కాంపిటీటివ్ గెడైన్స్ కరెంట్ అఫైర్‌స
మార్క్ సెల్బీకి స్నూకర్ వరల్డ్ టైటిల్
స్నూకర్ వరల్డ్ టైటిల్‌ను మార్క్ సెల్బీ (ఇంగ్లండ్) గెలుచుకున్నాడు. షీఫీల్డ్ (చైనా)లో మే 2న జరిగిన పోటీలో జున్‌హుయి (చైనా)ను సెల్బీ ఓడించాడు.
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 4వ స్థానం
అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్షిక వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది. మే 4న విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలవగా, న్యూజిలాండ్ రెండో స్థానంలో, దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉన్నాయి. టీ-20 ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ మొదటి స్థానాన్ని దక్కించుకోగా, భారత్ రెండో స్థానంలో నిలిచింది.
జకోవిచ్‌కు మాడ్రిడ్ మాస్టర్స్ టైటిల్
మాడ్రిడ్ టెన్నిస్ మాస్టర్స్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నొవాక్ జకోవిచ్ (సెర్బియా) గెలుచుకున్నాడు. మాడ్రిడ్‌లో మే 9న జరిగిన ఫైనల్లో ఆండీ ముర్రే(బ్రిటన్)పై జకోవిచ్ గెలుపొందాడు.
లియాండర్ పేస్ జోడీకి ఏటీపీ ఛాలెంజర్ టోర్నీ టైటిల్
ఏటీపీ ఛాలెంజర్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ టైటిల్ ను లియాండర్ (భారత్), సామ్ గ్రోత్ (ఆస్ట్రేలియా) జోడీ గెలుచుకుంది. బుసాన్‌లో మే 8న జరిగిన ఫైనల్లో సంచాయ్, సొంచాట్ రటివటనా (థాయిలాండ్)లను ఈ జోడీ ఓడించింది. పేస్‌కు ఇది 12వ ఛాలెంజర్ టైటిల్.