Assistant post exam
-
ఆర్బీఐలో భారీగా కొలువులు.. ప్రారంభ జీతమే రూ.45వేలు..
బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేసుకొని.. బ్యాంక్ కొలువుల కోసం ఎదురు చూస్తున్న యువత కోసం దేశ అత్యున్నత బ్యాంక్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) ప్రకటన విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 950 అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఎల్పీజీ పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను పూర్తిచేయాలి. మొత్తం పోస్టుల సంఖ్య: 950. వీటిలో హైదరాబాద్ కార్యాలయానికి సంబంధించిన ఖాళీలు 40, ముంబయి కార్యాలయంలో 128 ఖాళీలు, చండీగఢ్ కార్యాలయంలో 78 ఖాళీలు, కాన్పూర్ అండ్ లక్నో కార్యాలయంలో 131 పోస్టులు, నాగ్‌పూర్ 56 ఖాళీలు, న్యూఢిల్లీలో 75 ఖాళీలు తదితరాలు ఉన్నాయి. క్లరికల్ స్థాయి పోస్టు ఆర్బీఐ అసిస్టెంట్.. అనేది క్లరికల్ స్థాయి పోస్ట్. ఆయా రాష్ట్ర రాజధానులలో ఉన్న ప్రాంతీయ కార్యాలయాల్లో వివిధ రకాల బాధ్యతలను వీరు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇందులో రసీదుల సేకరణ, లెడ్జర్ నిర్వాహణ, బ్యాలెన్స్ ట్యాలీ తదితర పనులను చేస్తారు. అంతేకాకుండా డేటాఎంట్రీ, రోజువారీ లావాదేవీల నమోదు, వచ్చిన ఈ–మెయిల్స్‌కు రిప్లై ఇవ్వడం, కరెన్సీ ఇష్యూ అండ్ సర్క్యులేషన్, వెరిఫికేషన్ ఆఫ్ బ్యాంకింగ్ డాక్యుమెంట్స్, గవర్నమెంట్స్ ట్రెజరీ పనులకు హాజరుకావడం, ఉన్నతాధికారులతో సమన్వయం చేసుకుంటూ... టీం వర్క్‌గా విధులను నిర్వహించాల్సి ఉంటుంది. అర్హతలు ఆర్బీఐ అసిస్టెంట్పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు డిగ్రీ పాసైతే సరిపోతుంది. దీంతోపాటు కంప్యూటర్ అప్లికేషన్స్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. అలాగే సంబంధిత రాష్ట్ర /కేంద్రపాలిత ప్రాంత భాషలో ప్రావీణ్యం తప్పనిసరి. ►వయసు: ఫిబ్రవరి 1, 2022 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనాలు ఆర్బీఐ అసిస్టెంట్స్‌కు మూల వేతనం రూ.20,700 వరకూ అందుతుంది. దీంతోపాటు హెచ్ఆర్ఏ, డీఏ, సీసీఏ, ట్రాన్స్పోర్ట్ తదితర అలవెన్సులను అదనంగా పొందవచ్చు. దీంతో ప్రారంభం నుంచే నెలకు రూ.45వేల వరకూ అందుకునే అవకాశం ఉంటుంది. మూడేళ్ల అనుభవం తర్వాత శాఖాపరమైన పరీక్షల ద్వారా పదోన్నతులు పొందొచ్చు. చదవండి: (రష్యా ఉక్రెయిన్ ఉద్రిక్తతల ప్రభావం మనపై ఎంత?) ఎంపిక ప్రక్రియ ఆర్బీఐ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి మూడు దశల ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్టుల ద్వారా అభ్యర్థుల ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్, మెయిన్స్ ఆన్లైన్లో ఉంటాయి. ప్రిలిమ్స్‌లో ప్రతిభ చూపిన వారిని షార్ట్‌లిస్ట్ చేసి.. మెయిన్స్ నిర్వహించారు. ఈ దశను దాటితే లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నిర్వహిస్తారు. మెయిన్‌లో సాధించిన మెరిట్ ప్రకారం తుది ఎంపిక చేసి ఉద్యోగాల్లోకి తీసుకుంటారు. ప్రిలిమ్స్ పరీక్ష ఇలా ఈ పరీక్షను ఆబ్జెక్టివ్ పద్దతిలో నిర్వహిస్తారు. మూడు విభాగాల నుంచి 100 మార్కులకు 100 ప్రశ్నలుంటాయి. ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్–30 ప్రశ్నలకు 30 మార్కులు, న్యూమరికల్ ఎబిలిటీ–35 ప్రశ్నలకు 35 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలకు 35 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాల్గో వంతు మార్కులను కోత విధిస్తారు. పరీక్ష సమయం 60 నిమిషాలు. మెయిన్ ఎగ్జామ్ ఈ పరీక్షలో ఐదు విభాగాల నుంచి 200 మార్కులకు 200 ప్రశ్నలుంటాయి. రీజనింగ్–40, ఇంగ్లిష్ లాంగ్వేజ్–40, న్యూమరికల్ ఎబిలిటీ–40, జనరల్ అవేర్నెస్–40, టెస్ట్ కంప్యూటర్ నాలెడ్జ్‌ల నుంచి 40 చొప్పున ప్రశ్నలను అడుగుతారు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కును కేటాయిస్తారు. పరీక్ష సమయం 135 నిమిషాలు. ఎల్పీటీ మెయిన్స్ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (ఎల్పీటీ) రాయాల్సి ఉంటుంది. పరీక్ష సంబంధిత రాష్ట్రంలోని అధికారిక భాషలో నిర్వహిస్తారు. స్థానిక భాషలో ప్రావీణ్యంలేని అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అనర్హులు. సిలబస్ విశ్లేషణ ►రీజనింగ్: పజిల్– వెన్డయగ్రమ్, అనాలజీ, కోడింగ్–డీకోడింగ్, వెర్బల్ రీజనింగ్, సిరీస్, వర్డ్ ఫార్మేషన్, డైరెక్షన్ అండ్ డిస్టెన్స్, బ్లడ్ రిలేషన్, నాన్–వెర్బల్ రీజనింగ్, సిలోజిం తదితర టాపిక్స్ ఉంటాయి. ►న్యూమరికల్ ఎబిలిటీ: డేటా ఇంటర్‌ప్రిటేషన్, నంబర్ సిరీస్, సగటులు, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా, సిప్లిఫికేషన్, పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, టైమ్ అండ్ వర్క్, ప్రాబ్లమ్ ఆన్ ఏజెస్, మెన్సురేషన్,స్పీడ్,డిస్టెన్స్ అండ్ టైమ్,ఎస్ఐ అండ్ సీఐ, జామెట్రీ నుంచి ప్రశ్నలు ఎదురవుతాయి. ►ఇంగ్లిష్ లాంగ్వేజ్: రీడింగ్ కాంప్రహెన్షన్, ఇడియమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్, ఎర్రర్ డైరెక్షన్, సినోనిమ్స్ అండ్ ఆంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సెంటెన్స్ కరెక్షన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ►జనరల్ అవేర్నెస్: హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, స్టాటిక్ జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, సైన్స్, స్పొర్ట్స్, ఇంపార్టెంట్ స్కీమ్స్, పీపుల్ ఇన్ న్యూస్, అవార్డ్స్, బ్యాంకింగ్ అవేర్నెస్ ►కంప్యూటర్ నాలెడ్జ్: ఎంఎస్ ఆఫీస్, ఆపరేటింగ్ సిస్టమ్, డేటాబేస్ మేనేజ్మెంట్, సిస్టమ్, నెట్వర్కింగ్, సెక్యూరిటీ, ఇంటర్నెట్ అండ్ వెబ్ ముఖ్యమైన సమాచారం ►దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ►దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 08, 2022 ►ప్రిలిమినరీ పరీక్ష తేదీలు: 2022 మార్చి 26–27 ►మెయిన్ పరీక్ష: మే, 2022లో ఉంటుంది. ►వెబ్సైట్: www.rbi.org.in -
ఆర్బీఐ అసిస్టెంట్స్ పరీక్ష: టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగం
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: ఆర్బీఐ అసిస్టెంట్స్ పరీక్షలో టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగంలో అధిక మార్కులు సాధించడం ఎలా? - ఆర్.ప్రసన్న లక్ష్మీ, అమీర్‌పేట రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అసిస్టెంట్స్ పోస్టుల పరీక్షలో టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగం నుంచి 40 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 1/4 వంతు మార్కుల చొప్పున కోత విధిస్తారు. ఇంగ్లిష్‌లో అధిక మార్కులు సాధించడానికి ప్రణాళికాబద్దంగా చదవాలి. రోజూ తప్పనిసరిగా ఆంగ్ల దినపత్రికలు, కొన్ని బుక్స్, మ్యాగజీన్స్ చదవాలి. ఇవి కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్ లాంటివాటికి కూడా ఉపకరిస్తాయి. చదివేటప్పుడే వాక్య నిర్మాణం, సెంటెన్స్ ఫ్రేమింగ్, స్పెల్లింగ్‌లను గమనించాలి. ప్రామాణిక డిక్షనరీ సాయంతో క్లిష్టమైన పదాలకు అర్థాలు తెలుసుకోవాలి. వాటికి యాంటోనిమ్స్, సినోనిమ్స్ రాసుకోవాలి. అదేవిధంగా రేడియో, టీవీల్లో వచ్చే ఇంగ్లిష్ న్యూస్ వినాలి. ఇలా చేయడం వల్ల భాషా నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. భాషపై పట్టు సాధిస్తే తప్పులను గుర్తించడం తేలికవుతుంది. టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో సినానిమ్స్, యాంటోనిమ్స్, టెన్సెస్, వాయిసెస్, వెర్బ్స్, ప్రిపోజిషన్స్, సెంటెన్స్ కంప్లీషన్, కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, సబ్స్టిట్యూషన్ ఎక్సర్‌సెజైస్, క్లోజ్ టెస్ట్ మొదలైనవి ఉంటాయి. పరీక్ష కోణంలో ఇవన్నీ ముఖ్యమైన అంశాలు. వీటిపై పట్టు సాధించడానికి ఏదైనా ప్రామాణిక గ్రామర్బుక్ తీసుకొని వాటిలోని అంశాలను రోజూ ప్రాక్టీస్ చేయాలి. పరీక్ష తేదీనాటికి వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ టెస్టులు, పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. దీని వల్ల వేగం కూడా అలవడుతుంది. పరీక్ష హాల్లో ఇంగ్లిష్ విభాగానికి చెందిన ప్రశ్నలను వేగంగా చేయడం వల్ల నిర్దేశిత సమయంలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలను గుర్తించగలుగుతారు. ప్రిపరేషన్ టిప్స్: ఊ ముందుగా స్టడీ ప్లాన్ రూపొందించుకోవాలి. - సబ్జెక్టులోని ప్రతి విభాగాన్ని రోజూ సాధన చేయాలి. దీనివల్ల పరీక్ష నాటికి అన్ని అంశాలపై పట్టు లభిస్తుంది. - నిర్దేశిత సమయంలో సమాధానాలు ఇవ్వగలిగేలా ప్రాక్టీస్ చేయాలి. - వీలైనన్ని పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. దీనివల్ల ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో తెలుస్తుంది. దానికనుగుణంగా ప్రిపరేషన్ శైలిని మలుచుకోవాలి. - పరీక్ష ఆన్లైన్లో కాబట్టి పరీక్ష తేదీనాటికి వీలైనన్ని మాక్ టెస్టులు రాయాలి. - అంతగా పట్టు లేని అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి. ఇన్పుట్స్: కె. లలితాబాయి, అసోసియేట్ ప్రొఫెసర్ , హైదరాబాద్ స్కాలర్షిప్స్, జాబ్స్ అలర్ట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెరిట్ స్కాలర్షిప్ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ మెరిట్ స్కాలర్షిప్ పథకం- 2014’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 3000. ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.2000 చొప్పున రెండేళ్ల పాటు అందిస్తారు. విభాగాలు: లైఫ్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, ఎర్త్ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్, సోషల్ సెన్సైస్, కామర్స్, లాంగ్వేజెస్. అర్హత: డిగ్రీలో యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్/అటానమస్ కాలేజ్ స్థాయిలో మొదటి, రెండో ర్యాంకులు సాధించినవారు అర్హులు. నాన్ ప్రొఫెషనల్ కోర్సుల్లో పీజీ చదువుతున్న వారికే ఈ స్కాలర్షిప్లు వర్తిస్తాయి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబరు 15 వెబ్సైట్: www.ugc.ac.in విదేశీ విద్య యూఎస్ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్లలోని విశ్వవిద్యాలయాల్లో మెడిసిన్/ఇంజ నీరింగ్/ఫార్మసీ/నర్సింగ్/ప్యూర్ సెన్సైస్/హుమానిటీస్/ సోషల్ స్టడీస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్న ఎస్సీ విద్యార్థులకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం కోసం తెలంగాణ ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ దరఖాస్తులను కోరుతోంది. అర్హతలు: షెడ్యూల్డ్ కులాలకు చెందిన తెలంగాణ రాష్ర్టం వారే దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం కుటుంబ ఆదాయం సంవత్సరానికి రెండు లక్షలకు మించరాదు. విదేశాల్లో పీజీ కోర్సులను కొనసాగించడానికి గ్రాడ్యుయేషన్‌లో, పీహెచ్‌డీని కొనసాగించడానికి పీజీలో ప్రథమ శ్రేణి మార్కులు ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 5 వెబ్సైట్: www.epass.cgg.gov.in బీఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కర్ణాటక సర్కిల్లో జూనియర్ టెలికమ్ ఆఫీసర్ (స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పోస్టుల వివరాలు.. జూనియర్ టెలికమ్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 13 విభాగాలు: టెలికమ్, ఎలక్ట్రికల్. అర్హత: టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్/ రేడియో/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రికల్/ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. వయసు: 30 ఏళ్లకు మించకూడదు. ఎంపిక: రాత పరీక్ష ద్వారా. దరఖాస్తు: వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: సెప్టెంబరు 5 వెబ్సైట్: www.karnataka.bsnl.co.in జనరల్ నాలెడ్జ్