వాషింగ్టన్ : అమెరికాలో సేవలు అందించిన వారికి ఇచ్చే సీఎన్‌ఎన్ హీరోస్ అవార్డు-2017 రేసులో ఇద్దరు ఇండో-అమెరికన్లు నిలిచారు. పీటర్స్‌బర్గ్‌కు చెందిన సమీర్ లఖానీ, టెక్సాస్‌కు చెందిన మోనా పటేల్ సీఎన్‌ఎన్ హీరోస్ టాప్ టెన్ జాబితాలో నిలిచారు. స్టార్ హోటల్స్ నుంచి సేకరించిన సబ్బులను రీ సైకిల్ చేసి.. వాటిని కాంబోడియాలోని పేదప్రజలకు అందిస్తున్నారు. లఖానీ 2004 నుంచి సేవాకార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. సర్ఫ్‌ను నీటిలో కలిపి.. దానితో చిన్నారులకు స్నానం చేయించే సన్నివేశం నా జీవితాన్ని మార్చిందని లఖాని చెబుతున్నారు. ఇప్పటి వరకూ లఖానీ 6 లక్షల 50 వేలమందికి లఖానీ సహాయం చేసినట్లు సీఎన్‌ఎన్ వర్గాలు చెబుతున్నాయి.
మోనా పటేల్ శాన్ అంటోనియో ఫౌండేషన్ నుంచి అంగవైకల్యంతో జన్మించిన పేద ప్రజలకు సహాయం అందిస్తున్నారు. వైకల్యం కలిగిన అవయవాలు అందించడంతో పాటు, చదువు చెప్పిస్తున్నారు. అంతేకాక వారికి ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నారు. ప్రతి నెల 30 నుంచి 60 మందికి వైకల్యం కలిగిన అవయవాలను మోనా పటేల్ అందిస్తుండడం విశేషం. ఇంత చేస్తున్న మోనా వయసు కేవలం 17 ఏళ్లు కావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment