భారత నౌకాదళ ప్రధానాధికారి? | Gedains competitive Current affairs | Sakshi
Sakshi News home page

భారత నౌకాదళ ప్రధానాధికారి?

Published Fri, Nov 4 2016 11:25 PM | Last Updated on Mon, Sep 4 2017 7:11 PM

భారత నౌకాదళ ప్రధానాధికారి?

భారత నౌకాదళ ప్రధానాధికారి?

ఎవరి జయంతిని జాతీయ ఐక్యతా దినంగా జరుపుకుంటారు?
 - సర్దార్ వల్లభాయ్ పటేల్ (అక్టోబర్ 31)
 ఇటీవల ఏ కంపెనీ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించారు?     - టాటా గ్రూప్
 వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్‌ఓపీ) కమిటీకి చైర్మన్?    - పట్నా హైకోర్‌‌ట మాజీ చీఫ్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి
 ఆసియాలోకెల్లా అతిపెద్ద ఆప్టికల్ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేసిన ఆర్యభట్ట రీసెర్‌‌చ ఇన్‌స్టిట్యూట్ ఫర్ అబ్జర్వేషనల్ సెన్సైస్ (అఖఐఉ) ఎక్కడ ఉంది?
 - నైనిటాల్, ఉత్తరాఖండ్
 నాలుగో అణు భద్రతా సదస్సు 2016, మార్చి 31, ఏప్రిల్ 1 తేదీల్లో ఎక్కడ జరిగింది?    - వాషింగ్టన్ డి.సి, అమెరికా
 బరాక్ ఒబామా 2016, మార్చిలో క్యూబాలో పర్యటించారు. ఒబామా కంటే ముందు 1928లో క్యూబాలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడెవరు?     - కాల్విన్ కూలిడ్‌‌జ
 ప్రపంచంలోనే అత్యంత ఆనందమయ దేశంగా వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన దేశం?
 - డెన్మార్‌‌క. భారత్ 118వ స్థానంలో నిలిచింది.
 జమ్మూకశ్మీర్ రాష్ర్ట తొలి మహిళా ముఖ్యమంత్రి?  - మెహబూబా ముఫ్తీ.  పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు
 2016, మేలో ఏబెల్ ప్రైజ్ గెలుచుకున్న బ్రిటిష్ గణితవేత్త?     - సర్ ఆండ్రూ వైల్స్
 2016-17 సంవత్సరానికి భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నూతన అధ్యక్షుడు?     
 - నౌషద్ ఫోర్‌‌బ్స
 2016-17కి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్‌కామ్) చైర్మన్ ?
 - సి.పి.గుర్నానీ (టెక్ మహీంద్రా సీఈఓ)
 2016 సంవత్సరానికి ఫెమినా మిస్ ఇండియాగా ఎవరు ఎంపికయ్యారు?
 - ప్రియదర్శినీ ఛటర్జీ
 ప్రపంచంలోని 50 మంది అత్యుత్తమ నేతలతో రూపొందించిన ఫార్చ్యూన్  జాబితాలో మనదేశం నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక వ్యక్తి?
 - అరవింద్ కేజ్రీవాల్ (42వ స్థానం దక్కింది). అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో నిలిచారు.
 2015 సంవత్సరానికి సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు?
 - పద్మ సచ్‌దేవ్. ఈమె డోగ్రి భాషలో రాసిన ‘చిట్-చెటె’ పుస్తకానికి ఈ అవార్డు దక్కింది.
 ప్రపంచంలోనే తొలి తెల్ల పులుల సఫారీని 2016, ఏప్రిల్‌లో ఎక్కడ ప్రారంభించారు?
 - మధ్యప్రదేశ్‌లోని ముకుంద్‌పూర్ జంతు ప్రదర్శనశాలలో
 2016, ఏప్రిల్‌లో మారిటైమ్ ఇండియా సమ్మిట్‌ను ఎక్కడ నిర్వహించారు?
 - ముంబై. ఈ సదస్సుకు దక్షిణ కొరియా భాగస్వామ్య దేశంగా వ్యవహరించింది.
 పనాఘర్ ఎయిర్ బేస్ పేరును అర్జున్ సింగ్ ఎయిర్‌ఫోర్‌‌స స్టేషన్‌గా మార్చారు. ఇది ఏ రాష్ర్టంలో ఉంది?     - పశ్చిమ బెంగాల్
 ‘గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్’ కార్యక్రమాన్ని 2016, ఏప్రిల్ 14న భారత ప్రధాని నరేంద్రమోదీ ఎక్కడ ప్రారంభించారు? - మహు (మధ్యప్రదేశ్). ఇది బీఆర్ అంబేద్కర్ జన్మస్థలం.
 2016, ఏప్రిల్‌లో భారత్‌లో పర్యటించిన అబ్దుల్లా యమీన్ ఏ దేశాధ్యక్షుడు?
 - మాల్దీవులు
 ఐదు దశాబ్దాల తర్వాత తొలిసారి మయన్మార్ దేశానికి పౌర అధ్యక్షుడిగా  ఎవరు పదవీ బాధ్యతలు చేపట్టారు?
 - తిన్ క్వా
 మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమకారిణి ఆంగ్‌సాన్ సూచీ కోసం సృష్టించిన కొత్త పోస్టు?
 - స్టేట్ కౌన్సిలర్
 2016, ఏప్రిల్ నుంచి ఏ రాష్ర్టంలో     సంపూర్ణ మద్య నిషేధం అమల్లోకి వచ్చింది?     - బిహార్
 ఆఫ్రికా దేశం చాద్‌లో అమెరికా రాయబారిగా బరాక్ ఒబామా ఎవరిని నామినేట్ చేశారు? - గీతా పాసి. ఈమె భారత సంతతికి చెందిన మహిళ
 భారత నౌకాదళ ప్రధానాధికారి?
 - అడ్మిరల్ సునీల్ లాంబా
 2016 సంవత్సరానికి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఎవరికి లభించింది?
 - ‘ద వెజిటేరియన్’ అనే నవలకు దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు దక్కింది.
 ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ను 2016, మే 1న భారత ప్రధాని నరేంద్రమోదీ  ఎక్కడ ప్రారంభించారు?
 - బలియా, ఉత్తరప్రదేశ్. రానున్న మూడు ఆర్థిక సంవత్సరాల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 5 కోట్ల మంది మహిళలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడమే ఈ పథకం లక్ష్యం.
 రియో ఒలింపిక్స్‌కు గుడ్‌విల్ అంబాసిడర్‌‌స?
 - సల్మాన్‌ఖాన్, అభినవ్ బింద్రా, సచిన్ టెండూల్కర్, ఏ.ఆర్.రెహ్మాన్
 2016, మే7న సాదిక్‌ఖాన్ ఏ నగర మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు?     
   - లండన్
 2016, మేలో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)ను తొలిసారి గెలుచుకున్న ఫుట్‌బాల్ జట్టు?     - లీసెస్టర్ సిటీ
 ‘మంచి దేశం - 2015’ సూచీలో భారత్ స్థానం? - 70. ఈ సూచీని 163 దేశాలతో రూపొందించారు. స్వీడన్ అగ్రస్థానంలో నిలిచింది.
 వంద మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ  గెలుచుకున్న తొలి టెన్నిస్ క్రీడాకారుడు?
 - నొవాక్ జొకోవిచ్ (సెర్బియా)
 2016 ఏప్రిల్, మే నెలల్లో ఏ నగరంలో కుంభమేళాను నిర్వహించారు?
 - ఉజ్జయిని (మధ్యప్రదేశ్)
 2015-సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో దేశంలో ప్రథమస్థానంలో నిలిచిన మహిళ?
 - టీనా దాబి
 హరీష్ రావత్ ఏ రాష్ర్ట ముఖ్యమంత్రి?
 - ఉత్తరాఖండ్
 దేశంలోని అన్ని అత్యవసర సేవల వినియోగానికి సంబంధించి అందుబాటులోకి రానున్న ఏకైక ఎమర్జెన్సీ నంబర్?     - 112
 ఫిఫా పరిపాలనా కమిటీ డిప్యూటీ చైర్మన్‌గా నియమితులైన భారతీయ న్యాయమూర్తి ఎవరు?     - జస్టిస్ ముకుల్ ముద్గల్
 ఇటీవల భారత్‌లో పర్యటించిన థాయ్‌లాండ్ ప్రధాని ?     - ప్రయాత్ చాన్ ఓచా
 ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ (ఐఏఏఫ్) హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయుడు?
 - యు.ఆర్.రావు (ఇస్రో మాజీ చైర్మన్)
 కేరళ ప్రస్తుత ముఖ్యమంత్రి ?
  - పినరయి విజయన్
 భారత్‌లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ పురుషుల టైటిల్‌ను గెలుచుకున్న జట్టు?
 - వెస్టిండీస్. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్‌‌సలో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను వెస్టిండీస్ ఓడించింది
 ఐసీసీ టీ20 మహిళల ప్రపంచకప్‌ను ఏ జట్టు కైవసం చేసుకుంది?
 - వెస్టిండీస్. 2016, ఏప్రిల్ 3న కోల్‌కతాలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాపై గెలుపొందింది.
 సెయింట్ లూసియానాలోని బ్యుసేజర్ క్రికెట్ స్టేడియానికి ఏ వెస్టిండీస్ క్రికెటర్ పేరు పెట్టారు?     - డారెన్ సామీ
 బీసీసీఐ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎవరు నియమితులయ్యారు?
 - రాహుల్ జోహ్రి
  ఏప్రిల్‌లో జరిగిన సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్-2016ను ఏ దేశం గెలుచుకుంది?
 - ఆస్ట్రేలియా. ఫైనల్లో భారత్‌ను ఓడించింది
 ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఏ రాష్ట్రానికి చెందిన అమ్మాయి?     - త్రిపుర
 భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జీవిత చరిత్ర పేరు?     - ఏస్ ఎగెనెస్ట్ ఆడ్‌‌స
 అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలి స్వతంత్ర చైర్మన్?     - శశాంక్ మనోహర్
 2016, జూన్‌లో నిర్వహించిన కోపా అమెరికా సెంటెనరీ ఫుట్‌బాల్ టోర్నమెంట్ విజేత?
 - చిలీ. ఫైనల్లో అర్జెంటీనాను ఓడించింది. ఈ టోర్నమెంట్ అమెరికాలో జరిగింది.
 2016, ఆగస్టులో జరిగిన రియో ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత పతాకధారి ?
 - అభినవ్ బింద్రా
 36వ పురుషుల చాంపియన్‌‌స ట్రోఫీ హాకీని 2016, జూన్‌లో ఎక్కడ నిర్వహించారు?  
  - లండన్
 ఫార్ములావన్ విజేతగా నిలిచిన అతి పిన్న వయస్కుడు? - మ్యాక్స్ వెర్‌స్టాపెన్ (నెదర్లాండ్‌‌స)
 ఉబెర్‌కప్ మహిళల బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను ఏ దేశం గెలుచుకుంది?
 - చైనా
 నీతి ఆయోగ్‌లోని సామాజిక విభాగానికి సలహాదారుగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు?     - రతన్ వతల్
 ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్?     
 - అనిల్ కుంబ్లే
 కేంద్ర ఆర్థిక శాఖ ప్రస్తుత కార్యదర్శి ?
 - అశోక్ లవాసా
 కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ ?     - కిరణ్ బేడి
 
 యూరోపియన్ యూనియన్‌లో కొనసాగడంపై ఇటీవల ఏ దేశం రిఫరెండం నిర్వహించింది?     - బ్రిటన్
 2016-సియట్ క్రికెట్ అవార్డుల్లో ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు’ను ఏ మాజీ క్రికెటర్‌కు అందజేశారు?
      - దిలీప్ వెంగ్‌సర్కార్
 
 N. Vijayender Reddy
 General Awareness
 Faculty, Hyderabad

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement