వాషింగ్టన్: పాతికేళ్లుగా శీతలీకరణ స్థితిలో ఉన్న ఓ పిండం పసిపాపగా ప్రాణం పోసుకుంది. 1992 అక్టోబరులో ఓ దాత నుంచి సేకరించిన ఒక పిండాన్ని శీతలీకరించి వైద్యులు భద్రపరిచారు. కాగా, ఈ ఏడాది మార్చిలో 26ఏళ్ల ఓ అమెరికన్ మహిళ గర్భంలోకి ఆ పిండాన్ని ప్రవేశపెట్టడంతో ఆమె గర్భందాల్చి నవంబర్ 25న పండంటి అమ్మాయికి జన్మనిచ్చింది. ‘సీఎన్‌ఎన్’ వార్తాకథనం ప్రకారం.. పాపకు జన్మనిచ్చిన టీనా భర్త బెంజమిన్ గిబ్సన్‌కు జన్యుపరమైన సమస్యలున్నాయి.
దాంతో ఈ జంట దాత నుంచి సేకరించిన పిండం ద్వారా బిడ్డను కనాలనుకున్నారు. ‘అమెరికా నేషనల్ ఎంబ్రియో డొనేషన్ సెంటర్’ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ జెఫెరే కీనన్ ఆధ్వర్యంలో పాతికేళ్లనాటి పిండాన్ని టీనా గర్భంలో ప్రవేశపెట్టారు. ‘పిండం ఎన్నో ఏళ్ల క్రితంనాటిదని మాకు తెలియదు. ఆ లెక్కన చూస్తే వయసురీత్యా నా కూతురు, నేను బెస్ట్ ఫ్రెండ్స్. నా కుమార్తె దేవుడిచ్చిన క్రిస్మస్ కానుక’ అని తల్లి టీనా వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment