Current affairs
-
బడ్జెట్ పై ఆశలు వద్దు.. నిర్మలమ్మ క్లారిటీ
-
ఉదయనిధి వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా ఆగని దుమారం
-
కరెంట్ అఫైర్స్‌పై.. సో కూల్ అంటోన్న త్రిష
సాక్షి, హైదరాబాద్: యునిసెఫ్ సంస్థ బాలల హక్కుల రాయబారిగా సినీ నటి త్రిష ఇటీవలే నియమితులయిన విషయం తెలిసిందే. అయితే బ్యాంకు పరీక్షల్లో నవంబర్ నెలకుగానూ కరెంట్ అఫైర్స్‌లో ముఖ్యమైవాటిలో త్రిషకు సంబంధించిన ప్రశ్న కూడా ఉంది. ఇది చూసిన త్రిష కరెంట్ అఫైర్స్‌లో తన గురించి అడిగిన ప్రశ్నకు సంబంధించి ఓ పేపర్ని, దిస్ ఈజ్ సో కూల్ అంటూ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేసింది. దక్షిణ భారత దేశ చలనచిత్ర రంగం నుంచి ఈ గౌరవం దక్కిన తొలి హీరోయిన్ త్రిష కావడం విశేషం. Reference for Bank Examinations of most important current affairs in the month of November 😁 This is soooo cooool 💃 ❤️ pic.twitter.com/GqCCHZlxjs — Trisha Krishnan (@trishtrashers) December 8, 2017 కేరళ ప్రభుత్వం, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంఘమైన యునిసెఫ్ సంస్థ సంయుక్తంగా చిన్నారులకు మీజిల్స్ టీకా ఆవశ్యకతపై యాడ్ ఫిల్మ్ రూపొందించారు. ఈ సందర్భంగా యూనిసెఫ్ తరఫున తమిళనాడు, కేరళ చిన్నారుల హక్కుల రాయబారిగా సినీ నటి త్రిషను నియమించింది. దీని ద్వారా ఆమె బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ, బాలలపై లైంగిక హింస వంటి వాటిపై వ్యతిరేకంగా పోరాడనున్నారు. బాలల విద్య కోసం కృషి చేయనున్నారు. -
కరెంట్ అఫైర్స్
సాహిత్య పురస్కారాలు – విజేతలు కాంపిటీటివ్ గైడెన్స్ వివిధ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ విభాగంలో అవార్డులు అందుకున్నవారు – ఇచ్చే సంస్థలు/వ్యక్తులపై ప్రశ్నలు అడుగుతున్నారు. ఈ నేపథ్యంలో వివిధ అవార్డులు, ఇటీవల కాలంలో వాటిని అందుకున్న విజేతల గురించి తెలుసుకుందాం.. జ్ఞాన్‌పీఠ్ అవార్డ్: మనదేశంలో అత్యున్నత సాహితీ పురస్కారం.. జ్ఞాన్‌పీఠ్. దీన్ని 1965 నుంచి ప్రదానం చేస్తున్నారు. అవార్డ్ గ్రహీతలకు రూ.11 లక్షల నగదు, సరస్వతీదేవి కాంస్య విగ్రహాన్ని అందజేస్తారు. తొలి గ్రహీత మలయాళం రచయిత జి.శంకర కురూప్. 52వ జ్ఞాన్‌పీఠ్ పురస్కారాన్ని భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏప్రిల్ 27న ప్రముఖ బెంగాలీ రచయిత శంఖఘోష్ (2016 సంవత్సరానికి)కు ప్రదానం చేశారు. ఆయన 2011లో పద్మభూషణ్ కూడా అందుకున్నారు. మూర్తీదేవి అవార్డ్: భారతీయ జ్ఞాన్‌పీఠ్ సంస్థ ఈ అవార్డ్‌ను తొలిసారి 1983లో కన్నడ రచయిత సి.కె.నాగరాజరావుకు ప్రదానం చేసింది. అవార్డ్ కింద రూ.నాలుగు లక్షల నగదును అందజేస్తారు. 2016కు ఈ అవార్డును ప్రముఖ మల యాళీ రచయిత, పాత్రికేయుడు ఎం.పీ. వీరేంద్ర కుమార్ అందుకున్నారు. ఆయన రాసిన ‘హైమవత భూవిల్’ అనే పుస్తకానికి అవార్డ్ దక్కింది. ఇది 30వ మూర్తీదేవి అవార్డ్. ఎం.పీ.వీరేంద్రకుమార్ మలయాళం దినపత్రిక మాతృభూమి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడుగా ఉన్నారు. 2015లో ఈ పురస్కారం తెలుగు రచయిత కొలకలూరి ఇనాక్‌కు ‘అనంత జీవనం’ అనే పుస్తకానికి లభించింది.సరస్వతీ సమ్మాన్: కె.కె.బిర్లా ఫౌండేషన్ ఈ అవార్డ్‌ను ఏర్పాటు చేసింది. దీని కింద రూ.15 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు. 1991లో ప్రముఖ హిందీ రచయిత హరివంశరాయ్ బచ్చన్‌కు మొదటిసారి ఈ పురస్కారం దక్కింది. 2016కు ఈ అవార్డ్‌ను ప్రముఖ కొంకణి రచయిత మహాబలేశ్వర్ సెయిల్‌కు మార్చి 9న ప్రకటించారు. ఆయన రాసిన ‘హాథాన్’ అనే నవలకు ఈ పురస్కారం లభించింది. వ్యాస్ సమ్మాన్: కె.కె. బిర్లా ఫౌండేషన్ కేవలం హిందీ రచనలు చేసేవారికి 1991లో వ్యాస్ సమ్మాన్‌ను ఏర్పాటు చేసింది. దీని కింద రూ.3.50 లక్షల నగదు బహుమతిని అందజేస్తారు. వ్యాస్ సమ్మాన్ 2016కు ప్రముఖ హిందీ రచయిత సురేంద్ర వర్మకు లభించింది. ఆయన రాసిన ప్రముఖ నవల ‘కాట్నా షమీకా వృక్షః పద్మ పంఖరి కో ధార్ సే’ పురస్కారం దక్కించుకుంది. ఆయన 26వ వ్యాస్ సమ్మాన్ గ్రహీత. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డ్ సాహిత్య అకాడమీ.. గతేడాది డిసెంబర్ 21న 24 భాషల్లో అవార్డులను ప్రకటించింది. వీటిని ఫిబ్రవరి 22న ప్రదానం చేశారు. నగదు బహుమతి రూ. లక్ష. ‘రజనీ గంధ’ అనే కవితా సంపుటికి తెలుగు రచయిత పాపినేని శివశంకర్‌కు ఈ పురస్కారం లభించింది. ఎన్. విజయేందర్ రెడ్డి జనరల్ అవేర్నెస్ ఫ్యాకల్టీ, హైదరాబాద్ -
కరెంట్ అఫైర్స్
రౌండప్ ఏప్రిల్ 2016 ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ).. గ్రూప్–2 స్క్రీనింగ్ టెస్ట్ ఈనెల 26న జరగనుంది. అదే విధంగా గ్రూప్–1, పంచాయతీ సెక్రటరీ తదితర పోస్టుల ఔత్సాహికులు ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) వివిధ పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. వీటితోపాటు బ్యాంక్స్, యూపీఎస్సీ, ఎస్ఎస్సీ పరీక్షలు రాసే లక్షల మంది అభ్యర్థులకు ఉపయోగపడేలా 2016, ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు కరెంట్ అఫైర్స్ (అంతర్జాతీయం) అందిస్తున్నాం. మిగతా కరెంట్ అఫైర్స్ (సైన్స్ అండ్ టెక్నాలజీ, అవార్డులు, వార్తల్లో వ్యక్తులు, క్రీడలు) తదుపరి సంచికల్లో అందిస్తాం. గ్రీన్హౌస్ ఉద్గారాల తగ్గింపునకు ఉద్దేశించిన పారిస్ ఒప్పందంపై న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఏప్రిల్ 22న భారత్ సంతకం చేసింది. ఈ ఒప్పందంపై భారత్‌తో పాటు 171 దేశాలు సంతకాలు చేశాయి. ఒక అంతర్జాతీయ ఒప్పందంపై ఒకే రోజు అత్యధిక దేశాలు సంతకాలు చేయడం ఇదే తొలిసారి. టిబెట్ ప్రధానిగా న్యాయ కోవిదుడు, రాజకీయవేత్త లోబ్సంగ్ సాంగే ఏప్రిల్ 27న తిరిగి ఎన్నికయ్యారు. ధర్మశాల నుంచి పాలన సాగుతున్న టిబెట్‌కు సాంగే తొలిసారి 2011 ఆగస్టులో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. భారత ప్రాంతీయ దిక్సూచి వ్యవస్థ కోసం ఏడో ఐఆర్ఎన్ఎస్ఎస్ (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్)–1జి ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఏప్రిల్ 28న విజయవంతంగా ప్రయోగించింది. 1,425 కిలోల బరువున్న ఈ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ–సీ33 ద్వారా భూమికి దగ్గరగా (పెరిజీ) 284 కిలోమీటర్లు, దూరంగా (అపోజీ) 20,657 కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్టారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఏప్రిల్ 28 నుంచి 2 రోజుల పాటు పపువా న్యూగినియాలో పర్యటించారు. ఆ దేశ ప్రధానమంత్రి పీటెర్ ఓ నీల్‌తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరుదేశాలు రక్షణ, వ్యవసాయ, ఆరోగ్య రంగాల్లో సహకారాన్ని పటిష్టం చేసుకోవాలని నిర్ణయించాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆరోగ్య రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. మే 2016 బ్రిటన్ రాజధాని లండన్ మేయర్‌గా సాదిక్ ఖాన్ మే 7న ప్రమాణస్వీకారం చేశారు. దీంతో బ్రిటన్‌లో మేయర్ పదవి చేపట్టిన తొలి ముస్లింగా రికార్డులకెక్కారు. పాకిస్తాన్ సంతతికి చెందిన సాదిక్ ఖాన్ లేబర్ పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీచేసి కన్సర్వేటివ్ పార్టీ అభ్యర్థి జాక్ గోల్డ్‌స్మిత్‌పై 57 శాతం ఓట్లతో విజయం సాధించారు. భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇరాన్ పర్యటనలో భాగంగా మే 23న ఆ దేశాధ్యక్షుడు హసన్ రౌహానీతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య 12 ఒప్పందాలు కుదిరాయి. ఈ ఒప్పందాల్లో చబహర్ ఓడరేవు అభివృద్ధితో పాటు అల్యూమినియం ప్లాంటు స్థాపన, ఆఫ్గానిస్తాన్, మధ్యాసియాలను అనుసంధానించే రైల్వేలైన్ ఏర్పాటు కోసం 150 మిలియన్ డాలర్ల రుణమిచ్చేందుకు ఇరాన్ సెంట్రల్ బ్యాంకుతో ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పందాలున్నాయి. 2000–15 మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రజల సగటు ఆయుర్ధాయం 5 ఏళ్లు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మే 18న విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. ఆఫ్రికా ప్రాంతంలో సగటు ఆయుర్దాయం అత్యధికంగా 9.4 ఏళ్లు పెరిగి 60 ఏళ్లకు చేరింది. అత్యధికంగా జపాన్‌లో మహిళల సగటు ఆయుర్దాయం 86.8 ఏళ్లు ఉండగా, పురుషుల సగటు ఆయుర్దాయం స్విట్జర్లాండ్‌లో అధికంగా 81.3 ఏళ్లని నివేదిక పేర్కొంది. అత్యల్పంగా సియెర్ర లియోన్‌లో పురుషుల సగటు ఆయుర్దాయం 49.3 ఏళ్లు, మహిళల సగటు ఆయుర్దాయం 50.8 ఏళ్లుగా ఉంది. లండన్‌లో మే 12న ప్రపంచ అవినీతి వ్యతిరేక సదస్సు జరిగింది. ఈ సదస్సులో ప్రపంచవ్యాప్తంగా అవినీతిని అంతమొందిస్తామని వివిధ దేశాధినేతలు ప్రతినబూనారు. ఈ సదస్సులో 40 దేశాల అధినేతలు, ఆర్థిక, పౌర సమాజ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌ను ఆ దేశ సెనెట్ మే 12న సస్పెండ్ చేసింది. బడ్జెట్ నిబంధనలను ఉల్లంఘించారనే కారణంతో ఆమెపై అభిశంసన ప్రక్రియ చేపట్టారు. ఈ తీర్మానానికి సెనెట్ ఆమోదం లభించింది. దీంతో ఉపాధ్యక్షుడు మిచెల్ టెమర్ తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా రోడ్రిగో డుటెర్టే ఎన్నికయ్యారు. మే 9న జరిగిన ఎన్నికల్లో పీడీపీ–లబాన్ పార్టీ నాయకుడు డుటెర్టే భారీ మెజారిటీతో విజయం సాధించారు. టర్కీలోని ఇస్తాంబుల్‌లో మే 23, 24 తేదీల్లో తొలి ప్రపంచ మానవతా సదస్సు (వరల్డ్ హ్యుమానిటేరియన్ సమ్మిట్) జరిగింది. ఈ సదస్సులో ఐక్యరాజ్యసమితిలోని 173 దేశాలు, ప్రైవేటు రంగాలకు చెందిన 350 మంది ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల నుంచి 2,000 మంది పాల్గొన్నారు. జి–7 దేశాల 42వ సదస్సు జపాన్‌లోని షిమాలో మే 26, 27 తేదీల్లో జరిగింది. సదస్సు అనంతరం అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, యూకే దేశాల నేతలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఇందులో ప్రపంచ ఆర్థికాభివృద్ధిని అత్యవసర ప్రాధాన్య అంశంగా పేర్కొన్నారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పుని ఎదుర్కొనేందుకు ఉమ్మడి చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చైనా పర్యటనలో భాగంగా బీజింగ్‌లో మే 26న చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో సమావేశమై పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. విద్యారంగంలో సహకారం కోసం భారత్‌కు చెందిన 10 విశ్వవిద్యాలయాలు చైనా యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకున్నాయి. జూన్ 2016 అణు సరఫరాదారుల బృంద (ఎన్ఎస్జీ) వార్షిక సదస్సు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో జూన్ 23, 24 తేదీల్లో జరిగింది. ఈ సమావేశంలో ఎన్పీటీ (అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం)ని సమర్థంగా అమలు చేయాలని ఎన్ఎస్జీ సభ్య దేశాలు నిర్ణయించాయి. ఎన్పీటీపై సంతకం చేయని దేశాలకు ఎన్ఎస్జీ సభ్యత్వం కల్పించే అంశంపై చర్చలు కొనసాగుతాయని సమావేశానంతరం విడుదల చేసిన ప్రకటనలో సభ్యదేశాలు పేర్కొన్నాయి. ప్రధానమంత్రి అమెరికా పర్యటనలో భాగంగా జూన్ 7న ఆ దేశ అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అణు సరఫరాదారుల బృందం(ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వానికి ఒబామా మద్దతు ప్రకటించారు. ప్రధాని మోదీ మెక్సికో పర్యటనలో భాగంగా జూన్ 9న ఆ దేశ అధ్యక్షుడు ఎన్రిక్ పెనా నీటోతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో వాణిజ్యం, పెట్టుబడులు, సమాచార, సాంకేతిక పరిజ్ఞానం, ఇంధనం, అంతరిక్ష రంగాల్లో సహకార విస్తరణపై ఇరు దేశాల నేతలు చర్చించారు. అణు సరఫరాదారుల బృందం(ఎన్ఎస్జీ)లో భారత సభ్యత్వానికి మద్దతిస్తున్నట్లు మెక్సికో ప్రకటించింది. మలబార్ ఎక్సర్సైజ్ పేరుతో భారత్, అమెరికా, జపాన్‌లు జూన్ 10న నౌకాదళ విన్యాసాలను ప్రదర్శించాయి. సైనిక సంబంధాలను బలోపేతం చేయడం, పరస్పర సమన్వయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా తూర్పు చైనా సముద్రంలోని వివాదాస్పద జలాలకు చేరువలో ఈ యుద్ధ విన్యాసాలు జరిగాయి. హ్యూమన్ క్యాపిటల్ ఇండెక్స్‌లో భారత్ 105వ స్థానంలో నిలిచింది. మొత్తం 130 దేశాలకు ర్యాంకులు ఇచ్చారు. ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) వార్షిక సమావేశం సందర్భంగా ఆయా దేశాలు.. ఆర్థికాభివృద్ధికి అవసరమైన ప్రతిభను గుర్తించడం, అభివృద్ధి చేయడం వంటి అంశాల ఆధారంగా జూన్ 27న ర్యాంకులను ప్రకటించారు. ఈ జాబితాలో ఫిన్లాండ్ మొదటి స్థానాన్ని దక్కించుకుంది. రెండో స్థానంలో నార్వే, మూడో స్థానంలో స్విట్జర్లాండ్‌లు నిలిచాయి. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఐవరీ కోస్ట్ పర్యటనలో భాగంగా జూన్ 15న ఆ దేశ అధ్యక్షుడు అలాసనే యుటారాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద కోకో ఉత్పత్తి కేంద్రమైన తమ దేశంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ప్రణబ్ ముఖర్జీని అలాసనే కోరారు. పర్యటన సందర్భంగా ఐవరీ కోస్టు అత్యున్నత పురస్కారం గ్రాండ్ క్రాస్ నేషనల్ ఆర్డర్‌ను రాష్ట్రపతి పణబ్‌కు అలాసనే ప్రదానం చేశారు. శ్రీలంకలోని జాఫ్నా పట్టణంలో పునరుద్ధరించిన స్టేడియాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేనలు సంయుక్తంగా జూన్ 18న ప్రారంభించారు. స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి సిరిసేన హాజరవగా, ప్రధాని ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ స్టేడియం మరమ్మతులకు భారత్ రూ.7 కోట్ల ఆర్థిక సాయం అందించింది. ప్రపంచంలో శరణార్థులు, నివాసాలను వదిలి వెళ్లిన వారి సంఖ్య 2015 నాటికి 65.3 మిలియన్లకు చేరుకుంది. ప్రపంచ శరణార్థుల దినోత్సవం సందర్భంగా జూన్ 20న ఐక్యరాజ్య సమితి ఈ వివరాలు వెల్లడించింది. శరణార్థుల్లో పాలస్తీనియన్లు అత్యధికంగా (5 మిలియన్లకు పైగా) ఉన్నారు. తర్వాతి స్థానాల్లో సిరియా (4.9 మిలియన్లు), అఫ్గానిస్తాన్ (2.7 మిలియన్లు) ఉన్నాయి. జూలై 2016 భారత ప్రధాని నరేంద్రమోదీ మొజాంబిక్ పర్యటనలో భాగంగా జూలై 7న ఆ దేశాధ్యక్షుడు ఫిలిప్ న్యూసీతో సమావేశమయ్యారు. దేశంలో పప్పు ధాన్యాల కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో మొజాంబిక్‌తో దీర్ఘకాలిక పప్పు ధాన్యాల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నారు. దక్షిణ చైనా సముద్రంలో తనకు 90 శాతానికి పైగా చారిత్రక హక్కులు ఉన్నాయనే చైనా వాదన ను హేగ్‌లోని అంతర్జాతీయ ట్రిబ్యునల్ జూలై 12న కొట్టివేసింది. 1940 నాటి చైనా మ్యాప్ ఆధారంగా నైన్–డాష్ లైన్ పరిధిలోని సముద్ర ప్రాంతం, అందులోని వనరులపై తనకు హక్కులున్నాయని చైనా వాదిస్తోంది. ఒకవేళ అలాంటి చారిత్రక హక్కులేమైనా ఉంటే సముద్ర చట్టాలకు సంబంధించి ఐక్యరాజ్యసమితి ఒడంబడికతో వాటికి కాలం చెల్లిందని ట్రిబ్యునల్ తేల్చిచెప్పింది. మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్‌లో పదకొండో ఆసియా–యూరప్ సదస్సు (ఏఎస్‌ఈఎం) జూలై 15, 16 తేదీల్లో జరిగింది. భారత్ తరఫున సదస్సులో పాల్గొన్న ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ.. ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ సమాజం కఠినంగా అణిచివేయాలని పిలుపునిచ్చారు. ఈ సదస్సులో భారత్ సహా 51 దేశాలు పాల్గొన్నాయి. ఆసియా, యూరప్ దేశాల మధ్య రాజకీయ, భద్రత, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక అంశాల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ జూలై 19న ఖరారయ్యారు. అభ్యర్థిత్వం కోసం 13 నెలలుగా పార్టీలోని అనేకమందితో పోటీపడి ట్రంప్ విజయం సాధించారు. పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా నిలిచేందుకు అవసరమైన 1,237 ఓట్లను ఆయన సాధించారు.lఅమెరికా అధ్యక్ష ఎన్నికకు డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా హిల్లరీ క్లింటన్ జూలై 27న ఖరారయ్యారు. నేపాల్ ప్రధాని కేపీ ఓలి జూలై 24న తన పదవికి రాజీనామా చేశారు. ఆయన ప్రభుత్వానికి మావోయిస్టు పార్టీ మద్దతు ఉపసంహరించుకోగా, అధికార కూటమిలోని మధేసి పీపుల్స్ రైట్స్ ఫోరమ్, డెమోక్రాటిక్, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీలు సైతం హామీలను నెరవేర్చడంలో ఓలి విఫలమయ్యారంటూ అవిశ్వాసానికి మద్దతిచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఓలి తన పదవికి రాజీనామా చేశారు. ఆగస్టు 2016 నేపాల్ కొత్త ప్రధానిగా మావోయిస్టు చీఫ్ పుష్ప కమల్ దహల్ (ప్రచండ) ఆగస్టు 4న ప్రమాణస్వీకారం చేశారు. ఆగస్టు 3న పార్లమెంటులో జరిగిన ఎన్నికలో సీపీఎన్–మావోయిస్టు సెంటర్ చీఫ్ ప్రచండకు అనుకూలంగా 363 ఓట్లు, వ్యతిరేకంగా 210 ఓట్లు వచ్చాయి. సార్క్ దేశాల హోంమంత్రుల 7వ సదస్సు ఆగస్టు 4న పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరిగింది. ఇందులో పాల్గొన్న భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలపై చర్యలు తీసుకొని, వాటిని ఒంటరి చేయాలని పిలుపునిచ్చారు. సదస్సులో సార్క్ సభ్యదేశమైన బంగ్లాదేశ్ మినహా అఫ్గానిస్థాన్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, భారత్, శ్రీలంక, మాల్దీవుల హోం మంత్రులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద విమానం‘ఎయిర్ ల్యాండర్–10’ ఆగస్టు 17న ఇంగ్లండ్‌లోని కార్డింగ్టన్‌లో ఆకాశంలోకి ఎగిరింది. 302 అడుగుల పొడవైన ఈ విమానాన్ని అమెరికా ఆర్మీ కోసం బ్రిటన్ సంస్థ హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్ (హెచ్ఏవీ) రూపొందించింది. 2050 నాటికి ప్రపంచ జనాభా దాదాపు 980 కోట్లకు చేరుతుందని పాపులేషన్ రిఫరెన్స్ బ్యూరో (పీఆర్బీ) పేర్కొంది. ఈ మేరకు ఆగస్టు చివరి వారంలో విడుదల చేసిన 2016 వరల్డ్ పాపులేషన్ డేటాషీట్లో తెలిపింది. మానవ అవసరాలు, సుస్థిర వనరులనే ఇతివృత్తంతో డేటా షీట్‌ను రూపొందించారు. యూరప్‌లో జననాల రేటు బాగా క్షీణించి జనాభా భారీగా తగ్గిపోనుండగా, ఆఫ్రికా దేశాల్లో రెట్టింపు అవుతుందని నివేదిక పేర్కొంది. వామపక్ష తీవ్రవాద సంస్థ.. కొలంబియా విప్లవ సాయుధ బలగాల (ఎఫ్ఏఆర్సీ–ఫార్క్)తో ఆ దేశ ప్రభుత్వం శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు ఇరు పక్షాలు క్యూబా రాజధాని హవానాలో ఆగస్టు 24న ప్రకటన విడుదల చేశాయి. దీంతో దక్షిణ అమెరికాలోని కొలంబియాలో 1964లో ప్రారంభమైన అంతర్యుద్ధానికి తెరపడింది. సెప్టెంబర్ 2016 ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య (అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్–ఆసియాన్) సదస్సు సెప్టెంబర్ 6–8 తేదీల్లో లావోస్‌లోని వియంటైన్లో జరిగింది. ఈ సదస్సును ‘టర్నింగ్ విజన్ ఇన్‌టూ రియాలిటీ ఫర్ ఎ డైనమిక్ ఆసియాన్ కమ్యూనిటీ’ అనే ఇతివృత్తంతో నిర్వహించారు. సదస్సులో ఆసియాన్ కమ్యూనిటీ విజన్ 2025 అమలుపై ఆసియాన్ వెలుపలి భాగస్వాములతో సహకారాన్ని విస్తరించుకోవడంపై నేతలు చర్చించారు. తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం సెప్టెంబర్ 8న లావోస్‌లోని వియంటైన్లో జరిగింది. జాతీయ, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో అణు భద్రతకు చర్యలు తీసుకోవాలని సదస్సు తీర్మానించింది. ఈ సందర్భంగా 18 దేశాలు అణు నిరాయుధీకరణ, అణు సాంకేతిక పరిజ్ఞాన వ్యాప్తి నిరోధానికి మద్దతు పలికాయి. ఈ సమావేశంలో 10 ఆసియాన్ దేశాలతోపాటు భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, అమెరికా, రష్యాలు పాల్గొన్నాయి. పారిస్ వాతావరణ మార్పు ఒప్పందానికి అమెరికా, చైనాలు అమోదం తెలిపాయి. దీనికి సంబంధించిన ఆమోద పత్రాలను సెప్టెంబర్ 3న చైనాలోని హాంగ్జౌలో ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్‌కు అందించాయి. పారిస్ ఒప్పందం ఈ ఏడాది చివరి నాటికి అమల్లోకి రావాల్సి ఉంది. దీనికోసం ఒప్పందానికి అంగీకరించిన 195 దేశాల్లో కనీసం 55 దేశాలు ఆమోదించాల్సి ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 6.5 కోట్ల మంది శరణార్థులు, వలసదారుల జీవితాలను కాపాడేందుకు ఉద్దేశించిన తీర్మానానికి సెప్టెంబర్ 19న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో భాగంగా 193 దేశాలు ఆమోదం తెలిపాయి. అయితే ఈ తీర్మానానికి చట్టబద్ధత లేదు. ఇజ్రాయెల్ మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత షిమోన్∙పెరెస్ (93) జెరూసలెంలో సెప్టెంబర్ 28న మరణించారు. ఆయన..1959లో తొలిసారి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఆయన రెండుసార్లు ప్రధాన మంత్రిగా, 2007 నుంచి 2014 వరకు దేశాధ్యక్షుడిగా కొనసాగారు. జీ–20 దేశాల 11వ సదస్సు చైనాలోని హాంగ్జౌలో సెప్టెంబర్ 4, 5 తేదీల్లో జరిగింది. ఈ సందర్భంగా సదస్సు ప్రధానంగా దార్శనికత, సమగ్రత, స్వేచ్ఛాయుత ఆర్థిక వ్యవస్థ, సమ్మిళితం వంటి అంశాలపై దృష్టి సారించింది. కొత్త ఆవిష్కరణలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలని పేర్కొంది. 2030 నాటికి సాధించాల్సిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కోసం కార్యక్రమాల రూపకల్పన– అమలుపై సదస్సులో చర్చించారు. అక్టోబర్ 2016 అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించేందుకు ప్రపంచంలో అత్యధిక దూరం సముద్ర గర్భంలో నుంచి కేబుల్ లైన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు గూగుల్, ఫేస్బుక్ సంస్థలు ప్రకటించాయి. పసిఫిక్ మహాసముద్రం ద్వారా అమెరికాలోని లాస్ ఏంజెల్స్ నుంచి హాంగ్‌కాంగ్‌కు 12,800 కి.మీ హైస్పీడ్ ఇంటర్నెట్ కేబుల్ ఏర్పాటు చేస్తారు. దీని ద్వారా అమెరికా, ఆసియాలను అనుసంధానం చేస్తారు. ఇప్పటికే అమెరికా, జపాన్ల మధ్య ప్రపంచంలోనే తొలి హై కెపాసిటీ ఇంటర్నెట్ కేబుల్ సముద్ర గర్భం నుంచి ఏర్పాటై ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద సముద్ర సంరక్షణ కేంద్రం (మెరైన్ రిజర్వ్) ఏర్పాటుకు అక్టోబర్ 28న ఒప్పందం కుదిరింది. అంటార్కిటికాలోని ప్రకృతి సిద్ధ నిర్జన ప్రదేశాలను పరిరక్షించే లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటార్కిటికా సముద్ర జీవ వనరుల పరిరక్షణ సంస్థ– హోబర్డ్ వార్షిక సమావేశంలో ఈ ఒప్పందం ఖరారైంది. కామన్వెల్త్ దేశాల గ్రూపు నుంచి వైదొలుగుతున్నట్లు మాల్దీవులు అక్టోబర్ 13న ప్రకటించింది. 2012 నాటి మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ నషీద్‌ను పదవీచుత్యుణ్ని చేయడానికి దారితీసిన పరిస్థితులను, రాజకీయ అశాంతిని అరికట్ట లేకపోయినందువల్ల ఆ దేశంపై ఆంక్షలు వి«ధించాలని కామన్వెల్త్ నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా కామన్వెల్త్ నుంచి వైదొలుగుతున్నట్లు మాల్దీవులు పేర్కొంది. 53 దేశాలున్న కామన్వెల్త్ దేశాల కూటమి నుంచి 2013లో జాంబియా వైదొలగగా, తర్వాత తప్పుకున్న దేశం మాల్దీవులు. నవంబర్ 2016 క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో (90) అనారోగ్యంతో నవంబర్ 25న కన్నుమూశారు. ఫిడెల్ క్యాస్ట్రో 1926, ఆగస్టు 13న బిరాన్ (హŸల్లూయిన్ ప్రావిన్స్)లో జన్మించారు. హవానా యూనివర్సిటీలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. 1959 నుంచి 1976 వరకు క్యూబా ప్రధానమంత్రిగా ఉన్న క్యాస్ట్రో.. అనంతరం దేశాధ్యక్షుడిగా ఎన్నికై 2008 వరకు ఆ పదవిలో కొనసాగారు. హైబ్రిడ్ వరి పితామహుడిగా పేరుగాంచిన చైనా వ్యవసాయ శాస్త్రవేత్త యువాన్ లాంగ్పింగ్ భారీ స్థాయిలో వరి పండించి సరికొత్త ప్రపంచ రికార్డులు నెలకొల్పారని చైనా అధికారులు నవంబర్ 25న ప్రకటించారు. గ్యాంగ్‌డాంగ్‌లో ఆయన పండించిన వరి 0.07 హెక్టార్‌కు 1,533.78 కిలోల వార్షిక దిగుబడి ఇచ్చిందని తెలిపారు. కొలంబియాలో గతంలో కుదిరిన శాంతి ఒప్పందాన్ని ప్రజలు తిరస్కరించడంతో.. ప్రభుత్వం, తిరుగుబాటు సంస్థ (ఎఫ్ఏఆర్సీ) నవంబర్ 12న కొత్త ఒప్పందాన్ని ప్రకటించాయి. వివిధ సంస్థలు, ప్రజల సూచనల మేరకు పాత ఒప్పందంలో కొన్ని మార్పులు చేయడంతోపాటు అదనపు అంశాలను చేర్చారు. ఈ మేరకు శాంతి చర్చల్లో కీలక పాత్ర పోషించిన క్యూబా, నార్వే, దౌత్యవేత్తలు సంయుక్త ప్రకటన చేశారు. అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన సంవత్సరంగా 2016 రికార్డుకెక్కింది. ఈ మేరకు ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) నవంబర్ 14న మొరాకోలోని మారకేష్‌లో విడుదల చేసిన నివేదికలో తెలిపింది. 2015తో పోల్చితే 2016లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2016లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే 1.2 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది. డిసెంబర్ 2016 వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో ఆ దేశంలో పెద్ద కరెన్సీ నోట్ అయిన 100 బొలివర్‌ను రద్దు చేస్తూ డిసెంబర్ 12న అత్యవసర డి్రMీ జారీ చేశారు. దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గియోన్ హై అభిశంసనకు గురయ్యారు. దీంతో ఆమె తాత్కాలికంగా అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పార్క్‌పై విపక్షాలు డిసెంబర్ 9న ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానానికి మెజారిటీ లభించింది. ఆ దేశ పార్లమెంటులో 300 స్థానాలుండగా.. 234 మంది అభిశంసన తీర్మానానికి మద్దతు తెలిపారు. దక్షిణ కొరియా అధ్యక్ష స్థానాన్ని చేపట్టిన తొలి మహిళ పార్క్. 2016 ప్రపంచ సుందరి కిరీటాన్ని ప్యూర్టొరికోకు చెందిన 19 ఏళ్ల స్టీఫెనీ డీ వాలే కైవసం చేసుకుంది. వాషింగ్టన్లో డిసెంబర్ 19న నిర్వహించిన పోటీల్లో 116 మందిలో స్టీఫెనీ అగ్రస్థానంలో నిలిచింది. యరిట్జా మిగులేనా రేయిస్ రమిరెజ్ (డొమినికన్ రిపబ్లిక్), నటాషా మాన్యుయెల్లా (ఇండోనేసియా) రన్నరప్‌లుగా నిలిచారు. ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐజాక్ న్యూటన్ రాసిన ప్రిన్సిపియా మ్యాథమెటికా తొలి ముద్రణ పుస్తకం వేలంలో రూ.21.1 కోట్లకు అమ్ముడైంది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ధరకు అమ్ముడైన శాస్త్ర సాంకేతిక ప్రచురణగా రికార్డు సృష్టించింది. క్రిస్టీ సంస్థ న్యూయార్క్‌లో డిసెంబర్ 18న నిర్వహించిన ఈ–వేలంలో అజ్ఞాత వ్యక్తి పుస్తకాన్ని సొంతం చేసుకున్నారు. చైనాలో ప్రపంచంలోనే ఎత్తయిన ప్రదేశంలో నిర్మించిన వంతెనపై రాకపోకలు డిసెంబర్ 29న ప్రారంభమయ్యాయి. ఈ వంతెనను భూమి నుంచి 1854 అడుగుల ఎత్తున, 1341 మీటర్ల పొడవున నిర్మించారు. దీనికోసం సుమారు రూ.1005 కోట్లు ఖర్చు చేశారు. దీన్ని పర్వతమయమైన నైరుతి చైనాలోని యున్నన్, గిఝౌ ప్రావిన్స్‌లను అనుసంధానం చేస్తూ నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన బుల్లెట్ రైలు మార్గంలో రాకపోకలను చైనా ప్రారంభించింది. షాంఘై నుంచి కున్మింగ్ వరకు ఉన్న ఈ మార్గం పొడవు 2,252 కిలోమీటర్లు. ఈ మార్గంలో గంటకు 330 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైలు దూసుకెళ్లనున్నట్లు చైనా ప్రభుత్వ రంగ వార్తా సంస్థ జిన్హువా డిసెంబర్ 28న వెల్లడించింది. అమెరికా నుంచి 2008–15 మధ్యకాలంలో భారీగా ఆయుధాలు కొన్న అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. కాంగ్రెసెనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్ఎస్) అభివృద్ధి చెందుతున్న దేశాలకు సంప్రదాయక ఆయుధాల బదిలీ, 2008–15 పేరిట డిసెంబర్ 26న విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలు వెల్లడించింది. శ్రీలంక మాజీ ప్రధాని రత్నసిరి విక్రమనాయకే (83) డిసెంబర్ 27న కన్నుమూశారు. ఆయన రెండు పర్యాయాలు శ్రీలంక ప్రధానిగా పనిచేశారు. ప్రపంచ జనాభా 2016లో 740 కోట్లకు చేరిందని ఐరాస జనాభా సంస్థ వెల్లడించింది. ఈ మేరకు జోర్డాన్‌లోని అమ్మాన్లో డిసెంబర్ 1న ప్రపంచ జనాభా నివేదిక–2016ను విడుదల చేసింది. జనాభాలో పదేళ్లలోపు చిన్నారులు 12.5 కోట్ల మంది ఉన్నారని.. వీరిలో 89 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఉన్నారని వెల్లడించింది. -
Nathpa Jhakri Dam is located in the State of?
1. India's Mariyappan Thangavelu won a gold medal at the 2016 Rio Paralympics in? 1) Long jump 2) Javelin throw 3) Shot put 4) High jump 2. Who topped the Fortune's list of 51 Most Powerful Women in the World? (It was released in September 2016) 1) Mary Barra 2) Indra Nooyi 3) Marillyn Hewson 4) Ginni Rometty 3. Which Indian-American won the prestigious Lemelson-MIT Prize in September 2016? 1) Ramesh Raskar 2) Subhat Khot 3) Manu Prakash 4) Dinesh Bharadia 4. Where was the BRICS Urbanization Forum Meet held in September 2016? 1) Goa 2) Hyderabad 3) New Delhi 4) Visakhapatnam 5. Ashraf Ghani visited India in September 2016. He is the President of which of the following countries? 1) Iran 2) Maldives 3) Afghanistan 4) Indonesia 6. Mother Teresa was made a Saint by Pope Francis in Vatican City on? 1) September 4, 2016 2) September 5, 2016 3) September 6, 2016 4) September 8, 2016 7. Who was named the brand ambassador of Uttar Pradesh Government's 'Samajwadi Kisan Beema Yojana'? 1) Amitabh Bachchan 2) Nawazuddin Siddiqui 3) Manoj Bajpayee 4) Salman Khan 8. Which city hosted the ASEAN-India Summit in September 2016? 1) Vientiane 2) Kuala Lumpur 3) Jakarta 4) Bandar Seri Begawan 9. 'Prabal Dostyk' is a joint army exercise of India and? 1) Russia 2) Kazakhstan 3) Belarus 4) Azerbaijan 10. Which State Government has launched Biju Kanya Ratna Yojana (BKRY) for the development of girls? 1) Assam 2) Tripura 3) Odisha 4) Jharkhand 11. September 15 is observed by the United Nations as? 1) International Day of Peace 2) International Literacy day 3) International Day of Charity 4) International Day of Democracy 12. Nathpa Jhakri Dam is located in the State of? 1) Punjab 2) Haryana 3) Jammu and Kashmir 4) Himachal Pradesh 13. The 25th World Conservation Congress of the International Union for Conservation of Nature (IUCN) was held in September 2016 in? 1) Jeju - South Korea 2) Nagoya - Japan 3) Hawaii - USA 4) Bogota - Colombia 14. Which of the following was adjudged the best film at the first BRICS film festival in September 2016? 1) Visaranai (Tamil) 2) Thithi (Kannada) 3) Xuan Zang (China) 4) Sultan (Hindi) 15. Lindsay Tuckett passed away on September 5, 2016. He played nine cricket Tests for? 1) New Zealand 2) West Indies 3) England 4) South Africa KEY 1) 4 2) 1 3) 1 4) 4 5) 3 6) 1 7) 2 8) 1 9) 2 10) 3 11) 4 12) 4 13) 3 14) 2 15) 4 -
కాంపిటీటివ్ కౌన్సెలింగ్
ఉద్యోగ నియామక పరీక్షలకు కీలకమైన కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించాలంటే ఏం చేయాలి? – ఎం.రవికుమార్, విజయవాడ ముందు అభ్యర్థి తాను రాయదలచుకున్న పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో గుర్తించడం ప్రధానం. దీనికోసం పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించాలి. ప్రశ్నల సరళి, కాఠిన్యతపై అవగాహన ఏర్పరచుకోవాలి. కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించడానికి పత్రికలను ప్రాథమిక వనరులుగా చెప్పుకోవచ్చు. అభ్యర్థులు కనీసం ఒక ఇంగ్లిష్, ఒక తెలుగు పత్రికలను చదవాలి. ముఖ్యఅంశాలను ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి. వాటి నేపథ్య సమాచారం కూడా తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల బిట్ల రూపంలో వచ్చే ప్రశ్నలతోపాటు డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు కూడా సమర్థంగా సమాధానాలు రాయడానికి వీలవుతుంది. వర్తమాన వ్యవహారాలపై అవగాహన లేకపోతే ఎస్సేతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక వ్యవహారాలు, పర్యావరణం తదితర అంశాల నుంచి వచ్చే డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానం ఇవ్వలేం. n కరెంట్ అఫైర్స్ అనగానే పరీక్షకు ముందు ఏదో ఒక పుస్తకం కొని, చదివితే సరిపోతుందనే భావన కొందరిలో ఉంటుంది. ఇది సరికాదు. కరెంట్ అఫైర్స్ అనేది కొన్ని మార్కులకు సంబంధించిన విభాగం కాదు. పరీక్ష మొత్తానికి ఈ విభాగంపై అవగాహన ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందనే వాస్తవాన్ని గుర్తించాలి. అందువల్ల తప్పనిసరిగా రోజువారీ ప్రిపరేషన్ అవసరం. పత్రికలతోపాటు ఒక ప్రామాణిక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చదివితే మంచిది. n పత్రికలను చదవడం వల్ల కరెంట్ అఫైర్స్‌పై పట్టుతోపాటు వివిధ రంగాల (ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ)కు సంబంధించిన పదజాలంపై అవగాహన ఏర్పడుతుంది. ఇది ప్రిపరేషన్ సాఫీగా సాగేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యమైన అంశాలపై గ్రూప్ డిస్కషన్ వల్ల కూడా ప్రయోజనం ఎక్కువ. -
భారత నౌకాదళ ప్రధానాధికారి?
ఎవరి జయంతిని జాతీయ ఐక్యతా దినంగా జరుపుకుంటారు? - సర్దార్ వల్లభాయ్ పటేల్ (అక్టోబర్ 31) ఇటీవల ఏ కంపెనీ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించారు? - టాటా గ్రూప్ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) కమిటీకి చైర్మన్? - పట్నా హైకోర్ట మాజీ చీఫ్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఆసియాలోకెల్లా అతిపెద్ద ఆప్టికల్ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేసిన ఆర్యభట్ట రీసెర్చ ఇన్స్టిట్యూట్ ఫర్ అబ్జర్వేషనల్ సెన్సైస్ (అఖఐఉ) ఎక్కడ ఉంది? - నైనిటాల్, ఉత్తరాఖండ్ నాలుగో అణు భద్రతా సదస్సు 2016, మార్చి 31, ఏప్రిల్ 1 తేదీల్లో ఎక్కడ జరిగింది? - వాషింగ్టన్ డి.సి, అమెరికా బరాక్ ఒబామా 2016, మార్చిలో క్యూబాలో పర్యటించారు. ఒబామా కంటే ముందు 1928లో క్యూబాలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడెవరు? - కాల్విన్ కూలిడ్జ ప్రపంచంలోనే అత్యంత ఆనందమయ దేశంగా వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన దేశం? - డెన్మార్క. భారత్ 118వ స్థానంలో నిలిచింది. జమ్మూకశ్మీర్ రాష్ర్ట తొలి మహిళా ముఖ్యమంత్రి? - మెహబూబా ముఫ్తీ. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు 2016, మేలో ఏబెల్ ప్రైజ్ గెలుచుకున్న బ్రిటిష్ గణితవేత్త? - సర్ ఆండ్రూ వైల్స్ 2016-17 సంవత్సరానికి భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నూతన అధ్యక్షుడు? - నౌషద్ ఫోర్బ్స 2016-17కి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) చైర్మన్ ? - సి.పి.గుర్నానీ (టెక్ మహీంద్రా సీఈఓ) 2016 సంవత్సరానికి ఫెమినా మిస్ ఇండియాగా ఎవరు ఎంపికయ్యారు? - ప్రియదర్శినీ ఛటర్జీ ప్రపంచంలోని 50 మంది అత్యుత్తమ నేతలతో రూపొందించిన ఫార్చ్యూన్ జాబితాలో మనదేశం నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక వ్యక్తి? - అరవింద్ కేజ్రీవాల్ (42వ స్థానం దక్కింది). అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో నిలిచారు. 2015 సంవత్సరానికి సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు? - పద్మ సచ్దేవ్. ఈమె డోగ్రి భాషలో రాసిన ‘చిట్-చెటె’ పుస్తకానికి ఈ అవార్డు దక్కింది. ప్రపంచంలోనే తొలి తెల్ల పులుల సఫారీని 2016, ఏప్రిల్‌లో ఎక్కడ ప్రారంభించారు? - మధ్యప్రదేశ్‌లోని ముకుంద్‌పూర్ జంతు ప్రదర్శనశాలలో 2016, ఏప్రిల్‌లో మారిటైమ్ ఇండియా సమ్మిట్‌ను ఎక్కడ నిర్వహించారు? - ముంబై. ఈ సదస్సుకు దక్షిణ కొరియా భాగస్వామ్య దేశంగా వ్యవహరించింది. పనాఘర్ ఎయిర్ బేస్ పేరును అర్జున్ సింగ్ ఎయిర్ఫోర్స స్టేషన్‌గా మార్చారు. ఇది ఏ రాష్ర్టంలో ఉంది? - పశ్చిమ బెంగాల్ ‘గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్’ కార్యక్రమాన్ని 2016, ఏప్రిల్ 14న భారత ప్రధాని నరేంద్రమోదీ ఎక్కడ ప్రారంభించారు? - మహు (మధ్యప్రదేశ్). ఇది బీఆర్ అంబేద్కర్ జన్మస్థలం. 2016, ఏప్రిల్‌లో భారత్‌లో పర్యటించిన అబ్దుల్లా యమీన్ ఏ దేశాధ్యక్షుడు? - మాల్దీవులు ఐదు దశాబ్దాల తర్వాత తొలిసారి మయన్మార్ దేశానికి పౌర అధ్యక్షుడిగా ఎవరు పదవీ బాధ్యతలు చేపట్టారు? - తిన్ క్వా మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమకారిణి ఆంగ్‌సాన్ సూచీ కోసం సృష్టించిన కొత్త పోస్టు? - స్టేట్ కౌన్సిలర్ 2016, ఏప్రిల్ నుంచి ఏ రాష్ర్టంలో సంపూర్ణ మద్య నిషేధం అమల్లోకి వచ్చింది? - బిహార్ ఆఫ్రికా దేశం చాద్‌లో అమెరికా రాయబారిగా బరాక్ ఒబామా ఎవరిని నామినేట్ చేశారు? - గీతా పాసి. ఈమె భారత సంతతికి చెందిన మహిళ భారత నౌకాదళ ప్రధానాధికారి? - అడ్మిరల్ సునీల్ లాంబా 2016 సంవత్సరానికి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఎవరికి లభించింది? - ‘ద వెజిటేరియన్’ అనే నవలకు దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు దక్కింది. ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ను 2016, మే 1న భారత ప్రధాని నరేంద్రమోదీ ఎక్కడ ప్రారంభించారు? - బలియా, ఉత్తరప్రదేశ్. రానున్న మూడు ఆర్థిక సంవత్సరాల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 5 కోట్ల మంది మహిళలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడమే ఈ పథకం లక్ష్యం. రియో ఒలింపిక్స్‌కు గుడ్‌విల్ అంబాసిడర్స? - సల్మాన్‌ఖాన్, అభినవ్ బింద్రా, సచిన్ టెండూల్కర్, ఏ.ఆర్.రెహ్మాన్ 2016, మే7న సాదిక్‌ఖాన్ ఏ నగర మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు? - లండన్ 2016, మేలో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)ను తొలిసారి గెలుచుకున్న ఫుట్‌బాల్ జట్టు? - లీసెస్టర్ సిటీ ‘మంచి దేశం - 2015’ సూచీలో భారత్ స్థానం? - 70. ఈ సూచీని 163 దేశాలతో రూపొందించారు. స్వీడన్ అగ్రస్థానంలో నిలిచింది. వంద మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ గెలుచుకున్న తొలి టెన్నిస్ క్రీడాకారుడు? - నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 2016 ఏప్రిల్, మే నెలల్లో ఏ నగరంలో కుంభమేళాను నిర్వహించారు? - ఉజ్జయిని (మధ్యప్రదేశ్) 2015-సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో దేశంలో ప్రథమస్థానంలో నిలిచిన మహిళ? - టీనా దాబి హరీష్ రావత్ ఏ రాష్ర్ట ముఖ్యమంత్రి? - ఉత్తరాఖండ్ దేశంలోని అన్ని అత్యవసర సేవల వినియోగానికి సంబంధించి అందుబాటులోకి రానున్న ఏకైక ఎమర్జెన్సీ నంబర్? - 112 ఫిఫా పరిపాలనా కమిటీ డిప్యూటీ చైర్మన్‌గా నియమితులైన భారతీయ న్యాయమూర్తి ఎవరు? - జస్టిస్ ముకుల్ ముద్గల్ ఇటీవల భారత్‌లో పర్యటించిన థాయ్‌లాండ్ ప్రధాని ? - ప్రయాత్ చాన్ ఓచా ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ (ఐఏఏఫ్) హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయుడు? - యు.ఆర్.రావు (ఇస్రో మాజీ చైర్మన్) కేరళ ప్రస్తుత ముఖ్యమంత్రి ? - పినరయి విజయన్ భారత్‌లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ పురుషుల టైటిల్‌ను గెలుచుకున్న జట్టు? - వెస్టిండీస్. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్సలో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను వెస్టిండీస్ ఓడించింది ఐసీసీ టీ20 మహిళల ప్రపంచకప్‌ను ఏ జట్టు కైవసం చేసుకుంది? - వెస్టిండీస్. 2016, ఏప్రిల్ 3న కోల్‌కతాలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. సెయింట్ లూసియానాలోని బ్యుసేజర్ క్రికెట్ స్టేడియానికి ఏ వెస్టిండీస్ క్రికెటర్ పేరు పెట్టారు? - డారెన్ సామీ బీసీసీఐ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎవరు నియమితులయ్యారు? - రాహుల్ జోహ్రి ఏప్రిల్‌లో జరిగిన సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్-2016ను ఏ దేశం గెలుచుకుంది? - ఆస్ట్రేలియా. ఫైనల్లో భారత్‌ను ఓడించింది ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఏ రాష్ట్రానికి చెందిన అమ్మాయి? - త్రిపుర భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జీవిత చరిత్ర పేరు? - ఏస్ ఎగెనెస్ట్ ఆడ్‌స అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలి స్వతంత్ర చైర్మన్? - శశాంక్ మనోహర్ 2016, జూన్‌లో నిర్వహించిన కోపా అమెరికా సెంటెనరీ ఫుట్‌బాల్ టోర్నమెంట్ విజేత? - చిలీ. ఫైనల్లో అర్జెంటీనాను ఓడించింది. ఈ టోర్నమెంట్ అమెరికాలో జరిగింది. 2016, ఆగస్టులో జరిగిన రియో ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత పతాకధారి ? - అభినవ్ బింద్రా 36వ పురుషుల చాంపియన్స ట్రోఫీ హాకీని 2016, జూన్‌లో ఎక్కడ నిర్వహించారు? - లండన్ ఫార్ములావన్ విజేతగా నిలిచిన అతి పిన్న వయస్కుడు? - మ్యాక్స్ వెర్స్టాపెన్ (నెదర్లాండ్స) ఉబెర్‌కప్ మహిళల బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను ఏ దేశం గెలుచుకుంది? - చైనా నీతి ఆయోగ్‌లోని సామాజిక విభాగానికి సలహాదారుగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? - రతన్ వతల్ ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్? - అనిల్ కుంబ్లే కేంద్ర ఆర్థిక శాఖ ప్రస్తుత కార్యదర్శి ? - అశోక్ లవాసా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ ? - కిరణ్ బేడి యూరోపియన్ యూనియన్‌లో కొనసాగడంపై ఇటీవల ఏ దేశం రిఫరెండం నిర్వహించింది? - బ్రిటన్ 2016-సియట్ క్రికెట్ అవార్డుల్లో ‘లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ను ఏ మాజీ క్రికెటర్‌కు అందజేశారు? - దిలీప్ వెంగ్‌సర్కార్ N. Vijayender Reddy General Awareness Faculty, Hyderabad -
కాంపిటీటివ్ గెడైన్స్
కరెంట్ అఫైర్స్ జాతీయం అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అషఫ్ రఘనీ భారత పర్యటన అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అషఫ్ రఘనీ భారత పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 14న ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నేరస్తుల పరస్పర మార్పిడి, పౌర, వాణిజ్య అంశాలకు సంబంధించి పలు ఒప్పందాలు కుదిరాయి. కాంగ్రెస్‌ను వీడిన అరుణాచల్‌ప్రదేశ్ సీఎం అరుణాచల్‌ప్రదేశ్‌లో సీఎం పెమా ఖండూ నేతృత్వంలో 43 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సెప్టెంబర్ 16న ఆ పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ)లో విలీనమయ్యారు. మొత్తం 60 మంది సభ్యులున్న అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలున్నారు. బలూచ్ మొబైల్ యాప్‌ను ప్రారంభించిన ఏఐఆర్ పాకిస్తాన్‌తోపాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న బలూచ్ ప్రజల కోసం ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్) సెప్టెంబర్ 16న మల్టీ మీడియా, మొబైల్ అప్లికేషన్ సేవలను ప్రారంభించింది. సరిహద్దు ప్రజల మధ్య మెరుగైన సంబంధాల కోసం ఈ సేవలను ప్రారంభించినట్లు ప్రసార భారతి చైర్మన్ ఎ.సూర్యప్రకాష్ తెలిపారు. యూరి ఉగ్ర దాడిలో 20 మంది సైనికులు మృతి జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో యూరి సైనిక స్థావరంపై సెప్టెంబర్ 18న ఉగ్రవాదులు జరిపిన దాడిలో 20 మంది భారత సైనికులు మృతి చెందారు. ఫెన్సింగ్ వైర్లు కత్తిరించి, సైనిక స్థావరంలోకి ప్రవేశించిన ముష్కరులు.. జవాన్లపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు గ్రెనేడ్లతో దాడి చేయడంతో సైనిక గుడారాలకు మంటలంటుకున్నాయి. మంటల వల్ల 13 మంది సైనికులు మరణించారు. సైనికులు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అరుదైన కళాకృతులను అప్పగించిన ఆస్ట్రేలియా స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న అతి పురాతనమైన మూడు విగ్రహాలను ఆస్ట్రేలియా ప్రభుత్వం సెప్టెంబర్ 19న భారత్‌కు అందించింది. కోట్ల రూపాయల విలువ చేసే ఈ విగ్రహాలను కాన్‌బెర్రాలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా (ఎన్జీఏ) వద్ద జరిగిన కార్యక్రమంలో ఆ దేశ కళల శాఖమంత్రి మిచ్ ఫైఫీల్డ్డ్.. భారత పర్యాటక శాఖ మంత్రి మహేశ్‌శర్మకు అందించారు. వీటిలో మూడో శతాబ్దానికి చెందిన రాతితో చేసిన విగ్రహం, బుద్ధుని విగ్రహం, 900 ఏళ్ల కిందటి ప్రత్యంగిరాదేవి విగ్రహం ఉన్నాయి. కశ్మీర్లో ఆపరేషన్ కామ్ డౌన్ చేపట్టిన సైన్యం కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు భారత సైన్యం సెప్టెంబర్ 14న ఆపరేషన్ కామ్ డౌన్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులను ఏరివేసేందుకు 4,000 మంది అదనపు బలగాలను దక్షిణ కశ్మీర్లో మోహరించారు. -
సింధు, సాక్షి మాలిక్‌లకు పతకాలు
కాంపిటీటివ్ గెడైన్స్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయం ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎయిర్‌ల్యాండర్ -10 ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎయిర్ ల్యాండర్-10.. ఆగస్టు 17న ఇంగ్లండ్‌లోని కార్డింగ్టన్‌లో ఆకాశంలోకి ఎగిరింది. 85 ఏళ్ల కిందట 1930 అక్టోబర్‌లో ఇదే ఎయిర్‌ఫీల్డ్ నుంచి ఎగిరిన ఎయిర్‌షిప్-ఆర్101 ఫ్రాన్స్‌లో కూలిపోయింది. ఈ సంఘటనలో 30 మంది చనిపోయారు. ఆ తర్వాత బ్రిటన్‌లో ఎయిర్‌షిప్‌లను రూపొందించడం ఆపేశారు. తాజాగా 302 అడుగుల పొడవైన ఎయిర్ ల్యాండర్-10ను అమెరికా ఆర్మీ కోసం బ్రిటన్ సంస్థ హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్ (హెచ్ఏవీ) రూపొందించింది. భారత్‌లో ఆమ్నెస్టీ ఆఫీసులు తాత్కాలికంగా మూసివేత అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ భారత్‌లో తన ఆఫీసులను తాత్కాలికంగా మూసివేసింది. బెంగళూరు, పుణె, న్యూఢిల్లీ, చెన్నై ఆఫీసులను మూసివేయడంతోపాటు తమ ఈవెంట్లను వాయిదా వేస్తున్నట్లు ఆగస్టు 17న వెల్లడించింది. బెంగళూరులో కశ్మీర్ అంశంపై ఆ సంస్థ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో కొందరు దేశ ద్రోహ నినాదాలు చేశారనే ఆరోపణలతో ఆమ్నెస్టీపై దేశ ద్రోహ కేసు నమోదైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్వేషాన్ని ప్రోత్సహించారని ఆరోపిస్తూ.. కొందరు ఈ సంస్థకు వ్యతిరేకంగా ఆగస్టు 16, 17 తేదీల్లో ప్రదర్శనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆమ్నెస్టీ ఆఫీసుల మూసివేత నిర్ణయం తీసుకుంది. ఆర్థికం జూలైలో 3.55 శాతానికి టోకు ద్రవ్యోల్బణం 2016 జూలైలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 3.55 శాతంగా నమోదైంది. కూరగాయలు, పప్పు దినుసులు వంటి ధరలు పెరగడంతో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 23 నెలల గరిష్టానికి చేరింది. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం రెండంకెలను దాటి 11.82 శాతానికి పెరిగింది. పప్పు దినుసులు 35.76 శాతం, కూరగాయలు 28.05 శాతం, తృణ ధాన్యాల ధరలు 7.03 శాతం అధికమయ్యాయని ఆగస్టు 16న కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి. నిత్యావసరాల్లో ఒకటైన బంగాళా దుంపల ధరలు 58.78 శాతం పెరిగాయి. పంచదార, పండ్ల ధరలు వరుసగా 32.33 శాతం, 17.30 శాతం చొప్పున పెరిగాయి. జూన్‌లో 1.62 శాతంగా నమోదైన ద్రవ్యోల్బణం.. 2015 జూలై లో -4.00 శాతంగా నమోదు కావడం గమనార్హం. సైన్స్ అండ్ టెక్నాలజీ తొలి క్వాంటమ్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా అంతరిక్షం నుంచి భూమికి కాంతి కంటే వేగవంతమైన, హ్యాకింగ్‌కు అవకాశం లేని కమ్యూనికేషన్లను సాగించడానికి వీలు కలిగించే క్వాంటమ్ ఉపగ్రహాన్ని చైనా ఆగస్టు 16న విజయవంతంగా ప్రయోగించింది. తద్వారా ప్రపంచంలోనే మొదటిసారిగా ఇటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం గా నిలిచింది. గోబీ ఎడారిలోని జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్-2డి రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ఉపగ్రహం బరువు 600 కిలోలు. ఇది రెండేళ్లపాటు సేవలు అందిస్తుంది. భూమిపై అత్యంత వేడి నెలగా జూలై ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో భూమిపై అత్యంత వేడి నెలగా ఈ ఏడాది జూలై నిలిచింది. గత 137 ఏళ్ల గణాంకాలతో పోల్చితే జూలైలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పర్యవేక్షణ సంస్థ (ఎన్ఓఏఏ) ఆగస్టు 16న ప్రకటించింది. 20వ శతాబ్దపు సగటు ఉష్ణోగ్రతతో పోల్చితే ఈ జూలైలో ఉష్ణోగ్రత 1.57నిఇ అధికంగా ఉంది. గత ఏడాది జూలైతో పోల్చితే ఈ ఉష్ణోగ్రత 0.11నిఇ ఎక్కువ. శిలాజ ఇంధనాల వినియోగం మరింత పెరగడం, వాతావరణ మార్పుల కారణంగా ప్రతి నెలా భూమిపై ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయని నివేదిక తెలిపింది. వార్తల్లో వ్యక్తులు పంజాబ్, అసోం, అండమాన్లకు కొత్త గవర్నర్లు మణిపూర్ గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి నజ్మా హెప్తుల్లా, పంజాబ్ గవర్నర్‌గా రాజ్యసభ మాజీ సభ్యుడు వీపీ సింగ్ బద్నోర్, అసోం గవర్నర్‌గా ది హితవాద దినపత్రిక ఎండీ బన్వారీలాల్ పురోహిత్‌ను నియమించారు. ఢిల్లీ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే, ప్రొఫెసర్ జగదీశ్ ముఖి అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎంపికయ్యారు. కోస్ట్‌గార్డ్ అడిషనల్ డెరైక్టర్ జనరల్‌గా వి.ఎస్.ఆర్.మూర్తి భారత సముద్ర తీర రక్షణ దళం అడిషనల్ డెరైక్టర్ జనరల్‌గా తెలుగు వ్యక్తి వీఎస్ఆర్ మూర్తి ఆగస్టు 18న బాధ్యతలు స్వీకరించారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ (52) ఆగస్టు 21న నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా, ద్రవ్య విధానం, ద్రవ్యోల్బణం విభాగాలకు ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ పదవీ కాలం మూడేళ్లు. డిప్యూటీ గవర్నర్‌గా ఉంటూ గవర్నర్ బాధ్యతలు చేపడుతున్న ఏడో వ్యక్తి పటేల్. క్రీడలు సానియా జంటకు సిన్సినాటి టైటిల్ బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)తో కలిసి సానియా మీర్జా.. సిన్సినాటి ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఆగస్టు 22న జరిగిన ఫైనల్లో ఈ జంట.. మార్టినా హింగిస్ - కోకో వాండెవెగె జోడీపై విజయం సాధించింది. 2016 క్రీడా అవార్డులు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 2016కు ఆగస్టు 22న అవార్డులను ప్రకటించింది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు, రెజ్లర్ సాక్షి మాలిక్, షూటర్ జీతూరాయ్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర దక్కింది. అవార్డు కింద రూ.7.5 లక్షల నగదు ఇస్తారు. ఉత్తమ కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య పురస్కారాలను కూడా కేంద్రం ప్రకటించింది. ఈ అవార్డు పొందినవారికి రూ.5 లక్షలు, ప్రశంస పత్రం బహూకరిస్తారు.రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర: పూసర్ల వెంకట సింధు (బ్యాడ్మింటన్), సాక్షి మాలిక్ (రెజ్లిం గ్), దీపా కర్మాకర్ (జిమ్మాస్టిక్స్), జీతూ రాయ్ (షూటింగ్). అర్జున అవార్డ్: అజింక్య రహానే (క్రికెట్), రజత్ చౌహాన్ (ఆర్చరీ), లలితా బాబర్ (అథ్లెటిక్స్), సౌరవ్ కొఠారి (బిలియర్డ్స్, స్నూకర్), శివ థాపా (బాక్సింగ్), సుబ్రతా పాల్ (ఫుట్‌బాల్), రాణి రాంపాల్ (హాకీ), వి.ఆర్.రఘునాథ్ (హాకీ), గురు ప్రీత్ సింగ్ (షూటింగ్), అపూర్వీ చండేలా (షూటింగ్), సౌమ్యజిత ఘోష్ (టేబుల్ టెన్నిస్), వినేశ్ (రెజ్లింగ్), అమిత్‌కుమార్ (రెజ్లింగ్), సందీప్ సింగ్మాన్ (పారా అథ్లెటిక్స్), వీరేందర్ సింగ్ (రెజ్లింగ్) ద్రోణాచార్య అవార్డు: నాగపురి రమేశ్ (అథ్లెటిక్స్), సాగర్ మాల్ దయాల్ (బాక్సిం గ్), రాజ్‌కుమార్ శర్మ (క్రికెట్), విశ్వేశ్వర్ నంది (జిమ్మాస్టిక్స్), ఎస్.ప్రదీప్‌కుమార్ (స్విమ్మింగ్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్). ధ్యాన్‌చంద్ అవార్డ్: సత్తి గీత (అథ్లెటిక్స్), సిల్వనస్ డుంగ్ డుంగ్ (హాకీ), రాజేంద్రప్రసాద్ షెల్కే (రోయింగ్). సింధు, సాక్షి మాలిక్‌లకు పతకాలు రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు రజత పతకం సాధించి రికార్డ్ సృష్టించింది. ఒలింపిక్స్‌లో భారత్ తరఫున రజతం గెలిచిన తొలి మహిళగా నిలిచింది. బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్) బంగారు పతకం గెలిచింది. మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 58 కిలోల విభాగంలో భారత రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. అగ్రస్థానంలో అమెరికా దేశం స్వర్ణం రజతం కాంస్యం మొత్తం అమెరికా 46 37 38 121 బ్రిటన్ 27 23 17 67 చైనా 26 18 26 70 రష్యా 19 18 19 56 జర్మనీ 17 10 15 42 జపాన్ 12 8 21 41 ఫ్రాన్స్ 10 18 14 42 కొరియా 9 3 9 21 ఇటలీ 8 12 8 28 ఆస్ట్రేలియా 8 11 10 29 భారత్ 0 1 1 2 (భారత్ స్థానం 67) ముగిసిన ఒలింపిక్స్ బ్రెజిల్‌లోని రియోడిజనీరోలో ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు జరిగిన ఒలింపిక్స్ -2016 ముగింపు వేడుకల్లో రెజ్లింగ్‌లో కాంస్యం సాధించిన సాక్షి మాలిక్ భారత పతాకధారిగా వ్యవహరించింది. 31వ ఒలింపిక్ క్రీడలు ఆగస్టు 5న ప్రారంభమయ్యాయి. మొత్తం 206 దేశాలు ఈ క్రీడల్లో పాల్గొన్నాయి. 32వ ఒలింపిక్ క్రీడలు 2020లో జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతాయి. రాష్ట్రీయం విశాఖపట్నంలో రోడ్డు భద్రతపై వర్కషాప్ దేశంలో 30 శాతం బోగస్ డ్రైవింగ్ లెసైన్స్‌లు ఉన్నాయని, వాటిని తొలగించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై విశాఖపట్నంలో జరిగిన జాతీయ వర్క్‌షాప్‌లో ఆగస్టు 18న నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. 18 రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, దాదాపు వంద మంది దేశ, విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. రహదారుల భద్రతపై వారు 69 రకాల సిఫార్సులు చేశారు. రవాణా శాఖలో అవినీతి మూలంగా ప్రమాదాల్లో అమాయకులు ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోందని గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏటా 1.50 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని తెలిపారు. ఈ సంఖ్యను బ్రెజీలియా డిక్లరేషన్ ప్రకారం 2020 నాటికి 50 శాతానికి తగ్గించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రోడ్డు భద్రతకు సంబంధించి ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్, ఎమర్జెన్సీ, ఎన్విరాన్మెంట్ అనే అంశాలపై దృష్టిపెట్టాలన్నారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) ఉండాలని కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్యను 2025 నాటికి 50 శాతానికి తగ్గించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు, ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్, హైదరాబాద్ -
Winner of 2016 French Open Women's Singles?
కాంపిటీటివ్ గెడైన్స్ Current Affairs for Bank Exams 1. Prime Minister Narendra Modi was conferred the Amir Amanullah Khan Award is the highest civilian honour of? Afghanistan 2. Who won the 2016 French Open women's singles Tennis title on June 4, 2016? Garbine Muguruza of Spain. She defeated Serena Williams of USA in the final. It is her maiden Grand Slam Title. 3. Who became the Chairman of Fair Trade Regular Competition Commission of India (CCI) in January 2016? Devender Kumar Sikri. He succeeded Ashok Chawla. 4. Which Indian writer won the prestigious $ 50,000 DSC prize for South Asian Literature for 2016? Anuradha Roy. She won the award for her novel "Sleeping on Jupiter" 5. Which city hosted the 103rd session of the Indian Science Congress between January 3 and January 7, 2016? Mysuru. The theme of 103rd Indian Science Congress is "Science and Technology for Indigenous Development in India" 6. Who is India's High Commissioner to Pakistan? Gautam Bambawale 7. Who took over as the Chief Information Commissioner (CIC) in January 2016? Radha Krishna Mathur. He is former defense secretary. He succeeded Vijai Sharma. 8. Who is the present Chief Executive officer of NITI Aayog? Amitabh Kant. He succeeded Sindhusree Khullar. 9. Who is the head of judicial committee on One Rank One Pension (OROP) Scheme for retired defense personnel? Justice L.Narasimha Reddy. He is former Chief Justice of Patna high court. 10. Who was honoured with Jnanpith Award for 2015? Raghuveer Chaudhary. He is the fourth Gujarati writer to win Jnanpith Award India's highest literature prize, after Uma Sankar Joshi (1967), Pannalal patel (1985) and Rajendra Shah (2001). 11. Which former cricketer was awarded the Col. C.K.Nayudu Literature Achievement Award for 2015? Syed Kirmani. He is former wicket keeper-batsman. He was also a member of the Indian team that won their first ever World Cup in 1983. 12. Which city hosted the United Nations Change Conference COP-21 from November 30 to December 12, 2015? Paris. It was the 21st yearly session of the Conference Of The Parties (COP) 13. Which country has announced to launch of Islamic Military coalition to counter terrorism? Saudi Arabia. The coalition will be led by Saudi Arabia and over see the participation of 34 nations. 14. Which country won the south Asian Football Federation (SAFF) cup in January 2016? India. SAFF cup Football Tournament was played in Thiruvananthapuram, Kerala. India won the SAFF cup by defeating Afghanistan in the final. 15. Who set a new world record for most runs in an innings in January 2016? Pranav Dhanawade. He scored 1,009 runs (not out) off 323 balls. Pranav made this record in the Thane district inter-school tournament. 16. Who took charge as the new United Nations high Commissioner for Refugees (UNHCR) on January 4, 2016? Filippo Grandi of Italy. He succeeded Antonto Guterres. 17. India signed an agreement on the purchase of 36 Raffle Aircraft with which country? France. It was signed during the state visit of French President Francois Hollande from January 24 to 26, 2016. He was the chief guest at the 67th India's Republic Day celebrations. 18. Which is the first organic state of India? Sikkim. Prime Minister Narendra Modi declared Sikkim as the first organic farming state of India on January 18, 2016. 19. In which city was Asian Infrastructure Investment Bank (AIIB) was formally opened on January 16, 2016? Beijing. AIIB is backed by China. It has 57 founding members including India. China's former Finance Minister Jin Liqun is the first AIIB president. 20. Which Indian was elected to the 12-member board of Directors of the Asian Infrastructure Investment Bank? Dinesh Sharma 21. Who has been appointed as the Registrar General and Census Commissioner of India? Sailesh. He succeeded C.Chandramouli. 22. Sahuag Kijin is a joint coast guard exercise between India and which other country? Japan. Sahyog Kaijin 2016 was conducted off the coast of Chennai. 23. What is the name of the Indo-French milatary exercise? Shakti India and France conducted their counter terrorism and counter- insurgency joint exercise Shakti-2016 in Rajasthan in January-2016. 24. Who was awarded India's highest peace time gallantry Ashok Chakra on January 26, 2016. Lance Naik Mohan Nath Goswami (Posthumously) 25. How many persons were awarded the 2016 Padma Awards? 112. The list comprises 10 Padma Vibhushan, 19 Padma Bhushan and 83 Padma Shri awards. 19 are women winners. The list also includes 10 persons in the category of foreigners/ NRIs/ PIOs. 26. Who was honoured with the third Yash Chopra Memorial Award in January 2016? Rekha. Maharashtra Governor Ch. Vidyasagar Rao presented the award to the veteran Bollywood actress. 27. Which is the most corruption-free country in the world? Denmark. Transparency International released the corruption perceptions index (CPI) 2015 in January 2016. The index is topped by Denmark. India was placed at 76th position. North Korea and Somalia shared the last place at 167. 28. Who won the Syed Modi International Grand Prix Badminton title in Lucknow on January 31, 2016? Kidambi Srikanth. Top seed K. Srikanth of India defeated Chinese player Huang Yuxiang in the finals. 29. Which Indian shuttler won the Malaysia Masters Grand Prix Gold Badminton women's singles title in January 2016? P.V. Sindhu. She defeated Scotland Kirsty Gilmour in the finals. 30. Which team won in the Premier Badminton League (PBL) title in January 2016? Delhi Acers. It defeated Mumbai Rockets in the finals in New Delhi. 31. Which is the first bank in India to launch a dedicated branch for start-ups? State Bank of India. SBI launched "SBI incube" a branch for start-ups in Bengaluru in January 2016. It would offer advisory services to the budding entrepreneurs under one roof. 32. Who won the 2016 Australian Open men's singles title? Novak Djokovic. World No.1 Novak Djokovic of Serbia won the 2016 Australian open men's singles title by defeating Andy Murray in the finals on January 31, 2016. It is his sixth Australian open title and he equalled Australian Roy Emerson's record. 33. Whom did Angelique Kerber defeat in the finals of the 2016 Australian Open Women's singles? Serena Williams. In the women's singles final of the 2016 Australian Open Tennis Tournament Angelique Kerber of Germany beat Serena Williams of USA to clinch her first grand slam title. Angelique Kerber become Germany's first Grand Slam Champion since Steffi Graf's 1999 French Open title. 34. Who won the 2016 Australian Open Women's doubles title? Sania Mirza and Martina Hingis. Indo-Swiss pair of Sania Mirza and Martina Hingis defeated Czech duo of Andrea Halvackova and Lucie Hradecka in the final. 35. Which country won the inaugural T-20 Asia Cup for Blind in January 2016? India. In the final played in Kochi, India defeated Pakistan by 44 runs. ICC Awards 2015 1. ICC Cricketer of the year Steven Smith (Australia) (He was given the Sir Garfield Sobers Trophy) 2. Test cricketer of the year Steven Smith (Australia) 3. ODI (Crickter of the Tournament) A.B.Devilliers (South Africa) 4. T 20 performance of the year Faf Du Plessis (South Africa) 5. Associate and affiliate cricketer of the year Khurram Khan (UAE) 6. Spirit of Cricket Award Brendon Mccullum (New Zealand) 7. Umpire of the year Richard Kettleborough (England) 8. Women's ODI cricketer of the year Meg Lanning (Australia) 9. Women's T 20 cricketer of the year Stefanic Taylor (West Indies) - N. Vijayender Reddy General Awareness Faculty, Hyderabad -
Rawat proved majority in Uttarakhand
Competitive Guidance Current Affairs International ♦ Brazil's Dilma Rousseff to face impeachment trial Brazil's President Dilma Rousseff is to face trial after the Senate voted to impeach and suspend her. Ms Rousseff is accused of illegally manipulating finances to hide a growing public deficit ahead of her re-election in 2014, which she denies. Senators voted to suspend her by 55 votes to 22. ♦ Switzerland honours Yash Chopra with a Bronze Statue Switzerland Government has honoured veteran filmmaker Yash Chopra by unveiling a bronze statue at Interlaken. Chopra was known for opening a legacy of South Asian tourists flocking to Switzerland and spend much time in the country besides shooting his movies. Economy ♦ Rs 100 Commemorative Coin on Maharana Pratap released A commemorative coin of Rs 100 and a circulation coin of Rs 10 were released today on the occasion of 475th birth anniversary of Maharana Pratap. Also the Union Culture and Tourism ministry has agreed to release a sum of Rs 9.5 Crore to the Rajasthan state government for the development of the Indoor Stadium at Khel Gaon, in memory of the great warrior. ♦ Govt notifies relaxed FDI norms for ARCs The Union government has notified the relaxed foreign investment norms in asset reconstruction companies (ARCs), as it looks at effectively dealing with the burgeoning bad debts in Indian banking system. The department of industrial policy and promotion permitted 100% foreign direct investment in asset reconstruction companies to come in without any prior government approval under the automatic route. Earlier, while 49% FDI was permitted under the automatic route, investors needed prior government approval to increase their stake beyond 49%. ♦ India Mauritius sign DTAA The Protocol for the amendment of the Convention for the avoidance of double taxation and the prevention of fiscal evasion with respect to taxes on income and capital gains between India and Mauritius was signed by both the countries. National ♦ Asia's first Rice Technology Park in Karnataka The Karnataka Government has decided to establish Asia's first Rice Technology Park at Gangavati in Koppal district. Maize Technology Park is to come up at Ranebennur in Haveri district. The Rice Technology Park is to be set up in 315 acre at Karatagi in Gangavathi of Koppal district. The park will be the focal point of agro-based activity in the region catering to most parts of the Tungabhadra Command Area. Sona Masuri, which is a lightweight and aromatic variety of rice, is grown pre-dominantly in this area. ♦ Harish Rawat proved majority in Uttarakhand Harish Rawat is set to become the Chief Minister of Uttarakhand once again. He proved his majority in the floor of the house. With this, the chaos has come to an end. The floor test to prove the Congress government's majority was held after a political battle that lasted over a month with the Centre imposing President's Rule on March 27 after nine Congress MLAs voted with the BJP in the House on the budget-related Appropriation Bill on March 18. The House Speaker disqualified the rebels, and the decision was upheld later by the High Court and Supreme Court, which paved the way for the floor test. ♦ '112' to be active from January 1 The single emergency number '112' will be operational throughout India from January 1, 2017 to help people reach immediate services of police, ambulance and fire department. It is similar to the '911' all-in-one emergency service in the US. The service will also be accessible even through such SIMs and landlines whose outgoing call facility has been stopped or temporarily suspended. Persons in news ♦ Sunil Lamba: Vice-Admiral Sunil Lamba will be the next Chief of the Indian Navy. He will take over on 31st of May. He will be the 23rd Chief of Indian Navy. ♦ Enda Kenny: Enda Kenny has been re-elected as Irish Prime Minister. ♦ Sadiq Khan: Sadiq Khan has been elected the new Mayor of London - boosting Labour Party after it slumped in Scotland's elections. Mr Khan is the city's first Muslim mayor. Sports ♦ Djokovic emerged victorious Novak Djokovic beat defending champion Andy Murray in the Madrid Open final. Djokovic now moved ahead of Spain's Rafael Nadal with a record 29 ATP Masters 1000 titles. ♦ India @ fourth in jr. shooting WC The Indian squad ended their campaign at the ISSF Junior World Cup with a creditable fourth place finish in the medals table. The Indian juniors had an overall tally of three gold, four silver and three bronze medals in the competition, the winners are…. * Rituraj Singh won two gold medals in both the individual and team events of the men's 25m Standard Pistol. * Shivam Shukla won gold and a silver in pistol event * Arjun Das won gold and a bronze ♦ Among the junior women…. * Yashaswini Singh Deswal- Two silver medals, both in the individual and team sections of the 10 metre Air Pistol event. Italy topped the table with seven gold, four silver and one bronze. Russia stood second. Senior World cup is scheduled on from May 19th, will be held in Munich, Germany. - Rajendra Sharma Current Affairs Faculty, Hyderabad -
కాంపిటీటివ్ గెడైన్స్ కరెంట్ అఫైర్స
మార్క్ సెల్బీకి స్నూకర్ వరల్డ్ టైటిల్ స్నూకర్ వరల్డ్ టైటిల్‌ను మార్క్ సెల్బీ (ఇంగ్లండ్) గెలుచుకున్నాడు. షీఫీల్డ్ (చైనా)లో మే 2న జరిగిన పోటీలో జున్హుయి (చైనా)ను సెల్బీ ఓడించాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 4వ స్థానం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్షిక వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది. మే 4న విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలవగా, న్యూజిలాండ్ రెండో స్థానంలో, దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉన్నాయి. టీ-20 ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ మొదటి స్థానాన్ని దక్కించుకోగా, భారత్ రెండో స్థానంలో నిలిచింది. జకోవిచ్‌కు మాడ్రిడ్ మాస్టర్స్ టైటిల్ మాడ్రిడ్ టెన్నిస్ మాస్టర్స్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నొవాక్ జకోవిచ్ (సెర్బియా) గెలుచుకున్నాడు. మాడ్రిడ్‌లో మే 9న జరిగిన ఫైనల్లో ఆండీ ముర్రే(బ్రిటన్)పై జకోవిచ్ గెలుపొందాడు. లియాండర్ పేస్ జోడీకి ఏటీపీ ఛాలెంజర్ టోర్నీ టైటిల్ ఏటీపీ ఛాలెంజర్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ టైటిల్ ను లియాండర్ (భారత్), సామ్ గ్రోత్ (ఆస్ట్రేలియా) జోడీ గెలుచుకుంది. బుసాన్‌లో మే 8న జరిగిన ఫైనల్లో సంచాయ్, సొంచాట్ రటివటనా (థాయిలాండ్)లను ఈ జోడీ ఓడించింది. పేస్‌కు ఇది 12వ ఛాలెంజర్ టైటిల్. -
జీకే - కరెంట్ అఫైర్స్
కాంపిటీటివ్ గెడైన్స్ : కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ప్లాన్ ఫర్.. పోటీ పరీక్షల్లో రాణించాలంటే జనరల్ నాలెడ్‌జ, కరెంట్ అఫైర్స కీలకం. దాదాపు ప్రతి పోటీ పరీక్షలోనూ ఈ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)తో మొదలుకొని ఎస్.ఎస్.సి., ఆర్ఆర్బీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఆర్బీఐ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స సంస్థలు, సబ్ ఇన్స్పెక్టర్స, పోలీస్ కానిస్టేబుల్స్, డీఎస్సీ.. ఇలా ప్రతి నియామక పరీక్షలో జీకే, కరెంట్ అఫైర్స నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంత ప్రాధాన్యమున్న ఈ విభాగాల్లో ఎక్కువ మార్కులు ఎలా సాధించాలి? ఎలా ప్రిపేరవ్వాలి? ఏయే అంశాలు చదవాలో చూద్దాం. ఏ సబ్జెక్ట్‌కు అయినా నిర్దేశిత సిలబస్ ఉంటుంది. కానీ జీకే, కరెంట్ అఫైర్‌సకు మాత్రం ఎలాంటి సిలబస్ ఉండదు. ఏ అంశం నుంచైనా ప్రశ్నలు రావచ్చు. కరెంట్ అఫైర్‌సపై పట్టు సాధించాలంటే నిత్యం వార్తాపత్రికలను చదవాలి. ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోవాలి. తెలుగుతోపాటు ఒక ఆంగ్ల దినపత్రికను కూడా చదివితే కరెంట్ అఫైర్సతోపాటు ఆంగ్లంపై కూడా పట్టు సాధించవచ్చు. పత్రికలను ప్రధానంగా పరీక్షల దృష్టితో చదవాలి. బ్యాంకు పరీక్షలకైతే ఆర్నెళ్లు, యూపీఎస్సీ, రాష్ర్ట పోటీ పరీక్షలకైతే ఏడాది పాటు జరిగిన వర్తమాన అంశాలను క్షుణ్నంగా చదవాలి. గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి ప్రశ్నల సరళి, క్లిష్టతను పరిశీలించాలి. గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. పూర్వాపరాలు తెలుసుకోండి కరెంట్ అఫైర్సను బిట్ల రూపంలో చదవద్దు. అలా చదివితే త్వరగా మరిచిపోయే ఆస్కారం ఉంది. ఒక అంశం గురించి చదివినప్పుడు దాని పూర్వాపరాలను కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు 2015కుగాను బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ కుమార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించారు. ఈ అంశాన్ని ఎలా ప్రిపేరవ్వాలో చూద్దాం.. ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతదేశంలోని అత్యుత్తమ చలనచిత్ర రంగ అవార్డు. భారత చలనచిత్ర పితామహుడైన దాదాసాహెబ్ ఫాల్కే పేరిట 1969లో ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మనదేశంలో మొదటి మూకీ చిత్రమైన ‘రాజా హరిశ్చంద్ర’ను 1913లో నిర్మించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కింద రూ. 10 లక్షల నగదు, స్వర్ణకమలం, శాలువా బహూకరిస్తారు. ఈ అవార్డును తొలిసారిగా 1969లో దేవికారాణి రోరిచ్కు ప్రదానం చేశారు. ఇప్పటివరకు అయిదుగురు తెలుగు సినీ ప్రముఖులకు కూడా ఈ అవార్డును అందజేశారు. వారు.. బొమ్మిరెడ్డి నర్సింహారెడ్డి (1974), ఎల్.వి.ప్రసాద్ (1982), బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (1986), అక్కినేని నాగేశ్వరరావు (1990), రామానాయుడు (2009). మనోజ్ కుమార్.. ఉప్కార్, క్రాంతి, పూరబ్ ఔర్ పశ్చిమ్ వంటి దేశభక్తి చిత్రాల్లో హీరోగా నటించారు. ఆయన అసలు పేరు హరికృష్ణ గిరి గోస్వామి.’ ఇలా.. ఒక అంశాన్ని అన్ని కోణాల నుంచి పరిశీలించినట్లయితే ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం రాయవచ్చు. ఈ విధంగా కరెంట్ అఫైర్సను స్టాక్ జీకేతో అనుసంధానం చేస్తూ చదివితే సులభంగా గుర్తుండి పోతుంది. బ్యాంక్ పరీక్షల కోసం.. బ్యాంక్ పీవో, క్లర్క, ఆర్బీఐ, నాబార్డ, ఇన్సూరెన్స సంస్థల పోటీ పరీక్షల్లో వర్తమాన అంశాలతోపాటు బ్యాంకింగ్ రంగం నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఈ ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యే వారు బ్యాంకింగ్ అవేర్నెస్ విభాగాన్ని కూడా చదవాలి. రిజర్వ బ్యాంక్ తాజా పరపతి విధానం, ఇటీవల ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు, కమిటీలు-చైర్మన్లు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలు, నూతన ప్రైవేట్ బ్యాంకులు (బంధన్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్), స్మాల్ ఫైనాన్స బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, జన్‌ధన్ యోజన, పాలసీరేట్లు, ఏటీఎంలు, వైట్ లేబుల్ ఏటీఎంలు, బ్యాంకింగ్ పదజాలం, నో యువర్ కస్టమర్ విధానాలు, మనీ లాండరింగ్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, కరెన్సీ, నాణేలు, ప్లాస్టిక్ కరెన్సీ, నాబార్డ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు తదితర అంశాలను క్షుణ్నంగా చదవాలి. జాతీయ అంశాలు దేశంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలపై దృష్టి సారించాలి. రాజకీయ సంఘటనలు, ప్రభుత్వ పథకాలు, కమిటీలు, కమిషన్లు, ఎన్నికలు, రాష్ట్రాల్లో జరిగిన ముఖ్య సంఘటనల్ని చదవాలి. తెలుగు రాష్ట్రాలు నిర్వహించే పరీక్షలకు హాజరయ్యేవారు ప్రాంతీయ అంశాలను కూడా తెలుసుకోవాలి. అంతర్జాతీయ అంశాలు వివిధ దేశాల్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన నేతలు, అంతర్జాతీయ సదస్సులు, భారత ప్రధాని విదేశీ పర్యటనలు వంటి అంశాలను చదవాలి. శాస్త్ర, సాంకేతిక అంశాలు ఇటీవల జరిగిన అంతరిక్ష, రక్షణ, పర్యావరణ, ఆరోగ్య, ఇంధన, సమాచార, సాంకేతిక రంగాల సంఘటనలను తెలుసుకోవాలి. ఉపగ్రహాలు, వాహక నౌకలు, ఇటీవల పరీక్షించిన క్షిపణులు, ఆవిష్కరణలు, వివిధ తుపాన్లకు పెట్టిన పేర్లు, సంప్రదాయేతర ఇంధన వనరులు, సోలార్ మిషన్ తదితర అంశాలను చదవాలి. ఆర్థిక అంశాలు కేంద్ర బడ్జెట్, ఎకనామిక్ సర్వే, రైల్వే బడ్జెట్, బడ్జెట్ కేటాయింపులు, ప్రకటించిన పథకాల గురించి చదవాలి. 2011 జనాభా లెక్కలను క్షుణ్నంగా పరిశీలించాలి. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల గురించి తెలుసుకోవాలి. క్రీడలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన క్రీడాంశాలను చదవాలి. ఇటీవల జరిగిన ఆసియాకప్ క్రికెట్, అండర్-19 ప్రపంచకప్, టీ-20 క్రికెట్ ప్రపంచకప్, ఐపీఎల్, దక్షిణాసియా క్రీడలు, కోపా అమెరికా ఫుట్‌బాల్, టెన్నిస్ ట్రోఫీలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. క్రీడాకారులు వారి దేశాలు, ట్రోఫీలు, క్రీడాపదజాలం తెలుసుకోవాలి. వార్తల్లోని వ్యక్తులు - అవార్డులు ఇటీవల చేపట్టిన నియామకాలు, ఎన్నిక, ఎంపిక, మరణాలు ముఖ్యమైనవి. జాతీయ అవార్డుల్లో.. పద్మ అవార్డులు, చలనచిత్ర పురస్కారాలు, క్రీడా పురస్కారాలు, సాహిత్య అవార్డులు; అంతర్జాతీయ అవార్డుల్లో.. నోబెల్ బహుమతులు, రామన్ మెగసెసే పురస్కారాలు, ఆస్కార్ అవార్డులు, ప్రపంచ ఆహార బహుమతి, బుక్ ప్రైజ్ తదితరాల నుంచి ప్రశ్నలు వస్తాయి. స్టాక్ జీకే కోసం.. భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి రాజధానులు, జాతీయ చిహ్నాలు, కేలండర్, జనాభా, భాషలు, రవాణా వ్యవస్థ, విమానాశ్రయాలు, సమాచార వ్యవస్థ, దేశ రక్షణ రంగం, క్షిపణి వ్యవస్థ, అంతరిక్ష పరిశోధనా సంస్థ, భారత అంతరిక్ష విజయాలు, అణుశక్తి రంగం, అణు విద్యుత్ కేంద్రాలు, పరిశోధనా కేంద్రాలు అవి ఉన్న ప్రదేశాలు, నదీ వ్యవస్థ, ప్రాజెక్టులు, జాతీయ పార్కులు, శాంక్చ్యురీలు, బయోస్పియర్ రిజర్వలు, వ్యవసాయ విప్లవాలు, ప్రముఖ ఆవిష్కరణలు, అధ్యయన శాస్త్రాలు, ప్రముఖ దినోత్సవాలు, ప్రముఖ వ్యక్తుల బిరుదులు, నినాదాలు, విటమిన్లు, వ్యాధులు, సౌరకుటుంబం, నదీతీరాన వెలసిన పట్టణాలు, ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థలు, ఐరాస ప్రకటించిన సంవత్సరాలు, దశాబ్దాలు, అంతర్జాతీయ సంస్థలు, వాటి ప్రధాన కార్యాలయాలు, అధిపతులు, దేశాలు-రాజధానులు-కరెన్సీలు, పార్లమెంట్లు వంటి వాటిని చదవాల్సి ఉంటుంది. - ఎన్. విజయేందర్‌రెడ్డి కరెంట్ అఫైర్స నిపుణులు,హైదరాబాద్ -
కరెంట్ అఫైర్స
సైన్స్ అండ్ టెక్నాలజీ పీఎస్ఎల్వీ సీ-30 ప్రయోగం విజయవంతం ఖగోళ పరిశోధన కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ-30 ప్రయోగం విజయవంతమైంది. ఈ ఉపగ్రహ వాహక నౌక ద్వారా ఇస్రో 1,513 కిలోల బరువు గల ఆస్ట్రోశాట్‌ను సెప్టెంబరు 28న శ్రీహరికోటలోని షార్ నుంచి ప్రయోగించింది. ఆస్ట్రోశాట్‌తో పాటు మరో ఆరు విదేశీ ఉపగ్రహాలను భూమికి 650 కిలోమీటర్ల ఎత్తులోని సూర్యానువర్తన కక్ష్యలో ప్రవేశపెట్టింది. వీటిలో ఇండోనేషియాకు చెందిన లపాన్-2 (76 కిలోలు), కెనడాకు చెందిన యాక్సెట్ యా (14 కిలోలు), యూఎస్‌కు చెందిన లెమర్-2, 3, 4, 5 (28 కిలోలు) ఉన్నాయి. భారత్ తొలిసారి ఖగోళ పరిశోధన కోసం ఉపగ్రహాన్ని ప్రయోగించింది. శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డులు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 2015 సంవత్సరానికి ప్రతిష్టాత్మక శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుకు 11 మంది శాస్త్రవేత్తలను ఎంపిక చేసింది. జీవశాస్త్రంలో బాలసుబ్రమణియన్ గోపాల్ (ఐఐఎస్సీ- బెంగళూరు), రాజీవ్ కుమార్ వర్షణే (ఇక్రిశాట్), భూ, వాతావరణ, సాగర, గ్రహ విజ్ఞాన శాస్త్రం: జ్యోతిరంజన్ శ్రీ చందర్ రే (ఫిజికల్ సైన్స్ లేబరేటరీ- అహ్మదాబాద్), ఇంజనీరింగ్ సెన్సైస్: యోగేష్ జోషి (ఐఐటీ- కాన్పూర్), గణిత శాస్త్రం: రితబ్రత మున్షీ (టీఐఎఫ్ఆర్- ముంబై), కె.సందీప్ (టీఐఎఫ్ఆర్- బెంగళూరు), భౌతిక శాస్త్రం: బేదంగదాస్ మొహంతీ (ఎన్ఐఎస్ఈఆర్- భువనేశ్వర్), మందర్ దేశ్‌ముఖ్ (టీఐఎఫ్ఆర్- ముంబై), వైద్యశాస్త్రం: విదితా వైద్య (టీఐఎఫ్ఆర్-ముంబై), రసాయన శాస్త్రం: డి.శ్రీనివాసరెడ్డి (సీఐఎస్ఆర్-పూణె), ప్రద్యుత్ ఘోష్ (ఐఎసీఎస్- జాదవ్‌పూర్). జాతీయం రాజస్థాన్‌లో 68 శాతానికి రిజర్వేషన్లు రాజస్థాన్ శాసనసభ సెప్టెంబరు 22న ఆమోదించిన రెండు బిల్లులతో ఆ రాష్ట్రంలో రిజర్వేషన్లు 68 శాతానికి చేరాయి. ఇందులో ఒకటి స్పెషల్ బ్యాక్వర్డ్ క్లాస్(ఎస్బీసీ)లో గుజ్జర్లకు 5 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు కాగా మరొకటి ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈబీసీ)లకు 14 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లు. ఈ రెండు బిల్లులను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాల్సిందిగా కేంద్రాన్ని కోరుతూ రాజస్థాన్ శాసనసభ తీర్మానాన్ని ఆమోదించింది. భారతీయ సంపన్నుల్లో ముకేశ్ అంబానీకి మొదటి స్థానం సెప్టెంబర్ 24న ఫోర్బ్స్ మేగజీన్ ప్రకటించిన జాబితాలో ముకేశ్ అంబానీ వరుసగా తొమ్మిదోసారి మొదటి స్థానంలో నిలిచారు. 100 మంది భారతదేశంలోని అత్యంత సంపన్నుల జాబితాను ఫోర్బ్స మేగజీన్ రూపొందించింది. ముకేశ్ 18.9 బిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో నిలువగా, సన్ ఫార్మా అధినేత దిలీప్ సింఘ్వీ 18 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో, విప్రో అధినేత అజీం ప్రేమ్‌జీ 15.9 డాలర్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. అంతర్జాతీయం ఐరాస సుస్థిర అభివృద్ధి సభ ఐక్యరాజ్యసమితి (ఐరాస) సుస్థిర అభివృద్ధి సభ సెప్టెంబరు 25 నుంచి మూడు రోజుల పాటు జరిగింది. ఈ సదస్సులో వివిధ దేశాల ప్రధానులు, అధ్యక్షులు, ప్రపంచ బ్యాంకు, ద్రవ్యనిధి సంస్థల అధిపతలు పాల్గొన్నారు. ఈ సదస్సులో ప్రసంగించిన పోప్ ఫ్రాన్సిస్ కొత్త అభివృద్ధి లక్ష్యాలను స్వాగతించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ సంపన్న దేశాలు టెక్నాలజీని ఇతర దేశాలకు అందజేయాలన్నారు. ఐరాసలో సంస్కరణలు అమలు చేస్తేనే దాని విశ్వసనీయత కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. పేదరికాన్ని రూపుమాపేందుకు ఉద్దేశించిన ప్రత్యేక అభివృద్ధి అజెండాను ఐరాస జనరల్ అసెంబ్లీ సెప్టెంబరు 15న ఆమోదించింది. పేదరిక నిర్మూలన, ఆరోగ్యకర జీవనం, విద్యను ప్రోత్సహించడం, వాతావరణ మార్పులను అరికట్టడం వంటి 17 లక్ష్యాలను ఇందులో నిర్దేశించారు. వీటి సాధనకై ఏడాదికి 3.5 నుంచి 5 ట్రిలియన్ డాలర్ల వరకు వెచ్చించనున్నారు. ఐరాస సంస్కరణలకు పిలుపునిచ్చిన జీ-4 దేశాలు భారత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బ్రెజిల్, జర్మనీ, జపాన్, భారత్ దేశాలతో కూడిన జీ-4 సదస్సు సెప్టెంబరు 26న న్యూయార్క్‌లో జరిగింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి జీ-4 దేశాలకు అన్ని అర్హతలు ఉన్నాయని ఈ సందర్భంగా జీ-4 దేశాలు ప్రకటించాయి. నిర్దేశిత కాలవ్యవధిలో భద్రతామండలిని సంస్కరించాలని డిమాండ్ చేశాయి. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు, ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, ఖండాలకు ప్రాతినిధ్యం కల్పించినప్పుడే భద్రతా మండలి విశ్వసనీయత, న్యాయబద్ధత కలిగి ఉంటుందని స్పష్టం చేశాయి. దశాబ్దం తర్వాత జరిగిన ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని షింజో అబే, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌లు పాల్గొన్నారు. హజ్ యాత్ర తొక్కిసలాటలో వెయ్యి మందికి పైగా మృతి సౌదీ అరేబియాలోని మినా వద్ద సెప్టెంబరు 24న జరిగిన తొక్కిసలాటలో వెయ్యి మందికి పైగా హజ్ యాత్రికులు మరణించారు.ఇందులో 35 మంది భారతీయులు ఉన్నారని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ సెప్టెంబరు 28న తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది ఆఫ్రికా, అరబ్ దేశాలకు చెందిన వారు ఉన్నారు. మినాలో జమారత్ వద్ద సైతానును రాళ్లతో కొట్టేందుకు యాత్రికులు భారీగా రావడంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. రాష్ట్రీయం ఛత్తీస్‌గఢ్-తెలంగాణల మధ్య విద్యుత్ కొనుగోలు ఒప్పందం ఛత్తీస్‌గఢ్ నుంచి 1000 మోగావాట్ల విద్యుత్ కొనుగోలుకు తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రంతో ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సమక్షంలో సెప్టెంబరు 22న ఈ మేరకు ఇరు రాష్ట్రాల అధికారులు ఒప్పంద పత్రాలను మార్చుకున్నారు. 2014, నవంబరులో ఇరు రాష్ట్రాల మధ్య కుదిరిన 2000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో భాగంగానే తాజా ఒప్పందం జరిగింది. వచ్చే 12 ఏళ్ల పాటు ఈ ఒప్పందం అమల్లో ఉంటుంది. తెలంగాణకు మరో మూడు ఎంఎల్సీ స్థానాలు తెలంగాణకు మూడు ఎంఎల్సీ స్థానాలు కేటాయిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సెప్టెంబరు 22న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ స్థానాలను స్థానిక సంస్థల కోటా కింద రంగారెడ్డి, మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలకు ఒక్కొక్కటి కేటాయించారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 11 స్థానిక సంస్థల నియోజక వర్గాలు ఉన్నాయి. తాజాగా మరో మూడు స్థానాలు చేరడంతో ఆ సంఖ్య 14 కు చేరుకుంది. ఏపీ విద్యుత్ ప్రాజెక్టులకు రూ.9,000 కోట్ల ఆర్ఈసీ రుణం ఆంధ్ర ప్రదేశ్‌లో నిర్మించే విద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ.9,000 కోట్లు రుణం ఇచ్చేందుకు గ్రామీణ విద్యుతీకరణ సంస్థ(ఆర్ఈసీ) అంగీకరించింది. ఈ మేరకు సెప్టెంబరు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఏపీ జెన్కో, ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఈసీల మధ్య సంతకాలు జరిగాయి. ఈ మొత్తంలో రూ.3,000 కోట్లతో అనంతపురం జిల్లాలో 500 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టును నెలకొల్పుతారు. మిగిలిన మొత్తాన్ని సరఫరా, పంపిణీ నెట్‌వర్క్‌ల కోసం వినియోగించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రూ.1000 కోట్ల కేంద్ర సహాయం సెప్టెంబరు 25న ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం రూ.1000 కోట్ల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఆంధ్ర, రాయలసీమల్లోని ఏడు వెనకబడిన జిల్లాలకు ఒక్కో జిల్లాకు రూ.50 కోట్లు చొప్పున మొత్తం రూ.350 కోట్లు, రాజధాని నిర్మాణానికి రూ.350 కోట్లు, పోలవరం ప్రాజెక్టుకు రూ. 300 కోట్లు చొప్పున ఈ మొత్తాన్ని కేటాయించింది. కాకినాడ ఎల్ఎన్జీ టెర్మినల్‌కు ఒప్పందం రాష్ట్రంలో గ్యాస్ గ్రిడ్ అభివృద్ధిలో భాగంగా ఏపీ ప్రభుత్వం కాకినాడ ఎల్ఎన్జీ టెర్మినల్‌కు సంబంధించి ఒప్పందం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎపీజీడీసీ), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్), షెల్, ఇంజీ సంస్థలు ఈ మేరకు రెండు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సమక్షంలో సెప్టెంబరు 25న విజయవాడలో దీనికి సంబంధించిన సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందంలో భాగంగా రూ.1,800 కోట్ల వ్యయంతో కాకినాడ డీప్ వాటర్ పోర్టులో ఎల్ఎన్జీ ఫ్లోటింగ్ స్టోరేజీ, రీ గ్యాసిఫికేషన్ యూనిట్‌ను నెలకొల్పుతారు. క్రీడలు సానియా- హింగిస్‌లకు గ్వాంగ్జౌ ఓపెన్ టైటిల్ గ్వాంగ్జౌ ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను సానియా మిర్జా (భారత్), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ గెలుచుకుంది. చైనాలోని గ్వాంగ్జౌలో సెప్టెంబరు 26న జరిగిన ఫైనల్స్‌లో జు షిలిన్- యు జియోడి (చైనా) జోడీని ఓడించి వీరిద్దరు టైటిల్‌ను గెలుచుకున్నారు. 2015 సీజన్లో సానియాకు ఇది ఏడో టైటిల్ కాగా హింగిస్‌కు ఆరో టైటిల్. మహిళల సింగిల్స్ టైటిల్‌ను జెలెనా జంకోవిచ్ (సెర్బియా) గెలుచుకుంది. క్యాబ్ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(క్యాబ్) అధ్యక్షుడిగా టీం ఇండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ నియమితులయ్యారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సెప్టెంబరు 24న ఈ మేరకు ప్రకటన చేశారు. క్యాబ్ అధ్యక్షుడిగా ఉన్న జగ్మోహన్ దాల్మియా మరణంతో క్యాబ్ పగ్గాలను గంగూలీ చేపట్టారు. 2016లో క్యాబ్ ఎన్నికలు జరిగే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. పంకజ్ అద్వానీకి ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ ఐబీఎస్ఎఫ్ ప్రపంచ బిలియర్డ్స్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను పంకజ్ అద్వానీ (భారత్) గెలుచుకున్నాడు. ఆడిలైడ్ (ఆస్ట్రేలియా)లో సెప్టెంబరు 27న జరిగిన ఫైనల్లో పీటర్ గిల్‌క్రిస్ట్ (సింగపూర్) ను పంకజ్ ఓడించాడు. ఇది పంకజ్కి 14వ టైటిల్. హామిల్టన్‌కు జపాన్ గ్రాండ్ ప్రీ టైటిల్ ఫార్ములా వన్ జపాన్ గ్రాండ్ ప్రీ టైటిల్‌ను మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ గెలుచుకున్నాడు. సెప్టెంబరు 27న జరిగిన రేసులో హామిల్టన్ మొదటి స్థానంలో నిలువగా నికో రోస్‌బర్గ్ రెండో స్థానం, వెటల్ మూడో స్థానంలో నిలిచారు. సంక్షిప్తంగా తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను ఈ-పంచాయతీలుగా తీర్చిదిద్దనుంది. ఈ మేరకు అక్టోబర్ 2న మొదట దశలో 104 పంచాయతీల్లో ఈ-సేవలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు, పింఛనర్ల కోసం ప్రవేశపెట్టిన ఉచిత వైద్య సేవల పథకం అక్టోబరు 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ పథకాన్ని జర్నలిస్టులకు కూడా అమలు చేయననున్నారు.స్వచ్ఛభారత్ నిధుల సమీకరణ కోసం టెలికాం సేవలు, పెట్రోలు, బొగ్గు, ఇనుప ఖనిజం వంటి వాటిపై సుంకం (సెస్సు) విధించాలని ముఖ్యమంత్రులతో కూడిన ఉపసంఘం సిఫార్సు చేసింది. -
కరెంట్ అఫైర్స్
రాష్ట్రీయం పట్టిసీమ పథకం ప్రారంభం పశ్చిమ గోదావరి జిల్లాలోని పట్టిసీమ వద్ద గోదావరిపై నిర్మించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు సెప్టెంబరు 16న ప్రారంభించారు. రూ.1300 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు ద్వారా 80 టీఎంసీల గోదావరి నదీ జలాలను పోలవరం కుడి కాల్వ ద్వారా 174 కి.మీ తరలించి కృష్ణా నదిలో కలపనున్నారు. ఈ నీటిని కృష్ణా బ్యారేజ్ ద్వారా కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని ఆయకట్టుకు అందిస్తారు. సీఎం కేసీఆర్ చైనా పర్యటన విజయవంతం తెలంగాణ ముఖ్యమంత్రి సెప్టెంబరు 7 నుంచి 16 వరకు పది రోజుల పాటు చైనాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో ప్రసంగించారు. తెలంగాణ ప్రభుత్వం అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తుందని సీఎం సదస్సులో పాల్గొన్న ప్రతినిధులకు తెలిపారు. సీఎం పర్యటన సందర్భంగా చైనాకు చెందిన బహుళజాతి సంస్థ వాండా కంపెనీ గ్రేటర్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం రూ.6 లక్షలకు పెంపు తెలంగాణ ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఇచ్చే పరిహారాన్ని రూ.6 లక్షలకు పెంచింది. ఈ మేరకు సెప్టెంబరు 19న సమావేశమైన రాష్ర్ట మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తంలో రూ.5 లక్షలు రైతు కుటుంబానికి, రూ.1 లక్షను రైతులు చెల్లించాల్సిన అప్పుకు వన్‌టైం సెటిల్మెంట్గా అందజేస్తారు. సైన్స్ అండ్ టెక్నాలజీ అమోఘ-1 క్షిపణి పరీక్ష విజయవంతం యాంటీ ట్యాంక్ గెడైడ్ మిస్సైల్ అమోఘ-1ను సెప్టెంబరు 10న భారత్ విజయవంతంగా పరీక్షించింది. యాంటీ ట్యాంక్ గెడైడ్ మిస్సైల్‌ను మధ్యప్రదేశ్‌లోని బాబినా ఆర్మీ రేంజ్ నుంచి విజయవంతంగా ప్రయోగించినట్లు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) తెలిపింది. ఈ క్షిపణి 2.8 కి.మీ పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. హైదరాబాద్‌లోని బీడీఎల్‌లో దీన్ని అభివృద్ధి చేశారు. సతీష్‌రెడ్డికి మోక్షగుండం అవార్డు రక్షణమంత్రి శాస్త్రీయ సలహాదారు, రక్షణ శాఖ పరిశోధనా కేంద్రం ఇమారత్ డెరైక్టర్ జి. సతీష్‌రెడ్డికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య స్మారక అవార్డు లభించింది. సెప్టెంబరు 15న హైదరాబాద్‌లో ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ సతీష్‌రెడ్డికి ఈ అవార్డును ప్రదానం చేసింది. 20 చిన్న ఉపగ్రహాలను ప్రయోగించిన చైనా ఉపగ్రహ వాహక నౌక లాంగ్ మార్చ్-6 ద్వారా చైనా ఒకేసారి 20 సూక్ష్మ ఉపగ్రహాలను రోదసిలో ప్రవేశపెట్టింది. సెప్టెంబరు 20న షాంఘై ప్రావిన్సులోని తైయువాన్ నుంచి ప్రయోగించిన ఈ రాకెట్లో ఇంధనంగా కాలుష్య రహిత ఇంధనాలు ద్రవ ఆక్సిజన్, కిరోసిన్‌లను ఉపయోగించారు. అంతర్జాతీయం అమల్లోకి వచ్చిన నేపాల్ రాజ్యాంగం నేపాల్‌లో సెప్టెంబరు 20 నుంచి చారిత్రాత్మక రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. దీంతో నేపాల్ పూర్తి స్థాయి లౌకిక, ప్రజాస్వామ్య, సమాఖ్య, గణతంత్ర రాజ్యంగా అవతరించింది. 239 ఏళ్ల నేపాల్ రాచరికం 2008లో రద్దయింది. కొత్త రాజ్యాంగం ప్రకారం రెండు చట్ట సభలు ఉంటాయి. ప్రతినిధుల సభ, దిగువసభలో 375 మంది, ఎగువసభలో 60 మంది సభ్యులు ఉంటారు. ఏడు ప్రావిన్సు(రాష్ట్రాలతో)లతో సమాఖ్య ఏర్పడుతుంది. దక్షిణ మైదాన ప్రాంతంలో మైనారిటీ గ్రూపులు తమ ప్రావిన్సుల విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఐరాసలో సంస్కరణలకు తొలి అడుగు ఐక్యరాజ్యసమితి(ఐరాస)లో చేపట్టాల్సిన సంస్కరణలకు సంబంధించిన చర్చా పత్రానికి ఐరాస సర్వప్రతినిధి సభ సెప్టెంబరు 14న ఆమోదం తెలిపింది. ఏడేళ్ల అనంతరం సభలో ముసాయిదా ఆధారంగా చర్చ జరుగనుంది. ఈ చర్చా పత్రంలో భద్రతా మండలి సంస్కరణలపై సభ్యదేశాల వైఖరి, భద్రతామండలి శాశ్వత, తాత్కాలిక సభ్యత్వాన్ని ఏవిధంగా విస్తరించాలి వంటి అంశాలున్నాయి. భద్రతామండలిలో సంస్కరణ లు చేపట్టాలని భారత్ కోరుతోంది. ఆస్ట్రేలియా ప్రధానిగా మాల్కొమ్ టర్న్‌బుల్ ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా మాల్కొమ్ టర్న్‌బుల్ సెప్టెంబరు 15 పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ నెల 14న లిబరల్ పార్టీ ఆయన్ను ప్రధాన మంత్రి అభ్యర్థిగా ఎన్నుకుంది. పార్టీ అధినేత కోసం జరిగిన ఎన్నికల్లో గత ప్రధాని టోనీ అబాట్‌కు 44 ఓట్లు రాగా, టర్న్‌బుల్‌కు 54 ఓట్లు లభించాయి. దీంతో టోనీ అబాట్ ప్రధాని పదవి కోల్పోవలసి వచ్చింది. అబాట్‌కు ప్రజల్లో ఆదరణ తగ్గడంతో లిబరల్ పార్టీ టర్న్‌బుల్‌ను ప్రధానిగా ఎన్నుకుంది. 2017 జనవరిలో ఆస్ట్రేలియా పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. కంబోడియాతో రెండు ఒప్పందాలు భారత ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ మూడు రోజుల కంబోడియా పర్యటనలో భాగంగా సెప్టెంబరు 15న ఆ దేశ ప్రధానమంత్రి హున్ సేన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య టూరిజం, ఐదు క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టులకు సంబంధించిన మొకాంగ్-గంగా సహకార కార్యక్రమంపై అవ గాహన ఒప్పందాలు కుదిరాయి. పర్యటనలో భాగంగా అన్సారీ కంబోడియా మంత్రిమండలి కార్యాలయంలో మంత్రులను ఉద్దేశించి ప్రసంగించారు. రచయిత్రి జాకీ కోలిన్స్ మృతి ప్రముఖ బ్రిటన్ రచయిత్రి జాకీ కోలిన్స్ (77) లాస్ ఏంజిలెస్‌లో సెప్టెంబరు 20న మరణించారు. ఆమె రాసిన 30కి పైగా పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా 500 మిలియన్ల సంఖ్యలో అమ్ముడయ్యాయి. ఆమె 1968లో రాసిన మొదటి నవల ‘ద వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ మ్యారీడ్ మెన్’ బాగా ప్రాచుర్యం పొందింది. ద స్టడ్, రాక్‌స్టార్ ఆమె ఇతర ప్రముఖ నవలలు. గ్రీస్ ప్రధానిగా సిప్రాస్ తిరిగి ఎన్నిక అలెక్సిస్ సిప్రాస్ సెప్టెంబరు 21న గ్రీసు ప్రధానిగా రెండోసారి ఎన్నికయ్యారు. గ్రీసు పార్లమెంటుకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 300 స్థానాలకు వామపక్ష పార్టీ సిరిజా నాయకుడు అలెక్సిస్ సిప్రాస్ 145 స్థానాల్లో విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి న్యూ డెమొక్రసీ నాయకుడు వాంగెలిస్ మీమరాకిస్‌కు 75 స్థానాలు దక్కాయి. రుణ సంక్షోభం నేపథ్యంలో ఆగస్టులో సిప్రాన్ ప్రధాని పదవికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్లారు. జాతీయం ఎస్పీఎంఆర్ఎం మిషన్‌కు కేబినెట్ ఆమోదం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక, సామాజిక, మౌలిక వసతుల అభివృద్ధికి ఉద్దేశించిన శ్యామ ప్రసాద్ ముఖర్జీ రర్బన్(రూరల్-అర్బన్) మిషన్ (ఎస్పీఎంఆర్ఎం)కు కేంద్ర కేబినెట్ సెప్టెంబరు 16న ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చే మూడేళ్లలో రూ.5,142.08 కోట్లు వెచ్చించనున్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 300 గ్రామీణ క్లస్టర్లను ఏర్పాటు చేయనున్నారు. గత యూపీఏ ప్రభుత్వం ప్రారంభించిన పురపథకం స్థానంలో ప్రభుత్వం గతేడాది ఎస్పీఎంఆర్ఎంను ప్రకటించింది. క్లస్టర్స్ అభివృద్ధిలో 14 అంశాలను పేర్కొన్నారు. ఇందులో డిజిటల్ అక్షరాస్యత, సంచార ఆరోగ్య కేంద్రం, రోడ్ల అనుసంధానం, ఆర్థిక కార్యక్రమాలతో ముడిపడిన నైపుణ్య అభివృద్ధి తదితర అంశాలు ఉన్నాయి. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ-పట్టణ ప్రాంతాల మధ్య వ్యత్యాసం తగ్గించడం,గ్రామీణ వలసలను తగ్గించడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు పరిచేందుకు చర్యలు తీసుకుంటారు. శ్రీలంక ప్రధానమంత్రి భారత్ పర్యటన శ్రీలంక ప్రధానమంత్రి విక్రమ సింఘే భారత పర్యటనలో భాగంగా సెప్టెంబరు 15 భారత ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. భారత్ భాగస్వామ్యం, హిందూ మహాసముద్రంలో భద్రత, ఉగ్రవాదం, తమిళుల సమస్యలు, శ్రీలంకలో మానవ హక్కుల పరిస్థితి తదితర అంశాలు వారి మధ్య చర్చకొచ్చాయి. శ్రీలంక ప్రధాని పర్యటన సందర్భంగా రెండు దేశాలు నాలుగు ఒప్పందాలపై సంతకాలు చేశాయి. వీటిలో సార్క్ ఉపగ్రహ ప్రయోగం, ఆరోగ్య రక్షణ, అంతరిక్ష శాస్త్రాలకు సంబంధించినవి ఉన్నాయి. క్రీడలు నేషనల్ ఓపెన్ అథ్లెటెక్స్ ఛాంపియన్‌గా రైల్వేస్ కోల్‌కతాలో సెప్టెంబరు 19లో ముగిసిన జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ ఓవరాల్ ఛాంపియన్‌గా రైల్వేస్ నిలిచింది. మొత్తం 267 పాయింట్లతో రైల్వేస్ మొదటి స్థానంలో నిలువగా, ఓఎన్జీసీ(185),సర్వీసెస్(174.5) వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ ఛాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఒక్క పతకం కూడా దక్కలేదు. బీసీసీఐ అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా మృతి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా (75) అనారోగ్యంతో సెప్టెంబరు 20న కోల్‌కతాలో మరణించారు. ఈ ఏడాది మార్చి నుంచి బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలో ఆయన బీసీసీఐ (2001-2004), ఐసీసీ(1997-2000) అధ్యక్షులుగా సేవలందించారు. 1987, 1996 ప్రపంచకప్‌ల నిర్వహణలో దాల్మియా కీలకపాత్ర పోషించారు. వెటెల్‌కు సింగపూర్ గ్రాండ్ ప్రి టైటిల్ ఫార్ములావన్ సింగపూర్ గ్రాండ్ ప్రి టైటిల్‌ను ఫెరారీ డ్రైవర్ సెబాస్టియన్ వెటల్ గెలుచుకున్నాడు. సింగపూర్‌లో సెప్టెంబరు 20న జరిగిన రేసులో వెటల్ మొదటి స్థానంలో నిలువగా, డేనియల్ రికియార్డో రెండో స్థానంలో నిలిచాడు. కొరియా ఓపెన్ టైటిల్ కొరియా బ్యాడ్మింటన్ ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్‌ను టాప్ సీడ్ చెన్ లాంగ్ (చైనా) గెలుచుకున్నాడు. సెప్టెంబరు 20న సియోల్‌లో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అజయ్ జయరామ్ (భారత్)ను చెన్ లాంగ్ ఓడించాడు. సంక్షిప్తంగా రాజమండ్రి పుష్కరాల తొక్కిసలాట దుర్ఘటనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి సీవై సోమయాజులతో న్యాయ విచారణ కమిటీని నియమించింది. ఏపీ నూతన రాజధాని అమరావతిలో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం తమ శాఖను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంబ్రిడ్జి ప్రతినిధి జెన్నిఫర్‌కు మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.ఉపాధి హామీ పథకాన్ని 100 రోజుల నుంచి 150 రోజులకు పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.విజయవాడ (ఏపీ), కురుక్షేత్ర (హర్యానా), భోపాల్ (మధ్యప్రదేశ్), జోరాట్ (అసోం)లలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎన్‌ఐడీలకు నలుగురు డెరైక్టర్ల నియామకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.యూపీ సచివాలయంలోని 368 ప్యూన్ పోస్టులకు రికార్డు స్థాయిలో 23 లక్షల దరఖాస్తులు వచ్చాయి. వీరిలో 1.5 లక్షల గ్రాడ్యుయేట్లు, 255 పీహెచ్‌డీలు ఉండటం విశేషం.నేతాజీకి సంబంధించిన 64 రహస్య ఫైళ్లను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం బయటపెట్టింది. -
‘కీ’లకం కరెంట్ అఫైర్సే
* ఎప్పటికప్పుడు అప్డేట్ కావాలి * ‘డిస్క్రిప్టివ్ నుంచి ఆబ్జెక్టివ్’కు ప్రిపేరవ్వాలి * దేన్నయినా ఒకటికి రెండుసార్లు కన్ఫర్మ్ చేసుకోవాలి * గ్రూప్స్ అభ్యర్థుల ప్రిపరేషన్ విధానం ఎలా ఉండాలంటే... * ‘సాక్షి’తో టీఎస్పీఎస్సీ సిలబస్ కమిటీ సభ్యుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ సాక్షి, హైదరాబాద్: ‘‘కరెంట్ అఫైర్స్ (సమకాలీన అంశాలు) ప్రత్యేక సబె ్జక్టు కాదు. పలు సబ్జెక్టులకు సంబంధించిన తాజా అంశాలు, వాటిలోని మార్పులనే కరెంట్ అఫైర్స్‌గా పేర్కొంటాం. మరోలా చెప్పాలంటే అన్ని రకాల సబ్జెక్టుల అంశాల కొనసాగింపేనన్నమాట. ఏ పోటీ పరీక్షకైనా కరెంట్ అఫైర్స్‌ది ప్రత్యేక స్థానం. వాటిపై సంపూర్ణ అవగాహన ఉన్న అభ్యర్థులకు పోటీ పరీక్షల్లో విజయం నల్లేరుపై నడకే’’ అని ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం జర్నలిజం ప్రొఫెసర్‌గా, బిట్స్ పిలానీ ఎకనామిక్స్ విజిటింగ్ ప్రొఫెసర్‌గా, ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్ సంస్థల్లో ఫ్యాకల్టీగా కరెంట్ అఫైర్స్ బోధనలో ప్రత్యేక స్థానమున్న ఆయన... గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేష న్పై ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. విశేషాలు... కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో అభ్యర్థులు ప్రధానంగా ఆరు రకాల అంశాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. సబ్జెక్టేమిటి, సమకాలీన అంశమేమిటన్న తేడాలు తెలుసుకోవాలి. ఉదాహరణకు ఆర్థిక వ్యవస్థలో జీఎస్డీపీ అని చదువుకున్నాం. దాన్ని కరెంట్ అఫైర్స్ కింద అడిగేప్పుడు వ్రస్తుతం జీఎస్డీపీ ఎంత? అందులో ధోరణులేమిటి? జీఎస్డీపీలో ఏ రంగం వాటా ఎంత? ఆయా రంగాల్లో తేడాలెలా వస్తున్నాయి? ఏ రంగం పురోగతిలో ఉంది? ఏది తగ్గుతోంది? ఇలాంటివన్నీ వస్తాయి. ఇక జీఎస్డీపీ అంటే ఏమిటనేది ఎకానమీ అవుతుంది. భారత రాజ్యాంగమంటే పాలిటీ అవుతుంది. ఇటీవల తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కనుక రాష్ట్రం ఏర్పాటు, సంబంధిత పరిణామాలన్నీ కరెంట్ అఫైర్సే అవుతాయి. 1. సబ్జెక్టు చదువుతూ ముందుకు: సంబంధిత సబ్జెక్టు చదువుతూ, అందులో భాగంగా సమకాలీన అంశాలను చదువుకోవాలి. సబ్జెక్టు చదవకుండా కేవలం సమకాలీన అంశాలే చదివితే ప్రయోజనకరం కాదు. 2. సాధికారిక వనరుల నుంచే చదువుకోవాలి. చాలామంది పత్రికలపై ఆధారపడతారు. వాటిల్లోనూ తప్పులు రావచ్చు. కాబట్టి ఒకటికి రెండుసార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి. విమర్శనాత్మకంగా, తులనాత్మకంగా చదువుకోవాలి. 3. సమకాలీన అంశాలను కాన్సెప్ట్‌తో కలిపి చదవాలి. దాంతోపాటు ఆ అంశానికి సంబంధించిన నేపథ్యాన్నీ కలిపి చదివితే ఎక్కువగా గుర్తుంటుంది. సమగ్ర అవగాహనకూ ఉపయోగపడుతుంది. కేవలం ఆబ్జెక్టివ్ టైపే చదివి ఊరుకుంటే విషయంలో స్పష్టత లేక పరీక్షలో నష్టపోతారు. ఉదాహరణకు జీఎస్ఎల్వీ ప్రయోగం తీసుకుంటే సైన్స్ టెక్నాలజీలో సమకాలీన అంశం. అది గుర్తుండాలన్నా, దాని ప్రత్యేకత అర్థం కావాలన్నా భారత రోదసీ రంగ ం మొత్తం చదవాలి. అందులో విజయాలేమిటన్నది చదవాలి. అప్పుడే దాని బ్యాక్‌గ్రౌండ్‌తోపాటు అన్నీ తెలుస్తాయి. అప్పుడు ప్రశ్న ఎలా అడిగినా సమాధానం రాయడం సులభమవుతుంది. 4. సమకాలీన అంశాలను నిరంతరం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. తెలంగాణ రాష్ట్ర వృద్ధి రేటు ప్రస్తుతమెంత అని అడిగితే ఈ రోజు ఉన్న వృద్ధి రేటు రాస్తాం. కానీ పరీక్ష ఆరు నెలలు వాయిదా పడితే సమాధానం మారిపోతుంది. కాబట్టి అంశాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. 5. సమకాలీన అంశాలను విశ్లేషించుకుంటూ చదవాలి. ద్రవ్యోల్బణం రేటు ఎంత అనేది సమాచారం. కాని విశ్లేషణాత్మకంగా చదవాలంటే అందులో ఉండే ధోరణులేమిటి? లక్షణాలేమిటి? ఎందుకు తగ్గుతోంది? ఇలాంటివన్నీ విశ్లేషించాలి.ఉదాహరణకు టోకు ధరల సూచీ తగ్గుతోంది. కాని వినిమయ ధరల సూచీ పెరుగుతోంది. అందులోనూ ముఖ్యంగా పప్పుదినుసుల సూచీ పెరుగుతోంది. వస్తు తయారీ రంగ ధరల సూచీ తగ్గుతోంది. ఇలా అనేకముంటాయి. కాబట్టి ప్రిపరేషన్లో విశ్లేషణాత్మకంగా ఉండాలి. ఇదివరకట్లా ఆహార ద్రవ్యోల్బణం రేటెంత తరహాలో ఇప్పుడు ప్రశ్నలడగటం లేదు. ఆహార ద్రవోల్బణానికి కారణాలేమిటంటూ లోతుగా ప్రశ్నిస్తున్నారు. ఆహార ద్రవ్యోల్బణంపై సంపూర్ణంగా చదివితే తప్ప లాభముండదు. అందుకే సమకాలీన అంశాలను ఫ్యాక్ట్ బేస్డ్‌గానే కాకుండా అనాలసిస్ బేస్డ్గా చదవాలి. ప్రిపరేషన్లో విషయమే గాక విశ్లేషణా ఉండాలి. 6. డిస్క్రిప్టివ్ టు ఆబ్జెక్టివ్: డిస్క్రిప్టివ్‌గా ప్రిపేరై ఆబ్జెక్టివ్‌గా సమాధానాలు రాయాలి. కానీ ఇప్పుడంతా ఆబెక్టివ్గా చదువుతున్నారు. అది సరికాదు. డిస్క్రిప్టివ్‌లో లాజికల్ పద్ధతిలో ప్రిపరేషన్ ఉంటుంది. అలాగాక ఆబ్జెక్టివ్‌గా ప్రిపేరైతే దేని గురించి చదువుతున్నదీ అర్థం కాదు. అందుకే పరీక్ష ఆబ్జెక్టివ్‌గా రాసినా ప్రిపరేషన్ మాత్రం డిస్క్రిప్టివ్‌గా చదవాలి. వివాదాస్పద అంశాలపై ఎలా రాయాలంటే... వివాదాస్పద అంశాలపై ప్రశ్నలకు సమాధానాలు జాగ్రత్తగా రాయాలి. సాధారణంగా ఒక అంశంపై ప్రభుత్వానికి అనుకూలంగా రాయాలా, వ్యతిరేకంగానా అనే ప్రశ్న సహజంగా గ్రూప్-1లో డిస్క్రిప్టివ్‌లో వస్తుంది. ఇది ఆలోచనకు సంబంధించినది. కార్మిక సంస్కరణలను తీసుకుంటే వీటిపై ఏం రాయాలన్న అనుమానాలుంటాయి. అలాంటప్పుడు వాటిపై ఇలా రాయాలి... 1. భారతదేశంలో కార్మిక సంస్కరణలు మంచివనే అభిప్రాయముంది, చెడ్డవనీ ఉంది. ప్రభుత్వ ఆలోచనల ప్రకారం ఇది మంచి అని, విమర్శకుల దృష్టిలో చెడు అని ఉంది. పరీక్ష రాసేప్పుడు దీన్ని సిద్ధాంతాలకు, ఆకాంక్షలకు అతీతంగా చూడాలి. భిన్న వాదనలు రాయాలి. అవి రాస్తూ, అభ్యర్థి తనపరంగా కూడా హేతుబద్ధమైన అభిప్రాయానికి రావచ్చు. కానీ అది హేతుబద్ధంగా, విశ్లేషణాత్మకంగా, మేధోపరమైన అభిప్రాయంగా ఉండాలి. అంతేతప్ప సిద్ధాంతపరమైన అభిప్రాయంగా ఉండొద్దు. కార్మిక సంస్కరణలు ప్రయోజనకరం కాదని, దోపిడీకి కారణాలని... ఇలా ఏకపక్షంగా రాయొద్దు. అదే సమయంలో సంస్కరణలు మాత్రమే శరణ్యమనీ రాయొద్దు. అభ్యర్థులకు సమాజాన్ని నిశితంగా పరిశీలించే సామర్థ్యం ఉందా, లేదా అని మాత్రమే గ్రూప్-1 వంటి పరీక్షల్లో చూస్తారు. అంతేతప్ప ప్రభుత్వానికి వందిమాగధులుగానో, వైరిపక్షులుగానో ఉండాలని ఆశించరు. ఎందుకంటే ఈ రెండూ కరెక్టు కాదు. కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగానో, వ్యతిరేకంగానో రాయాల్సిన అవసరం లేదు. భిన్న వాదనలు రాయాలి. హేతుబద్ధమైన అభిప్రాయానికి రావచ్చు. కాకపోతే ప్రభుత్వోద్యోగానికి పోతూ ప్రభుత్వ వ్యతిరేక అభిప్రాయం రాయడం సరికాదు. 2. ‘మేకిన్ ఇండియా’ను తీసుకుంటే... ఈ కార్యక్రమమే బోగసని రాస్తే అది తప్పు. అమలులో ఇబ్బందులుంటే వాటిని రాయడంలో అభ్యంతరం లేదు. లేదా విమర్శకులు అభిప్రాయాలిలా ఉన్నాయని రాయొచ్చు. అంతే తప్ప సొంత అభిప్రాయంగా రాయొద్దు. భిన్నాభిప్రాయాలను, విమర్శలను రాయాల్సి వచ్చినపుడు విమర్శకుల అభిప్రాయంగానే రాయాలి. ఇలా వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. 3. న్యాయమూర్తుల నియామకాలు జరిపే కొలీజియం వ్యవస్థను రద్దు చేసి న్యాయ నియామకాల కమిషన్ వేసిన విషయం తీసుకుంటే.. దాని ప్రయోజనాలేమిటని ప్రభుత్వం చెబుతోందో రాయాలి. అలాగే సుప్రీంకోర్టు ఏం చెబుతోంది, దాని అభిప్రాయమేమిటన్నదీ రాయా లి. రెండిటినీ విశ్లేషించి, మీకో అభిప్రాయం ఏర్పడితే అది కూడా రాయాలి. కానీ ప్రభుత్వ అభిప్రాయాన్నో, సుప్రీంకోర్టు అభిప్రాయాన్నో ఖండించేలా ఉండొద్దు. మేధోపరమైన విశ్లేషణలతో కూడిన అభిప్రాయంగా రాయొచ్చు. రెండు రకాలుగా అంశాల విశ్లేషణ కొన్ని సాధారణాంశాలూ ఉంటాయి. కొన్ని నిర్దిష్టమైన అంశాలుంటాయి, ఒక అంశంపై ప్రశ్నను సాధారణంగా అడిగినపుడు, ఒక పాయింట్ తీసుకొని దాన్ని బలపరిచే అంశాలను, విశ్లేషణను రాయాలి. ఉదాహరణకు భారత ఆర్థిక పరిస్థితి సంక్షోభంలో ఉందా అనడిగితే.. ముందుగా ఆర్థిక సంక్షోభమంటే ఏమిటో నిర్వచించాలి. ఆర్థిక వ్యవస్థకు కొలబద్ధ ఏమిటో విశ్లేషించాలి. ఆర్థిక వ్యవస్థకు కొలబద్ధలు 1. వృద్ధిరేటు, 2. ఎగుమతులు, దిగుమతులు, 3. విదేశీ మారకద్రవ్య నిల్వలు, 4.ద్రవ్యోల్బణం, 5.ద్రవ్యలోటు, 6. ప్రస్తుత ఖాతాల లోటు 7. రుణభారం. ఇలాంటి అంశాలను తీసుకోవాలి. ప్రతి అంశంలో వాస్తవాలేమిటో విశ్లేషించాలి. వాట న్నింటినీ కలిపి తే వచ్చే సమగ్ర రూపాన్ని సమాధానంగా రాయాలి. అంతేతప్ప ఏదో ఒక పాయింట్ పట్టుకుని, దాని ఆధారంగా సూత్రీకరణకు రాకూడదు. సూత్రీకరణ ఎప్పుడు సమగ్రంగా, ప్రామాణిక సమాచారం ఆధారంగా ఉండాలి. మరీ అన్ని కోణాలనూ విశ్లేషించేలా ఉండొద్దు. అలాగని మరీ పరిమితమైన కోణంలోనూ ఉండొద్దు. నిర్దిష్టమైన అంశాలు నిర్దిషమైన ప్రశ్న అడిగితే జవాబూ నిర్దిష్టంగానే రాయాలి. ద్రవ్యోల్బణంపై ప్రశ్న అడిగితే దాని పైనే జవాబు రాయాలి. అంతే తప్ప జనరల్‌గా అన్నీ కలిపి జవాబు కింద రాయొద్దు. అందు కే అడిగిన ప్రశ్నను ముందు అర్థం చేసుకోవాలి. ఏమడిగారు, జవాబెలా రాయాలన్నది అర్థం చేసుకోవాలి. అదే సమయంలో సాధారణ అంశంపై ప్రశ్న అడిగితే ఏదో ఒక అంశంపై నిర్దిష్టమైన జవాబు రాసినా మార్కులు రావు. నిర్దిష్టమైన ప్రశ్నకు తెలిసిన సమాచారమంతా రాసినా అంతే. సమపాళ్లలో సమకాలీన అంశాలు అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయాంశాలన్నీ దాదాపు సమపాళ్లలో ఉంటాయి. ఇప్పుడు ప్రాంతీయమంటే ఒక్క తెలంగాణవే. గతంలో ఉమ్మడి ఏపీ అంతా ప్రాంతీయ. అలాగని ఇప్పుడు ఏపీ గురించి అడగరా అంటే అడుగుతారు. అయితే అవి జాతీయాంశాల్లోకి వెళ్లవచ్చు. ఈ ఏడాదిలో తెలంగాణకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమాలు, ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక, సాంస్కృతిక పరిణామాలు. నియామకాలు. ప్రభుత్వ విధానాలు. పథకాల వంటివాటిపై కరెంట్ అఫైర్స్‌లో ప్రశ్నలడగొచ్చు. అన్నీ కచ్చితంగా సమపాళ్లలో ఉండకపోయినా మొత్తంమీద సమతుల్యత పాటిస్తారు. సబ్జెక్టుల్లోనూ అంతే. రాజకీయ, భౌగోళిక, ఆర్థిక, శాస్త్ర సాంకేతికాంశాలు, ప్రదేశాలు, సంఘటనలను దాదాపు సమపాళ్లలోనే అడుగుతారు. ఫ్యాక్ట్స్‌ను తెలుసుకోవాలంటే.. ఏ పరీక్షలోనైనా జవాబులు రాసేప్పుడు ఫ్యాక్ట్స్‌ను (వాస్తవాంశాలను) జాగ్రత్తగా పరిశీలించాలి. ఇవి మూడు రకాలుగా ఉంటాయి. 1. అబ్సల్యూట్, 2. ఎనలిటికల్, 3. లింక్డ్ ఫ్యాక్ట్స్ ఉదాహరణకు ద్రవ్యోల్బణరేటనేది అబ్సల్యూట్ ఫ్యాక్ట్. దానికి సంబంధించిన ఇతర అనేకాంశాలు లింక్డ్ ఫ్యాక్ట్స్. ఇక పలు అంశాల మధ్య సంబంధం గురించి చర్చిందేది విశ్లేషణాత్మక ఫ్యాక్ట్స్. కృష్ణా గోదావరి అనుసంధానం తీసుకుంటే, నదుల అనుసంధానం ఫ్యాక్ట్. తత్సంబంధిత ఇతర అంశాలు లింక్డ్ ఫ్యాక్ట్స్. నదుల అనుసంధానానికి సంబంధించిన ఇతర ప్రతిపాదనలు తదితరాలన్నమాట. ఇక అనుసంధానంపై భిన్నాభిప్రాయాలు, అనుభవాలు, పరిణామాలు విశ్లేషణాత్మక ఫ్యాక్ట్స్. -
కరెంట్ అఫైర్స్
గోల్డ్ బాండ్, గోల్డ్ డిపాజిట్ పథకాలకు కేబినెట్ ఆమోదం గోల్డ్ బాండ్, గోల్డ్ డిపాజిట్ పథకాలకు కేంద్ర కేబినెట్ సెప్టెంబరు 9న ఆమోదం తెలిపింది. దేశీయంగా బంగారం డిమాండ్ తగ్గించేందుకు ప్రభుత్వం ఈ పథకాలను ప్రారంభిస్తోంది. అదే విధంగా ఇళ్లకు పరిమితమవుతున్న బంగారాన్ని మార్కెట్ వ్యవస్థలోకి తీసుకొచ్చేందుకు కూడా ఈ పథకాలు ఉపయోగపడతాయి. వీటివల్ల బంగారం దిగుమతులు తగ్గుముఖం పడతాయి. బంగారానికి ప్రత్యామ్నాయంగా ఆర్థిక ఆస్తులను అభివృద్ధి చేసేందుకు బంగారం బాండ్ల (ఎస్జీబీ) పథకాన్ని ప్రారంభించాలని ఈ ఏడాది బడ్జెట్లో ప్రతిపాదించారు. దీనికి అనుగుణంగా కేబినెట్ తాజాగా నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంకు ఈ బాండ్లను జారీచేస్తుంది. వ్యాపారానికి అనువైన రాష్ట్రాల్లో గుజరాత్‌కు మొదటి స్థానం వ్యాపారానికి అనువైన రాష్ట్రాలకు సంబంధించి ప్రపంచ బ్యాంకు రూపొందించిన జాబితాలో గుజరాత్ మొదటి స్థానంలో నిలిచింది. పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐఐపీ), సీఐఐ, ఫిక్కీ, కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీతో కలిసి ప్రపంచ బ్యాంకు రూపొందించిన నివేదిక సెప్టెంబరు 14న విడుదలైంది. జాబితాలో ఆంధ్రప్రదేశ్‌కు రెండో స్థానం, జార్ఖండ్‌కు మూడో స్థానం లభించింది. తెలంగాణ 13వ స్థానంలో నిలిచింది. అరుణాచల్‌ప్రదేశ్ చివరి స్థానంలో ఉంది. స్థల కేటాయింపులు, కార్మిక సంస్కరణలు, పర్యావరణ అనుమతులు, వ్యాపారాల ఏర్పాటుకు అనువైన పరిస్థితులు, మౌలిక సదుపాయాలు వంటి 8 ప్రాతిపదికల ఆధారంగా నివేదికను రూపొందించారు. అంతర్జాతీయం సింగపూర్ పార్లమెంటు ఎన్నికల్లో అధికార పార్టీ విజయం సింగపూర్ పార్లమెంటు ఎన్నికల్లో పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) విజయం సాధించింది. సెప్టెంబరు 11న జరిగిన ఎన్నికల్లో పీఏపీ 89 స్థానాలకు 83 స్థానాల్లో విజయం సాధించింది. ప్రతిపక్ష వర్కర్స్ పార్టీ ఆరు స్థానాలకు పరిమితమైంది. 1965లో స్వాతంత్య్రం పొందినప్పటి నుంచి పీఏపీ అధికారంలో కొనసాగుతోంది. ఈజిప్టు కొత్త ప్రధానిగా షరీఫ్ ఇస్మాయిల్ అవినీతి ఆరోపణలు రావటంతో ఈజిప్టు ప్రధానమంత్రి ఇబ్రహీం మహ్లాబ్, కేబినెట్ మంత్రులు సెప్టెంబరు 12న రాజీనామా చేశారు. దీంతో చమురు శాఖ మంత్రిగా ఉన్న షరీఫ్ ఇస్మాయిల్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా దేశాధ్యక్షుడు అబ్దుల్ ఫత్తా ఎల్ సీసీ కోరారు. రాష్ట్రీయం విజయనగరం జిల్లాలో తోటపల్లి ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సెప్టెంబరు 10న జాతికి అంకితం చేశారు.తెలంగాణలో ఆత్మహత్యల నివారణకు రాష్ట్ర ప్రభుత్వం టోల్‌ఫ్రీ నెంబర్ 104ను ఏర్పాటు చేసింది.వరంగల్ జిల్లాలోని పాలకుర్తి మార్కెట్‌కు తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ పేరు పెట్టింది. వార్తల్లో వ్యక్తులు డీఆర్డీవో విభాగానికి డెరైక్టర్‌గా మంజుల రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు చెందిన ‘ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్’ విభాగానికి డెరైక్టర్ జనరల్‌గా ప్రముఖ శాస్త్రవేత్త జె.మంజుల సెప్టెంబరు 9న బాధ్యతలు స్వీకరించారు. డీఆర్డీవోలో ఒక విభాగానికి డెరైక్టర్ జనరల్ అయిన మొదటి మహిళగా ఆమె గుర్తింపు సాధించారు. హైదరాబాద్ ఉస్మానియా వర్సిటీలో మంజుల ఇంజనీరింగ్ పూర్తిచేశారు. శక్తిమంతమైన వ్యాపార మహిళల్లో ఇంద్రానూయి ఫార్చ్యూన్ ప్రపంచంలోని శక్తిమంతమైన వ్యాపార మహిళల జాబితాలో భారత్ నుంచి పెప్సికో సీఈవో ఇంద్రానూయి ఒక్కరికే చోటు లభించింది. 50 మందితో సెప్టెంబరు 10న విడుదల చేసిన జాబితాలో జనరల్ మోటార్స్ సీఈవో మేరీ బారా మొదటి స్థానంలో నిలవగా, ఇంద్రా నూయి రెండో స్థానంలో నిలిచారు. 66.6 బిలియన్ డాలర్ల విలువైన వ్యాపారాన్ని ఇంద్రానూయి నిర్వహిస్తున్నారు. కె.జయరామన్‌కు డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ హోదా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు చెందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి లేబొరేటరీ (డీఆర్డీఎల్) డెరైక్టర్ కె.జయరామన్‌కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డిస్టింగ్విష్డ్ సైంటిస్ట్ హోదా లభించింది. శాస్త్రవేత్తలకు కల్పించే ఈ అత్యున్నత గౌరవాన్ని కేంద్రం సెప్టెంబర్ 11న ప్రకటించింది. అవార్డులు అమ్మంగి వేణుగోపాల్‌కు కాళోజీ పురస్కారం కాళోజీ నారాయణరావు పురస్కారానికి ప్రముఖ కవి, రచయిత అమ్మంగి వేణుగోపాల్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. కాళోజీ జయంతి సందర్భంగా సెప్టెంబరు 9న నిర్వహించిన తెలంగాణ భాషా దినోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణుగోపాల్‌కు అవార్డును ప్రదానం చేశారు. పురస్కారం కింద జ్ఞాపికతో పాటు రూ.లక్ష నగదు బహూకరించారు. ఉత్తమ సాక్షర భారత్ కేంద్రాలకు పురస్కారాలు జాతీయ స్థాయిలో ఉత్తమ సాక్షర భారత్ కేంద్రాలుగా శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని పూసర్లపాడు, నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలంలోని అంకిరెడ్డి గూడెం ఎంపికయ్యాయి. సెప్టెంబరు 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పురస్కారాలు ప్రదానం చేశారు. వయోజనులను అక్షరాస్యులను చేసినందుకు ఈ పురస్కారాలు ప్రకటించారు. దేశ వ్యాప్తంగా సంపూర్ణ అక్షరాస్యత సాధించిన 5 సాక్షర భారత్ కేంద్రాలను పురస్కారానికి ఎంపిక చేశారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఐఎన్ఎస్ వజ్రకోష్ ప్రారంభం నౌకా స్థావరం ఐఎన్ఎస్ వజ్రకోష్‌ను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సెప్టెంబరు 9న కర్ణాటకలోని కార్వార్ నౌకా స్థావరంలో ప్రారంభించారు. పశ్చిమ తీరం నుంచి యుద్ధ నౌకల నిర్వహణకు ఈ స్థావరం ఉపయోగపడుతుంది. దీన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) నిర్మించింది. దీర్ఘ శ్రేణి బ్రహ్మోస్ క్షిపణులతో పాటు ఇతర ఆయుధాలను స్థావరంలో నిల్వ చేస్తారు. ఇది కార్వార్లో ఏర్పాటైన మూడో నౌకా స్థావరం. దక్షిణాఫ్రికా గుహల్లో కొత్త ‘మానవ జాతి’ మానవ కుటుంబ వృక్షానికి చెందిన కొత్త జాతి ఆనవాళ్లను దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్ సమీపంలో రైజింగ్ స్టార్ గుహల్లో శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ విషయాన్ని సెప్టెంబరు 10న మగలీస్‌బర్గ్‌లో శాస్త్రవేత్తలు తెలిపారు. శిలాజాలు వెలుగుచూసిన నలెడి గుహ పేరిట ఈ కొత్త జాతికి హోమో నలెడిగా పేరుపెట్టారు. నలెడి గుహలో 15 జీవులకు సంబంధించిన 1500కు పైగా ఎముకలు లభించాయి. ఈ శిలాజాల వయసు 25 లక్షల ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్నారు. క్రీడలు యూత్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు 5వ స్థానం అపియా (సమోవా)లో సెప్టెంబరు 11న ముగిసిన యూత్ కామన్వెల్త్ క్రీడల్లో భారత్ 5వ స్థానంలో నిలిచింది. 24 స్వర్ణాలు, 19 రజతాలు, 19 కాంస్య పతకాలతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలిచింది. దక్షిణాఫ్రికా(13 స్వర్ణ పతకాలు), ఇంగ్లండ్(12), మలేసియా(11)తో వరుసగా రెండు, మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. 9 స్వర్ణాలు, 4 రజతాలు, 6 కాంస్య పతకాలతో భారత్ 5వ స్థానంలో నిలిచింది. జకోవిచ్, పెనెట్టాలకు యూఎస్ ఓపెన్ సింగిల్స్ టైటిల్స్ పురుషుల సింగిల్స్: నొవాక్ జకోవిచ్ (సెర్బియా) యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నాడు. సెప్టెంబరు 14న జరిగిన ఫైనల్లో రోజర్ ఫెదరర్ (స్విట్జర్లాండ్)ను ఓడించాడు. మహిళల సింగిల్స్: ఇటలీకి చెందిన ఫ్లావియా పెనెట్టా మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో రాబెర్టా విన్సీ (ఇటలీ)ని ఓడించింది. అత్యంత పెద్ద వయసులో (33) తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలుచుకున్న మహిళగా పెనెట్టా గుర్తింపు సాధించింది. పురుషుల డబుల్స్: హెర్బెర్ట్-నికోలస్ (ఫ్రాన్స్) జోడీ గెలుచుకుంది. వీరు ఫైనల్లో జేమీ ముర్రే (బ్రిటన్)- జాన్ పీర్స్ (ఆస్ట్రేలియా) జోడీపై విజయం సాధించారు.మహిళల డబుల్స్: సానియా మీర్జా (భారత్), మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జోడీ గెలుచుకుంది. వీరు ఫైనల్లో కేసే డెలాక్వా (ఆస్ట్రేలియా), యారోస్లావా ష్వెదోవా (కజకిస్థాన్) జంటను ఓడించారు.మిక్స్డ్ డబుల్స్: భారత్‌కు చెందిన లియాండర్ పేస్.. స్విస్‌కు చెందిన మార్టినా హింగిస్‌తో కలిసి టైటిల్ సాధించాడు. వీరు ఫైనల్లో అమెరికాకు చెందిన బెథానీ మాటెక్, సామ్ క్వెరీ జోడీని ఓడించారు. ఈ విజయంతో పేస్ ఖాతాలో 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ చేరాయి. రెజ్లింగ్‌లో నర్సింగ్ యాదవ్‌కు కాంస్యం రెజ్లింగ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ నర్సింగ్ పంచమ్ యాదవ్ పురుషుల ఫ్రీస్టయిల్ 74 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించాడు. లాస్‌వెగాస్‌లో సెప్టెంబరు 13న కాంస్యం కోసం జరిగిన పోటీలో జెలిమ్ఖాన్ ఖాదియెవ్ (ఫ్రాన్స్)పై యాదవ్ విజయం సాధించాడు. ఈ గెలుపుతో నర్సింగ్ యాదవ్ 2016-రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. యూకీ బాంబ్రీకి షాంఘై చాలెంజర్ టైటిల్ భారత్ టెన్నిస్ క్రీడాకారుడు యూకీ బాంబ్రీ షాంఘై చాలెంజర్ టైటిల్ గెలుచుకున్నాడు. టోక్యోలో సెప్టెంబరు 13న జరిగిన ఫైనల్లో విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)ను లిన్ డాన్ ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను నొజోమి గె ఒకుహారా (జపాన్) గెలుచుకుంది. ఆమె ఫైనల్లో అకానె యమగుచి (జపాన్)ను ఓడించింది. క్లుప్తంగా ఆసియా, పసిఫిక్ దేశాల శక్తిమంతమైన మహిళల జాబితాలో ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో, మేనేజింగ్ డెరైక్టర్ చందా కొచ్చర్‌కు అగ్రస్థానం లభించింది. ఎస్బీఐ ఛైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య రెండో స్థానంలో నిలిచారు. అంతర్జాతీయ పత్రిక ఫార్చ్యూన్ 25 మందితో జాబితా రూపొందించింది. నీతి ఆయోగ్ పూర్తికాల సభ్యుడిగా వ్యవసాయ రంగ నిపుణులు ప్రొఫెసర్ రమేశ్‌చంద్ నియామకానికి ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబరు 9న ఆమోదం తెలిపారు.విద్య, వృత్తి శిక్షణ, ఆరోగ్య సంరక్షణ రంగాలకు వ్యక్తిగతంగా భూరి విరాళాలిచ్చిన ఆసియా-పసిఫిక్ దేశాల దాతల జాబితాను ఫోర్బ్స్ ఆసియా పత్రిక విడుదల చేసింది. 13 దేశాలకు చెందిన దాతల జాబితాలో ఏడుగురు భారతీయులకు చోటులభించింది. భారత సంతతికి చెందిన అశోక్ శ్రీధరన్.. జర్మనీలోని ప్రముఖ నగరం బాన్ పురపాలక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. సెప్టెంబరు 13న ప్రకటించిన ఎన్నికల ఫలితాల్లో ఆయన విజయం సాధించారు.కొత్త రాజ్యాంగంలో లౌకికవాదం అనే పదాన్ని తొలగించి, హిందూ దేశంగా తిరిగి చేర్చాలనే ప్రతిపాదనను నేపాల్ రాజ్యాంగ సభ తిరస్కరించింది. దీనికి సంబంధించిన ఓటింగ్ సెప్టెంబరు 14న జరిగింది.సరిహద్దుల్లో కాల్పులు, మోర్టార్ షెల్స్ ప్రయోగంపై పూర్తి నిషేధాన్ని పాటించేందుకు భారత్, పాక్ అంగీకరించాయి. ఈ మేరకు సెప్టెంబరు 12న ఢిల్లీలో జరిగిన సరిహద్దు దళాల డెరైక్టర్ జనరల్స్ స్థాయి చర్చల్లో అంగీకారం కుదిరింది. -
విజయానికి ‘వర్తమానం’!
వర్తమాన వ్యవహారాలు (కరెంట్ అఫైర్స్).. ఉద్యోగార్థుల విజయానికి కీలక అస్త్రాలు! ఐఏఎస్, ఐపీఎస్ వంటి అత్యున్నత సర్వీసులను చేజిక్కించుకునేందుకు వీలుకల్పించే సివిల్ సర్వీసెస్ పరీక్షనైనా.. డిప్యూటీ కలెక్టర్లు, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్లు వంటి మేలిమి ఉద్యోగాలను ఒడిసిపట్టుకునేందుకు ఉపకరించే గ్రూప్స్ పరీక్షల్లోనైనా విజయానికి ‘వర్తమానం’పై పట్టు సాధించాల్సిందే! ‘గ్లోబల్ గ్రామ’ పరిణామాలపై అవగాహన పెంపొందించుకోవాల్సిందే! ఇంతటి కీలకమైన కరెంట్ అఫైర్స్‌పై స్పెషల్ ఫోకస్.. కరెంట్ అఫైర్స్‌లో సమకాలీన అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్రీయ పరిణామాలుంటాయి. అంతర్జాతీయ అంశాల్లో వివిధ దేశాల్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన వారి వివరాలు, సదస్సులు, ఆందోళనలు, ద్వైపాక్షిక సంబంధాలు, కూటములు వంటి వాటిపై దృష్టిసారించాలి. జాతీయ అంశాల్లో రాజకీయ పరిణామాలు కీలకమైనవి. ఎన్నికలు, పార్టీల బలాబలాలు, కొత్తగా పదవులు చేపట్టిన నేతలు వంటివి ముఖ్యమైనవి. ఉదాహరణకు 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ రెండు చోట్ల పోటీ చేశారు.. వాటిలో ఒకటి వడోదర కాగా రెండోది ఏమిటి?. ఇలాంటి ప్రశ్నలు పోటీ పరీక్షల్లో ఎదురవుతాయి. నియామకాలు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలు-వాటి చైర్మన్లు తదితరాల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. రాష్ట్రీయానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు, బడ్జెట్, ఆర్థిక సర్వేలోని అంశాలు, కొత్త నియామకాలు వంటివి ముఖ్యమైనవి. ఆర్థికం, శాస్త్రసాంకేతికం ఆర్థిక రంగానికి సంబంధించి బడ్జెట్, సామాజిక-ఆర్థిక సర్వేలలోని ప్రధాన అంశాలపై దృష్టిసారించాలి. బడ్జెట్ కేటాయింపులు, ప్రకటించిన పథకాలు వంటివి ముఖ్యమైనవి. శాస్త్రసాంకేతిక రంగంలో అంతరిక్షం, రక్షణ, పర్యావరణం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ముఖ్యమైన విభాగాలు. అంతరిక్ష పరిజ్ఞానంలో ఉపగ్రహాలు, ప్రయోగ వాహక నౌకలు కీలకమైనవి. రక్షణ రంగంలో పరీక్షించిన క్షిపణులు, వాటి పరిధి; ఐటీలో సూపర్ కంప్యూటర్లు, కొత్త ఆవిష్కరణలు ప్రధానమైనవి. వ్యక్తులు, అవార్డులు, క్రీడలు నియామకాలు, ఎన్నిక-ఎంపికల నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి. అవార్డుల్లో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు ముఖ్యంగా నోబెల్, మెగసెసే, ఆస్కార్, భారత రత్న, పద్మ పురస్కారాలు ముఖ్యమైనవి. సాహిత్య, శాస్త్రసాంకేతిక అవార్డులపైనా అవగాహన అవసరం. క్రీడలకు సంబంధించి జాతీయ, అంతర్జాతీయ క్రీడలపై దృష్ట్టిసారించాలి. ఒలింపిక్స్, కామన్వెల్త్, ఆసియా, గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీలు- విజేతలు, రికార్డులు, మొదటి స్థానంలో నిలిచిన దేశాలు వంటివి ముఖ్యమైనవి. వెయిటేజీ ఎంత? పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు, డీఎస్సీ, పంచాయతీ కార్యదర్శి, ఎస్ఐ/పోలీస్ కానిస్టేబుల్, ఐబీపీఎస్, ఎస్బీఐ, ఎస్ఎస్సీ.. ఇలా ఏ పరీక్ష తీసుకున్నా వాటిలో కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. గతంలో గ్రూప్స్ జనరల్ స్టడీస్ పేపర్లలో కరెంట్ అఫైర్స్ నుంచి 30-35 వరకు ప్రశ్నలు అడిగారు. కొన్ని పరీక్షల్లో 10-20 వరకు ప్రశ్నలు వస్తున్నాయి. పట్టు సాధించడమెలా? ఓ అభ్యర్థి తాను రాయదలచుకున్న పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయో గుర్తించడం ప్రధానం. దీనికోసం పాత ప్రశ్నపత్రాలను విశ్లేషించుకోవాలి. ప్రశ్నల సరళి, కాఠిన్యతపై అవగాహన ఏర్పరుచుకోవాలి. కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించడానికి పత్రికలను ప్రాథమిక వనరులుగా చెప్పుకోవచ్చు. అభ్యర్థులు కనీసం ఒక ఇంగ్లిష్, ఒక తెలుగు పత్రికలను చదవడాన్ని అలవరచుకోవాలి. ముఖ్యమైన అంశాలను ప్రత్యేకంగా నోట్ చేసుకోవాలి. వాటి నేపథ్య సమాచారం కూడా తెలుసుకోవాలి. ఇలా చేయడం వల్ల బిట్ల రూపంలో వచ్చే ప్రశ్నలతో పాటు డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు కూడా సమర్థవంతంగా సమాధానాలు రాయడానికి వీలవుతుంది. వర్తమాన వ్యవహారాలపై అవగాహన లేకపోతే ఎస్సేతో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆర్థిక వ్యవహారాలు, పర్యావరణం తదితర అంశాల నుంచి వచ్చే డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు విశ్లేషణాత్మక సమాధానం ఇవ్వలేం. కరెంట్ అఫైర్స్ అనగానే పరీక్షకు ముందు ఏదో ఒక పుస్తకం కొని, చదివితే సరిపోతుందనే భావన కొందరిలో ఉంటుంది. ఇది సరికాదు. కరెంట్ అఫైర్స్ అనేది కొన్ని మార్కులకు సంబంధించిన విభాగం కాదు. పరీక్ష మొత్తానికి ఈ విభాగంపై అవగాహన ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందనే వాస్తవాన్ని గుర్తించాలి. అందువల్ల తప్పనిసరిగా రోజువారీ ప్రిపరేషన్ అవసరం. పత్రికలతో పాటు ఒక ప్రామాణిక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ చదివితే మంచిది. పత్రికలను చదవడం వల్ల కరెంట్ అఫైర్స్‌పై పట్టుతో పాటు వివిధ రంగాల(ఎకానమీ, పాలిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ..)కు సంబంధించిన పదజాలంపై అవగాహన ఏర్పడుతుంది. ఇది ప్రిపరేషన్ సాఫీగా సాగేందుకు ఉపయోగపడుతుంది. ముఖ్యమైన అంశాలపై గ్రూప్ డిస్కషన్ వల్ల కూడా ప్రయోజనం ఎక్కువ. వీలైతే కరెంట్ అఫైర్స్‌ను అందించే వెబ్సైట్లను ఉపయోగించుకోవచ్చు. ఏ పరీక్షకైనా ఎన్ని నెలల సమాచారంపై దృిష్టిసారించాలనేది ఒక ప్రధానాంశం. సాధారణంగా రెండు నెలల ముందునుంచి ఏడాది వెనకకు వెళ్లాల్సి ఉంటుంది. - ఆకేపాటి శ్రీనివాసులురెడ్డి, కరెంట్ అఫైర్స్ నిపుణులు. ప్రాధాన్యం పెరుగుతోంది ఇటీవల కాలంలో అత్యున్నత సివిల్ సర్వీసెస్ పరీక్ష మొదలు గ్రూప్-4 వరకు అన్ని నియామక పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యం పెరుగుతోంది. డెరైక్ట్ కరెంట్ అఫైర్స్ ప్రశ్నలుగా పేర్కొనే వార్తల్లో వ్యక్తులు, అవార్డులు వంటివే కాకుండా రాజకీయ, ఆర్థిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో చోటుచేసు కుంటున్న తాజా పరిణామాలపైనా ప్రశ్నల సంఖ్య పెరుగుతోంది. అంతేకాకుండా ఆబ్జెక్టివ్ తరహా ప్రశ్నలే కాకుండా డిస్క్రిప్టివ్ విధానంలోనూ కరెంట్ అఫైర్స్ సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. తాజాగా ముగిసిన సివిల్స్ మెయిన్ పరీక్షను పరిగణనలోకి తీసుకుంటే రక్షణ రంగంలో ఎఫ్‌డీఐలు, భూసేకరణ చట్టం-2013 నుంచి ప్రశ్నలు వచ్చాయి. అంటే అభ్యర్థుల సమకాలీన అంశాల పరిజ్ఞానాన్ని లోతుగా పరీక్షిస్తున్నారు. కాబట్టి ఔత్సాహికులు కరెంట్ అఫైర్స్‌కు కూడా అధిక ప్రాధాన్యమివ్వాలి. ఈ ప్రిపరేషన్‌ను కూడా తులనాత్మకంగా ఉండేలా చూసుకుంటే తాము రాసే పరీక్షలో మెరుగైన ఫలితాలు ఖాయం. - ఆర్.సి.రెడ్డి, డెరైక్టర్, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. విజయానికి కీలకం... కరెంట్ అఫైర్స్ నేటి పోటీ ప్రపంచంలో అనునిత్యం జరుగుతున్న పోటీ పరీక్షల్లో విజయానికి కరెంట్ అఫైర్స్ కీలక విభాగంగా మారింది. కరెంట్ అఫైర్స్ నుంచి వస్తున్న ప్రశ్నల సంఖ్య పెరుగుతుండటమే దీనికి నిదర్శనం. సివిల్స్ వంటి అత్యున్నత స్థాయి పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ అంశాలను వాటి నేపథ్యానికి ముడిపెడుతూ పరోక్షంగా అడుగుతుండగా.. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 వంటి పరీక్షలు, ఇతర నియామక పరీక్షల్లో నేరుగా అడుగుతున్నారు. అంతేకాకుండా భవిష్యత్తులో ఆయా విధులు సమర్థంగా నిర్వహించడానికి కూడా కరెంట్ అఫైర్స్‌పై అవగాహన ఎంతగానో తోడ్పడుతుంది. సిలబస్‌లో మార్పులు-చేర్పులు వంటివి వర్తించని కరెంట్ అఫైర్స్‌పై అవగాహన పెంచుకుంటే ఆ స్థాయిలో విజయావకాశాలు మెరుగుపడతాయి. ఇక.. కొత్త సంవత్సరంలో భారీ సంఖ్యలో నోటిఫికేషన్లు విడుదలవనున్న తరుణంలో ఔత్సాహికులు పరీక్షకు ఏడాది ముందుకాలంలో చోటు చేసుకున్న పరిణామాలపై అవగాహన పెంపొందించుకుంటే పోటీలో ముందంజలో నిలుస్తారు. - వి.గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ. -
సచిన్ ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే ఆవిష్కరణ
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం కేంద్ర మంత్రివర్గ విస్తరణ ప్రధానమంత్రి నరేంద్రమోదీ నవంబరు 9న కొత్తగా 21 మందిని తన మంత్రివర్గంలో చేర్చుకున్నారు. ఇందులో నలుగురు కేబినెట్, ముగ్గురు సహాయ స్వతంత్ర ప్రతిపత్తి, 14మంది సహాయ మంత్రులు ఉన్నారు. దీంతో మంత్రి వర్గసభ్యుల సంఖ్య 66కు చేరింది. మనోహర్ పారికర్‌కు రక్షణ శాఖ, సురేశ్ ప్రభుకు రైల్వే , జగత్ ప్రకాశ్ నడ్డాకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, చౌదరి బీరేందర్ సింగ్‌కు గ్రామీణాభివృద్ధి శాఖలను కేటాయించారు. తెలంగాణ నుంచి బండారు దత్తాత్రేయకు స్వతంత్ర ప్రతిపత్తి గల సహాయమంత్రిగా కార్మిక, ఉపాధి కల్పన శాఖ. ఆంధ్రప్రదేశ్ నుంచి వై.సుజనా చౌదరికి సహాయ మంత్రిగా సైన్స్, టెక్నాలజీ శాఖను కేటాయించారు. ఢిల్లీ అసెంబ్లీ రద్దు ఢిల్లీ అసెంబ్లీ రద్దుకు కేంద్ర కేబినెట్ నవంబరు 4న సిఫార్సు చేయగా, రాష్ట్రపతి ఆమోదించారు. నవంబరు 11 లోగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టు గడువు ఇచ్చింది. ఈమేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజబ్జంగ్ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ, ఆమ్ ఆద్మీలను కోరగా, ఎన్నికలకే మొగ్గు చూపారు. దీంతో గవర్నర్ అసెంబ్లీ రద్దుకు సిఫార్సు చేశారు. జయపూర్ గ్రామాన్ని దత్తత తీసుకున్న ప్రధాని సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన పథకం కింద వారణాసికి సమీపంలోని జయపూర్ గ్రామాన్ని ప్రధాని నరేంద్రమోదీ దత్తత తీసుకున్నారు. ప్రతి పార్లమెంటు సభ్యుడు తమ నియోజక వర్గం నుంచి ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని దాన్ని మోడల్ గ్రామంగా రూపొందించడమే సంసద్ ఆదర్శ్ గ్రామ యోజన ప్రధాన లక్ష్యం. ఢిల్లీలో ప్రపంచ ఆయుర్వేద సదస్సు ప్రపంచ ఆయుర్వేద ఆరో సదస్సుకు ఢిల్లీ వేదికైంది. దీనికి హాజరైన ప్రధాని నరేంద్రమోదీ ఆయుర్వేద వైద్యానికి భారత్ ప్రాధాన్యమిస్తున్నట్లు ప్రకటించారు. పొగాకు ఉత్పత్తులపై బీహార్ నిషేధం పొగాకు, దాని ఉత్పత్తులపై నిషేధం విధిస్తున్నట్లు బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంజీ నవంబరు 7న ప్రకటించారు. బహిరంగ ప్రదేశాల్లో పొగతాగేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్థానిక ఎన్నికల్లో ఓటింగ్ తప్పనిసరి: గుజరాత్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటింగ్‌ను తప్పనిసరి చేసిన తొలి రాష్ట్రంగా గుజరాత్ నిలిచింది. దీని ప్రతిపాదన బిల్లును ఆ రాష్ట్ర గవర్నర్ ఓపీ కోహ్లి ఆమోదించారు. స్థానిక ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోకపోతే అలాంటి వారికి శిక్ష తప్పదన్నది ఈ బిల్లులోని సారాంశం. వార్తల్లో వ్యక్తులు సీబీడీటీ చైర్‌పర్సన్‌గా అనితా కపూర్ ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) కొత్త చైర్‌పర్సన్‌గా అనితాకపూర్ నవంబరు 5న నియమితులయ్యారు. ఆమె 1978 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారిణి. అక్టోబరు 31న ఉద్యోగ విరమణ చేసిన కె.వి.చౌదరి స్థానంలో అనితాకపూర్ బాధ్యతలు చేపట్టారు. 2015 నవంబరు వరకు ఈ హోదాలో కొనసాగుతారు. దక్షిణ కరోలినా గవర్నర్‌గా నిక్కీ హేలీ అమెరికాలోని దక్షిణ కరోలినా గవర్నర్‌గా భారతీయ సంతతికి చెందిన అమెరికన్ నిక్కీ హేలీ రిపబ్లిక్ పార్టీ తరపున నవంబరు 4న రెండోసారి ఎన్నికయ్యారు. ఆమె 57.8 శాతం ఓట్ల తేడాతో ప్రత్యర్థి విన్సెంట్‌పై విజయం సాధించారు. దక్షిణ కరోలినా ప్రప్రథమ మహిళా గవర్నర్‌గానూ, అమెరికాలో మొట్టమొదటి శ్వేత, జాతేతర గవర్నర్‌గా నిక్కీ చరిత్ర సృష్టించారు. గోవా ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్ గోవా నూతన ముఖ్యమంత్రిగా లక్ష్మీకాంత్ పర్సేకర్ (58) నవంబరు 8న బాధ్యతలు చేపట్టారు. 2012 నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న మనోహర్ పారికర్ కేంద్రమంత్రివర్గంలో చేరడంతో ఆ స్థానంలో పర్సేకర్ నియమితులయ్యారు. ఫోర్బ్స్ జాబితాలో మోదీకి 15వ స్థానం ఫోర్బ్స్ పత్రిక నవంబరు 5న విడుదల చేసిన ప్రపంచ శక్తిమంతుల జాబితాలో ప్రధాని నరేంద్ర మోదీ 15వ స్థానంలో నిలిచారు. మొత్తం 72 మందితో కూడిన ఈ జాబితాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొదటి స్థానం, అమెరికా అధ్యక్షుడు ఒబామా రెండో స్థానం, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ మూడో స్థానంలో ఉన్నారు. అత్యంత శక్తిమంతమైన మహిళగా అరుంధతీ భట్టాచార్య భారత్‌లో అత్యంత శక్తిమంతులైన 50 మంది మహిళా వ్యాపారవేత్తల జాబితాను ఫోర్బ్స్ నవంబరు 9న విడుదల చేసింది. ప్రథమ స్థానంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ అరుంధతీ భట్టాచార్య నిలిచారు. ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈఓ చందాకొచ్చర్‌కు రెండో స్థానం, యాక్సిస్ బ్యాంక్ ఎండీ,సీఈఓ శిఖాశర్మ కు మూడో స్థానం దక్కింది. అపోలో హాస్పిటల్ ఎంటర్ ప్రైజెస్ ఎండీ ప్రీతారెడ్డి ఏడో స్థానంలో నిలిచారు. గుల్జార్‌కు హెచ్‌సీయూ గౌరవ డాక్టరేట్ కవి, సినీ దర్శకుడు సంపూర న్ సింగ్ కల్రా (గుల్జార్)కు హైదరాబాద్ కేంద్ర విశ్వ విద్యాలయం (హెచ్‌సీయూ) గౌరవ డాక్టరేట్‌ను నవంబరు 6న అందించింది. సాహిత్య రంగంలో విశేష కృషిని గుర్తిస్తూ వర్సిటీ కులపతి సీహెచ్. హనుమంతరావు గుల్జార్‌కు డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. రాష్ట్రీయం తెలంగాణ తొలి బడ్జెట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తొలి బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ నవంబరు 5న శాసనసభకు సమర్పించారు. మొత్తం రూ. 1,00,637 కోట్ల బడ్జెట్లో ప్రణాళికా వ్యయం రూ. 48,640 కోట్లు కాగా, ప్రణాళికేతర వ్యయం రూ. 51,989 కోట్లు. ప్రధాన రంగాలకు కేటాయింపుల వివరాలు... గ్రామీణాభివృద్ధి: రూ.7,579.45 కోట్లు, సాగునీరు: రూ. 6,500 కోట్లు. వ్యవసాయ, అనుబంధ రంగం: రూ. 3,061.71 కోట్లు. విద్య: రూ. 3,663.26 కోట్లు. వైద్యం: రూ. 2,282.86 కోట్లు. ఆంధ్రప్రదేశ్‌లో హరిత పథకం వ్యవసాయాభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హరిత అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. హరిత పూర్తి రూపం.. హార్మోనైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అగ్రికల్చర్, రెవెన్యూ, ఇరిగేషన్ ఫర్ ఏ ట్రాన్స్ఫర్మేషన్ ఎజెండా. వ్యవసాయం, సాగునీటి పారుదల, రెవెన్యూ శాఖల చొరవతో వ్యవసాయాన్ని మెరుగుపరచడమే హరిత పథకం లక్ష్యం. తెలంగాణ సామాజిక, ఆర్థిక సర్వే -2014 రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం: 1,14,840 చ.కి.మీ, జనాభా (2011 నాటికి): 3.51 కోట్లు, రాష్ట్ర స్థూల ఆదాయం (జీఎస్డీపీ): రూ. 3,78,963 కోట్లు, తలసరి ఆదాయం: రూ. 93,151, జీఎస్డీపీలో సాగురంగం వాటా: 17 శాతం, పారిశ్రామిక రంగం వాటా: 27శాతం, సేవారంగం వాటా: 56 శాతం, అక్షరాస్యత: 66.46 శాతం, పట్టణ జనాభా: 39 శాతం, అడవుల విస్తీర్ణం: 28.89 శాతం, సాగునీటి సౌకర్యం: 31.64 లక్షల హెక్టార్లు. ఇంటర్నెట్ వినియోగదారుల్లో హైదరాబాద్‌కు ఆరో స్థానం దేశంలో అత్యధిక అంతర్జాల వినియోగదారులున్న నగరాల జాబితాలో హైదరాబాద్ ఆరోస్థానంలో నిలిచింది. భారత ఇంటర్నెట్, సెల్‌ఫోన్ సంఘం నిర్వహించిన అధ్యయనం ప్రకారం దేశం మొత్తం మీద 24.3 కోట్ల మంది ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారని తేలింది. వీరిలో 1.64 కోట్ల మందితో ముంబయి అగ్ర స్థానం, 1.21 కోట్ల మందితో ఢిల్లీ రెండో స్థానంలో నిలిచాయి. తెలంగాణలో ఆసరా పథకం ప్రారంభం వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు అందించే ఆసరా పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు నవంబరు 8న మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో ప్రారంభించారు. పథకం కింద వృద్ధులు, వితంతువులు, మరనేత, కల్లుగీత కార్మికులతోపాటు ఎయిడ్స్ బాధితులకు నెలకు రూ. 1000, వికలాంగులకు రూ. 1,500లు అందజేస్తారు. అంతర్జాతీయం బెర్లిన్ గోడ కూల్చివేతకు పాతికేళ్లు చారిత్రక బెర్లిన్ గోడ కూల్చివేత ఘట్టానికి పాతికేళ్లు నిండాయి. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో కమ్యూనిస్టుల పాలనలోని నాటి తూర్పు జర్మనీ ప్రభుత్వం 1961లో దీన్ని నిర్మించింది. ఆ తర్వాత 1989 నవంబరు 9న తూర్పు జర్మనీ ప్రభుత్వం పశ్చిమ జర్మనీ వెళ్లేందుకు తమ పౌరులను అనుమతించింది. దీంతో ఆ రోజున వేలమంది జర్మన్లు బెర్లిన్ గోడను కూల్చేశారు. ఆ పరిణామమే జర్మనీ ఏకీకరణకు దారితీసింది. సంక్రమించని వ్యాధులతో ప్రధాన ఆరోగ్య సమస్య భారత్‌లో 2012లో 60 శాతం మరణాలు ఒకరి నుంచి ఒకరికి సంక్రమించని వ్యాధుల వల్లనే సంభవించా యని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఎకానమిక్స్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఇన్ ఇండియా పేరుతో విడుదలైన నివేదిక ప్రకారం భారత్‌లో 2012-2030 మధ్య కాలంలో ఎన్సీడీలు, మానసిక ఆరోగ్య స్థితుల వల్ల 4.58 ట్రిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని తెలిపింది. గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు, మధుమేహం, క్యాన్సర్లు మనుషుల ఆరోగ్యానికి, ఆర్థిక వృద్ధికి, దేశాభివృద్ధికి పెద్ద సమస్య గా మారాయని పేర్కొంది. మొనాకోలో ఇంటర్‌పోల్ సదస్సు మొనాకో వేదికగా 83వ ఇంటర్‌పోల్ సదస్సు జరిగింది. నవంబరు 3-7 తేదీల మధ్య సాగిన ఈ సమావేశంలో భారత హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొని హిందీలో ప్రసంగించారు. ఈ అంతర్జాతీయ వేదికపై హిందీలో ప్రసంగించడం ఇదే ప్రథమం. 82వ సదస్సు గతేడాది కొలంబియాలోని కార్టెజినాలో జరిగింది. భారత్-శ్రీలంక సంయుక్త సైనిక విన్యాసాలు భారత్-శ్రీలంక దేశాలు నవంబరు 3న సైనిక విన్యాసాలను ప్రారంభించాయి. దీనికి మిత్రశక్తి అని పేరు పెట్టారు. ఈ విన్యాసాలు కొలంబో సమీపంలోని ఓ దీవిలో నవంబరు 23వరకు నిర్వహించనున్నారు. ఆసియా-పసిఫిక్ మంత్రుల సదస్సు దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో గృహ నిర్మాణం-పట్టణాభివృద్ధి ఆసియా పసిఫిక్ మంత్రుల స్థాయి ప్లీనరీ నవంబరు 5న జరిగింది. దీనికి కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు హాజరయ్యారు. 2022 నాటికి అందరికీ గృహ వసతి భారత్ లక్ష్యమని ప్రకటించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ జలాంతర్గామి సింధుకీర్తి జల ప్రవేశం భారత నౌకాదళానికి చెందిన ఐ.ఎన్.ఎస్ సింధుకీర్తి జలాంతర్గామి విశాఖపట్టణంలోని హిందూస్థాన్ షిప్‌యార్డ్ బిల్డింగ్ డాక్లో నవంబరు 4న జలప్రవేశం చేసింది. దీన్ని ఐదారునెలల్లో నౌకాదళానికి అప్ప గిస్తారు. ఇది సింధూ ఘోష్‌కు చెందిన డీజిల్ ఎలక్ట్రిక్ జలాంతర్గామి. బంగాళాఖాతంలో మునిగిన నౌకాదళ నౌక తూర్పు నౌకాదళానికి చెందిన టోర్పెడో రికవరీ వెహికల్ -72 (టీఆర్వీ) నవంబరు 6న బంగాళాఖాతంలో ము నిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. దీన్ని యుద్ధ నౌకల నుంచి ప్రయోగాత్మకంగా పేల్చిన టోర్పెడో లను తిరిగి సేకరించడానికి ఉపయోగిస్తారు. అగ్ని-2 పరీక్ష సక్సెస్ మధ్యశ్రేణి అణ్వస్త్ర క్షిపణి అగ్ని-2ని సైన్యం మరోసారి విజయవంతంగా పరీక్షించింది. నవంబర్ 9న ఒడిశా తీరంలోని వీలర్ ఐల్యాండ్‌లో గల ఐటీఆర్ నుంచి దీన్ని ప్రయోగించారు. 20 మీటర్ల పొడవైన ఈ క్షిపణి వెయ్యి కిలోల పేలోడ్లను మోసుకుపోగలదు. క్రీడలు సచిన్ ఆత్మకథ ఆవిష్కరణ మాజీ క్రికెటర్, భారత రత్న సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథ ప్లేయింగ్ ఇట్ మై వే పుస్తకాన్ని అక్టోబరు 5న ముంబయిలో ఆవిష్కరించారు. తొలికాపీని తన తల్లి రజనికి అందించారు. తన 24 ఏళ్ల క్రికెట్ కెరీర్లో ఎదురైన అనుభవాలు, వివాదాలు, తదితర అంశాలను ఈ పుస్తకంలో వెల్లడించారు. జాతీయ స్క్వాష్ విజేతలు సంధు, జ్యోష్న జాతీయ సీనియర్ స్క్వాష్ ఛాంపియన్ షిప్ టైటిల్‌ను హరీందర్ పాల్ సింగ్ సంధు కైవసం చేసుకున్నాడు. నవంబర్ 8న ముంబయిలో జరిగిన ఫైనల్లో సౌరభ్ ఘోషల్‌పై విజయం సాధించాడు. సంధుకిదే తొలి జాతీయ టైటిల్. మహిళల టైటిల్‌ను జ్యోష్న చినప్ప గెలుచుకుంది. ఫైనల్లో సచికా ఇంగాలేని ఆమె ఓడించింది. భువనేశ్వర్‌కు పీపుల్స్ ఛాయిస్ అవార్డు భారత ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్కుమార్కు ప్రతిష్టాత్మక ఎల్.జి పీపుల్స్ చాయిస్ అవార్డు వరించింది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఇందుకు జరిగిన ఓటింగ్‌లో పాల్గొని విజేతను ఎన్నుకొన్నారు. ఈ అవార్డు 2010లో సచిన్, 2011, 2012లో సంగక్కర, 2013లో ఎం.ఎస్. ధోనికి లభించింది. హాకీ సిరీస్ భారత్ కైవసం ఆస్ట్రేలియాతో జరిగిన హాకీ సిరీస్‌ను భారత్ గెలుచుకుంది. నవంబరు 9న పెర్త్‌లో జరిగిన నాలుగో టెస్ట్‌ను భారత్ గెలవడంతో 3-1 తేడాతో సిరీస్‌ను చేజిక్కించుకుంది. ఆస్ట్రేలియాపై భారత్ సిరీస్ గెలవడం ఇదే తొలిసారి. -
కరెంట్ అఫైర్స్‌కు ప్రత్యేక పోర్టల్
హైదరాబాద్: పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ పాత్ర నిర్వచించలేనిది. ఏ పరీక్ష తీసుకున్నా కనీసం 20 నుంచి 30 శాతం ప్రశ్నలు వస్తాయి. ఈ తరుణంలో ప్రతి పరీక్షకు స్టడీ మెటీరియల్, మోడల్ పేపర్లతో ప్రత్యేక పోర్టల్స్ ప్రారంభించే సాక్షి ఇప్పుడు కరెంట్ అఫైర్స్‌కు కూడా తెలుగు, ఇంగ్లిష్‌లో ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్‌లో ైడైలీ, వీక్లీ, మంత్లీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్ బిట్బ్యాంక్తో పాటు కరెంట్ అఫైర్స్ స్పెషల్ (ఇయర్ రౌండప్), సులువుగా ప్రాక్టీస్ చేసుకునేందుకు మంత్లీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్టులను రూపొందించింది. రోజూ దినపత్రిక చదువుతూ సాక్షి ప్రత్యేకంగా రూపొందించిన కరెంట్ అఫైర్స్, బిట్ బ్యాంక్స్ సాధన చేయడం వల్ల ఈ విభాగంలో మంచి మార్కులు సాధించవచ్చు. అంతర్జాతీయ సంఘటనలు, ద్వైపాక్షిక సంబంధాలు-నిర్ణయాలు, దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు, తాజా నియామకాలు, వార్తల్లోని వ్యక్తులు, క్రీడలు-విజేతలు, సదస్సులు-సమావేశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్న కొత్త ఆవిష్కరణలు వంటి వాటిలో తాజా అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.. http://www.sakshieducation.com/CA/Index.html -
సివిల్స్ ప్రిలిమ్స్ 2014.. విశ్లేషణ
సివిల్స్ ప్రిలిమ్స్-2014 పరీక్ష విజయవంతంగా ముగిసింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా దాదాపు 9,45,000 మంది దరఖాస్తు చేయగా.. నాలుగున్నర లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 26 వేల మందికి పైగా పరీక్షకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష ఎలా ఉంది? గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏయే విభాగాల్లో ప్రశ్నలు పెరిగాయి? ఎన్ని మార్కులు సాధించినవారు మెయిన్స్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది? వంటి అంశాలపై నిపుణుల విశ్లేషణ.. పేపర్-1 (ప్రశ్నల సంఖ్య- 100, మార్కులు- 200) కరెంట్ అఫైర్స్, జీకే.. ప్రశ్నలు సులువే: పేపర్-1లో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌ల నుంచి 10 ప్రశ్నలు అడిగారు. జీకే నుంచి 7 ప్రశ్నలు, కరెంట్ అఫైర్స్ నుంచి మూడు ప్రశ్నలు వచ్చాయి. గతేడాదితో పోలిస్తే ఈ విభాగాల్లో ప్రశ్నలు ఎక్కువే. గతేడాది ప్రిలిమినరీలో జీకే నుంచి కేవలం నాలుగు ప్రశ్నలు మాత్రమే ఇచ్చారు. వర్తమాన వ్యవహారాల నుంచి ఒక్క ప్రశ్న కూడా రాలేదు. ఈ ఏడాది కొన్ని జీకే ప్రశ్నలను నేరుగా అడిగారు. ఉదాహరణకు సత్యమేవ జయతేను ఏ ఉపనిషత్ నుంచి సంగ్రహించారు? (సమాధానం: ముండక ఉపనిషత్). కొన్ని ప్రశ్నలు సులువుగా ఉన్నాయి. ఉదా: ప్రాచీన భాషలుగా ప్రభుత్వం గుర్తించిన భాషలు? (సమాధానం: కన్నడం, తెలుగు). అదేవిధంగా కొన్ని ప్రశ్నల క్లిష్టత ఎక్కువగా ఉంది. ఉదా: ఆర్కిటిక్ కౌన్సిల్‌లోని సభ్యదేశాలు? అగ్ని క్షిపణి, బ్రిక్స్ సదస్సు, ఇటీవల వార్తల్లోకెక్కిన ప్రాంతాలు ఏయే దేశాల్లో ఉన్నాయి? వంటి ప్రశ్నలకు తేలికగానే సమాధానాలు గుర్తించవచ్చు. జాగ్రఫీ.. ఎకాలజీకి పెరిగిన ప్రాధాన్యత: జాగ్రఫీలో గతేడాది దాదాపు 21 ప్రశ్నలు రాగా.. ఈ ఏడాది 20కు పైగా ప్రశ్నలు ఇచ్చారు. ఈ ఏడాది ఎకాలజీ సంబంధిత ప్రశ్నలకు ప్రాధాన్యం పెరిగింది. 20 ప్రశ్నల్లో 10 ప్రశ్నలను ఎకాలజీ నుంచే అడిగారు. గతేడాది ప్రశ్నలన్నీ కాంటెంపరరీగా ఉండగా.. ఈ ఏడాది ఇచ్చిన ప్రశ్నలు సివిల్ స్థాయికి తగినట్లు లేవు. కాంటెంపరరీ అంశాలపై ప్రశ్నలు తగ్గించారు. అంతగా ప్రాధాన్యం లేని అంశాలు, ప్రస్తుతం వార్తాపత్రికలు, చర్చల్లో లేని అంశాలపై ప్రశ్నలు ఇచ్చారు. ఉదాహరణకు జాతీయ రహదారులు, పర్వత ప్రాంతాలు ఎక్కడున్నాయి అనే ప్రశ్నలకు ఇచ్చిన ఆప్షన్స్‌ను పరిశీలిస్తే.. ఆప్షన్స్ మరీ సూక్ష్మంగా ఉన్నాయి. అన్నింటి గురించి తెలిస్తేనే కానీ అభ్యర్థి సమాధానాలు గుర్తించలేడు. కొన్ని ప్రశ్నలు అభ్యర్థిలోని విశ్లేషణాత్మక నైపుణ్యాలకు పదునుపెట్టేలా ఉంటే మరికొన్ని ప్రశ్నలు మంచి నాలెడ్జ్ ఉన్న అభ్యర్థి కూడా ఆన్సర్ చేయలేని విధంగా ఉన్నాయి. వర్తమాన అంశాలపై అతి తక్కువ ప్రశ్నలు అడిగారు. ఉదా: పేపర్-1లో చెచెన్యా, డార్ఫర్, స్వాత్ లోయ అనే ప్రాంతాలు.. వాటికి ఎదురుగా రష్యన్ ఫెడరేషన్, మాలి, ఇరాక్లను ఇచ్చి జతపరచమని అడిగారు. దీనికి ఎవరైనా సమాధానం గుర్తించవచ్చు. రీజనింగ్, సమాచారం, విశ్లేషణాత్మక నైఫుణ్యాలను పరిశీలించేలా ఇచ్చిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఉదా: అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రవహిస్తున్న నదులేవి? అనే ప్రశ్న. కొన్ని ప్రశ్నలు సులువుగా ఉన్నాయి. ఉదా: ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వల్ల ప్రయోజనాలు ఏమిటి? హిమాలయాల్లో ప్రయాణించేటప్పుడు సహజంగా కనిపించే వృక్షాలు ఏవి? అనే ప్రశ్నలు. వీటికి ఇచ్చిన ఆప్షన్స్‌ను కొంచెం పరిశీలించి ఆలోచిస్తే సమాధానంగా తేలికగా గుర్తించవచ్చు. ఎకానమీ.. గతేడాదితో పోలిస్తే తగ్గిన ప్రశ్నలు: 2013 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రంలో ఎకానమీకి సంబంధించి 19 ప్రశ్నలు ఇవ్వగా.. ఈ ఏడాది 14 ప్రశ్నలు ఇచ్చారు. రెండు ప్రశ్నపత్రాల్లోనూ కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా ఉన్నాయి. గతేడాది బ్యాంకింగ్, విదేశీ వాణిజ్యం, ప్రణాళికలు, పబ్లిక్ ఫైనాన్స్, జనాభా, ద్రవ్యోల్బణం, ద్రవ్యం, జాతీయాదాయం, పారిశ్రామిక రంగానికి సంబంధించిన ప్రశ్నలు ఎక్కువగా వచ్చాయి. కాగా ఈ ఏడాది ప్లానింగ్, అభివృద్ధి కార్యక్రమాలు, ఐఎంఎఫ్, పబ్లిక్ ఫైనాన్స్, స్టాక్ మార్కెట్, విదేశీ వాణిజ్యం ప్రధాన అంశాలుగా ప్రశ్నలు ఇచ్చారు. మొత్తం 14 ప్రశ్నల్లో బ్యాంకింగ్ రంగం నుంచి ఐదు ప్రశ్నలు రాగా.. ప్రణాళికల నుంచి రెండు ప్రశ్నలు, అభివృద్ధి కార్యక్రమాలపై రెండు ప్రశ్నలు, బడ్జెట్, పన్నుల వ్యవస్థ, స్టాక్ మార్కెట్, ఐఎంఎఫ్, విదేశీ వాణిజ్యంలాంటి అంశాలపై ఒక్కొక్క ప్రశ్న వచ్చాయి. బ్యాంకింగ్ రంగంపై కరెంట్ అఫైర్స్‌లో భాగంగా బ్రిక్స్ బ్యాంక్ లాంటి ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి అంశానికి సంబంధించిన కాన్సెప్ట్స్‌పై పూర్తి అవగాహనతో ఆయా కాన్సెప్ట్‌ల అప్లికేషన్స్‌పై అధ్యయనం చేసిన వారు ఎకానమీలో మంచి స్కోర్ సాధించే అవకాశం ఉంది. జనరల్ సైన్స్.. పర్యావరణానికి పెరిగిన ప్రాధాన్యత: పేపర్-1లో ముఖ్యంగా పర్యావరణం నుంచి 15 ప్రశ్నలు, జీవ శాస్త్రం నుంచి 10 ప్రశ్నలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి 3 ప్రశ్నలు అడిగారు. గతేడాదితో పోలిస్తే పర్యావరణం, బయాలజీల నుంచి ప్రశ్నలు పెరిగాయి. ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి బాగా తగ్గాయి. పర్యావరణం విభాగంలోని ప్రశ్నలు కొంచెం కష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రశ్నలు ప్రభుత్వ సంరక్షణ కార్యక్రమాలు, చట్టాలు, చట్టాల పరిధికి ఉద్దేశించినవి. మరికొన్ని ప్రశ్నలను సంరక్షణ చర్యల ఆధారంగా అడిగారు. బయోస్ఫియర్ రిజర్వ్, అంతర్జాతీయ కార్యక్రమాలు, ఒప్పందాలు, జీవవైవిధ్య పరిరక్షణ మొదలైనవాటి గురించి ప్రశ్నలు ఇచ్చారు. దేశవ్యాప్తంగా చిత్తడి నేలలు, జాతీయ పార్కులు, టైగర్ రిజర్వులు వంటివాటిపై కూడా 5 - 6 ప్రశ్నలు అడిగారు. విస్తృత సమాచార సేకరణ ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానం గుర్తించవచ్చు. అంతరించిపోతున్న, ప్రమాదం ఎదుర్కొంటున్న జంతు జాతులపై ప్రతిసారీ ప్రశ్నలు వస్తున్నాయి. గత పరీక్షలో రాబందులపై ప్రశ్న ఇచ్చారు. ఈసారి డాల్ఫిన్స్ ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రశ్న అడిగారు. సైన్స్ అండ్ టెక్నాలజీలో సమకాలీన అంశాలైన అగ్ని - 4, అంతర్జాతీయ అంతరిక్ష కార్యక్రమాలు, నానో టెక్నాలజీలపై ప్రశ్నలు వచ్చాయి. చరిత్ర.. ప్రాచీన చరిత్రపై అధిక ప్రశ్నలు: గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది చరిత్రకు సంబంధించిన ప్రశ్నలు పెరిగాయి. గతంలో 13 నుంచి 15 ప్రశ్నలు వరకు వచ్చేవి. అవి కూడా ఆధునిక చరిత్ర, స్వాతంత్య్రోద్యమం నుంచి ఎక్కువగా ఇచ్చేవారు. ఈ ఏడాది చరిత్ర నుంచి 20 ప్రశ్నలు అడిగారు. ప్రాచీన భారతదేశం నుంచి 10 ప్రశ్నలు, మధ్యయుగం నుంచి 3 ప్రశ్నలు, ఆధునిక యుగం నుంచి 4 ప్రశ్నలు, స్వాతంత్య్రోద్యమం నుంచి 3 ప్రశ్నలు వచ్చాయి. చరిత్ర సిలబస్‌లో ప్రాచీన, మధ్య, ఆధునిక దశలు, భారత స్వాతంత్య్రోద్యమం ఉన్నాయి. చాలామంది అభ్యర్థులు ప్రాచీన, మధ్య యుగాల నుంచి ఎక్కువ ప్రశ్నలు రావని, వాటికి ఎక్కువ ప్రాధాన్యత అవసరం లేదని భావించారు. ఎక్కువగా ఆధునిక చరిత్ర, స్వాతంత్య్రోద్యమంపైనే దృష్టి సారించారు. అయితే ప్రాచీన చరిత్ర నుంచి ఎక్కువ ప్రశ్న లు వచ్చాయి. మొత్తం మీద చరిత్రలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ప్రశ్నలు లోతుగా, విశ్లేషణాత్మకంగా ఉన్నాయి. పాలిటీ: జనరల్ స్టడీస్‌లో పాలిటీకి సంబంధించిన ప్రశ్నలు సులువుగానే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ప్రధాన అంశాల నుంచి కాకుండా.. అంతగా ఊహించని అంశాల నుంచి ప్రశ్నలు అడిగారు. ఉదా: అభ్యర్థి సాధారణంగా వివిధ కమిటీలు, చైర్మన్లు వంటి అంశాలను చదువుతారు. అయితే ఏ కమిటీలో ఎక్కువ మంది సభ్యులున్నారు? అనే ప్రశ్న ఇచ్చారు. పాలిటీ నుంచి దాదాపు 8 ప్రశ్నల వరకు వచ్చాయి. గతేడాది కూడా ఇదే సంఖ్యలో ప్రశ్నలు అడిగారు. స్థానిక స్వపరిపాలన సంస్థలపై ఎలాంటి ప్రశ్నలు లేవు. అంతర్జాతీయ సంబంధాలపై బ్రిక్స్ దేశాలకు సంబంధించిన ప్రశ్న ఒకటి మాత్రమే ఇచ్చారు. ప్రత్యేకంగా ఒక విభాగంపై ఎక్కువ ప్రశ్నలు రాలేదు. ప్రెసిడెంట్, గవర్నర్, సుప్రీంకోర్టు, పార్లమెంట్.. ఇలా వివిధ అంశాలపై ఒక్కొక్క ప్రశ్న అడిగారు. ఈ ఏడాది పేపర్ -1 (200 మార్కులు), పేపర్- 2 (ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్‌కు కేటాయించిన 15 మార్కులు మినహాయించి మిగిలిన 185 మార్కులు)లు కలిపి మొత్తం 385 మార్కులకు ఉంటాయి. ఇందులో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 230 మార్కులు సాధిస్తే.. మెయిన్స్‌కు ఎంపికయ్యే అవకాశముందని నిపుణుల అంచనా. ప్రశ్నపత్రాల సరళిని పరిశీలిస్తే కటాఫ్ మరింత తగ్గినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని నిపుణులు అంటున్నారు.పేపర్-1లో బాగా తెలివైన అభ్యర్థి 70 నుంచి 80 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వొచ్చు. కాబట్టి 150 మార్కులు సాధించొచ్చు.బాగా ప్రిపేర్ అయిన అభ్యర్థి పేపర్- 2లో 185 మార్కులకుగాను 115 నుంచి 120 వరకు తెచ్చుకునే అవకాశం ఉంది. గతేడాది ప్రిలిమ్స్ జనరల్ కేటగిరీ కటాఫ్ - 241. పేపర్-2 (ప్రశ్నలు 74, మార్కులు 185, వ్యవధి: రెండు గంటలు) డెసిషన్ మేకింగ్ నుంచి ప్రశ్నలు లేవు ఇటీవల పేపర్-2 గురించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడిచింది. వివాదానికి కారణమైన రెండో పేపర్లో ప్రశ్నల సరళిని పరిశీలిస్తే గతంలో మాదిరిగానే 80 ప్రశ్నలు ఇచ్చారు. సివిల్స్ సిలబస్ ప్రకారం డెసిషన్ మేకింగ్ అనే అంశం నుంచి వచ్చే ప్రశ్నలకు నెగెటివ్ మార్కులు లేవు. గతేడాది ఈ అంశం నుంచి ఆరు ప్రశ్నలు (15 మార్కులకు) వచ్చాయి. కానీ ఈ ఏడాది కనీసం ఒక్క ప్రశ్న కూడా డెసిషన్ మేకింగ్ నుంచి రాలేదు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ అంశం నుంచి వచ్చిన ఆరు ప్రశ్నలను యూపీఎస్సీ తొలగించింది. ఈ విషయాన్ని పరీక్షకు ముందే యూపీఎస్సీ తెలిపింది. అంటే రెండో పేపర్లో 80 ప్రశ్నలకుగాను 74 ప్రశ్నలు (185 మార్కులు) మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు. ఈ 74 ప్రశ్నల్లో ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ నుంచి 26 ప్రశ్నలు, జనరల్ మెంటల్ ఎబిలిటీ నుంచి 30 ప్రశ్నలు, బేసిక్ న్యూమరసీ నుంచి 18 ప్రశ్నలు అడిగారు. 74 ప్రశ్నల్లో 48 ప్రశ్నలు చాలా సులువుగానూ, 14 ప్రశ్నలు మధ్యస్తంగానూ, 12 ప్రశ్నలు కఠినంగానూ ఉన్నాయి. ఈ పేపర్లో అంశాలవారీగా వచ్చిన ప్రశ్నల సంఖ్యను ఈ కింది పట్టిక ద్వారా తెలుసుకోవచ్చు. బేసిక్ న్యూమరసీ 1. నంబర్స్ 4 2. పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్ 3 3. రేషియోష్ ప్రొపర్షన్ ఈక్వేషన్స్ 1 4. టైమ్ అండ్ డిస్టెన్స్ 2 5. సింపుల్ ఇంట్రెస్ట్ 1 6. డేటా ఇంటర్‌ప్రిటేషన్ 6 7. మిస్లేనియస్ 1 మొత్తం 18 -
జీకే, వర్తమాన వ్యవహారాలు
పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. తీవ్ర పోటీ ఉన్న ఈ పరీక్షలో విజయం సాధించాలంటే స్టాక్ జీకేతో పాటు వర్తమాన వ్యవహరాలపై దృష్టిసారించాలి. జీకేకు సంబంధించి చదవాల్సిన అంశాలు: భారతదేశ జాతీయ చిహ్నాలు, కేలండర్, జనాభా, భాషలు, రాష్ట్రాలు, రాజధానులు, కేంద్రపాలిత ప్రాంతాలు, రవాణా వ్యవస్థ, విమానాశ్రయాలు, సమాచార వ్యవస్థ, దేశ రక్షణ రంగం, క్షిపణి వ్యవస్థ, అంతరిక్ష పరిశోధనా సంస్థ, భారత అంతరిక్ష విజయాలు, అణుశక్తి రంగం, అణు విద్యుత్ కేంద్రాలు, పరిశోధనా కేంద్రాలు, అవి నెలకొని ఉన్న ప్రదేశాలు, భారత భౌగోళిక అంశాలు, నదీ వ్యవస్థ, ప్రాజెక్టులు, భారత రాజ్యాంగంలోని ముఖ్యాంశాలు. రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, న్యాయ వ్యవస్థ, భారత ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికలు, బ్యాంకింగ్ వ్యవస్థ, ఉపాధి కల్పనా పథకాలు, వ్యవసాయ రంగం తదితర అంశాలపై దృష్టిసారించాలి.అంతర్జాతీయ అంశాలలో దేశాలు, రాజధానులు, కరెన్సీలు, పార్లమెంటు పేర్లు, వివిధ దేశాల జాతీయ చిహ్నాలు, పుష్పాలు, జంతువులు, భౌగోళిక మారుపేర్లు, నదీ తీరాన వెలసిన నగరాలు, అత్యున్నత అంశాలు, ప్రసిద్ధ కట్టడాలు, ప్రదేశాలు, సరస్సులు, జలపాతాలు, ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ సంస్థలు, కూటములు వంటి వాటిని చదవాలి. గ్రంథాలు-రచయితలు; ప్రముఖ ఆవిష్కరణలు-ఆవిష్కర్తలు; ప్రముఖ వ్యక్తుల బిరుదులు, నినాదాలు, వివిధ అధ్యయన శాస్త్రాలు, కల్చర్స్, జాతీయ, అంతర్జాతీయ దినాలు, ప్రపంచ సంస్థల ప్రధాన కార్యాలయాలు, వాటి ప్రస్తుత అధిపతులు, రాష్ట్రానికి సంబంధించిన రాజకీయ, ఆర్థిక, భౌగోళిక విషయాలను చదవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. కరెంట్ అఫైర్స్‌లో ప్రపంచంలో ఏ మూల జరిగిన సంఘటన నుంచైనా ప్రశ్నలు రావొచ్చు. దీనికి నిర్దేశిత సిలబస్ అంటూ ఉండదు. పరీక్షకు ముందు ఏడాది కాలంలో జరిగిన సంఘటనలను అధ్యయనం చేయాలి. రోజూ ఒకట్రెండు ప్రామాణిక వార్తా పత్రికలను చదివి, సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి. మార్కెట్లో పేరున్న ఒక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్‌ను కూడా చదవాలి. కరెంట్ అఫైర్స్- ప్రధాన అంశాలు: రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ ముఖ్య సంఘటనలు రాజకీయ సంఘటనలు, ఎన్నికలు, ముఖ్యమంత్రులు, గవర్నర్లు వార్తల్లోని వ్యక్తులు, ప్రదేశాలు వాణిజ్య వ్యవహారాలు శాస్త్ర, సాంకేతిక అంశాలు పర్యావరణం రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సంబంధించిన పోటీలు, విజేతలు, ఇతర ముఖ్యమైన సమాచారం అంతర్జాతీయ సదస్సులు దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు ఆర్థిక సర్వేలు, రైల్వే బడ్జెట్, కేంద్ర బడ్జెట్, రాష్ర్ట బడ్జెట్ సన్నద్ధత ఎలా? గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి ప్రశ్నల సరళిని, క్లిష్టతను పరిశీలించాలి. వాటికి అనుగుణంగా సిద్ధంకావాలి. పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ ప్రిపరేషన్‌ను బిట్లను చదవడానికే పరిమితం చేయకూడదు. ఒక ముఖ్య ఘటన జరిగినప్పుడు దాన్ని వివిధ కోణాల్లో అధ్యయనం చేయాలి. అప్పుడే సంబంధిత అంశం నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా సమాధానం గుర్తించగలరు. ఇటీవల కామన్వెల్త్ క్రీడలు ముగిశాయి. ఈ అంశం నుంచి వేటిని చదవాలో పరిశీలిస్తే.. కామన్వెల్త్ క్రీడలు తొలిసారి 1930లో కెనడాలోని హామిల్టన్ నగరంలో జరిగాయి. అప్పటి నుంచి నాలుగేళ్లకోసారి నిర్వహిస్తున్నారు. భారతదేశం తొలిసారిగా 1934లో లండన్‌లో జరిగిన క్రీడల్లో పాల్గొంది. మనదేశం 2010లో క్రీడలకు ఆతిథ్యం కూడా ఇచ్చింది. 20వ కామన్వెల్త్ క్రీడలు జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జరిగాయి. దాదాపు 4,950 మంది క్రీడాకారులు 18 క్రీడలలో 261 అంశాల్లో పాల్గొన్నారు. మొత్తం 71 జట్లు పాల్గొన్నాయి. భారత్ నుంచి 215 మంది క్రీడాకారులు పాల్గొఇంగ్లండ్ జట్టు 58 బంగారు, 59 రజత, 57 కాంస్య పతకాలతో మొత్తం 174 పతకాలు సాధించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆస్ట్రేలియా, కెనడా, స్కాట్లాండ్ 2, 3, 4 స్థానాల్లో నిలిచాయి. మన దేశం 64 పతకాలు సాధించి ఐదో స్థానాన్ని దక్కించుకుంది. వీటిలో 15 స్వర్ణ పతకాలు, 30 వెండి, 19 కంచు పతకాలు ఉన్నాయి. భారత్‌కు మొదటి బంగారు పతకాన్ని మహిళల 48 కిలోల వెయిట్ లిఫ్టింగ్‌లో సంజితా చాను సాధించిపెట్టింది. మన దేశానికి బంగారు పతకాలు లభించిన విభాగాలు.. రెజ్లింగ్ (5), షూటింగ్ (4), వెయిట్ లిఫ్టింగ్ (3), స్క్వాష్ (1), బ్యాడ్మింటన్ (1), అథ్లెటిక్స్ (1).అభినవ్ బింద్రా, అపూర్వి చందేలా జీతురాయ్, రాహి సర్నోబత్ షూటింగ్లో స్వర్ణాలు సాధించగా, సుశీల్ కుమార్, యోగేశ్వర్‌దత్ రెజ్లింగ్‌లో, వికాస్ గౌడ్ డిస్కస్ త్రోలో పారుపల్లి కశ్యప్ బ్యాడ్మింటన్‌లో బంగారు పతకాలు సాధించారు. పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియ మారే అవకాశం ఉందా? ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ వెలువడొచ్చు? -కిరణ్, షాద్‌నగర్. ప్రస్తుతానికి మాత్రం పోలీస్ కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో మార్పులకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. కాబట్టి పాత పద్ధతిలోనే పోలీస్ ఉద్యోగాల భర్తీ ఉండొచ్చు. గతంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో మూడు వేలకు పైగా పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. ఇందులో కొన్ని డ్రైవర్ పోస్టులు కూడా ఉన్నాయి. ఈ పోస్టులన్నీ హైదరాబాద్‌లో పరిధిలోనివి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం లభిస్తుంది. కానిస్టేబుల్ పోస్టులకు కావల్సిన ఎత్తు ఎంత? -శ్రీను, మహబూబ్‌నగర్. సాధారణంగా కానిస్టేబుల్ పోస్టులకు కావల్సిన విద్యార్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు మాత్రం పదో తరగతి ఉత్తీర్ణులై, ఇంటర్మీడియెట్ రెండేళ్ల పరీక్షలకు హాజరై ఉంటే సరిపోతుంది. వయసు: 22ఏళ్లు. నిబంధనల మేరకు రిజర్వ్డ్ అభ్యర్థులకు వయోసడలింపు ఉంటుంది. ఎత్తు విషయానికొస్తే.. పురుషులు-167.6 సెం.మీ., మహిళలు-152.5 సెం.మీ. ఉండాలి. అదేవిధంగా పురుషుల ఛాతీ 81.3 సెం.మీ. ఉండి గాలి పీలిస్తే-5 సెం.మీ. పెరగాలి. ఎంపిక ప్రక్రియలో ఉండే రెండో దశ.. ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్‌లో అభ్యర్థుల శారీరక ప్రమాణాలను పరిశీలిస్తారు. నిర్దేశించిన ప్రమాణాలు ఉన్న వారిని మాత్రమే తర్వాతి దశకు అనుమతిస్తారు. పోలీస్ కానిస్టేబుల్‌కు సంబంధించి అర్హత ఈవెంట్ అయిన 5 కి .మీ.ను ఏవిధంగా ప్రాక్టీస్ చేయాలి? -రవీందర్, మెదక్. పోలీస్ కానిస్టేబుల్ ఎంపికప్రక్రియలో కీలకమైంది. 5 కి.మీ. పరుగు. దీన్ని ప్రైమరీ క్వాలిఫైయింగ్ టెస్ట్‌గా పేర్కొంటారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులను మాత్రమే రెండో దశ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్‌కు అనుమతిస్తారు. ఈ క్రమంలో అభ్యర్థులు నిర్దేశించిన దూరాన్ని.. నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలి. ఈ క్రమంలో పురుష అభ్యర్థులు 5 కి.మీ. దూరాన్ని 25 నిమిషాల్లో పరుగెత్తాలి. మహిళా అభ్యర్థులు 2.5 కి.మీ.ల దూరాన్ని 16 నిమిషాల్లో చేరుకోవాలి. ఈ ఈవెంట్‌ను ప్రాక్టీస్ చేసేటప్పడు కొన్ని జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. అవి..పరుగెత్తేటప్పుడు స్పోర్ట్స్ షూ, కాన్వాస్ షూ వాడాలి. పలుచని కాటన్ సాక్స్ ధరించాలి. బూట్లు లేకుంటే కాలివేళ్లకు, పాదాలకు కాటన్ ప్లాస్టర్ చుట్టాలి. ప్రతిరోజు 5 కి.మీ. లేదా కనీసం 2 కి.మీ. అయిన పరుగెత్తాలి. వారానికి ఒకసారి 5 కి.మీ. స్వీయ పరీక్ష చేసుకోవాలి. ఎన్ని సెకన్లలో పూర్తిచేశారో రికార్డు చేసుకుని 5 కి.మీ. పరుగుకు లక్ష్యాన్ని నిర్ణయించుకోవాలి. నోటిలో గుడ్డలు, నిమ్మకాయలు పెట్టుకోవడం సరికాదు. ఆక్సిజన్ అవసరం కాబట్టి కేవలం ముక్కుతోపాటు నోటితోనూ గాలి పీల్చుకోవచ్చు. కాలి అంగలు ఎలా వీలైతే అలా వేయాలి. పరుగులో కండరాలను, పిడికిలిని గట్టిగా బిగించకూడదు. ఉపరితలం మెత్తగా ఉన్న దారిలోనే రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం మంచిది. పోటికి రెండు రోజుల ముందు రెస్ట్ తీసుకోవాలి. లైట్ ఎక్సర్సైజ్లకు మాత్రమే పరిమితం కావాలి. ఇన్పుట్స్: ఉపేంద్ర, సీనియర్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. -
విద్యార్థులకు ఆర్బీఐ క్విజ్ పోటీలు
న్యూఢిల్లీ: సీనియర్ స్యూల్ విద్యార్థులకు ఆర్బీఐక్యూ 2014 పేరుతో క్విజ్ పోటీలను నిర్వహించనున్నట్లు ఇక్కడి రిజర్వ్ బ్యాంక్ కార్యాలయం తెలిపింది. పోటీలను దేశవ్యాప్తంగా ఈ నెల 6,8, 27వ తేదీలలో నిర్వహించనున్నట్లు వెల్లడించింది. 9-12 తరగతుల ప్రభుత్వ, ప్రయివేట్ స్కూళ్ల విద్యార్థులు ఈ క్విజ్‌లో పాల్గొనవచ్చునని పేర్కొంది. తొలి దశలో గెలుపొందిన టీమ్‌లను జోనల్ ఫైనల్స్‌కు, ఆపై నేషనల్ ఫైనల్స్‌కు ఎంపిక చేయనున్నట్లు వివరించింది. ఈ క్విజ్‌లో భాగంగా బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగాలలో రిజర్వ్ బ్యాంక్ పాత్ర, చరిత్రలతోపాటు, ఆర్థిక విషయాలు, కరెంట్ అఫైర్స్, దేశ పురోభివృద్ధికి సహకరించిన వ్యక్తులు, సంఘటనలు వంటి అంశాలపై అవగాహన కల్పించనుంది. ఇతర వివరాలను www.rbi.org.in చూడొచ్చు. -
ఆర్బీఐ అసిస్టెంట్స్ పరీక్షలో జనరల్ అవేర్నెస్..?
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: ఆర్బీఐ అసిస్టెంట్స్ పరీక్షలో జనరల్ అవేర్నెస్ నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి? - శ్రీనివాస్‌గౌడ్, రాంనగర్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ అసిస్టెంట్ పరీక్షలో జనరల్ అవేర్నెస్ నుంచి 40 ప్రశ్నలు ఇస్తారు. 2012 ఏప్రిల్‌లో నిర్వహించిన ఆర్బీఐ అసిస్టెంట్ పరీక్షలోని జనరల్ అవేర్నెస్ విభాగాన్ని పరిశీలిస్తే కరెంట్ అఫైర్స్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. వర్తమాన సంఘటనల నుంచి 20 ప్రశ్నలు వచ్చాయి. స్టాక్ జీకే నుంచి 8 ప్రశ్నలు, బ్యాంకింగ్/ఎకానమీల నుంచి 12 ప్రశ్నలు అడిగారు. అభ్యర్థులు ఈ విభాగాలను ప్రత్యేక దృష్టితో చదవాలి. కరెంట్ అఫైర్స్‌లో జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు, దేశాల మధ్య జరిగిన ఒప్పందాలు, విదేశాలతో భారత్ సంబంధాలు, దేశాధ్యక్షులు, ప్రధాన మంత్రులు, రాష్ట్రాలు - ముఖ్యమంత్రులు, నూతన గవర్నర్లు, కేంద్ర బడ్జెట్, రైల్వే బడ్జెట్, ఆర్థిక సర్వే, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, ఇటీవల జరిగిన క్రీడలు - పోటీలు - వాటి విజేతలు, అంతర్జాతీయ సదస్సులు, అంతరిక్ష పరిశోధనలు, రక్షణ రంగం, శాస్త్ర సాంకేతిక రంగంలో జరిగిన పరిణామాలు, అణ్వస్త్ర రంగం, వార్తల్లో వ్యక్తులు, నియామకాలు, ప్రదేశాలు, ప్రభుత్వ పథకాల గురించి అధ్యయనం చేయాలి. బ్యాంకింగ్‌లో ఆర్బీఐ - దాని విధులు, గవర్నర్, డిప్యూటీ గవర్నర్, పరపతి విధానం, పాలసీ రేట్లు, కమిటీలు - వాటి చైర్మన్లు, కమిటీల సిఫార్సులు, ఫైనాన్షియల్ ఇన్‌క్లూజన్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, కరెన్సీ, ప్లాస్టిక్ కరెన్సీ, బ్యాంకుల రుణాలు, నాబార్డు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, బ్యాంకింగ్ రంగంలో తాజా పరిణామాలు, బ్యాంకింగ్ పదజాలం, డిపాజిట్లు - వాటి రకాలు, చెక్కులు, ఏటీఎంలు, నో యువర్ కస్టమర్ విధానాలు మొదలైనవాటిని బాగా చదవాలి. స్టాక్ జీకే నుంచి అబ్రివియేషన్స్, దేశాలు - అవి ఉన్న ఖండాలు/భౌగోళిక ప్రాంతాలు, దేశాలు - రాజధానులు- కరెన్సీలు - పార్లమెంట్లు, క్రీడలకు సంబంధించిన ట్రోఫీలు, క్రీడా పదాలు, పుస్తకాలు - రచయితలు, ముఖ్యమైన దినాలు, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు - వాటి రాజధానులు, అభయారణ్యాలు - అవి ఉన్న రాష్ట్రాలు మొదలైన అంశాలను అధ్యయనం చేయాలి. - ఇన్పుట్స్: ఎన్. విజయేందర్ రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ మహీంద్రా ఎకోల్ సెంట్రల్ తొలి బ్యాచ్ ప్రారంభం ఎడ్యూన్యూస్: భవిష్యత్తు ఇంజనీర్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, పరిశ్రమ అవసరాలకు ధీటుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని టెక్ మహీంద్రా ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, మహీంద్రా ఎకోల్ సెంట్రల్ (ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్) చైర్మన్ వినీత్ నాయర్ పేర్కొన్నారు. మహీంద్రా సంస్థ, ఫ్రాన్స్‌కు చెందిన ఎకోల్ సెంట్రల్ ప్యారిస్, జేఎన్టీయూ -హైదరాబాద్ సంయుక్త ఒప్పందంతో హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ మహీంద్రా ఎకోల్ సెంట్రల్లో సోమవారం నుంచి తొలి బ్యాచ్ తరగతులు మొదలయ్యాయి. ప్రారంభ కార్యక్రమంలో జేఎన్టీయూ- హైదరాబాద్ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ రామేశ్వర్ రావు, ఎకోల్ సెంట్రల్ ప్యారిస్ ఇంటర్నేషనల్ అఫైర్స్ డీన్ క్రిస్టోఫర్ క్రిప్స్, భారత్‌లో ఫ్రాన్స్ కాన్సులేట్ జనరల్ ఎరిక్ లవెర్టు, టెక్ మహీంద్రా సీఈఓ సి.పి గుర్గానీ, యంగ్ సీఈఓ రాహుల్ భూమన్ తదితరులు పాల్గొన్నారు. జనరల్ నాలెడ్జ్ : ప్రముఖ వ్యక్తులు కౌటిల్యుడు విష్ణుగుప్తుడు, చాణక్యుడు అనే పేర్లు కలిగిన కౌటిల్యుడు చంద్రగుప్త మౌర్యుని ప్రధానమంత్రి. అర్థశాస్త్రాన్ని రచించాడు. మెగస్తనీస్ చంద్రగుప్త మౌర్యుని సమకాలికుడు. ఇండికా అనే గ్రంథ రచయిత. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్య స్థాపకుడు. సాండ్రకొట్టస్ బిరుదు ఉంది. జైనమతాన్ని అవలంబించాడు. అశోకుడు దేవానంప్రియ, ప్రియదర్శి అనే బిరుదులు ఉన్నాయి. దేశంలో - తొలిసారిగా లిఖిత పూర్వక శాసనాలు, స్తంభ శాసనాలు వేయించాడు. భారత ఆర్థిక వ్యవస్థ ప్రణాళికలు - ఆర్థిక ప్రణాళిక: ఆర్థిక వ్యవస్థ ఆశయాలను, వనరులను సమస్యలను పరిగణలోకి తీసుకొని నిర్ణీత లక్ష్యాలను నిర్ణీత కాలంలో సాధించే ప్రయత్నమే ‘ఆర్థిక ప్రణాళిక’. - 1929-30లో సంభవించిన ప్రపంచ ఆర్థిక మాంద్యానికి గురికాకపోవడంతో పాటు రష్యా సాధించిన ప్రణాళికాబద్ధ ప్రగతి భారతదేశాన్ని ప్రభావితం చేసింది. - భారతదేశంలో కేంద్రమంత్రి మండలి తీర్మానం ద్వారా 1950లో ప్రణాళికా సంఘం ఏర్పాటు చేశారు. - 1952 సం॥జాతీయాభివృద్ధి మండలిని నెలకొల్పారు. - భారతదేశ ప్రణాళికా విధానం మౌలికంగా సమగ్రమైన ప్రజాస్వామ్య మిశ్రమ ఆర్థిక వ్యవస్థలోని ప్రణాళికా విధానం. -
రుణమో ఫణమో!
-
అర్చకష్టాలు
-
కూల్చివెతలు
-
ఆంధ్రుల రాజధాని
-
ముఖ్యమంత్రి కాదు.. ఆర్బీఐ చెప్పాలి
* రుణమాఫీ అధికారం రాష్ట్రాలకు లేదు * రుణాలు రీ షెడ్యూల్ చేయమని ప్రభుత్వాలు అడగలేవు * రుణాలు రీ షెడ్యూల్ చేస్తే 10 శాతం వడ్డీ చెల్లించాలి * బాండ్లు జారీ చేసే ఆర్థిక స్తోమత ఏపీకి లేదు * ఆర్థిక పరిస్థితులు తెలుసుకోకుండా మాఫీ హామీ ఎలా ఇచ్చారో * ప్రభుత్వ నిర్ణయం జాప్యమయ్యేకొద్దీ డిఫాల్టర్లు పెరుగుతారు * ఇప్పటికే ఆంధ్రాబ్యాంకులో ఎన్పీఏలుగా మారిన రూ. 1,000 కోట్ల రైతు రుణాలు * ప్రభుత్వ పాలసీ త్వరగా రాకపోతే 11,000 కోట్లు ఎన్పీఏలే * రుణమాఫీ అంశంలో తెలంగాణ పరిస్థితి కొంత మెరుగు ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ సి.వి.ఆర్. రాజేంద్రన్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాష్ట్రంలోని ఆర్థిక స్థితిగతులను తెలుసుకోకుండా ఇచ్చిన హామీలు బ్యాంకింగ్ రంగాన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్బీఐ అనుమతి లేనిదే రుణమాఫీ పథకం అమలు చేసే అవకాశం లేదంటున్నారు ఆంధ్రా బ్యాంక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ సి.వి.ఆర్. రాజేంద్రన్. ఒకవేళ రుణాలను రీ-షెడ్యూల్ చేస్తే వ్యవసాయ రుణాలపై లభిస్తున్న సబ్సిడీ వర్తించదంటున్న రాజేంద్రన్‌తో ‘సాక్షి’ ఇంటర్వ్యూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ రుణాలను రీ-షెడ్యూల్ చేయమని కోరుతోంది కదా? ఇందులో సాధ్యాసాధ్యాలు వివరిస్తారా? రుణాలను రీ-షెడ్యూల్ చేయమని బ్యాంకులను అడిగే అధికారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు. కేంద్రం కేవలం కరువు మండలాలను మాత్రమే ప్రకటించగలదు. కానీ ఆ విషయంలో ప్రభుత్వం విఫలమయ్యింది. ఇప్పుడు రాష్ట్రంలో రుణాలను రీ-షెడ్యూల్ చేయాలంటే ఆర్బీఐ నుంచి ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్బీఐ అనుమతిస్తే చేయడానికి మేం సిద్ధం. ఆర్బీఐ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాం. అంతే తప్ప రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పారని రీ-షెడ్యూల్ చేయలేం. రీ-షెడ్యూల్ కోసం రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ) అనుమతి కోరమని ఎస్ఎల్బీసీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బ్యాంకులకు విజ్ఞప్తిచేశారు కదా? ఈ విషయంలో బ్యాంకులు నేరుగా కల్పించుకోలేవు. ఎస్ఎల్బీసీ సమావేశంలో జరిగిన మినిట్స్‌ను ప్రాంతీయ ఆర్బీఐ కార్యాలయం కేంద్ర కార్యాలయానికి పంపుతుంది. త్వరలోనే ఆర్బీఐ దీనిపై తుది నిర్ణయం తీసుకుంటుంది. రుణాలను రీ-షెడ్యూల్ చేస్తే వ్యవసాయ రుణాలకు లభించే 3 శాతం వడ్డీ ప్రయోజనం కొనసాగుతుందా? అలాగే కొత్త రుణాలను మంజూరు చేస్తారా? ఒకవేళ రుణాలు రీ-షెడ్యూల్ చేస్తే ఆ రుణాలపై 7 శాతానికి బదులు 10 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. రీ-షెడ్యూల్‌కు ఆర్బీఐ అనుమతిస్తే ప్రస్తుత పంటకు కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు సిద్ధంగా ఉన్నాయి. లేదా రుణాలు చెల్లించిన వారికి కూడా కొత్త రుణాలను మంజూరు చేస్తున్నాం. ఇలా పెరిగిన వడ్డీ రేటును రైతులే భరించాల్సి ఉంటుందా? లేదంటే రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందా? వాస్తవంగా అయితే ప్రభుత్వం చెల్లించాలి. కానీ దీనిపై స్పష్టత లేదు. అసలు రుణమాఫీ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు నేరుగా ప్రకటించే అధికారం లేదు. ప్రభుత్వం దగ్గర నిధులు ఉంటే అప్పుడు రైతుల తరఫున రుణం చెల్లించే విధంగా హామీ ఇవ్వొచ్చు. రుణ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించకుండా ఇతర మార్గాలను అవలంబించాల్సి వస్తే మాత్రం ఆర్బీఐ అనుమతి తప్పకుండా తీసుకోవాల్సిందే. రుణ వసూళ్ల కోసం రైతుల మీద ఏమైనా ఒత్తిడి చేస్తున్నారా? చెల్లించని వారిని డిఫాల్టర్లుగా ప్రకటిస్తున్నారా? ఎటువంటి ఒత్తిడి తీసుకురావడం లేదు. రాజకీయంగా ఒత్తిడి ఉండటం, రైతులు ఆందోళన చేస్తుండటంతో చెల్లించని వారిపై ఎటువంటి రికవరీ చర్యలు తీసుకోలేకపోతున్నాం. తమ రుణాలను ప్రభుత్వం చెల్లిస్తుందని రైతులు చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం వెంటనే ఒక స్పష్టత తీసుకురావాలి. జూన్ నెలలోనే చాలా మంది రైతుల్ని డిఫాల్టర్లుగా ప్రకటించాం. ఆలస్యం అయ్యేకొద్దీ ఈ జాబితా పెరుగుతుంది. గడచిన త్రైమాసికంలో ఆంధ్రాబ్యాంక్‌కు సంబంధించి రూ.1,000 కోట్ల వ్యవసాయ రుణాలు ఎన్పీఏలుగా మారాయి. ప్రభుత్వం రుణమాఫీ పథకాన్ని ఆలస్యం చేస్తే మిగతా రూ.11,000 కోట్ల వ్యవసాయ రుణాలు కూడా ఎన్పీఏగా మారే అవకాశం ఉంది. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఎస్ఎల్బీసీ కన్వీనర్‌గా రుణ మాఫీ పథకానికి సంబంధించి ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేశారా? చేయాలనుకుంటున్న రుణమాఫీ మొత్తం, కటాఫ్ తేదీపై (రుణ మాఫీ లేదా రీషెడ్యూల్కు అర్హులైన రైతుల గుర్తింపునకు వర్తింపచేసే నిర్ణీత తేదీ) ముందు స్పష్టత తెచ్చుకోమని సూచించాం. అప్పుడు ఎంత మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుందన్న దానిపై అవగాహన వస్తుంది. ఈ రుణమాఫీ పథకం పరిధిలోకి వచ్చే రైతులు వారి బకాయిల్ని ముందుగా చెల్లిస్తే కొత్త రుణాలను ఇస్తాం. అప్పుడు రైతులు బ్యాంకుకు చెల్లించిన సొమ్మును ప్రభుత్వం రైతులకే నేరుగా చెల్లించుకోవచ్చు. రైతు చెల్లించిన రుణానికి సంబంధించి మేము ప్రభుత్వానికి సర్టిఫికెట్ రూపం లో ఇస్తామన్నాం. ఈ సర్టిఫికెట్‌ను పరిశీలించుకొని ప్రభుత్వం రైతులకు ఐదేళ్ల లోపు చెల్లించుకోవచ్చు. అప్పుడు ఇది రైతులకు, ప్రభుత్వానికి మధ్య కుది రిన ఒప్పందమవుతుంది.దీనికి ఆర్బీఐ అనుమతులు అవసరం లేదు. కానీ ఇక్క డ ప్రభుత్వం గ్యారంటీగా రైతులకి చెల్లిస్తామన్న హామీ ఉండదు. ఇది పూర్తిగా ప్రభుత్వం, రైతులకు మధ్య ఉన్న నమ్మకంపైనే ఆధారపడి ఉంటుంది. చెల్లించాల్సిన రుణ బకాయిలకు సంబంధించి బ్యాంకులకు రాష్ర్ట ప్రభుత్వం బాండ్లు జారీ చేసే ఆలోచనలో ఉందన్న ప్రచారంలో ఉంది కదా? ఇది కూడా సాధ్యమయ్యేపని కాదు. ఇందుకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించదు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ (ఎఫ్ఆర్బీఎం) చట్ట ప్రకారం జీడీపీలో 3 శాతానికి మించి రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేయడానికి లేదు. ఈ విధంగా చూస్తే రూ.13,000 కోట్లు మించి ఆంధ్రప్రదేశ్ అప్పులు చేయడానికి లేదు. అలా అప్పు చేసిన నిధులు ప్రభుత్వం నడవడానికే చాలా అవసరం. కాబట్టి బాండ్లను జారీ చేసే అవకాశం కూడా లేదు. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసుకోకుండా ఇంత పెద్ద హామీలను ఏ విధంగా ఇచ్చారో తెలియడం లేదు. గతంలో అంత ఆదాయం ఉన్న కేంద్ర ప్రభుత్వమే దేశమంతటా రూ.60,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తే ఒక్క రాష్ట్రం రూ.50,000 కోట్ల రుణాల మాఫీ హామీని ఎలా ఇచ్చారో.., దీన్ని ప్రజలు ఎలా నమ్ముతున్నారో అర్థం కావడం లేదు. కానీ ఈ హామీ ప్రభావం ఆంధ్రాబ్యాంక్, ఎస్బీహెచ్, ఎస్బీఐలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాల మొత్తంపై భిన్నమైన గణాంకాలు ప్రచారంలో ఉన్నాయి. వాస్తవంగా రాష్ట్రంలో వ్యవసాయ రుణాల విలువ ఎంత ఉంటుంది? గతేడాది ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న మొత్తం వ్యవసాయ రుణాల విలువ రూ.1.30 లక్షల కోట్లు. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా రూ.77 వేల కోట్లపైనే ఉంది. మాకొస్తున్న సమాచారం ప్రకారం రెండు రాష్ట్రాల్లో కలిపి అర్హులుగా గుర్తించే రైతులకు రూ.55,000 కోట్ల రుణాలను మాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ వాటా రూ.35,000 కోట్లు కాగా, తెలంగాణ వాటా రూ.20,000 కోట్లుగా ఉన్నట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వాల అంచనా. ఏ పరిమితులు ఆధారంగా ఈ గణాంకాలు తయారు చేశారో తెలియదు. ఈ ప్రకారం చూస్తే ఆంధ్రాబ్యాంక్ సుమారు రూ.11,670 కోట్ల రుణాలను మాఫీ చేయాల్సి ఉంటుంది. ఇందులో తెలంగాణ వాటా రూ.4,557 కోట్లు. రుణ మాఫీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటోంది? బ్యాంకుల నుంచి సమాచారం తీసుకున్నారే కాని ఇంతవరకు ఎటువంటి ప్రతిపాదనలు రాలేదు. కాని ఆంధ్రప్రదేశ్ రాష్టంతో పోలిస్తే రైతులు తీసుకున్న రుణాల విలువ తక్కువగా ఉండటం, మిగులు బడ్జెట్‌ను కలిగి ఉండటంతో తెలంగాణ రాష్ట్రం కొద్దిగా మెరుగైన పరిస్థితిలో ఉందని చెప్పొచ్చు. -
బియాండ్ బార్డర్స్
-
రష్యాలో విలీనమైన క్రిమియా
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం ఆర్థిక స్వేచ్ఛలో గుజరాత్ అగ్రస్థానం ఆర్థికాంశాల స్వేచ్ఛకు సంబంధించి రాష్ట్రాల వారీ జాబితాలో గుజరాత్‌కి అగ్రస్థానం దక్కింది. ఇదే విషయంలో అత్యంత వేగంగా స్కోరును మెరుగుపరుచుకున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది. ప్రముఖ ఆర్థికవేత్తలు అశోక్ గులాటీ, బిబేక్ దేబ్రాయ్, లవీష్ భండారీ, జర్నలిస్ట్ స్వామినాథన్ అయ్యర్ రూపొందించిన ఈఎఫ్‌ఎస్‌ఐ-2013 నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. పాలనా యంత్రాంగం పరిమాణం, న్యాయ వ్యవస్థ, ప్రాపర్టీ హక్కులకు భద్రత, వ్యాపార, కార్మిక చట్టాల అమలు మొదలైన అంశాల ప్రాతిపదికగా దీన్ని రూపొందించారు. దీనిప్రకారం 2005లో అయిదో స్థానంలో ఉన్న గుజరాత్ ఆర్థిక స్వేచ్ఛతోపాటు వేగంగా పరిస్థితులను మెరుగు పరచుకునే విషయంలో కూడా అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో తమిళనాడు ఉండగా ఆంధ్ర ప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది. హైకోర్టులలో 25 శాతానికి పెరగనున్న న్యాయమూర్తుల సంఖ్య దేశంలోని అన్ని హైకోర్టులలో న్యాయమూర్తుల సంఖ్యను కేంద్రం 25 శాతానికి పెంచింది. పెండింగ్‌లో ఉన్న 40 లక్షల కేసులను పరిష్కరించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించి కేంద్ర న్యాయశాఖమంత్రి కపిల్ సిబాల్ మార్చి 19న హైకోర్టుల్లో భర్తీ చేయాల్సిన ఖాళీలకు సంబంధించి ప్రతిపాదనలు పంపవలసిందిగా అన్ని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులను కోరారు. 25 శాతానికి పెంచితే ప్రస్తుతం ఉన్న న్యాయ మూర్తుల సంఖ్య 906 నుంచి 1112కి పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 49 నుంచి 61కి చేరుతుంది. సామాజిక భద్రత పథకాలకు ఆధార్ తప్పనిసరికాదన్న సుప్రీం సామాజిక భద్రత పథకాల కింద లబ్ధి పొందడానికి ఆధార్ కార్డు ఉండాలన్న నోటిఫికేషన్లను వెంటనే విరమించుకోవాలని సుప్రీంకోర్టు మార్చి 24న కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విద్యుత్, గ్యాస్, కుళాయి కనెక్షన్లు వంటి సేవలు పొందడానికి ఆధార్ కార్డు చట్టబద్ధం కాదని జస్టిస్ బీఎస్ చౌహాన్,జస్టిస్ జె. చలమేశ్వర్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. ఆధార్ సమాచారాన్ని సీబీఐతో పంచుకోవాలన్న గోవా కోర్టు ఇచ్చిన ఆదేశాలపై కూడా స్టే విధించింది. అంతర్జాతీయం రష్యాలో విలీనమైన క్రిమియా రష్యాలో క్రిమియాను విలీనం చేసే ఒప్పందంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మార్చి 18న సంతకం చేశారు. దీంతో రష్యా సమాఖ్యలో క్రిమియా చేరినట్లయింది. 18వ శతాబ్దం నుంచి రష్యాలో భాగంగా ఉన్న క్రిమియాను 1954లో నాటి సోవియట్నేత నికితా కృశ్చేవ్ ఉక్రెయిన్‌కు బదిలీ చేశారు. నాటి నుంచి క్రిమియాలో మెజారిటీ ప్రజలుగా ఉన్న రష్యా జాతీయులు క్రిమియాను రష్యాలో విలీనం చేయాలని కోరుకుంటున్నారని పుతిన్ తెలిపారు. క్రిమియాను రష్యా విలీనం చేసుకోవడంతో జీ-8 నుంచి రష్యాను సస్పెండ్ చేస్తున్నట్లు ఫ్రాన్స్ ప్రకటించింది. దీంతో జూన్‌లో రష్యాలోని సోచిలో జరగాల్సిన జీ-8 సదస్సు నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఆగ్నేయాసియా దేశాల్లో టీబీ రోగులకు వైద్యం ఆగ్నేయాసియా దేశాల్లో ఏటా టీబీ వ్యాధి సోకే మూడు మిలియన్లలో మూడింట ఒకవంతు రోగులకు వైద్య సేవలు అందుబాటులో లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డ బ్ల్యుహెచ్ ఓ) మార్చి 20న విడుదల చేసిన నివేదిక తెలిపింది. టీబీ వ్యాధి మరణాలను సున్నా స్థాయికు తీసుకువచ్చేందుకు వైద్య సేవలు అందని మిలియన్ మందిని గుర్తించి, వైద్యం అందించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా దేశాలను కోరింది. ప్రపంచంలో ప్రతీ సంవత్సరం తొమ్మిది మిలియన్ల మందికి ఈ వ్యాధి సోకుతుంది. ఇందులో మిలియన్ మందికి వ్యాధి తీవ్రంగా ఉంటోంది. తద్వారా వ్యాధి ఇతరులకు విస్తరిస్తుంది. పౌష్టికాహార లోపం, పేదరికం, పర్యావరణం, అధిక స్థాయిలో ప్రజలను తరలించడం వంటి పరిస్థితులు టీబీకి కారణమవుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియాప్రాంతీయ డెరైక్టర్ పూనమ్ ఖేత్రపాల్ తెలిపారు. ఓకే పదానికి 175 ఏళ్లు ఇంగ్లిష్ భాషలో అత్యధికంగా వాడుకలో ఉన్న పదం ఓకే (ైఓ)కి 175 వసంతాలు పూర్తయ్యాయి. అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అత్యంత ప్రజాదరణ గల నాటి పత్రిక ద బోస్టన్ మార్నింగ్ పోస్ట్‌లో ఓకే పదం తొలిసారిగా 1839 మార్చి 23న ప్రచురితమైంది. మాల్దీవుల ఎన్నికల్లో పాలక సంకీర్ణం విజయం మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్‌కు చెందిన ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవులు (పీపీఎం) తన సంకీర్ణ భాగస్వామ్య పార్ట్టీల కూటమి పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించింది. మార్చి 22న జరిగిన ఎన్నికల్లో ఆ కూటమి పార్లమెంట్‌లోని మొత్తం 85 స్థానాలకు గాను 54 స్థానాల్లో గెలుపొందింది. మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ నాయకత్వంలోని ప్రతిపక్ష మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండీపీ) 24 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఈజిప్ట్‌లో 529 మందికి ఉరిశిక్ష ఈజిప్ట్‌లో ఒకేసారి 529 మందికి ఉరిశిక్ష విధిస్తూ ఆ దేశంలోని మనియా కోర్టు తీర్పునిచ్చింది. వీరంతా ఆ దేశ పదవీచ్యుత అధ్యక్షుడు మహమ్మద్ మోర్సీ మద్దతుదారులని కోర్టు ప్రకటించింది. ముస్లిం బ్రదర్ హుడ్కు చెందిన వీరంతా ఓ పోలీసు అధికారి హత్యకేసు, ప్రజలపై దాడుల కేసులో దోషులుగా నిర్ధారిస్తూ ఈ శిక్షను విధించింది. ఆధునిక ఈజిప్ట్ చరిత్రలో ఇంతమందికి మరణదండన విధించడం ఇదే తొలిసారి. సముద్రంలో కూలిన మలేషియా విమానం తప్పిపోయిన తమ దేశ విమానం దక్షిణ హిందూ మహాసముద్రంలో కుప్పకూలి జలసమాధి అయిందని మలేషియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ మార్చి 24న ప్రకటించారు. ఉపగ్రహాల నుంచి లభించిన సమాచారం ఆధారంగా విమానం సముద్రంలో కూలి మునిగిపోయిందన్న నిర్ధారణకు వచ్చినట్లు ఆయన తెలిపారు. మార్చి 8న మలేషియన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ఎం.హెచ్.-370 విమానం కౌలాలంపూర్ నుంచి బీజింగ్‌కు బయలుదేరి వెళ్లింది. ఇందులో 239 మంది ప్రయాణికులు, 13మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికుల్లో ఐదుగురు భారతీయులున్నారు. స్పెయిన్ తొలి ప్రధానమంత్రి అడోల్ఫ్ సూరెజ్ మృతి స్పెయిన్ తొలి ప్రధానమంత్రి అడోల్ఫ్ సూరెజ్ (81) మాడ్రిడ్‌లో మార్చి 23న మరణించారు. 1975లో జనరల్ ఫ్రాన్సిస్కో ఫ్రాంకో మరణించిన తర్వాత సూరెజ్ స్పెయిన్ తొలి ప్రధానమంత్రిగా నియమితులయ్యారు. స్పెయిన్‌లో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకున్న కాలంలో భాగం పంచుకున్న వారిలో మరణించిన చివరి వ్యక్తి సూరెజ్. నియంతృత్వాన్ని కూల్చి ప్రజాస్వామ్య సంస్కరణలు తీసుకురావడంలో సూరెజ్ నాయకత్వం వహించారు. 1976లో సూరెజ్ను ఆదేశ రాజు ప్రధానిగా నియమించారు. వార్తల్లో వ్యక్తులు రచయిత, పాత్రికేయుడు కుష్వంత్‌సింగ్ మృతి ప్రముఖ రచయిత, పాత్రికేయుడు కుష్వంత్‌సింగ్ (99) న్యూఢిల్లీలో మార్చి 20న మృతి చెందారు. ఆయన 30 నవలలు రాశారు. ఇందులో స్వీయ కథ ట్రూత్, లవ్ అండ్ ఏ లిటిల్ మ్యాలీస్తో పాటు దసన్ సెట్ క్లబ్, కుష్వంత్ నామా, ద లెసన్స్ ఆఫ్ మై లైఫ్, ట్రైన్‌టు పాకిస్థాన్, విత్ మలైస్ టువార్డ్స్ వన్ అండ్ ఆల్, ఐ షల్ నాట్ హియర్ ద నైటింగేల్, ద కంపెనీ అండ్ ఉమెన్, ద మార్క్ ఆఫ్ విష్ణు అండ్ అదర్ స్టోరీస్, బ్లాక్ జాస్మిన్, పోట్రయిట్ ఆఫ్ ఎ లేడీ, వంటి అత్యంత ఆదరణ పొందిన రచనలు చేశారు. ఈయన 1915, ఫిబ్రవరి 2న జన్మించారు. 1947 తర్వాత విదేశీ సర్వీసుల్లో చేరారు. లండన్,పారిస్, ఒట్టావాలలో దౌత్యవేత్తగా పనిచేశారు. ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా, హిందూస్థాన్ టైమ్స్, నేషనల్ హెరాల్డ్ లో సంపాదకుడిగా పనిచేశారు. యోజన పత్రిక (1951-53)కు ఆయన వ్యవస్థాపక సంపాదకుడుగా పనిచేశారు. ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో ఆయన రాజ్యసభ (1980 -1986)కు నియమితులయ్యారు. 1974లో పొందిన పద్మభూషణ్పురస్కారాన్ని స్వర్ణమందిరంపై సైనిక చర్యకు నిరసనగా 1984లో తిరస్కరించారు. ఈసీ ప్రచారకర్తగా అమీర్‌ఖాన్ బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రచార కర్తగా ఎంచుకుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలలో ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేందుకు అమీర్సేవలను వినియోగించుకోనుంది. ముఖ్యంగా యువత ఓటు హక్కును వినియోగించుకునేలా చేయడమే ఈసీ చేపట్టిన కార్యక్రమాల ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే ఈసీ తరపున మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్, భారత జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ప్రచారకర్తలుగా సేవలందిస్తున్నారు. ఐ.ఎన్.ఎలో పనిచేసిన బాల ఎ చంద్రన్ మృతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐ.ఎన్.ఎ)కి చెందిన యూత్వింగ్ లో పనిచేసిన బాల ఎ చంద్రన్ (86) సింగపూర్‌లో మార్చి 20న మరణించారు. ఐ.ఎన్.ఎలో పనిచేసిన చివరి సభ్యుల్లో చంద్రన్ ఒకరు. కేరళకు చెందిన చంద్రన్ 1940లో ఏర్పాటు చేసిన ఐ.ఎన్.ఎ యూత్వింగ్ బాలక్ సేనలో పనిచేశారు. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ చక్రవర్తి రాజీనామా రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) డిప్యూటీ గవర్నర్ కె.సి.చక్రవర్తి మార్చి 20న వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేశారు. ఈ ఏడాది జూన్ 30న ఆయన పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈయన 2009, జూన్ 15న ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా చేరారు. మడేళ్ల పదవీ కాలం 2012లో ముగియగా మరో రెండేళ్లు పొడిగించారు. అవార్డులు రాజేశ్ గోపకుమార్‌కు జి.డి.బిర్లా అవార్డు 2013 సంవత్సరానికి జి.డి. బిర్లా అవార్డు భౌతిక శాస్త్రవేత్త రాజేశ్ గోపకుమార్‌కు లభించింది. క్వాంటమ్ ఫీల్డ్ థియరీలో, స్ట్రింగ్ థియరీలో ఆయన చేసిన కృషికి ఈ పురస్కారం దక్కింది. శాస్త్ర పరిశోధనలో విశేష కృషి చేసిన వారికి ఈ పురస్కారం అందజేస్తారు. సుబ్రాన్సు చౌదరికి డిజిటల్ యాక్టివిజమ్ అవార్డు ఇండిపెండెంట్ జర్నలిస్ట్ సుబ్రాన్సు చౌదరికి యునెటైడ్ కింగ్డమ్ సంస్థ అందించే 2014 డిజిటల్ యాక్టివిజమ్ అవార్డు లభించింది. సెంట్రల్ గోండ్వానా నెట్ (సీజీ నెట్) స్వర కమ్యూనిటీ రేడియో నిర్వహణకుగాను ఈ అవార్డు దక్కింది. ఈ రేడియోను రాయ్‌పూర్‌లో 2004లో ప్రారంభించారు. ప్రస్తుతం ఈ రేడియోను మధ్యప్రదేశ్‌లోని హాకర్ గ్రామం నుంచి నిర్వహిస్తున్నారు. మహిళా సంఘాల భాగస్వామ్యంతో ఈ రేడియో మధ్యప్రదేశ్‌లో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ రేడియో తొలుత ఛత్తీస్‌గఢ్‌లో ప్రారంభమైనప్పటికీ దీని కార్యక్రమాలు ప్రస్తుతం మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు కూడా విస్తరించాయి. క్రీడలు ఎయిరిండియాకు నేషనల్ ఎ డివిజన్ హాకీ చాంపియన్‌షిప్ నేషనల్ ఎ డివిజన్ హాకీ చాంపియన్‌షిప్‌ను ఎయిరిండియా గెలుచుకుంది. లక్నోలో మార్చి 23న జరిగిన ఫైనల్లో కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా (కాగ్) జట్టును ఓడించింది. మూడో స్థానాన్ని ఉత్తర ప్రదేశ్ హాకీ సాధించింది. రైల్వేలకు హాకీ ఇండియా ఉమెన్స్ నేషనల్ చాంపియన్ షిప్ నాలుగో హాకీ ఇండియా ఉమెన్స్ నేషనల్ చాంపియన్‌షిప్‌ను రైల్వేస్ గెలుచుకుంది. మార్చి 23న భోపాల్‌లో జరిగిన ఫైనల్లో హర్యానాను ఓడించింది. జార్ఖండ్ మూడో స్థానంలో నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్‌గా హర్యానా జట్టుకు చెందిన మోనిక ఎంపికైంది. రాష్ట్రీయం రాష్ట్రంలో మొదటి మహిళాబ్యాంక్ ఏర్పాటు రాష్ట్రంలో భారతీయ మహిళా బ్యాంక్ మొదటి శాఖను హైదరాబాద్‌లో మార్చి 23న ఆ బ్యాంక్ చైర్పర్సన్, మేనేజింగ్ డైరక్టర్ ఉషా అనంత సుబ్రమణియన్ ప్రారంభించారు. ఏడాదిలోగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 20 శాఖలను ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ఆమె ప్రకటించారు. దేశవ్యాప్తంగా ఇది 19వ మహిళా బ్యాంక్ శాఖ. తూర్పు తీరానికి సుమేధ నౌక ఐఎన్ఎస్ సుమేధ నౌక మార్చి 23న తూర్పు నావికాదళం ప్రధాన కేంద్రమైన విశాఖకు చేరింది. గోవా షిప్‌యార్డులో మార్చి7న ఈస్ట్రన్ నావల్ కమాండ్ కమాండింగ్ ఇన్ ఛీఫ్ వైస్ అడ్మిరల్ అనిల్‌చోప్రా దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. తూర్పు నౌకాదళంలో ఇటువంటి నౌక చేరడం ఇది తొలిసారి. ఇది మూడో తరం ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్ విభాగంలో మూడో నౌక. ఈ నౌక యాంటీ పైరసీ, పెట్రోలింగ్, ఫ్లీట్ సపోర్ట్ ఆపరేషన్స్, మారిటైమ్ సెక్యూరిటీ, ఎస్కార్ట్ ఆపరేషన్స్, నేవీ ఆస్తుల పరిరక్షణ వంటి విధులను నిర్వహిస్తుంది. హెలికాప్టర్ ల్యాండింగ్ సదుపాయమున్న ఈ నౌకలో పలు రకాల ఆయుధాలు, తుపాకులు ఉన్నాయి. నౌకలో రెండు బోట్లు ఉంటాయి. ఆటోమేటిక్ పవర్మేనేజ్మెంట్ విధానంలో కమాండర్ నేతృత్వంలో పనిచేసే ఈ నౌకలో 9మంది అధికార్లు,వందమంది సెయిలర్లు ఉన్నారు. -
వరల్డ్ వైడ్ వెబ్‌కు 25 ఏళ్లు
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం ఎంపీలు, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ ఏడాదిలో పూర్తి చేయాలన్న సుప్రీం ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను సంవత్సరంలోపు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు మార్చి 10న కిందిస్థాయి కోర్టులను ఆదేశించింది. అభియోగాలు నమోదైన సంవత్సరంలోగా విచారణ ముగించాలని పేర్కొంది. ఏడాదిలోగా విచారణ పూర్తికాకపోతే దిగువ కోర్టులు సంబంధిత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. విచారణలో జాప్యం వల్ల కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధులు తమ పదవుల్లో కొనసాగుతున్నారని జస్టిస్ ఆర్.ఎం.లోధా నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. డ్రాపౌట్ల సంఖ్య 8 కోట్లు భారత్‌లో ప్రాథమిక విద్య పూర్తికాక ముందే బడి మానే స్తున్న చిన్నారుల సంఖ్య గణనీయంగా పెరిగిందని యూనిసెఫ్ ప్రతినిధి లూయిస్-జార్జెస్ ఆర్సెనాల్ట్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా సుమారు 8 కోట్ల మంది పిల్లలు వివిధ కారణాల వల్ల మధ్యలోనే స్కూలు డ్రాపౌట్లుగా మారారని తెలిపారు. ప్రాథమిక విద్య (ఎనిమిదో తరగతి వరకూ) పూర్తి కాకుండానే బడి మానేస్తున్న పిల్లల సంఖ్య గ్రామీణ ప్రాంతాల్లోనే అధికంగా ఉందన్నారు. 10వ యంగ్ ఇండియన్ సదస్సు 10వ యంగ్ ఇండియన్ సదస్సు న్యూఢిల్లీలో మార్చి 15న ప్రారంభమైంది. ‘ఇండియా-ద ఫ్యూచర్ ఈజ్ నౌ’ అనే ఇతివృత్తంతో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (సీఐఐ) కు చెందిన యంగ్ ఇండియన్స్ (వైఐ) సంస్థ ఈ సదస్సును నిర్వహించింది. విద్వేషం చిమ్మే నేతలను బుక్ చేయండి: సుప్రీం కులం, మతం, ప్రాంతం, జాతి ఆధారంగా నేతలు చేసే విద్వేష ప్రసంగాలు సమాజానికి విఘాతకరమని.. అలాంటి ప్రసంగాలు చేసే రాజ కీయ, సంఘ, మత సంస్థల నేతలపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పార్టీలు లేదా నేతలు విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తే... ఆయా పార్టీల గుర్తింపు రద్దు చేయాలా? అన్న అంశాన్ని పరిశీలించాలని లా కమిషన్‌ను సుప్రీం కోర్టు ధర్మాసనం కోరింది. నేతల విద్వేష ప్రసంగాలు ప్రజస్వామ్య వ్యవస్థను దెబ్బతీస్తున్నాయని, రాజ్యాంగ సూత్రాలను ఉల్లంఘించేలా ఉంటున్నాయని స్వచ్ఛంద సంస్థ ప్రవాసీ భలాయ్ సంఘటన్ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై సుప్రీం కోర్టు మార్చి 12న విచారించింది. ఎన్నికల్లో నల్లధనం నియంత్రణకు ‘గ్రిడ్’ రాబోయే లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నల్లధనాన్ని నియంత్రించడంలో భాగంగా రెవెన్యూ, సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో కూడిన ప్రత్యేక నిఘా వ్యవస్థ(గ్రిడ్)ను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ఈ విధమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల గురించి ఇది ఎప్పటికప్పుడు ఈసీకి తెలియజేస్తుంది. తద్వారా నల్లధనం నియంత్రణకు చర్యలు తీసుకోవడంలో తోడ్పడుతుంది. యూఐడీఏఐకి నిలేకని రాజీనామా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) చైర్మన్ పదవికి నందన్ నిలేకని మార్చి 13న రాజీనామా చేశారు. యూఐడీఏఐ చైర్మన్‌గా నిలేకని 2009 జూన్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిలేకని వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్‌కు పోటీ చేసేందుకు వీలుగా తన పదవికి రాజీనామా చేశారు. అంతర్జాతీయం దేవయానిపై అభియోగాల కొట్టివేత భారత దౌత్యవేత్త దేవయానిపై నమోదైన వీసా మోసం అభియోగాలను అమెరికా కోర్టు మార్చి 12న కొట్టివేసింది. ఆమెకు పూర్తిస్థాయి దౌత్య రక్షణ ఉన్న నేపథ్యంలో ఈ అభియోగాలు చెల్లవని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యూయార్క్‌లోని జిల్లా కోర్టు జడ్జి షీరా షైండ్లిన్ తీర్పు ఇచ్చారు. దేవయానిపై మార్చి 15 అమెరికా విచారణాధికారులు తాజా అభియోగాలతో అరెస్ట్ వారంట్ జారీ చేశారు. దీంతో ఆమె అమెరికా వెళితే మరోసారి అరెస్టయ్యే అవకాశం ఉంది. దేవయాని న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ అధికారిగా ఉన్నప్పుడు తన ఇంట్లో పనిమనిషి సంగీత రిచర్డ్ వీసా విషయంలో అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చారంటూ గతేడాది ఆమెపై కేసు నమోదైన విషయం తెలిసిందే. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యంలో భారత్‌కు 73వ స్థానం రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం విషయంలో భారత్ ప్రపంచంలో 73వ స్థానంలో నిలిచింది. ‘ద ఉమెన్స్ ఇన్ పాలిటిక్స్ మ్యాప్-2014’ అనే పేరుతో ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ (ఐపీయూ), యూఎన్ ఉమెన్ సంస్థలు మార్చి 16న విడుదల చేసిన నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మహిళల భాగస్వామ్యం విషయంలో నికరాగువా మొదటి స్థానంలో నిలిచింది. స్వీడన్, ఫిన్లాండ్, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా మహిళ పార్లమెంటేరియన్ల శాతం 21.8గా ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. భారత్‌లో పార్లమెంటరీ లేదా మంత్రిత్వ పదవుల్లో 9 శాతం మంది మహిళలు మాత్రమే ఉన్నారు. ఈ విషయంలో ఆఫ్రికా దేశాలు హైతీ, రువాండా, కాంగో, ఛాద్, జాంబియాలు భారత్ కంటే మెరగైన స్థానాల్లో ఉన్నాయి. స్వాతంత్య్రం ప్రకటించుకున్న క్రిమియా ఉక్రెయిన్‌లో భాగంగా ఉన్న క్రిమియా.. ఉక్రెయిన్ నుంచి మార్చి 17న స్వాతంత్య్రం ప్రకటించుకుంది. ఈ ద్వీపకల్పంలోని ఉక్రెయిన్ ప్రభుత్వ ఆస్తులను జాతీయం చేస్తున్నట్లు ప్రకటించింది. పొరుగునే ఉన్న రష్యాలో చేరేందుకు అంగీకరించాలని ఆ దేశాన్ని కోరింది. ‘‘క్రిమియాను స్వతంత్ర దేశంగా గుర్తించాలని ఐక్యరాజ్యసమితి, ప్రపంచ దేశాలన్నింటికీ క్రిమియా రిపబ్లిక్ విజ్ఞప్తి చేస్తోంది. రిపబ్లిక్ ఆఫ్ క్రిమియాను రష్యా సమాఖ్యలో సభ్యురాలిగా చేర్చుకోవాలని ఆ దేశాన్ని క్రిమియా రిపబ్లిక్ కోరుతోంది’’ అనే తీర్మానాన్ని క్రిమియా ప్రాంతీయ పార్లమెంటు ఆమోదించింది. ఉక్రెయిన్‌లో కొంత కాలంగా కొనసాగుతున్న సంక్షుభిత పరిణామాల నేపథ్యంలో.. స్వయం ప్రతిపత్తి గల క్రిమియా తాను ఉక్రెయిన్‌లోనే కొనసాగాలా? లేక ఆ దేశం నుంచి విడిపోయి రష్యాలో చేరాలా? అనే అంశంపై మార్చి 16న ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. ఇందులో పాల్గొన్న ఓటర్లలో 96.8 శాతం మంది ఉక్రెయిన్ నుంచి వేరుపడి రష్యాలో చేరాలని తీర్పుచెప్పినట్లు రెఫరెండం ఎన్నికల కమిషన్ చైర్మన్ మిఖాయిల్ మలిషేవ్ ప్రకటించారు. మార్చి 30 నుంచి తమ ప్రాంతం మాస్కో కాలమానానికి (జీఎంటీ + 4, ప్రస్తుత క్రిమియా కాలమానం కంటే రెండు గంటలు ముందుకు) మారుతుందని క్రిమియా స్థానిక ప్రధానమంత్రి సెర్గీ అక్సియోనోవ్ పేర్కొన్నారు. ఎల్ సాల్వెడార్ అధ్యక్షునిగా సెరెన్ ఎల్ సాల్వెడార్ అధ్యక్షునిగా మాజీ వామపక్ష గెరిల్లా కమాండర్ సాల్వెడార్ సాంచెజ్ సెరెన్ ఎన్నికయ్యారు. ఆయుధాల దిగుమతుల్లో భారత్ టాప్ ఆయుధ సంపత్తి దిగుమతుల్లో భారత్ పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌ల కంటే ముందుంది. ఆ దేశాల కంటే మూడు రెట్లు అధికంగానే ప్రధాన ఆయుధాలను దిగుమతి చేసుకుంది. అలాగే ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను కొనుగోలు చేస్తున్న దేశంగా తన స్థానాన్ని కొనసాగిస్తోంది. చైనా, పాక్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా ఆయుధాల సరఫరాపై స్వీడన్‌కు చెందిన స్టాక్‌హోం ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సిప్రి) తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం... భారత్ భారీ ఆయుధాల దిగుమతులు 2004-08తో పోలిస్తే 2009-13 మధ్య కాలంలో 111 శాతం, పాకిస్థాన్ దిగుమతులు 119 శాతం పెరిగాయి. అలాగే అంతర్జాతీయంగా ఆయుధాల దిగుమతుల్లో భారత్ వాటా 7 నుంచి 14 శాతానికి పెరిగింది. ఇలా భారత్ కొనుగోలు చేస్తున్న ఆయుధ సంపత్తిలో 75 శాతం విక్రయించి రష్యా ప్రథమ స్థానంలో నిలవగా, 7 శాతం సరఫరాతో అమెరికా రెండో స్థానం దక్కించుకుంది. భారత్ తన సైనిక అవసరాలకు స్వదేశీ తయారీ పరిశ్రమ కంటే ఆయుధాల దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడుతోందని సిప్రి ప్రస్తావించింది. వరల్డ్ వైడ్ వెబ్‌కు 25 ఏళ్లు వరల్డ్ వైడ్ వెబ్(www) మార్చి 12న పాతికేళ్ల ప్రస్థానంలోకి అడుగు పెట్టింది. ఇంటర్నెట్లో ప్రస్తుతం ఒక వెబ్ బ్రౌజర్ నుంచే అనేక వెబ్‌పేజీలు మనం చూడగలుగుతున్నాం. దీనంతటికీ ఇంటర్నెట్ కారణమైనా.. దాని వెనక వరల్డ్ వైడ్ వెబ్ చేరడం వల్లే ఆన్లైన్ ప్రపంచం ఇంతగా సులభ సాధ్యమైంది. 1989లో బ్రిటిష్ శాస్త్రవేత్త టీమ్ బెర్నర్స్ లీ ప్రతిపాదనతో వరల్డ్ వైడ్ వెబ్ ప్రాచుర్యంలోకి వచ్చింది. క్రీడలు ఇండియన్ వెల్స్ విజేత జొకోవిచ్ ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టెన్నిస్ టోర్నమెంట్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) గెలుచుకున్నాడు. ఫైనల్లో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)ను ఓడించాడు. జొకోవిచ్ కెరీర్లో ఓవరాల్‌గా ఇది 42వ టైటిల్. ఇందులో 17 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ ఉన్నాయి. ఈ క్రమంలో అత్యధికంగా మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో ఆండ్రీ అగస్సీ (అమెరికా) సరసన జొకోవిచ్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో రాఫెల్ నాదల్ (26 టైటిల్స్), ఫెడరర్ (21 టైటిల్స్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. విజయ్ హజారే విజేత కర్ణాటక దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీని కర్ణాటక గెలుచుకుంది. మార్చి 16న కోల్‌కతాలో జరిగిన ఫైనల్లో రైల్వేస్‌ను ఓడించింది. ఈ విజయంతో కర్ణాటక ఈ ఏడాది వరుసగా మూడో టైటిల్‌ను గెలుచుకుంది. ఇప్పటికే రంజీ, ఇరానీ ట్రోఫీలలో విజేతగా నిలిచింది. ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రి విజేత రోస్‌బర్గ్ ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. మాగ్నుసన్ (మెక్లారెన్) రెండో స్థానంలో నిలిచాడు. ఇదే రేసులో ఎఫ్1 చరిత్రలో పిన్న వయస్సులో (19 ఏళ్ల 10 నెలల 18 రోజులు) పాయింట్లు నెగ్గిన డ్రైవర్‌గా డానిల్ క్వియాట్ (రష్యా) రికార్డు నెలకొల్పాడు. హాకీ జూనియర్ ఉమెన్స చాంపియన్‌షిప్ హాకీ ఇండియా జూనియర్ ఉమెన్స చాంపియన్‌షిప్‌ను ఛత్తీస్‌గఢ్ గెలుచుకుంది. మైసూర్లో మార్చి 13న జరిగిన ఫైనల్లో కేరళను ఓడించింది. క్రికెటర్ ఆఫ్ ది జనరేషన్ సచిన్ భారత మాజీ ఆటగాడు, మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్‌ను ‘క్రికెటర్ ఆఫ్ ది జనరేషన్’ అవార్డుకు ఈఎస్పీఎన్-క్రిక్ ఇన్ఫో సంస్థ ఎంపిక చేసింది. ఇతర అవార్డుల విజేతలు: టెస్టు బ్యాటింగ్ అవార్డు: శిఖర్ ధావన్ (ఆస్ట్రేలియాపై తొలి టెస్టులో 187 పరుగుల ఇన్నింగ్స్) వన్డే బ్యాటింగ్ అవార్డు: రోహిత్ శర్మ (ఆస్ట్రేలియాపై వన్డే డబుల్ సెంచరీ); తొలి ఏడాది అత్యుత్తమ ప్రదర్శన అవార్డు: షమీ (2013లో టెస్టులు, వన్డేలు కలిపి 47 వికెట్లు); ఉత్తమ టెస్టు బౌలింగ్ అవార్డు: మిచెల్ జాన్సన్ (7/40, ఇంగ్లండ్‌పై); ఉత్తమ వన్డే బౌలింగ్ అవార్డు: షాహిద్ ఆఫ్రిది (7/12, వెస్టిండీస్‌పై). అవార్డులు జ్ఞాన్ కొర్రేకు గొల్లపూడి అవార్డు గొల్లపూడి శ్రీనివాస్ (జీఎస్) మెమోరియల్ ఫౌండేషన్ అందజేసే జీఎస్ జాతీయ అవార్డు- 2013కు దర్శకుడు జ్ఞాన్ కొర్రే ఎంపికయ్యారు. గుజరాతీ సినిమా ‘ది గుడ్ రోడ్’కు దర్శకత్వం వహించినందుకుగాను కొర్రేను ఈ పురస్కారం వరించింది. భారతీయ అమెరికన్ విద్యార్థులకు ఇంటెల్ అవార్డులు ఇద్దరు భారతీయ అమెరికన్ విద్యార్థులు ఆనంద్ శ్రీనివాసన్(17), శౌన్ దత్తా(18) మార్చి 12న ప్రతిష్టాత్మక ఇంటెల్ సైన్స్ టాలెంట్ సెర్చ్ అవార్డులు గెలుచుకున్నారు. ఇంటెల్ ఫౌండేషన్ నిర్వహించిన ఈ సైన్స్ అవార్డుల పోటీలో ఎనిమిది, పదో స్థానాలను వీరిద్దరూ కైవసం చేసుకున్నారు. అవార్డు కింద చెరో రూ. 12.23 లక్షల నగదును అందజేశారు. డీఎన్ఏలోని అతి సూక్ష్మ భాగాలను సైతం తెలుసుకునేందుకు ఉపయోగపడే ‘ఆర్‌ఎన్‌ఎన్‌స్కాన్’ అనే న్యూరల్ నెట్వర్క్ సంబంధిత కంప్యూటర్ మోడల్‌ను శ్రీనివాసన్ ఆవిష్కరించగా.. అణు పదార్థాల చర్యలను మరింత బాగా అర్థం చేసుకునేందుకు దోహదపడే కంప్యూటర్ మోడల్స్‌ను, సూత్రాలను శౌన్ దత్తా అభివృద్ధిపర్చాడు. నలిమెల భాస్కర్‌కు సాహిత్య అకాడమీ అవార్డు ప్రముఖ కవి, భాషావేత్త డాక్టర్ నలిమెల భాస్కర్‌కు ‘అనువాద సాహిత్యం’లో సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ప్రఖ్యాత మలయాళ రచయిత పుణత్తిల్ కుంజబ్దుల్లా రచించిన ‘స్మారక శిలగళ్’ నవలను ‘స్మారక శిలలు’ పేరుతో 2010లో భాస్కర్ తెలుగులోకి అనువదించారు. అవార్డు కింద రూ. 50 వేల నగదు, ప్రశంసా పత్రం బహూకరిస్తారు. సాహిత్య అకాడమీ ఈ పురస్కారాన్ని 1989 నుంచి 24 భాషల్లోని అత్యున్నత అనువాదాలకు అందజేస్తోంది. టోమస్ హలిక్‌కు టెంపుల్టన్ ప్రైజ్ చెక్కు చెందిన మతగురువు, మేధావి టోమస్ హలిక్‌కు 2014 టెంపుల్టన్ ప్రైజ్ లభించింది. పురస్కారాన్ని అందజేసే జాన్ టెంపుల్టన్ ఫౌండేషన్ మార్చి 13న ఈ విషయాన్ని ప్రకటించింది. అవార్డు కింద 1.1 మిలియన్ పౌండ్లు బహూకరిస్తారు. -
కరెంట్ అఫైర్స్
రాష్ట్రీయం జీవశాస్త్ర విధానాన్ని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్‌లో ఫిబ్రవరి 17-19తేదీల మధ్య మూడు రోజులపాటు బయో ఏషియా-14 సదస్సు జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవశాస్త్ర విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం వల్ల రూ. 20వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయి. 50 వేల ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయి. రూ.60వేల కోట్ల ఎగుమతులకు అవకాశముంటుంది. జీవ శాస్త్ర రంగాన్ని పారిశ్రామిక రంగం కేటగిరీ కింద పరిగణిస్తారు. ఏక గవాక్ష విధానంలో సంస్థలకు అనుమతులిస్తారు. ఇతర పరిశ్రమలకిచ్చే విద్యుత్ రాయితీలు కల్పిస్తారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో విజ్ఞాన కేంద్రాన్ని నెలకొల్పుతారు. ఉత్తమ వారసత్వ నగరంగా తిరుపతి కేంద్ర ప్రభుత్వం 2012-13 సంవత్సరానికి ఉత్తమ వారసత్వ నగరంగా తిరుపతిని ఎంపిక చేసింది. తిరుమల-తిరుపతి దేవస్థానం వల్ల తిరుపతికి ఈ గుర్తింపు లభించింది. ఫిబ్రవరి 18న రాష్ట్రపతి నుంచి టీటీడీ అధికారి ఈ అవార్డును అందుకున్నారు. 2010-11లో హైదరాబాద్, 2011-12లో వరంగల్ ఉత్తమ వారసత్వ నగరాలుగా ఎంపికయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విభజనకు లోక్‌సభ ఆమోదం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడనుంది. రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన బిల్లుకు లోక్‌సభ ఫిబ్రవరి 18న ఆమోదం తెలపగా, రాజ్యసభ ఫిబ్రవరి 20న ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత నోటిఫికేషన్లో పేర్కొన్న తేదీ నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కొనసాగుతాయి. రాజ్యసభలో బిల్లు ఆమోదం సందర్భంగా రెండు రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి పన్ను రాయితీలు, రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీలు, పోలవరం ప్రాజెక్టును కేంద్ర నిధులతో పూర్తి చేయడంతోపాటు ఆంధ్రప్రదేశ్ తొలి ఏడాది ఆదాయ లోటు కేంద్ర బడ్జెట్ నుంచి భర్తీ చేస్తామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి రాజీనామా ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు 2014ను లోక్‌సభ ఆమోదించినందుకు నిరసనగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి ఫిబ్రవరి 19న తన పదవికి రాజీనామా చేశారు. ఈయన ఆంధ్రప్రదేశ్ 16వ ముఖ్యమంత్రిగా 39 నెలలు పనిచేశారు. 2010 నవంబర్ 25న నాటి ముఖ్యమంత్రి కె.రోశయ్య స్థానంలో ఎన్నికయ్యారు. క్రీడలు టెస్ట్ సిరీస్ కివీస్‌దే భారత్, న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌ను ఆతిథ్య న్యూజిలాండ్ గెలుచుకుంది. ఫిబ్రవరి 18న జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగియడంతో మొదటి టెస్టులో విజయం పొందిన కివీస్ విజేతగా నిలిచింది. నాదల్కు రియో టైటిల్ ప్రపంచ నెంబర్‌వన్ రఫెల్ నాదల్ రియో ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. రియో డి జెనెరోలో ఫిబ్రవరి 24న జరిగిన ఫైనల్లో ఉక్రెయిన్‌కు చెందిన అలెగ్జాండర్ డొల్గోపోలోను ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను కురుమీనారా గెలుచుకుంది. ఫైనల్లో క్లారా జెకోపలోవాపై విజయం సాధించింది. దేవ్ వర్మన్‌కు ఢిల్లీ ఓపెన్ టైటిల్ ఢిల్లీ ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్ టైటిల్‌ను భారత్‌కు చెందిన సోమ్‌దేవ్‌వర్మన్ గెలుచుకున్నాడు. ఫిబ్రవరి 23న ఢిల్లీలో జరిగిన ఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన అలెగ్జాండర్ నెదోవ్ యెసోవ్ను దేవ్ వర్మన్ ఓడించాడు. డబుల్స్ టైటిల్‌ను భారత్‌కు చెందిన సన మ్ సింగ్, సాకేత్ మైనేనీ గెలుచుకున్నారు. ఫైనల్స్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన సాంచయ్, సోన్చాట్ రతివతనాలను ఓడించారు. ఢిల్లీకి హాకీ ఇండియా లీగ్ ట్రోఫీ హాకీ ఇండియా లీగ్ (హెచ్.ఐ.ఎల్) ట్రోఫీని ఢిల్లీ వేవ్ రైడర్స్ జట్టు గెలుచుకుంది. ఫిబ్రవరి 23న ఢిల్లీలో జరిగిన అంతిమ పోరులో పంజాబ్ వారియర్స్‌ను ఢిల్లీ వేవ్‌రైడర్స్ ఓడించి విజేతగా నిలిచింది. వింటర్ ఒలింపిక్స్‌లో రష్యాకు అగ్రస్థానం సోచిలో పదిహేను రోజులపాటు జరిగిన వింటర్ ఒలింపిక్స్ ఫిబ్రవరి 23న ముగిశాయి. ఈ పోటీల్లో ఆతిథ్య రష్యా ఎక్కువ పతకాలను సాధించి అగ్రస్థానంలో నిలిచింది. 13 స్వర్ణపతకాలతో రష్యా ప్రథమస్థానం కైవసం చేసుకుంది. 11 స్వర్ణాలతో నార్వే, 10 స్వర్ణాలతో కెనడా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. భారత్ తరపున పాల్గొన్న ముగ్గురు క్రీడాకారులకు ఒక పతకం కూడా దక్కలేదు. కాగా 2018 వింటర్ ఒలింపిక్స్ దక్షిణకొరియాలోని ప్యాంగ్చాంగ్లో జరగనున్నాయి. సీసీఎల్-4 విజేతగా కర్ణాటక సెలబ్రిటీ క్రికెట్ లీగ్(సీసీఎల్) విజేతగా డిఫెండింగ్ చాంపియన్ కర్ణాటక బుల్డోజర్స నిలిచింది. ఫిబ్రవరి 23న హైదరాబాద్‌లో జరిగిన ఫైనల్స్‌లో కేరళ స్ట్రైకర్సను కర్ణాటక ఓడించింది. జాతీయం సిక్కింకు జాతీయ పర్యాటక అవార్డు 2012-13 సంవత్సరానికి జాతీయ పర్యాటక అవార్డు సిక్కిం రాష్ట్రానికి లభించింది. గ్రామీణ పర్యాటక ప్రాజెక్టుల అమలులో ఉత్తమ రాష్ట్రంగా సిక్కిం నిలిచింది. కేంద్ర మానవ వనరుల శాఖ సహాయ మంత్రి శశిథరూర్... సిక్కిం రాష్ట్ర ప్రభుత్వానికి ఫిబ్రవరి 18న న్యూఢిల్లీలో అవార్డును ప్రదానం చేశారు. సిక్కిం రూ. 140 కోట్లతో అనేక పర్యాటక సౌకర్యాలను అభివృద్ధి చేసింది. కేరళ, మహారాష్ట్ర, గుజరాత్, గోవా, కర్నాటక రాష్ట్రాలతో పర్యాటకులను ఆకర్షించేందుకు ఒప్పందాలు కుదుర్చుకొని పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తోంది. ఉత్తమ పర్యాటక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సంయుక్తంగా నిలిచాయి. రాజీవ్ హంతకులకు శిక్ష తగ్గింపు మాజీ ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ హత్యకేసులో శిక్ష అనుభవిస్తున్న ముగ్గురికి విధించిన మరణశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా తగ్గిస్తూ ఫిబ్రవరి 18న సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. వారి క్షమాభిక్ష పిటిషన్‌పై 11 ఏళ్లుగా కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా జాప్యం చేయడం వల్ల శిక్ష తగ్గిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.సదాశివం నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. క్షమాభిక్ష జాప్యం జరిగినందువల్ల తమ శిక్షను పునస్సమీక్షించాలంటూ నిందితులైన సంతన్, మురుగన్, పెరారివాలన్ దాఖలు చేసిన పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఇదిలాఉండగా ఈ కేసులో శిక్షను అనుభవిస్తున్న ఖైదీలను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం ఫిబ్రవరి 19న నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంపై సుప్రీం స్టే విధించింది. 1991లో రాజీవ్‌గాంధీ హత్య జరిగిన తరువాత 1998లో టాడాకోర్టు దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. ఈ శిక్షను 1999లో సుప్రీం ఖరారు చేసింది. ఒడియా భాషకు ప్రాచీన హోదా ఒడియా భాషకు ప్రాచీన హోదా కల్పించేందుకు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 20న ఆమోదం తెలిపింది. దీంతో ఈ హోదా ఉన్న భాషల సంఖ్య ఆరుకు చేరింది. సంస్కృతం, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం భాషలకు ఇప్పటి వరకు ఈ హోదా ఉంది. ఈ హోదా దక్కితే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఆర్థిక సాయం అందుతుంది. స్కాలర్స్‌కు రెండు అవార్డులు ఏర్పాటు చేసి అందించవచ్చు. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో భాషా పీఠాల ఏర్పాటుకు వీలుంటుంది. ఆకాశ్ క్షిపణి పరీక్ష విజయవంతం ఆకాశ్ క్షిపణిని రక్షణ శాఖ ఒడిశాలోని చాందీపూర్ సమీకృత పరీక్షా కేంద్రం నుంచి ఫిబ్రవరి 24న విజయవంతంగా పరీక్షించింది. మానవరహిత విమానం నుంచి వేలాడే లక్ష్యాన్ని ఆకాశ్ ఛేదించింది. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఈ క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ (డి.ఆర్.డి.ఒ.) పూర్తి స్వదీశీ పరిజ్ఞానంతో నిర్మించింది. 25 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించే ఈ క్షిపణి 60 కిలోల పేలుడు పదార్థాలను మోసుకుపోతుంది. విష్ణు నార్లికర్‌కు నాయుడమ్మ అవార్డు ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త, పద్మ విభూషణ్ జయంత్ విష్ణు నార్లికర్ 2013 నాయుడమ్మ అవార్డుకు ఎంపికయ్యారు. ఇతర గ్రహాల్లో జీవుల ఉనికిని, అంతరిక్ష రహస్యాలను కనుక్కోవడానికి ఆయ న చేసిన కృషికి గాను ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు గుంటూరులోని నాయుడమ్మ ట్రస్ట్ ఫిబ్రవరి 22న ప్రకటించింది. మహారాష్ట్రకు చెందిన విష్ణు నార్లికర్‌ను 1965లో పద్మభూషణ్, 2004లో పద్మ విభూషణ్‌తో భారత ప్రభుత్వం గౌరవించింది. అంతర్జాతీయం భారత పర్యటనలో బహ్రెయిన్ రాజు బహ్రెయిన్ రాజు హమద్‌బిన్ ఇసా అల్ ఖలీఫా భారత పర్యటనలో ఫిబ్రవరి 20న ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్‌తో చర్చలు జరిపారు. వాణిజ్యం, వ్యాపార రంగాల్లో సహకారాన్ని విస్తరించుకొనేందుకు మూడు ఒప్పందాలపై ఇరుపక్షాలు సంతకాలు చేశాయి. ద్వైపాక్షిక వాణిజ్యంపై ఇరు దేశాల నాయకులు సమీక్షించారు. భారత కంపెనీలు తమ దేశం లో పెట్టుబడులు పెట్టాలని బహ్రెయిన్ కోరింది. ఇటలీ ప్రధానిగా మటెనో రెంజీ ఇటలీ ప్రధానమంత్రిగా మటెనోరెంజీ ఫిబ్రవరి 22న ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 16 మంది మంత్రులు కూడా బాధ్యతలు స్వీకరించారు. 39 ఏళ్ల రెంజీ ఇటలీకి అత్యంత పిన్న వయసులో ప్రధాని అయిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. రెంజీ గతంలో ఫ్లోరెన్స గవర్నర్‌గా పనిచేశారు. ఏడీబీ ట్రిబ్యునల్ ప్రెసిడెంట్‌గా లక్ష్మీ స్వామినాథన్ ఫిలిప్పీన్స్‌లోని ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) ట్రిబ్యునల్ ప్రెసిడెంట్‌గా భారత్‌కు చెందిన లక్ష్మీ స్వామినాథన్ ఫిబ్రవరి 21న ఎంపికయ్యారు. ఈమె మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఏడీబీ ట్రిబ్యునల్‌కు ఈమె ఏడో అధ్యక్షురాలు. 1992లో ఏడీబీ ట్రిబ్యునల్ ఏర్పాటైన తర్వాత ఈ పదవి భారత్‌కు దక్కడం ఇదే తొలిసారి. 2010లో ట్రిబ్యునల్‌లో సభ్యులుగా నియమితులైన లక్ష్మీ స్వామినాథన్ 2013 ఆగస్టు నుంచి తాత్కాలిక అధ్యక్షురాలిగా వ్యవ హ రిస్తున్నారు. -
కరెంట్ అఫైర్స్
రాష్ర్టం నుంచి రాజ్యసభకు ఆరుగురు రాజ్యసభకు రాష్ర్టం నుంచి ఆరుగురు సభ్యులు ఎన్నికయ్యారు. 2014 ఫిబ్రవరి 7న జరిగిన ఎన్నికల్లో ఆరు స్థానాలకు ఏడుగురు పోటీ చేశారు. స్వతంత్ర అభ్యర్థి ఆదాల ప్రభాకరరెడ్డి పోటీ నుంచి విరమించుకున్నారు. కాంగ్రెస్ నుంచి ఎం.ఎ. ఖాన్, కేవీపీ రామచంద్రరావు, టి. సుబ్బిరామిరెడ్డి, తెలుగుదేశం నుంచి సీతారామలక్ష్మి, జి. మోహన్‌రావు, టీఆర్ఎస్ నుంచి కె. కేశవరావు ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు తిరస్కరణ ఓటు వేశారు. రూ. 1,83,129 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ 2014-15 సంవత్సరానికి రూ. 1,83,129 కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి 2014 ఫిబ్రవరి 10న శాసనసభకు సమర్పించారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా వచ్చే ఆర్నెల్ల కాలానికి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ ఆర్నెల్ల కాలానికి రూ. 79,460 కోట్లు కేటాయించారు. ఎన్నికల తర్వాత వచ్చే ప్రభుత్వం పూర్తి బడ్జెట్‌ను ప్రవేశపెడుతుంది. మొత్తం బడ్జెట్: రూ. 1,83,129 కోట్లు ప్రణాళికేతర వ్యయం: రూ. 1,15,179 కోట్లు ప్రణాళికా వ్యయం: రూ. 67,950 కోట్లు ద్రవ్యలోటు: రూ. 25,402 కోట్లు(జీఎస్డీపీలో 2.6 శాతం) రెవెన్యూ మిగులు: రూ. 474 కోట్లు ప్రధాన కేటాయింపులు: వ్యవసాయం, అనుబంధ రంగాలు: రూ. 6,685.33 కోట్లు గ్రామీణాభివృద్ధి: రూ. 13,661.77 కోట్లు నీటిపారుదల: రూ. 23,311.98 కోట్లు సాధారణ విద్య: రూ. 22,123.09 కోట్లు సంక్షేమం: రూ. 11,650.85 కోట్లు సాధారణ సేవలు: రూ. 62,678.74 కోట్లు అంతర్జాతీయం మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల ‘మైక్రోసాఫ్ట్’ సీఈఓగా రాష్ట్రానికి చెందిన సత్య నాదెళ్ల(46) 2014 ఫిబ్రవరి 4న నియమితులయ్యా రు. ప్రస్తుత సీఈఓ స్టీవ్ బామర్ స్థానంలో నాదెళ్ల బాధ్యతలు చేపడతారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ బిల్‌గేట్స్ స్థానంలో జాన్ థాంప్సన్ చైర్మన్‌గా నియమితులయ్యారు. మలాలాకు బాలల నోబెల్ పురస్కారం పాకిస్థాన్ బాలల హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్ జాయ్(16) ప్రపంచ బాలల పురస్కారానికి ఎంపికయ్యారు. ఆమెతో పాటు అమెరికాకు చెందిన జాన్ఉడ్, నేపాల్‌కు చెందిన రాణామగర్ కూడా 2014 సంవత్సరానికి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. స్వీడన్‌కు చెందిన సంస్థ ఈ ప్రతిష్టాత్మక అవార్డును ప్రదానం చేస్తుంది. జాన్ఉడ్, రాణామగర్ కూడా పిల్లల విద్య, హక్కుల కోసం పాటుపడుతున్నారు. తొలి ఎలక్ట్రానిక్ కంప్యూటర్‌కు 70 ఏళ్లు మొట్టమొదటి ఎలక్ట్రానిక్ కంప్యూటర్‌కు 2014 ఫిబ్రవరి 5 నాటికి 70 ఏళ్లు పూర్తయ్యాయి. 1944 ఫిబ్రవరి 5న ఈ ‘కోలోసస్’ కంప్యూటర్ వినియోగంలోకి వచ్చింది. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్ తన జనరల్స్‌కు పంపిన కోడ్ సందేశాలను డీకోడ్ చేసేందుకు ఉపయోగించారు. క్రీడలు ఐసీసీ చైర్మన్‌గా ఎన్. శ్రీనివాసన్ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చైర్మన్‌గా ఎన్. శ్రీనివాసన్ 2014 ఫిబ్రవరి 8న సింగపూర్‌లో జరిగిన బోర్డు సమావేశంలో ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం బీసీసీఐ చైర్మన్‌గా ఉన్నారు. ఐఓఏ అధ్యక్షుడిగా ఎన్. రామచంద్రన్ భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) అధ్యక్షుడిగా ఎన్. రామచంద్రన్ 2014 ఫిబ్రవరి 9న న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ప్రస్తుతం వరల్డ్ స్క్వాష్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆల్ ఇండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఈ టోర్నమెంట్ బెంగళూరులో 2014 ఫిబ్రవరి 8న ముగిసింది. విజేతలు: పురుషుల సింగిల్స్: అనూప్ శ్రీధర్(కర్ణాటక). ఫైనల్స్‌లో సౌరభ్ వర్మ(పెట్రోలియం)ను ఓడించాడు. పురుషుల డబుల్స్: చోప్రా ప్రణవ్ జెర్రీ, అక్షయ్ దెవాల్కర్. వీరు ఫైనల్స్‌లో నందగోపాల్, హేమనాగేంద్రబాబులను ఓడించారు. మహిళల సింగిల్స్: తాన్వి లాడ్. ఫైనల్స్‌లో రితూపర్ణాదాస్ను ఓడించింది. మహిళల డబుల్స్: జె. మేఘన, సిక్కి రెడ్డి. వీరు ఫైనల్స్‌లో ప్రజక్తా సావంత్, ఆరతీ సారా సునీల్‌ను ఓడించారు. జాతీయం పద్మశ్రీ అవార్డు గ్రహీత సిల్వెరిన్ స్వెర్ మృతి మేఘాలయ మొదటి పద్మశ్రీ అవార్డు గ్రహీత సిల్వెరిన్ స్వెర్(103) షిల్లాంగ్‌లో 2014 ఫిబ్రవరి 1న మరణించారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో అనేక హోదాల్లో పని చేశారు. జమ్మూలో 101 సైన్స కాంగ్రెస్ 2014 ఫిబ్రవరి 3 నుంచి 7 వరకు జమ్మూ విశ్వవిద్యాలయంలో జరిగిన 101 సైన్స కాంగ్రెస్‌ను ప్రధాన మంత్రి మన్మోహన్సింగ్ ప్రారంభించారు. సైన్స కాంగ్రెస్‌లో మన్మోహన్సింగ్ ప్రసంగించడం ఇది ఏడోసారి. రూ. 9,000 కోట్లతో చేపట్టే శాస్త్ర, సాంకేతిక ప్రాజెక్టులను ప్రధాని ప్రకటించారు. వాటిలో రూ. 4,500 కోట్లతో చేపట్టే నేషనల్ మిషన్ ఆన్ హైపర్ఫార్మెన్స కంప్యూటింగ్, రూ. 1,450 కోట్లతో తమిళనాడులో ఏర్పాటు చేసే న్యూట్రినో ఆధారిత అబ్జర్వేటరీ,రూ. 3,000 కోట్లతో జాతీయ భౌగోళిక సమాచార వ్యవస్థ ఉన్నాయి. ప్రఖ్యాత విదేశీ శాస్త్రవేత్తలు భారత్‌లో ఏడాది పాటు పనిచేసేందుకు 25 జవహర్లాల్ నెహ్రూ ఫెలోషిప్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో కృషి చేసినందుకు హోమీ జె. బాబా స్మారక అవార్డును రీసెర్చ సెంటర్ ఇమారత్ డెరైక్టర్ జి. సతీష్ రెడ్డికి ప్రదానం చేశారు. 7వ వేతన సంఘం చైర్మన్‌గా అశోక్ కుమార్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఏడో వేతన సంఘం చైర్మన్‌గా జస్టిస్ అశోక్ కుమార్ మాథుర్‌ను కేంద్ర ప్రభుత్వం 2014 ఫిబ్రవరి 4న నియమించింది. 50 లక్షల మందికి పైగా ఉన్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, 30 లక్షల మంది పెన్షనర్ల చెల్లింపులపై వేతన సంఘం సిఫార్సులు చేస్తుంది. రెండేళ్లలో ఈ సంఘం తన నివేదికను సమర్పిస్తుంది. ఈ సిఫార్సులు 2016 జనవరి నుంచి అమల్లోకి వస్తాయి. కేంద్ర ప్రభుత్వం పే స్కేళ్లను సవరించేందుకు ప్రతి పదేళ్లకోసారి వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తుంది. ‘బ్రహ్మోస్’ క్షిపణి పరీక్ష విజయవంతం బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్‌ని సాల్వో మోడ్ పద్ధతిలో రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) 2014 ఫిబ్రవరి 7న విజయవంతంగా పరీక్షించింది. అరేబియా సముద్రంలో యుద్ధనౌక ఐఎన్ఎస్ త్రికండ్ నుంచి రెండు క్షిపణులతో నిర్వహించిన పరీక్ష విజయవంతమైంది. సాల్వో మోడ్ పద్ధతిలో ఒకేసారి సమాంతరంగా క్షిపణులను ప్రయోగిస్తారు. బ్రహ్మోస్ 290 కి.మీ. పరిధిలోని లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఘన, ద్రవ ఇంధనాలతో పనిచేసే బ్రహ్మోస్‌ను ఇప్పటికే సైన్యం, నౌకాదళంలో ప్రవేశపెట్టారు. ఇండో-రష్యన్ సంస్థ ‘బ్రహ్మోస్ ఏరోస్పేస్’ దీన్ని నిర్మించింది. సీబీఐ అదనపు డెరైక్టర్‌గా అర్చనా రామసుందరం కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అదనపు డెరైక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అర్చనా రామసుందరం 2014 ఫిబ్రవరి 7న నియమితులయ్యారు. మహిళా అధికారి ఈ పదవి చేపట్టడం ఇదే తొలిసారి. ఈమె తమిళనాడు కేడర్‌కు చెందిన అధికారి. ఆమె గతంలో తమిళనాడు అదనపు డెరైక్టర్ జనరల్‌గా పనిచేశారు. 2013-14లో జీడీపీ వృద్ధి రేటు 4.9 శాతం 2013-14 సంవత్సర స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాలను కేంద్ర గణాంక కార్యాలయం 2014 ఫిబ్రవరి 7న విడుదల చేసింది. 2013-14లో వృద్ధి రేటు 4.9 శాతంగా సీఎస్ఓ అంచనా వేసింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు 2013-14లో వృద్ధికి తోడ్పడ్డాయి. 2012-13లో వృద్ధి రేటు 4.5 శాతంగా పేర్కొంది.ఇది దశాబ్ద కాలంలో అతి తక్కువ. తలసరి ఆదాయం 2004-05 ధరల్లో వాస్తవ ప్రాతిపదికన 2013-14లో రూ. 39,961 ఉండొచ్చని అంచనా. ఇది 2012-13లో రూ. 38,856. ఈ పెరుగుదల 2.8 శాతం మాత్రమే ఉంది. తలసరి ఆదాయం ప్రస్తుత ధరల్లో 2013-14లో రూ. 74,920 ఉంటుందని సీఎస్ఓ అంచనా వేసింది. ఇది గతేడాది *67,839 కంటే 10.4 శాతం ఎక్కువ. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రమణ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జస్టిస్ నూతలపాటి వెంకటరమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా 2014 ఫిబ్రవరి 8న నియమితులయ్యారు. ఈయన 2013 సెప్టెంబర్ 3 నుంచి ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా పనిచేశారు. 73వ రాజ్యాంగ సవరణ వర్తింపునకు జమ్మూ కాశ్మీర్ ఆమోదం జమ్మూకాశ్మీర్ పంచాయతీ రాజ్ చట్టం 1989కు 73వ రాజ్యాంగ సవరణ చట్టం వర్తింపచేసేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అధ్యక్షతన 2014 ఫిబ్రవరి 8న జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. ఇందువల్ల పంచాయతీలకు ప్రణాళికలు రూపొందించడం, అభివృద్ధి కార్యక్రమాల అమలు, నిధు ల వినియోగంలో స్వయం ప్రతిపత్తి లభిస్తుంది. షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రిజర్వేషన్ కల్పించేందుకు, మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు వీలు పడుతుంది. పంచాయతీలకు పోటీచేసే అభ్యర్థుల వయసును 25 నుంచి 21కి తగ్గించొచ్చు. జాతీయ అటవీ వ్యవసాయ విధానానికి కేబినెట్ ఆమోదం జాతీయ అటవీ వ్యవసాయ (ఆగ్రోఫారెస్ట్రీ) విధానానికి కేంద్ర కేబినెట్ 2014 ఫిబ్రవరి 6న ఆమోదం తెలిపింది. ప్రతికూల విధానాలు, చట్టపరమైన అడ్డం కులు, పెట్టుబడుల లేమి, అందు బాటులో లేని మార్కెట్ వంటి సమస్యలను అధిగమించడానికి, గ్రామీణ కుటుంబాల జీవన ప్రమాణాలు పెంచడానికి, ఈ విధానాన్ని రూపొందించారు. ఈ విధానం కింద రైతులకు రుణాలు, బీమా సౌకర్యాలు కల్పిస్తారు. ఉత్పత్తులకు మార్కెట్ సౌకర్యం కల్పిస్తారు.రూ. 200 కోట్లతో నేషనల్ ఆగ్రోఫారెస్ట్రీ మిషన్, నేషనల్ ఆగ్రోఫారెస్ట్రీ బోర్డులను ఏర్పాటు చేస్తారు. సివిల్స్‌కు రెండు అవకాశాలు పెంచిన కేంద్రం సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాసే అభ్యర్థులకు మరో రెండు అవకాశాలను కేంద్ర ప్రభుత్వం కల్పించింది. ఇందుకు సంబంధించి 2014 ఫిబ్రవరి 10న ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇది 2014 ప్రిలిమ్స్ పరీక్ష నుంచి అమల్లోకి వస్తుంది. ఓసీ అభ్యర్థులు ప్రస్తుతం 30 ఏళ్ల వయసు వరకు నాలుగుసార్లు మాత్రమే ఈ పరీక్షలు రాయొచ్చు. వెనుకబడిన వర్గాల వారు ఏడుసార్లు రాయొచ్చు. వీరికి మూడేళ్లు సడలింపు ఉంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎన్నిసార్లయినా రాయొచ్చు. వీరికి వయోపరిమితిలో ఐదేళ్లు సడలింపు ఉంది. ప్రస్తుతం కల్పించిన రెండు అవకాశాల వల్ల అన్ని వర్గాల వారికి రెండేళ్ల వయోపరిమితి సడలింపు కూడా ఉంటుంది. -
అమెరికా సదస్సుకు ఒడిశా మహిళా సర్పంచ్
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం జపాన్ ప్రధాని భారత పర్యటన జపాన్ ప్రధానమంత్రి షింజో అబే జనవరి 25-27 తేదీల్లో భారత్‌లో పర్యటించారు. భారత్ 65వ గణతంత్ర వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు. భద్రత, రాజకీయ, రక్షణ సంబంధాలను మరింత విస్తరించుకునేందుకు ఇరుదేశాలు అంగీకరించాయి. ఎనిమిది ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇందులో సగం జపాన్ సహాయానికి సంబంధించినవి ఉన్నాయి. భారత్-ఫిజిల మధ్య ద్వంద్వ పన్నుల ఒప్పందం ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందంపై (డిటిఎఎ) భారత్- ఫిజిలు జనవరి 30న సంతకాలు చేశాయి. భారత్ తరపున ఆర్థికమంత్రి పి.చిదంబరం, ఫిజి తరపున ఆ దేశ పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రి అయియజ్ ఖయూమ్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కింద డివిడెండ్లు, వడ్డీ, రాయల్టీ, నిపుణుల సేవలందించినందుకు వసూలు చేసే రుసుములపై ఇరుదేశాల్లో పన్ను విధిస్తారు. అఖిల భారత సర్వీసులకు రెండేళ్ల తర్వాతే బదిలీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కనీసం రెండేళ్లు ఒకచోట పనిచేసేటట్లు నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఇందుకు సంబంధించిన మార్గ దర్శకాలను కేంద్ర సిబ్బంది శిక్షణా మంత్రిత్వశాఖ జనవరి 31న విడుదల చేసింది. దీని ప్రకారం ఉద్యోగోన్నతి, డెప్యుటేషన్‌పై ఇతర రాష్ట్రాలకు బదిలీ, పదవీ విరమణ, రెండు నెలలకు మించి శిక్షణ లాంటి పరిస్థితులలో తప్ప వారిని బదిలీ చేసేందుకు వీలులేదు. ఒకవేళ రెండేళ్లలోపు బదిలీ చేయాల్సి వస్తే రాష్ట్ర పరిధిలో ఏర్పాటయ్యే సివిల్ సర్వీసెస్ బోర్డు ద్వారా చేయాల్సి ఉంటుంది. మూడు నెలల క్రితం సివిల్ సర్వెంట్ల కనీస ఉద్యోగ కాలం రెండేళ్లు ఉండాలని, రాజకీయ ఒత్తిడి నుంచి రక్షణ కల్పించాలని సుప్రీంకోర్డు సూచించడంతో కొత్త మార్గదర్శకాలను కేంద్రం రూపొందించింది. రాజస్థాన్‌లో అతిపెద్ద సౌరవిద్యుత్ కేంద్రం ప్రపంచంలోనే అతిపెద్ద సౌరవిద్యుత్ కేంద్రాన్ని రాజస్థాన్‌లో ఏర్పాటు చేయడానికి భెల్, పవర్‌గ్రిడ్ కార్పోరేషన్ సహా ఆరు ప్రభుత్వ రంగసంస్థలు సంకల్పించాయి. 4 వేల మెగావాట్ల సామర్థ్యం ఉండే ఈ కేంద్రం ఏర్పాటుకు మొదటి దశలో రూ.7,500 కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు భెల్ సంస్థ తెలిపింది. న్యూఢిల్లీలో జాతీయ వక్ఫ్ అభివృద్ధి సంస్థ కొత్త ప్రభుత్వ రంగ సంస్థ ‘నేషనల్ వక్ఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్’ (జాతీయ వక్ఫ్ అభివద్ధి కార్పోరేషన్ -నవాడ్కో)ను ప్రధాని మన్మోహన్సింగ్ జనవరి 29న న్యూఢిల్లీలో ప్రారంభించారు. వక్ఫ్ ఆస్తుల అభివృద్ధికి, వనరుల సమీకరణకు రూ. 500 కోట్ల మూలధనంతో 2013, డిసెంబర్ 31న ఈ సంస్థను ఏర్పాటు చేశారు. 4.9 లక్షల రిజిస్టర్డ ఆస్తులతో భారత్ ప్రపంచంలోనే అత్యధిక వక్ఫ్ ఆస్తులు కలిగి ఉందని ప్రధాని మన్మోహన్ తెలిపారు. వీటిని సక్రమంగా అభివృద్ధి చేస్తే ఏటా రూ.1,200 కోట్ల ఆదాయం వస్తుందని మన్మోహన్ పేర్కొన్నారు. భారత్‌లోనే నిరక్షరాస్యత: ఐరాస భారత్‌లో నిరక్షరాస్యులైన వయోజనుల సంఖ్య అధికంగా ఉందని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో వెల్లడించింది. 28.7 కోట్ల మందికి అక్షరం పట్ల అవగాహన లేదని స్పష్టం చేసింది. వాస్తవానికి దేశంలో అక్షరాస్యుల సంఖ్య పెరిగినా జనాభా సంఖ్య పోటీగా ఎగబాకటంతో నిరక్షరాస్యుల శాతంలో మార్పులేదని పేర్కొంది. అంతర్జాతీయ నిరక్షరాస్యుల్లో 37 శాతం మంది భారతీయులే ఉన్నారని తెలిపింది. ఐక్యరాజ్య సమితి విద్యా, శాస్త్ర, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రచురించిన ‘అందరికీ విద్య-అంతర్జాతీయ పర్యవేక్షణ -2013-14’ నివేదికలో ఈ వివరాలను వెల్లడించింది. బెంగళూరులో మెదడు పరిశోధనా కేంద్రం బెంగళూరులో మెదడు పరిశోధనా కేంద్రం ఏర్పాటు కానుంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐటీ మద్రాస్ సహకారంతో రూ. 225 కోట్లతో ఈ పరిశోధనా కేంద్రాన్ని స్థాపించనున్నట్లు ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ ఉపాధ్యక్షుడు క్రిస్ గోపాలకృష్ణన్ జనవరి 30న ప్రకటించారు. అమెరికా సదస్సుకు ఒడిశా మహిళా సర్పంచ్ ఒడిశా రాష్ట్రానికి చెందిన మహిళా సర్పంచ్ ఆరతీదేవీ (28) కి అమెరికాలో జరిగే ఓ ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ నాయకత్వ సదస్సులో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కింది. ఇల్లినాయీ రాష్ట్రం స్ప్రింగ్ఫీల్డ్లో ఫిబ్రవరిలో మూడు వారాల పాటు నిర్వహించే ఇంటర్నేషనల్ విజిటర్స్ లీడర్షిప్ ప్రోగ్రాం (ఐవీఎల్పీ)కి భారత్ నుంచి ఆరతీదేవి ఒక్కరే ఎంపికవడం విశేషం. ఈ సదస్సులో రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం తదితరాలపై ఆమె మాట్లాడతారు. గంజాం జిల్లాలోని ధుంకపరా అనే మారుమూల గ్రామ సర్పంచ్ అయిన ఆరతి, ఎంబీఏలో పట్టభద్రురాలు. సర్పంచ్‌గా ఎన్నికవడం కోసం ఐడీబీఐలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఉద్యోగాన్ని వదులుకోవడం విశేషం. ఇప్పటిదాకా ఈ సదస్సుకు మన దేశం నుంచి మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, అటల్‌బీహారీ వాజ్‌పేయి, మాజీ రాష్ట్రపతులు కేఆర్ నారాయణన్, ప్రతిభాపాటిల్ మాత్రమే గతంలో పాల్గొన్నారు. ముంబైలో మోనోరైలు సేవలు దేశంలోనే మొట్టమొదటి మోనోరైలు సేవలు ముంబైలో ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ మొదటిదశను ఫిబ్రవరి 1న ప్రారంభించారు. వడాలా-చెంబూర్‌ల మధ్య 8.93 కిలోమీటర్ల మార్గం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. ముంబైలో మొత్తం 19.17 కి.మీ మోనోకారిడార్ నిర్మిస్తున్నారు. ఇది ప్రపంచంలో రెండో అతిపెద్ద మోనోకారిడార్. జపాన్‌లోని ఒసాకా నగరంలోని 23.8 కి.మీ. పొడవైన మోనోరైలు మార్గం ప్రపంచంలో అతి పొడవైనది. దక్షిణ ముంబైలోని జాకోబ్ సర్కిల్ నుంచి తూర్పు ముంబైలోని చెంబూర్‌కు మోనోరైలు రవాణామార్గం అనుసంధానమవుతుంది. ఈ 19.17 కి.మీ మోనోరైలు మార్గాన్ని రూ. 3వేల కోట్లతో ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ నిర్మిస్తోంది. 101వ సైన్స కాంగ్రెస్ జమ్మూలో 101వ సైన్స కాంగ్రెస్‌ను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఫిబ్రవరి 3న ప్రారంభించారు. ‘ఇన్నోవేషన్స ఇన్ సైన్స అండ్ టెక్నాలజీ ఫర్ ఇన్‌క్లూజివ్ డెవలప్మెంట్’ ఇతివృత్తంతో ఈ సైన్స కాంగ్రెస్‌ను నిర్వహిస్తున్నారు. ఉత్తరాఖండ్ సీఎంగా హరీష్‌రావత్ ఉత్తరాఖండ్ నూతన ముఖ్యమంత్రిగా హరీష్‌రావత్ ఫిబ్రవరి 1న ప్రమాణ స్వీకారం చేశారు. ఉత్తరాఖండ్ ఏర్పడ్డాక రావత్ఎనిమిదో ముఖ్యమంత్రి. గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన విజయ్ బహుగుణ జనవరి 30న తన పదవికీ రాజీనామా చేశారు. గతేడాది ఉత్తరాఖండ్‌కు వరదలు వచ్చినప్పుడు బహుగుణ పనితీరుపై సొంతపార్టీలోనే విమర్శలు తలెత్తడంతో బహుగుణ రాజీనామా చేశారు. వృద్ధి రేటును తగ్గించిన కేంద్రం 2012-13లో జీడీపీ వృద్ధి 4.5 శాతంగా ఉంటుందని కేంద్రం తెలిపింది. ఇది దశాబ్దంలో అతి తక్కువ. గతంలో దీన్ని 5 శాతంగా అంచనా వేసింది. ఇందుకు సంబంధించిన అంచనాలను సీఎస్ఓ జనవరి 31న విడుదల చేసింది. వీటి మేరకు 2011-12లో జీడీపీ వృద్ధిని 6.7 శాతంగా సవరించింది. 2012-13లో జీడీపీ విలువ రూ.54.80 లక్ష కోట్లు కాగా 2011-12లో రూ. 52.50 కోట్లుగా తెలిపింది. అంతర్జాతీయం టునీషియా కొత్త ప్రధాని మెహ్దీ జోమా టునీషియాలో మెహ్దీజోమా ప్రధానమంత్రిగా కొత్త ప్రభుత్వం జనవరి 29న కొలువు దీరింది. రాజకీయ అనిశ్చితి తొలగించేందుకు కుదిరిన ఒప్పందం ప్రకారం ఇస్లామిస్టుల నాయకత్వాన గల ప్రభుత్వ స్థానంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. 2014 చివరి నాటికి పార్లమెంట్ అధ్యక్ష ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. పర్యావరణ జాబితాలో భారత్‌కు 155వ స్థానం అత్యంత ప్రాధాన్యతనివ్వవలసిన పర్యావరణ అంశాల పనితీరు ఆధారంగా రూపొందించిన ప్రపంచ పర్యావరణ జాబితా (గ్లోబల్ గ్రీన్ లిస్)లో భారత్‌కు 155వ స్థానం దక్కింది. ‘2014 పర్యావరణ పనితీరు సూచి’లో 178 దేశాలకు ర్యాంకులు కేటాయించగా.. ఈ సూచిలో 31.23 పాయింట్లతో భారత్ 155 వ స్థానంలో నిలిచింది. స్విట్జర్లాండ్ మొదటి స్థానం, తరువాత స్థానాల్లో లగ్జమ్‌బర్గ్, ఆస్ట్రేలియా, సింగపూర్, చెక్ రిపబ్లిక్లు ఉన్నాయి. ఈ సూచీని ప్రపంచ ఆర్థిక ఫోరమ్‌తో కలిసి యేల్,కొలంబియా విశ్వవిద్యాలయాలు రూపొందించాయి. ఫేస్‌బుక్‌కు పది వసంతాలు సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్ ఫేస్‌బుక్‌కు 2014, ఫిబ్రవరి 4వ తేదీ నాటికి పదేళ్లు పూర్తయ్యాయి. ఇంటర్నెట్ తెచ్చిన సమాచార విప్లవంలో సోషల్ మీడియా మరింత విప్లవాత్మక మార్పులు తెచ్చింది. హార్వర్డ్ వర్సిటీ విద్యార్థిగా మార్క్ జుకర్‌బర్గ్ రూపొందించిన ప్రాజెక్టు ఫేస్‌బుక్‌గా రూపుదిద్దుకుని ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 123 కోట్ల మందిని అనుసంధానిస్తోంది. నాసా డెరైక్టర్‌గా మైఖల్ రోజర్స్ అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజన్సీ (నాసా) డెరైక్టర్‌గా మైఖల్ రోజర్స్‌ను అధ్యక్షుడు బరాక్ ఒబామా జనవరి 30న నియమించారు. వైస్ అడ్మిరల్ రోజర్స్ నౌకారంగం సైబర్-వార్ఫేర్ నిపుణుడు. మార్చిలో పదవీవిరమణ చేస్తున్న ప్రస్తుత డెరైక్టర్ కీత్ అలెగ్జాండర్ స్థానంలో రోజర్స్ నాసా బాధ్యతలు చేపడతారు. ఐరాసలో ప్రత్యేక సలహాదారుగా వివేక్‌లాల్ ఐక్యరాజ్యసమితి ప్రత్యేక సలహాదారుడిగా ప్రముఖ ఏరోస్పేస్, సైబర్ సెక్యూరిటీ నిపుణుడు వివేక్‌లాల్ జనవరి 30న నియమితులయ్యారు. ఈయన ఐక్యరాజ్యసమితికి బ్రాడ్ బాండ్, ఇతర సైబర్ భద్రత అంశాలకు సంబంధించి విధాన రూపక ల్పన, అమలులో తోడ్పడతారు. జింబాబ్వేలో చలామణిలోకి రుపాయి జింబాబ్వేలో చలామణి అవుతున్న కరెన్సీ జాబితాలో భారత రూపాయికి చోటు దక్కింది. ఈ మేరకు రిజర్వ బ్యాంక్ ఆఫ్ జింబాంబ్వే జనవరి 29న ప్రకటించింది. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న వాణిజ్యాన్ని ఇందుకు కారణంగా పేర్కొంది. ఇప్పటికే బొట్సవానా పౌలా, బ్రిటిష్ స్టెర్లింగ్ పౌండ్, యూరో, సౌత్ ఆఫ్రికన్ రాండ్, యూఎస్ డాలర్, ఆస్ట్రేలియన్ డాలర్, చైనీస్ యూవాన్, జపాన్ యెన్ చలామణిలో ఉన్నాయి. క్రీడలు వన్డేల్లో 8 వేల పరుగులు చేసిన ధోనీ ఎంఎస్ ధోనీ వన్డేల్లో 8 వేల పరుగుల మైలురాయిని దాటిన ఏడో భారత ఆటగాడుగా గుర్తింపు పొందాడు. న్యూజిలాండ్‌తో జనవరి 31న ముగిసిన ఐదో వన్డేలో ధోనీ 8,046 పరుగులకు చేరుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో అత్యంత వేగంగా 8వేల పరుగులు చేసిన నాలుగో క్రికెటర్‌గా కూడా ధోనీ గుర్తింపు పొందాడు. ఐసీసీ ప్యానల్లో తొలి మహిళా అంపైర్ న్యూజిలాండ్‌కు చెందిన కేథీక్రాస్ ఐసీసీ అంపైర్ ప్యానల్‌కు ఎంపికైన తొలిమహిళగా చరిత్ర పుటలకెక్కింది. 2014 సంవత్సరానికి అసోసియేట్, అఫిలియేట్ ఇంటర్నేషనల్ అధికారిణిగా ఆమెను ఐసీసీ ప్యానల్లోకి తీసుకోనున్నారు. కింగ్‌కౌంటీలోని టౌమరునీలో పుట్టిన 56 ఏళ్ల క్రాస్ ఇప్పుడు ఐసీసీ ప్రపంచ లీగ్ డివిజన్స్‌లో నియామకానికి అర్హత సాధించింది. రంజీ విజేత కర్ణాటక రంజీ ట్రోఫీ విజేతగా కర్ణాటక జట్టు నిలిచింది. ఈ టైటిల్ నెగ్గడం కర్ణాటకకు ఇది ఏడోసారి. హైదరాబాద్ లో ఫిబ్రవరి 2న ముగిసిన ైఫైనల్లో మహారాష్ట్రను ఓడించి 1998-99 తర్వాత ఈ టైటిల్‌ను నెగ్గింది. విజేతకు రూ. 2 కోట్లు, రన్నరప్‌కు రూ. కోటి ప్రైజ్‌మనీ లభించింది. సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ విజేత సింధు ఆంధ్రప్రదేశ్ స్టార్‌షట్లర్ పి.వి. సింధు అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. కొచ్చిలో ఫిబ్రవరి 2న జరిగిన ఫైనల్లో పి.సి.తులసి (కేరళ)పై సింధు విజయం సాధించింది. మహిళల డబుల్స్‌లోనూ రాష్ట్రానికి చెందిన సిక్కిరెడ్డి జోడి టైటిల్ నెగ్గింది. అపర్ణ బాలన్‌తో జతగా బరిలోకి దిగిన సిక్కిరెడ్డి జోడి ప్రజక్తా సావన్, ఆరతి సారా జంటను ఓడించింది. కాగా పురుషుల సింగిల్స్ టైటిల్‌ను హెచ్. ఎస్. ప్రణయ్ కైవసం చేసుకున్నాడు. అమృత్‌రాజ్‌కు డేవిస్‌కప్ అవార్డు భారత మాజీ టెన్నిస్ ఆటగాడు విజయ్ అమృత్‌రాజ్‌కు డేవిస్‌కప్ కమిట్మెంట్ అవార్డు లభించింది. ఈ పురస్కారం గతంలో రామనాథన్ కృష్ణన్, జైదీప్ ముఖర్జీ, ఆనంద్ అమృత్‌రాజ్, రమేశ్ కృష్ణన్, లియాండర్ పేస్ , మహేశ్ భూపతిలకు దక్కింది. రాష్ట్రీయం జీవ వైవిధ్యమండలి చైర్మన్‌గా హంపయ్య రాష్ట్ర జీవ వైవిధ్య మండలి చైర్మన్‌గా డాక్టర్ హంపయ్య మరో ఏడాది కొనసాగనున్నారు. ఆయన పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగిస్తూ జనవరి 30న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ఓటర్లు... 6.23 కోట్లు రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 6.23 కోట్లకు చేరిందని ఎన్నికల కమిషన్ ఫిబ్రవరి 1న ప్రకటించింది. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో, అత్యల్పంగా విజయనగరం జిల్లాలో ఓటర్లున్నారని తెలిపింది. 2013 జనవరి 15న సవరించిన జాబితా ప్రకారం 5.81 కోట్ల మంది ఓటర్లు కాగా తాజాగా ఈ సంఖ్య 6.23 కోట్లకు పెరిగింది. చక్రపాణికి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ పురస్కారం శాసనమండలి ైచైర్మన్ ఎ.చక్రపాణిని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ (జీజీఎఫ్) గౌరవ మెడల్‌తో సత్కరించింది. ఫిబ్రవరి 2న శాసనమండలి ఆవరణలోని కమిటీ హాల్లో పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్పీ వర్మ చేతులమీదుగా చక్రపాణికి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. -
పోలియో రహిత దేశంగా భారత్
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం అగ్ని-4 విజయవంతం అణ్వాయుధాలను మోసుకుపోయే సామర్థ్యం గల అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని భారత్ జనవరి 20న ఒడిశా వీలర్ ఐలాండ్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి విజయవంతంగా ప్రయోగించింది. బంగాళాఖాతంలో ఏర్పాటు చేసిన లక్ష్యాన్ని ఈ క్షిపణి ప్రయోగించిన 20 నిమిషాల్లోనే విజయవంతంగా ఛేదించింది. దీంతో సైన్యానికి అప్పగించేందుకు వీలుగా క్షిపణి పూర్తిస్థాయిలో సిద్ధమైందని డీఆర్డీఓ ప్రకటించింది. ఈ క్షిపణి 4వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అలాగే 850 కిలోమీటర్లు పైకి వెళ్లి తిరిగి వాతావర ణంలోకి ప్రవేశించి లక్ష్యాన్ని ఛేదిస్తుంది. ఐక్యరాజ్య సమితి ప్రాజెక్టుగా చిలక సరస్సు ఒడిశాలోని చిలక సరస్సును సుస్థిర పర్యాటక రంగం, జీవనోపాధి వనరుల అభివృద్ధి, పక్షుల వలస కొనసాగింపునకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యునెటైడ్ నేషన్స్ ఆఫ్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్) ఎంపిక చేసింది. చిలక సరస్సుతో కలిపి ఎనిమిది ప్రాంతాలను ఈ సంస్థ ఎంపిక చేసింది. ఆసియాలో చిలక ప్రాంతం ఒక్కటే యూఎన్ ప్రాజెక్టుకు ఎంపికవడం విశేషం. ఈ ప్రాజెక్టు కింద చిలక అభివృద్ధి ప్రాజెక్టుకు సహాయం చేస్తారు. సరికొత్త పర్యాటక కార్యక్రమాలు, జీవనోపాధి చర్యలు చేపట్టడం ద్వారా వలస పక్షుల పరిరక్షణకు అభివృద్ధి వ్యూహాలు చేపడతారు. జైనులకు మైనారిటీ హోదా జైనులకు మైనారిటీ హోదా కల్పిస్తూ కేంద్ర కేబినెట్ 2014 జనవరి 20న నిర్ణయం తీసుకుంది. దేశంలో వీరి జనాభా 50 లక్షల వరకు ఉంటుంది. వీరిలో అత్యధికంగా 10 శాతం మంది ముంబైలోనే ఉన్నారు. ఇప్పటివరకు ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు మైనారిటీ హోదాను కలిగి ఉన్నారు. బెంగళూరులో ద్విచక్ర అంబులెన్సు సేవలు క్షతగాత్రులు, అత్యవసరంగా ఆసుపత్రులకు తరలించాల్సిన రోగుల కోసం బెంగళూరులో సరికొత్త అంబులెన్సులు అందుబాటులోకి వచ్చాయి. ట్రాఫిక్ సమస్యను అధిగమించి సకాలంలో ఆసుపత్రులకు చేరేలా కర్ణాటక ప్రభుత్వం ఈ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. బెంగళూరులో ఓ వైద్యుడు తన ద్విచక్ర వాహనానికి ప్రాథమిక చికిత్స సామాగ్రి పెట్టెతో ప్రమాదాలు జరిగిన చోటుకే వెళ్లి వైద్యం చేసేవారు. ఆ వైద్యుని స్ఫూర్తితోనే ద్విచక్ర అంబులెన్సులు ప్రవేశపెట్టడానికి నిర్ణయించామని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి యు.టి.ఖాదర్ తెలిపారు. అంతర్జాతీయం దక్షిణకొరియా అధ్యక్షురాలు భారత పర్యటన దక్షిణ కొరియా తొలి మహిళా అధ్యక్షురాలు పార్క్ గున్ హే భారత్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా 2014, జనవరి 16న ఆర్థిక, వ్యూహాత్మక భాగస్వామ్యం, రక్షణరంగం వంటి అంశాలపై ఆమె చర్చలు జరిపారు. భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌లతో గున్ హే సమావేశ మయ్యారు. రాజస్థాన్‌లో కొరియా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు అవకాశాలను ఆమె స్వాగతించారు. కొరియన్ జాతీయులకు టూరిస్ట్ వీసా జారీచేసే భారత నిర్ణయాన్ని ప్రధాని మన్మోహన్ ప్రకటించారు. ఒడిశాలో రూ.52,000 కోట్లతో దక్షిణ కొరియా నిర్మించే పోస్కో ఉక్కుకర్మాగారానికి పర్యావరణ అనుమతి లభించడం పట్ల గున్ హే సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య తొమ్మిది ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇందులో వర్గీకృత సైనిక సమాచార రక్షణ, సైబర్‌స్పేస్ అంశాలున్నాయి. మడగాస్కర్ అధ్యక్షుడిగా హెరీ రాజోనారి మాంపియానినా మడగాస్కర్ దేశ అధ్యక్షునిగా ఆ దేశ మాజీ ఆర్థిక మంత్రి హెరీ రాజోనారి మాంపియానినా ఎన్నికయ్యారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే క్రమంలో జరిగిన ఎన్నికల అనంతరం హెరీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నారు. 2009లో రాజోయిలీనా అధికారం చేజిక్కించుకున్నాక నాలుగేళ్లకు గత డిసెంబర్లో ఎన్నికలు జరిగాయి. నాటి అధికార మార్పిడిలో రాజోయిలీనా ప్రత్యర్థి మార్క్ రాలో మనన దేశం విడిచి పారి పోయి దక్షిణాఫ్రికాలో ఆశ్రయం పొందారు. పోలియో రహిత దేశంగా భారత్ భారత్‌ను పోలియో రహిత దేశంగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ 2014, జనవరి 13న ప్రకటించారు. దేశంలో గత మూడేళ్లలో ఒక్క పోలియో కేసు కూడా నమోదు కాలేదని ఆయన తెలిపారు. చివరిగా 2011, జనవరి 13న పశ్చిమబెంగాల్లో ఓ కేసు నమోదైంది. 2009లో 741గా ఉన్న కేసుల సంఖ్య 210 నాటికి 42కు, 2011లో ఒక్క కేసుకి తగ్గాయి. తులసిలో జన్యుమార్పిడి తులసిలో ఔషధ గుణాలను మరింతగా పెంచేందుకు అమెరికా పరిశోధకులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ మేరకు ఆ మొక్కలో జన్యుమార్పిడికి శ్రీకారం చుట్టారు. ఈ బృందానికి భారతీయ అమెరికన్ శాస్త్రవేత్త మన తెలుగు వాడైన చంద్రకాంత్ ఈమని నేతృత్వం వహిస్తున్నారు. ఈయన తన విద్యార్థులతో కలిసి తులసిలో యూజెనాల్ అనే పదార్థం పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. రొమ్ము క్యాన్సర్‌ను నియంత్రించడంలో యూజెనాల్ పాత్ర ఎంతో కీలకం. దాతల సదస్సులో సిరియాకు 2.4 బిలియన్ డాలర్ల సాయం అంతర్యుద్ధంతో నలిగిపోతున్న సిరియాకు కువైట్‌లో 2014, జనవరి 17న జరిగిన దాతల సదస్సులో వివిధ దేశాలు 2.4 బిలియన్ డాలర్ల సహాయాన్ని ప్రకటించాయి. మానవతా దృక్పథంతో 6.5 బిలియన్ డాలర్లు సమకూర్చాలని ఐక్యరాజ్యసమితి ఈ సదస్సు నిర్వహించింది. ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్-కీ-మూన్ అధ్యక్షతన జరిగిన ఈ సదస్సు లో 70 దేశాలు, 24 అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. సదస్సుకు ఆతిథ్యమిచ్చిన కువైట్ అత్యధికం గా 5 వందల మిలియన్ డాలర్ల సాయాన్ని ప్రకటించింది. ద్వైపాక్షిక వాణిజ్యంపై భారత్-పాక్ అంగీకారం ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలను సాధారణ స్థాయికి తీసుకువచ్చి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని పెంచుకోవడానికి భారత్,పాకిస్థాన్‌ల మధ్య పరస్పర అంగీకారం కుదిరింది. న్యూస్‌మేకర్స్ నటి సుచిత్రా సేన్ మృతి అలనాటి అందాల నటి సుచిత్రా సేన్ (82) కోల్‌కతాలో 2014, జనవరి 17న మరణించారు. ఆమె బెంగాలీ, హిందీ భాషల్లో 60 సినిమాల్లో నటించారు. అగ్ని పరీక్ష, ఆంధీ, సాత్‌పాకే బంధా, మసాఫిర్, బొంబాయ్ కాబబా, దేవదాస్ వంటి చిత్రాలు ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. దేవదాస్‌లో నటనకు ఉత్తమ జాతీయ నటి అవార్డు ఆమెకు లభించింది. 1963లో మాస్కోలో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. 1972లో ఆమెకు పద్మశ్రీ పురస్కారం, 2005లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును సుచిత్రాసేన్ అందుకున్నారు. కేంద్రమంత్రి థరూర్ భార్య సునంద పుష్కర్ మృతి కేంద్ర మానవ వనరుల శాఖ సహాయమంత్రి శశిథరూర్ భార్య సునంద పుష్కర్ (52) న్యూఢిల్లీలో 2014 జనవరి 17న అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సునంద పుష్కర్‌ను థరూర్ 2010 ఆగస్టులో వివాహమాడారు. ఆధ్యాత్మిక గురువు బుర్హానుద్దీన్ మృతి దావూద్ బోహ్రా ముస్లిమ్మతపెద్ద సేడ్నా బుర్హానుద్దీన్ (99) ముంబాయిలో 2014 జనవరి 17న మరణించారు. ఈయన ప్రపంచ వ్యాప్త దావూదీ బోహ్రా మతానికి 52వ దాయ్ అల్-మల్తక్. జోర్డాన్ ప్రభుత్వం స్టార్ ఆఫ్ జోర్డాన్, ఈజిప్ట్ ప్రభుత్వం ఆర్డర్ ఆఫ్ ది నైలీ వంటి అత్యున్నత పౌరపురస్కారాలతో ఆయనను సత్కరించాయి. అనేక సంస్థలు డాక్టరేట్ బహుకరించాయి. ఇదిలా ఉండగా ఇయన అంత్యక్రియల సందర్భంగా జనవరి 18న ముంబైలో జరిగిన తొక్కిసలాటలో 18 మంది మృత్యు వాతపడ్డారు. కవి నామ్‌దేవ్ ఢసాల్ మృతి ప్రముఖ మరాఠి కవి, దళిత ఉద్యమనేత పద్మశ్రీ నామ్‌దేవ్ ఢసాల్ (64) ముంబయిలో 2014, జనవరి 16న కన్నుమూశారు. నామ్‌దేవ్ తొలి కవితా సంకలనం గోల్పెథా 1973లో ప్రచురితమయింది. ఆయన 1972లో దళిత్ పాంథర్స్అనే ర్యాడికల్ సంస్థను స్థాపించారు. దళిత్ పాంథర్స్ ముంబయిలో శివసేనను సిద్ధాంత పరంగాను, బహిరంగం గాను విభేదించింది. మహిళలతో పాటు కులాలకు అతీతంగా దోపిడికి గురైన వారందరూ దళితులేనంటూ దళిత్ పాంథర్స్ నిర్వచించింది. రాష్ట్రీయం అసెంబ్లీ ఆవరణలో అంబేద్కర్ విగ్రహం ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆవరణలో భవనానికి ఎదురుగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ జనవరి 20న ఆవిష్కరించారు. ఎన్పీఏ తొలి మహిళా డెరైక్టర్‌గా అరుణా బహుగుణ సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎన్పీఏ) 28వ డెరైక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారిణి అరుణా బహుగుణ (56)ను కేంద్ర ప్రభుత్వం 2014, జనవరి 20న నియమించింది. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎన్ిపీఏలో ఐపీఎస్‌కు ఎంపికైన వారికి శిక్షణ ఇస్తారు. 68 ఏళ్ల చరిత్ర గల ఎన్‌పీఏకి తొలి మహిళా డెరైక్టర్ బహుగుణ కావడం విశేషం. ఈమె 1979 బ్యాచ్‌కు చెందిన ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారిణి. అవార్డులు ఓల్గాకు లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కారం ప్రముఖ స్త్రీవాద రచయిత్రి పోపూరి. లలిత కుమారి (ఓల్గా) లోక్‌నాయక్ ఫౌండేషన్ పురస్కారాన్ని అందుకున్నారు. ఎన్టీరామారావు, హరివంశరాయ్ బచ్చన్ వర్ధంతి రోజున తెలుగు సాహిత్య రంగంలో విశేష సేవలందించిన వారికి ఈ పురస్కారాలను అందిస్తారు. రాష్ట్ర వ్యవసాయశాఖకు కృషికర్మాన్ అవార్డు కేంద్ర వ్యవసాయశాఖ అందించే కృషికర్మాన్ అవార్డు 2012-2013 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖకు లభించింది. చిరు ధాన్యాల పంటల సాగును ప్రోత్సహించినందుకు ఈ అవార్డు రాష్ట్ర వ్యవసాయశాఖకు దక్కింది. ఈ అవార్డు కింద కోటి రూపాయల నగదు, ప్రశంసాపత్రం అందజేస్తారు. రాష్ట్రంలో రాగులు, సజ్జలు, జొన్నలు, మొక్క జొన్నలు, కొర్రలు వంటి చిరుధాన్యాల పంటల సాగు, దిగుబడి పెంచి నందుకు రాష్ట్ర వ్యవసాయశాఖ ఈ అవార్డుకు ఎంపికైంది. గత ఏడాది రాష్ట్రంలో చిరుధాన్యాల పంటలు 13.39 లక్షల హెక్టార్లలో సాగు చేశారు. 53.69 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. 71వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులు 71వ గోల్డెన్ గ్లోబ్ అవార్డులను లాస్ ఏంజిలిస్‌లో 2014 జనవరి 12న ప్రదానం చేశారు. ఉత్తమ చిత్రం (డ్రామా): 12 ఇయర్స్ ఆఫ్ స్లేవ్ ఉత్తమ చిత్రం(మ్యూజికల్ కామెడీ): అమెరికన్ హజిల్ ఉత్తమ దర్శకుడు: ఆల్ఫోన్సో క్యూరోన్ (చిత్రం-గ్రావిటీ) ఉత్తమ నటుడు (డ్రామా): మ్యూథ్యూస్ మ్యాక్ కొనాగే (చిత్రం-డల్లాస్ బయ్యర్స్ క్లబ్ ఉత్తమ నటి (డ్రామా): కేట్ బ్లాంచెట్ (చిత్రం: బ్లూ జాన్) ఉత్తమ నటుడు (మ్యూజికల్ కామెడీ): లియోనార్డో డి క్యాప్రియో (చిత్రం-డి వోల్పో ఆఫ్ వాల్‌స్ట్రీట్) ఉత్తమ నటి (మ్యూజికల్ కామెడీ): అమీ ఆడమ్స్ (చిత్రం-అమెరికన్ హజిల్) ఉత్తమ విదేశీ భాషాచిత్రం: దిగ్రేట్ బ్యూటీ (ఇటలీ ) జైపూర్ సాహిత్య ఉత్సవాలు ఏడో జైపూర్ సాహిత్య ఉత్సవాలు జైపూర్‌లో 2014 జనవరి 17నుంచి 21 వరకు జరిగాయి. ఇది ఆసియాలో కెల్లా అతిపెద్ద వార్షిక సాహితీ ఉత్సవం. ఈ ఉత్సవాల్లో 14 భాషలకు చెందిన రెండు లక్షల మంది సాహితీ ప్రియులు పాల్గొన్నారు. నోబెల్ అవార్డు గ్రహీతలు అమర్త్యసేన్, హారోల్డ్ వార్ముస్తో పాటు 240 మంది ప్రసంగించారు. క్రీడలు అంజూజార్జికి ఎనిమిదేళ్ల తర్వాత స్వర్ణం 2005 మొనాకో ప్రపంచ అథ్లెటిక్స్ పైనల్లో లాంగ్ జంపర్ అంజూబాబి జార్జికి ఎనిమిదేళ్ల తర్వాత స్వర్ణం దక్కింది. అప్పట్లో తొలి స్థానంలో నిలిచిన రష్యాకు చెందిన అథ్లెట్ తత్యానా కొటోవా డోపింగ్ పరీక్షలో పట్టుబడటంతో రెండో స్థానంలో నిలిచిన అంజూబాబి జార్జికి అంతర్జాతీయ అథ్లెటిక్ సంఘాల సమాఖ్య స్వర్ణం ప్రకటించింది. దీంతో ప్రపంచ అథ్లెటిక్ పోటీల్లో తొలి స్వర్ణం సాధించిన మహిళగా అంజూ ఘనత సాధించింది. అభిజిత్‌కు గ్రాండ్‌మాస్టర్స్ ఇంటర్నేషనల్ చెస్ టైటిల్ పార్శ్వనాథ్ గ్రాండ్‌మాస్టర్స్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెం ట్ టైటిల్‌ను అభిజిత్‌గుప్తా గెలుచుకున్నాడు. న్యూఢిల్లీలో 2014 జనవరి16న ముగిసిన పోటీలో ఉక్రెయిన్‌కు చెందిన ఎల్డర్ గాసనోవ్ను ఓడించి అభిజిత్ విజేతగా నిలిచాడు. హాకీ వరల్డ్ లీగ్ విజేత నెదర్లాండ్ న్యూఢిల్లీ వేదికగా జరిగిన హాకీ వరల్డ్ లీగ్ పోటీల్లో నెదర్లాండ్స్ జట్టు విజేతగా నిలిచింది. జనవరి 18న ఏకపక్షంగా సాగిన అంతిమపోరులో ఈ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈ లీగ్‌లో భారత్ ఆరో స్థాన ంలో నిలిచింది. -
పృథ్వి-2 క్షిపణి పరీక్ష విజయవంతం
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం పన్నెండో ప్రవాసీ భారతీయ దివస్ 12వ ప్రవాసీ భారతీయ దివస్ న్యూఢిల్లీలో జనవరి 7నుంచి 9 వరకు జరిగింది. కార్యక్రమం ముగింపు సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వివిధ రంగాల్లో సేవలందించిన 13 మంది ప్రవాస భారతీయులకు ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డులు ప్రదానం చేశారు. ఈ అవార్డులందుకున్న వారిలో మహాత్మా గాంధీ మనుమరాలు, దక్షిణాఫ్రికా మాజీ పార్లమెంట్ సభ్యురాలు ఇలాగాంధీ, భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియా సెనేటర్ లీసా మారియా సింగ్, ఫిజిలోని రామకృష్ణ మిషన్, వర్గీస్, వాసుదేవన్చంచ్లానీ, వికాస్ చంద్ర, సన్యాల్ తదితరులున్నారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా మలేసియా సహజవనరులు, పర్యావరణ మంత్రి దాతు సెరి జి. పళనివేల్ హాజరయ్యారు. పృథ్వి-2 క్షిపణి పరీక్ష విజయవంతం అణ్వస్త్ర సామర్థ్యం గల పృథ్వి -2 క్షిపణిని భారత్ జనవరి 7న ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్లో మొబైల్ లాంచర్ నుంచి విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయాణించే ఈ క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. వెయ్యి కిలోల ఆయుధాలను మోసుకుపోగలదు. 2003లో పృథ్విని సైన్యంలో ప్రవేశపెట్టారు. అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్లో నిర్మించిన ప్లాట్‌ఫామ్ నెంబర్-1 ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్లాట్‌ఫామ్‌గా రికార్డుల్లోకెక్కింది. దీని పొడవు 1,355.40 మీటర్లు. ఈ విషయూన్ని నార్త్ ఈస్ట్రన్ రైల్వే జనరల్ మేనేజర్ ఏకే ఆటల్ జనవరి 9న వెల్లడించారు. జాతీయ యువ విధానానికి కేంద్రం ఆమోదం జాతీయ యువజన విధానాన్ని (నేషనల్ యూత్ పాలసీ-ఎన్వైపీ) జనవరి 9న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్వైపీ-2003 స్థానంలో కొత్త విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. విద్య, నైపుణ్యం అభివృద్ధి, ఉపాధి, పరిశ్రమ స్థాపన, ఆరోగ్యం, ఆరోగ్యకరమైన జీవన విధానం, క్రీడలు, సామాజిక విలువలను పెంపొందించడం, సామాజిక భాగస్వామ్యం, రాజకీయాలు, ప్రభుత్వాల్లో పాలుపంచుకోవడం, సమ్మిళత సామాజిక న్యాయం వంటి అంశాలపై ఈ విధానం దృష్టి సారిస్తుంది. దేశంలోని 15-29 ఏళ్ల యువతకు ఈ విధానం వర్తిస్తుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం వీరు దేశ జనాభాలో 27.5 శాతం ఉన్నారు. మహిళా ఉద్యోగినులకు ఎస్బీఐ కానుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన మహిళా ఉద్యోగులకు రెండేళ్ల సెలవును తీసుకోవడానికి అవకాశం కల్పించింది. భార్యలేని లేదా విడాకులు తీసుకున్న పురుషులకూ ఈ వెసులుబాటు కల్పించింది. పిల్లల చదువు, తల్లిదండ్రులు, అత్తమామల ఆరోగ్యసంరక్షణ వంటి ఎలాంటి అవసరాలకైనా రెండేళ్లపాటు సెలవులు తీసుకోవచ్చని ఎస్బీఐ చైర్ పర్సన్ అరుంధతీ భట్టాచార్య ప్రకటించారు. కౌమార ఆరోగ్యం కోసం కేంద్రం కొత్త పథకం కౌమారదశలో ఆరోగ్య, ఆహార, ఇతర సాంఘిక సమస్యలను అధిగమించేందుకు 10-19 ఏళ్ల లోపు వారికోసం కేంద్రం కొత్తపథకాన్ని ఆరంభించింది. దీనికి రాష్ట్రీయ కిశోర్ స్వాస్థ్య కార్యక్రమం (ఆర్కేఎస్కే) అని నామకరణం చేసింది. పథకం కింద దేశంలోని 34.3 కోట్ల మంది కౌమార బాలబాలికలకు పోషకాహారం, ప్రత్యుత్పత్తి అవ గాహన, శారీరక, మానసిక ఆరోగ్యం, లైంగిక వేధింపులు, అసాంక్రమిక వ్యాధులతోపాటు జీవనశైలిసమస్య లాంటి పలు అంశాల్లో సాయపడుతుంది. విదేశీ మదుపుదారులకు వెసులుబాటు విదేశీ మదుపుదారులు భారత్‌లో షేర్లు లేదా రుణ పథకాలలో తాము పెట్టిన పెట్టుబడులను విక్రయించి నిష్ర్కమించే అవకాశం కల్పిస్తూ రిజర్వ్ బ్యాంక్ విదేశీప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను సడలించింది. ఈ నిర్ణయంతో దేశంలోకి మరింత ఎక్కువగా ఎఫ్‌డీఐ నిధులు రావడానికి తోడ్పడుతుందని రిజర్వ్‌బ్యాంక్ తెలిపింది. మార్పు చేసిన నిబంధనల ప్రకారం ఎఫ్‌డీఐ ఒప్పందాలలో ఇక మీదట ఐచ్ఛికంతో కూడిన షరతులు ఉంటాయి. ఇందులో కనీస లాకిన్ కాలంతోపాటు ప్రతిఫలాలపై ఎటువంటి హామీ లేకపోవడం వంటివాటికి చోటు కల్పించారు. పదోన్నతి ఉద్యోగి మౌలిక హక్కు : సుప్రీం పదోన్నతి ఉద్యోగి మౌలిక హక్కు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పదోన్నతి పొందడానికి ఆ ఉద్యోగికి తగిన అర్హతలున్నాయని నిర్ధారించినపుడు తప్పనిసరిగా కల్పించాలని జస్టిస్ ఎ.కె. పట్నాయక్, జస్టిస్ జె.ఎస్. ఖేహర్‌లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. మేజర్ జనరల్ హెచ్ ఎం సింగ్‌కు లెఫ్టినెంట్ జనరల్ స్థాయి పదోన్నతినివ్వాలంటూ సదరు ఎంపిక బోర్డు చేసిన సిఫారసును మంత్రివర్గం నియమించిన కమిటీ తోసిపుచ్చడంపై ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. దేవయాని బహిష్కరణ అమెరికాలో భారత దౌత్యవేత్త దేవయానిని జనవరి 10న బహిష్కరించింది. వీసా కేసులో విచారణ గడువును పొడిగించాల్సిందిగా దేవయాని చేసిన విజ్ఞప్తిని అమెరికా కోర్టు తోసిపుచ్చుతూ నేరాభియోగం మోపింది. అయితే కోర్టు నేరం నమోదు చేసిన నేపథ్యంలో ఈ హోదాను రద్దు చేయాల్సిందిగా అమెరికా కోరడం... అందుకు భారత్ నిరాకరించడంతో ఆమెను తక్షణమే అమెరికా విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించింది. దీంతో దేవయాని న్యూయార్క్ నుంచి భారత్‌కు వచ్చేశారు. ఈ పరిణామాలపై భారత్ స్పందిస్తూ అమెరికా దౌత్యవేత్త ఒకర్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది. జాన్ ఐపేకు భారత్‌గౌరవ్ పురస్కారం బహ్రెయిన్‌లో ఉన్న ప్రవాస భారతీయుడు జాన్‌ఐపే (63) ప్రతిష్ఠాత్మక భారత్ గౌరవ్ పురస్కారానికి ఎంపికచేసినట్లు ఇండియా ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ సొసైటీ ప్రకటించింది. నాలుగుదశాబ్దాల పాటు బహ్రెయిన్‌లో నివశిస్తున్న ఐపే...14 ఏళ్లుగా ప్రవాస భారతీయుల అభివృద్ధికి విశేష కృషి చేస్తున్న తీరుకు ఈ అవార్డు వరించింది. ఇప్పటివరకు ఈ అవార్డును మదర్‌థెరిసా, క్రికెటర్ గవాస్కర్, నటులు షమ్మీకపూర్, రాజేశ్‌ఖన్నా, దేవానంద్ అందుకున్నారు. అంతర్జాతీయం ఫెడరల్ రిజర్వ్ చైర్ పర్సన్‌గా యెలెన్ అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్ పర్సన్ గా జానెట్ యెలెన్ (67) నియామకానికి సెనెట్ జనవరి 7న ఆమోదం తెలిపింది. వందేళ్ల చరిత్ర కలిగి ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన సెంట్రల్ బ్యాంక్‌కు అధిపతిగా నియమితులైన తొలి మహిళ యెలెన్. ఈమె ప్రస్తుతం ఫెడరల్ రిజర్వ్ ఉపాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. ఫెడరల్ై ఛెర్మన్‌గా ఉన్న బెన్బెర్నాంకీ జనవరి 31న పదవీ విరమణ అనంతరం యెలెన్ ఆస్థానంలో బాధ్యతలు చేపట్టనున్నారు. పాక్ బాలుడికి అంతర్జాతీయ సాహస అవార్డు తన ప్రాణాలొడ్డి పాఠశాలలోని వేల మంది విద్యార్థులను కాపాడిన 14 ఏళ్ల పాకిస్థాన్ బాలుడు ఐత్జాజ్ హసన్‌కు అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ అంతర్జాతీయ సాహస అవార్డును ప్రకటించింది. అలాగే పాక్ ప్రభుత్వం కూడా తమ దేశ అత్యున్నత సాహస అవార్డుల్లో ఒకటైన సితారా ఎ సుజాత్‌ను ఇవ్వాలని నిర్ణయించింది.జనవరి 6న పాకిస్థాన్‌లోని ఖైబర్ ఫఖ్తుంఖ్యా రాష్ట్రంలోని ఓ పాఠశాలలో మానవబాంబుతో ప్రవేశిస్తున్న ఉగ్రవాదిని హసన్ అడ్డుకున్నాడు. ఆ పేలుడులో ఇద్దరూ చనిపోయారు. భారతీయ శాస్త్రవేత్తకు అధ్యయన నిధి అమెరికాలోని భారత సంతతి నాడీశాస్త్రవేత్త ఖలీల్జ్రాక్కు అక్కడి జాతీయ ఫౌండేషన్ సుమారు రూ. 5.21కోట్లు (866.90 డాలర్లు) మంజూరు చేసింది. వయసుతోపాటు వచ్చే వినికిడి సమస్యలకు చికిత్స చేసేందుకు ఉపయోగ పడేలా మెదడు చర్యా విధానంపై రజాక్ కొద్దికాలంగా పరిశోధనలు చేస్తున్నారు. వీటిని కొనసాగించేందుకు ఐదేళ్లకుగాను ఈ మొత్తం నిధిని రజాక్‌కు బహుకరించారు. ప్రపంచ ప్రశంసనీయుడు బిల్‌గేట్స్ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు ప్రపంచంలోనే అత్యంత ప్రశంసనీయ వ్యక్తిగా నిలిచారు. భారత్ సహా 13 దేశాల్లో సర్వే జరిపి 30 మందితో రూపొందించిన ఈ జాబితాలో బిల్ గేట్స్ మొదటి స్థానంలో నిలిచారు. కాగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా రెండోస్థానం, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఐదోస్థానం, నరేంద్రమోడీ ఏడో స్థానం, అమితాబ్‌బచ్చన్ తొమ్మిది, అబ్దుల్‌కలామ్ పది, అన్నాహజారే 14వ, కేజ్రీవాల్ 18వ, రతన్‌టాటా 30వ స్థానం పొందారు. ఈ మేరకు ద టైమ్స్ కోసం ‘యుగోవ్’ అనే సంస్థ ప్రపంచంలోనే అత్యంత ఆరాధనీయ వ్యక్తుల జాబితా రూపొందించింది. బంగ్లా ప్రధానిగా షేక్ హసీనా ప్రవూణం బంగ్లాదేశ్ ప్రధానవుంత్రిగా షేక్ హసీనా (అవామీలీగ్ పార్టీ) జనవరి 12న ప్రవూణ స్వీకారం చేశారు. హసీనా ప్రధాని పదవిని చేపట్టడం ఇది వరుసగా రెండోసారి, మొత్తం మీద వుూడోసారి. గత వారం పార్లమెంట్‌కు జరిగిన ఎన్నికల్లో అవామీలీగ్ 232 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. అవామీలీగ్ మిత్ర పక్షమైన జతియా పార్టీ 33 స్థానాలను కైవసం చేసుకుంది. షెరాన్ కన్నుమూత ఇజ్రాయెల్ మాజీ ప్రధాని ఎరియల్ షెరాన్ (85) జనవరి 11న మరణించారు. ఈయన 2001లో ఇజ్రాయెల్ ప్రధానిగా ఎన్నికైయ్యారు. వివాదాస్పద విధానాలతో ‘ది బుల్డోజర్’గా చరిత్రకెక్కాడు. ఇజ్రాయిలీలు ఈయన్ను ‘మిస్టర్ సెక్యూరిటీ’గా పిలుస్తారు. భారత్‌ను సందర్శించిన తొలి ఇజ్రాయెల్ ప్రధాని షెరాన్. ఈయన 2003 లో భారత పర్యటనకు వచ్చారు. భూమిలాంటి గ్రహం భూమికి 200 కాంతి సంవత్సరాల దూరంలో భూమి లాంటి గ్రహాన్ని గుర్తించినట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తెలిపింది. కెప్లర్ వ్యోమనౌక ద్వారా కనుగొన్న ఈ గ్రహానికి కెఓఐ-314గా పేరు పెట్టారు. హైడ్రోజన్, హీలియం వాయువులతో కూడిన ఈ గ్రహం భూమికి సమానమైన ద్రవ్యరాశితోనూ, భూమి కన్నా 60 శాగతం అధిక వ్యాసంతోనూ ఉంది. 104 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉండే ఈ గ్రహంలో జీవం ఉనికి ఉండటానికి అవకాశం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు. రాష్ట్రీయం విశాఖ ఉక్కుకు మరో కీర్తి నవరత్న హోదాగల విశాఖఉక్కు (రాష్ట్రీయఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ -ఆర్ఐఎన్ఎల్) సిగలో మరో కలికితురాయి వచ్చిచేరింది. వర్క్ ప్లేస్ మేనేజ్ మెంట్ సిస్టమ్‌లో మెరుగైన ప్రతిభ కనబరిచి 5ఎస్ ధ్రువీకరణపత్రం సాధించింది. దేశంలోని ఉక్కు పరిశ్రమ రంగంలో ఈ ధ్రువీకరణ పొం దిన తొలి పరిశ్రమగా విశాఖ ఉక్కు ఘనత దక్కించుకుంది. ఆర్టీసీకి మూడు జాతీయ పురస్కారాలు ఏపీఎస్ఆర్టీసీకి మూడు పురస్కారాలు లభించాయి. అత్యధిక ఇంధన పొదుపు (కేఎంపీఎల్),అర్బన్ సర్వీసుల్లో అత్యధిక ఇంధన పొదుపు (కేఎంపీఎల్), భద్రత అంశాల్లో అతి తక్కువ ప్రమాదాలు కలిగి ఉండటంతో అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్ టేకింగ్స్ (ఏఎస్ఆర్టీయూ) న్యూఢిల్లీ నుంచి పురస్కారాలు దక్కించుకుంది. ఇంధన పొదుపులో ఇప్పటికి 39వసారి ఆర్టీసీ అవార్డును గెలుచుకుంది. రాష్ట్రంలో గేమ్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన గేమింగ్ యానిమేషన్ మీడియాఎంటర్టైన్మెంట్ (గేమ్) ప్రాజెక్టుకు హైదరాబాద్ సమీపంలోని రాయదుర్గ్‌లో జనవరి 8న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇందులో గేమింగ్, యానిమేషన్ ఎంటర్టైన్మెంట్, యానిమేషన్ వెబ్ డిజైనింగ్, ఇ- ఎడ్యుకేషన్,ఇ-లెర్నింగ్, పీసీ, మొబైల్ గేమింగ్, కాన్సోల్ గేమింగ్,ఆన్లైన్ మల్టీప్లేయర్ గేమింగ్‌లకు సదుపాయాలు కల్పిస్తారు. 15 వేల మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయి. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ. 350 కోట్లతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. ఇటువంటి పార్క్‌ను ఏర్పాటు చేయడం దేశంలో ఇదే తొలిసారి. అంజలీదేవి మృతి అలనాటి సినీనటి అంజలీదేవి (86) జనవరి 13న చెన్నైలో కన్ను ముశారు. 1927 ఆగస్టు 24న తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జన్మించారు. తెలుగులో 350కి పైగా చిత్రాల్లో నటించారు. లవకుశ, అనార్కలి, సువర్ణసుందరి చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపు తెచ్చాయి. క్రీడలు నేషన్ కప్ బాక్సింగ్‌లో నిఖత్‌కు స్వర్ణం ఆంధ్రప్రదేశ్ యువబాక్సింగ్ కెరటం నిఖత్ జరీన్ నేషన్స్ కప్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణపతకం గెలిచింది. 51 కిలోల విభాగం ఫైనల్లో పాల్టో సెవా ఎక్తరీనా (రష్యా)ను ఓడించింది. నిఖిత్ కెరీర్లో ఇది నాలుగో అంతర్జాతీయ పతకం. నిజామాబాద్‌కు చెందిన నిఖత్ ప్రస్తుతం ప్లస్ టూ చదువుతోంది. నేషనల్ టేబుల్‌టెన్నిస్ టోర్నీ జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ షిప్ టైటిళ్లను పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు (పీఎస్‌పీబీ)కి చెందిన పురుషుల, మహిళ జట్లు గెలుచుకున్నాయి. పాట్నాలో జనవరి 9న ముగిసినపోటీల్లో పురుషుల టీమ్ ఫైనల్లో పశ్చిమబెంగాల్‌ను, మహిళల జట్టు ఉత్తర బెంగాల్‌ను ఓడించాయి. ఫెడరేషన్ కప్ బాస్కెట్ బాల్ 28వ ఫెడరేషన్ కప్ ఛాంపియన్‌షిప్‌లో పురుషుల టైటిల్నుఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్, మహిళల టైటిల్‌ను ఛత్తీస్‌గఢ్ గెలుచుకున్నాయి. అహ్మదాబాద్‌లో జనవరి 9న ముగిసిన పోటీల్లో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకును ఓడించి ఓఎన్జీసీ పురుషుల టైటిల్ కైవసం చేసుకోగా-మహారాష్ట్రను ఓడించి ఛత్తీస్‌గఢ్ మహిళల టైటిల్‌ను గెలుచుకున్నాయి. -
జీఎస్ఎల్వీ డి-5 ప్రయోగం విజయవంతం
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం లోక్‌పాల్‌కు రాష్ట్రపతి ఆమోదం లోక్‌పాల్ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసినట్లు జనవరి 1న సంబంధిత వర్గాలు ప్రకటనను విడుదల చేశాయి. లోక్‌పాల్ బిల్లుకు గతేడాది డిసెంబర్లో పార్లమెంట్ ఆమోదం తెలిపింది. నూతన భూసేకరణ చట్టం నూతన భూసేకరణ చట్టం జనవరి 1 నుంచి అవుల్లోకి వచ్చింది. 1894 నాటి చట్టం స్థానంలో తీసుకువచ్చిన ఈ సరికొత్త చట్టంతో భూములు కోల్పోయే రైతులు, గిరిజనులు సహా భూవుులు కోల్పేయే వారికి పూర్తి స్థాయిలో పరిహారం, పునరావాసం అందుతాయి, ఆయూ విషయూల్లో పూర్తిగా పారదర్శకతను పాటించాల్సి ఉంటుంది. పంచాయుతీ సవూవేశాల ప్రత్యక్ష ప్రసారం కర్ణాటకలో గ్రావుపంచాయుతీల సమావేశాలను వచ్చే వూర్చి 1వ తేదీ నుంచి ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. తొలిదశలో వెయ్యి గ్రామ పంచాయతీలను లోకల్ కేబుల్ నెట్వర్క్ ద్వారా అనుసంధానించారు. ఉత్తరాది గ్రిడ్‌తో అనుసంధానమైన దక్షిణాది గ్రిడ్ షోలాపూర్-రాయచూర్ మధ్య 765 కేవీ సామర్థ్యం గల విద్యుత్తు సరఫరా మార్గాన్ని జనవరి1న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో నేషనల్ గ్రిడ్‌తో దక్షిణాది గ్రిడ్ అనుసంధానమైంది. ఇప్పటి వరకు ఉత్తర, తూర్పు, పశ్చిమ, ఈశాన్య గ్రిడ్ల మధ్య మాత్రమే అనుసంధానం ఉండేది. దక్షిణాది గ్రిడ్ అనుసంధానం వల్ల ఉత్తరాది రాష్ట్రాల్లో అందుబాటులో ఉన్న విద్యుత్‌ను దక్షిణాది రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు వీలు కలుగుతుంది. గ్రిడ్ అనుసంధానం లేకపోవడంతో మిగులు విద్యుత్ ఉన్న ఉత్తరాది రాష్ట్రాల నుంచి కొరత ఉన్న దక్షిణాదికి విద్యుత్ సరఫరా వీలయ్యేది కాదు. రాయచూర్ లైన్ నుంచి కర్నూలు, హైదరాబాద్ ప్రాంతాలకు విద్యుత్ లైన్ల అనుసంధాన త ఉండటంతో ఇకమీదట రాష్ట్రానికి ఉత్తరాది నుంచి విద్యుత్తు సరఫరా సులభతరమవుతుంది. జీఎస్ఎల్వీ డి-5 ప్రయోగం విజయవంతం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్‌తో చేపట్టిన జియో సింక్రోనస్ శాటిలైట్ వెహికల్ (జి.ఎస్.ఎల్.వి)-డి5 ప్రయోగం విజయవంతమైంది. జీఎస్ఎల్వీ-డి5 ద్వారా జీశాట్-14 ఉపగ్రహాన్ని జనవరి 5న శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించింది.1982 కిలోల బరువు గల జీశాట్-14 అత్యాధునిక కమ్యూనికేషన్ ఉపగ్రహం. ఇది టెలికాస్టింగ్, కమ్యూ నికేషన్ల కోసం 12 సంవత్సరాల పాటు సేవలందిస్తుంది. ఇందులో 12 ట్రాన్స్ పాండర్లు ఉన్నాయి. దేశీయంగా రూ పొందించిన క్రయోజెనిక్ ఇంజన్‌తో చేపట్ట్టిన జీఎస్ఎల్వీ ప్రయోగం విజయవంతం అయింది. ఈ ఇంజన్‌ను ఉపయోగించడం ఇది రెండోసారి. తొలిసారి 2010 ఏప్రిల్‌లో భారత క్రయోజెనిక్తో చేపట్టిన జీఎస్ఎల్వి-డి3 ప్రయోగం విఫలమైంది. ప్రస్తుత ప్రయోగం విజయవంతం కావడంతో క్రయోజెనిక్ ఇంజన్ గల అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనా దేశాల సరసన భారత్ చేరింది. జీఎస్ఎల్వీ-డి5 బరువు 414.75 టన్నులు. ఎతు ్త49.13 మీటర్లు. ఇందులో ఘన, ద్రవ, క్రయోజెనిక్ అనే మూడు దశలు ఉన్నాయి.మొదటి దశలో ఘన ఇంధనాన్ని, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని,మూడోదైన క్రయోజెనిక్ దశలో ద్రవీకృత హైడ్రోజన్, ఆక్సిజన్ వాడారు. క్రయోజెనిక్ ఇంజన్ అత్యంత శీతల ఇంధనంతో పని చేస్తుంది. సామర్థ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. 2 వేల టన్నుల బరువైన సమాచార ఉపగ్రహాలను భూమికి 36 వేల కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో ప్రవేశ పెట్టేందుకు క్రయోజెనిక్ సాంకేతిక పరిజ్ఞానం అవసరం. ఇది ఎనిమిదో జీఎస్ఎల్వీ ప్రయోగం. తొలిసారి జీఎస్ఎల్వీ ద్వారా 2001 ఏప్రిల్ 18న చేపట్టిన జీశాట్-1ప్రయోగం విజయవంతమైంది. తరువాత చేపట్టిన వాటిలో మూడు ప్రయోగాలు విఫలమయ్యాయి. నాలుగు విజయ వంతమయ్యాయి. విజయవంతమైన ప్రయోగాల్లో రష్యా నుంచి పొందిన క్రయోజెనిక్ ఇంజను ్లఉపయోగించారు. మాల్దీవుల అధ్యక్షుడు యామీన్ భారత పర్యటన మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యామీన్ భారత పర్యటనలో జనవరి 2న రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని మన్మోహన్‌సింగ్‌లతో సమావేశమయ్యా రు. ఈ సందర్భంగా భారత్ నుంచి చేసుకునే దిగుమతుల కోసం 25 మిలియన్ డాలర్ల రుణాన్ని మాల్దీవులకు అందజేస్తామని ప్రధాని మన్మోహన్ హామీ ఇచ్చారు. అలాగే మాల్దీవుల పెట్రోలియం ఉత్పత్తుల అవసరాలను తీర్చేందుకు భారత్ అంగీకరించింది. ఇరుదేశాల మధ్య ఆరోగ్య రంగంలో పరస్పర సహకార అవగాహనపై సంతకాలు జరిగాయి. మాలేలోని ఇందిరాగాంధీ మెమోరియల్ ఆసుపత్రిలో అవసరమైన సిబ్బందికి సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని పొడిగించారు. ఇదిలాఉండగా మాలే విమానాశ్రయం ఆధునికీకరణకు సంబంధించిన భారత కంపెనీ జీఎంఆర్ ప్రాజెక్టును గత మాల్దీవుల ప్రభుత్వం రద్దు చేయగా-దానిపై యామీన్ ఎటువంటి హామీఇవ్వలేదు. తొలిదశ గగన్‌కు డీజీసీఏ ధ్రువీకరణ భారత గగనతలంపై ఉపగ్రహ ఆధారిత విమాన నావిగేషన్ వ్యవస్థ ఏర్పాటుకు మార్గం సుగమమైంది. ఈమేరకు ప్రతిష్ఠాత్మక నావిగేషన్.. గగన్ తొలిదశకు డీజీసీఏ నుంచి జనవరి మొదటివారంలో ధ్రువీకరణ లభించింది. దీంతో ఈ వ్యవస్థ కలిగిఉన్న అమెరికా, ఐరోపా, జపాన్ దేశాల జాబితాలో భారత్ చేరింది. అంతర్జాతీయం కార్మికుల రక్షణపై భారత్, సౌదీ ఒప్పందం సౌదీఅరేబియాలో పనిచేసే భారత కార్మికుల హక్కుల పరిరక్షణకు ఉద్దేశించిన ఒప్పందంపై భారత్, సౌదీ అరేబియాలు జనవరి 2న న్యూఢిల్లీలో సంతకాలు చేశాయి. ఈ ఒప్పందంపై సౌదీ అరేబియా కార్మికమంత్రి మొహమ్మద్ ఫఖీ, భారత్ తరపున ప్రవాస భారతీయశాఖ మంత్రి వాయిలార్వ్రి సంతకాలు చేశారు. ఈ ఒప్పందం యజమాని, గృహ కార్మికుడు ఇరువురి హక్కుల పరిరక్షణకు తోడ్పడుతుంది. ఇరువురి మధ్య ఒప్పందం సంబంధాలను క్రమబద్ధీకరిస్తుంది. చట్టాలను ఉల్లంఘించే ఏజెంట్లపై చర్యలు తీసుకునేందుకు తోడ్పడుతుంది. న్యూఢిల్లీవేదికగా పెట్రోటెక్-2014 2014 అంతర్జాతీయ పెట్రోలియం సమావేశాలకు న్యూఢిల్లీ వేదిక కానుంది. ఈ సమావేశాలు జనవరి 12 నుంచి 15 వరకు నాలుగు రోజులపాటు జరగనున్నాయి. ఈ సదస్సును పెట్రోలియం, సహజవనరుల, చమురు శుద్ధి మంత్రిత్వశాఖ, పెట్రోటెక్ లిమిటెడ్‌లు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. 2030 విజన్ పేరుతో ఈ పెట్రోటెక్ 2014 జరగనుంది. యూరోలోకి లాత్వియా జనవరి 1న లాత్వియా అధికారికంగా యూరో ను తన దేశ ఆధికారిక కరెన్సీగా స్వీకరించింది. ఉత్తర యూరప్ దేశమైన లాత్వియా జనాభా 2,070,370. రాష్ట్రీయం భాష, సాంస్కృతికశాఖ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భాష, సాంస్కృతిక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసింది. ఈ శాఖను మంత్రి వట్టి వసంతకుమార్‌కు కేటాయించారు. 2012లో తిరుపతిలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో ఈ శాఖను ఏర్పాటు చేస్తామని అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. సాంస్కృతిక శాఖ కార్యకలాపాలతోపాటు భాషకు సంబంధించిన కార్యక్రమాలను కొత్తశాఖ పర్యవేక్షిస్తుంది. ప్రస్తుతం చలన చిత్రాభివృద్ధి సంస్థ పరిధిలో ఉన్న నాటక రంగాభివృద్ధి, ప్రాచీన భాష కేంద్రం, కొత్తగా పునరుద్ధరించిన సాహిత్య సంగీత, లలిత కళల అకాడమీ, ఉన్నత విద్యాశాఖ పరిధిలో ఉన్న తెలుగు అకాడమీలు కొత్తశాఖ పరిధిలోకి వస్తాయి. రెండో అధికార భాషైన ఉర్దూ వ్యవహారాలు కూడా ఈ శాఖ పరిధిలోనే ఉంటాయి. రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా జస్టిస్ గోపాలకృష్ణ రాష్ట్ర వినియోగదారుల ఫోరం అధ్యక్షునిగా జస్టిస్ తామడ గోపాలకృష్ణను రాష్ట్ర ప్రభుత్వం జనవరి 3న నియమించింది. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ గోపాలకృష్ణ ఐదేళ్లపాటు లేదా ఆయనకు 67ఏళ్ల వయసు వచ్చేవరకు ఈ పదవిలో కొనసాగుతారు. రాష్ట్ర ఒలింపిక్ సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామ్రెడ్డి మృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒలింపిక్ సంఘం మాజీ అధ్యక్షుడు ఎల్.వెంకట్రామ్రెడ్డి (88) జనవరి 3న హైదరాబాద్‌లో మరణించారు. ఆయన రాష్ట్ర ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శిగా, వాలీబాల్ సంఘం ప్రధాన కార్యదర్శిగా రెండు దశాబ్దాల పాటు సేవలందించారు. రాష్ట్రంలో 50 క్రీడాసంఘాల ఏర్పాటులో ప్రధాన పాత్ర పోషించారు. న్యూస్ మేకర్స్ ఖేమ్కాకు డామేహుడ్ అవార్డు భారతసంతతికి చెందిన ప్రముఖ విద్యావేత్త ఆశాఖేమ్కా బ్రిటన్ ప్రతిష్టాత్మక డామే కమాండర్ ఆఫ్‌ది ఆర్డర్ (డి.బి.ఇ-డామేహుడ్) అవార్డుకు ఎంపికయ్యారు. 1917 లో బ్రిటీష్ ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. బీహార్‌లో జన్మించిన ఆశాఖేమ్కా 1975లో బ్రిటన్ వెళ్లారు. టీవీలో బోధన కార్య క్రమాలు చేపట్టిన ఆమె-అక్కడి యువతకు విద్య, ఉపాధి, శిక్షణను అందిస్తున్నారు. బ్రిటన్‌లోని 33 కళాశాలలను భారత్‌లోని కళాశాలలతో అనుసంధానించి ఇరుదేశాలకు చెందిన విద్యార్థులలో నైపుణ్యాల అభివృద్ధికి ఆమె కృషి చేస్తున్నారు. కాగా 83 ఏళ్ల తర్వాత ఈ అవార్డు భారత సంతతికి దక్కింది. ఇంతకుముందు 1931లో మహా రాణి లక్ష్మీదేవి భాయ్ సాహిబాకు ఈ గౌరవం లభించింది. వైమానిక దళాధిపతిగా అరూప్ రహా భారతై వెమానికదళం 24వ అధిపతిగా ఎయిర్‌చీఫ్ మార్షల్ అరూప్హ్రా (59) 2013 డిసెంబర్ 31న బాధ్యతలు చేపట్టారు. ఏకే బ్రౌన్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన అరూప్హ్రా మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు. జస్టిస్ గంగూలీ రాజీనామా లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే గంగూలీ జనవరి 6న పశ్చిమబెంగాల్ మానవ హక్కుల కమిషన్ (డబ్ల్యూ హెచ్ఆర్సీ) ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. నాస్కామ్ అధ్యక్షునిగా చంద్రశేఖర్ నాస్కామ్ అధ్యక్షునిగా మాజీ టెలికమ్ కార్యదర్శి రెంటాల చంద్రశేఖర్ జనవరి 5న బాధ్యతలు చేపట్టారు. ఈయన 1975వ బ్యాచ్ ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. క్రీడలు ఆసీస్‌దే యాషెస్ ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదు క్రికెట్ టెస్టుల మ్యాచ్‌ల యాషెస్ సిరీస్‌ను ఆతిథ్య ఆసీస్ 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. యాషెస్ సిరీస్‌ను 5-0తో కైవసం చేసుకోవడం ఆస్ట్రేలియాకు ఇది మూడోసారి. ఇంతకుముందు ఆర్మ్ స్ట్రాంగ్ (1920-21), రికీపాంటింగ్(2006-07) నేతృత్వంలో ఈ ఘనత సాధించగా ఇప్పుడు మైకేల్ క్లార్క్ వారి జాబితాలో చేరాడు. వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన అండర్సన్ 2014 జనవరి 1న క్వీన్స్‌టౌన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ కోరె అండర్సన్ కేవలం 36 బంతుల్లో సెంచరీ చేసి కొత్త రికార్డు సృష్టించాడు. దీంతో ఇప్పటి వరకు షాహిద్ఆఫ్రిది (పాకిస్థాన్) శ్రీలంకపై 1996లో 37 బంతుల్లో సాధించిన శతకం రికార్డును అండర్సన్ అధిగమించాడు. చెన్నై ఓపెన్ విజేత వావ్రింకా చెన్నై ఓపెన్ టాప్‌సీడ్ స్టానిస్లాస్ వావ్రింకా (స్విట్జర్లాండ్) గెలుచుకున్నాడు. ఫైనల్లో ఫ్రాన్స్‌కు చెందిన ఎడ్వర్డ్ రోజర్ వాసెలిన్‌ను ఓడించాడు. చెన్నై ఓపెన్‌ను గెలుచుకోవడం వావ్రింకాకు ఇది రెండోసారి. డబుల్స్‌లో జోహాన్స్ బ్రెయిన్స్ (స్వీడన్), ఫ్రెడరిక్నీల్సన్ (డెన్మార్క్) జోడీ విజేతలుగా నిలిచారు. సెరెనాకు బ్రిస్బేన్ ఓపెన్ టైటిల్ బ్రిస్బేన్ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను సెరెనా విలియమ్స్ గెలుచుకుంది. బ్రిస్బేన్‌లో జనవరి 4న జరిగిన ఫైనల్లో విక్టోరియా అజరెంకా (బెలారస్)ను ఓడించింది. ఇది సెరెనాకు 58వ ఉమెన్స్ సింగిల్స్ టైటిల్. పురుషుల సింగిల్స్‌ను లేటన్ హెవిట్ (ఆస్ట్రేలియా)సొంతం చేసుకున్నాడు. ఫైనల్లో రోజర్ ఫెదరర్‌ను హెవిట్ మట్టికరిపించాడు. నాదల్కు ఖతార్ ఓపెన్ ఖతార్ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను రఫెల్‌నాదల్ (స్పెయిన్) గెలుచుకున్నాడు. దోహాలో జనవరి 5న జరిగిన ఫైనల్లో గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)ను నాదల్ ఓడించాడు. ఫ్రాన్స్‌కు హాఫ్మన్కప్ హాఫ్మన్కప్ మిక్స్డ్ టీమ్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌ను ఫ్రాన్స్ గెలుచుకుంది. పెర్త్‌లో జనవరి 5న జరిగిన ైఫైనల్లో పోలెండ్‌పై విజయం సాధించింది. అండర్-19 ఆసియాకప్ క్రికెట్ విజేత భారత్ షార్జా వేదికగా జరిగిన అండర్-19 ఆసియాకప్ క్రికెట్ విజేతగా భారత్ నిలిచింది. జనవరి 4న ఫైనల్లో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. భారత్ ఈ టైటిల్ గెలుచుకోవడం రెండోసారి. 2012లో భారత్-పాక్ సంయుక్త విజేతలుగా నిలిచాయి. బాస్కెట్‌బాల్ ఆటగాడు ఖుషిరామ్ మృతి ఒకనాటి ప్రముఖ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు ఖుషిరామ్(77) న్యూఢిల్లీలో 2013 డిసెంబర్ 29న మరణించారు. 1967లో ఆయనకు అర్జున అవార్డు లభించింది. 1970 మనీలా ఆసియన్ ఛాంపియన్‌షిప్‌లో ఖుషిరామ్ను అత్యంత విలువైన ఆటగాడు అవార్డు వరించింది. -
వ్యాపార నిర్వహణకు అనుకూల నగరం బెంగళూరు
2013 - ఆర్థిక రంగం 82వ బడ్జెట్ సమర్పణ.. ఆర్బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్.. తొలి మహిళా బ్యాంకు ప్రారంభం.. ఫోర్బ్స బిలియనీర్ల జాబితా.. వంటి అంశాలు ఆర్థికంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి చైర్మన్‌గా 14వ ఆర్థిక సంఘాన్ని జనవరి 2న కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జెనీవాలోని వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) జనవరి 8న విడుదల చేసిన నివేదిక ప్రకారం ప్రపంచంలో ఆర్థిక ప్రమాదాలను ఎదుర్కొనే సామర్థ్యంలో భారత్ 9వ స్థానంలోనూ, పర్యావరణ ప్రమాదాలను ఎదుర్కోవడంలో 10వ స్థానంలోనూ ఉంది. ఈ జాబితాలో స్విట్జర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) 43వ వార్షిక సదస్సు దావోస్ (స్విట్జర్లాండ్) లో జనవరి 23 నుంచి 27వరకు జరిగింది. 2011-12 సంవత్సరానికి స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును 6.2 శాతంగా (గతంలో దీన్ని 6.5 శాతంగా పేర్కొంది) కేంద్ర గణాంకాల సంస్థ(సీఎస్ఓ) అంచనా వేసింది. తాజా అంచనాలను జనవరి 31న విడుదల చేసింది. దీంతోపాటు అంతకుముందు రెండేళ్ల జీడీపీ వృద్ధి గణాంకాలను కూడా సవరించింది. దీని ప్రకారం 2010-11 లో వృద్ధిరేటు 8.4 శాతం నుంచి 9.3 శాతానికి పెరిగింది. భారతీయుల జీవన ప్రమాణాన్ని లెక్కించే సగటు నెలవారీ తలసరి ఆదాయం 2011-12 ఆర్థిక సంవత్సరంలో 13.7 శాతం వృద్ధితో రూ.5,130కు పెరిగిందని కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్ఓ) పేర్కొంది. 2010-11లో ఇది రూ.4,513. కాగా, ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే 2011-12లో వార్షిక తలసరి ఆదాయాన్ని రూ. 61,564గా సీఎస్ఓ అంచనా వేసింది. ప్రభుత్వ రంగ సంస్థలు భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (భెల్), గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) కు కేంద్ర ప్రభుత్వం మహారత్న హోదా కల్పించింది. దీంతో ఈ రెండు సంస్థలు రూ.5,000 కోట్ల వరకు పెట్టుబడులపై స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవచ్చు. 2012-13లో జీడీపీ వృద్ధి రేటు 5 శాతంగా ఉంటుందని కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్ఓ) ముందస్తు అంచనాల్లో ఫిబ్రవరి 7న తెలిపింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్(బీహెచ్ఈఎల్)లో భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెస్సల్స్ లిమిటెడ్ (బీహెచ్‌పీవీ) విలీనానికి ఫిబ్రవరి 21న కేంద్ర కేబినెట్ అనుమతించింది. 2012-13 ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఫిబ్రవరి 27న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ముఖ్యాంశాలు: 2013-14 ఆర్థిక సంవత్సరంలో 6.1-6.7 శాతం మేర స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు నమోదయ్యే అవకాశం ఉందనేది సర్వే అంచనా. అయితే, ఈ ఏడాది (2012-13) వృద్ధిరేటు 5 శాతానికి పరిమితం కావొచ్చని పేర్కొంది. బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ మార్చి 4న బిలియనీర్ల జాబితాను విడుదల చేసింది. భారతీయుల్లో కుబేరుడిగా ముకేష్ అంబానీ మళ్లీ టాప్ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నారు. లక్ష్మీ మిట్టల్ రెండో ర్యాంక్‌ను పొందారు. విప్రో అధినేత ప్రేమ్‌జీ 11.2 బిలియన్ డాలర్లతో మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. కాగా, ప్రపంచ కుబేరుల్లో మెక్సికన్ వ్యాపారవేత్త కార్లోస్ స్లిమ్ (73 బిలియన్ డాలర్లు) వరుసగా నాలుగోసారి అగ్రస్థానాన్ని పొందడం విశేషం. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్ (67 బిలియన్ డాలర్లు) రెండో స్థానంలో నిలిచారు. ఇంటర్నేషనల్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ (ఐసీసీ) ఉపాధ్యక్షునిగా భారతీ ఎంటర్ప్రైజెస్ సీఈఓ సునీల్ భారతీ మిట్టల్ ఎన్నికయ్యారు. భారత్ నుంచి ఈ పదవి చేపట్టిన మూడో వ్యక్తి మిట్టల్. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) భారత్ వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంక్ ఏప్రిల్ 30న కుదించింది. ఆరు నెలల క్రితం 7 శాతంగా ఉన్న అంచనాలను 6.1 శాతానికి తగ్గించింది. బ్రెజిల్‌కు చెందిన రాబెర్టో అజెవెడో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) డెరైక్టర్ జనరల్‌గా మే 8న నియమితులయ్యారు. డబ్ల్యూటీవో 1995, జనవరి 1న ఏర్పడింది. స్విట్జర్లాండ్‌లోని జెనీవా కేంద్రంగా పనిచేస్తోంది. ఇందులో 159 దేశాలకు సభ్యత్వముంది. ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కో ఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ (ఓఈసీడీ) 2013 సంవత్సరానికి భారత వృద్ధి అంచనాను 5.3 శాతానికి తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు వాస్తవ ప్రాతిపదికన 5.7 శాతం ఉండొచ్చని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది. 2014-15లో 6.5 శాతం, 2015-16లో 6.7 శాతం వృద్ధిరేటు ఉండొచ్చని పేర్కొంది. జి-20 దేశాల ఆర్థిక మంత్రులు, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశం మాస్కోలో జూలై 19-20 తేదీల్లో జరిగింది. ఆర్థిక వ్యవస్థల వృద్ధి పునరుత్తేజానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. నాయకత్వానికి ఉత్తమమైన పది ఆసియా కంపెనీల జాబితాలో టాటా గ్రూప్ నాలుగో స్థానంలో నిలిచింది. శామ్సంగ్ కంపెనీకి మొదటి స్థానం దక్కింది. అంతర్జాతీయ జాబితాలో చూస్తే ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో మైక్రోసాఫ్ట్, జనరల్ ఎలక్ట్రిక్, కోక-కోలాలు ఉన్నాయి. ప్రణాళిక సంఘం జూలై 23న విడుదల చేసిన అంచనాల ప్రకారం భారతదేశంలో 2011-12లో పేదరికం 21.9 శాతానికి తగ్గింది. ఇది 2004-05లో 37.2 శాతంగా ఉండేది. 2011-12లో పేదరికంలో ఉన్నవారి సంఖ్య 270 మిలియన్లు. అంటే ప్రతి ఐదుగురు భారతీయుల్లో ఒకరు దారిద్య్ర రేఖకు దిగువనున్నారు. వీరిలో గ్రామీణ ప్రాంతాల్లో 217 మిలియన్లు, పట్టణ ప్రాంతాల్లో 53 మిలియన్లు ఉన్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌గా ప్రముఖ ఆర్థిక వేత్త, కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా ఉన్న రఘురామ్ రాజన్ సెప్టెంబర్ 4న బాధ్యతలు స్వీకరించారు. పదవీ విరమణ చేసిన దువ్వూరి సుబ్బారావు స్థానంలో ఆర్బీఐ 23వ గవర్నర్‌గా రాజన్ నియమితులయ్యారు. 2013-14 ఆర్థిక అంచనాల నివేదికను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (పీఎంఏసీ) సెప్టెంబర్ 13న విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 5.3 శాతంగా పేర్కొంది. దీన్ని ఏప్రిల్‌లో 6.4 శాతంగా అంచనా వేసింది. వ్యవసాయ రంగం 4.8 శాతం, పారిశ్రామిక రంగం 2.7 శాతం వృద్ధి చెందుతాయని పేర్కొంది. సేవల రంగంలో వృద్ధి 6.6 శాతానికి తగ్గుతుందని తెలిపింది. ప్రవాసీయులు తమ స్వదేశాలకు పంపే నిధులు (రెమిటెన్సులు) పొందడంలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. 2013లో భారత్ 71 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు పొంది మొదటి స్థానంలో ఉందని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో అక్టోబర్ 3న తెలిపింది. చైనా 60 బిలియన్ డాలర్లు పొంది రెండో స్థానంలో నిలిచింది. భారత్ స్థూల దేశీయోత్పత్తి 2013లో కేవలం 3.75 శాతమేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) సంస్థ అంచనా వేసింది. క్రితం అంచనా (ఏప్రిల్‌లో) 5.7 శాతం. కాగా 2014లో వృద్ధిరేటు అంచనాను సైతం ఇంతకు ముందు ఉన్న 6.2 శాతం నుంచి 5 శాతానికి కుదించింది. 2050 నాటికి భారత్ 160 కోట్ల జనాభాతో ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశంగా అవతరించనుందని ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోగ్రఫిక్ స్టడీస్ తెలిపింది. ప్రపంచ జనాభా 2050 నాటికి 970 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 710 కోట్ల్లుగా ఉంది. అభివృద్ధి చెందిన దేశాల్లో 15.7 మిలియన్ల మంది ఆకలి బాధతో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థ తెలిపింది. అక్టోబర్ 2న విడుదల చేసిన ‘ప్రపంచంలో ఆహార భద్రత స్థితి - 2013’ అనే నివేదికలో 2011- 13లో మొత్తం 842 మిలియన్ల మంది ఆకలి బాధతో ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2013-14) భారత్ వృద్ధి రేటు కేవలం 4.7 శాతమేనని ప్రపంచబ్యాంక్ అంచనా వేసింది. గతంలో 6.1 శాతంగా వేసిన అంచనాలను కుదించింది. భారత్‌లో వ్యాపారాల నిర్వహణకు బెంగళూరు అత్యంత అనుకూలమైన నగరంగా అగ్రస్థానం దక్కించుకుంది. హైదరాబాద్ 12వ స్థానంలో, విశాఖపట్నం 21వ స్థానంలో నిలిచాయి. ఈ జాబితాలో బెంగళూరు తర్వాత చెన్నై, ముంబై, పుణే నగరాలు వరుసగా తర్వాత స్థానాలు దక్కించుకోగా ఢిల్లీకి అసలు చోటు దక్కలేదు. భారతీయ మహిళా బ్యాంకు తొలి శాఖను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నవంబర్ 19న ముంబైలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స ద్వారా చెన్నై, బెంగళూరు, గువాహటి, కోల్‌కతా, లక్నో, అహ్మదాబాద్ శాఖలను కూడా ప్రధాని ప్రారంభించారు. భారత వ్యాపార రంగంలో అత్యంత శక్తిమంతమైన 50 మంది మహిళల జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్ వరుసగా మూడోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. దేశీయ అతిపెద్ద జీవిత బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)కి మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉషా సంగ్వాన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచంలో వ్యాపారానికి ఉత్తమ దేశాల జాబితాను ఫోర్బ్స్ పత్రిక డిసెంబర్ 5న విడుదల చేసింది. 148 దేశాల జాబితాలో భారత్‌కు 98వ స్థానం దక్కింది. ఐర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌కు రెండో స్థానం, హాంగ్‌కాంగ్‌కు మూడో స్థానం లభించాయి. కేంద్ర బడ్జెట్: 2013-14 ముఖ్యాంశాలు 2013-14 కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పి.చిదంబరం ఫిబ్రవరి 28న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. చిదంబరం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టడం ఇది ఎనిమిదోసారి. తద్వారా ఆయన.. అత్యధిక బడ్జెట్లు సమర్పించిన రెండో ఆర్థిక మంత్రిగా ఘనత సాధించారు. ఈ జాబితాలో పది బడ్జెట్లతో మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తొలి స్థానంలో ఉన్నారు. మొత్తమ్మీద స్వతంత్ర భారతావనిలో ఇది 82వ బడ్జెట్. వీటిలో 66 సాధారణ వార్షిక బడ్జెట్లు కాగా, 12 తాత్కాలిక బడ్జెట్లు, ప్రత్యేక పరిస్థితుల్లో ప్రవేశపెట్టిన నాలుగు మినీ బడ్జెట్లు ఉన్నాయి. బడ్జెట్ వ్యయం: రూ. 16,65,297 కోట్లు రెవెన్యూ వసూళ్లు: రూ.10,56,331 కోట్లు మూల ధన వసూళ్లు: రూ.6,08, 967 కోట్లు ప్రణాళికా వ్యయం: రూ. 5,55,322 కోట్లు ప్రణాళికేతర వ్యయం: రూ. 11,09,975 కోట్లు రెవెన్యూ లోటు: రూ. 3,79,838 కోట్లు ద్రవ్య లోటు: రూ. 5,42,499 కోట్లు ప్రాథమిక లోటు: రూ. 1,71,814 కోట్లు వివిధ రంగాలకు కేటాయింపులు: రక్షణ వ్యయం: రూ. 2,03,672 కోట్లు గ్రామీణాభివృద్ధి: రూ. 80,194 కోట్లు వ్యవసాయం: రూ. 27,049 కోట్లు విద్య: రూ. 65,867 కోట్లు శాస్త్ర సాంకేతిక రంగం: రూ. 6,275 కోట్లు భారత జీడీపీ వృద్ధి రేటు 2013లో 5.9 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎంఎఫ్ విడుదల చేసిన వరల్డ్ ఎకనమిక్ అవుట్‌లుక్ నివేదిక పేర్కొంది. 2014లో ఈ రేటు 6.4 శాతంగా ఉంటుందని కూడా తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్‌పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్య అక్టోబర్ 7న నియమితులయ్యారు. బ్యాంక్ చరిత్రలో ఒక మహిళ ఈ అత్యున్నత స్థాయి బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి. -
విజయ సారథికి ‘వర్తమానం’!
నచ్చిన కోర్సులో ప్రవేశానికైనా, మెచ్చిన కొలువును అందుకోవడానికైనా పోటీ పరీక్షతో సమరానికి సిద్ధపడాల్సిందే! సరైన సన్నద్ధతనే అస్త్రంగా చేసుకొని, మెరుగైన ‘స్కోర్’ను గురిచూసి కొట్టినప్పుడే విజయం సొంతమవుతుంది. ప్రస్తుత పోటీ పరీక్షల్లోని ప్రశ్నలు చాలా వరకు సమకాలీన అంశాల ఆధారంగానే ఇస్తున్నందున కరెంట్ అఫైర్స్ విభాగానికి ప్రాధాన్యం పెరిగిన తరుణంలో దీనిపై స్పెషల్ ఫోకస్.. దేశంలో నిర్వహించే దాదాపు అన్ని పోటీ పరీక్షల్లో వర్తమాన అంశాలకు (కరెంట్ అఫైర్స్) ప్రాధాన్యం ఉంటోంది. జనరల్ స్టడీస్ లేదా జనరల్ అవేర్నెస్ విభాగంలో కరెంట్ అఫైర్స్ కీలకమైన విభాగం. పోటీ పరీక్షల్లో మంచి మార్కులు సాధించాలంటే ఈ విభాగంపై పట్టు సాధించాల్సిందే! సివిల్ సర్వీసెస్, యూపీఎస్సీ నిర్వహించే ఇతర పరీక్షలు; గ్రూప్-1, గ్రూప్-2, ఇతర ఏపీపీఎస్సీ పరీక్షలు; డీఎస్సీ; ఎసై్స; కానిస్టేబుల్; ఐబీపీఎస్; వీఆర్వో- వీఆర్ఏ; సా్‌టఫ్ సెలక్షన్ కమిషన్ తదితర పరీక్షల్లో కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఉంటుంది. కేవలం ఉద్యోగ నియామకాల పరీక్షల్లోనే కాకుండా.. క్లాట్, మ్యాట్, సీమ్యాట్ వంటి కోర్సుల ప్రవేశ పరీక్షల్లోనూ కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన ప్రశ్నలు వస్తున్నాయి. నిత్య నూతనంగా మన చుట్టూ నిత్యం జరిగే విషయాలే కరెంట్ అఫైర్స్. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచం ఒక గ్లోబల్ విలేజ్‌గా మారిపోయింది. ఏ మూల ఏ సంఘటన జరిగినా అది ప్రపంచం మొత్తంమీద ఏదో ఒక రూపంలో ప్రభావం చూపుతుంది. జాతి వివక్షపై పోరాటం చేసి, నల్లజాతి ప్రజల హృదయాల్లో చోటు సంపాదించిన నెల్సన్ మండేలా 2013, డిసెంబర్ 5న మరణించారు. ఆయన దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తి అయినప్పటికీ, అన్ని దేశాల ప్రజలను ప్రభావితం చేసిన మహా మనిషి. ఇలాంటి వర్తమాన వ్యవహారాల ఆధారంగా పోటీ పరీక్షల్లో ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల ఏదైనా ఒక ముఖ్య సంఘటన చోటుచేసుకున్నప్పుడు దాన్ని అన్ని కోణాల్లోనూ అధ్యయనం చేయాలి. అప్పుడే సంబంధిత అంశం నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా కచ్చితమైన సమాధానం రాసేందుకు వీలవుతుంది. ఉదాహరణకు మండేలా గురించి చదివేటప్పుడు ఈ కింది అంశాలను తప్పకుండా గుర్తించాలి. మండేలా దక్షిణాఫ్రికాకు తొలి నల్లజాతి అధ్యక్షుడు. జాతి వివక్షపై అలుపెరుగని పోరాటం చేసినందుకు దక్షిణాఫ్రికా ప్రభుత్వం మండేలాను జైలుకు పంపింది. ఆయన రాబెన్ దీవి జైల్లో 27 ఏళ్లు గడిపారు. శ్వేతజాతి ప్రభుత్వంపై అంతర్జాతీయ ఆంక్షల ఫలితంగా 1990, ఫిబ్రవరి 11న మండేలాను జైలు నుంచి విడుదల చేశారు. అప్పటి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఎఫ్.డబ్ల్యూ.డి. క్లార్క్.. మండేలా పార్టీ ‘ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్’పై నిషేధాన్ని ఎత్తివేశారు. 1990లో భారత్.. మండేలాకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది. 1993లో మండేలా, ఎఫ్.డబ్ల్యూ.డి.క్లార్క్‌కు సంయుక్తం గా నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1994లో జరిగిన ఎన్నికల్లో గెలిచి, దక్షిణాఫ్రికాకు తొలి నల్లజాతి అధ్యక్షుడయ్యారు. దేశాన్ని 1999 వరకు పరిపాలించారు. మండేలా ఆత్మకథ.. ‘లాంగ్ వాక్ టు ఫ్రీడం’. ఐక్యరాజ్య సమితి మండేలా జన్మదినమైన జూలై 18ని నెల్సన్ మండేలా దినోత్సవంగా ప్రకటించింది. ఆకాశమే హద్దు కరెంట్ అఫైర్స్‌కు నిర్దేశిత సిలబస్ అంటూ ఉండదు. ప్రపంచంలో ఏ మూల ఏ సంఘటన జరిగినా, దాన్నుంచి ప్రశ్న రావొచ్చు. కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించాలంటే రోజూ వార్తా పత్రికలు చదవడం తప్పనిసరి. పరీక్షకు ముందు ఏడాది కాలంలో జరిగిన సంఘటనలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. ప్రామాణిక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లను ఎంపిక చేసుకొని,చదవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పోటీ పరీక్షలను బట్టి కరెంట్ అఫైర్స్ ప్రశ్నల సరళి, క్లిష్టత మారుతుంది. అయితే ప్రధానంగా ఈ కింది విభాగాల సమకాలీన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ ముఖ్య సంఘటనలు. వాణిజ్య వ్యవహారాలు. సైన్స్ అండ్ టెక్నాలజీ. పర్యావరణం. వార్తల్లో వ్యక్తులు. రాజకీయ సంఘటనలు. భౌగోళిక ప్రాధాన్య ప్రదేశాలు. రాష్ట్ర స్థాయి, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు. క్రీడల సమాచారం. దేశాల మధ్య కుదిరిన ఒప్పందాలు; అంతర్జాతీయ సదస్సులు తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. పరిధి ఆధారంగా ప్రిపరేషన్ పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ విభాగంలో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో తెలుసుకొని,దానికి అనుగుణంగా సిద్ధంకావాలి. ఇందుకోసం గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి ప్రశ్నల సరళిని, వాటి క్లిష్టతను పరిశీలించాలి. బ్యాంకు పరీక్షల్లో ఎక్కువగా బ్యాంకింగ్, ఇతర ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు అడుగుతారు. ప్రభుత్వాల వార్షిక బడ్జెట్లు, ఆర్థిక సర్వేలు, ప్రభుత్వ పథకాలు, ఆర్బీఐ ప్రకటించే పాలసీ రేట్లు, పంచవర్ష ప్రణాళికలు, వివిధ కమిషన్లు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి వంటి అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పోటీ పరీక్షలకు జాతీయ, అంతర్జాతీయ అంశాలతో పాటు రాష్ట్రస్థాయి సంఘటనలను కూడా చదవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, సంక్షేమ పథకాలు, పురస్కారాలు వంటి వాటిని చదవాలి. కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధిస్తే సివిల్స్, గ్రూప్-1 పరీక్షల్లో ఎస్సే పేపర్లో మంచి మార్కులు సాధించవచ్చు. సాధారణంగా ఎస్సే పేపర్లో వచ్చే ప్రశ్నలు ఎక్కువగా వర్తమాన అంశాలకు సంబంధించినవే ఉంటాయి. ప్రస్తుతానికి చూస్తే యూరోజోన్ సంక్షోభం, చిల్లర వ్యాపారంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, నిర్భయ సంఘటన నేపథ్యంలో దేశంలో మహిళల భద్రత వంటి అంశాలపై ఎస్సే పేపర్లో ప్రశ్నలు రావొచ్చు. అభ్యర్థి ఎదుర్కొనే పోటీ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ కరెంట్ అఫైర్స్‌కు సిద్ధమవుతున్నప్పుడు కేవలం బిట్లకే పరిమితం కాకూడదు. అంశాన్ని వివిధ కోణాల్లో అధ్యయనం చేయాలి. దీనివల్ల ఇంటర్వ్యూలోనూ మెరుగైన ఫలితాలు సాధ్యమవుతాయి. 1 వివిధ పోటీ పరీక్షలకు సంబంధించి కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించేందుకు తప్పకుండా వార్తా పత్రికలను చదవాలి. దీనికోసం కనీసం గంట సమయాన్ని కేటాయించాలి. 2 పత్రికలను చదివేటప్పుడు ముఖ్యాంశాలతో సొంతంగా నోట్స్‌ను రూపొందించుకోవాలి. దీన్ని ప్రతి వారం తప్పనిసరిగా పునశ్చరణ (రివిజన్) చేయాలి. ఇంటర్నెట్ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. 3 సబ్జెక్టు నిపుణులు, పోటీ పరీక్షల్లో విజేతలుగా నిలిచిన వారి సలహా మేరకు మార్కెట్లో లభించే ఒక కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్‌ను చదవాలి. 4 అభ్యర్థి రాసే పోటీ పరీక్షకు అనుగుణంగా కొన్ని ప్రత్యేకమైన పత్రికలు, మేగజైన్‌ను చదవాలి (ఉదాహరణకు బ్యాంకు పరీక్షలకు సిద్ధమయ్యేవారు బ్యాంకింగ్ సర్వీస్ క్రానికల్ను చదివితే మంచిది). ఎన్. విజయేందర్ రెడ్డి జనరల్ అవేర్నెస్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. దినపత్రికలను చదవడం ప్రధానం ఏపీపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించేందుకు జనరల్ స్టడీస్ పేపర్ కీలకమైంది. ఇందులో 30-35 వరకు కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు వస్తాయి. ఎన్ని పనులున్నప్పటికీ రోజువారీ ప్రిపరేషన్ టైంటేబుల్లో గంటన్నర సమయాన్ని కరెంట్ అఫైర్స్ కోసం కేటాయించాలి. రెండు ప్రామాణిక దినపత్రికలను ఎడిటోరియల్స్తో సహా చదివి, సొంతంగా నోట్స్ తయారు చేసుకోవాలి. ఒక మేగజైన్‌ను చదవటం వల్ల కొంత అదనపు సమాచారం లభిస్తుంది. పరీక్షకు నెల రోజుల ముందు ప్రచురణ సంస్థలు విడుదల చేసే కరెంట్ అఫైర్స్ పుస్తకాలు మెరుగైన పునశ్చరణకు par ఉపకరిస్తాయి.ఙ- ఎస్. భానుమూర్తి, ఏసీటీవో, విజయనగరం. -
లోక్‌పాల్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం లోక్‌పాల్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం అత్యున్నత స్థాయిలో అవినీతిని నిర్మూలించేందుకు ఉద్దేశించిన లోక్‌పాల్, లోకాయుక్తల ఏర్పాటు బిల్లు -2011కు పార్లమెంట్ డిసెంబర్ 18న ఆమోదం తెలిపింది. ఈ బిల్లును రాజ్యసభ డిసెంబర్ 17న, లోక్‌సభ డిసెంబర్ 18న ఆమోదించాయి. ఈ బిల్లు ప్రకారం కేంద్ర స్థాయిలో స్వతంత్ర దర్యాప్తు సంస్థ లోక్‌పాల్‌ను ఏర్పాటు చేస్తారు. లోక్‌పాల్ ఏర్పాటైన ఏడాదిలోగా రాష్ట్రాలు లోకాయుక్తలను ఏర్పాటు చేస్తూ చట్టం తీసుకురావాల్సి ఉంటుంది. ప్రధానమంత్రి (కొన్ని పరిమితులు మినహా), మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ సంస్థలు లోక్‌పాల్ పరిధిలోకి వస్తాయి. లోక్‌పాల్‌లో చైర్‌పర్సన్‌తోపాటు గరిష్టంగా ఎనిమిదిమంది సభ్యులు ఉంటారు. వీరి పదవీకాలం ఐదేళ్లు లేదా 75 ఏళ్ల వయసు వచ్చే వరకు కొనసాగుతారు. వీరిని ప్రధానమంత్రి, స్పీకర్, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తి లేదా ఆయన నియమించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తితో కూడిన కమిటీ నియమిస్తుంది. సీఐసీగా బాధ్యతలు స్వీకరించిన సుష్మాసింగ్ కేంద్ర నూతన ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా మాజీ ఐఏఎస్ అధికారి సుష్మాసింగ్ బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 19న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రస్తుత సీఐసీ దీపక్ సంధూ పదవీ కాలం ముగియడంతో ఆమె స్థానంలో సుష్మా సింగ్‌ను ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కేంద్ర న్యాయ శాఖ మంత్రితో కూడిన ప్యానెల్ ఎంపిక చేసింది. సుష్మాసింగ్ 2009, సెప్టెంబర్ 23 నుంచి కేంద్ర సమాచార కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆమె అంతకుముందు కేంద్ర ప్రభుత్వంలో పంచాయతీరాజ్, సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల్లో కార్యదర్శిగా పనిచేశారు. ఆమె కాకుండా మరో ఎనిమిదిమంది సమాచార కమిషనర్లు ఉన్నారు. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద వచ్చే అప్పీళ్లు, ఫిర్యాదులను సీఐసీ పరిష్కరిస్తారు. ప్రభుత్వ శాఖలు, ఇతర ప్రభుత్వ సంస్థలకు సంబంధించి ప్రజలు కోరిన సమాచారంపై ఈ అప్పీళ్లు, ఫిర్యాదులు ఉంటాయి. వైమానిక దళంలో ప్రవేశానికి ఎల్సీఏ తేజస్‌కు అనుమతి భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన అధునాతన తేలికపాటి యుద్ధ విమానం (ఎల్సీఏ) ‘తేజస్’ను వైమానిక దళంలో ప్రవేశపెట్టేందుకు ప్రాథమిక అనుమతి లభించింది. బెంగళూరులోని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)లో డిసెంబర్ 20న తేజస్‌ను వాయుసేనకు అప్పగించేందుకుగాను ‘రిలీజ్ టు సర్వీస్’ ధ్రువపత్రాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ ఎన్ఏకే బ్రౌనేకు రక్షణ మంత్రి ఎ.కె. ఆంటోనీ అందజేశారు. ఈ అత్యాధునిక తేలికపాటి యుద్ధ విమానాన్ని మిగ్-21 స్థానంలో ప్రవేశపెడతారు. తద్వారా స్వదేశీయంగా ఎల్‌సీఏలను తయారుచేయగలిగిన అతికొద్ది దేశాల్లో భారత్ కూడా ఒకటిగా నిలుస్తోంది. 2014 చివరినాటికి తేజస్‌కు తుది నిర్వహణ అనుమతి (ఎఫ్‌వోసీ) లభిస్తుంది. దీనికోసం రక్షణ శాఖ 1983లో రూ.560 కోట్లతో ప్రాజెక్టు ప్రారంభించింది. అయితే ఈ వ్యయం ఇప్పటికే రూ.25,000 కోట్లకు చేరుకుంది. అగ్ని -3 క్షిపణి పరీక్ష విజయవంతం వినియోగ పరీక్షల్లో భాగంగా అణు సామర్థ్యం గల అగ్ని-3 క్షిపణిని సైన్యానికి చెందిన వ్యూహాత్మక దళాల కమాండ్ డిసెంబర్ 23న ఒడిశా తీరంలో వీలర్ ఐలాండ్‌లో విజయవంతంగా పరీక్షించింది. ఇది దేశీయంగా అభివృద్ధి చేసిన ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణి. ఈ క్షిపణి 3,000 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. బరువు 48.3 టన్నులు. ఎత్తు 16.7 మీటర్లు, వ్యాసం 1.8 మీటర్లు. ఇది 1.5 టన్నుల బరువు ఉన్న సంప్రదాయ, సంప్రదాయేతర ఆయుధాలను మోసుకుపోగలదు. 2006, జూలైలో జరిపిన మొదటి పరీక్ష విఫలమైంది. తర్వాత 2007, 2008, 2010 పరీక్షలు విజయవంతమయ్యాయి. 1983లో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ గెడైడ్ మిస్సైల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా అగ్ని సిరీస్ క్షిపణులను అభివృద్ధి చేస్తున్నారు. ప్రముఖ జర్నలిస్టు ప్రాణ్ చోప్రా మృతి ప్రముఖ పాత్రికేయుడు, ద స్టేట్స్‌మన్ తొలి ఎడిటర్ ప్రాణ్ చోప్రా (92) డిసెంబర్ 22న కన్నుమూశారు. 1921లో లాహోర్‌లో జన్మించిన ఆయన 1941లో పాత్రికేయ వృత్తిలోకి ప్రవేశించారు. చైనా, వియత్నాంలలో 1940లలో ఆల్ ఇండియా రేడియోకు ప్రతినిధిగా పనిచేశారు. పాకిస్థాన్ మాజీ ప్రధాని జుల్ఫీకర్ అలీ భుట్టో రాసిన ‘ఇఫ్ అయామ్ అసాసినేటెడ్ (నేను హత్యకు గురైతే)’ పుస్తకానికి ప్రాణ్ ముందుమాట రాశారు. ప్రాణ్ రాసిన పలు పుస్తకాలు కూడా ప్రసిద్ధి పొందాయి. మణిపూర్ గవర్నర్‌గా వీకే దుగ్గల్ కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి వీకే దుగ్గల్(68) డిసెంబర్ 23న మణిపూర్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఈ ఏడాది జూలైలో ఖాళీ అయిన మణిపూర్ గవర్నర్ స్థానంలో దుగ్గల్‌ను నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నిర్ణయం తీసుకున్నారు. ఇంతకుముందు దుగ్గల్ ఢిల్లీ మునిసిపల్ కమిషనర్‌గా, కేంద్ర జలవనరుల శాఖలో కార్యదర్శిగా, పలు కమిషన్లలో సభ్యుడిగా విశేష సేవలందించారు. తెలంగాణపై ఏర్పాటైన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీలో దుగ్గల్ సభ్య కార్యదర్శిగా ప్రముఖ పాత్ర పోషించారు. కిషన్‌గంగ నదీజలాలపై భారత్‌కు ఊరట కిషన్‌గంగ నదీ జలాలను జమ్మూకాశ్మీర్‌లో విద్యుదుత్పాదన కోసం మళ్లించేందుకు భారత్‌కు గల హక్కును హేగ్‌లోని అంతర్జాతీయ మధ్యవర్తిత్వం కోర్టు సమర్థించింది. ఈ విషయంలో పాకిస్థాన్ అభ్యంతరాలను కొట్టివేసింది. ఈ మేరకు భారత్ - పాక్‌ల మధ్యవర్తిత్వం కేసులో డిసెంబర్ 20న తుది తీర్పు ఇచ్చింది. కిషన్‌గంగ జలవిద్యుత్ ప్రాజెక్టు దిగువకు కిషన్‌గంగ/నీలం నదిలోకి కనీసం 9 క్యూమెక్‌ల (సెకనుకు క్యూబిక్ మీటర్లు) నీటిని భారత్ నిరంతరం వదిలిపెట్టాలని కూడా ఈ తీర్పులో నిర్ణయించింది. అంతర్జాతీయం చిలీ అధ్యక్షురాలిగా మిచెల్ బాషెలెట్ చిలీ అధ్యక్షురాలిగా సోషలిస్టు పార్టీ నాయకురాలు మిచెల్ బాషెలెట్ డిసెంబర్ 15న ఎన్నికయ్యారు. దేశంలో సామాజిక అసమానతలు తగ్గించేందుకు భారీస్థాయిలో పన్ను, విద్యా సంస్కరణలు తీసుకొస్తానని ఆమె వాగ్దానం చేశారు. అధ్యక్ష ఎన్నికల్లో ఆమెకు 62 శాతం ఓటర్ల మద్దతు లభించింది. 1989లో తిరిగి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరగడం మొదలైన తర్వాత అధ్యక్ష అభ్యర్థికి ఇంత భారీ మద్దతు లభించడం ఇదే తొలిసారి. ఎకే 47 సృష్టికర్త కలష్నికోవ్ మృతి ఎకే-47 ఆటోమేటిక్ రైఫిల్ సృష్టికర్త మిఖైల్ కలష్నికోవ్ (94) రష్యాలోని ఉద్ముర్షియాలో డిసెంబర్ 23న మరణించారు. ఆయన 1947లో ఆ రైఫిల్‌ను రూపొందించడంతో ఎకే 47గా పేరు పెట్టారు. ఈ అత్యాధునిక ఆయుధాన్ని రూపొందించినందుకు కలష్నికోవ్కు ప్రతిష్టాత్మకమైన ‘హీరో ఆఫ్ రష్యా’ ప్రైజ్ లభించింది. 100 మిలియన్లకుపైగా ఈ రైఫిల్స్ ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోయాయి. వీటిని ఇరాక్, అప్ఘానిస్థాన్, సోమాలియా వంటి పోరాట ప్రాంతాల్లో వాడుతున్నారు. కృత్రిమ గుండెను అమర్చిన ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు 75 సంవత్సరాల వ్యక్తికి ఫ్రెంచ్ శాస్త్రవేత్తలు తొలిసారిగా కృత్రిమ గుండెను విజయవంతంగా డిసెంబర్ 20న అమర్చారు. ఫ్రాన్స్‌కు చెందిన బయోమెడికల్ సంస్థ కార్మట్ ఈ కృత్రిమ గుండెను రూపొందించింది. లిథూయం ఐయాన్ బ్యాటరీలు ఉపయోగించిన గుండెను డచ్‌కు చెందిన యూరోపియన్ ఏరోనాటిక్స్ డిఫెన్స్ అండ్ స్పేస్ కంపెనీ అభివృద్ధి చేసింది. ఈ గుండె రోగికి ఐదేళ్ల అదనపు జీవితాన్నిస్తుంది. దీని బరువు దాదాపు కిలోగ్రాము ఉంటుంది. ఇది ఆరోగ్యవంతమైన మనిషి గుండెకంటే మూడింతలు ఎక్కువ. ఆపరేషన్‌కు నాయకత్వం వహించిన డా.అలైన్ కార్పెంటైర్ ఈ గుండె అభివృద్ధికి 25 ఏళ్లపాటు కృషి చేశారు. గతంలో రూపొందించిన కృత్రిమ గుండెలను ఆపరేషన్ సమయంలో తాత్కాలిక అవసరాలకు మాత్రమే ఉపయోగించేవారు. మూడోసారి జర్మనీ చాన్సలర్‌గా మెర్కెల్ జర్మనీ చాన్సలర్‌గా ఏంజెలా మెర్కెల్ డిసెంబర్ 17న ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె చాన్సలర్‌గా ఎన్నికవడం ఇది మూడోసారి. ఆమె నాలుగేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. సెప్టెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో మెర్కెల్‌కు చెందిన సంప్రదాయ క్రిస్టియన్ డెమోక్రాట్స్ యూనియున్ (సీడీయూ) పూర్తి మెజారిటీ సాధించలేకపోవడంతో రాజకీయ అనిశ్చితి నెలకొంది. దీంతో ప్రతిపక్ష సోషల్ డెమోక్రటిక్ పార్టీ (ఎస్పీడీ)తో కలిసి ఒప్పందం చేసుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రీయం కాత్యాయని విద్మహేకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తెలుగు స్త్రీవాద సాహిత్య విమర్శకురాలు, కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు ప్రొఫెసర్ కాత్యాయని విద్మహే 2013 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. సాహిత్యాకాశంలో సగం - స్త్రీల అస్తిత్వ సాహిత్యం, కవిత్వం, కథ అనే సాహిత్య విమర్శ గ్రంథానికిగాను ఆమెకు ఈ అవార్డు దక్కింది. ఈ పురస్కారానికి ఎంపికైన 22 భాషలకు చెందిన రచయితల పేర్లను డిసెంబర్ 18న కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. అవార్డును 2014, మార్చి 11న గ్రహీతలకు ప్రదానం చేస్తారు. అవార్డు కింద జ్ఞాపిక, ప్రశంసపత్రం, రూ. లక్ష నగదు బహూకరిస్తారు. పెప్సికో బేవరేజ్ సంస్థకు సీఎం శంకుస్థాపన చిత్తూరు జిల్లా శ్రీ సిటీలో రూ.1200 కోట్లతో పెప్సికో సంస్థ ఏర్పాటుచేసే శీతల పానీయాల పరిశ్రమకు ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి డిసెంబర్ 21న హైదరాబాద్‌లో శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులో మూడు దఫాలుగా పెప్సీకో సంస్థ పెట్టుబడులు పెడుతుంది. రోజుకు 3.6 లక్షల లీటర్ల సామర్థ్యం గల ఉత్పత్తి కేంద్రాన్ని నెలకొల్పుతుంది. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం సంతరించుకుంటే ప్రత్యక్షంగా, పరోక్షంగా 8000 మందికి ఉపాధి లభిస్తుంది. దేశంలో పెప్సికో సంస్థ ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో శ్రీ సిటీలో నెలకొల్పే పరిశ్రమ అతిపెద్దది కానుంది. వంశధార నుంచి శ్రీకాకుళంకు 8 టీఎంసీల నీటికి అనుమతి శ్రీకాకుళంలో కాట్రగడ్డ వద్ద వంశధార నది నీటిని వాడుకొనేందుకు మళ్లింపు కాలువ నిర్మాణానికి ఆంధ్రప్రదేశ్‌కు వంశధార ట్రిబ్యునల్ అనుమతినిచ్చింది. ఈ అడ్డుగోడ (సైడ్ వీయర్) నిర్మాణాన్ని అడ్డుకుంటూ ఒడిశా చేసిన అభ్యంతరాలను తోసిపుచ్చుతూ వంశధార జల వివాదాల ట్రిబ్యునల్ డిసెంబర్ 17న తీర్పునిచ్చింది. ఈ తీర్పు వల్ల ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో 8 టీఎంసీల నీటిని అదనంగా వాడుకోవడానికి తద్వారా 50 వేల ఎకరాలకు నీటి సౌకర్యం కల్పించేందుకు వీలవుతుంది. వంశధార ఒడిశాలో జన్మించి ఆ రాష్ట్రంలో 154 కిలోమీటర్లు, ఒడిశా - ఆంధ్ర సరిహద్దులో 29 కి.మీ, ఆంధ్రప్రదేశ్‌లో 82 కి.మీ ప్రవహిస్తోంది. ఈ నదీ జలాలను సమానంగా పంచుకోవాలని ఇరు రాష్ట్రాల మధ్య 1962, సెప్టెంబర్ 30న ఒప్పందం కుదిరింది. క్రీడలు కపిల్‌దేవ్‌కు కల్నల్ సి.కె.నాయుడు అవార్డు భారత క్రికెట్ మాజీ కెప్టెన్ కపిల్ దేవ్‌ను 2013 సంవత్సరానికి సి.కె.నాయుడు జీవిత కాల సాఫల్య పురస్కారానికి బీసీసీఐ ఎంపిక చేసింది. ఈ అవార్డు కింద ప్రశంస పత్రం, రూ.25 లక్షల నగదు బహూకరిస్తారు. కపిల్ 1978- 94 మధ్య కాలంలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. టెస్టుల్లో 5,000 పరుగులు, 400 వికెట్లు తీసిన తొలి క్రీడాకారుడిగా రికార్డు నెలకొల్పారు. మొత్తం 131 టెస్టులు ఆడి 5248 పరుగులు చేసి, 434 వికెట్లు తీశారు. 225 వన్డేల్లో 253 వికెట్లు తీసి, 3,783 పరుగులు చేశారు. తన కెప్టెన్సీలో 1983లో తొలిసారి భారత్‌కు ప్రపంచ్‌కప్‌ను సాధించి పెట్టారు. కల్నల్ సి.కె. నాయుడు అవార్డు 2010లో సలీం దురానీకి, 2011లో అజిత్ వాడేకర్‌కు, 2012లో సునీల్ గవాస్కర్‌కు లభించింది. అత్యధిక టెస్టులకు కెప్టెన్‌గా ధోని రికార్డు భారత్ తరపున 50 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించి ఎంఎస్ ధోని రికార్డు నెలకొల్పాడు. డిసెంబర్ 18న జోహన్నెస్‌బర్గ్‌లో మొదలైన తొలి టెస్టు అతనికి 50వది. ఇంతకు ముందు ఈ రికార్డు సౌరవ్ గంగూలీ పేరిట ఉంది. గంగూలీ మొత్తం 49 టెస్టుల్లో భారత్‌కు నాయకత్వం వహించాడు. ఏఐఎఫ్ఎఫ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా సునీల్ ఛెత్రి భారత ఫుట్‌బాల్ టీం కెప్టెన్ సునీల్ ఛెత్రి ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా ఎంపికయ్యాడు. ఈ అవార్డు 2007, 2011లో కూడా ఛెత్రికి దక్కింది. అవార్డు కింద రూ. 2 లక్షలు, ట్రోఫీ బహూకరిస్తారు. ఉమెన్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు బెంబెమ్ దేవి ఎంపికైంది. శ్రీకాంత్, సింధులకు జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ టైటిల్స్ జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ న్యూఢిల్లీలో డిసెంబర్ 23న ముగిసింది. విజేతలు: పురుషుల సింగిల్స్: ఈ టైటిల్‌ను కె.శ్రీకాంత్ గెలుచుకున్నాడు. ఫైనల్స్‌లో గురుసాయిదత్‌ను ఓడించాడు. మహిళల సింగిల్స్: ఈ టైటిల్‌ను పీవీ సింధు గెలుచుకుంది. ఫైనల్స్‌లో రీతూపర్ణదాస్‌ను ఓడించింది. సింధుకు ఇది రెండో మహిళల టైటిల్. పురుషుల డబుల్స్: ప్రణవ్ చోప్రా, అక్షయ్ దివాల్కర్ గెలుచుకున్నారు. వీరు ఫైనల్స్‌లో సుమీత్ రెడ్డి, మనూ అత్రిలను ఓడించారు. మహిళల డబుల్స్: గుత్తా జ్వాల, అశ్వినీ పొన్నప్ప గెలుచుకున్నారు. వీరు ఫైనల్స్‌లో సిక్కి రెడ్డి, ప్రద్న్యా గాద్రెలను ఓడించారు. జ్వాలకిది 14వ జాతీయ డబుల్స్ టైటిల్. మిక్స్డ్ డబుల్స్: అరుణ్ విష్ణు, అపర్ణా బాలన్ జోడి.. తరుణ్, అశ్విని జోడిని ఓడించి టైటిల్ గెలుచుకున్నారు. -
టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా పోప్ ఫ్రాన్సిస్
జాతీయం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా శివరాజ్‌సింగ్ చౌహాన్ వరుసగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 230 స్థానాల మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 165 సీట్లు దక్కించుకుంది. మంత్రుల ప్రవర్తనా నియమావళికి కేంద్ర కేబినెట్ ఆమోదం రాజకీయ ఒత్తిళ్ల నుంచి ఉద్యోగస్తులకు రక్షణ కల్పించేందుకు ఉద్దేశించిన కేంద్ర, రాష్ట్ర మంత్రుల ప్రవర్తనా నియమావళికి చేసిన సవరణలకు కేంద్ర కేబినెట్ డిసెంబర్ 12న ఆమోదం తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులు నిష్పక్షపాతంగా, తటస్థంగా వ్యవహరించాలన్న దానికి కార్యనిర్వాహక వర్గం కట్టుబడి ఉండాలనే క్లాజును సవరణ ద్వారా చేర్చారు. ఈ సవరణలు కేంద్ర స్థాయిలో వెంటనే అమల్లోకి వస్తాయి. తర్వాత రాష్ట్రస్థాయిలోనూ అమలు చేయాలని కోరతారు. ఈ సవరణలు నిర్ణయాలు తీసుకోవడంలో అధికారులను మంత్రులు ఒత్తిడి చేయకుండా అడ్డుకుంటాయి. అధికారులను ప్రలోభపెట్టే బదిలీలు, పోస్టింగ్‌లను అడ్డుకోవడంలో ఈ నియమావళి సవరణలు దోహదం చేయనున్నాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధర రాజే ప్రమాణ స్వీకారం రాజస్థాన్ ముఖ్యమంత్రిగా వసుంధర రాజే డిసెంబర్ 12న ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె ముఖ్యమంత్రిగా ఎన్నికవడం ఇది రెండోసారి. నవంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఆమె నాయకత్వంలోని బీజేపీ 200 స్థానాలకుగాను 163 స్థానాలు గెలుచుకుంది. ఆమె 2003 నుంచి 2008 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. నాబార్డ చైర్మన్‌గా హర్షకుమార్ భన్వాలా నియామకం జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ) చైర్మన్‌గా డిసెంబర్ 15న హర్షకుమార్ భన్వాలా నియమితులయ్యారు. సెప్టెంబర్‌లో పదవీ విరమణ చేసిన ప్రకాశ్ భక్షీ స్థానంలో హర్షకుమార్ బాధ్యతలు చేపడతారు. ఆయన ఇంతవరకూ ప్రభుత్వరంగ సంస్థ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స కంపెనీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా పనిచేశారు. సచివాలయం - మండలాల మధ్య వీడియో అనుసంధానం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మండలాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు హైడెఫినిషన్ వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్ (ఏపీస్వాన్) ద్వారా అనుసంధానం చేసే ఈ సౌకర్యాన్ని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి డిసెంబర్ 9న హైదరాబాద్‌లో ప్రారంభించారు. దీంతో ఇటువంటి సౌకర్యం గల మొదటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. ఈ వ్యవస్థ రాష్ట్ర రాజధానిని 23 జిల్లాలు, 1126 మండల కార్యాలయాలతో అనుసంధానం చేస్తుంది. దేశంలోనే అతిపెద్దదైన ఈ వ్యవస్థ ప్రభుత్వ నిర్వహణలో పారదర్శకతను తీసుకువస్తుందని, సంక్షేమ పథకాల సమీక్షకు, ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వానికి తోడ్పడుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో 2000లోనే అన్ని జిల్లా కేంద్రాలకు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం కల్పించారు. స్వలింగ వివాహాలను తప్పుబట్టిన సుప్రీంకోర్టు స్వలింగ లైంగిక సంబంధాలు నేరం కాదన్న 2009 నాటి ఢిల్లీ కోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. స్వలింగ సంపర్కం శిక్షించదగ్గ నేరమన్న భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 377ను కోర్టు సమర్థించింది. దీన్ని తొలగించే అధికారం పార్లమెంటుకు ఉంది. ఈ సెక్షన్ కొనసాగుతున్నంతవరకూ స్వలింగ లైంగిక సంబంధాలను చట్టబద్ధమైనవిగా పరిగణించలేమని కోర్టు డిసెంబర్ 11న తన తీర్పులో అభిప్రాయపడింది. స్వలింగ సంప్కరాన్ని చట్టబద్ధం చేయాలా? వద్దా? అనే అంశంపై పార్లమెంటు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్ల అసహజ లైంగిక కార్యకలాపాలను న్యాయస్థానం చట్టబద్ధం చేయలేదని కోర్టు వ్యాఖ్యానించింది. దేశంలో 25 ల క్షలమంది స్వలింగ సంపర్కులు ఉన్నట్లు అంచనా. వైమానిక దళం నుంచి మిగ్-21 తొలగింపు భారత వైమానిక దళం నుంచి మిగ్-21 ఎఫ్.ఎల్ యుద్ధ విమానాలను తొలగించారు. వీటి చివరి విన్యాసాలను డిసెంబర్ 11న పశ్చిమ బెంగాల్‌లోని మిడ్నాపూర్ జిల్లా కలైకుండ విమాన స్థావరంలో నిర్వహించారు. రష్యాకు చెందిన మిగ్-21 మొదటి బ్యాచ్‌ను 1963, మార్చి- ఏప్రిల్‌ల్లో వైమానిక దళంలో చేర్చారు. ఇవి భారత్ పొందిన మొదటి సూపర్సోనిక్ యుద్ధ విమానాలు. ఈ విమానాలు యుద్ధ సమయాల్లో భారత్ వైమానిక దళం ఆధిపత్యాన్ని చాటాయి. 1971 భారత్ - పాకిస్థాన్ యుద్ధంలో ఈ విమానాలు తమ శక్తిని నిరూపించాయి. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా రమణ్‌సింగ్ ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిగా రమణ్‌సింగ్ డిసెంబర్ 12న ప్రమాణస్వీకారం చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికవడం ఇది వరుసగా మూడోసారి. నవంబర్‌లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో మొత్తం 90 స్థానాలకుగాను రమణ్‌సింగ్ నాయకత్వంలోని బీజేపీ 49 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. మిజోరం ముఖ్యమంత్రిగా లాల్ తన్వాహ్లా మిజోరం సీఎంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లాల్ తన్వాహ్లా (71) డిసెంబర్ 14న ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి 1984లో ముఖ్యమంత్రి అయిన ఆయన తర్వాత 1989, 1993, 2008లో ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. భారత్‌లో కేన్సర్‌తో ఏటా ఏడు లక్షల మంది మృతి భారత్‌లో ప్రతి సంవత్సరం ఏడు లక్షల మంది కేన్సర్ వల్ల మరణిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన ప్రపంచ కేన్సర్ నివేదిక పేర్కొంది. 10 లక్షల మందికి పైగా కొత్తగా వ్యాధికి గురవుతున్నట్లు తెలిపింది. 2012లో 4.77 లక్షల మంది పురుషులలో, 5.37 లక్షల మంది మహిళలలో ఈ వ్యాధిని గుర్తించారు. 2012లో మరణించిన వారిలో 3.56 లక్షల మంది పురుషులు, 3.26 లక్షల మంది మహిళలు ఉన్నట్లు నివేదిక తెలిపింది. భారతీయ పురుషుల్లో పెదవుల, నోటి కేన్సర్ వల్ల, మహిళల్లో రొమ్ము కేన్సర్ వల్ల అధిక మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 2012లో కొత్త కేసులు 14.1 మిలియన్లకు చేరుకున్నాయని నివేదిక తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ద ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ ఆన్ కేన్సర్ (ఐఎఆర్సీ) ప్రపంచ వ్యాప్తంగా కేన్సర్ వ్యాప్తి, మరణాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేసింది. మైసూర్ రాజవంశీయుడు ఒడెయార్ మృతి మైసూర్ మహారాజ వంశీయుడు శ్రీకంఠదత్త నరసింహరాజ ఒడెయార్ (60) బెంగళూరులో డిసెంబర్ 10న మరణించారు. ఆయన మైసూరు లోక్‌సభ స్థానం నుంచి నాలుగుసార్లు గెలిచారు. 1399 నుంచి 1950 వరకు మైసూరును పాలించిన రాజ వంశీయుల్లో ఒడెయార్ చివరివారు. మైసూరు చివరి మహారాజు జయచామరాజేంద్ర ఒడెయార్ కుమారుడు శ్రీకంఠదత్త. 1974, సెప్టెంబర్‌లో మైసూరు సంస్థాన బాధ్యతలు చేపట్టారు. కేంద్రమంత్రి శీష్‌రాం మృతి కేంద్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు శీష్‌రాం ఓలా (86) డిసెంబర్ 15న అనారోగ్యంతో న్యూఢిల్లీలో మరణించారు. రాజస్థాన్‌కు చెందిన ఓలా 1996లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. బాలికల విద్య కోసం కృషి చేసిన ఆయనకు 1968లో పద్మశ్రీ పురస్కారం లభించింది. ఆయన రాజస్థాన్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా పనిచేశారు. అంతర్జాతీయం చంద్రునిపై దిగిన చైనా రోవర్ చైనా పంపిన చాంగ్-3 అనే వ్యోమనౌక డిసెంబర్ 14న చంద్రునిపై సైనస్ ఇరిడమ్ అనే ప్రదేశంలో దిగింది. ఆ నౌకలో ఉన్న ల్యాండర్‌తోపాటు యుతు (జేడ్ ర్యాబిట్) అనే రోవర్ చంద్రున్ని చేరాయి. ల్యాండర్ నుంచి రోవర్ విడిపోయి మూడు చదరపు కిలోమీటర్లలో తిరుగుతూ చంద్రుడి అంతర్నిర్మాణం, ఉపరితలంపై సర్వే చేస్తుంది. సహజ వనరుల అన్వేషణ సాగిస్తుంది. 40 సంవత్సరాల తర్వాత తొలిసారి చంద్రునిపై రోవర్ దిగింది. ఇప్పటివరకు అమెరికా, సోవియట్ యూనియన్లు చంద్రునిపై రోవర్లు దింపాయి. ఇది చైనా పంపిన తొలి రోవర్. చంద్రునిపై రోవర్‌ను దించిన మూడోదేశంగా చైనాకు గుర్తింపు దక్కింది. డిసెంబర్ 1న చైనా లాంగ్‌మార్‌చ-3బి రాకెట్ ద్వారా చాంగ్-3 వ్యోమనౌకను ప్రయోగించింది. గార్డియన్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా స్నోడెన్ లండన్‌కు చెందిన ది గార్డియన్ పత్రిక ఎడ్వర్డ్ స్నోడెన్‌ను 2013 సంవత్సరానికి పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక చేసింది. అమెరికా నిఘా సంస్థ సేకరించిన వర్గీకృత రహస్య సమాచారాన్ని స్నోడెన్ బహిర్గతం చేశాడు. హాలీవుడ్ నటి ఎలీనర్ పార్కర్ మృతి ప్రముఖ హాలీవుడ్ నటి ఎలీనర్ పార్కర్ (91) అమెరికాలోని కాలిఫోర్నియాలో డిసెంబర్ 10న మరణించారు. 1966 నాటి ‘ది సౌండ్ ఆఫ్ మ్యూజిక్’లో బారోనెస్ పాత్ర ఆమెకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆమె చివరిసారిగా 1991లో ‘డెడ్ ఆన్ ద మనీ’లో నటించారు. అంటార్కిటికాలో రికార్డు స్థాయిలో -93.2 డిగ్రీల సెల్సియస్ అంటార్కిటికా తూర్పు ప్రాంతంలో 2010లో రికార్డు స్థాయిలో -93.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్లు నాసా తెలిపింది. ఈ ప్రాంతంలో రికార్డు స్థాయిలో 1983లో -89.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇక్కడ గత 32 ఏళ్లుగా నమోదైన ఉష్ణోగ్రతల వివరాలను నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఉపగ్రహాల సాయంతో ఈ సమాచారం సేకరించారు. టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా పోప్ ఫ్రాన్సిస్ 2013 సంవత్సరానికి పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా పోప్ ఫ్రాన్సిస్‌ను టైమ్ పత్రిక ప్రకటించింది. పోప్‌గా బాధ్యతలు చేపట్టిన తొమ్మిది నెలల్లోనే కేథలిక్ చర్చి దృక్పథాన్ని అసాధారణ రీతిలో మార్చారని టైమ్ పత్రిక పేర్కొంది. ఈ ఏడాది మేటి వ్యక్తుల్లో రెండో స్థానంలో అమెరికా రహస్యాలను బయటపెట్టిన సీఐఏ మాజీ ఉద్యోగి ఎడ్వర్డ్ స్నోడెన్ నిలిచాడు. టైమ్ పత్రిక ఎంపిక చేసిన టాప్-10 జాబితాలో అమెరికా అధ్యక్షుడు ఒబామా, సిరియా అధ్యక్షుడు బసర్ అసద్ తదితరులు ఉన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి 42వ స్థానం దక్కింది. క్రీడలు వన్డే సిరీస్ విజేత దక్షిణాఫ్రికా భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను దక్షిణాఫ్రికా 2-0 తేడాతో గెలుచుకుంది. డిసెంబర్ 11న జరిగిన మూడో వన్డే వర్షం వల్ల రద్దు కావడంతో సిరీస్ దక్షిణాఫ్రికాకు దక్కింది. అంతకుముందు జరిగిన రెండు వన్డేల్లో దక్షిణాఫ్రికా గెలిచింది.దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డికాక్ వరుసగా మూడు వన్డేలలో మూడు సెంచరీలు సాధించాడు. తద్వారా ఈ ఘనత సాధించిన ఐదో ఆటగాడిగా నిలిచాడు. డికాక్ కంటే ముందు జహీర్ అబ్బాస్, సయీద్ అన్వర్, గిబ్స్, డివిలియర్స్ వరుసగా సెంచరీలు చేశారు. ఒకే సిరీస్‌లో వరుసగా మూడు వన్డే సెంచరీలు చేసిన తొలి ఆటగాడు డికాక్. ప్రపంచ మహిళల, పురుషుల కబడ్డీ టైటిల్ విజేత భారత్ ప్రపంచ కప్ మహిళల కబడ్డీ టైటిల్‌ను భారత్ జట్టు గెలుచుకుంది. జలంధర్‌లో డిసెంబర్ 12న జరిగిన ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను భారత్ ఓడించింది. ఈ టైటిల్‌ను భారత్ గెలుచుకోవడం ఇది వరుసగా మూడోసారి. టైటిల్ సాధించిన భారత్‌కు కోటి రూపాయల నగదు బహుమతి లభించింది. ఉత్తమ స్టాపర్‌గా అనురాణి, ఉత్తమ రైడర్‌గా రామ్ బతేరి ఎంపికయ్యారు. అదేవిధంగా భారత్ వరుసగా నాలుగోసారి పురుషుల ప్రపంచ కప్ కబడ్డీ టైటిల్‌ను గెలుచుకుంది. లూథియానాలో డిసెంబర్ 14న జరిగిన ఫైనల్స్‌లో పాకిస్థాన్‌ను ఓడించింది. ఈ గెలుపుతో భారత్‌కు ట్రోఫీతోపాటు రూ. 2 కోట్ల నగదు బహుమతి లభించింది. పాకిస్థాన్‌కు కోటి రూపాయలు దక్కాయి. 2013 ఐసీసీ అవార్డులు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) 2013 సంవత్సరానికి వార్షిక అవార్డులను డిసెంబర్ 13న దుబాయ్‌లో ప్రకటించింది. క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ (సర్ సోబర్‌స ట్రోఫీ): మైకేల్ క్లార్క (ఆస్ట్రేలియా) టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ మైకేల్ క్లార్క (ఆస్ట్రేలియా) ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: చటేశ్వర్ పుజారా (భారత్) వన్డే క్రికెటర్ ఆఫ్ ద ఇయర్: కుమార సంగక్కర(శ్రీలంక) ఉమెన్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్: సుజీ బేట్స్ (న్యూజిలాండ్) స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డ: మహేల జయవర్ధనే(శ్రీలంక) అంపైర్ ఆఫ్ ద ఇయర్ (డేవిడ్ షెపర్డ ట్రోఫీ): రిచర్డ కెట్లెబరో ఎల్జీ పీపుల్స్ ఛాయిస్ అవార్డ: ఎం.ఎస్. ధోని జర్మనీకి పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ టైటిల్ డిఫెండింగ్ చాంపియన్ జర్మనీ పురుషుల జూనియర్ హాకీ ప్రపంచ కప్ టైటిల్‌ను నిలబెట్టుకుంది. న్యూఢిల్లీలో డిసెంబర్ 15న జరిగిన ఫైనల్స్‌లో ఫ్రాన్‌సను ఓడించింది. ఇది జర్మనీకి వరుసగా రెండో టైటిల్. మొత్తానికి ఆరో టైటిల్. నెదర్లాండ్‌సకు మూడు, మలేషియాకు నాలుగో స్థానం దక్కగా భారత్ పదో స్థానంలో నిలిచింది. లీ చోంగ్ వీకు వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టైటిల్ బ్యాడ్మింటన్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్ టైటిల్‌ను మలేషియాకు చెందిన లీ చోంగ్ వీ గెలుచుకున్నాడు. కౌలాలంపూర్‌లో డిసెంబర్ 15న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్స్‌లో టామీ సుగియార్తో (ఇండోనేషియా)ను లీ చోంగ్ వీ ఓడించాడు. ఈ టైటిల్‌ను లీ చోంగ్ వీ గెలుచుకోవడం ఇది నాలుగోసారి. 2008, 2009, 2010లో ఈ టైటిల్‌ను గెలుచుకున్నాడు. -
నెల్సన్ మండేలా అస్తమయం
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం పృధ్వీ-2 పరీక్ష విజయవంతం ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే పృధ్వీ-2 క్షిపణిని సైన్యానికి చెందిన వ్యూహాత్మక దళాల కమాండ్ (ఎస్ఎఫ్సీ) విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని బాలాసోర్ వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి డిసెంబర్ 3న పరీక్ష నిర్వహించారు. ఈ క్షిపణి 250 కి.మీ నుంచి 350 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 350 కిలోల అణ్వాయుధాలను మోసుకుపోగలదు. దీన్ని 2003లో సైన్యంలో చేర్చారు. దీన్ని ధనుష్ పేరుతో నౌకాదళానికి కూడా అందించారు. అవినీతి సూచీలో భారత్‌కు 94వ స్థానం అవినీతి సూచీలో భారత్‌కు 94వ స్థానం దక్కింది. గతేడాది కూడా భారత్ ఇదే స్థానంలో నిలిచింది. ప్రపంచంలోని అవినీతి దేశాల జాబితాలో సోమాలియా అత్యంత అవినీతి దేశంగా మొదటి స్థానంలో ఉంది. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ 177 దేశాల జాబితాను డిసెంబర్ 3న విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యంత తక్కువ అవినీతి దేశాలుగా డెన్మార్క్, న్యూజిలాండ్ ఉన్నాయి. 0-100 స్కేలులో 0 స్థానంలో ఉంటే అత్యంత అవినీతి దేశంగా, 100వ స్థానంలో ఉంటే అత్యంత నీతివంతమైన దేశంగా పరిగణిస్తారు. భారత్‌కు 36 పాయింట్లు దక్కాయి. డెన్మార్క్, న్యూజిలాండ్‌లకు 91 పాయింట్లు లభించాయి. ఫిన్లాండ్, స్వీడన్, నార్వే, సింగపూర్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్ దేశాలు తక్కువ అవినీతి దేశాలుగా మంచి స్థానంలో ఉన్నాయి. చైనా 80వ స్థానంలోనూ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌లు 72వ స్థానంలోనూ, రష్యా 127, పాకిస్థాన్ 127వ స్థానంలోనూ ఉన్నాయి. శక్తిమంతమైన విద్యుత్ సరఫరా లైన్ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన విద్యుత్ సరఫరా లైన్‌ను వార్దా - ఔరంగాబాద్ మధ్య 1200 కె.వి లైన్ నెలకొల్పనున్నారు. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం 400 కి.మీ. ప్రస్తుతం 400 కె.వి లైన్ పనిచేస్తోంది. వచ్చే రెండేళ్లలో దీని సామర్థ్యాన్ని 1200 కె.వికి పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ పెంచనుంది. అల్ట్రా హై వోల్టేజి (యుహెచ్‌వీ) విధానాలను ఈ లైన్ ఏర్పాటులో వినియోగిస్తారు. ప్రస్తుతం చైనా వాణిజ్యపరంగా 1100 కె.వి లైన్‌ను ఉపయోగిస్తోంది. ఉత్తమ వ్యాపార దేశాల జాబితాలో భారత్‌కు 98వ స్థానం ప్రపంచంలో వ్యాపారానికి ఉత్తమ దేశాల జాబితాను ఫోర్బ్స్ పత్రిక డిసెంబర్ 5న విడుదల చేసింది. 148 దేశాల జాబితాలో భారత్‌కు 98వ స్థానం దక్కింది. ఐర్లాండ్ మొదటి స్థానంలో నిలిచింది. న్యూజిలాండ్‌కు రెండో స్థానం, హాంగ్‌కాంగ్‌కు మూడో స్థానం లభించాయి. ఆస్తి హక్కులు, కొత్తదనం, పన్నులు, సాంకేతికత, అవినీతి, స్వేచ్ఛ (వ్యక్తిగత, వ్యాపార, ద్రవ్యపరమైన), జాప్యం, పెట్టుబడిదారు రక్షణ, స్టాక్ మార్కెట్ పనితీరు వంటి 11 అంశాలపై ఆధారపడి ర్యాంకులు కేటాయించారు. సీఐసీగా సుష్మా సింగ్ కేంద్ర ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా మాజీ ఐఏఎస్ అధికారి సుష్మా సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుత సీఐసీ దీపక్ సంధూ పదవీకాలం ముగియడంతో ఆమె స్థానంలో సుష్మ బాధ్యతలు చేపట్టారు. ఆమెను ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్, కేంద్ర న్యాయశాఖ మంత్రితో కూడిన ప్యానెల్ ఎంపిక చేసింది. సుష్మా 2009, సెప్టెంబర్ 23 నుంచి కేంద్ర సమాచార కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఏపీలో తయారీ జోన్ల ఏర్పాటుకు కేంద్రం ఆమోదం ఆంధ్రప్రదేశ్‌లో మూడు జాతీయ పెట్టుబడి, తయారీ జోన్ల ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్రం డిసెంబర్ 4న సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. వీటి కోసం భూసేకరణకు రూ.250 కోట్లు విడుదల చేసేందుకు కూడా కేంద్రం అంగీకరించింది. ఈ మూడు జోన్లను చిత్తూరు, ప్రకాశం, మెదక్ జిల్లాల్లో ఏర్పాటు చేస్తారు. మెదక్ జిల్లాకు రూ.43,000 కోట్లు, చిత్తూరుకు రూ.31,000 కోట్లు, ప్రకాశంకు రూ.43000 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. ఒక్కో జోన్‌కు 5000 హెక్టార్ల భూమిని కేటాయించారు. తెలంగాణ ఏర్పాటు బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రుల బృందం సమర్పించిన నివేదికను, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యస్థీకరణ బిల్లు - 2013ను డిసెంబర్ 5న కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఇందులో ఇరు రాష్ట్రాల సరిహద్దుల నుంచి నదీ జలాలు, సహజ వనరుల పంపకాలు, హైదరాబాద్‌లో శాంతిభద్రతల వరకు అనేక అంశాలను పొందుపరిచారు. విభజనతో ఏర్పడే తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలు ఉంటాయి. 119 మంది శాసనసభ సభ్యులు, 40 మంది శాసనమండలి సభ్యులు, 17 మంది లోక్‌సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉంటారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలు ఉంటాయి. కొత్త ఆంధ్రప్రదేశ్‌లో 175 మంది శాసనసభ సభ్యులు, 50 మంది శాసనమండలి సభ్యులు, 25 మంది లోక్‌సభ సభ్యులు, 11 మంది రాజ్యసభ సభ్యులు ఉంటారు. కొత్త హైకోర్టు ఏర్పడే వరకు ప్రస్తుత హైకోర్టు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టుగా ఉంటుంది. కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలకు పదేళ్లకు మించని కాలానికి ఉమ్మడి గవర్నర్ ఉంటాడు. హైదరాబాద్ పదేళ్లకు మించని కాలానికి ఉమ్మడి రాజధానిగా పనిచేస్తుంది. ప్రస్తుతమున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పరిధి ప్రాంతం ఉమ్మడి రాజధాని ప్రాంతమవుతుంది. కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానికి సంబంధించి వివిధ ప్రత్యామ్నాయాలను అధ్యయనం చేయడానికి కేంద్రం నిపుణుల కమిటీని నియమిస్తుంది. ఈ చట్టం అమలులోకి వచ్చిన 45 రోజుల్లోగా ఈ నిపుణుల కమిటీ సిఫారసులు చేస్తుంది. కృష్ణా, గోదావరి నదుల పర్యవేక్షణ, నిర్వహణ కోసం రెండు ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తారు. కేంద్ర జలవనరుల మంత్రి, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నేతృత్వంలోని సర్వోన్నత మండలి ఈ బోర్డులను పర్యవేక్షిస్తుంది. ఐదేళ్ల కాలపరిమితికి మించకుండా అన్ని ప్రభుత్వ, ప్రభుత్వేతర ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశాలతోపాటు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ కూడా ఉమ్మడిగా అందరికీ ఒకేలా వర్తిస్తుంది. 371డీ రెండు రాష్ట్రాల్లోనూ అమల్లో ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో పారిశ్రామికాభివృద్ధికి పన్ను ప్రోత్సాహకాలు కల్పిస్తారు. పులిచింతల ప్రాజెక్టు ప్రారంభం కృష్ణానదిపై నిర్మించిన డాక్టర్ కెఎల్ రావు సాగర్ పులిచింతల ప్రాజెక్టును ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి డిసెంబర్ 7న ప్రారంభించారు. ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కృష్ణా డెల్టా ఆయకట్టు భూముల స్థిరీకరణకు తోడ్పడుతుంది. కృష్ణా, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని 13.88 ల క్షల ఎకరాలకు నీరందుతుంది. 45.77 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1831 కోట్లు వ్యయమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. డ్యామ్ స్పిల్ వే 18.50 మీటర్లు ్ఠ 17.00 మీటర్ల 24 రేడియల్ గేట్లతో దేశంలోనే అత్యంత భారీగా నిర్మితమైంది. దీన్ని గుంటూరు జిల్లాలో అచ్చంపేట మండలంలో కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజ్ ఎగువన, నాగార్జునసాగర్‌కు దిగువన నిర్మించారు. 2004, అక్టోబర్ 15న నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దీనికి శంకుస్థాపన చేశారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా నిర్మాణం మొదలుపెట్టిన తొలి ప్రాజెక్ట్. క్షిపణిని ప్రయోగించిన ఎల్సీఏ తేలికపాటి యుద్ధ విమానం (ఎల్సీఏ) నుంచి ప్రయోగించిన క్షిపణి విజయవంతంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఈ పరీక్షను గోవా తీరం నుంచి డిసెంబర్ 7న చేపట్టారు. తొలిసారి దేశీయంగా అభివృద్ధి చేసిన యుద్ధ విమానం తేజస్ నిర్వహించిన క్షిపణి ప్రయోగం మరో ప్రధాన ఘట్టం. దీంతో వైమానిక దళంలో తేజస్‌ను చేర్చేందుకు వీలవుతుంది. దీన్ని బెంగళూరులో ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ, హెచ్ఏఎల్ కలిసి అభివృద్ధి చేశాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఐదు రాష్ట్రాల శాసనసభలకు నవంబర్, డిసెంబర్లలో జరిగిన ఎన్నికల ఫలితాలు.. మధ్యప్రదేశ్ (మొత్తం సీట్లు -230): ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ నేతృత్వంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చింది. బీజేపీ 165, కాంగ్రెస్‌కు 58, ఇతరులకు 7 స్థానాలు దక్కాయి. ఛత్తీస్‌గఢ్ (మొత్తం సీట్లు -90): ఇక్కడ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్ నాయకత్వంలో బీజేపీ వరుసగా మూడోసారి అధికారంలోకి వచ్చిం ది. బీజేపీకి 49,కాంగ్రెస్‌కు 39, ఇతరులకు 2 స్థానాలు లభించాయి. రాజస్థాన్ (మొత్తం సీట్లు -200): అధికార కాంగ్రెస్‌ను ఓడించి బీజేపీ అధికారంలోకి వచ్చింది. మొత్తం ఎన్నికలు జరిగిన 199 స్థానాల్లో బీజేపీ 162, కాంగ్రెస్ 21, ఇతరులు 16 స్థానాలు దక్కించుకున్నారు. ఢిల్లీ (మొత్తం సీట్లు - 70): ఇక్కడ ఏ పార్టీకి మెజారిటీ పూర్తిగా రాలేదు. మూడు దఫాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతింది. కేవలం 8 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాలు దక్కించుకోగా, బీజేపీ 31 స్థానాలతో అతిపెద్ద పార్టీగా నిలిచింది. ఇతరులు మూడు స్థానాల్లో విజయం సాధించారు. మిజోరాం (మొత్తం సీట్లు-40): ముఖ్యమంత్రి లాలా థన్హవ్లా నేతృత్వంలో అధికార కాంగ్రెస్ పార్టీ 33 సీట్లు దక్కించుకుంది. ప్రధాన ప్రతిపక్షం మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) 5 స్థానాలు, మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ ఒక స్థానంలో విజయంలో సాధించాయి. అంతర్జాతీయం ఆసియా కోసం కమ్యూనికేషన్ ఉపగ్రహం దక్షిణాసియా, ఆసియా పసిఫిక్ ప్రాంతాలకు టెలివిజన్, కేబుల్ టీవీ సేవలు అందించేందుకు తొలి ప్రైవేటు వాణిజ్య రాకెట్ ప్రయోగాన్ని అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ చేపట్టింది. భారత్, చైనాలకు కూడా ఈ ఉపగ్రహ సేవలు అందుతాయి. ఈ రాకెట్ ద్వారా ఎస్.ఇ.ఎస్-8 అనే 3.2 టన్నుల ఉపగ్రహాన్ని ఫ్లోరిడాలోని కేప్ కేనవెరాల్ అంతరిక్ష కేంద్రం నుంచి డిసెంబర్ 4న ప్రయోగించారు. ఈ ఉపగ్రహాన్ని భూమి కంటే పైన స్థిర కక్ష్యలో ఉంచి ఉపయోగించుకుంటారు. నెల్సన్ మండేలా అస్తమయం నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా (95) జోహెన్నెస్‌బర్గ్‌లో డిసెంబర్ 5న మరణించారు. మండేలా దక్షిణాఫ్రికాకు తొలి నల్లజాతి అధ్యక్షుడు. దక్షిణాఫ్రికాలో శ్వేత జాత్యహంకార పాలనను అంతమొందించారు. అల్ప సంఖ్యాకులైన శ్వేత జాతీయుల పాలనలో తీవ్ర వివక్షకు గురైన నల్లజాతి ప్రజల విముక్తి కోసం సుదీర్ఘ పోరాటం చేసి విజయం సాధించారు. ఈ పోరాటంలో ఆయన 27 ఏళ్ల జైలు జీవితం గడిపారు. మండేలా 1918, జూలై 18న జన్మించారు. 1943లో ఆఫ్రికా నేషనల్ కాంగ్రెస్ (ఏఎన్సీ)లో చేరారు. 1960, మార్చిలో ప్రభుత్వం ఏఎన్సీని నిషేధించడంతో 1961 డిసెంబర్లో మండేలా చీఫ్ కమాండర్‌గా ఏఎన్సీ సాయుధ దళం ఏర్పడింది. ప్రభుత్వం 1962లో మండేలాను బంధించి ఐదేళ్ల జైలుశిక్ష విధించింది. 1964లో జీవిత ఖైదుకు గురయ్యారు. 27 ఏళ్లపాటు రాబెన్ ఐలాండ్ జైలులో దుర్భర జీవితం గడిపారు. 1990, ఫిబ్రవరి 11న జైలు నుంచి విడుదలయ్యారు. 1991లో ఏఎన్సీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1993లో మండేలాకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. 1994, ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి అన్ని జాతులు ఓటింగ్‌లో పాల్గొన్నాయి. జాతి వివక్షకు తెరపడింది. 1994, మే 10న దక్షిణాఫ్రికా తొలి నల్లజాతి అధ్యక్షుడిగా మండేలా ఎన్నికయ్యారు. ఐదేళ్ల తర్వాత 1999లో స్వచ్ఛందంగా అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. 2004లో ప్రజా జీవితం నుంచి విరమించుకున్నారు. 1990లో భారతరత్న పురస్కారాన్ని అందుకున్నారు. 2001లో గాంధీ అంతర్జాతీయ శాంతి బహుమతితో భారత ప్రభుత్వం మండేలాను సత్కరించింది. క్రీడలు ధోనీకి ఐసీసీ పీపుల్స్ చాయిస్ అవార్డు -2013 భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 2013 సంవత్సరానికి ఐసీసీకి చెందిన ఎల్జీ పీపుల్స్ చాయిస్ అవార్డుకు ఎంపికయ్యాడు. సచిన్ (2010) తర్వాత ఈ అవార్డుకు ఎంపికైన రెండో భారత క్రికెటర్ ధోని. 2011లో, 2012లో రెండుసార్లు ఈ అవార్డు శ్రీలంక క్రికెటర్ కుమార సంగక్కరకు దక్కింది. ఐసీసీ వెబ్సైట్, ట్విట్టర్ ద్వారా జరిగిన ఓటింగ్‌లో రెండు లక్షల మంది విజేతను ఎంపిక చేశారు. కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్ దక్షిణాఫ్రికాలోని జోహాన్నెస్‌బర్గ్‌లో డిసెంబర్ 8న ముగిసిన కామన్వెల్త్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్ 16 స్వర్ణ పతకాలు గెలుచుకుంది. 13 రజతాలు, 11 కాంస్య పతకాలతోపాటు మొత్తం 38 పతకాలు భారత్‌కు దక్కాయి. పురుషుల ఫ్రీ స్టైల్, గ్రీక్-రోమన్ స్టైల్ టీం చాంపియన్‌షిప్ భారత్‌కు లభించాయి. మహిళా విభాగంలో భారత్ రన్నరప్‌గా నిలిచింది. -
యునిసెఫ్ రాయబారిగా టెండ్కూలర్
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం విద్య, నైపుణ్యాలపై భారత్ - ఆస్ట్రేలియా ఒప్పందం విద్య, నైపుణ్యాల రంగంలో సహకరించుకునేందుకు భారత్ - ఆస్ట్రేలియాలు నవంబర్ 29న న్యూఢిల్లీలో ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఆస్ట్రేలియా తాత్కాలిక హైకమిషనర్ బెర్నార్డ్ ఫిలిప్, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి ఎం.ఎం. పల్లంరాజు సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. ఇప్పటికే ఏర్పాటైన భారత్ - ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ విద్య, నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు సంబంధించి అన్ని స్థాయిల్లో కార్యాచరణను రూపొందిస్తుంది. 2022 నాటికి భారత్ 500 మిలియన్ల మందికి శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. వచ్చే దశాబ్దాల్లో ప్రతి ఏటా 12 నుంచి 15 మిలియన్ల మంది మానవ వనరులను భారత్ సమకూర్చుకోవాల్సి ఉంది. ఇందుకు అవసరమైన నాణ్యతతో కూడిన శిక్షణ, ప్రమాణాలను ఆస్ట్రేలియా అందిస్తుందని బెర్నార్డ్ ఫిలిప్ తెలిపారు. ఈ సంఖ్య 2011లో 2.3 మిలియన్లు. యునిసెఫ్ రాయబారిగా టెండ్కూలర్ క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండ్కూలర్ యునిసెఫ్ పారిశుద్ధ్య కార్యక్రమం ప్రాంతీయ ప్రచార కార్యకర్తగా నియమితులయ్యారు. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ దేశాల్లో యునిసెఫ్ ప్రచార కార్యకర్తగా సచిన్ వ్యవహరిస్తారు. ఇందుకు సంబంధించిన అంగీకార పత్రంపై యునిసెఫ్ దక్షిణాసియా ప్రాంతీయ డెరైక్టర్ కరీన్ హుల్షోప్ సమక్షంలో నవంబర్ 21న టెండ్కూలర్ సంతకం చేశారు. సబ్బుతో చేతులు కడుక్కునే అలవాటుపై తన శాయశక్తులా ప్రచారం చేస్తానని సచిన్ అన్నారు. దక్షిణాసియాలో అత్యధికంగా ఐదేళ్లలోపు పిల్లల మరణాలు జరుగుతున్నాయని కరీన్ హుల్షోప్ తెలిపారు. ఇఫి చిత్రోత్సవం అవార్డులు 44వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు (ఇఫి) పనాజీలో నవంబర్ 30న ముగిశాయి. అవార్డులు: ఉత్తమ చిత్రానికిచ్చే బంగారు నెమలి: తూర్పు తైమూర్ నిర్మించిన తొలి చిత్రం ‘బీట్రిజ్ వార్’కు దక్కింది. దీనికి బెటిరీస్ దర్శకత్వం వహించారు. ఈ అవార్డు కింద రూ.40 లక్షలు బహూకరించారు. వెండి నెమలి అవార్డు: మెగే దాకా తారా (బెంగాలీ, దర్శకత్వం: కమలేశ్వర్ ముఖర్జీ) ఉత్తమ దర్శకుడు: కౌశిక్ గంగూలీ (చిత్రం: అపూర్ పాంచాలి) ఉత్తమ నటుడు: అలోన్ మోని అబేత్బేల్ (చిత్రం: ఎ ప్రెస్ ఇన్ హెలెన్) ఉత్తమ నటి: మగ్దలెనా బోక్జరాస్కా (చిత్రం: ఇన్హైడింగ్) పురావస్తు శాస్త్రవేత్త ఐ.కె.శర్మ మృతి ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, భారత పురావస్తు శాఖ మాజీ డెరైక్టర్ ఐ.కె. శర్మ (ఇంగువ కార్తికేయ శర్మ) (76) హైదరాబాద్‌లో నవంబర్ 28న మరణించారు. ఆయన పురావస్తు శాస్త్రంలోనే కాకుండా కళలు, ఆర్కిటెక్చర్, ప్రాచీన కట్టడాల పరిరక్షణ వంటి విషయాల్లో కూడా పేరొందారు. ఆంధ్రప్రదేశ్‌లోని నాగార్జున కొండ, గుడిమల్లామ్, అమరావతి, గుంటుపల్లి, పెదవేగి, రాజస్థాన్‌లోని కాలీభంగం, తమిళనాడులోని పైయాంపల్లి, మహారాష్ట్రలోని పుణే, గుజరాత్‌లోని సుర్కోడ్తా ప్రాంతాల్లో చేపట్టిన తవ్వకాల్లో ప్రధాన పాత్ర పోషించారు. అనేక పుస్తకాలు ప్రచురించారు. తుది తీర్పు ప్రకటించిన కృష్ణా జలాల ట్రిబ్యునల్ కృష్ణా జలాల వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యు నల్ తన తుది తీర్పును నవంబర్ 29న వెలువరించింది. ఈ తీర్పు 2050 వరకు అమలులో ఉంటుంది. తీర్పు ప్రధానాంశాలు: ఆల్మట్టి డ్యామ్ ఎత్తు 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్ల ఎత్తుకు పెంచేందుకు కర్ణాటకకు అనుమతి ఇచ్చింది. మిగులు జలాలపై ఉన్న హక్కును ఆంధ్రప్రదేశ్ కోల్పోయింది. ఎగువ రాష్ట్రాలకు వాటా లభించింది. ఆంధ్రప్రదేశ్‌కు 1005 టీఎంసీలు, కర్ణాటకకు 907 టీఎంసీలు, మహారాష్ట్రకు 666 టీఎంసీలు కేటాయించింది. 2010, డిసెంబర్ 30న ఇచ్చిన మధ్యంతర తీర్పులో ఈ కేటాయింపులు వరుసగా 1001 టీఎంసీలు, 911 టీఎంసీలు, 666 టీఎంసీలు ఉన్నాయి. 65 శాతం నీటి లభ్యత ఆధారంగా 2578 టీఎంసీల నీటిని మూడు రాష్ట్రాలకు పంచింది. బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యత ఆధారంగా 2130 టీఎంసీల నీటిని పంపిణీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో తక్కువ లభ్యత ఉంటే ఆ మేరకు మిగిలిన నీటిని ఎగువ రాష్ట్రాలు విడుదల చేయాలి. నీటి వాడకంపై పర్యవేక్షణ బోర్డు ఏర్పాటు చేస్తారు. కర్ణాటకకు 173, మహారాష్ట్రకు 81 టీఎంసీల నీటిని అదనంగా కేటాయించింది. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ 811, కర్ణాటక 734, మహారాష్ట్రలకు 585 టీఎంసీల నీటి కేటాయింపు ఉంది. సహజీవనం నేరం కాదన్న సుప్రీంకోర్టు సహజీవనం నేరం కాదని సుప్రీంకోర్టు నవంబర్ 28న తీర్పులో పేర్కొంది. సహజీవనం చేస్తున్న మహిళలకు, వారికి పుట్టే పిల్లలకు భద్రత, రక్షణకు చట్టాన్ని రూపొందించాలని పార్లమెంటును కోరింది. వివాహబంధాల్నే కాకుండా సహజీవనానికి గుర్తింపునివ్వాలని కోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా పెళ్లికి ముందు లైంగిక సంబంధాలను ప్రోత్సహించడం లేదని కూడా తెలిపింది. భరణం ఇప్పించాలంటూ సహజీవనం చేసిన మహిళ దాఖలు చేసిన పిటీషన్‌పై కోర్టు తీర్పునిచ్చింది. డా.సుబ్బన్న అయ్యప్పన్కు నాయుడమ్మ అవార్డు ప్రముఖ శాస్త్రవేత్త ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చరల్ రీసెర్చ డెరైక్టర్ జనరల్ డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్కు ప్రతిష్టాత్మక నాయుడమ్మ అవార్డు 2014ను అందజేయనున్నట్లు నాయుడమ్మ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆల్టర్నేటివ్స్ డెరైక్టర్ డాక్టర్ ఎ.జగదీష్ డిసెంబర్ 2న తెలిపారు. విప్లవకవి మండే సత్యం మృతి విప్లవ కవి మండే సత్యనారాయణ (80) హైదరాబాద్‌లో నవంబర్ 27న మరణించారు. ఆయన పీపుల్స్‌వార్ ఉద్యమ నేపథ్యంలో 100కు పైగా విప్లవ గీతాలు రాశారు. ఎర్ర సైన్యం, చీమల దండు సినిమాలకు పాటలు రాశారు. అంతర్జాతీయం మూన్ రోవర్‌ను ప్రయోగించిన చైనా చంద్రుడిపై పరిశోధనకు చైనా తన మొదటి రోవర్‌ను డిసెంబర్ 1న ప్రయోగించింది. చాంగె-3 రాకెట్ ద్వారా ‘జడే రాబిట్’ అని పిలిచే రోవర్‌ను క్సిచాంగ్ శాటిలైట్ లాంచ్ కేంద్రం నుంచి పంపింది. ఈ రోవర్ డిసెంబర్ మధ్యలో చంద్రుడిపై దిగుతుంది. చంద్రుడి ఉపరితలం, అక్కడి సహజ వనరులపై సమాచారం సేకరిస్తుంది. ఇది చంద్రుడిపైకి పంపిన మూడో లూనార్ రోవర్. గతంలో అమెరికా, రష్యాలు ఇటువంటి రోవర్లు పంపాయి. దుబాయ్‌లో 2020 వరల్డ్ ఎక్స్పో వరల్డ్ ఎక్స్పో-2020కు దుబాయ్ ఆతిథ్యమివ్వనుంది. ఈ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు నవంబర్ 28న జరిగిన బిడ్డింగ్‌లో దుబాయ్‌కు 116 ఓట్లు వచ్చాయి. రష్యాలోని ఎకటెరిన్ బర్గ్ 47 ఓట్లు మాత్రమే సాధించింది. పారిస్‌లో జరిగిన ఓటింగ్‌లో 168 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఎగ్జిబిషన్ నిర్వహించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కోసం 6.8 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రైవేటు రంగం వ్యయం కలుపుకుంటే ఇది 18.3 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. 438 హెక్టార్లలో భారీ నిర్మాణాలు చేపట్టవలసి ఉంటుంది. 2,77,000 ఉద్యోగావకాశాలు ఏర్పడతాయి. ప్రతి ఐదేళ్లకొకసారి ఈ ఎక్స్పో నిర్వహిస్తారు. 2015లో మిలాన్‌లో ఈ ఎక్స్పో జరుగుతుంది. చివరగా షాంఘైలో జరిగింది. మహిళల హక్కుల పరిరక్షకుల తీర్మానానికి యూఎన్ ఆమోదం ఐక్యరాజ్యసమితి సాధారణ సభ కమిటీ తొలిసారిగా మహిళల హక్కుల పరిరక్షకుల తీర్మానాన్ని నవంబర్ 27న ఆమోదించింది. మహిళా హక్కు పరిరక్షకులపై జరిగే హింసాత్మక చర్యలను దేశాలు బహిరంగంగా ఖండించాలని, వారిని అడ్డుకునే చట్టాలను సవరించాలని, వారికి ఐక్యరాజ్యసమితి సంస్థల్లో అవకాశాలు కల్పించాలని ఈ తీర్మానం పేర్కొంటోంది. ఎయిడ్స్ సంబంధిత రోగంతో 2.1 లక్షల మంది పిల్లల మృతి గత ఏడాదిలో ఎయిడ్స్ సంబంధిత అనారోగ్యంతో 2,10,000 మంది బాలలు మరణించినట్లు ఐక్యరాజ్యసమితి బాలల అత్యవసర నిధి (యునిసెఫ్) తన నివేదికలో తెలిపింది. హెచ్ఐవి వ్యాధితో బాధపడే చిన్నారుల్లో 34 శాతం మంది తక్కువ, మధ్యస్థ ఆదాయ దేశాల్లోనే ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మరణాలు 10-19 సంవత్సరాల వయసువారిలో 2005-2012 మధ్యకాలంలో 50 శాతం పెరిగాయని నివేదిక తెలిపింది. 2005-12మధ్య కాలంలో పిల్లల్లో 8.5 లక్షల మందికి ఈ వ్యాధి సోకకుండా అరికట్టినట్టు నివేదిక పేర్కొంది. గూఢచారం వ్యతిరేక తీర్మానాన్ని ఆమోదించిన యూఎన్ ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిటీ వ్యక్తిగత జీవన హక్కు (రైట్ టు ప్రైవసీ) తీర్మానాన్ని నవంబర్ 26న ఆమోదించింది. జర్మనీ, బ్రెజిల్ ఒత్తిడితో ఈ తీర్మానం తీసుకొచ్చారు. జర్మనీ, బ్రెజిల్ నాయకులపై అమెరికా నిఘా పెట్టిందన్న వార్తలపై అంతర్జాతీయంగా ఆగ్రహం వ్యక్తమైంది. ఈ తీర్మానం కింద ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిటీ అధిపతి నవనీతం పిళ్లై దేశీయ, దేశీయేతర ప్రైవసీపై నివేదిక తయారు చేస్తారు. ఈ తీర్మానానికి ఫ్రాన్స్, రష్యా, ఉత్తర కొరియాతోపాటు 55 దేశాలు మద్దతునిచ్చాయి. పాకిస్థాన్ సైన్యాధిపతిగా రహీల్ షరీఫ్ పాకిస్థాన్ సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ రహీల్ షరీఫ్ (57) నియమితులయ్యారు. పదవీ విరమణ చేసిన జనరల్ అష్పాక్ పర్వేజ్ కయానీ స్థానంలో షరీఫ్ నవంబర్ 29న బాధ్యతలు చేపట్టారు. క్రీడలు పి.వి.సింధుకు మకావు గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్ మకావు గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను భారత క్రీడాకారిణి పి.వి.సింధు గెలుచుకుంది. మకావులో డిసెంబర్ 1న జరిగిన ఫైనల్లో కెనడాకు చెందిన మిచెల్లి లీని ఓడించింది. ఈ ఏడాది సింధుకు ఇది రెండో గ్రాండ్ ప్రి టైటిల్. గత మేలో మలేషియా ఓపెన్ టైటిల్ సాధించింది. బుల్లర్‌కు ఇండోనేషియా ఓపెన్ గోల్ఫ్ టైటిల్ ఇండోనేషియా ఓపెన్ గోల్ఫ్ టైటిల్‌ను గగన్జిత్ బుల్లర్ గెలుచుకున్నాడు. డిసెంబర్ 1న జకార్తాలో జరిగిన పోటీలో విజేతగా నిలిచాడు. ఈ ఏడాదిలో బుల్లర్‌కు ఇది మొదటి టైటిల్. కాగా ఇండోనేషియాలో రెండో టైటిల్. కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు 117 పతకాలు మలేషియాలోని పెనాంగ్‌లో నవంబర్ 30న ముగిసిన కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 117 పతకాలు లభించాయి. ఇందులో 57 స్వర్ణం, 39 రజతం, 21 కాంస్య పతకాలు ఉన్నాయి. ఉత్తమ లిఫ్టర్ అవార్డు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాగాల్ వెంకట్ రాహుల్‌కు దక్కింది. రాహుల్ మొత్తం ఆరు స్వర్ణ పతకాలు గెలిచాడు. జూనియర్, యూత్, సీనియర్ విభాగాల్లో ఈ పోటీలు జరిగాయి. భారత్ యూత్ బాయ్స్, గర్ల్స్, జూనియర్ మెన్, ఉమెన్, సీనియర్ మెన్ విభాగాల్లో టీమ్ టైటిల్స్ సాధించింది. సీనియర్ ఉమెన్ విభాగంలో రన్నరప్ ట్రోఫీ దక్కింది. కరణ్ ఠాకూర్ రికార్డు సీకే నాయుడు ట్రోఫీ (బీసీసీఐ అండర్-25 మీట్)లో రైల్వేస్ పేసర్ కరణ్ ఠాకూర్ ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. దీంతో ఈ టోర్నీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. వడోదరాలో బరోడాతో జరిగిన ఈ మ్యాచ్‌లో అతను పది వికెట్లు పడగొట్టాడు. భారత్‌లో పి.ఎం.చటర్జీ, దేబాశిష్ మొహంతి, ఎస్.పి.గుప్తే, పి.సుందరం... ఈ నలుగురూ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీశారు. శ్రీజకు స్వర్ణం భారత్‌కు చెందిన టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి శ్రీజ ఇరాన్లో జరిగిన ఫజర్ కప్ అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ టోర్నీ జూనియర్ విభాగంలో సింగిల్స్ టైటిల్ గెలిచింది. నవంబర్ 30న జరిగిన సింగిల్స్ ఫైనల్లో బెలారస్‌కు చెందిన బరవోక్ను ఓడించింది. టీమ్ విభాగంలో భారత్ ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకుంది. వసీం జాఫర్ రికార్డు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 50 సెంచరీలు సాధించిన ఎనిమిదో భారత బ్యాట్స్‌మెన్‌గా ముంబై బ్యాట్స్‌మెన్ వసీం జాఫర్ రికార్డులకెక్కాడు. నవంబర్ 27న విదర్భతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో సెంచరీ చేసి ఈ ఘనతను సాధించాడు. ఇంతకుముందు గవాస్కర్, సచిన్, ద్రవిడ్, విజయ్ హజారే, వెంగ్‌సర్కార్, లక్ష్మణ్, అజహర్ ఈ జాబితాలో ఉన్నారు. వన్డే సిరీస్ విజేత భారత్ వెస్టిండీస్‌తో జరిగిన మూడు వన్డేల క్రికెట్ సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో గెలుచుకుంది. కాన్పూర్‌లో నవంబర్ 27న జరిగిన మూడో వన్డేలో భారత్ విజయం సాధించడంతో మూడు వన్డేల సిరీస్ భారత్ వశమైంది. మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా విరాట్ కోహ్లి ఎంపిక య్యాడు. -
