ఆర్‌బీఐలో భారీగా కొలువులు.. ప్రారంభ జీతమే రూ.45వేలు.. | RBI Assistant Recruitment 2022: Vacancies Notified For 950 Posts | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐలో భారీగా కొలువులు.. ప్రారంభ జీతమే రూ.45వేలు..

Published Thu, Feb 24 2022 8:18 AM | Last Updated on Thu, Feb 24 2022 12:04 PM

RBI Assistant Recruitment 2022: Vacancies Notified For 950 Posts - Sakshi

బ్యాచిలర్‌ డిగ్రీ పూర్తిచేసుకొని.. బ్యాంక్‌ కొలువుల కోసం ఎదురు చూస్తున్న యువత కోసం దేశ అత్యున్నత బ్యాంక్‌.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) ప్రకటన విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 950 అసిస్టెంట్స్‌ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఎల్‌పీజీ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాలి.

మొత్తం పోస్టుల సంఖ్య: 950. వీటిలో హైదరాబాద్‌ కార్యాలయానికి సంబంధించిన ఖాళీలు 40, ముంబయి కార్యాలయంలో 128 ఖాళీలు, చండీగఢ్‌ కార్యాలయంలో 78 ఖాళీలు, కాన్పూర్‌ అండ్‌ లక్నో కార్యాలయంలో 131 పోస్టులు, నాగ్‌పూర్‌ 56 ఖాళీలు, న్యూఢిల్లీలో 75 ఖాళీలు తదితరాలు ఉన్నాయి.

క్లరికల్‌ స్థాయి పోస్టు
ఆర్‌బీఐ అసిస్టెంట్‌.. అనేది క్లరికల్‌ స్థాయి పోస్ట్‌. ఆయా రాష్ట్ర రాజధానులలో ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో వివిధ రకాల బాధ్యతలను వీరు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇందులో రసీదుల సేకరణ, లెడ్జర్‌ నిర్వాహణ, బ్యాలెన్స్‌ ట్యాలీ తదితర పనులను చేస్తారు. అంతేకాకుండా డేటాఎంట్రీ, రోజువారీ లావాదేవీల నమోదు, వచ్చిన ఈ–మెయిల్స్‌కు రిప్లై ఇవ్వడం, కరెన్సీ ఇష్యూ అండ్‌ సర్క్యులేషన్, వెరిఫికేషన్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ డాక్యుమెంట్స్, గవర్నమెంట్స్‌ ట్రెజరీ పనులకు హాజరుకావడం, ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ... టీం వర్క్‌గా విధులను నిర్వహించాల్సి ఉంటుంది.

అర్హతలు
ఆర్‌బీఐ అసిస్టెంట్‌పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు డిగ్రీ పాసైతే సరిపోతుంది. దీంతోపాటు కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అలాగే సంబంధిత రాష్ట్ర /కేంద్రపాలిత ప్రాంత భాషలో ప్రావీణ్యం తప్పనిసరి.

వయసు: ఫిబ్రవరి 1, 2022 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనాలు
ఆర్‌బీఐ అసిస్టెంట్స్‌కు మూల వేతనం రూ.20,700 వరకూ అందుతుంది. దీంతోపాటు హెచ్‌ఆర్‌ఏ, డీఏ, సీసీఏ, ట్రాన్స్‌పోర్ట్‌ తదితర అలవెన్సులను అదనంగా పొందవచ్చు. దీంతో ప్రారంభం నుంచే నెలకు రూ.45వేల వరకూ అందుకునే అవకాశం ఉంటుంది. మూడేళ్ల అనుభవం తర్వాత శాఖాపరమైన పరీక్షల ద్వారా పదోన్నతులు పొందొచ్చు.

చదవండి: (రష్యా ఉక్రెయిన్‌ ఉద్రిక్తతల ప్రభావం మనపై ఎంత?)

ఎంపిక ప్రక్రియ
ఆర్‌బీఐ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి మూడు దశల ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్టుల ద్వారా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్‌ ఆన్‌లైన్‌లో ఉంటాయి. ప్రిలిమ్స్‌లో ప్రతిభ చూపిన వారిని షార్ట్‌లిస్ట్‌ చేసి.. మెయిన్స్‌ నిర్వహించారు. ఈ దశను దాటితే లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ నిర్వహిస్తారు. మెయిన్‌లో సాధించిన మెరిట్‌ ప్రకారం తుది ఎంపిక చేసి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు.

ప్రిలిమ్స్‌ పరీక్ష ఇలా
ఈ పరీక్షను ఆబ్జెక్టివ్‌ పద్దతిలో నిర్వహిస్తారు. మూడు విభాగాల నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. ఇందులో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌–30 ప్రశ్నలకు 30 మార్కులు, న్యూమరికల్‌ ఎబిలిటీ–35 ప్రశ్నలకు 35 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ 35 ప్రశ్నలకు 35 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో నెగిటివ్‌ మార్కింగ్‌ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గో వంతు మార్కులను కోత విధిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలు.

మెయిన్‌ ఎగ్జామ్‌
ఈ పరీక్షలో ఐదు విభాగాల నుంచి 200 మార్కులకు 200 ప్రశ్నలుంటాయి. రీజనింగ్‌–40, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌–40, న్యూమరికల్‌ ఎబిలిటీ–40, జనరల్‌ అవేర్‌నెస్‌–40, టెస్ట్‌ కంప్యూటర్‌ నాలెడ్జ్‌ల నుంచి 40 చొప్పున ప్రశ్నలను అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కును కేటాయిస్తారు. పరీక్ష సమయం 135 నిమిషాలు.

ఎల్‌పీటీ
మెయిన్స్‌ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌ (ఎల్‌పీటీ) రాయాల్సి ఉంటుంది. పరీక్ష సంబంధిత రాష్ట్రంలోని అధికారిక భాషలో నిర్వహిస్తారు. స్థానిక భాషలో ప్రావీణ్యంలేని అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అనర్హులు.

సిలబస్‌ విశ్లేషణ
రీజనింగ్‌: పజిల్‌– వెన్‌డయగ్రమ్, అనాలజీ, కోడింగ్‌–డీకోడింగ్, వెర్బల్‌ రీజనింగ్, సిరీస్, వర్డ్‌ ఫార్మేషన్, డైరెక్షన్‌ అండ్‌ డిస్టెన్స్, బ్లడ్‌ రిలేషన్, నాన్‌–వెర్బల్‌ రీజనింగ్, సిలోజిం తదితర టాపిక్స్‌ ఉంటాయి. 

న్యూమరికల్‌ ఎబిలిటీ: డేటా ఇంటర్‌ప్రిటేషన్, నంబర్‌ సిరీస్, సగటులు, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, సిప్లిఫికేషన్, పర్సంటేజెస్, రేషియో అండ్‌ ప్రపోర్షన్, టైమ్‌ అండ్‌ వర్క్, ప్రాబ్లమ్‌ ఆన్‌ ఏజెస్, మెన్సురేషన్,స్పీడ్,డిస్టెన్స్‌ అండ్‌ టైమ్,ఎస్‌ఐ అండ్‌ సీఐ, జామెట్రీ నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. 

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌: రీడింగ్‌ కాంప్రహెన్షన్, ఇడియమ్స్, స్పెల్లింగ్‌ ఎర్రర్, ఎర్రర్‌ డైరెక్షన్, సినోనిమ్స్‌ అండ్‌ ఆంటోనిమ్స్, వన్‌ వర్డ్‌ సబ్‌స్టిట్యూషన్, సెంటెన్స్‌ కరెక్షన్, ఫిల్‌ ఇన్‌ ద బ్లాంక్స్‌

జనరల్‌ అవేర్‌నెస్‌: హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, స్టాటిక్‌ జనరల్‌ నాలెడ్జ్, కరెంట్‌ అఫైర్స్, సైన్స్, స్పొర్ట్స్, ఇంపార్టెంట్‌ స్కీమ్స్, పీపుల్‌ ఇన్‌ న్యూస్, అవార్డ్స్, బ్యాంకింగ్‌ అవేర్‌నెస్‌

కంప్యూటర్‌ నాలెడ్జ్‌: ఎంఎస్‌ ఆఫీస్, ఆపరేటింగ్‌ సిస్టమ్, డేటాబేస్‌ మేనేజ్‌మెంట్, సిస్టమ్, నెట్‌వర్కింగ్, సెక్యూరిటీ, ఇంటర్నెట్‌ అండ్‌ వెబ్‌

ముఖ్యమైన సమాచారం
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 08, 2022
ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 2022 మార్చి 26–27
మెయిన్‌ పరీక్ష: మే, 2022లో ఉంటుంది. 
వెబ్‌సైట్‌: www.rbi.org.in

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement