ఆర్‌బీఐ అసిస్టెంట్స్ పరీక్ష: టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగం | RBI assistant exam: Which questions to Test of english language part? | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ అసిస్టెంట్స్ పరీక్ష: టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగం

Published Sat, Aug 2 2014 1:12 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM

ఆర్‌బీఐ అసిస్టెంట్స్ పరీక్ష: టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగం

ఆర్‌బీఐ అసిస్టెంట్స్ పరీక్ష: టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగం

కాంపిటీటివ్ కౌన్సెలింగ్: ఆర్‌బీఐ అసిస్టెంట్స్ పరీక్షలో టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగంలో అధిక మార్కులు సాధించడం ఎలా?
 - ఆర్.ప్రసన్న లక్ష్మీ, అమీర్‌పేట
 
 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అసిస్టెంట్స్ పోస్టుల పరీక్షలో టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగం నుంచి 40 ప్రశ్నలు వస్తాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి 1/4 వంతు మార్కుల చొప్పున కోత విధిస్తారు. ఇంగ్లిష్‌లో అధిక మార్కులు సాధించడానికి ప్రణాళికాబద్దంగా చదవాలి. రోజూ తప్పనిసరిగా ఆంగ్ల దినపత్రికలు, కొన్ని బుక్స్, మ్యాగజీన్స్ చదవాలి. ఇవి కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్‌నెస్ లాంటివాటికి కూడా ఉపకరిస్తాయి. చదివేటప్పుడే వాక్య నిర్మాణం, సెంటెన్స్ ఫ్రేమింగ్, స్పెల్లింగ్‌లను గమనించాలి. ప్రామాణిక డిక్షనరీ సాయంతో క్లిష్టమైన పదాలకు అర్థాలు తెలుసుకోవాలి. వాటికి యాంటోనిమ్స్, సినోనిమ్స్ రాసుకోవాలి. అదేవిధంగా రేడియో, టీవీల్లో వచ్చే ఇంగ్లిష్ న్యూస్ వినాలి. ఇలా చేయడం వల్ల భాషా నైపుణ్యాలు వృద్ధి చెందుతాయి. భాషపై పట్టు సాధిస్తే తప్పులను గుర్తించడం తేలికవుతుంది.
 
 టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లో సినానిమ్స్, యాంటోనిమ్స్, టెన్సెస్, వాయిసెస్, వెర్బ్స్, ప్రిపోజిషన్స్, సెంటెన్స్ కంప్లీషన్, కాంప్రహెన్షన్, ఎర్రర్ స్పాటింగ్, సబ్‌స్టిట్యూషన్ ఎక్సర్‌సెజైస్, క్లోజ్ టెస్ట్ మొదలైనవి ఉంటాయి. పరీక్ష కోణంలో ఇవన్నీ ముఖ్యమైన అంశాలు. వీటిపై పట్టు సాధించడానికి ఏదైనా ప్రామాణిక గ్రామర్‌బుక్ తీసుకొని వాటిలోని అంశాలను రోజూ ప్రాక్టీస్ చేయాలి. పరీక్ష తేదీనాటికి వీలైనన్ని ఎక్కువ ప్రాక్టీస్ టెస్టులు, పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. దీని వల్ల వేగం కూడా అలవడుతుంది. పరీక్ష హాల్లో ఇంగ్లిష్ విభాగానికి చెందిన ప్రశ్నలను వేగంగా చేయడం వల్ల నిర్దేశిత సమయంలో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలను గుర్తించగలుగుతారు.
 
 ప్రిపరేషన్ టిప్స్: ఊ ముందుగా స్టడీ ప్లాన్ రూపొందించుకోవాలి.

