Gedains competitive
-
భారత నౌకాదళ ప్రధానాధికారి?
ఎవరి జయంతిని జాతీయ ఐక్యతా దినంగా జరుపుకుంటారు? - సర్దార్ వల్లభాయ్ పటేల్ (అక్టోబర్ 31) ఇటీవల ఏ కంపెనీ చైర్మన్ పదవి నుంచి సైరస్ మిస్త్రీని తొలగించారు? - టాటా గ్రూప్ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) కమిటీకి చైర్మన్? - పట్నా హైకోర్ట మాజీ చీఫ్ జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి ఆసియాలోకెల్లా అతిపెద్ద ఆప్టికల్ టెలిస్కోప్‌ను ఏర్పాటు చేసిన ఆర్యభట్ట రీసెర్చ ఇన్స్టిట్యూట్ ఫర్ అబ్జర్వేషనల్ సెన్సైస్ (అఖఐఉ) ఎక్కడ ఉంది? - నైనిటాల్, ఉత్తరాఖండ్ నాలుగో అణు భద్రతా సదస్సు 2016, మార్చి 31, ఏప్రిల్ 1 తేదీల్లో ఎక్కడ జరిగింది? - వాషింగ్టన్ డి.సి, అమెరికా బరాక్ ఒబామా 2016, మార్చిలో క్యూబాలో పర్యటించారు. ఒబామా కంటే ముందు 1928లో క్యూబాలో పర్యటించిన అమెరికా అధ్యక్షుడెవరు? - కాల్విన్ కూలిడ్జ ప్రపంచంలోనే అత్యంత ఆనందమయ దేశంగా వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన దేశం? - డెన్మార్క. భారత్ 118వ స్థానంలో నిలిచింది. జమ్మూకశ్మీర్ రాష్ర్ట తొలి మహిళా ముఖ్యమంత్రి? - మెహబూబా ముఫ్తీ. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలు 2016, మేలో ఏబెల్ ప్రైజ్ గెలుచుకున్న బ్రిటిష్ గణితవేత్త? - సర్ ఆండ్రూ వైల్స్ 2016-17 సంవత్సరానికి భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నూతన అధ్యక్షుడు? - నౌషద్ ఫోర్బ్స 2016-17కి నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (నాస్కామ్) చైర్మన్ ? - సి.పి.గుర్నానీ (టెక్ మహీంద్రా సీఈఓ) 2016 సంవత్సరానికి ఫెమినా మిస్ ఇండియాగా ఎవరు ఎంపికయ్యారు? - ప్రియదర్శినీ ఛటర్జీ ప్రపంచంలోని 50 మంది అత్యుత్తమ నేతలతో రూపొందించిన ఫార్చ్యూన్ జాబితాలో మనదేశం నుంచి స్థానం దక్కించుకున్న ఏకైక వ్యక్తి? - అరవింద్ కేజ్రీవాల్ (42వ స్థానం దక్కింది). అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ అగ్రస్థానంలో నిలిచారు. 2015 సంవత్సరానికి సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు? - పద్మ సచ్దేవ్. ఈమె డోగ్రి భాషలో రాసిన ‘చిట్-చెటె’ పుస్తకానికి ఈ అవార్డు దక్కింది. ప్రపంచంలోనే తొలి తెల్ల పులుల సఫారీని 2016, ఏప్రిల్‌లో ఎక్కడ ప్రారంభించారు? - మధ్యప్రదేశ్‌లోని ముకుంద్‌పూర్ జంతు ప్రదర్శనశాలలో 2016, ఏప్రిల్‌లో మారిటైమ్ ఇండియా సమ్మిట్‌ను ఎక్కడ నిర్వహించారు? - ముంబై. ఈ సదస్సుకు దక్షిణ కొరియా భాగస్వామ్య దేశంగా వ్యవహరించింది. పనాఘర్ ఎయిర్ బేస్ పేరును అర్జున్ సింగ్ ఎయిర్ఫోర్స స్టేషన్‌గా మార్చారు. ఇది ఏ రాష్ర్టంలో ఉంది? - పశ్చిమ బెంగాల్ ‘గ్రామ్ ఉదయ్ సే భారత్ ఉదయ్ అభియాన్’ కార్యక్రమాన్ని 2016, ఏప్రిల్ 14న భారత ప్రధాని నరేంద్రమోదీ ఎక్కడ ప్రారంభించారు? - మహు (మధ్యప్రదేశ్). ఇది బీఆర్ అంబేద్కర్ జన్మస్థలం. 2016, ఏప్రిల్‌లో భారత్‌లో పర్యటించిన అబ్దుల్లా యమీన్ ఏ దేశాధ్యక్షుడు? - మాల్దీవులు ఐదు దశాబ్దాల తర్వాత తొలిసారి మయన్మార్ దేశానికి పౌర అధ్యక్షుడిగా ఎవరు పదవీ బాధ్యతలు చేపట్టారు? - తిన్ క్వా మయన్మార్ ప్రజాస్వామ్య ఉద్యమకారిణి ఆంగ్‌సాన్ సూచీ కోసం సృష్టించిన కొత్త పోస్టు? - స్టేట్ కౌన్సిలర్ 2016, ఏప్రిల్ నుంచి ఏ రాష్ర్టంలో సంపూర్ణ మద్య నిషేధం అమల్లోకి వచ్చింది? - బిహార్ ఆఫ్రికా దేశం చాద్‌లో అమెరికా రాయబారిగా బరాక్ ఒబామా ఎవరిని నామినేట్ చేశారు? - గీతా పాసి. ఈమె భారత సంతతికి చెందిన మహిళ భారత నౌకాదళ ప్రధానాధికారి? - అడ్మిరల్ సునీల్ లాంబా 2016 సంవత్సరానికి మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఎవరికి లభించింది? - ‘ద వెజిటేరియన్’ అనే నవలకు దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్‌కు దక్కింది. ‘ప్రధానమంత్రి ఉజ్వల యోజన’ను 2016, మే 1న భారత ప్రధాని నరేంద్రమోదీ ఎక్కడ ప్రారంభించారు? - బలియా, ఉత్తరప్రదేశ్. రానున్న మూడు ఆర్థిక సంవత్సరాల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 5 కోట్ల మంది మహిళలకు ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడమే ఈ పథకం లక్ష్యం. రియో ఒలింపిక్స్‌కు గుడ్‌విల్ అంబాసిడర్స? - సల్మాన్‌ఖాన్, అభినవ్ బింద్రా, సచిన్ టెండూల్కర్, ఏ.ఆర్.రెహ్మాన్ 2016, మే7న సాదిక్‌ఖాన్ ఏ నగర మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు? - లండన్ 2016, మేలో ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్)ను తొలిసారి గెలుచుకున్న ఫుట్‌బాల్ జట్టు? - లీసెస్టర్ సిటీ ‘మంచి దేశం - 2015’ సూచీలో భారత్ స్థానం? - 70. ఈ సూచీని 163 దేశాలతో రూపొందించారు. స్వీడన్ అగ్రస్థానంలో నిలిచింది. వంద మిలియన్ డాలర్ల ప్రైజ్‌మనీ గెలుచుకున్న తొలి టెన్నిస్ క్రీడాకారుడు? - నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) 2016 ఏప్రిల్, మే నెలల్లో ఏ నగరంలో కుంభమేళాను నిర్వహించారు? - ఉజ్జయిని (మధ్యప్రదేశ్) 2015-సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో దేశంలో ప్రథమస్థానంలో నిలిచిన మహిళ? - టీనా దాబి హరీష్ రావత్ ఏ రాష్ర్ట ముఖ్యమంత్రి? - ఉత్తరాఖండ్ దేశంలోని అన్ని అత్యవసర సేవల వినియోగానికి సంబంధించి అందుబాటులోకి రానున్న ఏకైక ఎమర్జెన్సీ నంబర్? - 112 ఫిఫా పరిపాలనా కమిటీ డిప్యూటీ చైర్మన్‌గా నియమితులైన భారతీయ న్యాయమూర్తి ఎవరు? - జస్టిస్ ముకుల్ ముద్గల్ ఇటీవల భారత్‌లో పర్యటించిన థాయ్‌లాండ్ ప్రధాని ? - ప్రయాత్ చాన్ ఓచా ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ (ఐఏఏఫ్) హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డుకు ఎంపికైన తొలి భారతీయుడు? - యు.ఆర్.రావు (ఇస్రో మాజీ చైర్మన్) కేరళ ప్రస్తుత ముఖ్యమంత్రి ? - పినరయి విజయన్ భారత్‌లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ పురుషుల టైటిల్‌ను గెలుచుకున్న జట్టు? - వెస్టిండీస్. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్సలో జరిగిన ఫైనల్లో ఇంగ్లండ్‌ను వెస్టిండీస్ ఓడించింది ఐసీసీ టీ20 మహిళల ప్రపంచకప్‌ను ఏ జట్టు కైవసం చేసుకుంది? - వెస్టిండీస్. 2016, ఏప్రిల్ 3న కోల్‌కతాలో జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియాపై గెలుపొందింది. సెయింట్ లూసియానాలోని బ్యుసేజర్ క్రికెట్ స్టేడియానికి ఏ వెస్టిండీస్ క్రికెటర్ పేరు పెట్టారు? - డారెన్ సామీ బీసీసీఐ తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎవరు నియమితులయ్యారు? - రాహుల్ జోహ్రి ఏప్రిల్‌లో జరిగిన సుల్తాన్ అజ్లాన్ షా హాకీ కప్-2016ను ఏ దేశం గెలుచుకుంది? - ఆస్ట్రేలియా. ఫైనల్లో భారత్‌ను ఓడించింది ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ ఏ రాష్ట్రానికి చెందిన అమ్మాయి? - త్రిపుర భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా జీవిత చరిత్ర పేరు? - ఏస్ ఎగెనెస్ట్ ఆడ్‌స అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలి స్వతంత్ర చైర్మన్? - శశాంక్ మనోహర్ 2016, జూన్‌లో నిర్వహించిన కోపా అమెరికా సెంటెనరీ ఫుట్‌బాల్ టోర్నమెంట్ విజేత? - చిలీ. ఫైనల్లో అర్జెంటీనాను ఓడించింది. ఈ టోర్నమెంట్ అమెరికాలో జరిగింది. 2016, ఆగస్టులో జరిగిన రియో ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత పతాకధారి ? - అభినవ్ బింద్రా 36వ పురుషుల చాంపియన్స ట్రోఫీ హాకీని 2016, జూన్‌లో ఎక్కడ నిర్వహించారు? - లండన్ ఫార్ములావన్ విజేతగా నిలిచిన అతి పిన్న వయస్కుడు? - మ్యాక్స్ వెర్స్టాపెన్ (నెదర్లాండ్స) ఉబెర్‌కప్ మహిళల బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను ఏ దేశం గెలుచుకుంది? - చైనా నీతి ఆయోగ్‌లోని సామాజిక విభాగానికి సలహాదారుగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? - రతన్ వతల్ ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్? - అనిల్ కుంబ్లే కేంద్ర ఆర్థిక శాఖ ప్రస్తుత కార్యదర్శి ? - అశోక్ లవాసా కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరికి ప్రస్తుత లెఫ్టినెంట్ గవర్నర్ ? - కిరణ్ బేడి యూరోపియన్ యూనియన్‌లో కొనసాగడంపై ఇటీవల ఏ దేశం రిఫరెండం నిర్వహించింది? - బ్రిటన్ 2016-సియట్ క్రికెట్ అవార్డుల్లో ‘లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు’ను ఏ మాజీ క్రికెటర్‌కు అందజేశారు? - దిలీప్ వెంగ్‌సర్కార్ N. Vijayender Reddy General Awareness Faculty, Hyderabad -
భారత రాజ్యాంగం లౌకిక స్వభావం-పరిశీలన
కాంపిటీటివ్ గెడైన్స్ పాలిటీ (గ్రూప్ 1, 2) భారతదేశం బహు మతాలకు, భిన్న సంస్కృతులకు, భాషలకు నిలయం. భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉంటూ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచే స్థాయిలో ఉండటం గర్వించాల్సిన విషయం. మత సామరస్యం కోసం లౌకిక రాజ్యంగా ప్రకటించడం జరిగింది. అయినా కొన్ని సందర్భాల్లో మత విశ్వాసాలకు, ఆధునిక అభివృద్ధికి, ప్రజల మనోభావాలకు మధ్య ఘర్షణ ఏర్పడుతోంది. వివిధ సందర్భాల్లో స్థానికంగా మతం రాజకీయ సమీకరణకు ప్రాతిపదిక అవుతూ వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాజ్యాంగ లౌకిక మూలాలు, ప్రకరణలు, చట్టాలను పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆధునిక ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చాలా వరకు లౌకిక రాజ్యాలే. లౌకిక రాజ్యమంటే ప్రజలు, ప్రభుత్వానికి మధ్య సంబంధాలు, పరిపాలన.. మత విశ్వాసాల ప్రాతిపదికన కాకుండా రాజ్యం, చట్టపరంగా నిర్ణయించి కొనసాగించడం. లౌకికం అంటే భౌతిక ప్రపంచం గురించి ఆలోచించడం. మనకు తెలిసిన ప్రాపంచిక విషయాలను మన అనుభవం, పరిశీలనతో వ్యాఖ్యానించడం లేదా వివరించడం. మతం మనకు తెలియని మరో లోకాన్ని గురించి ఊహించి చెప్పే ప్రయత్నం చేస్తుంది. లౌకికవాదం అనే పదాన్ని 19వ శతాబ్దానికి చెందిన సామాజిక శాస్త్రవేత్త జార్జి జాకబ్ హోలియోక్ మొదటి సారిగా వాడుకలోకి తెచ్చారు. ఈ పదం లాటిన్ భాషలోని Seculum (సెక్యులమ్) అనే పదం నుంచి ఉద్భవించింది. తరం (జనరేషన్) అని దీని అర్థం. ఆ తర్వాత వాడుకలో ప్రభుత్వాన్ని, పరిపాలనను.. మతం ముఖ్యంగా చర్చి నుంచి వేరుచేయడం.. పాలన చట్టం, రాజ్యాంగం ప్రకారం కొనసాగించడం అనే భావనలు లౌకికవాదంగా ప్రాచుర్యం పొందాయి. లౌకిక భావన, వివిధ పార్శ్వాలు లౌకిక భావనకు రాజకీయ, సామాజిక పార్శ్వాలున్నాయి. రాజకీయ కోణంలో పరిశీలించినప్పుడు లౌకికవాదం అనేది చారిత్రక నేపథ్యంలో రాజ్యానికి-చర్చికి జరిగిన సంఘర్షణ. పూర్వకాలంలో ప్రజల అన్ని విషయాలను మతం, మతాచార్యులే నిర్దేశించేవారు. రాజు కూడా వీరు చెప్పినట్లే న డుచుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి లౌకిక భావన అనేది రాజ్యాన్ని మత నియంత్రణ నుంచి వేరు చేసే ప్రయత్నంలో జరిగిన సంఘర్షణగా చెప్పొచ్చు. సామాజిక కోణంలో చూస్తే లౌకిక భావన అనేది ప్రజలు తమ జీవన విధానాన్ని స్వతంత్రంగా మలచుకొనే దశలో మితిమీరిన మత జోక్యాన్ని, ప్రభావాన్ని నిరసించే సామాజిక తిరుగుబాటుగా వర్ణించొచ్చు. భారతీయ భావన భిన్నం పైన ఉదహరించిన రెండు అంశాలు పాశ్చాత్య సమాజానికి సంబంధించిన పరిణామాలు. అయితే భారతదేశంలో అలా లేదు. భిన్న మతాలు, విశ్వాసాలు, జాతులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వానికి రెండు ప్రధాన ప్రాథమ్యాలుంటాయి. మొదటిది మతాన్ని రాజకీయాల నుంచి వేరు చేయడం, రెండోది భిన్న మతాల మధ్య సామరస్యాన్ని సాధించడానికి అన్ని మతాలకు సమాన గౌరవాన్ని కల్పించడం. ఈ నే పథ్యంలోనే భారత రాజ్యాంగ నిర్మాతలు లౌకికతత్వాన్ని రాజ్యాంగంలో పొందుపరిచారు. ప్రఖ్యాత భారతీయ తత్వవేత్త, భారతదేశ రెండో రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ భారతీయ లౌకిక భావనను ఈ విధంగా వర్ణించారు. * ‘లౌకికవాదం అంటే మతరహిత సమాజం కాదు. మత వ్యతిరేకం కూడా కాదు. ప్రాపంచిక సుఖాలు అంతకంటే కాదు. విశ్వవ్యాప్తమైన ఆధ్యాత్మిక విలువలను విభిన్న మార్గాల్లో అన్వేషించడమే’. లక్షణాలు * ప్రభుత్వానికి అధికార మతం ఉండరాదు. * అన్ని మతాలకు సమాన గుర్తింపు, గౌరవం, సమాన అవకాశాలు. మత వివక్షకు తావు లేదు. * మత విశ్వాసాలను హేతుబద్ధతతో పాటించడం. మూఢ విశ్వాసాలను త్యజించడం. * న్యాయమైన, మానవీయమైన జీవన పరిస్థితులను కల్పించడం. * మతం పూర్తిగా వ్యక్తిగతం. ప్రజా శ్రేయస్సు దృష్ట్యా మాత్రమే ప్రభుత్వ జోక్యం ఉండాలి. * రాజ్యాంగ సవరణ-లౌకిక భావన ద్విగుణీకృతం లౌకికతత్వం (సెక్యులర్) అనే పదాన్ని మౌలిక రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో పొందుపరిచారు. ఈ పదం చేరికతో రాజ్యాంగాన్ని లౌకికతత్వం మరింత స్పష్టీకరించడంతోపాటు ద్విగుణీకృతం చేసింది. అంతేకాకుండా మౌలిక నిర్మాణంలో అంతర్భాగంగా పరిగణనలో ఉంది. * లౌకికతత్వం- రాజ్యాంగ ప్రకరణలు రాజ్యాంగం వివిధ ప్రకరణల్లో లౌకికతత్వాన్ని స్పష్టీకరించింది. దీనికి అనుగుణంగా పార్లమెంటు.. చట్టాలను కూడా రూపొందించింది. ప్రవేశికలో లౌకికతత్వం అనే పదం చేరిక, ప్రాథమిక హక్కులలో మత స్వేచ్ఛను గుర్తించడం, నిర్దేశిక నియమాలలో ఉమ్మడి పౌర నియమాలను ప్రస్తావించడం, ప్రాథమిక విధుల్లో పరమత సహనాన్ని ప్రతి పౌరుడు కలిగి ఉండాలని కోరడం, లౌకికతత్వానికి మచ్చుతునకలుగా చెప్పొచ్చు. వాటిని ఈ కింది విధంగా పరిశీలించొచ్చు. ప్రవేశిక - లౌకిక భావన భారత రాజ్యాంగ ఆత్మ, హృదయంగా పరిగణించే ప్రవేశికలో లౌకికం అని చేర్చడం, ప్రతి వ్యక్తికి ఆరాధన, విశ్వాసం, నమ్మకం అనే అంశాలలో స్వేచ్ఛను గుర్తించడం లౌకికతత్వానికి ప్రతీకగా పేర్కొనొచ్చు. ప్రాథమిక హక్కులు- లౌకికతత్వం రాజ్యాంగం మూడో భాగంలో మత స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా పేర్కొనడం విశేషంగా పరిగణించాలి. ముఖ్యంగా.. * ప్రకరణ-14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. చట్టం మూలంగా అందరికీ సమాన రక్షణ. * ప్రకరణ-15 ప్రకారం మత ప్రాతిపదికపై ప్రజల పట్ల వివక్షను నిషేధించడం. * ప్రకరణ-16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో కొన్ని మినహాయింపులు తప్ప అందరికీ సమాన అవకాశాలు ఇవ్వడం. * ప్రకరణ-25 ప్రకారం ప్రతి వ్యక్తి తన ఆత్మ ప్రబోధం మేరకు తనకు నచ్చిన మతాన్ని అవలంబించడం, ఆచరించడం, ప్రచారం చేసుకోవడం, మత మార్పును చేసుకోవడానికి స్వేచ్ఛను కల్పించడం. * ప్రకరణ-26 ప్రకారం మత సంస్థలను స్థాపించుకుని నిర్వహించుకునే హక్కును గుర్తించడం. * ప్రకరణ-27 ప్రకారం మతం ఆధారంగా పన్నులు విధించకుండా నిషేధించడం. * ప్రకరణ-28 ప్రకారం ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు విద్యా సంస్థల్లో ప్రత్యేక మత బోధన నిషేధించడం. * మొదలైన హక్కులు, స్వేచ్ఛలు లౌకి క తత్వానికి ఆచరణాత్మక అంశాలు. * నిర్దేశిక నియమాల్లో ప్రకరణ 44 ప్రకారం ఉమ్మడి పౌర నియమావళిని అమలు చేయాలని ప్రభుత్వానికి మార్గదర్శకత్వం చేయడం ద్వారా దేశ ఐక్యత, సమగ్రతలకు మత విశ్వాసాలు సమస్యగా పరిణమించకుండా నియంత్రించొచ్చు. రాజ్యాంగం ప్రకారం ఏ ప్రజా ప్రతినిధికి పోటీ చేయడానికైనా మతం అడ్డంకి కాదు. ఉదా: * రాష్ట్రపతి పదవికి పోటీచేయడం (ప్రకరణ-58) * ఉపరాష్ట్రపతి పదవికి పోటీచేయడం (ప్రకరణ-66) * గవర్నర్ నియామకం (ప్రకరణ-155) * పార్లమెంట్, శాసనసభలకు పోటీ చేయడం (ప్రకరణ 80, 173) మొదలైన అంశాలు. * అదేవిధంగా 18 ఏళ్లు నిండిన ప్రతి పౌరుడికి ఓటు హక్కును కల్పించడం (ప్రకరణ-325) కూడా లౌకికవాదానికి ఉదాహరణలుగా చెప్పొచ్చు. లౌకికతత్వం, వివాదాలు, సుప్రీంకోర్టు తీర్పులు రాజ్యాంగంలో లౌకిక రాజ్యం అనే పదం ప్రత్యక్షంగా పేర్కొననప్పటికీ భారతదేశం లౌకిక రాజ్యమే అని ప్రాథమిక హక్కుల్లోని ప్రకరణలు 25 నుంచి 28 వరకు స్పష్టంగా తెలియజేస్తున్నాయని సుప్రీంకోర్టు.. జేవియర్ కాలేజ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసు (1974)లో తీర్పు చెప్పింది. అదేవిధంగా 1994లో ఎస్ఆర్ బొమ్మాయ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో లౌకికతత్వం రాజ్యాంగంలోని మౌలిక సారాంశంలో అంతర్భాగమని, లౌకికతత్వాన్ని ఉల్లంఘించే రాష్ట్రాలపై ప్రకరణ 356 ప్రకారం చర్యలు చేపట్టవచ్చని స్పష్టం చేసింది. లౌకికతత్వాన్ని సకారాత్మకంగా, నిర్మాణాత్మకంగా చూడాలని, పాఠశాలలో వివిధ మత విలువలను విద్యార్థులకు బోధించడం ద్వారా ఇతర మతాల పట్ల గౌరవాన్ని కలిగి ఉండటానికి, పరమత సహనానికి తోడ్పడుతుందని అది లౌకికతత్వానికి విఘాతం కాదని 2003లో అరుణారాయ్ వర్సెస్ ఇండియన్ యూనియన్ కేసులో సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా కొన్ని మార్గదర్శక సూత్రాలను ప్రకటించింది. * లౌకికతత్వాన్ని పెంపొందించే అంశాలు * శాస్త్రీయ విద్యను, తార్కిక ఆలోచనను ప్రోత్సహించాలి. * రాజకీయాల్లో మత సంస్థలు పాల్గొనరాదు. * మత విశ్వాసాలతో కూడిన మత ప్రదర్శనలను నిషేధించాలి. * అధికార హోదాలో ఎవరూ మత ప్రదేశాలను సందర్శించరాదు. * వ్యక్తి ప్రజా జీవితంలో తాము నిర్వహించే పాత్రలో తన వ్యక్తిగత మత విశ్వాసాలను చొప్పించరాదు. ఏది ఏమైనా మొత్తానికి మత స్వేచ్ఛ, నమ్మకాలు వ్యక్తిగత ఔన్నత్యానికి, ఆధ్యాత్మిక చింతనకు తోడ్పడినంతవరకు ఫర్వాలేదు కానీ మత స్వేచ్ఛల పేరుతో మత సామరస్యానికి చేటు చేసేవారిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందే. లేదంటే ప్రతి చిన్న విషయం అలజడికి కారణమై దేశ ఐక్యత, సమగ్రతకు సవాలుగా పరిణమించవచ్చు. కారల్‌మార్క్స్ అన్నట్లు మతం మత్తు మందుగా మారుతుంది. మతోన్మాదానికి దారితీస్తుంది. ఉన్మాదంగా చెలరేగుతుంది. మానవ సంస్కృతిని మింగేస్తుంది. దీనికి చరిత్రలో చాలా ఆధారాలున్నాయి. మతోన్మాద చరిత్ర ఎప్పటికీ పునరావృతం కారాదు. చరిత్ర నుంచి గుణపాఠాలు నేర్చుకోకపోతే అవి పునరావృతం అవుతాయి. లౌకికతత్వం వర్ధిల్లాలి. రాజ్యాంగ, చట్టపాలన కొనసాగాలి. - బి. కృష్ణారెడ్డి, డెరైక్టర్, క్లాస్-వన్ స్టడీ సర్కిల్ -
తెలంగాణ-పర్యాటకం
కాంపిటీటివ్ గెడైన్స్ : తెలంగాణ ఎకానమీ ఆధునిక ఆర్థిక వ్యవస్థలో పర్యాటక రంగానికి ప్రాధాన్యం పెరుగుతోంది. పర్యాటక రంగ అభివృద్ధి వల్ల అధిక రాబడితో పాటు విదేశీ మారక ద్రవ్య ఆర్జన పెరగటంతో ప్రభుత్వాలు ఈ రంగానికి ప్రాధాన్యమిస్తున్నాయి. పర్యాటకం ద్వారా అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, ఇటలీ, చైనా, ఇంగ్లండ్, జర్మనీ, ఆస్ట్రేలియా, టర్కీ, ఆస్ట్రియా తదితర దేశాలకు ఎక్కువ ఆదాయం లభిస్తోంది. మానవ సమాజం సాంఘికంగా, సాంస్కృతికంగా, ఆర్థికంగా సాధించిన ప్రగతికి తోడ్పాటునందించిన రంగాల్లో పర్యాటకం ఒకటి. తెలంగాణ రాష్ర్టంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ‘రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ’ ఏర్పాటైంది. దీన్ని 2014, జూన్ 2న ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వేరుచేశారు. రాష్ట్రంలో పర్యటించే పర్యాటకులకు అవసరమైన మౌలికవసతులు, ఇతర సౌకర్యాలు కల్పించటం పర్యాటక అభివృద్ధి సంస్థ లక్ష్యం. దీని వద్ద వోల్వో, మెర్సిడెస్ బెంజ్ కోచ్‌లున్న 63 వాహనాలు ఉన్నాయి. ముఖ్య పర్యాటక కేంద్రాల్లో హరిత హోటళ్లను నిర్వహిస్తోంది. విభిన్న పర్యాటక ప్యాకేజీలు అందిస్తూ దేశ, విదేశ పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటోంది. నిజాం ప్యాలెసెస్ టూర్, హైదరాబాదీ హెరిటేజ్ ఫ్లేవర్ వీకెండ్ ప్యాకేజ్, టెంపుల్ కమ్ హిల్ స్టేషన్ టూర్, కాకతీయ హెరిటేజ్ టూర్ వంటి ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ప్యాకేజీలను ఇరుగుపొరుగు రాష్ట్రాలతో అనుసంధానించేందుకు పర్యాటక సంస్థ చర్యలు తీసుకుంది. నదీ ప్రయాణాలు, జల విహారాలకు అవసరమైన పడవలను కూడా సంస్థ నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వ చర్యలు ♦ యాదగిరి గుట్ట దేవస్థానాన్ని అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లను ప్రకటించింది. ఈ ప్రాజెక్టులో భాగంగా 400 ఎకరాల్లో నరసింహ అభయారణ్యాన్ని అభివృద్ధిపరచటంతో పాటు మరో 1600 ఎకరాల్లో ఉద్యానవనాలు, కల్యాణమండపాలు, ధ్యానమందిరాలు, వేద పాఠశాల, కాటేజీలను ఏర్పాటు చేస్తారు. ♦ నల్గొండ-రంగారెడ్డి జిల్లాల సరిహద్దులోని రాచకొండలో దాదాపు 2,000 ఎకరాల విస్తీర్ణంలో ‘మెగా సినిమా సిటీ’ అభివృద్ధికి ప్రభుత్వం సంకల్పించింది. ♦ వైద్య పర్యాటక కేంద్రంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం తగిన ప్రణాళికలు రూపొందించింది. ♦ బతుకమ్మ ఉత్సవాన్ని రాష్ట్ర ఉత్సవంగా ప్రభుత్వం ప్రకటించింది. 2015లో ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం రూ.10 కోట్లు మంజూరు చేసింది. ఏటా ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సంకల్పించింది. బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా పర్యాటక ప్యాకేజీలను టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రారంభించింది. ఈ విశిష్టమైన పండగకు దేశంలోని అన్ని ప్రాంతాల పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటోంది. ♦ అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే ఉత్సవం మేడారం జాతర. 2016, ఫిబ్రవరిలో జరిగిన మేడారం జాతరలో లక్షల మంది పాల్గొన్నారు. ఈ జాతర వైపు దేశ ప్రజలను ఆకర్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ♦ నాగార్జున సాగర్, కిన్నెరసాని, రామప్ప, కొత్తగూడెం, గజ్వేల్ ప్రాంతాల్లో పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధికి ‘నీతి ఆయోగ్’ రూ.33 కోట్లు కేటాయించింది. ♦ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యాటక కేంద్రాల అభివృద్ధికి సమగ్ర జిల్లా ప్రణాళికల రూపకల్పనకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ♦ ప్రభుత్వం వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయం, కొండగట్టులోని హనుమాన్ ఆలయం, ధర్మపురిలోని నరసింహ స్వామి ఆలయం, వరంగల్ జిల్లా పాలంపేటలోని రామప్ప ఆలయం, మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్లోని జోగులాంబ ఆలయాల వద్ద పర్యాటకులకు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. ♦ తెలంగాణ జిల్లాల్లో తక్కువ ప్రాచుర్యం పొందిన పర్యాటక కేంద్రాల్లో తగిన సౌకర్యాలు కల్పించటం ద్వారా ఆయా ప్రాంతాలు ఎక్కువ పర్యాటకులను ఆకర్షించేలా చేయటంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ♦ కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ గ్రామీణ పర్యాటకానికి సంబంధించి గుర్తించిన వాటిలో నల్గొండలోని పోచంపల్లి గ్రామీణ పర్యాటక ప్రాజెక్టు, ఆదిలాబాద్‌లోని నిర్మల్ గ్రామీణ పర్యాటక ప్రాజెక్టు, వరంగల్ జిల్లాలోని చేర్యాల గ్రామీణ పర్యాటక ప్రాజెక్టు, పెంబర్తి గ్రామీణ పర్యాటక ప్రాజెక్టులున్నాయి. ♦ భారత ప్రభుత్వం సహకారంతో కుతుబ్‌షాహీ సమాధుల పరిరక్షణ, ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ♦ ప్రసిద్ధ సమాధుల పరిరక్షణ ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వంతో అగాఖాన్ ట్రస్ట్ ఇప్పటికే చేతులు కలిపింది. ఆర్థిక వ్యవస్థపై పర్యాటక రంగ ప్రభావం ♦ అధిక ఆర్థిక వృద్ధి సాధనకు పర్యాటక రంగం ముఖ్య సాధనంగా ఉపకరిస్తోంది. మధ్యతరగతి ప్రజల ఆదాయాల పెరుగుదలతో పాటు పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వ చర్యల కారణంగా పర్యాటక రంగ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ధనాత్మకంగా ఉంటోంది. ♦ అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ఉన్న తెలంగాణలో నిర్మాణాత్మక మార్పు ద్వారా ఆధునిక ఆర్థిక వృద్ధి జరగాలంటే పర్యాటక రంగాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకోవాలి. ♦ పర్యాటక రంగ అభివృద్ధి వల్ల రాష్ట్రంలో రవాణా రంగం, విద్య, ఆరోగ్యం, బ్యాంకింగ్, కుటీర పరిశ్రమలు, పాడిపరిశ్రమ, పౌల్ట్రీ రంగాల్లో అభివృద్ధి సాధ్యమవుతుంది. ♦ ఆదాయం, ఉపాధికల్పన పెరుగుదలతో పాటు పేదరిక నిర్మూలన, సుస్థిర మానవాభివృద్ధి సాధనకు పర్యాటక రంగం దోహదపడుతుంది. ♦ పర్యావరణ పరిరక్షణ, అంతర సాంస్కృతిక అవగాహన పెంపునకు పర్యాటక రంగం తోడ్పడుతుంది. ♦ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ)తో వివిధ ప్రాజెక్టులు చేపట్టినప్పుడు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. పర్యాటకం, పౌరవిమానయానం, ఆతిథ్య పరిశ్రమల్లో పీపీపీ నమూనాను ప్రవేశపెడితే ప్రభుత్వ వ్యయభారం తగ్గుతుంది. ♦ పర్యాటక రంగం ద్వారా విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించవచ్చు. బహుళ ప్రయోజన మౌలిక వసతుల అభివృద్ధిని పర్యాటక రంగం ప్రోత్సహిస్తుంది. అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి, ఇతర ఉత్పాదక కార్యకలాపాల అభివృద్ధిపై ప్రభావం చూపుతుంది. తద్వారా రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి(జీఎస్డీపీ)లో వృద్ధి అధికమవుతుంది. ♦ పర్యాటక రంగం పరంగా అంతగా ప్రాచుర్యం చెందని ప్రాంతాలపై దృష్టిసారించటం ద్వారా ఆయా ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాలు అభివృద్ధి చెంది, ప్రాంతీయ సమతౌల్య అభివృద్ధికి మార్గం సుగమమవుతుంది. - డాక్టర్ తమ్మా కోటిరెడ్డి ప్రొఫెసర్, ఐబీఎస్, హైదరాబాద్ -
సివిల్స్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ప్రణాళిక
కాంపిటీటివ్ గెడైన్స్ : యూపీఎస్సీ- సివిల్స్ 100 శాతం ఆత్మవిశ్వాసంతో సివిల్స్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కొనసాగించాలి. పటిష్ట ప్రణాళికతో చదివితే తప్పకుండా ప్రిలిమ్స్‌లో విజయం సాధిస్తామనే నమ్మకం అవసరం. అదృష్టాన్ని నమ్ముకోకుండా, కేవలం కటాఫ్ మార్కులు తెచ్చుకుంటే సరిపోతుందని కాకుండా పూర్తిస్థాయిలో మంచి స్కోర్ సాధించేందుకు శ్రమించాలి. పేపర్ 1: 2015 సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్‌తో వచ్చిన మార్పులు కారణంగా ప్రిలిమ్స్‌లో విజయానికి జనరల్ స్టడీస్ పేపర్-1 కీలకంగా మారింది. ఈ పేపర్లో కనబర్చిన ప్రతిభ ఆధారంగా మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. పేపర్-2 అర్హత పేపర్ మాత్రమే. సిలబస్‌లోని సబ్జెక్టులకు సంబంధించి ప్రాథమిక అంశాలపై పట్టుసాధించడం ద్వారా ప్రిలిమ్స్‌ను తేలిగ్గా అధిగమించవచ్చు. తేదీలు, ఫ్యాక్ట్స్ జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ అంటే కేవలం ఫ్యాక్ట్స్, తేదీలు, పేర్లను గుర్తుంచుకోవడం కాదు. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి వివిధ అంశాలను క్రమపద్ధతిలో అధ్యయనం చేస్తూ వెళ్తే ప్రిపరేషన్ సాఫీగా సాగిపోతుంది. మెయిన్స్ కోణంలో వివిధ అంశాలపై పరిజ్ఞానం, అభిరుచిని పరీక్షించేలా ప్రిలిమ్స్ ఉంటుంది. మెయిన్స్‌ను దృష్టిలో ఉంచుకొని, ప్రిలిమ్స్‌కు ప్రిపరేషన్ కొనసాగించాలి. దీనివల్ల రెండు పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు వీలవుతుంది. ప్రిలిమ్స్ పూర్తయ్యాక మెయిన్స్ సబ్జెక్టులను చదవడం కూడా తేలికవుతుంది. * ప్రిలిమ్స్‌లో ఒక ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్ల నుంచి కచ్చితమైన సమాధానాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటే, మెయిన్స్‌లో సరైన సమాధానాన్ని రాయాల్సి ఉంటుంది. ఈ రెండింటికీ అదే తేడా. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి. ఒక్క ఆప్షనల్ సబ్జెక్టు తప్పించి, మిగిలిన అన్ని సబ్జెక్టులు, అంశాలు ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఒకే విధంగా ఉంటాయి. * జనరల్ స్టడీస్‌కు దగ్గరగా ఉండే హిస్టరీ, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సోషియాలజీ వంటి సబ్జెక్టులను ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకుంటే మంచిది. * ప్రిలిమ్స్ (మల్టిపుల్ చాయిస్), మెయిన్స్ (డిస్క్రిప్టివ్), పర్సనాలిటీ టెస్ట్ (వెర్బల్ ప్రజెంటేషన్).. సివిల్స్‌లో ఈ మూడింటి రూపాలు వేరైనా.. వాటి మధ్య అంతర్గత సంబంధం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని, పరీక్షకు సిద్ధమవాలి. * ప్రిలిమ్స్‌లో సబ్జెక్టుల వారీగా ప్రశ్నలకు వెయిటేజీ లేదు. ఒక అంశం నుంచి కచ్చితంగా వచ్చే ప్రశ్నల సంఖ్యను చెప్పలేం. ఈ పరిస్థితిలో ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఉమ్మడిగా ఉన్న సబ్జెక్టుల ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి. ఉమ్మడి అంశాలు: ఆధునిక భారతదేశ చరిత్ర, రాజనీతి శాస్త్రం, భారత ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక శాస్త్రం, వర్తమాన అంశాలు. ఎన్ని అంశాలను చదివామనే దానికంటే, చదివిన అంశాలను ఎంత బాగా అధ్యయనం చేశామన్నది విజయానికి కీలకం. పేపర్-2 (సీశాట్): సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్) పేపర్‌ను అర్హత పేపర్‌గా మార్చడం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు మేలు జరుగుతోంది. ఈ పేపర్లో 33 శాతం మార్కులను అర్హత మార్కులుగా నిర్దేశించారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ స్కిల్ విభాగాన్ని తొలగించారు. ఈ మార్పుల వల్ల పేపర్-2 ప్రిపరేషన్ తేలికైంది. అయితే ఇది అర్హత పేపర్ కాబట్టి, నిర్లక్ష్యం చేయకూడదు. ఈ పేపర్లో విజయం సాధించాలంటే అభ్యర్థులు కనీస స్థాయిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీడింగ్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి. * పేపర్-2 ప్రశ్నలకు సమాధానాలు రాసే విషయంలో వేగం, కచ్చితత్వం అవసరం. ప్రాక్టీస్ ద్వారా మాత్రమే ఈ నైపుణ్యాలు అలవడతాయి. దీనికోసం పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. వీలైనన్ని మాక్‌టెస్ట్‌లు రాయాలి. మ్యాగజైన్లలో ప్రచురించిన క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. రీడింగ్ కాంప్రెహెన్షన్ * సీశాట్‌లో రీడింగ్ కాంప్రెహెన్షన్ విభాగం చాలా చిన్నది. ప్యాసేజ్ను చదివే ముందు మొదట ఒకసారి ప్రశ్నలన్నింటినీ పరిశీలించాలి. దీనివల్ల ప్రశ్నలకు సరైన సమాధానాల ఎంపికకు అవసరమైన సమాచారాన్ని గుర్తించడం తేలికవుతుంది. రీడింగ్ కాంప్రెహెన్షన్ విభాగాన్ని విజయవంతంగా అధిగమించడానికి ఫ్రంట్‌లైన్, ఇండియా టుడే, వీక్ వంటి మ్యాగజైన్లను చదవాలి. ఇవి జనరల్ స్టడీస్‌కు కూడా ఉపయోగపడతాయి. * నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు పరీక్ష గురించి ఆందోళన చెందనవసరం లేదు. పరీక్షలో కేవలం బేసిక్ అంశాలపై పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. అందువల్ల ప్రాక్టీస్ బాగా చేస్తే తేలిగ్గానే లాజికల్, అనలిటికల్ రీజనింగ్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. ఈ విభాగాల ప్రిపరేషన్‌కు ఎం.కె.పాండే, ఆర్.ఎస్.అగర్వాల్ పుస్తకాలు ఉపయోగపడతాయి. * ప్రిలిమ్స్‌కు ఒకసారి చదవడం పూర్తిచేశాక, ప్రీవియస్ పేపర్లను తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. వీలైనన్ని మాక్‌టెస్ట్‌లు రాయాలి. ప్రిపరేషన్‌కు ఇంటర్నెట్ బాగా ఉపయోగపడుతుంది. రిఫరెన్స్ * అనలిటికల్ రీజనింగ్: ఎం.కె.పాండే (లాజికల్, అనలిటికల్ రీజనింగ్) * ఆర్.ఎస్.అగర్వాల్ (వెర్బల్/లాజికల్ రీజనింగ్, ఆప్టిట్యూడ్, రీడింగ్ కాంప్రెహెన్షన్) * క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-అరుణ్‌శర్మ (టీఎంహెచ్) * అరిహంత్ పబ్లికేషన్స్ (సీశాట్) * పజిల్స్ టు పజిల్ యూ - శకుంతలా దేవి * అరిహంత్ పబ్లికేషన్స్ (సీశాట్) - శ్రీరాం శ్రీరంగం డెరైక్టర్, శ్రీరాం ఐఏఎస్, న్యూఢిల్లీ -
హర్షుడి కాలంలో వచ్చిన ప్రధాన మార్పు?
కాంపిటీటివ్ గెడైన్స్ : ఇండియన్ హిస్టరీ గుప్తుల అనంతర యుగం (క్రీ.శ. 6వ శతాబ్దం - 8వ శతాబ్దం) గుప్తుల తర్వాత భారతదేశం మరోసారి అనేక చిన్న చిన్న రాజ్యాలుగా చీలిపోయింది. ఈ రాజకీయ అనైక్యత ఉత్తర భారతంలో తీవ్రంగా ఉంది. ఈ కాలంలోనే ఉత్తరాదిలో.. వల్లభి కేంద్రంగా మైత్రకులు, గౌహతి కేంద్రంగా (కామరూప రాజ్యం) - వర్మన్ వంశం, పాటలీపుత్రం కేంద్రంగా - కడపటి గుప్తులు పాలించారు. అలాగే బెంగాల్ కేంద్రంగా - గౌడ వంశం, కనౌజ్ కేంద్రంగా - మౌఖరీలు, ఒడిశా కేంద్రంగా-మాతరులు, మానవంశం, స్థానేశ్వర్ కేంద్రంగా- పుష్యభూతి వంశంవారు పాలన కొనసాగించారు. అయితే పుష్యభూతి వంశంవారు క్రమంగా ఈ రాజ్యాలన్నింటినీ జయించి మొత్తం ఉత్తర భారతదేశాన్ని రాజకీయంగా ఏకం చేసి పాలించారు. ఈ కాలంలో దక్షిణ భారతదేశాన్ని పశ్చిమ గాంగులు, బాదామీ చాళుక్యులు, పల్లవులు, పాండ్యులు మొదలైన రాజవంశాలు పాలిస్తున్నాయి. ఈ వంశాలు దక్షిణ భారతదేశంలో వాస్తు, శిల్ప కళలకు అమూల్యమైన సేవలను అందించాయి. గుప్తుల తర్వాత యుగంలో ఉత్తరాదిని పాలించిన రాజవంశాలన్నింటిలో ‘పుష్యభూతి వంశం’ గొప్పది. పుష్యభూతి వంశం పుష్యభూతి ఇతడు తన పేరుతో పుష్యభూతి వంశాన్ని స్థాపించాడు. స్థానేశ్వర్ రాజధానిగా గుప్తుల సామంతుడిగా పరిపాలించాడు. ప్రభాకర వర్థనుడు పుష్యభూతి వంశంలో తొలి స్వతంత్ర రాజు. తన స్వతంత్ర పాలనకు గుర్తుగా ‘రాజాధిరాజ’ అనే బిరుదును ధరించాడు. ప్రభాకరుడి భార్య యశోమతి. ప్రభాకర వర్థనుడు క్రీ.శ. 605లో మరణించగా భార్య సతీ సహగమనాన్ని ఆచరించిందని బాణుడి గ్రంథాల ద్వారా తెలుస్తోంది. రాజ్యవర్థనుడు ప్రభాకర వర్థనుడు తన జ్యేష్ట పుత్రుడు రాజ్య వర్థనుడికి బదులు రెండో కుమారుడు హర్షుడిని రాజుగా చేయాలని సంకల్పించాడు. దీనికి హర్షుడు సమ్మతించలేదు. దీంతో రాజ్యవర్థనుడు రాజయ్యాడు. ఇతడి కాలంలో కనౌజ్‌ను గ్రహవర్మ అనే మౌకరీరాజు పాలించేవాడు. ఇతడు రాజ్యవర్థనుడి సోదరి రాజ్యశ్రీ భర్త. మగధను, మాళ్వాను పాలించే దేవగుప్తుడు.. గౌడ దేశాన్ని పాలించే శశాంకుడితో కలిసి.. గ్రహవర్మను చంపి కనౌజ్‌ను ఆక్రమించాడు. రాజ్యవర్థనుడు దేవగుప్తుడిని చంపి కనౌజ్‌ను స్వాధీనం చేసుకున్నాడు. శశాంకుడు.. రాజ్యవర్థనుడిని హత్య చేయడంతో హర్షుడు రాజ్యానికి వచ్చాడు. హర్షవర్థనుడు హర్షవర్థనుడు గౌడ శశాంకుడి నుంచి కనౌజ్‌ను విడిపించి, రాజధానిని స్థానేశ్వరం నుంచి కనౌజ్‌కు మార్చాడు. శశాంకుడి తర్వాత గౌడ దేశాన్ని కూడా ఆక్రమించాడు. ఆ తర్వాత తన దిగ్విజయ యాత్రలు ప్రారంభించి.. సింధు, వల్లభి, గుజరాత్, సౌరాష్ర్ట మొదలైన ప్రాంతాలను జయించాడు. లత, మాళ్వా ప్రాంతాలపై ఆధిపత్యం విషయంలో హర్షుడికి.. బాదామీ చాళుక్యరాజు రెండో పులకేశితో ఘర్షణ అనివార్యమైంది. హర్షుడు.. పులకేశితో యుద్ధానికి చేసిన సన్నాహాల గురించి బాణభట్టు తన రచనల్లో వివరించాడు. వీరి మధ్య జరిగిన యుద్ధం గురించిన ప్రస్తావన రెండో పులకేశికి చెందిన ఐహోల్ ప్రశస్తిలో కనిపిస్తోంది. ఈ యుద్ధంలో హర్షుడి విజయం సందిగ్ధకరం అని భావించాలి. పులకేశి వారసులు ఈ యుద్ధంలో పులకేశి విజయం సాధించినట్లు పేర్కొన్నారు. అయితే చరిత్రకారులు వీరి మధ్య స్నేహపూర్వక ఒప్పందం జరిగినట్లు భావిస్తున్నారు. హర్షుడు సాధించిన సైనిక విజయాల సమాచారం అతడు జారీ చేసిన వివిధ శాసనాల ద్వారా లభిస్తోంది. హర్షుడు బన్సిఖేర, మధుబన్, సోనేపట్ మొదలైన శాసనాలను జారీ చేశాడు. హర్షుడు మరణించే నాటికి అతడి రాజ్యంలో కాశ్మీర్ తప్ప మిగిలిన ఉత్తర భారతదేశమంతా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అంతర్భాగంగా ఉండేది. అందుకే హర్షుడిని ఉత్తర భారతదేశాన్ని పాలించిన చివరి గొప్ప హిందూ రాజుగా పరిగణిస్తారు. పాలనా విధానం ప్రాచీన భారతదేశ చరిత్రలో చివరిసారిగా ఒక పటిష్టమైన పాలనాపద్ధతిని ఏర్పాటు చేసిన రాజు హర్షుడు. ఇతడి పాలనా సమర్థత వల్ల గుప్తుల అనంతరం ఉత్తర భారతంలో దాదాపు 40 ఏళ్లపాటు శాంతియుత వాతావరణం ఏర్పడింది. కనౌజ్‌కు దగ్గరగా ఉన్న ప్రాంతాలను ఇతడు ప్రత్యక్షంగా పాలించినప్పటికీ.. పరోక్ష పాలనలో మాత్రం చాలా ప్రాంతాలుండేవి. హర్షుడి కాలంలో వచ్చిన ప్రధాన మార్పు భూస్వామ్య వ్యవస్థ ఏర్పడటం. దీంతోపాటు సామంత వ్యవస్థ కూడా పెరిగిపోయింది. ఒక రాజుకు ఉన్న సామంతుల సంఖ్యను బట్టి అతడి గొప్పదనాన్ని అంచనా వేయడం ప్రారంభమైంది. హర్షుడు తన సామ్రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం అనేక రాష్ట్రాలుగా విభజించాడు. వీటిని ‘భుక్తి’ అని పిలిచేవారు. రాష్ట్రాలను ‘విషయ’ అనే పేరుతో జిల్లాలుగా విభజించారు. జిల్లాలను ‘పాథక’ అని విభజించారు. పాలనలో చిట్టచివరి విభాగం గ్రామం. పరిపాలనలో రాజుకు సహాయంగా మంత్రి పరిషత్ ఉండేది. హర్షుడి అధికారుల్లో ముఖ్యమైనవారు మంత్రి, సేనాపతి, మహాసామంత, కుమారామాత్య, ఉపారిక, విషయపతి, రాజస్థానీయ తదితరులు. ఉన్నతాధికారులందరికీ వేతనాలను భూముల రూపంలోనే చెల్లించేవారు. కేవలం కిందిస్థాయి సైనికులకే జీతాలను నగదు రూపంలో చెల్లించేవారు. అందుకే ఈ కాలంలో అతి తక్కువ సంఖ్యలో నాణేలు కనిపిస్తాయి. నాణేల కొరతకు మరో కారణం.. ఈ కాలంలో వ్యాపార వాణిజ్యాలు మరింతగా క్షీణించడమే. ప్రజలపై పన్నుల భారం తక్కువగానే ఉండేది. రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు భూమిశిస్తు. ఇది పంటలో ఆరో వంతుగా ఉండేది. ‘తుల్యమేయ’ అనే అమ్మకం పన్ను కూడా విధించారు. - కె. యాకూబ్‌బాష, సబ్జెక్టు నిపుణులు