Flashback 2018
-
2018 : సోషల్ మీడియాలో వైరల్ న్యూస్
-
2018 బిజినెస్ రౌండప్
-
నింగికేగిన దిగ్గజాలు.. చారిత్రక నిర్ణయాలు..మహిళా విజయాలు
-
2018.. పరుగుల కింగ్ కోహ్లినే
-
2018.. భారత్ ఆట.. పతకాల వేట
-
2018 : సోషల్ మీడియాలో వైరల్ న్యూస్
ఆధునిక సమాజంలో సమాచార రంగంలో మహత్తర విప్లవానికి కారణమైన సోషల్ మీడియా 2018లో ఎన్నో సరికొత్త సంచలనాలకు కేంద్రంగా మారింది. మొబైల్ ఇంటర్నెట్ సేవలు గణనీయంగా పెరగడంతో సామాజిక మాధ్యమాల వాడకం విస్తృతంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు సమాచారం చేరవేయడంలో, ప్రజల మధ్య సమాచారం అందించుకోవడంలో సోషల్ మీడియా వహిస్తున్న పాత్ర విశేషంగా పెరిగింది. మంచి ఉన్న చోటే చెడు కూడా ఉన్నట్టు, 2018లో ఎన్నో ఉద్యమాలకు పురుడుపోసిన సామాజిక మాధ్యమాలు తప్పుడు వార్తల ప్రచారంతో అపకీర్తిని మూటకట్టుకున్నాయి. తమ కంటికి తప్పనిపించిందో ఫేస్బుక్ సీఈఓ అయినా సరే డేటా చోరి వంటి ఘటనలపై నెటిజనులు నిప్పులు చెరిగారు. సీఎం స్థానాల్లో ఉండి నోరుజారినా, రెండు నాల్కల ధోరణిలను ప్రదర్శించినా సరే ఓ హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్చేసి వారి నోరు మూయించారు. ఎక్కడో సిరియాలో తుపాకుల తూటాల నడుమ బిక్కుబిక్కుమంటున్న అమాయక పసిమోములు, కల్మశం లేని చిన్నారుల ఫొటోలకు నెటిజన్లు చలించారు. జర్నలిజాన్ని బాత్‌టబ్‌కు దిగజార్చడం వంటి ఘటనలను నెటిజన్లు తమ క్రియేటివిటీ జోడించి ఓ ఆట ఆడుకున్నారు. ఓరకంట చూస్తూ ఒక్క ఫ్లయింగ్ కిస్ ఇస్తే చాలు, ఓవర్ నైట్ స్టార్‌నే చేసేశారు. చిన్నా పెద్దా తేడా లేకుండా సమస్య అయినా, సంఘటనైనా తమకు మంచి అనిపిస్తే పొగడటం, తేడా అనిపిస్తే కడిగిపాడేయడమే అంటూ మూడు కామెంట్లు ఆరు లైకులు అన్నచందంగా నెటిజన్లకు గత ఏడాది గడిచిపోయింది. 2018 ఏడాదిలో సోషల్‌మీడియాలో వైరల్ అయినవి.. జనవరి 1) ప్రాణాలు లెక్కచేయలేదు.. హీరో అయ్యాడు! అప్పటివరకూ ఆడుతుపాడుతున్న ఓ చిన్నారి క్షణాల్లో ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తలెత్తింది. ఓ వ్యక్తి వెంటనే స్పందించి సినిమా సీన్ తరహాలో ఆ బాలికను కాపాడి హీరో అయ్యారు. చైనాలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2) ఎఫ్బీలో చూసి ఆ పిచ్చిపని చేశా.. వైరల్ జమ్మూకశ్మీర్‌కు చెందిన మెడిసిన్ విద్యార్థి చేసిన డేరింగ్ ఫీట్‌పై తీవ్ర విమర్శలు వెల్లవెత్తాయి. రైలు పట్టాలపై పడుకుని రైలు వెళ్తుండగా స్నేహితుడితో ఈ తతంగాన్ని వీడియో తీయించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. 3)వాట్సప్ క్రాష్ ; న్యూఇయర్ విషెష్ వెల్లువెత్తడంతో.. ప్రఖ్యాత మెసేజింగ్ సర్వీస్ యాప్ వాట్సప్ క్రాష్‌డౌన్ కావడంతో 2018 ప్రారంభంలోనే ప్రపంచవ్యాప్తంగా కొద్దిపాటి కలకలంరేగింది. ఊహకు అందని రీతిలో న్యూఇయర్ విషెస్ వెల్లువత్తడంతో ఏర్పడిన సాంకేతిక సమస్యలే ఇందుకు కారణమని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 4)కిరాక్ డాన్స్‌తో కేక పుట్టించిన మాజీ ఎంపీ వరంగల్ క్లబ్లో జరిగిన న్యూఇయర్ వేడుకలో పాల్గొన్న రాజయ్య.. సన్నిహితులతో కలిసి సరదాగా డాన్స్చేశారు. రాజయ్య చేసిన కిరాక్ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో తెగవైరల్ అయింది. 5)నాలా ఇంకెవరూ తప్పు చేయొద్దు.. ప్రదీప్ వైరల్ వీడియో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరికిపోయిన స్టార్ యాంకర్ ప్రదీప్.. తాను తప్పుచేసినట్లు అంగీకరించి, ఇంకెవరూ తనలాగా తప్పుచేయకూడదంటూ పోస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 6)పెళ్లికొడుకు వెక్కివెక్కి ఏడుపు.. ఎందుకంటే.. బిహార్‌లో సరదాగా పెళ్లికి వెళ్లి తిరుగు పయనమైన ఓ యువకుడు పెళ్లికొడుగ్గా మారాల్సి వచ్చింది. బోరుమని ఏడుస్తూ తన పక్కన తెలిసిన వారే లేకుండా తనపైకి ఎక్కుపెట్టిన తుపాకీని చూస్తూ తాళికట్టాల్సి వచ్చింది. ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. 7)చంద్రబాబు బండారం బయటపెట్టిన వెంకటాచలం సొంత కంపెనీ హెరిటేజ్ బాగు కోసం చంద్రబాబు వేలాదిమంది రైతుల పొట్టకొట్టాడని స్థానిక ఉద్యమకారుడు వెంకటాచలం నిప్పులు చెరిగిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అయింది. 8)సెల్ఫీ పోజు.. అతనికేం కాలేదంట! వేగంగా వస్తున్న ఎంఎంటీఎస్ ముందు సెల్ఫీ వీడియో దిగడానికి ప్రయత్నించి.. ఓ యువకుడు తీవ్రంగా గాయపడినట్టు వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అయితే, ఈ ఘటనలో అతనికేం పెద్దగా గాయాలు కాలేదని, అతను బాగానే ఉన్నాడంటూ ఆ తర్వాత తెలిసింది. ఫిబ్రవరి 1)ఆ హోంగార్డులకు హ్యాట్సాఫ్ గుండెపోటుకు గురైన వాహనదారుడి ప్రాణాలు కాపాడిన హోంగార్డులపై ప్రశంసలు కురిశాయి. మంత్రి కేటీఆర్ వారికి ట్వీటర్ ద్వారా అభినందనలు తెలిపారు. 2)యువభారత్‌పై ప్రశంసల జల్లు అండర్-19 ప్రపంచకప్ సాధించిన యువభారత్‌పై ప్రశంసల జల్లు కురిసింది. దేశం గర్వించదగ్గ సమయమిదని రాజకీయ ప్రముఖుల, క్రికెటర్లు, సినీతారాలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలతో ముంచెత్తారు. 3)తన పెళ్లిలో కూడా డ్యూటీ చేసిన జర్నలిస్టు పెళ్లిరోజు సైతం సెలవుపెట్టకుండా ఓ పాకిస్థాన్ జర్నలిస్టు ఉద్యోగం చేశాడు. మరికొన్ని నిమిషాల్లో పెళ్లి జరుగుతుందనగా బ్రేకింగ్ న్యూస్ అంటూ పెళ్లికొడుకు కాస్త రిపోర్టర్ అవతారమెత్తాడు. సిటీ 41 చానెల్లో పనిచేసే హనాన్ బుకారీ తన పెళ్లినే రిపోర్ట్ చేసి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లోకెక్కాడు. 4)గోవా సీఎం వ్యాఖ్యలపై నెటిజన్ల ఆగ్రహం! అమ్మాయిలు కూడా బీర్లు తాగడం మొదలుపెట్టేశారని.. వారిని చూస్తుంటే తనకి భయమేస్తోందని గోవా సీఎం మనోహర్ పారికర్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తమయింది. పలువురు 'గర్ల్స్ హూ డ్రింక్ బీర్' హ్యాష్ ట్యాగ్ జోడిస్తూ, పారికర్ వ్యాఖ్యలకు నిరసనగా బీరు తాగే ఫొటోలను పోస్ట్ చేశారు. 5) అబ్బాయిల గుండెల్ని పేల్చేసింది! ‘ఒరు ఆదార్ లవ్’ అనే మలయాళ సినిమాలోని ఓ వీడియో సాంగ్ విడుదలై సెన్షన్ క్రియేట్ చేసింది. ఒక్క వీడియోతో ప్రియాప్రకాశ్ వారియర్ ఓవర్‌నైట్ నేషనల్ స్టార్ అయిపోయింది. ఒక ఫ్లయింగ్ కిస్ని గన్లా మార్చి తూటాలా పేల్చితే.. అది తగిలి ఆమె లవర్ విలవిలలాడుతాడు. నిజానికి ఆమె విసిరిన ఫ్లయింగ్ కిస్కు అబ్బాయిల గుండెలు పేలిపోయాయంటూ నెటిజన్లు స్పందించారు. 6)మంత్రివర్యా.. నీకిది తగునా? స్వచ్ఛ భారత్ కోసం మోదీ చేస్తున్న కృషిని స్ఫూర్తిగా తీసుకొని రాజస్థాన్‘స్వచ్చ్ భారత్ అభియాన్’కింద మంచి ర్యాంక్‌ను కొట్టేయాలని చూస్తూంటే.. రాజస్థాన్ ఆరోగ్య మంత్రి కాలిచరణ్ శరఫ్ జైపూర్‌లోని ఓ గోడకు మూత్రం పోస్తూ దొరికిపోయారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 7)బాత్‌టబ్‌లో రిపోర్టర్.. నెటిజన్ల విస్మయం! శ్రీదేవి ఆకస్మిక మృతి విషయంలో న్యూస్ చానెళ్లు జర్నలిజాన్ని బాత్‌టబ్‌కు దిగజార్చడం, బాత్‌టబ్‌లోకి కూరుకుపోయి మరీ కథనాలు ప్రసారం చేయడంపై నెటిజన్లు మండిపడ్డారు. 8)ఆ చిన్నారుల కోసం తల్లడిల్లుతున్న సోషల్ మీడియా! సిరియాలో తుపాకుల తూటాల నడుమ, విస్ఫోటన శిథిలాలలో నెత్తుటి చారికలతో బిక్కుబిక్కుమంటున్న అమాయక పసిమోములు, కల్మశం లేని చిన్నారుల ఫొటోలు సోషల్ మీడియాలో నెటిజన్లను కదిలించాయి. యుద్ధక్షేత్రంగా మారిన సిరియాలో అమాయక బాల్యం ఎలా నరకం అనుభవిస్తుందో.. ఎలా నిత్యం రకప్తుటేరుల మధ్య నలిగిపోతుందో చాటుతున్న ఫొటోలు నెటిజన్లను కంటతడి పెట్టించాయి. 9)కాంగ్రెస్ సంతాప ట్వీట్‌పై నెటిజన్ల ఫైర్ నటి శ్రీదేవి(54) హఠాన్మరణం భారత ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన ఓ ట్వీట్‌పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ‘యూపీఏ హయాంలో పద్మశ్రీ అవార్డు’ అని ప్రస్తావించడాన్ని తప్పుబడుతూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. 10) లైవ్‌లోనే న్యూస్ రీడర్ల మధ్య వాగ్వాదం పాకిస్థాన్‌లో లైవ్‌లోనే ఇద్దరు న్యూస్ రీడర్లు వాగ్వాదానికి దిగిన వీడియో ఒకటి నెట్లో జోరుగా చక్కర్లు కొట్టింది. ‘ఈమెతో నేనేలా బులిటెన్ చదవాలి?’ అంటూ యాష్ ట్యాగ్‌తో ఆ వీడియోను తెగ వైరల్ అయింది. 11)శోకాన్ని దిగమింగుకొని భర్త అంత్యక్రియలకు.. ఓ మహిళా ఆర్మీ అధికారి శోకాన్ని దిగమింగుకొని తన ఐదు రోజుల పసి బిడ్డతో భర్త అంత్యక్రియలకు హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. మార్చి 1) వీర్యంతో దాడులా?.. ఛాన్సే లేదు హోలి వేడుకల్లో భాగంగా దేశ రాజధానిలో ఇద్దరు విద్యార్థినులపై చోటు చేసుకున్న వికృత దాడులు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. వీర్యంతో నింపిన బెలూన్లను వారిపై విసిరిన ఆకతాయిలను కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. అయితే అదసలు సాధ్యమయ్యే పనే కాదంటూ నెటిజన్లు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. 2)నిన్నటి వరకు గొప్ప కవి.. నేడు వేశ్యనా? సోషల్ మీడియా వేదికగా తనపై వస్తున్న విమర్శలపై మలయాళ మోడల్ గిలు జోసెఫ్ ఘాటుగా స్పందించారు. నిన్నటి వరకు గొప్ప కవి అని కొనియాడినవారే ఇప్పడు వేశ్యగా ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిపాలు ఆవశ్యకతపై అవగాహన పెంచడానికి మలయాళ మ్యాగజైన్ ‘గృహలక్ష్మీ’ఓ సంచికను విడుదల చేసిన విషయం తెలిసిందే. 3) అందుకే దూరంగా ఉన్నా: యాంకర్ అనసూయ ‘రంగస్థలం’ సినిమా విడుదల అనంతరం సోషల్ మీడియాలోకి వస్తానని బుల్లితెర యాంకర్ అనసూయ స్పష్టం చేశారు. సెల్ఫీ అడిగిన ఓ బాలుడి మొబైల్ పగలగొట్టడంతో అనసూయపై సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె తన ట్విట్టర్, ఫేస్ బుక్ అకౌంట్లను డీయాక్టివేట్ చేసి సోషల్ మీడియాకు కొంత కాలం దూరంగా ఉన్నారు. 4)అద్వానీని అవమానించిన మోదీ! వైరల్ వీడియో త్రిపురలో తొలిసారి బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం సందర్భంగా చోటుచేసుకున్న ఓ వీడియో వైరల్ అయింది. అద్వానీ చేతులు దండం పెడుతూనే ఉన్నా.. మోదీ పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో‘గురువును విస్మరించిన శిశ్యుడు..’,, ‘అద్వానీని అవమానించిన మోదీ..’ , ‘పెద్దాయనను చూస్తే జాలేస్తోంది..’ అంటూ ఈ వీడియోకు నెటిజన్లు రకరకాల భాష్యాలు జోడించారు. 5)‘సెవ్‌కొచ్చి’ యాష్ ట్యాగ్‌కు తలొగ్గిన బీసీసీఐ ‘సెవ్‌కొచ్చి’ యాష్ ట్యాగ్‌తో సోషల్‌మీడియా వేదికగా అభిమానులు చేసిన ఉద్యమానికి బీసీసీఐ దిగొచ్చింది. ఫుట్‌బాల్‌కు గుర్తింపు పొందిన నెహ్రూ స్టేడియాన్ని క్రికెట్ కోసం పాడుచేయడం ఏమిటని పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ వేదికను మార్చారు. 6) స్మిత్ మళ్లీ మైండ్ పనిచేయ లేదా! బాల్ ట్యాంపరింగ్ వివాదంతో చిక్కుల్లో పడ్డ ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్‌పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. స్మిత్ మళ్లీ మైండ్ పనిచేయ లేదా ( బ్రెయిన్ ఫేడ్) అంటూ గత భారత్-ఆసీస్ టెస్ట్ సిరీస్ వివాదాన్ని గుర్తు చేస్తున్నారు. ఏప్రిల్ 1) ఫేస్బుక్ సీఈఓపై జోకులే జోకులు.. డేటా చోరిపై అమెరికన్ కాంగ్రెస్ ముందుకు వచ్చిన ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్‌కు జవాబులు చెప్పడం చాలా కష్టమైంది. 44 మంది సెనేటర్లు దాదాపు 5 గంటలకు పైగా జుకర్‌బర్గ్‌కు వందల కొద్దీ ప్రశ్నలు సంధించారు. ఈ నేపథ్యంలో ఎదురైన పరిణామాలపై సోషల్ మీడియాలో నెటిజన్లు అనూహ్యంగా స్పందించారు. 2) రైలింజన్ పైకెక్కి నిరసన.. ఊహించని షాక్! కావేరీ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలంటూ తమిళనాడు వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో అపశృతి చోటుచేసుకుంది. రైల్‌రోకో ఆందోళనలో భాగంగా పీఎంకే కార్యకర్త ఒకరు ఆగిఉన్న రైలింజన్ పైకి ఎక్కి నిరసన తెలుపుతుండగా, కరెంట్ షాక్ తగిలి, మంటలు అంటుకున్నాయి. 3)తివారి బౌలింగ్ యాక్షన్‌పై జోకులే జోకులు సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌలర్‌గా కొత్త అవతారమెత్తాడు.. కింగ్స్‌పంజాబ్ ఆటగాడు మనోజ్ తివారి. యువరాజ్ సింగ్ స్థానంలో జట్టులోకి వచ్చిన ఈ యువ ఆటగాడు వినూత్న శైలితో బౌలింగ్ చేసి ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం తివారి బౌలింగ్ యాక్షన్‌పై అభిమానులు సోషల్ మీడియా వేదికగా జోకులు పేల్చారు. మే 1) నువ్వు ఆగు మిత్రమా.. నేను వెళతాను..!! బాహుబలి-ది కంక్లూజన్ పార్ట్‌కు చైనీయులు ఫిదా అయిపోయారు. హీరో ప్రభాస్‌ను ఏకంగా హాలీవుడ్ స్టార్స్‌తో పోల్చుతూ ఓ చైనీయుడు చేసిన పోస్టు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. బ్లాక్ పాంథర్‌ను కలిసిన ప్రభాస్.. తాను ముందు వెళ్తానని ఆపుతున్నట్లు, శత్రువును చీల్చిచెండాటానికి వెళ్తున్న ఎవెంజర్స్ సీరియస్‌గా చూస్తుంటే.. ప్రభాస్ మాత్రం చిరునవ్వుతో శత్రువును చూస్తున్నట్లు ఫొటోషాప్ చేసిన ఫొటోలు ఆకట్టుకున్నాయి. 2) చంద్రబాబు డబుల్ గేమ్ : నాడు అలా.. నేడు ఇలా.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి రెండు నాల్కల ధోరణి మరోమారు బయటపడింది. జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీయే)లో ఉన్నప్పుడు నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్ధిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పొగిడిన చంద్రబాబు.. తిరిగి నోట్ల రద్దు వల్ల దేశ బ్యాంకింగ్ వ్యవస్థ నిర్వీర్యం అయిందని అందుకు మోదీనే కారణమని ఆరోపించారు. బాబు రెండు నాల్కల ధోరణిపై నెటిజన్లు మండిపడ్డారు. 3)మీరు ఫిట్‌గా ఉన్నారా? చాలెంజ్ ‘హమ్ ఫిట్‌తో ఫిట్ ఇండియా ఫిట్’అనే చాలెంజ్‌కు కేంద్ర కీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ శ్రీకారం చుట్టారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్లకు సవాల్ విసిరారు. జూన్ 1) అంకుల్... ఇరగదీశావ్ పో! 40 ఏళ్లకు పైబడిన ఓ ఇండియన్ అంకుల్ డాన్స్ వీడియో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. ‘ఆప్ కే ఆ జానే సే...’ పాటలో గోవిందనే తలదన్నెలా స్టెప్పులేశారంటూ సెలబ్రిటీల దగ్గరి నుంచి సామాన్యుల దాకా ఆ అంకుల్‌పై అంతా ప్రశంసలు గుప్పించారు. 2) తెలుగుకు తెగులు పట్టించిన లోకేష్ తన సహజ ధోరణితో మంత్రి నారా లోకేష్ అభాసుపాలయ్యారు. కాకినాడలో జరిగిన ధర్మపోరాట దీక్షలో తెలుగు భాషకు తెగులు పట్టించారు. తెలుగును సరిగ్గా ఉచ్ఛరించలేక పలుమార్లు అర్థ రహితంగా మాట్లాడారు. దీంతో సభలో ఉన్న మహిళలు లోకేష్ ప్రసంగిస్తుండగా పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. 3) వామ్మో.. వరుసబెట్టి హగ్ ఇచ్చిన యువతి.! రంజాన్ పర్వదినం సందర్భంగా ఓ యువతి లక్నోలోని ఓ షాపింగ్ మాల్ దగ్గర యువకులకు ఆత్మీయ ఆలింగనం ఇవ్వడం మొదలుపెట్టింది. దీంతో యువతి హగ్ కోసం యువకులు పోటీ పడ్డారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. 4) ఎక్కడికి పోతారు సార్? తమిళనాడులో తాము ఎంతగానో అభిమానించే ఉపాధ్యాయుడు ట్రాన్స్‌ఫర్‌పై మరో చోటకు బదిలీపై వెళుతుండగా, మిమల్ని వెళ్లనివ్వం సార్.. అంటూ విద్యార్థులు ఏడుపు అందుకున్నారు. అంతే వారిని చూసి అతను కూడా ఏడవటం ప్రారంభించాడు. అందుకు సంబంధించిన దృశ్యాలు స్థానిక మీడియా ఛానెళ్లలో విపరీతంగా చక్కర్లు కొట్టాయి. దీంతో అధికారుల్లో కూడా కదలిక వచ్చింది. జూలై 1) ట్రైలర్‌కు బదులుగా ఫుల్ మూవీ అప్లోడ్.. రెడ్ బ్యాండ్ మూవీ ట్రైలర్ లింక్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాల్సి ఉండగా.. జాన్ మథ్యూస్ దర్శకత్వం వహించిన ‘ఖాళీ ద కిల్లర్’ మూవీ లింక్‌ను సోని సంస్థ పొరపాటున షేర్ చేసింది. ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటర్నెట్లో మూవీని చూసిన ఉత్సాహంలో కొందరు సోనీ సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతూ చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. 2) ఒక్క ట్వీట్‌తో 26 మంది బాలికలకు విముక్తి సోషల్ మీడియా పుణ్యమా అని 26 మంది మైనర్ బాలికలు అక్రమ రవాణా ముఠా నుంచి సురక్షితంగా బయటపడ్డారు. మజఫర్ నగర్-బాంద్రాల మధ్య నడిచే అవధ్ ఎక్స్‌ప్రెస్‌లో ఓ ప్రయాణికుడు చేసిన ట్వీట్‌పై స్పందించిన జీఆర్పీ, ఆర్పీఎఫ్ భద్రతా దళాలు సత్వరం రంగంలోకి దిగి బాలికలను రక్షించాయి. 3) తప్పు నాదే.. మన్నించండి ఉత్తర థాయ్‌లాండ్‌లోని చియాంగ్ రాయ్ ప్రొవిన్స్‌లో 12 మంది సభ్యులున్న ఫుట్‌బాల్ టీమ్.. థామ్ లూవాంగ్ గుహ సందర్శనకు వెళ్లి, ఒక్కసారిగా భారీ వర్షాలు కురియటంతో వారంతా లోపలే ఇరుక్కుపోయారు. అయితే చిమ్మచీకట్లో వారందరినీ కంటికి రెప్పలా వాళ్లను కాపాడిన కోచ్.. ఓ భావోద్వేగమైన సందేశాన్ని ప్రపంచానికి విడుదల చేయడంతో అది వైరల్ అయింది. 4) యూనిఫాంతో మోకరిల్లిన సీఐ.. ట్రోలింగ్ ఉత్తరప్రదేశ్‌లో ఓ సీనియర్ అధికారి చేసిన పని సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ ముందు యూనిఫాంలో మోకరిల్లిన సదరు అధికారి.. పైగా ఆ ఫోటోలను తన ఫేస్బుక్లో పోస్టు చేశారు. దీంతో పలువురు ఆన్లైన్లో సీఐను ట్రోల్ చేశారు. 5) ఆధార్ నంబర్ ట్వీట్ చేసి.. చాలెంజ్ ! ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ తన ఆధార్ నంబర్‌ను ట్వీట్ చేసి.. సవాల్ విసిరారు. 12 అంకెల తన ఆధార్ నంబర్‌ను తెలుసుకోవడం ద్వారా ఎలా తనకు హాని చేయగలరో నిరూపించాలని ఆయన సవాల్ చేశారు. అయితే, శర్మ ట్వీట్ చేసిన ఆధార్ నెంబర్ ఆధారంగా ఆయన ఇంటి చిరునామా, జన్మదినం, ఫోన్ నంబర్, పాన్ నెంబర్ తదితర వివరాలు రాబట్టినట్టు పలువురు నెటిజన్లు ట్వీట్ చేస్తుండటం కొసమెరుపు. ఆగష్టు 1) పంద్రాగస్టు: కోహ్లి సరికొత్త చాలెంజ్ టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో కొత్త చాలెంజ్‌కు స్వీకారం చుట్టాడు. భారత సంప్రదాయలపై విస్తృత ప్రచారం కల్పించాలని కోహ్లి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా #Veshbhusha చాలెంజ్‌ను తీసుకొచ్చాడు. 2) అనుష్కశర్మపై కుళ్లు జోకులు! వరుణ్ ధావన్, అనుష్క శర్మ జంటగా నటించిన ‘సూయి ధాగా’. చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన లభించింది. ఓ సన్నివేశంలో అనుష్కశర్మ భావోద్వేగానికి లోనైన ఫొటోకు నెటిజన్లు క్యాప్షన్లు జతచేసిన ఫోటోలు తెగవైరల్ అయ్యాయి. 3) వైరల్ వీడియో : హ్యాట్సాప్ ఇండియన్ ఆర్మీ భారీ వర్షాలతో అతలాకుతలమయిన కేరళలో భారత ఆర్మీ అందించిన సేవలను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తారు. గర్బిణీ, దివ్యాంగుడు, బాలుడు ఇలా చాలామందిని హెలికాప్టర్ సహాయంతో కాపాడిని ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. 4) హరికృష్ణతో సెల్ఫీ.. నెటిజన్ల ఫైర్ సెల్ఫీ పిచ్చి పరాకాష్టకు చేరింది. ఎప్పుడు, ఎక్కడ సెల్ఫీ దిగాలో కూడా తెలియకుండా ప్రవర్తించారు. నార్కట్‌పల్లి కామెనేని ఆసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది హరికృష్ణ పార్దీవదేహంతో సెల్ఫీలు దిగారు. అంతటితో ఆగకుండా సోషల్‌మీడియాలో షేర్ చేసి రాక్షసానందం పొందారు. దీంతో ఆగ్రహానికి గురైన నెటిజన్లు వారిపై దుమ్మెత్తిపోశారు. 5) కీకీ ఛాలెంజ్.. అవార్డు మనోళ్లదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన కీకీ ఛాలెంజ్‌కు తెలంగాణలోని లంబడిపల్లి గ్రామానికి చెందిన యువకులు దేశీ టచ్ ఇచ్చారు. ఒక్కసారిగా వీడియో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. సెప్టెంబర్ 1)వైరల్‌గా సమంత ‘కర్మ థీమ్’ చాలెంజ్ నటి సమంత సరికొత్త చాలెంజ్‌ను పరిచయం చేశారు. ‘యూటర్న్’ చిత్ర ప్రమోషన్లో భాగంగా.. సంగీత దర్శకుడు అనిరుధ్ రూపొందించిన కర్మ థీమ్‌లో డ్యాన్స్‌తో అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్లో పోస్ట్ చేసిన సమంత #యూటర్న్‌డాన్స్‌చాలెంజ్ పేరిట సవాల్ విసిరారు. 2) ఫేస్బుక్ వేదికగా అమృత పోరాటం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన పరువు హత్య కేసులో మృతుడు పెరుమాళ్ల ప్రణయ్ భార్య అమృత వర్షిణి న్యాయం కోసం తన పోరాటాన్ని సోషల్‌మీడియాలో ప్రారంభించారు. అమృత ‘జస్టిస్ ఫర్ ప్రణయ్’ పేరిట ఫేస్బుక్ పేజీ క్రియేట్ చేసింది. సోషల్ మీడియా వేదికగా తన పోరాటాన్ని ప్రారంభించి తొలి అడుగేసింది. 3) స్వలింగ సంపర్కం నేరం కాదు రాజ్యాంగంలోని సెక్షన్ 377 పౌరుల సమానత్వ, గౌరవ హక్కులను ఉల్లంఘిస్తున్నదని ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్మానించింది. వయోజనుల మధ్య జరిగే స్వలింగ సంపర్కం నేరం కాదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో సోషల్‌మీడియాలో ఎల్జీబీటీక్యూ వర్గానికి అభినందనలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో #Section377Verdict ట్రెండింగ్ హ్యాష్ట్యాగ్గా నిలిచింది. అక్టోబర్ 1) బిగ్‌బాస్: మూడింట్లో ‘ఆర్మీ’లదే గెలుపు బిగ్‌బాస్ సీజన్-2 తెలుగు టైటిల్‌ను కౌశల్ గెలుచుకున్న విషయం తెలసిందే. ఒక్క తెలుగులోనే కాదు.. ఈ సోషల్ మీడియా వేదికగా ఏర్పాటైన ఆర్మీల ప్రభావం.. అటు తమిళం, మలయాళంలోను కనిపించింది. 2) సీఎం రమేశ్ రాజభవనం చూశారా? టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కార్యాలయాలలో ఆదాయ పుపన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో జూబ్లిహిల్స్‌లో తన నివాసానికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. రమేష్ నివాసంలోని అత్యంత ఆధునిక టెక్నాలజీతో ఉన్న హోంథియేటర్, స్విమ్మింగ్‌పూల్, డైనింగ్ టేబుల్, బెడ్ రూం ఫొటోలు వైరల్ అయ్యాయి. 3) ఓటుకు నోట్లు ఇంగ్లీష్ రిపీట్ మన వాళ్లు బ్రీఫ్డ్ మీ.. వాట్ ఐయామ్ సేయింగ్ ఈజ్.. లాంటి పదాలు వినగానే గుర్తొచ్చే సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో విలేఖరుల సమావేశంలో ఇంగ్లీష్‌లో ప్రసంగించారు. చంద్రబాబు ఇంగ్లీష్‌పైనే కాకుండా వాయిస్‌పైన సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు సెటైర్ల వర్షం కురిపించారు. ఓటుకు నోట్లు కేసు తాలుకూ ఇంగ్లీష్ మళ్లీ రిపీటైంది అంటూ సోషల్ మీడియాలో చర్చించుకున్నారు. 4) మావోల దాడి: డీడీ ఉద్యోగి సెల్ఫీ వీడియో ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులతో పాటు దూరదర్శన్ కెమెరామెన్ అచ్యుతానంద్ సాహు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో తన తల్లిని ఉద్దేశించి లైట్ అసిస్టెంట్ మొర్ముక్త్ శర్మ రికార్డు చేసిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నవంబర్ 1) డ్యూడ్ ఇది క్రికెట్.. రన్నింగ్ రేస్ కాదు! భారత్, వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఓ ఆసక్తికర సంఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. పరుగు కోసం ప్రయత్నించే క్రమంలో సమన్వయ లోపంతో హోప్ అవుటయ్యాడు. అయితే హెట్‌మైర్, హై హోప్‌లు పరుగు కోసం ఒకేవైపు పరుగెత్తడంతో డ్యూడ్ ఇది క్రికెట్.. రన్నింగ్ రేస్ కాదు’అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 2) ఈ ఎయిర్ హోస్టెస్‌కు సోషల్ మీడియా సలాం! ఆకలితో గుక్కపట్టిన ఓ ప్రయాణికురాలి బిడ్డకు పాలిచ్చి అమ్మ ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఫిలిప్పిన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ప్రతీశా అనే ఎయిర్ హోస్టెస్. దీంతో ఎవ్వరికీ తెలియని ఆమె పేరు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. 3) ఐర్లాండ్‌లో అండర్వేర్ ఉద్యమం.! అండర్వేర్ ఉద్యమం ఐర్లాండ్‌ను కుదిపేసింది. ThisIsNotConsent... అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఆ దేశ మహిళలు అండర్వేర్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓ 17 ఏళ్ల అమ్మాయిపై జరిగిన అఘాయిత్యాన్ని నిలదీశారు. 4) బాలకృష్ణ సంభ్రమాశ్చర్యం.. వైరల్! ఎవరైనా చనిపోతే దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తారు.. కానీ బాలయ్య మాత్రం అన్న మరణంతో సంభ్రమాశ్చర్యానికి లోనయ్యాడట.. ఇది ఆయన నోట నుంచి వచ్చిన మాటే. ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేసింది. 5) బుల్లెట్లు దించినవాడి కడుపులో తలపెడతావా? ఒకప్పుడు విప్లవ రాజకీయాలతో మమేకమై.. తన ఆటాపాటతో చైతన్యం తీసుకొచ్చి.. ప్రజాయుద్ధనౌకగా పేరొందిన గద్దర్.. ఇటీవల పంథా మార్చుకున్నారు. ఒకప్పుడు తన కడుపులో బుల్లెట్లు దించిన చంద్రబాబునాయుడు కడుపులోనే గద్దర్ తాజాగా తలపెట్టడంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. డిసెంబర్ 1) వాట్సాప్‌లో ఎన్నికల లొల్లి! తెలంగాణ ఎన్నికల సందర్భంగా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. ఆరోపణలు.. ప్రత్యారోపణలతో వాట్సాప్ గ్రూప్‌లు దద్దరిల్లాయి. 2) వైరల్: బుల్బుల్ బాలయ్య..! మహాకూటమి తరఫున ప్రచారం నిర్వహించిన నందమూరి బాలకృష్ణ మరోసారి నవ్వుల పాలయ్యారు. హిందీలో మాట్లాడాలని ప్రయత్నించి.. సారేజహాసె అచ్చా పాటను ఖూనీ చేయడంతో..బుల్బుల్ బాలయ్య అంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సందించారు. 3) మస్తానమ్మకు గుడ్ బై: వీడియో వైరల్ ఇంటర్నెట్ సంచలనం కంట్రీ ఫుడ్స్ మస్తానమ్మ (107) ఇక లేరన్న వార్త ఆమె అభిమానులను బాధించింది. కంట్రీఫుడ్స్ వెబ్సైట్లో గతంలో పోస్ట్ చేసిన ‘ది స్టోరీ ఆఫ్ గ్రాండ్మా ’ వీడియో వైరల్‌గా మారింది. మస్తానమ్మ జీవిత ప్రస్తానంలోని సాధక బాధకాలను ఈ వీడియోలో పొందుపర్చారు. 4) వైరలవుతున్న వజ్రాల విమానం..!? ఎమిరేట్స్ విమానయాన సంస్థ పోస్ట్ చేసిన ఓ ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకర్షించింది. ఈ ఫోటో చూసిన దగ్గర నుంచి నెటిజన్లలో ఒకటే అనుమానం.. ‘ఇది నిజమేనా’.. ‘ఇంత ఖరీదైన విమానమా’.. ‘ఎంత ఖర్చు చేశారు’ అనే ప్రశ్నలు క్యూ కట్టాయి. 5)బండ్ల గణేశా.. ఎక్కడా? బండ్ల గణేశ్‌పై సోషల్‌మీడియా వేదికగా కుళ్లు జోకులు పేలాయి. తెలంగాణ ఎన్నికల ముందు నుంచి టీవీ చానెళ్లలో హడావుడి చేస్తూ అందరిదృష్టిని ఆకర్షించిన ఈ యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ పొలిటీషియన్.. ఇప్పుడు కనబడటం లేదంటూ నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 6) వైరల్: చంద్రుడు ఐయామ్ కమింగ్ ‘‘ఔర్ మిష్టర్ చంద్రుడూ.. నీ గురించి మరిచిపోయా.. చంద్రుడూ ఐయామ్ కమింగ్ టూ ఆంధ్రప్రదేశ్.. సిద్దంగా ఉండూ’’ అంటూ సినిమాటిక్ స్టైల్లో ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ చెప్పిన డైలాగ్ నెట్టింట హల్చల్ చేసింది. -
2018: ప్రజా సంకల్పయాత్ర రౌండప్
ప్రజల సమస్యలపై అహర్నిశలూ పోరాటం చేస్తూ.. వారి మధ్యనే ఎక్కువకాలం గడుపుతూ... అందరి బంధువుగా గుర్తింపు పొందిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. గత ఏడాది నవంబర్ 6వ తేదీన ఒక్క అడుగుతో మొదలైన ఈ యాత్ర.. వందలు.. వెయ్యి.. రెండు వేలు.. మూడు వేలు దాటుకుని 3,500 కిలోమీటర్లనూ అధిగమించింది. అశేష జనవాహిని సాక్షిగా కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రను మరొకసారి గుర్తు చేసుకుంటూ 2018 రౌండప్.. 01–01–2018 ఈ ఏడాది జనవరి ఒకటి నాటికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 49వ రోజుకు చేరుకోగా, ఆరోజు చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె, మదనపల్లి నియోజకవర్గాలలో పాదయాత్ర కొనసాగింది. అప్పటికే వైఎస్సార్ కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలలో యాత్ర ముగిసింది. 02–01–2018 పాదయాత్రలో 50వ రోజున పాదయాత్ర చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలోని జమ్ములవారిపల్లి వద్ద 700 కి.మీ మైలురాయి దాటింది. 06–01–2018 పాదయాత్రలో 54వ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని కల్లూరు వద్ద ముస్లిం మైనారిటీల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. 07–01–2018 పాదయాత్రలో 55వ రోజున చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించిన వైఎస్ జగన్‌కు అసాధారణ రీతిలో స్వాగతం పలికిన ప్రజలు, అభిమానులు. చంద్రబాబు సొంత మండలంలో జగన్ వెంట ‘జన సునామీ’.. 7 కి.మీ పొడవునా అడుగడుగునా అభిమానం. మంగళహారతులు, మేళతాళాలు, కోలాటాలు, కర్రలపై నడకలు. 09–01–2018 చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం, పెనుమూరు మండల కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 10–01–2018 చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురుకుప్పం మండలంలోని నల్లవెంగనపల్లి వద్ద పాదయాత్రలో 800 కి.మీ పూర్తి చేసిన వైఎస్ జగన్. 11–01–2018 చిత్తూరు జిల్లాలోనే చంద్రగిరి నియోజకవర్గంలోని నెమ్మళ్లగుంటపల్లి వద్ద వైఎస్ జగన్.. రైతులతో ముఖాముఖిలో కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలపై చర్చించారు. 12–01–2018 చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని తిమ్మరాజుపల్లి హరిజన వాడ మీదుగా ఎన్ఆర్ కమ్మపల్లి చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కాసేపు పొలాల్లో రైతులతో కలిసి కలివిడిగా తిరిగారు. ఆ తర్వాత చంద్రబాబు అనే రైతుకు చెందిన పొలంలో మినీ ట్రాక్టర్ నడిపిన ఆయన వరి నాట్లు వేశారు. 13–01–2018 చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండల కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 17–01–2018 చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని పాపనాయుడుపేట వద్ద బీసీలతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 21–01–2018 చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం, చెర్లోపల్లి వద్ద పాదయాత్రలో 900 కి.మీ పూర్తి చేసుకున్న ప్రజా సంకల్పయాత్ర. అదే రోజు సాయంత్రం శ్రీకాళహస్తి పట్టణంలోని పెండ్లి మండపం సెంటర్లో బహిరంగ సభలో పాల్గొన్నారు. 23–01–2018 రాయలసీమలో పాదయాత్ర ముగించి కోస్తాలోకి ప్రవేశించిన ప్రజా సంకల్పయాత్ర. యాత్ర 69వ రోజున నెల్లూరు జిల్లా పీసీటీ కండ్రిగ వద్ద కోస్తాలోకి అడుగు పెట్టిన జననేత. 24–01–2018 నెల్లూరు జిల్లా నాయుడుపేటలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 28–01–2018 నెల్లూరు జిల్లా గూడూరు నియోజకవర్గ కేంద్రంలోని కోర్టు సెంటర్లో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 29–01–2018 నెల్లూరు జిల్లా వెంకటగిరి వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం శివారు వద్ద పాదయాత్రలో 1000 కి.మీ పూర్తి చేసుకున్న ప్రజాసంకల్ప యాత్ర. ఈ సందర్భంగా అక్కడి కైవల్య నది పక్కన నిర్మించిన 25 అడుగుల ‘విజయ సంకల్ప స్థూపం’ను జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిఆవిష్కరించారు.పాదయాత్రలో 1000 కి.మీ ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఇదే రోజున అన్ని చోట్లా పార్టీ శ్రేణులు ‘వాక్ విత్ జగనన్న’ కార్యక్రమం నిర్వహించాయి. 30–01–2018 నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలోని కలిచేడుకు ముందు శివారులో చేనేత కార్మికులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్ జగన్. 31–01–2018 నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరు మండల కేంద్రంలో జరిగిన బహిరంగసభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. 03–02–2018 నెల్లూరు జిల్లాలోని నెల్లూరు రూరల్ నియోజకవర్గం, సౌత్ మోపూర్‌లో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. 04–02–2018 నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ములుముడి వద్ద పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన జగన్. ఆ తర్వాత దేవరపాలెం ప్రారంభ శివారులో వైశ్యులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. 05–02–2018 నెల్లూరు జిల్లా కొవ్వూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాలెంలో బహిరంగ సభలో పాల్గొన్నజగన్. 06–02–2018 నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం, సంగం మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు. 07–02–2018 నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం, ఏఎస్ పేట మండలం, కొలిమెర్ల క్రాస్ రోడ్స్ వద్ద 1100 కి.మీ మైలురాయి దాటిన ప్రజా సంకల్పయాత్ర. 10–02–2018 నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం, దగదర్తి మండలం బోదగుడిపాడులో బహిరంగ సభలో పాలొన్న వైఎస్ జగన్. 13–02–2018 నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం, కలిగిరి మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. 14–02–2018 నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం, అదే మండలంలోని జంగాలపల్లిలో ఉదయగిరికి చెందిన హస్త కళాకారులు ఏర్పాటు చేసిన ప్రదర్శన తిలకించిన వైఎస్ జగన్. హస్త కళాకారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. 15–02–2018 నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని రేనుమాలలో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ జగన్. 16–02–2018 ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గం, లింగసముద్రం మండలంలోని రామకృష్ణాపురం వద్ద పాదయాత్రలో 1200 కి.మీ ప్రస్థానం చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 18–02–2018 ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని అదే మండల కేంద్రంలో వైఎస్ జగన్ బహిరంగ సభలో పాల్గొన్నారు. 20–02–2018 ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలోని తిమ్మపాలెం శివారులో రైతులతో ముఖాముఖిలో పాల్గొన్న వైఎస్ జగన్. 24–02–2018 ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. 25–02–2018 ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గం నందనమారెళ్ల వద్ద పాదయాత్రలో 1300 కి.మీ పూర్తి చేసుకున్న వైఎస్ జగన్. 26–02–2018 ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం, పొదిలి మండల కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 28–02–2018 ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలోని చీమకుర్తిలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. మరోవైపు అదే రోజున ఆయన తన సుదీర్ఘ పాదయాత్రలో 100 రోజులు పూర్తి చేసుకున్నారు. 03–03–2018 ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలోని తాళ్లూరు మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. అదే విధంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకు అదే నెల 5వ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ధర్నాలో పాల్గొనేందుకు వెళ్తున్న పార్టీ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలకు ఆయన ఆరోజు దిశా నిర్దేశం చేశారు. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో శివరాంపురం వద్ద సమావేశమైన జననేత ఆ తర్వాత వారి వాహనశ్రేణికి జెండా ఊపి, ఢిల్లీ యాత్రను ప్రారంభించారు. 04–03–2018 ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గం, అదే మండల కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 05–03–2018 ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలోని నాగులపాడు వద్ద 1400 కి.మీ మైలురాయి దాటిన జననేత పాదయాత్ర. 06–03–2018 ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం, ఇంకొల్లు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. 10–03–2018 ప్రకాశం జిల్లా చీరాలలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 12–03–2018 ప్రకాశం జిల్లాలో యాత్ర ముగించుకుని గుంటూరు జిల్లాలో అడుగుపెట్టిన ప్రజా సంకల్పయాత్ర. 110వ రోజు పాదయాత్రలో భాగంగా బాపట్ల నియోజకవర్గంలోని స్టూవర్టుపురం వద్ద జిల్లాలోకి ప్రవేశించింది. 14–03–2018 గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం ములుకుదురు వద్ద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర 1500 కి.మీ మైలురాయిని దాటింది. 17–03–2018 గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కాకుమాను శివారులో రైతులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్ జగన్. 19–03–2018 గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని కొమ్మూరు వద్ద ప్రజాసంకల్ప మానవహారంలో పాల్గొన్న వైఎస్ జగన్. అదే రోజు సాయంత్రం పెదనందిపాడులో బహిరంగ సభలో పాల్గొన్నారు. 21–03–2018 గుంటూరు జిల్లా చిలకలూరిపేటలోని కళామందిర్ సెంటర్లో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 24–03–2018 సాక్షి పత్రిక 10 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుంటూరు జిల్లా, చిలకలూరిపేట నియోజకవర్గంలోకి ఇర్లపాడు క్రాస్ వద్ద వైఎస్ జగన్ ప్రత్యేకంగా కేక్ కట్ చేశారు. 27–03–2018 గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని పలుదేవర్లపాడు వద్ద పాదయాత్రలో 1600 కి.మీ పూర్తి చేసుకున్న వైఎస్ జగన్. 28–03–2018 గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని గుడిపూడి ప్రారంభ శివారులో బీసీలతో ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. 29–03–2018 గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 31–03–2018 గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గం, ఫిరంగిపురం మండలం, పేరేచర్లలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. 03–04–2018 గుంటూరు నగరంలోని గుంటూరు తూర్పు నియోజకవర్గం పరిధిలో ఉన్న కింగ్ హోటల్ సెంటర్ వద్ద బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 04–04–2018 గుంటూరు రూరల్ మండలం (ప్రత్తిపాడు నియోజకవర్గం) లోని మధ్యాహ్న భోజన శిబిరం వద్ద వైఎస్ జగన్‌ను కలిసిన హోదా సాధన సమితి నాయకులు. సమితి నేత చలసాని శ్రీనివాస్ నేతృత్వంలో జననేతను కలిసిన నాయకులు. హోదా కోసం నాలుగేళ్లుగా నిరంతర పోరాటం చేసిన, చేస్తున్న వైఎస్సార్సీపీని అభినందించిన వారు, హోదా సాధన కోసం పోరాడుతున్న పార్టీలు, సంఘాలన్నింటినీ కలుపుకుని నేతృత్వం వహించాలని జననేతకు విజ్ఞప్తి చేశారు. 07–04–2018 గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గం, అదే మున్సిపల్ పరిధిలోని సుల్తానాబాద్ వద్ద పాదయాత్రలో 1700 కి.మీ పూర్తి చేసుకున్న జననేత. 10–04–2018 గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం (పట్టణం)లోని ఒక స్కూల్ గ్రౌండ్స్‌లో చేనేత కార్మికులతో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. 11–04–2018 గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్న శ్రీ వైయస్ జగన్‌ను కలిసిన మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌కు చెందిన సతీష్ వైఎస్సార్సీపీలో చేరారు. అదే రోజున తాడేపల్లి మండలంలోని ఉండవల్లిలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 14–04–2018 పాదయాత్ర 136వ రోజున కనకదుర్గమ్మ వారధి మీదుగా కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్. ఆయన వెంట జన ప్రభంజనం కొనసాగడంతో కంపించిన వంతెన. వారధి వద్ద జగన్‌ను కలిసిన టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైఎస్సార్సీపీలో చేరారు. అదే రోజున సాయంత్రం విజయవాడ నగర పరిధిలోని విజయవాడ పశ్చిమం నియోజకవర్గం, చిట్టినగర్ సెంటర్లో బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు. 17–04–2018 కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 18–04–2018 కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం, అదే మండలంలోని గణపవరం వద్ద పాదయాత్రలో వైఎస్ జగన్ 1800 కి.మీ. పూర్తి చేశారు. 21–04–2018 కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 22–04–2018 రాజీనామా చేసిన పార్టీ ఎంపీలతో పాటు, రీజినల్ కో-ఆర్డినేటర్లతో కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని అగిరిపల్లి శిబిరంలో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. 24–04–2018 కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ కేంద్రంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 28–04–2018 కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఉయ్యూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. 29–04–2018 కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని తాడంకి వద్ద తన ప్రస్థానంలో 1900 కి.మీ పూర్తి చేసుకున్న జననేత ప్రజా సంకల్పయాత్ర. 30–04–2018 ఎన్టీఆర్ స్వగ్రామమైన నిమ్మకూరులో పర్యటించిన వైఎస్ జగన్. ఘన నీరాజనం పలికిన ప్రజలు. గ్రామ సమస్యలపై స్వయంగా వచ్చి ఫిర్యాదు చేసిన ఎన్టీఆర్ బంధువులు. 01–05–2018 కృష్ణా జిల్లా మచిలీపట్నం నియోజకవర్గం (పట్టణం)లో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 02–05–2018 కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలంలోని పొట్లపాడులో విశ్వబ్రాహ్మణులతో ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. 05–05–2018 కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 06–05–2018 కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలోని కౌతవరం, గుడ్లవల్లేరు మధ్య న్యాయవాదులతో జననేత ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. 07–05–2018 కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నవైఎస్ జగన్. 09–05–2018 కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం, పెరికగూడెంలో దళితులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్ జగన్. 10–05–2018 కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గంలో పర్యటనలో ఉన్న జననేతను మైలవరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేత వసంత కృష్ణప్రసాద్‌తో పాటు, ఆయన అనుచరులు వైఎస్సార్సీపీలో చేరారు. 12–05–2018 కృష్ణా జిల్లా కైకలూరులో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 13–05–2018 కృష్ణా జిల్లాలో యాత్ర ముగించుకున్న జననేత కలకర్రు వద్ద పశ్చిమ గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టారు. 14–05–2018 ఏలూరు నియోజకవర్గం, వెంకటాపురం వద్ద పాదయాత్రలో 2000 కి.మీ పూర్తి చేసుకున్న వైఎస్ జగన్. 15–05–2018 పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో రైతులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్ జగన్ 18–05–2018 పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం, నల్లజెర్లలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 19–05–2018 పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం ప్రకాశరావుపాలెం వద్ద గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ జగన్ పాల్గొన్నారు. 21–05–2018 పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని బ్రహ్మానందరెడ్డి మార్కెట్ సెంటర్లో జరిగిన బహిరంగ సభలో జననేత పాల్గొన్నారు. 22–05–2018 పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని పిప్పర వద్ద 2100 కి.మీ పాదయాత్ర పూర్తి చేసుకున్న విపక్షనేత. 23–05–2018 పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలోని గణపవరం మండల కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 25–05–2018 పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం, ఆకివీడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వైఎస్ జగన్ హాజరయ్యారు. 27–05–2018 పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 30–05–2018 పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వద్ద పాదయాత్రలో 2200 కి.మీ పూర్తి చేసుకున్న వైఎస్ జగన్. అదే రోజు పట్టణంలో బహిరంగ సభలో పాల్గొన్న జననేత. 01–06–2018 పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభకు హాజరైన వైఎస్ జగన్. 03–06–2018 పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం, పెనుగొండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ పాల్గొన్నారు. 05–06–2018 పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 09–06–2018 పశ్చిమ గోదావరి జిల్లా నిడుదవోలు నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 10–06–2018 పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం, మల్లవరం వద్ద బీసీలతో ఆత్మీయ సమ్మేళనం. 11–06–2018 పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని నందమూరు క్రాస్ వద్ద పాదయాత్రలో 2300 కి.మీ పూర్తి చేసుకున్న జననేత. 12–06–2018 రైల్ కమ్ రోడ్ వంతెన మీదుగా తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర. 4.25 కి.మీ పొడవైన వంతెనపై అశేష జనవాహిని మధ్య రాజమండ్రిలోకి ప్రవేశించిన జననేత.అదే రోజు సాయంత్రం రాజమండ్రి నగరంలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద బహిరంగ సభ. 15–06–2018 తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం రావులపాలెంలో బహిరంగ సభ. 18–06–2018 తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 20–06–2018 తూర్పు గోదావరి జిల్లా రాజోలులో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 21–06–2018 తూర్పు గోదావరి జిల్లా లక్కవరం క్రాస్ వద్ద పాదయాత్రలో 2400 కి.మీ పూర్తి చేసుకున్న జననేత. 26–06–2018 తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 27–06–2018 200వ రోజుకు చేరుకున్న పాదయాత్ర. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో జననేత ప్రజా సంకల్ప యాత్ర. 30–06–2018 తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 07–07–2018 తూర్పు గోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్ పాదయాత్ర. 08–07–2018 తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం, రాయవరం మండలం, పసలపూడి వంతెన వద్ద పాదయాత్రలో 2500 కి.మీ ప్రస్థానం చేరుకున్న జననేత. 09–07–2018 తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం, రాయవరం మండల కేంద్రంలో బహిరంగ సభ. 11–07–2018 మాజీ మంత్రి మహీధర్‌రెడ్డి వైఎస్సార్సీపీలో చేరిక. 14–07–2018 తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, పెదపూడి మండలంలోని గొల్లల మామిడాడలో బహిరంగ సభ. 18–07–2018 తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నియోజకవర్గంలోని సంతచెరువు ఎస్ఆర్కే సెంటర్ వద్ద బహిరంగ సభ. ఆ తర్వాత నగరంలో పర్యటన. 21–07–2018 తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, అచ్చంపేట జంక్షన్లో మత్స్యకారులతో ఆత్మీయ సమ్మేళనం. 25–07–2018 తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం, వేములవారి సెంటర్లో బహిరంగ సభ. 28–07–2018 ప్రజా సంకల్పయాత్రలో 100వ నియోజకవర్గం అయిన తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట చేరుకున్న వైఎస్ జగన్. సరిగ్గా అదే పట్టణంలో పాదయాత్రలో 2600 కి.మీ పూర్తి చేసుకున్న జననేత. 31–07–2018 తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 05–08–2018 తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం, కత్తిపూడిలో బహిరంగ సభ. 11–08–2018 తూర్పు గోదావరి జిల్లా తుని నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. మరోవైపు పట్టణంలోని సినిమా రోడ్డు వద్ద పాదయాత్రలో 2700 కి.మీ ప్రస్థానం చేరుకున్న వైఎస్ జగన్. 14–08–2018 విశాఖ జిల్లాలోకి ప్రవేశించిన ప్రజా సంకల్పయాత్ర. నర్సీపట్నం నియోజకవర్గంలోకి అడుగు పెట్టిన జననేత. 18–08–2018 విశాఖ జిల్లా నర్సీపట్నంలో బహిరంగ సభలో పాల్గొన్న వైఎస్ జగన్. 20–08–2018 విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం, అదే మండల కేంద్రంలో బహిరంగ సభ. 24–08–2018 విశాఖ జిల్లా యలమంచిలి నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ.పట్టణంలోని కోర్టు సెంటర్ వద్ద పాదయాత్రలో 2800 కి.మీ పూర్తి చేసుకున్న జననేత. 29–08–2018 విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 30–08–2018 250వ రోజుకు చేరుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర. విశాఖ జిల్లా అనకాపల్లిలో జననేత పర్యటన. 01–09–2018 విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 03–09–2018 విశాఖ జిల్లా మాడుగుల నియోజకవర్గం, కె.కోటపాడులో బహిరంగ సభ. 05–09–2018 విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సబ్బవరం మండలం కేంద్రంలో బహిరంగ సభ. మరోవైపు అదే మండలంలోని పెదనాయుడుపాలెం పాత రోడ్డు వద్ద పాదయాత్రలో 2900 కి.మీ. పూర్తి చేసుకున్న జననేత. 09–09–2018 విశాఖపట్నం–ఉత్తరం నియోజకవర్గం, కంచరపాలెం, మెట్టు సెంటర్ వద్ద బహిరంగ సభ. 10–09–2018 విశాఖపట్నం–తూర్పు నియోజకవర్గంలోని విజ్ఞాన్ కళాశాల వేదికగా బ్రాహ్మణులతో ఆత్మీయ సమ్మేళనం. 12–09–2018 గ్రేటర్ విశాఖ పరిధి, విశాఖపట్నం–తూర్పు నియోజకవర్గం అరిలోవ వద్ద ముస్లిం మైనారిటీలతో ఆత్మీయ సమ్మేళనం. 17–09–2018 విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం, ఆనందపురం మండల కేంద్రంలో బహిరంగ సభ. 24–09–2018 విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన ప్రజా సంకల్ప యాత్ర. ఎస్.కోట నియోజకవర్గంలోకి అడుగు పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొత్తవలస మండలం, దేశపాత్రునిపాలెం వద్ద పాదయాత్రలో 3000 కి.మీ ప్రస్థానం చేరిన జననేత పాదయాత్ర. 30–09–2018 విజయనగరం నియోజకవర్గంలో విశ్వబ్రాహ్మణులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న వైఎస్ జగన్. 01–10–2018 విజయనగరం పట్టణంలోని మూడు లాంతర్ల సెంటర్లో బహిరంగ సభ. 03–10–2018 విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గ కేంద్రంలోని మొయిద జంక్షన్ వద్ద బహిరంగ సభ. 07–10–2018 విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం, గుర్ల మండల కేంద్రంలో బహిరంగ సభ. 08–10–2018 విజయనగరం జిల్లా గుర్ల మండలం, ఆనందపురం క్రాస్ వద్ద పాదయాత్రలో 3100 కి.మీ మైలురాయి దాటిన జననేత. 10–10–2018 విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 17–10–2018 విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 22–10–2018 విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 24–10–2018 విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గం, అదే మండలంలోని బాగువలస వద్ద పాదయాత్రలో 3200 కి.మీ పూర్తి చేసుకున్న జననేత. 25–10–2018 విశాఖపట్నం విమానాశ్రయంలోని విఐపీ లాంజ్‌లో జగన్‌పై హత్యాయత్నం. 12–11–2018 17రోజుల విరామం తర్వాత తిరిగి పాదయాత్రలో పాల్గొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని పాయకపాడు నుంచి యాత్ర పునః ప్రారంభం. 17–11–2018 విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. విశాఖలో హత్యాయత్నం తర్వాత తొలిసారి సభలో మాట్లాడిన వైఎస్ జగన్. 18–11–2018 300వ రోజుకు చేరుకున్న ప్రజా సంకల్ప యాత్ర. విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గంలో జననేత పర్యటన. 20–11–2018 విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 24–11–2018 విజయనగరం జిల్లా కురుపాం నియోజకవర్గం, జియ్యమ్మవలస మండలం తురకనాయుడు వలస శివారులో పాదయాత్రలో 3300 కి.మీ పూర్తి చేసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర. 25–11–2018 శ్రీకాకుళం జిల్లాలోకి ప్రవేశించిన ప్రజా సంకల్ప యాత్ర. జిల్లాలోని వీరఘట్టం మండలం కడకెల్ల వద్ద పాలకొండ నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన జననేత. 28–11–2018 శ్రీకాకుళం జిల్లా పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 03-12–2018 శ్రీకాకుళం జిల్లా రాజాం నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 0612–2018 శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం, చిలకపాలెంలో బహిరంగ సభ. మరోవైపు ఎచ్చెర్ల వద్ద పాదయాత్రలో 3400 కి.మీ పూర్తి చేసుకున్న వైఎస్ జగన్. 08–12–2018 శ్రీకాకుళం పట్టణంలోని 7 రోడ్ల కూడలి వద్ద బహిరంగ సభలో పాల్గొన్న జననేత. 11–12–2018 శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 16–12–2018 శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. 22–12–2018 శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ కేంద్రంలో బహిరంగ సభ. అదే మండలంలోని రావివలస శివారులో పాదయాత్రలో 3500 కి.మీ ప్రస్థానం చేరిన ప్రజా సంకల్పయాత్ర. 24–12–2018 శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం, మెళియాపుట్టి మండలం కేంద్రంలో బహిరంగ సభ. 30–12–2018 శ్రీకాకుళం జిల్లా పలాస–కాశీబుగ్గలో బహిరంగ సభ. ఇతర వివరాలు డిసెంబరు 30వ తేదీ, ఆదివారం నాటికి 333వ రోజుకు చేరుకున్న ప్రజా సంకల్ప యాత్ర. డిసెంబరు 29వ తేదీ, శనివారం సాయంత్రానికి 3550.3 కి.మీ నడిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 12 జిల్లాలలో పూర్తి చేసుకుని చివరిదైన 13వ జిల్లాలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్ర 135 నియోజకవర్గాలలో పూర్తైన పాదయాత్ర. 136వ నియోజకవర్గం ‘పలాస’లో కొనసాగుతోంది. మొత్తం 123 సభలు, సమావేశాలు 42 ఆత్మీయ సమ్మేళనాలు -
సంచలనాలు, వివాదాలు.. కోలీవుడ్ 2018
సందేశాలు, సాంకేతిక అంశాలు పక్కన పెడితే.. క్షణం తీరికలేని దినచర్యలతో ఉక్కిరిబిక్కిరయ్యే సగటు మనిషి కాస్త స్వాంతన కోసం వచ్చేది సినిమాకే. వారికి రెండు గంటల పాటు ఆహ్లాదాన్ని అందించడమే సినిమా ప్రధాన లక్ష్యం. అందులో ఎంత వరకు చిత్ర పరిశ్రమ సక్సెస్ అయ్యిందన్నది ప్రశ్నార్థకమే. ఈ ఏడాది కోలీవుడ్ మనుగడ కూడా అలాగే గడిచిపోయింది. కోలీవుడ్ చిత్రపరిశ్రమ 2018లో జీఎస్టీ పన్ను విధానం, చిత్ర పరిశ్రమ సమ్మె వంటి సంఘటనలను ఎదుర్కొంది. దాదాపు 170 చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది విజయాల శాతం కొంచెం (10 శాతం) ఎక్కువే అన్నది సంతోషించాల్సిన విషయం. పెద్దా, చిన్న చిత్రాల్లో విజయాలపై అంచనాలు పెట్టుకున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాయి. ఇక కొన్ని చిత్రాలయితే పెట్టిన పెట్టుబడులను కూడా తిరిగి రాబట్టలేకపోయాయి. దెయ్యం ఇతివృత్తాలతో హర్రర్, థ్రిల్లర్ కథా చిత్రాలు వెల్లువెత్తాయి. తక్కువ ఖర్చు, అధిక లాభార్జన కారణం. చిత్ర జయాపజయాల విశ్లేషణ గురించి ప్రముఖ పంపిణీదారుడు తిరుపూర్ సుబ్రమణియం మాట్లాతూ ఈ ఏడాది భారీ బడ్జెట్, చిన్న బడ్జెట్ చిత్రాలన్ని కలిసి 170 విడుదలైనా విజయాల సంఖ్య తక్కువేనన్నారు. కొన్ని చిత్రాలైతే నిర్మాణ వ్యయాన్ని సైతం రాబట్టలేక నష్టాలనే మిగిల్చాయన్నారు. చెన్నైలో ‘2.ఓ’దే అగ్రస్థానం ఈ ఏడాది అధిక చిత్రాలు విడుదలైనా, చాలా తక్కువ చిత్రాలే లాభాలను తెచ్చిపెట్టాయని చెప్పారు. తమిళనాడు వ్యాప్తంగా చూసుకుంటే విజయ్ నటించిన సర్కార్ చిత్రమే అత్యధిక వసూళ్లను రాబట్టింది. అయితే చెన్నై వరకూ అగ్రస్థానం రజనీకాంత్ నటించిన 2.ఓ చిత్రానిదే. ఇక ప్రపంచ వ్యాప్తంగా వసూళ్లలో 2.ఓ చిత్రమే సత్తా చాటుకుంది. ఇక నటుడు కార్తీ నటించిన కడైకుట్టి సింగం వసూళ్ల సాధనలో మూడోస్థానంలో నిలిచింది. విశాల్ నటించిన ఇరుంబుతిరై, విజయ్‌సేతుపతి నటించిన 96, నయనతార నటించిన కోలమావు కోకిల, ఇమైకా నోడిగళ్ వంటి చిత్రాలు మంచి లాభాలను తెచ్చి పెట్టాయి. చిన్న చిత్రాల్లో అనూహ్య విజయాన్ని సాధించిన చిత్రం రాక్షసన్. ఇకపోతే సక్సెస్ అనిపించుకున్న చిత్రాల్లో గులేబకావళి, ఒరు నల్లనాళ్ పాత్తు సొల్రేన్, నాచియార్, కాట్రిన్ మొళి, స్కెచ్, కలగలప్పు 2, ఒరు కుప్పకథై, కాలా, టిక్ టిక్ టిక్, ప్యార్ ప్రేమ కాదల్, యూటర్న్, వడచెన్నై, మారి–2 వంటి చిత్రాలు ఉన్నాయి. సూపర్‌స్టార్ నటించిన కాలా, కమల్‌హాసన్ నటించిన విశ్వరూపం– 2 వంటివి అంచనాలు అందుకోలేకపోయాయి. సంచలనాలు, వివాదాలు పలు సంచలనాలకు, వివాదాలకు ఈ ఏడాది నిలయం అయ్యిందనే చెప్పాలి. ఏడాది ఆరంభంలోనే జనవరి 15న గీత రచయిత వైరముత్తు ఆండాళ్ గురించి చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారితీశాయి. వైరముత్తుపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇక సంచలన నటి అమలాపాల్ ఖరీదైన కారును కొనుగోలు చేసి పాండిచ్చేరిలో రిజిస్టర్ చేసి వివాదాల్లో చిక్కుకుంది. జనవరి 28న ఈ వ్యవహారంలో కొచ్చిలో ఆమె అరెస్ట్ అయి తరువాత విడుదలైంది. అదే నెల 31న ఒక వ్యక్తి లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లోకి ఎక్కింది. గాయని చిన్మయి గీత రయియిత వైరముత్తు, నటుడు రాధారవిలపై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు వివాదంగా మారాయి. ఇక నటి శ్రీరెడ్డి దర్శకుడు ఏఆర్ మురుగదాస్, నటుడు రాఘవ లారెన్స్ వంటివారిపై కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సంచలనం సృష్టించాయి. కమల్‌హాసన్ ఫిబ్రవరి 21న మక్కళ్ నీది మయ్యం పేరుతో రాజకీయ పార్టీని ప్రారంభించారు. డిజిటల్ సంస్థలు అధిక ధరలను వసూలు చేయడాన్ని ఖండిస్తూ నిర్మాతల మండలి 47 రోజుల పాటు సమ్మె చేయడంతో చిత్ర షూటింగ్‌లు రద్దు కొత్త చిత్రాల విడుదలను నిలిపేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహ్మాన్ ఏప్రిల్ 13న శ్రీదేవి జాతీయ అవార్డుకు ఎంపికయ్యారు. జూలై 15న పైయనూర్‌లో ఫెఫ్సీ ఆధ్వర్యంలో స్టూడియోనే ప్రారంభించారు. ఆగస్ట్ 29న విశాల్ ప్రజా సంక్షేమ సంఘం పేరుతో సంఘాన్ని ప్రారంభించారు. అక్టోబర్ 20న నటుడు అర్జున్ తనను లైంగిక వేధింపులకు గురి చేశాడంటూ నటి శ్రుతీహరిహరన్ ఆరోపణలు చేసింది. రాజకీయ దుమారం నవంబర్ 8న నటుడు విజయ్ నటించిన సర్కార్ చిత్రంలో ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకాలను విమర్శించారంటూ అన్నాడీఎంకే నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గజ తుపాను బాధితులను ఆదుకోవడానికి సినీలోకం తరలి వచ్చింది. ఇక సర్కార్ చిత్ర వ్యవహారంలో దర్శకుడు ఏఆర్ మురుగదాస్ క్షమాపణ చెప్పాలంటూ ప్రభుత్వ తరఫు న్యాయవాది చెన్నై హైకోర్టులో వాదనలు వినిపించారు. అందుకు ససేమిరా అన్న ఏఆర్ మురుగదాస్ కేసును ఎదుర్కొంటానని మరు పిటిషన్లో పేర్కొన్నారు. అధిక చిత్రాల హీరో ఈ ఏడాది అధిక చిత్రాల్లో నటించిన కథానాయకుడిగా విజయ్‌సేతుపతి నిలిచారు. జీవీ.ప్రకాశ్, ప్రభుదేవా, కార్తీక్ గౌతమ్,విక్రమ్‌ప్రభు,విక్రాంత్ ఉన్నారు. రజనీ కాంత్, విక్రమ్, విశాల్, ధనుష్, జయంరవి, విష్ణువిశాల్, అధర్వ, అరవిందస్వామి రెండు చిత్రాలే చేశారు. కమల్, సూర్య, విజయ్, శివకార్తి్తకేయన్, కార్తీ, శింబు, జీవా ఒక్క చిత్రంతోనే సరి పెట్టుకున్నారు. హీరోయిన్లలో కీర్తీదే అధిక్యం హీరోయిన్లలో ఈ ఏడాది అధిక చిత్రాల్లో నటించిన రికార్డు యువనటి కీర్తీసురేశ్‌దే. ఈ బ్యూటీ ఏకంగా 5 చిత్రాల్లో నటించింది. వీటిలో మహానటి(నడిగైయార్ తిలగం) చిత్రం కీర్తీ సినీ కెరీర్లో గొప్ప మైలురాయిగా నిలిచింది. ఇక నటి ఐశ్వర్యరాజేశ్, వరలక్ష్మీశరత్‌కుమార్ కూడా తలా ఐదు చిత్రాల్లో నటించారు. నటి సమంత, సాయిషా, జ్యోతిక 3 చిత్రాలు చేశారు. అగ్రనటి నయనతార, త్రిష, హన్సిక, అమలాపాల్, సాయిపల్లవి రెండేసి చిత్రాల్లో నటించారు. తమన్నా, అంజలి ఒక్కో చిత్రానికే పరిమితం అయ్యారు. కాగా నటి త్రిషకు ‘96’చిత్రం అనూహ్య విజయాన్ని అందించింది. అదే విధంగా సూపర్‌స్టార్‌తో నటించాలనే తన చిరకాల కోరిక ఏడాది ‘పేట’చిత్రంతో నెరవేరింది. 2018 త్రిషకు మరచిపోలేని అనుభవాన్ని మిగిల్చింది. దివికేగిన తారలు ఇక విషాద కరమైన సంఘటన ఆగస్ట్ 7న డీఎంకే అధినేత, సినీ రచయిత కరుణానిధి తుదిశ్వాస విడిచారు. నిర్మాత పట్టియల్ శేఖర్, నటుడు దేసింగురాజా, కొల్లం అజిత్, హాస్య నటుడు నీలు, సిలోన్ మనోహర్, నటి శ్రీదేవి, కృష్ణకుమారి, ఎడిటర్ పీఎస్.నాగరాజ్, ఎడిటర్ అనిల్‌మల్నాడ్, ఎడిటర్ శేఖర్, చాయాగ్రహకుడు సురేశ్‌కుమార్, సీవీ.రాంజేంద్రన్, గాయని ఎంఎస్. రాజ్యలక్ష్మి, రచయిత బాలకుమార్, సీనియర్ దర్శక నిర్మాత ముక్తాశ్రీనివాసన్, దర్శకుడు ఆర్.త్యాగరాజన్, గాయని రాణి, దర్శకుడు శివకుమార్, నటుడు వెల్లైసుబ్బయ్య, నటుడు రాకెట్ రామనాథన్, నిర్మాత ఎంజీ.శేఖర్, నటుడు కోవై.సెంథిల్, నటుడు కెప్టెన్‌రాజు వంటి సినీ ప్రముఖులను చిత్ర పరిశ్రమ కోల్పోయింది. -
రసవత్తరం.. ఈయేటి భారతం
2018 సంవత్సరం భారత రాజకీయాల్లో పలు మార్పులకు నాంది పలికింది. సంవత్సర ఆరంభంలో బీజేపీ దేశవ్యాప్తంగా జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినా.. సంవత్సరాంతానికి వచ్చేసరికి మూడు రాష్ట్రాల్లో పరాజయంతో కుదేలైంది. అయితే.. బీజేపీకి జరిగిన నష్టాన్ని అందిపుచ్చుకోవడంలో మాత్రం కాంగ్రెస్ అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ప్రాంతీయపార్టీలు తమ సత్తాచాటుకోవడం దేశ రాజకీయాల్లో మరో మలుపునకు నాంది పలికింది. మరోవైపు ప్రధానిగా మోదీ జనాదరణ తగ్గకపోయినా.. వివిధ రాజకీయ పరిణామాల కారణంగా ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి భంగపాటు తప్పలేదు. ఈ ఏడాది తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. మార్చి నాటికి బీజేపీ, దాని మిత్రపక్షాలు 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉండగా, సంవత్సరం చివరకు వాటి సంఖ్య 16కు పడిపోయింది. 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయంగా ఎదురులేని స్థితి నుంచి బీజేపీ జోరు నెమ్మదించింది. ఒకప్పటి పాలకపక్షం కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో కేవలం 44 సీట్లకు పరిమితమైనా.. ఇప్పుడిప్పుడే కాస్త పుంజుకుంటోంది. పదిహేనేళ్లుగా అధికారంలో లేని మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో మళ్లీ ప్రభుత్వాలు ఏర్పాటుచేసింది. రఫేల్ యుద్ధవిమానాల కొనుగోలులో ఎన్డీయే ప్రభుత్వానికి సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇవ్వడం వంటి పరిణామాలు బీజేపీకి అనుకూలంగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వచ్చే లోక్‌సభ ఎన్నికలపై పలు మీడియా సంస్థలు జరిపిన సర్వేల ప్రకారం.. మళ్లీ ఎన్డీఏకే అధికారం రావచ్చనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే.. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మారుతున్న రాజకీయ పరిణామాల వల్ల ఫలితాన్ని ఇప్పుడే ఊహించడం కష్టమేననే భావన వ్యక్తమవుతోంది. మొదట బీజేపీ విజయ పరంపర ఈ ఏడాది ఫిబ్రవరి చివర్లో.. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయాలు సాధించింది. త్రిపురలో కమ్యూనిస్టుల బలమైన కోటను కూల్చి మరీ అధికారాన్ని కమలనాథులు కైవసం చేసుకున్నారు. త్రిపుర తొలి కాషాయపార్టీ సీఎంగా విప్లవ్ కుమార్ దేవ్ ప్రమాణం చేశారు. మేఘాలయాలో కాంగ్రెస్ పరాజయంపాలైంది. నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ), యునైటెడ్ డెమొక్రాటిక్ పార్టీ అధికారంలోకి వచ్చాయి. ఎన్పీపీకి చెందిన కన్రాడ్ సంగ్మా సీఎం అయ్యారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పక్షమైన నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) ఓడిపోయింది. బీజేపీతో కలిసి నేషనలిస్ట్ డెమొక్రాటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ) మెజారిటీ సీట్లు సాధించింది. ముఖ్యమంత్రిగా ఎన్డీపీపీ నేత నెయిఫియూ రియో ప్రమాణం చేశారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈశాన్య భారతంలో బీజేపీకి మొదలైన విజయాలు ఇలా ముందుకు కొనసాగాయి. కర్ణాటకతో కథ మారింది మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పక్షమైన కాంగ్రెస్ మళ్లీ మెజారిటీ సీట్లు సాధించలేకపోయింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలు దక్కపోయినా.. బీజేపీ అసెంబ్లీలో అతిపెద్ద పక్షంగా అవతరించింది. గవర్నర్ ఆహ్వానంపై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన బీజేపీ మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్ప శాసనసభలో మెజారిటీ నిరూపించుకోలేక వారం రోజుల వ్యవధిలోనే రాజీనామా చేశారు. జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామిని సీఎంగా చేసేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. దీంతో కుమారస్వామి నేతృత్వంలో జేడీఎస్–కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తమకు వచ్చిన సీట్లలో సగం కూడా గెలుచుకోని జేడీఎస్‌తో చేతులు కలిపేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సిద్ధమవడంతో.. కూటమి సర్కారు ఏర్పాటైంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరే సందర్భంగా.. బీజేపీ వ్యతిరేకపార్టీలు (జాతీయ, ప్రాంతీయ) బెంగళూరులో బలప్రదర్శన చేశాయి. సోనియా, రాహుల్లతోపాటుగా మమతా బెనర్జీ (తృణమూల్), కేజ్రీవాల్ (ఆప్), చంద్రబాబు (టీడీపీ) అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), మాయావతి (బీఎస్పీ) సహా సీపీఎం, సీపీఐ నాయకులు సహా అనేక మంది ప్రతిపక్షాల నేతలు కుమారస్వామి ప్రమాణానికి హాజరయ్యారు. ఇంత మంది ప్రతిపక్ష నేతలు ఒకే వేదిక మీద కనిపించడం 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత ఇదే మొదటిసారి. దీంతో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అన్ని సీట్లలో బీజేపీపై ప్రతిపక్షాల తరఫున ఒకే అభ్యర్థి ఉండాలనే ప్రతిపాదన ముందుకొచ్చింది. అప్పటినుంచి ఈఅంశం ఆధారంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఒకే బీజేపీ వ్యతిరేక మహాఘట్ బంధన్ ఏర్పాటుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఐదు రాష్ట్రాల్లో ఎదురుదెబ్బ నవంబర్, డిసెంబర్ నెలల్లో ఐదు రాష్ట్రాల్లో (మధ్యప్రదేశ్, రాజస్తాన్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, మిజోరం) జరిగిన అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి వ్యతిరేక ఫలితాలు ఇచ్చాయి. పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లో ఈ పార్టీ అధికారం కోల్పోయింది. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు భూపేష్ బాఘేల్ సీఎం అయ్యారు. మధ్యప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కన్నా బీజేపీ ఒక శాతం ఓట్లు ఎక్కువ సాధించినా.. కాంగ్రెస్ పార్టీయే ఎక్కువ సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వం ఏర్పాటుకు తగినన్ని సీట్లు రాకపోవడంతో బీఎస్పీ, ఎస్పీ, ఇండిపెండెంట్ల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ సీఎంగా ప్రమాణం చేశారు. బీజేపీకి 109 సీట్లు వచ్చాయి. సీఎం సీటుకోసం యువనేత జ్యోతిరాదిత్య సింధియా పోటీపడినప్పటికీ.. వయసు, అనుభవం, రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా కమల్‌నాథ్‌కే ఈ పీఠం దక్కింది. రాజేను తిరస్కరించిన రాజస్తాన్ రాజస్తాన్‌లో ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న బీజేపీకి ప్రజలు అధికారపీఠం నుంచి కిందకు దించారు. రాజేపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉంటుందనుకున్నప్పటికీ.. బీజేపీకి చెప్పుకోదగ్గ సంఖ్యలో సీట్లు వచ్చాయిగానీ.. ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయలేకపోయింది. ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన 101 సీట్లు రాకున్నా చిన్న పార్టీలు, ఇతరుల మద్దతుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సీఎం సీటును ఆశించిన పీసీసీ అధ్యక్షుడు సచిన్ పైలట్‌కు ఆశాభంగం తప్పలేదు. గతంలో రెండుసార్లు సీఎంగా పనిచేసిన సీనియర్ నేత అశోక్ గహ్లోత్‌కే అధిష్టానం సీఎల్పీ నాయకత్వం అప్పగించింది. డిప్యూటీ సీఎంగా ఉండేందుకు పైలట్ అంగీకరించడంతో రాష్ట్ర కాంగ్రెస్‌లో నాయకత్వం కోసం రగిలిన వివాదం సమసిపోయింది. మొత్తంమీద కాంగ్రెస్ కన్నా ఒక శాతం తక్కువ ఓట్లు సంపాదించిన బీజేపీ 73 సీట్లతో సరిపెట్టుకుంది. ప్రతి ఐదేళ్లకూ పాలకపక్షాన్ని మార్చే ఆనవాయితీని ఈసారి కూడా రాజస్తాన్ కొనసాగించింది. ‘చే’జారిన ఈశాన్యం ఐదేళ్లుగా ఈశాన్యంలో ఒక్కో రాష్ట్రాన్ని కోల్పోతున్న కాంగ్రెస్.. ఈ ప్రాంతంలో అధికారం ఉన్న ఏకైక రాష్ట్రం మిజోరంలోనూ ఓటమిపాలైంది. కాంగ్రెస్ సీఎం లాల్ థాన్వాలా పోటీచేసిన రెండు సీట్లలోనూ ఓటమిపాలయ్యారు. మెజారిటీ సీట్లు సాధించిన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) నేత జోరంతంగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంత లోకాలకు అటల్జీ... ఆగస్టు 16న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి (93) కన్నుమూశారు. దేశ ప్రధానిగా ఐదేళ్ల పూర్తి కాలం పదవిలో కొనసాగిన మొదటి కాంగ్రెస్సేతర ప్రధానిగా వాజ్‌పేయి రికార్డు సృష్టించారు. 1996లో 13 రోజులు, 1998–99 మధ్య 13 నెలలపాటు ఆయన ప్రధానిగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 1999–2004 మధ్యలో మూడోసారి ప్రధానిగా (ఐదేళ్లపాటు) పని చేశారు. 1924, డిసెంబర్ 25న గ్వాలియర్‌లో జన్మించారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన వాజ్‌పేయి తన వాక్చాతుర్యంతో పార్టీలకతీతంగా అభిమానం సంపాదించారు. అజాతశత్రువుగా అందరి మన్ననలు పొందారు. సంకీర్ణ ప్రభుత్వానికి అధినేతగా ఉంటూ భాగస్వాముల్లో ఎలాంటి అసంతృప్తి రేగకుండా వ్యవహరించడమే.. వాజ్‌పేయి రాజకీయ సమర్థతకు నిదర్శనం. ఇరుగుపొరుగు దేశాలతో సయోధ్యకు ప్రయత్నించడం ద్వారా ప్రపంచ దేశాల నేతలకు కూడా అభిమానపాత్రుడయ్యారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన అటల్.. ప్రధాని హోదాలో లాహోర్ బస్సుయాత్ర చేపట్టి ఇరు దేశాలమధ్య సత్సంబంధాలకు కృషి చేశారు. కరుణానిధి అస్తమయం తమిళనాడుకు దాదాపు రెండు దశాబ్దాలు సీఎంగా పని చేసిన డీఎంకే అధినేత కరుణానిధి ఆగస్టు 7న చెన్నైలో కన్నుమూశారు. తమిళనాడులో ద్రవిడ ఉద్యమం ప్రబలడంలో ఆయన ముఖ్య భూమిక పోషించారు. 1924, జూన్ 3న జన్మించిన కరుణానిధి రాజకీయాల్లోకి రాకముందు సినీ రచయితగా ఉన్నారు. 1969లో డీఎంకే తొలి సీఎం అన్నాదురై ఆకస్మిక మరణంతో కరుణానిధి ముఖ్యమంత్రి అయ్యారు. 1976లో అవినీతి తదితర ఆరోపణలపై కరుణానిధి సర్కారును అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ బర్తరఫ్ చేశారు. 13 ఏళ్ల తర్వాత 1989లో మళ్లీ కరుణ అధికారంలోకి వచ్చారు. శ్రీలంక తమిళ ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈతో సంబంధాలున్నాయన్న ఆరోపణపై 1991లో ఆయన ప్రభుత్వాన్ని కేంద్రంలోని చంద్రశేఖర్ ప్రభుత్వం బర్తరఫ్ చేసింది.1989లో కేంద్రంలో కాంగ్రెస్సేతర ప్రభుత్వం ఏర్పాటులో కరుణానిధి కీలక పాత్ర పోషించారు. మళ్లీ 1996–98 మధ్య కేంద్రంలో యునైటెడ్ ఫ్రంట్ పేరుతో కొనసాగిన సంకీర్ణ ప్రభుత్వంలో డీఎంకే భాగస్వామిగా ఉంది. రఫేల్‌పై కాంగ్రెస్‌కు మొట్టికాయలు ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేయనున్న రఫేల్ యుద్ధ విమానాల విషయంలో భారత్–ఫ్రాన్స్ ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఈ విషయంలో ప్రధానిపై రాహుల్ గాంధీ పలు వేదికల ద్వారా తీవ్ర ఆరోపణలు చేశారు. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ సంస్థకు లబ్ధి చేకూర్చేలా మోదీ వ్యవహరించారని విమర్శించారు. అంతటితో ఆగకుండా ఈ ఒప్పందంలో అవినీతిపై విచారించాలంటూ సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించారు. అయితే.. ఈ ఒప్పందంలో అవినీతి కనిపించడం లేదని.. లోపాలేమీ లేవని, దీనిపై న్యాయ విచారణ జరపాల్సిన అవసరం లేదని డిసెంబర్ 14న సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రఫేల్ పేరుతో రెండు ఇంజన్లు కలిగిన యుద్ధవిమానాలను తయారు చేసే ఫ్రెంచి కంపెనీ డసో ఏవియేషన్ సంస్థ నుంచి 126 రఫేల్ విమానాలు కొనుగోలు చేయాలని 2007లో యూపీఏ ప్రభుత్వం భావించింది. కొన్నేళ్ల పాటు ఇరుపక్షాల మధ్య చర్చలు సాగాయి. చివరికి 18 విమానాలు ఫ్రాన్స్‌లో తయారు చేయాలని, మిగిలిన 108 విమానాలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) భాగస్వామ్యంతో భారతదేశంలో తయారు చేయాలని 2012లో యూపీఏ ప్రభుత్వం, డసో ఏవియేషన్ ఒక అంగీకారానికి వచ్చాయి. ధర విషయంలో చర్చలు ఒక కొలిక్కి రాకుండానే ఇరు దేశాల్లో ఎన్నికలు జరిగి ప్రభుత్వాలు మారాయి. దీంతో ఒప్పందం ముందుకు సాగలేదు. అయితే ఒక్కో యుద్ధవిమానానికి రూ.526 కోట్లు చెల్లించేలా ఒప్పందం కుదర్చుకున్నామని కాంగ్రెస్ చెబుతోంది. 2014 ఎన్నికల్లో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మోదీ.. నాటి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్‌తో చర్చలు జరిపారు. 126కి బదులుగా 36 రఫేల్ యుద్ధవిమానాలను కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నామని 2015లో ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఎన్ని కోట్లకు ఒప్పందం కుదుర్చుకుందో, ఒక్కో విమానాన్ని ఎన్ని కోట్లు పెట్టి కొనుగోలు చేస్తోందో అధికారికంగా వెల్లడించలేదు. 59 వేల కోట్లకు రఫేల్ ఒప్పందం కుదిరిందని, 2019 సెప్టెంబర్ నుంచి 2022 ఏప్రిల్ మధ్య 36 యుద్ధ విమానాలను ఇండియాకు సరఫరా చేయడానికి ఫ్రాన్స్ అంగీకరించిందని వార్తలు వచ్చాయి. రాఫెల్ ఒప్పందంలో అంశాలను రహస్యంగా ఎందుకు ఉంచాల్సి వచ్చిందో మోదీ తెలపాలని రాహుల్ ప్రశ్నించారు. ఈ ఒప్పందంపై న్యాయవిచారణ జరిపించాలని కాంగ్రెస్ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది. కేసు విచారణలో వైమానిక దళం అధికారులు సహా పలువురి వాదనలు విన్న సుప్రీం కోర్టు రఫేల్ ఒప్పందాన్ని సమర్థిస్తూ, కాంగ్రెస్ సహా పలువురు వేసిన పిటిషన్లను కొట్టివేసింది. ప్రభుత్వం ఇచ్చిన తప్పుడు అఫిడవిట్ కారణంగా సుప్రీం తీర్పు వచ్చిందని, దీనిపై జేపీసీని నియమించాలని కోరుతూ విపక్షాలు పార్లమెంటులో రోజూ గొడవ చేస్తూనే ఉన్నాయి. కౌగిలింత ఆపై కన్నుగీత.. జూలై 20న పార్లమెంటులో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రధాని మోదీ దగ్గరకు వెళ్లి ఆయనను కౌగలించుకున్నారు. మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో ప్రసంగించిన తర్వాత రాహుల్ అనూహ్యంగా మోదీ దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. దాంతో మోదీ సహా పార్లమెంటు సభ్యులంతా క్షణకాలం అవాక్కయ్యారు. ఆ తరువాత తన సీటు వద్దకు తిరిగొచ్చిన రాహుల్.. సన్నిహితులవైపు చూసి కన్నుగీటారు. ఇది సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. -
తొడగొట్టకుండానే సవాల్!
మీసం మెలేసి, తొడగొట్టే సవాళ్లకు కాలం చెల్లింది. సామాజిక మాధ్యమాల్లో సవాల్ విసిరితే చాలు ప్రపంచం మొత్తం చుట్టేస్తోంది. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో సోషల్ మీడియా సవాళ్లు ఎక్కువైపోతున్నాయి. 2018లో సోషల్ మీడియా వేదికగా వెలుగులోకి వచ్చిన చాలెంజ్‌లు వైరల్‌గా మారాయి. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ సవాళ్లు నెట్లింట్లో హల్చల్ చేశాయి. కొన్ని సవాళ్లు భయపెట్టగా, మరికొన్ని హాస్యాన్ని పంచాయి. సమాజానికి మేలు చేసే చాలెంజ్‌లు ప్రముఖులతో పాటు సామాన్యులను కదిలించాయి. కీకీ చాలెంజ్ ‘హట్‌లైన్ బ్లింగ్’ సింగర్ డ్రేక్ తన కొత్త పాట ‘ఇన్ మై ఫీలింగ్స్’ను విడుదల సందర్భంగా ‘కికి చాలెంజ్’ను జనాల్లోకి వదిలారు. ఈ చాలెంజ్ తీసుకున్న వారు కదులుతున్న వాహనంలోంచి దిగి లేదా వాహనంలోనే ఉండి ‘ఇన్ మై లైఫ్’ పాటకు అనుగుణంగా.. కదులుతున్న వాహహంతోపాటు వారు డ్యాన్స్ చేయాల్సి ఉంటుంది. పాట అయిపోయాక తిరిగి వాహనంలోకి ఎక్కాలి. అయితే కింద పడకూడదు, మధ్యలో ఆగకూడదు. అలా చేస్తేనే చాలెంజ్ నెగ్గినట్లు. ఈ చాలెంజ్ ప్రమాదకరంగా పరిణమించడంతో చాలా రాష్ట్రాల్లో పోలీసులు హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది. అయితే తెలుగు రాష్ట్రాల యువకులు మాత్రం తమదైనా శైలిలో కీకీ చాలెంజ్‌ను స్వీకరించి నవ్వులు పూయించారు. నిమ్మకాయ సవాల్ క్యాన్సర్ బాధితులకు సహాయపడేందుకు సృష్టించిన ‘లెమన్ ఫేస్ ఛాలెంజ్’కు మంచి ఆదరణ లభించింది. డీఐపీజీగా వ్యవహరించే ఒకరకమైన ప్రాణాంతక బ్రెయిన్ క్యాన్సర్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్న ‘అబ్రైగ్ ఆర్మీ’ ఈ సవాల్‌ను తెరపైకి తెచ్చింది. సగం కోసిన నిమ్మకాయ ముక్కను తీసుకొని పళ్లతో కొరికి కొంత రసాన్ని మింగాలి. అప్పుడు ముఖంలో కలిగే హావభావాలను వీడియోలో రికార్డు చేసి ఇంటర్నెట్లో పోస్ట్ చేయాలి. ఇతరులను పోటీకీ ఛాలెంజ్ చేయాలి. ఈ ఛాలెంజ్‌ను ఒంటరిగానైనా స్వీకరించవచ్చు. ఇంటిల్లిపాది స్వీకరించవచ్చు లేదా మిత్ర బృందంతో కలిసి ఛాలెంజ్ చేయవచ్చు. ఛాలెంజ్ చేసిన వాళ్లు ఎంతోకొంత కరెన్సీ అబ్రైగ్ ఆర్మీకి విరాళంగా ఇవ్వాలి. ఫిట్‌గా ఉన్నారా? భారతీయులు ఫిట్నెస్గా ఉండాలనే ఉద్దేశ్యంతో కేంద్ర కీడా శాఖ మంత్రి, ఒలింపిక్ విజేత రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ ‘హమ్ ఫిట్‌తో ఫిట్ ఇండియా ఫిట్’ అనే చాలెంజ్‌కు శ్రీకారం చుట్టారు. ఫిట్నెస్ కోసం చేసే కసరత్తులకు సంబంధించి వీడియో, ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటూ ఆయన విసిరిన సవాల్‌కు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు స్పందించారు. ఆరోగ్యం పట్ల చైతన్యం కలిగిన వారందరు కూడా కసరత్తుల వీడియోలతో తెగ సందడి చేశారు. మాస్టర్ బ్లాస్టర్ కూడా.. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ అభిమానులకు ఓ సవాల్ విసిరారు. ఈ చాలెంజ్ పేరు 'కిట్ అప్ చాలెంజ్'. ఈ చాలెంజ్‌ని స్వీకరించిన వారు తమకిష్టమైన ఆట ఆడుతూ దానికి సంబంధించిన వీడియోను షేర్ చేయాలి. తాను క్రికెట్ ఆడుతోన్న వీడియోను షేర్ చేయడంతోపాటు భారత క్రీడాకారులు సర్దార్ సింగ్, పీవీ సింధు, మిథాలీ రాజ్, విజేందర్ సింగ్, కిదాంబి శ్రీకాంత్, విరాట్ కోహ్లి పేర్లను ‘మాస్టర్ బ్లాస్టర్’ ట్యాగ్ చేశారు. సచిన్ సవాల్‌కు పెద్ద సంఖ్యలో క్రీడాకారులు స్పందించారు. మొక్కలు నాటే చాలెంజ్ ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి ఆరోగ్యకర వాతావరణానికి కృషి చేయాలన్న లక్ష్యంతో తెలంగాణలో ‘గ్రీన్ చాలెంజ్’ పుట్టుకొచ్చింది. ఓ స్వచ్చంద సంస్థ విసిరిన ఈ సవాల్‌కు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ నుంచి సామాన్య ప్రజల వరకు పెద్ద సంఖ్యలో చాలెంజ్‌ను స్వీకరించి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. సెలబ్రిటీలు కూడా ఒకరికొకరు సవాల్ విసురుకుంటూ పచ్చదనాన్ని పాదుకొల్పారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి స్వయంగా మొక్కలు నాటి స్ఫూర్తి నింపారు. మోమో.. వామ్మో! గతేడాది బ్లూవేల్ చాలెంజ్ నెటిజన్లను భయపెడితే ఈ ఏడాది మోమో చాలెంజ్ ఆన్లైన్ ప్రియులను హడలెత్తించింది. అర్జెంటీనాలో 12 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకోవడంతో ఇది వెలుగులోకి వచ్చింది. అసలు ఈ మోమో అన్నది ఎక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారు.. దీని వెనక ఎవరున్నారన్న వివరాలు వెల్లడికాలేదు. గేమ్‌లో ముందుగా.. మోమోను కాంటాక్ట్ అవ్వడానికి వీలుగా మనకు తెలియని ఓ నంబర్ ఇచ్చి.. మెసేజ్ పంపుతూ చాట్ చేయాలంటూ చాలెంజ్ విసురుతారు. మనం పంపితే.. భయానక చిత్రాలు.. హింసాత్మక సందేశాలు వస్తాయి. పలు పనులు పూర్తి చేయాలంటూ వరుసగా సవాళ్లు వస్తాయి. స్వీయ హాని చేసుకునేలా ఇవి ప్రోత్సహిస్తుంటాయి. చాలెంజ్ పూర్తి చేయని వాళ్లకు బెదిరింపు సందేశాలు కూడా వచ్చాయి. ‘వెల్త్ ఫ్లాంటింగ్ చాలెంజ్’ వెల్త్ ఫ్లాంటింగ్ చాలెంజ్ తీసుకున్న వ్యక్తులు తమ నిజ జీవితంలో వేటినైయితే అత్యంత భద్రంగా చూసుకుంటారో.. వేటిని ఎక్కువగా ప్రేమిస్తారో.. ఇంకో రకంగా చెప్పాలంటే తమ సంపదగా భావించే వాటిని రోడ్డు మీద పడేయ్యాలి. క్రెడిట్ కార్డ్స్, డబ్బు, జ్యూవెలరి, డిజైనర్ బట్టలు, చెప్పులు, బ్యాగ్‌లు, వృత్తికి సంబంధించినవి, వస్తువులు, జంతువులు, మనషులతో సహా. వాటిని రోడ్డు మీద పడేయాలి. తర్వాత కార్ నుంచి బయటకు వచ్చి పడేసిన వాటి మధ్య పడుకోని ఫోటో దిగాలి. ఏదో ఫోటోషూట్‌కి ఫోజ్ ఇస్తున్నట్లు కాకుండా.. స్పృహతప్పి కింద పడిపోయినట్లు పేవ్మెంట్ వైపుగా ముఖం పెట్టి పడిపోవాలి. తర్వాత ఈ ఫోటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి. లిప్ సింక్ బాటిల్ చాలెంజ్, వ్యాట్ ది ఫ్లఫ్ చాలెంజ్, ఇన్విజిబుల్ చాలెంజ్, ది డెలె అలీ హ్యాండ్ చాలెంజ్, ది నెయ్మార్ చాలెంజ్, స్నూట్ సవాళ్లు కూడా సోషల్ మీడియాలో సందడి చేశాయి. వీటిలో ఒకట్రెండు మినహా మిగతావన్నీ యూజర్లకు హాస్యాన్ని పంచాయి. సమాజ హితానికి తోడ్పడే సవాళ్లు ఎన్ని విసిరినా ఫర్వాలేదు గానీ ప్రాణాలతో చెలగాటమాడే చాలెంజ్‌లు మాత్రం వద్దని నెటిజన్లు చెబుతున్నారు. కొత్త ఏడాదిలో మేలు చేసే సోషల్ మీడియా సవాళ్లు వైరల్ అవుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
వివాదాల కీలాద్రి!
రాజకీయ జోక్యం అధికం కావడం.. అధికారుల మధ్య ఆధిపత్య పోరు.. పాలకవర్గం పెద్దల చర్యలు వెరసి ఇంద్రకీలాద్రిపై వ్యవహారాలు 2018లో భక్తుల మెప్పు పొందలేకపోయాయి. వివిధ కారణాలతో నలుగురు ఈవోలను మార్చడం.. అభివృద్ధి పనుల అంశంగా ఎవరి ధోరణి వారిదన్నట్లు నడుచుకోవడం ఇబ్బందికర పరిస్థితులకు దారితీశాయి. పవిత్ర దుర్గగుడి వ్యవహారాల్లో వర్గపోరుకు పాలకపక్షం ఆజ్యం పోసిందన్న విమర్శలు మిన్నంటాయి. సాక్షి, విజయవాడ : దుర్గగుడిలో గతంలో ఎన్నడూ లేనంతగా ఈ ఏడాది వివాదాలు జరిగాయి. దేవస్థానం పాలకమండలి సభ్యుల చర్యల వల్ల దేవస్థానం ప్రతిష్ట దిగజారే పరిస్థితి తలెత్తింది. ఒకే ఏడాది నలుగురు ఈవోలను మార్చి దేవస్థానం అభివృద్ధిని రాష్ట్ర ప్రభుత్వమే అడ్డుకుందనే విమర్శలు వినిపించాయి. దేవస్థానంలో నాయీబ్రాహ్మణులు రోడ్డెక్కి ధర్నా చేసి చివరకు ముఖ్యమంత్రిని నిలదీసే పరిస్థితి ఏర్పడింది. ఈవో సూర్యకుమారిపై బదిలీ వేటు ఐటీ మంత్రి నారా లోకేష్ కోసం గత ఏడాది డిసెంబర్ 26వ తేదీ అర్ధరాత్రి దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగాయని పత్రికలు కోడై కూశాయి. ఈ అంశం వివాదం కావడంతో ఈ ఏడాది జనవరి 7న అప్పటి ఈవో సూర్యకుమారిపై బదిలీ వేటుపడింది. అయితే దీనిపై జరిగిన విచారణలో వెల్లడైన వాస్తవాలను ప్రభుత్వం ఇప్పటి వరకు బయట పెట్టలేదు. ఈవో వర్సెస్ ఏఈవో.. దసరా ఉత్సవాల్లో జరిగిన జ్ఞాపికల స్కాం చివరకు ఏఈవో అచ్యుతరామయ్య సస్పెక్షన్ వరకు వెళ్లింది. దీంతో ఈవో కోటేశ్వరమ్మకు, ఏఈవో అచ్యుతరామయ్యకు మధ్య తీవ్ర వివాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఏఈవో అచ్యుతరామయ్య తనను బెదిరించారంటూ ఈవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరో వైపు ఈవో నియామకం చెల్లదంటూ ఏఈవో కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. చివరకు ఆలయ చైర్మన్ యలమంచిలి గౌరంగబాబు జోక్యంతో ఏఈవోనే ఒకడుగు దిగి వచ్చి ఈవో కోటేశ్వరమ్మకు బేషరతుగా క్షమాపణ చెప్పడంతో ఆయన్ను తిరిగి విధుల్లోకి తీసుకున్నారు. భక్తులకు సౌకర్యాలు.. ప్రస్తుతం దుర్గగుడి నిధులు తరిగిపోవడంతో భక్తుల సహకారంతోనే అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఘాట్‌రోడ్డు, మల్లికార్జున మహామండపంలో భక్తుల సౌకర్యార్థం షెడ్లు వేయించారు. అన్నదాన భవానాన్ని మల్లికార్జున మహామండపంలోకి మార్చడంతో భక్తులకు సౌకర్యవంతంగా ఉంది. ఒకే ఏడాది నలుగురుకార్యనిర్వహణాధికారులు ఒకే ఏడాదిలో నలుగురు ఈఓలు మారడంతో దేవస్థానం అభివృద్ధికి ఆటంకంగా మారింది. దుర్గగుడిలో తాంత్రిక పూజలు జరిగిన నేపథ్యంలో ఈవో ఎ.సూర్యకుమారిని జనవరి 7 బదిలీ చేశారు. అదే రోజు తాత్కాలిక ఈవోగా అప్పటి దేవాదాయ శాఖ కమిషనర్ వైవీ అనూరాధ బాధ్యతలు స్వీకరించారు. జనవరి 29న మొవ్వ పద్మను ఈవోగా నియమించారు. పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత చీర మాయం చేసిన ఘటనలో మొవ్వ పద్మను పదవి నుంచి తప్పించారు. ఆగస్టు 17న వి.కోటేశ్వరమ్మ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఇలా ఈవోలను మార్చడం చర్చనీయాంశంగా మారింది. దుర్గమ్మను దర్శించుకున్నతెలంగాణ సీఎం కేసీఆర్.. జూన్ 28న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దుర్గమ్మను దర్శించుకుని ముక్కెరను బహూకరించారు. తమిళనాడు డెప్యూటీ సీఎం పన్నీరుసెల్వం అమ్మవారిని దర్శించుకోవడం విశేషం. ఆలయ ప్రతిష్ట దెబ్బతీసిన పాలకమండలిదేవాలయం ప్రతిష్టను దేవస్థానం పాలకమండలి దెబ్బతీసింది. పాలకమండలి సభ్యులు తమ స్థాయిని దిగజార్చుకునే విధంగా ప్రవర్తించారు. జూన్ రెండో వారంలో దేవస్థానంలో పాలకమండలి సభ్యుడు పెంచలయ్య కేశఖండనశాలలోని ఒక క్షురకుడిపై చేయి చేసుకున్నాడు. దీంతో క్షురకులంతా రోడ్డెక్కారు. చివరకు ఈ వివాదం ముదిరి క్షురకులు తమకు వేతనాలు ఇవ్వాలంటూ ధర్నాకు దిగారు. క్షురకులంతా వెళ్లి చంద్రబాబును కలసి ఆయన్ను నిలదీయడం.. నాయీబ్రాహ్మణులపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేయడం రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఆగస్టు 5న దుర్గగుడిలో భక్తులు సమర్పించిన ఖరీదైన చీరను పాలకమండలి సభ్యురాలు కోడెల సూర్యలత మాయం చేసిందంటూ ఆరోపణలు వచ్చాయి. చివరకు ఈ వివాదం ముదిరి కోడెల సూర్యలతను పాలకమండలి నుంచి తొలగించారు. ఈ ఘటనలతో దేవస్థానం ప్రతిష్ట దెబ్బతింది. చిన్నారి మిస్సింగ్.. మహిళల డ్రస్సింగ్ రూమ్‌లో సీసీ కెమెరాలు అమ్మవారి దర్శనానికి వచ్చిన చిన్నారి నవ్య శ్రీ జూన్ 17న మల్లికార్జున మహామండపం సమీపంలో మాయమైంది. సీసీ కెమెరాల సహాయంతో బాలిక ను ఒక మహిళ గుంటూరు తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఈలోగా ఆ మహిళ నవ్యశ్రీని పోలీసులకు అప్పగించడంతో కథ సుఖాంతమైంది. జూన్ 25న దుర్గగుడికి చెందిన ఓ కాటేజీలో మహిళలు దుస్తులు మార్చుకునే ప్రదేశంలో సీసీ కెమెరాల ఏర్పాటుపై భక్తులు ఆందోళన వ్యక్తం చేయడంతో చివరకు కెమెరాలు తొలగించారు. -
జీహెచ్ఎంసీ ‘అప్ అండ్ డౌన్స్’
సాక్షి,సిటీబ్యూరో: రాష్ట్రంలో జరిగిన ముందస్తు ఎన్నికలు జీహెచ్ఎంసీపై పెనుప్రభావం చూపాయి. దిగువస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారుల దాకా అందరూ ఎన్నికల విధుల్లో నిమగ్నమవడంతో నాలుగునెలల పాటు ఎక్కడి పనులక్కడే నిలిచిపోయాయి. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఉన్న బి.జనార్దన్‌రెడ్డిని బదిలీ చేశాక ఎం.దానకిశోర్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించారు. జీహెచ్ఎంసీలోని ఐదు జోన్లు ఆరు జోన్లుగా రూపాంతరం చెందాయి. 30 సర్కిళ్లను 48 సర్కిళ్లకు, ఆరు జోన్లను 12 జోన్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ అయినప్పటికీ, వారి ఏర్పాటు మాత్రం సాధ్యం కాలేదు. నలుగురు యువ ఐఏఎస్‌లు భారతి హొళికేరి, ముషారఫ్, శ్రుతి ఓజా, సిక్తా పట్నాయక్ లు బదిలీపై జీహెచ్ఎంసీకి వచ్చారు. వీరిలో భారతి హొళికేరి స్వల్ప కాలంలోనే జీహెచ్ఎంసీ నుంచి బదిలీ కాగా.. ఆమె స్థానంలో మరో ఐఏఎస్ సందీప్‌కుమార్ ఝా వచ్చారు. అక్రమ కట్టడాల నిరోధం, విపత్తు నిర్వహణ తదితర పనుల కోసం కొత్తగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌ను ఏర్పాటు చేసి యువ ఐపీఎస్ విశ్వజిత్‌ను డైరెక్టర్‌గా నియమించారు. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తనదైన శైలిలో దూసుకెళ్తూ ఫుట్‌ఫాత్‌లపై దాదాపు 12 వేల ఆక్రమణలను తొలగించారు. విపత్తుల నివారణకు ప్రత్యేక వాహనాలు, యంత్ర సామగ్రిని సమకూర్చుకున్నారు. బార్లు, పబ్బులపైనా కొరడా ఝళిపించారు. అయితే, ఎన్నికల ప్రకటనతో ఆయా కార్యక్రమాలకు బ్రేక్ పడింది. భవన నిర్మాణ అనుమతుల్లో ఈసీబీసీని అమల్లోకి తెచ్చారు. వివిధ ప్రాజెక్టుల కవసరమైన నిధులు చెల్లించేందుకు ఖజానాలో నిధులు లేకపోవడంతో టీడీఆర్(అభివృద్ధి బదలాయింపు హక్కు)ను విస్తృతంగా ప్రచారం చేశారు. రహదారుల విస్తరణలో ఆస్తులు కోల్పోయేవారికి నాలుగురెట్లు పరిహారంతో దీన్ని అమల్లోకి తెచ్చారు. అందుబాటులోకి అండర్‌పాస్‌లు, ఫ్లై ఓవర్లు ఎస్సార్డీపీలో భాగంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో అయ్యప్ప సొసైటీ, చింతల్‌కుంట, మైండ్‌స్పేస్ అండర్‌పాస్‌లు, కామినేని, మైండ్‌స్పేస్ ఫ్లై ఓవర్లు పూర్తిచేసి అందుబాటులోకి తేవడంతో ఆయా ప్రాంతాల ప్రజలకు ట్రాఫిక్ ఉపశమనం లభించింది. నిధుల లేమితో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం మందగించింది. గ్రేటర్లో అక్రమ నిర్మాణాలు ఆగలేదు. ఓటర్ల జాబితా నుంచి మొదలు పెడితే ఫలితాలు వెలువడ్డాక వీవీప్యాట్ స్లిప్‌లు బయటకు రావడం దాకా ఎన్నికల నిర్వహణలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఘనవ్యర్థాల నిర్వహణలో నంబర్–1 రహదారుల కోసం పీరియాడికల్ ప్రివెంటివ్ మెయింటనెన్స్(పీపీఎం) పేరిట రూ.720 కోట్లు మంజూరైనా నిధులు విడుదల కాక పనులు ముందుకు సాగలేదు. ప్రజలకు రోడ్ల పాట్లు తప్పలేదు. భూసేకరణ సమస్యలతో నాలాల ఆధునీకరణ పనులూ ముందుకు సాగలేదు. స్వచ్ఛ ర్యాంకింగ్‌లో జీహెచ్ఎంసీ గత ఏడాది కంటే దిగజారిపోయింది. గత సంవత్సరం 22వ ర్యాంకు రాగా, ఈ సంవత్సరం 27వ ర్యాంకు లభించింది. ఘనవ్యర్థాల నిర్వహణలో మాత్రం రాజధాని నగరాల్లో ప్రథమస్థానం పొందింది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డు పనుల్లో పురోగతి సాధించింది. సాలార్జంగ్ మ్యూజియం వద్ద పాలికాబజార్ తరహాలో ఐకానిక్ బ్రిడ్జి, చార్మినార్ వద్ద అమృత్సర్ తరహా ప్రాజెక్టులు కార్యరూపం దాల్చలేదు. ‘టీమ్ యాప్’ వినియోగంలోకి రాలేదు. ఎలక్ట్రిక్ వాహనాలు, ఏసీ బస్టాపులు ప్రచార పటాటోపాలుగా మిగిలాయి. ఎఫ్‌ఓబీలు తదితరమైనవి వాస్తవరూపం దాల్చలేదు. రూ.13,500 కోట్లతో భారీ బడ్జెట్‌కు ఆమోదం తెలిపినప్పటికీ, సగం నిధులు కూడా సమకూరలేదు. నెలనెలా మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగుల జీతాల చెల్లింపు కూడా కష్టంగా మారింది. కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. -
రాజకీయ రణరంగం
ముందస్తు ఎన్నికలతో 2018 చివరి ఐదు నెలలు రాష్ట్ర రాజకీయాలను ఆసక్తికరంగా మార్చాయి. ఈ ఎన్నికల నామ సంవత్సరం అధికార టీఆర్ఎస్ను మరింత ఉత్తేజితం చేసి అధికారాన్ని అప్పగించింది. 2018లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ అనుకూల రాజకీయ పరిణామాలే చోటుచేసుకున్నాయి. కేసీఆర్ వ్యూహాలతో.. డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ తెలంగాణ ఛాంపియన్‌గా నిలిచింది. జమిలి ఎన్నికల నినాదం దేశమంతటా వినిపిస్తున్న వేళ ఈ ఏడాది రాష్ట్రంలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఘనవిజయాన్ని అందించిన తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను మరోమారు సీఎంగా ఎంచుకున్నారు. దీనికితోడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతానని, హైదరాబాద్‌లో ఉండి ఢిల్లీలో భూకంపం సృష్టిస్తానంటూ కేసీఆర్ ఈఏడాదిలోనే ‘ఫెడరల్ ఫ్రంట్’జాతీయనేతగా తన ప్రయాణాన్ని మొద లుపెట్టారు. అటు, టీఆర్ఎస్ దెబ్బకు రాష్ట్రంలో ప్రతిపక్షాలు చిత్తయిపోయాయి. కాంగ్రెస్ మరోమారు పరాభవం పొందగా, కేంద్రంలో అధికారంలో ఉన్నా కమలనాథులు రాష్ట్రంలో కనీస ప్రతిభ చూపలేకపోయారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో సీఎం కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటనలు, అసెంబ్లీ నుంచి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల శాసనసభ సభ్యత్వం రద్దు, తెలంగాణ జనసమితి పేరిట ప్రొఫెసర్ కోదండరాం కొత్త పార్టీ, సీపీఎం జాతీయ మహాసభలు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు పట్టాభిషేకం, ముగ్గురు రాజ్యసభ సభ్యుల ఎన్నిక, ఎన్నికల వేళ రాజకీయ హడావుడి, జంపింగ్‌లు జపాంగ్‌లతో పార్టీలు మారిన నేతలు వంటి ఘటనలతో 2018 ఎన్నికలనామ వత్సరంగా మిగిలిపోయింది. టీఆర్ఎస్ అడ్డాగా తెలంగాణ 2018 సంవత్సరం టీఆర్ఎస్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే విధంగా నిలిచిపోయింది. ఉద్యమంతో రాష్ట్రాన్ని సాధించిన పార్టీగా 2014 ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఆశీర్వాదం పొందిన టీఆర్ఎస్కు.. 2018 మరో అతిపెద్ద విజయాన్ని అందించింది. కుటుంబ పాలన, అవినీతి అక్రమాలంటూ ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టినా తెలంగాణ ప్రజానీకం కేసీఆరే తమ ఛాంపియన్‌గా నిర్ణయించారు. 8 నెలల ముందే ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ కేసీఆర్ తీసుకున్న సాహసో పేత నిర్ణయానికి జైకొట్టారు. 2014 ఎన్నికల్లో 63 స్థానాల్లో గెలిపించిన టీఆర్ఎస్కు ఇప్పుడు ఏకంగా 88 స్థానాలను కట్టబెట్టి తెలంగాణ గడ్డ.. టీఆర్ఎస్ అడ్డా అనే రీతిలో తీర్పునిచ్చారు. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడంతో టీఆర్ఎస్ పరిస్థితిలో కూడా పూర్తి మార్పు వచ్చి బలీయశక్తిగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన నలుగురు మంత్రులు మాత్రమే ఓటమి పాలుకాగా, చాలా మంది కొత్త నేతలు శాసనసభకు ఎన్నికయ్యారు. ముఖ్యంగా దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలపై పట్టును నిరూపించుకున్న టీఆర్ఎస్.. హైదరాబాద్‌లోనూ తమకు తిరుగులేదని చాటిచెప్పింది. ఎలాగూ ఉత్తర తెలంగాణలో సంస్థాగతంగా పూర్తిస్థాయిలో బలంగా ఉన్న గులాబీ పార్టీ దక్షిణ తెలంగాణలో లభించిన అనూహ్య విజయంతో పూర్తిస్థాయిలో కుదురుకుంటుందనేది రాజకీయ నిపుణుల అంచనా. ఇక పార్టీ పరంగా కూడా కీలక మార్పులకు 2018 వేదిక అయ్యింది. ఎన్నికల ఫలితాల అనంతరం.. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్‌కు పట్టాభిషేకం జరిగింది. రెండు, మూడేళ్ల నుంచి ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తున్న కార్యక్రమం పూర్తికావడంతో టీఆర్ఎస్కు రెండోబాస్గా కేటీఆర్ మరింత క్రియాశీలమవుతున్నారు. దీంతో పాటు పార్టీ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించి పావులు కదుపుతుండటం గమనార్హం. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు పేరుతో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ఏర్పాటు కోసం కేసీఆర్ దేశ వ్యాప్త పర్యటనలు చేస్తున్నారు. కాంగ్రెస్‌కు రెండో‘సారీ’ ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు మాత్రం ఈ ఏడాది చేదు అనుభవాలనే మిగిల్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన పార్టీగా వరుసగా రెండోసారి ఆ పార్టీని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. అధికారం దక్కుతుందనే కోటి ఆశలతో టీడీపీ సహా పలు పార్టీలతో పొత్తులు పెట్టుకుని పోరాడినా పెద్దగా కలసిరాలేదు. ఏఐసీసీ అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీ బాధ్యతలు చేపట్టిన సంవత్సరంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుబాటలో పయనిస్తే ఇక్కడ మాత్రం బోల్తాకొట్టింది. ఎన్నికల్లో ఓటమితో కేడర్ పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోగా, కనీసం ప్రక్షాళన చేసేందుకు అధిష్టానం ముందుకు రాకపోవడం, సమీక్షించుకుని మళ్లీ రణరంగంలో దిగేందుకు టీపీసీసీ ముఖ్యులు కూడా ఆసక్తి చూపకపోవడం ఆ పార్టీని గందరగోళంలో పడేసింది. పార్టీ పరంగా కూడా కాంగ్రెస్‌కు ఈ ఏడాది పెద్దగా కలిసివచ్చిందేమీ లేదు. ఎన్నికలు జరిగినప్పటికీ పార్టీ నుంచి ఎంత మంది వచ్చారో.. అంతే మంది పార్టీని వీడి వెళ్లిపోయారు. ఎన్నికలకు ముందు పార్టీ కొత్త సైన్యాన్ని ఏర్పాటు చేయడం, రేవంత్‌రెడ్డిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించడం లాంటి పరిణామాలు తప్ప పెద్దగా జరిగిందేమీ లేకపోవడం గమనార్హం. మీ సోపతి.. మాకొద్దు ‘బాబో’య్ రాష్ట్ర రాజకీయాల్లో 2018లో జరిగిన కీలక పరిణామం.. తెలంగాణ ప్రజలు చంద్రబాబుతో సావాసాన్ని అంగీకరించకపోవడమే. తెలంగాణ వ్యవహారాల్లో తలదూర్చాలన్న ఆలోచనతో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లిన చంద్రబాబును తెలంగాణ ప్రజలు పూర్తిస్థాయిలో తిరస్కరించారు. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు కాంగ్రెస్‌ను కలిపి కుమ్మేశారు. చంద్రబాబు ప్రచార పటాటోపాలకు ఏమాత్రం తలొగ్గని తెలంగాణ ప్రజలు ఆయనతో సోపతి మాకు వద్దంటే వద్దని తేల్చేశారు. దీంతో 2014 ఎన్నికల్లో 15 అసెంబ్లీ స్థానాలను గెల్చుకున్న టీడీపీ ఈసారి రెండు స్థానాలకే పరిమితమైంది. నేతలు పార్టీ మారినా కేడర్పోలేదని, తమ ఓట్లు తమకున్నాయని గొప్పలు చెప్పుకున్న తమ్ముళ్ల గూబగుయ్‌మనేలా ప్రజలు తీర్పునిచ్చారు. పైన ఉన్నా.. ఇక్కడ సున్నా 2018 కమలనాథులను కోలుకోలేని దెబ్బ కొట్టింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే మోదీ చరిష్మాతోనయినా కొంతమేర గట్టెక్కుదామని ఆశించిన రాష్ట్ర బీజేపీ నేతలకు అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి. దక్షిణ భారతదేశంలో కాషాయదళం పాగా వేసేందుకు ప్రయోగాత్మకంగా తెలంగాణను బీజేపీ ఎంచుకుందన్న ప్రచారం జరిగినా.. బీజేపీ మాత్రం ఉన్నస్థానాలను కోల్పోవాల్సి వచ్చింది. ప్రధాని మోదీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో పాటు కేంద్రమంత్రులు ప్రచారం చేసినా తెలంగాణ ప్రజలు బీజేపీని స్వీకరించలేదు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కిషన్‌రెడ్డి సహా ముఖ్య నాయకులు కూడా ఓడిపోయారు. రాష్ట్రంలో మళ్లీ సున్నా నుంచి ప్రారంభించుకోవాల్సిన పరిస్థితి బీజేపీకి తప్పలేదు. ఇక, పార్టీ పరంగా కూడా ఈ ఏడాది చెప్పుకోదగిన పరిణామాలేవీ సంభవించలేదు. టీఆర్ఎస్, కాంగ్రెస్‌లలో టికెట్లు రాని నేతలు ఎన్నికల వేళ పార్టీలో చేరడం మినహా బీజేపీకి 2018లో కలిసివచ్చిందేమీ కనిపించలేదు. కమ్యూనిస్టులు ఖతమే! ఈ ఏడాది రాజకీయంగా తీవ్రంగా నష్టపోయింది కమ్యూనిస్టులే. కాంగ్రెస్‌తో గుడ్డిగా పొత్తు కుదుర్చుకుని సీపీఐ, సామాజిక న్యాయం ఎజెండా అంటూ బీఎల్ఎఫ్ పేరుతో కూటమి కట్టిన సీపీఎంలు బొక్కబోర్లా పడ్డాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రెండో అసెంబ్లీలోనే వారి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ప్రతిపక్ష ఓట్లు చీలుస్తామని, ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోలేమని తెలిసినా కులాల వారీ టికెట్లు కేటాయించి సీపీఎం తన ఉనికిని కోల్పోయే పరిస్థితికి చేరుకోగా, సీపీఐ మాత్రం కాంగ్రెస్‌తో జట్టుకట్టినా ఫలితం లేకుండా పోయింది. ఎంఐఎంకు మాత్రం 2018 మంచి మిత్రుడిని తెచ్చిపెట్టింది. టీఆర్ఎస్ రూపంలో లభించిన దోస్తానాతో మంచి ఉత్సాహంతో ఎన్నికలకు వెళ్లిన ఎంఐఎం పాతబస్తీలో మరోమారు తన పట్టు నిరూపించుకుంది. 2018లో జరిగిన ముఖ్య రాజకీయ ఘటనలు మార్చి 4: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలని ప్రకటించిన సీఎం కేసీఆర్. అందుకే కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడి. మార్చి 12: శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ప్రసంగ సమయంలో కాంగ్రెస్ సభ్యుల ఆందోళన. కాంగ్రెస్ సభ్యులు విసిరిన హెడ్‌ఫోన్ తగిలి మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయం. మార్చి 13: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్. సంపత్‌కుమార్‌ల శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీ నిర్ణయం. సీఎల్పీ నేత జానారెడ్డితో పాటు 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెన్షన్. ఆరుగురు ఎమ్మెల్సీలపై కూడా చర్యలు. మార్చి 23: జె.సంతోశ్, బడుగుల లింగయ్య, బండా ప్రకాశ్‌లు రాజ్యసభ సభ్యులుగా ఎన్నిక. ఏప్రిల్ 2: తెలంగాణ జనసమితి పార్టీ పేరును ప్రకటించిన కోదండరాం. అదే నెల4వ తేదీన పార్టీ జెండావిష్కరణ. ఏప్రిల్ 18: హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో సీపీఎం జాతీయ మహాసభలు ప్రారంభం. ఐదు రోజుల పాటు సభలు. ఏప్రిల్ 27: కొంపల్లిలో టీఆర్ఎస్ ప్లీనరీ. హైదరాబాద్‌లోనే ఉండి ఢిల్లీలో భూకంపం పుట్టిస్తానని ప్రకటించిన సీఎం కేసీఆర్. మే 2: ఫెడరల్‌ఫ్రంట్ రూపకల్పనలో భాగంగా హైదరాబాద్‌లో కేసీఆర్‌ను కలిసిన యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్. మే 23: కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమం. తొలిసారి బహిరంగంగా ఒకేచోట కనిపించిన రాహుల్, చంద్రబాబు. జూన్ 28: విజయవాడ వెళ్లి కనకదుర్గమ్మకు మొక్కులు చెల్లించిన సీఎం కేసీఆర్. వజ్రఖచిత ముక్కుపుడక సమర్పణ. జూలై 27: గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు గజం రూ.100 చొప్పున జిల్లా కేంద్రాల్లో ఎకరానికి మించకుండా ప్రభుత్వ భూమి కేటాయించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం. ఆగస్టు 4: ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలిసిన సీఎం కేసీఆర్. జమిలి ఎన్నికలపై చర్చ. ఆగస్టు 13, 14: హైదరాబాద్‌కు వచ్చిన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ. స్వయం సహాయక సంఘాల మహిళలు, సెటిలర్లతో భేటీలు. సరూర్‌నగర్ స్టేడియంలో నిరుద్యోగ గర్జన. ఆగస్టు 22: ప్రగతి భవన్లో మంత్రివర్గ సహచరులతో ఏడుగంటలపాటు సీఎం కేసీఆర్ సుదీర్ఘ భేటీ. ముందస్తు ఎన్నికలకు వెళ్లాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే అధికారాన్ని కేసీఆర్‌కు అప్పగించిన మంత్రివర్గ సహచరులు. ఆగస్టు 24: టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర నాయకత్వంతో సమావేశమయిన కేసీఆర్. ఆగస్టు 25: ఢిల్లీ వెళ్లి ప్రధానితో కేసీఆర్ ముందస్తుపై భేటీ. సెప్టెంబర్ 2: కొంగరకలాన్‌లో టీఆర్ఎస్ ప్రగతినివేదన సభ. సెప్టెంబర్ 5: ముందస్తు ఎన్నికలు వస్తాయనే అంచనాతో సన్నబియ్యం, సొంతిల్లు లాంటి ప్రజాకర్షక హామీలు ప్రకటించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి. సెప్టెంబర్ 6: శాసనసభను రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం. 8 నెలల 26 రోజుల ముందే సభను రద్దు చేస్తూ కేబినెట్ చేసిన తీర్మాన కాపీని గవర్నర్‌కు అందజేసిన సీఎం కేసీఆర్. వెంటనే 105 మంది టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన. సెప్టెంబర్ 7: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుంచి ఎన్నికల శంఖారావం పూరించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సెప్టెంబర్ 19: ఎన్నికల సైన్యాన్ని ప్రకటించిన కాంగ్రెస్. టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా భట్టి, వర్కింగ్ ప్రెసిడెంట్లుగా రేవంత్ రెడ్డి, పొన్నం నియామకం. అక్టోబర్ 4: ఎన్నికల నగారా ఆలంపూర్ నుంచి ప్రారంభించిన కాంగ్రెస్. అక్టోబర్ 10: రాష్ట్రంలో ఎన్నికలకుషెడ్యూల్ విడుదల. నవంబర్ 5: ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ. నవంబర్ 12: 65 మందితో కాంగ్రెస్, 9 మందితో టీడీపీ అభ్యర్థుల తొలిజాబితా విడుదల. నవంబర్ 20: టీఆర్ఎస్కు ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి రాజీనామా. నవంబర్ 23: మేడ్చల్ కాంగ్రెస్ బహిరంగసభ. హాజరయిన సోనియా, రాహుల్. నవంబర్ 27: నిజామాబాద్, మహబూబ్‌నగర్‌లలో ప్రధాని మోదీ బహిరంగసభలు. ప్రజాకూటమి మేనిఫెస్టో విడుదల. డిసెంబర్ 7: ప్రశాంతంగా శాసనసభకు ఎన్నికలు. డిసెంబర్ 11: ఎన్నికల ఫలితాలు విడుదల. 88 స్థానాలతో ఘనవిజయం సాధించిన టీఆర్ఎస్. కాంగ్రెస్‌కు 19, ఎంఐఎంకు 7, టీడీపీ 2, బీజేపీ 1, ఇతరులు రెండు స్థానాల్లో గెలుపు. డిసెంబర్ 13: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్. మంత్రిగా ప్రమాణం చేసిన మహమూద్ అలీ. డిసెంబర్ 14: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కేటీఆర్ ఎన్నిక. -
2018 : కన్నీటిని మిగిల్చిన కొండగట్టు ప్రమాదం
కొండగట్టు ప్రమాదం ఎంతో మంది జీవితాల్లో కన్నీటిని మిగిల్చింది.. కథువా ఘటన మనిషిలో కనుమరుగైన మానవత్వాన్ని చూపింది.. ఉన్నావ్ దుర్ఘటన రాజకీయ ఒత్తుడులను చవిచూసింది.. సమాజానికి సిగ్గుచేటుగా దాచేపల్లి ఘటన.. ప్రేమికుడి కోసం భర్తను హత్య చేయించడం మానవ సంబంధాల ఉనికిని చూపెడుతోంది.. ఈ ఏడాది సంచలనం రేపిన ఘటనలను ఓ సారి చూద్దాం.. సంచలనం రేపిన కథువా దుర్ఘటన (జనవరి 10-17) జమ్మూకశ్మీర్‌లోని కథువాలో 8 ఏళ్ల చిన్నారిపై జరిగిన అత్యాచారం, హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాలిక కనిపించకుండా పోయిన వారం రోజుల తర్వాత ఆమె మృతదేహాన్ని కథువా గ్రామానికి కిలోమీటరు దూరంలో గుర్తించారు. ఈ కేసులో ఏప్రిల్ 16వ తేదీన విచారణ ప్రారంభమైంది. ఆ తర్వాత ఈ కేసులో అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. విషాదం మిగిల్చిన విమానం ఆఫ్రికాలోని అల్జీరియాలో ఏప్రిల్ 11న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 257 మంది దుర్మరణం చెందారు. రాజధాని అల్జీర్స్ నుంచి టేకాఫ్ అయిన విమానం కొద్ది సేపటికే సమీపంలోని పొలాల్లో కుప్పకూలింది. మృతుల్లో ఎక్కువ మంది ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులే ఉన్నారు. ఉలిక్కిపడేలా చేసిన ఉన్నావ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లోని ఓ యువతిపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్సింగ్ అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో బాధితురాలి తండ్రిని ఏప్రిల్ 5వ తేదీన అక్రమ ఆయుధాల చట్టం కింద అరెస్ట్ చేశారు. ఆయన అదే రాత్రి మృతి చెందడం కలకలం రేపింది. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం జరగడంతో.. ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి అప్పగించింది. మానవత్వానికి సిగ్గుచేటు.. దాచేపల్లి ఘటన (మే 3-5) గుంటూరు జిల్లా దాచేపల్లిలో 9 ఏళ్ల బాలికపై 55 ఏళ్ల వృద్దుడు అన్నం సుబ్బయ్య అత్యాచారానికి పాల్పడటం కలకలం సృష్టించింది. దీనిపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు 17 బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టారు. చివరకు నిందితుడు గురజాల మండలంలోని అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ప్రేమికుడు కోసం భర్త హత్య (మే 7)విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం తోటపల్లి మండలంలో సరస్వతి అనే వివాహిత పెళ్లైనా వారం రోజులకే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించడం స్థానికంగా కలకలం రేపింది. ఫేస్బుక్లో పరిచయమైన యువకుడిని ప్రేమించిన సరస్వతి ఈ దారుణానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఈ హత్య దుండగులు చేసినట్టు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. కానీ ఈ ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరిపిన పోలీసులు సరస్వతిని నిందితురాలిగా తేల్చారు. పడవ బోల్తా.. 26మంది మృతి (మే 15) పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో లాంచీ మునిగిపోయిన ఘటన ఉభయ గోదావరి జిల్లాలను వణికించింది. ఈ దుర్ఘటనలో దాదాపు 26 మంది మృతి చెందారు. మే 15 సాయంత్రం దేవిపట్నం నుంచి కొండమొదలు బయలుదేరిన లాంచీ సుడిగాలుల తీవ్రతకు బోల్తాపడింది. మేనమామే.. మృగంలా మారి! (జూన్ 15) మానసిక వికలాంగులైన చిన్నారులను సొంత మేనమామే దారుణంగా హత్య చేశాడు. మిర్యాలగూడలోని తన అక్క వద్ద నుంచి పిల్లల్ని తన రూమ్‌కు తీసుకువచ్చిన మల్లికార్జునరెడ్డి ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డాడు. చివరకు నిందితుడు మృతదేహాలను అర్ధరాత్రి కారులో తరలిస్తూ పోలీసులకు చిక్కాడు. ఎనిమిదేళ్ల బాలికపై.. (జూన్ 26) మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్‌లో ఎనిమిదేళ్ల బాలికపై ఇద్దరు వ్యక్తులు అతి కిరాతకంగా అత్యాచారనికి పాల్పడటం రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు వ్యతిరేకంగా మహిళలు మధ్యప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపట్టారు. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది.. (జూలై 1) దేశ రాజధాని ఢిల్లీలోని బురారీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద రీతిలో చనిపోవడం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. మూఢ నమ్మకాలపై విశ్వాసంతో.. మోక్షం పొందడం కోసమే వారంతా సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్టు అనుమానాలు వ్యక్తమయ్యాయి. వారి ఇంట్లో లభించిన ఆధారాలు కూడా ఈ వాదనకు బలం చేకూర్చేలా ఉన్నాయి. ఆరుగురు విద్యార్థులు, ఒక వివాహిత గల్లంతు.. (జూలై 14) తూర్పుగోదావరి జిల్లా పశువుల్లంకలో నాటుపడవ గోదావరి నది పాయలో బోల్తా కొట్టిన దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు, ఒక వివాహిత గల్లంతయ్యారు. చిన్నారులు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అనాథ శరణాలయంలో దారుణం! (జూలై) బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఓ అనాథ శరణాలయంలో 34 మంది మైనర్ బాలికలపై నిర్వాహకుడు బ్రజేష్ లైంగిక దాడికి పాల్పడిన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ముంబైకి చెందిన ‘టిస్’ చేపట్టిన సోషల్ ఆడిట్‌తో ఈ దారుణం బయటపడింది. ఈ ఘటనలో బాధిత బాలికలు ఇచ్చిన వాంగ్మూలాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. కరక్కాయతో కాటువేశాడు! (జూలై) హైదరాబాద్ కేపీహెచ్బీలో కరక్కాయ పొడి పేరుతో జరిగిన ఘరానా మోసం వెలుగుచూసింది. బాధితులకు వేల రూపాయలు ఎరగా చూపిన నిందితులు కోట్లాది రూపాయలతో ఉడాయించారు. ధర్మపురి సంజయ్‌పై ఆరోపణలు (ఆగస్టు) ప్రముఖ రాజకీయ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ కుమారుడు సంజయ్ నర్సింగ్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆరోపణలు రావడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసులో సంజయ్ 20 రోజలు పాటు సారంగపూర్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కన్నీటిని మిగిల్చిన కొండగట్టు ప్రమాదం (సెప్టెంబర్ 11) జగిత్యాల జిల్లా కొండగట్టు వద్ద ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో 60 మంది దుర్మరణం పాలయ్యారు. ఆర్టీసీ చరిత్రలోనే అతి పెద్ద బస్సు ప్రమాదంగా ఇది నిలిచింది. ఆర్టీసీ అధికారుల తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విమర్శలు తీవ్ర స్థాయిలో వెలువెత్తాయి. మిర్యాలగూడ పరువు హత్య! (సెప్టెంబర్ 14) మిర్యాలగూడలో జరిగిన పరువు హత్య తెలుగు రాష్ట్రాలో సంచలనం రేపింది. మిర్యాలగూడకు చెందిన అమృత, ప్రణయ్‌లు ఈ ఏడాది జనవరిలో ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. కూతురి ప్రేమ వివాహన్ని తట్టుకోలేకపోయిన మారుతి రావు ప్రణయ్‌ను అంతమొందించాడు. ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర చర్చ జరిగింది. పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. మావోయిస్టుల చేతిలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హతం! (సెప్టెంబర్ 23) మన్యంలో మాటు వేసిన మావోయిస్టులు విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే కిడారి సోములను దారుణంగా కాల్చి చంపారు. దాదాపు 65 మందితో కూడిన మావోయిస్టు దళం ఈ దాడికి పాల్పడినట్టుగా తెలిసింది. నిఘా వ్యవస్థ వైఫల్యం వల్లనే ఈ దాడి జరిగిందనే విమర్శలు ఉన్నాయి. మిస్టరీగా ఖషోగ్గి హత్య (అక్టోబర్ 2) ఇస్తాంబుల్‌లోని సౌదీ అరేబియా దౌత్య కార్యాలయానికి వాషింగ్టన్ పోస్ట్ కాలమిస్ట్ జమాల్ ఖషోగ్గీ హత్యకు గురికావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. కనీసం ఆయన మృతదేహాం కూడా లభించకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఖషోగ్గీ హత్య వెనుక ఉంది సౌదీ అరేబియా ఉందనడానికి తమ దగ్గర ఆధారాలున్నాయంటూ టర్కీ ప్రభుత్వం పేర్కొంది. తనపై విమర్శనాత్మక కథనాలు రాసినందున ఖషోగ్గీని సౌదీ యువరాజు సల్మాన్ చంపించారనే ఆరోపణలు వచ్చాయి. రావణాసురుడి దహణం.. 59మంది దుర్మరణం (అక్టోబర్ 19) పంజాబ్ అమృత్‌సర్‌లో దసరా వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. జోడా ఫాటక్ ప్రాంతంలో రావణ దహనాన్ని వీక్షిస్తున్న వారిపైకి రైలు మృత్యువులా దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో 59 మంది చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు. అండమాన్‌లో అమెరికన్ టూరిస్ట్ హత్య (నవంబర్) అండమాన్, నికోబార్ దీవుల్లో నివసించే సెంటినెలీస్ తెగ చేతిలో జాన్ అలెన్ చౌ అనే అమెరికన్ టూరిస్ట్ దారుణ హత్యకు గురయ్యారు. బయటివారి ఉనికిని ఏమాత్రం ఇష్టపడని ‘సెంటినెలీస్’ తెగ వారు ఈ చర్యకు పాల్పడ్డారు. కాగా, అలెన్ క్రైస్తవ మత ప్రచారం కోసం అక్కడికి వెళ్లారు. ఆలయంలో విష ప్రసాదం.. 15మంది మృతి (డిసెంబర్ 14) కర్ణాటక చామరాజనగర జిల్లా సుళ్వాడిలోని చిక్క మారమ్మ ఆలయంలో విష ప్రసాదం తిని 15 మంది మృతి చెందటం సంచలనంగా మారింది. ఆధిపత్య పోరు ముసుగులో పగతో ఆలయ ట్రస్ట్ అధ్యక్షుడు ఇమ్మడి మహదేవస్వామి తన మనుషులతో ప్రసాదంలో మోనోక్రోటోఫాస్ అనే పురుగుల మందు కలిపి ఈ ఘోరానికి పాల్పడినట్టు తెలింది. -
‘మహా’భాగ్యం
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థకు లే అవుట్ రెగ్యులేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) రూపంలో ఈ ఏడాది దాదాపు రూ.వెయ్యి కోట్ల ఆదాయం చేకూరింది. ఈ సంస్థ చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులు కొన్ని నింపాదిగా నడుస్తుండగా, మరికొన్ని పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. ప్రధానంగా నగరంలో ట్రాఫిక్ సమస్యను నిలువరించేందుకు మంగళ్‌పల్లి, బాటాసింగారంలో లాజిస్టిక్ పార్కులు, బాలానగర్ ఫ్లైఓవర్ పనులు నింపాదిగా సాగుతున్నాయి. అయితే ఎల్ఆర్ఎస్ ద్వారా వచ్చిన ఆదాయంలో దాదాపు రూ.500 కోట్లతో శివారు ప్రాంతాల్లోని గ్రామాల్లో చేపట్టిన అభివృద్ధి పనులు కొన్ని పూర్తవగా, మరికొన్ని శరవేగంగా సాగుతున్నాయి. ఈ ఏడాది పూర్తికావాల్సి ఉన్నా.. నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యను దృష్టిలో ఉంచుకొని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విజయవాడ జాతీయ రహదారి పక్కన బాటసింగారం వద్ద 40 ఎకరాల్లో రూ.35 కోట్లు, మంగళ్‌పల్లి వద్ద 22 ఎకరాల్లో రూ.20 కోట్ల అంచనాలతో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో లాజిస్టిక్ పార్క్‌లు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పెద్ద పెద్ద ట్రక్కులు, ఇతర సరుకు రవాణ వాహనాలు నగరంలో ప్రవేశించకుండా అక్కడ ఏర్పాటు చేసే గోడౌన్లలో ఖాళీ చేసే వీలు కలుగుతుంది. ఆయా సరుకులను మినీ ట్రక్కుల ద్వారా ఆయా కేంద్రాలకు చేరుస్తారు. దీంతో నగరంలోని వ్యాపార వాణిజ్య సముదాయాలకు వివిధ మార్గాలలో లారీల రాకపోకలను నగరం బయటే నియంత్రించే వీలుంది. అంతే కాకుండా మినీ ట్రక్కుల ఉపయోగం వల్ల కొన్ని వేలమందికి ఉపాధి దొరుకుతుంది. అయితే ఈ లాజిస్టిక్ పార్కు పనులు పూర్తికావల్సి ఉన్నా పనులు మాత్రం నింపాదిగా సాగుతుండటం అధికారుల ఆలసత్వానికి నిదర్శనంగా మారింది. నత్తనడకన బాలానగర్ ఫ్లైఓవర్ పనులు .. నగరవాసుల ట్రాఫిక్ కష్టాలను తప్పించే బాలానగర్ నర్సాపూర్ ఎక్స్ రోడ్డులో ట్రాఫిక్ కష్టాలు తీర్చడం కోసం హెచ్ఎండీఏ రూ.384 కోట్లతో బాలానగర్‌లోని శోభన థియేటర్ నుంచి ఐడీపీఎల్ వరకు 1.09 కి.మీ. పొడవునా ఆరులేన్ల ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఏడాది క్రితం మొదలుపెట్టింది. ఈ ఫ్లైఓవర్ కోసం ఎనిమిది ఎకరాల 20 గుంటలు (33,175 చదరపు మీటర్ల) స్థలంలో 59 ప్రాపర్టీలకు నష్టం కలుగుతోంది. ఈ ఫ్లైఓవర్ అంచనా వ్యయం రూ.104.53 కోట్లవుతుండగా, భూసేకరణ కోసం రూ.265 కోట్లను హెచ్ఎండీఏ చెల్లిస్తోంది. ఈ ఫ్లైఓవర్ నిర్మాణం కోసం ఆహ్వానించిన టెండర్‌ను బీఎస్సీపీఎల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ దక్కించుకుంది. అయితే భూసేకరణలో ఇబ్బందులు ఎదురవుతుండడంతో పనులు నింపాదిగా జరుగుతున్నాయి. శివారు మౌలిక వసతులకు ప్రాధాన్యం నగరశివారు గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల అభివృద్ధిలో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) భాగస్వామ్యం అవుతోంది. తద్వారా శివారుల్లో అభివృద్ధి పనుల్లో వేగం పెరిగింది. ఎల్ఆర్ఎస్ ద్వారా హెచ్ఎండీఏకు వచ్చిన రూ.1,000 కోట్ల ఆదాయంలో దాదాపు రూ.500 కోట్లు ప్రజల మౌలిక వసతులకు ఖర్చుబెడుతున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ఏడు జిల్లాల స్థానిక సంస్థల నుంచి వస్తున్న దరఖాస్తులను పరిశీలించిన తర్వాత పనులు చేపడుతున్నారు. ఇందులో భాగంగానే సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ.10 కోట్లు, పటాన్చెరులో రూ.మూడు కోట్లతో రహదారుల విస్తరణ, డ్రైనేజీ, సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల వసతుల పనులు శరవేగంగా సాగుతున్నాయి. సంగారెడ్డి పట్టణంలో రూ.6.59 కోట్లతో రెండు కి.మీ. మేర రోడ్డు విస్తరణ పనులు, డ్రైనేజీ ఏర్పాటు, ఫుట్‌పాత్‌ల ఏర్పాటు చేస్తున్నారు. రూ1.09 కోట్లతో 2.6 కి.మీ. మేర రిచ్–1 సెంట్రల్ మీడియన్ పనులను, రూ.1.09 కోట్ల వ్యయంతో 2.6 నుంచి 5.4 కిలోమీటర్ల మేర రిచ్–2 సెంట్రల్ మీడియన్ పనులు చేస్తున్నారు. 5.5 కి.మీ. మేర సెంట్రల్ మీడియన్‌లో రూ.1.34 కోట్లతో వీధి దీపాలు ఏర్పాటు చేస్తున్నారు. నందిగామ గ్రామంలో రూ.48 లక్షల వ్యయంతో 400 మీటర్లు డ్రైనేజీ లైన్, 1.3 కి.మీ. మేర సీసీ రోడ్డు పనులు చేస్తున్నారు. రూ.3.59 కోట్లతో అమీన్‌పూరాలో రోడ్డు పనులు ఊపందుకున్నాయి. రూ.15 కోట్లతో భువనగిరి మున్సిపాలిటీల్లో సెంట్రల్ మీడియన్ నిర్మాణం, నాలుగు కి.మీ. మేర సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనుల్లో వేగం పెరిగింది. రూ.5 కోట్లతో చౌటుప్పల్‌లో రూ.56 కోట్లతో కుంట్లూరులో డ్రైనేజీ వ్యవస్థ కోసం రూ.6.80 కోట్లతో కిస్మత్‌పూర బ్రిడ్జి, రూ.6.50 కోట్లతో హుస్సేన్‌సాగర్ కూకట్పల్లి కాలువ వద్ద ఐ అండ్ వో స్ట్రక్చర్, రూ.7.50 కోట్లతో లక్ష్మీగూడ నుంచి శంషాబాద్ వరకు ఉన్న రేడియల్ రోడ్డు మార్గంలో అసంపూర్తిగా ఉన్న కిలోమీటర్ మేర పనులను చేపట్టింది. రంగారెడ్డి జిల్లాలో తొర్రూరులోని ఇంజాపూర్ ఎక్స్ రోడ్డు నుంచి వై జంక్షన్ వరకు బీటీ రోడ్డు విస్తరణ పనుల కోసం రూ.2.95 కోట్లను మంజూరు చేసింది. రూ.5 కోట్లతో పటాన్చెరులో ట్రక్కు పార్కింగ్ పనులు పూర్తయ్యాయి. కోట్లు కురిపించిన ప్లాట్ల వేలం హెచ్ఎండీఏ ప్లాట్ల ఆన్లైన్ వేలం కోట్ల వర్షం కురిపించింది. 211 ప్లాట్లకు నిర్వహించిన వేలంలో హెచ్ఎండీఏకు దాదాపు రూ.380 కోట్ల ఆదాయం సమకూరింది. అత్యధికంగా మాదాపూర్‌లో గజానికి రూ.1,52,000 పలుకగా, షేక్‌పేటలో రూ.1,11,700, సరూర్‌నగర్ రెసిడెన్సియల్ కమర్షియల్ కాంప్లెక్స్‌లో రూ.73,000, మియాపూర్‌లో రూ. 73,000 పలికింది. హెచ్ఎండీఏ నిర్ధారించిన అప్సెట్ ధరను మించి రెండింతలు, మూడింతల ధరను కోట్ చేసి కొనుగోలుదారులు సొంతం చేసుకోవడంతో అధికారులు ఊహించిన రూ.250 కోట్ల కన్నా మరో రూ.130 కోట్లు ఎక్కువగా వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎంఎస్టీసీ లిమిటెడ్ ద్వారా వేలంలో అత్తాపూర్ రెసిడెన్సియల్ లే అవుట్, అత్తాపూర్ ముష్క్ మహల్ రెసిడెన్సియల్ కాంప్లెక్స్‌లోనూ గజానికి రూ.1,42,000 పైనే పలికింది. దాదాపు రూ.600 కోట్ల ఆదాయం సమకూరే ఉప్పల్ భగాయత్ ప్లాట్ల ఆన్లైన్ వేలంలో సాంకేతిక కారణాలతో నిలిపివేశారు. అలాగే లేఅవుట్, భవన నిర్మాణ అనుమతుల ద్వారా సంస్థకు నెలకు దాదాపు రూ.25 కోట్ల చొప్పున హెచ్ఎండీఏ ఖజానాకు వచ్చాయని అధికారులు చెబుతున్నారు. -
సంక్షేమం కొత్త పుంతలు!
సాక్షి, హైదరాబాద్: ‘ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి’అనే నినాదంతో సర్కారు నడుస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెబుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఈ ఏడాది ఇలాగే కొనసాగాయి. కంటివెలుగు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతో సంక్షేమం ఈ ఏడాది కొత్త పుంతలు తొక్కింది. ప్రతిష్టాత్మక ఎయిమ్స్ మంజూరైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇతర ప్రాజెక్టుల పరిధిలో కొత్త ఆయకట్టుకు నీరు చేరింది. ఇవన్నీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు సానుకూలంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న పథకాలపై రౌండప్ మీకోసం. పెళ్లికి లక్షా నూట పదహార్లు.. అడబిడ్డ పెళ్లి చేయాలంటే భారంగా భావించే పేదలకు అండగా ఉండేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ను ప్రవేశపెట్టింది. 2014లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అమలైన ఈ పథకాన్ని ఆ తర్వాత బీసీలకు, అగ్రవర్ణాల్లోని పేదలకూ వర్తింపజేసింది. పథకం మొదలైన కొత్తలో రూ.51 వేలుగా ఉన్న సాయాన్ని గతేడాది రూ.75,116 వేలకు పెంచింది. ఈ ఏడాదిలో దీన్ని రూ.1,00,116కు పెంచింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఈ ఏడాది 1,21,793 మందికి సాయం అందింది. ఈ రెండు పథకాలతో లబ్ధిపొందిన వారిలో ఎస్సీలు 18,626, ఎస్టీలు 12,105, బీసీలు 62,453, ఈబీసీలు 6,369, మైనార్టీలు 22,240 మంది ఉన్నారు. అన్నదాతకు బీమా.. వ్యవసాయ కుటుంబంలోని పెద్ద చనిపోతే ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడుతుంది. ఇలాంటి దుస్థితిని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. వ్యవసాయ కుటుంబంలోని పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. ఎల్ఐసీతో ఒప్పందం చేసుకుని ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభమైంది. పట్టాదారుగా నమోదై, 60 ఏళ్లలోపు ఉన్న ప్రతి రైతుకు ఈ పథకం వర్తిస్తుంది. ఒక్కో రైతు పేరుమీద రూ.2,271 చొప్పున రూ.650 కోట్లను ప్రభుత్వం ఎల్ఐసీకి ఏడాది ప్రీమియం చెల్లించింది. రాష్ట్రంలో 60 ఏళ్లలోపు వయసున్న 28.3 లక్షల మంది ఈ పథకం కింద నమోదయ్యారు. రైతు బీమా అమల్లోకి వచ్చినప్పటి నుంచి దురదృష్టవశాత్తు 5 వేలకు పైగా రైతులు చనిపోయారు. వీరికి ఎల్ఐసీ రూ.230 కోట్లు విడుదల చేసింది. తెలంగాణకు ఎయిమ్స్.. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను మంజూరు చేస్తూ కేంద్రం ఈ ఏడాది నిర్ణయం తీసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.1,028 కోట్లు, ఎయిమ్స్ నిర్వహణలో కీలకమైన డైరెక్టర్ పోస్టును మంజూరు చేసింది. ఎయిమ్స్ మొదటి దశ పనులను 10 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. మూడు విడతల్లో పూర్తిస్థాయిలో ఎయిమ్స్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. 2019–20 విద్యా సంవత్సరంలో ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ కోర్సులు ప్రారంభించేలా నోటిఫికేషన్ జారీ చేసింది. రైతు బంధు.. రైతులకు పెట్టుబడి సాయమందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ‘రైతు బంధు’పేరిట రైతులకు నగదు ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టింది. 2018 ఖరీఫ్ నుంచి అమల్లోకి వచ్చింది. రబీలోనూ విజయవంతంగా అమలు చేశారు. రైతుబంధు పథకం అమలుకు ముందుగా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టింది. పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా సీజనుకు ఎకరానికి రూ.4 వేల చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. వర్షాకాలం సీజన్లో 1.4 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం ఇచ్చింది. చిన్న, సన్నకారు, పెద్ద రైతులు అనే తేడా లేకుండా వ్యవసాయ భూమి ఉన్న అందరికీ రైతుబంధు సాయం అందింది. రాష్ట్రంలో 58.16 లక్షల పట్టాదారులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 58.81 లక్షల చెక్కులను ముద్రించింది. 51.4 లక్షల చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. పంపిణీ చేసిన చెక్కుల విలువ మొత్తం రూ.5,437 కోట్లు. రబీలో 44 లక్షల మందికి రూ.4,500 కోట్ల పెట్టుబడి సొమ్మును బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. నీళ్లు పారాయి.. సాగునీటి రంగంలో ఈ ఏడాది గణనీయ పురోగతి కనిపించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రారంభించిన పనుల ఫలాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద గరిష్ట ఆయకట్టుకు నీరందేలా ప్రభుత్వం కృషి చేసింది. మిషన్ కాకతీయ కింద నాలుగు విడతల్లో పునరుద్ధరించిన చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఈ ఏడాది నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు నిండాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు పూర్తి కావడంతో ఏడు లక్షల ఎకరాలకు కొత్త నీరు అందించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ మధ్యతరహా ప్రాజెక్టుల కింద గరిష్ట ఆయకట్టుకు నీరు చేరింది. కాళేశ్వరం పనులు మరింత వేగవంతమయ్యాయి. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు పూర్తయిన పనులతో కొత్త ఆయకట్టుకు నీరు చేరింది. కోటి కళ్ల కొత్త చూపు.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ‘కంటి వెలుగు’పథకానికి శ్రీకారం చుట్టింది. మారుతున్న జీవనశైలితో కంటి జబ్బుల బాధితుల సంఖ్య పెరుగుతోంది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోని ఎర్రవల్లిలో కంటి పరీక్షల నిర్వహణ కార్యక్రమం ఈ పథకానికి స్ఫూర్తిగా నిలిచింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేయడం, శస్త్ర చికిత్సలు చేయించడం ఈ పథకం ఉద్దేశం. ఆగస్టు 15 నుంచి కంటి వెలుగు కార్యక్రమం మొదలైంది. వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం కోటి మందికిపైగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 45.15 లక్షల మంది పురుషులు, 54.85 లక్షల మంది మహిళలు ఉన్నారు. కంటి పరీక్షలు చేయించుకున్న కోటి మందిలో 36.61 లక్షల మందికి దృష్టి లోపాలు ఉన్నట్లుగా వైద్యులు నిర్ధారించారు. వీరిలో 16.66 లక్షల మందికి అక్కడికక్కడే ఉచితంగా సాధారణ కళ్లద్దాలు(రీడింగ్) పంపిణీ చేశారు. దృష్టి లోపం ఎక్కువగా ఉన్న మరో 12.95 లక్షల మందికి ప్రత్యేకంగా అద్దాలను తయారు చేసి ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు 4.47 లక్షల మందికి కంటి శస్త్ర చికిత్సలు చేయాలని వైద్యులు నిర్ధారించారు. త్వరలోనే శస్త్ర చికిత్సలు మొదలుకానున్నాయి. కొత్తగా 7 లక్షల ఎకరాలకు.. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల కంటే నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం గట్టిగా కృషి చేసింది. సాగునీటి మంత్రిగా హరీశ్‌రావు పట్టుదల తోడవడంతో మంచి ఫలితాలొచ్చాయి. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించడంతో కొత్తగా ఏడు లక్షల ఎకరాలకు నీరు చేరింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని కాలువ ఆధునీకరణతో హుజూరాబాద్, పెద్దపల్లి, పరకాల, వర్ధన్నపేట, పాలకుర్తి, డోర్నకల్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని పంటలకు, చెరువులకు నీరు అందింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భూసేకరణ అడ్డంకులతో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 57 చెరువు పనులు ఈ ఏడాది పూర్తయ్యాయి. దీంతో 82 వేల ఎకరాల కొత్త ఆయకట్టు సాధించారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు 75 శాతం పూర్తయ్యాయి. 2019 జూన్ నాటికి మొత్తం పనులను పూర్తి చే సి నీటిని తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేడిగడ్డ నుంచి కనిష్టంగా 90 టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి... అక్కడి నుంచి మిడ్‌మానేరు వరకు తరలించేలా పనులు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే రూ.24 వేల కోట్లు రుణాల రూపంలో ఖర్చు చేశారు. మరో ఎనిమిది వేల కోట్ల రుణాలతో తుపాకులగూడెం, సీతారామ, వరదకాల్వ పనులు చేశారు. రుణాల ద్వారా చెల్లింపులు చేస్తున్నా ప్రతి నెలా రూ.5 వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి. కొత్త ఏడాదిలో ఈ సమస్యను అధిగించేందుకు ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ–హబ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న రాష్ట్ర ప్రభుత్వం వీ–హబ్ ఇంక్యుబేటర్‌ను ప్రారంభించింది. స్టార్టప్‌ల ఏర్పాటుకు ఐడియాలతో వచ్చే ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం దీని ద్వారా అవసరమైన ప్రోత్సాహం అందిస్తోంది. గతేడాది రాష్ట్రంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఈఎస్) ముగింపు సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ‘వీ–హబ్’పేరుతో ఇంక్యుబేటర్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. -
తమిళ్ మున్నేట్ర పడమ్
2018లో సినిమాలు చూశాం.గొప్పగా చెప్పుకున్నాం.2019లోనూ పక్కవాళ్ల సినిమాల కంటే గొప్పగా ఉండాలని కోరుకుందాం.2018లో తమిళులు సినిమాల్లో ముందడుగు ఎలా వేశారో తెలుసుకుందాం.మున్నేట్రమ్ అంటే ముందడుగు.ఇంద(ఈ) తమిళ్ మున్నేట్ర పడమ్ పాక్కలామ్ (చూద్దాం). సంవత్సరం పూర్తి కావస్తోంది. కొత్త ఏడాది మొదలుపెట్టాలంటే ఈ ఏడాది ఎలా గడిచిందో విశ్లేషించుకోవాలి. మన సినిమాలకు సంబంధించిన లెక్కలు మొదలుపెట్టేశాం. ప్లస్సులు, మైనస్సులు, లాభ నష్టాలు అన్నీ లెక్క తేలుతున్నాయి. మనం ఎలా ఉన్నామో తెలియడానికి స్వీయ విశ్లేషణ ఒక్కటే సరిపోదు... మనం ఎక్కడున్నామో తెలియాలంటే పక్క ఇండస్ట్రీ వాళ్లతో పోల్చి చూసుకుంటే తప్పు లేదు. ఈ ఏడాది తమిళంలో వచ్చిన ‘పడమ్’(సినిమా)ల ప్రస్తావన.ఈ ఏడాది మొదటి సినిమా సీజన్‌ను విక్రమ్, సూర్య మొదలెట్టారు. పొంగల్‌కు పోటీగా రిలీజ్ అయిన ‘స్కెచ్’, తానా సేంద కూట్టమ్(గ్యాంగ్)’ చిత్రాలు యావరేజులుగా నిలిచాయి. ‘తానా సేంద కూట్టమ్’ పాటలు మార్కెట్‌ను విపరీతంగా ఊపేసినా ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ కాలేదనే చెప్పాలి. తెలుగు ప్రేక్షకులను భయపెట్టిన అనుష్క ‘భాగమతి’ ఏకకాలంలో తమిళంలోనూ విడుదలైంది. అక్కడ కొంత శాతం మాత్రమే ప్రేక్షకులు భయపడడంతో యావరేజ్‌గా నిలిచింది. అలా గ్రాండ్ స్టార్ట్ లేకుండానే 2018లో కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టింది తమిళ పరిశ్రమ. హంగామా లేదు ఫిబ్రవరిలో విజయ్ సేతుపతి ‘ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్ (ఓ మంచి రోజు చూసి చెబుతాను) రిలీజ్ అయింది. ఈ సినిమా ద్వారా నిహారిక కొణిదెల తమిళ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా పర్వాలేదనిపించుకుంది. జీవా, జై, శివ, కేథరీన్, నిక్కీ గల్రానీలతో దర్శకుడు సుందర్.సి తెరకెక్కించిన ‘కలకలప్పు 2’ అనుకున్నంత ఆడలేదు. ‘యాక్షన్ కింగ్’ అర్జున్ తన కుమార్తెను పరిచయం చేస్తూ తెరకెక్కించిన ‘సొల్లి విడవా’ సరిగ్గా ఆడలేదు. ‘36 వయదినిలే’తో కమ్‌బ్యాక్ ఇచ్చిన జ్యోతిక ఆ తర్వాత బాల దర్శకత్వంలో చేసిన చిత్రం ‘నాచ్చియార్’. ఇందులో పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించారు జ్యోతిక. సినిమా బాగానే ఆడింది. మొదటి నెల లానే రెండో నెల కూడా కలకలప్పు (హంగామా) లేకుండా మామూలుగా గడిచింది. బొమ్మ పడలేదు మధ్యలో ఏర్పడ్డ థియేటర్ల సమస్య కారణంగా రిలీజ్లు పల్చబడ్డాయి. పూర్తిగా బంద్ అయ్యాయి కూడా. దాంతో వెండితెరపై బొమ్మ పడలేదు. బాక్స్‌లన్నీ ల్యాబుల్లోనే ఉండాల్సిన పరిస్థితి. ఆ వివాదం సద్దుమణిగిన తర్వాత ఆగిపోయిన చిత్రాలన్నీ కూడా గేటు వదిలిన నీళ్లలా వారానికి 4,5 చిత్రాలు విడుదలయ్యాయి. విభిన్న కథ– స్క్రీన్‌ప్లేతో సినిమాలు రూపొందిస్తాడనే పేరు పొందిన కార్తీక్ సుబ్బరాజ్ సైలెంట్ థ్రిల్లర్ ‘మెర్కురీ’తో వచ్చాడు. ప్రభుదేవా ముఖ్య పాత్రలో నటించిన ఈ సైలెంట్ సినిమాకు మంచి చప్పట్లే పడ్డాయి. ‘మహానటి’ని ఏకకాలంలో ‘నడిగయర్ తిలగమ్’గా తమిళంలో రిలీజ్ చేశారు. సినిమాకు మంచి ప్రశంసలు వినపడ్డా అక్కడక్కడా జెమినీ గణేశన్ పాత్ర తీర్చిదిద్దిన విధానంపై కొందరు అసంతృప్తి వ్యక్తపరిచారు. మన ఫోన్లో ఉన్న సమాచారంతోనే మనల్ని ఎలా మభ్యపెట్టొచ్చు అనే కాన్సెప్ట్‌తో వచ్చిన ‘ఇరుంబుదురై’ (అభిమన్యుడు) చిత్రం విశాల్‌కు ఈ మధ్య కాలంలో పెద్ద హిట్‌గా నిలిచింది. మంచి వసూళ్లూ రాబట్టింది. కార్తీ రైతుగా కనిపించిన ‘కడైకుట్టి సింగం’ (చినబాబు) దెబ్బకు థియేటర్స్‌ను కన్నీటి పర్యంతం చేసేసింది. ఉద్వేగభరిత కుటుంబ కథా చిత్రంగా వంద రోజులాడేసింది. తమిళంలో మంచి హిట్ సాధించి, తెలుగులో ‘చిన్నబాబు’గా రిలీజ్ అయింది. తమిళ కమర్షియల్ సినిమాల్లో కనిపించే ఫార్ములాని పేరడీ చేసి తెరకెక్కించిన చిత్రం ‘తమిళ పడమ్ 2’. ‘తమిళ పడమ్’కు సీక్వెల్. బాగానే నవ్వుకున్నారు ఆడియన్స్. మన తెలుగు ‘సుడిగాడు’కు ఈ చిత్రమే ప్రేరణ. కామెడీ డాన్‌గా విజయ్ సేతుపతి చేసిన ‘జుంగా’ పెద్ద నష్టాన్నే మిగిల్చింది. యువన్ శంకర్ రాజా నిర్మాతగా మారి తీసిన ‘ప్యార్ ప్రేమ కాదల్’కు పాస్ మార్కులు పడ్డాయి. ఫస్ట్ పార్ట్‌కు ఐదేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన కమల్ హాసన్ ‘విశ్వరూపం 2’ చిత్రానికి తెలుగులో మంచి స్పందన రాకపోయినా తమిళంలో డీసెంట్ హిట్‌గా నిలిచింది. పలు వాయిదాల తర్వాత విడుదలైన నయనతార ‘ఇమైక్క నొడిగళ్’ మంచి హిట్ సాధించింది. ఈ సినిమా ద్వారానే రాశీ ఖన్నా తమిళ ఎంట్రీ ఇచ్చారు. శివకార్తికేయన్ ‘సీమరాజా’ పండగ సినిమాగా మిగిలిపోయింది. సమంత ‘యు టర్న్’ మంచి హిట్‌గా నిలిచింది. సీక్వెల్స్ ‘సామీ స్క్వేర్ (సామి 2), సండైకోళి 2 (పందెం కోడి 2) ఫస్ట్ పార్ట్ మ్యాజిక్‌ని రిపీట్ చేయలేకపోయాయి. విజయ్ దేవరకొండ ‘నోటా’కు మన దగ్గర అనుకున్నన్ని ఓట్లు పడకపోయినా తమిళంలో మంచి మెజారిటీ సాధించింది. ‘జయం’ రవి స్పేస్ సినిమా ‘టిక్ టిక్ టిక్’ కూడా మంచి ప్రయత్నం అనిపించుకుంది. చాలా కాలం తర్వాత మణిరత్నం సినిమా సూపర్ హిట్ టాక్ని తీసుకొచ్చింది. అరవింద స్వామి, శింబు, విజయ్ సేతుపతి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన ఈ మల్టీస్టారర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘చెక్క చివంద వానమ్’(నవాబ్) మంచి సక్సెస్‌గా నిలిచింది. విజయ్ – మురగదాస్ కాంబినే షన్లో వచ్చిన ‘సర్కార్’ సినిమా కలెక్షన్స్‌ల వర్షం కురిపించింది. అందులో రాజకీయ వివాదాల సహాయం కూడా లేకపో లేదు. జ్యోతిక ‘కాట్రిన్ మొళి’ పర్వాలేదనిపించింది.ఈ ఏడాది తమిళ ఇండస్ట్రీ ఎక్కువగా డిస్కస్ చేసుకున్న సైకో థ్రిల్లర్ ‘రాక్షసన్’. విష్ణు విశాల్ హీరోగా నటించి, నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది అద్భుతమైన రివ్యూలను సంపాదించిపెట్టింది. ప్రస్తుతం ఈ థ్రిల్లర్‌ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు నితిన్. ఇలాంటి రివ్యూస్ అందుకున్న మరో సినిమా ‘పరియేరుమ్ పెరుమాళ్’. దళిత సిద్ధాంతాలతో, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలతో మారి సెల్వరాజ్ రూపొందించిన ఈ చిత్రం కూడా మంచి రివ్యూలను అందుకుంది.దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో శంకర్ రూపొందించిన గ్రాఫికల్ సృష్టి చిట్టి. ‘2.0’ చూసిన ప్రేక్షకులు ‘హాలీవుడ్ సినిమా చూసినట్టే ఉంది’ అని అభినందించారు. ఆ ఆనందాన్ని కోట్లతో కలెక్షన్ల రూపంలో తెలియజేశారు. గత శుక్రవారం సుమారు నాలుగు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ‘మారీ 2, అడంగామారు, కానా, సిలుక్కువారిపట్టి సింగం’ సినిమాలు విడుదలయ్యాయి. మామూలుగా తమిళనాడులో ఒకేసారి ఇన్ని సినిమాలు విడుదల నిషిద్ధం. రూల్ బ్రేక్ చేసి, థియేటర్లకొచ్చిన ఈ ఐదు సినిమాలూ వసూళ్లు పంచుకుంటున్నాయి. అలా ఈ ఏడాది స్టార్ హీరోలు ఫార్ములానే నమ్ముకుంటే.. యంగ్ హీరోలు కొత్త కొత్త కాన్సెప్ట్స్‌తో దూసుకుపోయారు. బాక్సాఫీస్ ఆకలి తీర్చడానికి స్టార్ హీరోల సినిమాలు.. వంక పెట్టడానికి వీల్లేకుండా రివ్యూలు సాధించిన చిన్న సినిమాలూ ఉన్నాయి. మార్కెట్ ఉన్న హీరోలు డబ్బింగ్ సినిమాల ద్వారా మనల్ని పలకరిస్తూనే ఉన్నారు. అలా తమిళ, తెలుగు ఇండస్ట్రీలు ఎప్పటికప్పుడు మంచి సినిమాలు మార్చుకుంటూ, కొత్త కథలను ఇచ్చి పుచ్చుకుంటూ.. బైలింగువల్స్గా కొనసాగాలని కోరుకుందాం. ఇండియన్ సినిమా స్థాయిని ఇంకొంచెం పైకి తీసుకెళ్లడానికి కిందుండి (భౌగోళికంగా) కృషి చేద్దాం. గ్యాంగ్స్ట్టర్ ఇయర్ ఈ ఏడాది ధనుష్ ‘ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకీర్’ చిత్రం ద్వారా హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. అలాగే వెట్రిమారన్ దర్శకత్వంలో రూపొందిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘వడ చెన్నై’ రిలీజ్ అయింది. నార్త్ చెన్నైలోని ఓ గ్యాంగ్ గురించి చర్చించిన ఈ చిత్రం గ్యాంగ్‌స్టర్ చిత్రాల్లో ఓ డిఫరెంట్ అటెంప్ట్ అనిపించింది. అలాగే ‘మారి’ సీక్వెల్‌గా రూపొందిన ‘మారి 2’ను రిలీజ్ చేశారు. మరోవైపు ‘రాక్షసన్, పరియేరుమ్ పెరుమాళ్’ వంటి పేరు సంపాదించిపెట్టిన రెండు చిత్రాల దర్శకులు తమ నెక్ట్స్ సినిమాలను ధనుష్‌తో చేస్తున్నట్టు ప్రకటించేశారు. రజనీ ఎక్స్‌ప్రెస్ స్టార్ హీరోలు ఏడాదికి ఒక్కసారి కనిపించడమే ఎక్కువ అనుకుంటున్న రోజుల్లో సూపర్‌స్టార్ రజనీకాంత్ రెండు సినిమాలను రిలీజ్ చేశారు. మరో సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశారు. ‘రోబో’ సీక్వెల్ ‘2.ఓ’ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయి విడుదలలో జాప్యం అవుతూ వచ్చి ఈ ఏడాది రిలీజ్ అయింది. అలాగే పా. రంజిత్ తెరకెక్కించిన ‘కాలా’ జూలైలో రిలీజ్ అయింది. ‘కబాలీ’ తర్వాత రజనీతో తీసిన ‘కాలా’ సినిమాతో రంజిత్ అన్ని వర్గాల ఆడియన్స్‌ను రంజింపచేయలేకపోయారు. ఇక కార్తీక్ సుబ్బరాజ్‌తో రజనీ చేస్తున్న ‘పేట్టా’ షూటింగ్ కూడా అనుకున్నదానికంటే 15 రోజుల ముందే కంప్లీట్ చేసి ఆశ్చర్యపరిచారు. లేడీ సూపర్ స్టార్ రెండు డిఫరెంట్ జానర్ల సినిమాలతో ఈ ఏడాది స్క్రీన్‌పై కనిపించారు నయనతార. కొంతకాలంగా వాయిదా పడుతూ వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఇమైక్క నొడిగళ్’, డార్క్ కామెడీ ‘కోకో’ (కోలమావు కోకిల) చిత్రాలు రెండూ సూపర్‌హిట్. స్టార్ హీరోలకు సమానంగా ‘కోకో’కు చెన్నైలో ఉదయం నాలుగు గంటల షోలు ఏర్పాటు చేయడం విశేషం. నయన్ ఫాలోయింగ్ ఎలా ఉందో చెప్పడానికి ఇదో నిదర్శనం. పాంచ్ పటాకా ఈ మధ్య తమిళ సినిమాల గుర్తించి ప్రస్తావించాలంటే కచ్చితంగా డిస్కస్ చేయాల్సిన పేరులా విజయ్ సేతుపతి మారిపోయారు. దానికి కారణం ఆయన స్క్రిప్ట్‌ల ఎంపికే. ఈ ఏడాది ఏడు చిత్రాల్లో కనిపించారు సేతుపతి. (రెండు గెస్ట్ రోల్స్). ‘ఒరు నల్ల నాళ్ పాత్తు సొల్రేన్ (ఓ మంచి రోజు చూసి చెబుతాను) సినిమాతో ఓపెన్ చేసి ‘జుంగా, చెక్క చివంద వానమ్, 96, సీతకాత్తి’, సినిమాల్లో కనిపించారు. ‘జుంగా’లో అల్లరి డాన్‌గా కనిపిస్తే, ‘చెక్క చివంద వానమ్’లో పోలీస్ ఆఫీసర్ రసూల్‌గా కనిపించి, పవర్ కోసం పరిగెడుతున్న అన్నదమ్ములను ఏరిపారేశారు. ఆ తర్వాత టాక్ ఆఫ్ ది సౌత్ ఇండస్ట్రీ అయిన ‘96’లో కనిపించారు. జానకి, రామచంద్రన్ అనే ఇద్దరి ప్రేమకథను టేప్రికార్డర్లో పెట్టి రివైండ్ బటన్ నొక్కి అందర్నీ పాత జ్ఞాపకాల్లో పడేసిన సినిమా ఇది. హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన 8 సంవత్సరాల్లోనే సేతుపతి 25వ సినిమా (సీతకాత్తి) మైలు రాయి అందుకోవడం విశేషం. -
2018.. భారత్ ఆట.. పతకాల వేట
ఒకప్పుడు అంతర్జాతీయ స్థాయిలో భారత క్రీడాకారుల మెరుపులు అడపాదడపా కనిపించేవి. కానీ కొన్నేళ్లుగా ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. వేదిక ఏదైనా.. ప్రత్యర్థులు ఎవరైనా దీటుగా బదులిస్తూ.. వారిని బోల్తా కొట్టిస్తూ.. అద్వితీయ ప్రదర్శనతో అదరగొడుతూ.. మనోళ్లు నిలకడగా పతకాలు కొల్లగొడుతున్నారు. గత ఏడాది కంటే మెరుగ్గా అద్భుత ఫలితాలు నమోదు చేశారు. భారత క్రీడారంగాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. ప్రధానంగా ఏషియన్ గేమ్స్‌లో భారత్ సాధించిన పతకాలే అందుకు నిదర్శనం. ఇండోనేసియా వేదికగా జరిగిన ఏషియన్ గేమ్స్‌లో భారత్ 69(15 స్వర్ణాలు, 24 రజతాలు, 30 కాంస్యాలు) పతకాలు సాధించింది. ఓవరాల్ ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇదే అత్యుత్తమ ప్రదర్శన. అలానే మరికొన్ని ప్రముఖ ఈవెంట్లలో సైతం భారత్ సత్తా చాటి పతకాల వేటను కొనసాగించింది. వాటిలో కొన్నింటిని ఓ లుక్కేద్దాం. 1. పీవీ సింధు: వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీ లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు విజేతగా నిలిచింది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ప్లేయర్‌గా గుర్తింపు సాధించింది. ఫలితంగా బ్యాడ్మింటన్ టోర్నీని బంగారు పతకంతో ముగించింది. ఈ సీజన్లో ఆమెకు ఇదే తొలి టైటిల్ కాగా, అంతకుముందు వరల్డ్ చాంపియన్‌షిప్స్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ టోర్నీల్లో రజత పతకాలు సాధించింది. ఇక థాయ్‌లాండ్ ఓపెన్, ఇండియా ఓపెన్లలో సైతం సింధు రజత పతకాల్ని సాధించింది. ఆసియా క్రీడల్లో రజతం సాధించిన తొలి భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఘనతను సింధు సొంతం చేసుకుంది. 2. సైనా నెహ్వాల్: ఈ ఏడాది మరో మహిళా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ సైతం మంచి ఫలితాల్ని సాధించింది. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణంతో పాటు ఏషియన్ గేమ్స్, ఆసియా చాంపియన్‌షిప్‌లలో కాంస్య పతకాలను ఖాతాలో వేసుకుంది. ఓవరాల్‌గా చూస్తే నాలుగు టోర్నీల్లో(కామన్వెల్త్ గేమ్స్, డెన్మార్క్ ఓపెన్, ఇండోనేసియా ఓపెన్, సయ్యద్ మోదీ) సైనా ఫైనల్‌కు చేరింది. 3. సైనా-కశ్యప్‌ల వివాహం: భారత బ్యాడ్మింటన్ స్టార్స్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌లు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్న సైనా-కశ్యప్‌లు కుటుంబ సభ్యుల ఆశీస్సులతో డిసెంబర్14వ తేదీన వివాహం చేసుకున్నారు. రిజిస్టర్ వివాహం చేసుకున్న ఈ జంట.. ఆపై ఘనంగా హెచ్ఐసీసీలో రిసెప్షన్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి పలువురు క్రీడా, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు వధూవరులను ఆశీర్వదించారు. 4. సమీర్‌వర్మ: ఈ సీజన్లో భారత షట్లర్ సమీర్ వర్మ సయ్యద్ మోదీ గ్రాండ్ ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టైటిల్‌ను సాధించాడు. లక్నోలో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్ మ్యాచ్‌లో చైనాకు చెందిన లు గాంగ్జును ఫైనల్లో ఓడించి టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. ఇక మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ రన్నరప్‌గా నిలిచింది. ఫైనల్లో చైనా క్రీడాకారిణి హన్ యు చేతిలో సైనా ఓటమి పాలైంది. 5. అంగద్ వీర్ సింగ్ బజ్వా: ఆసియా షాట్‌గన్ చాంపియన్‌షిప్ స్కీట్ ఈవెంట్లో భారత షూటర్ అంగద్ వీర్ సింగ్ బజ్వా ప్రపంచ రికార్డు స్వర్ణంతో చరిత్ర సృష్టించాడు. కాంటినెంటల్, ప్రపంచస్థాయి స్కీట్ ఈవెంట్లలో స్వర్ణం సాధించిన తొలి భారత షూటర్‌గా అంగద్ రికార్డులకెక్కాడు. కువైట్ సిటీ వేదికగా జరిగిన ఈ చాంపియన్‌షిప్ ఫైనల్ రౌండల్ అంగద్ 60కి 60 పాయింట్లు సాధించి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. 10 మీటర్ల రైఫిల్ మిక్స్డ్ ఈవెంట్లో భారత జోడి ఎలవెనిల్ వలరివాన్-హ్రిదయ్ హజరికాలు గోల్డ్ సాధించారు. 6. స్వప్న బర్మన్: ఏషియన్ గేమ్స్‌లో 66 ఏళ్లుగా సాధ్యం కాని ఘనతను అద్భుత ప్రదర్శనతో బెంగాల్‌కు చెందిన 21 ఏళ్ల స్వప్న బర్మన్ సాధించింది. ఇండోనేసియా వేదికగా జరిగిన ఆసియా క్రీడల హెప్టాథ్లాన్‌లో తొలిసారి స్వర్ణం నెగ్గిన భారత అథ్లెట్‌గా రికార్డులకెక్కింది. అరుదైన విజయంతో చరిత్ర సృష్టించింది. హై జంప్, జావెలిన్ త్రోలలో టాపర్‌గా నిలిచిన ఈ బెంగాలీ యువతి... షాట్‌పుట్ , లాంగ్ జంప్ లో రెండో స్థానంలో వచ్చింది. ఇక 100 మీటర్ల పరుగులోనాలుగో స్థానంలో, 200మీ. పరుగులో సెకన్లతో నాలుగో స్థానంతో సరి పెట్టుకుంది. 64 పాయింట్ల ఆధిక్యంతో చివరిదైన 800 మీ. పరుగు బరిలో దిగిన బర్మన్... నాలుగో స్థానంలో నిలిచినా మెరుగైన పాయింట్లతో స్వర్ణం గెల్చుకుంది. 7. అర్పిందర్ సింగ్: ఆసియా క్రీడల్లో భాగంగా ట్రిపుల్ జంప్‌లో భారత జంపర్ అర్పిందర్ 16.77 మీటర్ల దూరం దూకి స్వర్ణంతో మెరిశాడు. కనీసం ఈ పోటీల్లో జాతీయ రికార్డును సవరిస్తే చాలు అనుకున్న అర్పిందర్ ఏకంగా పసిడిని పట్టేయడం విశేషం. దీంతో ఈ విభాగంలో 48 ఏండ్లుగా ఊరిస్తు వస్తున్న స్వర్ణ ఆశలకు తెరదించాడు. 2014 కామన్వెల్త్ గేమ్స్ తర్వాత ఒక్క పతకం కూడా గెలువని అర్పిందర్.. ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌లో పసిడిని సాధించి అందరినీ అబ్బురపరిచాడు. 8. తేజిందర్ పాల్ సింగ్: ఆసియా క్రీడల్లో షాట్‌పుట్ ఈవెంట్లో పోటీపడిన తేజిందర్‌పాల్ సింగ్ స్వర్ణాన్ని సాధించాడు. రికార్డు స్థాయిలో గుండుని 20.75 మీటర్లు విసిరి పసిడి పతకాన్ని గెలుపొందాడు. ఇలా అథ్లెటిక్స్‌లో తొలి స్వర్ణం అందజేశాడు. తొలి ప్రయత్నంలో గుండును 19.96 మీటర్లు విసిరిన తజిందర్ రెండో ప్రయత్నంలో 19.15 మీటర్లు విసిరాడు. దీంతో ఒత్తిడికి గురైన తేజిందర్ మూడో ప్రయత్నంలో విఫలమయ్యాడు. నాలుగో ప్రయత్నంలో మాత్రం మళ్లీ 19.96 మీటర్లు విసిరి మునుపటి లయని అందుకున్నాడు. ఐదోసారి కసితో ఆడి ఆసియా క్రీడల్లోనే రికార్డు నెలకొల్పేలా గుండును 20.75 మీటర్లు విసిరాడు. ఆరోసారి 20 మీటర్లకు పరిమితం అయ్యాడు. 9. రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ జోడికి స్వర్ణం: ఆసియా క్రీడల టెన్నిస్‌లో రోహన్ బోపన్న–దివిజ్ శరణ్ (భారత్) జంట స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అలెగ్జాండర్ బుబ్లిక్–డెనిస్ యెవ్సెయెవ్ (కజకిస్తాన్) ద్వయంపై గెలుపొందిన బోపన్న–శరణ్ జోడి పసిడి సాధించింది. ఫలితంగా తమ కెరీర్లో ఏషియాడ్ డబుల్స్ స్వర్ణాన్ని తొలిసారి సొంతం చేసుకుంది. 10. వుషూలోనూ మెరిశారు: ఈ ఏడాది జరిగిన ఆసియా క్రీడల వుషూ ఈవెంట్లో భారత్ నాలుగు కాంస్య పతకాల్ని సాధించింది. ఇది ఏషియన్ గేమ్స్ వుషూ చరిత్రలో భారత్‌కు ఇది అత్యుత్తమ ప్రదర్శన. అంతకుముందు 2014లో రెండు క్యాంస పతకాల్ని మాత్రమే సాధించగా.. ఈసారి దాన్ని మరింత మెరుగుపరుచుకుంది. వుషూలో పతకాలు సాధించిన వారిలో రోషిబినా దేవీ(60 కేజీల కేటగిరీ), సంతోస్ కుమార్(56 కేజీల కేటగిరీ), సూర్య భాను ప్రతాప్ సింగ్(60 కేజీల కేటగిరీ), నరేందర్ గ్రావెల్(65 కేజీల కేటగిరీ)లు ఉన్నారు. 11. సెపక్తక్రా: ఆసియాగేమ్స్ సెపక్‌తక్రాలో ఈవెంట్లో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించి కొత్త చరిత్రను లిఖించింది. ఆసియాగేమ్స్‌లో భాగంగా భారత పురుషుల జట్టు సెమీఫైనల్లో థాయ్‌లాండ్ చేతిలో ఓటమి పాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. ఈ గేమ్స్ చరిత్రలో సెపక్తక్రా క్రీడాంశంలో భారత్ కనీసం కాంస్య పతకాన్ని సాధించడం ఇదే తొలిసారి. 12. వినేశ్ ఫొగాట్: ఆసియా క్రీడల మహిళల రెజ్లింగ్ చరిత్రలో వినేశ్ ఫొగాట్ రూపంలో తొలిసారి భారత వనిత పసిడి పట్టు పట్టింది. అదీ కూడా ప్రపంచ మహిళల రెజ్లింగ్‌లో తిరుగులేని శక్తిగా పేరున్న జపాన్ క్రీడాకారిణిని చిత్తు చేసి ఈ ఘనత సాధించింది. మహిళల ఫ్రీస్టయిల్ 50 కేజీల విభాగంలో వినేశ్ ఫొగాట్ విజేతగా నిలిచింది. ఫలితంగా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా గుర్తింపు పొందింది. 13. బజరంగ్ పూనియా: ఆసియా క్రీడల్లో రెజ్లర్ బజరంగ్ పూనియా గోల్డ్ సాధించాడు. 65 కేజీల పురుషుల విభాగంలో జపాన్ రెజ్లర్ తకాతాని దైచిని ఓడించిన పూనియా పసిడిని ఒడిసి పట్టుకున్నాడు. 14. గోల్డెన్ జాన్సన్: ఆసియా క్రీడల్లో జిన్సన్ జాన్సన్ స్వర్ణం ఒడిసిపట్టాడు.1500 మీ. పరుగులో జాన్సన్ పసిడితో మెరిశాడు. 3 నిమిషాల 44.72 సెకన్లలో రేసు పూర్తి చేసి బంగారు పతకం అందుకున్నాడు. 800 మీటర్ల పరుగులో రజతంతో సంతృప్తిపడిన జాన్సన్...1500 మీ. పరుగులో మాత్రం అందరి కంటే ముందు లక్ష్యాన్ని చేరి బంగారు పతకాన్ని సాధించాడు. 15.జెరెమీ లాల్రిన్గుంగా: అర్జెంటీనా వేదికగా జరిగిన యూత్ ఒలింపిక్స్‌లో భారత్ టీనేజ్ వెయిట్‌లిఫ్టింగ్ సంచలనం జెరెమీ లాల్రిన్గుంగా స్వర్ణ పతకాన్ని సాధించి కొత్త చరిత్ర సృష్టించాడు. వెయిట్‌లిఫ్టింగ్ పోరులో 15 ఏళ్ల లాల్రిన్గుంగా ఫైనల్ అటెంప్ట్‌లో 150 కేజీల బరువు ఎత్తడంతో పసిడిని ఒడిసి పట్టుకున్నాడు. గ్రూప్-ఎలో భాగంగా 62 కేజీల విభాగంలో పోటీపడ్డ ఈ యువ వెయిట్‌లిఫ్టర్.. మొత్తంగా 274 కేజీల బరువు ఎత్తి స్వర్ణాన్ని సాధించాడు. తొలుత స్నాచ్ విభాగంలో అత్యధికంగా 124 కేజీల బరువును సునాయాసంగా ఎత్తిన జెరెమీ.. క్లీన్ అండ్ జర్క్‌లో అత్యధికంగా 150కేజీలను ఎత్తాడు. 16. తబాబి దేవి: యూత్ ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలిసారి జూడోలో పతకం లభించింది. 44 కిలోల కేటగిరిలో తంగ్జమ్ తబాబి దేవి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. సీనియర్ లేదా యూత్ స్థాయిలో పరంగా చూసిన జూడోలో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. 17. దీపా కర్మాకర్: టర్కీలో జరిగిన జిమ్నాస్టిక్స్ వరల్డ్ చాలెంజ్కప్లో భారత జిమ్నాస్ట్ దీపాకర్మాకర్ స్వర్ణాన్ని సాధించి కొత్త చరిత్రను లిఖించింది. ఈ గేమ్స్‌లో భారత్ తరపున పసిడి సాధించిన తొలి భారత జిమ్నాస్ట్‌గా గుర్తింపు పొందింది. 18. సునీల్ ఛెత్రి: జూన్ నెలలో జరిగిన ఇంటర్ కాంటినెంటల్ కప్‌లో భారత ఫుట్‌బాల్ కెప్టెన్ సునీల్ ఛెత్రి అత్యధిక అంతర్జాతీయ గోల్స్ సాధించిన ఆటగాడిగా రెండోస్థానం పొందాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్‌తో లియోనల్ మెస్సీతో కలిసి సంయుక్తంగా రెండోస్థానంలో నిలిచాడు. 19.నవజ్యోత్ కౌర్: భారత మహిళా రెజ్లర్ నవజ్యోత్ కౌర్ కొత్త చరిత్ర లిఖించింది. కిర్గిస్తాన్‌లో జరిగిన ఆసియా సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం నెగ్గి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్‌గా గుర్తింపు పొందింది. 20. సానియా మీర్జాకు పుత్రోత్సాహం: అక్టోబర్ నెలలో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా పుత్రుడికి జన్మనిచ్చింది. సానియా, షోయబ్‌లకు 2010 ఏప్రిల్ 12న హైదరాబాద్‌లో వివాహం జరగ్గా.. ఈ ఏడాది ఆ దంపతులకు కొడుకు పుట్టాడు. ఆరు గ్రాండ్‌స్లామ్ డబుల్స్ టైటిల్స్ గెలుచుకున్న 32 ఏళ్ల సానియా సుదీర్ఘ కాలం పాటు డబుల్స్‌లో వరల్డ్ నంబర్‌వన్‌గా కొనసాగింది. 21. సాక్షి మాలిక్: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో సాక్షి మాలిక్(57 కేజీలు) స్వర్ణ పతకం నెగ్గింది. తుదిపోరులో నికోలినా కాసిక్ (క్రొయేషియా)పై సాక్షి విజయం సాధించింది. 22. మేరీకోమ్: ముప్పై ఐదేళ్ల వయసు.. ముగ్గురు పిల్లల తల్లి అయినా తనలో ఏ మాత్రం సత్తా తగ్గలేదని మహిళా బాక్సర్ మేరీకోమ్ తన ప్రదర్శనతో నిరూపించింది. నవంబర్‌లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మేరికోమ్ పసిడి సొంతం చేసుకుంది. తద్వార ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలు నెగ్గిన తొలి మహిళా బాక్సర్‌గా చరిత్ర సృష్టించింది. ఈ స్వర్ణంతో ఈ మణిపురి మణిపూస క్యూబా పురుషుల బాక్సింగ్ దిగ్గజం ఫెలిక్స్ సవాన్ సరసన చేరింది. ఏప్రిల్‌లో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి సొంతం చేసుకున్న మేరీ.. ఫిబ్రవరిలో జరిగిన స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో రజతం సరిపెట్టుకుంది. సెప్టెంబర్‌లో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ మేరికోమ్‌ను గిరిజనుల ప్రచారకర్తగా నియమించింది. ఇదే నెలలో పొలాండ్‌లో జరిగిన బాక్సింగ్ చాంపియన్‌షిప్ కోసం నాలుగు గంటల్లో రెండు కిలోలు తగ్గి ఔరా అనిపించింది. -
2018.. పరుగుల కింగ్ కోహ్లినే
గతేడాది జరిగిన సిరీస్‌ల్లో జైత్రయాత్ర కొనసాగించిన భారత క్రికెట్ జట్టు.. ఈ ఏడాది మిశ్రమ ఫలితాలు నమోదు చేసింది. ప్రధానంగా స్వదేశంలో ఘన విజయాల్ని సాధించిన టీమిండియా.. విదేశీ పర్యటనల్లో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించడంలో విఫలమైంది. ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్ స్థానంలో కొనసాగుతున్న విరాట్ సేన.. వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో మాత్రం రెండో స్థానంలో నిలిచింది. ఇక ఆటగాళ్ల ర్యాంకు పరంగా చూస్తే బ్యాటింగ్ విభాగంలో విరాట్ కోహ్లి టెస్టులతో పాటు, వన్డేల్లో కూడా అగ్రస్థానంలో కొనసాగుతుండగా, వన్డే బౌలింగ్ విభాగంలో బూమ్రా టాప్‌లో ఉన్నాడు. 1. దక్షిణాఫ్రికా పర్యటన : ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లిన భారత జట్టు టెస్టు సిరీస్‌ను చేజార్చుకుంది. భారత జట్టు 1-2 తేడాతో సఫారీల చేతిలో ఓటమి పాలై సిరీస్‌ను సమర్పించుకుంది. వరుసగా రెండు టెస్టు మ్యాచ్‌లు ఓడిపోయిన భారత్.. చివరి టెస్టులో మాత్రం గెలిచి ఊపిరిపీల్చుకుంది. ఆపై వన్డే సిరీస్‌ను భారత్ 5-1తో కైవసం చేసుకుంది. ఫిబ్రవరి 10న జరిగిన నాలుగో వన్డేలో మినహా అన్నింటిల్లోనూ భారత్ విజయాలు నమోదు చేసింది. నాలుగో వన్డేలో దక్షిణాఫ్రికా డక్‌వర్త్‌లూయిస్ ప్రకారం 5 వికెట్ల తేడాతో గెలుపు సాధించింది. టీ 20 సిరీస్‌లోనూ భారత్ 2-1 తేడాతో దక్షిణాఫ్రికాను చిత్త చేసింది. 2. నిదహాస్ ట్రై సిరీస్: శ్రీలంక వేదికగా మార్చి నెలలో జరిగిన నిదహాస్ ట్రై సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. శ్రీలంక, భారత్‌తో పాటు బంగ్లాదేశ్ ఈ సిరీస్‌లో పాల్గొంది. 3. అఫ్గాన్‌తో ఏకైక చారిత్రాత్మక టెస్ట్‌లో భారత్ విజయం(జూన్ 14 నుంచి 18 వరకు జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 26 పరుగుల తేడాతో టీమిండియా విజయం). ఈ టెస్టు మ్యాచ్‌కు అజింక్యా రహానే నేతృత్వం వహించాడు. ఈ మ్యాచ్‌లో భారత్ ఏకపక్ష విజయం సాధించింది. 4. ఐర్లాండ్ రెండు టీ20ల సిరీస్: ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌ను భారత్ 2-0 తో క్లీన్‌స్వీప్ చేసింది. జూన్27వ తేదీన జరిగిన తొలి టీ20లో భారత్ 76 పరుగుల తేడాతో విజయం సాధించగా, రెండో టీ20లో 143 పరుగులతో జయభేరి మోగించింది. 5. ఐర్లాండ్ సిరీస్ ముగించుకుని ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన భారత్‌కు శుభారంభం లభించింది. టీ20 సిరీస్‌ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. అటు తర్వాత మూడు వన్డేల సిరీస్‌ను భారత్ 1-2తో కోల్పోయింది. తొలి వన్డేలో గెలిచినప్పటికీ, మిగతా రెండు వన్డేల్లో భారత్ ఓటమి పాలై సిరీస్‌ను సమర్పించుకుంది. ఇక టెస్టు సిరీస్‌లో భారత్‌కు ఘోర పరాభవం ఎదురైంది. టెస్టు సిరీస్‌లో భారత్ 4-1తో కోల్పోయింది. ఆగస్టు 18 నుంచి 22 వరకూ నాటింగ్హమ్లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో భారత్ 203 పరుగుల తేడాతో విజయం సాధించింది. 6. ఆసియాకప్ భారత్ కైవసం: దుబాయ్ వేదికగా ఆరు దేశాల పాల్గొన్న ఆసియాకప్‌లో భారత్ విజేతగా నిలిచింది. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ జరిగిన ఈ టోర్నీలో భాగంగా ఫైనల్లో బంగ్లాదేశ్‌ను 3 వికెట్ల తేడాతో ఓడించిన భారత్ కప్‌ను ముద్దాడింది. పాకిస్తాన్,అఫ్గానిస్తాన్‌లు సూపర్-4 దశతోనే సరిపెట్టుకోగా, శ్రీలంక లీగ్ దశలోనే నిష్క్రమించింది. 7. విండీస్‌తో ద్వైపాక్షిక సిరీస్: సెప్టెంబర్ చివరి వారంలో భారత్ పర్యటనకు వచ్చిన విండీస్ టెస్టు సిరీస్‌తో పాటు వన్డే, టీ20 సిరీస్‌ను కోల్పోయి స్వదేశానికి రిక్తహస్తాలతో వెనుదిరిగింది. రెండు టెస్టుల సిరీస్‌ను 2-0 క్లీన్‌స్వీస్ చేసిన భారత్.. ఐదు వన్డేల సిరీస్ 3-1తో సాధించింది. రెండో వన్డే టైగా ముగియగా, మూడో వన్డేలో విండీస్ విజయం నమోదు చేసింది. ఇక మూడు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. 8. ఆసీస్‌తో ద్వైపాక్షిక సిరీస్: ఆసీస్ పర్యటనలో భాగంగా టీమిండియా ముందుగా టీ20 సిరీస్‌ను ఆడింది. నవంబర్ 21వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరు జట్లు తలో మ్యాచ్ గెలవగా, రెండో టీ20 వర్షం వల్ల రద్దయ్యింది. దాంతో సిరీస్ సమం అయ్యింది. ఆపై నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా డిసెంబర్ 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకూ జరిగిన తొలి టెస్టులో భారత్ 31 పరుగుల తేడాతో విజయం సాధించగా, డిసెంబర్ 14వ తేదీ నుంచి 18 వరకూ జరిగిన రెండో టెస్టులో 146 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. 9. గౌతం గంభీర్ రిటైర్మెంట్: టీమిండియా సీనియర్ క్రికెటర్ గౌతం గంభీర్ అనూహ్యంగా తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఢిల్లీ-ఆంధ్రా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ రంజీ ట్రోఫీ మ్యాచే గంభీర్‌కు చివరిది. 2016లో ఇంగ్లండ్‌తో చివరి టెస్ట్ ఆడిన గంభీర్.. చివరి వన్డేను 2013లో ఇంగ్లండ్‌తోనే ఆడాడు. 10. రిషబ్ పంత్: ఈ ఏడాది ఆగస్టులో ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టెస్టు ద్వారా అరంగేట్రం చేసిన టీమిండియా యువ కీపర్ రిషబ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఐదు క్యాచ్‌లను అందుకున్న నాల్గో భారత కీపర్‌గా గుర్తింపు పొందాడు. మరొకవైపు ఒక టెస్టు మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన భారత వికెట్ కీపర్‌గా అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఇటీవల ఆసీస్‌తో ఇక్కడ జరిగిన తొలి టెస్టులో రిషభ్ ఈ ఫీట్ సాధించాడు. ఈ టెస్టు మ్యాచ్‌లో రిషభ్ పట్టిన క్యాచ్‌లు 11. ఫలితంగా టీమిండియా తరుఫున ఇప్పటివరకూ సాహా పేరిట ఉన్న రికార్డును రిషభ్ బ్రేక్ చేశాడు. 11. అండర్-19 వరల్డ్‌కప్‌లో రికార్డు: ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆసీస్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచి అండర్-19 వరల్డ్‌కప్‌లో కొత్త చరిత్రను లిఖించింది. పృథ్వీ షా నేతృత్వంలోని యువ జట్టు.. పటిష్టమైన ఆసీస్‌ను మట్టికరిపించి కప్‌ను సగర్వంగా అందుకుంది. ఈ ట్రోఫీని అత్యధిక సార్లు గెలిచిన జట్టుగా భారత్ రికార్డు సృష్టించింది. అండర్-19 వరల్డ్‌కప్‌లో ఆరుసార్లు ఫైనల్‌కు చేరిన భారత్.. నాలుగుసార్లు విజేతగా నిలిచింది. ఈ ఓవరాల్ టోర్నీలో అత్యధిక సార్లు కప్‌ల జాబితా ప్రకారం భారత్ తొలిస్థానంలో ఉంది. ఇక్కడ ఆసీస్ మూడు వరల్డ్‌కప్‌లతో రెండో స్థానంలో ఉంది. 12. పృథ్వీ షా రికార్డులు: ఈ ఏడాది అక్టోబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా ఈ ఫార్మాట్లోకి అడుగుపెట్టిన టీమిండియా యువ కెరటం పృథ్వీషా పలు రికార్డులు సాధించాడు. భారత్ తరుపున ఆడుతున్న తొలి మ్యాచ్‌లోనే సెంచరీ సాధించిన పిన్నవయస్కుడిగా షా రికార్డు నెలకొల్పాడు. మరొకవైపు పిన్న వయసులోనే తొలి టెస్టు సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 18 ఏళ్ల 329 రోజుల వయసులోనే షా ఈ ఘనత సాధించాడు. అంతకుముందు సచిన్ టెండూల్కర్ 17 ఏళ్ల 112 రోజుల వయసులో తొలి టెస్టు సెంచరీ సాధించాడు. టెస్టు అరంగేట్రంలో ఫాస్టెస్ సెంచరీ సాధించిన మూడో ఓవరాల్ క్రికెటర్‌గా పృథ్వీ షా గుర్తింపు సాధించాడు. 13. మిథాలీ-పొవార్‌ల వివాదం: మహిళా టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరిగిన సెమీస్‌లో తనను అర్థాంతరంగా తప్పించడం వెనుక కోచ్ రమేశ్ పవార్, మాజీ కెప్టెన్, పరిపాలకుల కమిటీ (సీఓఏ) మెంబర్ డయానా ఎడుల్జీల హస్తం ఉందని సీనియర్ క్రికెటర్ మిథాలీ రాజ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే సమస్య ఆ ఒక్క మ్యాచ్‌తో మాత్రమే కాదని, తనను లక్ష్యంగా చేసుకొని కోచ్ రమేశ్ పొవార్ వ్యవహరించారని మిథాలీ పేర్కొంది. ఇన్నేళ్లపాటు దేశానికి ఆడిన తర్వాత అవమానకర రీతిలో తనతో ప్రవర్తించారని హైదరాబాద్ ప్లేయర్ కన్నీళ్లపర్యంతమైంది. కాగా, ఓపెనర్‌గా పంపకపోతే ప్రపంచకప్ నుంచి తప్పుకొని, రిటైర్మెంట్ ప్రకటిస్తానని మిథాలీ రాజ్ బెదిరించిందని బీసీసీఐకి రాసిన లేఖలో పవర్ తెలపడం మరింత అగ్గి రాజేసింది. ఇక్కడ మరొకసారి పొవార్‌ను కోచ్‌గా నియమించాలంటూ టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కోరడం కొసమెరుపు. 14. పరుగుల కింగ్ కోహ్లినే: ఈ ఏడాది డిసెంబర్ 27 వరకు లెక్కలు తీసుకుంటే టెస్టుల్లో విరాట్ కోహ్లి అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 2018లో 13 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 23 ఇన్నింగ్స్‌లకు గాను 1322 పరుగులు సాధించాడు. అంతేకాదు ఈ ఏడాది వెయ్యి పరుగులు సాధించిన ఏకైక టెస్ట్ బ్యాట్స్‌మన్ కోహ్లి. ఇక వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో కోహ్లినే తొలి స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది 14 వన్డేలు ఆడిన భారత కెప్టెన్.. 1202 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు. . మరొకవైపు విదేశాల్లో ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టెస్టు పరుగులు సాధించిన భారత క్రికెటర్‌గా కోహ్లి రికార్డు నెలకొల్పాడు. ఇక టెస్ట్‌ల్లో అత్యంత వేగంగా 25 సెంచరీలు పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లి గుర్తింపు పొందాడు. 128 ఇన్నింగ్స్‌లో కోహ్లి ఈ ఘనత సాధించి సచిన్ రికార్డును(130 ఇన్నింగ్స్‌లు) బ్రేక్ చేశాడు. -
2018.. కేరళను ముంచెత్తిన వరదలు
2018 ఆరంభంలో చప్పగా సాగినప్పటికీ చివరికొచ్చే సరికి దేశంలో రాజకీయాలు వేడెక్కాయి. పలు రాష్ట్రాల శాసనసభకు జరిగిన ఎన్నికలు, 2019 సంవత్సరం అత్యంత ఆసక్తికర సన్నివేశాలకు శ్రీకారం చుట్టనుంది. సీబీఐలో జగడం, సుప్రీం జడ్జీల మధ్య వివాదం... పలు రాష్ట్రాల్లో ప్రజా తీర్పులు... 2018 ని ఒక్కసారి తరిచి చూస్తే.... (సాక్షి రౌండప్) థియేటర్లలో జాతీయ గీతం (జనవరి 9) సినిమా థియేటర్లలో జాతీయగీతం పాడటం తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు జనవరి 9న స్పష్టం చేసింది. సినిమా హాళ్లలో చలనచిత్ర ప్రదర్శనకు ముందుగా జాతీయగీతం పాడటం తప్పనిసరని, ఆ సమయంలో ప్రేక్షకులు లేచి నిలబడాలని 2016 నవంబర్ 30 న ఇచ్చిన ఆదేశాలను తదనుగుణంగా మార్పు చేసింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 12 మంది సభ్యుల మంత్రివర్గ కమిటీ సినిమా థియేటర్లలో జాతీయగీతం పాడటంపై తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. సుప్రీంకోర్టులో సంక్షోభం (జనవరి 12) దేశ న్యాయ వ్యవస్థ చరిత్రలో తొలిసారిగా నలుగురు సీనియర్ న్యాయముర్తులు మీడియా ముందుకు వచ్చారు. సీజేఐ తీరును ఆక్షేపిస్తూ సీనియర్ జడ్జిలు జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ మదన్ బి లోకూర్, జస్టిస్ కురియన్ జోసెఫ్‌లు మీడియా సమావేశం నిర్వహించారు. కొద్ది నెలలుగా కోర్టు పాలన వ్యవస్థలో అవాంఛనీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని సంధించిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. కీలక కేసుల కేటాయింపుల విషయంలో అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రాపై ఆరోపణలు సంధించారు. కావేరీ జలాలపై కీలక తీర్పు (ఫిబ్రవరి 16) తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య దశాబ్దాలుగా నడుస్తున్న కావేరీ నదీ జలాల వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 2007లో కావేరీ జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (సీడబ్ల్యూడీటీ) కేటాయించిన నీటి వాటాల్లో మార్పులు చేస్తూ కర్ణాటకకు మరో 14.75 టీఎంసీల నీటిని వాడుకునే అవకాశం ఇచ్చింది. కమల్ హాసన్ కొత్త పార్టీ (ఫిబ్రవరి 21) ప్రఖ్యాత హీరో కమల్ హాసన్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. మధురైలో తన పార్టీ పేరును, పతాకాన్ని ఆవిష్కరించారు. ‘మక్కల్ నీది మయ్యం’ (ప్రజా న్యాయ వేదిక) పేరుతో ప్రజాక్షేత్రంలోకి దిగబోతున్నట్లు ప్రకటించి ఐకమత్యాన్ని ప్రతిబింబించేలా రూపొందించిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం (మార్చి09) సుమారు పాతికేళ్ల కమ్యూనిస్టుల పాలన అనంతరం త్రిపురలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం కొలువుతీరింది. ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా విప్లవ్ కుమార్ (48) ప్రమాణం చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 35 స్థానాలు గెలుచుకుని సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన బలం సంపాదించుకుంది. బీజేపీ భాగస్వామ్య పార్టీ అయిన ఇండిజీనియస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్టీ) 8 సీట్లు గెలుచుకుంది. సీపీఎం కేవలం 16 స్థానాల్లో మాత్రమే గెలుపొందింది. 39 మందిని చంపిన ఉగ్రవాదులు (మార్చి 20) ఇరాక్‌లో నాలుగేళ్ల క్రితం( జూన్ 15, 2014) ఐఎస్ ఉగ్రవాదులు అపహరించిన భారతీయుల కథ విషాదాంతమైంది. ఆ 39 మంది మరణించారని కేంద్రం ప్రకటించింది. వారిని ఉగ్రవాదులు ఊచకోత కోసి మోసుల్ పట్టణ సమీపంలో పూడ్చిపెట్టినట్లు గుర్తించామని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ప్రకటించారు. సల్మాన్‌కు ఐదేళ్ల జైలు (ఏప్రిల్ 5) కృష్ణ జింకల్ని వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (52)కు ఐదేళ్లు జైలు శిక్ష పడింది. సల్మాన్‌ను దోషిగా నిర్దారిస్తూ జోధ్‌పూర్ ట్రయల్ కోర్టు ఈ తీర్పు వెలువరించింది. హమ్ సాథ్ హై షూటింగ్ సమయంలో (1998) రాజస్తాన్‌లోని కంకిణి గ్రామంలో రెండు కృష్ణ జింకల్ని సల్మాన్ కాల్చి చంపారని కేసు నమోదైంది. కర్ణాటకలో కొలువుతీరిన సంకీర్ణం (మే 15) కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో 103 స్ధానాల్లో గెలుపొందిన బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ 78 స్ధానాలను హస్తగతం చేసుకోగా, జేడీఎస్ 37 స్ధానాల్లో గెలుపొందింది. అయితే జేడీఎస్-కాంగ్రెస్ కూటమిగా ఏర్పడటంతో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. స్టెరిలైట్ ఆందోళనలు హింసాత్మకం (మే 23) స్టెరిలైట్ ప్లాంట్‌కు వ్యతిరేకంగా తమిళనాడులో వంద రోజుల పాటు సాగిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది. తూత్తుకుడి ఘటనలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది మరణించగా, 60 మందికి గాయాలయ్యాయి. దుమ్ము తుపాన్‌తో 17 మంది మృతి (జూన్ -3) యూపీలో చెలరేగిన దుమ్ము తుఫానులో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ తుపాన్ దాటికి 24 గంటల్లోనే 13 మంది చనిపోయారు. సీతాపూర్ జిల్లాలో ఆరుగురు, గొండాలో ముగ్గురు, కౌశాంబిలో ఇద్దరు చనిపోగా, ఫైజాబాద్, హర్డొయ్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు. దీని ప్రభావంతో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. లోయలో బస్పులో... 48 మంది మృతి (జూలై 1) ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పౌడీ జిల్లాలో అదుపుతప్పిన ఓ ప్రైవేటు బస్సు 200 మీటర్ల లోయలో పడటంతో 48 మంది మరణించారు. 28 సీట్లుండే బస్సులో 58 మంది ప్రయాణించడంతో ప్రమాదం సంభవించింది. సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు (జూలై 18) శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశం వారికి రాజ్యాంగం కల్పించిన హక్కు అని సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. అయ్యప్ప ఆలయంలో మహిళలు కూడా పూజలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. సుప్రీం తీర్పును పలు రాజకీయ పార్టీలు, మహిళా, ప్రజా సంఘాలు స్వాగతించగా.. సంప్రదాయవాదులు మాత్రం తీవ్రంగా తప్పుబడుతున్నారు. కరుణానిధి అస్తమయం (ఆగస్ట్ 7) డీఎంకే కురువృద్ధుడు కరుణానిధి (94) మరణంతో యావత్ తమిళనాడు శోకసంద్రంలో మునిగింది. ద్రవిడ రాజకీయాలపై చెరగని ముద్రవేసిన దిగ్గజం సెలవంటూ అనంతలోకాలకు తరలింది. అనారోగ్యంతో బాధపడుతూ తుదిశ్వాస విడిచిన కరుణానిధికి ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. కేరళను కుదిపిన భారీ వర్షాలు (ఆగస్ట్ 8) కేరళను భారీ వర్షాలు కుదిపివేశాయి. తీరప్రాంతాన్ని ముంచెత్తిన వరదల్లో 26 మంది మరణించారు. వరద తాకిడికి 24 డ్యాముల గేట్లు ఎత్తివేశారు. కనీవినీ ఎరుగని వరదలతో 26 ఏళ్ల తర్వాత చెరుతోని డ్యాం గేట్లు తెరుచుకున్నాయి. వాజ్‌పేయి కన్నుమూత (ఆగస్టు 16) మాజీ ప్రధాని, బీజేపీ దిగ్గజ నేత అటల్ బీహారీ వాజ్‌పేయి కన్నుమూశారు. సుదీర్ఘ అనారోగ్యంతో బాధపడుతూ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. వాజ్‌పేయి మరణంతో యావత్‌దేశం శోకసంద్రంలో మునిగింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు పలు రాష్ట్రాలు వారం రోజుల పాటు సంతాపదినాలను ప్రకటించాయి. స్వలింగ సంపర్కం నేరం కాదు (సెప్టెంబర్ 6) స్పలింగ సంపర్కం ఇక నేరం కాదని సెక్షన్ 377పై సుప్రీం కోర్టు చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. సెక్షన్ 377తో సమానత్వపు హక్కుకు విఘాతమని సర్వోన్నత న్యాయస్ధానం స్పష్టం చేసింది. మేజర్ల మధ్య పరస్పర అంగీకారంతో శృంగారం చేసుకోవడం నేరం కాదని పేర్కొంది. సీబీఐలో జగడం (అక్టోబర్ 24) సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థానాలపై కేంద్రం వేటు వేసింది. కీచులాటలతో దర్యాప్తు ఏజెన్సీని దిగజార్చినందుకు సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ అధికారాలకు కత్తెర వేసి ఆయనను సెలవుపై వెళ్లాలని ఆదేశించింది. అయోధ్య వివాదంపై విచారణ..!! (అక్టోబర్ 29) అయోధ్య వివాదంపై అత్యవసర విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2019 జనవరిలో తాము ఏర్పాటు చేయబోయే ధర్మాసనం ఈ కేసు విచారణ తేదీలను ఖరారు చేస్తుందని తెలిపింది. పటేల్ విగ్రహావిష్కరణ (అక్టోబర్ 31) భారత తొలి హోం మంత్రి సర్దార్ వల్లభ్‌బాయ్ పటేల్ 143 వ జయంతి సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 182 మీటర్ల (597అడుగులు) పటేల్ విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. గుజరాత్ నర్మదా జిల్లాలోని సర్దార్ సరోవర్ డ్యాంక్ సమీపంలో సాధజెట్ అనే దీవిలో ఈ విగ్రహానికి ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ అని నామకరణం చేశారు. శబరిమల తీర్పు నిలిపివేతకు నో (నవంబర్ 13) శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలను అనుమతిస్తూ సర్వోన్నత న్యాయస్ధానం వెలువరించిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. రివ్యూ పిటిషన్లు జనవరి 22న విచారిస్తామని పేర్కొంది. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ రద్దు (నవంబర్ 21) జమ్మూ కశ్మీర్ అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పీడీపీ - కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో గవర్నర్ సత్యపాల్ మాలిక్ అసెంబ్లీని రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు సెమీఫైనల్స్‌లో సత్తా చాటిన కాంగ్రెస్ (డిసెంబర్ 11) సార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీఫైనల్స్‌గా పరిగణించిన అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణలో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించి అధికారం చేపట్టగా, మధ్యప్రదేశ్, రాజస్ధాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో పాలక బీజేపీకి భంగపాటు ఎదురైంది. కీలక హిందీ రాష్ట్రాల్లో పట్టుసాధించిన కాంగ్రెస్ మూడు చోట్లా ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రపతి పాలన షురూ.. (డిసెంబర్ 20) డిసెంబర్ 19 అర్ధరాత్రి నుంచి జమ్మూ కశ్మీర్లో రాష్ట్రపతి పాలన కొనసాగనుంది. జూన్‌లో విధించిన గవర్నర్ పాలన డిసెంబర్ 19తో ముగిసిన నేపథ్యంలో రాష్ట్ర గవర్నర్ సత్యపాల్ మాలిక్ కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపారు. దీనికి కేంద్ర మంత్రివర్గంతో పాటు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా ఆమోద ముద్ర వేశారు. -
2018 : ప్రకృతి విలయాలు.. చారిత్రక ఘటనలు
అనేక ఘటనలు, సంఘటనలు - ఆయా దేశాల్లోని పరిణామాలు ఆందోళన కలిగించాయి. అనేక ఆటుపోటుల మధ్య అంతర్జాతీయంగా 2018 సంవత్సరం పలు చేదు జ్ఞాపకాలను మిగిల్చడంతో పాటు పలు చారిత్రక ఘటనలకు వేదికగా నిలిచింది. కీలకమైన అంతర్జాతీయ పరిణామాలపై సాక్షి రౌండప్...!!! అఫ్గాన్‌లో మారణహోమం (జనవరి 30) అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్‌లో తాలిబన్లు మారణహోమం సృష్టించారు. నగరంలో రద్దీగా ఉన్న ప్రాంతంలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 95 మంది ప్రాణాలు కోల్పోగా 151 మంది గాయపడ్డారు. అంతర్యుద్ధంతో తీవ్రంగా దెబ్బతిన్న కాబూల్‌లో ఇటీవల కాలంలో చోటుచేసుకున్న అతిపెద్ద దాడి ఇదే. స్వీడన్‌తో బంధం బలోపేతం (ఫిబ్రవరి 5) రక్షణ, భద్రత రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని భారత్, స్వీడన్లు నిర్ణయించాయి. సరికొత్త వ్యూహాత్మక భాగస్వామ్యంతో పటిష్ట సహకారానికి ఇరు దేశాలు అంగీకరించాయి. 5 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈమేరకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఘోర విమాన దుర్ఘటన (మార్చి 13) నేపాల్‌లోని ఖట్మాండు విమానాశ్రయంలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఢాకా నుంచి అమెరికాకు బయలుదేరిన బంగ్లాదేశ్ విమానం ఖట్మాండు అంతర్జాతీయ విమానాశ్రయంలో కుప్పకూలింది. ఈ ఘటనలో 50మంది ప్రయాణికులు మరణించారు. విశ్వవిజేత స్టీఫేన్ హాకింగ్ మరణం (మార్చి 14) మన కాలపు మహా మేధావి... ఐన్‌స్టీన్‌కు మాత్రమే సాటిరాగల విజ్ఞానఖని స్టీఫెన్ హాకింగ్ (76) కన్నుమూశారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానానికి ఆద్యుడైన గెలీలియో పుట్టిన జనవరి 8 న జన్మించి, మరో విఖ్యాత శాస్త్రవేత్త ఐన్‌స్టీన్ జన్మదినం రోజైన మార్చి 14న కన్నుమూశారు. విశ్వాంతరాళంలో మనిషిని పోలిన జీవులుండొచ్చునని పదేళ్ల క్రితం జోస్యం చెప్పి వారివల్ల ప్రమాదం ముంచుకు రావొచ్చునని ఆయన హెచ్చరించారు. సిరియాలో మరో విష దాడి (ఏప్రిల్ 8) అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న సిరియాలో మరో విష రసాయన దాడి జరిగింది. తిరుగుబాటుదారుల అధీనంలో ఉన్న డౌమా పట్టణంపై జరిగిన ఈ దాడిలో 42 మందికి పైగా ప్రజలు మృత్యువాతపడ్డారు. వందలాది పౌరులు శ్వాస, కంటిచూపు సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తిరుగుబాటుదారులు లక్ష్యంగా సిరియా ప్రభుత్వమే ఈ దారుణానికి పాల్పడిందన్న ఆరోపణలు వచ్చాయి. 257 మంది దుర్మరణం (ఏప్రిల్ 11) ఆఫ్రికా ఖండంలోని ఉత్తరాది దేశమైన అల్జీరియాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్మీ సిబ్బంది, వారి కుటుంబాలతో వెళ్తున్న సైనిక విమానం గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో 257 మంది మృతిచెందారు. రాజధాని అల్జీర్స్‌కి దగ్గరలోని బౌఫరిక్ సైనిక కేంద్రం నుంచి టేకాఫ్ అయిన విమానం.. సమీపంలోని పొలాల్లో కూలడంతో పెద్ద ఎత్తున మంటలు రేగాయి. ఆ మంటల్లో చాలా మంది సజీవదహనమయ్యారు. కూచిభోట్ల దోషికి జీవిత ఖైదు (మే 6) అమెరికాలోని కన్సాస్ సిటీలో భారతీయ ఇంజనీరు కూచిభొట్ల శ్రీనివాస్ హత్య కేసులో నిందితుడికి యూఎస్ ఫెడరల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. 2017, ఫిబ్రవరి 22 న కన్సాస్‌లోని ఒక బార్లో కూచిభొట్ల, అతని స్నేహితుడిపై.. నిందితుడు ఆడం ప్యూరింటన్ (52) కాల్పులు జరిపాడు. ‘మా దేశం విడిచి వెళ్లండి’ అని అరుస్తూ ఈ ఘాతుకానికి పాల్పడి అక్కడి నుంచి పారిపోయాడు. ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కల్ వివాహం (మే 19) బ్రిటన్ రాజకుమారుడు ప్రిన్స్ హ్యారీ (33), అమెరికా నటి మేఘన్ మార్కల్ (36)లు వివాహం బంధంతో ఒక్కటయ్యారు. కొత్త జంట ప్రిన్స్ హ్యారీ-మేఘన్ మార్కల్‌కు రాణి ఎలిజబెత్ 2 సస్సెక్స్ డ్యూక్, సస్సెక్స్ డచెస్ బిరుదులు ప్రదానం చేశారు. వివాహానికి మన దేశం నుంచి నటి ప్రియాంక చోప్రా, మైనా మహిళా ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు సుహానీ జలోటా, తన ఫౌండేషన్ సభ్యులతో హాజరయ్యారు. ట్రంప్ - కిమ్ చారిత్రాత్మక భేటీ (జూన్ 12) కొరియా ద్వీపకల్పంలో అణు నిరాయుధీకరణే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్– ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య జరిగిన చరిత్రాత్మక శిఖరాగ్ర సదస్సు విజయవంతమైంది. ట్రంప్ ఆశించినట్లుగానే అణు నిరాయుధీకరణకు ఉత్తర కొరియా అంగీకరించగా.. అందుకు ప్రతిగా ఉత్తర కొరియా భద్రతకు అమెరికా నుంచి కిమ్ హామీ పొందారు. సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ (జూన్ 24) కట్టుబాట్లకు మారుపేరైన సౌదీలో దశాబ్దాలుగా మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని ఆ దేశ యువరాజు బిన్ సల్మాన్ ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులు 2018, జూన్ 24 నుంచి అమల్లోకి వచ్చాయి. మహిళల డ్రైవింగ్‌పై నిషేధాన్ని ఎత్తివేయడంతో ఆదివారం తెల్లవారుజామున అధిక సంఖ్యలో మహిళలు కార్లతో రోడ్లపైకి చేరి సంబరాలు చేసుకున్నారు. తొలిసారి డ్రైవింగ్‌కు బయలుదేరినవారికి కొందరు మహిళలు పూలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. నవాజ్ షరీఫ్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష (జూలై 6) అవెన్‌ఫీల్డ్ అవినీతి కేసులో పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. షరీఫ్ తనయ మర్యమ్, అల్లుడు కెప్టెన్ సర్దార్లు కూడా ఈ కేసులో దోషులుగా తేలారు. కానీ సెప్టెంబర్‌లో షరీఫ్ జైలు శిక్షను రద్దు చేసి.. అతన్ని విడుదల చేశారు. నాటో దేశాల సరసన భారత్ (ఆగస్టు 1) భారతదేశానికి వ్యూహాత్మక రక్షణ, హైటెక్ ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చే దిశగా అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామ్య హోదా కల్పించే ‘స్ట్రేటజిక్ ట్రేడ్ ఆథరైజేషన్-1 (ఎస్టీఏ- 1)’ ప్రతిపత్తిని మంజూరు చేసింది. ప్రధానంగా ‘నాటో’లోని తన మిత్రదేశాలకు మాత్రమే కల్పించే అవకాశాన్ని తాజాగా భారత్‌కు కూడా వర్తింపచేస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. పాక్ ప్రధానిగా ఇమ్రాన్‌ఖాన్ (ఆగస్టు 18) పాకిస్తాన్ క్రికెట్ దిగ్గజం, తెహ్రీక్-ఇ-న్సాఫ్ (పీటీఐ) చైర్మన్ ఇమ్రాన్ ఖాన్ ఆ దేశ 22 వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రకృతి విలయం.. 832 మంది మృతి (సెప్టెంబరు 29) ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో భూకంపం, సునామీ కారణంగా భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ ఘటనలో 832 మంది చనిపోయారు. ప్రజలు భారీగా మృత్యువాత పడిన నేపథ్యంలో అంటువ్యాధులు వ్యాపించకుండా అధికారులు శవాలను సామూహికంగా ఖననం చేశారు. నోబెల్ శాంతి బహుమతి విజేతలు (అక్టోబరు 5) ప్రపంచ వ్యాప్తంగా చెలరేగుతున్న యుద్ధాలు, అంతర్యుద్ధాల కారణంగా కల్లోలంగా మారిన ప్రాంతాల్లో చోటుచేసుకుంటున్న లైంగిక హింసపై అలుపెరుగని పోరాటం జరుపుతున్న... కాంగో వైద్యుడు డెనిస్ మక్వీజ్ (63), ఇరాక్‌లోని యాజిది తెగకు చెందిన యువతి నదియా మురాద్ (25) లకు నోబెల్ శాంతి పురస్కారం దక్కింది. కాగా డెనిస్ లైంగిక బానిసలకు బాధితులకు అండగా నిలిస్తే నదియా స్వయంగా ఆ బాధలన్నీ అనుభవించారు. మలేసియాలో మరణశిక్ష రద్దు (అక్టోబరు 10) తీవ్రమైన నేరాలకు పాల్పడిన దోషులకు విధించే మరణశిక్షను త్వరలోనే రద్దు చేస్తామని మలేసియా ప్రభుత్వం ప్రకటించింది. ఆ దేశ ప్రధాని మహతీర్ మొహమ్మద్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. మలేసియా ప్రభుత్వ నిర్ణయాన్ని అమ్నెస్టీ ఇంటర్నేషనల్, మానవహక్కుల సంస్థ ‘లాయర్స్ ఫర్ లిబర్టీ’ స్వాగతించాయి. సెనెట్ నీది హౌస్ నాది (నవంబర్ 8) అమెరికా మధ్యంతర ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలొచ్చాయి. ప్రతినిధుల సభ డెమొక్రటిక్ పార్టీ వశం కాగా.. ఎగువ సభ సెనెట్‌లో అధికార రిపబ్లికన్ పార్టీ తన మెజారిటీని నిలబెట్టుకుంది. ప్రతినిధుల సభకు ఎన్నికైన తొలి ముస్లిం మహిళలుగా రషిదా త్లాయిబ్, సోమాలియాకు చెందిన ఇల్హాన్ ఒమర్‌లు గుర్తింపు పొందారు. సీనియర్ బుష్ కన్నుమూత (డిసెంబరు 1) పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్న అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెర్బర్ట్ వాకర్ బుష్ (94) శుక్రవారం కన్నుమూశారు. సీనియర్ బుష్‌గా సుపరిచితులైన ఆయన 1989- 1993 మధ్య కాలంలో అమెరికా 41వ అధ్యక్షుడిగా పనిచేశారు. మిస్ వరల్డ్‌గా మెక్సికన్ సుందరి (డిసెంబరు 8) ఈ ఏడాది ప్రపంచ సుందరిగా మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్ డీ లియోన్ (26) ఎంపికయ్యారు. చైనాలో జరిగిన ఈ అందాల పోటీల్లో థాయ్‌లాండ్‌కు చెందిన నికోలేనే పిచప లిమ్స్నుకన్ మొదటి రన్నరప్‌గా నిలిచారు. ఇక మిస్ ఇండియా 2018 అనుకృతి వ్యాస్ టాప్ - 30లో చోటు దక్కించుకున్నారు. ఐర్లాండ్‌లో.. ఇక అబార్షన్ చట్టబద్ధం (డిసెంబరు 13) అబార్షన్‌ను చట్టబద్ధం చేస్తూ ఐర్లాండ్ పార్లమెంట్ రాజ్యాంగ సవరణ చేసింది. 80 శాతం క్యాథలిక్‌లు ఉండే ఆ దేశంలో ఇదొక చరిత్రాత్మక నిర్ణయం. కాగా ఆరేళ్ల క్రితం అనారోగ్య కారణాల వల్ల గర్భస్రావానికి అనుమతివ్వాలంటూ భారతీయురాలు సవిత చేసిన విన్నపాన్ని ఐరిష్ ప్రభుత్వం తిరస్కరించడంతో ఆమె ప్రాణాలు కోల్పోయారు. మిస్ యూనివర్స్‌గా ఫిలిప్పిన్స్ సుందరి (డిసెంబరు 17) మిస్ యూనివర్స్ 2018 కిరీటాన్ని ఫిలిప్పీన్స్ యువతి కాట్రియానా గ్రే సొంతం చేసుకుంది. బ్యాంకాక్‌లో జరిగిన ఫైనల్లో తొలి రన్నరప్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన తామరిన్ గ్రీన్, రెండో రన్నరప్‌గా వెనెజులాకు చెందిన స్టీఫనీ గుటీరెజ్ నిలిచారు. సిరియాపై ట్రంప్ సంచలన ప్రకటన (డిసెంబరు 19) సిరియా నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకుంటున్నట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ‘సిరియాలో ఐఎస్‌ను ఓడించాం. నా అధ్యక్ష కాలంలో పూర్తిచేయాలనుకున్న లక్ష్యం అది’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా సిరియాలో ఐఎస్ సృష్టిస్తున్న అలజడి కారణంగా మారణహోమం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. మృత్యు సునామీ (సాక్షి 2018 రౌండప్) (డిసెంబర్ 23) ఇండోనేషియాను మళ్లీ జల విలయం ముంచెత్తింది. సముద్రం నుంచి ఉప్పెనలా దూకొచ్చిన మృత్యు అలల కారణంగా... ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే దాదాపు 400 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. మరో వంద మంది జాడ ఇంకా తెలియరాలేదు. ఈ అలల సునామీకి పశ్చిమ జావా, దక్షిణ సుమత్రా దీవులు అతలాకుతలం కాగా 15 వందలకుపైగా క్షతగాత్రులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. -
2018 బిజినెస్ రౌండప్ : స్కాంల హోరు, వివాదాల జోరు
పెరిగిన డాలర్ - తగ్గిన రూపాయి, మండిన పెట్రోలు - భగ్గుమన్న ధరలు, హెచ్చుతగ్గుల మార్కెట్, మైమరింపించిన పెట్టుబడులు, భారీ రుణాలు - బ్యాంకుల కుంభకోణాలు, బంగారం ధరల దోబూచులాట... లాంటివి అనేకం 2018లో మరిచిపోలేని వాణిజ్య వ్యాపార రంగాల్లో ప్రభావం చూపిన ఘట్టాలు అనేకం ఉన్నాయి. గడిచిన ఏడాది కాలంలో సాగిన బిజినెస్ పై సాక్షి రౌండప్...!!! వణికించిన చమురు : మండిన పెట్రోలు ఆకాశాన్నంటిన చమురు ధరలు ప్రపంచదేశాలను వణికించాయి. బ్రెంట్ ఆయిల్ బ్యారెల్ 86.74 డాలర్లు వద్ద ఆల్ టైం గరిష్టాన్ని తాకింది. దేశీయంగా పెట్రో ధరలు వినియోగదారులకు చుక్కలు చూపించాయి. పెట్రోలు, డీజిల్ ధరలు అక్టోబరులో చారిత్రక గరిష్టాలను నమోదు చేశాయి. పెట్రోలు లీటరు ధర ముంబైలో ఏకంగా రూ.90స్థాయిని అధిగమించింది. ఈ నేపథ్యంలో కేంద్రం దిద్దుబాటు చర్యలు చేపట్టడంతో దేశీయంగా ఇంధన ధరలు దిగి వచ్చాయి. మరోవైపు అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోతున్నాయి. డిసెంబరు 22 నాటికి బ్రెంట్ ఆయిల్ 53.50 డాలర్లకు చేరింది. 2018 స్టాక్‌మార్కెట్లు : 2017 ఏడాదిలో కీలక సూచీలు బీఎస్సీ సెన్సెక్స్ 26,494 వద్ద ఉండగా, 2018 జనవరిలో 36, 957 స్థాయికి చేరింది. నిఫ్టీ కూడా 11వేల రికార్డ్ స్థాయిని తాకింది. అయితే ఈ ఏడాది మాత్రం సెన్సెక్స్, నిఫ్టీ రెండూ ఏడాదంతా ఒడిదుడుకులను చవి చూసాయి. ఆగస్టులో 38,800 వద్ద సెన్సెక్స్, నిఫ్టీ 11,760 కి ఎగువన నిఫ్టీ చారిత్రక గరిష్టాలను తాకియి. అయితే ఏడాది చివరికి 2018 జనవరి నాటి స్థాయిలోనే కొనసాగుతుండటం విశేషం. ఉసూరుమనిపించిన రూపాయి : ఈ ఏడాది జనవరిలో డాలరు మారకంలో రూపాయి 63.8 వద్ద నిలిచింది. అంతర్జాతీయ పరిణామాలు, చమురు ధరలు ప్రభావంతో 74. 49 వద్ద ఆల్‌టైం కనిష్టానికి చేరింది. ఒకదశలో 75 రూపాయల స్థాయిని దాటి పతనంకానుందని ఆందోళన కూడా నెలకొంది. అయితే మళ్లీ చమురు ధరలు కాస్త చల్లబడటంతో రూపాయికి బలమొచ్చింది. అయినా గత ఏడాదితో పోలిస్తే దేశీయ కరెన్సీ విలువ దిగజారింది. ప్రస్తుతం 70రూపాయల స్థాయి వద్ద కొనసాగుతోంది. స్మార్ట్ఫోన్ల హవా : స్మార్ట్ఫోన్లు భారత మార్కెట్లలో హల్చల్ చేశాయి. ప్రధానంగా భారత్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో చైనా స్మార్ట్ఫోన్లు ఆధిపత్యం రోజురోజుకు పెరుగుతోంది. అందులోనూ షావోమీ డివైస్లవైపే యూజర్లు మొగ్గు చూపారు. దీంతో షావోమి నెం.1 బ్రాండ్‌గా నిలిచింది. అలాగే ఒప్పో, వివో లెనోవా, వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లు భారీ విక్రయాలను నమోదు చేశాయి. భారీ స్ర్కీన్లు, అతిపెద్ద స్టోరేజ్ కెపాసిటీ, భారీ, డ్యుయల్ రియర్, సెల్ఫీ కెమెరా ఈ ఏడాదిలో ప్రముఖంగా నిలిచాయి. ఫోల్డబుల్ ఫోన్ : ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలు శాంసంగ్, యాపిల్, ఎల్జీ, హువావే లాంటి దిగ్గజాలకు షాకిస్తూ చైనాకంపెనీయే ముందుగా ప్రపంచంలోనే తొలి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ‘ఫ్లెక్సీ పై’ పేరుతో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రాయ్లీ కార్పొరేషన్ అనే సంస్థ విడుదల చేసింది. పడిలేచిన పసిడి : బంగారానికి డిమాండ్ బాగా తగ్గింది. 2018 ఏడాదంతా బులియన్ మార్కెట్లో విలువైన లోహాలు వెండి, బంగారం ధరలు అక్కడక్కడే కదలాడాయి. 25 జనవరి 2018న 24 కారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.30,454 గా ఉంది. డిసెంబరు 22 నాటికి స్వల్పంగా పుంజుకుని పది గ్రాముల పుత్తడి రూ.31,197 గా నిలిచింది. వెండి ధర మాత్రం బాగా పడిపోయింది. ఏడాది ఆరంభంలో 42 వేలు పలికిన వెండి కిలో ధర డిసెంబరు 22 నాటికి రూ. 37,276 స్థాయికి చేరింది. కుంభకోణంలో చిక్కిన పీఎన్బీ : ఏడాది ఆరంభంలోనే దేశంలో నేషనల్ బ్యాంకు కుంభకోణం ప్రకంపనలు రేపింది. బ్యాంకులోని సీనియర్ అధికారులు, ఉద్యోగులతో కుమ్మక్కైన డైమండ్ వ్యాపారులు నీరవ్‌మోదీ, మెహుల్ చెక్సీ (గీతాంజలి గ్రూప్) 13వేల 600 కోట్ల రూపాయలకు బ్యాంకు ముంచేసి విదేశాలు చెక్కేసారు. ఈ కేసులో కేసులు నమోదు, చార్జిషీట్లు, ఆస్తులు స్వాధీనంలాంటి చర్యల్లో సీబీఐ, ఐడీ బిజీగా ఉన్నాయి. అయితే బ్యాంకింగ్ రంగంలోనే అతి పెద్ద కుంభకోణంగా పేరొందిన పీఎన్బీ స్కాంలో నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు. ఈ సెగ అది పెద్ద ప్రయివేటు బ్యాంకు ఐసీఐసీఐని కూడా తాకింది. గీతాంజలి గ్రూపునకు వేలకోట్ల రుణాన్ని మంజూరు చేసిన బ్యాంకుల కన్సార్షియంకు నేతృత్వం వహించిన ఐసీఐసీఐ బ్యాంక్ కూడా వివాదంలో ఇరుక్కుంది ఐసీఐసీఐ వీడియోకాన్ కుంభకోణం : పీఎన్బీ కుంభకోణానికి తోడుగా ప్రైవేట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకు వీడియోకాన్ రుణ కుంభకోణం బ్యాంకింగ్ రంగ నిబద్ధతను ప్రశ్నార్థకం చేసింది. వీడియోకాన్ సంస్థకు రూ.3,250 కోట్ల రుణం దక్కేలా ఈ బ్యాంకు సీఈవో, ఎండీ చందా కొచర్ సాయం చేశారని ఆరోపణలు చెలరేగాయి. నిబంధనలు పాటించకుండా క్విడ్ ప్రోకో ప్రాతిపదికన వీడియోకాన్ గ్రూప్‌నకు కొచర్ రుణాలిచ్చారని, తద్వారా భర్త దీపక్ కొచర్, ఇతర కుటుంబ సభ్యులకు చెందిన కంపెనీకి లబ్ది చేకూరిందనేది ప్రధాన ఆరోపణ. బోర్డు పదేపదే చందా కొచర్ అండగా నిలిచినప్పటికీ, తుదకు చందాకొచర్ పదవిని వీడక తప్పలేదు. భారీ డీల్స్ : దేశీయ ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్, అంతర్జాతీయ ఆన్లైన్ దిగ్గజం వాల్‌మార్ట్‌ల మెగా డీల్ ఇ-కామర్స్ రంగంలో ప్రముఖంగా నిలిచింది. 16 బిలియన్ డాలర్లతో ఫ్లిప్‌కార్ట్‌లో 77శాతం వాటాను కొనుగోలు చేసింది. అయితే ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్లు ఇద్దరూ అనూహ్యంగా కంపెనీని వీడడం విశేషం. డీల్ ముగిసిన వెంటనే సచిన్ బన్సల్ తన వాటాను అమ్ముకొని కంపెనీ నుంచి నిష్ర్కమించారు. అటు మరో ఫౌండర్ బిన్సీ బన్సల్ కూడా అనివార్య పరిస్థితుల్లో సంస్థకు రాజీనామా చేయాల్సి వచ్చింది. వోడాఫోన్, ఐడియా డీల్ టెలికాం రంగంలో మెగా డీల్‌కు సాక్ష్యంగా నిలిచింది. వోడాఫోన్ ఇండియా, ఐడియా సెల్యులార్ సంస్థలు విలీనమై వోడాఫోన్ ఐడియా పేరుతో దేశీయంగా అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించాయి. తద్వారా టెలికాం రంగంలో సునామీలా దూసుకొచ్చిన జియో దెబ్బతో కుదేలైన దేశీయ అతిపెద్ద టెల్కో ఎయిర్‌టెల్‌ను మరింత వెనక్కి నెట్టేసింది. కీలక నిష్క్రమణ : శిఖా శర్మ - భారీ నష్టాలు, నోట్ల రద్దు సమయంలో బ్యాంకులో చట్టవిరుద్ధంగా పాతనోట్లను మార్చిన ఆరోపణలు రావడం లాంటి పరిణామాలతో యాక్సిస్ బ్యాంక్ సీఈఓ శిఖాశర్మ కూడా తన పదవికి రాజీనామా చేశారు. 2018మే నాటికి మూడవసారి బ్యాంకు సీఎండీగా ఆమె పదవీకాలం ముగియనుండగా, నాలుగవసారి ఆమెను ఎండీగా నియమించాలని బోర్డు నిర్ణయించింది. అయితే దీనిపై ఆర్బీఐ ప్రశ్నలు లేవనెత్తింది. ఈ నేపథ్యంలో డిసెంబరు 31, 2018నుంచి బాధ్యతలనుంచి తప్పుకోనున్నట్టు ఏప్రిల్‌లో శిఖా శర్మ ప్రకటించారు. ఉషా అనంత సుబ్రమణియన్ : పీఎన్బీ స్కాంకు సంబంధించిన ఛార్జ్‌షీట్‌లో అలాహాబాద్ బ్యాంక్ సీఈఓగా ఉన్న ఉషా అనంత సుబ్రమణియన్ పేరు చేర్చడంతో ఆమె పదవిని కోల్పోయారు. ఐసీఐసీఐ బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్టియం 2016లో గీతాంజలి గ్రూప్‌నకు అనుమానాస్పద ఈ రుణాల కేటాయింపులపై (రూ.5,280 కోట్లు) సీబీఐ అధికారులు ఆమెను చార్జ్‌షీట్‌లో చేర్చారు. అరుంధతి భట్టాచార్య : దేశీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ తొలి మహిళా ఛైర్మన్‌గా విజయవంతంగా బాధ్యతలను నిర్వహించిన అరుంధతి భట్టాచార్య అక్టోబర్‌లో 2018లో రిటైర్ అయ్యారు. ఎస్బీఐలో ప్రొబెషనరీ ఆఫీసరుగా ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆమె నాలుగు దశాబ్దాలు పాటు బ్యాంకుకు విశేష సేవలందించారు. 2018 బిజినెస్ రౌండప్ : బ్యాంకుల విలీనం : గత ఏడాది ప్రభుత్వరంగ బ్యాంకు ఎస్బీఐలో భారతీయ మహిళా బ్యాంకుతోపాటు అయిదు బ్యాంకులను విలీనంచేసిన కేంద్రం, రుణవితరణ సామర్ధ్యాన్ని పెంచడంతోపాటు బ్యాంకులను బలోపేతం చేయడాని కంటూ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ), విజయా, దేనా బ్యాంక్‌లను విలీనం చేస్తున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. రూ.14.82 లక్షల కోట్లతో దేశంలో మూడవ అతిపెద్ద సంస్థగా అవతరించ నుంది. అయితే ఈ మెర్జర్‌ను బ్యాంకు ఉద్యోగ సంఘాలు నిరసన తెలిపాయి. పరారైన కార్పొరేట్ నేరస్తులు : విజయ్ మాల్యా : ప్రభుత్వ బ్యాంకులకు వేలకోట్ల రూపాయలు ఎగవేసి బ్రిటన్‌కు చెక్కేసిన పారిశ్రామికవేత్త విజయ్‌మాల్యా వ్యవహారం 2018లో బ్రిటన్ కోర్టుకు చేరింది. 2016, మార్చిలో మాల్యా లండన్‌కు పారిపోయిన మాల్యా పాస్‌పోర్టును కూడా రద్దు చేసింది. ఆర్థిక నేరగాళ్ల ఆర్డినెన్స్, బినామీ లావాదేవీల చట్టం ప్రకారం దేశం వదిలి పారిపోయిన మాల్యాను భారత్‌కు తిరిగి తీసుకొచ్చేందుకు కేంద్ర సర్కారు నానా తంటాలు పడుతోంది. అయితే తాను బ్యాంకుల వద్ద తీసుకున్న మొత్తం రుణాలు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాననీ, మీడియానే తన మీద తప్పుడు ప్రచారం చేస్తోందంటూ మాల్యా పాత పాటే పాడుతున్నాడు. మరోవైపు బ్యాంకులకు వేలకోట్ల రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన ఆర్థిక నేరగాళ్ల సంఖ్య 58కి చేరింది. విజయ్ మాల్యాతో పాటు వివిధ స్కాంలలో నిందితులుగా ఉన్న నీరవ్ మోదీ, మొహుల్ చోక్సీ, నితిన్, చేతన్ సందేస్రా, లలిత్ మోదీ, యూరోపియన్ దళారీ గ్యూడో రాల్ఫ్ హస్చకే, కార్ల్ గెరోసాలను వెనక్కి రప్పించడానికి లుక్అవుట్ సర్క్యులర్స్ (ఎల్ఒసీ), ఇంటర్‌పోల్ ద్వారా నోటీసులు జారీ చేశామని కేంద్రం ప్రకటించడం గమనార్హం. అయితే అగస్టా కుంభకోణం కేసులో మధ్యవర్తి క్రిస్టియన్ మిషెల్‌ను దేశానికి రప్పించడంలో కేంద్రం విజయం సాధించింది. వివాదాల చట్రంలో ఆర్బీఐ : దేశ ఆర్థికరంగానికి ఆయువు పట్టులాంటి రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఈ ఏడాది కూడా తీవ్ర చర్చల్లో నానింది. ముఖ్యంగా కేంద్రం, ఆర్బీఐ మధ్య వివాదాలు మరోసారి భగ్గుమన్నాయి. అప్పటివరకు గుంభనంగా ఉన్న విభేదాలు డిప్యూటీ గవర్నర్ విరేల్ ఆచార్య బహిరంగంగా ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిపై వ్యాఖ్యలు చేయడంతో ఈ ప్రచ్ఛన్న యుద్ధం మరింత రాజుకుంది. చివరకు గవర్నర్ ఉర్జిత్ పటేల్ అనూహ్యంగా రాజీనామా చేశారు. ఆయన స్థానంలో నూతన గవర్నర్‌గా మాజీ ఆర్థికమండలి సలహా సభ్యుడు శక్తికాంత దాస్‌ను కేంద్రం నియమించింది. హెచ్చు తగ్గుల మధ్య జీఎస్టీ : ఒకే దేశం ఒకే పన్ను పేరుతో గత ఏడాది తీసుకొచ్చిన పన్ను సంస్కరణల చట్టం గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ చట్టం రేట్ల శ్లాబులలో మార్పులను ప్రకటించింది. కేంద్రం పలు వస్తువులపై జీఎస్టీ పన్ను రేటును తగ్గించినట్టు ప్రకటించింది. 33 వస్తువులను 12, 5 శాతం శ్లాబుల్లోకి, 28 రకాల విలాస వస్తువులపై 28 శాతం జీఎస్టీ రేటుకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. దీంతో ప్రభుత్వ ఆదాయంపై 55 వేల కోట్ల భారం పడనుందని ఆర్థిక శాఖమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు. ట్రాయ్ కొత్త నిబంధనలు : వినియోగదారులపై రెట్టింపు భారం సుప్రీంకోర్టు నిబంధన ప్రకారం కొత్త కేబుల్ టారిఫ్ అమలు కానుందని, డిసెంబర్ 29 తర్వాత వివిధ ఛానళ్ల ప్రసారాలు నిలిచిపోతాయనే వార్తలు కేబుల్ వినియోగదారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టించాయి. తాజా ఆర్డర్‌తో ఛానల్‌కు 19 రూపాయిలు చొప్పున గరిష్టంగా పెంచుకునే అవకాశం ఇచ్చింది ట్రాయ్. 20నెలల ముందే అంటే 2017 మార్చిలోనే ఈ చట్టం వచ్చినప్పటికీ 2018, జులై 3న వాటిని తిరిగి జారీ చేస్తూ అమలు షెడ్యూలును నిర్దేశించింది. ఈ నెల 29 తర్వాత కొత్త కేబుల్ నిబంధనల వల్ల టీవీ ఛానళ్ల ప్రసారాలకు అంతరాయం ఉండదని, కొంత సమయం ఉంటుందని టెలికాం నియంత్రణ సంస్థ (టాయ్) స్పష్టం చేసింది. ఈ మేరకు ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు ఈ నిబంధనలను కేబుల్ ఆపరేటర్లు వ్యతిరేకిస్తున్నారు. -
2018 : సినిమా సంగతులపై ఓ లుక్కేద్దాం...!
చిన్న సినిమాలు పెద్ద విజయాలు సాధించగా.. పెద్ద సినిమాలు చతికిలపడ్డాయి. బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడా లేకుండా చిన్న సినిమాలు అదరగొట్టాయి. అతిలోక సుందరి శ్రీదేవి, కన్నడ రెబల్ స్టార్ అంబరీష్ మరణం సినీ ఇండస్ట్రీకి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. మీటూ ఉద్యమంతో సినీ పరిశ్రమ వేడెక్కింది. కొత్త దర్శకులకు, హీరోయిన్లకు ప్రేక్షకులు రెడ్‌కార్పెట్ పరిచారు.. ఈ ఏడాది సినిమా సంగతులపై ఓలుక్కెద్దాం... 1. ఈ ఏడాది టాలీవుడ్ కొత్త దర్శకులకు ఘనంగా స్వాగతం పలికింది. ఛలో(వెంకీ కుడుముల), ఆర్ఎక్స్ 100(అజయ్ భూపతి) లాంటి కమర్షియల్ సినిమాలతో పాటు కేరాఫ్ కంచరపాలెం (వెంకటేష్ మహా), చిలసౌ (రాహుల్ రవీంద్రన్) లాంటి ప్రయోగాత్మక చిత్రాలు చేసిన దర్శకులకు కూడా మంచి విజయాలు దక్కాయి. అ! కమర్షియల్‌గా వర్క్ అవుట్ కాకపోయినా ప్రశాంత్ వర్మ టేకింగ్‌కు మాత్రం మంచి రెస్పాన్స్ వచ్చింది. 2. 2018లో కొంత మంది క్రేజీ హీరోలు వెండితెరకు ముఖం చాటేశారు. మెగాస్టార్ చిరంజీవి, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, భల్లాలదేవ రానా, అక్కినేని యువ కథనాయకుడు అఖిల్‌లు ఈ ఏడాది ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయలేదు. 3. ఈ ఏడాది భారతీయ సినీ పరిశ్రమను కుదిపేసిన సంఘటన అతిలోక సుందరి మరణం. దుబాయ్‌లో బందువుల వివాహ వేడుకలకు హజరయ్యేందుకు వెళ్లిన శ్రీదేవి ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో మునిగి చనిపోయారు. ఈ సంఘటనతో బాలీవుడ్‌తో పాటు యావత్ భారతీయ సినీ అభిమానులు శోక సంద్రంలో మునిగిపోయారు. 4. ఈ ఏడాది హిందీ సినీ పరిశ్రమలో పెళ్లి బాజాలు కాస్త గట్టిగానే వినిపించాయి. బాలీవుడ్ టాప్ స్టార్స్‌గా కొనసాగుతున్న భామలు పెళ్లి బంధంలో ముడిపడిపోయారు. అంతేకాదు అందరూ ప్రేమ వివాహాలకే ఓటేయడం విశేషం. సోనమ్ కపూర్.. ఆనంద్ అహూజాను, దీపిక పదుకొనే.. రణవీర్ సింగ్‌ను, ప్రియాంక చోప్రా.. హాలీవుడ్ గాయకుడు నిక్ జోనాస్‌లను పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకలకు మీడియాలోనూ విస్తృతమైన కవరేజ్ లభించింది. 5. 2018లో సౌత్ ఇండస్ట్రీలోనూ పెళ్లి సందడి బాగానే కనిపించింది. ముఖ్యంగా అందాల నటి శ్రియ వివాహం హాట్ టాపిక్‌గా మారింది. ఎలాంటి ఎనౌన్స్మెంట్ లేకుండా మీడియాకు, ఆర్భాటాలకు దూరంగా పెళ్లి చేసుకుంది శ్రియ. ఇక తెలుగింటి అమ్మాయి స్వాతి కూడా తన మనసుకు నచ్చిన వికాస్‌తో ఏడడుగులు నడిచేసింది. వివాదస్పద నటి శ్వేతాబసు ప్రసాద్, మలయాళ నటి భావన, తెలుగు, కన్నడ చిత్రాలు చేసిన మదాలస శర్మ కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయారు. 6. ఈ ఏడాది టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిన వ్యక్తి శ్రీ రెడ్డి. సోషల్ మీడియా ద్వారా మీటూ పోరాటాన్ని ప్రారంభించిన శ్రీరెడ్డి.. ఫిలిం చాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శనకు దిగటం తీవ్ర దుమారాన్ని రేపింది. తరువాత పవన్‌ను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయటంతో ఈ అంశం మరింత రసాభాసగా మారింది. 7. బాలీవుడ్‌లోనూ మీటూ వివాదం తీవ్ర దుమారం రేపింది. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై చాలా కాలంగా చర్చ నడుస్తున్నా మాజీ నటి తను శ్రీ దత్త ఆరోపణలతో పరిస్థితి మరింత వేడెక్కింది. బాలీవుడ్ అగ్రనటుడు నానా పటేకర్‌పై ఆమె ఆరోపణలు చేయటంతో ఆయన పలు ప్రాజెక్ట్‌ల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. తను శ్రీ బాటలో మరింత మంది నటీమణులు దర్శకులు, నటులపై ఆరోపణలకు దిగటంతో బాలీవుడ్లో మీటూ వివాదం తారాస్థాయికి చేరింది. 8. ఈ ఏడాదిలో బాలీవుడ్‌ను కుదిపేసిన మరో అంశం ఇద్దరు తారలు క్యాన్సర్ బారిన పడటం. హిందీలో విలక్షణ నటుడిగా ఎన్నో అద్భుతమైన పాత్రల్లో కనిపిస్తున్న ఇర్ఫాన్ ఖాన్, తను ఓ అరుదైన వ్యాది బారిన పడినట్టుగా ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చారు. ఈ సంఘటన జరిగిన కొద్ది రోజులకే నటి సోనాలి బ్రిందే కూడా తాను క్యాన్సర్‌తో బాధ పడుతున్నట్టుగా ప్రకటించటంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. 9. 20 సంవత్సరాలుగా సల్మాన్‌ను వెంటాడుతున్న కృష్ణ జింకల కేసులో ఈ ఏడాది తీర్పు వెలువడింది. ఈ కేసులో సల్మాన్ ను దోషిగా తేల్చిన కోర్టు ఏప్రిల్ 5న ఐదేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు నిచ్చింది. వెంటనే ఏప్రిల్ 7న సల్మాన్ బెయిల్ పై విడుదలయ్యారు. ఈ కేసులో సైఫ్ అలీఖాన్, సొనాలి, నీలమ్, టబులను కోర్టు నిర్దోషులుగా తేల్చింది. 10. ఈ ఏడాది సాండల్‌వుడ్‌ను కుదిపేసిన సంఘటన రెబల్ స్టార్ అంబరీష్ మరణం. కన్నడ నాట స్టార్ హీరోగా తిరుగులేని మాస్ ఫాలోయింగ్‌ను సాదించిన అంబరీష్ ప్రస్తుతం పరిశ్రమకు పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లోనూ క్రియాశీల పాత్ర పోషిస్తున్న ఆయన నవంబర్ 24న అనారోగ్య కారణాలతో తుదిశ్వాస విడిచారు. 11. ఈ ఏడాది బాలీవుడ్ వెండితెర మీద కొత్త అందాలు తళుక్కుమన్నాయి. ముఖ్యంగా స్టార్ వారసుల ఎంట్రీతో బాలీవుడ్ కళకళలాడింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ దడక్ సినిమాతో ఎంట్రీ ఇవ్వగా.. సైఫ్ గారాల పట్టి సారా అలీఖాన్ కేదార్నాథ్ సినిమాతో తెరంగేట్రం చేసింది. షాహిద్ సోదరుడు ఇషాన్ కట్టర్‌తో పాటు సౌత్ టాప్ స్టార్ మమ్ముట్టి కుమారుడు దుల్కర్ సల్మాన్ కూడా బాలీవుడ్‌కు పరిచయమయ్యారు. 12. వెండితెరకు ఎంతో మంది సూపర్ హీరోలను పరిచయం చేసిన ప్రముఖ హాలీవుడ్ రచయిత స్టాన్లీ 95 ఏళ్ల వయసులో నవంబర్ 12న కన్నుమూశారు. హాలీవుడ్లో స్పైడర్ మేన్, ది హల్క్, థోర్, ఐరన్ మేన్, ఎక్స్ మేన్, డాక్టర్ స్ట్రేంజ్ లాంటి సూపర్ హీరో పాత్రలను సృష్టించి మార్వెల్ సంస్థ ఎదుగుదలకు ఎంతో కృషి చేశారు స్టాన్లీ. 13. ఈ ఏడాది టాలీవుడ్ ప్రేక్షకులకు తగిలిన షాక్ అజ్ఞాతవాసి. త్రివిక్రమ్, పవన్ కల్యాణ్‌ల కాంబినేషన్‌పై భారీ అంచనాలతో థియేటర్లకు వెళ్లిన అభిమానులను ఈ ఇద్దరు తీవ్రంగా నిరాశపరిచారు. ఈ సినిమాతో త్రివిక్రమ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెళ్లువెత్త్తాయి. నా పేరు సూర్యతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అల్లు అర్జున్ కూడా అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. 14. బాహుబలి 2ను మించి భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, 2.ఓ సినిమాలు ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే వీటిలో థగ్స్ ఆఫ్ హిందుస్థాన్‌కు ఫ్లాప్ టాక్ రాగా.. 2.ఓ కు డివైడ్ టాక్ వచ్చింది. ఎన్నో వివాదాలకు కారణమైన మరో భారీ బడ్జెట్ సినిమా పద్మావత్ కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 15. 2018 టాలీవుడ్ లో డెబ్యూ హీరోయిన్లకు చాలా బాగా కలిసొచ్చింది. ఈ ఏడాది ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మలు తొలి సినిమాతోనే స్టార్ లీగ్‌లో చేరిపోయారు. భరత్ అనే నేను తో కియారా అద్వానీ, ఛలో తో రష్మిక మందన్న, సమ్మోహనంతో అదితిరావ్ హైదరీ, ఆర్ఎక్స్ 100తో పాయల్ రాజ్‌పుత్‌లు టాలీవుడ్ హాట్ ఫేవరెట్స్‌గా మారిపోయారు. 16. ఈ ఏడాది చిన్న సినిమాలు సంచలన విజయాలు నమోదు చేశాయి. బాండ్ తరహా కథాంశంతో వచ్చిన గూడచారి, సందేశాత్మకంగా తెరకెక్కిన నీది నాది ఒకే కథ, ప్రయోగాత్మక చిత్రం కేరాఫ్ కంచరపాలెంతో పాటు కమర్షియల్ ఎంటర్టైనర్లుగా తెరకెక్కిన ఛలో, తొలిప్రేమ, గీత గోవిందం కూడా చిన్న సినిమాలుగా విడుదలై విమర్శకుల ప్రశంసలతో పాటు మంచి వసూళ్లు సాదించాయి. 17. ఈ ఏడాది టాలీవుడ్ నటులు ప్రయెగాలకు ఓటేశారు. రొటీన్ కమర్షియల్ ఫార్ములాను పక్కన పెట్టి కొత్త కథలను ఎంచుకున్నారు. నోటా లాంటి పొలిటికల్ థ్రిల్లర్‌తో విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ పీరియాడిక్ జానర్లో తెరకెక్కిన రంగస్థలంతో, మహేష్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన భరత్ అనే నేనుతో, సుమంత్ మిస్టరీ థ్రిల్లర్‌గా సుబ్రహ్మణ్యపురం సినిమాలతో అలరించారు. హీరోయిన్ సమంత కూడా తొలిసారిగా యు టర్న్ సినిమాతో లేడీ ఓరియంటెడ్ సినిమాల ట్రెండ్‌లోకి అడుగుపెట్టింది. 18. ఈ ఏడాది బాలీవుడ్ ఖాన్లకు ఏమాత్రం కలిసిరాలేదు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ ఏడాది బాక్సాఫీస్ వద్ద బోల్తాపడ్డాడు. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన రేస్3 ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక ఆమిర్‌ఖాన్ థగ్స్ ఆఫ్ హిందుస్తాన్ భారీ హైప్‌ను క్రియేట్చేయగా.. ఈ ఏడాది బాలీవుడ్ డిజాస్టర్‌గా నిలిచింది. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గత కొంత కాలంపాటు సరైన విజయం లేక ఈ ఏడాది జీరో లాంటి ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ అది కూడా మిశ్రమ ఫలితాన్ని మిగిల్చింది. మొత్తంగా ఖాన్‌త్రయానికి ఈ ఏడాది చేదు అనుభవమే మిగిలింది. -
థాయ్ గుహ నుంచి అందరూ క్షేమంగా..
కొరియాలో శాంతి గీతాలాపన, సౌదీ అరేబియాలో స్టీరింగ్ చేతపట్టి మహిళల స్వేచ్ఛాగానం, హాలీవుడ్ సినిమాను తలపించేలా థాయ్ గుహలో ఆపరేషన్, పాక్ ప్రధానమంత్రిగా ఇమ్రాన్ కొత్త ఇన్నింగ్స్, తమకు తిరుగే లేదని నిరూపించుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, అంగరంగవైభవంగా ప్రిన్స్ హ్యారీ వివాహం, వీల్ చైర్ నుంచే విశ్వరహస్యాలపై ప్రయోగాలు చేసిన స్టీఫెన్ హాకింగ్ అస్తమయం, ఇండోనేసియాపై మరోసారి విరుచుకుపడిన సునామీ లాంటి మర్చిపోలేని ఘటనలను మిగిల్చింది 2018. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందిన కొన్ని ఘటనలను మరోసారి గుర్తుచేసుకుందాం.. ట్రంప్, కిమ్ శిఖరాగ్ర సదస్సు నా టేబుల్ మీద అణుబాంబుని పేల్చే మీట ఉందని ఒకరంటే నా టేబుల్‌పై అంతకంటే పెద్ద అణుబాంబు బటన్ ఉందంటూ మరొకరు మాటల తూటాలు పేలుస్తూ ప్రపంచ దేశాల గుండెల్లో అణుబాంబుల్ని పేల్చారు. చివరికి ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా నేత కిమ్‌జాంగ్ ఉన్ జూన్‌లో సింగపూర్‌లో భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య చర్చలు ఫలప్రదం అయ్యాయని నేతలిద్దరూ ప్రకటించడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. కొరియాలో శాంతిస్థాపన దిశగా అడుగులు పడతాయన్న ఆశలు చిగురించాయి. విశ్వ శోధకుడు హాకింగ్ అస్తమయం అరుదైన వ్యాధితో బాధపడుతూ వీల్‌చైర్‌కే పరిమితమైనా ఆత్మవిశ్వాసంతో విశ్వరహస్యాల్ని నిరంతం శోధించిన ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్స్ మార్చి 14న కన్నుమూశారు. ఏ క్షణంలోనైనా మృత్యుదేవత దరిచేరవచ్చని తెలిసినా స్టీఫెన్ విశ్వానికి సంబంధించి రోజుకో కొత్త విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. కృష్ణ బిలాలకు సంబంధించి ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేసిన హాకింగ్ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నింపిన స్ఫూర్తి తరతరాలకి పదిలం. మనిషి భూమిని వదిలి కొత్త గ్రహాలకు వెళ్లిపోవాలని హెచ్చరిస్తూ తాను అనంతలోకాలకు తరలిపోయారు. పాక్ ప్రధానిగా ఇమ్రాన్ క్రికెట్ మైదానంలో ఫాస్ట్ బౌలింగ్‌తో దూకుడు ప్రదర్శించిన ఇమ్రాన్‌ఖాన్ పాకిస్తాన్ ప్రధానిగా కొత్త ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ఆగస్టు 18న పాక్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయనకు ఈ విజయం అంత సులభంగా దక్కలేదు. కేవలం ఒక్క సీటుతో మొదలు పెట్టి 22 ఏళ్ల కృషితో తాను కన్న కలల్ని సాకారం చేసుకున్నారు ఇమ్రాన్. పాక సైన్యం చెప్పుచేతల్లో ఉంటారన్న ఆరోపణలు ఉన్న ఇమ్రాన్ ప్రధాని పీఠంపై కూర్చోగానే కశ్మీర్ విషయంలో భారత్ అడుగు ముందుకేస్తే తాము రెండడుగులు వేస్తామంటూ ప్రకటించి శాంతి మంత్రం ఆలాపించారు. నాలుగోసారీ.. పుతిన్ రష్యా అధ్యక్షుడిగా వ్లాదిమిర్ పుతిన్ ప్రస్థానం 2018లోనూ అప్రతిహతంగా కొనసాగింది. ఈ ఏడాది మేలో ఆయన వరసగా నాలుగోసారి రష్యా అధ్యక్షుడిగా ప్రమాణం చేశారు. గత పద్దెనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న ఆయన మరో ఆరేళ్ల పాటు రష్యా పీఠంపై కొనసాగుతారు. జిన్‌పింగ్.. శాశ్వత అధ్యక్షుడు ఒక వ్యక్తి చైనా దేశ అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు మాత్రమే పోటీ చేయాలన్న నిబంధనల్ని చైనా పార్లమెంటు తిరగరాసింది. అధ్యక్షుడు జిన్‌పింగ్ శాశ్వతంగా దేశాధ్యక్షుడిగా కొనసాగడం కోసమే కొత్త నిబంధనల్ని తీసుకొచ్చింది. దానికి చైనా పార్లమెంటు నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ ఆమోద ముద్ర వేయడంతో జిన్‌పింగ్ శాశ్వత అధ్యక్షుడిగా మారారు. చైనా కమ్యూనిస్టు పార్టీలో మావో జెడాంగ్ తర్వాత అత్యంత శక్తిమంతమైన నాయకుడు జిన్ పింగ్. క్షమాపణలు చెప్పిన జుకర్‌బర్గ్ ఫేస్బుక్ డేటా లీకేజీ వ్యవహారంతో ఆ సంస్థ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ అమెరికా కాంగ్రెస్ విచారణ ఎదుర్కొన్నారు. సెనేటర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేక జుకర్‌బర్గ్ సారీ చెప్పారు. ఫేస్బుక్ నుంచి సమాచారం దుర్వినియోగం కాకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సీనియర్ బుష్ కన్నుమూత వృద్దాప్యం కారణంగా 94ఏళ్ల వయసులో అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ హెచ్‌డబ్ల్యూ బుష్ నవంబర్ 30న కన్నుమూశారు. అమెరికాలో కీలక పరిణామాల సమయంలో ఆయనే అధ్యక్షుడిగా ఉన్నారు. కువైట్ యుద్ధం ఆయన నేతృత్వంలోనే జరిగింది. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైన సమయంలోనూ, ప్రచ్ఛన్న యుద్ధం చివరి రోజుల్లో బుష్ అధ్యక్ష పీఠంపై ఉన్నారు. సౌదీలో డ్రైవింగ్ చేసిన మహిళలు సౌదీ అరేబియాలో మహిళలు స్వేచ్ఛావాయువులు పీల్చుకున్నారు. స్టీరింగ్ చేతపట్టి ఆత్మవిశ్వాసంతో రయ్ రయ్‌మంటూ కార్లు నడిపే అవకాశాన్ని 2018 ఏడాది వారికి బహుమతిగా ఇచ్చింది. తరతరాలుగా మహిళల డ్రైవింగ్‌పై ఉన్న నిషేధాన్ని సౌదీ ప్రభుత్వం జూన్ 24న ఎత్తివేసింది. దీంతో అర్ధరాత్రి అని కూడా చూడకుండా చాలా మంది సౌదీ మహిళలు రోడ్లపైకి వచ్చి కార్లలో షికారు చేస్తూ సంబరాలు చేసుకున్నారు. థాయ్ గుహలో చిన్నారుల రెస్క్యూ అందరూ క్షేమంగా ఉన్నారు.. ఈ ఒక్క మాట ఈ ఏడాది కోట్లాది మందిని ఊపిరి పీల్చుకునేలా చేసింది. 12 మంది ఫుట్‌బాల్ యువ క్రీడాకారులు, వారి కోచ్ 18 రోజులు థాయ్‌లాండ్ గుహలో చిక్కుకుపోయిన ఘటన నరాలు తెగేలా ఉత్కంఠకు కారణమైంది. అకస్మాత్తుగా భారీ వర్షాలు కురిసి, వరద నీరు గుహ ద్వారాన్ని ముంచేసింది. గుహలోపల నిద్రాహారాలు లేకుండా బిక్కుబిక్కుమన్న చిన్నారుల క్షేమసమాచారాల కోసం ప్రపంచం యావత్తూ కోట్ల కళ్లతో ఎదురు చూసింది. గుహ నుంచి వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ప్రపంచంలోని అసాధారణ నేవీ బృందాలు, థాయ్ నేవీ సీల్స్ చేసిన సాహసానికి ప్రపంచ దేశాలు సెల్యూట్ చేశాయి. జర్నలిస్టు ఖషోగ్గి హత్య సౌదీలో ప్రముఖ జర్నలిస్టు, వాషింగ్టన్ పోస్టు పత్రిక కాలమిస్టు జమాల్ ఖషోగ్గి దారుణ హత్య ఈ ఏడాది సంచలనం సృష్టించింది. అక్టోబర్‌లో వ్యక్తిగత పనుల నిమిత్తం టర్కీలోని ఇస్తాంబుల్‌లో సౌదీ రాయబార కార్యాలయంలోకి వెళ్లాక ఆయన అదృశ్యమయ్యారు. సౌదీ ప్రభుత్వ ఏజెంట్లు ఆయనను హత్య చేసి శవాన్ని ముక్కలు చేసి రాయబార కార్యాలయంలోనే యాసిడ్‌లో కరిగించారని వార్తలు వచ్చాయి. ఖషోగ్గి అదృశ్యం, హత్య వెనుక సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ హస్తం ఉన్నట్టుగా ఆరోపణలున్నాయి. ఒక్కటైన ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్కల్ ప్రపంచమంతా ఆ పెళ్లి కోసం ఒళ్లంతా కళ్లు చేసుకొని ఎదురు చూసింది. బ్రిటన్ రాణి ఎలిజబెత్ మనవడు ప్రిన్స్ హ్యారీ, అమెరికా నటి మేఘన్ మార్కల్ ఈ ఏడాది మే 19న ఒక్కటయ్యారు. వెయ్యేళ్ల చరిత్ర కలిగిన రాజవంశానికి హాలీవుడ్ గ్లామర్ జతకూరడంతో ఈ పెళ్లిపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. వీరిద్దరి వివాహానికి అంతర్జాతీయ మీడియా అత్యంత ప్రాధాన్యత కల్పించింది. శ్రీలంక సంక్షోభం శ్రీలంకలో రాజకీయ సంక్షోభం ఈ ఏడాది సెగలు పొగలు కక్కింది. శ్రీలంక అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన రాత్రికి రాత్రే ప్రధాని కుర్చీ నుంచి రణిల్ విక్రమసింఘేను దింపేసి మహిందా రాజపక్సను కూర్చోబెట్టారు. కానీ రాజపక్స రెండు సార్లు విశ్వాస పరీక్షలో ఓడిపోయారు. దీంతో పార్లమెంటును రద్దు చేస్తున్నట్లు సిరిసేన ప్రకటించారు. కానీ పార్లమెంటును రద్దు చేయడం చెల్లదంటూ శ్రీలంక సుప్రీంకోర్టు తీర్పు చెప్పడంతో సిరిసేనకు ఎదురుదెబ్బ తగిలింది. రాజపక్స రాజీనామా చేయడం, తిరిగి విక్రమసింఘే ప్రధానిగా ప్రమాణం చేయడం వెంటవెంటనే జరిగాయి. అమెరికా షట్‌డౌన్ అమెరికాలో ఈ ఏడాది మూడుసార్లు షట్‌డౌన్ జరిగింది. ట్రంప్ వలస విధానాలతో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించాయి. అక్రమ వలసదారుల్ని అడ్డుకోవడానికి అమెరికా, మెక్సికో సరిహద్దు పొడవునా గోడ నిర్మాణం కోసం 500 కోట్ల డాలర్లు వెచ్చించాలంటూ ట్రంప్ ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లును కాంగ్రెస్ ఆమోదించకపోవడం తాజాగా డిసెంబర్లో పాలన స్తంభించింది. జనవరి, జూన్ నెలల్లోనూ కొన్నాళ్లు షట్‌డౌన్ జరిగింది. ఒకే ఏడాదిలో మూడు సార్లు ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించడమనేది గత 40 ఏళ్లలో ఇదే తొలిసారి. ఇండోనేసియాపై విరుచుకుపడిన సునామీ 2018 వెళ్లిపోతూ వెళ్లిపోతూ తీవ్ర విషాదాన్నే మిగిల్చింది. ఇండోనేసియాపై సునామీ మరోసారి విరుచుకుపడింది. ఆనక్ క్రకటోవా అగ్నిపర్వతం భారీ స్థాయిలో బద్దలై పర్వతంలోని ఒక భాగం సముద్రంలో కుప్పకూలింది. దీంతో భారీ అలల మొదలై సునామీగా మారి జావా, సుమత్రా తీర ప్రాంతంలో ఊళ్లను ముంచెత్తింది. ఈ ప్రకృతి విలయంలో దాదాపుగా 500 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. బ్రెగ్జిట్.. థెరిసాకి సవాల్ యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడానికి సంబంధించిన ఒప్పందం(బ్రెగ్జిట్ డీల్)పై సంక్షోభం నెలకొంది. బ్రిటన్ ప్రధానమంత్రి థెరిసా మే ఒకే చేసిన ముసాయిదా ఒప్పందంపై సొంత పార్టీలోనే వ్యతిరేకత నెలకొంది. ప్రస్తుతం ఉన్నట్టుగా ఆ ఒప్పందం పార్లమెంటులో ప్రవేశపెడితే ఆమోదం పొందడం కష్టమేనన్న అనుమానాలు మొదలయ్యాయి. అందుకే బ్రెగ్జిట్ ఒప్పందానికి మార్పులు చేర్పులు చేసి పార్లమెంటుకు సమర్పించే యోచనలో థెరిసా ఉన్నారు. కొత్త సంవత్సరంలో దీనిపై ఒక స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. సిరియాపై అమెరికా వార్ గత ఏడేళ్లుగా అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సిరియాపై అమెరికా నేరుగా యుద్ధాన్ని ప్రకటించింది. సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ ఆధీనంలోని సైనిక స్థావరాలపై క్షిపణి దాడులకు దిగింది. అసద్ గద్దె దిగితేనే సిరియాలో శాంతిస్థాపనకు ఆస్కారం ఉంటుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెబుతూ వస్తున్నారు. ఈ దాడుల్లో చిన్నారులు మరణించిన దృశ్యాలు అందరినీ కలిచివేశాయి. జీరో టాలరెన్స్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అనుసరించిన జోరో టాలరెన్స్ వలస విధానం వివాదాస్పదంగా మారింది. సరిహద్దుల్లో శరణార్థుల పడిగాపులు, తల్లీ బిడ్డల్ని వేరు చేసిన దృశ్యాలు మనసుల్ని పిండేశాయి. చట్టవిరుద్ధంగా అమెరికాలోకి వచ్చారని 2000 మంది పిల్లల్ని తల్లిదండ్రుల నుంచి వేరు చేసి హోమ్స్‌కి తరలించారు. చివరికి ట్రంప్ సర్కార్‌పై ఒత్తిడి పెరగడంతో తల్లీ బిడ్డల్ని వేరు చేయొద్దంటూ ఉత్తర్వులిచ్చారు. -
కొన్ని మెరుపులు.. కాసిన్ని మరకలు
2018లో బాబ్రీ మసీదు–రామ జన్మభూమి వివాదం నుంచి ఆధార్ కార్డు చెల్లుబాటు వ్యవహారం, రఫెల్ విమానాల కొనుగోలు, శబరిమల ఆలయంలో మహిళ ప్రవేశం వరకు భిన్నమైన కేసులను విచారించిన సుప్రీం కోర్టు అనూహ్యమైన తీర్పులు ఇచ్చింది. సెక్షన్ 377ను పునర్నిర్వచించి స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పించింది. వివాహేతర సంబంధాలను క్రిమినల్ నేరంగా పరిగణించడం సరికాదు అంది. శబరిమలలో మహిళ ప్రవేశాన్ని అనుమతించాలంది. జస్టిస్ లోయ అనుమానాస్పద మృతి, మానవ హక్కుల నేతల అరెస్ట్‌పై పిటిషన్లను కొట్టివేసింది. బాబ్రీ మసీదు–రామజన్మభూమి వివాదంపై విచారణ, ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ న్యాయబద్ధత, అలోక్ వర్మ పిటిషన్లతో 2019 స్వాగతం పలుకుతోంది. కొన్ని మంచి రోజులున్నట్టే... కొన్నిసార్లు గడ్డు రోజులు కూడా దాపురిస్తాయి. సుప్రీం కోర్టుకు సంబంధించినంత వరకు 2018 ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులకు చెందిన సంవత్సరం. సుప్రీం కోర్టుకు చెందిన నలుగురు సీనియర్ న్యాయమూర్తులు అనూహ్యంగా విలేఖరుల సమావేశం ఏర్పాటుచేయడంతో ఈ ఏడాది మొదలయ్యింది. అప్పటి ప్రధాన న్యాయమూర్తి తమకు కేసులు కేటాయించడంలో వివక్ష చూపుతున్నారని వారు ఆ సమావేశంలో ఆరోపించి దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేశారు. ఇప్పుడు మన ఏడాది చివరికి వచ్చేశాం. ఆ నలుగురు న్యాయమూర్తుల్లో ముగ్గురు పదవీ విరమణ చేయగా, నాలుగోవారైన జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రధాన న్యాయమూర్తి అయ్యారు. ఏడాది ప్రారంభంలో పైస్థాయి న్యాయవ్యవస్థలో చాలా నియమాకాలు అపరిష్కృతంగా ఉండేవి. అయితే, అక్టోబర్‌లో గొగోయ్ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాక పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. అక్టోబర్ నుంచి వివిధ హైకోర్టుల్లో వందలాది నియామకాలు జరిగాయి. సుప్రీం కోర్టులో కూడా కొన్ని ఖాళీలు భర్తీ చేశారు. బాధ్యతలు స్వీకరించినవారిని చూసి కొంతమంది కళ్లెగరేశారు, మరికొందరు పెదవి విరిచారు. ఆయా పదవులను చేపట్టిన తర్వాతైనా వారిలో మార్పు వస్తుందని ఆశిద్దాం. అనూహ్యమైన తీర్పులు ఎన్నో రకాలుగా సుప్రీంకోర్టుకు 2018 చాలా కీలకమైన సంవత్సరం. ఎన్నో విభిన్నమైన కేసులను ఈ ఏడాది సుప్రీం కోర్టు విచారించింది. బాబ్రీ మసీదు–రామ జన్మభూమి వివాదం నుంచి ఆధార్ కార్డు చెల్లుబాటు వ్యవహారం, రఫెల్ విమానాల కొనుగోలు, శబరిమల ఆలయంలో మహిళ ప్రవేశం వరకు భిన్నమైన కేసులను విచారించిన న్యాయస్థానం అనూహ్యమైన తీర్పులు ఇచ్చింది. సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు తీసుకున్న కీలక నిర్ణయాలతోపాటు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయిన సందర్బాలను కూడా గుర్తుచేసుకుంటే బావుంటుంది. లోక్ ప్రహారీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన ఎన్నికల దిశగా న్యాయస్థానం ముందడుగు వేసింది. 1961నాటి ఎన్నికల నిబంధనలను మార్పు చేయాలని ఆదేశించింది. దీంతో అభ్యర్థులు, వారి అనుయాయుల ఆదాయ వివరాల అఫిడవిట్‌ను స్వయంగా దాఖలు చేయాల్సి ఉంటుంది. ççహదియా కేసుగా అందరికీ తెలిసిన షఫీన్ జహాన్ వర్సెస్ అశోకన్ కేఎం కేసులో తనకు నచ్చినవారిని వివాహం చేసుకునే హక్కు వారికుందని పునరుద్ఘాటించింది. ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడే దిశగా తీర్పు వెలువరిస్తూ కోర్టు సంరక్షకుడి పాత్ర పోషించింది. ‘సామాజిక కట్టుబాట్లు, నైతిక విలువలకు ఎప్పుడూ విలువ ఉంటుంది. అయితే, ఆ విలువలు రాజ్యాంగం ప్రసాదించిన స్వేచ్ఛకంటే ఎక్కువకాదని’ సుదీర్ఘ విచారణ అనంతరం కోర్టు వ్యాఖ్యానించింది. కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో ప్రతి భారతీయుడికీ హుందాగా మరణించే హక్కుందని పేర్కొంది. నిరంతరం మిషన్ల సహాయంతో మాత్రమే జీవించగలిగేవారికి, వాటిని తొలగించడం ద్వారా సహజంగా మరణించే అవకాశం కల్పించవచ్చని తీర్పు చెప్పింది. అయితే, ఇందుకు అవసరమైన విధానపరమైన సూచనలను కూడా సవివరంగా వెల్లడించింది. స్టే కాలపరిధి ఆరు నెలలే ఆసియన్ రిసర్ఫేసింగ్ ఆఫ్ రోడ్ ఏజెన్సీ వర్సెస్ సీబీఐ కేసులో సివిల్, క్రిమినల్ కేసుల విచారణ సుదీర్ఘకాలం ఆలస్యం కాకుండా కీలకమైన నిర్ణయం తీసుకుంది. కొన్నిసార్లు స్టేను కేసు విచారణను సాగదీయడానికి వాడుకుంటున్న నేపథ్యంలో; సివిల్, క్రిమినల్ కేసుల విచారణలో ఇచ్చే స్టే ఆరు నెలల తర్వాత రద్దవుతుందని పేర్కొంది. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రం కేసును ముగించడం కంటే, స్టేను కొనసాగించడమే ముఖ్యమని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. తహ్సీన్ పూనావాలా పిటిషన్‌ను విచారించిన కోర్టు దేశంలో మూకదాడులు ఎక్కువైపోవడంపై స్పందిస్తూ నిందితులను పట్టుకోవడానికి పూర్తి స్థాయిలో విధివిధానాలు రూపొందించాలని ఆదేశించింది. సెప్టెంబర్ చివరికొచ్చేసరికి అప్పటి ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం కొన్ని ముఖ్యమైన తీర్పులు ఇచ్చింది. నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సెక్షన్ 377ను పునర్నిర్వచించి స్వలింగ సంపర్కానికి చట్టబద్ధత కల్పిస్తూ చరిత్రాత్మకమైన తీర్పు వెలు వరించింది. జోసెఫ్ షైన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సెక్షన్ 497 కొట్టివేస్తూ భార్య భర్త సొత్తుకాదని, వివాహేతర సంబంధాలను క్రిమినల్ నేరంగా పరిగణించడం సరికాదు అంది. దీనివల్ల మహిళలు తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. అంతేకాదు, ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో శబరిమలలో మహిళా ప్రవేశాన్ని అనుమతించాలని తీర్పు చెప్పింది. పది నుంచి యాభై ఏళ్ల వయసు కలిగిన మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడం రాజ్యాంగ ఉల్లంఘనే అని వ్యాఖ్యానించింది. అన్నీ అనుకూలమైనవి కావు ఇటీవలి ఈ తీర్పులన్నీ దేశంలోని పౌరులందరికీ మేలు చేయాలని సుప్రీంకోర్టు తీసుకున్నవే. ఈ తీర్పులపై వ్యాఖ్యానించే ముందు కోర్టు పెద్దన్న తరహాలో హక్కులను ధారాదత్తం చేయలేదనే విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పటికే రాజ్యాంగంలో పొందుపరిచిన వాటినే మరోసారి పునర్నిర్వచించింది. అంతమాత్రనా కోర్టు ప్రతి సందర్భంలోనూ పౌరుడి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుందని చెప్పడం కాదు. ఆధార్ కార్డు చెల్లుబాటును సవాల్ చేసిన కేఎస్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జనవరి నుంచి వాదనలు సాగాయి. చివరికి సుప్రీం కోర్టు ఆధార్ కార్డుకు చట్టబద్ధత కల్పించింది. ప్రైవేట్ పార్టీలు కూడా ఆధార్ కార్డును డిమాండ్ చేయడం వంటి అంశాలను మాత్రం కొట్టివేసింది. చీకటి కోణాలు కొన్ని కేసుల విషయంలో అనేక వివాదాలు ఈ ఏడాది సుప్రీం కోర్టును చుట్టుముట్టాయి. సొహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న జస్టిస్ లోయ అనుమానాస్పద మృతిపై విచారణ చేపట్టాలని కోరుతూ దాఖలైన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. అలాగే, భీమా కోరేగావ్‌లో జరిగిన హింసాత్మక సంఘటనలతో సంబంధం ఉందని ఆరోపిస్తూ ఐదుగురు మానవ హక్కుల నేతలను అరెస్ట్ చేయడంపై సమగ్రమైన స్వతంత్ర విచారణ జరిపించాలని దాఖలైన పిటిషన్‌ను కూడా కొట్టివేసింది. ప్రభుత్వం రఫెల్ విమానాల కొనుగోలు చేయడంపై దాఖలైన పిటిషన్లు అన్నింటినీ కూడా కోర్టు తోసిపుచ్చింది. సీల్డ్ కవర్లో వచ్చిన అంశాలను పరిగణనలోకి తీసుకుని తీర్పు వెలువరించే విధానాన్ని అవలంబించడం చాలా చర్చకు తావిచ్చింది. ఈ తీర్పు విషయంలో పార్లమెంటరీ వ్యవహారాల కమిటీకి కాగ్ సమర్పించే నివేదికపై కోర్టు ఆధారపడింది. అయితే, అటువంటి నివేదిక ఏదీ అప్పటికి కాగ్ సమర్పించలేదు. దీంతో తీర్పులో తప్పులను దిద్దాలంటూ కేంద్రం దరఖాస్తు చేసుకుంది. రాబోయే 2019వ సంవత్సరం కూడా కీలకంగానే కనిపిస్తోంది. కోర్టు ప్రారంభం కాగానే బాబ్రీ మసీదు–రామజన్మభూమి వివాదంపై కేసు విచారణకు తేదీ ఖరారు చేయాల్సి ఉంది. తర్వాత ప్రభుత్వం జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ న్యాయబద్ధతపై నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. అలాగే, సీబీఐ డైరెక్టర్‌గా తనను తొలగించడంపై అలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషనపై కూడా కోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. సుప్రీంకోర్టుకు సంబంధించి మరో ఏడాది 2018 కూడా కాలప్రవాహంలో కలిసిపోతోంది. సుప్రీంకోర్టు ఈ ఏడాది తనను తాను ఒక బృంద సంస్థగా నిలబెట్టుకుంది. ఎవరో ఒకరు పెత్తనం చేయడం కుదరదని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆధిపత్యానికి వ్యతిరేకంగా నిలబడలేకపోయినా, సామాజిక నైతిక చట్రం నుంచి పౌరులను కాపాడే విషయంలో అండగా నిలిచింది. రాజ్యాంగ నైతికతను కాపాడటానికి అధిక ప్రాధాన్యతనిస్తూ, అస్పష్ట భావనతో, ఇంద్రియ జ్ఞానంకంటే వ్యక్తిత్వంపైనే ఎక్కువ ఆధారపడుతుంది. కొన్ని మంచి సమయాలు, మరి కొన్ని చెడు సమయాలు. వ్యాసకర్తలు: సంజయ్ హెగ్డే, ప్రెంజాల్ కిషోర్.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు – ‘ది వైర్’ సౌజన్యంతో -
2018 టాప్ న్యూస్
-
ప్రణయ్‌ను సుపారీ ఇచ్చి మరీ చంపించాడు!
2018 సంవత్సరం.. తెలంగాణకు మాయని గాయాలను మిగిల్చింది. ప్రమాదాలు, పరువు హత్యలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. కొండగట్టు బస్సు ప్రమాదం కలవరపరిచింది. టపాసులు పేలి డజను మంది మృత్యువాత పడ్డారు. కులం కోసం ప్రేమించుకున్న వారిని, కన్న వారిని కూడా చూడకుండా కడతేర్చారు. చలికి రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్న కుంపటి జీవితాలను బుగ్గిపాలు చేసింది. డబ్బుకు లోకం దాసోహం అన్నట్లుగా మారిన తీరును కొందరు అక్షరాల సత్యం చేశారు. నౌహీరా షేక్ డిపాజిట్ల కుంభకోణం వేల కుటుంబాలను ఆగం చేసింది. – సాక్షి, హైదరాబాద్ ప్రమాదపు చావులు.. దేశ చరిత్రలోనే భారీ ప్రాణనష్టం కొండగట్టు బస్సు ప్రమాదంలో జరిగింది. సెప్టెంబర్ 12న జరిగిన కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఆర్టీసీ బస్సు బోల్తా పడి 62 మంది ప్రయాణికులను పొట్టన పెట్టుకుంది. ఈ ఘటనతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. హైదరాబాద్ నుంచి రామగుండం వెళ్లే రాజీవ్ రహదారిపై వరుస రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగించాయి. ఈ ఏడాది మేలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం 11 మందిని బలిగొంది. ప్రముఖ సినీ నటుడు, నందమూరి హరికృష్ణ నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి చెరువుగట్టు వద్ద కారు ప్రమాదానికి గురై దుర్మరణం చెందారు. అర్థంలేని పరువు హత్యలు.. ప్రేమించి పెళ్లి చేసుకోవడం నచ్చకపోతే వాళ్ల బతుకు వాళ్లను బతకనివ్వాల్సింది. కానీ అర్థం లేని ఆవేశాలకు పోయి కులాంతర వివాహం చేసుకున్నందుకు కన్న కూతుర్ల జీవితాలనే కాలారాశారు. మిర్యాల గూడలో ప్రణయ్ పరువు హత్య రాష్ట్రంలో సంచలనం రేపింది. తన కూతురిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడని, ప్రణయ్‌ను సుపారీ ఇచ్చి మరీ చంపించాడు అమృత తండ్రి మారుతీరావు. ఇలాంటి ఉదంతమే మంచిర్యాలలో కూడా చోటుచేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్న కన్న కూతురినే తల్లిదండ్రులు, సోదరుడు కలసి గొంతు నులిమి చంపేశారు. కులాంతర వివాహం చేసుకున్నారనే కోపంతో కూతురు, అల్లుడిపై ఎర్రగడ్డలో నడిరోడ్డుపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచాడు ఓ తండ్రి. అదృష్టవశాత్తు వారిద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. హవాలా హవా.. పైకి పార్శిళ్లలాగే ఉన్నా వాటిలో మాత్రం హవాలా డబ్బు సరఫరా అవుతోంది. హైదరాబాద్ నుంచి ముంబైకి హవాలా డబ్బును ఆంధ్రా పార్శిళ్ల సంస్థ రవాణా చేస్తుండగా రైల్వే పోలీసులు పట్టుకున్నారు. రూ.66 లక్షల హవాలా సొమ్మును సీజ్ చేశారు. ఏకంగా రైళ్లలోనే హవాలా డబ్బు రవాణా జరగడం ఈ ఏడాది చర్చనీయాంశమైంది. వెయ్యి కోట్లు మింగేసింది.. హీరా గోల్డ్ పేరుతో 8 రాష్ట్రాల్లో డిపాజిట్లు వసూలు చేసినా ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. రూ.వెయ్యి కోట్లకు పైగా పలు రకాల స్కీముల పేరుతో డిపాజిట్ల రూపంలో సేకరించింది ఆ సంస్థ యజమాని నౌహీరా షేక్. రాజకీయ వేడి.. ఏడాది చివర జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హవాలా డబ్బు ఏరులై పారింది. రూ.125 కోట్లకు పైగా నగదును పోలీస్ శాఖ స్వాధీనం చేసుకోగా, అందులో హవాలా డబ్బే దాదాపు 40 కోట్లకు పైగా ఉంది. వరంగల్ పెంబర్తిలో పట్టుబడ్డ కేసులో మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, కాంగ్రెస్ నేత మద్దిరాజు రవిచంద్ర పేర్లు బయటపడటం కలవరం రేపాయి. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు, విచారణ రాజకీయంగా వేడిని రగిలించాయి. ఎన్నికల ప్రచారం ముగియడానికి ముందు రోజు రేవంత్‌రెడ్డి ముందస్తు అరెస్ట్ పోలీసు శాఖకు, ఉన్నతాధికారులకు మాయని మచ్చగా మిగిలింది. ఈ అరెస్ట్ వ్యవహారంపై హైకోర్టు చేసిన ఘాటు వ్యాఖ్యలు సంచలనం రేపాయి. సంచలన తీర్పులు.. 2007లో జరిగిన హైదరాబాద్ గోకుల్ చాట్, లుంబినీ పార్క్ జంట పేలుళ్ల కేసులో న్యాయస్థానం ఈ ఏడాది సంచలన తీర్పు వెలువరించింది. నిందితుల్లో ఇద్దరికి ఉరిశిక్ష విధించగా, మరొకరికి జీవిత ఖైదు విధించింది. మద్దెల చెరువు సూరి అలియాస్ గంగుల సూర్యనారాయణరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న భానుకిరణ్‌కు జీవితఖైదు విధిస్తూ సీఐడీ కోర్టు ఎనిమిదేళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం శిక్ష ఖరారు చేసింది. నర్సింగ్ విద్యార్థులకు వేధింపులు.. నర్సింగ్ కాలేజీలను లైంగిక వేధింపులకు గురిచేశారంటూ మాజీ మంత్రి, రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ కుమారుడు సంజయ్‌ను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. శాంకరీ నర్సింగ్ కాలేజీలోని 11 మంది నర్సింగ్ విద్యార్థినులు దీనిపై నేరుగా హోంమంత్రికి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, పాతబస్తీలోని నిజాం మ్యూజియం నుంచి రూ.300 కోట్ల విలువైన వస్తువులను కొట్టేశారు దుండగులు. ప్రాణాలు బలితీసుకున్న కుంపటి.. చలి వేస్తుండటంతో వెచ్చదనం కోసం ఇంటిలో పెట్టుకున్న బొగ్గుల కుంపటి ఆరుగురి ప్రాణాలను బలిగొంది. జూబ్లీహిల్స్‌కు చెందిన బుచ్చివేణి, ఆమె కుమారుడు పద్మరాజు పొగకు ఊపిరాడక మృతిచెందగా, ఆ మరుసటిరోజే శామీర్‌పేట బొమ్మరాసిపేట గ్రామంలో కోళ్లఫారంలో పనిచేస్తున్న మహబూబ్‌నగర్‌కు చెందిన నలుగురు వలస కూలీలు ఇదే రీతిలో మరణించడం సంచలనం రేపింది. కాల్చేసిన బాణసంచా.. రోజువారీ కూలీలుగా పనిచేసుకునే కుటుంబాల్లో అగ్నిప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. వరంగల్ శివారులో బాణసంచా తయారీ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో 12 మంది కూలీలు దుర్మరణం చెందడంతో ఆ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కాగా, హైదరాబాద్‌లోని పాతబస్తీ చాంద్రాయణగుట్టలో బాసిత్‌తో పాటు నలుగురిని ఐసిస్ మాడ్యూల్ కోసం పనిచేస్తున్నట్లు గుర్తించి ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. -
వచ్చిన లాభాలన్నీ హరించుకుపోయాయి!
బహుశా! 2018వ సంవత్సరాన్ని ఇన్వెస్టర్లెవరూ మరిచిపోలేరేమో!! ఎందుకంటే ఈ ఏడాది వచ్చినన్ని ఒడిదుడుకులు గతంలో ఎన్నడూ రాలేదు. ఈ ఏడాదిలో ఒకదశలో మార్కెట్లు జీవితకాల గరిష్ఠ స్థాయిలకు వెళ్లాయి. భారీ లాభాలనిచ్చాయని అనుకున్నారంతా!. కానీ ఏడాది చివరికి వచ్చేసరికి పరిస్థితి తల్లకిందులైంది. ఈ ఏడాది వచ్చిన లాభాలన్నీ హరించుకుపోయాయి. మన దేశంలోనే కాదు. అంతర్జాతీయంగానూ ఇదే పరిస్థితి. మార్కెట్లే కాదు. మన కరెన్సీ రూపాయిదీ అదే పరిస్థితి. జీవితంలో ఎన్నడూ చూడని గరిష్ఠ స్థాయిని మన రూపాయి ఈ ఏడాది చూసింది. డాలర్‌తో మారకంలో ఏకంగా 74 రూపాయల్ని దాటేసింది. మళ్లీ 70 దిగువకు వచ్చేసింది. మన ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన ముడి చమురుదీ అదే పరిస్థితి. ఈ ఏడాది ఒక దశలో 80 డాలర్లను కూడా దాటిన బ్యారెల్ చమురు... మళ్లీ 50 డాలర్ల దిగువకు వచ్చేసింది. మన బ్యాంకులు కొన్ని భారీ కుంభకోణాల్ని చూశాయి. బిట్‌కాయిన్ పాతాళానికి పడిపోయింది. ఇక అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థల్ని ప్రభావితం చేసే వాణిజ్య యుద్ధాలనూ ఈ ఏడాది మనకు పరిచయం చేసింది. చైనా దిగుమతులపై అమెరికా భారీ సుంకాలు విధిస్తే... దాన్ని చైనా అంతే దీటుగా తిప్పికొట్టింది. చివరకు ఈ యుద్ధంలోకి మనలాంటి దేశాలూ చేరక తప్పలేదు. అందుకే... ఆర్థిక వ్యవస్థకు ఇది ఎగుడుదిగుడుల నామ సంవత్సరమని చెప్పొచ్చు. మరి అలాగని ఈ సంవత్సరం సానుకూల పరిణామాలేవీ లేవా? అంటే... చాలా ఉన్నాయి. అన్నిటికన్నా ముఖ్యం... మార్కెట్లు పరిణతి సాధించాయి. ఎన్నికల ఫలితాలొచ్చినపుడో, ఆర్బీఐ గవర్నరు ఉన్నట్టుండి రాజీనామా చేసినపుడో మార్కెట్లు ఒక్కసారి ఉలిక్కిపడ్డా... వెంటనే సర్దుకున్నాయి. మార్కెట్లే కాదు!! మన ఇన్వెస్టర్లలోనూ పరిణతి పెరిగింది. గతంలో మార్కెట్లు పెరిగేటపుడు పెట్టుబడులు పెట్టి... ఒకవేళ పడిపోతే ఉపసంహరించుకునే సంస్కృతి ఉండేది. ఇపుడు మార్కెట్లు పడుతున్నపుడే మరిన్ని పెట్టుబడులు పెట్టే ధోరణి పెరిగింది. ఫండ్లలోకి.. అది కూడా సిప్ రూపంలో వచ్చే పెట్టుబడులు పెరగటం దీనికి నిదర్శనం. ఇక కనుమరుగైన బ్రాండ్లు, వాహనాలు మళ్లీ మార్కెట్లో హల్చల్ చేస్తున్నాయి. శాంత్రో, జావా ఇలాంటి కథలే. దేశీయంగా జరిగిన విలీనాలు– కొనుగోళ్లలో ఈ ఏడాదిది రికార్డు స్థాయి. అద్భుతాలు సృష్టించిన స్టార్టప్‌ల సంఖ్య పెరగటమే కాదు. రిటైల్ దిగ్గజం ఐకియా భారత్‌లో తొలి స్టోర్‌ను ఆరంభించటం... ఇవన్నీ శుభపరిణామాలే. కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న వేళ 2018 నాటి కీలక ఆర్థిక ఘటనల సమాహారం మీకోసం.. స్టాక్ మార్కెట్: లాభాలు హరీ! గతేడాది భారీ రాబడులిచ్చిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది పడుతూ లేస్తూ ముగించాయి. ప్రస్తుతానికి ఏడాది ఆరంభంతో పోలిస్తే ప్రధాన సూచీలు దాదాపు 7 శాతం లాభపడ్డాయి. ఈ ఏడాది మధ్యలో నిఫ్టీ, సెన్సెక్స్ జీవితకాల గరిష్ఠాలను చవిచూశాయి. ప్రధాన సూచీలతో పోలిస్తే మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అత్యంత అధ్వాన్న ప్రదర్శనిచ్చాయి. ఏడాది ఆరంభంతో పోలిస్తే మిడ్‌క్యాప్ సూచీ 13 శాతం, స్మాల్‌క్యాప్ సూచీ 23 శాతం మేర నష్టపోయాయి. గతేడాది ర్యాలీ అనంతరం ఈ సంవత్సరం సూచీలు ఒకదశలో భారీ కరెక్షన్ చవిచూశాయి. ఈక్విటీ మార్కెట్లోకి దేశీయ నిధుల ప్రవాహం ఈ ఏడాది కూడా కొనసాగింది. ఈక్విటీ ఫండ్స్ దేశీయ మార్కెట్లో దాదాపు 1.18 లక్షల కోట్ల రూపాయల కొనుగోళ్లు చేశాయి. మరోవైపు ఎఫ్‌పీఐలు దేశీయ మార్కెట్ నుంచి సుమారు 87వేల కోట్ల రూపాయల అమ్మకాలు జరిపాయి. వరుసగా ఆరేళ్లు భారత మార్కెట్లో కొనుగోలుదారులుగా ఉన్న ఎఫ్‌పీఐలు ఈ ఏడాది నికర అమ్మకందారులుగా మారాయి. ఈ సంవత్సరం మోదీ సర్కారు బడ్జెట్లో దీర్ఘకాలిక మూలధన రాబడి పన్నును (ఎల్టీసీజీ) ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అంతర్జాతీయ మార్కెట్లదీ అదేదారి... ట్రేడ్‌వార్ పుణ్యమా అని అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు ఈ ఏడాది భారీ పతనాలను నమోదు చేశాయి. ముఖ్యంగా చైనా సూచీ సంవత్సరంలో 22 శాతం పతనమైంది. వర్ధమాన దేశాల మార్కెట్లు అతలాకుతలం అయ్యాయి. యూఎస్ సూచీలు సైతం పలు ఆటుపోట్లు చవిచూశాయి. యూకేలో బ్రెగ్జిట్ భయాలతో మార్కెట్లు దాదాపు 12 శాతం క్షీణించాయి. ఇతర యూరప్ మార్కెట్లు సైతం నేల చూపులు చూశాయి. ఐపీఓలు.. సెకండాఫ్ నీరసం 2018లో దాదాపు 60వేల కోట్ల రూపాయల విలువైన పబ్లిక్ ఆఫర్లకు సెబి అనుమతినిచ్చింది. అయితే ఇంతవరకు కేవలం 31వేల కోట్ల రూపాయల ఐపీఓలే మార్కెట్ ముందుకు వచ్చాయి. ప్రైమరీ మార్కెట్లు పేలవంగా ఉండటంతో అనుమతి పొందిన ఇతర కంపెనీలు సరైన తరుణం కోసం వేచి చూస్తూ ప్రస్తుతానికి తమ ప్రణాళికలను వాయిదా వేసుకున్నాయి. ఈ సంవత్సరం ఐపీఓకి వచ్చిన కంపెనీల్లో భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హెచ్ఏఎల్, ఇండోస్టార్ క్యాపిటల్ ఫైనాన్స్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్; అపోలో మైక్రోసిస్టమ్స్ అధ్వాన పనితీరు కనబరిచాయి. ఎండీఎన్ఎల్, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ, ఫైన్ ఆర్గానిక్స్, బంధన్ బ్యాంక్, రైట్స్ కంపెనీల షేర్లు ఒక మోస్తరు రాబడులు అందించాయి. అందుకే ఈ ఏడాది తొలి అర్ధ సంవత్సరంతో పోలిస్తే రెండో అర్ధ భాగంలో పెద్దగా ఐపీఓలు రాలేదు. దేశీయ మ్యూచ్‌వల్ ఫండ్లలోకి పెట్టుబడుల వరద ఈ సంవత్సరం కూడా కొనసాగింది. కానీ ఈ సంవత్సరం లార్జ్‌క్యాప్ ఫండ్స్ 4 శాతం, మిడ్‌క్యాప్ ఫండ్స్ 14 శాతం, స్మాల్‌క్యాప్ ఫండ్స్ 21 శాతం మేర నెగటివ్ రాబడులు ఇచ్చాయి. అయినా.. సిప్ రూపంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల్ని కొనసాగిస్తూనే వస్తున్నారు. ఉర్జిత్ పటేల్: ఎగ్జిట్ ప్రభుత్వానికి, రిజర్వు బ్యాంకుకు మధ్య పొరపచ్చాలున్నాయంటూ ఈ ఏడాది వార్తలు వచ్చాయి. వీటికి పరాకాష్టగా ఉన్నట్లుండి ఏడాది చివర్లో ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన చెప్పినా, ప్రభుత్వ పోకడలు నచ్చక వైదొలిగారని సంబంధిత వర్గాలంటున్నాయి. ముఖ్యంగా ఆర్బీఐ ఎన్‌పీఏలున్న బ్యాంకులపై ఆంక్షలు, లిక్విడిటీ మేనేజ్మెంట్, రిజర్వు నిధుల వినియోగంపై ఇరు పక్షాలకు బేధాభిప్రాయాలున్నాయి. ఇవన్నీ చినికి చినికి పటేల్ రాజీనామాకు దారితీశాయి. అనంతరం ప్రభుత్వం శక్తికాంతదాస్ను కొత్త గవర్నర్‌గా నియమించింది. ఐఎల్ఎఫ్ఎస్: సంక్షోభం లిక్విడిటీ కొరత కారణంగా అప్పులిచ్చినవాళ్లకు సకాలంలో చెల్లింపులు చేయలేక ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ చేతులెత్తేసింది. దీంతో బ్యాంకింగేతర ఆర్థిక సంస్థల(ఎన్బీఎఫ్సీ) రంగంలో పెను సంక్షోభం బయటపడింది. ఈ ప్రభావం డెట్, ఈక్విటీ మార్కెట్‌పై విపరీతంగా పడింది. సుమారు మూడునెలలు మార్కెట్లు, ఎన్బీఎఫ్సీ షేర్లు అల్లకల్లోలం అయ్యాయి. రేటింగ్ ఏజెన్సీలు కంపెనీ బాండ్లను డౌన్‌గ్రేడ్ చేశాయి. కంపెనీ ఎక్కువగా రుణాలిచ్చిన రియల్టీ రంగంపై ఈ సంక్షోభం ప్రభావం చూపించింది. ఇంతలో డీహెచ్ఎఫ్ఎల్ బాండ్లను డీఎస్పీ బ్లాక్‌రాక్ మ్యూచ్‌వల్ ఫండ్ ఉన్నట్లుండి విక్రయించడంతో అనుమానాలు ముదిరాయి. ఈ నేపథ్యంలో గృహ ఫైనాన్స్ రంగ షేర్లు కుదేలయ్యాయి. ఫేస్బుక్... వివాదాలు కొత్త సంవత్సరం ఫేస్బుక్ పలు వివాదాల బారిన పడింది. కేంబ్రిడ్జ్ అనలిటికా సంస్థ... ఫేస్బుక్ యూజర్ల డేటాను రాజకీయంగా దుర్వినియోగం చేసిందని మార్చిలో బయటపెట్టింది. ఏప్రిల్‌లో వ్యవహారం మరింత మంది యూజర్ల డేటా హ్యాకింగ్‌కు గురైందని ఫేస్బుక్ ప్రకటించింది. పలు వివాదాలపై సంస్థ సీఈఓ యూఎస్ కాంగ్రెషనల్ కమిటీ ముందు హాజరయి వివరణ ఇచ్చారు. పలుదేశాల ప్రభుత్వాలు డేటా వినియోగంపై ఫేస్‌బుక్‌ను వివరణ కోరాయి. ఈ వివాదాలతో 2018లో కంపెనీ షేరు దాదాపు 30 శాతం పతనమైంది. కొనుగోళ్లు, విలీనాలు: రికార్డు భారత ఎంఅండ్ఏ (మెర్జర్స్ అండ్ ఎక్విజిషన్స్) డీల్స్ ఈ ఏడాది ఆల్‌టైమ్ హైని చేరాయి. 2018లో ఏకంగా 12,520 కోట్ల డాలర్ల విలువైన డీల్స్ జరిగాయి. అంతర్జాతీయ దిగ్గజం వాల్‌మార్ట్ భారత ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో 77% వాటాను 1600 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. వొడాఫోన్, ఐడియా విలీనమై దేశంలో అతిపెద్ద టెలికం కంపెనీగా అవతరించాయి. టెలినార్, టాటాటెలీని ఎయిర్టెల్ సొంతం చేసుకుంది. ఇండస్ టవర్స్, భారతి ఇన్ఫ్రాటెల్ కలిసిపోయాయి. హెచ్పీసీఎల్లో 51% వాటాను ఓఎన్జీసీ సొంతం చేసుకుని హెచ్‌పీసీఎల్‌కు యజమానిగా మారింది. ప్రఖ్యాత హార్లిక్స్, బూస్ట్ బ్రాండ్లతో పాటు గ్లాక్సో స్మిత్‌క్లైన్ కన్జూమర్ న్యూట్రిషన్ వ్యాపారాన్ని హెచ్‌యూఎల్ కొనుగోలు చేసింది. బీఓబీ, విజయాబ్యాంక్, దేనా బ్యాంకులను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అరైస్టా లైఫ్ సైన్సెస్‌ను యూపీఎల్ కొనుగోలు చేసింది. దివాలా తీసిన ఎలక్ట్రో స్టీల్‌ను వేదాంత... భూషణ్ స్టీల్‌ను టాటా స్టీల్... మోన్నెట్ ఇస్పాత్‌ను జేఎస్‌డబ్ల్యూ స్టీల్... ఆమ్టెక్ ఆటోను లిబర్టీ హౌస్ సొంతం చేసుకున్నాయి. దిగ్గజాలుగా మన స్టార్టప్స్ ఈ ఏడాది ఇండియన్ స్టార్టప్స్ అనేకం యూనికార్న్స్‌గా (వందకోట్ల డాలర్ల పైచిలుకు వాల్యుయేషన్ సాధించినవి) అవతరించాయి. ప్రస్తుతం భారత్‌లో 26 యూనికార్న్‌లున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌తో పాటు ఓయో, ఓలా, బైజు, పేటీఎం, జొమాటో, స్విగ్గీలు ఈ ఏడాది భారీగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించాయి. వీటితో పాటు ఈ సంవత్సరం పలు దేశీయ కంపెనీల్లో విదేశీ ఇన్వెస్టర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. దాదాపు 77 డీల్స్‌లో సుమారు 360 కోట్ల డాలర్ల నిధులు దేశీ కంపెనీల్లోకి ప్రవహించాయి. తొలిసారి వారెన్ బఫెట్ భారతీయ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. పేటీఎం మాతృసంస్థలో బఫెట్‌కు చెందిన బెర్క్‌షైర్ హాత్వే 30 కోట్ల డాలర్లు పెట్టుబడి పెట్టింది. ఏడేళ్లలో ఎన్నడూ లేనట్లు ఈ సంవత్సరం చైనా, జపాన్ నుంచి పలువురు ఇన్వెస్టర్లు దేశీయ కంపెనీల్లో వాటాలు కొన్నారు. వీటిలో సాఫ్ట్‌బ్యాంక్ అత్యధికంగా 25 డీల్స్ కుదుర్చుకుని పలు భారతీయ కంపెనీల్లో వాటాలు కొన్నది. ఎకానమీ... తిరిగి గాడిలోకి! రెండేళ్ల పాటు నోట్లరద్దు, జీఎస్టీ అమలుతో కుంటుపడిన దేశ ఆర్థిక వృద్ధి ఈ ఏడాది కాస్త గాడిన పడింది. ఈ సంవత్సరం తిరిగి జీడీపీ 7 శాతం పైకి చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎకాఎకిన 8.2 శాతం వృద్ధి నమోదు చేసింది. రెండో త్రైమాసికంలో కాస్త చల్లబడి 7.1%కి చేరింది. ఇండియా జీడీపీ వృద్ధి రేటు అంచనాలను ఫిచ్ 7.8% నుంచి 7.2%కి తగ్గించింది. ఈ ఏడాది ద్రవ్యోల్బణం క్రమంగా దిగివచ్చింది. నవంబర్‌లో ద్రవ్యోల్బణం 2.3%గా నమోదయింది. ప్రపంచ బ్యాంకు ప్రకటించే ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకింగ్స్‌లో ఇండియా ర్యాంకు 23 స్థానాలు మెరుగుపడి 77కు చేరింది. ఈ ఏడాది ప్రభుత్వం కొత్తగా డ్రోన్స్ పాలసీ, జాతీయ ఎలక్ట్రానిక్స్ పాలసీ, పీఎస్ఎస్ చట్ట సవరణ, కంపెనీల చట్ట సవరణ బిల్లులను, ఇ– ఫార్మసీ పాలసీని తీసుకువచ్చింది. ఎలక్ట్రిక్ వాహనాల పాలసీలో మార్పులు చేసింది. జీఎస్టీ పూర్తయి సంవత్సరం పూర్తయిన వేళ తొలిసారి ఈ ఏడాది జీఎస్టీ నెలవారీ వసూళ్లు లక్ష కోట్ల రూపాయలను తాకాయి. స్కాములు... షరా మామూలు ఈ ఏడాది ఫిబ్రవరిలో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు సంబంధించి దాదాపు 14వేల కోట్ల రూపాయల కుంభకోణం బయటపడింది. భారత బ్యాంకింగ్ చరిత్రలోనే ఇది అతిపెద్ద కుంభకోణం. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఆయన బంధువు మెహుల్ చోక్సీ... లెటర్ ఆఫ్ అండర్‌టేకింగ్‌ల పేరిట పీఎన్బీని ఏకంగా రూ.13,000 కోట్ల మేర మోసగించారు. తరవాత ఇద్దరూ దేశం విడిచి పరారయ్యారు కూడా. ఇక కాన్పూర్‌కు చెందిన రొటోమాక్ కంపెనీ... దాదాపు ఏడు బ్యాంకులకు సుమారు రూ.3,700 కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టింది. దీంతోపాటు కనిష్క గోల్డ్, ఆర్పీ ఇన్ఫోసిస్టమ్స్, యూబీఐ స్కాములు సైతం బయటపడ్డాయి. మరోవైపు కింగ్‌ఫిషర్ విజయ్‌మాల్యాను భారత్‌కు అప్పగించేందుకు బ్రిటన్ కోర్టు అంగీకరించింది. ఈ ఏడాది స్కామ్‌లతో బ్యాంకులకు రూ.35,000 కోట్ల మేర నష్టం వచ్చింది. వీడియోకాన్ గ్రూప్‌లో అనుచిత పెట్టుబడులకు పరోక్ష సహకారం అందించారని ప్రముఖ బ్యాంకర్ చందా కొచ్చర్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ఆమె ఐసీఐసీఐ సీఈఓ పదవికి రాజీనామా చేశారు. ఆటో రంగం: కొత్త లాంచింగ్‌లు హుందాయ్ సంస్థ తన హ్యాచ్‌బ్యాగ్ శాంత్రోను మళ్లీ మార్కెట్లోకి తీసుకువచ్చింది. మహీంద్రా సంస్థ కొత్త ఎస్యూవీ మారాజోను, టయోటా కొత్తకారు యారిస్‌ను విడుదల చేశాయి. హోండా కంపెనీ అమేజ్ న్యూవెర్షన్‌ను తెచ్చింది. టూవీలర్స్ విభాగంలో టీవీఎస్ ఎన్‌టార్క్, హీరో డెస్టినీ, ఎక్స్ట్రీమ్ 200ఆర్, రాయల్‌ఎన్‌ఫీల్డ్ ఇంటర్ సెప్టార్, కాంటినెంటల్ జీటీ, బీఎండబ్ల్యూ జీ310, హోండా డెస్టినీ, సుజుకీ బర్గ్మాన్ స్ట్రీట్ మార్కెట్లో సందడి చేశాయి. 80వ దశకం వరకు బాగా క్రేజ్ ఉన్న జావా బైక్‌ను మహీంద్రా అండ్ మహీంద్రా తిరిగి మార్కెట్లోకి తీసుకువచ్చింది. క్రూడ్, రూపాయి: ఎగసిపడి... 2018లో ముడి చమురు భారీ కదలికలు నమోదు చేసింది. ఇరాన్‌పై యూఎస్ ఆంక్షలు విధించడంతో క్రూడ్ ధరకు రెక్కలొచ్చాయి. బ్రెంట్ ధర ఒక దశలో 90 డాలర్లకు చేరువైంది. అయితే కొన్ని దేశాలకు ఆంక్షల నుంచి మినహాయింపు ఇవ్వడం, షేల్ గ్యాస్ ఉత్పాదన పెరగడంతో క్రూడ్ ధర ఒక్కసారిగా పతనమై 60 డాలర్ల దిగువకు చేరింది. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువను క్రూడ్ ధర పెరగడం ప్రభావితం చేసింది. క్యాడ్ భయాలు, డాలర్ బలపడటంతో మన రూపాయి ఈ ఏడాది జీవితకాల కనిష్ఠం 74.48 స్థాయిలకు పతనమైంది. కానీ ఆ తర్వాత పరిస్థితులు చక్కబడటంతో ఏడాది చివరకు రూపీ క్రమంగా బలపడుతూ 70 స్థాయిలకు అటుఇటుగా కదలాడుతోంది. అమెరికా ఫెడ్: ట్రంప్‌తో రగడ ఈ ఏడాది అమెరికా ఫెడరల్ రిజర్వు బ్యాంకు 4 సార్లు రేట్లు పెంచింది. దీంతో ఫెడ్ రేటు 2.5%కి చేరింది. యూఎస్ ఎకానమీ అనుకున్నట్లుగానే బలపడుతోందని.... వచ్చే ఏడాది 3, ఆపై ఏడాది 2 దఫాలు రేట్లు పెంచవచ్చని అంచనా వేసింది. కాకపోతే ఇది అధ్యక్షుడు ట్రంప్‌కు సుతరామూ నచ్చలేదు. తాజాగా డిసెంబర్లో పెంపు వద్దని ఆయన ఫెడ్‌ను కోరినా... ఫెడ్ ఆయన మాట వినలేదు. దీంతో ఫెడ్ చైర్మన్‌ను తీసేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వస్తున్న కథనాలు తాజాగా అంతర్జాతీయ మార్కెట్లను అతలాకుతలం చేస్తున్నాయి. విమానయానం: నేల చూపులు దేశీయ విమానయాన రంగం ఈ ఏడాది రెండు రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంది. ఒకపక్క వైమానిక ఇంధనం ధరలు పెరిగిపోవడం, మరోపక్క రూపాయి పతనం కంపెనీలను కుంగదీశాయి. విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా... అది కంపెనీలకు లాభాలు తెచ్చి పెట్టే స్థాయిలో లేదు. పైపెచ్చు మార్కెట్లో ప్రముఖంగా ఉన్న ఏడు కంపెనీల్లో చాలా వరకు రుణభారం ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియాను ప్రైవేటీకరించడానికి ప్రభుత్వం చేసిన యత్నాలు ఫలించలేదు. దీంతో కంపెనీని ఆదుకునేందుకు విడతలవారీగా మూలధన సాయం అందిస్తూ వస్తోంది. బంగారం: మెరుపులు ఈ సంవత్సరం బంగారం ధరలు దాదాపు 7 శాతం మేర లాభపడ్డాయి. ఈక్విటీలు అంతంతమాత్రపు పనితీరు చూపించటంతో బంగారానికి డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి నిధుల ప్రవాహం బాగానే కనిపించింది. ప్రభుత్వ గోల్డ్ సావరిన్ బాండ్లలోకీ పెట్టుబడులు బాగానే వచ్చాయి. ఐకియా... తొలి స్టోర్ ఆరంభం అంతర్జాతీయ ఫర్నిచర్, ఫర్నిషింగ్ దిగ్గజం ఐకియా తొలిసారి ఇండియాలో కాలు మోపింది. నాలుగేళ్ల పరిశోధన, ప్రయత్నాల అనంతరం హైదరాబాద్‌లో కొత్త స్టోర్‌ను ఈ ఏడాది ఆగస్టులో ఆరంభించింది. దాదాపు 10,500 కోట్ల రూపాయలను ఐకియా ఈ స్టోరుపై వెచ్చించింది. క్రమేపీ దేశంలో ఇతర నగరాలకు విస్తరించాలని కంపెనీ భావిస్తోంది. 2025కు 11 స్టోర్లతో పాటు 14,600 మందికి ఉపాధి కల్పిస్తామని తెలిపింది. బిట్‌కాయిన్: పెరిగిన భయాలు నిజ కరెన్సీకి ప్రత్యామ్నాయంగా భావించిన మిధ్యా (క్రిప్టో) కరెన్సీలు ఈ ఏడాది భారీగా దెబ్బతిన్నాయి. బిట్‌కాయిన్ విలువ ఏడాది చివరకు 19,350 డాలర్ల నుంచి ఏకంగా 3,360 డాలర్లకు దిగి రాగా, ఇథెరియమ్ విలువ 1,405 డాలర్ల నుంచి 88.71 డాలర్లకు పడిపోయింది. యూఎస్, చైనా ట్రేడ్‌వార్ చైనా అనుసరిస్తున్న వాణిజ్య విధానాలు బాగాలేవంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆయన పలు చైనా ఉత్పత్తులపై సుంకాలను భారీగా పెంచారు. ఇందుకు దీటుగా చైనా సైతం యూఎస్ ఉత్పత్తులపై సుంకాలను పెంచింది. ఈ పరిణామాలన్నీ అంతర్జాతీయ ట్రేడ్ వార్‌కు దారి తీసేలా ఉద్రిక్తతలను పెంచాయి. అయితే ఏడాది చివరకు ఇరుదేశాల మధ్య ఒక అవగాహన వచ్చింది. 90 రోజుల్లో ఒక ఒప్పందానికి రావాలని ఇరుదేశాలు సంకల్పించాయి. -
బీసీలకు పెద్దపీట
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగి తెలంగాణలో సీట్ల సంఖ్య 119 కి పెరిగింది. గతంలో భద్రాచలం పార్లమెంటరీ నియోజకవర్గం ఏపీలో కూడా విస్తరించి ఉండేది. కాని పునర్విభజనలో అలాంటిది లేకుండా తెలంగాణకు పరిమితం చేశారు. కాగా అప్పట్లో వైఎస్‌ను ఓడించాలన్న లక్ష్యంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలతో మహాకూటమి పేరుతో పొత్తు పెట్టుకుని ఎన్నికలలో పోటీచేశారు. మరో వైపు మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఎన్నికల గోదాలోకి వచ్చారు. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవడం కోసం చంద్రబాబు తెలంగాణకు అనుకూల లేఖ ఇవ్వడం మరో విశేషం. అత్యంత హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. పొత్తుతో తెలంగాణలో టీడీపీ లాభపడితే, టీఆర్ఎస్ బాగా నష్టపోవడం మరో విశేషంగా కనిపిస్తుంది. చిరంజీవి పార్టీ విఫలం అవడం కూడా ఇంకో ప్రత్యేకత అని చెప్పాలి. తెలంగాణలో 119 సీట్లకు గాను కాంగ్రెస్ 50 సీట్లను, టీడీపీ 39, టీఆర్ఎస్ పది, ఎంఐఎం ఏడు, సీపీఐ నాలుగు, బీజేపీ రెండు, ప్రజారాజ్యం రెండు సీపీఎం ఒక స్థానం, లోక్ సత్తా ఒక సీటు గెలుచుకోగా, ముగ్గురు ఇండి పెండెంట్లు కూడా గెలిచారు. ఇక సామాజికవర్గాల వారీగా చూస్తే తెలంగాణ, కోస్తా, రాయలసీమలలో కలిపి 82 మంది రెడ్డి నేతలు విజయం సాధిస్తే, వారిలో 53 మంది కాంగ్రెస్ పక్షాన గెలిచారు. తెలుగుదేశం పార్టీ తరపున 20 మంది, టీఆర్ఎస్లో ఇద్దరు గెలిచారు. తెలంగాణ వరకు తీసుకుంటే 40 మంది రెడ్డి నేతలు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పక్షాన 22 మంది, తెలుగుదేశం పార్టీలో 12 మంది, బీజేపీ, సీపీఎం, ప్రజారాజ్యంల నుంచి ఒక్కొకరు, ఇండిపెండెంట్ ఒకరు గెలుపొందారు. కమ్మ నేతలు ముగ్గురు గెలిస్తే వారిద్దరూ టీడీపీ, లోక్ సత్తాకు చెందినవారు. వెలమ వర్గం నుంచి 10 మంది ఎన్నికయ్యారు. వారిలో టీడీపీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్‌లో ఒకరు, టీఆర్ఎస్లో ముగ్గురు, సీపీఐ నుంచి ఒకరు గెలిచారు. ముస్లింలు ఏడుగురు విజయం సాధించారు. వారంతా ఎఐంఎం వారే. షెడ్యూల్ కులాల నేతలు 19 మందికిగాను కాంగ్రెస్ నుంచి పది మంది, టీడీపీలో ఆరుగురు, టీఆర్ఎస్ ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరు ఎన్నికయ్యారు. ఎస్టీలలో 12 మందికి గాను ఆరుగురు కాంగ్రెస్, ఐదుగురు టీడీపీ, ఒకరు సీపీఐ నుంచి గెలిచారు. బీసీలు 25 మంది గెలిస్తే కాంగ్రెస్ తరపున పది మంది, టీడీపీలో ఎనిమిది, టీఆర్ఎస్ ముగ్గురు బీజేపీ ఒకరు, ఇండిపెండెంట్లు ఇద్దరు గెలిచారు. ఇతర సామాజికవర్గాలలో ముగ్గురు కాంగ్రెస్, ఒకరు టీడీపీకి చెందినవారు ఉన్నారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన కాంగ్రెస్ రెడ్డి ప్రముఖులలో పి.సుదర్శన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, డి.కె.అరుణ, కె.జానారెడ్డి, ఆర్.దామోదరరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాంరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. దామోదరరెడ్డి, ఆర్.వెంకటరెడ్డిలు సోదరులు. వీరిద్దరూ ఒకే సభలో సభ్యులుగా ఉండడం విశేషం. తెలుగుదేశం నుంచి ఎన్నికైనవారిలో పోచారం శ్రీనివాసరెడ్డి, కె.హరీశ్వర్‌రెడ్డి, మహేందర్ రెడ్డి, రావుల చంద్రశేఖరరెడ్డి, నాగం జనార్దనరెడ్డి తదితరులు ఉన్నారు. కాగా కొత్తకోట దయాకరరెడ్డి, ఆయన సతీమణి సీతలు ఇద్దరూ టీడీపీ పక్షాన అసెంబ్లీకి ఎన్నికవడం విశేషం. డాక్టర్ జయప్రకాష్ నారాయణ లోక్ సత్తా పక్షాన గెలుపొందారు. బీజేపీ నేత కిషన్ రెడ్డి కూడా మరోసారి విజయం సాధించారు. వెలమ నేతలలో టి.హరీష్ రావు, కె.తారక రామారావు, చెన్నమనేని రమేష్, ఎర్రబెల్లి దయాకరరావు, జూపల్లి కృష్ణారావు ప్రభృతులు ఉన్నారు. కమ్మ నేతలు మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావులు టీడీపీ పక్షాన గెలిచారు. బీసీ నేతలలో దానం నాగేందర్, పొన్నాల లక్ష్మయ్య, కొండా సురేఖ, జోగు రామన్న, ఎల్.రమణ, బసవరాజు సారయ్య తదితరులు ఉన్నారు. ఎస్సీ నేతలలో దామోదర రాజనరసింహ, మోత్కుపల్లి నరసింహులు, డాక్టర్ శంకరరావు, సుద్దాల దేవయ్య తదితరులు ఉన్నారు. గిరిజన ఎమ్మెల్యేలలో జి.నగేష్ తదితరులు ఉన్నారు. -
1999 ఎన్నికలు: సామాజిక విభజనకు బీజం
1995లో తెలుగుదేశంలో జరిగిన తిరుగుబాటు ఫలితంగా ఎన్టీ రామారావు పదవి కోల్పోగా, ఆయన అల్లుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. 1999 లోక్‌సభ మధ్యంతర ఎన్నికలతో పాటు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి 50 స్థానాలు వస్తే కాంగ్రెస్ పార్టీకి 42 సీట్లు దక్కాయి. బీజేపీకి ఎనిమిది, ఎంఐఎంకు 4, సీపీఎం రెండు సీట్లు పొందాయి. ఒక ఇండిపెండెంట్ కూడా ఎన్నికయ్యారు. రెడ్డి సామాజికవర్గంలో మొత్తం 31 మంది గెలిస్తే, టీడీపీ నుంచి పది మందే గెలిచారు. మిత్రపక్షమైన బీజేపీ టిక్కెట్‌పై మరో నలుగురు గెలుపొందారు. ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి 17 మంది విజయం సాధించారు. ఒకరకంగా ఉమ్మడి ఏపీలో ఈ ఎన్నికల నుంచి సామాజిక విభజన బాగా పెరిగిందని చెప్పాలి.. వెలమ వర్గీయులు 12 మంది గెలిస్తే ఏడుగురు టీడీపీ, నలుగురు కాంగ్రెస్, ఒకరు బీజేపీ నుంచి విజయం సాధించారు. కమ్మ ఎమ్మెల్యేలుగా ముగ్గురు ఎన్నికైతే ఆ ముగ్గురు టీడీపీ వారే. బీసీలలో 26 మంది గెలిస్తే, 12 మంది టీడీపీ, 10 మంది కాంగ్రెస్ నుంచి గెలిచారు. ముగ్గురు బీజేపీ వారు కాగా, ఒకరు సీపీఎం నుంచి ఎన్నికయ్యారు. ముస్లింలు ఏడుగురు గెలుపొందితే ఎంఐఎం లో నలుగురు, టీడీపీ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎన్నికయ్యారు. ఎస్సీలు 17 మందికిగాను 13 మంది టీడీపీ , నలుగురు కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఎస్టీలు ఎనిమిది మందికిగాను కాంగ్రెస్, టీడీపీల నుంచి చెరో ముగ్గురు, ఒకరు సీపీఎం, ఒకరు ఇండిపెండెంట్‌గా నెగ్గారు. కాంగ్రెస్ నుంచి గెలిచినవారిలో రెడ్యానాయక్ జనరల్ సీటు నుంచి మరోసారి విజయం సాధించారు. ఇద్దరు బ్రాహ్మణులు గెలవగా, వారిలో ఒకరు కాంగ్రెస్, మరొకరు టీడీపీ వారు. వైశ్య వర్గం నుంచి ఒకరు కాంగ్రెస్ తరపున గెలిచారు. ఆయా వర్గాల వారీ గెలిచిన ప్రముఖులను పరిశీలిస్తే, కాంగ్రస్ నేతలు ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, జి.గడ్డన్న, జీవన్‌రెడ్డి, ఇంద్రారెడ్డి, చిన్నారెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, గోవర్దనరెడ్డి, యు.పురుషోత్తంరెడ్డి ఉన్నారు. టీడీపీ నుంచి గెలిచినవారిలో పోచారం శ్రీనివాసరెడ్డి, ముద్దసాని దామోదరరెడ్డి, ముత్యంరెడ్డి, హరీశ్వర్ రెడ్డి మహేందర్ రెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రభృతులు ఉన్నారు. బీజేపీ నుంచి ఇంద్రాసేనారెడ్డి తదితరులు ఉన్నారు. వెలమ సామాజికవర్గం నుంచి గెలిచిన వారిలో సీబీఐ మాజీ డైరెక్టర్ కె.విజయరామారావు టీడీపీ నుంచి ఖైరతాబాద్‌లో పోటీచేసి పీజేఆర్‌ను ఓడించారు. గెలిచిన ఇతర ప్రముఖులలో కె.చంద్రశేఖరరరావు, ఎర్రబెల్లి దయాకరరావు, జూపల్లి కృష్ణారావు ఉన్నారు. కమ్మ వర్గం నుంచి మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు మరోసారి గెలిచారు. ముస్లింలలో ఒవైసీ సోదరులు అసదుద్దీన్ ఒవైసీ, అక్బరుద్దీన్ ఒవైసీ ఉన్నారు. బీసీలలో దేవేందర్ గౌడ్, పి.చంద్రశేఖర్, డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, నోముల నరసింహయ్య వంటి వారు ఉన్నారు. బ్రాహ్మణులలో దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కరణం రామచంద్రరావు ఉన్నారు. బీసీలలో అత్యధికంగా మున్నూరు కాపు వర్గం వారు 11 మంది గెలిచారు. గౌడ వర్గం వారు ఇద్దరు, ముదిరాజ్ ముగ్గురు ,యాదవ నలుగురు ఉన్నారు. ఎస్సీలలో బోడ జనార్దన్, బాబూ మోహన్, సుద్దాల దేవయ్య, పి.రాములు, కడియం శ్రీహరి, డాక్టర్ పి.శంకరరావు, మోత్కుపల్లి నరసింహులు ప్రభృతులు ఉన్నారు. కాగా కాంగ్రెస్ పక్షాన ఎన్నికైన గిరిజన ఎమ్మెల్యే రాగ్యానాయక్‌ను కొంతకాలానికి నక్సలైట్లు కాల్చి హత్య చేయడంతో ఆయన భార్యను అసెంబ్లీకి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సామాజిక విశ్లేషణ కొమ్మినేని శ్రీనివాసరావు -
పెరిగిన బీసీ,ఎస్సీలు
1994లో తెలుగుదేశం ప్రభంజనం వీచింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ, దాని మిత్రపక్షాలుగా ఉన్న సీపీఐ, సీపీఎంలకు కలిపి 90 సీట్లు వస్తే, టీడీపీ మద్దతు ఇచ్చిన మరో ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా గెలిచారు. ఆ ఎన్నికలలో కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. తెలంగాణలో కేవలం ఆరు సీట్లే దక్కాయి. అయితే, ఇంత భారీ మెజార్టీ సాధించుకున్న తెలుగుదేశం అధినేత ఎన్.టి.రామారావు ఈసారి ఎనిమిది నెలలకే ఆయన అల్లుడు, అప్పటి మంత్రి చంద్రబాబు చేతిలో పరాభవానికి గురై ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. ఈ ఎన్నికల్లో సామాజిక వర్గాలవారీగా చూస్తే తెలంగాణలో రెడ్డి వర్గానికి చెందిన వారు అత్యధిక సంఖ్యలో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మొత్తం 35 మంది రెడ్డి నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికైతే, కాంగ్రెస్ తరపున అతి తక్కువగా కేవలం నలుగురే ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ నుంచి 21 మంది, బిజెపి నుంచి ఒకరు, సిపిఐ తరపున ఇద్దరు, సిపిఎం పక్షాన నలుగురు రెడ్డి నేతలు ఎమ్మెల్యేలు కాగా, ఇండిపెండెంట్లుగా ముగ్గురు రెడ్డి నేతలు గెలుపొందారు. వెలమ నేతలు 12 మంది గెలుపొందగా, ఎనిమిది టీడీపీ, బీజేపీ ఒకరు, సీపీఐ నుంచి ఇద్దరు, ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు. ముస్లింలు ఐదుగురు గెలుపొందగా, టీడీపీ, సీపీఐ, ఎంఐఎం లకు చెందినవారు ఒక్కొక్కరు ఉన్నారు. ఇద్దరు ఎంబీటీ పక్షం నుంచి విజయం సాధించారు. ఎంఐఎంలో చీలిక వచ్చి కొత్తగా ఏర్పడ్డ ఎంబీటీ రెండుస్థానాలు సాధించింది. కమ్మ నేతలు ఆరుగురు గెలుపొందగా, నలుగురు టీడీపీ, సీపీఐ, సీపీఎంల నుంచి ఒక్కొక్కరు గెలిచారు. ఎస్సీ వర్గాల నుంచి 17 మంది విజయం సాధించగా, వారిలో 12 మంది తెలుగుదేశం, ఇద్దరు సీపీఐ, ఇద్దరు సీపీఎం, ఇండి పెండెంట్ ఒకరు గెలిచారు. ఎస్టీలు ఎనిమిది మందికి గాను, కాంగ్రెస్ ఒకరు, టీడీపీ మూడు, సీపీఐ మూడు, సీపీఎం ఒకురు గెలిచారు. బీసీ వర్గాలు 21 మంది గెలిస్తే, ఒకరు కాంగ్రెస్ నుంచి, 17 మంది టీడీపీ నుంచి గెలిచారు. బీజేపీ ఒకరు, సీపీఐ నుంచి ఇద్దరు గెలుపొందారు. ఇతర వర్గాలకు చెందిన ఆరుగురు టీడీపీ నుంచే గెలిచారు. వీరిలో బ్రాహ్మణులు ఇద్దరు, వైశ్య ఒకరు, ఇతరులు ముగ్గురు ఉన్నారు. ఆయా వర్గాల నుంచి గెలుపొందిన ప్రముఖులలో కాంగ్రెస్ పక్షాన కె.ఆర్ సురేష్ రెడ్డి, పి.జనార్దన్‌రెడ్డి , మర్రి శశిధర్‌రెడ్డి, టీడీపీ పక్షాన పోచారం శ్రీనివాసరెడ్డి, ఇ.పెద్దిరెడ్డి, ముద్దసాని దామోదరరెడ్డి, పి.ఇంద్రారెడ్డి, నాగం జనార్దన్‌రెడ్డి, ఎ.మాధవరెడ్డి తదితరులు ఉన్నారు. సీపీఎం నేత నర్రా రాఘవరెడ్డి ఆరోసారి శాసనసభకు ఎన్నికయ్యారు. సీపీఐ నేత విఠల్ రెడ్డి మరోసారి చట్టసభకు వచ్చారు. కాంగ్రెస్ నేత ఆర్.దామోదరరెడ్డి టిక్కెట్ రాకపోవడంతో తిరుగుబాటు చేసి ఇండిపెండెంట్‌గా గెలిచారు. కమ్మవర్గం వారు టీడీపీ మిత్రపక్షాల నుంచే గెలిచారు. మండవ వెంకటేశ్వరరావు, తుమ్మల నాగేశ్వరరావు(టీడీపీ)పువ్వాడ నాగేశ్వరరావు(సీపీఐ), బోడేపూడి వెంకటేశ్వరరావు గెలిచినవారిలో ఉన్నారు. వెలమ నేతలలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు, యతిరాజారావు, (టీడీపీ) చెన్నమనేని రాజేశ్వరరావు(సీపీఐ), సీహెచ్ విద్యాసాగరరావు (బీజేపీ) ఉన్నారు. బీసీ వర్గాలలో మున్నూరు కాపు నుంచి ఐదుగురు, గౌడ ఇద్దరు, యాదవ ముగ్గురు, ముదిరాజ్ నలుగురు, పద్మశాలి 1, విశ్వబ్రాహ్మణ 1, పెరిక 1, పట్కారి 2, ఆర్య మరాఠా ఇద్దరు ఉన్నారు. బీసీ ప్రముఖులలో దేవేందర్ గౌడ్, తలసాని శ్రీనివాసయాదవ్, పి.చంద్రశేఖర్, ఎల్.రమణ, ఎస్.మధుసూదనాచారి, దానం నాగేందర్ ప్రభృతులు ఉన్నారు. ఎస్సీల్లో బోడ జనార్దన్, మోత్కుపల్లి నరసింహులు, కడియం శ్రీహరి, గుండా మల్లేష్, తదితరులు ఉన్నారు. ఎస్టీల్లో గోవింద నాయక్, చందూలాల్, రెడ్యాలు ఉన్నారు. ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ తొలిసారి ఎన్నికయ్యారు. సామాజిక విశ్లేషణ కొమ్మినేని శ్రీనివాసరావు -
మారిన ముఖచిత్రం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 1983 ఎన్నికలు పెనుమార్పులకు మూలమయ్యాయి. ఇక్కడి రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చివేశాయి. రెండు పార్టీల వ్యవస్థకు బలమైన పునాది ఈ ఎన్నికలలో పడింది. కొన్నిసార్లు చీలినా మూడు దశాబ్దాల పాటు ఏపీని పాలించిన కాంగ్రెస్ పార్టీ మొదటిసారిగా పరాజయం పాలైంది. ప్రఖ్యాత నటుడు ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి అధికారాన్ని కైవసం చేసుకున్నారు. అయితే తెలంగాణలో మెజార్టీ సీట్లను ఆయన పొందలేకపోవడం విశేషం. కాంగ్రెస్, ఇతర పక్షాలకు వచ్చిన సీట్లన్నిటిని కలిపితే, టీడీపీకి తక్కువ సీట్లు వచ్చినట్లు లెక్క. ఆ ఎన్నికలలో తెలంగాణలో మొత్తం 107 స్థానాలకు గాను తెలుగుదేశం పార్టీకి 43 సీట్లు మాత్రమే వచ్చాయి. వీరిలో 39 మంది కొత్తవారు, మొదటిసారి శాసనసభకు ఎన్నికైన వారు కావడం మరో ప్రత్యేకత. కాంగ్రెస్ పక్షాన 43 మంది గెలుపొందారు. బీజేపీకి రెండు, సీపీఐకి నాలుగు, సీపీఎంకు రెండు, జనతా పార్టీకి ఒకటి, ఇండిపెండెంట్లు పది మంది గెలుచుకున్నారు. సామాజిక వర్గాల వారిగా చూస్తే మొత్తం 34 మంది రెడ్లు విజయం సాధించగా, వారిలో 14 మంది కాంగ్రెస్, పన్నెండు మంది టీడీపీ, ఇద్దరు బీజేపీ, ఇద్దరు సీపీఎం, ఒకరు జనతా, ముగ్గురు ఇండిపెండెంట్లు ఉన్నారు. కమ్మ వర్గం వారు ఏడుగురు గెలవగా వారంతా తెలుగుదేశం పక్షానే గెలిచారు. వెలమ సామాజికవర్గం వారు ఎనిమిది మంది గెలవగా వారిలో నలుగురు కాగ్రెస్, నలుగురు టిడిపి తరపున నెగ్గారు. ఎస్సీలలో ఎనిమిది మంది కాంగ్రెస్, ఏడుగురు టీడీపీ, ఇద్దరు సీపీఐ పక్షాన గెలిచారు. ఎస్టీలలో నలుగురు కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, ఇండిపెండెంట్లు ఒక్కొక్కరు చొప్పున గెలిచారు. జనరల్ సీటు బాన్స్ వాడ నుంచి టీడీపీ తరపున ఒక ఎస్టీ అభ్యర్థి గెలిచారు. బీసీలలో తొమ్మిది మంది కాంగ్రెస్, ఏడుగురు టీడీపీ, ఒకరు ఇండిపెండెంట్‌గా నెగ్గారు. ముస్లింలలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐల తరుపున ఒక్కొక్కరు గెలవగా, ఐదుగురు ఇండిపెండెంట్లు నెగ్గారు. రెడ్డి వర్గం నుంచి.. రెడ్డి సామాజికవర్గం నుంచి 34 మంది గెలిస్తే కాంగ్రెస్ నుంచే ఎక్కువ మంది గెలిచారు. టీడీపీ తరపున గెలిచిన రెడ్డి ప్రముఖులలో జానారెడ్డి ఒకరు. కాంగ్రెస్ నుంచి ఎం.బాగారెడ్డి, ఆర్.సురేంద్రరెడ్డి, శీలం సిద్ధారెడ్డి, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, టి.అంజయ్య, బీజేపీ నుంచి నల్లు ఇంద్రసేనారెడ్డి, చందుపట్ల జంగారెడ్డి ఉండగా, జనతా పార్టీ పక్షాన ఎస్.జైపాల్ రెడ్డి గెలుపొందారు. సీపీఎం నుంచి నర్రా రాఘవరెడ్డి, మల్లు స్వరాజ్యం ఉన్నారు. ఇండిపెండెంటుగా గెలిచినవారిలో పి.రామచంద్రారెడ్డి ఉన్నారు. వెలమ.. వెలమ సామాజికవర్గం నుంచి తెలుగుదేశం పక్షాన కొత్తవారు గెలిస్తే, కాంగ్రెస్ పార్టీ తరపున పాత తరం నేతలు గెలిచారు. కాంగ్రెస్ నుంచి గెలిచినవారిలో ఎన్.యతిరాజారావు, జలగం ప్రసాదరావు వంటి నేతలు ఉన్నారు. టీడీపీ, కాంగ్రెస్ నుంచి నలుగురు చొప్పున గెలిచారు. అందరూ టీడీపీ వారే.. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత కమ్మ సామాజికవర్గం ఆ పార్టీని సొంత పార్టీగా భావించడం ఆరంభించింది. దానికి తగినట్లే తెలంగాణలో అత్యధికంగా ఏడుగురు కమ్మనేతలు ఎన్నికైతే వారంతా టీడీపీ నుంచి గెలవడం విశేషం. ఏడుగురిలో ఒక్క టి.రజనీబాబు తప్ప మిగిలిన వారంతా రాజకీయంగా కొత్తవారని చెప్పాలి. ఏడుగురు తొలిసారి ఎన్నికయ్యారు. బ్రాహ్మణ వర్గం.. బ్రాహ్మణ వర్గం నుంచి ఏడుగురు గెలిస్తే, ముగ్గురు కాంగ్రెస్, ముగ్గురు టీడీపీ వారు.ఒకరు సీపీఎం నుంచి గెలిచారు. టీడీపీ నుంచి గెలిచినవారిలో కరణం రామచంద్రరావు ప్రముఖులు. కాంగ్రెస్‌లో చకిలం శ్రీనివాసరావు, బొప్పరాజు లక్ష్మీకాంతరావు, డి.శ్రీపాదరావు గెలిచారు. సీపీఎం నేత మంచికంటి రామకిషన్ రావు గెలుపొందారు. ముస్లింలు 8 మంది.. హైదరాబాద్ పాతబస్తీ నుంచి అత్యధికంగా ఐదుగురు ముస్లిం నేతలు గెలిచారు. వారంతా మజ్లిస్ పక్షంవారే. సలావుద్దీన్ ఒవైసీ నాయకత్వంలో వారు ఉండేవారు. సీపీఐ నుంచి మహ్మద్ రజబ్ అలీ గెలిచారు. బీసీలు 17 మంది .. వెనుకబడిన తరగతుల వారిలో కాంగ్రెస్ నుంచి తొమ్మిది మంది, టీడీపీ నుంచి ఏడుగురు, సీపీఎం నుంచి ఒకరు గెలుపొందారు. టీడీపీ తెలంగాణలో బీసీలపై పట్టు సాధించలేకపోయింది. మున్నూరుకాపు, గౌడ, ముదిరాజ్ వర్గాల నుంచే ఎక్కువ మంది గెలిచారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ప్రముఖులలో సి.జగన్నాథరావు, మాణిక్ రావు, మదన్ మోహన్ వంటి ప్రముఖులు ఉన్నారు. బీసీల నుంచి గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలంతా తొలిసారి గెలిచినవారే. సీపీఎం నేత ఓంకార్ కూడా బీసీ నేతే. ఎస్సీల్లో కాంగ్రెస్ వారే అధికం ఎస్సీల్లో కూడా కాంగ్రెస్ వారే ఎక్కువ మంది గెలిచారు. 8 మంది కాంగ్రెస్, ఏడుగురు టీడీపీ నుంచి గెలిచారు. టీడీపీలో గెలిచిన వారిలో పుట్టపాగ మహేంద్రనాథ్ తప్ప మిగిలినవారంతా కొతవారే. కాగా కాంగ్రెస్‌లో గోకా రామస్వామి, పి.శంకరరావు ఉన్నారు. సామాజిక విశ్లేషణ కొమ్మినేని శ్రీనివాసరావు -
వెయ్యి రూపాయలతో బతికాను..
ఆ రోజుల్లో రాజకీయాలంటే డబ్బు, స్వార్థం, పదవీ వ్యామోహం ఉండేది కాదు. పదవి అంటే ఒక బాధ్యతగా భావించేవాళ్లం. నిత్యం జనం కోసమే కృషి చేశాం. ఒక్కోసారి కుటుంబం గురించి కూడా ఆలోచించేవాళ్లం కాదు. నిర్బంధ(ఎమర్జెన్సీ) సమయంలో పోరాటంలోకి వచ్చాం. ప్రజల హక్కుల సాధనకు నిత్యం శ్రమించాను. నన్ను ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. 1989లో నా ఎన్నికల ఖర్చు కేవలం రూ.88వేలు, 1994లో రూ.3 లక్షలు. రూ. వెయ్యితో బతికాను. మిగతా డబ్బంతా పార్టీకే ఖర్చు చేశాను. ప్రస్తుత రాజకీయాలు డబ్బులతో కూడుకున్నవి. ఓటును నోటుకు అమ్ముకోవడం చాలా పెద్దతప్పు. ప్రస్తుత ఎన్నికల్లో మద్యం ఏరులై పారతోంది. నిత్యం బిర్యానీ లేకపోతే ఈ రోజుల్లో కార్యకర్తలు, నాయకులు వెంట తిరగడం కష్టంగా మారిందని ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. మిగతా వివరాలు ఆయన మాటల్లోనే.. ఇబ్రహీంపట్నం రూరల్ : మాది మారుమూల కుగ్రామం. మంచాల మండలం ఆరుట్ల. నా బాల్యంలో 1952లో అప్పట్లో పంచాయతీ సమితి ఎన్నికల్లో మా తండ్రి కనకయ్య వార్డు సభ్యుడిగా పోటీ చేశారు. అంతకు ముందు నుంచే తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారు. అప్పట్లో నేను శంషాబాద్‌లోని అమెరికన్ మెనోనైట్ బ్రదరన్ మిషన్ స్కూల్లో 6వ తరగతి చదువుతుండగానే ఉద్యమాల వైపు ఆకర్షితుడినయ్యాను. కమ్యూనిస్టు పార్టీలో మా నాన్న పని చేస్తున్నారని అప్పటి దొరలు నాపై కక్షగట్టారు. 9వ తరగతిలోనే చురుకైన కార్యకర్తగా వ్యవహరించడంతో పాఠశాల నుంచి తొలగించాలని అధికారులకు లేఖ రాశారు. నాలో కమ్యూనిస్టు భావజాలం ఉందని పాఠశాల నుంచి పంపించారు. చదువు మానేశాక 14 ఏటనే అసెంబ్లీ ఎన్నికల్లో పీడీఎఫ్ తరుఫున పిలాయిపల్లి పాపిరెడ్డికి మద్దతుగా ప్రచారంలో పాల్గొన్నాను. అదే స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాను. రెండుసార్లు సీపీఎం తరఫున 1989,1994లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాను. మొదటిసారి ఎన్నికల్లో మొత్తం రూ.88వేలు, రెండవసారి జరిగిన ఎన్నికల్లో రూ.3 లక్షలు పార్టీ విరాళాలు సేకరించి ఖర్చు చేసింది. ఇంట్లో తిని పార్టీ కోసం పనిచేశారు.. 1989లో మొదటిసారిగా ఎన్నికల బరిలో నిలిచినప్పుడు 200 మంది కార్యకర్తలు నా గెలుపు కోసం కష్టపడ్డారు. రోజు రూ.2 పెట్టి అద్దెసైకిళ్లు తీసుకొని గ్రామాల్లో తిరిగి ప్రచారం చేశారు. కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్లినప్పుడు అక్కడే భోజనాలు చేసేవారు. నాకు జీపు ఉండేది.. దాని మీదే ప్రచారం చేసేవాళ్లం. అప్పట్లో గోడల మీద రాతలు, నాయకులు నోటితో చేసే ప్రచారామే. అప్పట్లో హైదరాబాద్, మహబూబ్‌నగర్ ప్రాంతాల నుంచి కార్యకర్తలు తమ కుటుంబాలను వదిలేసి వచ్చి నెల రోజులు ఇక్కడే ఉండి నన్ను గెలిపించడం కోసం పనిచేశారు. రాత్రిపూట బహిరంగ సభలు.. గ్రామాల్లోకి ప్రచారం కోసం ముందుగా కళాకారులు వెళ్లేవారు. రాత్రిపూట ఆయా గ్రామాల్లో బహిరంగ సభలు పెట్టి ఉపన్యాసాలు ఇస్తే ప్రజలు ఆకర్షితులయ్యేవారు. పార్టీ కేడర్ ఎంతో ధృడసంకల్పంతో పనిచేసేది. కార్యకర్తలు, నాయకులు నిస్వార్థంగా పనిచేసేవారు. అప్పటి ప్రజాప్రతినిధులు సైతం అలాగే ఉండేవారు. అసైన్డ్ భూములకు పట్టాలిచ్చాను.. ఆర్థిక సమానత్వం రావలంటే భూమే ప్రధానం. అప్పట్లో పెద్దొళ్ల చేతుల్లో ఉన్న దానిని పేదలకు దక్కేలా ఆలోచించాం. అప్పట్లో అసైన్మెంట్ కమిటీ చైర్మన్‌గా స్థానిక ఎమ్మెల్యేలకే హక్కు ఉండేది. దీంతో నా నియోజకవర్గంలోని నిరుపేదలకు భూములు పంచాలని నిర్ణయించుకున్నాను. 20 వేల ఎకరాలను పేదలకు పంచి పట్టాలు ఇచ్చాను. దీంతో నేడు ఇబ్రహీంపట్నంలో దళిత, బడుగుబలహీన వర్గాలకు భూమి ఆధారంగా ఉంది. అభివృద్ధి కోసం అప్పట్లో నేను ఎంతో తపించాను. బావుల నిర్మాణం, రైతులకు ట్రాన్స్ఫార్మర్ల అందజేత, బస్సు డిపో నిర్మాణం, ప్రతి గ్రామానికి బస్సులు మంజూరు చేయించాను. ఎస్సీ, ఎస్టీల పిల్లల చదువుల కోసం ఇబ్రహీంపట్నంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేశాను. సుందరయ్య.. నచ్చిన నాయకుడు ఆదర్శమూర్తి నాకు మార్గదర్శకుడు పుచ్చలపల్లి సుందరయ్య. ఆయనంటే పిచ్చి అభిమానం. నేను హంగు ఆర్భాటాలకు పోకుండా సాధారణ జీవితానికి ఆలవాటు పడ్డాను. త్యాగధనుడు సుందరయ్య బాటలోనే నా ప్రయాణం. నా కొడుకును పోగొట్టుకున్నా.. ప్రస్తుతం ఎమ్మెల్యేలకు జీతం లక్షల్లో ఉంది. దాంతోపాటు వివిధ రకాల అలవెన్స్‌లు ఇస్తున్నారు. నేను మొదట ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు రూ.7,500 జీతం ఇస్తుండేవారు. అందులో రూ.6500 పార్టీకి ఇచ్చి మిగతా రూ.1000 కుటుంబానికి వెచ్చించేవాడిని. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఎక్కడ పోరాటాలు జరిగినా అక్కడికి వెళ్లి పనిచేసేవాడిని. ఈ క్రమంలో నా కొడుకు అరుణ్ ఆరోగ్యానికి గురైతే ఆస్పత్రిలో చూపించుకోలేక, ఆర్థిక పరిస్థితి బాగాలేక వాడు చనిపోయాడు. ప్రస్తుతం నాకు వచ్చే పింఛనే ఆధారం. -
ఉద్యమ సారథికి ప్రభుత్వ పగ్గాలు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు రెండు వారాల ముందు 2014 ఏప్రిల్–మే మాసాల్లో రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరిగాయి. లోక్‌సభతోపాటు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్లా ప్రాంతీయపక్షాలే అధికారంలోకి వచ్చాయి. సాంకేతికంగా పాత ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పేరుతోనే ఎన్నికల ప్రక్రియ పూర్తయింది. ఉమ్మడి ఏపీలోని 294 సీట్లలో 175 ఏపీలో, 119 తెలంగాణలో చేరాయి. ఈ జమిలి ఎన్నికల్లో బీజేపీతో కలిసి టీడీపీ రెండు రాష్ట్రాల్లో పోటీచేసింది. ఏపీలో 101 సీట్లు గెలిచి, నారా చంద్రబాబు నాయుడు నాయకత్వాన అధికారంలోకి వచ్చింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్సీపీ 67 సీట్లు సాధించి ప్రధాన ప్రతిపక్షమైంది. టీడీపీ మిత్రపక్షం బీజేపీ 4 సీట్లు గెల్చుకుని చంద్రబాబు కేబినెట్లో చేరింది. తెలంగాణలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం నడిపిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) 63 సీట్లు కైవసం చేసుకోగా కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర ఆవిర్భావ దినం నాడే తొలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తెలంగాణలో టీడీపీకి 15, బీజేపీకి 5 సీట్లు దక్కాయి. 21 సీట్లతో కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమైంది. ఎంఐఎం 7, బీఎస్పీ 2 సీట్లు గెలుచుకున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా దొంతి మాధవరెడ్డి (నర్సంపేట) ఎన్నికయ్యారు. ఏపీలో మూడు ప్రధాన పార్టీలకే ప్రాతినిధ్యం ఏపీలో మాత్రం అసెంబ్లీలో మూడు ప్రధాన పార్టీలకే ప్రాతినిధ్యం లభించింది. చీరాల నుంచి నవతరం పేరుతో స్వతంత్ర అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ గెలుపొందారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పులివెందులలో విజయం సాధించారు. అనంతపురం మినహా మిగిలిన రాయలసీమ జిల్లాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైఎస్సార్సీపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో టీడీపీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంది. సీఎం చంద్రబాబు కుప్పం నుంచి గెలుపొందారు. అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు (టీడీపీ) సత్తెనపల్లి నుంచి ఎన్నికయ్యారు. ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ అవనిగడ్డలో గెలుపొందారు. రెండుచోట్ల నుంచి కేసీఆర్.. టీఆర్ఎస్ నేత కేసీఆర్ మెదక్ జిల్లా గజ్వేల్ నుంచి అసెంబ్లీకి, మెదక్ నుంచి పార్లమెంటుకు పోటీచేసి ఘన విజయం సాధించారు. అనంతరం మెదక్ ఎంపీ సీటుకు రాజీనామా చేశారు. టి.హరీశ్‌రావు (సిద్దిపేట), కె.తారకరామారావు (సిరిసిల్ల), జి.జగదీశ్‌రెడ్డి (సూర్యాపేట), పి.మహేందర్‌రెడ్డి (తాండూరు), జూపల్లి కృష్ణారావు (కొల్లాపూర్), పోచారం శ్రీనివాస్‌రెడ్డి(బాన్స్వాడ), జోగు రామన్న (ఆదిలాబాద్) తెలంగాణ తొలి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. నిర్మల్ నుంచి బీఎస్పీ టికెట్‌పై గెలిచిన ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి తర్వాత టీఆర్ఎస్లో చేరి కేసీఆర్ మంత్రివర్గంలో చేరారు. కాంగ్రెస్‌కు మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువ (12) అసెంబ్లీ సీట్లు లభించాయి. కాంగ్రెస్ సీనియర్ నేతలు కె.జానారెడ్డి (నాగార్జునసాగర్), ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి (హుజూర్నగర్), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్లగొండ), డీకే అరుణ (గద్వాల్), చల్లా వంశీచంద్‌రెడ్డి (కల్వకుర్తి), టి.జీవన్‌రెడ్డి(జగిత్యాల), జె.గీతారెడ్డి (జహీరాబాద్) విజయం సాధించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ (ముషీరాబాద్), ఇంకా బీజేపీ తరఫున జి.కిషన్‌రెడ్డి (హిమాయత్‌నగర్), చింతల రామచంద్రారెడ్డి (ఖైరతాబాద్) కూడా అసెంబ్లీకి ఎన్నికయ్యారు. టీడీపీ నుంచి ఎ.రేవంత్‌రెడ్డి (కొడంగల్), టి.ప్రకాశ్‌గౌడ్ (రాజేంద్రనగర్), తలసాని శ్రీనివాస్‌యాదవ్ (సనత్‌నగర్) విజయం సాధించారు. చాంద్రాయణగుట్ట నుంచి గెలిచిన అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి ఎంఐఎం శాసనసభ పక్ష నేత అయ్యారు. హస్తం గోడు.! 2014 ఏపీ లోక్‌సభ ఎన్నికల్లో 42 సీట్లలో కాంగ్రెస్ రెండు సీట్లకే పరిమితమైంది. అవి కూడా తెలంగాణలోనే గెలిచింది. నల్లగొండ నుంచి గుత్తా సుఖేందర్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ (ఎస్సీ) నుంచి నంది ఎల్లయ్య గెలుపొందారు. టీడీపీకి 16 సీట్లు రాగా తెలంగాణలో ఒక్కటే దక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 9 సీట్లు గెలుచుకోగా అందులో తెలంగాణలోని ఖమ్మం లోక్‌సభ సీటు ఒకటి. బీజేపీకి మూడు సీట్లు వచ్చాయి. తెలంగాణలోని మొత్తం 17 సీట్లలో టీఆర్ఎస్ 11 సీట్లను గెలుచుకుంది. ఏపీ నుంచి 2004 ఎన్నికల్లో 29, 2009 ఎన్నికల్లో 33 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించి కేంద్రంలో యూపీఏ 1, 2 ప్రభుత్వాల ఏర్పాటులో డా.వైఎస్ రాజశేఖరరెడ్డి కీలకపాత్ర పోషించారు. 2014లో అందుకు పూర్తి విరుద్ధమైన ఫలితాలు వచ్చాయి. కేంద్ర మంత్రులు సూదిని జైపాల్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు ఓటమి పాలయ్యారు. తొలి గెలుపు.. మొదటిసారి ఎంపీలైన వారిలో వైఎస్సార్సీపీ నుంచి వై.వి.సుబ్బారెడ్డి (ఒంగోలు), వైఎస్ అవినాష్‌రెడ్డి (కడప), పి.వి.మిథున్‌రెడ్డి (రాజంపేట), వెలగపల్లి వరప్రసాదరావు (తిరుపతి), పీ.శ్రీనివాసరెడ్డి (ఖమ్మం), టీడీపీ నుంచి పి.అశోకగజపతిరాజు(విజయనగరం), కె.రామ్మోహన్నాయుడు (శ్రీకాకుళం), మాగంటి మురళీమోహన్ (రాజమండ్రి). ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అనకాపల్లి), గల్లా జయదేవ్ (గుంటూరు) బీజేపీ నుంచి కె.హరిబాబు (విశాఖపట్నం), గోకరాజు గంగరాజు (నరసాపురం), టీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి (వరంగల్), బి.బి.పాటిల్ (జహీరాబాద్), బాల్క సుమన్ (పెద్దపల్లి), బూర నర్సయ్యగౌడ్ (భువనగిరి), కొండా విశ్వేశ్వరరెడ్డి (చేవెళ్ల), అజ్మీరా సీతారాం నాయక్ (మహబూబాబాద్) ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఉమ్మడి ఏపీలో దాదాపు 310 మంది మహిళలు వివిధ పార్టీల తరఫున, స్వతంత్రులుగానూ పోటీచేశారు. తెలంగాణ నుంచి 120 మంది పోటీ చేయగా 9 మంది (టీఆర్ఎస్–6, కాంగ్రెస్–3) గెలుపొందారు. కోస్తా, రాయలసీమ నుంచి 190 మంది పోటీ చేయగా, 18 మంది (టీడీపీ–10, వైఎస్సార్ కాంగ్రెస్–8) గెలిచారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 24 ఎంపీ సీట్లలో మొత్తం 43 మంది మహిళా అభ్యర్థులు పోటీచేశారు. వీరిలో తెలంగాణలో నిజామాబాద్ స్థానం నుంచి కల్వకుంట్ల కవిత (టీఆర్ఎస్), రాయలసీమలోని కర్నూలు నుంచి బుట్టా రేణుక (వైఎస్సార్సీపీ), ఉత్తరాంధ్రలోని అరకు (ఎస్టీ) సీటు నుంచి కొత్తపల్లి గీత (వైఎస్సార్సీపీ) తొలిసారి లోక్‌సభకు ఎన్నికయ్యారు. -
దండేపల్లి ఘనత రాజకీయ చరిత
దండేపల్లి(మంచిర్యాల): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో దండేపల్లి మండలం రాజకీయ ఘనత వహించింది. 2009లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు ముందు లక్సెట్టిపేట నియోజకవర్గంగా ఉండేది. ఇందులో దండేపల్లిది ప్రత్యేక స్థానం. ఎందుకంటే మండలానికి చెందిన నలుగురు నాయకులు ఆరుసార్లు అసెంబ్లీకి ఎన్నికై ఉన్నత పదవులు అధిరోహించారు. రాష్ట్ర రాజకీయాల్లోనూ పదవులు పొందారు. మండలంలోని ధర్మరావుపేటకు చెందిన జేవీ నర్సింగరావు, కొర్విచెల్మకు చెందిన జీవీ సుధాకర్‌రావు, కన్నెపల్లికి చెందిన చుంచు లక్ష్మయ్య అసెంబ్లీకి ఎన్నికయ్యారు. లింగాపూర్‌కు చెందిన అజ్మేర గోవింద్‌నాయక్ కూడా ఖానాపూర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వారిలో జేవీ నర్సింగరావు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. జీవీ సుధాకర్‌రావు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగా పలు ఉన్నత పదవులు చేపట్టారు. చుంచు లక్ష్మయ్య ఒకసారి, గోవిందనాయక్ మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. విద్యుత్ ఆరాధ్యుడు జేవీ.. దండేపల్లి మండలం ధర్మరావుపేటకు చెందిన జేవీ నర్సింగరావు 1967–72 కాలంలో రాష్టానికి ఉప ముఖ్యమంత్రిగా పని చేశారు. న్యాయవాదిగా హైదరాబాద్ హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తూ 1957లో అక్కడి బేగంబజార్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీచేసి గెలుపొందారు. నీలం సంజీవరెడ్డి కేబినెట్లో నీటి పారుదలశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత సొంత నియోజకవర్గం అయిన లక్సెట్టిపేటకు వచ్చారు. 1967లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. ఈ సమయంలో రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1972లో కూడా ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా కాకుండా పలు కీలక పదవులు చేపట్టారు. పీసీసీ అధ్యక్షుడిగా, విద్యుత్ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. విద్యుచ్ఛక్తి బోర్డు చైర్మన్‌గా పనిచేసిన కాలంలో జిల్లాలో విద్యుత్ అభివృద్ధికి ఎంతగానో కృషిచేశాడు. కడెం ప్రాజెక్టు నిర్మాణంలోనూ కీలక పాత్ర పోషించారు. 1972, సెప్టెంబర్ 4న తుదిశ్వాస విడిచారు. ముక్కుసూటి మనిషి జీవీ.. మండలంలోని కొర్విచెల్మ (రాజంపేట)గ్రామానికి చెందిన మాజీ మంత్రి జీవీ సుధాకర్‌రావు ముక్కు సూటి మనిషి. పట్టుదలకు మారు పేరున్న వ్యక్తిగా పేరు గడించారు. అంతే కాకుండా సరస్వతి కాల్వ నిర్మాతగా కూడా పేరుంది. ఒకసారి ఎంఎల్సీ, రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర మంత్రిగా పని చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్ శాఖల అధ్యక్షుడిగా పనిచేస్తూ జీవి 1977లో మొదటి సారిగా శాసన మండలికి ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి మంత్రివర్గంలో భారీ నీటి పారుదలశాఖ మంత్రిగా పనిచేసి సరస్వతి కాలువ నిర్మాణానికి అంకుర్పాణ చేశారు. 1983లో ఓడిపోయి 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1989లో మళ్లీ ఎన్నికయ్యారు. చెన్నారెడ్డి మంత్రి వర్గంలో రోడ్డు రవాణాశాఖ మంత్రిగా పనిచేశారు. 2002 డిసెంబరు 30న హైదరాబాద్‌లో మరణించారు. మూడో వ్యక్తి లక్ష్మయ్య.. దండేపల్లి నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టిన మూడో వ్యక్తి చుంచు లక్ష్మయ్య. కన్నెపల్లి గ్రామానికి చెందిన లక్ష్మయ్య రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. 1967 ఎన్నికల్లో జనతా పార్టీ నుంచి గెలిచారు. పదవి కాలం అనంతరం లక్సెట్టిపే ట కోర్టులో, హైదరాబాద్ హైకోర్టులోనూ ప్రాక్టీసు చేశారు. 2007లో హైదరాబాద్ నుంచి స్వగ్రామం అయిన కన్నెపల్లికి వచ్చారు. గ్రామ సమీపంలోని సదానందహరి ఆలయంలో కొద్దిరోజుల పాటు ఆధ్యాత్మిక జీవనం గడుపుతూ అనారోగ్యానికి గురై 2008 మే 1న మృతి చెందాడు. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు, తర్వాత లక్సెట్టిపేట, మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీసీ సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఏకైక వ్యక్తిగా లక్ష్మయ్య ప్రత్యేక గుర్తింపు పొందారు. నాలుగో వ్యక్తిగా గోవిందనాయక్.. దండేపల్లి మండలం నుంచి అసెంబ్లీకి ఎన్నికైన నాలుగో వ్యక్తి గోవిందనాయక్. ఈయనది మండలంలోని లింగాపూర్. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఖానాపూర్ నియోజక వర్గం నుంచి 1985లో స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యే బరిలో నిలిచి గెలుపొందారు. 1994లో టీడీపీ నుంచి, 2004లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2008 నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. -
అభివృద్ధికే ఆశీస్సులు
గెలుపు అందరికీ సాధ్యమవొచ్చు. కానీ అందరిలాంటి గెలుపు కాకుండా...ప్రత్యర్థి బిత్తరపోయేలా...ప్రజలు నిండైన మనసుతో దీవించినప్పుడు లభించే విజయం ఎంతో ప్రత్యేకమైంది. 2009 ఎన్నికల్లో మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సరిగ్గా ఇలాంటి గెలుపునే అందుకున్నారు. ఐదేళ్ల పాలనలో ప్రగతి రథాన్ని పరుగులెత్తించిన ఆయన ‘అభివృద్ధి–సంక్షేమాన్ని’ ∙నమ్ముకుని రెండోసారి ఎన్నికల బరిలోకి దూకారు. ప్రత్యర్థులంతా ఏకమై కూటమి కట్టారు. సినీహీరో చిరంజీవి కొత్త పార్టీతో ముందుకు వచ్చారు. టీఆర్ఎస్–టీడీపీ ఒక్కటయ్యాయి. అయినా ‘కూటమి’ని ఎదురొడ్డి అచ్చంగా ప్రగతి పాలనతోనే మళ్లీ వైఎస్ అధికారంలోకి వచ్చారు. పాలనపై పూర్తి పట్టును సాధించడంతో పాటు ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమల్లో దేశంలో ముందువరసలో నిలిచిన ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి తనదైన రికార్డ్‌ను నెలకొల్పారు. 2004–09 మధ్యకాలంలో రైతు సంక్షేమం, అణగారిన వర్గాల అభ్యున్నతికి చేపట్టిన కార్యక్రమాలు మంచి ఫలితాలనిచ్చాయి. బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థుల ఉన్నతవిద్యకు వీలు కల్పించే ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, నిరుపేదలకు ఉచిత కార్పొరేట్ వైద్యాన్ని అందించే ‘ఆరోగ్యశ్రీ’ పథకాలతో పాటు ఆపత్కాలంలో ఆసుపత్రికి తరలించేందుకు ‘108’ ఉచిత అంబులెన్స్ సర్వీసు.. వైఎస్‌ను ప్రతి గుండెకు చేరువ చేశాయి. పెన్షన్లను గణనీయంగా పెంచారు. సంక్షేమ కార్యక్రమాలు ‘సంతృప్తస్థాయి’లో అందరికీ అందించేందుకు వైఎస్ అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలుచేశారు. ఎన్నికలపై వైఎస్ ముద్ర నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఏపీలో జరిగిన తొలి ఎన్నికలివి. పూర్తిగా అయిదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా అధికారంలో కొనసాగిన (2004లో గెలిచాక) డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలోనే మరోసారి 2009లో అసెంబ్లీ/లోక్‌సభ ఎన్నికలు జరగడం రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి. 2009 ఏప్రిల్/మే ఎన్నికలకు ఎనిమిది నెలల ముందు సినీనటుడు కొణిదెల చిరంజీవి నేతృత్వంలో ప్రజారాజ్యం పార్టీ (పీఆర్పీ) ఏర్పడింది. ఈ ఎన్నికల్లో 18 సీట్లకే పరిమితమైంది. కాంగ్రెస్ దాదాపు మూడు దశాబ్దాల తర్వాత (1972, 78) మొదటిసారి వరుసగా రెండు శాసనసభ ఎన్నికల్లో గెలిచి (2009లోనూ) అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ తరఫున 29 రోజుల వ్యవధిలో 170 నియోజకవర్గాల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్వహించిన విస్తృత ప్రచారం మంచి ఫలితాలనిచ్చింది. స్పీకర్, పీసీసీ చీఫ్ ఓటమి మహాకూటమి ప్రభావం వల్ల తెలంగాణలో స్పీకర్ కేఆర్ సురేష్‌రెడ్డి, ఏపీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ సహా పార్టీ ప్రముఖులు 14 మంది ఓటమిపాలయ్యారు. లోక్‌సత్తా పార్టీని ఏర్పాటు చేసిన మాజీ ఐఏఎస్ అధికారి ఎన్.జయప్రకాష్‌నారాయణ కూకట్పల్లి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. టీడీపీలో సుదీర్ఘకాలం కొనసాగిన టి. దేవేందర్‌గౌడ్ తొలుత నవతెలంగాణ ప్రజాపార్టీని స్థాపించి, తర్వాత దానిని పీఆర్పీలో విలీనం చేశారు. 2009 ఎన్నికల్లో రెండుచోట్ల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2009లో టీడీపీ టికెట్‌పై గెలిచి ఎ.రేవంత్‌రెడ్డి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఈ ఎన్నికల్లో అత్యధికంగా 300 మంది మహిళలు పోటీ చేస్తే, 34 మంది గెలుపొందారు. కడపలో జగన్ తొలి విజయం కడప నుంచి తొలిసారి పోటీచేసిన వైఎస్ కుమారుడు జగన్మోహన్రెడ్డి.. పాలెం శ్రీకాంత్‌రెడ్డి (టీడీపీ)ని ఓడించి లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతర పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేశారు. 2011లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి ఆ తరువాత ఉప ఎన్నికలకు వెళ్లారు. ఈ ఎన్నికల్లో కడప లోక్‌సభ స్థానం నుంచి 5,45,672 ఓట్ల రికార్డు స్థాయి మెజారిటీతో జగన్మోహన్రెడ్డి గెలుపొందగా, వైఎస్ విజయమ్మ పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి 81,373 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో పెరిగిన కాంగ్రెస్ బలం 15వ లోక్‌సభ (2009) ఎన్నికల్లో ఏపీలో చాలా ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌కు 33 సీట్లు వచ్చాయి. టీడీపీ మహా కూటమికి 8 సీట్లే దక్కాయి. తెలంగాణలోని 17 సీట్లలో కాంగ్రెస్ 12, టీడీపీ 2, టీఆర్ఎస్ 2 సీట్లు గెల్చుకున్నాయి. హైదరాబాద్‌లో ఎంఐఎం గెలిచింది. పీఆర్పీకి ఒక్క లోక్‌సభ సీటూ దక్కలేదు. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఆదిలాబాద్, ఖమ్మం సీట్లను కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం కైవసం చేసుకుంది. కేసీఆర్‌కు బదులు కరీంనగర్ నుంచి పోటీచేసిన బి.వినోద్‌కుమార్ (టీఆర్ఎస్)ను కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ ఓడించారు. అంతకుముందు మిర్యాలగూడ నుంచి గెలిచిన ఎస్.జైపాల్‌రెడ్డి (కాంగ్రెస్) చేవెళ్ల నుంచి విజయం సాధించారు. మెదక్‌లో మొదటిసారి టీఆర్ఎస్ టికెట్‌పై పోటీచేసిన సినీనటి విజయశాంతి లోక్‌సభకు ఎన్నియ్యారు. టీఆర్ఎస్ నేత కేసీఆర్ మొదటిసారి మహబూబ్‌నగర్ నుంచి పోటీచేసి డి.విఠల్‌రావు (కాంగ్రెస్)ను ఓడించారు. విఫలమైన మహాకూటమి వైఎస్సార్ నాయకత్వంలో పటిష్టస్థితిలో ఉన్న కాంగ్రెస్‌ని ఎన్నికల్లో ఎదుర్కునేందుకు రాష్ట్ర విభజనను మొదట్లో వ్యతిరేకించిన టీడీపీ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పడిన టీఆర్ఎస్ జత కలిశాయి. అంతకు ముందున్న వైఖరికి భిన్నంగా తెలంగాణ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించడంతో పాటు ఆ అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చేందుకు టీడీపీ ఆమోదించింది. రాష్ట్రంలో కొన్నేళ్ల తర్వాత టీడీపీ, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంలతో మహాకూటమి ఏర్పడింది. అయినా ఈ కూటమి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. గతంలో ఎన్టీరామారావు మాదిరిగా సినీ గ్లామర్‌తో రాష్ట్రంలో అధికార అందలం ఎక్కొచ్చని ఆశించిన చిరంజీవికి చుక్కెదురైంది. త్రిముఖ పోటీ వల్ల (కాంగ్రెస్, మహాకూటమి, పీఆర్పీ) టీడీపీ బలం 2004తో పోలిస్తే 41 నుంచి 92కు పెరిగింది. అంజయ్య గారి జంబో కేబినెట్ అత్యధిక మంత్రులతో కేబినెట్‌ను ఏర్పాటు చేసిన రికార్డు ఇప్పటికీ మాజీ సీఎం టి.అంజయ్య పేరు మీదే కొనసాగుతోంది. 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి 13 మంది మంత్రులతో కేబినెట్ ఏర్పాటు చేశారు. జలగం వెంగళరావు, మర్రి చెన్నారెడ్డిల హయాంలో కేబినెట్లో మంత్రుల సంఖ్య ముప్పై దాటిపోయింది. అయితే, 1980–82 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన టీ.అంజయ్య మాత్రం ఏకంగా 62 మందితో కేబినెట్ ఏర్పాటు చేశారు. ఇందులో బాగారెడ్డి, ఎన్.జనార్ధన్‌రెడ్డి, హయగ్రీవాచారి, జగన్నాథరావు, బాట్టం శ్రీరాంమూర్తి, రోశయ్య, డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబునాయుడు తదితరులంతా మంత్రి పదవులు నిర్వహించారు. ఈ అత్యధిక మంత్రుల కేబినెట్ రికార్డు ఇప్పటికీ టి.అంజయ్య పేరుతోనే కొనసాగుతుండటం విశేషం. తిరగాలంటే కష్టమే! మంథని: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మంథని నియోజకవర్గంలో ప్రచారం సాగించడమంటే మాటలు కాదు. ప్రస్తుత ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి తాను పోటీచేసే నియోజకవర్గంలోని ప్రాంతాలకు కనీసం రెండుసార్లైనా వెళ్లి ఓట్లు అడగాల్సిన పరిస్థితి.. దట్టమైన అటవీ ప్రాంతం, గిరిజన గ్రామాలు, మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న ప్రాంతంగా పేరున్న మంథని నియోజకవర్గం విస్తీర్ణం రీత్యా అతి పెద్దది. ఏడు మండలాలు, దాదాపు మూడు వందల గ్రామాలు, 2.01 లక్షల ఓటర్లను కలిగిన ఈ నియోజకవర్గం, 180 కిలోమీటర్ల పొడవు, 40 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉంది. పెద్దపల్లి జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న సబ్బితం వద్ద ప్రారంభమయ్యే మంథని నియోజకవర్గ పరిధి మహదేవ్పూర్ మండలంలోని చారిత్రాత్మక కట్టడమైన ఇచ్చంపల్లికి సమీపంలోని ముకునూరు వరకు విస్తరించి ఉంది. అక్కడక్కడా రవాణా మార్గం కూడా సరిగా లేని గ్రామాలు ఉండడంతో ఈ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం కత్తిమీద సాములాంటిదే అని చెప్పొచ్చు. అందుకే ఈ నియోజకవర్గం నుంచి పోటీకి దిగే అభ్యర్థులు కాస్త ముందు నుంచే ప్రచారం ప్రారంభించడం పరిపాటి. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
విజయానికి ‘నడక’ నేర్పిన బాటసారి
2004 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ఏడాది ముందు మండు వేసవిలో వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సాగించిన 1,470 కిలోమీటర్ల పాదయాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను కీలక మలుపు తిప్పింది. పదేళ్లు అధికారానికి దూరమైన కాంగ్రెస్‌ను ఈ యాత్ర గద్దెనెక్కించింది. ప్రజాప్రస్థానం పేరుతో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నుంచి ప్రారంభమైన వైఎస్ పాదయాత్ర 11 జిల్లాల మీదుగా కొనసాగి ఇచ్చాపురంలో ముగిసింది. వరుసగా రెండేళ్లు కరవు కాటకాలతో నష్టపోయిన రైతులు, వివిధ వర్గాల ప్రజల ఇబ్బందులను రాజశేఖరరెడ్డి ఈ యాత్రలో స్వయంగా తెలుసుకున్నారు. ఈ అవగాహనతోనే ఆయన 2004 అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికను రూపొందించారు. సాక్షి, నాలెడ్జ్ సెంటర్: రెండు వరుస ఓటముల తర్వాత ఆంధ్రప్రదేశ్ 12వ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 మే14న ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. లోక్‌సభతోపాటే జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఎన్.చంద్రబాబునాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం ఘోర పరాజయంపాలైంది. ఎనిమిదిన్నరేళ్ల చంద్రబాబు పాలనకు తెరపడింది. రాష్ట్రంలోని 294 సీట్లలో కాంగ్రెస్ 185 సీట్లు కైవసం చేసుకుంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత.. అతి తక్కువ అంటే 47 స్థానాలకే పరిమితమైంది. తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్), సీపీఐ, సీపీఎంతో సీట్లు సర్దుబాటు చేసుకుని కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ 26, సీపీఎం 9, సీపీఐ 6 సీట్లు గెలుచుకున్నాయి. మొత్తం 42 లోక్‌సభ సీట్లలో కాంగ్రెస్ 29, టీఆర్ఎస్ 5, టీడీపీ 5, సీపీఐ, సీపీఎం చెరో స్థానం కైవసం చేసుకున్నాయి. వైఎస్ 1999 తర్వాత మళ్లీ 2004లో పులివెందుల నుంచే అసెంబ్లీకి ఎన్నికయ్యారు. పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ నిజామాబాద్ నుంచి గెలిచారు. టీడీపీతో పొత్తుపెట్టుకుని పోటీచేసిన బీజేపీ రెండు సీట్లే గెలుచుకుంది. ఎంఐఎం మరోసారి నాలుగు సీట్లు సాధించింది. మొత్తంమీద కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం కూటమికి 226 సీట్లు దక్కాయి. చంద్రబాబు కేబినెట్లోని తెలంగాణ మంత్రులు పి.చంద్రశేఖర్ (మహబూబ్‌నగర్), తుమ్మల నాగేశ్వరరావు (సత్తుపల్లి), కరణం రామచంద్రరావు (మెదక్), కడియం శ్రీహరి (ఘన్పూర్), పోచారం శ్రీనివాస్‌రెడ్డి(బాన్స్వాడ), మండవ వెంకటేశ్వరరావు (డిచ్పల్లి), తలసాని శ్రీనివాస్‌యాదవ్ (సికింద్రాబాద్) సహా పలువురు టీడీపీ నేతలు ఓటమి పాలయ్యారు. టీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన నాయిని నరసింహారెడ్డి (ముషీరాబాద్), ఎస్.సంతోష్‌రెడ్డి (ఆర్మూర్), ఎ.చంద్రశేఖర్ (వికారాబాద్), వి.లక్ష్మీకాంతరావు (హుజూరాబాద్), జి.విజయరామారావు (ఘన్పూర్) వైఎస్ మంత్రివర్గంలో చేరారు. తర్వాత సిద్దిపేట నుంచి ఉప ఎన్నికలో గెలిచిన టి.హరీశ్‌రావు కూడా ఈ ఐదుగురితోపాటు మంత్రి అయ్యారు. సిద్దిపేట నుంచి అసెంబ్లీకి, కరీంనగర్ నుంచి లోక్‌సభకు ఎన్నికవడంతో కేసీఆర్ అసెంబ్లీకి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తానని చేసిన వాగ్దానం, అనావృష్టితో కుదేలైన రైతాంగాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఆదుకోకపోవడం, పెరిగిన విద్యుత్ చార్జీలు వంటివి కాంగ్రెస్ విజయానికి దోహదం చేశాయి. ఎనిమిదేళ్ల ఎనిమిది నెలల చంద్రబాబు పాలనపై జనంలో పెల్లుబికిన వ్యతిరేకత టీడీపీ ఓటమికి ప్రధాన కారణమైంది. ఎన్నికల హామీ ప్రకారం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఫైలుపై రాజశేఖరరెడ్డి తొలి సంతకం చేశారు. టీడీపీ టికెట్‌పై ఆసిఫ్‌నగర్ నుంచి గెలిచిన దానం నాగేందర్ కొన్ని నెలలకే రాజీనామా చేశారు. ఉప ఎన్నికలో నాగేందర్ (కాంగ్రెస్)ను ఎంఐఎం అభ్యర్థి ఓడించారు. ఉప ఎన్నికలు... 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ 9 ఎమ్మెల్యే సీట్లు (మొత్తం 16లో), రెండు ఎంపీ స్థానాలు (నాలుగు సీట్లలో) కోల్పోయింది. ఈ మేరకు టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ ఐదు, టీడీపీ నాలుగు స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్, టీడీపీ చెరో ఎంపీ సీటు గెలుచుకున్నాయి. 2004 లోక్‌సభ ఎన్నికల్లో.. 37–5 సీట్ల తేడాతో కాంగ్రెస్, టీఆర్ఎస్, వామపక్షాలు టీడీపీ–బీజేపీ జట్టుపై ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని 27 సీట్లలో 4 మినహా అన్ని స్థానాలను కాంగ్రెస్ మిత్రపక్షాలు గెలుచుకున్నాయి. తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 15 సీట్లలో టీడీపీ, బీజేపీలకు కేవలం ఒకే సీటు వచ్చింది. మిగతా స్థానాలన్నింటినీ కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ, ఎంఐఎం గెలిచాయి. తెలంగాణ నుంచి... ఈ ప్రాంతంలో టీడీపీ–బీజేపీ కూటమికి చెందిన మందా జగన్నాథం (టీడీపీ–నాగర్‌కర్నూల్) ఒక్కరే గెలిచారు. అసదుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం–హైదరాబాద్) తొలిసారి గెలిచి పార్లమెంట్‌లోకి ప్రవేశించారు. టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ (కరీంనగర్), ఆలె నరేంద్ర (మెదక్), బి.వినోద్‌కుమార్ (హనుమకొండ), డి. రవీంద్రనాయక్ (వరంగల్), టి.మధుసూదనరెడ్డి(ఆదిలాబాద్) గెలిచారు. సీపీఐ నేత సురవరం సుధాకరరెడ్డి రెండోసారి నల్లగొండ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు కాంగ్రెస్ నుంచి సీనియర్లు జి.వెంకటస్వామి (పెద్దపల్లి–ఎస్సీ), సూదిని జైపాల్‌రెడ్డి (మిర్యాలగూడ) గెలుపొందగా, తొలిసారి ఎంపీలుగా మధు యాష్కీగౌడ్ (నిజామాబాద్), అంజన్‌కుమార్‌యాదవ్ (సికింద్రాబాద్), సర్వే సత్యనారాయణ (సిద్ధిపేట–ఎస్సీ) ఎన్నికయ్యారు.మొత్తం 21 మంది మహిళా అభ్యర్థులు పోటీచేయగా, 12 మందికి డిపాజిట్లు దక్కలేదు. దగ్గుబాటి పురందేశ్వరి (కాంగ్రెస్–బాపట్ల), పనబాక లక్ష్మి (కాంగ్రెస్–నెల్లూరు), రేణుకా చౌదరి (కాంగ్రెస్–ఖమ్మం) గెలిచారు. -
అప్పటి లవ్వు.. కమలం పువ్వు!
సాక్షి, నాలెడ్జ్సెంటర్: నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలో తొలిసారి 1999 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం విజయం సాధించింది. 1989 జమిలి ఎన్నికల తర్వాత బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తెలుగుదేశం పదేళ్లకు మళ్లీ ఈ ఎన్నికల్లో కాషాయ పక్షంతో పొత్తుపెట్టుకుని పోటీచేసింది. 1999 ఏప్రిల్‌లో అటల్‌బిహారీ వాజ్‌పేయి(బీజేపీ) నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారుకు జరిగిన బలపరీక్షలో ప్రభుత్వానికి అనుకూలంగా తెలుగుదేశం ఓటేయడంతో రెండు పార్టీల మధ్య మళ్లీ ఈ స్నేహం మొదలైంది. లోక్‌సభలో ఒక ఓటు తేడాతో కూలిపోవడంతో వాజ్‌పేయిపై పెల్లుబికిన సానుభూతి, కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ విజయంతో పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి పెరిగిన ఓట్లు టీడీపీకి ఉపయోగపడ్డాయి. లోక్‌సభతోపాటే అసెంబ్లీ (జమిలి) ఎన్నికలు జరగడంతో టీడీపీ–బీజేపీ కూటమి గెలిచింది. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కాగలిగారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలనపై అసెంబ్లీ ఎన్నికలను రిఫరెండంగా భావించారు. అయితే, కేంద్రంలోజరిగిన రాజకీయ పరిణామాల ఫలితంగా బీజేపీతో పొత్తుపెట్టుకుని టీడీపీ ఈ జమిలి ఎన్నికల్లో విజయం సాధించింది. ఎన్టీఆర్ మూడో కొడుకు, టీడీపీ మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ, అల్లుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు నాయకత్వంలోని అన్న టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా పోటీచేసి ఓడిపోయింది. ఈ పార్టీకి ఒక్క సీటూ దక్కలేదు. హరికృష్ట గుడివాడ నుంచి పోటీచేసి తెలుగుదేశం అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 సీట్లకుగాను తెలుగుదేశం 216 సీట్లు సంపాదించగా, 1999 సెప్టెంబర్–అక్టోబర్‌లో జరిగిన ఈ ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలో ఈ పార్టీకి 181 సీట్లు దక్కాయి. బీజేపీకి 12 వచ్చాయి. ఏపీలోని మొత్తం 42 లోక్‌సభ సీట్లలో టీడీపీ 29, బీజేపీ 6, కాంగ్రెస్ 5 సీట్లు గెలుచుకున్నాయి. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 26 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ ఈసారి పీసీసీ అధ్యక్షుడు వైఎస్ రాజశేఖరరెడ్డి నాయకత్వంలో 91 సీట్లు కైవసం చేసుకుంది. అక్టోబర్ 11న చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయగా, వైఎస్ ప్రతిపక్షనేత అయ్యారు. తెలంగాణలో తగ్గిన టీడీపీ సీట్లు తెలంగాణలో తెలుగుదేశం బలం తగ్గింది. కాంగ్రెస్ సీట్లు ఇక్కడ పెరిగాయి. తెలంగాణలోని 107 అసెంబ్లీ సీట్లలో టీడీపీ 49, కాంగ్రెస్ 42 సీట్లు గెలుచుకున్నాయి. బీజేపీ 7, ఎంఐఎం 4, సీపీఐ(ఎంఎల్) 1, సీపీఎం 2 స్థానాలు సాధించాయి. హైదరాబాద్ నగరంలో టీడీపీ–బీజేపీ కూటమికి అత్యధిక సీట్లు దక్కాయి. కిందటి అసెంబ్లీలో కాంగ్రెస్ పక్ష నేత పి.జనార్దన్‌రెడ్డి 1983 ఎన్నికల తర్వాత ఈ ఎన్నికల్లో ఖైరతాబాద్‌లో ఓడిపోవడం విశేషం. టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన మాజీ డీజీపీ కె.విజయరామారావు చేతిలో పీజేఆర్ ఓడిపోయారు. మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి నాగర్‌కర్నూలులో మరోసారి విజయం సాధించారు. మాజీ మంత్రి పి.చంద్రశేఖర్(టీడీపీ) మహబూబ్‌నగర్ నుంచి మళ్లీ ఎన్నికయ్యారు. హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి(టీడీపీ) భువనగిరి నుంచి గెలుపొందారు. ప్రస్తుత తెలంగాణ టీఆర్ఎస్ మంత్రి జూపల్లి కృష్ణారావు(కాంగ్రెస్) కొల్లాపూర్ నుంచి తొలిసారి కాంగ్రెస్ టికెట్‌పై గెలిచారు. మాజీ మంత్రి పి.ఇంద్రారెడ్డి తొలిసారి కాంగ్రెస్ టికెట్‌పై పోటీచేసి చేవెళ్ల నుంచి గెలుపొందారు. తర్వాత కొద్ది నెలలకే ఆయన రోడ్డుప్రమాదంలో మరణించారు. ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ మొదటిసారి అసెంబ్లీకి చాంద్రాయణ గుట్ట నుంచి పోటీచేసి ఎంబీటీ నేత అమానుల్లాఖాన్‌ను ఓడించారు. మంత్రులు టి.దేవేందర్‌గౌడ్, కె.చంద్రశేఖర్‌రావు వరుసగా మేడ్చల్, సిద్దిపేట నుంచి మళ్లీ గెలుపొందారు. మాజీ స్పీకర్ సురేష్‌రెడ్డి (కాంగ్రెస్) మరోసారి బాల్కొండ నుంచి ఎన్నికయ్యారు. మండవ వెంకటేశ్వరరావు(టీడీపీ) డిచ్పల్లి నుంచి మళ్లీ గెలుపొందారు. కాంగ్రెస్ నేతలు డి.శ్రీనివాస్(నిజామాబాద్), జి.గడ్డెన్న(ముధోల్), ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి(నిర్మల్), దానం నాగేందర్(ఆసిఫ్‌నగర్), దుద్దిళ్ల శ్రీధర్ బాబు(మంథని), కొండా సురేఖ(శాయంపేట), వనమా వెంకటేశ్వరరావు(కొత్తగూడెం), ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(కోదాడ), కోమటిరెడ్డి వెంకటరెడ్డి(నల్లగొండ) విజయం సాధించారు. లోక్‌సభ ఎన్నికల్లోనూ... - అసెంబ్లీ ఎన్నికలతోపాటు జరిగిన లోక్‌సభ మధ్యంతర ఎన్నికల్లో బీజేపీతో జతకట్టి టీడీపీ గట్టెక్కింది. - ఈ కూటమికి 35 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు ఐదు సీట్లే దక్కాయి. బీజేపీ ఆరు సీట్లు గెలవడం ఇదే మొదటిసారి. - కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ(బీజేపీ) వరుసగా రెండోసారి సికింద్రాబాద్ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. మరో మంత్రి చెన్నమనేని విద్యాసాగర్‌రావు కూడా కరీంనగర్ నుంచి వరుసగా రెండోసారి విజయంసాధించారు. - మళ్లీ కాంగ్రెస్ గూటికి చేరిన సీనియర్ నేత సూదిని జైపాల్‌రెడ్డి మిర్యాలగూడ నుంచి గెలుపొందారు. - కాంగ్రెస్ టికెట్‌పై లోక్‌సభకు పోటీచేసిన మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు సికింద్రాబాద్‌లో దత్తాత్రేయ చేతిలో ఓటమిపాలయ్యారు. ఇల్లెక్కిన ఇందిరమ్మ కోదాడ: ప్రచార సభ వేదికలను ప్రత్యేకంగా నిర్మిస్తారు. కానీ, ఒక ఇల్లే ప్రచార వేదిక కావడం మాత్రం విచిత్రమే. ఉమ్మడి నల్లగొండ జిల్లా కోదాడ పట్టణం నయానగర్‌లోని పాత కోర్టు ఎదురుగా, రవీంద్రభారతి పాఠశాల వెనుక ఓ ఇల్లుంది. నాడు ఈ ప్రాంతం విశాలమైన సాగుభూమిగా ఉండి.. మధ్యలో ఇల్లు ఉండేది. 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన కొత్తలో తొలిసారి కోదాడకు వచ్చారు. వేలమంది ఆయనను చూసేందుకు తరలివచ్చారు. వారినుద్దేశించిన ఆయన ఈ ఇంటి మీద నుంచే ప్రసంగించారు. దీంతో కోదాడ కాంగ్రెస్ అభ్యర్థి చింతా చంద్రారెడ్డి.. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని కోదాడకు తీసుకొచ్చారు. ఆమె కూడా ఈ ఇంటి మీది నుంచే ప్రసంగించారు. హెలికాప్టర్లో వచ్చిన ఇందిరను చూసేందుకు నాడు ప్రజలు ఎగబడ్డారని నాటి తరం నేతలు చెబుతుంటారు. ఇక తామేం తక్కువ కాదన్నట్టు సీపీఎం నాయకులు సినీ నటుడైన మాదాల రంగారావును తీసుకొస్తే.. ఆయనా ఈ ఇంటి మీద నుంచే ప్రజలనుద్దేశించి మాట్లాడారు. అలా ఈ ఇల్లు నాడు ఎన్నికల వేళ ప్రచారహోరుతో వెల్లువెత్తేది. ఇంతకీ ఈ ఇల్లు వంగవీటి వెంకట్రామయ్యది. టౌన్‌హాలు.. అసెంబ్లీ హైదరాబాద్ మహా నగరానికి తలమానికంగా నిలిచే శాసనసభ భవన నిర్మాణం వెనుక ఆసక్తికరమైన అంశాలు దాగి ఉన్నాయి. దవళ వర్ణంలో తళతళలాడుతూ కనిపించే ఈ భవనాన్ని 1913లో నిర్మించారు. అప్పట్లో ఇది టౌన్‌హాలుగా వినియోగంలో ఉండేది. నిజాం నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ 40వ జన్మదినోత్సవం సందర్భంగా, ఆయనకు కానుక సమర్పించేందుకు అప్పటి హైదరాబాద్ వాసులు కొన్ని నిధులు సేకరించారు. ఈ మొత్తంతో ప్రస్తుత అసెంబ్లీ భవనాన్ని నిర్మించారు. ప్రసిద్ధ వాస్తు శిల్పులు ఈ భవనానికి డిజైన్ చేశారు. ఇదీ మన శాసనసభ భవనం నిర్మాణం వెనకున్న కథ. -
జనం ఓటు..అల్లుడి పోటు
శాసనసభ చరిత్రలోనే 1994 ఎన్నికలకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలుపొందాక పట్టుమని పదినెలలు కూడా సీఎం పదవిలో కొనసాగకుండానే టీడీపీ అధినేత ఎన్టీఆర్ రాజీనామా చేయాల్సి వచ్చింది. మూడో అల్లుడు చంద్రబాబునాయుడు పన్నిన రాజకీయ కుట్రకు ఎన్టీరామారావు బలయ్యారు. స్వపక్షం నుంచి అదీకూడా అత్యంత నమ్మకస్థుడైన వ్యక్తి నుంచే అనూహ్యమైన పద్థతుల్లో ఎదురైన రాజకీయ ఎత్తుగడలు, వ్యూహాలకు ఆయన చిత్తయ్యారు. రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలే ఉంటాయన్న నానుడిని నిజం చేస్తూ సొంత అల్లుడు రచించిన వెన్నుపోటు రాజకీయాన్ని ఏమాత్రం గ్రహించలేకపోయారు. ఆ ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రజాకర్షకశక్తితో టీడీపీ మొత్తం 216 స్థానాల్లో తిరుగులేని అధిక్యతను సాధించింది. అయితే అల్లుడు పొడిచిన వెన్నుపోటుతో అధికారాన్ని కోల్పోయారు. తీవ్రమైన మనోవేదన మధ్య సీఎం పీఠం చంద్రబాబు వశమయ్యాక నాలుగున్నర నెలల్లోనే 1996 జనవరి 18న ఎన్టీఆర్ మరణించారు. 1996, 1998 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో వామపక్షాలతో పోత్తుపెట్టుకున్న చంద్రబాబు 1999 లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకల్లా యూటర్న్ తీసుకుని బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నారు. రెండో ఆగస్టు సంక్షోభం... 1993లో ఎన్టీరామారావు లక్ష్మీ పార్వతిని రెండో వివాహం చేసుకున్న సమయంలో టీడీపీ ప్రతిపక్షంలో ఉండడంతో చంద్రబాబు అణిగిమణిగి ఉన్నట్టుగా కనిపించారు. టీడీపీ అధికారానికి వచ్చాక చంద్రబాబును విశ్వసించి ఆర్థిక, రెవెన్యూ వంటి కీలకశాఖలను ఎన్టీఆర్ అప్పగించారు. పరిపాలనలో లక్ష్మీపార్వతి జోక్యం ఆరోపణలతో పాటు 1995 ప్రథమార్థంలో జరిగిన మున్సిపల్, పంచాయతీరాజ్, సహకార ఎన్నికల్లో లక్ష్మీపార్వతి సూచించిన అభ్యర్థులు ఎక్కువ మందికి టికెట్లు కేటాయించడం వంటి పరిణామాలు చంద్రబాబు ఆగ్రహానికి కారణమైంది. పదకొండేళ్ల తర్వాత 1995లో ఎన్టీఆర్ రెండో ఆగస్టు సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. టీడీపీలో మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతుతో పాటు వామపక్షాల అండదండలు కూడా చంద్రబాబుకు లభించాయి. టీడీఎల్పీలో చీలిక కారణంగా అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని ఎన్టీఆర్‌కు గవర్నర్ కృష్ణకాంత్ కోరారు. బలపరీక్షకు ముందే ఎన్టీఆర్ రాజీనామా చేయడంతో 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేశారు. కుమ్ములాటలే కొంప ముంచాయి ముఠా కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరుకున్న నేపథ్యంలో 1994 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తీవ్ర పరాభవం ఎదుర్కొంది. టీడీపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకుంది. టీడీపీ 216 స్థానాల్లో విజయం సాధించింది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 26 ఎమ్మెల్యే సీట్లకే పరిమితమైంది. ఎంఐఎం నాయకత్వంతో విభేదించిన అమానుల్లాఖాన్ ఎంబీటీని స్థాపించి తొలిసారిగా ఆ పార్టీకి సవాల్ విసిరారు. ఈ ఎన్నికల్లో ఎన్టీఆర్ హిందూపురం, టెక్కలి స్థానాల నుంచి గెలిచారు. కాంగ్రెస్ శాసనసభాపక్షానికి పి.జనార్దనరెడ్డి నేతగా ఉన్నారు. జహీరాబాద్ నుంచి ఎం.బాగారెడ్డి , చలకర్తి నుంచి కుందూరు జానారెడ్డి (కాంగ్రెస్) ఓటమి చవిచూశారు. - సాక్షి, నాలెడ్జ్ సెంటర్ -
ఓడిన ఎన్టీఆర్.. ఆసక్తి రేపిన 1989 ఎన్నికలు
తెలుగుదేశం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్.టి.రామారావు ఏడేళ్ల పాలన తర్వాత (మధ్యలో నాదెండ్ల భాస్కరరావు నెల రోజులు మినహాయిస్తే) 1989 డిసెంబర్లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం1990 మార్చి వరకూ ఉన్నా లోక్‌సభ ఎన్నికలు ముందే రావడంతో ఎన్టీఆర్ జమిలి ఎన్నికలకే నిర్ణయం తీసుకున్నారు. రాజీవ్‌గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ప్రతిపక్షాలతో కలిసి నడిచిన రామారావు..అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో పరాజయం పాలయ్యారు. టీడీపీ స్థాపించాక జరిగిన మొదటి రెండు అసెంబ్లీ ఎన్నికల్లో రెండుసార్లూ 200కిపైగా సీట్లు లభించగా, 1989 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ 74 సీట్లే దక్కించుకుని మొదటిసారి ప్రతిపక్షమైంది. లోక్‌సభ ఎన్నికల్లో తెలుగుదేశం కేవలం రెండు సీట్లే (బొబ్బిలి, నర్సాపురం) సాధించి ఘోర పరాజయం చవిచూసింది. 1983 జనవరి నుంచీ ప్రతిపక్ష స్థానానికే పరిమితమైన కాంగ్రెస్ 1989 డిసెంబర్ 3న మళ్లీ రాష్ట్రంలో అధికారం చేపట్టింది. సీనియర్ నేత, పీసీసీ(ఐ) అధ్యక్షుడు మర్రి చెన్నారెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. 1988, 89లో జరిగిన రాజకీయ పరిణామాలు, టీడీపీ సర్కారు వేసిన తప్పటడుగులు, విజయవాడలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగారావు హత్యతో ఆయన సామాజికవర్గంలో తెలుగుదేశంపై పెల్లుబికిన వ్యతిరేకత, 1989 ఆరంభంలో ఒకేసారి తన మంత్రివర్గంలోని సభ్యులందరితో ఎన్టీఆర్ రాజీనామా చేయించడం వంటి అనేక కారణాలు టీడీపీ ఓటమికి దోహదంచేశాయి. మూడు నెలలు ముందు జరిగిన తెలుగు శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం ఓడిపోతుందని ఎక్కువ మంది రాజకీయ పరిశీలకులు ఊహించలేకపోయారు. అనంతపురం జిల్లా హిందూపురంతోపాటు మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి కూడా పోటీచేసిన రామారావు రెండో స్థానంలో ఓడిపోవడం సంచలనం సృష్టించింది. అల్లుడికి అందలం! ఎన్టీఆర్ 1985లో మరోసారి సీఎం అయ్యాక మూడో అల్లుడు నారా చంద్రబాబు నాయుడు గుట్టు చప్పుడు కాకుండా తెలుగుదేశంలో చేరారు. ఆయనకు తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి పదవిని కూడా ఎన్టీఆర్ ఇచ్చారు. అయితే ఏ చట్ట సభలోనూ సభ్యత్వం లేని చంద్రబాబుకు కొత్తగా ఏర్పాటు చేసిన కర్షక పరిషత్ చైర్మన్ పదవి అప్పగించారు. ఈ నియామకం చెల్లదని హైకోర్టు తీర్పు ఇవ్వడం కూడా ఎన్టీఆర్‌కు, టీడీపీకి రాజకీయంగా ఇబ్బంది కలిగించింది. ప్రకాశం జిల్లా కారంచేడులో దళితులపై ఊచకోత కూడా తెలుగుదేశం ఎస్సీల్లో కొంత మేరకు మద్దతు కోల్పోవడానికి దారితీసింది. నెల్లూరు జిల్లాలో సీనియర్ నేత, మంత్రి నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డికి పార్టీ నాయకత్వంతో విభేదాలు రావడంతో పార్టీకి దూరమయ్యారు. తర్వాత ఒకేసారి మంత్రులందరినీ తొలగించినప్పుడు టీడీపీలో అంతర్గత ప్రజాస్వామ్యం కోసం ప్రయత్నం చేసిన సీనియర్ నేతలు ముద్రగడ పద్మనాభం, వసంత నాగేశ్వరరావు, కుందూరు జానారెడ్డి, కేఈ కృష్టమూర్తి వేర్వేరు సమయాల్లో పార్టీ నుంచి బయటికొచ్చి తెలుగునాడు అనే కొత్త పార్టీ ప్రారంభించారు. చివరికి ఎన్నికల ముందు వారంతా కాంగ్రెస్‌లో చేరారు. ఇంత జరిగినా పేద, బడుగు వర్గాల్లో ఎన్టీఆర్‌కు జనాకర్షణ శక్తి తగ్గలేదనీ, తెలుగుదేశమే మళ్లీ అధికారంలోకి వస్తుందని చాలా మంది అంచనావేశారు. కాని, ఏడేళ్ల తెలుగుదేశం పాలనపై జనం వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి కాంగ్రెస్‌కే అధికారం కట్టబెట్లారు. జెయింట్ కిల్లర్ చిత్తరంజన్! ఈ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి అసెంబ్లీకి పోటీచేసిన ఎన్టీఆర్ అప్పటి జనతాదళ్ నేత ఎస్ జైపాల్‌రెడ్డి సూచనతో కల్వకుర్తిలో నామినేషన్ వేసి కాంగ్రెస్ అభ్యర్థి జక్కుల చిత్తరంజన్‌దాస్ చేతిలో ఓడిపోయారు. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ఆయన రెండోసారి విజయం సాధించారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన చెన్నారెడ్డి సనత్‌నగర్ నుంచి పోటీచేసి గెలిచారు. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
సంక్షోభం.. మధ్యంతరం
ఆంధ్రప్రదేశ్‌లో సుదీర్ఘకాలం పాటు సాగిన కాంగ్రెస్ పాలనకు 1983 జనవరి ఎన్నికల్లో సినీనటుడు ఎన్టీ రామారావు నేతృత్వంలోని టీడీపీ అడ్డుకట్ట వేశాక అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో 1985 మార్చిలోనే ఏపీ అసెంబ్లీకి మధ్యంతర ఎన్నికలు జరిగాయి. టీడీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన నాదెండ్ల భాస్కరరావు సీఎం ఎన్టీఆర్‌తో విభేదించారు. రాష్ట్ర కేబినెట్లో నెంబర్ టూగా తనకు తగినంత గౌరవం లభించడం లేదని భావించిన నాదెండ్ల.. కాంగ్రెస్‌తో చేతులు కలిపారు. ఎన్టీఆర్ గుండె శస్త్రచికిత్స కోసం అమెరికా వెళ్లినపుడు ఆయన్ను గద్దె దింపే వ్యూహం పన్నారు. స్వపక్షంలోనే అసమ్మతికి కేంద్ర బిందువుగా మారిన నాదెండ్ల, ఆయన అనుయాయులను కేబినెట్ నుంచి ఎన్టీఆర్ తొలగించారు. అయితే, తనకు 91 మంది టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు 57 మంది కాంగ్రెస్, ఐదుగురు ఎంఐఎం, ఇద్దరు రాష్ట్రీయ సంజయ్ మంచ్, ఆరుగురు ఇండిపెండెంట్ల మద్దతు ఉందని (మొత్తం 161 మంది ఎమ్మెల్యేలు) గవర్నర్ రాంలాల్‌కు నాదెండ్ల వినతిపత్రం సమర్పించారు. మెజారిటీ కోల్పోయినందున ఎన్టీ రామారావు ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయడం, ప్రభుత్వ ఏర్పాటుకు నాదెండ్లను ఆహ్వానించడం, ఆయన ప్రమాణం చేయడం వెంటవెంటనే జరిగిపోయాయి. నెల రోజుల్లో అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని నాదెండ్లకు గడువు విధించారు. స్పీకర్ తంగి సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్ భీంరెడ్డి కూడా నాదెండ్ల వర్గంలో చేరడంతో బలపరీక్ష సమయంలో ప్రోటెమ్ స్పీకర్‌ను నియమించారు. అయితే టీడీపీ నుంచి ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకునేందుకు నాదెండ్ల చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎన్టీఆర్‌ను అప్రజాస్వామికంగా గద్దె దింపడాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రజాస్వామ్య ఉద్యమాలు మొదలయ్యాయి. జనతా, సీపీఐ, సీపీఎం, బీజేపీ, లోక్‌దళ్‌తో సహా ఇతర విపక్ష పార్టీలన్నీ ఈ ఉద్యమానికి మద్దతిచ్చాయి. రాష్ట్రంలో నెలరోజుల పాటు తీవ్రస్థాయిలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించింది. ఈ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం దేశవ్యాప్తంగా విస్తరించింది. ఎన్టీఆర్ 161 మంది ఎమ్మెల్యేలతో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ముందు పరేడ్ చేయించారు. దీంతో కేంద్రం అప్రతిష్టపాలైన రాంలాల్‌ను తొలగించి శంకర్ దయాళ్శర్మను కొత్త గవర్నర్‌గా నియమించింది. దీంతోనెల రోజుల్లోనే (1984 సెప్టెంబర్) ఎన్టీ రామారావు మళ్లీ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. అయితే, మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట ఇతర రాజకీయ పక్షాలు అందించిన మద్దతు, ప్రజల సహకారం వంటి సానుకూల అంశాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఆర్.. శాసనసభను రద్దు చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా నాదెండ్ల వర్గంలోకి వెళ్లి వచ్చిన ఎమ్మెల్యేలు శాసనసభ్యులుగా కొనసాగడం ఇష్టం లేక అసెంబ్లీని రద్దు చేసి 1985లో మధ్యంతర ఎన్నికలకు వెళ్లారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ముందు ఎమ్మెల్యేల పరేడ్ లోక్‌సభ ఎన్నికల్లోనూ తెలుగుదేశం సత్తా... తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి ఏపీలో అధికారంలోకి వచ్చాక, తొలిసారి 1984లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 30 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది. ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురైన నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా సానుభూతి పవనాలు పెల్లుబికినా ఏపీలో అవేమీ పనిచేయలేదు. కాంగ్రెస్ కేవలం ఆరు సీట్లకే పరిమితమైంది. సీపీఐ, సీపీఎం, జనతా, బీజేపీ, ఎంఐఎం, ఐసీఎస్ చెరో సీటు గెలుచుకున్నాయి. కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుంచి టీడీపీ టికెట్‌పై గెలిచినవారిలో పి.ఆనందగజపతిరాజు (బొబ్బిలి), భాట్టం శ్రీరామమూర్తి (విశాఖపట్నం), భూపతిరాజు విజయ కుమారరాజు (నరసాపూర్), వడ్డే శోభనాద్రీశ్వరరావు (విజయవాడ), నిశ్శంకరరావు వెంకటరత్నం( తెనాలి), ఎన్పీ ఝాన్సీలక్ష్మి (చిత్తూరు), ఎరాసు అయ్యపురెడ్డి (కర్నూలు) ఉన్నారు. కాంగ్రెస్ నుంచి కావూరు సాంబశివరావు (మచిలీపట్నం), ఆచార్య ఎన్జీరంగా (గుంటూరు), సీపీఐ నుంచి సోడే రామయ్య (భద్రాచలం–ఎస్టీ), ఐసీఎస్ అభ్యర్థిగా వైరిచర్ల కిషోర్‌చంద్రదేవ్ (పార్వతీపురం–ఎస్టీ) విజయం సాధించారు. ఓడిన ప్రముఖులు... కాంగ్రెస్ నుంచి ఓడిన వారిలో కాసు బ్రహ్మానందరెడ్డి (నరసారావుపేట), కోట్ల విజయభాస్కరరెడ్డి (కర్నూలు), పెండేకంటి వెంకటసుబ్బయ్య (నంద్యాల), చెన్నుపాటి విద్య(విజయవాడ), సింగం బసవపున్నయ్య (తెనాలి), నల్లారి అమరనాథరెడ్డి (చిత్తూరు) ఉన్నారు. తెలంగాణలో గెలిచిన ప్రముఖులు... మాజీ ముఖ్యమంత్రులు టి.అంజయ్య (కాంగ్రెస్–సికింద్రాబాద్), జలగం వెంగళరావు (కాంగ్రెస్– ఖమ్మం)తో పాటు సూదిని జైపాల్‌రెడ్డి (జనతాపార్టీ–మహబూబ్‌నగర్), సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ (హైదరాబాద్), జె.చొక్కారావు (కరీంనగర్), చందుపట్ల జంగారెడ్డి (బీజేపీ–హనుమకొండ), టి.కల్పనాదేవి (టీడీపీ–వరంగల్), భీంరెడ్డి నర్సింహారెడ్డి (సీపీఎం–మిర్యాలగూడ) గెలుపొందారు. ఓడినవారిలో మాజీ సీఎంలు పీవీ నరసింహారావు (కాంగ్రెస్–హనుమకొండ), మర్రి చెన్నారెడ్డి (ఎన్డీపీఐ–కరీంనగర్), పి.శివశంకర్ (కాంగ్రెస్–మెదక్), ఎం.మల్లికార్జున్ (కాంగ్రెస్–మహబూబ్‌నగర్), మల్లు అనంతరాములు (కాంగ్రెస్–నాగర్‌కర్నూలు–ఎస్సీ) నంది ఎల్లయ్య (కాంగ్రెస్–సిద్దిపేట), కమాలుద్దీన్ అహ్మద్ (కాంగ్రెస్ –వరంగల్), నల్లమల గిరిప్రసాద్ (సీపీఐ–ఖమ్మం), పరసా సత్యనారాయణ (సీపీఎం–ఖమ్మం), చకిలం శ్రీనివాసరావు (కాంగ్రెస్ –మిర్యాలగూడ), బండారు దత్తాత్రేయ (బీజేపీ–సికింద్రాబాద్), వి.హనుమంతరావు (కాంగ్రెస్ –హైదరాబాద్) ఉన్నారు. నాదెండ్లతో సీఎంగా ప్రమాణం చేయిస్తున్న రామ్‌లాల్ కూటమిలో కామ్రేడ్లు, కమలనాథులు.. ఈ ఎన్నికల్లో పరస్పర విరుద్ధ రాజకీయ సిద్ధాంతాలున్న వామపక్షాలు, బీజేపీ, జనతా పార్టీలను కలుపుకుని ఎన్టీఆర్ కూటమిని రూపొందించారు. ఆగస్టు సంక్షోభం సందర్భంగా టీడీపీకి చేదోడువాదోడుగా నిలిచిన సీపీఐకు 15, సీపీఎంకు 12, బీజేపీకి 10, జనతాపార్టీకి 5 సీట్లు కేటాయించారు. మొత్తం 249 సీట్లకు పోటీ చేసిన టీడీపీ 202 స్థానాల్లో గెలవగా, కేవలం రెండుచోట్ల మాత్రమే డిపాజిట్ కోల్పోయింది. సీపీఐ, సీపీఎం చెరో 11 సీట్లు, బీజేపీ 8, జనతా 3 సీట్లు గెలుపొందాయి. ఈ నాలుగు పార్టీల నుంచి పోటీచేసిన అభ్యర్థులంతా ధరావతు దక్కించుకోవడం విశేషం. లోక్‌దళ్ 14 సీట్లకు పోటీ చేసి అన్నిచోట్లా డిపాజిట్‌ను కోల్పోయింది. మరోవైపు కాంగ్రెస్ మొత్తం 292 సీట్లకు పోటీపడి 50 స్థానాలు దక్కించుకుంది. 19 చోట్ల డిపాజిట్లు దక్కలేదు. 1983 ఎన్నికలతో పోల్చితే ఆ పార్టీ బలం పదిసీట్ల మేర తగ్గింది. ఎంఐఎం ఏడు స్థానాల్లో పోటీ చేసి ఐదు చోట్ల గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులుగా పోటీచేసిన 1,337 మందిలో అత్యధికశాతం ధరావతు కోల్పోయారు. బడ్జెట్ వివరాలు లీక్.. కేబినెట్ ఔట్... శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే దానికి సంబంధించిన వివరాలు కొన్ని తెలుగుపత్రికల్లో ముందుగానే లీక్ అయ్యాయనే కోపంతో 1989 ఆరంభంలో ఎన్టీ రామారావు మంత్రుల నుంచి రాజీనామాలు స్వీకరించి 23 మంది కొత్తవారితో కేబినెట్ ఏర్పాటుచేశారు. దీంతో కేఈ కృష్ణమూర్తి, వసంత నాగేశ్వరరావు తదితర మంత్రులు అసెంబ్లీకి రాజీనామా చేయగా, కుందూరు జానారెడ్డి పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఎన్టీఆర్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయం పార్టీలో తీవ్ర అసంతృప్తికి దారితీసింది. తెలంగాణ నుంచి ఒకే మహిళ... ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిపి (అన్ని పార్టీల నుంచి) అత్యధిక సంఖ్యలో 66 మంది మహిళలు పోటీచేయగా.. పదిమందే గెలుపొందారు. వారిలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుంచి 9 మంది గెలవగా, తెలంగాణ నుంచి ఒక్కరే ఉన్నారు. తెలంగాణ నుంచే 24 మంది (15 మంది ఇండిపెండెంట్లు) పోటీచేశారు. కాంగ్రెస్ అభ్యర్థులు ఏడుగురు, టీడీపీ నుంచి ఇద్దరు బరిలో నిలిచారు. షాద్‌నగర్ (ఎస్సీ) సీటు నుంచి ఎం.ఇందిర (టీడీపీ) గెలుపొందారు. ఈ ప్రాంతం నుంచి మొత్తం 17 మందికి ధరావతు కూడా దక్కలేదు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ (ఎస్సీ) స్థానం నుంచి ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన జెట్టి ఈశ్వరీబాయి, కేపీ జయశ్రీ డిపాజిట్లు కోల్పోయారు. గెలిచిన, ఓడిన ప్రముఖులు... ఈ ఎన్నికల్లో సీఎం ఎన్టీ రామారావు మూడుచోట్ల (గుడివాడ, హిందూపురం, నల్లగొండ) నుంచి పోటీచేసి గెలుపొందారు. హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా కొనసాగారు. మహరాజ్‌గంజ్ నుంచి గెలిచిన సీనియర్ న్యాయవాది జి.నారాయణరావు (టీడీపీ) ఆ తర్వాత సభాపతిగా నియమితులయ్యారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు (టీడీపీ) సిద్దిపేట నుంచి 15వేలకు పైగా మెజారిటీతో మొదటిసారి గెలుపొందారు. నరసాపూర్ నుంచి చిలుముల విఠల్‌రెడ్డి (సీపీఐ) సి.జగన్నాథరావు (కాంగ్రెస్)పై విజయం సాధించారు. జహీరాబాద్ నుంచి ఎం.బాగారెడ్డి గెలిచారు. ఆందోల్ (ఎస్సీ) సీటు నుంచి సి.రాజనర్సింహ (కాంగ్రెస్)పై మల్యాల రాజయ్య (టీడీపీ) విజయం సాధించారు. జీవీ సుధాకరరావు (కాంగ్రెస్– లక్సెట్టిపేట), దుద్దిళ్ల శ్రీపాదరావు (కాంగ్రెస్–మంథని), చెన్నమనేని రాజేశ్వరరావు (సీపీఐ–సిరిసిల్ల) చెన్నమనేని విద్యాసాగరరావు (బీజేపీ–మెట్పల్లి), కుందూరు జానారెడ్డి (కాంగ్రెస్–చలకుర్తి) నాగం జనార్దనరెడ్డి (టీడీపీ–నాగర్‌కర్నూలు), చిట్టెం నర్సిరెడ్డి ( మక్తల్–జనతాపార్టీ), నర్రారాఘవరెడ్డి (సీపీఎం–నకిరేకల్) దేశిని చినమల్లయ్య (సీపీఐ–ఇందుర్తి), నెమురుగొమ్ముల యతిరాజారావు (టీడీపీ–చెన్నూరు), కొప్పుల హరీశ్వర్‌రెడ్డి (టీడీపీ–పరిగి), పి.ఇంద్రారెడ్డి (చేవెళ్ల–టీడీపీ), నాయిని నర్సింహారెడ్డి (జనతాపార్టీ), ఆలె నరేంద్ర (బీజేపీ–హిమాయత్‌నగర్), మహ్మద్ రజబ్ అలీ (సీపీఐ–సుజాతనగర్), రావుల రవీంద్రనాథ్‌రెడ్డి (బీజేపీ–ఆలంపూర్), శ్రీపతి రాజేశ్వర్ (టీడీపీ–సనత్‌నగర్), అల్లాడి పి.రాజ్‌కుమార్ (టీడీపీ–సికింద్రాబాద్), పి.జనార్దనరెడ్డి (కాంగ్రెస్–ఖైరతాబాద్), నల్లు ఇంద్రసేనారెడ్డి (బీజేపీ–మలక్‌పేట), బద్ధం బాల్‌రెడ్డి (బీజేపీ–కార్వాన్) ,కరణం రామచంద్రరావు (టీడీపీ–మెదక్), ఎలిమినేటి మాధవరెడ్డి (టీడీపీ–భువనగిరి), ఎస్.వేణుగోపాలాచారి (టీడీపీ–నిర్మల్), గుండా మల్లేష్ (సీపీఐ–ఆసిఫాబాద్ ఎస్సీ), సి.ఆనందరావు (టీడీపీ–కరీంనగర్), జి.రాజేశం గౌడ్ (టీడీపీ–జగిత్యాల), రామసహాయం సురేందర్‌రెడ్డి (కాంగ్రెస్–డోర్నకల్), మద్దికాయల ఓంకార్ (నర్సంపేట–ఎంసీపీఐæ), వన్నాల శ్రీరాములు (బీజేపీ–వర్థన్నపేట), అజ్మీరా చందూలాల్ (టీడీపీ–ములుగు ఎస్టీ), కుంజా బొజ్జి (సీపీఎం–భద్రాచలం ఎస్టీ), చందా లింగయ్య (కాంగ్రెస్–బూర్గుంపహాడ్), తుమ్మల నాగేశ్వరరావు (టీడీపీ–సత్తుపల్లి), బోడెపూడి వెంకటేశ్వరరావు (సీపీ ఎం–మధిర), గుమ్మడి నర్సయ్య (సీపీఐఎంఎల్–ఇల్లెందు ఎస్టీ), ఉజ్జిని నారాయణరావు ( సీపీఐ– మునుగోడు) విజయపతాకం ఎగురవేశారు. ఓడిన అభ్యర్థులు... ప్రజాస్వామ్య తెలుగుదేశం టికెట్‌పై పోటీచేసిన నాదెండ్ల భాస్కరరావు (మలక్‌పేట), మల్లుస్వరాజ్యం (సీపీఎం–తుంగతుర్తి), కాంగ్రెస్ నుంచి డీకే సమరసింహారెడ్డి (గద్వాల), జి.చిన్నారెడ్డి (వనపర్తి), శనిగరం సంతోష్‌రెడ్డి (ఆర్మూరు), జి.గడ్డెన్న (ముథోల్), గీట్ల ముకుందరెడ్డి (పెద్దపల్లి), వి.జగపతిరావు (కరీంనగర్), పొన్నాల లక్ష్మయ్య (జనగామ), రాంరెడ్డి వెంకటరెడ్డి (సుజాతనగర్),రాగ్యానాయక్ (చలకుర్తి) ఓటమి చవిచూశారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
తెలుగునాట 1983 ఎన్నికలు చరిత్రాత్మకం
1983 ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్‌తోపాటు జాతీయ రాజకీయాల్లోనూ చరిత్రాత్మకంగా నిలిచిపోయాయి. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భవించినప్పటినుంచి అప్రతిహతంగా 26 ఏళ్ల పాటు ఎదురులేకుండా దూసుకెళ్తున్న కాంగ్రెస్‌కు తెలుగుగడ్డపై నందమూరి తారక రామారావు బ్రేకులు వేశారు. కాంగ్రెస్ వ్యతిరేక నినాదంతో 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారు. ఆ తర్వాత కేవలం 9 నెలల వ్యవధిలో.. 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ ప్రభంజనం సృష్టించారు. 294 స్థానాల్లో 202 సీట్లు సాధించి చరిత్ర సృష్టించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 60 సీట్లకే పరిమితం కాగా.. ఇందులో తెలంగాణలోనే 42 (107 సీట్లలో) స్థానాలు సంపాదించుకుంది. కాంగ్రెస్ హేమాహేమీలు.. సైకిల్ గుర్తుపై పోటీచేసిన అనామకుల చేతుల్లో దారుణంగా ఓడిపోయారు. ఎన్టీఆర్‌తో పొత్తుకోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించిన ఉభయ కమ్యూనిస్టులు, జనతాపార్టీ, లోక్‌దళ్, బీజేపీ పార్టీలు కూడా తక్కువ సీట్లకే పరిమితమయ్యాయి. 1982లో ఇందిరతో విభేదించి సొంతపార్టీ (రాష్ట్రీయ సంజయ్ మంచ్) పెట్టుకున్న చిన్న కోడలు మేనకా గాంధీ ఎన్టీఆర్‌తో చేతులు కలిపారు. శూన్యత పూరించిన ఎన్టీఆర్ ఏపీ అవతరణ తర్వాత కాంగ్రెస్ కాస్తో, కూస్తో పోటీగా భావించిన కామ్రేడ్లు 1957, 62 ఎన్నికల్లో మినహా గట్టిపోటీని ఇవ్వలేకపోయారు. మిగిలిన జాతీయ పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయి. ఈ నేపథ్యంలో తెలుగుగడ్డపై ఏర్పడిన రాజకీయ శూన్యతను ఎన్టీఆర్ పూరించారు. 1978లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (ఐ)లో మిగిలిన పార్టీల ఎమ్మెల్యేలు చేరడంతో ఈ సంఖ్య 250 దాటింది. అయినా ఆ పార్టీ సుస్థిర పాలనను అందించలేకపోయింది. అవినీతి, అసమ్మతి, అంతర్గత పోరుతో కాంగ్రెస్ ప్రజాదరణ కోల్పోయింది. అప్పటికే హైదరాబాద్‌లో స్థిరపడిన ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రారంభిస్తున్నట్టు ప్రకటించి సంచలనం సృష్టించారు. అయితే.. టీడీపీ తొలి ర్యాలీకి జనం పెద్దగా హాజరుకాలేదు. కానీ.. చైతన్యరథం ద్వారా ఎన్టీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించడంతో ఆ పార్టీకి జనాదరణ మొదలైంది. ఆర్నెల్లలోపే ఈ గాలి ప్రభంజనంగా మారుతున్నట్లు కనిపించడంతో ఇందిర అసెంబ్లీని మూడునెలల ముందే రద్దుచేసి ఎన్నికలు జరిపించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేనాటికి.. ఎన్టీఆర్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటన పూర్తిచేయలేదు. దీంతో కోస్తా, రాయలసీమతో పోలిస్తే తెలంగాణలో టీడీపీకి తక్కువసీట్లు వచ్చాయి. గతంలో కాంగ్రెస్ మంత్రులుగా ఉన్న నాదెండ్ల భాస్కరరావు, నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వసంత నాగేశ్వరరావు, ఎన్.యతిరాజారావు, పి.మహేంద్రనాథ్, టీఎన్ సదాలక్ష్మి వంటి నేతలు తెలుగుదేశంలో చేరారు. అంతేగాక, అసలు రాజకీయాల్లో పెద్దగా అనుభవం లేని వారు కూడా టీడీపీలో చేరి విజయం సాధించారు. తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతోపాటు రెండు రూపాయలకే కిలో రేషన్ బియ్యం, బడుగు వర్గాల సంక్షేమానికి చేసిన హామీలు ఎన్టీఆర్ ప్రభంజనానికి కారణాలు. కుదేలైన కాంగ్రెస్! కేవలం సినీ గ్లామర్‌తో ఎన్టీఆర్ ఈ ఎన్నికల్లో విజయం సాధించలేరని.. కాంగ్రెస్ నేతలు వేసిన అంచనాలు తప్పయ్యాయి. ఇందిరతోపాటు, రాజీవ్ గాంధీ స్వయంగా ప్రచారం చేసినా ఎన్టీఆర్ జోరు ముందు పనిచేయలేదు. సొంత జిల్లా కృష్ణాలోని గుడివాడ, చిత్తూరు జిల్లా తిరుపతి నుంచి పోటీ చేసిన ఎన్టీఆర్ రెండు చోట్లా ఘనవిజయం సాధించారు. చంద్రగిరి నుంచి రెండోసారి కాంగ్రెస్ టికెట్ తీసుకొని పోటీచేసిన ఆయన అల్లుడు, సహాయ మంత్రి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. తెలుగుదేశం 149 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 50%కు పైగా ఓట్లు సంపాదించడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీకి 46.3% ఓట్లు పోలయ్యాయి. హైదరాబాద్ నగరంలో అప్పటివరకు రెండు సీట్లకే పరిమితమైన ఎంఐఎం.. ఈసారి తన సంఖ్యను ఐదుకు పెంచుకుంది. కాంగ్రెస్ పరువు కాపాడిన తెలంగాణ కాంగ్రెస్ గెలిచిన 60 సీట్లలో అత్యధికంగా 42 స్థానాలు తెలంగాణ ప్రాంతంలోనే దక్కాయి. తెలుగుదేశం పార్టీకి కూడా బలహీనంగా ఉందనుకున్న తెలంగాణలోని మొత్తం 107 సీట్లలో 42 సీట్లు కైవసం కావడం విశేషం. తెలంగాణ జిల్లాల్లో ఆంధ్రప్రాంత సెటిలర్లు గణనీయ సంఖ్యలో ఉన్న నిజామాబాద్ జిల్లాలో టీడీపీ అత్యధిక సీట్లు (6/9) గెలుచుకోగలిగింది. అలాగే పూర్వపు ఆంధ్రరాష్ట్ర జిల్లాల మూలాలున్న జనం చెప్పుకోదగ్గ సంఖ్యలో నివసించే హైదరాబాద్ నగరంలో కూడా తెలుగు దేశం పార్టీకి ఎక్కువ సీట్లు కైవసమయ్యాయి. ఇక్కడ ఏడు సీట్లు (హిమాయత్‌నగర్, ముషీరాబాద్, సనత్‌నగర్, సికింద్రాబాద్, ఖైరతాబాద్, సికింద్రాబాద్ కంటోన్మెంట్) టీడీపీ గెలుచుకుంది. ఇంకా జిల్లాల వారీగా చూస్తే మహబూబ్‌నగర్‌లో 6/13, మెదక్‌లో 3/10, ఆదిలాబాద్‌లో 4/9, కరీంనగర్లో 6/13, వరంగల్‌లో 4/13, నల్లగొండలో 4/12, ఖమ్మంలో 1/9 స్థానాల్లో ఎన్టీఆర్ పార్టీ విజయం సాధించింది. బరిలో తొలిసారి... సిద్ధిపేట నుంచి టీడీపీ తరఫున పోటీచేసిన కేసీఆర్.. సీనియర్ కాంగ్రెస్ నేత మదన్మోహన్ చేతిలో కేవలం 877 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అసెంబ్లీ రద్దు కారణంగా రెండేళ్లకే జరిగిన మధ్యంతర ఎన్నికల్లో (1985) సమీప కాంగ్రెస్ అభ్యర్థి టి.మహేందర్‌రెడ్డిపై 16 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో కేసీఆర్ గెలుపొందారు. సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ మంత్రి కె.కేశవరావును తెలుగుదేశం అభ్యర్థి మాచినేని కిషన్‌రావు ఓడించారు. కార్మిక నేత, జనతాపార్టీ అభ్యర్థి నాయిని నరసింహారెడ్డి తెలుగుదేశం అభ్యర్థి శ్రీపతి రాజేశ్వరరావు చేతిలో పరాజయం పాలయ్యారు. మాజీ హోంమంత్రి కె.ప్రభాకరరెడ్డిని బీజేపీ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి మలక్‌పేటలో ఓడించారు. చాంద్రాయణగుట్ట నుంచి పోటీచేసిన బీజేపీ నేత ఆలె నరేంద్రను ఎంఐఎం నేత అమానుల్లా ఖాన్ ఓడించారు. జగిత్యాలలో కాంగ్రెస్ నేత జువ్వాడి రత్నాకరరావును.. టీడీపీ అభ్యర్థి టి.జీవన్ రెడ్డి ఓడించారు. తొలిసారి ఈవీఎంలు ఈవీఎంలు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన షాద్‌నగర్‌లో తొలిసారి పోటీచేసిన కాకా అల్లుడు శంకరరావు గెలుపొందారు. డీకే సమర సింహారెడ్డి(కాంగ్రెస్) గద్వాల నుంచి, మంత్రి ఎం.మాణిక్‌రావు తాండూరులో గెలిచారు.చార్మినార్ నుంచి ఎంఐఎం నేత సలావుద్దీన్ ఒవైసీ అసెంబ్లీకి చివరిసారి పోటీచేసి బీజేపీ అభ్యర్థి సి.అశోక్‌కుమార్‌ను ఓడించారు. మాజీ సీఎం అంజయ్య(రామాయంపేట), సీపీఐ నేత గూండా మల్లేష్ (ఆసిఫాబాద్), దుద్దిళ్ల శ్రీపాదరావు (మంథని) నుంచి గెలిచారు.అచ్చంపేటలో టీడీపీ టికెట్‌పై పోటీచేసిన పి.మహేంద్రనాథ్ విజయం సాధించారు. మెదక్ నుంచి గెలిచిన ఇందిర కేంద్రంలో జనతాపార్టీ ప్రభుత్వ పతనం తర్వాత 1980లో లోక్‌సభకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ (ఐ) ఘన విజయం సాధించింది. మొత్తం 42 ఎంపీ స్థానాల్లో 41 సీట్లను (పార్వతీపురం–ఎస్టీ) నుంచి గెలుపొందిన కిశోర్ చంద్రదేవ్ (కాంగ్రెస్ అర్స్–యూ) మినహా ఇందిరా కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తెలంగాణ ప్రాంతంలోని మొత్తం 15 సీట్లను ఆ పార్టీ చేజిక్కించుకుని పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఈ ఎన్నికల్లో మెదక్ నుంచి మాజీ ప్రధాని ఇందిర 2,19,124 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. తెలంగాణ నుంచి గెలిచిన ఇతర ప్రముఖులు గెలిచిన ముఖ్యనేతల్లో మాజీ సీఎం పీవీ నరసింహారావు (హన్మకొండ), పి.శివశంకర్ (సికింద్రాబాద్), ఎం. మల్లిఖార్జున్ (పాలమూరు), మల్లు అనంతరాములు (నాగర్‌కర్నూల్–ఎస్సీ), కమాలుద్దీన్ అహ్మద్ (వరంగల్), ఎం.సత్యనారాయణరావు (కరీంనగర్), నంది ఎల్లయ్య (సిద్దిపేట–ఎస్సీ), కోదాటి రాజమల్లు (పెద్దపల్లి–ఎస్సీ), కె.సత్యనారాయణ (హైదరాబాద్) ఉన్నారు. -(సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
ఏడాదంతా ఒక్కటే బస్ పాస్
సాక్షి, ఎంవీపీ కాలనీ(విశాఖ తూర్పు) : ఏడాది పొడవునా బస్‌పాస్‌ల కోసం విద్యార్థులు నిరీక్షించాల్సిన పనిలేకుండా ఆర్టీసీ కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఈ వివరాలను ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.ఎ.అన్సారీ సోమవారం ఎంవీపీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరించారు. ప్రస్తుతం విద్యార్థులు నెలవారి బస్‌పాస్ పొందుతున్నారని, దీనివల్ల వారికి సమయం వృ థా అవుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఏడాది మొ త్తం ఒకేపాస్ ఉండేలా కొత్త విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు. ఈ విధానం ద్వారా ప్రతి విద్యార్థి ఏడాదిలో ఒక్కసారి బస్ పాస్ తీసుకుంటే సరిపోతుందన్నారు. దీంతోపాటు బస్ పాస్‌ల మంజూరులో ఇక నుంచి ఇంటర్నెట్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు వెల్లడించారు. ముందుగా విద్యార్థులు వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకొని అనంతరం దగ్గరలోని ఆర్టీసీ కేంద్రంలో పాస్‌లు పొందవచ్చన్నారు. ఎంవీపీ, ద్వారకా నగర్, మద్దిలపాలెం, సింహాచలం, గాజువాక, కూర్మనపాలెం, ఎన్ఏడీ కొత్తరోడ్డు, మధురవాడ కేంద్రాల్లో బస్ పాస్‌లు పొందవచ్చన్నారు. గతంలో జారీ చేసే 3 నెలల పాస్‌లో యథాతదంగా ఉంటాయన్నారు. ప్రస్తుతం 10వ తరగతి విద్యార్థులకు 10 నెలలకు రూ.1300, ఇంటర్, పాలిటెక్నికల్ విద్యార్థులకు 11 నెలలకు రూ.1430, డిగ్రీ, పలు వృత్తి విద్యా కోర్సుల వారికి 12 నెలలకు రూ.1560 చొప్పున చెల్లించి బస్ పాస్‌లు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ సుదేష్కుమార్, సుధా బిందు వెంకటరావు పాల్గొన్నారు. -
ముచ్చటగా మూడో‘సారీ’
సాక్షి, విశాఖపట్నం : జూనియర్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం స్టీల్‌ప్లాంట్ గత నెలలో నిర్వహించిన పరీక్షలను రద్దు చేసింది. ఈ మేరకు యాజమాన్యం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఏడాదిలో మూడు సార్లు పరీక్షలను రద్దు చేసి అప్రతిష్టను మూటగట్టుకుంది. స్టీల్‌ప్లాంట్ యాజమాన్యం గతేడాది జూన్‌లో 645 జూనియర్ ట్రైనీ, 91 ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. జూనియర్ ట్రైనీ పోస్టులకు సుమారు 78 వేల మంది, ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకు సుమారు 56 వేల మంది దరఖాస్తు చేశారు. వీటికి సంబందించి గతేడాది జూలైలో రాత పరీక్షకు సిద్ధం కాగా.. ప్రశ్నపత్రాలు సకాలంలో చేరకపోవడంతో పరీక్షలను రద్దు చేశారు. దీంతో ఫీల్డ్ అసిస్టెంట్ పరీక్షను పక్కన పెట్టి జూనియర్ ట్రైనీ పరీక్షను ఆన్లైన్లో నిర్వహించడానికి సన్నద్ధమయ్యారు. అయితే నిర్వాసితులు కోర్టును ఆశ్రయించారు. దీంతో అఖరు నిమిషంలో ఆ పరీక్షను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. న్యాయస్థానం అనుమతి తీసుకుని ఎట్టకేలకు గత నెల 9 నుంచి 14 వరకు రాష్ట్రంలోని వివిధ కేంద్రాల్లో ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలకు సుమారు 40 వేల మంది మాత్రమే హాజరయ్యారు. అయితే ఈసారి జరిగిన ఆన్లైన్ పరీక్ష పత్రంలో 2016, 2017లలో జరిగిన ఎస్ఎస్సీ జేఈ పరీక్ష పత్రాలను మక్కిమక్కీగా దించేశారు. దీనిపై అభ్యర్థులు పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టడంతో యాజమాన్యం ఇద్దరు ఈడీలతో కమిటీ వేసింది. ఆ కమిటీ కూడా రద్దుకు సిఫార్సు చేసింది. దీంతో యాజమాన్యం గత్యంతరం లేక ఈ పరీక్షను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఏడాదిలో మూడు సార్లు ఒక పరీక్షను రద్దు చేసిన ఘనతను మూటగట్టుకుంది. లోపించిన పర్యవేక్షణ స్టీల్‌ప్లాంట్ నియామకాల ప్రక్రియలో వరుసగా జరుగుతున్న తప్పిదాలను గమనిస్తే అధికార యంత్రాంగం పర్యవేక్షణ లోపించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎంపిక చేసిన ఏజెన్సీ చరిత్ర తెలుసుకోకుండా పరీక్షల నిర్వహిణను అప్పగించడంపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా తరచూ పరీక్షలను రద్దు చేసి నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడడం తగదని పలువురు సూచిస్తున్నారు. అభ్యర్థులకు ఇబ్బందులు ప్రభుత్వ రంగ సంస్ధలో ఉద్యోగంపై ఆశతో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అభ్యర్ధులు అనేక ఇబ్బందులు పడి ఒక రోజు ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. చాలా మందికి షెల్టర్ లేకపోవడంతో బస్టాండ్, రైల్వే ఫ్లాట్‌ఫారాల పైన పడుకుని మరునాడు పరీక్షలకు హాజరయ్యేవారు. దీంతో వసతి, భోజనం వంటి వాటి కోసం వేలాది రూపాయలు వ్యయం చేయాల్సి వచ్చింది. ఇలా ప్రతిసారీ రద్దు చేస్తే తమ పరిస్థితి ఏమిటని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
జై 2017.. మన హీరోలు దుమ్మురేపారు!
కొందరు సిక్సులు బాదారు.. మరికొందరు ఫోర్లు కొట్టారు.. ఇంకొందరు యావరేజ్‌గా ఆడినా మొత్తానికి టాలీవుడ్‌ని 2017లో గెలిపించారు. సంవత్సరం ప్రారంభంలోనే అదిరిపోయే హిట్స్ వచ్చాయి. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిసింది. టాలీవుడ్ ఇండియన్ రికార్డ్సు కూడా బద్దలుకొట్టింది. దేశం మొత్తం టాలీవుడ్ వైపు చూసింది. హీరోలు కథలను ఎంచుకోవడంలో మార్పు కనిపించింది. పాతతరం హీరోలు సైతం తమ స్టామినాను చాటుకున్నారు. యువ హీరోలకు సవాల్ విసిరారు. ఈ ఏడాది హీరోయిజానికి కాకుండా కథలకు వెండితెర పట్టంకట్టింది. ఈ పరిణామం మంచిదే. అయితే కొన్నిసక్సెస్ అవ్వొచ్చు, మరికొన్ని కాకపోవచ్చు. 2017 వెళ్లిపోతున్న ఈ తరుణంలో ఈ ఏడాది అదరగొట్టిన టాలీవుడ్ హీరోలపై ఓ లుక్కేద్దాం.. మెగాస్టార్ గ్రాండ్ ఎంట్రీ.. దాదాపు 9 ఏళ్ల నిరీక్షణ అనంతరం మెగా అభిమానుల కల నిజమైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఖైదీ నం.150 ఈ ఏడాది జనవరిలో విడుదలైంది. నాన్ బాహుబలి రికార్డులను బద్దలు కొట్టింది. రీ ఎంట్రీతో తన స్టామినా ఏంటో ఇండస్ట్రీకి చూపించారు. విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోయేలా ఈ సినిమా రికార్డులను బ్రేక్ చేసింది. ఈ విజయం ఇచ్చిన ఊపుతో 151వ సినిమాను చేయడానికి సిద్ధమయ్యారు. స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటిస్తున్నారు. బాలకృష్ణ సంక్రాంతి బరిలో దిగిన బాలయ్యకు ఈ ఏడాది కలిసొచ్చింది. గౌతమీపుత్ర శాతకర్ణిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్న దర్శకుడు క్రిష్. ఆయన కథను నడిపించిన విధానం, యుద్ధ సన్నివేశాలు, బాలకృష్ణ నటన అన్నీ కలిసి ఈ సినిమాను విజయతీరాలకు చేర్చాయి. ప్రతీ ఫ్రేమ్‌లో క్రిష్ పనితనం కనిపిస్తుంది. బాలయ్య తన మార్క్ కనిపించేలా డైలాగ్స్‌తో ఆకట్టుకున్నాడు. విమర్శకుల నుంచి ప్రశంసలు వచ్చాయి. పూరీ డైరెక్షన్లో వచ్చిన 'పైసావసూల్' కూడా ఈ సంవత్సరమే విడుదలైంది. ప్రభాస్ ఈ సంవత్సరం ప్రభాస్‌కు బాగా కలిసొచ్చింది. బాహుబలితో జాతీయ స్థాయి హీరోగా ఎదిగారు. దాదాపు ఐదు సంత్సరాలు కష్టపడి తీసిన బాహుబలికి ప్రపంచస్థాయిలో సంచలన విజయం సాధించింది. ప్రభాస్‌కు టాలీవుడ్‌లోని హీరోలందరికంటే ఎక్కువ గుర్తింపు వచ్చింది. భారతీయ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన రెండో చిత్రంగా బాబహుబలి-2 రికార్డుకెక్కింది. ఈ క్రేజ్‌ని ప్రభాస్ నిలబెట్టుకుంటాడా అన్నది చూడాలి. రానా దగ్గుబాటి రానా ముందు నుంచీ విలక్షణ పాత్రలను చేస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఈ సంవత్సరం మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. బాహుబలి, ఘాజీ, నేనే రాజు నేనే మంత్రి ఈ మూడు చిత్రాలు విభిన్నమైనవే. బాహుబలిలో ప్రతినాయకుడి పాత్రలో ఒదిగిపోయారు. సబ్‌మెరైన్ కథతో తెరకెక్కిన ఘాజీ చిత్రంలో నేవీ ఆఫీసర్‌గా పాత్రకు ప్రాణం పోశారు. చాలాకాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న డైరెక్టర్ తేజ 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో మళ్లీ సక్సెస్ బాట పట్టారు. రానాతో తీసిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. రాజకీయ నాయకుడిగా రానా నట విశ్వరూపాన్ని చూపించారు. మొత్తానికి రానాకు ఈ సంవత్సరం అన్నీ హిట్లతో ఆనందంగా గడిచింది. విజయ్ దేవరకొండ పెళ్లిచూపులు సినిమాతో అందరినీ ఆశ్చర్యానికీ గురి చేశాడు విజయ్ దేవరకొండ. జాతీయ స్థాయిలో ఈ సినిమాకు అవార్డు లభించింది. ఈ ఏడాది 'అర్జున్ రెడ్డి'గా వచ్చి ఇండస్ట్రీ దృష్టిని తనవైపు తిప్పుకున్నారు. వివాదాల మధ్యలో ఈ సినిమా విడుదలైనా పెద్ద విజయాన్ని సాధించింది. రాత్రికి రాత్రి విజయ్ సూపర్‌స్టార్‌గా ఎదిగాడు. తన వయసుకు తగ్గ కథ, ఆ పాత్రలో తను లీనమైన తీరు, నటనలో పరిణతి ఈ సినిమాను మరోమెట్టు ఎక్కించాయి. విజయ్ తప్ప ఇంకెవరూ ఆ పాత్రకు న్యాయం చేయలేరన్నంతగా నటించారు. జూనియర్ ఎన్టీఆర్ తనకు ఏ పాత్ర ఇచ్చినా అవలీలగా చేయగలిగే ఎన్టీఆర్.. ఈ ఏడాది త్రిపాత్రాభినయంతో అదరగొట్టారు. వరుస హిట్స్‌తో దూసుకుపోతున్న ఆయన ఈ ఏడాది 'జైలవకుశ'గా మన ముందుకు వచ్చారు. ప్రతినాయకుడి ఛాయలున్న 'జై' పాత్రతో ఎన్టీఆర్ తన నటవిశ్వరూపాన్ని చూపారు. మహేశ్‌బాబు తమిళ డైరెక్టర్ మురుగదాస్, మహేశ్ బాబు కలయికలో భారీ అంచనాలతో వచ్చిన సినిమా స్పైడర్.. తమిళ, తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. మహేశ్ నటనకు విశ్లేషకుల ప్రశంసలు దక్కాయి. శ్రీమంతుడు లాంటి భారీ హిట్ ఇచ్చిన డైరెక్టర్ కొరటాల శివతో 'భరత్ అను నేను' సినిమాను మహేశ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది ఎలాగైనా సూపర్‌హిట్ కొట్టాలనే కసితో ప్రిన్స్ ఉన్నాడని ఈ చిత్రం విశేషాలను బట్టి తెలుస్తోంది. నాని టాలీవుడ్లో అదృష్టం ఎవరికైనా ఉందంటే అది నానికే. ఈ ఏడాది విడుదలైన మూడు సినిమాలు విజయవంతమయ్యాయి. నేను లోకల్, నిన్ను కోరి, ఎంసీఏ ఇలా వరుస హిట్స్‌తో నాని అదరగొట్టారు. నటన విషయంలో నాని ఒక్కో సినిమాకి ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు. టాలీవుడ్లో తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు. నాచురల్ స్టార్‌గా తన సహజమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. శర్వానంద్ టాలీవుడ్లో యువ హీరోల హవా కొనసాగుతోంది. ఈ ఏడాది యువ హీరోలందరూ విజయాలతో దూసుకెళ్లారు. శతమానం భవతి, రాధ, మహానుభావుడు వంటి మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు శర్వానంద్. శతమానం భవతి సినిమాకి జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. రాధ పర్వాలేదనిపించినా.. మహానుభావుడుతో హిట్ కొట్టారు. అతి శుభ్రం అనే వ్యాధితో బాధపడే వ్యక్తి పాత్రలో శర్వానంద్ నటించి మెప్పించారు. మారుతి తనదైన శైలిలో వినోదాత్మకంగా సినిమాను రూపొందించారు. అల్లు అర్జున్ మెగా కార్డ్‌తో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నారు. వరుస హిట్స్‌తో రాకెట్లా దూసుకుపోతున్నారు. రేసుగుర్రం, సన్ ఆఫ్ సత్యమూర్తి, సరైనోడు లాంటి హిట్లతో ఉన్న అల్లు అర్జున్ ఈ సంవత్సరం 'డీజే దువ్వాడ జగన్నాథం'గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హరీశ్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా విజయవంతమైంది. అదే ఊపులో కథా రచయిత వక్కంతం వంశీని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా' సినిమాలో అల్లుఅర్జున్ నటిస్తున్నారు. -
సీఎన్ఎన్ హీరోల రేసులో ఇండో అమెరికన్లు
వాషింగ్టన్ : అమెరికాలో సేవలు అందించిన వారికి ఇచ్చే సీఎన్ఎన్ హీరోస్ అవార్డు-2017 రేసులో ఇద్దరు ఇండో-అమెరికన్లు నిలిచారు. పీటర్స్బర్గ్కు చెందిన సమీర్ లఖానీ, టెక్సాస్‌కు చెందిన మోనా పటేల్ సీఎన్ఎన్ హీరోస్ టాప్ టెన్ జాబితాలో నిలిచారు. స్టార్ హోటల్స్ నుంచి సేకరించిన సబ్బులను రీ సైకిల్ చేసి.. వాటిని కాంబోడియాలోని పేదప్రజలకు అందిస్తున్నారు. లఖానీ 2004 నుంచి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సర్ఫ్‌ను నీటిలో కలిపి.. దానితో చిన్నారులకు స్నానం చేయించే సన్నివేశం నా జీవితాన్ని మార్చిందని లఖాని చెబుతున్నారు. ఇప్పటి వరకూ లఖానీ 6 లక్షల 50 వేలమందికి లఖానీ సహాయం చేసినట్లు సీఎన్ఎన్ వర్గాలు చెబుతున్నాయి. మోనా పటేల్ శాన్ అంటోనియో ఫౌండేషన్ నుంచి అంగవైకల్యంతో జన్మించిన పేద ప్రజలకు సహాయం అందిస్తున్నారు. వైకల్యం కలిగిన అవయవాలు అందించడంతో పాటు, చదువు చెప్పిస్తున్నారు. అంతేకాక వారికి ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారు. ప్రతి నెల 30 నుంచి 60 మందికి వైకల్యం కలిగిన అవయవాలను మోనా పటేల్ అందిస్తుండడం విశేషం. ఇంత చేస్తున్న మోనా వయసు కేవలం 17 ఏళ్లు కావడం విశేషం. -
వచ్చే తెలుగు సంవత్సరం పండుగలివే
మార్చి 18న ఉగాది.. అక్టోబర్ 18న విజయదశమి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని సిద్ధాంతులు, జ్యోతిష్యులు, పంచాగకర్తలు వచ్చే తెలుగు ఏడాది (విళంబినామ సంవత్సరం) పండు గలపై స్పష్టతనిచ్చారు. చైత్ర మాసం నుంచి ఫాల్గుణ మాసం వరకు వచ్చే పండుగల వివరాలను వెల్లడించారు. పండుగల నిర్వహణ తేదీలపై ఏటా తలెత్తుతున్న వివాదాలను పరిష్కరించేందుకుగాను ఈ ప్రయత్నం చేశారు. రెండ్రోజులపాటు హైదరాబాద్‌లో జరిగిన విద్వత్ సభ నిర్ణయా లను సభ నిర్వాహకులు ఎం.వెంకటరమణ శర్మ, దివ్యజ్ఞాన సిద్ధాంతి, గాయత్రి తత్వా నంద రుషి, యాయవరం చంద్రశేఖర శర్మ తదితరులు సోమవారం సీఎం కేసీఆర్‌ను కలసి తెలిపారు. పండుగల తేదీలకు సంబంధించిన వివరాలు అందించారు. విళంబినామ సంవత్సరంలో ముఖ్య పండుగలు 2018 మార్చి 18: ఉగాది; మార్చి 25: స్మార్తానాం శ్రీరామనవమి; మార్చి 26: వైష్ణవానాం శ్రీరామనవమి; ఏప్రిల్ 14: మాస శివరాత్రి; ఏప్రిల్ 18: అక్షయ తృతీయ; మే 10: శ్రీ హనుమాన్ జయంతి; జులై 27, వ్యాస పూర్ణిమ, గురు పూర్ణిమ; జులై 29: సికింద్రాబాద్ మహంకాళి జాతర ఆగస్టు 24: వరలక్ష్మీ వ్రతం; ఆగస్టు 26: రాఖీ పూర్ణిమ; సెప్టెంబర్ 2: స్మార్తానాం శ్రీ కృష్ణాష్టమి; సెప్టెంబర్ 3: శ్రీ వైష్ణవానాం శ్రీ కృష్ణాష్టమి ; సెప్టెంబర్ 13: వినాయక చవితి; అక్టోబర్ 17: దుర్గాష్టమి; అక్టోబర్ 18: విజయదశమి; నవంబర్ 6: దీపావళి; నవంబర్ 23: కార్తీక పూర్ణమి; 2019 జనవరి 14: భోగి; జనవరి 15: సంక్రాంతి; జనవరి 16: కనుమ; ఫిబ్రవరి 12: రథ సప్తమి; మార్చి 4: మహా శివరాత్రి; మార్చి 19: కామదహనం (దక్షిణాది వారికి); మార్చి 20: కామదహనం (ఉత్తరాది వారికి); మార్చి 21: హోళి. -
‘నన్నయ’ డిగ్రీ ఫైనలియర్ ఫలితాలు విడుదల
-53.59 శాతం ఉత్తీర్ణత రాజానగరం : ఆదికవి నన్నయ యూనివర్సిటీ డిగ్రీ ఫైనలియర్ ఫలితాలను ఉపకులపతి ఆచార్య ఎం. \ముత్యాలునాయుడు బుధవారం విడుదల చేశారు. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలోని కళాశాలల నుంచి 20,397 మంది విద్యార్థులు పరీక్షలకు హజరుకాగా, వారిలో 10,930 మంది ఉత్తీర్ణులయ్యారు. 53.59 శాతం ఉత్తీర్ణత నమోదైంది. గత ఏడాది సాధించిన 48.64 శాతం ఉత్తీర్ణత కంటే అధికంగా ఫలితాలను సాధించడానికి కారకులైన విద్యార్థులను, అధ్యాపక బృందాన్ని వీసీ అభినందించారు. సమాజానికి ఉత్తమ విద్యార్థులను అందించడమే లక్ష్యంగా తమ యూనివర్సిటీ ముందంజ వేస్తుందన్నారు. మొదటి మూడు స్థానాలు పొందిన విద్యార్థులు : సబ్జెక్టుల వారీగా మొదటి మూడు స్థానాలను అందుకున్న విద్యార్థుల వివరాలను కూడా వీసీ ప్రకటించారు. బీఏ : నీలపు లీలాభవాని, బొచ్చ జానకి, యర్రా మంజుల. బీ ఏ (ఫిలాసఫీ) : పొలిశెట్టి బాలసంతోషి, మద్దాల రవి, సి.పౌలు, బీఎస్సీ : నంబూరి సాయినాగలక్ష్మిప్రసన్న, సూతపల్లి సాయిసుధ, ముత్యాల జయశ్రీ, బీఎస్సీ (హోమ్ సైన్స్) : చల్లా దుర్గాభవాని, అంకంరెడ్డి చంద్రిక, ఉండ్రాజవరపు ప్రియాంక. బీఎస్సీ (ఫుడ్‌టెక్నాలజీ): యు.పావని, కేఎస్ఎస్ హారిక, పరమట దుర్గాతేజస్వి బీకాం : నున్నా రత్నం శిరీషా, రాయి వాసవి, బలభద్రుని ప్రత్యూష. బీకాం (ఒకేషనల్) : సోమిశెట్టి నిఖిల, తణుకు కల్యాణì పద్మనాగరాణి, విద్యాల కృష్ణకుమారి. బీఏఏ : అడుసుమిల్లి మహేశ్వరి, ఏలిశెట్టి అఖిల, తమ్మన అజయ్‌కుమార్. బీవీఎం : మేడపాటి మౌనిక, రుషాలి జైన్, పుల్లేపు సౌజన్యకుమారి. -
సమ్మెటివ్ పోటు
వార్షిక పరీక్షల మూల్యాంకనంపై గందరగోళం ట్రిపుల్ఆర్ అమలుకు సమయమేది అసంబద్ధ విధానాలతో అస్తవ్యస్తం ఏలూరు సిటీ : సర్కారు బడుల్లో అమలు చేస్తున్న నూతన విధానాలు గందరగోళానికి గురి చేస్తున్నాయి. కొత్త ప్రణాళికలు పాఠశాలలో విద్యను అభివృద్ధి చేయడానికి బదులు నిర్వీర్యం చేస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో అమలు చేస్తున్న నిరంతర సమగ్ర మూల్యాంకన (సీసీఈ), సమ్మెటివ్3 (వార్షిక) పరీక్షలు కొత్త ఇబ్బందులు తెస్తున్నాయి. పబ్లిక్ పరీక్షల తరహాలో 6నుంచి 9వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న సమ్మెటివ్ పరీక్షలు వారి పాలిట సమ్మెట పోటులా మారాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మూల్యాంకన ఎలా.. ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ఏకరీతిలో అమలు నిర్వహిస్తున్న వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనపై గందరగోళం నెలకొంది. 8, 9వ తరగతుల విద్యార్థుల జవాబు పత్రాలను మండల కేంద్రాల్లో మూల్యాంకన చేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఒక్కో మండలం పరిధిలో సుమారు 5 వేల జవాబు పత్రాలు ఉంటాయి. వీటి మూల్యాంకన విధులకు 8 కిలోమీటర్ల దూరంలోని ఉపాధ్యాయులను నియమించాల్సి ఉంది. నిబంధనల మేరకు 8 కిలోమీటర్ల పైబడి దూరంలోని ఉపాధ్యాయులను మూల్యాంకన విధులకు వినియోగిస్తే వారికి టీఏ, డీఏ చెల్లించాలి. ఈ సొమ్ములు ఎలా ఇస్తారు, ఉపాధ్యాయుల నియామకాలు ఎలా చేపడతారనే దానిపై సందిగ్ధత నెలకొంది. త్రిపుల్ ఆర్ సాధ్యమా..! నిరంతర సమగ్ర మూల్యాంకన విధానంలో భాగంగా ఉన్నత పాఠశాలల్లో సమ్మెటివ్ పరీక్షలు నిర్వహించి, మూల్యాంకన చేసి విద్యార్థులను పై తరగతుల్లోకి పంపించి ఆ పాఠాలు బోధించాలని నూతన విద్యావిధానంలో పొందుపరిచారు. ప్రాథమిక పాఠశాలల్లో చదవటం, రాయటం, అర్థ గణితం (ట్రిపుల్ ఆర్) విధానాన్ని, ఉన్నత పాఠశాలల్లో ప్రతిక్రియాత్మక బోధన (రెమీడియల్ టీచింగ్) విధానాన్ని తెరపైకి తెచ్చారు. సమ్మెటివ్3 పరీక్షలు సోమవారంతో ముగిశాయి. మంగళవారం నుంచి పాఠశాలల్లో తరగతులు ప్రారంభం అవుతాయి. వేసవి సెలవులు ఇచ్చే వరకు 18 రోజులపాటు పాఠశాలలు పని చేస్తాయి. ఏప్రిల్ 3వ తేదీ నుంచి సబ్జెక్టు టీచర్లు 10వ తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన విధులకు వెళతారు. ఈలోగా సమ్మెటివ్3 పరీక్షలకు సంబంధించి 8, 9 తరగతుల జవాబు పత్రాల మూల్యాంకన విధులకు మరికొందరు ఉపాధ్యాయులు వెళ్తారు. ఏప్రిల్ 12 నుంచి ఓపెన్ స్కూల్స్ పరీక్షల విధులకు ఉపాధ్యాయులు ఇన్విజిలేటర్లుగా వెళతారు. దీనివల్లో ఉపాధ్యాయులు లేక పాఠశాలలన్నీ ఖాళీ అవుతాయి. ఈ పరిస్థితుల్లో ట్రిపుల్ ఆర్, రెమీడియల్ టీచింగ్ కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారో సందేహంగా మారింది. లోపభూయిష్ట విధానాలు ప్రభుత్వం అమలు సాధ్యం కాని.. లోపభూయిష్ట విధానాలతో ప్రభుత్వ విద్యను గందరగోళంలోకి నెడుతోంది. కొత్త విద్యా విధానంలో పిల్లలకు నాణ్యమైన విద్య అందే పరిస్థితులు కనిపించటం లేదు. ముందుగా పరీక్షలు నిర్వహించి, మళ్లీ తరగతులు పెట్టారు. ఉపాధ్యాయులను మూల్యాంకన విధుల్లోకి పంపితే పిల్లలకు చదువులు ఎవరు చెబుతారు. సమ్మెటివ్ పరీక్షల మూల్యాంకన వి«ధులకు హాజరైన 8 కిలోమీటర్లలోపు టీచర్లకు టీఏ, డీఏ ఇస్తారా. గుగ్గులోతు కృష్ణ, ఏపీటీఎఫ్1938 జిల్లా ప్రధాన కార్యదర్శి -
భారీగా పడిపోతున్న టెకీ నియామకాలు
సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఈ ఏడాది 6,000 ఉద్యోగాలకు కోత పెట్టనుందన్న వార్త టెకీ ప్రపంచంలో ఆందోళన రేకెత్తించింది. అయితే మిగిలిన టెక్నాలజీసంస్థలు కూడా ఇదే బాటలో పయనించే అవకాశం ఉందని నిపుణులు లు భావిస్తున్నారు. ఒకవైపు ఉన్న ఉద్యోగులకు ఉద్వాసనతో పాటు, కొత్త నియమాకలు కూడా భారీగా పడిపోవడం పరిశ్రమ ఎదుర్కొంటున్న ఒడిదుడుకులకు నిదర్శనమంటున్నారు. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పెరుగుతున్నా గత మూడేళ్లుగా టెకీ నియామకాలు తగ్గుముఖ్యం పట్టాయని స్టాఫింగ్ ఏజెన్సీ టీమ్ లీజ్, సహ-స్థాపకులు, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, రీతూపర్ణ చక్రవర్తి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఐటీ పరిశ్రమలో డిమాండ్-సప్లయ్ వ్యత్యాసం బాగా ఉందని మరికొన్ని ఐటీ సంస్థలు మధ్య స్థాయి ఉద్యోగులకు ఉద్వాసన పలికి, ఫ్రెషర్స్‌కు లేటెస్ట్ టెక్నాలజీలపై శిక్షణ ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నాయన్నారు. క్యాంపస్ రిక్రూట్మెంట్లు కనీసం 40శాతం పడిపోయాయని ఐటి ప్రత్యేక నియామక ఏజెన్సీ హెడ్ హంటర్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ , ఛైర్మన్ క్రిస్ లక్ష్మీకాంత్ తెలిపారు. అయితే ఐటీ, ఐటీయేతర రంగంలో మొత్తం ఉద్యోగాల కల్పనలో 5 శాతం వృద్ధి సాధించినట్టు నాస్స్కాం గతనెలలో చెప్పింది. అలాగే దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ ఈ ఏడాది మొదటి తొమ్మిదినెలల కాలంలో కేవలం 5వేల మంది ఉద్యోగులను నియమించుకున్నట్టు థర్డ్క్వార్టర్ ఫలితాల సందర్భంగా ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంలోఈ సంఖ్య 17 వేలుగా ఉన్నట్టు తెలిపింది. కాగా డిజిటల్ సర్వీసులవైపు టెక్నాలజీలు వేగంగా మారుతుండటం.. హెచ్1బీ వీసా నిబంధనలు కఠినతరం, రూపాయి మారకపు విలువ పుంజుకోవడం వంటి అంశాలు కంపెనీ పనితీరుపై ప్రభావాన్ని చూపనున్నాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. కొత్త డిజిటల్ సర్వీసులోకి మరలే క్రమంలో ఐటీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సంక్షోభంతో కంపెనీలు ఉద్యోగులకు గుడ్ బై చెబుతున్న విషయం తెలిసిందే. -
ఎర్రచందనం కేసులో జైలు శిక్ష
రైల్వేకోడూరు: ఎర్రచందనం అక్రమ రవాణా కేసుకు సంబంధించి తుపాకుల సిద్దయ్య అనే వ్యక్తికి ఏడాది జైలుశిక్ష, రూ.10 వేలు జరిమానా విధించినట్లు సబ్ డీఎఫ్ఓ వెంకటేష్, కోడూరు ఎఫ్ఆర్ఓ నయీం అలీ తెలిపారు. శనివారం వారు మాట్లాడుతూ 2012 సంవత్సరంలో ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో పట్టుబడిన మండలంలోని కన్నెగుంట ఎస్టీ కాలనీకి చెందిన సిద్దయ్యకు ఈమేరకు శిక్ష విధించారన్నారు. -
నిరుద్యోగులకు శుభవార్త..లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: నిరుద్యోగులకు శుభవార్త. ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి నిజంగా ఇది తీపి కబురు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో త్వరలోనే భారీ సంఖ్యలో కొలువుల జాతరకు తెరలేవనుంది. 2018 మార్చి నాటికి 2.84 లక్షల మందికి కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్యంగా పోలీసు ,ఐటీ, కస్టమ్స్ శాఖకు ఈ నియామకాల్లో సింహభాగం దక్కనుంది. సుమారు 2.80 లక్షల మంది అదనపు సిబ్బంది భర్తీకి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను కేటాయించనుంది. వీరిలో పోలీసు, ఆదాయం పన్ను, కస్టమ్స్ మరియు కేంద్ర ఎక్సైజ్ విభాగాల్లో 1.80 లక్షల మందిని నియామకాలను చేపట్టనుంది. కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్లో ప్రకటించిన మేరకు ఈ నియామకాలు చోటుచేసుకోనున్నాయి. పాలనను మరింత సరళతరం చేయడంతో పాటు.. ప్రభుత్వ సేవలను పౌరుల కేంద్రంగా మార్చాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో పలు శాఖల్లో ప్రస్తుతం ఉన్న వారికి రెట్టింపు చేసే యోచనలో ఉందిట. దీంతోపాటు హోం, మైన్స్, విదేశీ వ్యవహారాలు, స్పేస్, తపాలా, స్కిల్ డెవల్‌పమెంట్ తదితర శాఖల్లోనూ భారీగా నియామకాలు చేపట్టనున్నారట. ఈ అదనపు కొలువులతో ప్రజలకు సేవలు మరింత విస్తరించాలని కేంద్రం భావిస్తోంది.. దీంతో 2018కల్లా 2.84 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది. దశలవారీ గా నోటిఫికేషన్లను జారీ చేసి, ఈ నియామకాలను చేపట్టే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా మార్చి 2016 నాటికి, రైల్వేల్లో 13.31 లక్షల ఉద్యోగులతో సహా కేంద్ర ప్రభుత్వ 55 విభాగాలు, మంత్రిత్వశాఖల్లో 32.84 లక్షల సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ నియామకాల లక్ష్యం నెరవేరితే, మార్చి 2018 నాటికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 35.67లక్షలకు పెరగనుంది. -
ఇదేం విధానం?
ఏప్రిల్ 23తో ముగిసే విద్యా సంవత్సరం మార్చి 20తోనే ముగియనుంది... జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం మార్చి 21 నుంచే ఆరంభం పాఠశాలలు తెరిచేనాటికి పుస్తకాలు అందిచగలరా..? ఏ పుస్తకం లేకుండానే తరగతులు నిర్వహించాలా...? ఇదేం నిర్ణయమంటూ మండిపడుతున్న ఉపాధ్యాయ సంఘాలు రామచంద్రపురం రూరల్ : ప్రతి ఏడాది ఏప్రిల్ 23వ తేదీతో ముగిసే విద్యా సంవత్సరం ఈసారి మార్చి 20తో ముగియనుంది. అలాగే జూన్ 12 నుంచి ప్రారంభమయ్యే విద్యా సంవత్సరం మార్చి 21వ తేదీ నుంచే మొదలు కానుంది. ఏటా ఏప్రిల్ 23 వరకూ వార్షిక పరీక్షలు నిర్వహించి 24వ తేదీ నుంచి వేసవి సెలవులు ఇచ్చేవారు. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యేవి. అయితే ఈ ఏడాది పద్ధతి మార్చారు. సెలవుల్లో మార్పు ఉండదు కానీ వార్షిక పరీక్షలు మాత్రం ముందుగానే నిర్వహిస్తారు. అవి ముగియగానే వెంటనే కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. ఆ తరువాత నెల రోజులకు వేసవి సెలవులు ఇస్తారు. ఈ క్రమంలో ప్రభుత్వం 1– 9వ తరగతుల వార్షిక పరీక్షలు (సమ్మేటివ్–3) షెడ్యూల్లో మార్పులు చేసింది. ఆ ప్రకారం ఉన్నత పాఠశాలల విద్యార్థులకు మార్చి 6న ప్రారంభమై 20న ముగుస్తాయి. ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు మార్చి 15న ప్రారంభమై 18న ముగుస్తాయి. ఆ మేరకు షెడ్యూలు, టైంటేబుల్ జిల్లా విద్యాశాఖకు చేరింది. ఇక్కడి నుంచి అన్ని యాజమాన్యాల పాఠశాలలకు చేరవేశారు. ఈ నిర్ణయంపై తలలు పట్టుకుంటున్న ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తప్పనిసరి పరిస్థితుల్లో తమ పిల్లలను ముందస్తు పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నారు. సిలబస్ సంగతేంటి... 6–10 తరగతులకు నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) విధానం ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభమైంది. ఈ విధానం ఉపాధ్యాయులకు అర్థమయ్యేందుకే బాగా సమయం పట్టింది. విద్యార్థులు ఇంకా ఓనమాలు నేర్చుకుంటున్నారు. మరీ ముఖ్యంగా ప్రాజెక్టు పనులకు ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. అయితే ప్రైవేట్ యాజమాన్యాలు ఈ విషయంలో కాస్త ముందున్నారు. వారు ఇప్పటికే అన్ని తరగతులకు దాదాపు సిలబస్ పూర్తి చేసి వార్షిక పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చాలా వరకు సిలబస్ ఇంకా 30 శాతంపైనే పెండింగ్ ఉంది. ఈ పరిస్థితుల్లో దాదాపు నెల రోజుల ముందు పరీక్షలు పెట్టడం తమకు ఇబ్బందికరమేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ ఏడాది ప్రకటించి వచ్చే ఏడాది నుంచి అమలు చేసి ఉంటే బాగుండేదంటున్నారు. పుస్తకాలు ఎలా? మార్చి 21 నుంచి విద్యాసంవత్సరం ప్రారంభమైతే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు ఎలా అందుతాయన్న సందేహం తలెత్తుతోంది. పోనీ పుస్తకాలు లేకుండా కేవలం తరగతులతో ఎలాగోలా కాలక్షేపం చేద్దామంటే విద్యార్థులు తీవ్ర ఎండల్లో ఏ మేరకు పాఠశాలలకు వస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
‘పది’లో తృతీయం
ఇంటర్మీడియట్లో 8వ స్థానం వివిధ ‘సెట్ల’లో ‘తూర్పు’ మెరుపులు ∙ ఎట్టకేలకు డీఎస్సీ–2014 నియామకాలు రాయవరం : జిల్లా విద్యార్థులు 2016లో ఉత్తమ ఫలితాలు సాధించారు. పదో తరగతి పరీక్షల్లో జిల్లా మూడవ స్థానంలో నిలిచింది. ఎంసెట్‌తో పాటు వివిధ సెట్లలోనూ జిల్లా విద్యార్థులు విజయఢంకా మోగించారు. సర్కారు బడుల్లోని విద్యార్థులు కూడా అత్యుత్తమ ఫలితాలు సాధించి కార్పొరేట్ బడులకు తీసిపోమని చాటారు. ఈ ఏడాది పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకున్నా..ఉపాధ్యాయులు సీపీఎస్ విధానం రద్దు చేయాలంటూ ఆందోళన బాట పట్టారు. ‘పది’లో ప్రైవేటుకు దీటుగా.. పదవ తరగతి పబ్లిక్ పరీక్ష ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రైవేటుకు దీటుగా రాణించారు. రాష్ట్రంలో జిల్లా తృతీయస్థానంలో నిలిచింది. 2015–16 విద్యా సంవత్సరంలో 67,493 మంది పరీక్షలకు హాజరు కాగా 65,850 మంది పాస్ కాగా 97.57 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 33,438 మంది బాలురు పరీక్షలకు హాజరు కాగా 32,637 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికల విభాగంలో 34,055 మంది హాజరు కాగా 33,123 మంది ఉతీర్ణత సాధించారు. ఎంసెట్‌లో రెండో ర్యాంకు ఈ ఏడాది మే 10న విడుదలైన ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాల్లో జిల్లా విద్యార్థి రాష్ట్రంలో రెండవ స్థానం పొందాడు. రావులపాలెంకు చెందిన చప్పిడి లక్షీ్మనారాయణ 157 మార్కులు సాధించి రాష్ట్రంలో 2వ ర్యాంకు పొందాడు. కాకినాడకు చెందిన బొద్దిరెడ్డి సూర్యగోపాల్ 152 మార్కులతో 20వ ర్యాంకు సాధించగా, కాకినాడకు చెందిన పి.వి.సత్యశ్రావ్య 147 మార్కులతో 47వ ర్యాంకు సాధించారు. అలాగే పదుల సంఖ్యలో విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులతో మెరిశారు. ఇంజనీరింగ్ విభాగంలో 16,535 మంది పరీక్షకు హాజరు కాగా 11,067 మంది ఉత్తీర్ణులయ్యారు. మెడిసి¯ŒSలో బాలికల విభాగంలో 3,741 మంది పరీక్ష రాయగా 3,076 మంది, బాలుర విభాగంలో 1,507 మంది పరీక్ష రాయగా, 1,146 మంది ఉత్తీర్ణత సాధించారు. జిల్లాకు చెందిన బండి సుబ్రహ్మణ్య సుధీర్ 148 మార్కులతో 19వ ర్యాంకు, కె.ప్రత్యూష 23వ ర్యాంకు సాధించగా పలువురు విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు పొందారు. ఐసెట్లోనూ.. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఇంటిగ్రేటెడ్ కామ¯ŒS ఎంట్ర¯Œ్స టెస్ట్(ఐసెట్–2016)లోనూ జిల్లా విద్యార్థులు మెరిశారు. రాష్ట్రంలోనే మొదటి ర్యాంకు జిల్లా సొంతమైంది. మొదటి ఐదు ర్యాంకర్లలో ముగ్గురు జిల్లాకు చెందిన వారు ఉండడం విశేషం. ధవళేశ్వరానికి చెందిన శీని జ్ఞానరామ్ప్రసాద్ 1వ ర్యాంకు సాధించగా, చందుపల్లి సుదీప్ 4వ ర్యాంకు, గంధం భార్గవి 5వ ర్యాంకు కైవసం చేసుకున్నారు. సివిల్స్‌లోనూ మెరిసిన జిల్లా వాసులు.. సివిల్స్‌లోనూ జిల్లా వాసులు మెరిశారు. మలికిపురం మండలం గూడవల్లికి చెందిన కట్టా సింహాచలం పట్టుదల ముందు పుట్టు అంధత్వం తలవంచింది. సింహాచలం సివిల్స్ పరీక్షలో 538వ ర్యాంకు సాధించాడు. అలాగే ధవళేశ్వరానికి చెందిన బండారు బాలుమహేంద్ర సివిల్స్ పరీక్షల్లో 730వ ర్యాంకు సాధించాడు. ఆసెట్లోను.. ఆంధ్రా విశ్వవిద్యాలయం పీజీలో ప్రవేశానికి నిర్వహించిన ప్రవేశ పరీక్షలో జిల్లా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. రాయవరం మండలం పసలపూడికి చెందిన తాడి సుస్మిత రసాయనశాస్త్రంలో యూనివర్సిటీ పరిధిలో మూడవ ర్యాంకు సాధించింది. అలాగే పలువురు విద్యార్థులు ఆసెట్లో వివిధ విభాగాల్లో ఉత్తమ ర్యాంకులు పొందారు. ఉపాధ్యాయుల ఉద్యమబాట.. ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ల సాధనకు ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఉద్యమబాట పట్టారు. రోజురోజుకూ విద్యారంగంలో కొత్త పథకాలు, కార్యక్రమాల పేరుతో ఉపాధ్యాయులను మానసికంగా వేధింపులకు గురిచేసేలా ఉంటున్న చర్యలను వ్యతిరేకించారు. ముఖ్యంగా ఈ ఏడాది కంట్రిబ్యూటరీ పెన్ష¯ŒS స్కీమ్(సీపీఎస్)కు వ్యతిరేకంగా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టారు. కొత్తగా సీపీఎస్ జిల్లా, రాష్ట్ర కమిటీలు ఏర్పడ్డాయి. డీఎస్సీ–2014 నియామకాలను ఎట్టకేలకు జూ¯ŒS నెలలో చేపట్టారు. తీవ్ర జాప్యం అనంతరం ఈ నియామకం ఉపాధ్యాయ అభ్యర్థులకు ఊరటనిచ్చిందని చెప్పవచ్చు. ఎస్జీటీలో 952 మంది ఎంపికయ్యారు. ఇంటర్లో 8వ స్థానం ఈ విద్యా సంవత్సరంలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు ఒకేరోజు ప్రకటించారు. జిల్లాలో 37,525 మంది సీనియర్ ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయగా 25,653 మంది ఉత్తీర్ణులయ్యారు. 68 శాతం ఉత్తీర్ణతతో జిల్లా 8వ స్థానంతో సరిపెట్టుకుంది. ఫస్టియర్ పరీక్షలు 42,435 మంది రాయగా, 27,186 మంది ఉత్తీర్ణులయ్యారు. 64శాతం ఉత్తీర్ణతతో ఫస్టియర్ ఫలితాల్లో రాష్ట్రంలో ఐదవ స్థానంలో నిలిచింది. ఇంటర్ వృత్తివిద్య(ఒకేషనల్) కోర్సుల ఫలితాలు మాత్రం తీవ్ర నిరాశపర్చాయి. -
మూడువేలకుపైగా అసోసియేట్స్ కావాలట!
ముంబై: ప్రముఖ టెక్నాలజీ సేవల సంస్థ రాబర్ట్ బోష్ దేశవ్యాప్తంగా భారీసంఖ్యలో అసోసియేట్స్‌ను నియమించుకోనున్నట్టు ప్రకటించింది. ప్రస్తుత సంవత్సరంలో 3,200 మందిని తీసుకోవాలని నిర్ణయించినట్టు సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. బెంగళూరు, కోయంబత్తూరులోని ఆర్ అండ్ డి సెంటర్స్ కోసం సమర్ధత, డాటా ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ రంగాల్లో అనుభవం ఉన్న అభ్యర్థుల కావాలని ప్రకటించింది. రాబర్ట్ బోష్ ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ సొల్యూషన్స్ నిర్వహించిన శుక్రవారం నిర్వహించిన ఒక కార్యక్రమంలో కంపెనీ ఎండీ విజయ్ రత్నపార్ఖే ఈ విషయాన్ని మీడియాకు వివరించారు. బెంగళూరు, బెంగళూరుకు చెందిన 1920మందిని నియమించుకున్నా మన్నారు. మిగిలిన రిక్రూట్మెంట్స్ కోయంబత్తూరు తదితర ప్రదేశాలనుంచి పూర్తి చేయనున్నట్టు తెలిపారు. గత ఆరేళ్లుగా పదివేలమందిని తమ సంస్థలో చేర్చుకున్నామన్నారు. మొత్త ఉద్యోగుల సంఖ్య 18 వేలని వెల్లడించారు. కాగా ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల బోష్ గ్రూపునుకు ఆర్ అండ్ డి సంస్థ రాబర్ట్ బోష్ ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ సొల్యూషన్స్. -
ఉచిత ఇంటర్నెట్తో 4జీ స్మార్ట్‌ఫోన్ రూ.3వేలు
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో ప్రభావం సృష్టించిన సంచలనం పలు ఆఫర్లకు ఆవిష్కరణలకు నాంది పలుకుతోంది. తాజాగా మొబైల్ మేకర్ డాటా విండ్ వివిధ వేరియంట్లలో ఎంట్రీలెవల్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. దీంతోపాటు ఈ మొబైల్స్ లో సంవత్సరం పాటు ఉచిత ఇంటర్ నెట్ ను కూడా అఫర్ చేస్తోంది. ఎంట్రీ లెవల్ రూ.3000 ధర లో 4 జీ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది డాటా విండ్ . వచ్చే నెల దీపావళికి ముందే వీటిని ప్రారంభించబోతోంది. 1జీబీ, 2జీబీ, 3జీబీ ర్యామ్, 8జీబీ, 16జీబీ , 32జీబీ ఇంటర్నెల్ మొమరీతో వీటిని అందుబాటులోకి తెస్తున్నట్టు కంపెనీ వెల్లడించింది. అలాగే మేటి స్మార్ట్ఫోన్లలో ఉండే దాదాపు అన్ని సుగుణాల మేళవింపుగా తమ స్మార్ట్ ఫోన్లు యూజర్లను అలరించనున్నాయని పేర్కొంది. మరోవైపు రూ.5 వేల ధర పలికే దేశీయ టాబ్లెట్ మార్కెట్ లో 76 శాతం వాటాను కలిగి ఉన్నట్టు కంపెనీ చెబుతోంది. కాగా అమృత్ సర్, హైదరాబాద్ లలో డాటా విండ్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి ప్రస్తుతం మార్కెట్లో రూ.1500ల నుంచి డాటా విండ్ స్మార్ట్ఫోన్లు లభిస్తున్నాయి. ఇటీవలే మార్కెట్లోకి కొత్తగా అడుగుపెట్టిన ఈ సంస్థ ఇప్పటికే రూ.2999కే 4జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. -
ఏడాదిగా ఎదురుచూపులు
ఏలూరు (సెంట్రల్): లిబియా దేశంలో ఉగ్రవాదుల చెరలో ఏడాది కాలంగా బందీగా ఉన్న ఏలూరు దొండపాడుకు చెందిన డాక్టర్ కొసనం రామ్మూర్తి రాక కోసం కుటుంబసభ్యులు కొండంత ఆశతో ఎదురుచూస్తున్నారు. మూడు రోజులు క్రితం భారత ప్రభుత్వ ప్రయత్నాలతో ఇద్దరు ప్రొఫెసర్లు విడుదల కావడంతో రామ్మూర్తి కుటుంబసభ్యుల్లో ఆశలు చిగురించాయి. ఏలూరు రూరల్ మండలం దొండపాడులో నివాసం ఉండే రామ్మూర్తి 17 ఏళ్లుగా లిబియాలోని సిరిట్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్‌లో ఆయన ఉగ్రవాదుల చెరలో చిక్కుకున్నారు. అప్పటి నుంచి పలు ప్రయత్నాలు చేస్తున్నా ఆయన విడుదల కాలేదు. ఈ క్రమంలో ఉగ్రవాదుల బందీ నుంచి ఇటీవల ఇద్దరు విడుదల కావడంతో రామ్మూర్తి భార్య అన్నపూర్ణభవానీ, కుమారుడు, ఇద్దరు కుమారైలు ఆయన రాకకోసం ఎదురుచేస్తున్నారు. రామ్మూర్తి విడుదలైయ్యే విధంగా ప్రభుత్వం మరింత శ్రద్ధ తీసుకోవాలని ఆయన కుటుంబసభ్యులు కోరుతున్నారు. -
ఉద్యోగం పేరుతో మోసగించిన ఇద్దరికి జైలు
ఏలూరు అర్బన్ : ఉద్యోగం ఇప్పిస్తానని ఓ యువకుడిని మోసగించిన కే సులో నేరం రుజువు కావడంతో ఇద్దరు నిందితులకు న్యాయస్థానం ఏడాది చొప్పున జైలు శిక్ష విధించింది. స్థానిక ఇశ్రాయేలు పేటకు చెందిన పులిపాక రవీంద్ర, హైదరాబాద్‌కు చెందిన ఆది విజయలక్ష్మి నగరానికి చెందిన యువకుడు తొమ్మండ్రు రత్నబాబును ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి 2011లో రూ.95వేలు తీసుకున్నారు. తరువాత ముఖం చాటేశారు. దీంతో బాధితుడు స్థానిక టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నాటి ఎస్సై, ఎస్.సి.హెచ్.కొండలరావు కేసు నమోదు చేసి కోర్టుకు పంపారు. అనంతరం ఇరుపక్షాల వాదనలు విన్న ఏలూరు స్పెషల్ మొబైల్ కోర్టు మేజిస్ట్రేట్, షేక్ అబ్దుల్ షరీఫ్ నిందితులు నేరం చేశారని నిర్ధారించారు. ఒక్కొక్కరికి ఏడాదిపాటు జైలు శిక్షతో పాటు నగదు జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు చెప్పారు. ఈ విషయాన్ని టూటౌన్ పోలీసులు తెలిపారు. -
పరిహాసం
– ఏడాది అవుతున్నా పూర్తికాని ఇన్‌పుట్‌సబ్సిడీ పంపిణీ – రూ.559.68 కోట్లలో రైతుల ఖాతాల్లోకి చేరింది రూ.484 కోట్లు మాత్రమే – కాళ్లరిగేలా తిరుగుతున్న రైతులు ఇన్పుట్ సబ్సిడీ పంపిణీ ప్రహసనంగా మారింది. అసలే అప్పుల ఊబిలో కూరుకుపోయిన ‘అనంత’ రైతులను అధికారులు కూడా ఇబ్బందులు పెడుతున్నారు. వారికి చెందాల్సిన పరిహారాన్ని సకాలంలో ఇవ్వడం లేదు. ఆధార్, ఆన్లైన్, మిస్‌మ్యాచింగ్, మరో జాబితా అంటూ తిప్పుకుంటున్నారు. పరిహారం కోసం ఏడాదిగా అన్నదాతలు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీకావు. అనంతపురం అగ్రికల్చర్ : ఖరీఫ్–2014లో దెబ్బతిన్న వేరుశనగ, ఇతర పంటలకు రాష్ట్ర ప్రభుత్వం ఇన్‌పుట్‌సబ్సిడీ ప్రకటించింది. మొదట్లో రూ.5,79,640 మంది రైతులకు రూ.567.32 కోట్లు మంజూరు చేసింది. అయితే.. కొన్ని నకిలీ పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్నట్లు తేలడంతో పరిశీలన తర్వాత 5,72,111 మందికి రూ.559.68 కోట్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. 2015 జూలై 22న ఈ మొత్తాన్ని జిల్లాకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏడు సార్లు పరిహారాన్ని విడుదల చేస్తూ వచ్చింది. అయితే.. ఇప్పటికీ పూర్తిగా పంపిణీ చేయలేదు. ఇచ్చే రూ.5 వేలు.. రూ.10 వేలు.. లేదంటే రూ.15 వేల పరిహారం కోసం రైతులు ఏడాదిగా కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఇప్పటికే వ్యయప్రయాసలకోర్చి 20–30 సార్లు మండల గ్రీవెన్స్‌లు, ఏవోలు, జిల్లా గ్రీవెన్స్, జేడీఏ కార్యాలయం, బ్యాంకర్ల చుట్టూ తిరిగారు. జాబితాలు తప్పుల తడక ఇన్‌పుట్‌సబ్సిడీ జాబితాల తయారీ, పరిహారం పంపిణీ పెద్ద ప్రహసనంగా మారింది. జాబితాల తయారీలోనే రెవెన్యూ, వ్యవసాయశాఖ సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఈ కారణంగా రైతులకు సకాలంలో పరిహారం అందలేదు. కొన్నిచోట్ల అర్హులైన రైతులను అసలు జాబితాలోనే చేర్చలేదు. తెలుగు తమ్ముళ్ల జోక్యం ఎక్కువ కావడంతో అర్హులైన రైతులకు అన్యాయం జరుగుతోంది. అధికారులతో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకుని ప్రభుత్వం నుంచి వచ్చే అరకొర రాయితీలు, పథకాలను ‘తమ్ముళ్లు’ కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలోనే ఇన్పుట్సబ్సిడీలోనూ మాయాజాలం ప్రదర్శించినట్లు జాబితాలు చూస్తే స్పష్టమవుతోంది. ఇంకా రూ.75 కోట్లు పంపిణీ చేయాలి: కేటాయించిన రూ.559.68 కోట్లలో ఇప్పటివరకు 484 కోట్లు మాత్రమే రైతుల ఖాతాల్లోకి జమ అయింది. ఇంకా రూ.75 కోట్లకు పైగా పంపిణీ చేయాల్సివున్నా.. ఆధార్ లింక్ పెట్టి పెద్దఎత్తున రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. చివరకు రూ.506 కోట్లు పంపిణీ చేసి ఫుల్స్టాప్ పెట్టాలని నిర్ణయించారు. మిగతా రూ.53 కోట్లు ప్రభుత్వ ఖాజానాకే జమ చేయనున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇన్‌పుట్‌సబ్సిడీ పంపిణీకి ఎప్పుడు ముగింపు పలుకుతారో, రైతులందరికీ ఎన్నడు న్యాయం జరుగుతుందో అంతుచిక్కని పరిస్థితి. -
ఐదేళ్ళ బాలికే ఆధారం!
'కుంచమంత కూతురుంటే మంచం మీదే కూడు' అన్న సామెత ఆ బాలిక విషయంలో సరిగ్గా సరిపోతుంది. అంధుడైన తన తండ్రి.. కొబ్బరి తోటల్లో పనికి వెళ్ళేందుకు ప్రతిరోజూ దారి చూపించే ఆ చిన్నారి.. ఎందరికో స్ఫూర్తిదాయకమౌతోంది. ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన మూడు నిమిషాల నిడివి ఉన్న వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఫిలిప్పీన్స్ కు చెందిన ఐదేళ్ళ బాలిక జెన్నీ, కాలికి చెప్పుల్లేకుండా తన అంధ తండ్రి పెపె నెల్సన్ కు పనిలో సహాయపడటం ఇప్పుడు ఫేస్ బుక్ లో లక్షలమందిని ఆకట్టుకుంటోంది. ఆ చిన్న ప్రాణానికి తండ్రిపై ఉన్న ప్రేమను, బాధ్యతను తెలియజేస్తోంది. కొబ్బరి తోటల్లో తండ్రి పనికి సాయ పడటమే కాదు... ఆప్యాయంగా ఆహారం తినిపించడం, నీళ్ళు అందించడం ప్రతి మనసునూ కదిలింపజేస్తోంది. కూతురి సహకారంతో నెల్సన్ ప్రతిరోజూ సుమారు 60 కొబ్బరి చెట్లు ఎక్కగల్గుతున్నాడు. అందుకుగాను అతడికి అందే 6 డాలర్ల వేతనం.. ఇప్పుడా కుటుంబానికి తిండికి లోటు లేకుండా చేస్తోంది. ప్రతి గుండెనూ కదిలిస్తున్న ఆ వీడియోను ఫేస్ బుక్ లోని తన పేజీలో రూబీ కెప్యూన్స్ పబ్బిలాన్.. జూన్ 10వ తేదీన పోస్ట్ చేసింది. అప్పట్నుంచీ లక్షలమంది తిలకించడమే కాదు.. స్థానిక, జాతీయ, అంతర్జాతీయ మీడియాల్లో కథనంగా మారింది. మనసును కదిలించే వీడియోను తిలకించిన ఎంతోమంది వినియోగదారులు సహాయక సంస్థల ద్వారా వారికి తగిన సహకారం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఏబీఎస్ సీబీఎన్ ఫౌండేషన్ ఆ తండ్రీ కూతుళ్ళను కలిసింది. రెటినల్ డిటాచ్ మెంట్, రెటినిటిస్ పిగ్మెంటోసా తో బాధపడుతున్న నెల్సన్ కు తగిన ట్రైనింగ్ ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. త్వరలో నెల్సన్, జెన్నీలు మంచి వాతావరణంలో స్థిరపడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
సీఎం నాటిన మొక్కకు ఏడాది
మొయినాబాద్: గత ఏడాది రాష్ట్రంలో హరితహారం కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించిన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాటిన మొక్క ఏడాది పూర్తిచేసుకుంది. గత సంవత్సరం జూలై 3న చిలుకూరు బాలాజీ దేవాలయంలో సీఎం కేసీఆర్ సంపంగి మొక్క నాటి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సీఎం నాటిన మొక్కలను ఆలయ అర్చకులు సంరక్షిస్తున్నారు. నాటినప్పుడు ఉన్న కొమ్మలు, ఆకులు రాలిపోయి ప్రస్తుతం కొత్త ఆకులతో పచ్చగా కళకళలాడుతోంది ఈ మొక్క. -
ఒడిశాలో నూతన సంవత్సర వేడుకలు!
భువనేశ్వర్: ఒడిశాలో నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఆనందోత్సాహాల మధ్య జరుగుతున్నాయి. మహా విషుభ సంక్రాంతిగా పిలిచే ఒడిశా కొత్త సంవత్సర పండుగ సందర్భంగా వివిధ దేవాలయాల్లో పూజలతోపాటు పూరి జగన్నాథుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మహావిషుభ సంక్రాంతికి స్వాగతం పలుకుతూ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. విషుభ సంక్రాంతి లేదా పాన సంక్రాంతిగా పిలిచే పండుగను ఒడిశా ప్రజలు సంవత్సరాదిగా జరుపుకుంటారు. కొత్త ఒడియా అల్మానాక్ అమల్లోకి వచ్చే ఈ రోజును ప్రత్యేక వేడుకగా నిర్వహిస్తారు. తెలుగు ప్రజలు సంవత్సరాదినాడు షడ్రసోపేతమైన ఉగాది పచ్చడిని తయారుచేసి తినే ఆచారం ఉన్నట్లుగానే ఒడిశాలోనూ నూతన సంవత్సరారంభం రోజున పానా గా పిలిచే పచ్చిమామిడి, చక్కెర కలిపిన రసాన్ని తాగుతారు. మరోవైపు అనేకమంది రాజకీయ పార్టీల నాయకులు, కేంద్ర మంత్రులు, విపక్షాల నాయకులు, ప్రముఖులు ఒడిషా ప్రజలకు కొత్త సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్లు చేశారు. దీంతో పాటు రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ 68వ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడ నిర్వహించారు. మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 1948 ఏప్రిల్ 13న రాష్ట్ర రాజధానిగా భువనేశ్వర్ నగరానికి తొలి పునాది రాయి వేశారు. -
హత్యా? ఆత్మహత్యా?!
పట్టుకోండి చూద్దాం ‘‘ ‘‘ఓసారి జరిగినదంతా రివైండ్ చేసుకో’’ అన్నాడు. ఒక్కసారి ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లాడు అప్పలస్వామి. ముందురోజు ఉదయం పదిన్నర కావస్తుండగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లోని ఫోన్ మోగింది. ‘‘హలో’’ అన్నాడు కానిస్టేబుల్ అప్పలస్వామి. ‘‘సర్. రోడ్ నంబర్ 12 నుంచి మాట్లాడుతున్నాను సర్. మా అపార్ట్మెంట్లోని రెండో ఫ్లోర్లో ఉండే ఓ సారు ఆత్మహత్య చేసుకున్నారు. మీరు వెంటనే రావాలి’’ అన్నాడు ఫోన్ చేసిన వ్యక్తి కంగారుగా. ‘‘అవునా? వివరాలు చెప్పు’’ అన్నాడు అప్పలస్వామి. అతను చెప్పినవన్నీ నోట్ చేసుకుని ఇన్స్పెక్టర్ దగ్గరకు పరుగెత్తాడు. అందరూ కలిసి సదరు అపార్ట్‌మెంట్‌కు బయలుదేరారు. అపార్ట్మెంట్లోని జనమంతా కిందే ఉన్నారు. చనిపోయిన వ్యక్తి గురించే అనుకుంటా... మాట్లాడుకుంటున్నారు. పోలీసుల్ని చూస్తూనే మాటలు ఆపేసి అలర్ట్ అయ్యారు ‘‘ఎక్కడ?’’ అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘ఫ్లాట్ నంబర్ 205 సర్’’ అన్నాడు వాచ్‌మేన్. వెంటనే ఆ ఫ్లాట్‌కి వెళ్లారు. తలుపు తీసేవుంది. హాల్లో సోఫా దగ్గర కింద కూర్చున్నాడా వ్యక్తి. తల వెనక్కి వాలిపోయింది. నుదుటి మీద బుల్లెట్ గుర్తు ఉంది. రక్తం చింది ముఖమంతా కారింది. ఓ చేతిలో తుపాకి, మరో చేతిలో ఒక క్యాసెట్ ఉన్నాయి. జేబులోంచి ఖర్చీఫ్ తీశాడు ఇన్స్పెక్టర్. దాన్ని క్యాసెట్ మీద వేసి క్యాసెట్ తీసుకున్నాడు. ఎదురుగా ఉన్న టీపాయ్ మీదే టేప్ రికార్డర్ ఉంది. క్యాసెట్ పెట్టి ఆన్ చేశాడు. ‘‘నేను జీవితంతో విసిగిపోయాను. చాలా విరక్తిగా ఉంది. ఒంటరితనం భయపెడుతోంది. బతుకంటేనే రోత పుడుతోంది. నాకే ఎందుకిలాంటి జీవితాన్నిచ్చాడో దేవుడు! అందుకే ఇక ఈ జీవితం వద్దనుకుంటున్నాను. దీన్నించి పారిపోవాలనుకుంటున్నాను.’’ రికార్డర్ ఆగిపోయింది. రివైండ్ చేసి, ఫార్వార్డ్ చేసి చూశాడు. ఆ మాటలు తప్ప ఇంకేమీ లేవు. ‘‘ఈయనకి ఎవరూ లేరా?’’ అన్నాడు ఇన్స్పెక్టర్. ‘‘లేదు సార్. భార్య చనిపోయింది. పిల్లలు లేరు. చాలాకాలంగా ఈ సార్ ఒక్కరే ఈ ఫ్లాట్‌లో ఉంటున్నారు. ఈ మధ్య చాలా దిగులుగా ఉంటున్నారు. కానీ ఇంత పని చేస్తారని అనుకోలేదు’’ అన్నాడు వాచ్‌మేన్. ‘‘చాలా మంచి మనిషి సర్. తన పనేంటో తను చూసుకుపోయేవారు. కానీ ఎవరికైనా కష్టం వచ్చిందంటే సాయపడటానికి అందరికంటే ముందుండేవారు. ఈయన ఇలా చేస్తారని అనుకోలేదు’’ అన్నాడొకాయన. ‘‘అవును సర్. మా పిల్లల్ని చాలా ప్రేమగా చూసేవారు. వద్దన్నా ఏదో ఒకటి తెచ్చి ఇస్తూ ఉండేవారు’’ అంటూ కళ్లొత్తుకుంది ఇంకొకావిడ. అందరూ చెప్పింది విన్నాడు ఇన్స్పెక్టర్ ప్రకాశ్. ఒంటరితనం భరించలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని అనిపించింది. వెంటనే బాడీని పోస్ట్‌మార్టమ్‌కి పంపించి స్టేషన్‌కి బయలుదేరాడు. ‘‘మొత్తం రివైండ్ చేశాను సర్. ఏమీ అర్థం కాలేదు’’ అన్నాడు అప్పలకొండ బుర్ర గోక్కుంటూ. చిన్నగా నవ్వి, ‘‘ఓసారి క్యాసెట్ మళ్లీ ఆన్ చెయ్’’ అన్నాడు ప్రకాశ్. అప్పలస్వామి క్యాసెట్ పెట్టి విన్నాడు. ఏమీ అర్థం కాలేదు. మళ్లీ క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టి ఇన్స్పెక్టర్ వైపు చూశాడు. ‘‘చివర్లో ఏం వినిపించింది?’’ అన్నాడు ప్రకాశ్. ‘‘గన్ పేలిన సౌండ్ సర్’’ ‘‘అదే అసలు రహస్యం బయటపెట్టింది’’ అప్పటికీ అప్పలస్వామికి ఆ రహ స్యం ఏమిటో అర్థం కాలేదు. పోనీ మీకు అర్థమైందా? ఆ వ్యక్తిది ఆత్మహత్య కాదు హత్య అని ఇన్స్పెక్టర్ ఎలా కనిపెట్టాడు? -
శ్రీ దుర్ముఖినామ సంవత్సర ఫలితాలు...
ఈ సంవత్సరం రాజు శుక్రుడు, మంత్రి, సేనాధిపతి, ఆర్ఘాధిపతి, మేఘాధిపతి బుధుడు, సస్యాధిపతి, నీరసాధిపతి శని, ధాన్యాధిపతి శుక్రుడు, రసాధిపతి చంద్రుడు. నవనాయకుల్లో ఏడుగురు శుభులు, మిగతా ఇద్దరు పాపులు. అలాగే, ఉపనాయకుల్లోని 21మందిలో 10మంది శుభులు, మిగతా వారు పాపులు. రాజు శుక్రుడు కావడం, మంత్రి బుధుడు కావడం, ఇద్దరూ మిత్రులైనందున పాలనాపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ప్రజలు ఆశించిన రీతిలో పాలన కొనసాగుతుంది. పంటల దిగుబడులు ఆశాజనకంగా ఉంటాయి. తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో మంచి వర్షాలు కురుస్తాయి. భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరిగి అన్యోన్యంగా జీవిస్తారు. పాల ఉత్పత్తి అధికమై దీనిపై ఆధారపడిన వారికి మంచిరోజులని చెప్పవచ్చు. అలాగే, మంత్రి బుధుడు కావడం వల్ల మేఘాలు, గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. మొత్తం మీద పరిశీలించగా కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కొన్ని వివాదాలు ఏర్పడవచ్చు. వీరు తీసుకునే నిర్ణయాలు ప్రజల తిరస్కారానికి గురికాగలవు. శాంతిభద్రతల లోపంతో దేశంలోని కొన్ని ప్రాంతాలలో ఘర్షణలు, ఉద్యమాలు చెలరేగి ప్రజాజీవనం అస్తవ్యస్తమయ్యే అవకాశాలున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య కూడా వివాదాలు నెలకొని పాలనపై ప్రభావం చూపవచ్చు. అలాగే, కొన్ని రాష్ట్రాల్లో పాలకులు మారవచ్చు. ఇరుగుపొరుగు దేశాలతో కొంత కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇందుకోసం సైనికచర్యలు సైతం తప్పని పరిస్థితి నెలకొంటుంది. శాస్త్ర, సాంకేతిక రంగాలు మరింత పుంజకుంటాయి. ముఖ్యంగా ఐటీ పరిశ్రమ విస్తరించి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఇక వ్యవసాయరంగం కొద్దిపాటి ఆటుపోట్లు ఎదుర్కొంటుంది. సరైన గిట్టుబాటు ధరలు రైతులు నిరాశకు గురికాగలరు. ఈ ఏడాది నల్లరేగడి భూములలో పంటలు బాగా పండుతాయి. వాణిజ్యపంటలు ఎక్కువగా పండుతాయి. తూర్పు, ఉత్తర ప్రాంతాలలో సుభిక్షం. ఇతర ప్రాంతాలలో వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు తప్పకపోవచ్చు. సస్యాధిపతి శని, ధాన్యాధిపతి శుక్రుడు కావడం వల్ల నువ్వులు, తెల్లధాన్యాల దిగుబడులు ఎక్కువగా ఉంటాయి. తూర్పు, ఈశాన్యప్రాంతాల్లో అధికంగానూ, దక్షిణ, నైరుతి ప్రాంతాల్లో సామాన్యంగా వర్షాలు కురుస్తాయి. బంగారం, వెండి, రాగి లోహాల ధరలు పెరిగే సూచనలు. శుక్రుడు రాజుకావడం వల్ల నాలుగు కుంచాల వర్షం కురుస్తుంది. ఇందులో 8భాగాలు సముద్రమందు, 9భాగాలు పర్వతాలపై, 3భాగాలు నేలపై కురుస్తాయి. ఈ ఏడాది వర్షలగ్నం కన్యరాశి అయినది. లగ్న, దశమాధిపతి బుధుడు లాభాధిపతి చంద్రునితో కలిసి అష్టమస్థితి, ద్వితీయ, భాగ్యాధిపతి శుక్రుడు సప్తమమైన మీనంలో ఉచ్ఛస్థితి కలిగి వ్యయాధిపతి రవితో కలయిక. తృతీయ మందు తృతీయ, అష్టమాధిపతి కుజుడు, పంచమ, షష్టమాధిపతి అయిన శనితో చేరియుండుట, చతుర్ధ, సప్తమాధిపతి గురుడు రాహువుతో చేరి వ్యయస్థానం, కేతువు షష్ఠమస్థానంలోనూ సంచారం. ఇక జగర్లగ్నం వృశ్చికమైనది. లగ్నంలో కుజ, శనుల కలయిక శుభంకాదు. రవి, శుక్రులకు ఉచ్ఛస్థితి. అష్టమంలో చంద్రుడు, గురు, రాహువులు రాజ్యస్థానంలో కలయిక. వీటిరీత్యా చూస్తే పాలకులలో పారదర్శకత లోపిస్తుంది. ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటారు. మతపరమైన ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. నిరుద్యోగులకు ఈ ఏడాది శుభదాయకంగా ఉంటుంది. కోరుకున్న ఉద్యోగావకాశాలు దక్కే సూచనలు. విద్యార్థులకు కూడా అనుకూలమైనదే. రాజు శుక్రుడు కావడం వల్ల చిత్రపరిశ్రమ పుంజుకుంటుంది. కళాకారులకు గతం కంటే ప్రోత్సాహవంతంగా ఉంటుంది. తూర్పు, ఈశాన్యరాష్ట్రాలు భారీ వర్షాలతో అతలాకుతలమవుతాయి. అలాగే, వరదలు సంభవించి ఆస్తినష్టం కలిగే అవకాశం. దేశంలోని మధ్యప్రాంతంలో భూకంపాది ప్రకృతి వైపరీత్యాల వల్ల జన, ఆస్తినష్టాలు. కేంద్ర, రాష్ట్రాల మంత్రివర్గాలలో మార్పులు జరుగుతాయి. మహిళలకు విశేష గౌరవం లభిస్తుంది. మహిళల శ్రేయస్సుకు ప్రభుత్వాలు కొత్త పథకాలు ప్రారంభిస్తాయి. అత్యున్నతస్థాయి పదవులకు మహిళలు ఎంపిక కావచ్చు. ఈ ఏడాది పేరుప్రఖ్యాతులు, విశేష ఆదరణ పొందిన నేతకు గడ్డుకాలమనే చెప్పాలి. విమాన, రైలు, బస్సు ప్రమాదాల కారణంగా జననష్టం. పశుపోషణ, మత్స్య, ఇతర వ్యవసాయానుబంధ రంగాలపై ఆధారపడిన వారికి మంచి రోజులు. మొత్తం మీద కొన్ని ఒడిడుదుడుకులు ఎదురైనా ప్రజలకు అనుగుణంగా పాలకులు వ్యవహరించే అవకాశాలున్నాయి. ఆర్థిక వ్యవస్థ ఒడిదుడుకులతో నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరిగే సూచనలు. షేర్ మార్కెట్ తరచూ పతనావస్థకు చేరి ఆందోళన కలిగిస్తుంది. ఏదేమైనా రాజు, మంత్రి శుక్రుడు, బుధుడు కావడం వల్ల మన దేశ ఖ్యాతి నలుదిశలా విస్తరించే అవకాశం ఉంది. క్రీడారంగం కొత ్తపుంతలు తొక్కుతుంది. క్రీడాకారులకు విశేష గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తాయి. ఈ ఏడాది వైశాఖం చివరి నుంచి చిరుజల్లులు, అక్కడక్కడా వడగళ్లు పడవచ్చు. శ్రావణం, భాద్రపద మాసాల్లో అధిక వర్షాలు కురిసే అవకాశం. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ఉద్యమాలు పుట్టి పాలకులకు సవాలుగా మారతాయి. అక్టోబర్ చివరి వారం, నవంబర్ మొదటి వారం మధ్యలో కాలసర్పదోషం కారణంగా విచిత్ర వ్యాధులు, చోరీలు, ప్రకృతి వైపరీత్యాలతో ప్రజలు ఇబ్బందులు పడతారు. దుర్ముఖినామ సంవత్సరంలో ప్రజల్లో పాపభీతి తగ్గి, నేరాలు పెరుగుతాయి. ఉన్మాద, తీవ్రవాద చర్యలతో సమస్యలు ఎదురుకావచ్చు. జ్యేష్ఠ బ.విదియ, బుధవారం అనగా జూన్ 22వ తేదీ ఉదయం 6.39గంటలకు పూర్వాషాఢ నక్షత్రం, బ్రహ్మయోగం, గరజి కరణం, మిథున లగ్నమందు రవి ఆరుద్రా నక్షత్రంలో ప్రవేశం. ఈరీత్యా చూస్తే ఉదయం పూట రవి ఆరుద్రనక్షత్ర ప్రవేశం, బ్రహ్మయోగం వల్ల పంటలకు నష్టం, ప్రజలకు కష్టాలు. బుధవారం, విదియ తిథి, గరజి కరణమైనందున సుభిక్షం, సకాలంలో వర్షాలు కురుస్తాయి. ఈ ఏడాది పశుపాలకుడు శ్రీకృష్ణుడు, గోష్టప్రాపకుడు, గోష్టబహిష్కర్త బలభద్రుడు కావడం వల్ల పశుసంపద, పాడిపరిశ్రమ అభివృద్ధి చెందుతుంది. ఉగాది నుంచి 2017 జనవరి 26 వరకు అఢకం(కుంచం) వృద్ధగోపకుని చేతిలో ఉండడం శుభం. పంటలు బాగా పండుతాయి. తదుపరి సంవత్సరాంతం వరకూ బ్రాహ్మణ బాలుని చేతిలో ఉండడం వల్ల కొంత దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటాయి. (వచ్చే ఏడాది శ్రీహేవిళంబినామ సంవత్సరం.) నవనాయకుల ఫలాలు... రాజు- శుక్రుడు... మంచి వర్షాలు కురిసి పంటల ఉత్పత్తులు అధికమవుతాయి. మహిళలకు ప్రోత్సాహం, ఆదరణ లభిస్తాయి. కళాకారులకు గుర్తింపు, సన్మానాలు అందుతాయి. బంగారం, వెండి, సుగంధ ద్రవ్యాలు, రాగి, తెల్లని ధాన్యాలు, వేరుశెనగ వంటి నూనె గింజలు, మిర్చి, పసుపు ధరలు పెరుగుతాయి. మంత్రి- బుధుడు... ఏడాదంతా మధ్యమ ఫలితాలు ఉంటాయి. నూనెగింజల ధరలు అధికమవుతాయి. చక్కటి సలహాలతో పాలకులు పాలన చేస్తారు. అకాల మబ్బులు, వాయువులతో ఆకాశం నిండి ఉంటుంది. సేనాధిపతి -బుధుడు... రాజకీయ నాయకులకు తరచూ ఇక్కట్లు ఎదురవుతాయి. నాయకులు, ప్రజలలో నిబద్ధత లోపిస్తుంది. వాయువులతో కూడిన వర్షాలు కురుస్తాయి.సస్యాధిపతి -శని... నువ్వులు, నల్లటి ధాన్యాల ఉత్పత్తులు పెరుగుతాయి.నల్లరేగడి భూములలో పంటలు బాగా పండుతాయి. బెల్లం, చింతపండు, పొగాకు ఇనుము వంటి ధరలు పెరుగుతాయి. ధాన్యాధిపతి - శుక్రుడు... సకాలంలో వర్షాలు కురిసి సుభిక్షంగా ఉంటుంది. అన్ని రకాల ధాన్యాలు బాగా పండుతాయి. సుగంధ ద్రవ్యాలకు గిరాకీ పెరుగుతుంది. అర్ఘాధిపతి- బుధుడు... పంటలు, వర్షాలు, ధరలు అధికంగా ఉంటాయి. నెయ్యి, పాలు, బంగారం, వెండి, పసుపు, కలప, కాగితం ధరలు పెరుగుతాయి. మేఘాధిపతి- బుధుడు... మధ్య ప్రాంతంలో పిడుగులు, వడగండ్లతో వర్షాలు కురుస్తాయి. రసాధిపతి- చంద్రుడు... ప్రజలు ఆరోగ్యవంతులై సుఖఃశాంతులతో జీవిస్తారు. నూనెలు, బెల్లం, కొబ్బరి, తేనె, పాలు చక్కెర ధరలు పెరుగుతాయి. నీరాసాధిపతి- శని... నల్లటి వస్త్రాలు, ఇనుము, ఇతర లోహాల ధరలు పెరుగుదల కనిపిస్తుంది. -
నా బాధను...మాటల్లో చెప్పలేను!
పిల్లలు పరీక్షలు రాస్తుంటే తల్లిదండ్రులు కూడా రాస్తున్నట్లే. అలాగే ఇంట్లో అమ్మమ్మ - నానమ్మ-తాతయ్యలు ఉంటే వాళ్లూ రాస్తున్నట్లే. పిల్లలను చదివిస్తూ, నానా హైరానా పడిపోతుంటారు. ఇది పరీక్షల సీజన్ కాబట్టి, ప్రణీత తన ఫ్లాష్‌బ్యాక్ గుర్తు చేసుకున్నారు. చదువుకొనే రోజుల్లో నాయనమ్మ తనను చదివించేవారని ప్రణీత చెబుతూ - ‘‘పదో తరగతి బోర్డ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మా నానమ్మ నన్ను బాగా చదివించేది. తెల్లవారుజామునే నాతో పాటు తను కూడా నిద్ర లేచేది. ముఖ్యంగా కన్నడ సబ్జెక్ట్ నాకు చాలా కష్టంగా అనిపిస్తే, తనే చదివి అర్థం చెప్పేది. అంతలా పెంచిన మన పెద్దల కోసం మనం పెద్దయ్యాక సమయం కేటాయించం. ముఖ్యంగా గ్రాండ్ పేరెంట్స్ ప్రేమను పట్టించుకోం. చిన్నప్పుడు అర్థం కాక పట్టించుకోకపోతే, టీనేజ్‌లోకొచ్చాక టైమ్ లేక పట్టించుకోం. తీరా కొంత వయసు పెరిగి, పరిణతి వచ్చాక పట్టించుకుందామనుకుంటే మనల్ని పట్టించుకునే స్థితిలో వాళ్లు ఉండకపోవచ్చు. అందుకే, ఇప్పుడు మా నానమ్మకు నేను సమయం కేటాయించాలనుకుంటున్నాను. ఏవేవో ముచ్చట్లు చెప్పాలనుకుంటున్నాను. కానీ, అర్థం చేసుకునే పరిస్థితిలో ఆమె లేదు. అసలు తను ఇంత ముసలావిడ ఎప్పుడు అయ్యిందో తెలియనంతగా రోజులు గడిచిపోయాయి. ఇప్పుడు మా నానమ్మ ఒక పసిపాప లాంటిది. ఎవరి సహాయమూ లేకుండా తను నడవలేదనీ, తినలేదనీ తల్చుకుంటుంటే నాకు చాలా బాధగా ఉంది. నేను ఆవిడ గది వైపుగా వెళుతునప్పుడు తన కేర్ టేకర్‌తో నానమ్మ పొందిక లేని, స్పష్టంగా లేని కథలు చెప్పడం వినపడుతుంది. అప్పుడు నాకు కలిగే బాధను మాటల్లో చెప్పలేను. అందుకే, పెద్దవాళ్లు బాగున్నప్పుడే వాళ్ల కోసం మనం సమయం కేటాయించాలి’’ అన్నారు. -
శతాబ్దాల సబ్బు
ఫ్లాష్‌బ్యాక్ ఒళ్లు శుభ్రంగా ఉంచుకోవడానికే కాదు, సౌందర్య సాధనంగా కూడా రకరకాల సబ్బులను ఉపయోగిస్తున్నాం మనం. మన దేశంలో ఒకప్పుడు సబ్బుల వాడుక చాలా తక్కువ. పాశ్చాత్య వలస పాలకుల ద్వారానే ఇవి మనకు పరిచయమయ్యాయి. అలాగని సబ్బు ఆధునిక ఆవిష్కరణేమీ కాదు. క్రీస్తుపూర్వం నుంచే సబ్బు వంటి పదార్థాలు వాడుకలో ఉన్నట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రాచీన బాబిలోనియన్ ప్రజలు క్రీస్తుపూర్వం 2800 ఏళ్ల కిందటే సబ్బు వంటి పదార్థాన్ని వాడేవారు. నీరు, క్షార పదార్థం, కాసియా నూనెలతో సబ్బు వంటి పదార్థాన్ని తయారు చేసే ఫార్ములా రాసి ఉన్న బాబిలోనియన్ల రాతి పలక ఒకటి తవ్వకాల్లో బయటపడింది. అది క్రీస్తుపూర్వం 2200 ఏళ్ల నాటిదని పరిశోధకులు అంచనా వేశారు. ప్రాచీన ఈజిప్షియన్లు సైతం క్రీస్తుపూర్వం 1500 ప్రాంతంలో క్షార పదార్థాలు, శాకాహార నూనెలు, జంతువుల కొవ్వులు ఉపయోగించి సబ్బువంటి పదార్థాన్ని తయారు చేసేవారు. అప్పట్లో చైనా వారు సబ్బుల తయారీలో నూనెలు, కొవ్వులు, క్షారాలతో పాటు మూలికలను కూడా వాడేవారు. క్రీస్తుశకం పదమూడో శతాబ్ది నాటికి పశ్చిమాసియా ప్రాంతంలో సబ్బుల తయారీ కుటీర పరిశ్రమ స్థాయికి ఎదిగింది. పదిహేనో శతాబ్ది ద్వితీయార్ధం నాటికి ఫ్రాన్స్‌లో సబ్బుల తయారీ పరిశ్రమ బాగా పుంజుకుంది. అయితే, పారిశ్రామిక విప్లవానికి ముందు సబ్బుల పరిశ్రమలు అక్కడక్కడా ఉన్నా, వాటి ఉత్పత్తి పరిమితంగానే ఉండేది. పారిశ్రామిక విప్లవం తర్వాత 19వ శతాబ్దిలో పలు పరిశ్రమలు భారీస్థాయిలో సబ్బుల తయారీ ప్రారంభించాయి. అప్పటి నుంచే రకరకాల ఆకారాలు, రంగులు, పరిమళాలతో ఆకర్షణీయమైన ప్యాకింగులతో బ్రాండెడ్ సబ్బులు మార్కెట్‌ను ముంచెత్తడం మొదలైంది. విస్తృత వ్యాపార ప్రచారం కూడా తోడవడంతో సబ్బుల వాడుక వెనుకబడిన దేశాలకూ పాకింది. -
ఏటా మూడు కొత్త నగరాలకు మెక్ డొనాల్డ్స్
వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్ వైస్ చైర్మన్ అమిత్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దక్షిణ, పశ్చిమ భారత్‌లో మెక్ డొనాల్డ్స్ ఔట్లెట్లను నిర్వహిస్తున్న హార్డ్‌క్యాజిల్ రెస్టారెంట్స్ ఏటా మూడు కొత్త నగరాల్లో అడుగు పెడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్‌తోసహా 29 నగరాలకుగాను 223 స్టోర్లను కంపెనీ నిర్వహిస్తోంది. ఏటా 30-50 ఔట్లెట్లను ఏర్పాటు చేయాలన్నది కంపెనీ ప్రణాళిక. ఒక్కో స్టోర్‌కు సుమారు రూ.3 కోట్లు వెచ్చిస్తోంది. 2017లో ఆంధ్రప్రదేశ్‌లో స్టోర్లను తెరుస్తామని హార్డ్‌క్యాజిల్ రెస్టారెంట్స్‌ను ప్రమోట్ చేస్తున్న వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్ వైస్ చైర్మన్ అమిత్ జతియా బుధవారమిక్కడ మీడియాకు తెలిపారు. దక్షిణ, పశ్చిమ భారత్‌లో 62 మెక్ కేఫ్ స్టోర్లను నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ ఏడాదే హైదరాబాద్‌లో మెక్ కేఫ్ తొలి ఔట్‌లెట్‌ను ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు. మెక్ డెలివరీ సర్వీసుల్లో 50 శాతం ఆన్లైన్ ద్వారా ఆర్డర్లు వస్తున్నాయని హార్డ్‌క్యాజిల్ రెస్టారెంట్స్ ఎండీ స్మిత జతియా తెలిపారు. 2014-15లో కంపెనీ రూ.760 కోట్ల టర్నోవర్ సాధించింది. ప్రస్తుత 2015-16ఆర్థిక సంవత్సరంలో రూ.850 కోట్ల టర్నోవర్‌ను ఆశిస్తోంది. పాశ్చాత్య ఫాస్ట్ ఫుడ్ వ్యాపార పరిమాణం భారత్‌లో సుమారు రూ.6,500 కోట్లుంది. పదేళ్లలో ఇది 3-5 రెట్లు పెరుగుతుందని వెస్ట్‌లైఫ్ డెవలప్మెంట్ అంచనా వేస్తోంది. -
బియ్యానికి రెక్కలు!
వచ్చే ఏడాదికల్లా రెట్టింపు కానున్న ధరలు? సాక్షి, హైదరాబాద్: బియ్యం బంగారం కానుందా..? వచ్చే ఏడాదికల్లా బియ్యం ధరలు ఆకాశాన్ని తాకనున్నాయా..? ప్రస్తుతం రూ.42 నుంచి రూ.50 మధ్య ఉన్న సూపర్ ఫైన్ క్వాలిటీ బియ్యం సెంచరీ కొట్టనుందా..? తాజా పరిస్థితులు అందుకు అవుననే సమాధానమిస్తున్నాయి! ఏటేటా బియ్యం దిగుబడి ఊహించని విధంగా పడిపోతుండడంతో రేట్లు భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఏటా మూడో వంతుకుపైగా బియ్యం దిగుబడి తగ్గిపోతోంది. రెండేళ్ల కిందటితో పోలిస్తే ఈ ఏడాది రాష్ట్రంలో 36.02 లక్షల టన్నుల బియ్యం దిగుబడి తగ్గిపోయింది. ఇదే పరిస్థితి కొనసాగితే సమీప భవిష్యత్తులోనే బియ్యానికి తీవ్ర కొరత ఏర్పడనుంది. మార్కెట్లో ఖరీదైన నిత్యావసర సరుకుగా మారి జనాన్ని హడలెత్తించనుంది. రాష్ట్ర అర్థ గణాంక శాఖ సోమవారం విడుదల చేసిన ‘తెలంగాణ వ్యవసాయ గణాంకాల దర్శిని 2014-15’ ఇదే విషయాన్ని స్పష్టంచేసింది. ఈ గణాంకాల ప్రకారం వరుసగా మూడేళ్ల పంట ఉత్పత్తులను పరిశీలిస్తే.. బియ్యం దిగుబడి తగ్గిన తీరు కళ్లకు కడుతోంది. 2013-14లో రాష్ట్రంలో 65.81 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి అయింది. 2014-15లో ఇది ఒక్కసారిగా 45.45 లక్షల టన్నులకు పడిపోయింది. ఒకే ఏడాదిలో 20.36 లక్షల టన్నుల బియ్యం దిగుబడి తగ్గిపోవటం గమనార్హం. తాజాగా రాష్ట్ర వ్యవసాయ శాఖ వేసిన లెక్కల ప్రకారం ఈ ఏడాది పరిస్థితి మరింత దారుణంగా ఉంది. వర్షాభావం, కరువుతో వరి సాగు నిరుటి కంటే గణనీయంగా తగ్గింది. 2015-16లో బియ్యం ఉత్పత్తి 29.79 లక్షల టన్నులకే పరిమితమవుతుందని అధికారులు ఇటీవల అంచనా వేశారు. అంటే నిరుటితో పోలిస్తే మరో 15.66 లక్షల టన్నులు తగ్గిపోనుందన్నమాట! బెంబేలెత్తిస్తున్న ధరలు ఇప్పటికే మార్కెట్లో బియ్యం ధరలు సామాన్యులకు అందకుండా పోయాయి. మధ్య తరగతి కుటుంబీకులు, సంపన్నులకు సైతం దడ పుట్టిస్తున్నాయి. మార్కెట్లో ప్రస్తుతం సూపర్ ఫైన్ బెస్ట్ క్వాలిటీ బియ్యం కిలో రూ.42 నుంచి రూ.50 మధ్య ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ధర 5 శాతం పెరిగినట్లు ప్రభుత్వమే నిర్ధారించింది. సూపర్ ఫైన్ సాధారణ రకం బియ్యం కిలో రూ.38 నుంచి రూ.42 మధ్య లభ్యమవుతోంది. గతేడాదితో పోలిస్తే ఇది 8 శాతం పెరిగింది. సాధారణ రకం బియ్యం రూ.24 నుంచి రూ.25 ధరలో విక్రయిస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ధరలో పెద్ద తేడా లేదు. కానీ తగ్గుతున్న బియ్యం ఉత్పత్తితో వచ్చే ఏడాది బియ్యం ధరలు ఏకంగా 90 శాతం వరకు ఎగబాకే ప్రమాదముందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కరువే కారణం.. తీవ్ర వర్షాభావంతో రాష్ట్రంలోని రైతులు వరి సాగుకు దూరమవుతున్నారు. అందుకే ఏటా వరి సాగు విస్తీర్ణం తగ్గిపోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వేసిన వరి పంటను సైతం ప్రకృతి వైపరీత్యాలు వెంటాడాయి. ఆహార ధాన్యాలన్నీ ప్రియమే బియ్యంతో పాటు కరువు దెబ్బకు మిగతా పంట ఉత్పత్తుల దిగుబడి కూడా పడిపోయింది. రెండేళ్ల కిందటితో పోలిస్తే ఆహార ధాన్యాల ఉత్పత్తి సగానిపైగా తగ్గింది. 2013-14లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 106.86 లక్షల టన్నులుగా నమోదవగా.. ఈ ఏడాది 49.35 లక్షల టన్నుల ఉత్పత్తిని అంచనా వేస్తున్నారు. గతేడాది 72.18 లక్షల టన్నులు ఉత్పత్తి అయినట్లుగా లెక్కలు చెబుతున్నాయి. మక్కల (మొక్కజొన్న) దిగుబడి సైతం అదే స్థాయిలో తగ్గుముఖం పట్టింది. రెండేళ్ల కిందట 35.12 లక్షల టన్నులు, కిందటేడాది 23.08 లక్షల టన్నులుండగా.. ఈసారి కేవలం 16.19 లక్షల టన్నుల దిగుబడి మాత్రమే రావొచ్చని అంచనా వేశారు. చిరుధాన్యాల దిగుబడి కూడా.. గడిచిన అయిదేళ్ల సగటు కంటే తగ్గిపోయింది. 2013-14లో 102.21 లక్షల టన్నులున్న చిరుధాన్యాల ఉత్పత్తి కిందటేడాది 69.55 లక్షల టన్నులకు పడిపోయింది. ఈసారి అంతకంటే ఘోరంగా 46.85 లక్షల టన్నులకు పరిమితమైంది. -
విశాఖలో న్యూ ఇయర్ జోష్
-
నేషనల్ రౌండప్ - 2015
-
యంత్రంతో మంత్రం వేశాడు!
ఫ్లాష్ బ్యాక్ ఢిల్లీకి చెందిన ధరమ్‌వీర్‌సింగ్ కాంబోజీ కనుగొన్న మల్టీపర్పస్ యంత్రం హైటెక్ యంత్రాలకు ఏమాత్రం తీసిపోదు. ఈ ఫొటోలో కనిపిస్తున్నది అదే. ఇది దేనికి పని కొస్తుందనుకుంటున్నారా? ఔషధ మూలికల నుంచి రసం తీసేందుకు, వాటిని పొడి చేసేందుకు, ముద్దగా రుబ్బేందుకు ఉప యోగపడుతుంది. కాయలు, గింజలు, చిరు ధాన్యాలు, పప్పులు వంటి వాటిని కూడా ఇది ఇట్టే ప్రాసెస్ చేసేయగలదు. ధరమ్వీర్ సింగ్ శాస్త్రవేత్త కాదు. ఇంజినీరూ కాదు. పట్టుమని పదోతరగతి కూడా చదువుకో లేదు. ఢిల్లీ వీధుల్లో రిక్షా తొక్కుతూ పొట్ట పోసుకునేవాడు. అయితే, చిన్నప్పటి నుంచి ఆయుర్వేదంపై, వనమూలికలపై ఆసక్తి ఉండటంతో కొందరు సాధువుల వద్ద మూలికలతో ఔషధాలను తయారుచేసే పద్ధతులు నేర్చున్నాడు. 2004లో హర్యానా ప్రభుత్వం తరఫున రాజస్థాన్ వెళ్లిన రైతుల బృందంతో కలసి, అక్కడి అలోవెరా, ఆమ్లా ప్రాసెసింగ్ యూనిట్లను సందర్శించాడు. అలాంటి యంత్రాలతో స్వయంగా ఏదైనా చేద్దామని భావించినా, వాటి ఖరీదు తన శక్తికి మించినది కావడంతో అప్పటికి మిన్నకున్నాడు. అయితే, రెండేళ్ల వ్యవధిలో స్వయంగా అలోవెరా రసాన్ని తీసే యంత్రాన్ని తయారు చేశాడు. ఇది విజయవంతంగా పని చేయడంతో, కొద్ది కాలానికే ఈ యంత్రానికి మార్పు చేర్పులు చేసి, ఎలాంటి మూలికలు, ఆహార ధాన్యాలనైనా ప్రాసెస్ చేయగల పూర్తిస్థాయి మల్టీపర్పస్ యంత్రంగా రూపొందించాడు. గంటకు 50 కిలోలు, గంటకు 150 కిలోల పదార్థాలను ప్రాసెస్ చేయగల రెండు నమూనాల్లో ఈ యంత్రాన్ని తయారు చేసి, విజయవంత మైన పరిశ్రమకు యజమానిగా మారాడు. ఇప్పుడు ఇతని వద్ద డజను మంది కార్మికులు పనిచేస్తున్నారు. -
షాంపూని కనిపెట్టింది మనమే!
ఫ్లాష్ బ్యాక్ సౌందర్య పోషణలో తలకట్టుదే పెమైట్టు. శిరసున కేశసంపద అలరారుతున్నప్పుడే సౌందర్యం ఇనుమడిస్తుంది. మన పూర్వీకులకు ఈ సంగతి ముందే తెలుసు. అందుకే వాళ్లు కేశ సంరక్షణకు అత్యధిక ప్రాధాన్యమిచ్చేవారు. శిరోజాలను శుభ్ర పరచుకోవడానికి వేల ఏళ్ల కిందటే షీకాయ, కుంకుడు కాయలు వంటి వాటిని మన దేశంలో విరివిగా వాడేవారు. తడి నెత్తికి పట్టిస్తే, నురగనిచ్చే ఈ పదార్థాలు 18వ శతాబ్ది వరకు పాశ్చాత్యులకు తెలియనే తెలియవు. వాస్తవానికి హిందీలోని ‘చాంపో’ పదమే ఇంగ్లిష్‌లోని ‘షాంపూ’పదానికి మూలం. క్రీస్తుశకం 1762లో ఇది ఇంగ్లిష్ వారికి పరిచయమైంది. అయితే, ఇరవయ్యో శతాబ్ది వరకు ‘షాంపూ’ జన సామాన్యానికి అందుబాటులోకి రాలేదు. అంతకు ముందు బ్రిటన్ సహా పలు యూరోప్ దేశాలలో షేవింగ్ కోసం ఉపయోగించే సబ్బును మరి గించిన నీటిలో వేసి, దాని ద్వారా వచ్చే నురగతో తలలు శుభ్రం చేసుకునేవారు. అమెరికాలోని హెచ్.ఎస్.పీటర్సన్ అండ్ కంపెనీ ‘కాంత్రాక్స్’ పేరిట 1914లో షాంపూను అందుబాటులోకి తెచ్చింది. పత్రికల్లో విరివిగా ప్రకటనలు గుప్పించింది. టిన్ డబ్బాల్లో అమ్మే ఈ షాంపూ... పొడిగా ఘనరూపంలో ఉండేది. ఆ తర్వాత 1926లో జర్మన్ పరిశోధకుడు హాన్స్ స్క్వార్జ్కాఫ్ చిక్కని ద్రవరూపంలో షాంపూను తయారు చేశాడు. ఇది అందుబాటులోకి వచ్చాక, చాలా దేశాలు ఇదే పద్ధతిలో వివిధ పరిమళాలతో షాంపూలను తయారు చేయడం మొదలుపెట్టాయి. ఇక అప్పటి నుంచి కేశ సంరక్షణలో విప్లవాత్మక మార్పులే వచ్చాయి. ఇప్పుడు మార్కెట్ నిండా రకరకాలు ఆక్రమించాయి. -
తలకట్టుకు పనిముట్టు
ఫ్లాష్ బ్యాక్ రోజూ తల దువ్వుకుంటూనే ఉంటాం. ఎప్పటికెయ్యది ప్రస్తుతమనే రీతిలో వర్తమాన ఫ్యాషన్లకు అనుగుణంగా ఎప్పటి కప్పుడు తలకట్టును తీర్చిదిద్దుకుంటూనే ఉంటాం. కాస్త కుడి ఎడమలగానో, నడి మధ్యగానో పాపిట తీర్చి, తలపై జుట్టును చెక్కుచెదరకుండా సర్దుకుంటాం. పాపిటి బెడద ఎందుకనుకుంటే... గాలికి చెదర కుండా జుట్టుకు కాస్త నూనెనో, క్రీమునో, జెల్నో పట్టించి ఎగదువ్వేస్తాం. ఇదంతా మనకు అనుదిన అనివార్య కార్యక్రమం. అయితే పని పూర్తయ్యాక దువ్వెనను మాత్రం పక్కన పడేస్తాం. కానీ ఎప్పుడైనా, అసలీ దువ్వెన ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని కనిపెట్టినదెవరని ఆలోచించామా? తెలుసుకోవాలే గానీ, దువ్వెనకు చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ నిత్యావసర పరికరాన్ని దాదాపు ఐదు వేల ఏళ్ల కిందటే కనిపెట్టారు. అప్పట్లోనే పర్షియాలో దువ్వెనల వాడకం ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలున్నాయి. తొలి రోజుల్లో ఏనుగు దంతాలతో, తాబేటి చిప్పలతో దువ్వెనలు తయారు చేసేవాళ్లు. ఇవి దొరకడం కాస్త కష్టం కాబట్టి... తర్వాత కలప, లోహాలతో కూడా దువ్వెనలను తయారు చేయడం మొదలెట్టారు. దంతపు దువ్వెనలు, తాబేటి చిప్ప దువ్వెనలు, కలప, లోహ దువ్వెనలను ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దే వాళ్లు. తలకట్టును అందంగా తీర్చిదిద్దు కోవడం కోసమే కాకుండా, తలకు పట్టిన పేలను తొలగించుకోవడానికి కూడా వాటిని వాడేవాళ్లు. ఇప్పటికీ దువ్వెనలను ఇవే ప్రయోజనాల కోసం మనం వాడుతున్నాం. అయితే ప్లాస్టిక్ వాడుకలోకి వచ్చాక దువ్వెనల తీరుతెన్నులే మారిపోయాయి. పాతకాలం దువ్వెనలు మ్యూజియములకే పరిమితమయ్యాయి. పైగా దువ్వెన రూపు మారిపోయి రకరకాల మోడళ్లు వచ్చాయి. చివరికి కరెంటుతో, బ్యాటరీలతో పని చేసే దువ్వెనలు కూడా వచ్చేశాయి! -
విగ్గు వెనుక కథ!
ఫ్లాష్ బ్యాక్ సమాజంలోని పెద్ద తలకాయలను ఇంగ్లిష్‌లో ‘బిగ్ విగ్స్’ అనడం వాడుక. అయితే, సినిమాలు వచ్చాక గానీ మనకు విగ్గుల వాడకం గురించి పెద్దగా తెలీదు. వయసు మళ్లిన హీరోలు అరవైలో ఇరవైలా కనిపించేందుకు విగ్గు తప్పనిసరి అలంకారం అని అందరికీ తెలిసిందే. అయితే, ‘విగ్గు’ అనే కృత్రిమ శిరోజాలంకరణ సినిమాల ప్రభావంతో మొదలైన పరిణామమేమీ కాదు. ఆధునిక ఆవిష్కరణ కూడా కాదు. క్రీస్తుపూర్వం వెయ్యి సంవత్సరాల నాడే విగ్గుల వాడకం విరివిగా ఉండేది. వాటి తయారీకి మనుషుల కేశాలే కాదు, జంతువుల జుట్టునూ వాడేవారు. ఆధునిక యుగం మొదలయ్యాక కృత్రిమ పదార్థాలతో తయారు చేసిన వెంట్రుకలను కూడా విగ్గుల తయారీకి వాడటం మొదలైంది. మొదట్లో ప్రాచీన ఈజిప్షియన్లు విగ్గులను వాడేవారు. వాళ్లు తలను నున్నగా గొరిగించేసుకునేవారు. ఎండ తాకిడికి మాడు మాడిపోకుండా ఉండేం దుకు విగ్గులను కనిపెట్టారు. సహజ కేశా లతో అలరారే తలలను గొరిగించుకోవడ మెందుకో, వాటిపై విగ్గులు పెట్టుకోవడ మెందుకో అనకండి. అప్పట్లో అదే ఫ్యాషన్. ఇక క్రీస్తుశకం 16, 17 శతాబ్దాల్లో ఇంగ్లండ్, ఫ్రాన్స్ వంటి యూరోపియన్ దేశాలలో విగ్గుల వాడకం రాచ కుటుంబాలలో తప్పనిసరి ఫ్యాషన్. ఇంగ్లండ్ రాణి ఒకటో ఎలిజబెత్, ఫ్రాన్స్ రాజు పదమూడో లూయీ వంటి వారంతా విగ్గుధారులే. పద్దెనిమిదో శతాబ్దిలో విగ్గుపై తెల్లపౌడర్ చల్లడం ఫ్యాషన్. అలా చల్లితే కాస్త వయసు మళ్లిన రూపం వచ్చేది. అలాంటి విగ్గును ధరించే వాళ్లను పెద్దమనుషులుగా పరిగణించేవాళ్లు. సినీ ఇండస్ట్రీ మొదలయ్యాక విగ్గులు ఎన్ని వేషాలు నేర్చాయో మనకు తెలిసిందే! -
గోరంత రంగు... కొండత కథ
ఫ్లాష్ బ్యాక్ సౌందర్య వర్ణన చేసేటప్పుడు నఖశిఖ పర్యంతం వర్ణించేవారు మన పూర్వకవులు. అంటే, కొనగోటి నుంచి కొప్పు వరకు నానాలంకార ప్రయోగాలతో వర్ణిస్తూ పద్యాలల్లేవారు. కొప్పుల సంగతి సరే, ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. మరి కొనగోటి వర్ణనలకు ఎందుకంత ప్రాధాన్యం అంటారా..? నఖసౌందర్యానికి కూడా అప్పట్లో చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు. వాటిని అందంగా తీర్చిదిద్దుకునేవారు. రంగు కోసం గోరింట పెట్టుకొనేవారు. గోరుపై గోరంత రంగు పడితేనే, దాని అందం కొండంత అవుతుందని భావించేవారు. నఖసౌందర్యం కోసం రకరకాల నెయిల్ పాలిష్‌లను ఇప్పటికీ అతివలు విరివిగా వాడుతూనే ఉన్నారు. అయితే, గోరింట పెట్టుకోవడం అమ్మమ్మల నాటి ఫ్యాషన్ అని, నెయిల్ పాలిష్‌లు పూసుకోవడం అల్ట్రా మాడర్న్ ఫ్యాషన్ అని చాలామంది అపోహపడుతుంటారు. కానీ, అది నిజం కాదు. నెయిల్ పాలిషే చాలా చాలా పురాతనమైన ఫ్యాషన్. చైనీస్ మహిళలు క్రీస్తుపూర్వం 3000 సంవత్సరాల నాడే గోళ్లకు రంగులు పూసుకునేవారు. ర వంశస్థుల పాలనలో క్రీస్తుపూర్వం 600 సంవత్సరం నాటికి నెయిల్ పాలిష్ చైనాలోని సంపన్న వర్గాల మహిళలకు తప్పనిసరి ఫ్యాషన్‌గా ఉండేది. వాళ్లు తేనెపట్టులోంచి సేకరించిన కొవ్వు, కోడిగుడ్డు సొన, శాకాహార రంగులు ఉపయోగించి, గోళ్లకు పూసుకునే రంగులు తయారు చేసేవారు. పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత కృత్రిమ పద్ధతుల్లో రకరకాల రసాయనాలు ఉపయోగించి తయారు చేసే నెయిల్ పాలిష్‌లు విరివిగా వాడుకలోకి వచ్చాయి. దరిమిలా మారుమూల పల్లెలకూ వీటి వాడుక వ్యాపించింది. -
కంకాళకేయుడి కథ
హ్యూమర్ ఫ్లస్ ఫ్లాష్‌బ్యాక్‌లు వినివిని మైండ్ బ్లాకయిపోయిన ఆజానుబాహుబలి రిలీఫ్ కోసం వంటల పోటీకి వెళ్లాడు. గాడి పొయ్యి అంటించి అగ్గిరాముడై వెలుగుతుండగా దూరంగా ఉన్న ఒక వ్యక్తి ‘బాహుబలి’ అని గొణిగాడు. ఒళ్లంతా తారు పూసుకుని ఒక కంటికి గాజు కన్నుని ఎకస్రా ్టఫిట్టింగ్ చేసుకుని ఉన్నాడతను. అతని పక్కనున్న వ్యక్తి గంగాళంలోకి గరిటెకి బదులు చెయ్యిని పెట్టి కెవ్వున అరిచి ‘బాహుబలా?’ అన్నాడు. దాంతో అందరూ పూనకం పట్టినట్టు ‘బాహుబలి’ అని అరిచారు. ఇది చూసి ఇంకో ఫ్లాష్ బ్యాక్ ప్రమాదముందని గ్రహించిన బలి పారిపోడానికి ప్రయత్నించాడు. గాజు కన్ను అడ్డుగా నిలబడ్డాడు. ‘‘తప్పేముంది స్టార్ట్ చెయ్యి’’ అన్నాడు బలి నిస్సహాయంగా. ‘‘నా పేరు కంకాళకేయుడు. కంటితో చూసిందేదీ నిజం కాదని గ్రహించిన నేను ఈ గాజుకన్నుతో లోకాన్ని చూస్తున్నాను. మీ నాన్న చేతిలో మానం పోయి నగ్నసత్యాన్ని తెలుసుకున్న కళావర్కేయుడు మా అన్న. అరటి ఆకులు కప్పుకుని ఎదుట నిలబడిన మా అన్నని చూసి ఏం జరిగిందని అడిగాను. ‘హరహర మహాదేవ సాంబశివగామి’ అని అరిచాడు. నేను జడుసుకుని ఆ శబ్దానికి అర్థమేమిటని అడిగాను. ఆమె ఒక స్త్రీమూర్తని, ఆమెతో ఏం మాట్లాడినా ప్రమాదమని చెప్పి, ప్రపంచంలో ఎవరికీ అర్థంకాని భాషలో ఆమెతో మాట్లాడితే బతికి బట్టకట్టొచ్చన్నాడు. దాంతో మా రాజ్యంలో నిఘంటువులు అమ్మేవాడిని పిలిచి ఎవరికీ అర్థం కాని భాష తయారు చేయమన్నాను. ఐదు నిముషాల్లో వాడు కిలకిల భాషని రెడీ చేశాడు. శాంపిల్‌గా ‘మిన్కిన్ డంకిన్, చెన్బన్ డమాడమాన్’ అని ఒక వాక్యం వదిలాడు. ఆకారాలను చూసి కాకుండా నకారాలను చూసి భయపడ్డం అదే మొదలు. యుద్ధానికి బయలుదేరాం. అనుకున్నట్టుగానే సాంబశివగామి చర్చలకు వచ్చింది. ‘‘లకలకన్, మకన్టెకన్, నిన్నన్కున్’’ అని అన్నాను. శివగామి చిరునవ్వు నవ్వి తమకు నమ్మకంగా ఉంటూ శత్రువులకి అతినమ్మకంగా రహస్యాలు చేరవేసే ఆఠీన్ జాకీని అనువాదకునిగా ప్రవేశపెట్టింది. వాడు తుండు గుడ్డని నోట్లో కుక్కుకుని ‘నా నోటితో చెప్పలేనమ్మగారూ’ అంటూ బోరున ఏడవసాగాడు. నేను తత్తరపడ్డాను. ‘‘మీ మీద వాడు మనసుపడ్డాడు అమ్మగారు’’ అని వాడు అనువాదం చేశాడు. నేను కోపంతో ‘‘చెత్తనా... (బీప్) నా లాంగ్వేజ్‌కి అర్థమే లేనపుడు ఎలా అనువాదం చేస్తావురా’’ అని బండబూతులు తిట్టాను. ‘‘మీ బాడీ లాంగ్వేజి ద్వారా అనువాదం చేశాను. ప్రపంచంలో అసలైన ప్రమాదం అనువాదమే. అనువాదకుడికి అర్థాలతో పనేలేదు. అసలు ఏ భాషా రాకుండా తెలుగులో పుస్తకాలే అనువాదం చేసినవాళ్లు ఎందరో వున్నారు తెలుసా’’ అన్నాడు జాకీ. వాడికి ఏ కీలుకాకీలు విరుద్దామనుకుంటూ ఉంటే శివగామి పళ్లునూరింది. కొడుకులు కత్తులు నూరారు. వాళ్ల వ్యూహాలన్నింటిని నేను చిత్తు చేస్తూ వుంటే శివగామి ‘గుర్రప్పా’ అని అరిచింది. గుర్రప్ప గుర్రంలా దబేలుమని దూకి అశ్వవ్యూహం అమలు చేశాడు. గుర్రం ఆకారంలో సైన్యం నిలబడి మమ్మల్ని వెనుక కాళ్లతో తన్నసాగింది. మా సైన్యంలో యుద్ధం చేసేవాళ్ల కంటే చూసేవాళ్లు ఎక్కువ ఉండడంతో తన్నులు తిని ఓడిపోయాం. అవమాన జ్వాలతో తిరిగి వెళ్లలేక ఇలా మంటముందు వంటవాడిగా మిగిలిపోయాను’’ అని కంకాళకేయుడు ముగించాడు. ఆజానుబాహుబలి కోపంతో ఊగిపోతూ ‘‘ప్రతివాడు ఫ్లాష్‌బ్యాక్‌లు చెప్పడమే కానీ ఇంతకూ మా నాన్న, వంటవాడు ఎలా అయ్యాడో చెప్పిచావండి’’ అని అరిచాడు. ‘‘అది మీ అమ్మ చారుసేన మాత్రమే చెప్పగలదు. పుట్టిన వెంటనే కేర్‌కేర్ మనకుండా చారుచారు మనడంతో ఆమెకాపేరు. డైమండ్ బళ్లాలుడి కోటలో ఉంది వెళ్లి అడుగు.’’ ‘‘ఎలా గుర్తుపట్టడం?’’ ‘‘కాలికి సంకెళ్లు వేసుకుని, ఎవరైతే కట్టెపుల్లలు ఏరి, పొయ్యిలో పెట్టి కాఫీ చేస్తూ ఉంటారో ఆమే చారుసేన.’’ - జి.ఆర్.మహర్షి -
ఏడాదిగా మహిళపై సీఆర్పీఎఫ్ జవాను అత్యాచారం
బల్లియా: ఇరవై ఏళ్ల యువతిపై ఏడాదిగా ఓ సీఆర్పీఎఫ్ జవాను అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని బల్లియాలో చోటుచేసుకుంది. చివరికి బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీసుల వివరాల ప్రకారం ములాయం యాదవ్ అనే సీఆర్పీఎఫ్ జవాను తన వదిన తరుపు బంధువుల అమ్మాయి అయిన ఓ 20 ఏళ్ల యువతిని బలవంతంగా లొంగదీసుకున్నాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మబలికించి ఏడాదిగా ఇదే వ్యవహారం కొనసాగించాడు. చివరికి ఆమె ఎప్పుడు తనను పెళ్లి చేసుకుంటావని ప్రశ్నించడంతో ప్లేటు ఫిరాయించాడు. పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదని ఆమెను గెంటివేసే ప్రయత్నం చేశాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా ములాయం యాదవ్ ను అదుపులోకి తీసుకున్నారు. -
మీ భూమి.. తప్పుల తడక!
అవుకు మండలం మంగంపేట తండాకు చెందిన కొర్ర శంకర్ నాయక్‌కు రామావరం సమీపంలోని వజ్రగిరి ప్రాంతంలో 143 సర్వే నంబర్లో 1.26 ఎకరాల భూమి ఉంది. అనారోగ్య కారణంగా ఈయన 2009వ సంవత్సరంలో మృతి చెందాడు. ఈ రైతు కుమారుడు శ్రీనివాసనాయక్ తన తండ్రి మరణ ధృవీకరణ పత్రం సంబంధింత రెవెన్యూ కార్యాలయంలో అందజేశాడు. మీ భూమి వెబ్సైట్లో మృతిచెందిన శంకర్‌నాయక్ పేరుమీదనే భూమి ఉన్నట్లు పొందుపరిచారు. దొర్నిపాడుకు చెందిన భూపనపాడి రోషమ్మకు 1093 సర్వే నంబర్లో 2 ఎకరాల మెట్ట పొలం ఉంది. మీ భూమి వెబ్ సైట్ ఆమె ఇంటిపేరు భూపాటి రోషమ్మగా నమోదు చేశారు. సాక్షి, కర్నూలు: ..వీరే కాదు జిల్లావ్యాప్తంగా వేలాది మంది రైతులు ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన మీ భూమి వెబ్సైట్లో తప్పులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులను బతిమాలకుండా, కాళ్లు అరిగేలా తిరగకుండా వారి భూమి వివరాలు వారే చూసుకునేలా ప్రభుత్వం ‘మీ భూమి’ వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా అవకాశం ప్రభుత్వం కల్పించడం వరకు బాగానే ఉన్నా.. వైబ్‌సైట్‌ను క్లిక్ చేసిన వాళ్లకు మాత్రం చుక్కలు కనబడుతున్నాయి. భూముల సమాచారం అంతా తప్పుల తడకగా ఉండడమే ఇందుకు కారణం. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న తప్పులను సరిచేయకపోవడం తమకు మరిన్ని కష్టాలు తెచ్చిపెడుతోందంటున్నారు రైతులు. రైతులు తమ భూమి వివరాలు తాము తెలుసుకోవాలంటే గతంలో రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. అక్కడ అధికారులకు అమ్యామ్యాలు చెల్లించాల్సి ఉండేది.. రెవెన్యూ రికార్డుల కంప్యూటరీకరణ, మీ-సేవ ద్వారా రెవెన్యూ సేవలు, వెబ్‌ల్యాండ్ వంటి మార్పులు జరిగిన తర్వాత ఈ పరిస్థితి మారినా ఇంకా ఇబ్బందులు తప్పలేదు. భూ ముల వివరాలు తెలుసుకునే చిన్నపనికి సైతం ఇళ్లు-ఊరు విడిచి వెళ్లాల్సి రావడంపై ప్రభుత్వం పునరాలోచన చేసింది. ఇంటర్నెట్ సౌకర్యం మారుమూల గ్రామాలకు విస్తరించిన నేపథ్యంలో అరచేతిలో సైతం భూమి వివరాలు తెలుసుకునే దిశగా వెబ్‌సైట్‌ను, మొబైల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్(యాప్)ను రూపొం దించి ‘మీ భూమి’ కార్యక్రమం పేరిట ప్రభుత్వం ప్రారంభించింది. భూములకు సంబంధించిన అడంగల్, 1బి, భూమి కొలతల రికార్డు(ఎఫ్ఎంబీ), గ్రామపటాల వివరాలు నమోదు చేసి ఆన్లైన్ చేశారు. మన భూమి వెబ్సైట్ ఆరంభించి అందరూ చూసుకునే సేవలు వెంటనే అందుబాటులోకి వచ్చాయి. తప్పుల తడక.. జిల్లాలో 914 రెవెన్యూ గ్రామాలు ఉండగా దాదాపు 7 లక్షల 1బి ఖాతాలున్నట్లు సమాచారం. అడంగల్ ఖాతాలు 13 లక్షల వరకూ ఉన్నాయి. ఈ రెండు రికార్డుల్లోనూ దాదాపు 30 శాతంపైగా తప్పులున్నట్లు రెవెన్యూ అధికారులే అభిప్రాయపడుతుండడం గమనార్హం. వాస్తవానికి రికార్డుల్లో ఇప్పుడు సాగులో ఉన్న, భూమి అనుభవిస్తున్న చాలామంది రైతుల పేర్లు లేవు. వారసత్వంగా సంక్రమించిన భూముల్లో తాతా, ముత్తాతల పేర్లు ఉన్నాయి. కొనుగోలు చేసిన వారి పేరున సైతం భూమార్పిడి జరగలేదు. ఆన్లైన్ సమయంలో కూడా ఎన్నో తప్పులు దొర్లాయి. కాగితపు రికార్డుల్లో ఉన్నట్లు కాకుండా రైతుల పేర్లు, సర్వే నంబర్లు, విస్తీర్ణం కూడా తప్పులుగా నమోదు చేశారు. ప్రతి నెలా వందల సంఖ్యలో మార్పు, సవరణలకు దరఖాస్తులు రావడం ఇందుకు నిదర్శనం. ఆ మండలం, ఈ మండలం అని తేడా లేకుండా అన్ని చోట్లా రికార్డుల్లో తప్పులు పరిపాటిగా మారాయి. వీటినే రెండేళ్ల కిందట ఆన్లైన్ చేశారు. వాటినే వెబ్‌ల్యాండ్‌లో ఇటీవల పెట్టారు. ఈ కారణంగా ఇప్పటికే అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. మార్పు కోసం రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు ఆ వివరాలు మీ భూమి వెబ్సైట్లో దర్శనమిస్తున్నాయి. తాజా రికార్డులు నమోదు చేయకుండా వెబ్‌ల్యాండ్ ప్రారంభించడం వల్ల రైతులకు ఒనగూరేదేమీ లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
పదమూడో నెల కోసం...
కాలమానం ఏడాదికి పన్నెండు నెలలు, 365 రోజులు, నెలకు రెండు పక్షాలు, నాలుగు వారాలు, వారానికి ఏడు రోజులు ఉంటాయని అందరికీ తెలిసిందే కదా! వారానికి ఏడు రోజుల చొప్పున నాలుగు వారాలు గల నెలకు ఉండాల్సింది 28 రోజులే కదా అని ఆలోచించారు కొందరు పాశ్చాత్య మేధావులు. ఆ లెక్కన ఏడాదికి పన్నెండు నెలలు సరిపోవు. లెక్క సరిపోవాలంటే పదమూడో నెల చేర్చాల్సిందేనంటూ గట్టి ప్రయత్నాలే చేశారు. పదమూడో నెలను జూన్, జూలై నెలలకు మధ్యన చేర్చాలని కూడా సూచించారు. ఆ లెక్కన ఏడాదికి 364 రోజులే అవుతాయి. ఏడాదికి 365 రోజుల లెక్కను సరిచేసేందుకు జనవరి నెలను 0 తేదీతో ప్రారంభించాలనే సలహాతో ముందుకొచ్చారు. ఇదంతా 1920 నాటి ముచ్చట. ఆ ప్రయత్నం నిష్ఫలమైంది గానీ, లేకుంటే ఏడాదికి ఎన్ని నెలలు అంటే, పదమూడు నెలలు అని పిల్లలకు నేర్పాల్సి వచ్చేది. -
వ్యాపార రంగానికి సరికొత్త జోష్..
ఎన్నో ఆశలు రేపుతున్న వ్యాపార రంగం కొత్త సంవత్సరంలోకి సరికొత్త జోష్ తో అడుగుపెడుతోంది. దేశంలో నరేంద్ర మోదీ నేతృత్వంలోని కొత్త సర్కారు సంస్కరణల బాట పట్టడం.. స్టాక్ మార్కెట్లు ఆశాజనకంగా ఉండటంతో భారత ఆర్థిక వ్యవస్థపై మళ్లీ విశ్వాసం చిగురించింది. మరోపక్క, అంతర్జాతీయంగా చమురు ధరలు నేలకు దిగి రావడం కూడా మనకు చేదోడుగా నిలుస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో మరింత పైకి ఎగిసిన చమురు ధరలు.. చివరికొచ్చేసరికి దిగిరావడం సామాన్య ప్రజలకు ఊరటనిచ్చాయి. తగ్గిన చమురు ధరలు ఈ ఏడాది జూన్ నుంచీ చమురు ధరలు గణనీయంగా పడిపోవడం భారత్ ఆర్థిక వ్యవస్థకు ఒక సానుకూల అంశంగా మారింది. జూన్‌లో 110 డాలర్ల స్థాయిలో ఉన్న బ్రెంట్ క్రూడ్ ధరలు డిసెంబర్ నాటికి 60 డాలర్ల స్థాయికి పడిపోయాయి. పెట్రోల్ డీజిల్, ధరలు డిసెంబర్ లో రెండు సార్లు తగ్గడంతో వినియోగదారులకు వరంగా మారాయి. పెట్రోల్ ధర గత ఆగస్టునుంచి వరుసగా ఎనిమిదో సారి తగ్గగా, డీజిల్ ధర గత అక్టోబర్నుంచి వరుసగా నాలుగోసారి తగ్గడం గమనార్హం. అయితే తీవ్ర ఒడిదుడుకుల్లో ఉన్న చమురు ధరలు ఎప్పుడు స్థిరత్వం పొందుతాయనే అంశంపై మాత్రం పూర్తి అనిశ్చితి నెలకొంది. ఈ పరిణామం దేశీ ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తోంది. ఈ-కామర్స్ జోరు- రిటైల్ బేజారు ఇండియాలో ఈ కామర్స్ పరిశ్రమ జోరుగా వృద్ధి సాధిస్తోంది. 2014లో ఈ-కామర్స్ విజృంభణ ముఖ్యాంశాల్లో ఒకటి. చైనా దిగ్గజ సంస్థ అలీబాబా సహా పలు దేశాల ఈ కామర్స్ సంస్థల దిగ్గజాలు భారత్‌కు క్యూ కట్టారు. ఫ్లిప్ కార్ట్ లాంటి సంస్థలు బిగ్ బిలియన్ డే లాంటి పేర్లతో అత్యంత చవగ్గా వస్తువులు ఇచ్చేయడం లాంటివి ఈ కామర్స్ మరింత పుంజుకోడానికి దోహదపడ్డాయి. ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అలీబాబా రూ.1,50,000 కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీఓ విజయవంతం కావడం, ఆ సంస్థ చీఫ్ జాక్ మా ఆసియాలోనే అపర కుబేరిడినా అవతరించడం గమనార్హం. దేశంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతామని ఈ కామర్స్ సంస్థలు హామీ ఇవ్వడంతో రిటైల్ సంస్థల్లో కొంత అనిశ్చితి నెలకొంది. ఈ విభాగం నేరుగా వ్యాపార రంగంలోకి ప్రవేశించడం వల్ల తమ అమ్మకాలు దెబ్బతింటాయని రిటైల్ సంస్థలు ఆందోళన వ్యక్తం చేశాయి. తమ అమ్మకాలు భారీ తగ్గుముఖం పట్టేఅవకాశం ఉందని రిటైల్ సంస్థలు బేజారెత్తుతున్నాయి. దుమ్మురేపిన స్టాక్ మార్కెట్లు ఈ ఏడాది స్టాక్ మార్కెట్లు లాభాలతో దుమ్మురేపాయి. ఐదేళ్ల తరువాత మళ్లీ సెన్సెక్స్ ఏకంగా 6,038 పాయింట్లు(29%) ఎగసింది. ఒక దశలో చరిత్రాత్మక గరిష్ఠ స్థాయికి చేరుకుంది. దీంతో డిసెంబర్ 3న లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ తొలిసారి రూ. 100 లక్షల కోట్లను (ట్రిలియన్లు) అధిగమించింది. ఈ ఏడాది 21,140 పాయింట్లతో ఆరంభమైన సెన్సెక్స్.. డిసెంబర్ 24 నాటికి 27,209 పాయింట్లతో కొనసాగుతోంది. ఇంతక్రితం 2009లో మాత్రమే సెన్సెక్స్ 7,817 పాయింట్లు జమ చేసుకుంది. ఇక ఎన్ఎస్ఈ ప్రధాన సూచీ నిఫ్టీ సైతం దాదాపు 30% పుంజుకోవడం విశేషం. ఆశాజనకంగా జీడీపీ ఈ ఏడాది రెండో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధిరేటు 5.3 శాతంతో కాస్త కిందికి దిగిజారినా.. గతం కంటే మెరుగ్గా ఉండటం ఆశాజనకంగా మారింది. ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 5.7 శాతం వృద్ధితో ఉత్సాహాన్ని ఇచ్చినా.. తరువాత కిందికి జారిపోవడం కాస్త నిరుత్సహాన్ని నింపింది. గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఐదు శాతం దిగువన జీడీపీ వృద్ధి రేటును నమోదు చేసుకున్నా.. క్రమేపీ ఇది పెరగడం మాత్రం ఉత్సాహాన్ని ఇచ్చింది. వచ్చే ఆర్థిక సంవత్సరం(2015-16)లో దేశ ఆర్థిక వ్యవస్థ 6.4% వృద్ధిని సాధించగలదని డన్ అండ్ బ్రాడ్‌స్ట్రీట్ తాజాగా అంచనా వేసింది. పెట్టుబడుల వాతావరణం పుంజుకోవడం ఇందుకు సహకరించగలదని ఒక నివేదికలో తెలిపింది. ఎయిర్ ఏషియా ఇండియా సేవలు ఇండిగో, స్పైస్‌జెట్, గో ఎయిర్, జెట్‌లైట్‌ల తరహాలో ఎయిర్ ఏషియా కూడా చౌక విమానయాన సర్వీసులను అందించడానికి ఈ ఏడాది శ్రీకారం చుట్టింది. టోనీ ఫెర్నాండెస్ నేతృత్వంలోని మలేసియా విమానయాన సంస్థ, ఎయిర్ ఏషియా, టాటా సన్స్, అరుణ్ భాటియాకు చెందిన టెలిస్ట్రా ట్రేడ్‌ప్లేస్‌లు కలసి 49:30:21 భాగస్వామ్యంతో ఎయిర్ ఏషియా ఇండియా సంస్థను ఏర్పాటు చేశాయి. ఇదిలా ఉండగా ఈ ఏడాది స్పైస్ జెట్ కష్టాలు కూరుకుపోయింది. విదేశీ, దేశీ సరఫరాదారులు, విమానాశ్రయ నిర్వాహకులు, చమురు కంపెనీలకు బకాయిలు రూ. 1,230 కోట్లకు ఎగబాకడంతో అవి తక్షణం చెల్లింపు జరపాలంటూ పట్టుబట్టాయి. దీంతో ఒకరోజు సర్వీసుల నిలిపివేత వరకూ పరి స్థితి వెళ్లింది. చివరకు ప్రభుత్వం కొంత వెసులుబాటు ఇవ్వడంతో మళ్లీ సర్వీసులు కొనసాగుతున్నాయి. పెను సవాళ్లతో ఆటోమొబైల్ రంగం అమ్మకాలపరంగా ఆటోమొబైల్ కంపెనీల ప్రయాణం ఈ ఏడాది పెను సవాళ్లను ఎదుర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో ఆటో ఎక్స్‌పోలో ఏకంగా 70 కొంగొత్త మోడల్స్ ఊరించిన మార్కెట్ మాత్రం ఎగుడుదిగుడుగా సాగింది. మొబీలియో, సియాజ్, జెస్ట్ వంటి వాహనాలతో ఏడాది పొడవునా కొత్త కార్లు సందడి చేశాయి. అయితే, అమ్మకాలు మాత్రం ఒక నెల పెరగడం, మరో నెల తగ్గడం లాగా సాగింది. ఏడాది తొలి 11 నెలల్లో అమ్మకాలు 10 శాతం మేర క్షీణించాయి. కాంపిటీషన్ కమిషన్ 14 కార్ల సంస్థలపై రూ. 2,545 కోట్ల జరిమానా విధించడం మరో చెప్పుకోతగ్గ పరిణామం. అయితే, సవాళ్లెన్ని ఎదురైనప్పటికీ.. ఆటోమొబైల్ కంపెనీలు మాత్రం ఇన్వెస్ట్మెంట్ల విషయంలో వెనక్కి తగ్గలేదు. మహీంద్రా, మారుతీ, హీరో మోటోకార్ప్, బజాజ్ తదితర సంస్థలు 5 బిలియన్ డాలర్ల మేర భారీ పెట్టుబడులను ప్రకటించాయి. కొత్త సంవత్సరం సానుకూలంగా ఉండగలదని ఆటోమొబైల్ కంపెనీలు ఆశావహంగా ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య ' వ్యాపార' పోటీ వ్యాపార రంగంలో తెలుగు రాష్ట్రాలు తమ ఉనికిని చాటి చెప్పేందుకు యత్నిస్తున్నాయి. ఆ రెండు రాష్ట్రాలు భౌగోళికంగా విడిపోయినప్పటికీ రెట్టించిన ఉత్సాహంతో వ్యాపార కార్యకలాపాల్ని మరింత ముందుకెళ్లేందుకు బాటలు వేసుకుంటున్నాయి. కొత్త ప్రాజెక్టులు, విస్తరణలు, పెట్టుబడులు ఇలా అన్నింటా రెండు రాష్ట్రాల మధ్య ఒక రకంగా పోటీకి తెరతీసింది. కొత్త పెట్టుబడులను ఆకర్షించడానికి రెండు రాష్ట్రాలు పోటీ పడుతుండటంతో కార్పొరేట్ రంగం సంతోషాన్ని వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించి ముందంజలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ దిశగా యత్నాలు ఆరంభించింది. హీరో మోటార్ సైకిల్స్ ప్రాజెక్ట్ గురించి ఇరు రాష్ట్రాలు పోటీ పడగా చివరకు ఆ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. అయితే ప్రపంచ అతిపెద్ద రిటైల్ ఫర్నిచర్ సంస్థ ఐకియూ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. అలాగే ఇసుజు, ఏషియన్ పెయింట్స్ వంటి సంస్థలు ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకొస్తే తెలంగాణలో ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, కోజెంట్ గ్లాస్ యూనిట్, జాన్సన్ అండ్ జాన్సన్, కోకకోలా తదితర కంపెనీలు భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. ఐటీ 'విస్తరణ ' తెలంగాణ ప్రభుత్వం గ్రామ స్థాయికి ఐటీని విస్తృతం చేస్తోంది. హైదరాబాద్‌ను వైఫై నగరంగా తీర్చిదిద్దడానికి ఇప్పటికే తన కార్యాచరణను మరింత విస్తృతం చేసింది. తొలుత హైటెక్‌సిటీ ప్రాంతంలో ఎయిర్‌టెల్‌తో కలిసి పబ్లిక్ వైఫై అందుబాటులోకి తెచ్చింది. టెక్నాలజీ స్టార్టప్‌ల కోసం టి-హబ్ పేరుతో దేశంలో అతిపెద్ద ఇంక్యుబేషన్ కేంద్రం ట్రిపుల్ ఐటీ క్యాంపస్‌లో ఏర్పాటవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ కూడా ఐటీకి విస్తృత ప్రాధాన్యం ఇస్తోంది. ఇంటర్నెట్ పరిజ్ఞానాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్లాలన్న లక్ష్యంతో డిజిటల్ ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో భాగంగానే గూగుల్, విప్రో తదితర సంస్థలతో చేతులు కలిపింది. ఏరోస్పేస్ కు ప్రత్యేక పాలసీ తెలంగాణ ప్రభుత్వం ఏరోస్పేస్‌కు ప్రత్యేక పాలసీని తీసుకొచ్చింది. స్విట్జర్లాండ్ కంపెనీ రువాగ్ ఏవియేషన్ తయారీ డార్నియర్-228 విమానాల కోసం విమాన బాడీ, రెక్కల తయారీ కేంద్రాన్ని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఆదిభట్లలోని ఏరోస్పేస్, ప్రెసిషన్ ఇంజనీరింగ్ సెజ్‌లో నెలకొల్పుతోంది. ఫ్రాన్స్‌కు చెందిన సాఫ్రాన్ సహకారంతో జీఎంఆర్ గ్రూప్ ఏరోస్పేస్ ట్రైనింగ్ హబ్‌ను శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఏర్పాటు చేస్తోంది. -
ఫేస్బుక్ సారీ!
విషాదాలను గుర్తుచేసినందుకు న్యూయార్క్: సంవత్సర సమీక్ష పేరుతో విషాద సంఘటనలనూ గుర్తు చేసినందుకు ఫేస్బుక్ యూజర్లను ఆ వెబ్సైట్ క్షమాపణలు కోరింది. ఫేస్బుక్లో ఏడాది పాటుగా యూజర్లు ఉంచిన పోస్టుల్లో కొన్నింటిని హైలైట్లుగా ఎంపికచేసి ప్రతి ఖాతాదారుడికీ తన ‘ఇయర్ ఇన్ రివ్యూ’ చూపించేలా ఆ వెబ్సైట్ ఓ అప్లికేషన్ ఉపయోగించింది. వీడియో, ఫొటోల హైలైట్లను చూడటంతో పాటు షేర చేసేందుకూ వీలయ్యేలా ఈ ‘ఇయర్ ఇన్ రివ్యూ’ యాప్‌ను ఫేస్బుక్ రూపొందించింది. అయితే ఆనందకర సంఘటనలతోపాటు విషాద సంఘటనలనూ హైలైట్లుగా ఎంపిక చేసి ఈ యాప్ సమీక్షలో ఉంచేసింది. దీంతో యూజర్లు మనో వేదనకు గురయ్యారు. అందుకే యూజర్లకు క్షమాపణలు చెబుతున్నామని ఫేస్బుక్ వర్గాలు తెలిపాయి. -
యాహూ సెర్చ్‌లో ప్రధాని మోదీ టాప్
బెంగళూరు: నెటిజన్లు ఈ ఏడాది ఇంటర్నెట్లో ప్రధాని నరేంద్ర మోదీ, పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీల పేర్లను ఎక్కువగా సెర్చ్ చేశారని యాహూ పేర్కొంది. యాహూ ఇండియా సంస్థ ఇయర్ ఇన్ రివ్యూ పేరుతో ఏడవ వార్షిక నివేదికను విడుదల చేసింది. ఈ ఇయర్ ఇన్ రివ్యూ ప్రకారం..., అత్యంత శక్తివంతమైన అగ్రశ్రేణి పది రాజకీయ నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో నిలిచారు. ఈ దేశపు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ మొదటి స్థానంలో ఉన్నారు. ఇక సెలిబ్రిటీల విషయానికొస్తే, సన్నీ లియోన్ వరుసగా మూడో ఏడాది మొదటి స్థానంలో నిలిచారు. -
పాలెం బస్సు ప్రమాదం : స్పెషల్ డ్రైవ్
-
ఆ మంటలు ఆరలేదూ.. ఆ కన్నీళ్ళూ ఆగలేదు!
-
పాలెం దుర్ఘటనకు నేటితో ఏడాది
-
పాలెం దుర్ఘటన కు నేటితో ఏడాది
* కొంతమంది బాధితులకు నేటికీ అందని పరిహారం * జబ్బర్ ట్రావెల్స్‌లో సజీవదహనమైన 44 మందికి నేడు శ్రద్ధాంజలి బెంగళూరు : మహబూబ్‌నగర జిల్లా, కొత్తకోట మండలంలోని పాలెం గ్రామం సమీపంలో జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు ప్రమాదానికి గురై 44 మంది సజీవదహనమైన సంఘటనకు నేటితో ఏడాది పూర్తయింది. నేటికీ కొంతమంది బాధితులు పరిహారం కోసం న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు. వివరాలు.. గత ఏడాది అక్టోబర్ 29వ రాత్రి 11 గంటల సమయంలో ఇక్కడి కలాసిపాళ్యలోని జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన వోల్వో బస్సు (ఏపీ 02- టిఏ,0963) హైదరాబాద్‌కు బయలుదేరింది. ఆ బస్సులో 50 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ ఫిరోజ్ బాష బస్సును అతి వేగంతో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లాడు. అర్ధరాత్రి దాటిన తరువాత ప్రయాణికులు గాఢనిద్రలోకి జారుకున్నారు. అక్టోబర్ 30వ తేదీ వేకువజామున 5.10 గంటల సమయంలో మహబూబ్‌నగర జిల్లా, కోత్తకోట మండలంలోని పాలెం-కనుమెట్ట గ్రామం మధ్యలోని జాతీయ రహదారిలో కారును ఓవర్టేక్ చేయడానికి ప్రయత్నిస్తూ వోల్వో బస్సు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. 15 సెంకెడ్లలో బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో 44 మంది సజీవదహమయ్యారు. ఈ ప్రమాదంలో మహబూబ్‌నగర జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టు న్యాయమూర్తి పల్లే మోహన్‌కుమార్ కుమార్తె ప్రియాంక (గర్బిణి), చిరంజీవి అభిమానుల సంఘం కర్ణాటక అధ్యక్షుడు కోటే వెంకటేష్, ఆయన సోదరి అనితతో పాటు, దంపతులు, చిన్నారి, వ్యాపారులు, ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ఈ ప్రమాదంలో సజీవదహనమైన వారికి బెంగళూరు కలాసిపాళ్యలో గురువారం శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిర ణ్ కుమార్‌రెడ్డి కేసు దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని, నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. బస్సుకు ఉన్న ఇన్సూరెన్స్‌ను క్లయిమ్ చేసి మృతుల కుటుంబ సభ్యులకు అందిస్తామని చెప్పారు. అయితే నేటికీ మృతుల కుటుంబ సభ్యులు కొంతమంది ప్రభుత్వ కార్యాలయాల చుట్లూ తిరుగుతూనే ఉన్నారు. న్యాయం జరగకపోవడంతో వారు మహబూబ్నగరలోని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేసు విచారణలో ఉంది. -
కరెంట్ అఫైర్స్‌కు ప్రత్యేక పోర్టల్
హైదరాబాద్: పోటీ పరీక్షల్లో కరెంట్ అఫైర్స్ పాత్ర నిర్వచించలేనిది. ఏ పరీక్ష తీసుకున్నా కనీసం 20 నుంచి 30 శాతం ప్రశ్నలు వస్తాయి. ఈ తరుణంలో ప్రతి పరీక్షకు స్టడీ మెటీరియల్, మోడల్ పేపర్లతో ప్రత్యేక పోర్టల్స్ ప్రారంభించే సాక్షి ఇప్పుడు కరెంట్ అఫైర్స్‌కు కూడా తెలుగు, ఇంగ్లిష్‌లో ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించింది. ఈ పోర్టల్‌లో ైడైలీ, వీక్లీ, మంత్లీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్ బిట్బ్యాంక్తో పాటు కరెంట్ అఫైర్స్ స్పెషల్ (ఇయర్ రౌండప్), సులువుగా ప్రాక్టీస్ చేసుకునేందుకు మంత్లీ ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్టులను రూపొందించింది. రోజూ దినపత్రిక చదువుతూ సాక్షి ప్రత్యేకంగా రూపొందించిన కరెంట్ అఫైర్స్, బిట్ బ్యాంక్స్ సాధన చేయడం వల్ల ఈ విభాగంలో మంచి మార్కులు సాధించవచ్చు. అంతర్జాతీయ సంఘటనలు, ద్వైపాక్షిక సంబంధాలు-నిర్ణయాలు, దేశ ఆర్థిక వ్యవస్థలో మార్పులు, తాజా నియామకాలు, వార్తల్లోని వ్యక్తులు, క్రీడలు-విజేతలు, సదస్సులు-సమావేశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తున్న కొత్త ఆవిష్కరణలు వంటి వాటిలో తాజా అప్డేట్స్ కోసం క్లిక్ చేయండి.. http://www.sakshieducation.com/CA/Index.html -
ప్రేమ ఎంత కఠినం!
కనువిప్పు ఆ అమ్మాయితో మాట్లాడడానికి తప్ప చదువుకోవడానికి కాలేజికి వెళ్లేవాడిని కాదు. దాని ఫలితం పరీక్ష తప్పడం. ప్రేమ ఎంత కఠినం... అనే మాటను మామూలుగానైతే ప్రేమలో భంగపడిన సందర్భంలోనో, విరహవేదనలో ఉన్నప్పుడో వాడుతుంటారు. కానీ, నేను మాత్రం ఆ నేపథ్యం నుంచి ‘ప్రేమ ఎంత కఠినం’ అనే మాటను వాడడం లేదు. ఎందుకు వాడానో తెలుసుకోవాలంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్‌లోకి... నేను మొదటి నుంచి చదువులో ముందుండే వాడిని. ‘‘అరే...వాడిని చూసి నేర్చుకోండిరా...స్టూడెంట్ అంటే అలా ఉండాలి’’ అని చదువులో వెనకబడిన విద్యార్థులను ఉద్దేశించి టీచర్లు నా గురించి చెప్పేవారు. ఇంటర్మీడియెట్‌లో చేరిన తరువాత మాత్రం పరిస్థితి పూర్తిగా మారింది. నేను ఒక అమ్మాయి ప్రేమలో పడ్డాను. నిజానికి అది ప్రేమ కాదు ఆకర్షణ అంటే సరిపోతుందేమో. ఆ అమ్మాయిని మెప్పించడం, ఆమెతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండడమే నా లోకం అయిపోయింది. చదువు కాస్తా వెనక్కి వెళ్లిపోయింది. ఆ అమ్మాయితో మాట్లాడడానికి తప్ప చదువుకోవడానికి కాలేజికి వెళ్లేవాడిని కాదు. దాని ఫలితం పరీక్ష తప్పడం. ఈ సమయంలోనే వాళ్ల నాన్నకు బదిలీ కావడంతో ఆ అమ్మాయి మహారాష్ట్రకు వెళ్లిపోయింది. ఒకవైపు పరీక్ష తప్పిన బాధ, మరోవైపు ఆ అమ్మాయి దూరమైన బాధ....నా మానసిక పరిస్థితి పూర్తిగా దెబ్బతింది. బరువు చాలా తగ్గిపోయాను. ఎప్పుడూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండేవాడిని. ‘‘నీకు ఎంత డబ్బు అంటే అంత ఇస్తాను. నీ ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేసుకో. సినిమాలకు వెళతావో, ఫ్రెండ్స్‌తో షికార్లకు వెళతావో నీ ఇష్టం. ఖాళీగా మాత్రం కూర్చోవద్దు. అనవసరంగా ఆలోచించవద్దు’’ అని చెప్పాడు నాన్న. బయటకు వెళ్లి సినిమాలైతే చూడలేదుగానీ, మా ఇంట్లో ఉన్న సిస్టమ్‌లో ఇరానీ సినిమాలు కొన్ని చూశాను. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక సందేశం నా దరికి చేరేది. ‘‘నాకు కాళ్లు చేతులు మాత్రమే లేవు. ఆత్మవిశ్వాసం ఉంది’’ అని చెబుతుంది ఒక ఇరానీ సినిమాలో ఒక పాత్ర. ఇది నా మీద చాలా ప్రభావం చూపించింది. ‘‘నాకు కాళ్లూ చేతులు మాత్రం ఉన్నాయి. ఆత్మవిశ్వాసం లేదు’’ అనుకున్నాను. నన్ను నేను నిరూపించుకోవాలనుకున్నాను. అటకెక్కిన పాఠ్యపుస్తకాలకు పని కల్పించాను. చదువు తప్ప వేరే లోకం లేదు...అన్నట్లుగా చదివాను. ఎక్కువ మార్కులతో పరీక్ష పాసయ్యాను. సివిల్స్ రాయలనేది నా భవిష్యత్ లక్ష్యం. ‘‘ఇప్పుడు నాకు కాళ్లు చేతులే కాదు...ఆత్మవిశ్వాసం కూడా ఉంది’’. నా భవిష్యత్ లక్ష్యాన్ని చేరుకుంటాననే నమ్మకం నాలో ఉంది. -ఆర్యస్వీ, రాజోలు -
ఆ రోజు ఆ రోడ్డులో వెళ్లకపోయి ఉంటే...
‘‘ఓ రోజు నేను రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతుంటే, ఒకాయన కారులో వెళుతున్నారు. నన్ను చూడగానే ఆయన కారాపి ‘రేపు ఒకసారి ఆఫీసుకి రాగలవా’ అని అన్నారు. నాకేం అర్థం కాలేదు. కాసేపు నా నోట మాట రాలేదు. ఎందుకంటే, ఆ పిలిచిన వ్యక్తి ఎవరో కాదు.. గ్రేట్ డెరైక్టర్ కె. బాలచందర్. ఆ తర్వాత రోజు నేను ఆఫీసుకు వెళ్లడం. నా కెరీర్ మలుపు తిరగడం.. ఇదంతా అందరికీ తెలిసిన చరిత్రే’’ అని కమల్‌హాసన్ ఉద్వేగంగా చెప్పారు. కామెడీ హీరో సంతానం కథానాయకునిగా నటించిన ‘వాలిబ రాజా’ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో కమల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, తన ఫ్లాష్‌బ్యాక్‌ని గుర్తు చేసుకున్నారు. ఇంకా కమల్ మాట్లాడుతూ - ‘‘యువతరాన్ని ప్రోత్సహించాలని నా గురువు కె. బాలచందర్ చెబుతుంటారు. ఆయన ప్రోత్సహించారు కాబట్టే, నేనీ రోజు మంచి స్థాయిలో ఉన్నాను. ఇక.. నన్ను రోడ్డు మీద చూసి, ఆయన ఎందుకు రమ్మన్నారంటే... ‘అపూర్వ రాగంగళ్’ సినిమా కోసం తమిళ నటుడు శ్రీకాంత్‌ని హీరోగా అడిగితే, ఆయన బిజీగా ఉన్నారట. శ్రీకాంత్ బిజీగా ఉన్నంత మాత్రన రోడ్డు మీద వెళ్లేవాళ్లని నటించపజేస్తామా.. ఏంటి? అని బాలచందర్‌గారు అంటున్న సమయంలో నేను కనిపించానట. నేను కరెక్ట్‌గా ఉంటాననిపించి, నన్ను ఎంపిక చేశారు. ఆ రోజు నేనా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్లకపోయి ఉంటే, ఈరోజు ఎక్కడ ఉండేవాణ్ణో తెలియడంలేదు. నేను లాయర్ కావాలనుకునేవాణ్ణి. ఒకవేళ సినిమాల్లో అవకాశం రాకపోతే, ఈపాటికి ఏదైనా కేసులు వాదించుకుంటూ ఉండేవాణ్ణేమో’’ అన్నారు నవ్వుతూ. -
ఖరీఫ్‌పై రైతన్న ఆశలు
-
తను దూరమయ్యాక వెక్కి వెక్కి ఏడ్చాను
దీపికా పదుకొనే తన ఫ్లాష్‌బ్యాక్‌ని గుర్తు చేసుకొని కాసేపు కన్నీళ్ల పర్యంతం అయిపోయారు. అంత బాధ కలిగించిన ఆ ఫ్లాష్‌బ్యాక్ ఏంటా! అనుకుంటున్నారా? తన మాజీ ప్రియుడు రణబీర్‌కపూర్ నుంచి తాను విడిపోయిన ఆ క్షణాలు. ఆ సంఘటనను తానెప్పటికీ మరిచిపోలేనంటోంది దీపిక. ఇటీవల ఓ మీడియా సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. నాటి క్షణాలను గుర్తు చేసుకున్నారు. అప్పుడు ఏడ్చినట్లు తానెప్పుడూ ఏడ్వలేదని సభాముఖంగా చెప్పేశారు. అంతగా బాధ పడ్డారంటే... రణబీర్‌ని మీరు ఏ స్థాయిలో ప్రేమించారో అర్థమవుతోంది? అనంటే- ‘‘దాన్ని ప్రేమ అనాలో ఆకర్షణ అనాలో తెలీదు. ఎందుకో కానీ బాధేసింది. రణబీర్‌తో అనుబంధం నాకో గొప్ప గుణపాఠం. ఎవర్నీ ఎక్కువగా ఇష్టపడకూడదని, ఎవరిపై ఆధారపడకూడదని అతని విషయంలో నాకు తెలిసిన సత్యాలు. కొన్నాళ్లు గదిలోనుంచి నేను బయటకే రాలేదు. వెక్కి వెక్కి ఏడ్చాను. కోలుకోవడానికి కొన్నాళ్లు పట్టింది. ఏది ఏమైనా నా జీవితంలో రణబీర్‌తో గడిపిన క్షణాలు మరిచిపోలేనివి’’ అని ఉద్వేగానికి గురయ్యారు దీపిక. మళ్లీ మీ ప్రేమ చిగురించే అవకాశం ఉందంటారా? అనంటే- ‘‘ ఆ విషయం నేనెప్పుడూ ఆలోచించలేదు. ప్రస్తుతం మేమిద్దరం మంచి స్నేహితులం... అంతే’’ అన్నారు ముక్తసరిగా దీపిక. -
మెరుపులు... మరకలు
కాలం కొలిమిలో మరో ఏడాది కలిసిపోయింది. జ్ఞాపకాలు మిగులుస్తూ 2013 వీడలేక వీడ్కోలు తీసుకుంది. ఈ 365 రోజుల్లో ఎన్నో అనుభవాలు, మరెన్నో అనుభూతులు. కొన్ని ఘటనలు ఛాతీ ఉప్పొంగేలా చేస్తే, ఇంకొన్ని కంట నీరు పెట్టించాయి. ఈ పన్నెండు నెలలూ ఏదో ఒక విశిష్ట కార్యక్రమానికి జిల్లా వేదికగా మారింది. ఆ వివరాలు... -న్యూస్‌లైన్, బొబ్బిలి జనవరి ఈ నెలలో ఇరవయ్యే తేదీ నుంచి జరిగిన నంది నాటకోత్సవాలు జిల్లా వాసులను అలరించాయి. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా కొత్త ఉత్తేజం వచ్చింది. ఈ నెల ఐదో తేదీన వైఎస్ఆర్ సీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్తగా సుజయ్‌కృష్ణ రంగారావు బాధ్యతలు స్వీకరించారు. అలాగే శంబర సిరిమానోత్సవం ఘనంగా జరిగింది. మొదటి సహకార ఎన్నికలకూ ఇదే నెల వేదికైంది. ఫిబ్రవరి ఈ నెలలో పదిహేనో తేదీన బొబ్బిలి మం డలం కలువరాయిలో బాణసంచా పేలుడు సంఘటన జిల్లా వాసులను ఉలిక్కిపడేలా చేసింది. అలాగే పదిహేడో తారీఖున బొబ్బిలిలో ఓ మానసిక వికలాంగురాలు మృగాళ్ల దాడికి బలైంది. రామతీర్థంలో వెంకన్న కల్యాణం వైభవంగా జరిగింది. అయితే రథయాత్రలో రథం ఇరుసు విరిగి విమర్శలూ వచ్చాయి. జిల్లాలో వస్త్ర దుకాణాల బంద్ కూడా నిర్వహించారు. మార్చి ఈ నెల ఒకటో తేదీన రామతీర్థంలో పరిపూర్ణానంద స్వామి ఆధ్వర్యంలో లక్షదీపారాధన నిర్వహించారు. అలాగే పదో తేదీన హాస్యనటుడు బ్రహ్మానందానికి పురస్కారం అందించారు. జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన విద్యుత్ మహాధర్నాకు మంచి స్పందన లభించింది. అప్పటి కలెక్టర్ వీరబ్రహ్మయ్య ప్రభుత్వ కార్యదర్శిగా పదోన్నతి పొందారు. ఇరవై ఒకటో తేదీన నెల్లిమర్ల నగర పంచాయతీగా మార్పు చెందింది. గరివిడి, బాడంగిలలో అగ్ని ప్రమాదాలు సంభవించాయి. మే ఈ నెల పదిహేనో తేదీన రామతీర్థంలో ఓ యువతిని దారుణంగా హత్య చేశారు. విజయనగరంలో గర్భిణిని సజీవంగా దహనం చేశారు. 27వ తేదీన గుర్ల మండలంలో ప్రమాదం సంభవించి 48 ఇళ్లు కాలిపోయాయి. కొమరాడలో మావోయిస్టుల డంప్ దొరికింది. ఈ నెలంతా జిల్లా వాసులకు నష్టాల ఘటనలే పలకరించాయి. ఏప్రిల్ వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీలపై ఆందోళన నిర్వహించారు. గజపతినగరంలో పదహారో తే దీన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి అమ్మహస్తం పథకం ప్రారంభించారు. ఐదో తేదీన రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రోహిణి జిల్లాలో పర్యటించారు. బొబ్బిలిలో వేణుగోపాల స్వామి తెప్పోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. జూన్ ఈ నెల పదహారో తేదీన జిల్లా కేంద్రంలో వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటించారు. అలాగే 18వ తేదీన కాంతిలాల్ దండే కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఎనిమిదో తేదీన బొబ్బిలి ఎమ్మెల్యే సుజయ్ కృష్ణరంగారావుపై అనర్హత వేటు పడింది. ఇరవైన విజయనగంలో ఖాదర్ వలీ బాబా 54వ చందనోత్సవం జరిగింది. జూలై ఆరో తేదీన మహానేత తనయ వైఎస్ షర్మిల జిల్లాలో మరో ప్రజాప్రస్థానం పాదయాత్రను ప్రారంభించా రు. 23, 27 తేదీల్లో పంచాయతీ తొలి, మలి విడత ఎన్నికలు జరిగాయి. ముపై్పవ తేదీన భోగాపురం మండలం చినకొండరాజు పాలెంలో 150 ఇళ్లు దగ్ధమయ్యాయి. 29వ తేదీన పూసపాటిరేగ మండలం చినకొండరాజు పాలెంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఆగస్టు ఈ నెల 23వ తేదీన విజయనగరంలో పదివేల మందితో మా తెలుగుతల్లి గీతాన్ని ఆలపించా రు. ఏడో తేదీన మంత్రి బొత్స ఇంటిని ముట్టడించారు. అలాగే 28వ తేదీన ఐటీడీఏ పీఓగా రంజిత్ కుమార్ షైనీ, సబ్ కలెక్టర్‌గా శ్వేతా మహంతి నియమితులయ్యారు. 24వ తేదీన రామతీర్థంలో రాముని పట్టాభిషేకం వైభవంగా జరిగింది. 30న విజయనగరంలో లక్షజన గర్జన దద్దరిల్లిపోయింది. సెప్టెంబర్ ఈ నెల 26వ తేదీన ఉగ్రవాదుల చేతిలో మెంటాడ మండల వాసి మృతి చెం దారు. పదో తేదీన గుమ్మలక్ష్మీపురంలో డంప్ స్వాధీనం చేసుకున్నారు. 26వ తేదీన ఏసీబీ వలలో భోగాపురం ఎంఈఓ చిక్కారు. 19వ తేదీన డెంకాడ మండలం చంపావతి వద్ద నదిలో పడి ఇద్దరు మృతి చెందడం జిల్లా వాసులను కలవరపరిచింది. అక్టోబర్ సమైక్యాంధ్రకు మద్దతుగా రెండో తేదీన నియోజకవర్గ కేం ద్రాల్లో వైఎస్ఆర్ సీపీ దీక్షలు ప్రారంభం. నాలుగో తేదీన జిల్లా కేంద్రంలో ఉవ్వెత్తున సమైక్య సెగ ఎగసి పడింది. ఐదో తేదీన జిల్లా కేంద్రంలో కర్ఫ్యూ పెట్టారు. 22వ తేదీన కర్ఫ్యూలోనే పైడితల్లి సిరిమానోత్సవం జరిగింది. 27వ తేదీన నెలిమర్ల, చీపురుపల్లిలో చంద్రబాబు పర్యటించారు. 27న ఎస్పీ కార్తికేయకు బదిలీ అయింది. 30వ తేదీన వైఎస్ విజయమ్మ పూసపాటిరేగ, భోగాపురం మండలాల్లో పంట నష్టాలు పరిశీలించారు. నవంబర్ ఈ నెల మూడో తేదీన గొట్లాం వద్ద విజయవాడ పాసింజర్ ఢీకొని ఎనిమి ది మంది మృతి చెందారు. ఐదో తేదీన గజపతినగ రం మాజీ ఎమ్మెల్యే వంగపండు నారాయణప్పలనాయుడు మృ తి చెందారు. పదకొండో తేదీన భోగాపురం మండలం ముక్కాం లో 19 ఇళ్లు దగ్ధమయ్యాయి. 14న గుర్ల మండలం చంపావతి నదిలో మునిగి ముగ్గురు బాలికలు మృతి చెందిన ఘటన విషా దం నింపింది. 21న బొండపల్లి మండలం రయింద్రంలో అగ్ని ప్రమాదం జరిగి 28 ఇళ్లు కాలిపోయాయి. 30న మొదలి నాగభూషణ శర్మకు గురుజాడ విశిష్ట పురస్కారం అందించారు. డిసెంబర్ ఆరో తేదీన సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో జిల్లా బంద్ నిర్వహించారు. 17వ తేదీన డుమా పీడీగా గోవిందరాజులు నియమితులయ్యారు. 20న నెల్లిమర్ల ఎస్టీఓ, సీనియర్ అకౌంటెంట్ ఏసీబీ వలకు చిక్కారు. 28న డెంకాడ మండలం చింతలవలస వద్ద బడ్డీలోనికి లారీ దూసుకు వెళ్లి ఐదుగురు దుర్మరణం చెందారు. -
2013లో అతి తక్కువ రోజులు సమావేశమైన అసెంబ్లీ
-
ఫోర్డ్‌కు జోష్ ఇచ్చిన ఎకోస్పోర్ట్
-
బంగారంలో స్వర్ణయుగానికి ముగింపు పలికిన 2013
-
హిట్టూ.. ఫట్టూ..
-
2013 - ప్రభుత్వం దెబ్బకు తగ్గిన బంగారం దిగుమతులు
బంగారానికి సంబంధించి ఈ ఏడాది మన దేశంలో కీలక అంశాలు చోటుచేసుకున్నాయి. బంగారం ధరలు భారీ స్థాయిలో పెరగడం, తగ్గడం కూడా జరిగింది. అలాగే బంగారం దిగుమతులను తగ్గించేందుకు ఈ ఏడాది ప్రభుత్వం మూడుసార్లు దిగుమతి సుంకం పెంచింది. దాంతో దిగుమతులు బాగా తగ్గాయి. బంగారం ధర గరిష్ట స్థాయికి చేరుకోవడమే కాక అదే స్థాయిలో పతనమైంది. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములు ఏడాది మొత్తంలో దాదాపు 8 వేల రూపాయల వరకు వ్యత్యాసంతో అమ్మకాలు జరిగాయి. మే నెలలో 25 వేల రూపాయలకు పడిపోతే, ఆగస్ట్‌లో 33 వేల రూపాయలు దాటి పోయింది. ఈ ఏడాది ప్రారంభంలో జనవరి 1న 30.860 రూపాయలు ఉన్న ధర ఏప్రిల్ నెలలో 25, 654 రూపాయలకు పతనం అయింది. మళ్లీ మూడు నెలల్లో ఆగస్ట్‌లో 33,640 రూపాయలకు చేరింది. డిసెంబరు 23కు వచ్చేసరికి 28,550 రూపాయల వద్ద అమ్మకాలు జరుగాయి. బంగారం దిగుమతులు విదేశీ మారకద్రవ్యాన్ని హరించివేస్తున్నాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులు కలిగిస్తున్న పసిడిపై మోజు తగ్గించుకోవాలని, బంగారం కొనుగోళ్ల జోలికి వెళ్లవద్దని కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ప్రజలను బతిమిలాడారు. దేశ భవిష్యత్తు ప్రయోజనాల కోసమైనా దయచేసి బంగారాన్ని కొనవద్దని విజ్ఞప్తి చేశారు. అయినా ఫలితం లేదు. బంగారం దిగుమతి తగ్గకపోగా, బంగారు ఆభరణాల ఎగుమతి కూడా తగ్గిపోతోంది. ఇది మరీ ఆందోళన కలిగించింది. భారత్ ఎగుమతులు-దిగుమతుల విధానంపై బంగారం తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతోందని ఒక దశలో వాణిజ్య కార్యదర్శి ఎస్ఆర్ రావు ఆందోళన కూడా వ్యక్తం చేశారు. బంగారం దిగుమతి పెరగడంతో రూపాయిపై వత్తిడి కూడా పెరిగిపోతోంది. ఇక ప్రభుత్వానికి కఠిన చర్యలు చేపట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. డిమాండ్ తగ్గించేందుకు పసిడిపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 8 శాతానికి, 8 నుంచి 10 శాతానికి, 10 నుంచి 15 శాతానికి మూడు సార్లు ప్రభుత్వం పెంచింది. బంగారం డిమాండ్ తగ్గించడానికి, దిగుమతికి కళ్లెం వేయడానికి ప్రభుత్వం, ఆర్బీఐ తీసుకుంటున్న పలు చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయి. ఈ ఏడాది 900 టన్నుల వరకు దిగుమతి అయ్యే అవకాశం ఉందని తొలుత భావించారు. అయితే కేంద్రం తీసుకున్న చర్యలతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్ వరకూ బంగారం 400 టన్నులు మాత్రమే దిగుమతి అయింది. 2011లో 969 టన్నుల బంగారం దిగుమతి కాగా, 2012లో 860 టన్నులు దిగుమతి అయింది. ఈ ఏడాది పుత్తడి దిగుమతులు గత ఏడాదితో పోలిస్తే 40 శాతం వరకు తగ్గి 500 టన్నులకు మించకపోవచ్చని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు మరో ప్రమాదం వచ్చి పడింది. దిగుమతి సుంకాల పెంపు వల్ల అంతర్జాతీయ మార్కెట్‌తో పోల్చితే మన దేశంలో పసిడి ధర అధికంగా ఉండటం వల్ల అక్రమ రవాణా పెరిగింది. ఈ విషయాన్ని శీతాకాల లోక్‌సభ సమావేశాలలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది బంగారం ధరల వివరాలు ఈ దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర నెల ప్రారంభంలో ధర చివరిలో ధర జనవరి రూ.30,860 రూ.30.212 ఫిబ్రవరి రూ.29,856 రూ.29,735 మార్చి రూ.29,588 రూ.29,448 ఏప్రిల్ రూ.29411 రూ.27,183 మే రూ.26,895 రూ.27185 జూన్ రూ.26,897 రూ. 25,563 జూలై రూ.25,665 రూ. 28,641 ఆగస్ట్ రూ. 28,182 రూ. 33,010 సెప్టెంబర్ రూ. 32,980 రూ. 30,737 అక్టోబర్ రూ. 30,450 రూ. 30,225 నవంబర్ రూ. 29,825 రూ.30,249 డిసెంబర్ రూ. 30,221 రూ. 29,620 s.nagarjuna@sakshi.com -
పోటుగాళ్లు 2013
-
డబ్బింగ్‌కు కలిసిరాని 2013
-
ఏడాదంతా సందడే
ఎమ్మెల్సీ ఎన్నికలతో మొదలైన రాజకీయ సందడి ఈ ఏడాదంతా కొనసాగింది. సహకార, పంచాయతీ ఎన్నికలు, తెలంగాణ ప్రకటనకు ముందూ వెనకా కొనసాగిన ఆందోళనలు, మారిన పార్టీల సమీకరణాలు జిల్లా రాజకీయాలను ఆసక్తికరంగా మార్చాయి. ప్రధాన పార్టీల ముఖ్యనేతల పర్యటనలు, సమావేశాలు ఆయా పార్టీల శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపాయి. అధికార పార్టీ ఆధిక్యాన్ని నిలబెట్టుకోగా తెలంగాణ ఉద్యమం, నేతల వలసలతో టీఆర్ఎస్ సత్తా చాటింది. తెలుగుదేశం పార్టీ బాగా దెబ్బ తినగా, ఉద్యమంలో క్రియాశీల భాగస్వామ్యం, నరేంద్రమోడీ ప్రభావంతో కమలం వికసించింది. - సాక్షి, కరీంనగర్ ఈ ఏడాది భారతీయ జనతా పార్టీకి బాగా కలిసివచ్చింది. తెలంగాణ జేఏసీలో కీలక భాగస్వామిగా కొనసాగుతున్న బీజేపీ టీఆర్ఎస్కు దీటుగా జనంలోకి వెళ్లింది. జేఏసీ కార్యక్రమాలతోపాటు సొంతంగా కూడా కార్యక్రమాలు చేపడుతోంది. జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు క్షేత్రస్థాయినుంచి కార్యాచరణ తీసుకుంది. హైదరాబాద్‌లో మోడీ సభకు జిల్లానుంచి భారీగా యువతను తరలించింది. నరేంద్రమోడీ పట్ల పెరుగుతున్న సానుకూలతతో పార్టీలోకి వలసలు కూడా పెరిగాయి. ఇంకా పలువురు కీలక నేతలను చేర్చుకునేందుకు మంతనాలు సాగిస్తున్నారు. ఈ ఏడాదిలోనే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా జిల్లాకు చెందిన పి. మురళీధరరావును నియమించారు. ఆయన జిల్లాలో వివిధ వర్గాలను ఆకర్షించేలా సదస్సులు, కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి సైతం పలుమార్లు జిల్లాలో పర్యటించి కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు వెంకయ్యనాయుడు సైతం జిల్లాలో పర్యటించారు. రైతు సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ ఎదుట దీక్ష చేశారు. పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా కార్యకర్తలు భారీగా తరలివస్తుండడం నేతను ఉత్తేజపరుస్తోంది. పార్టీ బలోపేతంపై వైఎస్సార్సీపీ దృష్టి సారించింది. సహకార, పంచాయతీ ఎన్నికలను ఎదుర్కొంది. పలు పంచాయతీలను కైవసం చేసుకుని సత్తా చాటింది. పంచాయతీ ఎన్నికలకు ముందుకు పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ జిల్లాలో పర్యటించారు. పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేశారు. అంతకుముందు అదే నెలలో నేత కార్మికుల్లో భరోసా నింపేందుకు సిరిసిల్లలో పర్యటించారు. విజయమ్మ పర్యటనలు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపాయి. తెలుగుదేశం పార్టీకి ఈ ఏడాది కలిసిరాలేదనే చెప్పాలి. ఆ పార్టీ చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. గతేడాది చివర్లో జిల్లాలో పాదయాత్ర చేసిన చంద్రబాబు ఇక్కడి నుంచే అఖిలపక్షానికి లేఖ పంపారు. తమ వల్లనే తెలంగాణ ప్రక్రియ ముందుకు వెళ్తోందని చెబుతూ వచ్చిన టీడీపీ నేతలు తాజా పరిణామాలపై మౌనం వహిస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు సమన్యాయమని, విభజన ఆపాలని ప్రకటించడం... జిల్లా నాయకులకు ఇబ్బందికర పరిస్థితులు తెచ్చిపెడుతోంది. చంద్రబాబు ఈ ఏడాది కనీసం జిల్లాకు కూడా రాలేదు. ఆయన జిల్లాలో అడుగుపెట్టే పరిస్థితులు కూడా లేకపోవడం ఆ పార్టీ పరిస్థితి చెప్పకనే చెబుతోంది. పార్టీ తీరు మీద నేతల్లో అసహనం పెరుగుతోంది. ఇందులో భాగంగానే గంగుల కమలాకర్ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ అధిష్టానం మీద క్యాడర్‌లోనూ అసంతృప్తి ఉన్నా బయట పడడం లేదు. దీనికి నేతల మధ్య సమన్వయం లోపమే కారణం. గంగుల రాజీనామా చేసి ఇంతకాలమైనా కరీంనగర్‌కు ఇన్చార్జీని నియమించలేకపోయారు. మరికొన్ని నియోజకవర్గాలకు కనీసం ఇన్చార్జి ఎవరూ దొరకని పరిస్థితి. ఇటీవల నాలుగు చోట్ల ఇన్చార్జీలను నియమించినా వివాదాస్పదమయ్యాయి. రామగుండం ఇన్‌చార్జీగా వ్యవహరించిన గోపు అయిలయ్య యాదవ్ పార్టీని వీడారు. పార్టీ వైఖరి, అధినేత తీరుైపై పెరుగుతున్న వ్యతిరేకత పార్టీ నేతలను కలవరపెడుతోంది. నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసే పెద్ద నాయకుడే జిల్లాకు కరువై పోయారు. బాబ్లీ ప్రాజెక్టుపై నిర్వహించిన ఆందోళనకు టీటీడీపీ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు హాజరయ్యారు. జిల్లాలో టీడీపీ తరఫున అదే పెద్ద కార్యక్రమంగా నిలిచింది. తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్తున్నా ఆ మేరకు రాజకీయంగా లబ్ధి పొందడంలో ఆ పార్టీ జిల్లా నాయకత్వం ఆశించిన ఫలితాలను పొందలేకపోయింది. శాసనసభకు బిల్లు వచ్చిన సందర్భంలో జిల్లా మంత్రి శ్రీధర్‌బాబు, సీమాంధ్ర నేతల తీరును ఎండగట్టడంలో ఎంపీ పొన్నం ప్రభాకర్ గట్టిగా వ్యవహరించినా జిల్లాలో పార్టీ పరంగా ఎలాంటి లబ్ధి చేకూరలేదు. అంతర్గత విభేదాలు నియోజకవర్గస్థాయికి చేరడం పార్టీని వేధిస్తోంది. ఫిబ్రవరిలో జరిగిన సహకార ఎన్నికల్లోనూ జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ కొంత కష్టం మీదే ఆధిక్యాన్ని నిలబెట్టుకోగలిగింది. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు, జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీలను దక్కించుకుంది. శాసనసభ కోటాలో సంతోష్‌కుమార్‌కు శాసనమండలి సభ్యత్వం లభించింది. ఫిబ్రవరిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ రికార్డు విజయాలతో దూకుడు ప్రారంభించింది. పట్టభద్రుల స్థానం నుంచి స్వామిగౌడ్, ఉపాధ్యాయ స్థానం నుంచి సుధాకరరెడ్డి విజయం సాధించారు. తెలుగుదేశం నుంచి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కాంగ్రెస్ నుంచి పెద్దపల్లి ఎంపీ వివేకానంద రెండు నెలల వ్యవధిలోనే టీఆర్ఎస్లో చేరడంతో పార్టీ బలోపేతమైంది. సహకార, పంచాయతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు దీటుగా విజయాలు సాధించింది. సీడబ్ల్యూసీ ప్రకటన తరువాత తెలంగాణ ఏర్పాటు ఘనత చేజారకుండా టీఆర్ఎస్ తాపత్రయపడుతోంది. ఆంక్షలు లేని తెలంగాణే కావాలంటూ కాంగ్రెస్‌ను ఇరుకున పెడుతోంది. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ జిల్లాలో పలు సభలు నిర్వహిస్తూ కార్యకర్తల్లో జోష్ కలిగిస్తున్నారు. -
బాలీవుడ్ విశేషాలు..విషాదాలు.. వివాదాలు
2013సంవత్సరంలో బాలీవుడ్ ఆడియెన్స్‌కు ఆశ్చర్యం కలిగించే, విషాదానికి గురిచేసే, ఊహించని సంఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్ని వార్తలు ప్రేక్షకులకు సంతోషాన్ని ఇవ్వగా, మరికొన్ని విషాదాన్ని నింపాయి. అలాంటి సంఘటనలను మరోసారి నెమరువేసుకుందామా! హృతిక్‌కు సుజానే గుడ్‌బై బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో ఉన్న 17 ఏళ్ల ప్రేమవ్యవహారం, 13 ఏళ్ల దాంపత్య జీవితానికి ఆయన సతీమణి సుజానే ముగింపు పలకాలని నిర్ణయించుకుంది. దాంతో బాలీవుడ్లో రొమాంటిక్ జోడి రిలేషన్‌కు ఒక్కసారిగా తెరపడింది. బాలీవుడ్ ప్రేక్షకులను, హృతిక్ అభిమానులను దిగ్బ్రాంతికి గురిచేసింది. క్రిష్3తో హిట్ సాధించి జోరు మీద ఉన్న హృతిక్‌కు ఈ సంవత్సరం చేదు అనుభవ మే. అనురాగ్ బసు, కల్కి బై..బై దర్శకుడు అనురాగ్ బసు కాశ్యప్, కల్కి కోచ్లిన్లు రెండేళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలికారు. వర్ధమాన తార హ్యూమా ఖురేషితో అనురాగ్ బసు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. షారుక్‌కు సర్రోగసి కష్టాలు బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ దంపతులు సర్రోగసి ద్వారా మరో బిడ్డకు జన్మనివ్వడం వివాదస్పదంగా మారింది. అప్పటికే షారుక్ దంపతులకు ఇద్దరు పిల్లలు. అయితే మూడో బిడ్డ అబ్రామ్ను సర్రోగసి పద్దతి కనడానికి ముందు లైంగిక నిర్ధారణ పరీక్షలు జరిపించారని ఓ సామాజిక కార్యకర్త వేసిన పిటిషన్ బాలీవుడ్ సూపర్‌స్టార్ ఇబ్బందుల్లోకి నెట్టింది.తొలుత దిగువ కోర్టు పిటిషన్‌ను కొట్టివేసినా.. ప్రస్తుతం బాంబే హైకోర్టులో విచారణ జరుగుతోంది. తన మూడో బిడ్డ అబ్రామ్ను కొద్ది రోజులతర్వాత మీడియా పరిచయం చేశారు. మళ్లీ కలిసిన సల్మాన్, షారుక్! కొద్ది సంవత్సరాల క్రితం బాలీవుడ్ తార కత్రీనా కైఫ్ జన్మదిన వేడుకల్లో అగ్రతారలు సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ల మధ్య గొడవ చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ గొడవకు ముందు సల్మాన్, షారుక్ క్లోజ్ ఫ్రెండ్స్. అయితే ఆతర్వాత వారిద్దరూ మధ్య విభేదాలు ముదిరాయి. అయితే విభేధాలను తెరదించుతూ.. రంజాన్ పండగ సందర్భంగా జరిగిన ఓ ఇఫ్తార్ పార్టీలో వారిద్దరూ కౌగిలించుకోవడం అభిమానులకు ఆనందం కలిగించింది. తమ ఇద్దరి మధ్య దూరం పెరిగినా షారుక్‌తో తన రిలేషన్లో ఎలాంటి తేడా లేదని చెప్పడం గమనార్హం. అయితే ఇఫ్తార్ తర్వాత మరే సందర్భంలో కూడా సల్మాన్, షారుక్‌లు కనిపించిన దాఖలాలు కనిపించలేదు. జియాఖాన్ ది ఆత్మహత్యా? హత్యా? రాంగోపాల్ వర్మ ‘నిశ్శబ్ద్’ చిత్రం ద్వారా అమితాబ్ సరసన నటించడంతో బాలీవుడ్లో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన జియాఖాన్ ఆత్మహత్యకు పాల్పడటం హిందీ చిత్ర పరిశ్రమలో సంచలనం రేపింది. జియాఖాన్ ఆత్మహత్య వెనుక బాలీవుడ్ నటుడు ఆదిత్యా పంచోలి కుమారుడు సూరజ్ పంచోలి పేరు ముడిపడి ఉండటం బాలీవుడ్‌ను కుదిపేసింది. ఈ కేసులో సూరజ్‌ను అరెస్ట్ చేశారు కూడా. అయితే జియాది ఆత్మహత్య కాదని.. హత్యేనని ఆమె తల్లి ఆరోపించడం మరింత సంచలనం రేపింది. నేను వర్జిన్‌నే: సల్మాన్ కాఫీ విత్ కరణ్ ఓ టెలివిజన్ ఛానెల్లో నాలుగవ ఎడిషన్ ప్రారంభమైంది. అయితే ఆరంభంలో అగ్రనటులు అమీర్, సల్మాన్‌ను ఈ కార్యక్రమంలో పాల్గొనేలా కరణ్ చేయడం అందర్ని ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సల్మాన్, అమీర్లు తమ వ్యక్తిగత అనుభవాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో తాను ఇంకా బ్రహ్మచారి(వర్జిన్) అని చెప్పడం, షారుక్‌తో విభేధాలను వెల్లడించడం గమనార్హం. కరణ్ జోహార్ అంటే ఇష్టం లేకపోవడం వల్లే ఈ కార్యక్రమానికి చాలా కాలంగా దూరంగా ఉన్నానని ఆయన ముఖం మీదే అమీర్ చెప్పడం అందర్ని ఆకర్షించింది. వివాదస్పదమైన క్రిష్3 కలెక్షన్లు ఈ సంవత్సరంలో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన చిత్రంగా కిష్3రికార్డుల్లోకి ఎక్కింది. అయితే ఈ చిత్ర నిర్మాతలు వెల్లడించిన కలెక్షన్లను ఎక్కువ చేసి చూపించారనే వార్త అందర్ని ఆశ్చర్య పరిచింది. వాస్తవ కలెక్షన్లకు 60 కోట్ల రూపాయలను అదనంగా చేర్చారనే వార్తల బాలీవుడ్ సంచలనానికి తావిచ్చింది. బాలీవుడ్లో అతిపెద్ద కుంభకోణమని వచ్చిన దర్శక నిర్మాత రాకేశ్ రోషన్ ఖండించారు. అయితే ఈవార్త వెనుక వాస్తవాలు వెలుగు చూడకుండానే కాలగర్భంలో కలిసిపోయింది. రాణీ చోప్రాగా మారిన రాణి ముఖర్జీ దిల్వాలే దుల్హనియా లేజాయింగేతో సంచలన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఆదిత్య చోపా, బాలీవుడ్ నటి రాణి ముఖర్జీల మధ్య సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయని.. వారిద్దరూ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారని వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఆదిత్య చోప్రా తన భార్యకు విడాకులు ఇచ్చిన తర్వాత రాణితో కలిసి ఉంటున్నాడనే వార్తలకు బలం చేకూర్చే విధంగా.. ఇటీవల ఓ కార్యక్రమంలో షాట్‌గన్ శతృఘ్న సిన్హా మాట్లాడుతూ.. అదే వేదికపై ఉన్న రాణీ ముఖర్జీని రాణి చోప్రాగా సంభోదించడం అందర్ని అశ్చర్య పరిచింది. దాంతో వారిద్దరి మధ్య జరుగుతున్న సీక్రెట్ వ్యవహారానికి షాట్‌గన్ తెరదించాడు. -
బాలీవుడ్ సూపర్ హిట్స్..డిజాస్టర్స్
2013లోస్వదే శంలోనే కాకుండా, అంతర్జాతీయంగా కూడా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ హవా కొనసాగింది. ఈ సంవత్సరం భారతీయ సినిమా 2 బిలియన్ డాలర్ల కలెక్షన్లను వసూలు చేసింది. ఎప్పూడూ లేనంతగా దక్షిణాదిలోనూ హిందీ చిత్రాలకు ఆదరణ పెరుగగా.. విదేశాల్లో కూడా బాలీవుడ్ చిత్రాలు పాగా వేశాయి. పెరూ, పనామా, మోరాకో లాంటి దేశాల్లో కూడా బాలీవుడ్ చిత్రాలు ఈ సంవత్సరం విడుదలై మంచి కలెక్షన్లనే రాబట్టాయి. ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ పెరుగుదల బాలీవుడ్‌కు కలిసి వచ్చిన అంశం. బాలీవుడ్‌ను నాలుగు దశాబ్దలపాటు ఏలిన అమితాబ్ బచ్చన్‌ను ’ది గ్రేట్ గాడ్స్బై’ చిత్రం ద్వారా హాలీవుడ్ కూడా అక్కున చేర్చుకుంది. బాలీవుడ్‌కు కొత్తగాపరిచయమైన వారికి కూడా మంచి ప్రోత్సాహమే దక్కింది ధనుష్(రాంజ్నా), తాప్సీ (చష్మే బద్దూర్), తమన్నా(హిమ్మత్వాలా), సుశాంత్ సింగ్ కపూర్ (కాయ్ పో చే)రాంచరణ్ (జంజీర్), వాణీ కపూర్(శుద్ద్ దేశీ రొమాన్స్), పూనమ్ పాండే(నషా)లకు ఆదరణ లభించింది. హడావిడి లేకుండా వచ్చిన లంచ్‌బాక్స్, మద్రాస్ కేఫే, షార్ట్స్, బాంబే టాకీస్, ఏబీసీడీ, షిప్ ఆఫ్ థీసీస్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక 2013లో భారీ అంచనాలతో వచ్చిన పెద్ద, చిన్న చితక చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద బ్రహ్మండంగా పేలగా.. మరికొన్ని తుస్సుమన్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ సంవత్సరం భారీ విజయాలను సొంతం చేసుకున్న చిత్రాలను, బోల్తా పడిన చిత్రాలను ఓసారి పరిశీలిద్దాం! హిట్ చిత్రాలు ధూమ్ 3 ఈ సంవత్సరాంతంలో విడుదలైన ధూమ్3 చిత్రం దేశీయంగానే కాకుండా విదేశాల్లో కూడా రికార్డులను తిరగరాస్తోంది. గత ఆరు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 313(గ్రాస్) వసూలు చేయగా దేశీయ మార్కెట్లో 229 కోట్లు గ్రాస్(నికరం 173 కోట్లు) వసూలు చేసింది. అమీర్ ఖాన్ వన్ మ్యాన్ షో ప్రేక్షకులను ఆలరిస్తోంది. కత్రినా కైఫ్, అభిషేక్ బచ్చన్, ఉదయ్ చోప్రా, జాకీ ష్రాఫ్‌ల నటన ఈ చిత్రానికి ప్లస్‌గా మారింది. క్రిష్ 3 సోషియో ఫాంటసీ చిత్రంగా రూపొందిన క్రిష్ చిత్రంలో హృతిక్ రోషన్, ప్రియాంకా చోప్రా, వివేక్ ఒబెరాయ్, కంగనా రనౌత్‌లు నటించారు. రాకేశ్ రోషన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 374 కోట్ల గ్రాస్ కలెక్షన్లు, దేశీయంగా 240 కోట్ల నికరాన్ని వసూలు చేసింది. చెన్నై ఎక్స్‌ప్రెస్ తమిళ నేపథ్యంతో తెరకెక్కిన చెన్నై ఎక్స్‌ప్రెస్ చిత్రం క్రిటిక్స్‌ను కూడా నివ్వెరపరిచి.. భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. షారుఖ్, దీపికా పదుకొనేలు నటించిన ఈ చిత్రానికి దర్శకుడు రోహిత్ శెట్టి. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 422 కోట్ల రూపాయలను వసూలు చేసి అత్యధికంగా వసూలు చేసిన చిత్రంగా రికార్డు నమోదు చేసింది. దేశవాలీ మార్కెట్లో చెన్నై ఎక్స్‌ప్రెస్ 226 కోట్ల రూపాయలను రాబట్టింది. యే జవానీ హై దీవానీ యూత్ ఫుల్ ఎంటర్టైన్మెంట్గా రూపొందిన ఈ చిత్రం బాలీవుడ్లోనే కాకుండా విదేశాల్లోనూ జాదూ చేసింది. రణ భీర్ క పూర్, దీపీకా పదుకోనెల కెమిస్ట్రీ కాసుల పంటగా మార్చింది. వీరికి తోడు మాధురీ దీక్షిత్ ప్రత్యేక పాటలో కనిపించి ఆలరించింది. గ్లోబల్ మార్కెట్లో 309 కోట్లు గ్రాస్ కలెక్షన్లు, ఇండియాలో 190 కోట్ల నికర వసూళ్లను సొంతం చేసుకుంది. రామ్‌లీలా షోమ్యాన్ సంజయ్ లీలా భన్సాలీ దర్శక, నిర్మాణంలో రూపొందిన రామ్‌లీలా టైటిల్‌పై కొంత వివాదం నెలకొన్నా.. ఎలాంటి అడ్డంకులు లేకుండా విడుదలైన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు భారీగానే ఆదరించారు. రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనేల కెమిస్ట్రీ, మ్యూజిక్, భారీ సెట్టింగులకు ప్రేక్షకుల్ని ఆలరించడంతో భారత్‌లోనే 110 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. భాగ్ మిల్కా భాగ్ ప్రముఖ అథ్లెట్ మిల్కాసింగ్ జీవిత కథను ఆధారంగా చేసుకుని రాకేశ్ ఓంప్రకాశ్ మిశ్రా రూపొందించిన భాగ్ మిల్కా భాగ్ చిత్రం విమర్శకులను, ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఫరాన్ అక్తర్, సోనమ్ కపూర్, రెబెక్కా బ్రీడ్స్ నటించిన ఈ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 102 కోట్లు వసూలు చేసి.. వందకోట్ల క్లబ్లో చోటు సంపాదించింది. ఇదే కోవలో తక్కువ బడ్జెట్‌తో రూపొందిన గ్రాండ్ మస్తీ 102 కోట్లు, రేస్2 100 కోట్లకు పైగా, ఆషీకి2 85 కోట్లు, స్పెషల్ చ బ్బీస్ 70 కోట్లు కొల్లగొట్టాయి. బోల్తా కొట్టాయి... జంజీర్ గతంలో అమితాబ్ నటించిన జంజీర్ చిత్రం రీమేక్‌గా రాంచరణ్ బాలీవుడ్లో ఇచ్చిన ఎంట్రీ చేదు అనుభవాన్ని మిగిల్చింది. 45 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం కేవలం 15 కోట్ల రూపాయలనే వసూలు చేసింది. జిల్లా ఘజియాబాద్ సంజయ్ దత్, అర్షద్ వార్సీలు నటించిన ఈ చిత్రం 36 కోట్ల వ్యయంతో రూపొందగా.. కేవలం 16 కోట్ల వసూళ్లకే పరిమితమై నిరాశపరిచింది. . బాస్ మలయాళ చిత్రం ఆధారంగా రూపొందిన బాస్ చిత్రంలో అక్షయ్ కుమార్, అదితిరావ్, మిథున్ చక్రవర్తి, డానీలు నటించారు. ఈ చిత్ర వ్యయం 72 కోట్లు. వసూలు చేసింది 54, నష్టం 18 కోట్లు బుల్లెట్ రాజా సోనాక్షి సిన్హా, సైఫ్ ఆలీ ఖాన్ల క్రేజి కాంబినేషన్‌తో బుల్లెట్ రాజాపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని కూడగట్టుకుంది. 50 కోట్ల వ్యయంతో రూపొందిన ఈ చిత్రం 33 కోట్లు మాత్రమే వసూలు చేసి 17 కోట్ల లోటును నమోదు చేసుకుంది. గోరి తేరే ప్యార్ మే ఇమ్రాన్ ఖాన్, కరీనా కపూర్ల క్రేజి కాంబినేషన్ కూడా చిత్రానికి లాభాల్ని సాధించిపెట్టలేకపోయింది. 30 కోట్ల వ్యయంతో నిర్మాణం జరిగితే 14 కోట్లకే పరిమితమై.. 16 కోట్ల నష్టాన్ని మిగిల్చింది. బేషరమ్ యే జవానీ హై దీవానీ విజయంతో ఊపు మీద ఉన్న రణ భీర్ కపూర్‌కు బేషరమ్ చేదు అనుభవాన్ని మిగిల్చింది. 75 కోట్ల వ్యయానికి 59 కోట్లు మాత్రమే వసూలు చేసి 15 నష్టాన్ని నిర్మాతకు పంచింది. వన్స్ ఆపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై దోబారా అక్షయ్ కుమార్‌కు వరుసగా రెండవ పరాజయాన్ని మిగిల్చిన చిత్రం. సోనాక్షి, ఇమ్రాన్ ఖాన్‌లాంటి భారీ తారాగణం కూడా కలెక్షన్లను రాబట్టలేక వసూళ్ల వెనుకపడింది. 80 కోట్లు నిర్మాణానికి ఖర్చుకాగా, 65 కోట్లు రాబట్టడంతో 15 నష్టం వాటిల్లింది. సత్య2 రాంగోపాల్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన సత్య2 బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని నమోదు చేసుకుంది. 15 కోట్లకు గాను, కేవలం 2 కోట్లు వసూలు చేసి 13 నష్టాన్ని రిజిస్టర్ చేసింది. రజ్జో కంగనా రనౌత్ నటించిన రజ్జో కు ఖర్చు పెట్టింది 12 కోట్లుకాగా వచ్చింది 2కోట్లే.. హిమ్మత్వాలా గతంలో జితేంద్ర నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాన్ని రీమేక్ చేశారు. అజయ్ దేవగన్, తమన్నాలు న టించిన ఈ చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లలో వెనకబడి 5 కోట్ల నష్టంతో చతికిలపడింది. -
వావ్ 2013
-
సెన్సెక్స్ ఆకాశం వైపు..షేర్లు నేల చూపు
2013 సంవత్సరంలో భారత స్టాక్ మార్కెట్ సూచీలు సానుకూలంగా స్పందించాయి. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు ఆల్‌టైమ్ హైకి చేరుకుని రికార్డు సృష్టించాయి. నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయ ఢంకా మోగిస్తుందనే సర్వే నివేదికలను ఆధారంగా చేసుకుని స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు పరుగులు పెట్టాయి. ఎన్నికల ఫలితాలు వెలువడగానే సెన్సెక్స్, నిఫ్టీలు జీవితకాలపు గరిష్ట స్థాయిని నమోదు చేసుకున్నాయి. ఈ సంవత్సరం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ), ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాల కంపెనీ షేర్లు భారీ లాభాలను స్టాక్మార్కెట్లో నమోదు చేసుకున్నాయి. ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ రంగాలు ప్రధాన సూచీలను పరిగెత్తించడంలో కీలక పాత్రను పోషించాయి. ఐటీ రంగ కంపెనీ షేర్లలో 52 వారాల గరిష్టస్థాయిని ఇన్ఫోసిస్ రూ. 3573 (20 డిసెంబర్), టీసీఎస్ 2258 (15 అక్టోబర్), హెచ్‌సీఎల్ 1261 (27 డిసెంబర్), విప్రో 557(27 డిసెంబర్) గరిష్టస్థాయిని నమోదు చేసుకున్నాయి. ఫార్మా రంగ కంపెనీ షేర్లలో డాక్టర్ రెడ్డీస్ 2557 (26 డిసెంబర్), లుపిన్ 945, సిప్లా 450 (16 సెప్టెంబర్), రాన్‌బాక్సీ 522(జనవరి 13), సన్‌ఫార్మా 651 (9 అక్టోబర్)లు 52 వారాల గరిష్టస్థాయిని చేరుకున్నాయి. ఎఫ్ఎంసీజీ రంగ షేర్లలో ఐటీసీ (24 జూలై), హిందూస్థాన్ యూనీలీవర్ 725 (07 మార్చి), డాబర్ 184 (28 అక్టోబర్)లు కూడా గరిష్టస్థాయిని చేరుకుని ప్రధాన సూచీలు ర్యాలీ జరపడంలో కీలక పాత్రను పోషించాయి. అయితే సూచీలు ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసినా.. మిగితా రంగాలు కంపెనీల షేర్లు మాత్రం అంతంత మాత్రంగానే పెరగడం ఇన్వెస్టర్లను ఆందోళనలోకి నెట్టింది. సెన్సెక్స్‌తోపాటు ఇతర ప్రధాన సూచీలు ఆకాశాన్నంటుతున్నా.. కొన్ని రంగాల షేర్లు నేలచూపు చూడటం మార్కెట్ నిపుణులకు అంతుపట్టని విషయంగా మారింది. మ ఇక రానున్నది ఎన్నికల సమయం కావడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. -
2013 : బిజినెస్ రౌండప్
-
2013 - హొంశాఖ పనితీరు
-
యూపీఏ, ఆర్బీఐకి ద్రవ్యోల్బణం అతిపెద్ద సవాల్!
2013 సంవత్సరం సామాన్య ప్రజలపై ధరల ప్రభావం భారీగానే పడింది. ఆహార పదార్ధాల, నిత్యావసర వస్తువుల, పెట్రోల్ ధరలు ఎన్నడూ లేనంతగా ఆకాశాన్నంటాయి. దాంతో ద్రవ్యోల్బణం అదుపులోకి తీసుకురావడానికి యూపీఏ, రిజర్వు బ్యాంక్‌కు తలకు మించిన భారమవుతోంది. అధిక ధరల ప్రభావంతో అల్లాడిన ప్రజలు ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వానికి గట్టి షాకే ఇచ్చారు. వచ్చే నాలుగు నెలలు యూపీఏ ప్రభుత్వానికి కఠిన పరీక్షగా మారింది. అధిక ధరలను అదుపులోకి తీసుకరావడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమైతే.. ఇక సాధారణ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూడాల్సిందే అని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. 2013లో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కిలోఉల్లిధర 100 రూపాయలకు చేరుకోగా, టామాటా ధర 80 రూపాయలకు పైగానే పలికింది. నవంబర్‌లో ఉల్లి ధర 190 శాతం పెరుగగా, కూరగాయల ధరలు 95.25 శాతం పెరిగింది. ఉల్లి, టామోటాతోపాటు నిత్యావసర వస్తువుల ధరలు అధిక స్థాయిలో ఉండటంతో ద్రవ్యోల్బణం రెండెకెలను చేరుకుంది. ద్రవ్యోల్బణ పెరుగుదలకు అడ్డుకట్టవేసేందుకు రిజర్వు బ్యాంక్ చేసిన ప్రయత్నాలు నిరాశనే మిగిల్చాయి. కన్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఆధారంగా మదింపు జరిపే రిటైల్ ద్రవ్యోల్బణం గత నవంబర్‌లో 11.24 శాతాన్ని నమోదు చేసుకున్నాయి. ధరల పెరుగుదలను అరికట్టేందుకు రిజర్వుబ్యాంక్ కీలక వడ్డీ రేట్లను పెంచూతు నిర్ణయం తీసుకున్నా.. ద్రవ్యోల్బణ నియంత్రణపై ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. ఇప్పటికిప్పుడు ద్రవ్యోల్బణ పెరుగుదలను అరికట్టడానికి రిజర్వు బ్యాంక్ వద్ద ఎలాంటి సులభ మార్గం ఏది ఉన్నట్టు కనిపించడం లేదు. ద్రవ్యోల్బణం అదుపులోకి తీసుకురాలేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ధరలను అరికట్టలేకపోవడంతో ఇప్పటికే రాజకీయంగా మూల్యం చెల్లించుకున్నాం. ఏది ఏమైనా వాస్తవాలను అంగీకరించాల్సిందే. అని చిదంబరం ఇటీవల వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌లో టోకు ధరల ఆధారంగా లెక్కించే ద్రవ్యోల్బణం 7.52 శాతానికి చేరుకుంది. రిజర్వు బ్యాంకు అంచనా వేసిన 5.5 శాతాని కంటే అధికంగా ఉండటం ఆందోళన రేకెత్తించింది. అధిక ధరల కారణంగాసామాన్య ప్రజలపై చూపిన పతికూల ప్రభావం ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల ఎన్నికల్లో కేంద్ర ప్రభుత్వంపై ప్రత్యక్ష ప్రభావం చూపింది. ఫలితాల అనంతరం అధిక ధరల కారణంగా ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించారని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అన్నారు. 2014 ఎన్నికల్లో మూడవ సారి అధికారం చేజిక్కించుకోవడానికి ఉవ్విళ్లూరుతున్న యూపీఏకు, అధిక ధరలను నియంత్రించడంలో రిజర్వు బ్యాంకుకు రానున్న కాలం అతిపెద్ద సవాల్‌గా కనిపిస్తోంది. -
సినీ పరిశ్రమకు తీరని విషాదం.. 2013
తెలుగు సినీ ప్రపంచంలో 2013 సంవత్సరం తీరని విషాదాన్ని మిగిల్చింది. వరుసగా మూడు నెలల్లో ముగ్గురు మేటి నటులు మరణించారు. రియల్ స్టార్ శ్రీహరి, హాస్యనటులు ఏవీఎస్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం.. ఈ ముగ్గురినీ టాలీవుడ్ ఒక్క సంవత్సరంలోనే, అది కూడా వరుస నెలల్లో కోల్పోవడం పెను విషాదమే. సినిమా ప్రపంచంలోకి ప్రవేశించాలంటే ఎవరో ఒక గాడ్ ఫాదర్ ఉండాల్సిందే. కానీ అలా ఎవరూ లేకుండా ఒక విలన్‌గా టాలీవుడ్ రంగ ప్రవేశం చేసి, క్యారెక్టర్ నటుడిగాను, హీరోగా కూడా తనదైన ఒక ముద్ర వేసుకున్న రియల్ స్టార్ శ్రీహరి.. కాలేయానికి సంబంధించిన వ్యాధితో అక్టోబర్ 9వ తేదీన మరణించారు. ముంబైలో 'ఆర్.. రాజ్‌కుమార్' చిత్రం షూటింగ్ కోసం వెళ్లిన ఆయన అక్కడే ప్రాణాలు కోల్పోయారు. శ్రీహరి ఆరోగ్య పరిస్థితి గురించి అక్కడి వైద్యులకు సరిగా తెలియకపోవడం, ఆయన తన ఫైళ్లను తీసుకెళ్లకపోవడం వల్ల సరైన సమయానికి చికిత్స అందకపోవడం వల్లే మరణించారు. దీంతో టాలీవుడ్లో తీవ్ర విషాదం అలముకుంది. ఇక ప్రముఖ హాస్యనటుడు ఆమంచి వెంకట సుబ్రహ్మణ్యం (ఏవీఎస్) కాలేయ సమస్యతో నవంబర్ 8వ తేదీన మరణించారు. ఆయనకు 2008లో కాలేయం పాడైపోగా.. అప్పట్లో గ్లోబల్ ఆస్పత్రి వైద్యులు కాలేయ మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఏవీఎస్ కుమార్తె శ్రీప్రశాంతి ఆయనకు లివర్‌ను దానం చేశారు. శస్త్రచికిత్స తర్వాత కోలుకున్న ఆయన మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. ఐదేళ్లపాటు ఆరోగ్యంగానే ఉన్నారు. నటనే ప్రాణంగా బతుకుతున్న ఏవీఎస్ వేళకు మందులు వేసుకోకపోవడం, సమయానికి వైద్యుడిని సంప్రదించకపోవడంతో కాలేయంలో మళ్లీ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఆస్పత్రిలో చికిత్స అందించినా, ఇన్ఫెక్షన్ తగ్గకపోగా మూత్రపిండాలపై కూడా ప్రభావం పడింది. పాత్రికేయుడిగా, హాస్య నటుడిగా, రచయితగా, నిర్మాతగా, దర్శకునిగా ఆయన బహుముఖ ప్రతిభ కనబరిచారు. 'తుత్తి' అనే డైలాగుతో హాస్యనటుడిగా జీవితం ప్రారంభించి అనేక చిత్రాల్లో తన నటనతో జీవించారు. మాటల విరుపులు, శోభన్ బాబు రింగు అంటూ జుట్టును స్టైలుగా ముందుకు రింగు చుట్టుకోవడం, చేతులమీద పాఠాలు రాసుకునే లెక్చరర్ అవతారం.. ఇలా అనేక పాత్రలతో తెలుగు ప్రజల గుండెల్లో పదిలంగా నిలిచిపోయిన ధర్మవరపు సుబ్రహ్మణ్యం డిసెంబర్ 7వ తేదీన కన్నుమూశారు. ఆరు నెలల క్రితం కాలేయ కేన్సర్ వ్యాధి బయటపడిన తర్వాత చికిత్స తీసుకున్నా ఫలితం లేకపోయింది. దూరదర్శన్ చానల్లో 'ఆనందోబ్రహ్మ' సీరియల్‌తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ధర్మవరపు అంతకుముందే ప్రకాశం జిల్లాలో ప్రజానాట్య మండలి కళాకారుడు. పలు నాటకాలతో రంగస్థలాన్ని ఏలారు. వీడీవో ఉద్యోగానికి ఎంపికై.. హైదరాబాద్‌లో శిక్షణ పొందుతుండగా దూరదర్శన్‌లో అవకాశం వచ్చింది. 'జయమ్ము నిశ్చయమ్మురా' చిత్రంతో తెరంగేట్రం చేసి, 'ప్రేమా గీమా జాన్తా నై' చిత్రం వరకు అనేక సినిమాల్లో హాస్యం పండించారు. ముగ్గురు నటులూ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నవారే. ఈ ముగ్గురినీ ఒకే సంవత్సరంలో కోల్పోవడం మాత్రం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటుగా మిగిలిపోయింది. -
కాంగ్రెస్ 2013
-
కల చెదిరింది.. కథ మారింది
ఉవ్వెత్తున ఎగసిన సమైక్య ఉద్యమం.. మలుపులు తిరిగిన రాజకీయం.. ఈ రెండు అంశాలు పశ్చిమగోదావరి తీరానికి ఈ ఏడాది అత్యంత ప్రాధాన్యతను తెచ్చిపెట్టాయి. చరిత్రకే వన్నె తెచ్చేలా జరిగిన సమైక్యాంధ్ర పరిరక్షణ పోరాటం.. రోజుకో తీరున మారిన రాజకీయం.. జిల్లా ముఖచిత్రాన్నే మార్చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాడుతూ, సమైక్యాంధ్ర పరిరక్షణే అభిమతంగా ముందుకుసాగింది. రాష్ట్ర విభజన నిర్ణయంపై ద్వంద్వ వైఖరితో టీడీపీ క్యాడర్‌ను దూరం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అడుగడుగునా ప్రజా వ్యతిరేకతను చవిచూశారు. - సాక్షి ప్రతినిధి / ఏలూరు వైఎస్సార్ సీపీలో ఉత్సాహం వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ ప్రజా సమస్యలపై పోరాడుతూ పార్టీని పటిష్టం చేసుకుంటూ ముందుకెళ్లింది. సమైక్యాంధ్ర ఉద్యమంలోనూ వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రభాగాన నిలిచింది. గడపగడపకూ పాదయాత్ర ద్వారా ఆ పార్టీ నేతలు ప్రజల్లోకెళ్లారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల 24 రోజుల పాటు 278 కిలోమీటర్ల మేర జిల్లాలోని 13 నియోజకవర్గాల్లో పాదయాత్ర నిర్వహించి ఔరా అనిపించారు. ఆ తర్వాత సమైక్య శంఖారావం పేరుతో బస్సు యాత్రను కూడా ఆమె జిల్లాలో చేపట్టారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విపత్తులు సంభవించినప్పుడు జిల్లాలో పర్యటించి రైతులను ఓదార్చారు. ఆ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి లెహర్ తుపాను తర్వాత జిల్లాలో పర్యటించి బాధితులను పరామర్శించారు. సమైక్యమే ఊపిరిగా.. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన తర్వాత మూడు నెల లపాటు జిల్లా అంతటా జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల భావోద్వేగాలను బయటపెట్టింది. ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న ఆందోళన, ఆవేదన ఒక్కసారిగా బయటపడ్డాయి. రోజురోజుకీ ఉద్యమం విస్తరించిన విధానం, అట్టడుగు నుంచి ఉన్నత వర్గాల వరకూ భాగస్వాములైన తీరు రా జకీయ వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపింది. ఎవరి ప్రోద్భలం లేకుండానే, ఎవరూ నాయకత్వం వహించకుండానే ప్రజలు స్వచ్ఛందంగా ఈ ఉద్యమాన్ని నడిపించడం మేధావుల్ని సైతం నివ్వెరపరిచింది. జనమంతా ఒక్కటై.. జిల్లాలో సమైక్య ఉద్యమానికి ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం ప్రాంతాలు కేంద్రాలుగా మారాయి. ఏలూరు ఫైర్‌స్టేషన్ సెంటర్, భీమవరం ప్రకాశంచౌక్ సెంటర్, తాడేపల్లిగూడెంలోని పోలీస్ ఐలాండ్ సెంటర్లో ప్రతిరోజూ 15 వరకూ ఆందోళనలు జరిగాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. లారీ, ట్యాక్సీ, జీపు, ట్రాక్టర్ల ఓనర్లు, వర్కర్లు, కళాకారులు, రైతాంగ సమాఖ్య, కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్, విద్యుత్, హాస్టల్ ఉద్యోగులతోపాటు అనేక ఇతర రంగాలకు చెందిన వారు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొనని రంగం లేదంటే నమ్మక తప్పదు. ప్రతి అసోసియేషన్ సమైక్య ఉద్యమంలో పాల్గొనడం తమ బాధ్యతగా భావిస్తోంది. యువజనం.. ఉద్యోగుల ప్రభంజనం సమైక్యాంధ్ర ఉద్యమానికి యువకులు కొండంత అండగా నిలిచారు. పాఠశాల, కళాశాల విద్యార్థులు ప్రతిచోటా ఆందోళనల్లో పాల్గొన్నారు. ప్రభుత్వోద్యోగులు నిబద్ధతతో కార్యరంగంలోకి దిగారు. ఏపీఎన్జీవోలు ఒక దశలో ఉద్యమానికి సారథులుగా వ్యవహరించి ముందుకుతీసుకెళ్లారు. వారు చేసిన 66 రోజుల నిరవధిక సమ్మె కారణంగానే ఉద్యమ ప్రభావం అందరికీ తెలిసింది. వారితోపాటు రైతులు, కార్మికులు, రిక్షా కార్మికులు, తోపుడు, ఇస్త్రీ బళ్లు, జట్టు కూలీలు, మేదరులు ఒకరేమిటి చివరికి హిజ్రాలు కూడా సమైక్య ఉద్యమంలో భాగస్వాములయ్యారు. ఏలూరు నగరంతోపాటు పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లోనూ జేఏసీలు ఏర్పాటై పకడ్బందీ ఉద్యమాలకు రూపకల్పన చేసి అమలు చేశారు. ఉద్యమం.. వినూత్నం ఉద్యమం అంటే ఒక ప్రదర్శన, ఒక ధర్నా, ఒక బహిరంగ సభ గురించే అందరికీ తెలుసు. అప్పుడప్పుడూ వినూత్న నిరసనలూ చూస్తుం టాం. కానీ సమైక్య ఉద్యమంలో చేసినన్ని వినూత్న ఆందోళనలు గతంలో ఎప్పుడూ జరిగిన దాఖలాలు లేవు. దిష్టిబొమ్మల దహనాలు, వంటావార్పు నుంచి పిండ ప్రదానాలు, హోమాలు, శవయాత్రలు, మానవహారాలతోపాటు రోడ్లపై ఆటల ద్వారా ప్రజలు తమ నిరసన తెలిపారు. కేబినెట్లో కావూరి ఏలూరు ఎంపీ కావూరి సాంబశివరావుకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడం ఒక్కటే కాంగ్రెస్ శ్రేణులకు ఊరటనిచ్చింది. ఆయనకు కేంద్ర జౌళి శాఖ లభించింది. అయితే మంత్రి పదవి దక్కిందనే ఆనందం పంచుకునేలోపే విభజన వ్యవహారం ముందుకురావడంతో కావూరి అడుగడుగునా నిరసనలు ఎదుర్కోక తప్పలేదు. దివికేగిన కోటగిరి జిల్లాపై చెరగని ముద్ర వేసిన సీనియర్ రాజకీయ నాయకుడు, మాజీ మంత్రి కోటగిరి విద్యాధరరావు మృతి ఈ సంవత్సరం రాజకీయాల్లో అనూహ్యంగా చెప్పుకోవచ్చు. జులై 20న అకస్మాత్తుగా గుండెపోటుతో ఆయన మృతి చెందడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం హవా నడిపిన విద్యాధరరావు ఆ తర్వాత పీఆర్పీలో చేరి అది కాంగ్రెస్‌లో విలీనమవడంతో ప్రాధాన్యతను కోల్పోయారు. మళ్లీ రాజకీయాల్లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు ప్రయత్నిస్తున్న తరుణంలో విద్యాధరరావు మృతి చెందారు. ఇరకాటంలో టీడీపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ 2013లో అనేక ఒడిదుడుకులను ఎదుర్కోక తప్పలేదు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు చేసిన పాదయాత్ర కూడా జిల్లాలో తెలుగుదేశం పరిస్థితిని మెరుగు పరచలేకపోయింది. ఆ తర్వాత రాష్ట్ర విభజన వ్యవహారంలో ఆ పార్టీ వైఖరి సమైక్యాంధ్రకు అనుకూలంగా లేకపోవడంతో క్యాడర్ సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే విభజనపై పార్టీ వైఖరిని వివరించేందుకు చంద్రబాబు జిల్లాలో పర్యటించాలని భావించినా ఇక్కడి నేతలు చేతులెత్తేయడమే ఆ పార్టీ పరిస్థితికి ఒక ఉదాహరణ. దీంతో ఆయన జిల్లా పర్యటనను రద్దు చేసుకోక తప్పలేదు. కాంగ్రెస్‌కు కష్టకాలం కాంగ్రెస్ పార్టీ పరిస్థితి 2013లో ఒక్కసారిగా తల్లకిందులైంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హవాతో కుదేలైన ఆ పార్టీ సమైక్య ఉద్యమంతో పాతాళానికి వెళ్లిపోయింది. ఆ పార్టీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రజలు అడుగడుగునా నిలదీసి జిల్లాలో తిరగనివ్వలేదు. దీంతో చాలామంది వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి భయపడుతూ పక్కపార్టీల వైపు చూస్తున్నారు. అయితే సహకార ఎన్నికల్లో అధికారం అండతో ఎలాగోలా నెగ్గుకొచ్చారు. ఆ పార్టీకి చెందిన ముత్యాల వెంకటరత్నం డీసీసీబీ చైర్మన్‌గా, రవివర్మ డీసీఎంఎస్ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అయినా పంచాయతీ ఎన్నికల్లో మాత్రం అధికార పార్టీ వెనుకబడిపోయింది. మారిన రాజకీయ ముఖచిత్రం సమైక్య ఉద్యమ ప్రభావంతోపాటు అంతకుముందు జరిగిన పరిణామాలతో జిల్లా రాజకీయ ముఖచిత్రం మారిపోయింది. కాంగ్రెస్, ఆ పార్టీ నేతలు ప్రజల దృష్టిలో చులకనైపోయారు. గందరగోళంతో తెలుగుదేశం కూడా జనంలోకి వెళ్లడానికి ఇబ్బంది పడింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సమైక్య నినాదంతో ప్రజల్లోకి వెళ్లి ఉద్యమంలో మమేకమైంది. -
2013..స్టాక్ మార్కెట్ల పై ఆశలు చిగురింపజేసింది
-
దూసుకొచ్చారు
-
పదుగురు మెచ్చిన పది ఫోన్లు
స్మార్ట్ ఫోన్లు.. ఈ సంవత్సరం మొత్తమ్మీద రాజ్యం ఏలిన టెక్నాలజీ ఇదే. అరచేతిలో ఇమిడిపోయి ప్రపంచం మొత్తాన్ని కళ్లముందుంచే ఈ ఫోన్ల కోసం యువత ఇప్పటికీ కలవరిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లు విడుదల కావడం, యూత్ తమ ఫోన్లను అప్డేట్ చేసుకునే ప్రయత్నాలు చేయడంతో వీటి మార్కెట్ బ్రహ్మాండంగా వెలిగిపోతోంది. శాంసంగ్, యాపిల్ కంపెనీల మధ్య అంతర్జాతీయంగా పోటీ ఉన్నా.. భారతీయ మార్కెట్లో మాత్రం ఎక్కువగా శాంసంగే రాజ్యం ఏలుతోంది. గూగుల్ విడుదల చేసిన టాప్ టెన్ స్మార్ట్ ఫోన్ల జాబితా చూస్తే.. నెంబర్ వన్ స్థానంలో శాంసంగ్ గెలాక్సీ ఎస్4 నిలిచింది. భారతీయుల్లో ఎక్కువ మంది ఈ ఫోన్ గురించే గూగుల్ మొత్తం గాలించారట. మనవాళ్లు ఏదైనా కొనాలంటే ముందుగా అందులో ఏవేం ఫీచర్లు ఉన్నాయో, ఎంత బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందో.. ఇలాంటి వివరాలన్నీ చూస్తారు. దాన్ని బట్టే ఈసారి మార్కెట్లో అగ్రస్థానం ఆక్రమించిన ఫోన్ శాంసంగ్ గెలాక్సీ ఎస్4 అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా నోకియా లూమియా 520, మైక్రోమాక్స్ కాన్వాస్ 2, శాంసంగ్ గెలాక్సీ గ్రాండ్, మైక్రోమాక్స్ కాన్వాస్, సోనీ ఎక్స్‌పీరియా జడ్, నోకియా లూమియా, మైక్రోమాక్స్ కాన్వాస్ 4, గూగుల్ నెక్సస్ 4, శాంసంగ్ గెలాక్సీ ఎస్ 3 ఫోన్లు ఉన్నాయి. -
నెంబర్ వన్ సైట్.. ఐఆర్సీటీసీ!!
ఇంటర్నెట్ అందుబాటులో లేకుండా ఒక్క నిమిషం కూడా గడవని రోజులివి. అలాంటి ఇంటర్నెట్ ఎదురుగా ఉన్నా, ఫలానా సైట్ కావాలంటే నేరుగా దాంట్లోకి వెళ్లడం చాలామందికి అలవాటు లేదు. గూగుల్ ఓపెన్ చేయడం, అందులో తమకు కావల్సిన పేరును సంక్షిప్తంగా కొట్టడం, అప్పుడు వచ్చిన లింకుల్లోంచి తమకు కావల్సిన దాన్ని ఎంచుకోవడం బాగా అలవాటు. అలా ఈ సంవత్సరం మొత్తమ్మీద భారతీయులు ఎక్కువగా ఏయే సైట్ల కోసం సెర్చ్ చేశారో తెలుసా? అన్నింటికంటే అత్యధికంగా వెతికినది రైల్వే టికెట్ల రిజర్వేషన్ చేసుకోడానికి ఉపయోగపడే ఐఆర్సీటీసీ కోసమే!! టాప్ టెన్ సైట్లు చూసుకుంటే వాటిలో రైల్వే రిజర్వేషన్ చేయించుకున్నప్పుడు వెయిటింగ్ లిస్టు గానీ, ఆర్ఏసీ గానీ వస్తే, ఆ తర్వాత దాని పరిస్థితి ఏంటో తెలుసుకోడానికి ఉపయోగపడే పీఎన్ఆర్ స్టేటస్. టాప్ టెన్ సైట్లలో ఈ రెండూ ఉండటం వీటికున్న ఆదరణను తెలియజేస్తుంది. గూగుల్ సెర్చింజన్ నుంచి ఏయే సైట్ల కోసం ఎక్కువగా సెర్చ్ చేశారన్న విషయాన్ని గూగుల్ ఇటీవల ప్రకటించింది. దీంట్లో టాప్ టెన్ సైట్ల పేర్లను పేర్కొంది. మొట్టమొదటి స్థానంలో ఐఆర్సీటీసీ ఉండగా, రెండో స్థానంలో ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో నిలిచింది. ప్రపంచంలో ఎక్కడ ఏ క్రికెట్ మ్యాచ్ జరిగినా బాల్ టు బాల్ ఏం జరిగిందోనన్న విషయాన్ని అందించే ఈ సైట్‌కు కూడా బోలెడంత ఆదరణ ఉంది. ఈ రెండింటి తర్వాత మిగిలిన వరుస స్థానాల్లో ఫ్లిప్‌కార్ట్, పీఎన్ఆర్ స్టేటస్, హెచ్డీఎఫ్సీ నెట్ బ్యాంకింగ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్, ఎస్ఎస్సీ, ఐబీపీఎస్, ఓఎల్ఎక్స్, యాక్సిస్ బ్యాంక్ ఉన్నాయి. -
ఈ యేటి మేటి చిత్రం.. ఆషికీ 2
హిందీలో అత్యధికంగా ప్రేక్షకుల ఆదరణ పొందిన చిత్రాలేవో తెలుసా? దీనికి ప్రమాణాలేంటని అనుకుంటున్నారా? వీక్షకులు గూగుల్‌లో ఎక్కువగా ఏయే సినిమాలను సెర్చ్ చేశారన్నదే ఇందుకు అతిపెద్ద ప్రమాణం. దాని ప్రకారం చూసుకుంటే, అగ్రస్థానంలో 'ఆషికీ 2' నిలిచింది. ఇది రొమాంటిక్ మ్యూజికల్ డ్రామా. ఇందులో ప్రధానంగా 'అప్నే కరమ్ కీ కర్ అదాయే' అంటూ వచ్చే మొదటిపాట యూట్యూబ్‌లో ఇప్పటికీ బ్రహ్మాండంగా నడుస్తోంది. వివిధ రకాలుగా దీన్ని ఇప్పటివరకు దాదాపు ఐదు లక్షల మంది యూట్యూబ్‌లో చూశారు. ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధా కపూర్ నటించిన ఈ సినిమాకు మోహిత్ సూరి దర్శకత్వం వహించగా, భూషణ్ కుమార్, ముఖేష్ భట్ నిర్మించారు. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా చెన్నై ఎక్స్‌ప్రెస్, క్రిష్ 3, ధూమ్ 3, హిమ్మత్వాలా, రేస్ 2, ఏబీసీడీ, భాగ్ మిల్కా భాగ్, దబాంగ్ 2, మద్రాస్ కేఫ్ నిలిచాయి. -
ధీమా పెరిగింది
గత ఏడాది లండన్ ఒలింపిక్స్‌లో ఎన్నడూలేని విధంగా ఆరు పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారులు ఈ సంవత్సరం కూడా తమ జోరు కొనసాగించారు. విశ్వ క్రీడా వేదికపై తమదైన ముద్ర వేశారు. ఆర్చరీ నుంచి రెజ్లింగ్ దాకా ప్రతి క్రీడాంశంలో మనోళ్లు మెరిశారు. భారత క్రీడాకారులు ఈ విజయనామ సంవత్సరంలో విజయాలు మోసుకొచ్చారు. కొన్నేళ్ల క్రితం వరకు అంతర్జాతీయ టోర్నమెంట్లలో ప్రాతినిధ్యం కోసమే వెళ్లేవారు ఇపుడు పతకాలతో తిరిగి వస్తున్నారు. వివాదాలు వెంటాడుతున్నా... అంచనాలను అందుకుంటూ... ఆశలను నేరవేరుస్తూ... క్రీడలను కూడా కెరీర్‌గా ఎంచుకోవచ్చనే ధీమాను పెంచుతూ... అద్వితీయ విజయాలతో క్రీడా ప్రపంచంలో మరింత ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది భారత క్రీడారంగంలో గుర్తుంచుకోదగిన క్షణాల సమాహారం... సాక్షి పాఠకుల కోసం. లేటు వయసులో మేటి ఫలితాలు (టెన్నిస్) ఉత్సాహం, పట్టుదల ఉంటే లేటు వయసులోనూ మేటి ఫలితాలు సాధించొచ్చని లియాండర్ పేస్ నిరూపించాడు. రాడెక్ స్టెపానెక్ (చెక్ రిపబ్లిక్)తో కలిసి ఈ కోల్‌కతా యోధుడు 40 ఏళ్ల ప్రాయంలో యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో డబుల్స్ టైటిల్ నెగ్గాడు. ఈ క్రమంలో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించిన పెద్ద వయస్కుడిగా పేస్ చరిత్ర లిఖించాడు. వేర్వేరు భాగస్వాములతో కలిసి రోహన్ బోపన్న రెండు డబుల్స్ టైటిల్స్‌ను... మహేశ్ భూపతి ఒక టైటిల్‌ను నెగ్గారు. డబుల్స్‌కే పరిమితమైన హైదరాబాద్ స్టార్ సానియా మీర్జాకు ‘గ్రాండ్‌స్లామ్’ విజయం దక్కకపోయినా స్థిరమైన ప్రదర్శనతో ఐదు టైటిల్స్ సాధించింది. బెథానీ మాటెక్ (అమెరికా)తో కలిసి బ్రిస్బేన్ ఓపెన్, దుబాయ్ ఓపెన్‌లో... జెంగ్ జీ (చైనా)తో కలిసి న్యూ హవెన్ ఓపెన్‌లో... కారా బ్లాక్ (జింబాబ్వే)తో కలిసి టోక్యో ఓపెన్, బీజింగ్ ఓపెన్లలో సానియా డబుల్స్ టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. గురి అదిరింది (ఆర్చరీ) లండన్ ఒలింపిక్స్‌లో వైఫల్యాన్ని మరిపిస్తూ ఈ ఏడాది భారత ఆర్చర్లు తీపి జ్ఞాపకాలు మిగిల్చారు. దీపిక కుమారి, బొంబేలా దేవి, రిమిల్ బురిలీలతో కూడిన భారత జట్టు పోలండ్, కొలంబియాలలో జరిగిన రెండు ప్రపంచకప్‌లలో స్వర్ణ పతకాలు గెలిచింది. ఈ క్రమంలో భారత బృందం ఒలింపిక్ చాంపియన్ దక్షిణ కొరియాను, చైనా జట్లను బోల్తా కొట్టించింది. పురుషుల కాంపౌండ్ ఈవెంట్లో భారత జట్టు ఆసియా చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచింది. ఇక మంగోలియాలో జరిగిన ఆసియా గ్రాండ్‌ప్రి టోర్నీలో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వై.చరణ్ రెడ్డి స్వర్ణ, రజత, కాంస్య పతకాలు సాధించాడు. ఉడుంపట్టు (రెజ్లింగ్) గతేడాది లండన్ ఒలింపిక్స్‌లో స్టార్ రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ విజయాల స్ఫూర్తితో... ఈసారి ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. సెప్టెంబరులో హంగేరిలో జరిగిన ఈ మెగా ఈవెంట్లో తొలిసారి భారత రెజ్లర్లు మూడు పతకాలు సాధించారు. ఫ్రీస్టయిల్లో అమిత్ కుమార్ (55 కేజీలు) రజతం నెగ్గగా... బజరంగ్ (60 కేజీలు) కాంస్యం సాధించాడు. గ్రీకో రోమన్ విభాగంలో సందీప్ తులసీ యాదవ్ (66 కేజీలు) కాంస్యం రూపంలో తొలిసారి భారత్‌కు పతకాన్ని అందించాడు. ఈ ‘త్రయం’ ప్రదర్శనతో తొలిసారి భారత్ వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్‌కు అర్హత సాధించింది. ‘పంచ్’ పదును అదుర్స్ (బాక్సింగ్) మనోళ్లపై అంతర్జాతీయ అమెచ్యూర్ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) సస్పెన్షన్ కొనసాగుతున్నా... ఈ ప్రభావం భారత బాక్సర్లపై పడలేదు. జూలైలో జోర్డాన్‌లో జరిగిన ఆసియా సీనియర్ చాంపియన్‌షిప్‌లో శివ థాపా (56 కేజీలు) స్వర్ణం నెగ్గగా... మన్దీప్ జాంగ్రా (69 కేజీ), దేవేంద్రో సింగ్ (49 కేజీ)లకు రజతాలు, మనోజ్ కుమార్ (64 కేజీలు) కాంస్యం లభించాయి. కజకిస్థాన్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో తొలిసారి ఐదుగురు భారత బాక్సర్లు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. సెర్బియా టోర్నీలో ఏపీ బాక్సర్ లలితా ప్రసాద్ (49 కేజీలు) పసిడి పతకం సాధించగా... సెప్టెంబరులో బల్గేరియాలో ప్రపంచ యూత్ చాంపియన్‌షిప్‌లో నిఖత్ జరీన్ (54 కేజీలు) రజతం గెల్చుకుంది. ‘రాకెట్’తో రఫ్ ఆడించారు (బ్యాడ్మింటన్) బ్యాడ్మింటన్ ప్రపంచంలో తెలుగు తేజం పి.వి.సింధు కొత్త రాకెట్లా దూసుకొచ్చింది. మేలో మలేసియా గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గిన 18 ఏళ్ల సింధు అదే జోరును కొనసాగించి చైనాలో జరిగిన ప్రపంచ సీనియర్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం సాధించింది. తద్వారా మహిళల సింగిల్స్‌లో పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా నిలిచింది. కేంద్ర క్రీడాపురస్కారం ‘అర్జున అవార్డు’ పొందిన ఈ ఆంధ్రప్రదేశ్ అమ్మాయి డిసెంబరులో మకావు గ్రాండ్‌ప్రి గోల్డ్ టోర్నీలోనూ విజేతగా నిలిచింది. దిగ్గజం ప్రకాశ్ పదుకొనే నుంచి బ్యాడ్మింటన్ భవిష్యత్ తారగా ప్రశంసలందుకుంది. గత ఐదేళ్లుగా భారత బ్యాడ్మింటన్‌కు పర్యాయపదంగా నిలిచిన సైనా నెహ్వాల్‌కు ఈ ఏడాది ఏదీ కలసిరాలేదు. ఆడిన 14 టోర్నమెంట్లలో ఆమె ఒక్కదాంట్లోనూ ఫైనల్‌కు చేరుకోలేదు. పురుషుల విభాగంలో ఆంధ్రప్రదేశ్ కుర్రాడు కిడాంబి శ్రీకాంత్ ఆశాకిరణంలా ఎదిగాడు. జూన్‌లో థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ టైటిల్ నెగ్గిన ఈ గుంటూరు జిల్లా క్రీడాకారుడు ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాడు. 2001లో పుల్లెల గోపీచంద్ ఆల్ ఇంగ్లండ్ టైటిల్ సాధించిన తర్వాత శ్రీకాంత్ రూపంలో మరో భారత ప్లేయర్ సీనియర్ స్థాయిలో అంతర్జాతీయ టైటిల్ నెగ్గాడు. తెలుగు కుర్రాడు సిరిల్ వర్మ ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో అండర్-15 చాంపియన్‌గా నిలిచి ఈ ఘనత సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడిగా నిలిచాడు. ఐపీఎల్ తరహాలో బ్యాడ్మింటన్‌లో ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) ఈ ఏడాది కొత్తగా ప్రారంభమైంది. సైనా నెహ్వాల్ సభ్యురాలిగా ఉన్న ‘పీవీపీ హైదరాబాద్ హాట్‌షాట్స్’ తొలి ఏడాది చాంపియన్‌గా అవతరించింది. బుల్లెట్ దిగింది (షూటింగ్) అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భారత మహిళా షూటర్ హీనా సిద్ధూ ప్రపంచకప్ ఫైనల్స్‌లో సంచలనం సృష్టించింది. నవంబరులో జర్మనీలో జరిగిన సీజన్ ముగింపు టోర్నీలో ఈ పంజాబ్ అమ్మాయి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో పసిడి పతకాన్ని నెగ్గింది. పిస్టల్ ఈవెంట్లో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ షూటర్‌గా చరిత్ర సృష్టించింది. పతకం నెగ్గే క్రమంలో హీనా ‘డబుల్ ఒలింపిక్ చాంపియన్’ గువో వెన్జున్ (చైనా), ప్రపంచ చాంపియన్ అరునోవిచ్ జొరానా (సెర్బియా), రెండుసార్లు ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన కొస్టెవిచ్ (ఉక్రెయిన్)లను ఓడించింది. ‘లిఫ్ట్’ చేస్తే పతకాలే... (వెయిట్‌లిఫ్టింగ్) భారత వెయిట్లిఫ్టింగ్కు ఈ ఏడాది కలిసొచ్చింది. ఆంధ్రప్రదేశ్ యువ లిఫ్టర్ రాగాల వెంకట్ రాహుల్ భవిష్యత్‌పై ఆశలు పెంచాడు. ఆసియా యూత్ చాంపియన్‌షిప్‌లో, ఆసియా యూత్ క్రీడల్లో, కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లలో అతను స్వర్ణ పతకాల పంట పండించాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన శిరీషా రెడ్డి, దీక్షిత కూడా కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు పతకాలు అందించారు. -
రికార్డులున్నా... అసంతృప్తే!
174 డెరైక్ట్ చిత్రాలు... కానీ విజయాలు మాత్రం పదిహేనే. 2013లో డిసెంబర్ 24 వరకూ మన చిత్రసీమ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇది. అంకెల పరంగా చూస్తే ఓకే గానీ, విజయాల పరంగా మాత్రం వీకే. ఈ విజయాలు ఏ మాత్రం బాక్సాఫీస్ దప్పికను తీర్చలేవనేది కరాఖండీగా చెప్పేయొచ్చును. మన తెలుగు సినిమా వంద కోట్ల క్లబ్‌కు (గ్రాస్ పరంగా) చేరుకోవడమనేది 2013లో ఓ గొప్ప విజయం. దాంతోపాటు మరో నాలుగు సినిమాలు 50 కోట్ల మైలురాళ్లను (షేర్ పరంగా) అందుకోవడం మరో తీయటి అనుభూతి. చాలామట్టుకు సినిమాలను ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు. కంటెంట్ లేకపోతే ఒక్క టిక్కెట్ కూడా తెగడంలేదనేది కాదనలేని వాస్తవం. రికార్డులను చూసి ఆనందపడాలో, పరాజయాలను తల్చుకుని కుమిలిపోవాలో తెలియని అసందిగ్ధావస్థ ఇది. విజయాలు సాధించిన సినిమాలను విశ్లేషించి చూస్తే, కుటుంబ కథాచిత్రాలకు మళ్లీ ఆదరణ మొదలైందని అర్థమవుతోంది. అందుకు నిదర్శనం ‘అత్తారింటికి దారేది’, ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు’ చిత్రాల ఘనవిజయాలే. మరో పక్క మాస్ ఎంటర్టైనర్లకూ ప్రేక్షకులు పట్టం కట్టారు. కుటుంబ కథ, ప్రేమకథ, మాస్ మసాలా, చివరకు హారర్ స్టోరీ అయినా వినోదం ఉండి తీరాల్సిందే. అలా అయితేనే ప్రేక్షకుడు సినిమాకి వస్తున్నాడు. రాష్ట్రంలో ఈ ఏడాది ఉదృతంగా జరిగిన తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు చిత్రసీమపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. చాలా సినిమాల విడుదలలు వెనక్కి ముందుకి ఊగిసలాడాల్సిన పరిస్థితి. ఒక దశలో పెద్ద సినిమాలన్నీ విడుదలకు వెనుకంజ వేస్తే... వారానికి అయిదారు చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. అయితే.. ఇవన్నీ ఎంత త్వరగా వచ్చాయో... అంతే త్వరగా వెళ్లిపోయాయి. ఈ ఏడాది విజయతీరానికి చేరుకున్న 15 సినిమాలేంటో ఒకసారి చూద్దాం... బ్లాక్‌బస్టర్ ఆఫ్‌ది ఇయర్: సినిమా రిలీజ్‌కి రెడీ. కానీ ఈ లోగా రాష్ట్రంలోని ఉద్యమం ఊపందుకుంది. దాంతో సినిమా విడుదల ఆగిపోయింది. జూలైలో అనుకున్న సినిమా సెప్టెంబర్ వరకూ సెలైంట్‌గా ఉండిపోవాల్సివచ్చింది. ఈ లోగా ఓ పిడుగులాంటి వార్త. బాక్సాఫీస్‌కి గుండెపోటు తెప్పించే వార్త. ఈ సినిమా ప్రథమార్ధం అంతా ఇంటర్నెట్లో దర్శనమిచ్చింది. దానికి తోడు అనేక పైరసీ ప్రింట్లు. ఇక ఈ సినిమా పని అయిపోయిందనే అందరూ అనుకున్నారు. అయినా మొండిగా సెప్టెంబర్ 27న సినిమాను విడుదల చేశారు. కట్ చేస్తే... ‘అత్తారింటికి దారేది’కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇన్ని అవరోధాలను దాటుకొని ఇంతటి ఘనవిజయం సాధించడమంటే... మాటలు కాదు. ఇది పవన్‌కల్యాణ్ మ్యాజిక్. దర్శకుడు త్రివిక్రమ్ మ్యాజిక్. వంద కోట్ల రూపాయల పై చిలుకు గ్రాస్నీ, 80 కోట్ల రూపాయల షేర్ని వసూలు చేసి తెలుగు సినిమా స్టామినాను బాక్సాఫీస్‌కి చాటిచెప్పింది. ‘గబ్బర్‌సింగ్’తో ఫామ్‌లోకొచ్చిన పవన్‌ని నంబర్‌వన్ రేస్‌లో ముందుండేలా చేసింది. కుటుంబ కథలు కనుమరుగైపోయిన నేటి తరుణంలో పవన్ ఈ కథను ఎంచుకొని మళ్లీ కొత్త ట్రెండ్‌కి నాంది పలికారు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కూడా ఓ సంచలనం. అత్త పాత్రలో నదియా కూడా పెద్ద ప్లస్. నాయక్(జనవరి 9) ఈ ఏడాదికి ఇదే తొలి హిట్. మాస్ అంశాలే ఈ సినిమాకు శ్రీరామరక్ష. ‘రచ్చ’ తర్వాత చరణ్‌కి ఇది మరో మాస్ హిట్. 50 కోట్ల పైచిలుకు షేర్ వసూలు చేసింది. చరణ్, వినాయక్ కాంబినేషన్ మాస్‌ని ఆకట్టుకుంది. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు(జనవరి 11) వెంకటేష్, మహేష్ లాంటి ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి చేసిన సినిమా. అదీ కుటుంబ కథ కావడం విశేషం. క్లీన్ మూవీ. అనుబంధాలు, అలకలు, అల్లర్లు, కోనసీమ అందాలు ప్రేక్షకుల మనసు నిండేలా చేశాడు దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల. అందుకేనేమో 50 కోట్ట పైచిలుకు షేర్ రాబట్టగలిగింది. ఓవర్సీస్లో కొత్త రికార్డ్ సృష్టించింది. మళ్లీ మల్టీస్టారర్ ట్రెండ్‌కి కొత్త ఊపిరిచ్చింది. మిర్చి(ఫిబ్రవరి 8) ఫ్యామిలీ డ్రామాకు ఫ్యాక్షన్ కలగలిపితే వచ్చిన ఘాటైన సినిమా ఇది. ఈ సినిమాతో ప్రభాస్ మాస్‌కి మరింత చేరువయ్యారు. రచయిత కొరటాల శివ దర్శకునిగా మెప్పించారు. ఈ సినిమా కూడా 50 కోట్ల పైచిలుకు షేర్ రాబట్టుకుంది. స్వామి రారా( మార్చి 23) కొత్త కాన్సెప్ట్‌తో కొత్తగా తీస్తే... చిన్న సినిమా అయినా పెద్ద రేంజ్లో ఆడుతుంది అనడానికి స్వామి రారా ఓ అందమైన నిదర్శనం. కొత్త దర్శకుడు సుధీర్‌వర్మ ఈ సినిమాను డీల్ చేసిన విధానమే మెయిన్ హైలైట్. బాద్షా(ఏప్రిల్ 5) ఈ ఏడాది యాభై కోట్ల పై చిలుకు షేర్ వసూలు చేసిన సినిమాల్లో ‘బాద్షా’ ఒకటి. ఊసరవెల్లి, దమ్ము చిత్రాలతో పోల్చుకుంటే... ఎన్టీఆర్‌కి ఇది మంచి ఊరట. శ్రీనువైట్ల శైలి ఈ సినిమాకు కలిసొచ్చింది. గుండెజారి గల్లంతయ్యిందే(ఏప్రిల్ 19) చాలాకాలం తర్వాత వచ్చిన క్లీన్ అండ్ కలర్‌ఫుల్ లవ్‌స్టోరీ ఇది. నితిన్, నిత్యామీనన్ల కెమిస్ట్రీ మరోసారి అదిరింది. అనూప్ మ్యూజిక్ మ్యాజిక్ మళ్లీ వర్కవుట్ అయ్యింది. దర్శకుడు విజయ్‌కుమార్ కొండా ప్రయత్నం ఫలించింది. తడాఖా(మే 10) తమిళ ‘వేట్టై’కి రీమేక్ ఇది. సునీల్, నాగచైతన్య కాంబినేషన్ ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. నాగచైతన్యకు మాస్ ఇమేజ్ జతకూడింది. డాలీ ఈ రీమేక్‌ని బాగా డీల్ చేశారు. ప్రేమకథాచిత్రమ్ (జూన్ 9) హారర్ సినిమా చూసి ఎవరైనా భయపడతారు. కానీ హారర్‌తో కూడా పొట్టచెక్కలయ్యేంత కామెడీ సృష్టించొచ్చని ‘ప్రేమ కథాచిత్రమ్’ నిరూపించింది. మారుతి దర్శకత్వ పర్యవేక్షణలో కెమెరామేన్ ప్రభాకరరెడ్డి డెరైక్ట్ చేశారీ సినిమా. ఈ ఏడాది చిన్న సినిమాల్లో అతి పెద్ద విజయం ఇదే. సుధీర్‌బాబుని హీరోగా నిలబెట్టింది. బలుపు(జూన్ 28) రెండేళ్ల దోబూచులాట తర్వాత రవితేజకు ‘బలుపు’తో విజయం దక్కింది. పంచ్ డైలాగులు బాగా పండాయ్. పెరిగిన టికెట్ రేట్లను బాగా సద్వినియోగం చేసుకోగలిగిందీ సినిమా. అంతకు ముందు ఆ తరువాత(ఆగస్ట్ 23) సహజీవనం అనేది కత్తిమీద సాములాంటి కాన్సెప్ట్. ఏ మాత్రం అటూఇటూ అయినా... చాలా తేడా వస్తుంది. ఇంద్రగంటి మోహన్‌కృష్ణ చాలా తెలివిగా ఈ సినిమాను మలిచారు. సుమంత్ అశ్విన్‌కి హీరోగా ఓ మంచి బ్రేక్. దామూకి నిర్మాతగా వేల్యూ పెంచింది. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ (నవంబర్ 29) ట్రావెల్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే సినిమా. కొత్త దర్శకుడు మేర్లపాక గాంధీ చాలా ఇన్నోవేటివ్‌గా ఈ కథను తెరకెక్కించాడు. సందీప్‌కిషన్‌కి సోలో హీరోగా తొలి విజయం. మంచు మనోజ్ కెరీర్లోనే భారీ వసూళ్లు రాబట్టిన సినిమా ‘పోటుగాడు’. మేకింగ్ దశలోనే ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ ఫలితంగా ప్రారంభ వసూళ్లు ఆకర్షణీయంగా వచ్చాయి. చాలా విరామం తర్వాత గోపిచంద్ చేసిన ‘సాహసం’ ఓ మంచి ప్రయత్నంగా నిలిచింది. ఆయన స్థాయి విజయం కాకపోయినా... రన్ మాత్రం బాగానే వచ్చింది. ‘అడ్డా’ సినిమా కూడా సెలైంట్‌గా వసూళ్లు రాబట్టింది. సుశాంత్‌కి ఓ విధంగా ఇదే తొలి విజయం. -
2013 టాలీవుడ్: సమంత
-
న్యూ డైరెక్టర్స్‌కు కలిసొచ్చిన 2013
-
యువ హోరు షురూ
చరిత్రలో క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం లాగా... క్రికెట్లోనూ సచిన్‌కు పూర్వం.. సచిన్ శకం... సచిన్ తర్వాత... అనే మూడు దశలు ఉన్నాయి. ఇందులో మూడో దశ మొదలైంది ఈ ఏడాదే. 2013 క్రికెట్ అభిమానులకు కావలసినంత వినోదాన్నిచ్చింది. అదే సమయంలో సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్తో అభిమానులను కన్నీరు పెట్టించింది. చాంపియన్స్ ట్రోఫీలో విజయంతో ధోనిసేన ఈ ఏడాదిని చిరస్మరణీయంగా మార్చింది. ఐపీఎల్లో స్పాట్ ఫిక్సింగ్‌తో ఆట మీద దెబ్బ పడుతుందేమో అని భయపడినా... యువ క్రికెటర్లు తమ అసమాన ఆటతీరుతో దేశంలో ఆట ప్రతిష్టను కాపాడారు. సచిన్ రిటైర్మెంట్... రోహిత్ శర్మ డబుల్ సెంచరీ... వన్డేల్లో ధోనిసేన వరుస విజయాలు... స్వదేశంలో టెస్టుల్లో తిరుగులేని ప్రదర్శన... విరాట్ కోహ్లి సూపర్ ఫామ్... ఇలా 2013లో భారత క్రికెట్లో చెప్పుకోదగ్గ అంశాలు చాలానే ఉన్నాయి. ఏడాది ఆరంభం నుంచి చివరి వరకు విరామం లేని క్రికెట్‌తో ఎప్పటిలాగే క్రికెటర్లు బిజీబిజీగా గడిపారు. ఐపీఎల్ సమయంలో వెలుగులోకి వచ్చిన స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం దేశంలో పెద్ద కలకలం. శ్రీశాంత్ లాంటి పేరున్న బౌలర్ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఇది పెద్ద మచ్చే అయినా... మొత్తం మీద ఈ ఏడాది భారత క్రికెట్ సరైన దిశలోనే నడిచిందని అనుకోవాలి. ఇక మిగిలిన దేశాల క్రికెట్లోనూ హడావుడి బాగానే ఉంది. యాషెస్ రెండు సార్లు జరగడంతో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా బిజీబిజీగా మారాయి. ఈ ఏడాది క్రికెట్లో విశేషాలు... - సాక్షి క్రీడావిభాగం ముగిసిన సచిన్ శకం 16 నవంబరు 2013... భారత దేశంలో కోట్లాది మంది క్రికెట్ అభిమానులు కన్నీరు పెట్టిన రోజు. రెండు దశాబ్దాలకు పైగా అలుపెరగని యోధుడిలా క్రికెట్ మైదానంలో పోరాడుతూ... అవిశ్రాంతంగా అభిమానులను అలరించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అంతరాత్మ ప్రబోధానుసారమే రిటైర్మెంట్ నిర్ణయం ఉంటుందని పలు సందర్భాల్లో చెప్పిన సచిన్... తన వీడ్కోలు అంశాన్ని నెల రోజుల ముందే ప్రకటించాడు. తన దగ్గరి నుంచి ప్రకటన వచ్చిన క్షణం నుంచి... వెస్టిండీస్‌తో సిరీస్ ముగిసేవరకు సచిన్ మేనియాతో దేశం ఊగిపోయింది. తన సొంతగడ్డ ముంబైలో తల్లి, భార్య, పిల్లలు, సన్నిహితులు, అభిమానుల మధ్య మాస్టర్ 200వ టెస్టు మ్యాచ్ ఆడాడు. క్రికెట్లో తనకే సాధ్యమైన చక్కటి షాట్లు ఆడి చివరిసారిగా అభిమానులను ఆటతో అలరించాడు. వెస్టిండీస్‌పై సిరీస్‌ను ధోని అండ్ కో క్లీన్‌స్వీప్ చేసి...మాస్టర్‌కు వీడ్కోలు పలికారు. భారమైన హృదయంతో అభిమానులను ఉద్దేశించి ప్రసంగించి... చివరిసారి పిచ్‌కు నమస్కరించి కన్నీళ్లతో క్రికెట్ ‘దేవుడు’ వెళ్లిపోతున్న దృశ్యం... అది చూసిన వాళ్లందరికీ ఎప్పటికీ ఓ జ్ఞాపకం. రోహిత్ ‘డబుల్’ వన్డేల్లో డబుల్ సెంచరీ అనే కలను ఈ ఏడాది రోహిత్ సాకారం చేసుకున్నాడు. సచిన్, సెహ్వాగ్‌ల తర్వాత ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియాతో బెంగళూరులో జరిగిన వన్డేలో విశ్వరూపం చూపించి 158 బంతుల్లో 209 పరుగులు చేశాడు. ఇందులో 12 ఫోర్లు, 16 సిక్సర్లు ఉన్నాయి. ధోని ధమాకా వెస్టిండీస్‌లో జరిగిన ముక్కోణపు వన్డే టోర్నీ ఫైనల్లో భారత కెప్టెన్ ధోని సంచలనాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 145/5 స్కోరుతో నిలిచింది. ఆ సమయంలో ధోని స్కోరు 2 పరుగులు! ఈ దశలో టెయిలెండర్ల సహకారంతో చివరి వరకు నిలిచి ధోని ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించాడు. గెలిచేందుకు కావాల్సిన 57 పరుగులలో ధోని ఒక్కడే 43 పరుగులు చేశాడు. ఆఖరి ఓవర్లో 15 పరుగులు అవసరం కాగా, ధోని వరుసగా 6,4,6 బాదడంతో ఒక వికెట్ తేడాతో భారత్ సంచలన విజయం సాధించింది. భారీ చేజింగ్ ఆస్ట్రేలియాతో జైపూర్‌లో జరిగిన వన్డేలో భారత్ 360 పరుగుల లక్ష్యాన్ని ఊదిపారేసింది. రోహిత్ శర్మ (141 నాటౌట్), విరాట్ కోహ్లి (100 నాటౌట్) శతకాలతో పాటు ధావన్ (95) చెలరేగడంతో 43.3 ఓవర్లలోనే ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి భారత్ ఈ స్కోరును అందుకోవడం విశేషం. భారత్ తరఫున అత్యంత వేగంగా సెంచరీ (52 బంతుల్లో) చేసిన క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. ‘స్పాట్’ పెట్టారు ఈ ఏడాది భారత క్రికెట్‌కు అతి పెద్ద మచ్చ స్పాట్ ఫిక్సింగ్. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు శ్రీశాంత్, చండిలా, చవాన్ ‘స్పాట్ ఫిక్సింగ్’కు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో వీరిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మే 17న ఈ ఉదంతం బయటకు వచ్చింది. అటు ఐపీఎల్ జట్ల యజమానులు కూడా బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ మొత్తం ఉదంతంపై ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. శ్రీశాంత్, చండిలా, చవాన్ ప్రస్తుతం బెయిల్‌పై బయటే ఉన్నారు. కానీ బోర్డు నుంచి నిషేధం ఎదుర్కొంటున్నారు. శ్రీశాంత్‌పై బోర్డు జీవితకాల నిషేధం విధించింది. కొత్త సంచలనాలు ఈ ఏడాది భారత క్రికెట్లో కొత్తగా సంచలనాలు సృష్టించిన క్రికెటర్లు భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్. వన్డేల్లో రెండు కొత్త బంతులు నిబంధనను అందరికంటే బాగా ఉపయోగించుకున్న బౌలర్ భువనేశ్వర్. తన స్వింగ్ బౌలింగ్‌తో ఈ ఏడాది భారత్ వన్డేల్లో విజయాలు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అటు శిఖర్ ధావన్ టెస్టుల్లో అరంగేట్రంలోనే చెలరేగిపోయాడు. ఆ ‘త్రయం’ మిస్! ఈ ఏడాది భారత క్రికెట్లో అతి పెద్ద మిస్సింగ్ సెహ్వాగ్, గంభీర్, హర్భజన్. దాదాపు దశాబ్దానికి పైగా భారత క్రికెట్లో భాగంగా ఉన్న హర్భజన్, సెహ్వాగ్ జట్టులో స్థానం కోల్పోయారు. సీజన్ ఆరంభంలో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఆడినా... ఆ తర్వాత మళ్లీ జట్టులోకి రాలేకపోయారు. ఫామ్ కోల్పోయిన స్టార్ క్రికెటర్ గంభీర్ ఈ ఏడాది వన్డేల్లో కనిపించినా ఒక్క టెస్టు కూడా ఆడలేకపోయాడు. చివరిసారి మనమే... ఇంగ్లండ్‌లో ఈ ఏడాది జరిగిన చాంపియన్స్ ట్రోఫీతో ఇక ఈ మెగా టోర్నీకి మంగళం పాడేశామని ఐసీసీ ప్రకటించింది. అయితే టెస్టు చాంపియన్ షిప్‌పై సందేహాలు పెరిగిన నేపథ్యంలో భవిష్యత్‌లో మళ్లీ ఈ టోర్నీ తెరమీదకు వస్తుందేమో తెలియదు. ఇక ఇదే చివరిసారి అని చెప్పిన ఏడాదిలో ధోనిసేన టైటిల్ సాధించింది. లీగ్ దశలో పాకిస్థాన్‌ను ఓడించి సెమీస్‌కు చేరిన భారత్... అక్కడ శ్రీలంకను చిత్తు చేసింది. ఆ తర్వాత ఇంగ్లండ్‌తో ఫైనల్ వర్షం కారణంగా 20 ఓవర్ల మ్యాచ్‌గా మారింది. తొలుత భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్లకు కేవలం 129 పరుగులు చేసి... అద్భుతమైన బౌలింగ్‌తో ఇంగ్లండ్‌ను 124/8 స్కోర్‌కు నియంత్రించి టైటిల్ సాధించింది. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన శిఖర్ ధావన్ (363) గోల్డెన్ బ్యాట్ అవార్డు గెలుచుకోగా... ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు గోల్డెన్ బాల్ అవార్డు లభించింది. వన్డేల్లో సిక్సర్... టెస్టుల్లో స్వీప్! భారత క్రికెట్ జట్టు ఈ ఏడాది స్ఫూర్తిదాయకంగా ఆడింది. చాంపియన్స్ ట్రోఫీతో సహా మొత్తం ఎనిమిది వన్డే టోర్నీలు/సిరీస్‌లు ఆడిన ధోనిసేన ఏకంగా ఆరుసార్లు విజయం సాధించింది. ఏడాది ఆరంభంలో పాకిస్థాన్‌తో 1-2తో సిరీస్‌ను కోల్పోయిన భారత్... చివరగా దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్‌లోనూ 0-2తో ఓడింది. ఈ మధ్యలో మాత్రం సిక్సర్ కొట్టింది. ఇంగ్లండ్‌తో స్వదేశంలో 3-2తో సిరీస్ గెలిచింది. చాంపియన్స్ ట్రోఫీలో విజయం సాధించి... వెస్టిండీస్‌లో జరిగిన ముక్కోణపు టోర్నీలో ఫైనల్లో లంకను ఓడించి టైటిల్ సాధించింది. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి కోహ్లి సారథ్యంలో జింబాబ్వే వెళ్లి 5-0తో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేశారు. మళ్లీ స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఏడు వన్డేల సిరీస్‌ను 3-2తో గెలిచారు. ఆ తర్వాత వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో 2-1తో విజయం సాధించారు. ఇక టెస్టుల విషయానికొస్తే ఈ ఏడాది తక్కువగానే ఆడారు. ఫిబ్రవరి-మార్చిలో ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరిగిన సిరీస్‌లో 4-0తో క్లీన్‌స్వీప్ చేసి బోర్డర్- గవాస్కర్ ట్రోఫీని గెలిచారు. నవంబరులో వెస్టిండీస్‌తో జరిగిన సచిన్ వీడ్కోలు సిరీస్‌నూ 2-0తో స్వీప్ చేశారు. ‘చాంపియన్’ ముంబై ఈ ఏడాది అదరగొట్టే ఆటతీరుతో ముంబై ఇండియన్స్ జట్టు అటు ఐపీఎల్, ఇటు చాంపియన్స్ లీగ్‌లోనూ విజేతగా నిలిచింది. ఐపీఎల్లో ప్రత్యేకంగా కెప్టెన్సీ కోసం పాంటింగ్‌ను పిలిపించుకున్నారు. కానీ రోహిత్ శర్మ కెప్టెన్ అయ్యాక జట్టు ఒక్కసారిగా కొత్తగా కనిపించింది. తన నాయకత్వ ప్రతిభతో రోహిత్ రెండు టోర్నీల్లోనూ ఆకట్టుకున్నాడు. చెన్నైను కంగుతినిపించి ఐపీఎల్ టైటిల్ నెగ్గిన ముంబై ... చాంపియన్స్ లీగ్ ఫైనల్లో రాజస్థాన్‌ను చిత్తు చేసింది. ‘యాషెస్’ రెండుసార్లు ఇంగ్లండ్, ఆస్ట్రేలియాల మధ్య ప్రతీకార పోరుగా భావించే ‘యాషెస్’ ఈ ఏడాది రెండుసార్లు జరిగింది. వన్డే ప్రపంచకప్ ఏర్పాట్లకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు గానే ఒకే ఏడాది రెండుసార్లు ఈ సిరీస్ నిర్వహించారు. ఆగస్టులో స్వదేశంలో జరిగిన ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లండ్ 3-0తో గెలుచుకుంది. రెండు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న సిరీస్‌లో మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే క్లార్క్‌సేన 3-0తో యాషెస్‌ను సాధించింది. మిగిలిన దేశాలలో చెప్పుకోదగ్గ సంచలనాలు ఏమీ లేవు. దక్షిణాఫ్రికా టెస్టుల్లో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంటూ దూసుకుపోతోంది. శ్రీలంక, పాకిస్థాన్, న్యూజిలాండ్, వెస్టిండీస్‌ల నుంచి సంచలన ఫలితాలేమీ రాలేదు. అఫ్ఘానిస్థాన్ జట్టు వన్డే ప్రపంచకప్‌తో పాటు టి20 ప్రపంచకప్‌కు అర్హత సాధించడం చిన్న దేశాల విషయంలో చెప్పుకోదగ్గ ఘనత. అన్నిటికంటే పెద్ద ట్విస్ట్... నేపాల్ జట్టు టి20 ప్రపంచకప్‌కు అర్హత సాధించడం. ఈ ఏడాది టాపర్స్ టెస్టులు అత్యధిక వికెట్లు: స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్-59 వికెట్లు) అత్యధిక పరుగులు: మైకేల్ క్లార్క్ (ఆస్ట్రేలియా - 1077 పరుగులు) అత్యధిక విజయాలు (జట్టు): ఆస్ట్రేలియా (13 టెస్టుల్లో 7 విజయాలు) వన్డేలు అత్యధిక వికెట్లు: అజ్మల్ (పాకిస్థాన్- 56 వికెట్లు) అత్యధిక పరుగులు: మిస్బావుల్ (పాకిస్థాన్- 1322 పరుగులు) అత్యధిక విజయాలు (జట్టు): భారత్ (34 వన్డేల్లో 22 విజయాలు) -
టాలివుడ్ 2013 - తెలుగమ్మాయి
-
టాలివుడ్ బుల్లోడు - త్రివిక్రమ్
-
టాలీవుడ్ 2013 - ఫ్లాప్ షో
-
టాలీవుడ్ 2013 - తెలుగమ్మాయి
-
టాలీవుడ్ 2013 - హిట్ బుల్లెట్ త్రివిక్రమ్ శ్రీనివాస్
-
టాలీవుడ్ 2013 - దూసుకొచ్చారు
-
సన్నీ లియోన్ కోసం గూగుల్‌లో గాలింపు!
ఈ సంవత్సరం మొత్తం మీద గూగుల్‌లో అత్యధికంగా ఎవరి కోసం సెర్చ్ చేశారో తెలుసా? బూతు చిత్రాలతో మొదలుపెట్టి, ఇటీవలి కాలంలో షారుక్ ఖాన్ కూడా ఆమెతో కలిసి సినిమా చేయాలని ఉందంటూ చెప్పిన సన్నీ లియోన్. కత్రినా కైఫ్, దీపికా పదుకొనే లాంటి అగ్రతారలను సైతం ఆమె ఈ వెదుకులాటలో వెనక్కి నెట్టేసింది. ఇలా వివిధ సినీ నటుల కోసం చేసిన సెర్చ్‌లో అగ్రస్థానంలోను, చిట్టచివరి స్థానంలో కూడా సెక్సిణులే ఉండటం గమనార్హం. మొదటి స్థానంలో సన్నీ లియోన్, పదో స్థానంలో పూనమ్ పాండే ఉన్నారు. ఇప్పుడంటే పూనమ్ పాండే వార్తల్లో లేదు గానీ, అంతకుముందు భారత్ విజయం సాధిస్తే తాను నగ్నంగా పోజులిస్తానంటూ బహిరంగంగా చెప్పి విపరీతంగా వార్తల్లో నిలిచింది. గూగుల్ సెర్చ్‌లో టాప్ టెన్ స్థానాల్లో నిలిచిన వ్యక్తులు ఎవరెవరో చూస్తే.. వరుసగా సన్నీ లియోన్, సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్, దీపికా పదుకొనే, షారుక్ ఖాన్, హనీ సింగ్, కాజల్ అగర్వాల్, కరీనా కపూర్, సచిన్ టెండూల్కర్, పూనమ్ పాండే ఉన్నారు. -
ఫెమీనా ఫెస్టివ్ షోకేష్ 2013 అందాలు
-
STBL మనోహరం 2013