఎన్నో అంశాలనూ ప్రస్తావించారు. -
ఆర్బీఐలో భారీగా కొలువులు.. ప్రారంభ జీతమే రూ.45వేలు..
బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసుకొని.. బ్యాంక్ కొలువుల కోసం ఎదురు చూస్తున్న యువత కోసం దేశ అత్యున్నత బ్యాంక్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకటన విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 950 అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఎల్పీజీ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాలి. మొత్తం పోస్టుల సంఖ్య: 950. వీటిలో హైదరాబాద్ కార్యాలయానికి సంబంధించిన ఖాళీలు 40, ముంబయి కార్యాలయంలో 128 ఖాళీలు, చండీగఢ్ కార్యాలయంలో 78 ఖాళీలు, కాన్పూర్ అండ్ లక్నో కార్యాలయంలో 131 పోస్టులు, నాగ్‌పూర్ 56 ఖాళీలు, న్యూఢిల్లీలో 75 ఖాళీలు తదితరాలు ఉన్నాయి. క్లరికల్ స్థాయి పోస్టు ఆర్బీఐ అసిస్టెంట్.. అనేది క్లరికల్ స్థాయి పోస్ట్. ఆయా రాష్ట్ర రాజధానులలో ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో వివిధ రకాల బాధ్యతలను వీరు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇందులో రసీదుల సేకరణ, లెడ్జర్ నిర్వాహణ, బ్యాలెన్స్ ట్యాలీ తదితర పనులను చేస్తారు. అంతేకాకుండా డేటాఎంట్రీ, రోజువారీ లావాదేవీల నమోదు, వచ్చిన ఈ–మెయిల్స్‌కు రిప్లై ఇవ్వడం, కరెన్సీ ఇష్యూ అండ్ సర్క్యులేషన్, వెరిఫికేషన్ ఆఫ్ బ్యాంకింగ్ డాక్యుమెంట్స్, గవర్నమెంట్స్ ట్రెజరీ పనులకు హాజరుకావడం, ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ... టీం వర్క్‌గా విధులను నిర్వహించాల్సి ఉంటుంది. అర్హతలు ఆర్బీఐ అసిస్టెంట్పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు డిగ్రీ పాసైతే సరిపోతుంది. దీంతోపాటు కంప్యూటర్ అప్లికేషన్స్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అలాగే సంబంధిత రాష్ట్ర /కేంద్రపాలిత ప్రాంత భాషలో ప్రావీణ్యం తప్పనిసరి. ►వయసు: ఫిబ్రవరి 1, 2022 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనాలు ఆర్బీఐ అసిస్టెంట్స్‌కు మూల వేతనం రూ.20,700 వరకూ అందుతుంది. దీంతోపాటు హెచ్ఆర్ఏ, డీఏ, సీసీఏ, ట్రాన్స్పోర్ట్ తదితర అలవెన్సులను అదనంగా పొందవచ్చు. దీంతో ప్రారంభం నుంచే నెలకు రూ.45వేల వరకూ అందుకునే అవకాశం ఉంటుంది. మూడేళ్ల అనుభవం తర్వాత శాఖాపరమైన పరీక్షల ద్వారా పదోన్నతులు పొందొచ్చు. చదవండి: (రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతల ప్రభావం మనపై ఎంత?) ఎంపిక ప్రక్రియ ఆర్బీఐ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మూడు దశల ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టుల ద్వారా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ ఆన్లైన్లో ఉంటాయి. ప్రిలిమ్స్‌లో ప్రతిభ చూపిన వారిని షార్ట్‌లిస్ట్ చేసి.. మెయిన్స్ నిర్వహించారు. ఈ దశను దాటితే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. మెయిన్‌లో సాధించిన మెరిట్ ప్రకారం తుది ఎంపిక చేసి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ప్రిలిమ్స్ పరీక్ష ఇలా ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ పద్దతిలో నిర్వహిస్తారు. మూడు విభాగాల నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్–30 ప్రశ్నలకు 30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ–35 ప్రశ్నలకు 35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలకు 35 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గో వంతు మార్కులను కోత విధిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. మెయిన్ ఎగ్జామ్ ఈ పరీక్షలో ఐదు విభాగాల నుంచి 200 మార్కులకు 200 ప్రశ్నలుంటాయి. రీజనింగ్–40, ఇంగ్లిష్ లాంగ్వేజ్–40, న్యూమరికల్ ఎబిలిటీ–40, జనరల్ అవేర్నెస్–40, టెస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్‌ల నుంచి 40 చొప్పున ప్రశ్నలను అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కును కేటాయిస్తారు. పరీక్ష సమయం 135 నిమిషాలు. ఎల్పీటీ మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (ఎల్పీటీ) రాయాల్సి ఉంటుంది. పరీక్ష సంబంధిత రాష్ట్రంలోని అధికారిక భాషలో నిర్వహిస్తారు. స్థానిక భాషలో ప్రావీణ్యంలేని అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అనర్హులు. సిలబస్ విశ్లేషణ ►రీజనింగ్: పజిల్– వెన్డయగ్రమ్, అనాలజీ, కోడింగ్–డీకోడింగ్, వెర్బల్ రీజనింగ్, సిరీస్, వర్డ్ ఫార్మేషన్, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, బ్లడ్ రిలేషన్, నాన్–వెర్బల్ రీజనింగ్, సిలోజిం తదితర టాపిక్స్ ఉంటాయి. ►న్యూమరికల్ ఎబిలిటీ: డేటా ఇంటర్‌ప్రిటేషన్, నంబర్ సిరీస్, సగటులు, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, సిప్లిఫికేషన్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, ప్రాబ్లమ్ ఆన్ ఏజెస్, మెన్సురేషన్,స్పీడ్,డిస్టెన్స్ అండ్ టైమ్,ఎస్ఐ అండ్ సీఐ, జామెట్రీ నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ►ఇంగ్లిష్ లాంగ్వేజ్: రీడింగ్ కాంప్రహెన్షన్, ఇడియమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్, ఎర్రర్ డైరెక్షన్, సినోనిమ్స్ అండ్ ఆంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సెంటెన్స్ కరెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ►జనరల్ అవేర్నెస్: హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, స్టాటిక్ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, సైన్స్, స్పొర్ట్స్, ఇంపార్టెంట్ స్కీమ్స్, పీపుల్ ఇన్ న్యూస్, అవార్డ్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ ►కంప్యూటర్ నాలెడ్జ్: ఎంఎస్ ఆఫీస్, ఆపరేటింగ్ సిస్టమ్, డేటాబేస్ మేనేజ్మెంట్, సిస్టమ్, నెట్వర్కింగ్, సెక్యూరిటీ, ఇంటర్నెట్ అండ్ వెబ్ ముఖ్యమైన సమాచారం ►దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ►దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 08, 2022 ►ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 2022 మార్చి 26–27 ►మెయిన్ పరీక్ష: మే, 2022లో ఉంటుంది. ►వెబ్సైట్: www.rbi.org.in -
తెలంగాణ వచ్చినా.. ఆత్మహత్యలా!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం వచ్చాక కూడా ఉద్యోగాల్లేక యువతీయవకులు ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత బాధాకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉద్యోగ ఖాళీల భర్తీ.. నిరుద్యోగ భృతి కోసం బీజేవైఎం ఆధ్వర్యంలో చేపట్టిన ‘కోటి సంతకాల’సేకరణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఆదివారం పార్టీ కార్యాల యంలో మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీజీకి నివాళులు అర్పించిన అనంతరం తొలి సంతకం చేసి ఈ కార్యక్రమానికి సంజయ్ శ్రీకారం చుట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ ఇచ్చిన హామీ లేవీ సీఎం అయ్యాక అమలు చేయకుండా నిరుద్యోగులను నిలువునా మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. 2014లో అసెంబ్లీలో కేసీఆర్.. 1.07 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కానీ ‘ఏడున్నరేళ్ల నుంచి ఒక్క గ్రూప్–1 ఉద్యోగం లేదు.. మూడేళ్ల నుంచి ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేదు’అని పేర్కొన్నారు. నిరుద్యోగుల ఆత్మహత్యలను సీఎం చేసిన హత్యలుగానే బీజేపీ భావిస్తోందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. ‘నిన్నొకాయన లక్షన్నర ఉద్యోగాలిచ్చామంటూ పచ్చి అబద్ధాలు చెబుతుండు.. దమ్ముంటే ఆ జాబితాను విడుదల చేయాలి’అని సంజయ్ సవాల్ విసి రారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, తమ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. -
జోనల్ సర్దుబాటు తర్వాత కొత్త ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: జోనల్ విధానం ద్వారా ఉద్యోగుల సర్దుబాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందని మంత్రి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. టీజీవో సంఘం అధ్యక్షురాలు మమత నేతృత్వంలో మంగళవారం హైదరాబాద్‌లో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులు బుధవారంలోగా ఆప్షన్లు ఇవ్వాలని సూచించారు. జోనల్ విధానం పూర్తయితే ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయో తెలుస్తుందన్నారు. మమత మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు రాకుండా జోనల్ విధానం ప్రవేశపెట్టినట్టు పేర్కొన్నారు. దీర్ఘకాలిక సెలవులో ఉన్న ఉద్యోగులు వెంటనే ఆప్షన్ పత్రాలపై సంతకాలు చేయాలని టీజీవో ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ సూచించారు. సమావేశంలో టీజీవో కేంద్ర సంఘం నాయకుడు సహదేవ్, రవీందర్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
సమగ్ర శిక్షా అభియాన్‌లో పోస్టులను భర్తీ చేయాలి
సాక్షి, హైదరాబాద్: సమగ్ర శిక్షా అభియాన్‌లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వాన్ని కోరారు. ఏడాదిన్నరగా 704 పోస్టుల భర్తీ ప్రక్రియలో జాప్యం జరుగుతుండటంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యేలా ఒత్తిడి తెస్తానని ఈ పోస్టుల ఫలితాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగ అభ్యర్థులకు హామీ ఇచ్చారు. శనివారం స్పెషల్ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పలువురు అభ్యర్థులు బండి సంజయ్‌కు వినతి పత్రం అందజేశారు. సమగ్ర శిక్షా అభియాన్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఐఈఆర్పీ, ఎంఐఎస్ కోఆర్డినేటర్, సిస్టమ్ అనలిస్ట్, అసిస్టెంట్ ప్రోగ్రామర్ నియామకాలకు సంబంధించి 704 పోస్టులను భర్తీ చేసేందుకు 2019 జూన్ 11న నోటిఫికేషన్ జారీ చేసిన ప్రభుత్వం, డిసెంబర్ 23న పరీక్షలు నిర్వహించింది. 2020 జనవరి 7న ఫలితాలను కూడా ప్రకటించి మెరిట్ కార్డులు కూడా జారీ చేసింది. అయితే ఫలితాలు ప్రకటించి ఏడాదిన్నర దాటినా ఇప్పటి వరకు నియామక పత్రాలు అందజేయలేదని అభ్యర్థులు సంజయ్‌కు వివరించారు. -
తెలంగాణలో 65 వేల ఖాళీలు భర్తీ చేసేలా..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను జోన్లలోని కేడర్ల వారీగా భర్తీ చేసేందుకు కసరత్తు పూర్తయింది. అన్ని శాఖలు తమతమ పరిధిలోని ఖాళీల సంఖ్యతో సిద్ధంగా ఉన్నాయి. దాదాపు 65 వేలకు పైగా ఖాళీలున్నట్టు ఇప్పటికే ప్రభుత్వం ప్రాథమికంగా గుర్తించింది. ఈ నేపథ్యంలో 50 వేల నుంచి 65 వేల వరకు పోస్టుల భర్తీకి ఏకకాలంలో నోటిఫికేషన్లు ఇచ్చే అవకాశాలున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. స్థానికతపై రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల మేరకు జిల్లా, జోనల్, మల్టీ జోనల్ కేడర్ల వారీగా.. మంజూరైన పోస్టులు, అందులో పనిచేస్తున్న ఉద్యోగుల విభజనకు సంబంధించిన వివరాలను నిర్దేశిత నమూనాలో అన్ని ప్రభుత్వ శాఖలు సోమవారం తమ పరిధి లోని విభాగాల నుంచి తెప్పిం చుకున్నాయి. (చదవండి: నూటొక్క జిల్లాల.. కేటుగాడు!) రాష్ట్ర ఆర్థిక శాఖ మంగళ, బుధ, గురువారాల్లో ఆయా ప్రభుత్వ శాఖలతో వరుసగా మూడు రోజులపాటు సమావేశాలు నిర్వహించి రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల విభజనకు తుది రూపు ఇవ్వనుంది. దీంతో పాటు ఆయా కేడర్ల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను సంబంధిత శాఖల నుంచి సేకరించనుంది. ఈనెల 9తో అన్ని శాఖల్లోని కేడర్ల వారీగా ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం రానుంది. దానికితోడు రిక్రూట్మెంట్ ఇతరత్రా సర్వీసు నిబంధనలు తదితర అంశాలన్నింటిపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు అన్ని శాఖల అధికారులతో సమీక్షించనున్నారు. ఒకేసారి 50 వేల పోస్టులకు.. శాఖల వారీగా ఖాళీ పోస్టులకు సంబంధించిన వివరాలతో రాష్ట్ర ఆర్థిక శాఖ నివేదికను సిద్ధం చేయనుంది. ఈ నెల 10 లేదా ఆ తర్వాత సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమావేశమై ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులకు సంబంధించిన ప్రతిపాదనలను పరిశీలించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆర్థిక శాఖ సమర్పించనున్న ప్రతిపాదనలతో ముఖ్యమంత్రి సంతృప్తి చెందితే భర్తీకి మార్గం సుగమం కానుంది. దాదాపు ఏడు నెలల కింద సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ఒకేసారి 50 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు రావాల్సి ఉంది. నవంబర్ చివరి వారంలో హుజూరాబాద్ శాసనసభ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశాలుండడంతో, ఎన్నికలకు నెల రోజుల ముందే కొలువుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. (చదవండి: TS: గెజిట్ అమలుకు గడువు పెంచండి) -
ఏపీపీ పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్: చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల (ఏపీపీ)ల నియామకానికి నోటిఫికేషన్ వచ్చింది. ఆదివారం ఉదయం వివిధ న్యాయస్థానాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల పోస్టుల భర్తీకి రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు (టీఎస్ఎల్ పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాస రావు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హతలు గలిగిన అభ్యర్థులంతా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. కొత్త జోనల్ వ్యవస్థకు కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత ప్రభుత్వం వెలువరించిన తొలి నోటిఫికేషన్ ఇదే కావడం గమనార్హం. ఏపీపీల రిక్రూట్‌మెంట్‌ను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేపడుతుందని ‘సాక్షి’ (ఆదివారం నాటి సంచికలో) ముందే తెలిపిన సంగతి తెలిసిందే. అలాగే ఏ క్షణంలోనైనా పోలీసుశాఖలోని దాదాపు 19వేల పైచిలుకు పోస్టుల ఖాళీలకు రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ ఇవ్వనుంది. ఏపీపీ పోస్టుల వివరాలు ఇలా... 8 మొత్తం పోస్టులు: 151 వేతనం: రూ.54,220–రూ.1,33,630. వయోపరిమితి: 2021, జూలై 1 నాటికి 34 ఏళ్లు దాటకూడదు. కనీస విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బీ/ బీఎల్ లేదా ఇంటర్ తరువాత ఐదేళ్ల లా కోర్సు పూర్తిచేసి ఉండాలి. అనుభవం: జూలై 4 నాటికి కనీసం మూడేళ్లపాటు క్రియాశీలకంగా క్రిమినల్ కోర్టుల్లో అడ్వోకేటుగా పనిచేసి ఉండాలి. ఫీజు: తెలంగాణ స్థానికత కలిగిన ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు రూ.750. మిగిలిన అభ్యర్థులు (ఓసీ/బీసీ) అంతా రూ.1500. అభ్యర్థుల దరఖాస్తు ప్రకియ ఆదివారం నుంచే మొదలవడం విశేషం. ఎంపిక, వయోపరిమితి ఇతర వివరాల కోసం https://www.tslprb.in/లో సంప్రదించగలరు. కొత్త జోన్ల ఆధారంగా కేటాయింపులు.. ప్రస్తుతం వెలువడిన ఏపీపీ నోటిఫికేషన్ ను కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ప్రకటించడం గమనార్హం. మొత్తం 151 పోస్టుల్లో మల్టీజోన్ 1 పరిధిలో 68 పోస్టులు ఉండగా, మల్టీజోన్ –2 పరిధిలో 83 పోస్టులు ఉన్నాయి. అన్ని పోస్టుల భర్తీలోనూ జనరల్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, విమెన్ రిజర్వేషన్లతోపాటు, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, ఎకనమికల్లీ వీకర్ సెక్షన్, వికలాంగుల రిజర్వేషన్ లను పరిగణనలోకి తీసుకున్నారు. ఎస్సీ/ఎస్టీ/బీసీలకు ఐదేళ్ల వయోపరిమితి కల్పించారు. వికలాంగులకు గరిష్టంగా పదేళ్ల మినహాయింపు ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు (టీఎస్ఆర్టీసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీ తదితరాలకు వర్తించదు) వయోపరిమితి, ఎక్స్ సర్వీస్‌మెన్ (మాజీ సైనికాధికారులు), ఎన్ సీసీలో సేవలందించిన వారికి వమోపరిమితిలో మూడేళ్లపాటు మినహాయింపు కల్పించారు. -
కొలువులు కదల్లే..6 నెలల క్రితమే సర్కారు కసరత్తు
ఉద్యోగాల భర్తీపై ప్రకటనతో.. ‘రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేస్తాం. వివిధ శాఖల్లో 50 వేల వరకు ఖాళీలున్నట్టు అంచనా. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఖాళీ పోస్టులను గుర్తించి భర్తీకి చర్యలు చేపడతారు..’.. గత ఏడాది డిసెంబర్ 13న సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన ఇది. కరోనా ఎఫెక్ట్, కొత్త జిల్లాల సమస్యతో.. పోస్టుల భర్తీ ప్రక్రియపై అధికారులు కసరత్తు మొదలుపెట్టినా.. కరోనా రెండో వేవ్‌తో సమస్య మొదలైంది. మరో రెండు కొత్త జిల్లాలతో తలెత్తిన జోనల్ సమస్య, ఉద్యోగుల పదోన్నతుల్లో న్యాయపరమైన చిక్కులతో ఎక్కడికక్కడే ఆగిపోయింది. ఆరు నెలలు గడిచినా.. సీఎం ప్రకటన చేసి ఇప్పటికి సరిగ్గా ఆరు నెలలు గడిచాయి. ఇప్పటివరకు నోటిఫికేషన్లు విడుదల కాలేదు. లక్షలాది మంది నిరుద్యోగులు పోస్టుల భర్తీ కోసం ఎదురుచూస్తున్నారు. ప్రక్రియ పునఃప్రారంభమెప్పుడు? జోనల్ సమస్య తీరింది. కరోనా రెండో వేవ్ నియంత్రణలోకి వస్తోంది. పోస్టుల భర్తీ ప్రక్రియ పునఃప్రారంభం అయితే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వాలని నిరుద్యోగుల నుంచి డిమాండ్ వస్తోంది. సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, త్వరలోనే నోటిఫికేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆరు నెలల కింద ప్రకటించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను ఆదేశించారు. ముందుగా అన్ని శాఖల్లో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించి, తద్వారా కింది స్థాయిలో ఏర్పడే ఖాళీలను భర్తీ చేయాలని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు, కింది స్థాయిలో అప్పటికే ఉన్న ఖాళీలు, కొత్తగా ఏర్పడే ఖాళీ పోస్టుల గుర్తింపుపై అన్ని ప్రభుత్వ శాఖలు కసరత్తు మొదలుపెట్టాయి. దాదాపు మూడు వారాల పాటు సీరియస్‌గా ప్రక్రియ కొనసాగింది. పురోగతిని సమీక్షించేందుకు సీఎస్ సోమేశ్‌కుమార్ అన్ని ప్రభుత్వ శాఖల కార్యదర్శులతో రోజువారీ సమావేశాలు కూడా నిర్వహించారు. వివిధ శాఖల్లోని దాదాపు 18 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించారు. కొందరు ఉద్యోగులకు పదోన్నతుల విషయంగా న్యాయపరమైన సమస్యలు, పలు ఇతర చిక్కులు తలెత్తడంతో జాప్యం జరిగింది. అప్పటికీ చాలా శాఖల నుంచి ఖాళీ పోస్టుల వివరాలు ఆర్థిక శాఖకు చేరాయి. పోస్టుల భర్తీ ప్రక్రియ ఆర్థిక శాఖ నుంచి సాధారణ పరిపాలన శాఖకు బదిలీ అయింది. అప్పటికే కరోనా రెండో వేవ్ విజృంభణతో పోస్టుల భర్తీ కసరత్తు నిలిచిపోయింది. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులతో.. కరోనా ఎఫెక్ట్‌కు తోడు.. ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు మరో సమస్య కూడా తలెత్తింది. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన ములుగు, నారాయణపేట జిల్లాల ప్రాతిపదికన కొత్త జోనల్ వ్యవస్థలో మార్పులు చేయాల్సి వచ్చింది. ఈ మేరకు 2018 నాటి రాష్ట్రపతి ఉత్తర్వుల్లో సవరణలు చేస్తూ కేంద్రం ప్రభుత్వం ఏప్రిల్‌లో గెజిట్ జారీ చేసింది. ఈ కొత్త విధానంలోని 33 జిల్లాలు, 7 జోన్లు, రెండు మల్టీజోన్ల ప్రాతిపదికన మళ్లీ పోస్టుల విభజన ప్రక్రియ చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదంతా పూర్తికావాలంటే కనీసం రెండు మూడు నెలలు సమయం పట్టవచ్చని అధికార వర్గాలు చెప్తున్నాయి. రెండు మూడు నెలల్లో, మొత్తంగా ఒకేసారి 50 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలన్న యోచనలో ప్రభుత్వం ఉందని పేర్కొంటున్నాయి. కాగా, ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయన్న ఆశతో లక్షల మంది నిరుద్యోగులు పరీక్షల ప్రిపరేషన్లో మునిగిపోయారు. జాప్యం జరిగిన కొద్దీ వయసు పెరిగి.. ఉద్యోగాలకు అర్హత కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 50వేల పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్లు ఒకేసారి 50 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వాలని భావిస్తున్నాం. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రాతిపదికన పోస్టుల విభజన ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉంది. దీనికి దాదాపు రెండు నెలల సమయం పట్టొచ్చు. ఈ మధ్య దాదాపు 18 వేల మంది ఉద్యోగులకు వివిధ స్థాయిల్లో పదోన్నతులు కల్పించాం. అలా ఏర్పడిన ఖాళీల వివరాలు సేకరిస్తున్నాం. వాటిని కూడా కలిపి, పూర్తి డేటా సిద్ధంకాగానే సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తాం. సీఎం కూడా ఒకేసారి పెద్ద మొత్తంలో నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పారు. అందువల్ల ఎలాంటి అవాంతరాలు రాకుండా చూసుకుని, ఒకేసారి 50 వేల కొలువుల భర్తీ చేపడతాం. - సోమేశ్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి 1.91 లక్షల పోస్టులు ఖాళీనే.. రాష్ట్రంలో 39 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్టు సీఆర్ బిశ్వాల్ నేతృత్వంలోని తెలంగాణ తొలి వేతన సవరణ సంఘం (పీఆర్సీ) తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం 4,91,304 పోస్టులు ఉండగా.. 3,00,178 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారని, ఏకంగా 1,91,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపింది. ప్రధానంగా విద్యా శాఖలో 23,798, హోంశాఖలో 37,182, వైద్య శాఖలో 30,570, రెవెన్యూశాఖలో 7,961, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 12,628 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు వివరించింది. -
మెదక్: వెల్దుర్తి మండలం శేరిల్లలో వైఎస్ షర్మిల పర్యటన
-
మెదక్: వెంకటేశ్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల
సాక్షి,మెదక్: జిల్లాలోని వెల్దుర్తి మండలం శేరిల్లా గ్రామంలో వైఎస్ షర్మిల బుధవారం ఉదయం పర్యటించారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకొని, ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నా.. ఎంతకు నోటిఫికేషన్ రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. డీఎస్సి నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో వెంకటేష్ మే16న ఆత్యహత్య చేసుకున్నాడు. వెంకటేశ్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం వెఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏడేళ్లు గడిచినా ఉద్యమ లక్ష్యాలు దరిదాపుల్లో లేవన్నారు. నేడు తెలంగాణలో ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులు చనిపోవడం తెలంగాణ ఉద్యమానికి అవమానమని, 35 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని గుర్తుచేశారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా పాలకులు మరణ శాసనాలు రాస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఎంత మంది నిరుద్యోగులు చనిపోతే ఉద్యోగాలు ఇస్తారో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని, మరి ప్రజల పిల్లలకు ఉద్యోగాలు వద్దా అని షర్మిల నిలదీశారు. చదవండి: బ్లాక్‌ఫంగస్ బాధితుడికి కేటీఆర్ అండ.. -
వందలమంది యువతుల్ని మోసం చేశాడు...
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగం అంటూ ఆశ చూపి...వందలాది మంది యువతులను మోసం చేశాడో కేటుగాడు. ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని ఆశ చూపి...ఆ తర్వాత నిజ స్వరూపం చూపించేవాడు. ఆకర్షణీయమైన ఉద్యోగం కావాలంటే శరీరమంతా కనిపించేలా ఫోటోలు పంపాలంటూ వేధింపులకు దిగాడు. చివరకు ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతగాడు కటకటాలపాలయ్యాడు. వివరాలు.. బెంగళూరుకు చెందిన ప్రదీప్ అనే వ్యక్తి చెన్నైలోని టీసీఎస్ కంపెనీలో పని చేస్తున్నాడు. యువతుల నగ్న చిత్రాలను సేకరించేందుకు పథకం పన్నాడు. ప్రముఖ కంపెనీల్లో రిసెప్షనిస్టు ఉద్యోగాలున్నాయంటూ ఓ నకిలీ వెబ్సైట్ సృష్టించి ప్రకటనలు గుప్పించాడు. ఉద్యోగం కావాలంటూ ఎవరైనా ప్రదీప్‌ను సంప్రదిస్తే... ‘ఈ ఉద్యోగాల్లో స్థిరపడాలంటే .. ఆకర్షణీయమైన రూపం ఉండాలి. ఫ్రంట్, బ్యాక్, చెస్ట్ కనపడేలా ఫోటోలు పంపించాలి’ అని మాయమాటలు చెప్పేవాడు. ఫోటోల్లో ఆకర్షణీయంగా ఉంటేనే ఉద్యోగం సొంతమవుతుందని నమ్మించేవాడు. అతని మాటల్ని నమ్మి 16 రాష్ట్రాలకు చెందిన సుమారు 2 వేల మంది యువతులు తమ ఫొటోల్ని పంపించారు. అయితే మియాపూర్‌కి చెందిన ఒక బాధితురాలికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు చివరకు ప్రదీప్‌ను అదుపులోకి తీసుకుని, అతడి వద్ద నుంచి రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుని దగ్గర వేల సంఖ్యలో ఫోటోలు, వీడియోలు ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యార్హత డిగ్రీ.. కొత్త జిల్లాలే ప్రాతిపదిక
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్త జిల్లాల ప్రాతిపదికగానే పంచాయతీ కార్యదర్శుల నియామకాలను చేపట్టాలని పంచాయతీరాజ్ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. పంచాయతీ కార్యదర్శులకు కనీస విద్యార్హతను బ్యాచిలర్ డిగ్రీగా ఖరారు చేసింది. రాతపరీక్ష ఆధారంగా, జిల్లాలవారీగా నియామకాలు చేపట్టాలని పేర్కొంది. గ్రామ కార్యదర్శులకు నెలకు రూ. 15 వేల చొప్పున మూడేళ్లపాటు వేతనం ఇవ్వాలని నిర్దేశించిన సబ్ కమిటీ...పనితీరు సరిగా ఉంటేనే మూడేళ్ల తర్వాత వారిని క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో కమిటీ సమావేశమైంది. మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్రావు, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్న ఈ భేటీలో నూతన పంచాయతీరాజ్ చట్టం అమలు, జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం, వారి బాధ్యతలు, విధులకు సంబంధించిన మార్గదర్శకాలపై కూలంకషంగా చర్చించారు. ప్రతి పంచాయతీకి ఒక గ్రామ కార్యదర్శి నియామకం, జనాభా ప్రాతిపదికన గ్రామంలో ఉద్యోగుల సంఖ్యను ఖరారు చేయాలని సబ్ కమిటీ నిర్ణయించింది. నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడానికి ప్రతి గ్రామానికీ ఒక కార్యదర్శిని నియమించాలని సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం మేరకు 9,355 మంది జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియామకం చేపట్టనుంది. నియామకాల్లో వయసుకు వెయిటేజీ! గ్రామ కార్యదర్శిగా ఎంపికైన వారు కచ్చితంగా ఆయా గ్రామాల్లోనే ఉండాలనే నిబంధన పెట్టి కఠినంగా అమలు చేయాలని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. అవసరమైతే నియామకాల్లో వయసుకు కొంత వెయిటేజీ ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని అధికారులను సబ్‌కమిటీ ఆదేశించింది. వారి పదోన్నతుల్లో సీనియారిటీతోపాటు పనితీరును కూడా ప్రాతిపదికగా తీసుకునేందుకు ఉన్న అవకాశాలపైనా సబ్ కమిటీ చర్చించింది. పంచాయతీల్లో పనిచేసే ప్రతి కార్మికుడు, సిబ్బందికి కనీస వేతనం ఇవ్వడంతోపాటు ప్రతి నెలా వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సబ్ కమిటీ ఆదేశించింది. జనాభా ప్రాతిపదికన ఏయే గ్రామానికి ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉంటుందన్న సంఖ్యను నిర్దిష్టంగా తేల్చాలని సబ్ కమిటీ నిర్ణయించింది. గ్రామ పంచాయతీలు కూడా ఇష్టానుసారంగా సిబ్బందిని నియమించుకునేందుకు వీలు లేకుండా ఈ నిర్ణయం తీసుకుంది. ఐదు వందల వరకు జనాభా ఉన్న గ్రామానికి ఒక పారిశుద్ధ్య కార్మికుడిని నియమించుకునేలా పంచాయతీలకు వెసులుబాటు ఇచ్చే అంశంపై సమావేశంలో చర్చించారు. వీటితోపాటు గ్రామంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల ప్రాధాన్యతాక్రమాన్ని కూడా స్పష్టంగా నిర్దేశించాలని నిర్ణయించారు. అలాగే నూతన చట్టానికి అనుగుణంగా జిల్లా పంచాయతీ అధికారులు, డివిజన్ పంచాయతీ అధికారులు, ఎంపీడీఓలు, ఈఓపీఆర్డీలు, కార్యదర్శుల సర్వీస్ రూల్స్‌లోనూ మార్పులు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సబ్ కమిటీ ఆదేశించింది. కోర్టు ఆదేశాల ప్రకారం బీసీ గణన చేపట్టాల్సిన అవసరం ఉందని పంచాయతీరాజ్ సబ్ కమిటీ అభిప్రాయపడింది. ఇందుకోసం విధివిధానాలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించింది. సమావేశంలో ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శులు శివశంకర్, రామకృష్ణారావు, పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
3 నెలలు.. 5,318 పోస్టులు
సాక్షి, హైదరాబాద్: గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్ఈ–ఐఆర్బీ) ద్వారా మూడు నెలల్లో 5,318 పోస్టులు భర్తీ చేయనున్నట్లు బోర్డు చైర్మన్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. ఇప్పటికే 3,213 ఉద్యోగాలకు సంబంధించి రెండు నోటిఫికేషన్లు జారీ చేశామని, వారాంతం లోగా మరో 465 డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. బుధవారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని పోలీస్ ఆఫీసర్స్ క్లబ్లో టీఆర్ఈ–ఐఆర్బీ కార్యక్రమాలపై మీడియా సమావేశం నిర్వహించారు. గురుకుల విద్యా సంస్థల్లో యుద్ధ ప్రాతిపదికన నియామకాలు చేపట్టేందుకే ప్రభుత్వం బోర్డు ఏర్పాటు చేసిందని, ఇందులో గురుకుల సొసైటీల్లోని ఉద్యోగులు, సిబ్బందిని డిప్యుటేషన్పద్ధతిలో తీసుకుని కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. బోర్డు నిర్వహణకు గురుకుల సొసైటీల ద్వారా ఆర్థిక సహకారాన్ని తీసుకుంటున్నామని, అక్టోబర్ ఆఖరుకల్లా అభ్యర్థులకు అర్హత పరీక్షలు నిర్వహించి నియామకాల ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పారు. ఇటీవల టీఎస్పీఎస్సీ ద్వారా నియమితులైన టీజీటీ, పీజీటీలకు ప్రత్యేకంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. వారికి