CNN
-
ఖైదీ కాదు, గూఢచారి!
డమాస్కస్: అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ తీవ్ర భంగపాటుకు గురైంది. అమాయకుడని చెబుతూ సిరియా జైలు నుంచి ఇటీవల ఆ సంస్థ చొరవ తీసుకుని మరీ విడుదల చేసిన ఓ ఖైదీ నిజమైన ఖైదీ కాదని తేలింది. తాజా మాజీ అధ్యక్షుడు అసద్ పాలనలో నిఘా విభాగంలో పని చేసిన అధికారి అని నిజ నిర్ధారణలో వెల్లడైంది. అతని పేరు సలామా మహమ్మద్ సలామా అని, చిత్రహింసలకు, దోపిడీలకే గాక యుద్ధ నేరాలకు కూడా పాల్పడ్డాడని స్థానిక నిజ నిర్ధారణ సంస్థ వెరిఫై–సై తెలిపింది. దాంతో సీఎన్ఎన్ తన తప్పును కప్పిపుచ్చుకునే పనిలో పడింది. ఎందుకంటే సీఎన్ఎన్ చీఫ్ ఇంటర్నేషనల్ కరస్పాండెంట్ క్లారిస్సా వార్డ్, అమె బృందం తిరుగుబాటు బృందంతో పాటు ఇటీవల సిరియా ఇంటలిజెన్స్ కార్యాలయంలోకి వెళ్లింది. అక్కడి ఓ జైలు గదిని తిరుగుబాటుదారులు తెరిచారు. అందులో ఒక వ్యక్తి వణుకుతూ కన్పించాడు. తన పేరు అదెల్ గుర్బల్ అని, మూడు నెలలుగా బందీగా దుర్భర పరిస్థితుల్లో నరకం అనుభవిస్తున్నానని చెప్పుకున్నాడు. అతన్ని వార్డ్ బృందం చొరవ తీసుకుని బయటకు తీసుకొచ్చింది. ఈ దృశ్యాలను సీఎన్ఎన్ ప్రముఖంగా ప్రసారం చేసుకుంది. ఇది తన జీవితంలోనే అత్యంత దారుణమైన ఘటన అని వార్డ్ చెప్పుకొచ్చారు. అసద్ క్రూరమైన పాలన తాలూకు బాధితుల్లో అతనొకడని సీఎన్ఎన్ అభిర్ణించింది. అతనికి ఆహారం అందించి అత్యవసర సేవల విభాగంలో చేర్చినట్టు కథనం ప్రసారం చేసింది. దాంతో పలువురు నెటిజన్లు సీఎన్ఎన్ను అభినందించారు. కానీ ఈ వ్యవహారంపై వెరిఫై–సై అనుమానాలు వ్యక్తం చేసింది. 90 రోజులు ఏకాంతంలో, వెలుతురు కూడా లేని గదిలో తీవ్ర నిర్బంధంలో ఉన్న వ్యక్తి అంత ఆరోగ్యంగా ఎలా కన్పిస్తారని ప్రశ్నించింది. అసలతను స్థానికుడేనని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లేవని చెప్పింది. అనంతరం కూపీ లాగి, అతను సలామా అని, అసద్ వైమానిక దళం నిఘా విభాగంలో ఫస్ట్ లెఫ్టినెంట్‌గా చేశాడని వెల్లడించింది. వసూళ్ల తాలూకు అక్రమ సంపాదనను పంచుకునే విషయంలో పై అధికారితో పేచీ రావడంతో నెల రోజులుగా జైల్లో ఉన్నట్టు వివరించింది. అతను సైనిక దుస్తుల్లో ఉన్న ఫొటోలను కూడా బయట పెట్టింది. దాంతో సీఎన్ఎన్ కంగుతిన్నది. ఆ వ్యక్తి తమకు తప్పుడు వివరాలు చెప్పి ఉంటాడని అప్పుడే అనుకున్నామంటూ మాట మార్చింది. అతని నేపథ్యం గురించి తామూ లోతుగా విచారణ చేస్తున్నట్టు చెప్పుకొచ్చింది. సీఎన్ఎన్ వివాదాస్పద రిపోర్టింగ్ శైలితో అభాసుపాలు కావడం ఇది తొలిసారేమీ కాదు. గతేడాది ఇజ్రాయెల్, గాజా సరిహద్దు వద్ద రిపోర్టింగ్‌కు సంబంధించి కూడా క్లారిస్సా వార్డ్ ఆరోపణలు ఎదుర్కొన్నారు. -
ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం!
బీరూట్: ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దుల వెంట కాల్పుల మోత ఆగే సూచనలు కనిపిస్తున్నాయి. హమాస్‌కు అండగా ఇజ్రాయెల్‌తో పోరు జరుపుతున్న హెజ్బొల్లా మిలిటెంట్ గ్రూప్ వెనక్కి తగ్గే వీలుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో హెజ్బొల్లాకు కుదరబోతున్న కాల్పుల విరమణ ఒప్పందమే ఇందుకు కారణమని తెలుస్తోంది. కాల్పుల విరమణకు నెతన్యాహూ సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు వార్తలొచ్చాయి. అయితే ఇంకొన్ని కీలక అంశాలపై సంప్రదింపులు జరుగుతున్నాయని, అవి కొలిక్కి వచ్చాక అంగీకారం కుదురుతుందని తెలుస్తోందని సీఎన్ఎన్ వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. సూత్రప్రాయ అంగీకారం త్వరలో కుదరబోతోందని ఇజ్రాయెల్ అధికార ప్రతినిధి డేవిడ్ మెన్సర్ సోమవారం చెప్పారు. -
USA Presidential Elections 2024: చెరో 47 శాతం!
అట్లాంటా: అమెరికా అధ్యక్ష రేసు అత్యంత హోరాహోరీగా సాగుతోంది. సీఎన్ఎన్ వార్తా సంస్థ తాజాగా నిర్వహించిన జాతీయ స్థాయి పోల్‌లో ప్రధాన అభ్యర్థులు డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ చెరో 47 శాతంతో సమానంగా నిలిచారు. అంతేగాక అక్టోబర్ 20–23 మధ్య న్యూయార్క్‌టైమ్స్/సియెనా కాలేజీ జరిపిన జాతీయ సర్వేలోనూ వారిద్దరికీ చెరో 48 శాతం దక్కడం విశేషం. ఆర్థిక వ్యవహారాలను చక్కదిద్దడంలో ఎవరు మెరుగనే అంశంపై ఫైనాన్షియల్ టైమ్స్, మిషిగన్ వర్సిటీకి చెందిన రాస్ స్కూల్ ఆఫ్ బిజినెస్ సరిపిన సంయుక్త సర్వేలో మాత్రం ట్రంప్‌ది పైచేయి అయింది. ఆయనకు 44 శాతం, హారిస్‌కు 43 శాతం మంది ఓటర్లు మద్దతు పలికారు. మొత్తమ్మీద చూస్తే మాత్రం ట్రంప్ కంటే హారిస్‌కు 1.7 శాతం మొగ్గున్నట్టు 538 పోల్ ట్రాకర్ విశ్లేషణలో తేలింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గేందుకు 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో కనీసం 270 ఓట్లు సాధించాలి. -
Kamala Harris: రెండో డిబేట్‌కు నేను రెడీ
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో రెండో అధ్యక్ష చర్చకు డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ సమ్మతించారు. అక్టోబర్ 23న జరిగే డిబేట్లో పాల్గొనాలని సీఎన్ఎన్ ఛానల్ పంపిన ఆహ్వానాన్ని శనివారం హారిస్ అంగీకరించారు. ట్రంప్‌తో వేదిక పంచుకోవడానికి ఉపాధ్యక్షురాలు సిద్ధంగా ఉన్నారని హారిస్ ప్రచార బృందం సారథి ఒమాలి డిల్లాన్ ఒక ప్రకటనలో తెలిపారు.రెండో డిబేట్‌కు తాను సంతోషంగా సమ్మతిస్తానని హారిస్ శనివారం ట్వీట్ చేశారు. అక్టోబరు 23న ట్రంప్ తనతో చర్చకు వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 10న జరిగిన తొలి డిబేట్లో ట్రంప్‌పై హారిస్ పైచేయి సాధించడం తెలిసిందే. మరో డిబేట్ ఆహ్వానంపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబరు 5న జరగనున్న విషయం తెలిసిందే. -
USA Presidential Elections 2024: స్వింగ్ స్టేట్స్లో కమల దూకుడు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ విజేతగా నిలిచే అవకాశాలు నానాటికీ మెరుగవుతున్నట్టు సీఎన్ఎన్ వార్తా సంస్థ తాజా సర్వేలో తేలింది. ఎన్నికల ఫలితాలను నిర్ణాయక రీతిలో ప్రభావితం చేసే అతి కీలకమైన ఆరు స్వింగ్ స్టేట్స్లో ఆమె హవా సాగుతోందని వెల్లడించింది. ఆ రాష్ట్రాల్లో విస్కాన్సిన్, మిషిగన్ల్లో ఉపాధ్యక్షురాలు స్పష్టంగా ముందంజలో ఉన్నారు. అరిజోనాలో మాత్రం ఆమె ప్రత్యరి్థ, రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ది పైచేయిగా ఉంది. ఇక జార్జియా, నెవెడా, పెన్సిల్వేనియాల్లో ఇద్దరి మధ్యా హోరాహోరీ నెలకొంది. దాంతో ఈ మూడూ ఎవరివైపు మొగ్గితే వారే అధ్యక్ష పీఠమెక్కడం దాదాపుగా ఖాయమంటున్నారు. ఎందుకంటే ఆరు స్వింగ్ స్టేట్స్ మినహా అమెరికాలో మిగతా రాష్ట్రాలన్నీ సాంప్రదాయికంగా రిపబ్లికన్, డెమొక్రటిక్ పారీ్టల్లో ఏదో ఒకవైపు ఉండేవే. జార్జియా, నెవెడా, పెన్సిల్వేనియాల్లో ఏకంగా 15 శాతం ఓటర్లు తామెవరికి ఓటేయాలో ఇంకా నిర్ణయించుకోలేదని చెప్పడం విశేషం. కనుక హారిస్, ట్రంప్ భాగ్యరేఖలను వీరే నిర్దేశించవచ్చని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు. దాంతో రానున్న రోజుల్లో జార్జియా, నెవెడా, పెన్సిల్వేనియాల్లో అభ్యర్థులిద్దరి ప్రచార హోరు మిన్నంటడం ఖాయంగా కని్పస్తోంది.‘స్వింగ్’ మహిళంతా హారిస్ వైపే... కొంతకాలంగా దాదాపుగా అన్ని సర్వేల్లోనూ హారిసే ముందంజలో కొనసాగుతుండటం తెలిసిందే. సీఎన్ఎన్ తాజా సర్వే కూడా అదే ధోరణిని ప్రతిబింబించింది. విస్కాన్సిన్లో 50 శాతం మంది హారిస్‌కు ఓటేస్తామని చెప్పగా ట్రంప్‌కు 44 శాతం మద్దతు దక్కింది. మిషిగన్‌లో 48 శాతం హారిస్‌కు, 43 శాతం ట్రంప్‌కు జైకొట్టారు. జార్జియా, నెవెడాల్లోనూ హారిసే స్వల్ప పై చేయి సాధించారు. ఆ రెండు రాష్ట్రాల్లో ఆమెకు 48 శాతం, ట్రంప్‌కు 47 శాతం ఓటర్లు మద్దతిచ్చారు. అరిజోనాలో మాత్రం ట్రంప్ 49 శాతం మద్దతు దక్కగా హారిస్ 44 శాతానికి పరిమితమయ్యారు. పెన్సిల్వేనియాలో ఇద్దరికీ చెరో 47 శాతం ఓట్లు దక్కాయి. ఆరు స్వింగ్ స్టేట్స్‌లోనూ ట్రంప్‌తో పోలిస్తే మహిళల్లో హారిస్ 27 శాతం అధిక ఓట్లు సాధించారు! ట్రంప్ విధానాలు అమెరికా భద్రతకే ముప్పు కలిగించేంత ప్రమాదకరమైనవని ఆరు రాష్ట్రాల ఓటర్లూ అభిప్రాయపడ్డారు.ఎకానమీ, వలసల్లో ట్రంప్ పైచేయి ఆర్థికాంశాలను డీల్ చేసే సామర్థ్యం విషయంలో ఎప్పట్లాగే తాజా సర్వేలోనూ ట్రంపే పైచేయి సాధించారు. ఈ విషయంలో ఆయనకు 8 శాతం ఎక్కువ ఓట్లొచ్చాయి. అక్రమ వలసలను అడ్డుకోవడంలో ట్రంప్‌కు, అబార్షన్ తదితరాలపై హారిస్‌కు ఓట్లరు జైకొట్టారు. దేశం ముందున్న అతి ముఖ్యమైన అంశం ఏదన్న ప్రశ్నకు 39 శాతం మంది ఎకానమీకే ఓటేశారు. -
Presidential Debate: ట్రంప్ జోరు బైడెన్ బేజారు
అట్లాంటా: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (78) దూకుడు పెంచారు. దేశాధ్యక్షుడు, డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌తో తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్లో స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు. శుక్రవారం (భారత కాలమానం ప్రకారం) సీఎన్ఎన్ చానల్లో దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన వాదనలో బైడెన్ సర్వశక్తులూ ఒడ్డారు. తన వయసుపై విమర్శలు, అధ్యక్ష బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంపై అమెరికన్లలో నానాటికీ పెరుగుతున్న అనుమానాలను కొట్టిపారేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. ట్రంప్ తనకంటే కేవలం మూడేళ్లే చిన్నవాడని పదేపదే చెప్పుకున్నారు. కానీ డిబేట్ పొడవునా బైడెన్ పదేపదే తడబడ్డారు. ప్రసంగం మధ్యలో ఉన్నట్టుండి మౌనాన్ని ఆశ్రయించారు. మాటల కోసం తడుముకున్నారు. తనలో తానే గొణుక్కుంటూ కన్పించారు. మాట్లాడుతున్న అంశాన్ని అర్ధంతరంగా వదిలేసి మరో విషయం ఎత్తుకుని ఆశ్చర్యపరిచారు. కొన్నిసార్లు బైడెన్ ఏం చెప్తున్నదీ ఎవరికీ అర్థం కూడా కాలేదు. పలు అంశాలపై ట్రంప్ పచ్చి అబద్ధాలు చెప్పినా వాటిని ఎత్తిచూపడంలో, సొమ్ము చేసుకోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. తనకు అనుకూలమైన గణాంకాలను సమయానుకూలంగా ప్రస్తావించడంలో కూడా చతికిలపడ్డారు. డిబేట్లో ట్రంపే నెగ్గారని సీఎన్ఎన్ పోలింగ్‌లో ఏకంగా 67 శాతం మంది ఓటర్లు పేర్కొన్నారు. బైడెన్‌కు 33 శాతం ఓట్లే లభించాయి. న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రఖ్యాత వార్తా పత్రికలు కూడా తొలి డిబేట్ ట్రంప్‌దేనని పేర్కొన్నాయి. ‘‘బైడెన్‌పై వయోభారం కొట్టొచ్చినట్టు కని్పస్తోంది. ఆయన మాటతీరులోనూ అది స్పష్టంగా ప్రతిఫలించింది. ఆయన చెబుతున్న విషయాల్లో పొందికే లేకుండా పోయింది’’ అంటూ విమర్శలు గుప్పించాయి. దూకుడుకు మారుపేరైన ట్రంప్‌కు 81 ఏళ్ల బైడెన్ ఏ మేరకు పోటీ ఇవ్వగలరోనంటూ డెమొక్రాట్లలో ఇప్పటికే గట్టిగా ఉన్న అనుమానాలు కాస్తా తాజా డిబేట్ నేపథ్యంలో ఆందోళనగా మారాయి. వాదనలో బైడెన్ తొలుత కాస్త వెనకబడ్డారని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా అంగీకరించారు. అయితే క్రమంగా పుంజుకుని సమర్థంగా ముగించారని చెప్పుకొచ్చారు. బైడెన్ భార్య జిల్ మాత్రం తన భర్త భలే బాగా మాట్లాడారంటూ ప్రశంసించారు! ‘‘ప్రతి ప్రశ్నకూ చక్కగా బదులిచ్చావు. అన్ని సమాధానాలూ తెలుసు నీకు!’’ అంటూ ఆయన్ను మెచ్చుకున్నారు. కానీ ఈ డిబేట్ నేపథ్యంలో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలంటున్న వారి సంఖ్య డెమొక్రాట్లలో క్రమంగా పెరుగుతోంది. ట్రంప్, బైడెన్‌లను అధ్యక్ష అభ్యర్థులుగా ఇంకా లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. జూలై 15–18 మధ్య జరిగే సదస్సులో రిపబ్లికన్లు, ఆగస్టు 19న సదస్సులో డెమొక్రాట్లు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. పరస్పర విమర్శల వర్షం... అమెరికా ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ చట్టం, విదేశీ వ్యవహారాలు, వలసల వంటి పలు అంశాలపై ట్రంప్, బైడెన్ మధ్య వాడివేడి వాదనలు సాగాయి. ఆ క్రమంలో నేతలిద్దరూ తిట్ల పర్వానికి దిగారు. ‘‘నువ్వే అబద్ధాలకోరు. అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త ప్రెసిడెంట్ కూడా నువ్వే’’ అంటూ పరస్పరం దుయ్యబట్టుకున్నారు. పలు రకాల విమర్శలు చేసుకున్నారు. హష్ మనీ కేసు దోషి అంటూ ట్రంప్‌కు బైడెన్ చురకలు వేశారు. ‘‘జరిమానాలుగా నువ్వు ఎన్ని బిలియన్ డాలర్లు కట్టాలో గుర్తుందా? భార్య గర్భవతిగా ఉండగా నీలి చిత్రాల తారతో గడిపావు. నైతికత విషయంలో వీధుల్లో విచ్చలవిడిగా తిరిగే పిల్లి కంటే కూడా హీనం’’ అంటూ విమర్శల వర్షం కురిపించారు. బైడెన్‌తో పాటు ఆయన కుమారుడు హంటర్ కూడా క్రిమినలేనంటూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా విరుచుకుపడ్డారు. అస్తవ్యస్తమైన వలసల విధానంతో దేశ భవితవ్యాన్నే బైడెన్ ప్రమాదంలోకి నెట్టారంటూ దుయ్యబట్టారు. డిబేట్ ఆరంభం నుంచే ట్రంప్ పై చేయి కనబరిచారు. ఆయనను ఇరుకున పెట్టేందుకు బైడెన్ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. -
USA Presidential Elections 2024: బైడెన్, ట్రంప్ రె‘ఢీ’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇరు పారీ్టల అభ్యర్థులు వాదనలతో ఎదురెదురుగా బలాబలాలు తేల్చుకునే ‘చర్చల’ అంకానికి డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెరలేపారు. సీఎన్ఎన్ టీవీ ఛానల్లో జూన్ 27వ తేదీన, ఏబీసీ ఛానల్లో సెప్టెంబర్ పదో తేదీన ఈ డిబేట్లు ఉంటాయి. మూడు దశాబ్దాలుగా డిబేట్లు నిర్వహించే ‘కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్’ను కాదని ఈసారి మీడియాసంస్థల ఆధ్వర్యంలో టీవీ ఛానళ్లలో డిబేట్‌కు బైడెన్ ప్రచార బృందం ఓకే చెప్పింది. ‘‘అట్లాంటా స్టూడియోలో ఈ డిబేట్‌ను నిర్వహిస్తాం’ అని సీఎన్ఎన్ తెలిపింది. జనం మధ్యలో డిబేట్ జరిపితే బాగుంటుందని ట్రంప్ అన్నారు. -
సురోవికిన్ కూడా వాగ్నర్ సభ్యుడే
న్యూయార్క్: రష్యాలో వాగ్నర్ గ్రూప్ తిరుగుబాటు ఘటన అక్కడి మిలటరీలో లుకలుకలను ఒకటొకటిగా బయట పెడుతోంది. తాజాగా, రష్యా టాప్ మిలటరీ కమాండర్ జనరల్ సెర్గెయ్ సురోవికిన్ వాగ్నర్ గ్రూప్‌లో రహస్య వీఐపీ సభ్యుడని తెలిపే కొన్ని పత్రాలు దొరికినట్లు సీఎన్ఎన్ పేర్కొంది. వాగ్నర్ వీఐపీ సభ్యుడిగా సురోవికిన్ పేరు 2018లో నమోదైనట్లు అందులో తెలిపింది. ఆయనతోపాటు మరో 30 మంది రష్యా సీనియర్ మిలటరీ, ఇంటెలిజెన్స్ అధికారులు కూడా వాగ్నర్ వీఐపీ సభ్యులని పేర్కొంది. వాగ్నర్ సభ్యుడిగా సురోవికిన్ ఉన్నారనేందుకు కచ్చితమైన ఆధారాలేవీ లేనప్పటికీ, రష్యా సైనిక బలగాల్లోని చాలా మంది సీనియర్ అధికారులు వాగ్నర్ గ్రూప్‌తో దగ్గరి సంబంధాలు సాగించేందుకు అవకాశం ఉందని సీఎన్ఎన్ కథనం పేర్కొంది. ఇలాంటి దగ్గరి సంబంధాల వల్లే వాగ్నర్ కిరాయి సైనికులు రొస్తోవ్‌లోని కీలక మిలటరీ బేస్‌నుæ శ్రమ లేకుండా స్వాధీనం చేసుకోగలిగారన్న అనుమానా లున్నాయి. తిరుగుబాటు అనంతరం సురోవికిన్ కనిపించకుండా పోయారు. ప్రిగోజిన్ తిరుగుబాటు విషయం ఆయనకు తెలుసునంటూ న్యూయార్క్‌టైమ్స్ కథనం పేర్కొంది. ప్రిగోజిన్‌ను తిరుగుబాటు ఆపేయాలంటూ విడుదల చేసిన వీడియోలో సురోవికిన్ తడబడుతూ మాట్లాడుతున్నట్లు కనిపించారు. దీంతో, ఆయన మానసిక ఆరోగ్యంపైనా అనుమానాలున్నాయి. జనర ల్ ఆర్మగెడ్డాన్గా పిలుచుకునే సురోవికిన్ అధ్యక్షుడు పుతిన్‌కు నిన్నటిదాకా నమ్మినబంటు. తాజా పరిణామాలతోనూ ఆయన్ను పుతిన్ నమ్ముతారా అన్నది తేలాల్సి ఉంది. -
బైడెన్ మళ్లీ పోటీ చేస్తారు: జిల్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి ఆ పదవికి పోటీపడనున్నారు. ఆయన భార్య జిల్ బైడెన్ సీఎన్ఎన్ వార్తా సంస్థకు ఈ మేరకు తెలిపారు. 80 ఏళ్ల బైడెన్ ఇప్పటికే అమెరికా అధ్యక్షుల్లో అత్యంత వయోధికునిగా రికార్డు సృష్టించారు. రెండేళ్లలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి బరిలో దిగే ఆలోచన ఉందని ఆయన కూడా ఇప్పటికే పలుమార్లు చెప్పారు. సీఎన్ఎన్తో మాట్లాడుతూ జిల్ ఇదే విషయాన్ని గుర్తు చేశారు. ఆయన నిర్ణయానికి తాను పూర్తిగా మద్దతిస్తున్నట్టు తెలిపారు. రెండోసారి పోటీపై బైడెన్ బహుశా మరో రెండు మూడు నెలల్లో అధికారిక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. అయితే డెమొక్రటిక్ పార్టీ సహచరుల్లో ప్రధానంగా ఆయన వయసుపైనే అభ్యంతరాలు నెలకొన్నాయి. దీనిపై రాయిటర్స్–ఇప్సోస్ తాజాగా నిర్వహించిన పోల్‌లో బైడెన్ పోటీ చేయొద్దని డెమొక్రాట్లలో ఏకంగా 52 శాతం మంది అభిప్రాయపడ్డారు! మరోవైపు రిపబ్లికన్ పార్టీ తరఫున రెండోసారి అధ్యక్ష బరిలో దిగాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌కు కూడా ప్రస్తుతం 76 ఏళ్లు! పైగా పార్టీ అభ్యర్థిత్వం కోసం నిక్కీ హేలీ తదితరులు ఇప్పటికే ఆయనకు పోటీదారులుగా ఉన్నారు. -
మస్క్... నువ్వు మాకొద్దు!
వాషింగ్టన్: సామాజిక దిగ్గజ సంస్థ ట్విట్టర్‌కు సారథ్య బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమయ్యాడంటూ సర్వత్రా విమర్శలు ఎదుర్కొంటున్న ఆ సంస్థ సీఈవో, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు మరో ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మస్క్ అధికారిక ట్విట్టర్ ఖాతాకు ప్రపంచవ్యాప్తంగా 12.2 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. వీరిని ఉద్దేశిస్తూ మస్క్ ఆదివారం ఒక ట్వీట్‌చేశారు. ‘ ట్విట్టర్‌కు సీఈవోగా నేను తప్పుకోవాలా ?. ఈ పోలింగ్‌లో వచ్చే ఫలితాలకు అనుగుణంగా నడుచుకుంటా. మీ నిర్ణయాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. మీరేం ఆశిస్తారో అదే మీకు దక్కుతుంది’ అని మస్క్ ఆదివారం ఒక ట్వీట్‌చేశారు. దీనిపై ట్విటర్ యూజర్లు వెంటనే భారీగా స్పందించారు. పోలైన ఓట్లలో 57.5 శాతం ఓట్లు మస్క్‌కు వ్యతిరేకంగా పడ్డాయి. మాకు మీరు అక్కర్లేదంటూ ‘యస్’ చెబుతూ ఓట్లు వేశారు. ఆదివారం సాయంత్రం మొదలైన ఈ ఓటింగ్ సోమవారం తెల్లవారుజామున ముగిసింది. మస్క్ పిలుపునకు స్పందనగా 1.7 కోట్లకుపైగా ఓట్లు పోల్ అయ్యాయని సీఎన్ఎన్ పేర్కొంది. ఓటింగ్ ఫలితంపై మస్క్ ఇంకా స్పందించలేదు. దాదాపు 44 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ట్విటర్‌ను హస్తగతం చేసుకున్నాక మస్క్ తీసుకున్న కఠిన నిర్ణయాలపై విమర్శలు కొనసాగుతుండటం తెల్సిందే. భారీగా సిబ్బంది కోతలకు సిద్దమవడం, ఎక్కువ గంటలు చెమటోడ్చి పనిచేయాలని ఒత్తిడి తేవడం వంటి నిర్ణయాలతో మస్క్ పేరు చెబితేనే ట్విటర్ సిబ్బంది హడలెత్తిపోతున్నారు. ట్విటర్ విధానపర నిర్ణయాల్లో మార్పులపైనా ఆన్లైన్ ఓటింగ్ చేపడతానని మస్క్ ప్రకటించారు. ఫేస్బుక్, ఇన్‌స్టా గ్రామ్, మాస్టోడోన్, ట్రూత్ సోషల్, ట్రైబల్, నోస్టర్, పోస్ట్ వంటి ఇతర సోషల్‌మీడియా సంస్థల ఖాతాలకు వాడుతున్న అవే యూజర్ఐడీలతో కొనసాగుతున్న/అనుసంధానమైన ట్విట్టర్ ఖాతాలను తొలగిస్తామని ట్విటర్ తెలిపింది. ‘ఇన్‌స్ట్రాగామ్‌లో నన్ను ఫాలో అవ్వండి’, ‘ఫేస్బుక్లో నా ప్రొఫైల్ చెక్ చేయండి’ వంటి వాటికీ ట్విట్టర్ చెక్ పెట్టనుంది. -
తెలుగు కుర్రాడి సత్తా.. ప్రతిష్టాత్మక సీఎన్ఎన్ హీరోస్ అవార్డు..
వాషింగ్టన్: తెలుగు కుర్రాడు అమెరికాలో సత్తా చాటాడు. వాడి పడేసిన బ్యాటరీలు రీసైకిల్ చేస్తున్నందుకు సీఎన్ఎన్ హీరోస్ యంగ్ వండర్ అవార్డు కైసవం చేసుకున్నాడు. 13 ఏళ్ల వయసులోనే అరుదైన ఘనత సాధించాడు. ఈ కుర్రాడి పేరు శ్రీ నిహాల్ తమ్మన. తెలుగు మూలాలున్న ఇతని కుటుంబం అమెరికా న్యూజెర్సీలోని ఎడిసన్‌లో నివసిస్తోంది. వాడి పడేసిన బ్యాటరీలు పర్యావరణానికి హానికరం. అందులోని కెమికల్స్ మట్టిని, నీటిని కలుషితం చేస్తాయి. ఏటా ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల బ్యాటరీలను పడేస్తున్నారు. వీటి వల్ల పర్యావరణానికి ఎంత ప్రమాదకరమో 10 ఏళ్ల పసిప్రాయంలోనే గుర్తించాడు నిహాల్. 2019లోనే 'రీసైకిల్ మై బ్యాటరీ క్యాంపెయిన్' ప్రారంభించాడు. బ్యాటరీ రీసైకిల్‌పై అమెరికాలోని స్కూళ్లు తిరిగి విద్యార్థులకు అవగాహన కల్పించాడు నిహాల్. తనతో కలిసి స్వచ్ఛందంగా పనిచేసేందుకు 300 సభ్యుల టీంను ఏర్పాటు చేసుకున్నాడు. వాడిపడేసే బ్యాటరీల కోసం స్కూళ్లు, ఇతర ప్రదేశాల్లో ప్రత్యేక బిన్లు ఏర్పాటు చేశాడు. ఇలా మూడేళ్లలో మొత్తం 2,25,000 బ్యాటరీలను సేకరించి వాటిని రీసైకిల్ చేశాడు. నిహాల్ ప్రతిభను గుర్తించిన సీఎన్ఎన్ అతడ్ని యంగ్ వండర్ అవార్డుతో గౌరవించింది. భవిష్యత్తుల్లో ప్రపంచమంతా రీసైక్లింగ్ బ్యాటరీ సేవలను విస్తరించి పర్యావరణాన్ని కాపాడటమే తన లక్ష్యమని నిహాల్ చెబుతున్నాడు. చదవండి: కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత చైనాలో తొలిసారి మరణాలు! -
షాకింగ్: ఇక ఆ రంగంలో ఉద్యోగాలకు ముప్పు, నేడో, రేపో నోటీసులు!
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థికమాంద్యం ప్రమాదం ఉద్యోగులు మెడకు చుట్టుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇప్పటికే టెక్, ఐటీ దిగ్గజాలు ఉద్యోగులు ఉపాధిపై దెబ్బకొట్టాయి.ఆదాయాలు తగ్గిపోవడం, ఖర్చులను తగ్గించుకునే క్రమంలో ఉద్యోగుల కోత ఆందోళన కొన సాగు తుండగానే తాజాగా ఈ భారీ తొలగింపుల సీజన్ సెగ మీడియా బిజినెస్‌ను తాకింది.(జొమాటోకు అలీబాబా ఝలక్, భారీగా షేర్ల అమ్మకం) వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ యాజమాన్యంలోని సీఎన్ఎన్ ఉద్యోగులపై వేటు వేయనుంది. ఈ మేరకు నెట్వర్క్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ క్రిస్ లిచ్ట్ బుధవారం మొత్తం టీమ్‌కు అంతర్గత సందేశంలో ఉద్యోగులను హెచ్చరించారు. ప్రధానంగా పెయిడ్ కాంట్రిబ్యూటర్స్పై ప్రభావం పడే అవకాశం ఉందని ఆయన ట్వీట్ చేశారు. పొంచి ఉన్న మాంద్యం, పెరుగుతున్న స్ట్రీమింగ్ ఖర్చులను తగ్గించుకునేలా డిస్నీ ఉద్యోగుల తొలగింపులు, నియామక స్తంభన, ఇతర వ్యయాలను తగ్గించే కార్యక్రమాలను కూడా ప్రకటించింది. (వారికి భారీ ఊరట: రెండేళ్లలో కోటి ఉద్యోగాలు) ఆర్థికరంగ మందగమనం ప్రభావాన్ని ఎదుర్కొనే క్రమంలో వ్యయాలను నియంత్రించు కునేందుకు ప్రధానంగా ఉద్యోగాల్లోనే కోత విధిస్తున్నాయి. యాక్సియోస్ కథనం ప్రకారం, యాడ్ మార్కెట్ మందగింపుతో మీడియా వ్యాపారం కూడా దెబ్బతింటోంది. ఫలితంగా ఉద్యోగుల తొలగింపులు, నియామకాలు నిలిపివేత లాంటి ఇతర ఖర్చు తగ్గించే చర్యలను మీడియా సంస్థలు ప్రకటించాయి. సీబీఎస్, ఎంటీవీ, వీహెచ్1 లాంటి అనేక ఇతర నెట్‌వర్క్‌లను నిర్వహిస్తున్న మరో మీడియా పవర్‌హౌస్, పారామౌంట్ గ్లోబల్ ఇటీవల ఉద్యోగులను తొలగించడం ప్రారంభించింది. (శాంసంగ్ గుడ్ న్యూస్: భారీ ఉద్యోగాలు) CNN boss Chris Licht informs employees in an all-staff note that layoffs are underway. Licht says those being notified today are largely paid contributors and then tomorrow CNN "will notify impacted employees." Licht will then provide an update to staff afterward. pic.twitter.com/nD0pt9Ruwj — Oliver Darcy (@oliverdarcy) November 30, 2022 -
Amazon:ఆ సైట్లో కొన్న ఎలక్ట్రానిక్ వస్తువులు మండిపోతున్నాయట
న్యూయార్క్ : ప్రముఖ ఆన్లైన్ దిగ్గజం అమెజాన్ డాట్ కామ్‌లో కొనుగోలు చేసిన ఎలక్ట్రానిక్ వస్తువులు కాగడాల్లా మారుతున్నాయి. ఉన్నట్టుండి పొగలు కక్కుతూ కాలి బూడిదవుతున్నాయి. గత రెండేళ్లుగా కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు అమెరికన్లు చెబుతున్నారు. అమెజాన్ బ్రాండ్ వస్తువులు అకస్మాత్తుగా కాలిపోతుండటంపై అమెరికాలోని కన్సుమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిటీ (CPSC) చేపట్టిన విచారణ కొనసాగుతోంది. ఈ మేరకు CPSC ఇచ్చిన నివేదికల ఆధారంగా సీఎన్ఎన్ పలు కథనాలు ప్రచురించింది. కాలిపోతున్నవి ఇవే వరల్డ్‌లోనే నంబర్ వన్ ఈ కామర్స్ సైట్ అమెజాన్‌లో ఎలక్ట్రిక్, ఎలక్ట్రానిక్ కేటగిరిలలో కొనుగోలు చేసిన సర్జ్ ప్రొటెక్టర్, ఫోన్ ఛార్జింగ్ కార్డ్స్, పాటియో హీటర్, బ్యాటరీ ఛార్జర్, వాయిస్ యాక్టివేటెడ్ మైక్రో ఓవెన్లుపై CPSCకి ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. ఆయా వస్తువులను వాడుతున్నప్పుడు ఉన్నట్టుండి మధ్యలోనే కాలిపోతున్నట్టు వినయోగదారులు పేర్కొన్నారు. ఈ వస్తువలన్నీ అమెజాన్ బ్రాండ్‌కి సంబంధించినే కావడం గమనార్హం. బాధితులు అమెజాన్ సైట్ నుంచి 2018లో సర్జ్ ప్రొటెక్టర్‌ను ఓ వ్యక్తి కొనుగోలు చేయగా..అది ఇంట్లో కాలిపోయింది. ఫలితంగా ఇంటికి డ్యామేజ్ జగిరింది. దీనిపై CPSCని ఆశ్రయించగా 1500 డాలర్ల నష్టపరిహారం ఆ బాధితుడు సీఎన్ఎన్ పేర్కొంది. ఆ తర్వాత మరో 40 మంది ఇదే ప్రొడక్టు కొని నష్టపోయినట్టు రివ్యూ ఇచ్చారు. దీంతో 2019లో తన సైట్ నుంచి ఆ ప్రొడక్టును అమెజాన్ తొలగించినట్టు సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది. స్పందించని అమెజాన్ CPSC విచారణపై స్పందించేందుకు అమెజాన్ నిరాకరించింది. తమ కస్టమర్ల భద్రత తమకు ఎంతో ముఖ్యమని, నాణ్యత విషయంలో రాజీపడేది లేదంటూ అమెజాన్ డాట్‌కామ్ చెబుతోంది. సీఎన్ఎన్ రిపోర్టులో పేర్కొన్నట్టు ఏ వస్తువును సేఫ్టీ రీజన్స్‌తో తమ సైట్ నుంచి తొలగించలేదంది. -
Jeffrey Toobin: నా చేష్టల్ని సమర్థించుకోలేను!
న్యూయార్క్: అమెరికా న్యూస్ పర్సనాలిటీ జెఫెర్రె టూబిన్ ఎనిమిది నెలల గ్యాప్ తర్వాత హఠాత్తుగా టీవీ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పటి నుంచి ప్రముఖ న్యూస్ ఛానెల్ సీఎన్ఎన్లో లీగల్ అనలిస్ట్‌గా ఆయన పని చేయనున్నారు. పోయినేడాది అక్టోబర్‌లో జూమ్ కాల్లో ఆయన అసభ్య చేష్టలకు పాల్పడడంతో ప్రపంచం నివ్వెరపోయింది. ఈ చర్యతో ది న్యూయార్కర్ ఆయన్ని అనధికారికంగా విధుల నుంచి తప్పించింది. కాగా, తన చేష్టలకు ఆయన అందరికీ క్షమాపణలు చెబుతూ కొత్త విధుల్ని ప్రారంభించడం విశేషం. ‘‘ఆరోజు నేను చాలా మూర్ఖంగా నేను ప్రవర్తించా. ఇతరులు చూస్తారనే ధ్యాస నాకు లేదు. నా కుటుంబానికి, సహచర జర్నలిస్టులకు, అందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నా. నా చేష్టలను ఎట్టిపరిస్థితుల్లో సమర్థించుకోలేను. ఆ ఘటన తర్వాత మామూలు మనిషిగా మారేందుకు టైం పట్టింది. మానసిక ప్రశాంతత కోసం థెరపీ తీసుకున్నా. ఒక ఫుడ్ బ్యాంక్‌లో పని చేశా. ఓక్లాహోమా సిటీ పేలుళ్ల గురించి ఒక బుక్ రాయడంలో లీనమయ్యా’’ అని 61 ఏళ్ల టూబిన్ చెప్పుకొచ్చాడు. కాగా, అక్టోబర్ 19, 2020న న్యూయార్కర్, డబ్ల్యూఎన్వైసీ రేడియో స్టాఫర్స్ మధ్య జూమ్ మీటింగ్ జరుగుతుండగా.. టూబిన్ తన వ్యక్తిగత వీడియో కాల్లో ఎవరితోనో మాట్లాడుతూ, హస్తప్రయోగం చేసుకున్నాడనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై దిగ్భ్రాంతి చెందిన న్యూయార్కర్.. ఆయన్ని విధుల నుంచి దూరంగా ఉంచింది. కాగా, దాదాపు మూడు దశాబ్దాలుగా న్యూయార్కర్‌తో అనుబంధం ఉన్న టూబిన్.. జూమ్ చేష్టల ద్వారా జర్నలిజానికి మాయని మచ్చ వేశాడంటూ జిమ్మీ ఫాలోన్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్ లాంటి ప్రముఖులు.. శాటర్ డే నైట్ లైవ్ ప్రోగ్రాం దుమ్మెత్తిపోశారు. లా స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచే మానవీయ కోణంలో ఎన్నో పుస్తకాలు రాసి ప్రపంచవ్యాప్తంగా గొప్ప రచయితగా పేరు దక్కించుకున్నాడు టూబిన్. -
లైవ్‌లో రిపోర్టింగ్.. అనుకోని అతిథి రావడంతో షాక్
వాషింగ్టన్: న్యూస్ రిపోర్టర్‌గా లైవ్ స్ట్రీమింగ్ చేయడం అంత ఈజీ కాదు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో అనేది పట్టించుకోకుండా కెమెరా వైపు చూస్తూ రిపోర్టింగ్ చేయాలి. ఒక్కోసారి అనుకోని పరిణామాలు జరిగి రిపోర్టర్స్ తమ ఏకాగ్రతను కోల్పోయిన సందర్భాలు ఉన్నాయి. ఇది చాలదన్నట్లు సీరియస్ అంశాలపై మాట్లాడుతున్న సమయంలో ఇంట్లోని పెంపుడు జంతువులో లేక ఇతర జంతువులేవైనా లైవ్ స్ట్రీమింగ్‌లో కనిపిస్తే రిపోర్టర్ ఇబ్బందిగా ఫీలైనా.. దానిని చూసే వారికి మాత్రం నవ్వు తెప్పించడం ఖాయం. తాజాగా సీఎన్ఎన్ రిపోర్టర్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. మనూ రాజు అనే వ్యక్తి సీఎన్ఎన్ చానెల్లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. రాజు వాషింగ్టన్ డీసీలో తన లైవ్ బైట్‌కు సిద్ధమయ్యాడు. దర్జాగా సూట్ వేసుకొని వార్తలు చదివేయడానికి ప్రిపేర్ అయ్యాడు. కెమెరాను చూస్తూ వార్తలు చదవడం మొదలుపెట్టాడు. ఇంతలో అతని సూట్‌పై ఒక పరుగు పాకుతుండడం కెమెరాకు చిక్కింది. రాజు దానిని గ్రహించకుండా తన పని తాను చేసుకుంటున్నాడు. అయితే ఆ పురుగు అతని మెడ వద్దకు రావడంతో లైవ్‌లో ఉన్నానన్న విషయం మరిచిన రాజు పురుగును అవతలికి విసిరేశాడు. ఆ తర్వాత పక్కనున్న వారిని '' అలాంటి పురుగులు నా జట్టులో ఉన్నాయా '' అంటూ అడిగాడు. ఇదంతా కెమెరాలో రికార్డ్ అవుతూనే ఉండడంతో అక్కడున్న వారిని నవ్వులు పూయించింది. ఈ వీడియోను స్వయంగా రాజు తన ట్విటర్లో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. వీడియో చూసిన నెటిజన్లు ట్రోల్స్, మీమ్స్‌తో రెచ్చిపోయారు. చదవండి: ఫ్లైట్‌లో దంపతుల ముద్దులు.. బ్లాంకెట్ ఇచ్చిన ఎయిర్ హోస్టస్ Had an unwelcome visitor try to crawl into my live shot earlier. pic.twitter.com/Pu68z0cWSN — Manu Raju (@mkraju) May 27, 2021 -
లైవ్‌లోనే వెక్కి వెక్కి ఏడ్చిన యాంకర్
వాషింగ్టన్: నాలుగు రోజులపాటు ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో జో బైడెన్ విజయం సాధించడం పట్ల నల్ల జాతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ పాలనలో అమానుష దాడులు, వర్ణ వివక్షను ఎదుర్కొన్నామని, తమకు మంచి రోజులు వచ్చాయని సంతోషం ప్రకటిస్తున్నారు. సీఎన్ఎన్ వార్తా సంస్థ సహ వ్యవస్థాపకుడు, వ్యాఖ్యాత వాన్ జోన్స్ ఏకంగా లైవ్‌లోనే కన్నీటి పర్యంతమయ్యాయ్యారు. జో బైడెన్ గెలిచాడనే వార్తలు చదువుతున్న క్రమంలో ఈ ఘటన చోసుకుంది. వాన్ జోన్స్ గద్గద స్వరంతో.. ‘ఒక తండ్రిగా, పిల్లల ఆలనాపాలనా చూసే రక్షకుడిగా ఈ ఉదయం నుంచి నిశ్చింతగా బతకొచ్చు. పిల్లలకు మంచి నడవడిక నేర్పొచ్చు’ అని పేర్కొన్నారు. అనంతరం తన ఎమోషనల్ వీడియో క్లిప్‌ను ట్విటర్లో షేర్ చేస్తూ.. ‘జో బైడెన్ అధ్యక్షుడు కావడం అత్యంత గొప్ప విషయం. జార్జ్ ఫ్లాయిడ్ లాంటి ఎంతో మంది నల్ల జాతీయులు ఊపిరాడక ప్రాణాలొదిలారు. అలాంటి వారందరికీ క్షమాపణలు. అమెరికా ప్రజలందిరికీ ఇదొక సుదినం. ఇప్పుడు మాకు కాస్త ప్రశాంతత దొరికింది’అని చెప్పుకొచ్చారు. కాగా, అమెరికా 46 వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. అమెరికా ప్రజలందరినీ తిరిగి ఒక్కటి చేస్తానని హామినిచ్చారు. దేశం గాయాలను మాన్పేందుకు అవకాశం దొరికిందని అన్నారు. ఇక 77 ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించనున్న బైడెన్ ఆ ఘనత సాధించిన పెద్ద వయస్కుడిగా రికార్డు సాధించారు. ఆయన రన్నింగ్ మేట్, కాలిఫోర్నియా సెనేటర్ కమాలా హ్యారీస్ ఉపాధ్యక్ష పదవి రేసులో విజయం సాధించి.. ఈ ఘతన సాధించిన తొలి నల్ల జాతీయురాలుగా చరిత్ర సృష్టించారు. (చదవండి: బైడెన్‌కే పట్టాభిషేకం) Today is a good day. It’s easier to be a parent this morning. Character MATTERS. Being a good person MATTERS. This is a big deal. It’s easy to do it the cheap way and get away with stuff — but it comes back around. Today is a good day.#PresidentBiden#VotersDecided pic.twitter.com/h8YgZK4nmk — Van Jones (@VanJones68) November 7, 2020 -
ఓటేసిన 6 కోట్ల అమెరికన్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ దఫా ఓటర్లు చురుగ్గా పాల్గొంటున్నారు. ఇప్పటివరకు దాదాపు 5.87 కోట్ల మంది ఎర్లీ బ్యాలెట్ ద్వారా ఓటు వేసినట్లు గణాంకాలు వెల్లడించాయి. 2016 ఎన్నికలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఎర్లీ బ్యాలెట్లు ఎక్కువగా ఉంటే కౌంటింగ్ ఆలస్యమయి, రిజల్టు లేటవుతుంటుంది. ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఎర్లీ బాలెట్లు కూడా పెరిగాయని సీఎన్ఎన్ నివేదిక తెలిపింది. కరోనా సంక్షోభంతో ఎక్కువమంది ఓటింగ్ కేంద్రాలకు వెళ్లకుండా ఉండేందుకు మొగ్గు చూపుతున్నారని తెలిపింది. అమెరికాలో సుమారు 24 కోట్లమంది ఓటర్లు ఈ దఫా ఓటు హక్కు ఉపయోగించుకుంటారని యూఎస్ఏ టుడే తెలిపింది. ఇప్పటివరకు ఎర్లీ ఓటు ఉపయోగించుకున్నవారిలో డెమొక్రాట్ మద్దతుదారులు అధికమని(70 శాతం) నివేదిక తెలిపింది. ఫలితాలు ఆలస్యం ఎర్లీ బ్యాలెట్టు లెక్కించేందుకు సమయం పడుతుందని, అందువల్ల ఎన్నికలైన 3వతేదీ అనంతరం వెంటనే ఫలితాలు వచ్చే అవకాశాలు లేవని సీఎన్ఎన్ మరో నివేదికలో తెలిపింది. 2016లో సైతం ఈ ఆలస్యం జరిగిందని, ఈ దఫా జాప్యం మరింత ఎక్కువని పేర్కొంది. ప్రధాన ఎన్నికలు పూర్తయిన తర్వాతనే ఎర్లీ బ్యాలెట్లను లెక్కించే పని మొదలెడతారు. ఇవన్నీ పూర్తి కావడానికి మరో ఒకటి రెండు రోజులు పట్టవచ్చని నివేదిక తెలిపింది. ప్రస్తుతం ఓటయిన 5.87 కోట్ల ఓట్లలో 54 శాతం ఓట్లు కీలకమైన 16 రాష్ట్రాల నుంచి వచ్చాయని వివరించింది. వీటిలో మిన్నిసోటాలో ఎర్లీ ఓట్లు ఈదఫా ఎక్కువగా నమోదయ్యాయని తెలిపింది. అలాగే ఎన్నికల్లో ముందుగా ఓటు ఉపయోగించుకున్న వారిలో యువ ఓటర్ల సంఖ్య బాగా పెరిగిందని పేర్కొంది. గత ఎన్నికల్లో ట్రంప్‌ను ఆదుకున్న కీలక రాష్ట్రాల్లో ఈదఫా మార్పు ఉంటుందని అంచనా వేసింది. టెక్సాస్‌లో ఈదఫా భారీగా ఎర్లీ ఓట్లు పోలయ్యాయి. శతాబ్దిలో లేనంతగా 70 లక్షల మంది అమెరికన్లు ఇప్పటికే ఓటుహక్కును ఉపయోగించుకున్నారు. ఇది ఆ రాష్ట్రంలోని మొత్తం ఓటర్లలో 43 శాతానికి సమానం. -
యుద్ధానికి సిద్ధంకండి!
వాషింగ్టన్: భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సైన్యాన్ని యుద్ధానికి అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మీకున్న శక్తియుక్తులన్నింటినీ యుద్ధంపైనే నిమగ్నం చేయండని చైనా ఆర్మీతో జిన్‌పింగ్ చెప్పినట్టుగా సీఎన్ఎన్ ఒక కథనాన్ని ప్రచురించింది. గాంగ్‌డాంగ్‌లో మంగళవారం ఒక సైనిక స్థావరాన్ని సందర్శించిన జిన్‌పింగ్ అక్కడ సైనికులతో మాట్లాడుతూ దేశం పట్ల విశ్వసనీయంగా వ్యవహరించండంటూ వారికి హితబోధ చేశారు. ‘‘మీకున్న శక్తిని, మేధస్సుని యుద్ధ వ్యూహ రచనపై కేంద్రీకరించండి. అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండండి. యుద్ధానికి సిద్ధంగా ఉండండి ’’అని జిన్‌పింగ్ చెప్పినట్టుగా సీఎన్ఎన్ తన కథనంలో పేర్కొంది. అయితే ఏ దేశంపైన, ఎప్పుడు దండెత్తడానికి జిన్‌పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారన్న దానిపై స్పష్టత లేదు. తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి భారత్‌తో ఉద్రిక్తతలు, అగ్రరాజ్యం అమెరికాతో విభేదాలతో పాటుగా దక్షిణ చైనా సముద్ర ప్రాంతానికి సంబంధించి ఇతర దేశాలతో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) నావికాదళ జవాన్లతో జిన్‌పింగ్ మాట్లాడారు. మరోవైపు చైనా మీడియా మాత్రం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మరింత బలోపేతం కావడానికి, సైనికుల్లో ఆత్మ విశ్వాసాన్ని నెలకొల్పడానికి జిన్‌పింగ్ సైనిక స్థావరాన్ని సందర్శించారని చెబుతోంది. ఇప్పటివరకు భారత్, చైనా ఏడు రౌండ్లు చర్చలు జరిగినప్పటికీ ఉద్రిక్తతల నివారణకు చర్యలు అమలు చేయడంలో చైనా వెనుకడుగ వేస్తూనే ఉంది. ఇలాంటి సమయంలో జిన్‌పింగ్ నోటి వెంట యుద్ధం ప్రస్తావన తేవడం మరింత ఆందోళనని పెంచుతోంది. -
కరోనా : నిలిచిపోయిన ఆ చానల్ ప్రసారాలు
మనీలా : ప్రపంచవ్యాప్తంగా ప్రతి రంగంపై కరోనా వైరస్ (కోవిడ్-19) ప్రభావాన్ని చూపుతోంది. తాజాగా కరోనా దెబ్బకి సీఎన్ఎన్ ఫిలిప్పీన్స్ చానల్ ప్రసారాలకు అంతరాయం ఏర్పడింది. ఆ టీవీ చానల్ ఉన్న బిల్డింగ్‌లో కరోనా పాజిటివ్ కేసు నమోదుకావడంతో.. ప్రసారాలు నిలిచిపోయాయి. కనీసం 24 గంటల పాటు తమ ప్రసారాలు నిలిచిపోనున్నాయని ఆ చానల్ ప్రకటించింది. అయితే వెబ్సైట్, సోషల్ మీడియా వేదికగా తాము వార్తలను అందిస్తామని సీఎన్ఎన్ ఫిలిప్పీన్స్ తెలిపింది. ఈ మేరకు ఆ చానల్ సోషల్ మీడియా అకౌంట్లో ఓ పోస్ట్ ఉంచింది. ‘కోవిడ్-19 ఫిలిప్పీన్స్‌తో సహా ప్రపంచంలోని ప్రతి మూలన వ్యాపి చెందుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1.97 లక్షల మందికి కరోనా సోకగా వారిలో 7,902 మంది మరణించారు. ఫిలిప్పీన్స్‌లో ఇప్పటివరకు 187 మంది కరోనా బారిన పడ్డారు. మా చానల్ కార్యాలయం కేంద్రీకృతమైన వరల్డ్‌వైడ్ కార్పొరేట్ సెంటర్లో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వరల్డ్‌వైడ్ కార్పొరేట్ సెంటర్ యాజమాన్యం ఆ ప్రాంతాన్ని శుభ్రపరచనుంది. ఈ ప్రక్రియ పూర్తయ్యే వరకు కనీసం 24 గంటల పాటు తమ ప్రసారాలను కొనసాగించలేం. అయినప్పటికీ మేము వెబ్సైట్, సోషల్ మీడియా వేదికగా వార్తలను అందజేస్తాం. ఈ అత్యవసర పరిస్థితులను ఎదుర్కొవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. రెండు వారాలకు మందు నుంచే మా సిబ్బందిలో చాలా మంది ఇంటి వద్ద నుంచే వర్క్ చేస్తున్నారు. ఇలాంటి ప్రమాదాన్ని ముందుగానే ఊహించి మేము ఆ నిర్ణయం తీసుకున్నాం’ అని తెలిపింది. OFFICIAL STATEMENT: CNN Philippines will go off air for at least 24 hours as the building where the network is housed will be disinfected. Employee of another company in the same building, but on a different floor, tests positive for COVID-19 https://t.co/uAy4Xpfx3d pic.twitter.com/VReWgzM9Co — CNN Philippines (@cnnphilippines) March 18, 2020 చదవండి : పరీక్షలు లేకుండానే పై తరగతులకు -
సీఎన్ఎన్ X ట్రంప్
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సీఎన్ఎన్ వార్తాసంస్థపై మరోసారి విరుచుకుపడ్డారు. ‘మీ పనితీరు చూసి మీరే సిగ్గుపడాలి’అంటూ సీఎన్ఎన్ విలేకరి అకోస్టాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రంప్ మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశం ఇందుకు వేదికయింది. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో విదేశీ జోక్యాన్ని నిరాకరిస్తూ మీరు ప్రతిజ్ఞ చేస్తారా?, ఎటువంటి అనుభవం లేని వ్యక్తిని నేషనల్ ఇంటెలిజెన్స్ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎలా నియమిస్తారు? అంటూ ఈ సమావేశంలో సీఎన్ఎన్ రిపోర్టర్ జిమ్ అకోస్టా ప్రశ్నించారు. ఇందుకు ట్రంప్.. ‘ఎన్నికల్లో సాయం చేయాలని ఏ దేశాన్ని కోరలేదు. ఏ దేశం నుంచి నాకు సాయం అందలేదు కూడా’అని బదులిస్తూ.. ఇటీవల ఓ వార్తాంశంలో తప్పుడు సమాచారం ఇచ్చినందుకు సీఎన్ఎన్ క్షమాపణ చెప్పాలన్నారు.(కోరితే.. కశ్మీర్‌పై మధ్యవర్తిత్వం!) నిజాన్ని వెల్లడించడంలో మీతో పోలిస్తే మాకు మంచి రికార్డే ఉంది’అని అకోస్టా అనడంతో ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీ రికార్డు ఏమిటో నేను చెబుతా. ఆ రికార్డు చూసి మీరే సిగ్గుపడతారు’అని పేర్కొన్నారు. ఇలా వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్న సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. 2018లో మీడియా సమావేశంలో ట్రంప్‌తో వాదులాటకు దిగిన అకోస్టా మీడియా పాస్‌ను అధ్యక్ష భవనం రద్దు చేసింది. ఆ తర్వాత కోర్టు జోక్యంతో దానిని పునరుద్ధరించారు. (రాష్ట్రపతి విందుకు కేసీఆర్ హాజరు) -
ప్రపంచ మీడియాకు హెడ్‌లైన్స్
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం తీసుకున్న నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని భారత మీడియా ఆకాశానికెత్తేస్తూ సోమవారం రోజంతా ప్రత్యేక కథనాలు ప్రసారం చేసింది. ఆర్టికల్ 370 రద్దుతో పరోక్షంగా ప్రభావం పడే పాకిస్తాన్ మీడియా మోదీ ప్రభుత్వ నిర్ణయంపై వ్యతిరేక కథనాలు వండి వారుస్తోంది. ఈ అంశంపై ప్రపంచ మీడియా సంస్థలు ఎలా రిపోర్ట్ చేశాయో ఓసారి చూద్దాం. ది గార్డియన్: జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పిస్తోన్న ఆర్టికల్ 370ని తొలగించడానికి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం తీవ్రమైన నిర్ణయం తీసుకుందని లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ది గార్డియన్ వెల్లడించింది. జమ్మూ కశ్మీర్‌ను విభజించాలన్న నిర్ణయం కూడా నాటకీయ మైన ఎత్తుగడ అని తెలిపింది. ఈ నిర్ణయం తో పాకిస్తాన్ వల్ల ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందంది. బీబీసీ: జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు చేయాలన్న భారత ప్రభుత్వ నిర్ణయం అత్యంత ముఖ్యమైన చర్యగా ప్రముఖ వార్తా సంస్థ బీబీసీ అభివర్ణించింది. అయితే ఈ నిర్ణయం వల్ల ఉద్రిక్తతలు రాజేసే అవకాశం ఉందంది. సీఎన్ఎన్: ఆర్టికల్ 370ని రద్దు చేయాలన్న భారత ప్రభుత్వ చర్య కశ్మీరీలకు మానసికంగా పెద్ద షాక్ కలిగించిందని అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సీఎన్ఎన్ సంస్థ పేర్కొంది. భారత్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆ రాష్ట్రం పూర్తిగా స్తంభించిపోయిందని తెలిపింది. ది వాషింగ్టన్ పోస్ట్: ‘కలహాలకు కొత్త వేదిక’అంటూ భారత ప్రభుత్వ ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని వాషింగ్టన్ పోస్ట్ రిపోర్ట్ చేసింది. భారత్‌లో కశ్మీర్ విలీనమవ్వడానికి ఆర్టికల్ 370 మూలమైందని పేర్కొంది. -
మై డియర్ బ్రేవ్ సిస్టర్స్
బిహార్‌లోని సుపాల్ జిల్లా (బిహార్) దర్పాఖలో.. పక్క గ్రామంలోని అబ్బాయిలు తమ గ్రామంలోని స్కూలు గోడలపై అసభ్య రాతలు రాయడాన్ని అడ్డుకుని, వారిపై తిరగబడి.. ‘మీరసలు ఆడపిల్లలేనా?’ అని తల్లిదండ్రుల చేత తీవ్రంగా దెబ్బలు తిని ఆసుపత్రి పాలైన 30 మంది కేజీబీవీ (కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం) బాలికలను ఉద్దేశించి.. సి.ఎన్.ఎన్. న్యూస్ 18 పొలిటికల్ ఎడిటర్ మారియా షకీల్ స్ఫూర్తిదాయకమైన ఉత్తరం రాశారు. చెడు రాతలపై తిరగబడిన బాలికలకు మారియా తన ఉత్తరంలో ‘అమ్మాయిలంటే మీలాగే ఉండాలి’ అని కూడా అభినందనలు తెలిపారు. మై డియర్ బ్రేవ్ సిస్టర్స్... బిహార్ వీధుల్లో సైకిళ్ల మీద కార్లు, బస్సులతో మీరు పోటీ పడడం చూశా. ‘‘మీ లైఫ్‌లో ఈ సైకిల్ రోల్ ఏంటీ?’’అని నేను అడిగినప్పుడల్లా ప్రపంచాన్ని జయించినట్టు విరిసిన మీ నవ్వుల్ని చూశా. మీ సాధికారత చూశా. చదువుకునే హక్కుకోసం పోరాడి పురుషాధిపత్యాన్ని వెక్కిరించిన మీ తెగువకు ముచ్చటపడ్డా. తల్లులు తమ కూతుళ్ల చదువుకు ఇంపార్టెన్స్ ఇచ్చేలా వాళ్ల ఆలోచనలను మార్చిన మీ తీరుకు మురిసిపోయా. మన అమ్మలు ఆడ బిడ్డలుగా ఉన్నప్పుడు చేయలేని పనిని మీరు చేశారు. మీ ఈ అచీవ్మెంట్ను చూసి గర్వపడుతున్నా. కానీ సుపాల్‌లో జరిగిన ఈ ఒక్క సంఘటనతో మీ శ్రమంతా వృథా అయిపోయి.. మళ్లీ ఈ సైకిల్ వెనక్కి వెళ్లిపోతుందేమోనని భయంగా ఉంది. స్కూల్లో మీ పాటికి మీరు చదువుకుంటుంటే.. పక్క ఊరి మగపిల్లలు వచ్చి మీ మీద కారుకూతలు కూస్తుంటే.. వేధింపులకు పాల్పడుతుంటే.. వాళ్లతో యుద్ధం చేశారు. ఆ ఆకతాయిలకు బుద్ధి చెప్పారు. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకున్నారు. ఈ గెలుపుని జీర్ణించుకోలేని పెద్దలు.. అమ్మాయిల స్వేచ్ఛ, సాధికారతకు హద్దులు గీశారు. ఆ గీత దాటొద్దని మీ ఒళ్లు చీరారు. మూల్యం.. మీలో 30 మంది ఆసుపత్రి పాలయ్యారు. అయినా సరే.. భయపడి వెనక్కి వెళ్లొద్దు. మీ సైకిళ్లను యూటర్న్ చేసుకోవద్దు. జరిగిన దాంట్లో మీ తప్పు కించిత్తయినా లేదు. మీరు సేఫ్ జోన్లోనే ఉన్నారు. మీరు మితిమీరారు అనే అధికారం ఎవరికీ లేదు. మీరు మీ స్కూల్ ప్లే గ్రౌండ్లో ఆడుకుంటున్నారు. అల్లరి మూకలు విరుచుకుపడ్డప్పుడు మీ హెడ్మాస్టర్, టీచర్లు అక్కడే ఉన్నారు. ఆ మూకను తరిమి, వెంటనే పోలీసులను పిలవాల్సింది పోయి చోద్యం చూస్తూ నిలబడ్డారు సిగ్గులేకుండా! స్కూల్ తన నమ్మకాన్ని పోగొట్టుకుంది. మీ భద్రతను ప్రశ్నగా మిగిల్చింది. అందుకే నాకు భయమేస్తోంది.. పోరాడి సాధించుకున్న మీ హక్కు మళ్లీ ఇంటి గడపలో దాక్కుంటుందేమోనని. అయినా మీరు వెనక్కి వెళ్లొద్దు.. మీరు ఏ తప్పూ చేయలేదు. బిహార్ పతనానికి ఈ సంఘటన ఓ ప్రతీక. రాష్ట్రంలో పెరుగుతున్న నేరాలకు, శాంతిభద్రతల మీద ముఖ్యమంత్రి కోల్పోతున్న నియంత్రణకు ఓ ఉదాహరణ. మహిళల, మైనార్టీల రక్షణ విషయంలో సీఎం నితీశ్ కుమార్ వైఫల్యం ఇది. ఒళ్లు గగుర్పొడిచే.. గుండె పిండేసే .. కడుపు రగిలే ముజఫర్‌పూర్ షెల్టర్ హోమ్ గాయం... ఇంకా పచ్చిగానే ఉంది. ఇప్పుడు సుపాల్ కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయ! సంఘటనలు వేరు కావచ్చు.. కానీ సారం ఒక్కటే. అమ్మాయిల మీద దాడి... అది ఏ రకంగానైనా! 2015లో నా రాష్ట్రంలో వస్తున్న మార్పులను చూసి సంతోషపడ్డాను. ఫ్యూడల్ వ్యవస్థ బలంగా ఉన్న బిహార్ లాంటి స్టేట్‌లో స్త్రీలు మద్యానికి వ్యతిరేకంగా ఉద్యమించి దాని వాసన లేకుండా చేశారు. మహిళలంతా కుల ప్రాధాన్యం, ప్రభావంలేని సమూహంగా ఏర్పడ్డారు. నిజంగా ఇది గొప్ప విజయం. ఒకానొక దశలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అమలవుతున్న తీరు చూసి బిహారీలమంతా గర్వంగా ఫీలయ్యాం. ప్రజోపయోగ కార్యక్రమాలు, ప్రణాళికలతో అప్రతిహతంగా దూసుకుపోతున్న నితీశ్కుమార్లో భవిష్యత్ ప్రధానమంత్రి కనిపించాడు. కానీ ఏం చేస్తున్నాడిప్పుడు? మద్యనిషేధం హామీతోనే గద్దెనెక్కిన నితీశ్ కుమార్.. మూడేళ్లలో మద్యాన్ని మళ్లీ పారించి ఆడవాళ్ల కష్టాన్ని బూడిదలో పోశాడు. అమ్మాయిలు చదువును ప్రోత్సహించడానికి సైకిళ్లను పంచిన ఆయనే ఇప్పుడు సైకిళ్లను ఇవ్వడం రద్దు చేశాడు.. రక్షణ, భద్రత ప్రధానాంశాలనీ మరిచిపోయాడు. ఆ పాత మంచి రోజులన్నీ పోయాయి. బిహార్‌ను ‘జంగిల్ రాజ్’గా పిలుస్తున్న రోజుల్లో కూడా మా అమ్మానాన్నలకు నేను స్కూల్‌కి ఎలా వెళ్తానో.. తిరిగి ఇంటికెలా చేరుకుంటానో అనే భయం తప్ప నా స్కూల్ గురించి ఎలాంటి అనుమానం ఉండేది కాదు. స్కూల్లో నేను భద్రంగా ఉంటాననే వాళ్ల నమ్మకం. నాకు బాగా గుర్తు.. నా కాలేజ్ డేస్‌లో.. కాలేజ్ టైమ్ అయిపోయాక బయటకు ఫ్రెండ్స్‌తో ఔటింగ్ అంటే ‘నో’ అనే వాళ్లు మా పేరెంట్స్. ఎందుకంటే సేఫ్‌గా ఉండదని. అంటే స్కూళ్లు, కాలేజ్‌లు అంత భద్రంగా ఉండేవి. కానీ మీ విషయంలో రివర్స్ అయింది. వరెస్ట్‌గా మారింది. మీరేం తప్పు చేయలేదు. మిమ్మల్ని మీరు రక్షించుకునే ప్రయత్నం చేశారు. ఆ మూకది తప్పు. వాళ్లు చేసిన బూతు కామెంట్లు తప్పు. ఆ తప్పును ఎత్తి చూపడానికి ధైర్యం కావాలి. అది మీకు దండిగా ఉంది. మీలో ప్రతి ఒక్కరిని చూసి గర్వపడుతున్నాను. మీ చర్యతో సమాజంలోని స్త్రీ ద్వేషాన్ని ఎండగట్టారు. మహిళలను గౌరవించని వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో చూపించారు. స్త్రీ శక్తికి ఉదాహరణగా నిలిచారు. మీ సహజ ప్రవర్తన వల్ల మీకు అందిన ప్రతిఫలం.. నా గుండెను పిండేస్తోంది. ఆ బాధ అక్షరాలను సాగనివ్వట్లేదు. అయినా మీలో ఉత్సాహం నింపాలనే ఈ తాపత్రయం. మీరు తల వంచాల్సిన పనిలేదు. మీ హక్కులను అటకెక్కించాల్సిన అవసరం లేదు. మారియా షకీల్ సీఎన్ఎన్ ఐబీఎన్ చానల్ పొలిటికల్ ఎడిటర్. కేవలం ప్రజాపక్షంగా మాత్రమే సాగుతున్న జర్నో ఆమె. ఆ నిష్పక్షపాత రిపోర్టింగ్కే రామ్‌నాథ్ గోయెంకా అవార్డ్ వచ్చింది. మారియా షకీల్ పాట్నాలోని ఓ రాజకీయ కుటుంబంలో పుట్టింది. జామియా ఇస్లామియా యూనివర్శిటీలో మాస్ కమ్యూనికేషన్ చదివింది. 2005లో సీఎన్ఎన్ ఐబీఎన్లోనే రిపోర్ట్‌గా మొదలై పొలిటికల్ ఎడిటర్ స్థాయికి ఎదిగింది. కరప్షన్, పొలిటికల్ ఇన్వెస్టిగేషన్ స్టోరీస్‌తో ఆమె ప్రాచుర్యంలోకి వచ్చింది. 2014లో మోదీ వేవ్ ఉండబోతోందని, 2015 బీహార్ ఎన్నికలప్పుడు మహాఘట్బంధన్ (మహా కూటమి) విజయం సాధించబోతోందని, 2017 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ మూడువందలకు పైగా సీట్లను గెలుచుకోబోతోందని పర్ఫెక్ట్ జోస్యం చెప్పిన ఏకైక జర్నలిస్ట్ మారియా షకీల్. -
ట్రంప్‌పై దండెత్తిన 350 మీడియా సంస్థలు
వాషింగ్టన్: అమెరికా చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా 350 మీడియా సంస్థలు ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యల్ని ఖండిస్తూ సంపాదకీయాలను ప్రచురించాయి. 2016లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తనకు వ్యతిరేక వార్తలు రాసే మీడియా సంస్థలను ట్రంప్ లక్ష్యంగా చేసుకోవడం తెల్సిందే. ఇటీవల ఆయన కొన్ని మీడియా సంస్థలను అమెరికా ప్రజలకు శత్రువులుగా అభివర్ణించారు. అంతేకాకుండా గతంలో ఓ ఇబ్బందికరమైన ప్రశ్న అడిగినందుకు సీఎన్ఎన్ చానల్ రిపోర్టర్‌ను ఇటీవల జరిగిన పత్రికా సమావేశానికి హాజరుకాకుండా నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ చర్యలు, వ్యాఖ్యలను నిరసిస్తూ సంపాదకీయాలు రాయాలని బోస్టన్ గ్లోబ్ పత్రిక పిలుపునిచ్చింది. తమకు నచ్చినట్లు రాతలు రాయని పత్రికలపై దేశానికి శత్రువులుగా ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ముద్రవేస్తున్నారని బోస్టన్ గ్లోబ్ పత్రిక తన సంపాదకీయంలో విమర్శించింది. తమకు నచ్చని వార్తల్ని నకిలీ కథనాలుగా ప్రచారం చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని న్యూయార్క్ టైమ్స్ సంపాదకీయాన్ని ప్రచురించింది. న్యూయార్క్ పోస్ట్ స్పందిస్తూ.. ప్రభుత్వానికి ఇబ్బందికరమైన వార్తలను పత్రికలు ప్రచురించినంత మాత్రన అవి నకిలీ వార్తలు అవిపోవని సంపాదకీయం రాసింది. ప్రతీకారం, వేధింపులు, శిక్షల నుంచి మీడియాకు స్వేచ్ఛ లేకపోతే.. ఆ దేశానికి, అక్కడి ప్రజలకు కూడా స్వేచ్ఛ లేనట్లేనని ఫిలడెల్ఫియా ఇన్క్వైరర్ సంపాదకీయం ప్రచురించింది. -
ట్రంప్ ఫేక్ న్యూస్ అవార్డులు.. విజేతలెవరో తెలుసా?
వాషింగ్టన్: ముందుగా వెల్లడించినట్టే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘ఫేక్ న్యూస్ అవార్డులు’ ప్రకటించారు. ప్రముఖ దినపత్రిక ‘ద న్యూయార్క్ టైమ్స్’కు ఫేక్ న్యూస్ అవార్డు ప్రకటించారు. అలాగే, ఏబీసీ న్యూస్, సీఎన్ఎన్, టైమ్, ద వాషింగ్టన్ పోస్ట్ తదితర మీడియా సంస్థలను కూడా విజేతలుగా ప్రకటించారు. ఇలా ట్రంప్ తనదైన శైలిలో అవార్డులు ప్రకటిస్తూ.. ఆ వివరాలు జీవోపీ.కామ్‌లో పొందుపరిచారు. దీని గురించి ట్వీట్ చేసిన వెంటనే ఆ వెబ్సైట్ క్రాష్ అయింది. పాత్రికేయ రంగంలో తాను గౌరవించే ఎంతో గొప్పమంది జర్నలిస్టులు ఉన్నారు కానీ, మీడియా ఇప్పుడు అవినీతి, కపటబుద్ధితో కథనాలు రాస్తున్నదని ట్రంప్ మరో ట్వీట్లో మండిపడ్డారు. ‘2017లో పక్షపాతబుద్ధితో ఏమాత్రం పారదర్శకత లేకుండా అథమస్థాయిలో బూటకపు కథనాలు వెలువడ్డాయి. అధ్యక్షుడు ట్రంప్‌కు వ్యతిరేకంగా 90శాతం ప్రతికూల కథనాలు వెలువడ్డాయి’అని జీవోపీ.కామ్ వెబ్సైట్ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రాత్మక విజయం సందర్భంగా.. దేశ ఆర్థిక వ్యవస్థ ఇక కోలుకోలేదంటూ పాల్ క్రుగ్మన్ రాసిన కథనానికిగాను ’ద న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు ఫేక్ అవార్డుల్లో ప్రథమ బహుమతి ప్రకటించగా.. తప్పుడు కథనాలతో మార్కెట్‌ను దెబ్బతీసినందుకు ఏసీబీ న్యూస్‌కు (బ్రియాన్ రాస్ కథనానికి) దిత్వీయ బహుమతిని, వీకీలీక్స్ పత్రాల యాక్సెస్ ట్రంప్‌కు, ఆయన తనయుడికి ఉందంటూ కథనం ప్రసారంచేసినందుకు సీఎన్ఎన్కు తృతీయ బహుమతిని ట్రంప్ ప్రకటించారు. ఒవల్ కార్యాలయంలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అర్ధవిగ్రహాన్ని తొలగించారని కథనం ప్రచురించినందుకు ‘టైమ్’ మ్యాగజీన్‌కు నాలుగో స్థానం కట్టబెట్టగా.. ఫ్లోరిడాలోని పెన్సాకోలాలో ట్రంప్ నిర్వహించిన భారీ ర్యాలీలో జనం లేరంటూ ప్రచురించిన ‘ద వాషింగ్టన్ పోస్ట్’కి చివరిస్థానం కేటాయించారు. తన హయాంలో మీడియా కపటబుద్ధితో వ్యవహరిస్తూ నిజాలను ప్రజలకు తెలియజేయడం లేదని ట్రంప్ వ్యాఖ్యానించారు. -
తల్లికి 26ఏళ్లు, బిడ్డకు 25ఏళ్లు!
వాషింగ్టన్: పాతికేళ్లుగా శీతలీకరణ స్థితిలో ఉన్న ఓ పిండం పసిపాపగా ప్రాణం పోసుకుంది. 1992 అక్టోబరులో ఓ దాత నుంచి సేకరించిన ఒక పిండాన్ని శీతలీకరించి వైద్యులు భద్రపరిచారు. కాగా, ఈ ఏడాది మార్చిలో 26ఏళ్ల ఓ అమెరికన్ మహిళ గర్భంలోకి ఆ పిండాన్ని ప్రవేశపెట్టడంతో ఆమె గర్భందాల్చి నవంబర్ 25న పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. ‘సీఎన్ఎన్’ వార్తాకథనం ప్రకారం.. పాపకు జన్మనిచ్చిన టీనా భర్త బెంజమిన్ గిబ్సన్‌కు జన్యుపరమైన సమస్యలున్నాయి. దాంతో ఈ జంట దాత నుంచి సేకరించిన పిండం ద్వారా బిడ్డను కనాలనుకున్నారు. ‘అమెరికా నేషనల్ ఎంబ్రియో డొనేషన్ సెంటర్’ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జెఫెరే కీనన్ ఆధ్వర్యంలో పాతికేళ్లనాటి పిండాన్ని టీనా గర్భంలో ప్రవేశపెట్టారు. ‘పిండం ఎన్నో ఏళ్ల క్రితంనాటిదని మాకు తెలియదు. ఆ లెక్కన చూస్తే వయసురీత్యా నా కూతురు, నేను బెస్ట్ ఫ్రెండ్స్. నా కుమార్తె దేవుడిచ్చిన క్రిస్మస్ కానుక’ అని తల్లి టీనా వ్యాఖ్యానించారు.