 -    సబ్జెక్టులోని ప్రతి విభాగాన్ని రోజూ సాధన చేయాలి. దీనివల్ల పరీక్ష నాటికి అన్ని అంశాలపై పట్టు లభిస్తుంది.
 -    నిర్దేశిత సమయంలో సమాధానాలు ఇవ్వగలిగేలా ప్రాక్టీస్ చేయాలి.
 -    వీలైనన్ని పాత ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. దీనివల్ల ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో తెలుస్తుంది. దానికనుగుణంగా ప్రిపరేషన్ శైలిని మలుచుకోవాలి.
 -    పరీక్ష ఆన్‌లైన్‌లో కాబట్టి పరీక్ష తేదీనాటికి వీలైనన్ని మాక్ టెస్టులు రాయాలి.
 -    అంతగా పట్టు లేని అంశాలపై ఎక్కువగా దృష్టి సారించాలి.
 ఇన్‌పుట్స్: కె. లలితాబాయి, అసోసియేట్ ప్రొఫెసర్ , హైదరాబాద్
 
స్కాలర్‌షిప్స్, జాబ్స్ అలర్ట్స్
 పోస్ట్ గ్రాడ్యుయేట్ మెరిట్ స్కాలర్‌షిప్
 యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ‘పోస్ట్ గ్రాడ్యుయేట్ మెరిట్ స్కాలర్‌షిప్ పథకం- 2014’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
 స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 3000.
 ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.2000 చొప్పున రెండేళ్ల పాటు అందిస్తారు.
 విభాగాలు: లైఫ్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, కెమికల్ సెన్సైస్, ఎర్త్ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్, సోషల్  సెన్సైస్, కామర్స్, లాంగ్వేజెస్.
 అర్హత: డిగ్రీలో యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్/అటానమస్ కాలేజ్ స్థాయిలో మొదటి, రెండో ర్యాంకులు సాధించినవారు అర్హులు. నాన్ ప్రొఫెషనల్ కోర్సుల్లో పీజీ చదువుతున్న వారికే ఈ స్కాలర్‌షిప్‌లు వర్తిస్తాయి.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబరు 15
 వెబ్‌సైట్: www.ugc.ac.in
 
 విదేశీ విద్య
 యూఎస్‌ఏ, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్‌లలోని విశ్వవిద్యాలయాల్లో మెడిసిన్/ఇంజ నీరింగ్/ఫార్మసీ/నర్సింగ్/ప్యూర్ సెన్సైస్/హుమానిటీస్/ సోషల్ స్టడీస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సుల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్న ఎస్సీ విద్యార్థులకు రూ.10 లక్షల ఆర్థిక సహాయం కోసం తెలంగాణ ప్రభుత్వ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ దరఖాస్తులను కోరుతోంది.
 
 
 అర్హతలు: షెడ్యూల్డ్ కులాలకు చెందిన తెలంగాణ రాష్ర్టం వారే దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం కుటుంబ ఆదాయం సంవత్సరానికి రెండు లక్షలకు మించరాదు. విదేశాల్లో పీజీ కోర్సులను కొనసాగించడానికి గ్రాడ్యుయేషన్‌లో, పీహెచ్‌డీని కొనసాగించడానికి పీజీలో ప్రథమ  శ్రేణి మార్కులు ఉండాలి.
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 5
 వెబ్‌సైట్: www.epass.cgg.gov.in
 
 బీఎస్‌ఎన్‌ఎల్
 భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) కర్ణాటక సర్కిల్‌లో జూనియర్ టెలికమ్ ఆఫీసర్ (స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
 
 పోస్టుల వివరాలు..
 జూనియర్ టెలికమ్ ఆఫీసర్
 పోస్టుల సంఖ్య: 13
 విభాగాలు: టెలికమ్, ఎలక్ట్రికల్.
 అర్హత: టెలికమ్యూనికేషన్/ ఎలక్ట్రానిక్స్/ రేడియో/ కంప్యూటర్ సైన్స్/ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ/ ఎలక్ట్రికల్/ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్‌లో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి.
 వయసు: 30 ఏళ్లకు మించకూడదు.
 ఎంపిక: రాత పరీక్ష ద్వారా.
 దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
 దరఖాస్తుల స్వీకరణకు చివరితేది: సెప్టెంబరు 5
 వెబ్‌సైట్: www.karnataka.bsnl.co.in
 
 జనరల్ నాలెడ్జ్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement