హైదరాబాద్: పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ పాత్ర నిర్వచించలేనిది. ఏ పరీక్ష తీసుకున్నా కనీసం 20 నుంచి 30 శాతం ప్రశ్నలు వస్తాయి. ఈ తరుణంలో ప్రతి పరీక్షకు స్టడీ మెటీరియల్, మోడల్ పేపర్లతో ప్రత్యేక పోర్టల్స్ ప్రారంభించే సాక్షి ఇప్పుడు కరెంట్ అఫైర్స్‌కు కూడా తెలుగు, ఇంగ్లిష్‌లో ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్‌లో ైడైలీ, వీక్లీ, మంత్లీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్ బిట్‌బ్యాంక్‌తో పాటు కరెంట్ అఫైర్స్ స్పెషల్ (ఇయర్ రౌండప్), సులువుగా ప్రాక్టీస్ చేసుకునేందుకు మంత్లీ ఆన్‌లైన్ ప్రాక్టీస్ టెస్టులను రూపొందించింది. రోజూ దినపత్రిక చదువుతూ సాక్షి ప్రత్యేకంగా రూపొందించిన కరెంట్ అఫైర్స్, బిట్ బ్యాంక్స్ సాధన చేయడం వల్ల ఈ విభాగంలో మంచి మార్కులు సాధించవచ్చు. అంతర్జాతీయ సంఘటనలు, ద్వైపాక్షిక సంబంధాలు-నిర్ణయాలు, దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు, తాజా నియామకాలు, వార్తల్లోని వ్యక్తులు, క్రీడలు-విజేతలు, సదస్సులు-సమావేశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్న కొత్త ఆవిష్కరణలు వంటి వాటిలో తాజా అప్‌డేట్స్ కోసం క్లిక్ చేయండి..
http://www.sakshieducation.com/CA/Index.html
కరెంట్ అఫైర్స్‌కు ప్రత్యేక పోర్టల్
Published Thu, Oct 30 2014 4:02 AM | Last Updated on Thu, Dec 27 2018 4:17 PM
Advertisement