ఆర్‌బీఐ అసిస్టెంట్స్ పరీక్షలో జనరల్ అవేర్‌నెస్..?
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: ఆర్‌బీఐ అసిస్టెంట్స్ పరీక్షలో జనరల్ అవేర్‌నెస్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి?
- శ్రీనివాస్‌గౌడ్, రాంనగర్
భారతీయ రిజర్వ్ బ్యాంక్ అసిస్టెంట్ పరీక్షలో జనరల్ అవేర్‌నెస్ నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు. 2012 ఏప్రిల్‌లో నిర్వహించిన ఆర్‌బీఐ అసిస్టెంట్ పరీక్షలోని జనరల్ అవేర్‌నెస్ విభాగాన్ని పరిశీలిస్తే కరెంట్ అఫైర్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. వర్తమాన సంఘటనల నుంచి 20 ప్రశ్నలు వచ్చాయి. స్టాక్ జీకే నుంచి 8 ప్రశ్నలు, బ్యాంకింగ్/ఎకానమీల నుంచి 12 ప్రశ్నలు అడిగారు.
అభ్యర్థులు ఈ విభాగాలను ప్రత్యేక దృష్టితో చదవాలి. కరెంట్ అఫైర్స్‌లో జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు, దేశాల మధ్య జరిగిన ఒప్పందాలు, విదేశాలతో భారత్ సంబంధాలు, దేశాధ్యక్షులు, ప్రధాన మంత్రులు, రాష్ట్రాలు - ముఖ్యమంత్రులు, నూతన గవర్నర్లు, కేంద్ర బడ్జెట్, రైల్వే బడ్జెట్, ఆర్థిక సర్వే, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, ఇటీవల జరిగిన క్రీడలు - పోటీలు - వాటి విజేతలు, అంతర్జాతీయ సదస్సులు, అంతరిక్ష పరిశోధనలు, రక్షణ రంగం, శాస్త్ర సాంకేతిక రంగంలో జరిగిన పరిణామాలు, అణ్వస్త్ర రంగం, వార్తల్లో వ్యక్తులు, నియామకాలు, ప్రదేశాలు, ప్రభుత్వ పథకాల గురించి అధ్యయనం చేయాలి.
బ్యాంకింగ్‌లో ఆర్‌బీఐ - దాని విధులు, గవర్నర్, డిప్యూటీ గవర్నర్, పరపతి విధానం, పాలసీ రేట్లు, కమిటీలు - వాటి చైర్మన్లు, కమిటీల సిఫార్సులు, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, కరెన్సీ, ప్లాస్టిక్ కరెన్సీ, బ్యాంకుల రుణాలు, నాబార్డు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, బ్యాంకింగ్ రంగంలో తాజా పరిణామాలు, బ్యాంకింగ్ పదజాలం, డిపాజిట్లు - వాటి రకాలు, చెక్కులు, ఏటీఎంలు, నో యువర్ కస్టమర్ విధానాలు మొదలైనవాటిని బాగా చదవాలి. స్టాక్ జీకే నుంచి అబ్రివియేషన్స్, దేశాలు - అవి ఉన్న ఖండాలు/భౌగోళిక ప్రాంతాలు, దేశాలు - రాజధానులు- కరెన్సీలు - పార్లమెంట్లు, క్రీడలకు సంబంధించిన ట్రోఫీలు, క్రీడా పదాలు, పుస్తకాలు - రచయితలు, ముఖ్యమైన దినాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు - వాటి రాజధానులు, అభయారణ్యాలు - అవి ఉన్న రాష్ట్రాలు మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి.
- ఇన్‌పుట్స్: ఎన్. విజయేందర్ రెడ్డి,
సీనియర్ ఫ్యాకల్టీ
మహీంద్రా ఎకోల్ సెంట్రల్ తొలి బ్యాచ్ ప్రారంభం
ఎడ్యూన్యూస్: భవిష్యత్తు ఇంజనీర్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, పరిశ్రమ అవసరాలకు ధీటుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని టెక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, మహీంద్రా ఎకోల్ సెంట్రల్ (ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్) చైర్మన్ వినీత్ నాయర్ పేర్కొన్నారు. మహీంద్రా సంస్థ, ఫ్రాన్స్‌కు చెందిన ఎకోల్ సెంట్రల్ ప్యారిస్, జేఎన్‌టీయూ -హైదరాబాద్ సంయుక్త ఒప్పందంతో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్ మహీంద్రా ఎకోల్ సెంట్రల్‌లో సోమవారం నుంచి తొలి బ్యాచ్ తరగతులు మొదలయ్యాయి. ప్రారంభ కార్యక్రమంలో జేఎన్‌టీయూ- హైదరాబాద్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రామేశ్వర్ రావు, ఎకోల్ సెంట్రల్ ప్యారిస్ ఇంటర్నేషనల్ అఫైర్స్ డీన్ క్రిస్టోఫర్ క్రిప్స్, భారత్‌లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ ఎరిక్ లవెర్టు, టెక్ మహీంద్రా సీఈఓ సి.పి గుర్గానీ, యంగ్ సీఈఓ రాహుల్ భూమన్ తదితరులు పాల్గొన్నారు.
జనరల్ నాలెడ్జ్ : ప్రముఖ వ్యక్తులు
కౌటిల్యుడు విష్ణుగుప్తుడు, చాణక్యుడు అనే పేర్లు కలిగిన కౌటిల్యుడు చంద్రగుప్త
మౌర్యుని ప్రధానమంత్రి. అర్థశాస్త్రాన్ని రచించాడు.
మెగస్తనీస్ చంద్రగుప్త మౌర్యుని సమకాలికుడు. ఇండికా అనే గ్రంథ రచయిత.
చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడు. సాండ్రకొట్టస్ బిరుదు ఉంది.
జైనమతాన్ని అవలంబించాడు.
అశోకుడు దేవానంప్రియ, ప్రియదర్శి అనే బిరుదులు ఉన్నాయి. దేశంలో
- తొలిసారిగా లిఖిత పూర్వక శాసనాలు, స్తంభ శాసనాలు వేయించాడు.
భారత ఆర్థిక వ్యవస్థ ప్రణాళికలు
- ఆర్థిక ప్రణాళిక: ఆర్థిక వ్యవస్థ ఆశయాలను, వనరులను సమస్యలను పరిగణలోకి తీసుకొని నిర్ణీత లక్ష్యాలను నిర్ణీత కాలంలో సాధించే ప్రయత్నమే ‘ఆర్థిక ప్రణాళిక’.
- 1929-30లో సంభవించిన ప్రపంచ ఆర్థిక మాంద్యానికి గురికాకపోవడంతో పాటు రష్యా సాధించిన ప్రణాళికాబద్ధ ప్రగతి భారతదేశాన్ని ప్రభావితం చేసింది.
- భారతదేశంలో కేంద్రమంత్రి మండలి తీర్మానం ద్వారా 1950లో ప్రణాళికా సంఘం ఏర్పాటు చేశారు.
- 1952 సం॥జాతీయాభివృద్ధి మండలిని నెలకొల్పారు.
- భారతదేశ ప్రణాళికా విధానం మౌలికంగా సమగ్రమైన ప్రజాస్వామ్య మిశ్రమ ఆర్థిక వ్యవస్థలోని ప్రణాళికా విధానం.