క్షేత్రస్థాయి శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులు, వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులు, జీవనశైలి తదితర అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు కొత్త టీచర్లను విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు పంపుతున్నామని వివరించారు. రెండ్రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో టీచర్లకు విద్యార్థుల సామాజిక, ఆర్థిక స్థితిగతులు అర్థమవుతాయని, దీంతో బోధన కార్యక్రమాలెలా నిర్వహించాలనే అంశంపై స్పష్టత వస్తుందన్నారు. స్వేరోస్.. విద్యార్థి సంఘం కాదు.. స్వేరోస్ సంస్థ విద్యార్థి నాయకుల సంఘం కాదని ప్రవీణ్‌కుమార్ స్పష్టం చేశారు. స్వేరోస్ కార్యక్రమాలపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. గురుకుల పాఠశాలల్లో చదువుకున్న పూర్వ విద్యార్థులతో ఏర్పాటైన సంస్థ స్వేరోస్ అని తెలిపారు. ఎస్సీ గురుకులాల్లోని కాంట్రాక్టు పనులను ఎస్సీలకే కేటాయించే క్రమంలో భాగంగా జిల్లాల్లో కలెక్టర్ల ద్వారా స్వేరోస్‌కు కాంట్రాక్టులు ఇస్తున్నామని, సొసైటీ నిబంధనల్లోనే ఈ అంశం ఉందని, ప్రభుత్వ ఆమోదంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. స్వేరోస్ వచ్చిన తర్వాత గురుకులాల్లో చాలా మార్పులు వచ్చాయని, సివిల్ సర్వెంట్లు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్ ఇందులో ఉన్నారని, వీరిని ఆదర్శంగా తీసుకుంటూ విద్యార్థులు ముందుకెళ్తున్నారని వివరించారు. విద్యార్థులపై లైంగిక దాడులు జరిగితే సహించబోమని, బాధ్యులు ఎవరైనా వదిలేది లేదన్నారు. అన్ని గురుకుల పాఠశాలల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణలో భద్రత కట్టుదిట్టంగా నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో బోర్డు కన్వీనర్ నవీన్ నికోలస్, సభ్యులు మల్లయ్యభట్టు, సత్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
3,010 ‘విద్యుత్’ పోస్టులు!
సాక్షి, హైదరాబాద్ : దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లో 3,010 పోస్టుల భర్తీకి త్వరలో ప్రకటన జారీ కానుంది. 2,440 జూనియర్ లైన్మెన్ (జేఎల్ఎం), 500 లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్డీసీ), 70 జూనియర్ పర్సనల్ ఆఫీసర్ (జేపీవో) పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేసేందుకు సంస్థ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి ట్రాన్స్‌కో జారీ చేసిన ప్రకటనలో 90 శాతం పోస్టులను లోకల్ కోటా అభ్యర్థులకు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ కొందరు హైకోరును ఆశ్రయించారు. ఈ కేసులో హైకోర్టు తీర్పు కోసం టీఎస్ఎస్పీడీసీఎల్ యాజమాన్యం ఎదురుచూస్తోంది. ఈ తీర్పుకు వచ్చిన తర్వాత 3,010 పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేస్తామని సంస్థ సీఎండీ జి.రఘుమారెడ్డి తెలిపారు. నెల రోజుల్లో తీర్పు రావచ్చని ఆశిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి వరకు 318 అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్), 133 సబ్ ఇంజనీర్, 112 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, 19 అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) పోస్టులను భర్తీ చేశామని పేర్కొన్నారు. -
18,428 పోలీసు పోస్టులకు నోటిఫికేషన్
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర పోలీసు శాఖలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా 18,428 పోస్టుల భర్తీకి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు గురువారం నోటిఫికేషన్ జారీచేసింది. పోలీసు శాఖతోపాటు అగ్నిమాపక, జైళ్ల శాఖలకు సంబంధించిన పోస్టులను భర్తీ చేస్తున్నట్టు అందులో పేర్కొంది. జూన్ 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు బోర్డు వెబ్సైట్ (www.tslprb.in) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామని వెల్లడించింది. దరఖాస్తు చేసుకునే ప్రతి పోస్టుకు కూడా వేర్వేరుగా ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఎస్సై, ఆ స్థాయి ఇతర పోస్టుల సంఖ్య, అర్హతలివీ.. పోస్టు విభాగం ఖాళీలు సబ్ ఇన్స్పెక్టర్ (పురుష, మహిళా) సివిల్ విభాగం 710 సబ్ ఇన్స్పెక్టర్ (పురుష, మహిళా) ఆర్మ్డ్ రిజర్వ్ 275 సబ్ ఇన్స్పెక్టర్ (పురుష) ఎస్ఏఆర్, సీపీఎల్ 05 సబ్ ఇన్స్పెక్టర్ (పురుష) టీఎస్ఎస్పీ 175 సబ్ ఇన్స్పెక్టర్ (పురుష) 15వ బెటాలియన్ 16 స్టేషన్ ఫైర్ ఆఫీసర్ అగ్నిమాపక శాఖ 19 డిప్యూటీ జైలర్ జైళ్ల శాఖ 15 అసిస్టెంట్ మాట్రన్ జైళ్ల శాఖ 2 అర్హతలు.. ఫీజులు.. ఈ పోస్టుల్లో పోలీసు విభాగంలోని ఉద్యోగాలకు అభ్యర్థుల వయసు జూలై 1, 2018 నాటికి 21 ఏళ్ల నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి (1993 జూలై 2 నుంచి 2000 జూలై 1 లోపు జన్మించి ఉండాలి). అగ్నిమాపకశాఖలోని ఉద్యోగాలకు 18 ఏళ్ల నుంచి 33 ఏళ్లలోపు (జూలై 2 1988 నుంచి 2003 జూలై 1లోపు జన్మించి) ఉండాలి. జైళ్ల విభాగంలోని డిప్యూటీ జైలర్ ఉద్యోగాలకు 21 ఏళ్ల నుంచి 33 ఏళ్లలోపు (జూలై 2, 1988 నుంచి జూలై 1 2000 మధ్య జన్మించి) ఉండాలి. జైళ్ల శాఖలోని అసిస్టెంట్ మాట్రన్ ఉద్యోగాలకు 21 నుంచి 28 ఏళ్ల లోపు (జూలై 2 1993 నుంచి జూలై 1 2000 మధ్య జన్మించి) ఉండాలి. జనరల్, బీసీ అభ్యర్థులు తప్పనిసరిగా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఇంటర్ లేదా పాలిటెక్నిక్ అర్హత ఉండాలి. దరఖాస్తు ఫీజు ప్రతి పోస్టుకు.. ఓసీ, బీసీ అ«భ్యర్థులకు రూ.1,000. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500. కానిస్టేబుల్, తత్సమాన పోస్టుల సంఖ్య అర్హతలివీ.. పోస్టు విభాగం ఖాళీలు కానిస్టేబుల్ (పురుష, మహిళా) పోలీస్ సివిల్ 5,909 కానిస్టేబుల్ (పురుష, మహిళా) ఆర్మ్డ్ రిజర్వ్ 5,273 కానిస్టేబుల్ (పురుష) ఎస్ఏఆర్ సీపీఎల్ 53 కానిస్టేబుల్ (పురుష) టీఎస్ఎస్పీ 4,816 కానిస్టేబుల్ (పురుష) ఎస్పీఎఫ్ 485 ఫైర్‌మన్ అగ్నిమాపక శాఖ 168 వార్డర్స్ (పురుష) జైళ్ల శాఖ 186 వార్డర్స్ (మహిళ) జైళ్ల శాఖ 35 మొత్తం 16,925 అర్హతలు.. ఫీజులు.. పోలీసుశాఖలోని కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసు (జూలై 2 1996 నుంచి జూలై 1 2003 మధ్య జన్మించి) ఉండాలి. ప్రస్తుతం హోంగార్డులుగా పనిచేస్తున్నవారైతే గత రెండేళ్లలో కనీసం 365 రోజులు విధులకు హాజరై ఉండాలి. వీరు 18 ఏళ్ల నుంచి 43 ఏళ్లలోపు (జూలై 2 1978 నుంచి జూలై 1 2003 మధ్య జన్మించి) ఉండాలి. ఇక అగ్నిమాపక, జైళ్ల శాఖల్లోని కానిస్టేబుల్ పోస్టులకు 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్యలోపు వయసు ఉండాలి. ఈ పోస్టులన్నింటికీ జనరల్, బీసీ అభ్యర్థులు ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే పదో తరగతి ఉత్తీర్ణులై ఇంటర్ లేదా తత్సమాన కోర్సు చదువుతున్న వారుకూడా అర్హులే. ఇక ఈ ఉద్యోగాల్లో ప్రతి పోస్టుకు దరఖాస్తు ఫీజు.. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.400. మహిళలకు వయోపరిమితి వెసులుబాటు మహిళా కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి పలు ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. ఒంటరి మహిళలు/విడాకులు తీసుకున్న మహిళలు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వారికి 18 ఏళ్ల నుంచి 43 ఏళ్లలోపు వయసు ఉండాలి. ఇతర కేటగిరీల మహిళా అభ్యర్థులకు 18 ఏళ్ల నుంచి 38 ఏళ్లలోపు వయసు ఉండాలి. కమ్యూనికేషన్ విభాగంలో పోస్టులు, అర్హతలివీ.. ఇటీవల పోలీసుశాఖలో టెక్నాలజీ వినియోగం పెరుగుతుండటంతో పోలీసు కమ్యూనికేషన్స్ విభాగాన్ని మరింత పటిష్టం చేస్తున్నారు. ఈ మేరకు కమ్యూనికేషన్ అండ్ ఐటీ విభాగం, ఫింగర్ ప్రింట్స్ బ్యూరోలో పోస్టుల భర్తీ చేపట్టారు. పోస్టు విభాగం ఖాళీలు సబ్ ఇన్స్పెక్టర్ (పురుష, మహిళా) కమ్యూనికేషన్స్, ఐటీ 29 అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఫింగర్ ప్రింట్స్ బ్యూరో 26 కానిస్టేబుల్ (పురుష, మహిళా) కమ్యూనికేషన్స్, ఐటీ 142 కానిస్టేబుల్ (మెకానిక్) ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ 19 కానిస్టేబుల్ (డ్రైవర్స్) ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్ 70 ఎస్సై, ఏఎస్సై ఆస్థాయి పోస్టులకు అర్హతలు, ఫీజులివీ.. కమ్యూనికేషన్స్–ఐటీ విభాగంలోని ఎస్సై పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు.. ఎలక్ట్రానిక్స్–కమ్యూనికేషన్ విభాగంలో లేదా ఎలక్ట్రానిక్, కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ (బీఈ/బీటెక్) పూర్తిచేసి ఉండాలి. ఇక ఏఎస్సై పోస్టుల కోసం కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ రెండు పోస్టులకు వయసు 21 ఏళ్ల నుంచి 28 ఏళ్లలోపు (జూలై 2 1993 నుంచి జూలై 1 2000 మధ్య జన్మించి) ఉండాలి. దరఖాస్తు ఫీజులు ప్రతి పోస్టుకు.. ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.500. కానిస్టేబుల్ తత్సమాన పోస్టులకు అర్హతలు, ఫీజులివీ.. కమ్యూనికేషన్స్ విభాగంలో కానిస్టేబుల్ పోస్టులకు 18 ఏళ్ల నుంచి 25ఏళ్లలోపు వయసు (జూలై 2 1996 నుంచి జూలై 1 2000 మధ్య జన్మించి) ఉండాలి. పదో తరగతితో పాటు ఐటీఐ లేదా ఐటీ, ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేషన్ అండ్ ప్రోగ్రామ్ అసిస్టెంట్, మెకానిక్ కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ తదితర వొకేషనల్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. ఇక కానిస్టేబుల్ మెకానిక్ పోస్టులకు 18 ఏళ్ల నుంచి 22 ఏళ్లలోపు వయసు ఉండాలి. పదోతరగతితో పాటు ఐటీఐలో వైర్మన్ లేదా మెకానిక్, ఫిట్టర్ విభాగంలో ఉత్తీర్ణులై ఉండాలి. కానిస్టేబుల్ డ్రైవర్ పోస్టులకు 21 ఏళ్ల నుంచి 28 ఏళ్లలోపు వయసు ఉండాలి. పదో తరగతితో పాటు ఐటీఐలో ఎలక్ట్రానిక్ లేదా మెకానిక్ మోటార్ లేదా మెకానిక్ డీజిల్, ఫిట్టర్ విభాగంలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టెక్నికల్ అర్హత కింద లైట్ మోటార్ వెహికల్ (ఎల్ఎంవీ) లైసెన్స్‌తో పాటు బ్యాడ్జ్ నంబర్ కలిగి ఉండాలి. లేదా హెవీ మోటార్ వెహికల్ (హెచ్ఎంవీ) లైసెన్స్ పొంది, కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. అభ్యర్థులెవరైనా తగిన విద్యార్హతలుండి ప్రస్తుతం హోంగార్డులుగా పనిచేస్తుంటే.. 43 ఏళ్ల వరకు గరిష్ట వయో పరిమితి వెసులుబాటు ఉంటుంది. వారు గత రెండేళ్లలో కనీసం 365 రోజుల పాటు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కమ్యూనికేషన్స్ విభాగంలో మహిళా కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి వయో పరిమితి సడలింపు ఉంది. ఒంటరి మహిళలు/విడాకులు తీసుకున్న మహిళలు, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వారికి 18 ఏళ్ల నుంచి 43 ఏళ్లలోపు వయసు ఉండాలి. ఇతర కేటగిరీల మహిళా అభ్యర్థులకు 18 ఏళ్ల నుంచి 38 ఏళ్లలోపు వయసు ఉండాలి. దరఖాస్తు ఫీజులు ఒక్కో పోస్టుకు ఓసీ, బీసీలకు రూ.800, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.400. ప్రిలిమ్స్.. ఫిజికల్ టెస్ట్.. మెయిన్స్.. గతంలో నిర్వహించిన విధంగానే పోలీసు పోస్టుల భర్తీ ప్రక్రియ మూడు దశల్లో జరుగుతుందని అధికారులు తెలిపారు. తొలుత ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తామని.. అందులో ఎంపికైన అభ్యర్థులకు శారీరక దృఢత్వ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. దీనిలోనూ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్ష నిర్వహిస్తామన్నారు. వయో పరిమితి సడలింపుపై స్పష్టత కరువు పోలీసు పోస్టుల భర్తీలో వయో పరిమితి సడలింపు ఇవ్వాలని నిరుద్యోగులు కొంతకాలంగా ప్రభుత్వంపై, పోలీసు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత చేసిన తొలి నియామకాల్లో వయో పరిమితి సడలింపు ఇచ్చారని.. ఈసారి కూడా సడలింపు ఇస్తే వేలాది మంది నిరుద్యోగులకు అవకాశం వస్తుందని విజ్ఞప్తి చేశారు. కానీ గురువారం ఇచ్చిన నోటిఫికేషన్లో వయో పరిమితి సడలింపుపై సమాచారం లేదు. ఏ రిజర్వేషన్‌కు ఎన్ని పోస్టులు, జిల్లాల వారీగా ఎన్ని పోస్టులన్న అంశాలపైనా స్పష్టత ఇవ్వలేదు. దీనిపై పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు అధికారులను వివరణ కోరగా... సిలబస్, ఎంపిక తేదీలు, రిజర్వేషన్లు తదితర వివరాలన్నింటినీ త్వరలో వెబ్సైట్లో పెట్టనున్న పూర్తిస్థాయి నోటిఫికేషన్లో వెల్లడిస్తామని తెలిపారు. -
కొలువుల నెల
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కానుకగా ప్రభుత్వం పెద్ద ఎత్తున కొలువుల నియామకానికి సిద్ధమైంది. జూన్‌లోనే వివిధ శాఖల్లో 25 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రాష్ట్ర పబ్లిక్ సర్వీ స్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ఇప్పటికే నాలుగు నోటిఫికేషన్ల జారీకి రెడీ అయ్యింది. గ్రూప్–4 కింద 1,500 పోస్టులతోపాటు 700 వీఆర్వో, 450 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. జూన్ మొదటి వారంలోనే వీటికి నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలున్నాయి. వీటిలో సాధారణ డిగ్రీ, ఇం టర్‌తో పోటీ పడే పోస్టులు ఎక్కువగా ఉండటంతో లక్షలాది మంది నిరుద్యోగులను ఊరిస్తున్నాయి. మరోవైపు రాష్ట్రంలోని అన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలో భారీ సంఖ్యలో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లలో 5,313 పోస్టులను భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది. టీఎస్పీఎస్సీ ద్వారా కాకుండా తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వ ర్యంలో వీటి నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ 18న టీఆర్‌ఈఐఆర్‌బీ వీటికి నోటిఫికేషన్లు జారీ చేయనుంది. అలాగే తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో 18 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. వీటిలో సివిల్, ఏఆర్ ఎస్సైలు, కానిస్టేబుల్ పోస్టులున్నాయి. జూన్ 2నే నోటిఫికేషన్ జారీకి పోలీసు శాఖ ఏర్పాట్లు చేసింది. జూన్ 2న 125 పోస్టులతో గ్రూప్–1 నోటిఫికేషన్ జారీ చేయాలని టీఎస్పీఎస్సీ ముందుగా భావించింది. కానీ జోన్ల వ్యవస్థలో మార్పులు, కొత్తగా 7 జోన్లు, రెండు మల్టీ జోన్ల ఏర్పాటు దృష్ట్యా ఈ నోటిఫికేషన్‌కు బ్రేక్ పడింది. జోన్ల పునర్వ్యవస్థీకరణకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వుల సవరణ కోరుతూ రాష్ట్ర ప్రభు త్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. అప్పటివరకు గ్రూప్ వన్ పోస్టుల భర్తీని తాత్కాలికంగా నిలిపేయాలని, ప్రభుత్వం నుంచి వచ్చే తదుపరి ఆదేశాల వరకు వేచిచూడాలని టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. భర్తీకి అనుమతులు చకచకా కొత్త నోటిఫికేషన్లు ఇచ్చేందుకు సిద్ధమవుతూనే, పెం డింగ్ పోస్టుల భర్తీలో టీఎస్పీఎస్సీ వేగం పెంచింది. పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. రాష్ట్రంలో మొత్తం 1.10 లక్షల ఖాళీలున్నట్లు ప్రభుత్వం వద్ద శాఖల వారీగా గణాంకాలున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచీ 86 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో 12 వేల పోస్టులకు గడిచిన రెండు నెలల్లోనే చకచకా ఉత్తర్వులను జారీ చేయటం గమనార్హం. 115 డిగ్రీ కాలేజీల్లో 1,384 పోస్టులు, పాలిటెక్నిక్ కాలేజీల్లో 199 లెక్చరర్ పోస్టులు, సిద్దిపేట మెడికల్ కాలేజీలో 931 పోస్టులు, వైద్య శాఖ పరిధిలో 1,224 పోస్టులు, ఆర్థిక శాఖ పరిధిలో 239 పోస్టులు, నిమ్స్‌లో 399 పోస్టులు వీటిలో ఉన్నాయి. -
మరో 485 కానిస్టేబుల్ పోస్టులు
సాక్షి, హైదరాబాద్: పోలీస్‌శాఖలో మరో 485 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ ఆర్థికశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, నాగార్జునసాగర్ డ్యాం, ప్రముఖ దేవాలయాలకు భద్రత కల్పిస్తున్న స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) విభాగంలో ఈ పోస్టుల భర్తీ జరుగనుంది. ఇప్పటికే పోలీస్‌శాఖలోని సివిల్, ఏఆర్, బెటాలియన్ విభాగాల్లో 18 వేల పోస్టులు.. ఆర్టీసీ, ఫైర్, జైళ్లు తదితర విభాగాల్లో మరో 4 వేల పోస్టుల భర్తీకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. అదే నోటిఫికేషన్లో ప్రస్తుతం మంజూరైన 485 ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. -
తెలంగాణలో మరో ఉద్యోగ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: అటవీ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీస్ విభాగాల్లో ఖాళీగా ఉన్న 2,345 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. అటవీ శాఖలో ఫారెస్టు రేంజ్ ఆఫీసర్–67, ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్–90, ఫారెస్టు బీట్ ఆఫీసర్–1857 పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి ఈనెల 21వ తేదీ నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనుంది. వైద్య ఆరోగ్య శాఖలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్టులు)–205, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ –10, వైద్య విద్యలో ట్యూటర్స్– 65, వైద్య విద్యలో లెక్చరర్స్ ఇన్ రేడియోలాజికల్ ఫిజిక్స్ అండ్ ఫిజిసిస్ట్స్– 6, ఇన్సూ్యరెన్స్ మెడికల్ సర్వీసెస్‌లో సివిల్ అసిస్టెంట్ సర్జన్–43, అసిస్టెంట్ పిజియో థెరపిస్టు–2 పోస్టులను భర్తీ చేయనుంది. వీటికి ఈనెల 22వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనుంది. ఆయా పోస్టులకు సంబంధించిన పూర్తి స్థాయి నోటిఫికేషన్‌ను, పరీక్ష తేదీల వివరాలను తమ వెబ్సైట్లో పొందవచ్చని టీఎస్పీఎస్సీ వివరించింది. -
నిరాశలో నిరుద్యోగులు
► ఉద్యోగ ప్రకటనల కోసం అభ్యర్థుల ఎదురుచూపులు విజయనగరం: డిగ్రీ, పీజీలు చేత పట్టుకుని కోచింగ్ సెంటర్లలో ఉంటున్న నిరుద్యోగులు ఉద్యోగ ప్రకటనల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విశాఖపట్టణం, తదితర ప్రాంతాల నుంచి వందలాది మంది అభ్యర్థులు జిల్లా కేంద్రంలోని పలు కోచింగ్ సెంటర్లలో శిక్షణలు తీసుకుంటున్నారు. ఓ పక్క శిక్షణ తీసుకుంటూనే నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కోచింగ్ తీసుకోవడంతో పాటు స్థానిక లైబ్రరీలలో గంటల తరబడి చదువుతూ, ఓ రకంగా యజ్ఞమే చేస్తున్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయం ఆవరణలో ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం పుస్తకాలతో కుస్తీలు పడుతూ నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా బ్యాంకింగ్, స్టీల్‌ప్లాంట్, రైల్వే, గ్రూప్స్, తదితర పరీక్షలకు ఎక్కువ మంది అభ్యర్థులు పోటాపోటీగా చదువుతున్నారు. చాలామంది అభ్యర్థులు ఇటీవల పంచాయతీ కార్యదర్శి పోస్టులకు తలపడ్డారు. అలాగే గ్రూప్ –2 ప్రిలిమినరీ పాసై మరో రెండురోజుల్లో జరగనున్న మెయిన్స్‌కు సిద్ధపడుతున్నారు. ఐబీపీఎస్‌లో 14 వేల ఖాళీలతో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటన వచ్చింది గాని ఇంతవరకు సైట్ ఓపెన్ కావడం లేదని అభ్యర్థులు తెలిపారు. రెండేళ్లుగా నోటిఫికేషన్లు లేవు.. రెండేళ్లుగా సరైన నోటిఫికేషన్లు లేవు. ప్రభుత్వం క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల చేస్తే బాగుంటుంది. అలాగే ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కల్పించాలి. –రమేష్, నిరుద్యోగి -
సింగరేణిలో 242 ఉద్యోగాలు
త్వరలో నోటిఫికేషన్ విడుదల గోదావరిఖని: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటగా దాదాపు 5 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించిన సింగరేణి జూన్‌లో మూడో ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ ఇవ్వడానికి సంసిద్ధమైంది. ఈ మేరకు సంస్థ చైర్మన్ అండ్ ఎండీ ఎన్.శ్రీధర్ బుధవారం ఒక ప్రకటన జారీ చేశారు. సింగరేణి కాలరీస్ కంపెనీలో త్వరలో మూడో ఎక్స్టర్నల్ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నామని, తద్వారా 242 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సీఎండీ ప్రకటించారు. ఈ ఎక్స్టర్నల్ నోటిఫికేషన్ వారం రోజుల్లో విడుదల కానుంది. ఇప్పటికే సింగరేణి 2015 ఫిబ్రవరి, మార్చి నెలల్లో రెండు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసింది. వీటిద్వారా 17 రకాల ఉద్యోగాలకు 2,201 మందికి పోస్టింగులను కూడా ఇచ్చింది. అలాగే, అంతర్గత నోటిఫికేషన్ ద్వారా 17 రకాల ఉద్యోగాలకు 1,000 మందిని ఎంపిక చేసింది. డిపెండెంట్ కేటగిరీలో సుమారు 2,000 మందికిపైగా ఉద్యోగావకాశాలు కల్పించింది. కాగా మరో 242 ఖాళీలను గుర్తించి వీటిని భర్తీ చేయడం కోసం మూడో ఎక్స్టర్నల్ ఉద్యోగ నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. భర్తీ చేయనున్న ఉద్యోగాలివే: మూడో నోటిఫికేషన్ ద్వారా జూనియర్ మైనింగ్ ఇంజనీర్ (మైనింగ్) 163 పోస్టులు, వెల్డర్ ట్రైనీ 46 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనీ ఫైనాన్స్ అండ్ ఎకౌంట్స్ 10 పోస్టులు, ఫార్మాసిస్టులు 7 పోస్టులు, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ 4 పోస్టులు, జూనియర్ టెక్నీషియన్ (ఎక్స్‌రే) 4 పోస్టులు, ఫిజియోథెరపిస్టు 4 పోస్టులు, జూనియర్ ఫారెస్ట్ అసిస్టెంట్ 4 పోస్టులను భర్తీ చేయనున్నారు. అయితే, గతంలో మాదిరిగానే ఈసారి కూడా కేవలం రాత పరీక్ష ద్వారానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని, ఇంటర్వ్యూ ప్రక్రియ ఉండదని డెరైక్టర్ (పా) జె.పవిత్రన్‌కుమార్ తెలిపారు. పరీక్షలు పూర్తి పారదర్శక విధానంలో నిర్వహించడం జరుగుతుందని, పరీక్ష రాసిన రోజే ఫలితాలను కూడా ప్రకటించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. -
సింగరేణిలో మరో 400 ఉద్యోగాలు
ఫిబ్రవరిలో నోటిఫికేషన్ గోదావరిఖని: సింగరేణి సంస్థలో ఇప్పటికే రెండు నోటిఫికేషన్ల ద్వారా రెండు వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేసిన యాజమాన్యం, మరో 400 పోస్టులతో ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 2015లో మొదటి నోటిఫికేషన్ ద్వారా 8 కేటగిరీలకు చెందిన 1,178 ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహించి ఫలితాలు విడుదల చేసింది. వీటిలో మేనేజ్మెంట్ పర్సనల్, ఈ అండ్ ఎం విభాగాలకు చెందిన 107 పోస్టులకు సంబంధించి కోర్టులో ఉన్నందున వాటి ఫలితాలు వెల్లడికాలేదు. రెండో నోటిఫికేషన్ ద్వారా 9 కేటగిరీలకు చెందిన 1,033 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు శ్రీకారం చుట్టింది. ఇందులో 48 సర్వే ట్రైనీ, 40 మోటర్ మెకానిక్ పోస్టులకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. మిగిలిన వారందరికీ ఆఫీస్ ఆర్డర్లు ఇచ్చారు. ఇక ఫిబ్రవరిలో మూడోసారి ఉద్యోగాల నోటిఫికేషన్‌ను విడుదలచేసేందుకు యాజమాన్యం సన్నాహాలు చేస్తోం ది. ఇందులో 101 జూని యర్ నర్స్ ఉద్యోగాలు, 50 వెల్లర్ ట్రైనీతోపాటు ఈపీ ిఫిట్టర్, ఈపీ ఎలక్ట్రీషియన్‌కు సంబంధించి 400 పోస్టులు భర్తీ చేయనున్నారు. 150 క్లర్క్ పోస్టుల భర్తీకీ సన్నాహాలు సింగరేణిలో ఇప్పటికే ఎక్స్టర్నల్గా నోటిఫికేషన్ విడుదల చేసి 471 గ్రేడ్-2 క్లర్క్ పోస్టులకు రాతపరీక్ష నిర్వహించిన యాజమాన్యం ఫిబ్రవరి మొదటివారంలో ఎంపికైన వారికి ఆఫీస్ ఆర్డర్లను అందజేయనుంది. 144 అంతర్గత క్లర్క్ పోస్టులకు సంస్థలో పనిచేస్తున్న అర్హులను ఎంపిక చేసింది. అయితే మరో 150 వరకు క్లర్క్ పోస్టులు ఖాళీ అయ్యే అవకాశాలు ఉండడంతో మార్చి తర్వాత వీటి భర్తీకి అవసరమైన ప్రక్రియను ప్రారంభించేందుకు యా జమాన్యం చర్యలు తీసుకుంటోంది. జూనియర్ మైనింగ్ ఇంజనీర్(ట్రైనీ)కి సంబంధించి 811 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా... 676 మందే అర్హత సాధించారు. మిగిలిన 125 జేఎంఈటీ పోస్టులను మార్చి తర్వాత మరో నోటిఫికేషన్ విడుదల చేసి భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి నెలాఖరులోగా 665 గిరిజన ఉద్యోగాలు భర్తీ తెలంగాణలోని గిరిజనులకు సంబంధించి కేటాయించిన 665 బదిలీ వర్కర్ పోస్టుల భర్తీని కూడా ఫిబ్రవరి నెలాఖరులోగా భర్తీ చేసేందుకు యాజమాన్యం కసరత్తు చేస్తోంది. ఈ పోస్టులకు సుమారు 8వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఉద్యోగాల్లో సింగరేణి నాలుగు జిల్లాల గిరిజనులకు 80 శాతం, మిగిలిన ఇతర జిల్లాల వారికి 20 శాతం రిజర్వేషన్ కల్పించారు. -
ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలి
లేకుంటే సచివాలయం ముట్టడిస్తాం: ఆర్.కృష్ణయ్య హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు రావని ఉద్యమంలో ఉపన్యాసాలు ఇచ్చి తెలంగాణ ఏర్పడ్డాక ఒక్క ఉద్యోగానికీ నోటిఫికేషన్ ఇవ్వలేదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య అన్నారు. తెలంగాణలో ఖాళీగా ఉన్న 2లక్షలు, ఏపీలో లక్షన్నర ఉద్యోగాలకు జూన్ 2లోగా ఆయా ప్రభుత్వాలు నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే లక్షమంది నిరుద్యోగులతో సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు నీలవెంకట్ అధ్యక్షతన ఆదివారం దిల్‌సుఖ్‌నగర్‌లోని అన్నపూర్ణ కల్యాణమండపంలో సమావేశం జరిగింది. పలు జిల్లాల నుంచి వచ్చిన నిరుద్యోగులనుద్దేశించి కృష్ణయ్య మాట్లాడారు. భారీ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయకపోవటంతో అనేక మంది నిరుద్యోగుల వయోపరిమితి దాటి పోయి నష్టపోతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నెలలోపు లక్ష, 6నెలల్లో 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి అసెంబ్లీలో కూడా ప్రకటించి ఏడాదైనా ఎటువంటి స్పందనలేదని ఆయన విమర్శించారు. ఆంధ్రాలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందన్నారు. బతుకునిచ్చే తెలంగాణ కావాలే: విమలక్క అన్ని వర్గాల ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఎవరి అయ్య జాగీరు కాదనీ అరుణోదయ కళామండలి అధ్యక్షురాలు, ప్రజాగాయని విమలక్క అన్నారు. మిలియనీర్లను బ్రాండ్ అంబాసిడర్లుగా చేయటం కాదనీ రైతుల సమస్యలు పరిష్కరించాలన్నారు. ప్రజలు కోరుకునేది బంగారు తెలంగాణ కాదని బతుకునిచ్చే తెలంగాణ అని అన్నారు. కార్యక్రమంలో గుజ్జ కృష్ణ, శారద, దుర్గయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు.