Competitive Gedains
-
కాంపిటీటివ్ గెడైన్స్
కరెంట్ అఫైర్స్ జాతీయం అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అషఫ్ రఘనీ భారత పర్యటన అఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అషఫ్ రఘనీ భారత పర్యటనలో భాగంగా సెప్టెంబర్ 14న ప్రధాని నరేంద్రమోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య నేరస్తుల పరస్పర మార్పిడి, పౌర, వాణిజ్య అంశాలకు సంబంధించి పలు ఒప్పందాలు కుదిరాయి. కాంగ్రెస్‌ను వీడిన అరుణాచల్‌ప్రదేశ్ సీఎం అరుణాచల్‌ప్రదేశ్‌లో సీఎం పెమా ఖండూ నేతృత్వంలో 43 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సెప్టెంబర్ 16న ఆ పార్టీకి రాజీనామా చేశారు. వీరంతా ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ)లో విలీనమయ్యారు. మొత్తం 60 మంది సభ్యులున్న అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 44 మంది ఎమ్మెల్యేలున్నారు. బలూచ్ మొబైల్ యాప్‌ను ప్రారంభించిన ఏఐఆర్ పాకిస్తాన్‌తోపాటు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న బలూచ్ ప్రజల కోసం ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్) సెప్టెంబర్ 16న మల్టీ మీడియా, మొబైల్ అప్లికేషన్ సేవలను ప్రారంభించింది. సరిహద్దు ప్రజల మధ్య మెరుగైన సంబంధాల కోసం ఈ సేవలను ప్రారంభించినట్లు ప్రసార భారతి చైర్మన్ ఎ.సూర్యప్రకాష్ తెలిపారు. యూరి ఉగ్ర దాడిలో 20 మంది సైనికులు మృతి జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో యూరి సైనిక స్థావరంపై సెప్టెంబర్ 18న ఉగ్రవాదులు జరిపిన దాడిలో 20 మంది భారత సైనికులు మృతి చెందారు. ఫెన్సింగ్ వైర్లు కత్తిరించి, సైనిక స్థావరంలోకి ప్రవేశించిన ముష్కరులు.. జవాన్లపై కాల్పులు జరిపారు. ఉగ్రవాదులు గ్రెనేడ్లతో దాడి చేయడంతో సైనిక గుడారాలకు మంటలంటుకున్నాయి. మంటల వల్ల 13 మంది సైనికులు మరణించారు. సైనికులు జరిపిన కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. అరుదైన కళాకృతులను అప్పగించిన ఆస్ట్రేలియా స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న అతి పురాతనమైన మూడు విగ్రహాలను ఆస్ట్రేలియా ప్రభుత్వం సెప్టెంబర్ 19న భారత్‌కు అందించింది. కోట్ల రూపాయల విలువ చేసే ఈ విగ్రహాలను కాన్‌బెర్రాలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆస్ట్రేలియా (ఎన్జీఏ) వద్ద జరిగిన కార్యక్రమంలో ఆ దేశ కళల శాఖమంత్రి మిచ్ ఫైఫీల్డ్డ్.. భారత పర్యాటక శాఖ మంత్రి మహేశ్‌శర్మకు అందించారు. వీటిలో మూడో శతాబ్దానికి చెందిన రాతితో చేసిన విగ్రహం, బుద్ధుని విగ్రహం, 900 ఏళ్ల కిందటి ప్రత్యంగిరాదేవి విగ్రహం ఉన్నాయి. కశ్మీర్లో ఆపరేషన్ కామ్ డౌన్ చేపట్టిన సైన్యం కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు భారత సైన్యం సెప్టెంబర్ 14న ఆపరేషన్ కామ్ డౌన్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉగ్రవాదులు, వారి సానుభూతిపరులను ఏరివేసేందుకు 4,000 మంది అదనపు బలగాలను దక్షిణ కశ్మీర్లో మోహరించారు. -
సింధు, సాక్షి మాలిక్‌లకు పతకాలు
కాంపిటీటివ్ గెడైన్స్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయం ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎయిర్‌ల్యాండర్ -10 ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎయిర్ ల్యాండర్-10.. ఆగస్టు 17న ఇంగ్లండ్‌లోని కార్డింగ్టన్‌లో ఆకాశంలోకి ఎగిరింది. 85 ఏళ్ల కిందట 1930 అక్టోబర్‌లో ఇదే ఎయిర్‌ఫీల్డ్ నుంచి ఎగిరిన ఎయిర్‌షిప్-ఆర్101 ఫ్రాన్స్‌లో కూలిపోయింది. ఈ సంఘటనలో 30 మంది చనిపోయారు. ఆ తర్వాత బ్రిటన్‌లో ఎయిర్‌షిప్‌లను రూపొందించడం ఆపేశారు. తాజాగా 302 అడుగుల పొడవైన ఎయిర్ ల్యాండర్-10ను అమెరికా ఆర్మీ కోసం బ్రిటన్ సంస్థ హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్ (హెచ్ఏవీ) రూపొందించింది. భారత్‌లో ఆమ్నెస్టీ ఆఫీసులు తాత్కాలికంగా మూసివేత అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ భారత్‌లో తన ఆఫీసులను తాత్కాలికంగా మూసివేసింది. బెంగళూరు, పుణె, న్యూఢిల్లీ, చెన్నై ఆఫీసులను మూసివేయడంతోపాటు తమ ఈవెంట్లను వాయిదా వేస్తున్నట్లు ఆగస్టు 17న వెల్లడించింది. బెంగళూరులో కశ్మీర్ అంశంపై ఆ సంస్థ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో కొందరు దేశ ద్రోహ నినాదాలు చేశారనే ఆరోపణలతో ఆమ్నెస్టీపై దేశ ద్రోహ కేసు నమోదైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్వేషాన్ని ప్రోత్సహించారని ఆరోపిస్తూ.. కొందరు ఈ సంస్థకు వ్యతిరేకంగా ఆగస్టు 16, 17 తేదీల్లో ప్రదర్శనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆమ్నెస్టీ ఆఫీసుల మూసివేత నిర్ణయం తీసుకుంది. ఆర్థికం జూలైలో 3.55 శాతానికి టోకు ద్రవ్యోల్బణం 2016 జూలైలో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం 3.55 శాతంగా నమోదైంది. కూరగాయలు, పప్పు దినుసులు వంటి ధరలు పెరగడంతో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 23 నెలల గరిష్టానికి చేరింది. ఆహార వస్తువుల ద్రవ్యోల్బణం రెండంకెలను దాటి 11.82 శాతానికి పెరిగింది. పప్పు దినుసులు 35.76 శాతం, కూరగాయలు 28.05 శాతం, తృణ ధాన్యాల ధరలు 7.03 శాతం అధికమయ్యాయని ఆగస్టు 16న కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాలు తెలుపుతున్నాయి. నిత్యావసరాల్లో ఒకటైన బంగాళా దుంపల ధరలు 58.78 శాతం పెరిగాయి. పంచదార, పండ్ల ధరలు వరుసగా 32.33 శాతం, 17.30 శాతం చొప్పున పెరిగాయి. జూన్‌లో 1.62 శాతంగా నమోదైన ద్రవ్యోల్బణం.. 2015 జూలై లో -4.00 శాతంగా నమోదు కావడం గమనార్హం. సైన్స్ అండ్ టెక్నాలజీ తొలి క్వాంటమ్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన చైనా అంతరిక్షం నుంచి భూమికి కాంతి కంటే వేగవంతమైన, హ్యాకింగ్‌కు అవకాశం లేని కమ్యూనికేషన్లను సాగించడానికి వీలు కలిగించే క్వాంటమ్ ఉపగ్రహాన్ని చైనా ఆగస్టు 16న విజయవంతంగా ప్రయోగించింది. తద్వారా ప్రపంచంలోనే మొదటిసారిగా ఇటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించిన దేశం గా నిలిచింది. గోబీ ఎడారిలోని జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్ మార్చ్-2డి రాకెట్ ద్వారా ఈ ప్రయోగాన్ని చేపట్టారు. ఈ ఉపగ్రహం బరువు 600 కిలోలు. ఇది రెండేళ్లపాటు సేవలు అందిస్తుంది. భూమిపై అత్యంత వేడి నెలగా జూలై ప్రపంచ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో భూమిపై అత్యంత వేడి నెలగా ఈ ఏడాది జూలై నిలిచింది. గత 137 ఏళ్ల గణాంకాలతో పోల్చితే జూలైలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయని అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పర్యవేక్షణ సంస్థ (ఎన్ఓఏఏ) ఆగస్టు 16న ప్రకటించింది. 20వ శతాబ్దపు సగటు ఉష్ణోగ్రతతో పోల్చితే ఈ జూలైలో ఉష్ణోగ్రత 1.57నిఇ అధికంగా ఉంది. గత ఏడాది జూలైతో పోల్చితే ఈ ఉష్ణోగ్రత 0.11నిఇ ఎక్కువ. శిలాజ ఇంధనాల వినియోగం మరింత పెరగడం, వాతావరణ మార్పుల కారణంగా ప్రతి నెలా భూమిపై ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయని నివేదిక తెలిపింది. వార్తల్లో వ్యక్తులు పంజాబ్, అసోం, అండమాన్లకు కొత్త గవర్నర్లు మణిపూర్ గవర్నర్‌గా కేంద్ర మాజీ మంత్రి నజ్మా హెప్తుల్లా, పంజాబ్ గవర్నర్‌గా రాజ్యసభ మాజీ సభ్యుడు వీపీ సింగ్ బద్నోర్, అసోం గవర్నర్‌గా ది హితవాద దినపత్రిక ఎండీ బన్వారీలాల్ పురోహిత్‌ను నియమించారు. ఢిల్లీ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే, ప్రొఫెసర్ జగదీశ్ ముఖి అండమాన్ నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎంపికయ్యారు. కోస్ట్‌గార్డ్ అడిషనల్ డెరైక్టర్ జనరల్‌గా వి.ఎస్.ఆర్.మూర్తి భారత సముద్ర తీర రక్షణ దళం అడిషనల్ డెరైక్టర్ జనరల్‌గా తెలుగు వ్యక్తి వీఎస్ఆర్ మూర్తి ఆగస్టు 18న బాధ్యతలు స్వీకరించారు. రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ (52) ఆగస్టు 21న నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా, ద్రవ్య విధానం, ద్రవ్యోల్బణం విభాగాలకు ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్నారు. ఆర్బీఐ గవర్నర్ పదవీ కాలం మూడేళ్లు. డిప్యూటీ గవర్నర్‌గా ఉంటూ గవర్నర్ బాధ్యతలు చేపడుతున్న ఏడో వ్యక్తి పటేల్. క్రీడలు సానియా జంటకు సిన్సినాటి టైటిల్ బార్బరా స్ట్రికోవా (చెక్ రిపబ్లిక్)తో కలిసి సానియా మీర్జా.. సిన్సినాటి ఓపెన్ మహిళల డబుల్స్ టైటిల్‌ను సాధించింది. ఆగస్టు 22న జరిగిన ఫైనల్లో ఈ జంట.. మార్టినా హింగిస్ - కోకో వాండెవెగె జోడీపై విజయం సాధించింది. 2016 క్రీడా అవార్డులు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ 2016కు ఆగస్టు 22న అవార్డులను ప్రకటించింది. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు, రెజ్లర్ సాక్షి మాలిక్, షూటర్ జీతూరాయ్, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌లకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర దక్కింది. అవార్డు కింద రూ.7.5 లక్షల నగదు ఇస్తారు. ఉత్తమ కోచ్‌లకు ఇచ్చే ద్రోణాచార్య పురస్కారాలను కూడా కేంద్రం ప్రకటించింది. ఈ అవార్డు పొందినవారికి రూ.5 లక్షలు, ప్రశంస పత్రం బహూకరిస్తారు.రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర: పూసర్ల వెంకట సింధు (బ్యాడ్మింటన్), సాక్షి మాలిక్ (రెజ్లిం గ్), దీపా కర్మాకర్ (జిమ్మాస్టిక్స్), జీతూ రాయ్ (షూటింగ్). అర్జున అవార్డ్: అజింక్య రహానే (క్రికెట్), రజత్ చౌహాన్ (ఆర్చరీ), లలితా బాబర్ (అథ్లెటిక్స్), సౌరవ్ కొఠారి (బిలియర్డ్స్, స్నూకర్), శివ థాపా (బాక్సింగ్), సుబ్రతా పాల్ (ఫుట్‌బాల్), రాణి రాంపాల్ (హాకీ), వి.ఆర్.రఘునాథ్ (హాకీ), గురు ప్రీత్ సింగ్ (షూటింగ్), అపూర్వీ చండేలా (షూటింగ్), సౌమ్యజిత ఘోష్ (టేబుల్ టెన్నిస్), వినేశ్ (రెజ్లింగ్), అమిత్‌కుమార్ (రెజ్లింగ్), సందీప్ సింగ్మాన్ (పారా అథ్లెటిక్స్), వీరేందర్ సింగ్ (రెజ్లింగ్) ద్రోణాచార్య అవార్డు: నాగపురి రమేశ్ (అథ్లెటిక్స్), సాగర్ మాల్ దయాల్ (బాక్సిం గ్), రాజ్‌కుమార్ శర్మ (క్రికెట్), విశ్వేశ్వర్ నంది (జిమ్మాస్టిక్స్), ఎస్.ప్రదీప్‌కుమార్ (స్విమ్మింగ్), మహావీర్ సింగ్ (రెజ్లింగ్). ధ్యాన్‌చంద్ అవార్డ్: సత్తి గీత (అథ్లెటిక్స్), సిల్వనస్ డుంగ్ డుంగ్ (హాకీ), రాజేంద్రప్రసాద్ షెల్కే (రోయింగ్). సింధు, సాక్షి మాలిక్‌లకు పతకాలు రియో ఒలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు రజత పతకం సాధించి రికార్డ్ సృష్టించింది. ఒలింపిక్స్‌లో భారత్ తరఫున రజతం గెలిచిన తొలి మహిళగా నిలిచింది. బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్) బంగారు పతకం గెలిచింది. మహిళల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ 58 కిలోల విభాగంలో భారత రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సాధించింది. దీంతో ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా నిలిచింది. అగ్రస్థానంలో అమెరికా దేశం స్వర్ణం రజతం కాంస్యం మొత్తం అమెరికా 46 37 38 121 బ్రిటన్ 27 23 17 67 చైనా 26 18 26 70 రష్యా 19 18 19 56 జర్మనీ 17 10 15 42 జపాన్ 12 8 21 41 ఫ్రాన్స్ 10 18 14 42 కొరియా 9 3 9 21 ఇటలీ 8 12 8 28 ఆస్ట్రేలియా 8 11 10 29 భారత్ 0 1 1 2 (భారత్ స్థానం 67) ముగిసిన ఒలింపిక్స్ బ్రెజిల్‌లోని రియోడిజనీరోలో ఆగస్టు 5 నుంచి ఆగస్టు 21 వరకు జరిగిన ఒలింపిక్స్ -2016 ముగింపు వేడుకల్లో రెజ్లింగ్‌లో కాంస్యం సాధించిన సాక్షి మాలిక్ భారత పతాకధారిగా వ్యవహరించింది. 31వ ఒలింపిక్ క్రీడలు ఆగస్టు 5న ప్రారంభమయ్యాయి. మొత్తం 206 దేశాలు ఈ క్రీడల్లో పాల్గొన్నాయి. 32వ ఒలింపిక్ క్రీడలు 2020లో జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతాయి. రాష్ట్రీయం విశాఖపట్నంలో రోడ్డు భద్రతపై వర్కషాప్ దేశంలో 30 శాతం బోగస్ డ్రైవింగ్ లెసైన్స్‌లు ఉన్నాయని, వాటిని తొలగించాలని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. రోడ్డు భద్రతపై విశాఖపట్నంలో జరిగిన జాతీయ వర్క్‌షాప్‌లో ఆగస్టు 18న నితిన్ గడ్కరీ పాల్గొన్నారు. 18 రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు, దాదాపు వంద మంది దేశ, విదేశీ ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. రహదారుల భద్రతపై వారు 69 రకాల సిఫార్సులు చేశారు. రవాణా శాఖలో అవినీతి మూలంగా ప్రమాదాల్లో అమాయకులు ప్రాణాలను కోల్పోవాల్సి వస్తోందని గడ్కరీ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఏటా 1.50 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని తెలిపారు. ఈ సంఖ్యను బ్రెజీలియా డిక్లరేషన్ ప్రకారం 2020 నాటికి 50 శాతానికి తగ్గించాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ రోడ్డు భద్రతకు సంబంధించి ఎడ్యుకేషన్, ఎన్ఫోర్స్మెంట్, ఇంజనీరింగ్, ఎమర్జెన్సీ, ఎన్విరాన్మెంట్ అనే అంశాలపై దృష్టిపెట్టాలన్నారు. జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనాలకు గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) ఉండాలని కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల సంఖ్యను 2025 నాటికి 50 శాతానికి తగ్గించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి కరెంట్ అఫైర్స్ నిపుణులు, ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్, హైదరాబాద్ -
Winner of 2016 French Open Women's Singles?
కాంపిటీటివ్ గెడైన్స్ Current Affairs for Bank Exams 1. Prime Minister Narendra Modi was conferred the Amir Amanullah Khan Award is the highest civilian honour of? Afghanistan 2. Who won the 2016 French Open women's singles Tennis title on June 4, 2016? Garbine Muguruza of Spain. She defeated Serena Williams of USA in the final. It is her maiden Grand Slam Title. 3. Who became the Chairman of Fair Trade Regular Competition Commission of India (CCI) in January 2016? Devender Kumar Sikri. He succeeded Ashok Chawla. 4. Which Indian writer won the prestigious $ 50,000 DSC prize for South Asian Literature for 2016? Anuradha Roy. She won the award for her novel "Sleeping on Jupiter" 5. Which city hosted the 103rd session of the Indian Science Congress between January 3 and January 7, 2016? Mysuru. The theme of 103rd Indian Science Congress is "Science and Technology for Indigenous Development in India" 6. Who is India's High Commissioner to Pakistan? Gautam Bambawale 7. Who took over as the Chief Information Commissioner (CIC) in January 2016? Radha Krishna Mathur. He is former defense secretary. He succeeded Vijai Sharma. 8. Who is the present Chief Executive officer of NITI Aayog? Amitabh Kant. He succeeded Sindhusree Khullar. 9. Who is the head of judicial committee on One Rank One Pension (OROP) Scheme for retired defense personnel? Justice L.Narasimha Reddy. He is former Chief Justice of Patna high court. 10. Who was honoured with Jnanpith Award for 2015? Raghuveer Chaudhary. He is the fourth Gujarati writer to win Jnanpith Award India's highest literature prize, after Uma Sankar Joshi (1967), Pannalal patel (1985) and Rajendra Shah (2001). 11. Which former cricketer was awarded the Col. C.K.Nayudu Literature Achievement Award for 2015? Syed Kirmani. He is former wicket keeper-batsman. He was also a member of the Indian team that won their first ever World Cup in 1983. 12. Which city hosted the United Nations Change Conference COP-21 from November 30 to December 12, 2015? Paris. It was the 21st yearly session of the Conference Of The Parties (COP) 13. Which country has announced to launch of Islamic Military coalition to counter terrorism? Saudi Arabia. The coalition will be led by Saudi Arabia and over see the participation of 34 nations. 14. Which country won the south Asian Football Federation (SAFF) cup in January 2016? India. SAFF cup Football Tournament was played in Thiruvananthapuram, Kerala. India won the SAFF cup by defeating Afghanistan in the final. 15. Who set a new world record for most runs in an innings in January 2016? Pranav Dhanawade. He scored 1,009 runs (not out) off 323 balls. Pranav made this record in the Thane district inter-school tournament. 16. Who took charge as the new United Nations high Commissioner for Refugees (UNHCR) on January 4, 2016? Filippo Grandi of Italy. He succeeded Antonto Guterres. 17. India signed an agreement on the purchase of 36 Raffle Aircraft with which country? France. It was signed during the state visit of French President Francois Hollande from January 24 to 26, 2016. He was the chief guest at the 67th India's Republic Day celebrations. 18. Which is the first organic state of India? Sikkim. Prime Minister Narendra Modi declared Sikkim as the first organic farming state of India on January 18, 2016. 19. In which city was Asian Infrastructure Investment Bank (AIIB) was formally opened on January 16, 2016? Beijing. AIIB is backed by China. It has 57 founding members including India. China's former Finance Minister Jin Liqun is the first AIIB president. 20. Which Indian was elected to the 12-member board of Directors of the Asian Infrastructure Investment Bank? Dinesh Sharma 21. Who has been appointed as the Registrar General and Census Commissioner of India? Sailesh. He succeeded C.Chandramouli. 22. Sahuag Kijin is a joint coast guard exercise between India and which other country? Japan. Sahyog Kaijin 2016 was conducted off the coast of Chennai. 23. What is the name of the Indo-French milatary exercise? Shakti India and France conducted their counter terrorism and counter- insurgency joint exercise Shakti-2016 in Rajasthan in January-2016. 24. Who was awarded India's highest peace time gallantry Ashok Chakra on January 26, 2016. Lance Naik Mohan Nath Goswami (Posthumously) 25. How many persons were awarded the 2016 Padma Awards? 112. The list comprises 10 Padma Vibhushan, 19 Padma Bhushan and 83 Padma Shri awards. 19 are women winners. The list also includes 10 persons in the category of foreigners/ NRIs/ PIOs. 26. Who was honoured with the third Yash Chopra Memorial Award in January 2016? Rekha. Maharashtra Governor Ch. Vidyasagar Rao presented the award to the veteran Bollywood actress. 27. Which is the most corruption-free country in the world? Denmark. Transparency International released the corruption perceptions index (CPI) 2015 in January 2016. The index is topped by Denmark. India was placed at 76th position. North Korea and Somalia shared the last place at 167. 28. Who won the Syed Modi International Grand Prix Badminton title in Lucknow on January 31, 2016? Kidambi Srikanth. Top seed K. Srikanth of India defeated Chinese player Huang Yuxiang in the finals. 29. Which Indian shuttler won the Malaysia Masters Grand Prix Gold Badminton women's singles title in January 2016? P.V. Sindhu. She defeated Scotland Kirsty Gilmour in the finals. 30. Which team won in the Premier Badminton League (PBL) title in January 2016? Delhi Acers. It defeated Mumbai Rockets in the finals in New Delhi. 31. Which is the first bank in India to launch a dedicated branch for start-ups? State Bank of India. SBI launched "SBI incube" a branch for start-ups in Bengaluru in January 2016. It would offer advisory services to the budding entrepreneurs under one roof. 32. Who won the 2016 Australian Open men's singles title? Novak Djokovic. World No.1 Novak Djokovic of Serbia won the 2016 Australian open men's singles title by defeating Andy Murray in the finals on January 31, 2016. It is his sixth Australian open title and he equalled Australian Roy Emerson's record. 33. Whom did Angelique Kerber defeat in the finals of the 2016 Australian Open Women's singles? Serena Williams. In the women's singles final of the 2016 Australian Open Tennis Tournament Angelique Kerber of Germany beat Serena Williams of USA to clinch her first grand slam title. Angelique Kerber become Germany's first Grand Slam Champion since Steffi Graf's 1999 French Open title. 34. Who won the 2016 Australian Open Women's doubles title? Sania Mirza and Martina Hingis. Indo-Swiss pair of Sania Mirza and Martina Hingis defeated Czech duo of Andrea Halvackova and Lucie Hradecka in the final. 35. Which country won the inaugural T-20 Asia Cup for Blind in January 2016? India. In the final played in Kochi, India defeated Pakistan by 44 runs. ICC Awards 2015 1. ICC Cricketer of the year Steven Smith (Australia) (He was given the Sir Garfield Sobers Trophy) 2. Test cricketer of the year Steven Smith (Australia) 3. ODI (Crickter of the Tournament) A.B.Devilliers (South Africa) 4. T 20 performance of the year Faf Du Plessis (South Africa) 5. Associate and affiliate cricketer of the year Khurram Khan (UAE) 6. Spirit of Cricket Award Brendon Mccullum (New Zealand) 7. Umpire of the year Richard Kettleborough (England) 8. Women's ODI cricketer of the year Meg Lanning (Australia) 9. Women's T 20 cricketer of the year Stefanic Taylor (West Indies) - N. Vijayender Reddy General Awareness Faculty, Hyderabad -
సామాజిక రక్షణ చర్యలతోనే నిజమైన ఆహార భద్రత
కాంపిటీటివ్ గెడైన్స్ : సివిల్స్, గ్రూప్స్ ఎస్సే సామాజిక రక్షణ-ఆహార భద్రత-ప్రభుత్వ పాత్ర అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఆకలి, పోషకాహార లోపం. ప్రభుత్వ విధానాలు సామాజిక రక్షణ కల్పించేవిగా ఉన్నట్లయితే ఆకలి, పోషకాహారలోప సమస్యలను తగ్గించవచ్చని ఇటీవల జరిపిన అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు (ప్రపంచ ఆరోగ్య సంస్థ; ఆహార, వ్యవసాయ సంస్థ, ప్రపంచ కార్మిక సంస్థ, తదితర) 64 పేద దేశాల నుంచి సేకరించిన సమాచార విశ్లేషణ ఈ వాదనకు బలం చేకూర్చింది. తక్కువ తలసరి ఆదాయం ఉన్న పేద దేశాలు కూడా సగటు మానవుని ప్రాథమిక అవసరాలను తీర్చడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయా దేశాలు తమకు లభ్యమవుతున్న పరిమిత వనరులను సామాజిక రక్షణకు కేటాయించినప్పుడే నిజమైన ప్రగతి సాధ్యమవుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ఆకలి, పోషకాహార లోపం ముఖచిత్రం పేదరికం, నిరపేక్ష ఆకలి, పోషకాహారలోపం, మానవ సమాజాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యలు. 201214 మధ్యకాలంలో 805 మిలియన్ల మంది ప్రజలు దీర్ఘకాలికంగా పౌష్టికాహారలోపంతో బాధపడుతున్నట్లు తేలింది. 1990వ దశాబ్దం నుంచి పేదరికం కొంత మేరకు తగ్గినప్పటికీ 2014 ప్రాపంచిక ఆకలి సూచిక (Global Hunger Index) దాదాపు 39 దేశాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉన్నట్లు పేర్కొంది. లాటిన్ అమెరికా, తూర్పు ఆగ్నేయాసియా, కరేబియన్ దేశాల్లో పేదరికం కొంత తగ్గినప్పటికీ దక్షిణాసియా, సహారా దిగువ ఆఫ్రికా దేశాల్లో విస్తృతంగా ఉంది. ప్రాంతీయ ప్రాతిపదికన ప్రాపంచిక ఆకలి సూచిక విలువలు1996లో జరిగిన ప్రపంచ ఆహార శిఖరాగ్ర సమావేశంలో ఆహార భద్రతను.. ‘ప్రజలందరికీ, ఎల్లప్పుడు పోషకాహారం అందుబాటులో ఉంటూ, వారు ఆరోగ్యంగా, చురుకుగా జీవించగలగడం, భౌతికంగా, ఆర్థికంగా దీన్ని పొందగలగడం’గా నిర్వచించారు. దీంట్లో పారిశుధ్యం, మంచినీరు, వైద్య సదుపాయం అంతర్లీనంగా ఉంటాయి. ఇటీవల కాలంలో అహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఇది జనాభా పెరుగుదలను అధిగమించింది. కానీ, బహుళజాతి సంస్థలు, వాణిజ్య సంస్థలు, ఆయా దేశ ప్రభుత్వాల లోపభూయిష్ట విధానాలు కృత్రిమ కొరతను సృష్టించి, పేద ప్రజలకు ఆహారధాన్యాలు అందుబాటులో లేకుండా చేస్తున్నాయి. దీనికితోడు అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కూడా ఆహార ధాన్యాల మీద ప్రభావం చూపుతోంది. ఇండియా లాంటి దేశాల్లో పర్యావరణ మార్పుల వల్ల సకాలంలో వర్షాలుపడటం లేదు. దీంతో పంట దిగుబడి తగ్గి, సాగుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. ఫలితంగా సన్నకారు రైతులు అప్పులపాలై, కొన్ని సందర్భాలలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పేద ప్రజలు వీధులపాలవుతున్నారు. మహిళలే అధిక బాధితులు ఆకలి, పోషకాహార లోపాన్ని స్త్రీ, పురుష కోణంలో పరిశీలించినట్లయితే ఆకలితో అలమటించే వారిలో 60% మంది మహిళలే ఉన్నారు. 50% గర్భిణీస్త్రీలకు సరైన పోషకాహారం లభించడం లేదు. ఈ కారణంగా (2,40,000 మంది) తల్లులు, పిల్లల మరణాలు సంభవిస్తున్నాయి. పోషకాహారం లభించక ప్రతి ఆరుగురిలో ఒకరు తక్కువ బరువుతో పుడుతున్నారు. ఐదు సంవత్సరాల లోపు బాలబాలికల్లో 45% మంది మరణిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం ప్రతి 10 సెకండ్లకు ఒక శిశుమరణం సంభవిస్తుంది. భారతదేశంలో షెడ్యూల్డ్ కులాలు/తెగల్లో ఆకలి, పోషకాహారలోపంతో బాధపడే వారి సంఖ్య సహారా దిగువ ఆఫ్రికాలోని వారికంటే ఎక్కువ. దీనికి పరిష్కారమేంటి? ప్రభుత్వాలు సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేయాలి. జీవనోపాధి పథకాల అమలు, బీమా పథకం వర్తింపు, పారిశుధ్యం, రక్షితనీటి పథకం, తిండి, బట్ట, వసతి వంటి కనీస సౌకర్యాలు అందరికీ అందుబాటులోకి తేవాలి. దీన్నే సామాజిక రక్షణ అంటారు. అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) ఈ భావనను ప్రాచుర్యంలోకి తెచ్చింది. ఈ పథకం కింద వైద్య సదుపాయం, అనారోగ్య భృతి, నిరుద్యోగ భృతి, వయోవృద్ధులకు ఆర్థికసహాయం, కుటుంబభృతి, ప్రసూతి భృతి, క్షతగాత్రుల భృతి మొదలైనవి అందించాలి. యూరోపియన్ కమిషన్, ఐక్యరాజ్యసమితి అనుబంధ సంస్థలు ప్రాంతీయ, అంతర్జాతీయ సమావేశాలు నిర్వహించి స్థూలంగా సామాజిక భద్రతకు పలు సూచనలు చేశాయి. 1995లో కోపెన్‌హాగన్‌లో జరిగిన ప్రపంచ శిఖరాగ్ర సమావేశం ‘సామాజిక అభివృద్ధి’ ఆవశ్యకతను పునరుద్ఘాటించింది. 2010లో ఐక్యరాజ్యసమితి అధ్యక్షతన జరిగిన శిఖరాగ్ర సమావేశం శతాబ్ది అభివృద్థి లక్ష్యాలను (Millenium Development goals) గుర్తించింది. ఈ లక్ష్యాల్లో దారిద్య్ర నిర్మూలన ప్రధానమైందిగా ఉంది. ఇందులో భాగంగా 2015లో (Sustainable development goals) ‘పేదరిక నిర్మూలన, ధరిత్రీ పరిరక్షణ, అందరికీ సంపద’ నినాదాన్ని ప్రారంభించారు. పేద దేశాల్లో వనరుల కేటాయింపు అత్యల్పం అభివృద్ధి చెందిన, చెందుతున్న అనేక దేశాల్లో సామాజిక రక్షణలో భాగంగా అనేక పథకాలు అమలు చేస్తున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, విద్య, ఆరోగ్యం, పారిశుధ్యం, బీమా, ప్రజోపయోగార్థ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. అయితే పేద దేశాలు తమ స్థూల దేశీయ ఉత్పత్తి (ఎఈ్క)లో ఈ రంగానికి ఆశించిన మేర వనరులను కేటాయించడం లేదు. వాస్తవానికి పేద దేశాల్లో ఈ రంగంపై ఎక్కువ వనరులను వెచ్చించాల్సిన అవసరం ఉంది. ఈ రంగంపై ఆఫ్రికా ఖండంలో (201011) కేవలం 5.1 శాతం వనరులను మాత్రమే ఖర్చుచేయగా, అదే ఏడాది పశ్చిమ యూరప్ 26.7% వనరులను కేటాయించింది. ప్రపంచ దేశాల సగటు కేటాయింపు 8.6% ఉండగా, ఆసియా, పసిఫిక్ దేశాలు 5.3 శాతం కేటాయించాయి. సామాజిక భద్రత రంగంలో వృద్ధులకు అందించే పింఛను చాలా తక్కువగా ఉంది. భారతదేశంలో ఇది నెలకు కేవలం రూ.250 మాత్రమే. కొన్నిసార్లు ఈ చిన్న మొత్తాన్ని కూడా నెలల తరబడి చెల్లించడం లేదు. విద్య, ఆరోగ్యం, దారిద్య్ర నిర్మూలన, పారిశుధ్యం, బీమా రంగాలపై ప్రాంతాలవారీగా ప్రభుత్వం కేటాయింపులు ఈ విధంగా ఉన్నాయి. పైన పేర్కొన్న గణాంకాలను బట్టి సంపన్న దేశాలు సామాజిక రక్షణకు తమ ఎఈ్కలో ఎక్కువ శాతం ఖర్చుపెడితే, పేద దేశాలు తక్కువ కేటాయిస్తున్నాయి. భారతదేశంలో భారతదేశం ప్రారంభించిన ప్రజా పంపిణీ వ్యవస్థ (1997) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాహిత కార్యక్రమంగా ప్రసిద్ధి చెందింది. నాలుగు లక్షల తొంభై ఎనిమిదివేల (4,98,000) చౌకధర దుకాణాలు దేశవ్యాప్తంగా 16 కోట్ల కుటుంబాలకు ఆహార భద్రత కల్పిస్తున్నాయి. వీటి ద్వారా ప్రతి కుటుంబానికి 25 నుంచి 35కిలోల వరకు చౌకధరలో ఆహారధాన్యాలను ప్రతినెలా అందిస్తున్నారు. దురదృష్టవశాత్తు 1990 తొలినాళ్లలో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల కారణంగా ప్రజా పంపిణీ వ్యవస్థ క్రమేణా బలహీనపడుతూ వచ్చింది. కానీ, మొత్తంగా చూస్తే ఈ వ్యవస్థ ద్వారా పేదరిక నిర్మూలన కొంత వరకు విజయవంతమైందని చెప్పవచ్చు. 2013నాటికి జాతీయస్థాయిలో పేదరిక తేడా సూచిక (Poverty Gap Index) గ్రామీణ స్థాయి పేదరికాన్ని 18% నుంచి 22% కి తగ్గించింది. తమిళనాడులో 61% నుంచి 83%కి, ఛత్తీస్‌గఢ్‌లో 39% నుంచి 57%కి గ్రామీణ స్థాయి పేదరికాన్ని తగ్గించడంలో ప్రజాపంపిణీ వ్యవస్థ విజయం సాధించింది. ఈ మధ్య కాలంలో పేదవారికి ధనసహాయం అందించడం మంచిదా? వస్తు సహాయాన్ని అందించడం మంచిదా? అనే వివాదం తలెత్తింది. లబ్ధిదారుల మీద జరిపిన సర్వే వివరాల ప్రకారం ముఖ్యంగా మహిళలు వస్తురూప సహాయాన్నే కోరుకుంటున్నారని తేలింది. బ్రెజిల్లో ప్రజలు ధనసహాయాన్ని కోరుకుంటున్నారు. వివిధ దేశాలు ఆయా పరిస్థితులను బట్టి విభిన్న విధానాలను అవలంబిస్తున్నాయి. మౌలిక సదుపాయాలు, సేవల విస్తరణ, పారదర్శకత, అందిస్తున్న సహాయం, అనుసరిస్తున్న పద్ధతులపై సామాజిక రక్షణ కార్యక్రమాల విజయవంతం కావడం ఆధారపడి ఉంటుంది. భారతదేశం విషయంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్న లొసుగుల మీద ఎన్నో విమర్శలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఉపయోగిస్తున్న సమాచార సాంకేతిక పరిజ్ఞానం (ఐఇఖీ) ఈ లొసుగులను తగ్గించటంలో ప్రముఖపాత్ర పోషిస్తోంది. ఇది 200405 నుంచి 2011-12 మధ్యకాలంలో ఈ రంగంలో అవినీతిని 35%55%కి తగ్గించడంలో కీలకంగా వ్యవహరించింది. అంతేకాకుండా ప్రజాపంపిణీ వ్యవస్థ పరిధిలోకి 23% 44.5% కుటుంబాలు వచ్చాయి. సమగ్ర శిశు అభివృద్ధి పథకం, ఇతర సామాజిక పథకాలు సమగ్ర శిశు అభివృద్ధి పథకం (ఐఇఈ), మధ్యాహ్న భోజన పథకం బాలబాలికల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడంలో ప్రముఖపాత్ర పోషించాయి. వీటి వల్ల గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లుల ఆరోగ్యం మెరుగుపడింది. శైశవ బాల్యదశలో శారీరక, మానసిక ఎదుగుదల లేని పిల్లలు పెద్దవారైన తర్వాత అన్ని రంగాల్లో విఫలం చెందడం వైద్యపరంగా నిరూపితమైంది. అందువల్ల పోషకాహారలోపాన్ని నివారించేందుకు అందరూ కృషి చేయాలి. పేదప్రజల ఆదాయాన్ని పెంపొందించడంలో 2005లో ప్రారంభించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి పథకం.. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (కూఖఉఎ్క) చక్కగా ఉపయోగపడింది. దీని కింద ఏటా 5 కోట్ల మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు జీవనోపాధి కల్పిస్తున్నారు. ప్రతి మూడు కుటుంబాల్లో ఒక కుటుంబం దీనివల్ల లబ్ధి పొందుతుంది. 201314 సంవత్సరాలలో 1.21 బిలియన్ పని దినాలను కల్పించారు. అందులో 40% పనిదినాలు బలహీన వర్గాలైన షెడ్యూల్డు కులాలు, తెగల వారికి, 55% పనిదినాలు మహిళలకు లబ్ధి చేకూర్చాయి. సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో మహిళలకు పెద్దపీట వేయడం వల్ల వారి కుటుంబాలకు ఆహార భద్రత లభిస్తుంది. ఎందుకంటే పురుషులతో పోల్చితే మహిళలే కుటుంబ ఆహార అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దక్షిణాఫ్రికాలో సత్ఫలితాలు దక్షిణ ఆఫ్రికాలో వృద్ధులకు పింఛన్ పథకం, బాలబాలికలకు ధనసహాయం మొదలైన కార్యక్రమాల ద్వారా సామాజిక రక్షణ అందుతోంది. తాజా అంచనాల ప్రకారం కోటి మంది బాలబాలికలు లబ్ధి పొందుతున్నారు. దీని ఫలితంగా బడి హాజరు శాతంలో గణనీయమైన పెరుగుదల, పౌష్టికాహార లభ్యత మెరుగైంది. బాల కార్మికుల సంఖ్య గణనీయంగా తగ్గింది. బాలబాలికలకు అందించే ధన సహాయం కుటుంబ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరిచి బిడ్డల చదువుకు, పోషకాహారానికి మరింత ఉదారంగా వెచ్చించటానికి వీలు కల్పించింది. బ్రెజిల్ దేశంలో ‘శూన్య ఆకలి’ అనే పథకం బాలబాలికల్లో పౌష్టికాహార లోపాన్ని గణనీయంగా తగ్గించేందుకు ఉపయోగపడింది. ఆౌట్చ జ్చఝజీజ్చీ అనే ప్రత్యక్ష నగదు పథకం కింద గత 9 ఏళ్లలో బాలబాలికల్లో పౌష్టికాహార లోపాన్ని 61%, గ్రామీణ పేదరికాన్ని 15% మేర తగ్గించారు. దీని కారణంగా మూడు కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారు. వర్ధమాన దేశాలన్నిటికంటే సామాజిక పరిరక్షణకు బ్రెజిల్ అత్యధికంగా తలసరి ఆదాయంలో 17.9% వెచ్చిస్తుంది. ఆహార అభద్రతను ఎదుర్కోవాలంటే? ఈ పై అంశాలను పరిశీలించినప్పుడు ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు ధన సహాయం అందించడానికి.. పేదరికం, ఆహార అభద్రత తగ్గుదలకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందని తెలుస్తోంది. ఈ మొత్తం ప్రక్రియలో తగినన్ని వనరులు, సరైన విధాన రూపకల్పన, సుపరిపాలన, రాజకీయ ఉద్యోగిస్వామ్య చిత్తశుద్ధి, సామాజిక రక్షణలు ప్రముఖపాత్ర వహిస్తాయి. బంగ్లాదేశ్ అమలుచేస్తున్న "Challenging the frontiers of poverty reduction",రువాండాలో "Vision 2020 umurenge", భారతదేశంలో MGNREGA పథకాలు వీటికి చక్కని ఉదాహరణలు. పేద దేశాలు సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కువ వనరులు కేటాయించలేవనే భావన బహుళ ప్రచారాన్ని పొందింది. ముఖ్యంగా పైన ప్రస్తావించిన దేశాలన్నీ పేద దేశాలనే విషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది. అభ్యుదయ భావాలు కలిగిన రాజకీయ నాయకత్వం, అంకితభావం కలిగిన ఉద్యోగిస్వామ్యం, చురుకైన పౌరసమాజాలు ఎన్ని పరిమితులనైనా అధిగమించి సామాజిక సంరక్షణకు దోహదం చేస్తాయి. వర్ధమాన దేశాల సమస్య వనరుల లేమి కాదు. వాటిని వెలికితీయడంలో విఫలం కావడమే. తృతీయ ప్రపంచదేశాల్లో ప్రత్యక్ష పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తక్కువ. పరోక్ష పన్నులు పేదలను మరింత కుంగదీసి, ధనికులకు పన్ను మినహాయింపునకు దారితీస్తాయి. దీనికి సరైన పరిష్కార మార్గం ప్రత్యక్ష పన్నుల పరిధిని విస్తృత పరచడమే. ఇండియా లాంటి దేశంలో ఆదాయం, సంపద విషయంలో ఖచ్చితమైన గణాంకాలు లేవు. దేశంలో 38% సంపద కేవలం 5% ఉన్న అత్యంత ధనికుల చేతిలో ఉంది. అట్టడుగున ఉన్న 60% కుటుంబాల చేతిలో 13% సంపద మాత్రమే ఉంది. సేవాపన్నుల విషయంలో కూడా ఇదే వైపరీత్యం కనపడుతుంది. ప్రోత్సాహకాలు అనే నెపంతో సంపన్న వర్గాలకు ఇచ్చే పన్ను మినహాయింపులు దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తున్నాయి. ప్రభుత్వం 201314 సంవత్సరంలో పన్ను ప్రోత్సాహకాల రూపంలో రూ. 5 లక్షల 49 వేల 984 కోట్లను నష్టపోయింది. ఈ మొత్తం.. పన్ను ఆదాయంలో 40 శాతానికి పైగా ఉంటుంది. గనులు, నిర్మాణం, స్థిరాస్థిరంగం, నగలు, రత్నాలు వంటివాటిపై పన్నులు విధించి వాటిని సక్రమంగా ఉపయోగించినట్లయితే సామాజిక రక్షణ కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. - డా॥బి.జె.బి. కృపాదానం సబ్జెక్ట్ నిపుణులు, ఆర్.సి.రెడ్డి స్టడీ సర్కిల్ -
పట్టణ జనాభా-రవాణా వ్యవస్థ
కాంపిటీటివ్ గెడైన్స్ : జనరల్ ఎస్సే ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ పెరుగుతోంది. ప్రపంచ జనాభా వృద్ధిరేటు కంటే పట్టణ జనాభా వృద్ధి అధికంగా ఉంది. ప్రపంచ పట్టణ జనాభా వార్షిక వృద్ధి మూడు శాతమని అంచనా. ప్రపంచ జనాభాలో సుమారు 50 శాతం మంది పట్టణాల్లో నివసిస్తున్నారు. 2011 లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో పట్టణ జనాభా 31.16 శాతంగా ఉంది. భారత్‌లో పట్టణీకరణని పరిశీలిస్తే.. పట్టణ జనాభాలో వృద్ధి అధికంగా ఉండటంతోపాటు పెద్ద నగరాల్లో జనాభా కేంద్రీకరణను గమనించొచ్చు. స్వాతంత్య్రానంతరం భారతదేశం మిశ్రమ ఆర్థిక విధానాన్ని అవలంబించింది. దీంతో ప్రైవేట్ రంగం అభివృద్ధి చెంది పట్టణ జనాభా పెరుగుదలకు కారణమైంది. 1901లో దేశ జనాభాలో పట్టణ జనాభా వాటా 11.4%. ఇది 2001లో 27.81 శాతానికి, 2011లో 31.16 శాతానికి పెరిగింది. వివిధ నివేదికలు ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం రాబోయే దశాబ్దాల్లో పెరిగే పట్టణ జనాభాలో భారత్, చైనా వాటా 1/3 వంతుగా ఉండనుంది. 2010 నుంచి 2050 మధ్య కాలంలో భారత్‌లో పట్టణ జనాభాకు అదనంగా 497 మిలియన్లు, చైనాలో 341 మిలియన్లు, నైజీరియాలో 200 మిలియన్లు, అమెరికాలో 103 మిలియన్లు, ఇండోనేషియాలో 92 మిలియన్ల మంది తోడవనున్నారని నివేదికలు పేర్కొంటున్నాయి. గత 40 ఏళ్లతో పోల్చినప్పుడు 2010 నుంచి 2050 మధ్య కాలంలో పట్టణ జనాభాలో పెరుగుదల భారత్, నైజీరియాలలో ఎక్కువగా ఉండనుంది. చైనాలో 2000-2050 మధ్య కాలంలో పట్టణ జనాభా పెరుగుదలకు పట్టణాభివృద్ధిని ప్రధాన కారణంగా పేర్కొనవచ్చు. ఇదే కాలంలో భారత్‌లో పట్టణ జనాభాలో 2/3 వంతు పెరుగుదలకు పట్టణాభివృద్ధి, 1/3 వంతు పెరుగుదలకు మొత్తం జనాభా పెరుగుదల దోహదపడతాయని నివేదికలు పేర్కొంటున్నాయి. ది గ్లోబల్ కమిషన్ ఆన్ ది ఎకానమీ అండ్ క్లైమేట్ 2014లో ‘న్యూ క్లైమేట్ ఎకానమీ’ పేరిట నివేదిక రూపొందించింది. దీని ప్రకారం 2031 నాటికి భారతదేశ పట్టణ జనాభా 600 మిలియన్లకు చేరనుంది. దేశ మొత్తం జనాభాలో ఇది 40 శాతంగా ఉండనుంది. రాబోయే 20 ఏళ్ల కాలంలో పట్టణ అవస్థాపనా పెట్టుబడిలో 827 బిలియన్ డాలర్ల లోటు ఉండే అవకాశం ఉంది. 2050 నాటికి అంచనా వేసిన వయసు కంటే ముందు సంభవించే మరణాలకు పట్టణ వాయుకాలుష్యం ప్రధాన కారణం అవుతుందని నివేదిక పేర్కొంది. పెరుగుతున్న పట్టణీకరణ కారణంగా భారత్ అధిక ప్రయోజనం పొందగలదని ఎం.సి.కిన్సె నివేదిక పేర్కొంది. 2030 నాటికి నగరాలు 70 శాతం నికర నూతన ఉపాధిని అందించగలవని, భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో నగరాల వాటా 70 శాతంగా ఉండొచ్చని నివేదిక అభిప్రాయపడింది. పట్టణ ప్రాంతాల్లోని మౌలిక సౌకర్యాలపై భారత్‌లో వార్షిక తలసరి మూలధన వ్యయం 17 డాలర్లు కాగా, చైనా వార్షిక తలసరి మూలధన వ్యయంలో 14 శాతం, పట్టణీకరణ డిమాండ్‌కు అనుగుణంగా భారత్‌లో ఏటా 700 మిలియన్ చదరపు మీటర్ల రెసిడెన్షియల్, 900 మి.చ.మీ. కమర్షియల్ నిర్మాణాలు జరగాలని నివేదిక పేర్కొంది. ప్రపంచ బ్యాంకు నివేదిక 2016 ప్రకారం ప్రపంచ జనాభాలో 54 శాతం మంది పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. 2045 నాటికి నగరాల్లోని జనాభా 1.5 రెట్లు పెరిగి, మొత్తం పట్టణ జనాభా 6 బిలియన్లకు చేరుకునే అవకాశం ఉంది. ప్రపంచ జీడీపీలో పట్టణ ప్రాంత వాటా 80 శాతంగా ఉండనుంది. ఉత్పాదకత, నవకల్పనల్లో పెరుగుదల కారణంగా సుస్థిర వృద్ధి సాధనకు పట్టణ ప్రాంతాలు దోహదపడతాయి. వేగవంతమైన పట్టణీకరణ కారణంగా మౌలిక సౌకర్యాల కల్పనలో అనేక సవాళ్లు ఎదురవుతాయి. వాతావరణ మార్పును అధిగమించడంలో పట్టణ ప్రాంతాలు ప్రధాన పాత్ర పోషిస్తాయని నివేదిక పేర్కొంది. ప్రపంచంలో శక్తి వినియోగంలో పట్టణ ప్రాంతాలు 2/3వ వంతు వాటాను కలిగి ఉన్నాయి. ప్రపంచ హరిత గృహ వాయు ఉద్గారాల విడుదలలోనూ పట్టణాల వాటా 70 శాతమని నివేదిక పేర్కొంది. జాతీయ రవాణా అభివృద్ధి విధాన కమిటీ అభిప్రాయంలో 2031 నాటికి భారత పట్టణ జనాభా 60 కోట్లకు చేరే అవకాశం ఉంది. మొత్తం దేశ జనాభాలో పట్టణ జనాభా 40 నుంచి 42 శాతంగా కమిటీ అంచనా వేసింది. పట్టణ అవస్థాపనా సేవలకు అవసరమైన పెట్టుబడి అంచనాలో భాగంగా.. 2031 నాటికి పట్టణ జనాభా 600 మిలియన్లకు చేరుతుందని హై పవర్డ ఎక్స్పర్ట కమిటీ పేర్కొంది. రవాణా వ్యవస్థ: భారత ఆర్థిక వ్యవస్థలో రవాణా ఒక ముఖ్య అంశం. 1990వ దశకంలో మొదలైన సరళీకృత ఆర్థిక విధానాల వల్ల భూ, జల, వాయు రవాణాల్లో అనేక రవాణా సాధనాలు వాడుకలోకి వచ్చాయి. ఇదే సమయంలో దేశంలోని అధిక జనాభాకు ప్రజా రవాణా ప్రాథమిక రవాణా సాధనంగా నిలిచింది. ప్రపంచంలో ప్రజా రవాణాను అధికంగా వినియోగిస్తున్న రవాణా వ్యస్థల్లో భారత్ రైల్ నెట్వర్క ఒకటి. భారత రైల్వే వ్యవస్థ 2014-15లో రోజుకు 23 మిలియన్ల మంది ప్రయాణీకులను చేరవేసింది. మొత్తంగా ఆ ఏడాదిలో 8.397 బిలియన్ల మంది రవాణా అవసరాలను తీర్చిడంతో పాటు 1058.81 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసింది. మార్చి 2013 నాటికి దేశంలో మొత్తం రిజిస్టర్డ మోటారు వాహనాలు 172 మిలియన్లు. వీటిలో 21.5 మిలియన్లు కార్లు, టాక్సీలు, జీపులున్నాయి. మొత్తం కుటుంబాల్లో 10 శాతం కుటుంబాలు మోటారు సైకిల్ కలిగి ఉన్నాయి. ట్రాఫిక్ రద్దీ కారణంగా ప్రపంచంలో అధిక మరణాలు సంభవిస్తున్న దేశంగా భారత్ నిలిచింది. భారత ఆటోమొబైల్ పరిశ్రమ ఏటా 4.6 మిలియన్ల వాహనాలను ఉత్పత్తి చేస్తోంది. 2015-16లో భారత ప్రభుత్వం భూ ఉపరితల రోడ్లు, రైల్వేల నుంచి ట్రాఫిక్‌ను జలమార్గాలకు మరల్చడానికి ఇన్లాండ్ వాటర్‌వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద 106 జాతీయ జల మార్గాలను ప్రకటించింది. పట్టణ రవాణా: దేశంలో పేదరిక నిర్మూలనకు విద్యుత్, భూమిని పొదుపుగా వినియోగించుకోవాలి. దీంతోపాటు కాలుష్యం, గ్రీన్ హౌజ్ వాయు ఉద్గారాలను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ఈ లక్ష్యసాధనలో పట్టణ రవాణా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుతం దేశంలో నాణ్యత, పరిమాణం పరంగా పట్టణ రవాణా సర్వీసులు, అవస్థాపనా సదుపాయాల లోటు అధికమైంది. దేశంలోని మెగాసిటీల్లో వాహన కాలుష్య పెరుగుదలకు కారణాలుగా కింది అంశాలను పేర్కొనవచ్చు. 1. అధిక ట్రాఫిక్ పరిమాణం, పట్టణ జనాభా పెరుగుదల. 2. ప్రైవేట్, వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరగడం. 3. వాహనాల నిర్వహణ సక్రమంగా లేకపోవడం. 4. ట్రాఫిక్ అడ్డంకుల పెరుగుదల 5. పర్యావరణహిత రవాణా సాధనాల వినియోగం తక్కువగా ఉండటం. ఇంధన సాంకేతిక పరిజ్ఞానం వినియోగం తక్కువగా ఉండటం. 6. ప్రైవేట్, వ్యక్తిగత వాహనాల సంఖ్యను తగ్గించడానికి సమగ్రమైన కోశపరమైన వ్యూహాలు అవలంభించిక పోవడం. - డాక్టర్ తమ్మా కోటిరెడ్డి ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్ -
కాంపిటీటివ్ గెడైన్స్ కరెంట్ అఫైర్స
మార్క్ సెల్బీకి స్నూకర్ వరల్డ్ టైటిల్ స్నూకర్ వరల్డ్ టైటిల్‌ను మార్క్ సెల్బీ (ఇంగ్లండ్) గెలుచుకున్నాడు. షీఫీల్డ్ (చైనా)లో మే 2న జరిగిన పోటీలో జున్హుయి (చైనా)ను సెల్బీ ఓడించాడు. ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్‌కు 4వ స్థానం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వార్షిక వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ నాలుగో స్థానానికి పడిపోయింది. మే 4న విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో నిలవగా, న్యూజిలాండ్ రెండో స్థానంలో, దక్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉన్నాయి. టీ-20 ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ మొదటి స్థానాన్ని దక్కించుకోగా, భారత్ రెండో స్థానంలో నిలిచింది. జకోవిచ్‌కు మాడ్రిడ్ మాస్టర్స్ టైటిల్ మాడ్రిడ్ టెన్నిస్ మాస్టర్స్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను నొవాక్ జకోవిచ్ (సెర్బియా) గెలుచుకున్నాడు. మాడ్రిడ్‌లో మే 9న జరిగిన ఫైనల్లో ఆండీ ముర్రే(బ్రిటన్)పై జకోవిచ్ గెలుపొందాడు. లియాండర్ పేస్ జోడీకి ఏటీపీ ఛాలెంజర్ టోర్నీ టైటిల్ ఏటీపీ ఛాలెంజర్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ టైటిల్ ను లియాండర్ (భారత్), సామ్ గ్రోత్ (ఆస్ట్రేలియా) జోడీ గెలుచుకుంది. బుసాన్‌లో మే 8న జరిగిన ఫైనల్లో సంచాయ్, సొంచాట్ రటివటనా (థాయిలాండ్)లను ఈ జోడీ ఓడించింది. పేస్‌కు ఇది 12వ ఛాలెంజర్ టైటిల్. -
కాంపిటీటివ్ గెడైన్స్
జనరల్ అవేర్నెస్ మాదిరి ప్రశ్నలు 1.2015, సెప్టెంబర్ 16న ఐక్యరాజ్యసమితి సాధారణ సభ అధ్యక్షుడిగా నియమితులైన మోజెన్స్ లెకైటాఫ్ట్ ఏ దేశానికి చెందిన వ్యక్తి? 1) డెన్మార్క్ 2) ఘనా 3) నమీబియా 4) పోలండ్ 2.అంతర్జాతీయ న్యాయస్థాన ప్రస్తుత అధ్యక్షుడు? 1) హిసాషి ఒవాడా 2) అబ్దుల్కవి అహ్మద్ యూసఫ్ 3) రోనీ అబ్రహాం 4) పీటర్ టోమ్కా 3.ప్రస్తుతం అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తిగా ఉన్న భారతీయుడు? 1) జస్టిస్ ఆర్ఎం లోథా 2) జస్టిస్ హెచ్ఎల్ దత్తు 3) జస్టిస్ దల్వీర్ భండారి 4) జస్టిస్ ఎంబీ షా 4.విమాన ప్రమాదంలో మరణించిన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్? 1) యు థాంట్ 2) ట్రిగ్వేలి 3) కుర్ట్ వాల్దీమ్ 4) దాగ్ హమ్మర్స్ జోల్డ్ 5.కిందివారిలో ఒకే పర్యాయం ఐరాస సెక్రటరీ జనరల్‌గా పనిచేసినవారు? 1) ట్రిగ్వేలి 2) యు థాంట్ 3) బౌత్రోస్ ఘలీ 4) కుర్ట్ వాల్దీమ్ సమాధానాలు 1) 1 2) 3 3) 3 4) 4 5) 3. ఎన్. విజయేందర్ రెడ్డి జనరల్ అవేర్నెస్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. -
Banking English
కాంపిటీటివ్ గెడైన్స్ SPOTTING ERRORS–2 1. In all financial matters, she is all in all. a b c d 2. After a glance, I have understood a b the second chapter comprises of three units. c d 3. All queries should be addressed to a b c the concerned officer. d 4. The literary giant has been conferred a b the same honour by the chairman of the college. c d 5. The PM has condoled the death of a b c the Pakistani Minister. d 6. The college is consisted of a b both Hindus and Muslims. c d 7. In completion of the task, he as well they a b c have been tired. d KEY WITH EXPLANATION 1-d. The phrase needed here is ‘all-powerful’ because ‘all in all’ means ‘of supreme or exclusive importance, interest’ etc. They were all in all to each other. Taking it all in all (= considering everything), I have decided to do so. All in all, it’s not a bad little restaurant (= generally, all things considered). Moreover, the phrase is adverbial not adjective which is needed here. 2-d. The word ‘comprise’ doesn’t take ‘of’ when it means ‘consist of’. However, ‘be comprised of’ is correct. It means ‘to include and contain’. The company is comprised of five divisions. The city’s population is largely comprised of Asians and Europeans. So the sentence should be: After a glance, I have understood the second chapter is comprised of/ comprises/consists of three units. The traditional rule states that the whole comprises the parts and the parts compose the whole. In strict usage: The Union comprises 50 states. Fifty states compose (or constitute or make up) the Union. Even though careful writers often maintain this distinction, comprise is increasingly used in place of compose, especially in the passive: The Union is comprised of 50 states. 3-d. It should be ….the officer concerned (with this matter). When you mean ‘involved in something or affected by it’, concerned is not used before a noun. The affair is greatly regretted by everyone concerned. Divorce is very painful, especially when children are concerned. Everyone concerned in the incident was questioned by the police. All the people concerned with children’s education. If ‘concerned’ is used before a noun, it means ‘worried’ or ‘anxious’. The concerned officer passed sleepless nights after an attack or a ride by ACB. Concerned parents approached the school about the problem. As a verb it has the conjugation: Concern, concerned, concerns, concerning giving the meaning ‘to have to do with or relate to’. I wrote an article that concerns the plight of homeless people. 4-c. The sentence should be: The same honour by the chairman of the college has been conferred (up) on the literary giant. Since the whole sentence is to be shuffled, the error lies in both ‘b’ and ‘c’ parts. Either of them can be marked in the exam. The correct phrase is ‘to confer a title/degree/honour etc. on/upon somebody’. An honorary degree was conferred on him by the university. Confer with somebody about or on something=to discuss something with somebody, especially in order to exchange opinions or to get advice. He wanted to confer with his colleagues/uncle before reaching a decision. To bestow (an honor), for example, they conferred a medal on the hero. We conferred an honorary degree on her. 5-b. The PM has condoled with the Pakistani people on their minister’s death (or) The PM sent his condolences on the death of the Pakistani Minister. The verb ‘condole’ is used with ‘with’. It means ‘to express sympathy or sorrow. I condoled with him in his loss. As a noun, it is used in plural ‘condolences’. The collocations are ‘give/send/offer one’s condolences. I would like to offer my condolences to the victim’s parents. Our condolences go to his wife and family. I sent him a letter of condolences. 6-b. The phrase ‘be consisted of’ unlike ‘be comprised of’ is wrong. Remove ‘is’. The forms of phrasal verbs are ‘consists in’ something and ‘consists of’ something. The team consists of (=to be made of or formed from) four Europeans and two Americans. The buffet consisted of several different Indian dishes. Happiness doesn’t consist in how many possessions you have. Consist of, include, comprise, comprehend, embrace, involve are used almost synonymously as explained below. These verbs mean to take in or contain as part of something larger. Include often implies an incomplete listing: "Through the process of amendment, interpretation and court decision I have finally been included in 'We, the people'" (Barbara C. Jordan). Comprise usually implies that all of the components are stated: The book comprises 15 chapters. Comprehend and embrace usually refer to the taking in of subordinate elements: My field of study comprehends several disciplines. This theory embraces many facets of human behaviour. Involve usually suggests inclusion as a logical consequence or necessary condition: "Every argument involves some assumptions" (Brooke F. Westcott). 7-d. …has been tired. If the subject is singular, the verb is singular. The verb is plural, if the subject is plural. The verb must agree with the number of the subject, not with its qualifiers. The subject is ‘he’ and so the verb is ‘has been tired’. It should not agree with ‘they’, though it is nearer to it. Radha as well as kamala is (not ‘are’) my favourite student. -
హిమాలయాల్లో సహజంగా పెరిగే మొక్క?
కాంపిటీటివ్ గెడైన్స్ : ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించి వివిధ పోటీ పరీక్షల్లో వచ్చేందుకు అవకాశం ఉన్న ప్రశ్నలు, వివరణాత్మక సమాధానాలు.. కిందివాటిని పరిశీలించండి. 1) పత్తి 2) వేరుశెనగ 3) వరి 4) గోధుమ పైవాటిలో ఖరీఫ్ పంటలు ఏవి? ఎ) 1, 4 బి) 2, 3 సి) 1, 2, 3 డి) 2, 3, 4 సరైన సమాధానం: సి వివరణ భారతదేశంలో సంవత్సరాన్ని మూడు వ్యవసాయ రుతువులుగా విభజిస్తారు. అవి 1) ఖరీఫ్ 2) రబీ 3) జైద్. గోధుమ ప్రధానమైన రబీ పంట. దీనికి తక్కువ ఉష్ణోగ్రత, వర్షపాతం సరిపోతుంది. తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమలు-శ్రీలంక, ఇండో-బర్మన్ ప్రాంతాలను ‘ఎకలాజికల్ హాట్‌స్పాట్స్’గా ప్రకటించడానికి కింద తెలిపిన వాటిలో మూడు ప్రామాణికతలేవి? 1) జాతుల సంపన్నత్వం (స్పిసీస్ రిచ్‌నెస్) 2) ఉద్భిజ్జ సంపద సాంద్రత (వెజిటేషన్ డెన్సిటీ) 3) స్థానీయత (ఎండెమిజం) 4) ప్రమాదస్థితి (థ్రెట్ పర్సెప్షన్) 5) వెచ్చటి, తడి వాతావరణాలకు అనుకూలత పొందే వృక్ష, జంతు జాతులు పై అంశాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. ఎ) 1, 2, 3 బి) 1, 3, 4 సి) 2, 3, 4 డి) 3, 4, 5 సమాధానం: బి వివరణ జాతుల సంపన్నత్వం అంటే ఏదైనా జీవసమాజంలో మిగతా జాతులకన్నా ఓ ప్రత్యేక జాతి సంఖ్యాపరంగా, ఆ ప్రాంత వనరులను వినియోగించుకోవడంలో మిగతా జాతుల కంటే ఆధిపత్యాన్ని కలిగి ఉండటం. స్థానీయత అంటే ఓ ప్రాంతానికి మాత్రమే పరిమితమై జీవిస్తూ, ఇతర ప్రాంతాల్లో పెరుగుదల తక్కువగా ఉన్న జాతులు. తూర్పు హిమాలయాలు, పశ్చిమ కనుమల ప్రాంతాలు, ఇండో-బర్మన్ ప్రాంతాల్లోని జాతుల్లో ఎక్కువగా స్థానీయమైనవి. ఇవి ప్రస్తుతం మానవ చర్యల వల్ల ప్రమాదకర స్థితిని ఎదుర్కొంటున్నాయి. కింది వాక్యాలను పరిశీలించండి (1) టెక్సాస్ అనే మొక్క హిమాలయాల్లో సహజంగా పెరుగుతుంది. (2) దీన్ని ఇటీవల ‘రెడ్ డేటా బుక్’ లిస్ట్‌లో చేర్చారు (3) దీని నుంచి ‘టాక్సోల్’ అనే డ్రగ్‌ను తయారు చేస్తారు. దీన్ని ‘పార్కిన్ సాన్స్’ వ్యాధి నివారణకు ఉపయోగిస్తారు. పై వాటి నుంచి సరైన దాన్ని గుర్తించండి (ఎ) 1 (బి) 2, 3 (సి) 1, 2, 3 (డి) పైవన్నీ సరైన సమాధానం: డి వివరణ ఈ మొక్క నుంచి తయారు చేసే టాక్సోల్ డ్రగ్‌లో గుండె క్యాన్సర్, పార్కిన్సాన్స్, రొమ్ము క్యాన్సర్లను నివారించే గుణాలు ఎక్కువగా ఉన్నందువల్ల దీన్ని ఎక్కువ స్థాయిలో టాక్సోల్ డ్రగ్‌ను తయారు చేసేందుకు నిర్మూలించారు. అందువల్ల దీన్ని రెడ్ డేటా లిస్ట్‌లో చేర్చారు. హిమాలయాలు ప్రస్తుతం ఉన్న స్థానంలో లేకపోతే కింది వాటిలో భారతదేశ భూభాగంపై కలిగే ప్రభావాలు ఎలా ఉంటాయి? (1) దేశంలో ఎక్కువ భాగం ఆసియా భూభాగం నుంచి వీచే శీతల గాలుల ప్రభావానికి లోనై ఉండేది. (2) గంగా-సింధు మైదాన ప్రాంతంలో ఇప్పుడున్నంత విస్తీర్ణంలో సారవంతమైన ఒండ్రుమట్టి నేలలు, జీవనదులు ఉండేవి కాదు. వర్షపాత పరిమాణం తక్కువై దుర్భిక్ష ప్రాంతంగా ఉండేది. (3) రుతుపవన విధానం ఇప్పుడున్నట్లు కాకుండా భిన్నమైన రీతిలో ఉండేది. పైవాటి నుంచి సరైనదాన్ని గుర్తించండి. (ఎ) 1 (బి) 1, 3 (సి) 2, 3 (డి) పైవ న్నీ సరైన సమాధానం: డి కింది వాటిలో భారత్-చైనాల మధ్య 2006లో రెండు దేశాల మధ్య వర్తక, వాణిజ్యాలను పెంపొందించేందుకు ఏ కనుమను తెరిచారు? (ఎ) నిథిలా (బి) జెలెప్లా (సి) నాథులా (డి) షిప్కిలా సరైన సమాధానం: సి పశ్చిమ దిశలో ప్రవహించే నర్మద, తపతి లాంటి ద్వీపకల్ప నదులు వాటి నదీ ముఖద్వారాల వద్ద డెల్టాలకు బదులు ఎస్టురీస్ ఏర్పరిచేందుకు కారణం? (1) అతి తక్కువ కాలంతో పాటు, వేగంగా ప్రవహించడంవల్ల (2) పశ్చిమతీర రేఖ తరచూ టైడల్ బోర్స్ తో మునిగిపోవడం వల్ల (3) అవి రవాణా చేసే నిక్షేపాల పరిమాణం తక్కువగా ఉండటం, పగులు లోయ గుండా ప్రవహిండం వల్ల. (4) వాటి ద్వారా రవాణా అయ్యే నిక్షేపాలను వాటి ముఖ ద్వారాల వద్ద నిక్షేపితం చేయకుండా సముద్రంలోకి నెట్టివేయడం వల్ల పైవాటిలో సరైన వాక్యాన్ని గుర్తించండి (ఎ) 1, 3, 4 (బి) 2, 3, 4 (సి) 2, 3 (డి) పైవన్నీ సరైన సమాధానం: ఎ వివరణ పై ప్రశ్నకు సరైన జవాబు గుర్తించాలంటే పగులులోయలు, పశ్చిమ కనుమల భౌమ నిర్మాణంపై సరైన అవగాహన ఉండాలి - ఎ.డి.వి. రమణ రాజు సీనియర్ ఫ్యాకల్టీ, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ -
బ్లాక్ హోల్ దశ అంటే..?
కాంపిటీటివ్ గెడైన్స్ : జీఎస్ - ఫిజిక్స్ కాస్మిక్ కిరణాలను 1912లో విక్టర్ హెజ్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. ఆయనకు 1936లో నోబెల్ బహుమతి లభించింది. వీటికి కాస్మిక్ కిరణాలు అని పేరు పెట్టిన శాస్త్రవేత్త మిల్లికాన్. ధర్మాలు ♦ కాస్మిక్ కిరణాల్లోని ముఖ్య కణాలు: 1. ఎలక్ట్రాన్ 2. పాసిట్రాన్ 3. ప్రోటాన్ 4. న్యూట్రాన్ 5. అయాన్లు ♦ వీటిలో సుమారు 80 శాతం వరకు ప్రోటాన్లు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే సూర్యుడు, నక్షత్రాల్లో ప్రోటాన్ల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ♦ వీటి ఉనికిని, దిశను తెలుసుకునేందుకు ఉపయోగించేది కాస్మిక్ రే టెలిస్కోప్. ♦ ఈ కిరణాల తీవ్రత ధృవాల వద్ద ఎక్కువగా, భూమధ్యరేఖ వద్ద తక్కువగా ఉంటుంది. ♦ ఈ కిరణాల శక్తి 109ev నుంచి 1020ev వరకు ఉంటుంది. అందువల్ల క్వాంటం సిద్ధాంతం ప్రకారం ఈ కిరణాల తరంగదైర్ఘ్యం తక్కువ. విశ్వంలోని అన్ని కిరణాల కంటే గరిష్ట శక్తిని కాస్మిక్ కిరణాలు కలిగి ఉన్నాయి. ♦ కాస్మిక్ కిరణాలను రెండు రకాలుగా వర్గీకరిస్తారు. 1. కఠిన 2. మృదు 1. కఠిన కాస్మిక్ కిరణాలు: 10 సెం.మీ.ల మందం గల సీసపు దిమ్మెద్వారా చొచ్చుకొని వెళ్లేవి. ఇవి సూపర్ నోవా నుంచి వెలువడి ఉండవచ్చని భావన. 2. మృదు కాస్మిక్ కిరణాలు: 10 సెం.మీ. మందం గల సీసపు దిమ్మెద్వారా చొచ్చుకొని వెళ్లలేవు. ఇవి నోవా నుంచి లేదా సూర్యుని ఉపరితలం నుంచి వెలువడుతుండొచ్చని భావన. ♦ మనదేశంలో కాస్మిక్ కిరణాల గురించి అధ్యయనం చేసిన శాస్త్రవేత్తలు. 1. విక్రం సారాభాయ్ 2. హెచ్.జె. బాబా 3. మేఘనాథ్ సాహా మొదలైనవారు. ♦ 1985లో భారత్, అమెరికా శాస్త్రవేత్తలు సంయుక్తంగా ‘అనురాధ’ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించి కాస్మిక్ కిరణాలను అధ్యయనం చేశారు. నక్షత్రాలు ఇవి స్వయం ప్రకాశాలు. పరిమాణాన్ని బట్టి వీటిని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. 1. భారీ నక్షత్రాలు: వీటి ద్రవ్యరాశి చాలా ఎక్కువ. పెద్ద పరిమాణంలో ఉంటాయి. ఉదా: ఎప్సిలాన్ అరిగా 2. మధ్యతరహా: వీటి ద్రవ్యరాశి భారీ నక్షత్రాల కంటే తక్కువ. ఉదా: సూర్యుడు 3. మరుగుజ్జు నక్షత్రాలు: వీటి ద్రవ్యరాశి పైన పేర్కొన్న నక్షత్రాల ద్రవ్యరాశి కంటే చాలా తక్కువగా ఉంటుంది. విశ్వంలో అధిక నక్షత్రాలు ఈ రకానికి చెందినవే. బ్లాక్‌హోల్ ♦ ఒక నక్షత్రం గురుత్వాకర్షణ బలం అనేక రెట్లు పెరిగి తనవైపు వస్తున్న ప్రతి వస్తువును ఆకర్షించుకోవడమే కాకుండా, తనలో నుంచి వెలువడే కాంతిని కూడా బయటకు వెళ్లనీయకుండా నిరోధిస్తుంటే ఆ దశను బ్లాక్ హోల్ దశ అంటారు. ♦ ఈ పేరు పెట్టిన శాస్త్రవేత్త జాన్ వీలర్ (అమెరికా) ♦ ఈ విశ్వంలో జనించిన ఒక నక్షత్రం బ్లాక్‌హోల్ దశను పొందాలంటే దాని ద్రవ్యరాశి కనీసం ఒక చంద్రశేఖర్ లిమిట్ (CSL)కు సమానంగా ఉండాలి. 1 CSL = 1.4ప2ప1030 kg (సూర్యుని ద్రవ్యరాశి) = 2.8ప1030kg ♦ ద్రవ్యరాశిని కొలవడానికి ఉపయోగించే అతి పెద్ద ప్రమాణం ఇఔ. అతి చిన్న ప్రమాణం amu. ♦ నక్షత్ర ద్రవ్యరాశి.. చంద్రశేఖర్ లిమిట్ కంటే తక్కువగా ఉంటే అది మరుగుజ్జు నక్షత్రంగా మారి నశిస్తుంది. కాబట్టి సూర్యుడు ఏ పరిస్థితిలో కూడా బ్లాక్‌హోల్ దశను పొందడు. నోట్: అంతరిక్షంలో వ్యోమగాములు ధరించే స్పేస్ సూట్‌ను Extra Terrestrial Mobile Unit అని అంటారు. దీన్ని ఫైబర్, నైలాన్ అనే పదార్థంతో తయారు చేస్తారు. ప్రతి స్పేస్ సూట్లో 7 పొరలు ఉంటాయి. ♦ ఇవి విశ్వాంతరాళం నుంచి వస్తున్న కాస్మిక్, X, రేడియోధార్మిక కిరణాలతోపాటు ఇతర కిరణాలన్నింటినీ శోషించుకుని రక్షణ కల్పిస్తాయి. అదేవిధంగా తగినంత పీడనాన్ని శరీరంపై కలగజేస్తాయి. ♦ వ్యోమగాములు చేసే స్పేస్ వాక్‌ను Extra Vehicular Activity అంటారు. సహజ రేడియో ధార్మికత ♦ ఈ ధర్మాన్ని 1896లో హెన్రీ బెకరల్ అనే శాస్త్రవేత్త కనుగొన్నారు. అందువల్ల ఆయనకు 1903లో నోబెల్ బహుమతి లభించింది. ♦ ప్రతి పరమాణు కేంద్రకం పరిమాణం 1 fermi గా (10–15m) ఉంటుంది. ఈ పరమాణు కేంద్రకంలో గల ప్రోటాన్లు, న్యూట్రాన్లను కేంద్రక బలాలు బంధిస్తాయి. ఈ విశ్వంలో ఇతర బలాలతో పోల్చినప్పుడు (అయస్కాంత, విద్యుత్, గురుత్వాకర్షణ మొదలైనవి) కేంద్రక బలాలు అత్యంత బలమైనవి. ♦ కేంద్రక బలాల గురించి కూలుంబ్ అనే శాస్త్రవేత్త అధ్యయనం చేసి వాటిని కూలుంబ్ ఆకర్షణ బలాలు, వికర్షణ బలాలు అని రెండు రకాలుగా వర్గీకరించారు. ♦ పరమాణు సంఖ్య 1 నుంచి 30 వరకు గల పరమాణు కేంద్రకాల్లో కూలుంబ్ ఆకర్షణ బలాలు ఎక్కువగా, వికర్షణ బలాలు తక్కువగా ఉంటాయి. అందువల్ల ఇలాంటి పరమాణు కేంద్రకాల్లో స్థిరత్వం ఎక్కువగా ఉండి అవి సహజ రేడియో ధార్మికతను ప్రదర్శించవు. ♦ పరమాణు సంఖ్య 31 నుంచి 82 వరకు [Pb82] గల పరమాణు కేంద్రకాల్లో కూలుంబ్ ఆకర్షణ బలాలు క్రమంగా తగ్గి వికర్షణ బలాలు పెరుగుతాయి. కాబట్టి ఇలాంటి పరమాణు కేంద్రకాల్లో అస్థిరత్వం క్రమంగా పెరుగుతుంది. - సీహెచ్.మోహన్ సీనియర్ ఫ్యాకల్టీ, ఆర్.సి.రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్ -
జీకే - కరెంట్ అఫైర్స్
కాంపిటీటివ్ గెడైన్స్ : కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ ప్లాన్ ఫర్.. పోటీ పరీక్షల్లో రాణించాలంటే జనరల్ నాలెడ్‌జ, కరెంట్ అఫైర్స కీలకం. దాదాపు ప్రతి పోటీ పరీక్షలోనూ ఈ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)తో మొదలుకొని ఎస్.ఎస్.సి., ఆర్ఆర్బీ, ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఆర్బీఐ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స సంస్థలు, సబ్ ఇన్స్పెక్టర్స, పోలీస్ కానిస్టేబుల్స్, డీఎస్సీ.. ఇలా ప్రతి నియామక పరీక్షలో జీకే, కరెంట్ అఫైర్స నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంత ప్రాధాన్యమున్న ఈ విభాగాల్లో ఎక్కువ మార్కులు ఎలా సాధించాలి? ఎలా ప్రిపేరవ్వాలి? ఏయే అంశాలు చదవాలో చూద్దాం. ఏ సబ్జెక్ట్‌కు అయినా నిర్దేశిత సిలబస్ ఉంటుంది. కానీ జీకే, కరెంట్ అఫైర్‌సకు మాత్రం ఎలాంటి సిలబస్ ఉండదు. ఏ అంశం నుంచైనా ప్రశ్నలు రావచ్చు. కరెంట్ అఫైర్‌సపై పట్టు సాధించాలంటే నిత్యం వార్తాపత్రికలను చదవాలి. ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోవాలి. తెలుగుతోపాటు ఒక ఆంగ్ల దినపత్రికను కూడా చదివితే కరెంట్ అఫైర్సతోపాటు ఆంగ్లంపై కూడా పట్టు సాధించవచ్చు. పత్రికలను ప్రధానంగా పరీక్షల దృష్టితో చదవాలి. బ్యాంకు పరీక్షలకైతే ఆర్నెళ్లు, యూపీఎస్సీ, రాష్ర్ట పోటీ పరీక్షలకైతే ఏడాది పాటు జరిగిన వర్తమాన అంశాలను క్షుణ్నంగా చదవాలి. గత పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలను సేకరించి ప్రశ్నల సరళి, క్లిష్టతను పరిశీలించాలి. గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలను దృష్టిలో పెట్టుకొని ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్‌ను కొనసాగించాలి. పూర్వాపరాలు తెలుసుకోండి కరెంట్ అఫైర్సను బిట్ల రూపంలో చదవద్దు. అలా చదివితే త్వరగా మరిచిపోయే ఆస్కారం ఉంది. ఒక అంశం గురించి చదివినప్పుడు దాని పూర్వాపరాలను కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు 2015కుగాను బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ కుమార్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించారు. ఈ అంశాన్ని ఎలా ప్రిపేరవ్వాలో చూద్దాం.. ‘దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు భారతదేశంలోని అత్యుత్తమ చలనచిత్ర రంగ అవార్డు. భారత చలనచిత్ర పితామహుడైన దాదాసాహెబ్ ఫాల్కే పేరిట 1969లో ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. ఆయన మనదేశంలో మొదటి మూకీ చిత్రమైన ‘రాజా హరిశ్చంద్ర’ను 1913లో నిర్మించారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కింద రూ. 10 లక్షల నగదు, స్వర్ణకమలం, శాలువా బహూకరిస్తారు. ఈ అవార్డును తొలిసారిగా 1969లో దేవికారాణి రోరిచ్కు ప్రదానం చేశారు. ఇప్పటివరకు అయిదుగురు తెలుగు సినీ ప్రముఖులకు కూడా ఈ అవార్డును అందజేశారు. వారు.. బొమ్మిరెడ్డి నర్సింహారెడ్డి (1974), ఎల్.వి.ప్రసాద్ (1982), బొమ్మిరెడ్డి నాగిరెడ్డి (1986), అక్కినేని నాగేశ్వరరావు (1990), రామానాయుడు (2009). మనోజ్ కుమార్.. ఉప్కార్, క్రాంతి, పూరబ్ ఔర్ పశ్చిమ్ వంటి దేశభక్తి చిత్రాల్లో హీరోగా నటించారు. ఆయన అసలు పేరు హరికృష్ణ గిరి గోస్వామి.’ ఇలా.. ఒక అంశాన్ని అన్ని కోణాల నుంచి పరిశీలించినట్లయితే ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం రాయవచ్చు. ఈ విధంగా కరెంట్ అఫైర్సను స్టాక్ జీకేతో అనుసంధానం చేస్తూ చదివితే సులభంగా గుర్తుండి పోతుంది. బ్యాంక్ పరీక్షల కోసం.. బ్యాంక్ పీవో, క్లర్క, ఆర్బీఐ, నాబార్డ, ఇన్సూరెన్స సంస్థల పోటీ పరీక్షల్లో వర్తమాన అంశాలతోపాటు బ్యాంకింగ్ రంగం నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి ఈ ఉద్యోగాల కోసం ప్రిపేరయ్యే వారు బ్యాంకింగ్ అవేర్నెస్ విభాగాన్ని కూడా చదవాలి. రిజర్వ బ్యాంక్ తాజా పరపతి విధానం, ఇటీవల ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాలు, కమిటీలు-చైర్మన్లు, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఇటీవలి కాలంలో జరిగిన పరిణామాలు, నూతన ప్రైవేట్ బ్యాంకులు (బంధన్ బ్యాంక్, ఐడీఎఫ్సీ బ్యాంక్), స్మాల్ ఫైనాన్స బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇంక్లూజన్, జన్‌ధన్ యోజన, పాలసీరేట్లు, ఏటీఎంలు, వైట్ లేబుల్ ఏటీఎంలు, బ్యాంకింగ్ పదజాలం, నో యువర్ కస్టమర్ విధానాలు, మనీ లాండరింగ్, క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు, కరెన్సీ, నాణేలు, ప్లాస్టిక్ కరెన్సీ, నాబార్డ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్టాక్ మార్కెట్లు తదితర అంశాలను క్షుణ్నంగా చదవాలి. జాతీయ అంశాలు దేశంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలపై దృష్టి సారించాలి. రాజకీయ సంఘటనలు, ప్రభుత్వ పథకాలు, కమిటీలు, కమిషన్లు, ఎన్నికలు, రాష్ట్రాల్లో జరిగిన ముఖ్య సంఘటనల్ని చదవాలి. తెలుగు రాష్ట్రాలు నిర్వహించే పరీక్షలకు హాజరయ్యేవారు ప్రాంతీయ అంశాలను కూడా తెలుసుకోవాలి. అంతర్జాతీయ అంశాలు వివిధ దేశాల్లో కొత్తగా అధికారంలోకి వచ్చిన నేతలు, అంతర్జాతీయ సదస్సులు, భారత ప్రధాని విదేశీ పర్యటనలు వంటి అంశాలను చదవాలి. శాస్త్ర, సాంకేతిక అంశాలు ఇటీవల జరిగిన అంతరిక్ష, రక్షణ, పర్యావరణ, ఆరోగ్య, ఇంధన, సమాచార, సాంకేతిక రంగాల సంఘటనలను తెలుసుకోవాలి. ఉపగ్రహాలు, వాహక నౌకలు, ఇటీవల పరీక్షించిన క్షిపణులు, ఆవిష్కరణలు, వివిధ తుపాన్లకు పెట్టిన పేర్లు, సంప్రదాయేతర ఇంధన వనరులు, సోలార్ మిషన్ తదితర అంశాలను చదవాలి. ఆర్థిక అంశాలు కేంద్ర బడ్జెట్, ఎకనామిక్ సర్వే, రైల్వే బడ్జెట్, బడ్జెట్ కేటాయింపులు, ప్రకటించిన పథకాల గురించి చదవాలి. 2011 జనాభా లెక్కలను క్షుణ్నంగా పరిశీలించాలి. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల గురించి తెలుసుకోవాలి. క్రీడలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో జరిగిన క్రీడాంశాలను చదవాలి. ఇటీవల జరిగిన ఆసియాకప్ క్రికెట్, అండర్-19 ప్రపంచకప్, టీ-20 క్రికెట్ ప్రపంచకప్, ఐపీఎల్, దక్షిణాసియా క్రీడలు, కోపా అమెరికా ఫుట్‌బాల్, టెన్నిస్ ట్రోఫీలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. క్రీడాకారులు వారి దేశాలు, ట్రోఫీలు, క్రీడాపదజాలం తెలుసుకోవాలి. వార్తల్లోని వ్యక్తులు - అవార్డులు ఇటీవల చేపట్టిన నియామకాలు, ఎన్నిక, ఎంపిక, మరణాలు ముఖ్యమైనవి. జాతీయ అవార్డుల్లో.. పద్మ అవార్డులు, చలనచిత్ర పురస్కారాలు, క్రీడా పురస్కారాలు, సాహిత్య అవార్డులు; అంతర్జాతీయ అవార్డుల్లో.. నోబెల్ బహుమతులు, రామన్ మెగసెసే పురస్కారాలు, ఆస్కార్ అవార్డులు, ప్రపంచ ఆహార బహుమతి, బుక్ ప్రైజ్ తదితరాల నుంచి ప్రశ్నలు వస్తాయి. స్టాక్ జీకే కోసం.. భారతదేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వాటి రాజధానులు, జాతీయ చిహ్నాలు, కేలండర్, జనాభా, భాషలు, రవాణా వ్యవస్థ, విమానాశ్రయాలు, సమాచార వ్యవస్థ, దేశ రక్షణ రంగం, క్షిపణి వ్యవస్థ, అంతరిక్ష పరిశోధనా సంస్థ, భారత అంతరిక్ష విజయాలు, అణుశక్తి రంగం, అణు విద్యుత్ కేంద్రాలు, పరిశోధనా కేంద్రాలు అవి ఉన్న ప్రదేశాలు, నదీ వ్యవస్థ, ప్రాజెక్టులు, జాతీయ పార్కులు, శాంక్చ్యురీలు, బయోస్పియర్ రిజర్వలు, వ్యవసాయ విప్లవాలు, ప్రముఖ ఆవిష్కరణలు, అధ్యయన శాస్త్రాలు, ప్రముఖ దినోత్సవాలు, ప్రముఖ వ్యక్తుల బిరుదులు, నినాదాలు, విటమిన్లు, వ్యాధులు, సౌరకుటుంబం, నదీతీరాన వెలసిన పట్టణాలు, ఐక్యరాజ్యసమితి, దాని అనుబంధ సంస్థలు, ఐరాస ప్రకటించిన సంవత్సరాలు, దశాబ్దాలు, అంతర్జాతీయ సంస్థలు, వాటి ప్రధాన కార్యాలయాలు, అధిపతులు, దేశాలు-రాజధానులు-కరెన్సీలు, పార్లమెంట్లు వంటి వాటిని చదవాల్సి ఉంటుంది. - ఎన్. విజయేందర్‌రెడ్డి కరెంట్ అఫైర్స నిపుణులు,హైదరాబాద్