మంగళయాన్ ప్రయోగం విజయవంతం
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు క్రీడలు ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ నెంబర్‌వన్ ఆల్‌రౌండర్‌గా అశ్విన్ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ ఆల్‌రౌండర్ల విభాగంలో నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. అశ్విన్ 405 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. బంగ్లాదేశ్ ఆటగాడు షకిబుల్ (362 పాయింట్లు), దక్షిణాఫ్రికాకు చెందిన కలిస్ (332 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత్‌కు బహ్రెయిన్ బ్యాడ్మింటన్ టోర్నీ టైటిల్స్ బహ్రెయిన్‌లో నవంబర్ 9న ముగిసిన బహ్రెయిన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో ఐదు టైటిల్స్‌ను భారత్ క్రీడాకారులు గెలుచుకున్నారు. పురుషుల సింగిల్స్: ఈ టైటిల్‌ను సమీర్‌వర్మ దక్కించుకున్నాడు. ఫైనల్లో సుభాంకర్ దేను ఓడించాడు. మహిళల సింగిల్స్: తన్వీలాద్ గెలుచుకుంది. ఫైనల్లో సైలీ రాణిపై విజయం సాధించింది. పురుషుల డబుల్స్: రూపేశ్‌కుమార్, సవానె థామస్ విజేతలుగా నిలిచారు. ఫైనల్లో నందగోపాల్, వి.దిజును ఓడించారు. మహిళల డబుల్స్: సిక్కిరెడ్డి, ప్రద్న్యగాద్రే జోడి మహిళల డబుల్స్ టైటిల్ దక్కించుకున్నారు. ఫైనల్లో అపర్ణా బాలన్-సాన్యాగిత గోర్పడేలను ఓడించారు. మిక్స్డ్ డబుల్స్: ఈ టైటిల్‌ను సనావె థామస్, ప్రజక్తా జంట గెలుచుకుంది. వీరు ఫైనల్లో సిక్కిరెడ్డి - దిజు జంటపై విజయం సాధించారు. సిద్దీకుర్కు హీరో ఇండియా ఓపెన్ గోల్ఫ్ టైటిల్ బంగ్లాదేశ్‌కు చెందిన మహ్మద్ సిద్దీకుర్ హీరో ఇండియా ఓపెన్ గోల్ఫ్ టైటిల్ గెలుచుకున్నాడు. న్యూఢిల్లీలో నవంబర్ 10న జరిగిన 50వ ఇండియన్ ఓపెన్ టైటిల్ విజేతగా సిద్దీకుర్ నిలిచాడు. స్కేటింగ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో అనూప్ కుమార్‌కు స్వర్ణం వరల్డ్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అనూప్ కుమార్ స్వర్ణ పతకం సాధించాడు. చైనీస్ తైపీలో నవంబర్ 10న జరిగిన టోర్నీలో ఇన్లైన్ ఆర్టిస్టిక్ స్కేటింగ్‌లో అనూప్ పసిడి నెగ్గాడు. ప్రపంచ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం రావడం ఇదే తొలిసారి. ఆసియా చాంపియన్స్ ట్రోఫీ మహిళల రన్నరప్ భారత్ ఆసియా చాంపియన్స్ ట్రోఫీ హాకీ పురుషుల టైటిల్‌ను పాకిస్థాన్ గెలుచుకుంది. జపాన్‌లో నవంబర్ 11న జరిగిన ఫైనల్లో జపాన్ను ఓడించింది. చైనాను ఓడించి మలేషియా మూడో స్థానం, ఒమన్‌ను ఓడించి భారత్ ఐదో స్థానం దక్కించుకున్నాయి. మహిళల టైటిల్లో జపాన్ విజేతగా నిలిచింది. ఫైనల్లో భారత్‌పై నెగ్గింది. చైనాను ఓడించి మలేషియా మూడో స్థానం పొందింది. ప్రపంచకప్ షూటింగ్లో హీనాకు స్వర్ణం భారత షూటర్ హీనా సిద్ధూ ప్రపంచకప్ షూటింగ్లో స్వర్ణ పతకం గెలుచుకుంది. జర్మనీలో మ్యూనిచ్‌లో నవంబర్ 11న జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో ప్రథమ స్థానంలో నిలిచింది. 2003లో అంజలి భగవత్, 2008లో గగన్ నారంగ్ తర్వాత ప్రపంచకప్‌లో స్వర్ణం గెలిచిన మూడో భారత వ్యక్తిగా హీనా రికార్డు సృష్టించింది. జాతీయంమంగళయాన్ను ప్రయోగించిన భారత్ అంగారక గ్రహాన్ని అధ్యయనం చేయడానికి చేపట్టిన మంగళయాన్ ఆర్బిటర్‌ను పీఎస్ఎల్వీ-సీ25 రాకెట్ ద్వారా భారత్ ప్రయోగించింది. ఈ ప్రయోగానికి మార్స్ ఆర్బిటర్ మిషన్ (ఎం.ఓ.ఎం)గా పేరుపెట్టారు. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష కేంద్రం (షార్) నుంచి నవంబర్ 5న పీఎస్ఎల్వీ - సీ25 మార్స్ ఆర్బిటర్‌ను భూకక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇది భూమి చుట్టూ 25 రోజులు పరిభ్రమిస్తుంది. తర్వాత అక్కడ నుంచి 300 రోజులపాటు 400 మిలియన్ కిలోమీటర్లు ప్రయాణించి 2014 సెప్టెంబర్ 24న అంగారక గ్రహాన్ని చేరుకుంటుంది. అంగారకుడిపై జీవం ఆవిర్భావానికి ఆధారమైన మిథేన్ గురించి ఆర్బిటర్ అన్వేషిస్తుంది. ఒకప్పుడు ఉన్న నీరు ఎలా లేకుండా పోయిందో తెలుసుకుంటుంది. అంతేకాకుండా అంగారకుడి ఉపరితలంపై పరిస్థితులను, ఖనిజాలను, మూలకాలను అధ్యయనం చేస్తుంది. ఈ పరిశోధనల కోసం ఆర్బిటర్‌లో ఐదు పరికరాలను అమర్చారు. మంగళయాన్ విజయవంతంగా అంగారక కక్ష్యలోకి చేరుకుంటే ఈ ఘనత సాధించిన నాలుగో దేశంగా, తొలి ఆసియా దేశంగా భారత్‌కు గుర్తింపు లభిస్తుంది. ఇది భారత్ మొదటి గ్రహాంతర పరిశోధన. ఇప్పటివరకూ అమెరికా, రష్యా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు మాత్రమే అంగారకుడిపై విజయవంతంగా ప్రయోగాలు చేశాయి. వివిధ దేశాలు అంగారకుడిపైకి 51 ప్రయోగాలు చేపట్టగా 21 మాత్రమే విజయవంతమయ్యాయి. పీఎస్ఎల్వీ-సీ25: భారత్ చేపట్టిన 25 పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) ప్రయోగాల్లో 24 విజయం సాధించాయి. 1993లో తొలి ప్రయోగం పీఎస్ఎల్వీ-డీ1 విఫలమైంది. 44.5 మీటర్ల పొడవైన పీఎస్ఎల్వీ-సీ25 ఉపగ్రహ వాహక నౌక 1337 కిలోల బరువు గల మార్స్ ఆర్బిటర్‌ను మోసుకెళ్లింది. 49.56 నిమిషాల్లో ఆర్బిటర్‌ను భూకక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగానికి 450 కోట్ల రూపాయలు వ్యయం చేశారు. అగ్ని-1 పరీక్ష విజయవంతం స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన అగ్ని-1 బాలిస్టిక్ క్షిపణిని ఒడిశా తీరంలోని వీలర్ ఐలాండ్‌లో ఉన్న ప్రయోగ కేంద్రం నుంచి న వంబర్ 8న మరోసారి విజయవంతంగా పరీక్షించారు. సాధారణ వినియోగ పరీక్షల్లో భాగంగా సైన్యానికి చెందిన వ్యూహాత్మక బలగాల విభాగం ఈ పరీక్షను నిర్వహించింది. ఈ క్షిపణి 700 కి.మీ దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న ఈ క్షిపణి 1000 కిలోల ఆయుధాలను మోసుకుపోగలదు. హైదరాబాద్‌లో ప్రపంచ వ్యవసాయ సదస్సు తొమ్మిదో ప్రపంచ వ్యవసాయ సదస్సు - 2013 హైదరాబాద్‌లో జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్ రెడ్డి నవంబర్ 4న దీన్ని ప్రారంభించారు. వరల్డ్ అగ్రికల్చర్ ఫోరం (డబ్ల్యుఏఎఫ్) రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో మూడు రోజులపాటు సదస్సును నిర్వహించింది. సుస్థిర భవిష్యత్తు కోసం వ్యవసాయాన్ని తీర్చిదిద్దడం, సన్నకారు రైతులపై దృష్టి అనే ఇతివృత్తంతో ఈ సదస్సు జరిగింది. దేశ, విదేశాల నుంచి 400 మంది ప్రతినిధులు, శాస్త్రవేత్తలు హాజరయ్యారు. 2050 నాటికి 1000 కోట్ల జనాభాకు ఆహారం అందించడం పెద్ద సవాలుగా ఉందని నిపుణులు అభిప్రాయపడ్డారు. జనాభా అవసరాలకనుగుణంగా ఆహారోత్పత్తులు పెంచేందుకు ఆధునిక వ్యవసాయ విధానాలు అవలంబించడం, చిన్న, సన్నకారు రైతులకు సహాయమందించడం, సాంకేతిక, వ్యవసాయ పరికరాలు వాడటం, ఆహారోత్పత్తుల్లో పోషక విలువలు పెంచడం, వివిధ సంస్థల మధ్య భాగస్వామ్యం పెంచడం వంటి ఐదు విధానాలను పాటించాలని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. వ్యవసాయేతర ఆదాయాలవైపునకు మళ్లుతున్నవారిని అడ్డుకునేందుకు వ్యవసాయ, వ్యవసాయేతర ఆదాయం మధ్య పెరుగుతున్న అంతరాన్ని పూరించాలని డబ్ల్యూఏఎఫ్ చైర్మన్ బోల్గర్ అన్నారు. చిన్నరైతులకు వ్యవసాయం ఆధారంగా కొనసాగాలంటే యాంత్రీకరణను ఒక పరిష్కారంగా పేర్కొన్నారు. సబ్సిడీలు చిన్నరైతులకు లబ్ధి చేకూరుస్తాయని చెప్పారు. నౌకాదళానికి ఆధునిక జెట్ ట్రైనర్ ‘హక్-132’ ఆధునిక జెట్ ట్రైనర్ (ఏజేటీ) ‘హక్ - 132’ ఎయిర్‌క్రాఫ్ట్‌ను నౌకాదళంలో చేర్చారు. నాలుగు ఏజేటీలను విశాఖపట్నంలోని తూర్పు నావల్ కమాండ్ బేస్ ఐఎన్ఎస్ డేగ వద్ద నౌకాదళాధిపతి డి.కె.జోషి నౌకాదళంలో ప్రవేశపెట్టారు. నాలుగో తరానికి చెందిన ఏజేటీ విమానాలను హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నిర్మించింది. దీనికి ఆధునిక నావిగేషన్ వ్యవస్థ, క్షిపణులు, రాకెట్లు, బాంబులు, తుపాకులు వంటి వాటిని చేర్చగల సామర్థ్యం ఉంది. ఆహార పుస్తక రచయిత్రి తర్లా దలాల్ మృతి ప్రముఖ ఆహార పుస్తక రచయిత్రి, పాక శాస్త్ర ప్రవీణురాలు తర్లా దలాల్ (77) నవంబర్ 6న ముంబైలో మరణించారు. ఆమె భారత తొలి మాస్టర్ చెఫ్‌గా గుర్తింపు పొందారు. వంటలపై 100 కు పైగా పుస్తకాలు రాశారు. 2007లో ఆమెను పద్మశ్రీ అవార్డుతో భారత ప్రభుత్వం సత్కరించింది. వ్యాపార రంగంలో శక్తిమంతమైన మహిళ చందా కొచర్ భారత వ్యాపార రంగంలో అత్యంత శక్తిమంతమైన 50 మంది మహిళల జాబితాలో ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచర్ వరుసగా మూడోసారి అగ్రస్థానం దక్కించుకున్నారు. యాక్సిస్ బ్యాంక్ ఎండీ శిఖా శర్మ, క్యాప్‌జెమిని ఇండియా సీఈవో అరుణ జయంతి తర్వాత స్థానాల్లో నిలిచారు. 2013 సంవత్సరానికి సంబంధించి ఫార్చూన్ మ్యాగజైన్ ఈ జాబితాను రూపొందించింది. ఎల్ఐసీ ఎండీగా ఉషా సంగ్వాన్ దేశీయ అతిపెద్ద జీవిత బీమా కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ)కి మేనేజింగ్ డెరైక్టర్‌గా ఉషా సంగ్వాన్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. సతీశ్‌రెడ్డికి హోమీ జే బాబా అవార్డు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు చెందిన క్షిపణి అభివృద్ధి కేంద్రం ‘రీసెర్చ్ సెంటర్ ఇమారత్’ డెరైక్టర్, ప్రముఖ శాస్త్రవేత్త జి.సతీశ్‌రెడ్డి ఈ ఏడాది ప్రతిష్టాత్మక హోమీ జే బాబా స్మారక అవార్డుకు ఎంపికయ్యారు. దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగం అభివృద్ధికి ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డును ప్రకటించారు. జమ్మూలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 03న జరగనున్న 101వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ అవార్డును ప్రదానం చేస్తారు. ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త హోమీ జహంగీర్ బాబా స్మారకార్థం ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ అసోసియేషన్ 1989 నుంచి ఏటా ఈ అవార్డును అందిస్తోంది. అంతర్జాతీయం విశ్వసుందరిగా మారియా గాబ్రియెలా ఇస్లర్ మిస్ యూనివ ర్స్ కిరీటాన్ని వెనిజువెలా సుందరి మారియా గాబ్రియెలా ఇస్లర్(25) దక్కించుకుంది. నవంబర్ 9న రష్యా రాజధాని మాస్కోలో జరిగిన ఫైనల్లో మొత్తం 85 మంది పాల్గొన్నారు. 2, 3 స్థానాల్లో మిస్ స్పెయిన్ పాట్రిసియా, మిస్ ఈక్వెడార్ కాన్స్టాంజా నిలిచారు. టీవీ యాంకర్‌గా పనిచేస్తున్న మారియా.. స్పెయిన్ జానపద నృత్యం ఫ్లమెంకోలో దిట్ట. మన దేశానికి చెందిన మానసి మోగే టాప్- 10లో ప్రవేశించినా.. టాప్-5లోకి చేరలేకపోయింది. భారత్ నుంచి చివరిసారిగా 2000లో లారాదత్తా మిస్ యూనివర్స్‌గా ఎంపికైంది. హతాఫ్-9 క్షిపణిని పరీక్షించిన పాక్ హతాఫ్-9 క్షిపణిని పాకిస్థాన్ నవంబర్ 5న విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి ప్రయోగించే ఈ క్షిపణి 60 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. బంగ్లాదేశ్‌లో మాజీ సైనికులకు మరణశిక్ష 2009 నాటి బంగ్లాదేశ్ సైనిక తిరుగుబాటు కేసులో 152 మంది మాజీ సైనికులకు ఢాకా మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు నవంబర్ 5న మరణశిక్ష విధించింది. బంగ్లాదేశ్ రైఫిల్స్ హెడ్ క్వార్టర్స్ వద్ద 2009, ఫిబ్రవరి 25, 26న పారామిలిటరీ సిబ్బంది తిరుగుబాటు చేసి 74 మంది అధికారులను హత్య చేశారు. ఈ కేసులో కోర్టు 152 మందికి మరణశిక్ష, 158 మందికి యావజ్జీవం, 251 మందికి ఐదేళ్లవరకు జైలు శిక్ష విధించింది. తజికిస్థాన్ అధ్యక్షుడిగా ఇమోమలి రఖ్మాన్ ఎన్నిక తజికిస్థాన్ అధ్యక్షుడిగా ఇమోమలి రఖ్మాన్ నవంబర్ 13న తిరిగి ఎన్నికయ్యారు. దీంతో 20 ఏళ్లుగా పాలిస్తున్న ఆయన మరో ఏడేళ్లపాటు అధికారంలో కొనసాగుతారు. రఖ్మాన్ 1992 నుంచి తజికిస్థాన్‌ను పరిపాలిస్తున్నారు. 4 మిలియన్ల ఓట్లలో ఆయనకు 83.1 శాతం ఓట్లు దక్కాయి. ఎన్నికల ప్రచారంలో ఉల్లంఘనలు జరుగుతున్నాయంటూ ప్రధాన ప్రతిపక్షం ఇస్లామిక్ రివైనల్ పార్టీ ఆఫ్ తజికిస్థాన్తోపాటు ఇతర ప్రతిపక్షాలు ఎన్నికలను బహిష్కరించాయి. భారత్ - చైనా సైనిక విన్యాసాలు పది రోజులపాటు సాగే భారత్-చైనా సంయుక్త సైనిక విన్యాసాలు నవంబర్ 5న చైనాలోని చెగ్దూ పట్టణ సమీపంలో ప్రారంభమయ్యాయి. ఇవి ఐదేళ్ల తర్వాత తొలిసారి జరుగుతున్నాయి. ఇటీవల ఇరుదేశాలు సరిహద్దు రక్షణ సహకార ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఈ నేపథ్యంలో కౌంటర్ టైజంపై దృష్టిసారించి ఈ విన్యాసాలు చేపట్టారు. కువైట్ ప్రధాని భారత్ పర్యటన కువైట్ ప్రధానమంత్రి షేక్ జబెర్ అల్ ముబారక్ అల్ అహ్మద్ అల్ సబా తన భారత పర్యటనలో నవంబర్ 8న ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశమయ్యారు. ఇందులో భాగంగా ఐదు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. తమ సంబంధాలను పటిష్టం చేసుకోవడంలో భాగంగా పెట్టుబడులు, వాణిజ్యం, భద్రత, ఇంధన రంగంలో ఉమ్మడి ప్రాజెక్టులపై చర్చలు జరిపాయి. ఫిలిప్పీన్స్‌లో హైయాన్ తుఫాన్ విధ్వంసం ఫిలిప్పీన్స్‌లో నవంబర్ 8, 9, 10 తేదీల్లో సంభవించిన తీవ్ర హైయాన్ తుఫాను వల్ల భారీ నష్టం జరిగింది. పదివేలమందికి పైగా మరణించారు. 44 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వేలాది మంది ఆచూకీ గల్లంతైంది. లైట్ ప్రావిన్స్‌లోని టాక్లోబాన్ పట్టణం అతలాకుతలం అయింది. తుపాన్ తీవ్రతకు లైట్, సమార్, విసాయాస్, బికోల్, మిండనాల్ ప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. చైనా, వియత్నాంలపై కూడా తుపాన్ ప్రభావం పడింది. -
వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు జాతీయం అనర్హత ఆర్డినెన్స్ ఉపసంహరణ వివిధ కేసుల్లో దోషులుగా నిర్ధారితులైన ఎంపీలు, ఎంఎల్ఏలు తక్షణమే అనర్హులు కాకుండా రక్షణ కల్పిస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్‌ను కేంద్ర కేబినెట్ అక్టోబర్ 2న ఉపసంహరించుకుంది. ఈ ఆర్డినెన్స్‌కు సెప్టెంబర్ 24న కేంద్రం ఆమోదం తెలిపింది. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడంతో ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం హైదరాబాద్ సహా పది జిల్లాలతో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ అక్టోబర్ 3న ఆమోదం తెలిపింది. జూలై 30 నాటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానానికి అనుగుణంగా తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం అంగీకరించింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందని కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే తెలిపారు. పదేళ్లపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కేబినెట్ తీర్మానించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న అంశాల పరిష్కారానికి, విభజన అంశాన్ని పరిశీలించడానికి మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తారు. రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటారు. మంత్రుల బృందం ఆరువారాల్లో సిఫార్సులు చేస్తుంది. భారత రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ బెల్జియం పర్యటన భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తన బెల్జియం పర్యటనలో ఆ దేశ ప్రధానమంత్రి ఎలియా డి రూపోతో అక్టోబర్ 3న సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఆర్థిక సంబంధాలను మరింత పటిష్టం చేసుకోవాలని రెండు దేశాలు నిర్ణయించాయి. ప్రధాన మౌలిక సదుపాయాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఉన్నత విద్య తదితర రంగాల్లో ఇరు దేశాలు సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుంటాయి. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారతదేశ శాశ్వత సభ్యత్వానికి తమ దేశ మద్దతును ప్రధాని డిరూపో పునరుద్ఘాటించారు. రెమిటెన్సుల్లో భారత్‌కు మొదటి స్థానం ప్రవాసీయులు తమ స్వదేశాలకు పంపే నిధులు (రెమిటెన్సులు) పొందడంలో భారత్ మొదటి స్థానంలో నిలిచింది. 2013లో భారత్ 71 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు పొంది మొదటి స్థానంలో ఉందని ప్రపంచ బ్యాంక్ తన నివేదికలో అక్టోబర్ 3న తెలిపింది. చైనా 60 బిలియన్ డాలర్లు పొంది రెండో స్థానంలో నిలిచింది. 26 బిలియన్ డాలర్ల నిధులతో ఫిలిప్పీన్స్ మూడో స్థానంలో ఉంది. 2013లో అభివృద్ధి చెందుతున్న దేశాలు పొందుతున్న మొత్తం రెమిటెన్సులు 414 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షాభియాన్‌కు ఆమోదం ఉన్నత విద్యా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షాభియాన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అక్టోబర్ 3న ఈ పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీన్ని 12, 13 పంచవర్ష ప్రణాళికల్లో అమలు చేస్తారు. ఈ పథకం కోసం మొత్తం 98,000 కోట్ల రూపాయలు కేటాయించారు. నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 65:35 నిష్పత్తిలో సమకూరుస్తాయి. ఈశాన్య, జమ్మూకాశ్మీర్ రాష్ట్రాల్లో 90:10 నిష్పత్తిలో నిధులు కేటాయిస్తాయి. సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ప్రత్యేక తరహా రాష్ట్రాల్లో 75:25 నిష్పత్తిలో నిధులు సమకూరుస్తారు. ఈ పథకం విశ్వవిద్యాలయాలకు, కళాశాలలకు అత్యంత స్వయం ప్రతిపత్తిని కల్పిస్తుంది. టీచింగ్- లెర్నింగ్ క్వాలిటీ, పరిశోధనలను మెరుగుపరచడంపై దృష్టి సారిస్తుంది. ఈ పథకం కిందకు 316 రాష్ట్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, 13,024 కళాశాలలను తీసుకువస్తారు. ఎస్బీఐ చైర్‌పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) చైర్‌పర్సన్‌గా అరుంధతీ భట్టాచార్య అక్టోబర్ 7న నియమితులయ్యారు. మూడేళ్లపాటు ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. బ్యాంక్ చరిత్రలో ఒక మహిళ ఈ అత్యున్నత స్థాయి బాధ్యతలు స్వీకరించడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఆగస్టు నుంచి ఆమె ఎస్బీఐ మేనేజింగ్ డెరైక్టర్(ఎండీ), చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. పృథ్వీ-2 ప్రయోగం విజయవంతం దేశీయ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన పృథ్వీ-2 క్షిపణిని అక్టోబర్ 7న మరోసారి విజయవంతంగా పరీక్షించారు. ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి దీన్ని ప్రయోగించారు. అణ్వస్త్రాలను మోసుకెళ్లే సామర్థ్యమున్న ఈ క్షిపణి 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. 500 కిలోల నుంచి వెయ్యి కిలోల బరువు ఉన్న వార్హెడ్లను మోసుకెళ్తుంది. దీన్ని 2003లో సైన్యంలో ప్రవేశపెట్టారు. కరణ్ థాపర్‌కు ఐపీఐ పురస్కారం సమకాలీన అంశాలపై, వివిధ రంగాల్లో ప్రముఖులతో టీవీ ఇంటర్వ్యూలు నిర్వహించడంలో పేరొందిన కరణ్ థాపర్ ‘ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్స్టిట్యూట్ (ఐపీఐ)-ఇండియా అవార్డ్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ జర్నలిజం ఫర్ 2013’కు ఎంపికయ్యారు. సీఎన్ఎన్ ఐబీఎన్ చానల్లో ‘డెవిల్స్ అడ్వొకేట్’ కార్యక్రమం ద్వారా 2012లో ప్రజా సంబంధిత అంశాలపై విధాన నిర్ణేతలను ఇంటర్వ్యూలు చేయడం ద్వారా వాటిపై దృష్టి సారించేలా కృషి చేసినందుకు ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఐపీఐ-ఇండియా శాఖ అక్టోబర్ 7న తెలిపింది. అంతర్జాతీయం వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ వైద్యశాస్త్రంలో చేసిన కృషికిగాను అమెరికా, జర్మనీలకు చెందిన ముగ్గురు శాస్త్రవేత్తలు ఉమ్మడిగా ఈ ఏడాది నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. శరీర కణాల్లో అంతర్గతంగా, కణాల మధ్య రవాణా వ్యవస్థపై పరిశోధన చేసిన.. అమెరికాకు చెందిన జేమ్స్ రోత్మాన్, రాండీ షెక్‌మాన్‌తోపాటు జర్మనీ సంతతి శాస్త్రవేత్త థామస్ స్యూదోఫ్‌లను నోబెల్‌కు ఎంపిక చేసినట్లు నోబెల్ జ్యూరీ ప్రకటించింది. ఈ బహుమతి కింద దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలను ముగ్గురు శాస్త్రవేత్తలు అందుకోనున్నారు. డిసెంబర్ 10న స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో జరిగే కార్యక్రమంలో వారికి పురస్కారాలను అందజేస్తారు. 2050 నాటికి జనాభాలో భారత్ నెంబర్ వన్ 2050 నాటికి భారత్ 160 కోట్ల జనాభాతో ప్రపంచంలో అత్యంత జనాభా కలిగిన దేశంగా అవతరించనుందని ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెమోగ్రఫిక్ స్టడీస్ తెలిపింది. ప్రస్తుతం భారత్ జనాభా 120 కోట్లు. ఇప్పుడు మొదటి స్థానంలో ఉన్న చైనా స్థానాన్ని భారత్ ఆక్రమిస్తుందని పేర్కొంది. ప్రస్తుతం చైనా జనాభా 130 కోట్లు. ప్రపంచ జనాభా 2050 నాటికి 970 కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది. ప్రస్తుతం ప్రపంచ జనాభా 710 కోట్ల్లుగా ఉంది. ఒబామా ప్రభుత్వంలో అసిస్టెంట్ సెక్రటరీగా అరుణ్ అమెరికా అంతర్జాతీయ వాణిజ్య విభాగం అసిస్టెంట్ సెక్రటరీగా భారత సంతతికి చెందిన అరుణ్ ఎం.కుమార్‌ను అక్టోబర్ 4న అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా నియమించారు. ఆయన కె.పి.ఎం.జి కన్సల్టెన్సీ సంస్థలో భాగస్వామిగా, బోర్డు సభ్యుడిగా పనిచేశారు. విదేశీ వాణిజ్య విభాగం అసిస్టెంట్ సెక్రటరీతోపాటు అంతర్జాతీయ వాణిజ్య పరిపాలన విభాగం డెరైక్టర్ జనరల్‌గా కూడా అరుణ్‌కుమార్ నియమితులయ్యారు. వరల్డ్ టాయిలెట్ సమ్మిట్ వరల్డ్ టాయిలెట్ సదస్సు ఇండోనేషియాలో అక్టోబర్ 2న మొదలైంది. ఈ మూడు రోజుల సదస్సులో పబ్లిక్ టాయిలెట్లు లేకపోవడం, బహిరంగ ప్రదేశాల్లో విసర్జన ప్రధానాంశాలుగా చర్చకు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మందికి మరుగుదొడ్ల సౌకర్యం, మురుగునీటి పారుదల సౌకర్యం అందుబాటులో లేదు. డయేరియాతో ప్రతి ఏటా 10 లక్షల మంది పిల్లలు మరణిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి తెలిపింది. సింగపూర్‌కు చెందిన జాక్సిమ్ 2001లో వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్‌ను ఏర్పాటు చేశారు. 15.7 మిలియన్లమందికి ఆకలి బాధ అభివృద్ధి చెందిన దేశాల్లో 15.7 మిలియన్ల మంది ఆకలి బాధతో ఉన్నట్లు ఐక్యరాజ్యసమితి ఆహార సంస్థలు తెలిపాయి. అక్టోబర్ 2న విడుదల చేసిన ప్రపంచంలో ఆహార భద్రత స్థితి - 2013 అనే నివేదికలో 2011-13లో మొత్తం 842 మిలియన్ల మంది ఆకలి బాధతో ఉన్నట్లు తెలిపింది. ఈ సంఖ్య 2010-12లో 868 మిలియన్లుగా ఉండేది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఎక్కువ మంది ప్రజలు ఆకలి బాధతో ఉండగా, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా 15.7 మిలియన్ల మంది ఆకలితో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. చురుకుగా, ఆరోగ్యంగా జీవించడానికి చాలినంత ఆహారం లేకపోవడాన్ని ఆకలి బాధగా నివేదిక తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాల్లో పెరుగుతున్న ఆర్థిక వృద్ధి ఆదాయాల పెరుగుదలకు, ఆహార లభ్యతకు తోడ్పడుతోందని వివరించింది. వ్యవసాయ ఉత్పత్తిలో అధిక వృద్ధి, వ్యవసాయ రంగంలో ప్రైవేటు పెట్టుబడులు ఆహార లభ్యతను మెరుగుపరుస్తున్నాయని నివేదిక తెలిపింది. ఈ నివేదికను ప్రతి ఏటా ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో), అంతర్జాతీయ వ్యవసాయ అభివృద్ధి నిధి, ప్రపంచ ఆహార కార్యక్రమం ప్రచురిస్తాయి. షట్‌డౌన్ ప్రకటించిన అమెరికా ప్రభుత్వం అమెరికా ప్రభుత్వం అక్టోబర్ 1న షట్‌డౌన్ ప్రకటించింది. షట్‌డౌన్ చేయాలంటూ ప్రభుత్వ కార్యాలయాలకు అమెరికా అధ్యక్ష కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లాయి. దాదాపు 18 ఏళ్ల తర్వాత అమెరికా షట్‌డౌన్ ప్రకటించింది. 1996లో క్లింటన్ కాలంలో షట్‌డౌన్ విధించారు. ఈ పాక్షిక షట్‌డౌన్ వల్ల అత్యవసర, నిత్యావసర సేవలు తప్ప ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోతాయి. అక్టోబర్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను సెప్టెంబర్ 30న కాంగ్రెస్ ఆమోదించకపోవడంతో షట్‌డౌన్ ప్రకటించాల్సి వచ్చింది. ‘ఒబామా కేర్’ అని పిలిచే ఆరోగ్య పథకంపై రిపబ్లిక్, డెమోక్రటిక్ పార్టీల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతో బడ్జెట్‌కు ఆమోదం లభించలేదు. యాజమాన్యాల నుంచి ఆరోగ్య బీమా లేనివారు వ్యక్తిగతంగా ఆరోగ్య బీమా పొందాలనేది ‘ఒబామా కేర్’ చట్టంలోని ముఖ్య నిబంధన. దీన్ని రిపబ్లికన్లు వ్యతిరేకిస్తున్నారు. యూకేలో హైకమిషనర్‌గా రంజన్ మథాయ్ భారత మాజీ విదేశాంగ కార్యదర్శి రంజన్ మథాయ్ యునెటైడ్ కింగ్డమ్లో భారత హైకమిషనర్‌గా అక్టోబర్ 1న నియమితులయ్యారు. ప్రస్తుత హైకమిషనర్ జైమిని భగవతీ స్థానంలో మథాయ్ బాధ్యతలు చేపడతారు. ఆయన ఫ్రాన్స్‌లో భారత రాయబారిగా కూడా పనిచేశారు. క్రీడలు సైనా నెహ్వాల్‌కు ‘స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్’ పత్రిక అవార్డు భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌కు స్పోర్ట్స్ పత్రిక ‘స్పోర్ట్స్ ఇలస్ట్రేటెడ్’ అవార్డు లభించింది. 2012 సంవత్సరానికి ఉత్తమ క్రీడాకారిణిగా ఆ పత్రిక సైనాను ఎంపిక చేసింది. ఈ అవార్డు రావడం ఆమెకు ఇది రెండోసారి. 2009లో అవార్డు ప్రారంభించినప్పుడు ఈ అవార్డు దక్కింది. ఉత్తమ కోచ్‌గా పుల్లెల గోపీచంద్‌ను పత్రిక ప్రకటించింది. ఉత్తమ యువ ఆటగాడిగా ఉన్ముక్త్ చంద్ (క్రికెట్), ఉత్తమ క్రీడాకారుడిగా విరాట్ కోహ్లి (క్రికెట్) ఎంపికయ్యారు. రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్‌లకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు దక్కింది. ముంబై ఇండియన్స్‌కు టీ-20 టైటిల్ చాంపియన్స్‌లీగ్ టీ-20 క్రికెట్ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. ఢిల్లీలో అక్టోబర్ 6న జరిగిన ఫైనల్స్‌లో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించింది. ఈ టైటిల్‌ను ముంబై ఇండియన్స్ గెలుచుకోవడం ఇది రెండోసారి. 2011లో మొదటిసారి చాంపియన్స్‌లీగ్ టైటిల్‌ను గెలుచుకుంది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా హర్భజన్ సింగ్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా డ్వేన్ స్మిత్ ఎంపికయ్యారు. అత్యధిక పరుగులకిచ్చే గోల్డెన్ బ్యాట్ అజింక్యా రహానే (288 పరుగులు, రాజస్థాన్ రాయల్స్), అత్యధిక వికెట్లు పడగొట్టిన క్రీడాకారుడికిచ్చే గోల్డెన్ వికెట్ ప్రవీణ్ తాంబే (12 వికెట్లు, రాజస్థాన్ రాయల్స్)కు దక్కాయి. జోకోవిచ్‌కు చైనా ఓపెన్ టెన్నిస్ టైటిల్ పురుషుల సింగిల్స్: ైచె నా ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సెర్బియాకు చెందిన జోకోవిచ్ సాధించాడు. అక్టోబర్ 6న బీజింగ్‌లో జరిగిన ఫైనల్లో రఫెల్ నాదల్ (స్పెయిన్)ను ఓడించాడు. 2009, 2010, 2012లో కూడా ఈ టైటిల్‌ను జోకోవిచ్ గెలిచాడు. మహిళల సింగిల్స్: సెరెనా విలియమ్స్ (అమెరికా) టైటిల్‌ను గెలుచుకుంది. ఫైనల్లో జంకోవిచ్ (సెర్బియా)ను ఓడించింది. ఇది సెరెనాకు 56వ టైటిల్. మహిళల డబుల్స్: సానియా మీర్జా (భారత్), కారా బ్లాక్ (జింబాబ్వే)లు మహిళల డబుల్స్ టైటిల్ గెలుపొందారు. వీరు ఫైనల్లో వెరా దుషెనివా (రష్యా), అరంటా సన్‌టోంజా (స్పెయిన్)ల జంటను ఓడించారు. వెటెల్‌కు కొరియా గ్రాండ్ ప్రి ఫార్ములావన్ కొరియా గ్రాండ్ ప్రి టైటిల్‌ను రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ సాధించాడు. అక్టోబర్ 6న ముగిసిన రేసులో వెటెల్ మొదటి స్థానంలో నిలవగా, లోటస్ జట్టు డ్రైవర్ రైకోనెన్ రెండో స్థానంలో నిలిచాడు. బోపన్న జోడికి జపాన్ ఓపెన్ జపాన్ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను రోహన్ బోపన్న (భారత్), రోజర్ వాసెలిన్ (జపాన్) జోడి గెలుచుకుంది. అక్టోబర్ 6న జరిగిన ఫైనల్లో జెమీ ముర్రే (బ్రిటన్), జాన్పీర్స్ (ఆస్ట్రేలియా) జోడిని ఓడించింది. భారత్‌కు అండర్-19 నాలుగు దేశాల క్రికెట్ టైటిల్ అండర్-19 నాలుగు దేశాల క్రికెట్ టోర్నమెంట్ టైటిల్‌ను భారత్ గెలుచుకుంది. అక్టోబర్ 5న విశాఖపట్నంలో జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను.. భారత్ ఓడించింది. భారత్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, జింబాబ్వే దేశాలు ఈ టోర్నమెంట్లో పాల్గొన్నాయి. -
అగ్ని-5 పరీక్ష విజయవంతం
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు క్రీడలు ప్రపంచ సీనియర్ రెజ్లింగ్‌లో అమిత్‌కు రజతం హంగేరిలో జరుగుతున్న ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ అమిత్ కుమార్ రజత పతకాన్ని గెలుచుకున్నాడు. సెప్టెంబర్ 16న జరిగిన పురుషుల ఫ్రీస్టయిల్ 55 కిలోల విభాగం ఫైనల్లో హసన్ ఫర్మాన్ రహీమి (ఇరాన్) చేతిలో ఓడిపోయాడు. తాజా ప్రదర్శనతో అమిత్ ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పతకం నెగ్గిన ఎనిమిదో భారత రెజ్లర్‌గా గుర్తింపు పొందాడు. తమిళనాడుకు మెయినుద్దౌలా కప్ మెయినుద్దౌలా గోల్డ్ కప్ క్రికెట్ టైటిల్‌ను తమిళనాడు గెలుచుకుంది. సెప్టెంబర్ 12న జరిగిన ఫైనల్స్‌లో ఢిల్లీ జట్టును తమిళనాడు ఓడించింది. అఫ్ఘానిస్థాన్‌కు శాఫ్ ఫుట్‌బాల్ కప్ దక్షిణాసియా ఫుట్‌బాల్ చాంపియన్‌షిప్ (శాఫ్)ను తొలిసారిగా అఫ్ఘానిస్థాన్ గెలుచుకుంది. ఖాట్మండులో సెప్టెంబర్ 11న జరిగిన ఫైనల్స్‌లో భారత్‌ను ఓడించింది. దీంతో భారత్ హ్యాట్రిక్ సాధించే అవకాశ ం కోల్పోయింది. శ్రీశాంత్, చవాన్లపై జీవిత కాల నిషేధం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడిన క్రికెట్ క్రీడాకారులు శ్రీశాంత్, అంకిత్ చవాన్లపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సెప్టెంబర్13న జీవితకాలం నిషేధం విధించింది. గతేడాది జరిగిన ఐపీఎల్ ఆరో సీజన్లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడిన వీరు స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి జట్టుకు అధిక పరుగులిచ్చారు. బుకీగా వ్యవహరించిన రాజస్థాన్ రాయల్స్ జట్టు మాజీ సభ్యుడు అమిత్‌సింగ్‌పై ఐదేళ్ల నిషేధం విధించారు. స్పాట్ ఫిక్సింగ్ గురించి తెలిసినా బీసీసీఐకి సమాచారం ఇవ్వని రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ సిద్ధార్థ త్రివేదిపై ఒక ఏడాదిపాటు బీసీసీఐ నిషేధం విధించింది. ఐఓసీ కొత్త అధ్యక్షుడిగా బాచ్ జాక్వస్ రోగే స్థానంలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) కొత్త అధ్యక్షుడిగా జర్మనీకి చెందిన 59 ఏళ్ల థామస్ బాచ్ ఎన్నికయ్యారు. ఆయన ఈ పదవిలో కనీసం ఎనిమిదేళ్లు కొనసాగే అవకాశముంది. జాతీయం లైబీరియా అధ్యక్షురాలు సర్లీఫ్ భారత్ పర్యటన లైబీరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సర్లీఫ్ భారత్ పర్యటనలో సెప్టెంబర్ 11న నాలుగు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. విద్యుత్ సరఫరా, పంపిణీ కోసం లైబీరియాకు భారత్ 144 మిలియన్ డాలర్ల రుణాన్ని అందిస్తుంది. రుణం, ఇంధన ఒప్పందాలతోపాటు ఉమ్మడి కమిషన్ ఏర్పాటు, విదేశీ సేవల సంస్థల మధ్య అవగాహన ఈ ఒప్పందాల్లో ఉన్నాయి. అంతర్జాతీయ శాంతి సుస్థిరతలను.. ప్రత్యేకంగా ఆఫ్రికా ఖండంలో మెరుగుపరిచేందుకు కలిసి పనిచేయాలని రెండు దేశాలు అంగీకరించాయి. షర్లీఫ్ తన పర్యటనలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీలతో సమావేశమై చర్చలు జరిపారు. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్‌కు లైబీరియా మద్దతు ఇవ్వడాన్ని ప్రధాని మన్మోహన్ కొనియాడారు. సర్లీఫ్కు ఇందిరాగాంధీ శాంతి బహుమతి 2012 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహుమతిని లైబీరియా అధ్యక్షురాలు ఎలెన్ జాన్సన్ సర్లీఫ్కు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. నోబెల్ శాంతి బహుమతి (2011) గ్రహీతైన సర్లీఫ్ ఆఫ్రికా ఖండంలోని ఓ దేశానికి ప్రజాయుతంగా ఎన్నికైన తొలి మహిళా అధ్యక్షురాలు కావడం విశేషం. ఈ అవార్డును భారత ప్రభుత్వం అంతర్జాతీయ శాంతి, అభివృద్ధిలో కృషి చేసిన వ్యక్తులు, సంస్థలకు అందిస్తోంది. ఈ అవార్డు కింద * 25 లక్షలు బహూకరిస్తారు. ఈ అవార్డు 2011లో ఇలాభట్‌కు లభించింది. ఆమె సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉమెన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సేవా) అనే సంస్థను నిర్వహిస్తున్నారు. అమితాబ్‌కు గ్లోబల్ డైవర్సిటీ అవార్డ్ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌కు 2013 గ్లోబల్ డైవర్సిటీ అవార్డు దక్కింది. సెప్టెంబర్ 12న లండన్‌లో బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో అమితాబ్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు. తన నాలుగు దశాబ్దాల నట జీవితంలో 180కు పైగా భారతీయ చిత్రాల్లో నటించిన అమితాబ్ భారతీయ చలనచిత్ర రంగాన్ని అత్యంత ప్రభావితం చేయగల వ్యక్తి అని ప్రశంసపత్రంలో పేర్కొన్నారు. కాగా అమితాబ్‌కు ఇంతకుముందు కూడా పలుసార్లు అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. బీబీసీ 1999లో నిర్వహించిన పోల్‌లో ‘మిలీనియంలోనే గొప్ప నటుడు’గా అమితాబ్ ఎంపికయ్యారు. 2003లో ఫ్రెంచ్ పట్టణం డీవిల్లే నుంచి గౌరవ పౌరసత్వం పొందారు. ఫ్రాన్స్‌లో అత్యున్నత పౌర పురస్కారమైన ‘నైట్ ఆఫ్ లీజియన్ ఆఫ్ హానర్’తో కూడా ఆ దేశ ప్రభుత్వం అమితాబ్‌ను సత్కరించింది. నీనా దావులూరికి మిస్ అమెరికా కిరీటం తెలుగు అమ్మాయి నీనా దావులూరి (24) మిస్ అమెరికాగా ఎంపికైంది. న్యూజెర్సీలోని అట్లాంటిక్ సిటీలో సెప్టెంబర్ 16న ముగిసిన పోటీలో నీనా విజేతగా నిలిచింది. 53 రాష్ట్రాల నుంచి 53 మంది పాల్గొన్న ఈ పోటీల్లో నీనా మిస్ న్యూయార్క్‌గా పోటీ పడింది. ఈ కిరీటం గెలిచిన తొలి భారతీయ సంతతి యువతి నీనా. ఆమె కుటుంబం కృష్ణా జిల్లా నుంచి అమెరికాకు వలస వెళ్లింది. ఈ గెలుపుతో నీనాకు 50,000 డాలర్లు (భారత కరెన్సీలో 35 లక్షల రూపాయలు) స్కాలర్షిప్ రూపంలో అందనున్నాయి. డబ్ల్యుహెచ్ఓ ఎస్ఈఏఆర్ఓ రీజినల్ డెరైక్టర్‌గా పూనమ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) ఆగ్నేయాసియా ప్రాంతీయ సంస్థ (ఎస్ఈఏఆర్ఓ) రీజినల్ డెరైక్టర్‌గా భారత ప్రతినిథి, మాజీ ఐఏఎస్ అధికారి డా.పూనమ్ ఖేత్రపాల్ సింగ్ సెప్టెంబర్ 12న ఎన్నికయ్యారు. ఆమె ఐదేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. 44 ఏళ్ల తర్వాత భారత్‌కు ఈ పదవి దక్కింది. బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ (63)ని ప్రధానమంత్రి అభ్యర్థిగా భారతీయ జనతాపార్టీ (బీజేపీ) ప్రకటించింది. న్యూఢిల్లీలో సెప్టెంబర్ 13న సమావేశమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డు నరేంద్ర మోడీ అభ్యర్థిత్వాన్ని నిర్ణయించింది. 2014 లోక్‌సభ ఎన్నికల్లో మోడీ ప్రధాని అభ్యర్థిగా ప్రజల ముందుకు వెళ్తారు. 2013-14లో వృద్ధి 5.3 శాతంగా పీఎంఏసీ అంచనా 2013-14 ఆర్థిక అంచనాల నివేదికను ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (పీఎంఏసీ) సెప్టెంబర్ 13న విడుదల చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధిరేటు 5.3 శాతంగా పేర్కొంది. దీన్ని ఏప్రిల్‌లో 6.4 శాతంగా అంచనా వేసింది. వ్యవసాయ రంగం 4.8 శాతం, పారిశ్రామిక రంగం 2.7 శాతం వృద్ధి చెందుతాయని పేర్కొంది. సేవల రంగంలో వృద్ధి 6.6 శాతానికి తగ్గుతుందని తెలిపింది. ఇది 2012-13లో 7 శాతం. మార్చి చివరి నాటికి ద్రవ్యోల్బణం 5.5 శాతంగా ఉంటుందని వివరించింది. వాణిజ్య లోటు 185 బిలియన్ డాలర్లుగా ఉందని తెలిపింది. ఆందోళన కలిగిస్తున్న కరెంట్ అకౌంట్ లోటు 70 బిలియన్ డాలర్లకు తగ్గుతుందని పేర్కొంది. ఇది జీడీపీలో 3.8 శాతం. విత్తలోటును జీడీపీలో 4.8 శాతంగా ఉంచడం ఒక సవాలుగా పీఎంఏసీ పేర్కొంది. అగ్ని-5 పరీక్ష విజయవంతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన ఖండాంతర క్షిపణి అగ్ని-5 పరీక్ష విజయవంతమైంది. 5000 కి.మీ దూరంలో లక్ష్యాన్ని ఛేదించగల ఈ క్షిపణి పరీక్షను ఒడిశాలోని వీలర్ ఐలాండ్ నుంచి సెప్టెంబర్ 15న పరీక్షించారు. అణ్వస్త్ర సామర్థ్యం గల, ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే ఈ క్షిపణిని పరీక్షించడం ఇది రెండోసారి. తొలిసారి ఏప్రిల్ 19, 2012న విజయవంతంగా పరీక్షించారు. ఈ క్షిపణి 1000 కిలోల అణ్వస్త్రాలను మోసుకుపోగలదు. దీని బరువు 50 టన్నులు. పొడవు 17.5 మీటర్లు. వెడల్పు 2 మీటర్లు. ఈ క్షిపణిని 2015 నాటికి సైన్యంలో చేర్చే ముందు మరో మూడు, నాలుగు పరీక్షలు నిర్వహిస్తారు. చైనా, పశ్చిమాసియా, ఆగ్నేయాసియా, ఆఫ్రికాలోని చాలా భూ భాగం అగ్ని-5 పరిధిలోకి వస్తాయి. తమ్మారెడ్డి కృష్ణమూర్తి కన్నుమూత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు, చిత్ర నిర్మాత తమ్మారెడ్డి కృష్ణమూర్తి (94) హైదరాబాద్‌లో సెప్టెంబర్ 16న మరణించారు. వామపక్ష ఉద్యమంలో, ప్రజా నాట్యమండలి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. తెలుగు, తమిళ భాషల్లో 13 చిత్రాలు నిర్మించారు. కృష్ణమూర్తికి 2007లో రాష్ట్ర ప్రభుత్వం అందించే రఘుపతి వెంకయ్య అవార్డు లభించింది. విద్యావేత్త వినోద్ రైనా మృతి ప్రముఖ విద్యావేత్త వినోద్ రైనా సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో మరణించారు. ‘ఉచిత, నిర్భంధ విద్యాహక్కు చట్టం-2009’ రూపకల్పనలో ఆయన ప్రధానపాత్ర పోషించారు. పిల్లల హక్కుల పరిరక్షణ నేషనల్ కమిషన్ ఏర్పాటు చేసిన ‘పిల్లల విద్యాహక్కు పర్యవేక్షణ’ నిపుణుల బృందంలో ఆయన సభ్యుడిగా పనిచేశారు. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఫర్ ఎడ్యుకేషన్ (సీఏబీఈ)లో సభ్యుడిగా ఆయన కొనసాగుతున్నారు. ‘భారత్ జ్ఞాన్ విజ్ఞాన్ సమితి’ అనే స్వచ్ఛంద సంస్థ సహ స్థాపకుల్లో రైనా ఒకరు. అంతర్జాతీయం ప్రపంచ ఆహారంలో మూడో వంతు వృథా ప్రపంచ ఆహార ఉత్పత్తిలో మూడో వంతు (1/3) వృథా అవుతున్నా యని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) సెప్టెంబర్ 11న తన నివేదికలో తెలిపింది. ‘ఆహార ధాన్యాల వృథా - సహజ వనరులపై ప్రభావం’ పేరుతో ఐరాస ఆహార, వ్యవసాయ సంస్థ తొలిసారిగా వెలువరించిన ఈ అధ్యయనంలో అంతర్జాతీయంగా తిండిని వృథా చేయడం వల్ల కలిగే దుష్ర్పభావాల గురించి పర్యావరణ కోణంలో వివరించారు. ఆహార ధాన్యాలను నిల్వ చేసే సామర్థ్యం లేకపోవడం, మనిషి నిర్లక్ష్యం కారణంగా ఉత్పత్తి అవుతున్న ఆహార పదార్థాల్లో మూడో వంతు వృథాగా మారుతున్నాయని తెలిపింది. ప్రతిరోజూ 820 మిలియన్ల మంది ఆకలితో ఉంటున్నట్లు కూడా ఆ నివేదిక పేర్కొంది. వృథాగా పోతున్న ఆహారం విలువ 750 బిలియన్ డాలర్లు ఉంటుంది. ఇందులో చేపలు, సముద్ర సంబంధిత ఆహారాన్ని చేర్చలేదు. వృథా అవుతున్న ఆహారాన్ని 1.3 బిలియన్ టన్నులుగా అంచనా వేశారు. ఉత్పత్తి చేసిన ఆహారంలో తినకుండాపోతున్న దానివల్ల ప్రతి ఏటా వాతావరణంలోకి 3.3 బిలియన్ టన్నుల గ్రీన్హౌస్ వాయువులు చేరుతున్నట్లు కూడా నివేదిక పేర్కొంది. ప్రపంచ ఆహార వృథాలో 54 శాతం ఉత్పత్తి, నూర్పిడి తర్వాత నిర్వహణ, నిల్వ స్థాయిల్లో వృథా అవుతోంది. మిగిలిన 46 శాతం ప్రాసెసింగ్, పంపిణీ, వినియోగ స్థాయిలో వృథాగా పోతోంది. సౌర కుటుంబం ఆవలికి వెళ్లిన వాయేజర్ - 1 అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రయోగించిన వ్యోమ నౌక వాయేజర్-1 సౌర కుటుంబం దాటి నక్షత్రాంతర రోదసీ (రెండు నక్షత్రాల మధ్య ప్రాంతం)లో ప్రవేశించింది. సౌర కుటుంబం దాటి అవతలికి ప్రవేశించిన తొలి మానవ నిర్మిత వస్తువు వాయేజర్-1. సౌర కుటుంబం ఆవలి నక్షత్రాంతర రోదసీని అధ్యయనం చేసేందుకు 1977లో నాసా వాయేజర్-1, వాయేజర్-2లను ప్రయోగించింది. 36 ఏళ్లుగా సాగుతున్న యాత్రలో వాయేజర్-1.. 1900 కోట్ల కి.మీ ప్రయాణించింది. ఈ యాత్రకు సంబంధించిన సమాచారాన్ని సెప్టెంబర్ 12 సంచికలో ‘సైన్స్’ పత్రిక ప్రచురించింది. రే డాల్బీ కన్నుమూత అమెరికాకు చెందిన శాస్త్రవేత్త, డాల్బీ లేబొరేటరీస్ వ్యవస్థాపకుడు రే డాల్బీ (80) శాన్ఫ్రాన్సిస్కోలో సెప్టెంబర్ 12న మరణించారు. ఆయన డాల్బీ వాయిస్ రిడక్షన్ విధానాన్ని రూపొందించి రికార్డింగ్ పరిశ్రమలో విప్లవం తీసుకొచ్చారు. డాల్బీ డిజిటల్ సరౌండ్ సౌండ్‌ను అభివృద్ధి చేసి సినిమా, హోం ఎంటర్టైన్మెంట్లో సరికొత్త ఆవిష్కరణలకు కారణమయ్యారు. చవకైన రాకెట్‌ను ప్రయోగించిన జపాన్ జపాన్ చవకైన రాకెట్ ‘ఎప్సిలోన్’నూ కైసూ అంతరిక్ష కేంద్రం నుంచి సెప్టెంబర్ 14న ప్రయోగించింది. ఈ రాకెట్ ద్వారా ‘స్ప్రింట్-ఎ’ అనే తొలి స్పేస్ టెలిస్కోప్‌ను అంతరిక్షానికి పంపింది. గ్రహాల పరిశీలనకు ఈ టెలిస్కోప్ తోడ్పడుతుంది. ‘ఎప్సిలోన్’ రాకెట్‌ను 40 మిలియన్ల డాలర్ల ఖర్చుతో నిర్మించారు. ఈ వ్యయం జపాన్ ప్రధాన రాకెట్ ‘హెచ్ 2ఎ’లో మూడో వంతు మాత్రమే. ‘హెచ్ 2ఎ’ రాకెట్లో మూడో వంతు సైజులో అంటే 24 మీటర్ల పొడవు గల ‘ఎప్సిలోన్’ను ఒక వారంలో ప్రయాణానికి సిద్ధం చేయొచ్చు. ఇది ‘హెచ్ 2ఎ’ తీసుకునే సమయంలో ఆరో వంతు మాత్రమే. యూరోపియన్ పార్లమెంట్ ప్రైజ్‌కు స్నోడెన్ ఎంపిక అమెరికా విజిల్ బ్లోయర్ ఎడ్వర్డ్ స్నోడెన్ 2013 సంవత్సరానికి యూరోపియన్ పార్లమెంట్ ప్రతిష్టాత్మక అవార్డు ‘సఖరోవ్ మానవ హక్కుల బహుమతి’కి ఎంపికయ్యాడు. ఆయన అమెరికా ప్రభుత్వ గ్లోబల్ ఎలక్ట్రానిక్ నిఘా కార్యక్రమాలను బయటపెట్టి సంచలనం సృష్టించాడు. స్నోడెన్ అమెరికా విడిచి రష్యాలో ఆశ్రయం పొందుతున్నాడు. -
సమైక్య కొరడా
-
కుట్రబాబు
-
కలిసుందాం!
-
సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జీ-20 సమావేశం
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు అంతర్జాతీయం సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జీ-20 సమావేశం జీ-20 దేశాల సమావేశం సెప్టెంబర్ 5, 6 తేదీల్లో సెయింట్‌పీటర్స్‌బర్గ్ (రష్యా)లో జరిగింది. సమావేశానంతరం జీ-20 దేశాల నాయకులు ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేశారు. ఉద్యోగ కల్పన, పటిష్టమైన, సుస్థిర, సమతౌల్య వృద్ధిని తిరిగి తీసుకొచ్చేందుకు కచ్చితమైన చర్యలకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. ఆర్థిక వృద్ధి, ప్రపంచ ఫైనాన్స్, పన్ను ఎగవేత, ఆర్థిక క్రమబద్ధీకరణ, అవినీతి వంటి అంశాలపై డిక్లరేషన్ దృష్టి సారించింది. వాతావరణ మార్పు, ఉగ్రవాదులకు ఆర్థిక సహాయం వంటి అంశాలకు కూడా ప్రాధాన్యతనిచ్చారు. సిరియా పరిస్థితిపై, సమస్యను ఎదుర్కోవడంపైన జీ-20 దేశాధినేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. భారత్ తరపున ఈ సమావేశంలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాల్గొన్నారు. వచ్చే సమావేశం 2014 నవంబర్‌లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ఆస్ట్రేలియా అధ్యక్షతన జరపాలని నిర్ణయించారు. భూమిపై అతిపెద్ద అగ్ని పర్వతం గుర్తింపు భూమిపై అతి పెద్ద అగ్ని పర్వతాన్ని పసిఫిక్ మహా సముద్ర గర్భంలో కనుగొన్నట్లు హోస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు సెప్టెంబర్ 5న ప్రకటించారు. ఇది సౌర కుటుంబంలో రెండో అతిపెద్ద అగ్ని పర్వతం. ఇది జపాన్‌కు 1609 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీన్ని ‘తాము మాసిఫ్’గా భావిస్తున్నారు. ‘తాము మాసిఫ్’ సముద్ర గర్భంలో ఉన్న శిఖరం. 130 - 145 మిలియన్ సంవత్సరాల క్రితం ఇది ఏర్పడింది. దీని విస్తీర్ణం 3,10,798 చదరపు కిలోమీటర్లు. అయితే ఏర్పడిన కొన్ని మిలియన్ సంవత్సరాల తర్వాత అది చురుకుదనం కోల్పోయింది. ప్రస్తుతం భూమిపై చురుకుగా ఉన్న ‘హవాయీ మౌనా లోయా’ అతిపెద్ద అగ్ని పర్వతం. దీని విస్తీర్ణం 5,179 చదరపు కిలోమీటర్లు. తాము మాసిఫ్ విస్తీర్ణంలో ఇది రెండు శాతం మాత్రమే. హోస్టన్ యూనివర్సిటీకి చెందిన ఎర్త్ అండ్ అట్మాస్ఫియరిక్ సెన్సైస్ చేసిన ఈ అధ్యయనం ఈ అతిపెద్ద అగ్ని పర్వతానికి సంబంధించిన సమాచారం అందించింది. పాక్ అధ్యక్షుడిగా ఐదేళ్లు కొనసాగిన జర్దారీ పాకిస్థాన్ అధ్యక్షుడిగా అసిఫ్ అలీ జర్దారీ ఐదేళ్ల పూర్తికాలం కొనసాగారు. సెప్టెంబర్ 8తో ఆయన పదవీకాలం పూర్తైది. పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్యబద్ధంగా అధ్యక్షుడిగా ఎన్నికై పూర్తి పదవీకాలం కొనసాగిన తొలి అధ్యక్షుడిగా జర్దారీ నిలిచారు. జర్దారీ స్థానంలో తదుపరి అధ్యక్షుడిగా మమ్మూన్ హుస్సేన్ సెప్టెంబర్ 10న ప్రమాణ స్వీకారం చేశారు. కంబోడియాలో పాలకపార్టీ సీపీపీ విజయం ప్రధానమంత్రి హూన్సేన్కు చెందిన కంబోడియా పీపుల్స్ పార్టీ (సీపీపీ) విజయం సాధించినట్లు కంబోడియా ఎలక్షన్ కమిటీ సెప్టెంబర్ 8న ప్రకటించింది. జూలైలో జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ప్రతిపక్ష నాయకుడు సామ్ రైన్స్సే ఆరోపిస్తూ రావడంతో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. చివరికి ఎలక్షన్ కమిటీ సీపీపీకి 3.2 మిలియన్ల ఓట్లతో 68 స్థానాలు, ప్రతిపక్ష పార్టీ సీఎన్‌ఆర్‌పీ 2.9 మిలియన్ ఓట్లతో 55 స్థానాలు దక్కినట్లు నిర్ణయించింది. ఆస్ట్రేలియా ప్రధానిగా టోనీ అబోట్ ఎన్నిక ఆస్ట్రేలియా ప్రధానమంత్రిగా టోనీ అబోట్ అధికారం చేపట్టనున్నారు. అబోట్ నాయకత్వంలోని లిబరల్/నేషనల్ సంకీర్ణం హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లో 150 స్థానాలకు గాను 90 స్థానాలు గెలుచుకున్నట్లు ఆస్ట్రేలియా ఎలక్టోరల్ కమిషన్ సెప్టెంబర్ 7న ప్రకటించింది. అధికారంలోని లేబర్ పార్టీకి 55 స్థానాలు లభించాయి. దీంతో ఆరేళ్లు ప్రధానిగా కొనసాగుతున్న కెవిన్‌రుడ్ పాలన ముగిసింది. జాతీయం ఆర్బీఐ కొత్త గవర్నర్‌గా రఘురామ్ రాజన్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్‌గా ప్రముఖ ఆర్థిక వేత్త, కేంద్ర ఆర్థిక శాఖ ముఖ్య సలహాదారుగా ఉన్న రఘురామ్ రాజన్ సెప్టెంబర్ 4న బాధ్యతలు స్వీకరించారు. పదవీ విరమణ చేసిన దువ్వూరి సుబ్బారావు స్థానంలో ఆర్బీఐ 23వ గవర్నర్‌గా రాజన్ నియమితులయ్యారు. ప్రధాన సమాచార కమిషనర్‌గా దీపక్ సంధు ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ)గా దీపక్ సంధు సెప్టెంబర్ 5న ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. సంధు దేశ తొలి మహిళా ప్రధాన సమాచార కమిషనర్. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్‌కు చెందిన మాజీ అధికారి అయిన సంధు 2009 నుంచి సమాచార కమిషనర్‌గా వ్యవహరిస్తున్నారు. 64 ఏళ్ల సంధూ 1971 బ్యాచ్‌కు చెందిన ఐఐఎస్ అధికారిణి. ఫించన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ, డెవలప్మెంట్ అథారిటీ (పీఎఫ్ఆర్డీఏ) బిల్లు-2011ను లోక్‌సభ సెప్టెంబర్ 4న ఆమోదించింది. వృద్ధాప్య ఆదాయ భద్రతను ప్రోత్సహించే అథారిటీ ఏర్పాటుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. పెన్షన్ ఫండ్‌ను ఈక్విటీ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు, పెన్షన్ రంగంలో 26 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతినిచ్చేందుకు ఈ బిల్లు తోడ్పడుతుంది. చందాదారులు తమ సొమ్మును కనీస హామీ మొత్తం పొందగలిగే పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకు సౌలభ్యం ఉంటుంది. ‘ఆదాయంతోపాటు పొదుపు’ అనే సూత్రం ఆధారంగా ఈ బిల్లును తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ బిల్లు పీఎఫ్ఆర్డీఏకి చట్టబద్ధమైన అధికారాలు కల్పిస్తుంది. ప్రస్తుతం 5.28 మిలియన్ల చందాదారులున్నారు. పీఎఫ్ఆర్డీఏ ఆగస్టు 14 నాటికి * 34,965 కోట్ల కార్పస్ ఫండ్ కలిగి ఉంది. 2004 జనవరి 1 నుంచి కేంద్ర ఉద్యోగులు (సాయుధ బలగాలు తప్ప) ఎన్‌పీఎస్‌లో కచ్చితంగా చేరాలని నిబంధన విధించారు. తర్వాత దేశంలో ఎవరైనా స్వచ్ఛందంగా ఎన్‌పీఎస్‌లో చేరేందుకు 2009 మేలో అవకాశం కల్పించారు. లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా జస్టిస్ రోహిణి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్‌గా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి.రోహిణి సెప్టెంబర్ 6న నియమితులయ్యారు. ఆమె రెండేళ్లపాటు ఈ పదవిలో ఉంటారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ ఎన్.వి. రమణ స్థానంలో జస్టిస్ రోహిణి బాధ్యతలు చేపట్టారు. జుబిన్ మెహతాకు టాగూర్ అవార్డు ప్రదానం పాశ్చాత్య సంగీత విద్వాంసుడు జుబిన్ మెహతాకు 2013 టాగూర్ సాంస్కృతిక సామరస్య అవార్డును రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ న్యూఢిల్లీలో సెప్టెంబర్ 6న ప్రదానం చేశారు. ఆయన పాశ్చాత్య సంప్రదాయ సంగీతంలో పేరుగాంచిన భారతీయుడు. ముంబైలో జన్మించిన మెహతా 1954లో వియన్నాకు వెళ్లి అక్కడ హాన్స్ స్వరోస్కీలో పాశ్చాత్య సంప్రదాయ సంగీతాన్ని ఆలపిస్తూ వచ్చారు. ఈ అవార్డు కింద కోటి రూపాయల నగదు, జ్ఞాపిక అందజేస్తారు. తొలి అవార్డును 2012లో సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్‌కు బహూకరించారు. భారతీయ రచయిత్రి సుస్మితా బెనర్జీ హత్య ప్రఖ్యాత భారతీయ రచయిత్రి సుస్మితా బెనర్జీ (43)ని అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ ఉగ్రవాదులు సెప్టెంబర్ 6న కాల్చి చంపారు. అఫ్గానిస్థాన్‌లో ఆరోగ్య కార్యకర్తగా ఆమె సేవలందిస్తుంది. సుస్మిత స్థానిక మహిళల జీవితాలను కెమెరాతో చిత్రీకరించినందుకు ఆమెను హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. మతం మార్చుకోవాలని వేధించిన తాలిబన్లు ఆమెను 1989లో అపహరించారు. 1993లో ఆమె తాలిబన్ల చెర నుంచి తప్పించుకున్న వైనంపై ‘ఏ కాబులీవాలాస్ బెంగాలీ వైఫ్’ పుస్తకం రాశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన ఈ నవలపై 2003లో హిందీలో ‘ఎస్కేప్ ఫ్రం తాలిబాన్’ అనే చిత్రం కూడా రూపొందింది. అక్షరాస్యతలో మొదటి స్థానంలో త్రిపుర దేశ అక్షరాస్యతలో త్రిపుర మొదటి స్థానంలో నిలిచినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తెలిపారు. 94.65 శాతం అక్షరాస్యతతో కేరళను అధిగమించి త్రిపుర మొదటి స్థానం సాధించింది. అంతర్జాతీయ అక్షరాస్యతా దినం సందర్భంగా సెప్టెంబర్ 8న నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాణిక్ ఈ విషయాన్ని తెలిపారు. కేరళ 93.91 శాతం అక్షరాస్యత సాధించింది. 100 శాతం అక్షరాస్యత లక్ష్యం సాధించేందుకు కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ తెలిపారు. వైమానిక దళానికి సీ-17 రవాణా విమానం భారీ రవాణా విమానం సీ-17 గ్లోబ్‌మాస్టర్-3ని రక్షణమంత్రి ఎ.కె ఆంటోనీ ఉత్తర ప్రదేశ్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో సెప్టెంబర్ 2న వైమానిక దళంలో ప్రవేశపెట్టారు. ఈ భారీ రవాణా విమానం సైనిక దళాలను, ట్యాంకర్లు వంటి ఆయుధాలను తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుంది. ఈ విమానం విపత్తుల్లో సహాయ చర్యలు చేపట్టడంలో వైమానిక దళం సామర్థ్యాన్ని ఎంతో పెంచుతుంది. 75 టన్నుల బరువు, 150 మంది సైనికులతో, 4200 కి.మీ నిరాటంకంగా సీ-17 విమానం ప్రయాణించగలదు. ప్రస్తుతం భారత్ ఉపయోగిస్తున్న రష్యా నిర్మించిన ఐఎల్-76 రవాణా విమానం 40 టన్నుల బరువును మాత్రమే మోయగలదు. పది సీ-17 విమానాలు, సంబంధిత పరికరాలు అమెరికా నుంచి కొనుగోలు చేయనుంది. క్రీడలు ఒలింపిక్స్‌లో స్థానం నిలుపుకున్న రెజ్లింగ్ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్ తన స్థానాన్ని నిలబెట్టుకుంది. 2020, 2024 ఒలింపిక్స్‌లో 26వ క్రీడగా రెజ్లింగ్‌ను కొనసాగిస్తున్నట్లు సెప్టెంబర్ 8న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) ప్రకటించింది. పోటీలో నిలిచిన బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్, స్క్వాష్లను ఓటింగ్‌లో వెనక్కి నెట్టి రెజ్లింగ్ తన స్థానాన్ని ఖాయం చేసుకుంది. మొత్తం 95 ఓట్లలో రెజ్లింగ్‌కు అనుకూలంగా 49 ఓట్లు వచ్చాయి. స్క్వాష్‌కు 22 ఓట్లు మాత్రమే రాగా, బేస్‌బాల్/సాఫ్ట్‌బాల్‌కు 24 ఓట్లు పడ్డాయి. రెజ్లింగ్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో క్రీడల జాబితా నుంచి ఐఓసీ తొలగించింది. కొత్తగా చేరిన రగ్బీ సెవెన్, గోల్ఫ్‌లతో కలిసి 2016 రియోడిజనిరో ఒలింపిక్స్‌లో మొత్తం 28 క్రీడాంశాల్లో పోటీలు జరుగుతాయి. 2020 ఒలింపిక్స్ వేదికగా టోక్యో ఖరారు ఒలింపిక్స్ క్రీడలు-2020ను నిర్వహించే అవకాశం జ పాన్ రాజధాని టోక్యో నగరానికి దక్కింది. సెప్టెంబర్ 8న బ్యూనస్ఎయిర్స్లో జరిగిన అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సమావేశంలో 2020 ఒలింపిక్స్ వేదికగా టోక్యోను ప్రకటించారు. ఇందుకోసం జరిగిన ఓటింగ్‌లో టోక్యో 24 ఓట్ల తేడాతో ఇస్తాంబుల్ (టర్కీ)పై స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ఒలింపిక్స్-2020 నిర్వహణ కోసం మొత్తం మూడు నగరాలు.. ఇస్తాంబుల్ (టర్కీ), మాడ్రిడ్ (స్పెయిన్), టోక్యో (జపాన్) పోటీపడ్డాయి. రాబోయే తరానికి ఒలింపిక్ విలువలు, క్రీడల ఫలితాలు అందించే క్రమంలో అద్భుతమైన, సురక్షితమైన క్రీడలను నిర్వహిస్తామంటూ (డిస్కవర్ టుమారో) పేరుతో జపాన్ ఇచ్చిన పిలుపు టోక్యోకు అవకాశం కల్పించింది. కాగా 1964లో కూడా టోక్యో ఒలింపిక్స్ నిర్వహించింది. రెండోసారి అవకాశం దక్కించుకున్న తొలి ఆసియా నగరం కూడా టోక్యోనే కావడం విశేషం. ఈ క్రీడల నిర్వహణకు రూ.54,087 కోట్లు ఖర్చు కాగలవని అంచనా. ఇటలీ గ్రాండ్ ప్రి విజేత వెటెల్ ఇటలీ గ్రాండ్ ప్రి రేసులో రెడ్‌బుల్ జట్టు డ్రైవర్ సెబాస్టియన్ వెటెల్ విజేతగా నిలిచాడు. సెప్టెంబర్ 8న జరిగిన ఈ రేసులో ఫెరారీ డ్రైవర్ ఆలోన్సో రెండో స్థానంలో, వెబెర్ మూడో స్థానంలో నిలిచారు. నాదల్, సెరెనాలకు యూఎస్ ఓపెన్ టెన్నిస్ టైటిల్స్ అమెరికాలో జరిగిన యూఎస్ ఓపెన్ టెన్నిస్ టైటిల్స్ విజేతల వివరాలు.. పురుషుల సింగిల్స్: సెప్టెంబర్ 9న జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో వరల్డ్ నెంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)ను ఓడించి రఫెల్ నాదల్ (స్పెయిన్) టైటిల్ గెలుచుకున్నాడు. ఈ గెలుపుతో నాదల్కు 3.6 మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ ద క్కింది. ఇది నాదల్కు 13వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. అదేవిధంగా రెండో యూఎస్ ఓపెన్ టెన్నిస్ టైటిల్. మహిళల సింగిల్స్: ప్రపంచ రెండో ర్యాంకర్ విక్టోరియా అజరెంకా (బెలారస్)ను ఓడించి సెరెనా విలియమ్స్ (అమెరికా) విజేతగా నిలిచింది. ఇది సెరెనాకు ఐదో యూఎస్ ఓపెన్ టైటిల్. దీనితో సెరెనా తన కెరీర్లో 17 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌ను సాధించింది. పురుషుల డబుల్స్: భారత్‌కు చెందిన లియాండర్ పేస్, రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్)తో కలిసి పురుషుల డబుల్స్ టైటిల్ సాధించాడు. ఫైనల్లో అలెగ్జాండర్ పెయా (ఆస్ట్రేలియా), బ్రూనో సోరెస్ (బ్రెజిల్)లను ఓడించి పేస్ జంట విజేతగా నిలిచింది. పేస్‌కు ఇది కెరీర్లో 14వ గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఇందులో ఎనిమిది డబుల్స్ టైటిళ్లు కాగా, ఆరు మిక్స్డ్ డబుల్స్ టైటిళ్లు. మహిళల డబుల్స్: ఈ టైటిల్‌ను ఆండ్రియా హవకోవా, లూసీ రడెకా (చెక్)లు గెలుచుకున్నారు. వీరు ఫైనల్లో ఆస్టీగ్ బార్టీ, కాస్ డెల్లాక్వా (ఆస్ట్రేలియా)లను ఓడించారు. మిక్స్డ్ డబుల్స్: ఆండ్రియా హవకోవా, మాక్స్మిర్నీ (చెక్ రిపబ్లిక్/బెలారస్)లు గెలుచుకున్నారు. వీరు ఫైనల్లో అబిగెయిల్ స్పియర్స్, సాంటియాగో గోంజాలెజ్ (అమెరికా/మెక్సికో)లను ఓడించారు. ఈతలో రికార్డు నెలకొల్పిన దియానా నయర్ అమెరికాకు చెందిన స్విమ్మర్ దియానా నయర్ (64) ఫ్లోరిడా జలసంధిలో క్యూబా నుంచి ఫ్లోరిడా కీస్ వరకు 177 కి.మీ ఈది రికార్డు నెలకొల్పింది. 53 గంటలపాటు సాగిన ఆమె సాహస కృత్యం సెప్టెంబర్ 2న ముగిసింది. షార్క్ కేజ్ లేకుండా చాలా దూరం సముద్రంలో ఈదిన తొలి వ్యక్తిగా దియానా రికార్డులకెక్కింది. -
దేశాల కూటములు, సదస్సుల వివరాలు...
యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, రైల్వే, బ్యాంక్స్ వంటి పోటీ పరీక్షల్లో జనరల్ స్టడీస్, జనరల్ అవేర్నెస్ విభాగాల్లో దేశాల కూటములు, సదస్సుల నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు అడుగుతున్నారు. ఎవరైతే జనరల్ స్టడీస్‌లో అత్యధిక మార్కులు సాధిస్తారో వారు పోటీలో ముందంజలో ఉంటారు. ఈ నేపథ్యంలో వివిధ పోటీ పరీక్షల్లో వివిధ దేశాల కూటములు, సదస్సులపై ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో తెలుసుకుందాం. ఎన్. విజయేందర్ రెడ్డి జనరల్ అవేర్నెస్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. జనరల్ స్టడీస్ అధ్యయనంలో భాగంగా అభ్యర్థులు వివిధ దేశాల కూటములు, వాటి కార్యకలాపాల ప్రధాన నగరాలు, ఏర్పాటైన సంవత్సరం, సభ్యదేశాల సంఖ్య, సభ్యదేశాల పేర్లు, ఆ సంస్థల అధ్యక్షులు లేదా సెక్రటరీ జనరల్, ఇటీవల శిఖరాగ్ర సమావేశం జరిగిన నగరం, దేశం పేర్లు, ఆ సంస్థలో భారతదేశం సభ్యదేశమా కాదా? తదుపరి సదస్సు ఏ దేశంలో జరుగుతుంది? వంటి విషయాలను క్షుణ్నంగా తెలుసుకోవాలి. అంతేకాకుండా ఈ సదస్సులలో పాల్గొన్న నాయకుల గురించి కూడా చదువుకోవాలి. పోటీ పరీక్షల కోణంలో అతి ముఖ్యమైన కొన్ని దేశాల కూటములు, సదస్సుల వివరాలు.. జీ-8 ఇది ఎనిమిది అత్యంత అభివృద్ధి చెందిన దేశాల కూటమి. ఇందులో కెనడా, ఫ్రాన్స, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యా, యూకే, యూఎస్ఏ సభ్య దేశాలు. 1975లో ఆరుదేశాలతో జీ-8 ఏర్పడింది. 1976లో కెనడా ఏడో సభ్యదేశంగా చేరింది. 1997లో రష్యా చేరికతో ఈ గ్రూపు జీ-8గా రూపాంతరం చెందింది. 39వ జీ-8 శిఖరాగ్ర సమావేశం 2013 జూన్ 17, 18 తేదీలలో యునెటైడ్ కింగ్‌డమ్‌లోని నార్తర్న ఐర్లాండ్‌లో జరిగింది. యూకే ఈ సమావేశాన్ని నిర్వహించడం ఇది ఆరోసారి. ఈ సమావేశంలో సిరియా అంతర్యుద్ధం గురించి చర్చించారు. 39వ జీ-8 సదస్సుకు కెనడా ప్రధానమంత్రి స్టీఫెన్ హార్పర్, ఫ్రాన్స అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండ్, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, ఇటలీ ప్రధాని ఎన్రికో లెట్టా, జపాన్ ప్రధాని షింజో అబె, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, యూకే ప్రధాని డేవిడ్ కామెరాన్, అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరయ్యారు. జీ-8 తదుపరి సమావేశం జూన్, 2014లో రష్యాలోని సోచి నగరంలో జరుగుతుంది. జీ-20 20 పెద్ద ఆర్థిక వ్యవస్థలకు చెందిన ఆర్థిక మంత్రుల, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల కూటమే జీ-20. ఇందులో 19దేశాలు, యూరోపియన్ యూనియన్ సభ్యులు. ఇది 1999లో ఏర్పడింది. ఈ 20 సభ్యుల దేశాధినేతల లేదా ప్రభుత్వాధినేతల శిఖరాగ్ర సమావేశాలు 2008 నుంచి ప్రారంభమయ్యాయి. ప్రపంచ వాణిజ్యంలో జీ-20 వాటా 80 శాతం ఉంటుంది. ఇందులో భారతదేశం కూడా ఒక సభ్యదేశమే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోని పలు సమస్యలను చర్చించడమే ఈ కూటమి ప్రధాన ఉద్దేశం. జీ-20 సభ్యులు: అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స, జర్మనీ, ఇండియా, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, టర్కీ, యూకే, యూఎస్ఏ, ఈయూ. 8వ జీ-20 సదస్సు 2013 సెప్టెంబర్ 5, 6 తేదీల్లో రష్యాలోని సెయింట్ పీటర్‌సబర్‌గలో జరిగింది. భారత ప్రధాని మన్మోహన్సింగ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. సిరియాపై సైనిక చర్యకు అమెరికా తొందరపడుతున్నప్పటికీ జీ-20లోని పలు దేశాల అధినేతలు మాత్రం దీనిని వ్యతిరేకించారు. తదుపరి జీ-20 సదస్సు నవంబర్, 2014లో ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో జరుగుతుంది. బ్రిక్స్ గోల్డ్‌మన్ శాక్స్‌లో పనిచేస్తున్న ప్రముఖ ఆర్థికవేత్త జిమ్ ఒ నీల్ ‘బ్రిక్’ అనే పదాన్ని 2001లో మొదటిసారిగా వాడారు. జీ-8 తర్వాత అతివేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలుగా బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలను ఆయన అభివర్ణించారు. బ్రిక్ దేశాల మొదటి సదస్సు జూన్, 2009లో రష్యాలోని వకాతెరిన్ బర్గ నగరంలో జరిగింది. 2010లో దక్షిణాఫ్రికా చేరడంతో ఈ గ్రూపు బ్రిక్స్‌గా మారింది. బ్రిక్స్ సదస్సులు: 1) 2009 వకాతెరిన్ బర్గ (రష్యా); 2) 2010 బ్రెజీలియా (బ్రెజిల్); 3) 2011 సాన్యా (చైనా); 4) 2012 ఢిల్లీ (ఇండియా); 5) 2013 డర్బన్ (దక్షిణాఫ్రికా) ఐదో బ్రిక్స్ సదస్సు 2013, మార్చి 26, 27 తేదీల్లో దక్షిణాఫ్రికాలోని డర్బన్ నగరంలో జరిగింది. ఈ సమావేశానికి బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రోసెఫ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని మన్మోహన్సింగ్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా హాజరయ్యారు. ఇప్పటివరకూ జరిగిన అన్ని బ్రిక్స్ సదస్సులకు హాజరైన ఒకే వ్యక్తి మన్మోహన్సింగ్. డర్బన్ సదస్సులో బ్రిక్స్ అభివృద్ధి బ్యాంక్ ఏర్పాటుపై చర్చించారు. ఈ బ్యాంక్‌ను 100 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్నారు. ఈ బ్యాంకు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మౌలిక వసతులను కల్పిస్తుంది. బ్రిక్స్ తదుపరి సదస్సు 2014లో బ్రెజిల్లో జరుగుతుంది. ఇబ్సా (ఐబీఎస్ఏ) అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించుకోవడం కోసం ఇండియా, బ్రెజిల్, దక్షిణాఫ్రికా ఐబీఎస్ఏను ఏర్పాటు చేసుకున్నా యి. వ్యవసాయం, వాణిజ్యం, సంస్కృతి, రక్షణ రంగాలలో సహకారానికై ఈ కూటమి ఏర్పడింది. తొలి సమావేశం 2006లో బ్రెజీలియాలో జరిగింది. 5వ సదస్సుకు 2011లో దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియా ఆతిథ్యమిచ్చింది. ఇబ్సా తదుపరి సదస్సు 2013లో న్యూఢిల్లీలో జరుగుతుంది. సార్క్ దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సమాఖ్య (సార్క్) డిసెంబర్, 1985లో ఏర్పడింది. ప్రధాన కార్యాలయం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది. సార్క్ సెక్రటరీ జనరల్ మాల్దీవులకు చెందిన అహ్మద్ సలీం. ఇందులో ఎనిమిది సభ్యదేశాలున్నాయి. అవి.. ఇండియా, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్థాన్, శ్రీలంక, అఫ్ఘానిస్థాన్. 2007లో అఫ్ఘానిస్థాన్ ఎనిమిదో సభ్యదేశంగా చేరింది. మొదటి సమావేశం 1985లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగింది. 17వ సమావేశాన్ని నవంబర్, 2011లో మాల్దీవులలోని అద్దూ నగరంలో నిర్వహించారు. ఇందులో భారత ప్రధాని మన్మోహన్సింగ్ పాల్గొన్నారు. సార్క 18వ సదస్సు 2014లో నేపాల్ రాజధాని ఖాట్మండులో జరుగుతుంది. భారతదేశం ఇప్పటివరకూ మూడు సార్క సదస్సులకు ఆతిథ్యమిచ్చింది. 1986లో బెంగళూరులో, 1995లో న్యూఢిల్లీలో, 2007లో న్యూఢిల్లీలో సార్క సమావేశాలు జరిగాయి. అలీనోద్యమం భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఇండోనేషియా తొలి అధ్యక్షుడు సుకర్నో, ఈజిప్టు రెండో అధ్యక్షుడు గామెల్ అబ్దుల్ నాసర్, ఘనా తొలి అధ్యక్షుడు క్వామేక్రుమా, యుగోస్లేవియా అధ్యక్షుడు జోసెఫ్ టిటో అలీన విధాన రూపకర్తలు. అమెరికా, సోవియట్ యూనియన్ దేశాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో ఈ కూటమి ఏర్పడింది. ఈ కూటమిలోని దేశాలు తటస్థ దేశాలు. సభ్యదేశాల స్వాతంత్య్రం, సార్వభౌమత్వం, సమగ్రత, భద్రతలను పరిరక్షించడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం. ఇందులో 120 సభ్యదేశాలు, 17 పరిశీలక దేశాలు ఉన్నాయి. మొదటి సమావేశం 1961లో బెల్గ్రేడ్లో జరిగింది. 16వ అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశాన్ని 2012లో ఆగస్టు 26 నుంచి 31 వరకు ఇరాన్ రాజధాని టెహరాన్‌లో నిర్వహించారు. ఇందులో 120 సభ్యదేశాలు పాల్గొన్నాయి. భారత ప్రధాని మన్మోహన్సింగ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. అలీన దేశాల కూటమికి 2012 నుంచి 2015 వరకు ఇరాన్ చైర్మన్‌గా వ్యవహరిస్తుంది. ప్రస్తుత చైర్మన్ ఇరాన్ అధ్యక్షుడు హసన్ రుహానీ. ఈ సమావేశాలు మూడేళ్లకు ఒకసారి జరుగుతాయి. 17వ అలీనోద్యమ శిఖరాగ్ర సదస్సును 2015లో వెనిజులా రాజధాని కారకాస్‌లో నిర్వహించనున్నారు. మనదేశం ఒకసారి ఆతిథ్యమిచ్చింది. 7వ సమావేశం 1983లో న్యూఢిల్లీలో జరిగింది. కామన్వెల్త్ ఆఫ్ నేషన్స ఇది ఒకప్పటి బ్రిటిష్ వలస రాజ్యాల కూటమి. ప్రధాన కార్యాలయం లండన్‌లో ఉంది. బ్రిటిష్ రాణి ఎలిజబెత్-2 ప్రస్తుత అధిపతి. భారతదేశానికి చెందిన కమలేష్ శర్మ సెక్రటరీ జనరల్. ఈ కూటమిలో 2009లో చేరిన చివరిదేశం రువాండా. 1949 లండన్ డిక్లరేషన్ ప్రకారం కామన్వెల్త్ ఏర్పడింది. కామన్వెల్త్ దేశాల సమావేశాలు రెండేళ్లకు ఒకసారి జరుగుతాయి. వీటిని చోగమ్ అని పిలుస్తారు. ఇఏైఎక అంటే కామన్వెల్త్ హెడ్స ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్. చోగమ్ మొదటి సమావేశం 1971లో సింగపూర్‌లో జరిగింది. 22వ చోగమ్‌ను అక్టోబర్, 2011లో ఆస్ట్రేలియాలోని పెర్తలో నిర్వహించారు. 23వ సదస్సు నవంబర్, 2013లో శ్రీలంక రాజధాని కొలంబోలో జరుగుతుంది. 7వ కామన్వెల్త్ సదస్సుకు 1983లో భారతదేశం ఆతిథ్యమిచ్చింది. ఒపెక్ ఒపెక్ 1960లో ఏర్పడింది. ఇది పెట్రోలియంను ఎగుమతి చేసే 12 దేశాల కూటమి. ప్రధాన కార్యాలయం ఆస్ట్రియా రాజధాని వియన్నాలో వుంది. సభ్యదేశాలు.. అల్జీరియా, అంగోలా, ఈక్వెడార్, ఇరాన్, ఇరాక్, కువైట్, లిబియా, నైజీరియా, ఖతార్, సౌదీ అరేబియా, యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్, వెనిజులా. ఆసియాన్ (ఆగ్నేయాసియా దేశాల సమాఖ్య) ఇండోనేషియా రాజధాని జకర్తా కేంద్ర కార్యాలయంగా ఆసియాన్ 1967లో ఏర్పడింది. ఇందులో పది ఆగ్నేయాసియా దేశాలు సభ్యులు. అవి.. బ్రూనై, ఇండోనేషియా, కాంబోడియా, లావోస్, మలేసియా, మయన్మార్ (బర్మా), ఫిలిప్పైన్‌స, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాం. ప్రస్తుత సెక్రటరీ జనరల్ వియత్నాంకు చెందిన లె లుంగ్ మిన్హ. 22వ ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు ఏప్రిల్, 2013లో బ్రూనై రాజధాని బందర్ సెరి బెగవాన్‌లో జరిగింది. ఎపెక్ (ఏషియా పసిఫిక్ ఎకనమిక్ కోఆపరేషన్) ఇది 1989లో సింగపూర్ ప్రధాన కార్యాలయంగా ఏర్పడింది. ఇందులో 21 దేశాలు సభ్యులు. భారతదేశానికి సభ్యత్వం లేదు. 24వ ఎపెక్ సమావేశం సెప్టెంబర్, 2012లో రష్యాలోని వ్లాదివోస్తాక్‌లో జరిగింది. 25వ సమావేశం వచ్చే నెలలో ఇండోనేషియాలో జరుగుతుంది. యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఐరోపా ఖండంలోని 28 దేశాల ఆర్థిక, రాజకీయ కూటమే యూరోపియన్ యూనియన్. ప్రధాన కార్యాలయం బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో వుంది. యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు హెర్మాన్ వాన్ రోంపి. కమిషన్ అధ్యక్షుడు జోస్ మాన్యుయేల్ బరోసో. 2012 నోబెల్ శాంతి బహుమతి ఈయూకే లభించింది. జూలై 1, 2013లో క్రొయేషియా యూరోపియన్ యూనియన్‌లో 28వ సభ్యదేశంగా చేరింది. నాటో నాటో 1949లో ఏర్పడిన మిలటరీ కూటమి. ప్రధాన కార్యాలయం బ్రస్సెల్స్‌లో ఉంది. సెక్రటరీ జనరల్ ఆండర్స ఫాగ్ రాస్ముసెన్. జీ-4 బ్రెజిల్, జర్మనీ, ఇండియా, జపాన్‌లను జీ-4 దేశాలు అంటారు. వీటి ప్రధాన ఉద్దేశం ఐక్యరాజ్యసమితిలోని భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం. ఏపీపీఎస్సీ నిర్వహించిన వివిధ పోటీ పరీక్షలలో దేశాల కూటములు, సదస్సుల గురించి అడిగిన కొన్ని ప్రశ్నలు: 1.ఈయూ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది? 2.సార్క శాశ్వత సచివాలయం ఎక్కడ ఉంది? 3.2012లో నోబెల్ శాంతి బహుమతి పొందింది? 4.2013 మార్చిలో 5వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం జరిగిన దేశం? 5.జీ-20 దేశాల ఆర్థిక మంత్రుల సమావేశం నవంబర్, 2012లో ఏ దేశంలో జరిగింది? 6.17వ సార్క దేశాల శిఖరాగ్ర సమావేశం జరిగిన దేశం? 7.ఆసియా-పసిఫిక్ ఎకనామిక్ కో-ఆపరేషన్ ఏర్పడిన సంవత్సరం? 8.బ్రిక్ గ్రూప్ బ్రిక్స్‌గా ఏ సంవత్సరంలో మారింది? 9.ఆగ్నేయాసియా దేశాల కూటమి ఆసియాన్ ఎప్పుడు ఏర్పడింది? 10.ఆగ్నేయ ఆసియా దేశాల సంఘం (ఏషియన్)లో సభ్యదేశాల సంఖ్య? 11.కమలేష్ శర్మ దేనికి సెక్రటరీ జనరల్? సమాధానాలు: 1) బ్రస్సెల్స్, 2) ఖాట్మండు,3) యూరోపియన్ యూనియన్, 4) దక్షిణాఫ్రికా, 5) మెక్సికో, 6) మాల్దీవులు, 7) 1989, 8) 2010, 9) 1967, 10) పది, 11) కామన్వెల్త్. -
సమైక్య సమరంపై కరెంట్ ఎఫైర్స్
-
ప్రగతి తప్పిన రథ చక్రాలు
-
పీఠముడి
-
సిరియా రసాయనిక దాడిలో 1300 మంది మృతి
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు అంతర్జాతీయం సిరియా రసాయనిక దాడిలో 1300 మంది మృతి సిరియా రాజధాని డెమాస్కస్ దగ్గర్లోని తూర్పు గౌటాలో ఆగస్టు 21న తిరుగుబాటుదారులపై ప్రభుత్వ బలగాలు రసాయనిక దాడి చేశాయి. ఈ ఘటనలో 1300 మంది మరణించారని ప్రతిపక్షాలు తెలిపాయి. వందలాదిమంది అస్వస్థతకు లోనయ్యారు. మరణించినవారిలో ఎక్కువ మంది పిల్లలున్నారు. అయితే, రసాయనిక దాడులు జరగలేదని ప్రభుత్వం పేర్కొంది. ఈ మరణాలపై దర్యాప్తు జరపాలని యూరోపియన్ యూనియన్ కోరింది. ఐక్యరాజ్యసమితి బృందాలు వాస్తవాలు తెలుసుకోవాలని అమెరికా, జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స దేశాలు కోరాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 2011 నుంచి ఉద్యమాలు చెలరేగాయి. అసద్ అధికారం నుంచి వైదొలగి ప్రజాస్వామిక సంస్కరణలు ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు, తిరుగుబాటు దళాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ పోరాటంలో 2012 జూన్ వరకు లక్షమంది మరణించారని, 40 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. ప్రముఖ రచయిత ఎల్మోర్ లియోనార్డ్ మృతి ప్రముఖ అమెరికన్ రచయిత ఎల్మోర్ లియోనార్డ్ (87) న్యూయార్కలో ఆగస్టు 20న మరణించారు. ఆయన క్రైం, సస్పెన్సతో కూడిన అనేక నవలలు రాశారు. గ్లిట్జ్, గెట్సార్ట్ల, అవుట్ ఆఫ్ సైట్, బండిట్స్ నవలలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఆయన 47వ పుస్తకం ‘బ్లూడ్రీమ్స్’ ఈ సంవత్సరం ప్రచురణ కావాల్సి ఉంది. జాతీయం ఎత్తై వైమానిక స్థావరంలో దిగిన సూపర్ హెర్క్యూలస్ విమానం జమ్మూ, కాశ్మీర్‌లోని లడక్‌లో ఉన్న దౌలత్‌బేగ్ ఓల్దీ వైమానిక స్థావరంలో భారత వాయుసేన.. సి-130 జె-30 సూపర్ హెర్క్యూలస్ రవాణా విమానాన్ని ఆగస్టు 20న దింపింది. ఈ స్థావరం ప్రపంచంలోనే ఎత్తై ప్రదేశంలో ఉంది. ఇది ఆక్సాయ్‌చిన్‌లో 16,614 అడుగులు (5,065 మీటర్లు) ఎత్తులో ఉంది. వాస్తవాధీన రేఖకు దగ్గరగా ఉంది. గత ఏప్రిల్‌లో చైనా బలగాలు ఇక్కడి భారత భూ భాగంలోకి చొచ్చుకువచ్చిన నేపథ్యంలో సూపర్ హెర్క్యూలస్‌ను దించారు. దీంతో ఈ ప్రాంతానికి జవాన్లు, యుద్ధ సామాగ్రి తరలింపు, కమ్యూనికేషన్ల నిర్వహణ సజావుగా సాగుతాయి. ఈ విమానం 20 టన్నుల బరువును అవలీలగా మోసుకెళ్తుంది. ఆహార భద్రత పథకం ప్రారంభం ఆహార భద్రత పథకాన్ని ఢిల్లీలో ఆగస్టు 20న సోనియా గాంధీ ప్రారంభించారు. ఢిల్లీతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్లు కూడా ఈ పథకాన్ని ప్రారంభించాయి. దేశంలో 80 కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రతి సంవత్సరం ఈ పథకం కోసం 1.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తారు. 6.2 కోట్ల టన్నుల బియ్యం, గోధుమలు, తృణ ధాన్యాలు సబ్సిడీపై పేదలకు అందజేస్తారు. దేశవ్యాప్తంగా చేపట్టే ఈ పథకానికి చట్టబద్ధత కల్పించేందుకు బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. నాలుగు ఒప్పందాలపై భారత్ - ఇరాక్ సంతకాలు ఇరాక్ ప్రధానమంత్రి నౌరీ అల్ - మాలికీ భారత పర్యటనలో ఆగస్టు 23న నాలుగు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇందులో బ్లాక్-8లో చమురు తవ్వకాలకు సంబంధించిన ఒప్పందాన్ని పూర్తి చేయడం ఒకటి. ఈ కాంట్రాక్టును సద్దాం హుస్సేన్ పాలనలో 2000లో ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్‌కు కేటాయించారు. అయితే రెండో గల్ఫ్ యుద్ధం తర్వాత ఇరాక్ తిరిగి సంప్రదింపులకు పిలుపునిచ్చింది. ఈ పర్యటనలో ఇరాక్ ప్రధాని మాలికీ భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో చర్చలు జరిపారు. చమురుశుద్ధి కర్మాగారాలు, ఎరువుల పరిశ్రమలు, స్టీల్ ప్రాజెక్టుల్లో ఉమ్మడి భాగస్వామ్యంపై కూడా ఇరు దేశాలు చర్చించాయి. వాయుసేనలోకి భారీ రవాణా విమానం వాయుసేన రవాణా సామర్థ్యం మరింత పటిష్టం కానుంది. అమెరికా నుంచి కొనుగోలు చేసిన భారీ తరహా రవాణా ఎయిర్‌క్రాఫ్ట్ సీ-17ను రక్షణమంత్రి ఏకే ఆంటోనీ సెప్టెంబర్ 2న వైమానిక దళంలో అధికారికంగా ప్రవేశపెట్టనున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో వీటి సేవలను ఆయన ప్రారంభిస్తారు. వాయుసేన 81వ స్క్వాడ్రన్‌లో చేర్చనున్న సీ-17 ఎయిర్‌క్రాఫ్ట్‌లను సుమారు రూ.20,000 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు అమెరికాతో ఒప్పందం కుదిరింది. దాదాపు 80 టన్నుల లోడ్‌ను ఇవి మోసుకెళ్లగలవు. 2011లో అమెరికాతో కుదిరిన ఒప్పందం ప్రకారం పది సీ-17 విమానాల సరఫరాకు భారత్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికే 3 విమానాలను అందచేయగా వచ్చే ఏడాది చివరినాటికి మిగతావి సరఫరా కానున్నాయి. ప్రకృతి విపత్తుల సమయంలో వీటి ద్వారా మెరుగైన సేవలు అందించవచ్చు. ఇంటర్నెట్ వినియోగంలో భారత్‌కు మూడో స్థానం ఇంటర్నెట్ వినియోగంలో భారత్ మూడో స్థానానికి చేరింది. మొదటి స్థానంలో చైనా, రెండో స్థానంలో అమెరికా ఉన్నాయి. జపాన్ను అధిగమించి భారత్ మూడో స్థానంలో చేరిందని ప్రపంచ డిజిటల్ మెజర్మెంట్ అండ్ అనలిటిక్స్ సంస్థ ‘కాంస్కోర్’ తన నివేదికలో పేర్కొంది. భారత్‌లో ప్రస్తుతం 74 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. 2012 మార్చి నుంచి వీరి సంఖ్య 31 శాతం పెరిగింది. వినియోగదారుల్లో మూడింట ఒక వంతు 35 ఏళ్లకంటే తక్కువ వయసువారున్నారు. పీసీ, ల్యాప్‌ట్యాప్ సర్వీసుల ఆధారంగా భారత్ నెట్ వినియోగదారుల సంఖ్య 74 మిలియన్లుగా కాంస్కోర్ సంస్థ పేర్కొంది. మొబైల్, టాబ్లెట్ నెట్ వినియోగదారులను కలుపుకుని ఈ సంఖ్య మార్చి 31 నాటికి 164.81 మిలియన్లని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది. రచయిత్రి మాలతీ చందూర్ కన్నుమూత ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ (84) ఆగస్టు 21న చెన్నైలో మరణించారు. ఆమె కృష్ణా జిల్లా, నూజివీడులో 1928లో జన్మించారు. ఆమె తెలుగులో మొత్తం 26 నవలలు రాశారు. మరెన్నో ఆంగ్ల రచనలను అనువదించారు. తొలి నవల ‘చంపకం - చెదపురుగులు’ కాగా, మొదటి కథ రవ్వలడ్డూలు. ఆమె నవల హృదయనేత్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆమె ఆంధ్రప్రభ వారపత్రికలో నిర్వహించిన ప్రమదావనం శీర్షిక వరుసగా 47 ఏళ్లపాటు కొనసాగి గిన్నిస్ రికార్డుకెక్కింది. సంగీత దర్శకుడు రఘునాథ్ పాణి గ్రాహి కన్నుమూత ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు పండిట్ రఘునాథ్ పాణిగ్రాహి(80) ఆగస్టు 25న భువనేశ్వర్‌లో మృతి చెందారు. ఆయన ఒడిశాలోనే తొలి సంగీత దర్శకుడు. ఒరియా, తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో అనేక పాటలు పాడారు. జయదేవుడి ‘గీత గోవిందం’ ఆలపించినందుకు 70వ దశకంలో ఫ్రెంచ్ ప్రభుత్వం ఆయనను సత్కరించింది. సంగీతంలో ఆయన సేవలకుగాను భారత ప్రభుత్వం 2010లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. హేతువాద నేత నరేంద్ర దభోల్కర్ హత్య ప్రముఖ హేతువాద నేత, మూఢనమ్మకాల వ్యతిరేక ప్రచారకుడు నరేందర దభోల్కర్ (69)ను పూణెలో ఆగస్టు 20న కాల్చి చంపారు. వైద్యుడైన నరేంద్ర అంధ శ్రద్ధ నిర్మూలన కమిటీకి అధ్యక్షుడిగా, సాధన వారపత్రిక సంపాదకుడిగా వ్యవహరించారు. గత రెండు దశాబ్దాలుగా సామాజిక రుగ్మతలపై ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు కృషి చేశారు. క్రీడలు ప్రపంచకప్ ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం పోలండ్‌లో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది. ఆగస్టు 25న జరిగిన టీమ్ రికర్వ్ విభాగం ఫైనల్లో దీపిక కుమారి, రిమిల్, బొంబేలా దేవిలతో కూడిన భారత జట్టు, ప్రపంచ నంబర్‌వన్, లండన్ ఒలింపిక్స్ చాంపియన్ దక్షిణ కొరియాను ఓడించింది. గత నెలలో కొలంబియాలో జరిగిన ప్రపంచ కప్‌లోనూ టీమిండియాకు బంగారు పతకం లభించింది. గోపీచంద్ అకాడమీకి రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ - 2013 అవార్డు హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ (పీజీబీఎ)కి లభించింది. అత్యుత్తమ అకాడమీల ఏర్పాటు, నిర్వహణ విభాగం కింద గోపీచంద్ అకాడమీని కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ సిఫార్సు చేసింది. ఈ అకాడమీ సైనా నెహ్వాల్, పి.వి.సింధు, పారుపల్లి కాశ్యప్ వంటి బ్యాడ్మింటన్ క్రీడాకారులను అందించింది. ఈ అవార్డు సర్వీసెస్ స్పోర్ట్స కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ), పెట్రోలియం స్పోర్ట్స ప్రమోషన్ బోర్డ, యు.కె. మిశ్రా జాతీయ స్పోర్ట్స అకాడమీ -అలహాబాద్‌లకు కూడా ప్రకటించారు. ఆసియా యూత్ క్రీడల్లో భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు చైనాలో జరిగిన ఆసియా యూత్ క్రీడల్లో ఆంధ్రపదేశ్‌కు చెందిన వెంకట్ రాహుల్ స్వర్ణ పతకం సాధించాడు. ఆగస్టు 21న జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ 77 కిలోల విభాగంలో రాహుల్ మొత్తం 310 కిలోల బరువెత్తి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. మహిళల 800 మీటర్ల పరుగులో అంజనా తమాకే స్వర్ణపతకం సాధించింది. భారత్‌కు తొలి స్వర్ణపతకం స్క్వాష్‌లో కుశ్కుమార్ అందించాడు. ఈ క్రీడల్లో భారత్ 3 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్య పతకాలతో పదో స్థానంలో నిలిచింది. చైనా 46 స్వర్ణం, 23 రజతం, 24 కాంస్యాలతో మొదటిస్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా (25-13-14) రెండోస్థానంలోనూ, జపాన్ (7-5-6) మూడోస్థానంలోనూ నిలిచాయి. ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగో స్థానం ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో భారత్‌కు నాలుగో స్థానం దక్కింది. సెర్బియాలో ఆగస్టు 25న ముగిసిన పోటీలో భారత రెజ్లర్లు బాలరాజ్ 76 కిలోల ఫ్రీ స్టయిల్ కేటగిరీలో రజతం, జతిన్ 42 కిలోల ఫ్రీ స్టయిల్ కేటగిరీలో కాంస్యం సాధించారు. 48 దేశాలు పాల్గొన్న ఈ చాంపియన్‌షిప్‌లో రష్యా మొదటి స్థానం సాధించగా, అజర్బైజాన్ రెండో స్థానంలో, ఇరాన్ మూడో స్థానంలో, భారత్ నాలుగో స్థానంలో నిలిచాయి. మహిళల విభాగంలో రష్యా మొదటి స్థానం, జపాన్ రెండో స్థానం, ఉక్రెయిన్ మూడో స్థానం, భారత్ ఏడో స్థానం సాధించాయి. లియాండర్ పేస్‌కు 52వ డబుల్స్ టైటిల్ అమెరికాలో ఆగస్టు 25న జరిగిన విన్స్టన్-సాలెమ్ ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్లో భారత టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్, కెనడా ప్లేయర్ డానియల్ నెస్టర్ జంట డబుల్స్ విజేతగా నిలిచింది. ఫైనల్లో పేస్ జంట.. ట్రీట్ హుయ్ (ఫిలిప్పీన్స్) - ఇంగ్లోట్ (బ్రిటన్)లపై గెలిచారు. 40 ఏళ్ల లియాండర్ పేస్‌కు ఇది 52వ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. నెస్టర్‌కు ఇది 81వ టైటిల్. అంతేకాకుండా ఈ విజయంతో నెస్టర్ తన కెరీర్లో డబుల్స్‌లో 900 పైగా విజయాలు సాధించిన తొలి క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. నేషనల్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో సౌరవ్, జోత్స్నలకు టైటిల్స్ 61 నేషనల్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సౌరవ్ ఘోషల్ గెలుచుకున్నాడు. జైపూర్‌లో ఆగస్టు 23న జరిగిన ఫైనల్స్‌లో మహేశ్ మంగోంకర్ను సౌరవ్ ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను జోత్స్న చిన్నప్ప గెలుచుకుంది. ఫైనల్స్‌లో అపరాజితా బాలమురుకన్ను ఓడించింది. న్యూహవెన్ ఓపెన్ టోర్నమెంట్ డబుల్స్ విజేత సానియా-జీ జెంగ్ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన ఖాతాలో 17వ డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకుంది. అమెరికాలో ఆగస్టు 25న జరిగిన న్యూ హవెన్ ఓపెన్ టోర్నమెంట్లో తన భాగస్వామి జీ జెంగ్ (చైనా)తో కలిసి సానియా విజేతగా నిలిచింది. మహిళల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ సానియా-జీ జెంగ్ , రెండో సీడ్ అనాబెల్ మెదీనా గారిగెజ్ (స్పెయిన్)-కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) జంటపై గెలిచింది. ఓవరాల్‌గా సానియా కెరీర్లో ఇది 17వ డబుల్స్ టైటిల్‌కాగా ఈ ఏడాది మూడోది. విజేతగా నిలిచిన సానియా జంటకు 36,500 డాలర్ల (రూ. 23 లక్షల 12 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రముఖ సెయిలర్ సి.ఎస్. ప్రదీపక్ మృతి ప్రముఖ సెయిలర్, అర్జున్ అవార్డు గ్రహీత సి.ఎస్. ప్రదీపక్ (66) ఆగస్టు 24న హైదరాబాద్‌లో మరణించారు. హుస్సేన్‌సాగర్‌లో సెయిలింగ్ నిర్వహించడాన్ని ప్రోత్సహించిన వారిలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. 1972 - 1992 మధ్య కాలంలో ఆయన ప్రముఖ సెయిలర్‌గా కొనసాగారు. ఆయన వరల్డ్ మాస్టర్స్‌లో కాంస్యం, ఆసియన్ గేమ్స్‌లో కాంస్యం, ఆసియన్ రెగట్టాలో స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. -
సిరియా రసాయనిక దాడిలో 1300 మంది మృతి
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు అంతర్జాతీయం సిరియా రసాయనిక దాడిలో 1300 మంది మృతి సిరియా రాజధాని డెమాస్కస్ దగ్గర్లోని తూర్పు గౌటాలో ఆగస్టు 21న తిరుగుబాటుదారులపై ప్రభుత్వ బలగాలు రసాయనిక దాడి చేశాయి. ఈ ఘటనలో 1300 మంది మరణించారని ప్రతిపక్షాలు తెలిపాయి. వందలాదిమంది అస్వస్థతకు లోనయ్యారు. మరణించినవారిలో ఎక్కువ మంది పిల్లలున్నారు. అయితే, రసాయనిక దాడులు జరగలేదని ప్రభుత్వం పేర్కొంది. ఈ మరణాలపై దర్యాప్తు జరపాలని యూరోపియన్ యూనియన్ కోరింది. ఐక్యరాజ్యసమితి బృందాలు వాస్తవాలు తెలుసుకోవాలని అమెరికా, జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స దేశాలు కోరాయి. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా 2011 నుంచి ఉద్యమాలు చెలరేగాయి. అసద్ అధికారం నుంచి వైదొలగి ప్రజాస్వామిక సంస్కరణలు ప్రవేశపెట్టాలని ప్రతిపక్షాలు, తిరుగుబాటు దళాలు ఆందోళన చేస్తున్నాయి. ఈ పోరాటంలో 2012 జూన్ వరకు లక్షమంది మరణించారని, 40 లక్షల మంది నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి చెబుతోంది. ప్రముఖ రచయిత ఎల్మోర్ లియోనార్డ్ మృతి ప్రముఖ అమెరికన్ రచయిత ఎల్మోర్ లియోనార్డ్ (87) న్యూయార్కలో ఆగస్టు 20న మరణించారు. ఆయన క్రైం, సస్పెన్సతో కూడిన అనేక నవలలు రాశారు. గ్లిట్జ్, గెట్సార్ట్ల, అవుట్ ఆఫ్ సైట్, బండిట్స్ నవలలు బాగా ప్రాచుర్యం పొందాయి. ఆయన 47వ పుస్తకం ‘బ్లూడ్రీమ్స్’ ఈ సంవత్సరం ప్రచురణ కావాల్సి ఉంది. జాతీయం ఎత్తై వైమానిక స్థావరంలో దిగిన సూపర్ హెర్క్యూలస్ విమానం జమ్మూ, కాశ్మీర్‌లోని లడక్‌లో ఉన్న దౌలత్‌బేగ్ ఓల్దీ వైమానిక స్థావరంలో భారత వాయుసేన.. సి-130 జె-30 సూపర్ హెర్క్యూలస్ రవాణా విమానాన్ని ఆగస్టు 20న దింపింది. ఈ స్థావరం ప్రపంచంలోనే ఎత్తై ప్రదేశంలో ఉంది. ఇది ఆక్సాయ్‌చిన్‌లో 16,614 అడుగులు (5,065 మీటర్లు) ఎత్తులో ఉంది. వాస్తవాధీన రేఖకు దగ్గరగా ఉంది. గత ఏప్రిల్‌లో చైనా బలగాలు ఇక్కడి భారత భూ భాగంలోకి చొచ్చుకువచ్చిన నేపథ్యంలో సూపర్ హెర్క్యూలస్‌ను దించారు. దీంతో ఈ ప్రాంతానికి జవాన్లు, యుద్ధ సామాగ్రి తరలింపు, కమ్యూనికేషన్ల నిర్వహణ సజావుగా సాగుతాయి. ఈ విమానం 20 టన్నుల బరువును అవలీలగా మోసుకెళ్తుంది. ఆహార భద్రత పథకం ప్రారంభం ఆహార భద్రత పథకాన్ని ఢిల్లీలో ఆగస్టు 20న సోనియా గాంధీ ప్రారంభించారు. ఢిల్లీతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలైన హర్యానా, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్లు కూడా ఈ పథకాన్ని ప్రారంభించాయి. దేశంలో 80 కోట్ల మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రతి సంవత్సరం ఈ పథకం కోసం 1.25 లక్షల కోట్లు ఖర్చు చేస్తారు. 6.2 కోట్ల టన్నుల బియ్యం, గోధుమలు, తృణ ధాన్యాలు సబ్సిడీపై పేదలకు అందజేస్తారు. దేశవ్యాప్తంగా చేపట్టే ఈ పథకానికి చట్టబద్ధత కల్పించేందుకు బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా ఆమోదం పొందింది. నాలుగు ఒప్పందాలపై భారత్ - ఇరాక్ సంతకాలు ఇరాక్ ప్రధానమంత్రి నౌరీ అల్ - మాలికీ భారత పర్యటనలో ఆగస్టు 23న నాలుగు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. ఇందులో బ్లాక్-8లో చమురు తవ్వకాలకు సంబంధించిన ఒప్పందాన్ని పూర్తి చేయడం ఒకటి. ఈ కాంట్రాక్టును సద్దాం హుస్సేన్ పాలనలో 2000లో ఓఎన్జీసీ విదేశ్ లిమిటెడ్‌కు కేటాయించారు. అయితే రెండో గల్ఫ్ యుద్ధం తర్వాత ఇరాక్ తిరిగి సంప్రదింపులకు పిలుపునిచ్చింది. ఈ పర్యటనలో ఇరాక్ ప్రధాని మాలికీ భారత ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో చర్చలు జరిపారు. చమురుశుద్ధి కర్మాగారాలు, ఎరువుల పరిశ్రమలు, స్టీల్ ప్రాజెక్టుల్లో ఉమ్మడి భాగస్వామ్యంపై కూడా ఇరు దేశాలు చర్చించాయి. వాయుసేనలోకి భారీ రవాణా విమానం వాయుసేన రవాణా సామర్థ్యం మరింత పటిష్టం కానుంది. అమెరికా నుంచి కొనుగోలు చేసిన భారీ తరహా రవాణా ఎయిర్‌క్రాఫ్ట్ సీ-17ను రక్షణమంత్రి ఏకే ఆంటోనీ సెప్టెంబర్ 2న వైమానిక దళంలో అధికారికంగా ప్రవేశపెట్టనున్నారు. దేశ రాజధాని న్యూఢిల్లీలోని హిండన్ ఎయిర్‌బేస్‌లో వీటి సేవలను ఆయన ప్రారంభిస్తారు. వాయుసేన 81వ స్క్వాడ్రన్‌లో చేర్చనున్న సీ-17 ఎయిర్‌క్రాఫ్ట్‌లను సుమారు రూ.20,000 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసేందుకు అమెరికాతో ఒప్పందం కుదిరింది. దాదాపు 80 టన్నుల లోడ్‌ను ఇవి మోసుకెళ్లగలవు. 2011లో అమెరికాతో కుదిరిన ఒప్పందం ప్రకారం పది సీ-17 విమానాల సరఫరాకు భారత్ ఆర్డర్ ఇచ్చింది. ఇప్పటికే 3 విమానాలను అందచేయగా వచ్చే ఏడాది చివరినాటికి మిగతావి సరఫరా కానున్నాయి. ప్రకృతి విపత్తుల సమయంలో వీటి ద్వారా మెరుగైన సేవలు అందించవచ్చు. ఇంటర్నెట్ వినియోగంలో భారత్‌కు మూడో స్థానం ఇంటర్నెట్ వినియోగంలో భారత్ మూడో స్థానానికి చేరింది. మొదటి స్థానంలో చైనా, రెండో స్థానంలో అమెరికా ఉన్నాయి. జపాన్ను అధిగమించి భారత్ మూడో స్థానంలో చేరిందని ప్రపంచ డిజిటల్ మెజర్మెంట్ అండ్ అనలిటిక్స్ సంస్థ ‘కాంస్కోర్’ తన నివేదికలో పేర్కొంది. భారత్‌లో ప్రస్తుతం 74 మిలియన్లకు పైగా ఇంటర్నెట్ వినియోగదారులున్నారు. 2012 మార్చి నుంచి వీరి సంఖ్య 31 శాతం పెరిగింది. వినియోగదారుల్లో మూడింట ఒక వంతు 35 ఏళ్లకంటే తక్కువ వయసువారున్నారు. పీసీ, ల్యాప్‌ట్యాప్ సర్వీసుల ఆధారంగా భారత్ నెట్ వినియోగదారుల సంఖ్య 74 మిలియన్లుగా కాంస్కోర్ సంస్థ పేర్కొంది. మొబైల్, టాబ్లెట్ నెట్ వినియోగదారులను కలుపుకుని ఈ సంఖ్య మార్చి 31 నాటికి 164.81 మిలియన్లని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది. రచయిత్రి మాలతీ చందూర్ కన్నుమూత ప్రముఖ రచయిత్రి మాలతీ చందూర్ (84) ఆగస్టు 21న చెన్నైలో మరణించారు. ఆమె కృష్ణా జిల్లా, నూజివీడులో 1928లో జన్మించారు. ఆమె తెలుగులో మొత్తం 26 నవలలు రాశారు. మరెన్నో ఆంగ్ల రచనలను అనువదించారు. తొలి నవల ‘చంపకం - చెదపురుగులు’ కాగా, మొదటి కథ రవ్వలడ్డూలు. ఆమె నవల హృదయనేత్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆమె ఆంధ్రప్రభ వారపత్రికలో నిర్వహించిన ప్రమదావనం శీర్షిక వరుసగా 47 ఏళ్లపాటు కొనసాగి గిన్నిస్ రికార్డుకెక్కింది. సంగీత దర్శకుడు రఘునాథ్ పాణి గ్రాహి కన్నుమూత ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు పండిట్ రఘునాథ్ పాణిగ్రాహి(80) ఆగస్టు 25న భువనేశ్వర్‌లో మృతి చెందారు. ఆయన ఒడిశాలోనే తొలి సంగీత దర్శకుడు. ఒరియా, తమిళం, తెలుగు, కన్నడ చిత్రాల్లో అనేక పాటలు పాడారు. జయదేవుడి ‘గీత గోవిందం’ ఆలపించినందుకు 70వ దశకంలో ఫ్రెంచ్ ప్రభుత్వం ఆయనను సత్కరించింది. సంగీతంలో ఆయన సేవలకుగాను భారత ప్రభుత్వం 2010లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. హేతువాద నేత నరేంద్ర దభోల్కర్ హత్య ప్రముఖ హేతువాద నేత, మూఢనమ్మకాల వ్యతిరేక ప్రచారకుడు నరేందర దభోల్కర్ (69)ను పూణెలో ఆగస్టు 20న కాల్చి చంపారు. వైద్యుడైన నరేంద్ర అంధ శ్రద్ధ నిర్మూలన కమిటీకి అధ్యక్షుడిగా, సాధన వారపత్రిక సంపాదకుడిగా వ్యవహరించారు. గత రెండు దశాబ్దాలుగా సామాజిక రుగ్మతలపై ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు కృషి చేశారు. క్రీడలు ప్రపంచకప్ ఆర్చరీలో భారత్‌కు స్వర్ణం పోలండ్‌లో జరుగుతున్న ఆర్చరీ ప్రపంచ కప్‌లో భారత మహిళల జట్టు స్వర్ణ పతకం గెలుచుకుంది. ఆగస్టు 25న జరిగిన టీమ్ రికర్వ్ విభాగం ఫైనల్లో దీపిక కుమారి, రిమిల్, బొంబేలా దేవిలతో కూడిన భారత జట్టు, ప్రపంచ నంబర్‌వన్, లండన్ ఒలింపిక్స్ చాంపియన్ దక్షిణ కొరియాను ఓడించింది. గత నెలలో కొలంబియాలో జరిగిన ప్రపంచ కప్‌లోనూ టీమిండియాకు బంగారు పతకం లభించింది. గోపీచంద్ అకాడమీకి రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ కేంద్ర ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మక రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ - 2013 అవార్డు హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ (పీజీబీఎ)కి లభించింది. అత్యుత్తమ అకాడమీల ఏర్పాటు, నిర్వహణ విభాగం కింద గోపీచంద్ అకాడమీని కేంద్ర క్రీడల మంత్రిత్వశాఖ సిఫార్సు చేసింది. ఈ అకాడమీ సైనా నెహ్వాల్, పి.వి.సింధు, పారుపల్లి కాశ్యప్ వంటి బ్యాడ్మింటన్ క్రీడాకారులను అందించింది. ఈ అవార్డు సర్వీసెస్ స్పోర్ట్స కంట్రోల్ బోర్డు (ఎస్‌ఎస్‌సీబీ), పెట్రోలియం స్పోర్ట్స ప్రమోషన్ బోర్డ, యు.కె. మిశ్రా జాతీయ స్పోర్ట్స అకాడమీ -అలహాబాద్‌లకు కూడా ప్రకటించారు. ఆసియా యూత్ క్రీడల్లో భారత్‌కు మూడు స్వర్ణ పతకాలు చైనాలో జరిగిన ఆసియా యూత్ క్రీడల్లో ఆంధ్రపదేశ్‌కు చెందిన వెంకట్ రాహుల్ స్వర్ణ పతకం సాధించాడు. ఆగస్టు 21న జరిగిన వెయిట్‌లిఫ్టింగ్ 77 కిలోల విభాగంలో రాహుల్ మొత్తం 310 కిలోల బరువెత్తి స్వర్ణ పతకాన్ని దక్కించుకున్నాడు. మహిళల 800 మీటర్ల పరుగులో అంజనా తమాకే స్వర్ణపతకం సాధించింది. భారత్‌కు తొలి స్వర్ణపతకం స్క్వాష్‌లో కుశ్కుమార్ అందించాడు. ఈ క్రీడల్లో భారత్ 3 స్వర్ణాలు, 4 రజతాలు, 7 కాంస్య పతకాలతో పదో స్థానంలో నిలిచింది. చైనా 46 స్వర్ణం, 23 రజతం, 24 కాంస్యాలతో మొదటిస్థానంలో నిలిచింది. దక్షిణ కొరియా (25-13-14) రెండోస్థానంలోనూ, జపాన్ (7-5-6) మూడోస్థానంలోనూ నిలిచాయి. ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు నాలుగో స్థానం ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో పురుషుల విభాగంలో భారత్‌కు నాలుగో స్థానం దక్కింది. సెర్బియాలో ఆగస్టు 25న ముగిసిన పోటీలో భారత రెజ్లర్లు బాలరాజ్ 76 కిలోల ఫ్రీ స్టయిల్ కేటగిరీలో రజతం, జతిన్ 42 కిలోల ఫ్రీ స్టయిల్ కేటగిరీలో కాంస్యం సాధించారు. 48 దేశాలు పాల్గొన్న ఈ చాంపియన్‌షిప్‌లో రష్యా మొదటి స్థానం సాధించగా, అజర్బైజాన్ రెండో స్థానంలో, ఇరాన్ మూడో స్థానంలో, భారత్ నాలుగో స్థానంలో నిలిచాయి. మహిళల విభాగంలో రష్యా మొదటి స్థానం, జపాన్ రెండో స్థానం, ఉక్రెయిన్ మూడో స్థానం, భారత్ ఏడో స్థానం సాధించాయి. లియాండర్ పేస్‌కు 52వ డబుల్స్ టైటిల్ అమెరికాలో ఆగస్టు 25న జరిగిన విన్స్టన్-సాలెమ్ ఓపెన్ ఏటీపీ టోర్నమెంట్లో భారత టెన్నిస్ ఆటగాడు లియాండర్ పేస్, కెనడా ప్లేయర్ డానియల్ నెస్టర్ జంట డబుల్స్ విజేతగా నిలిచింది. ఫైనల్లో పేస్ జంట.. ట్రీట్ హుయ్ (ఫిలిప్పీన్స్) - ఇంగ్లోట్ (బ్రిటన్)లపై గెలిచారు. 40 ఏళ్ల లియాండర్ పేస్‌కు ఇది 52వ డబుల్స్ టైటిల్ కావడం విశేషం. నెస్టర్‌కు ఇది 81వ టైటిల్. అంతేకాకుండా ఈ విజయంతో నెస్టర్ తన కెరీర్లో డబుల్స్‌లో 900 పైగా విజయాలు సాధించిన తొలి క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. నేషనల్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో సౌరవ్, జోత్స్నలకు టైటిల్స్ 61 నేషనల్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను సౌరవ్ ఘోషల్ గెలుచుకున్నాడు. జైపూర్‌లో ఆగస్టు 23న జరిగిన ఫైనల్స్‌లో మహేశ్ మంగోంకర్ను సౌరవ్ ఓడించాడు. మహిళల సింగిల్స్ టైటిల్‌ను జోత్స్న చిన్నప్ప గెలుచుకుంది. ఫైనల్స్‌లో అపరాజితా బాలమురుకన్ను ఓడించింది. న్యూహవెన్ ఓపెన్ టోర్నమెంట్ డబుల్స్ విజేత సానియా-జీ జెంగ్ భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తన ఖాతాలో 17వ డబుల్స్ టైటిల్‌ను జమ చేసుకుంది. అమెరికాలో ఆగస్టు 25న జరిగిన న్యూ హవెన్ ఓపెన్ టోర్నమెంట్లో తన భాగస్వామి జీ జెంగ్ (చైనా)తో కలిసి సానియా విజేతగా నిలిచింది. మహిళల డబుల్స్ ఫైనల్లో మూడో సీడ్ సానియా-జీ జెంగ్ , రెండో సీడ్ అనాబెల్ మెదీనా గారిగెజ్ (స్పెయిన్)-కాటరీనా స్రెబోత్నిక్ (స్లొవేనియా) జంటపై గెలిచింది. ఓవరాల్‌గా సానియా కెరీర్లో ఇది 17వ డబుల్స్ టైటిల్‌కాగా ఈ ఏడాది మూడోది. విజేతగా నిలిచిన సానియా జంటకు 36,500 డాలర్ల (రూ. 23 లక్షల 12 వేలు) ప్రైజ్‌మనీతోపాటు 470 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. ప్రముఖ సెయిలర్ సి.ఎస్. ప్రదీపక్ మృతి ప్రముఖ సెయిలర్, అర్జున్ అవార్డు గ్రహీత సి.ఎస్. ప్రదీపక్ (66) ఆగస్టు 24న హైదరాబాద్‌లో మరణించారు. హుస్సేన్‌సాగర్‌లో సెయిలింగ్ నిర్వహించడాన్ని ప్రోత్సహించిన వారిలో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. 1972 - 1992 మధ్య కాలంలో ఆయన ప్రముఖ సెయిలర్‌గా కొనసాగారు. ఆయన వరల్డ్ మాస్టర్స్‌లో కాంస్యం, ఆసియన్ గేమ్స్‌లో కాంస్యం, ఆసియన్ రెగట్టాలో స్వర్ణ పతకాలు గెలుచుకున్నారు. -
ఆరని చిచ్చు..!
-
పార్టీలకు అతీతంగా మద్ధతు
-
కరెంట్ అఫైర్స్
ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు అంతర్జాతీయం ఈజిప్టులో 525 మంది నిరసనకారుల మృతి ఈజిప్టు సైన్యం అణచివేత చర్యలకు నిరసనగా వీధుల్లో చేరిన వేలాది మంది ముస్లిం బ్రదర్హుడ్ పార్టీ కార్యకర్తలపై ఆగస్టు 15న సైన్యం జరిపిన దాడుల్లో 525 మంది మరణించారు. వేలాది మంది గాయపడ్డారు. అయితే 2600 మంది మరణించినట్లు 10 వేల మంది గాయపడినట్లు ముస్లిం బ్రదర్హుడ్ తెలిపింది. జూలై 3న అధ్యక్షుడు మోర్సీని సైన్యం అధికారం నుంచి తొలగించి, రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసింది. దీంతో మోర్సీకి చెందిన ముస్లిం బ్రదర్హుడ్ పార్టీ కార్యకర్తలు తాత్కాలిక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మొదలుపెట్టారు. నిరసనలు అణచి వేసేందుకు సైన్యం చర్యలు చేపట్టింది. ఆగస్టు 14న దేశంలో నెల రోజులపాటు ఎమర్జెన్సీ ప్రకటించారు. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యక్షుడు ఎల్ బరాదీ పదవికి రాజీనామా చేశారు. సైన్యం మద్దతుతో నడుస్తున్న ప్రభుత్వ చర్యలను అనేక పశ్చిమ దేశాలు ఖండించాయి. సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ అధ్యక్షుడిగా మైకేల్ జొతోడియా తిరుగుబాటు నాయకుడు మైకేల్ జొతోడియా సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్ (సీఏఆర్) కొత్త అధ్యక్షుడిగా ఆగస్టు 18న ప్రమాణ స్వీకారం చేశారు. ‘సెలెకా’ తిరుగుబాటు సంకీర్ణానికి ఆయన నాయకుడు. సుదీర్ఘకాలం పాలన సాగిస్తున్న ప్రాంకోసిస్ బూజీజెను మార్చిలో అధికారం నుంచి తొలగించి తనకు తానే అధ్యక్షుడిగా జొతొడియా ప్రకటించుకున్నాడు. జాతీయం జన్యుమార్పులతో క్లోమగ్రంధి వ్యాధి క్లోమగ్రంధి వ్యాధి (పాంక్రియాటైటిస్)కి జన్యుపరమైన మార్పులే ప్రధాన కారణం. సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ), ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ (ఏఐజీ) శాస్త్రవేత్తల పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. పాంక్రియాటైటిస్‌కు గల కారణాలపై 25 దేశాలకు చెందిన 55 మంది శాస్త్రవేత్తలు, నిపుణులతో చేసిన సంయుక్త పరిశోధన ఫలితాలను లండన్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘నేచర్ జెనెటిక్స్’ తాజా సంచికలో ప్రచురించింది. ఈ పరిశోధనల్లో కీలక భూమిక పోషించిన సీసీఎంబీ, ఏఐజీ ప్రతినిధులు ఆగస్టు 18న హైదరాబాద్‌లో వివరాలు వెల్లడించారు. మానవ శరీరంలో చిన్న అవయవమైన క్లోమ గ్రంధి పనిచేయకపోవడానికి ఇప్పటివరకు ఆల్కహాల్, మాల్ న్యూట్రిషన్ కారణమని భావించేవారు. అయితే జన్యుపరమైన మార్పులూ ఇందుకు కారణమని వారు చేసిన పరిశోధనలో తేలింది. సాధారణంగా ఇన్సులిన్ ఉత్పత్తి ద్వారా షుగర్‌ను నియంత్రించడం, ఆహారాన్ని జీర్ణమయ్యేలా చేయడం క్లోమం ప్రధాన విధులు. ఇది పనిచేయకపోతే మధుమేహం (షుగర్ వ్యాధి) వస్తుంది. అలాగే ఆహారం జీర్ణం కాకపోవడంవల్ల విపరీతమైన కడుపు నొప్పి వస్తుంది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్.వి.రమణ పేరు సిఫారసు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్.వి.రమణ పేరును భారత ప్రధాన న్యాయమూర్తి పి.సదాశివం నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారు. రెండువారాల్లోగా నియామకం జరగవచ్చని కేంద్ర న్యాయశాఖ వర్గాలు వెల్లడించాయి. జస్టిస్ రమణ 1957 ఆగస్టు 27న కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. హైకోర్టుతో పాటు కేంద్ర, రాష్ట్ర పరిపాలనా ట్రిబ్యునళ్లలో ప్రాక్టీస్ చేశారు. సుప్రీంకోర్టులో కూడా కేసులు వాదించారు. రాజ్యాంగపరమైన, క్రిమినల్, సర్వీస్, అంతరాష్ట్ర నదీ జలాల సంబంధిత కేసుల వాదన ఆయన ప్రత్యేకత. 2000, జూన్ 27న హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అమీర్‌ఖాన్‌కు ఉర్దూ యూనివర్సిటీ డాక్టరేట్ హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ ప్రముఖ బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌కు డాక్టరేట్ ప్రదానం చేయాలని నిర్ణయించింది. ఈ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకునేవారిలో అమీర్ఖాన్తోపాటు సచార్ కమిటీ చైర్మన్ జస్టిస్ రాజేంద్ర సచార్ కూడా ఉన్నారు. యూనివర్సిటీ ఐదో స్నాతకోత్సవం సందర్భంగా ఆగస్టు 24న వీరికి డాక్టరేట్లు ప్రదానం చేస్తారు. జీఎస్ఎల్వీ-డీ 5 ప్రయోగం వాయిదా జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ - డీ 5 (జీఎస్ఎల్వీ-డీ5) ప్రయోగం వాయిదా పడింది. ఆగస్టు 19న శ్రీహరికోట నుంచి సాయంత్రం 4.50 గంటలకు జరగాల్సిన ఈ ప్రయోగ వాహన నౌక రెండో దశలో ద్రవ ఇంధనంలో లీకేజి ఏర్పడింది. ఈ వాహక నౌక ద్వారా 1982 కిలోల సమాచార ఉపగ్రహం జీశాట్-14ను 36,000 కిలోమీటర్ల దూరంలోని మధ్యంతర భూ స్థిర కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉంది. 49.13 మీటర్ల ఎత్తు, 414.75 టన్నుల బరువు గల జీఎస్ఎల్వీలో మూడు దశలు ఉంటాయి. మొదటి దశలో ఘన ఇంధనాన్ని, రెండో దశలో ద్రవ ఇంధనాన్ని ఉపయోగించారు. మూడో దశలో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన క్రయోజనిక్ ఇంజన్లో ద్రవ హైడ్రోజన్, ఆక్సిజన్లను వాడారు. ప్రస్తుతం జరిపేది ఎనిమిదో జీఎస్ఎల్వీ ప్రయోగం. మొదటి ఆరు ప్రయోగాలకు రష్యా అందించిన క్రయోజనిక్ ఇంజన్లు వాడారు. 2010 జూలై 10న జరిపిన ఏడో ప్రయోగంలో స్వదేశీ క్రయోజనిక్ ఇంజన్‌ను వాడారు. ఇది విఫలమైంది. ఐదు టన్నుల బరువైన ఉపగ్రహాలను భూ స్థిర కక్ష్యలోకి ప్రయోగించేందుకు క్రయోజనిక్ ఇంజన్లు అవసరమవుతాయి. పీఎస్ఎల్వీలు 1.5 టన్నుల ఉపగ్రహాలను మాత్రమే మోసుకుపోగలవు. ప్రస్తుత క్రయోజనిక్ టెక్నాలజీ అమెరికా, రష్యా, యూరప్, జపాన్, చైనాలు మాత్రమే కలిగి ఉన్నాయి. పేలుళ్లతో మునిగిపోయిన సింధురక్షక్ జలాంతర్గామి ఐఎన్ఎస్ సింధు రక్షక్ జలాంతర్గామిలో ఆగస్టు 13న వరుస పేలుళ్లు సంభవించాయి. దీంతో ముంబై కొలాబా డాక్‌యార్డ్‌లో ఉన్న సింధు రక్షక్ సగం వరకు మునిగిపోయింది. ఈ దుర్ఘటనలో అందులో ఉన్న మొత్తం 18 మంది సిబ్బంది మరణించినట్లు భావిస్తున్నారు. ఈ జలాంతర్గామిలో టోర్పడోలు, క్షిపణులు ఉన్నాయి. 2010, ఫిబ్రవరిలో హైడ్రోజన్ లీకేజీ వల్ల సింధు రక్షక్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో సిబ్బందిలో ఒకరు మరణించారు. డీజిల్ - ఎలక్ట్రిక్ జలాంతర్గామి సింధు రక్షక్ను రష్యా నిర్మించింది. రు.400 కోట్లతో కొనుగోలు చేసిన ఈ జలాంతర్గామిని 1997లో భారత నౌకా దళంలో చేర్చారు. దీన్ని 2010లో ఆధునికీకరణకు రష్యాకు అప్పగించారు. రు.450 కోట్లతో ఆధునికీకరించిన సింధు రక్షక్ను రష్యా తిరిగి జనవరి, 2013లో భారత్‌కు అప్పగించింది. అణు సామర్థ్యం గల ఐఎన్ఎస్ చక్రతోపాటు భారత్ 15 జలాంతర్గాములను కలిగి ఉంది. ఏపీ పోలీసుకు అశోక్ చక్ర శాంతి సమయంలో ధైర్యసాహసాలకిచ్చే రెండో అత్యున్నత అవార్డు అశోక్ చక్ర మరణానంతరం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సబ్ ఇన్స్పెక్టర్ ఎన్.వి.ప్రసాద్ బాబుకు దక్కింది. 67వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న కేంద్రం ఈ అవార్డును ప్రకటించింది. మరో ముగ్గురికి కీర్తి చక్ర లభించింది. ఇవే కాకుండా 10 సౌర్య చక్ర అవార్డులతోపాటు మొత్తం 43 గ్యాలెంటరీ అవార్డులను రాష్ట్రపతి ప్రకటించారు. క్రీడలు రంజన్సోధికి రాజీవ్ గాంధీ ఖేల్ రత్న ఈ ఏడాదికి సంబంధించిన క్రీడా అవార్డులను కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ఆమోదించింది. ప్రతిష్టాత్మక క్రీడా అవార్డు రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర ట్రాప్ షూటర్ రంజన్ సోధికి దక్కింది. సోధి 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో రెండు రజత పతకాలు, 2012 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించాడు. అర్జున అవార్డులు: పేరు క్రీడ విరాట్ కోహ్లీ క్రికెట్ చక్రవోల్ సువురో ఆర్చరీ రంజిత్ మహేశ్వరి అథ్లెటిక్స్ పి.వి. సింధు బ్యాడ్మింటన్ కవితా చాహల్ బాక్సింగ్ రూపేశ్ షా స్నూకర్ గగన్జిత్ బుల్లర్ గోల్ఫ్ సాబా అంజుమ్ హాకీ రాజ్‌కుమారీ రాథోర్ షూటింగ్ జోత్స్న చినప్ప స్క్వాష్ మౌమా దాస్ టేబుల్ టెన్నిస్ నేహా రాతీ రెజ్లింగ్ ధర్మేంద్ర దలాల్ రెజ్లింగ్ అభిజిత్ గుప్తా చెస్ అమిత్‌కుమార్ సరోహా ప్యారాస్పోర్ట్స్ పోల్‌వాల్ట్‌లో ఇసిన్ బయేవాకు స్వర్ణం మాస్కోలో జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఆగస్టు 13న రష్యా అథ్లెట్ ఎలీనా ఇసిన్ బయేవా పోల్‌వాల్ట్‌లో స్వర్ణం సాధించింది. ఆమె 4.89 మీటర్ల ఎత్తు దూకి అగ్రస్థానంలో నిలిచింది. ఆమె 2005, 2007 ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో కూడా స్వర్ణ పతకాలు సాధించింది. రిటైర్మెంట్ ప్రకటించిన బర్తోలి వింబుల్డన్-2013 చాంపియన్ మరియన్ బర్తోలి (28) టెన్నిస్ నుంచి వైదొలుగుతున్నట్లు ఆగస్టు 15న ప్రకటించింది. ఫ్రాన్స్‌కు చెందిన బర్తోలికి వింబుల్డన్ మాత్రమే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్. ఆమె కెరీర్లో 2000 నుంచి ఏడు డబ్ల్యూటీఏ టైటిల్స్, ఒక గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించింది. క్రికెట్ కోచ్ ఆజాద్ మృతి ప్రముఖ క్రికెట్ కోచ్ దేశ్ ప్రేమ్ ఆజాద్ (75) మొహాలిలో ఆగస్టు 16న మరణించారు. ఆయన భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్తోపాటు చేతన్ శర్మ, యోగ రాజ్‌సింగ్, అశోక్ మల్హోత్రాలకు కోచ్‌గా వ్యవహరించారు. ఆయనను ప్రభుత్వం ద్రోణాచార్య అవార్డుతో సత్కరించింది. ఆసియా యూత్ క్రీడల్లో కుశ్కుమార్కు స్వర్ణం ఆసియా యూత్ గేమ్స్‌లో స్క్వాష్‌లో భారత క్రీడాకారుడు కుశ్కుమార్ స్వర్ణ పతకం సాధించాడు. నాన్జింగ్ (చైనా) లో జరుగుతున్న పోటీల్లో ఆగస్టు 19న జరిగిన ఫైనల్స్‌లో మహ్మద్ కమల్ (మలేిషియా)ను కుశ్కుమార్ ఓడించాడు. ఈ పోటీల్లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణ పతకం. టేబుల్ టెన్నిస్‌లో అభిషేక్ యాదవ్ కాంస్య పతకం సాధించాడు. ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో రష్యాకు మొదటి స్థానం ప్రపంచ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో ఏడు స్వర్ణ పతకాలతో రష్యా మొదటిస్థానంలో నిలిచింది. మాస్కోలో ఆగస్టు 18న ముగిసిన పోటీల్లో రష్యా మొదటిస్థానంలో నిలవగా, అమెరికా, జమైకాలు రెండు, మూడు స్థానాలు పొందాయి. పతకాల పట్టిక (మొదటి ఐదు స్థానాలు) దేశం స్వర్ణం రజతం కాంస్యం మొత్తం రష్యా 7 4 6 17 అమెరికా 6 13 6 25 జమైకా 6 2 1 9 కెన్యా 5 4 3 12 జర్మనీ 4 2 1 7 ముఖ్యాంశాలు: ఈ చాంపియన్‌షిప్‌లో ఉసేన్ బోల్ట్ (జమైకా)100 మీటర్లు, 200 మీటర్లు, 4ణ100 మీటర్ల రేసుల్లో మూడు స్వర్ణ పతకాలు సాధించాడు. 200 మీటర్లలో వరుసగా మూడోసారి స్వర్ణం సాధించాడు. తద్వారా ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో మొత్తం ఎనిమిది స్వర్ణ పతకాలు సాధించి ఈ ఘనత సాధించిన కార్ల్ లూయిస్, మైకేల్ జాన్సన్, అలిసన్ ఫిలిక్స్ (అమెరికా)ల సరసన చేరాడు. బోల్ట్ 2009లో 100 మీ, 200 మీ, 4ణ100 మీ, 2011లో 200 మీ, 4ణ100 మీ విభాగాల్లో స్వర్ణాలు సాధించాడు. పురుషుల 1500 మీటర్ల పరుగులో అబ్డెల్ కిప్రొస్ (కెన్యా) టైటిల్ నిలబెట్టుకున్నాడు. మహిళల విభాగంలో షెల్లీ ఆన్ ఫ్రేజర్ హ్యాట్రిక్ నమోదు చేసింది. ఆమె 100, 200 మీటర్ల రేసుల తోపాటు 4ణ100 మీటర్ల రిలేలో జమైకాకు స్వర్ణాలు సాధించిపెట్టింది. నాదల్, అజరెంకాలకు సిన్సినాటి టైటిల్స్ సిన్సినాటి పురుషుల సింగిల్స్ టైటిల్‌ను రఫెల్ నాదల్ (స్పెయిన్) గెలుచుకున్నాడు. సిన్సినాటిలో ఆగస్టు 19న జరిగిన ఫైనల్స్‌లో జాన్ ఇస్నర్ (అమెరికా)ను నాదల్ ఓడించాడు. మహిళల సింగిల్స్‌ను విక్టోరియా అజరెంకా (బెలారస్) గెలుచుకుంది. ఫైనల్స్‌లో సెరెనా విలియమ్స్ (అమెరికా) ను ఓడించింది. సిన్సినాటి టైటిల్‌ను గెలుపొందడం నాదల్, అజరెంకాలకు ఇదే తొలిసారి. కార్తికేయన్‌కు టైటిల్ భారత ఫార్ములావన్ డ్రైవర్ నారాయణ్ కార్తికేయన్... ఆటో జీపీ సిరీస్‌లో మూడో గెలుపును నమోదు చేశాడు. ఆగస్టు 17న హోరాహోరీగా సాగిన రేసులో కార్తికేయన్ టైటిల్ గెలుచుకున్నాడు. -
జెండా సాక్షిగా
-
గందరగోళం బాబు
-
ఢిల్లీ లొల్లి
-
తలో దారి!
-
కరెంట్ షాక్ ఎవరికి ఎంత?
-
కరెంట్ షాక్ ఎవరికి ఎంత?
-
ఆ నలుగురు..!
-
మెగా మోసం
-
రాజీడ్రామాలు!
-
హైడర్‌బాద్!
-
అసలే బొత్స....ఆపై..!
-
మరో సంక్షోభం!
-
జైత్రయాత్ర
-
ఏం T తేల్చేస్తారా?
-
బోగస్ రాతలు