వాషింగ్టన్: నాలుగు రోజులపాటు ఉత్కంఠ రేపిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో జో బైడెన్ విజయం సాధించడం పట్ల నల్ల జాతీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ పాలనలో అమానుష దాడులు, వర్ణ వివక్షను ఎదుర్కొన్నామని, తమకు మంచి రోజులు వచ్చాయని సంతోషం ప్రకటిస్తున్నారు. సీఎన్‌ఎన్ వార్తా సంస్థ సహ వ్యవస్థాపకుడు, వ్యాఖ్యాత వాన్ జోన్స్ ఏకంగా లైవ్‌లోనే కన్నీటి పర్యంతమయ్యాయ్యారు. జో బైడెన్ గెలిచాడనే వార్తలు చదువుతున్న క్రమంలో ఈ ఘటన చోసుకుంది. వాన్ జోన్స్ గద్గద స్వరంతో.. ‘ఒక తండ్రిగా, పిల్లల ఆలనాపాలనా చూసే రక్షకుడిగా ఈ ఉదయం నుంచి నిశ్చింతగా బతకొచ్చు. పిల్లలకు మంచి నడవడిక నేర్పొచ్చు’ అని పేర్కొన్నారు.
అనంతరం తన ఎమోషనల్ వీడియో క్లిప్‌ను ట్విటర్‌లో షేర్ చేస్తూ.. ‘జో బైడెన్ అధ్యక్షుడు కావడం అత్యంత గొప్ప విషయం. జార్జ్ ఫ్లాయిడ్ లాంటి ఎంతో మంది నల్ల జాతీయులు ఊపిరాడక ప్రాణాలొదిలారు. అలాంటి వారందరికీ క్షమాపణలు. అమెరికా ప్రజలందిరికీ ఇదొక సుదినం. ఇప్పుడు మాకు కాస్త ప్రశాంతత దొరికింది’అని చెప్పుకొచ్చారు. కాగా, అమెరికా 46 వ అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్.. అమెరికా ప్రజలందరినీ తిరిగి ఒక్కటి చేస్తానని హామినిచ్చారు. దేశం గాయాలను మాన్పేందుకు అవకాశం దొరికిందని అన్నారు. ఇక 77 ఏళ్ల వయసులో అమెరికా అధ్యక్ష పీఠం అధిరోహించనున్న బైడెన్ ఆ ఘనత సాధించిన పెద్ద వయస్కుడిగా రికార్డు సాధించారు. ఆయన రన్నింగ్ మేట్, కాలిఫోర్నియా సెనేటర్ కమాలా హ్యారీస్ ఉపాధ్యక్ష పదవి రేసులో విజయం సాధించి.. ఈ ఘతన సాధించిన తొలి నల్ల జాతీయురాలుగా చరిత్ర సృష్టించారు.
(చదవండి: బైడెన్‌కే పట్టాభిషేకం)
Today is a good day.
— Van Jones (@VanJones68) November 7, 2020
It’s easier to be a parent this morning.
Character MATTERS.
Being a good person MATTERS.
This is a big deal.
It’s easy to do it the cheap way and get away with stuff — but it comes back around.
Today is a good day.#PresidentBiden#VotersDecided pic.twitter.com/h8YgZK4nmk
Comments
Please login to add a commentAdd a comment