
డిబేట్‌కు సిద్ధమని ప్రకటించిన అధ్యక్ష అభ్యర్థులు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇరు పారీ్టల అభ్యర్థులు వాదనలతో ఎదురెదురుగా బలాబలాలు తేల్చుకునే ‘చర్చల’ అంకానికి డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెరలేపారు. సీఎన్‌ఎన్ టీవీ ఛానల్‌లో జూన్ 27వ తేదీన, ఏబీసీ ఛానల్‌లో సెప్టెంబర్ పదో తేదీన ఈ డిబేట్‌లు ఉంటాయి.
మూడు దశాబ్దాలుగా డిబేట్‌లు నిర్వహించే ‘కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్’ను కాదని ఈసారి మీడియాసంస్థల ఆధ్వర్యంలో టీవీ ఛానళ్లలో డిబేట్‌కు బైడెన్ ప్రచార బృందం ఓకే చెప్పింది. ‘‘అట్లాంటా స్టూడియోలో ఈ డిబేట్‌ను నిర్వహిస్తాం’ అని సీఎన్‌ఎన్ తెలిపింది. జనం మధ్యలో డిబేట్ జరిపితే బాగుంటుందని ట్రంప్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment