Republican candidate
-
ట్రంప్ శిబిరంలో వీసా చిచ్చు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఘన విజయానికి దోహదపడిన అంశాల్లో కీలకమైన వలసల వివాదం... తిరిగి తిరిగి ఆయన శిబిరంలోనే చిచ్చు పెడుతున్న వైనం కనబడుతోంది. ఆయన ప్రమాణ స్వీకారానికి చాలాముందే అనుచరగణం పరస్పరం కత్తులు దూసుకుంటున్నారు. ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్నారు. అమెరికాను మళ్లీ అగ్రస్థానానికి తీసుకెళ్లాలన్న ట్రంప్ ‘మాగా’ ఉద్యమ మూలపురుషుల్లో ఒకరైన స్టీఫెన్ మిల్లర్‌కూ, స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్‌కూ మధ్య హెచ్1బి వీసాల విషయంలో తాజాగా తలెత్తిన లడాయి ఇప్పట్లో చల్లారడం కష్టమే. తొలిసారి ట్రంప్ విజేతగా నిలిచిన 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో హెచ్1బి వీసాలపై ఆయన దూకుడుగా మాట్లాడటం వెనక మిల్లర్ వ్యూహం ఉంది. స్థానికులను నిర్లక్ష్యం చేసి తక్కువ వేతనాలకు పరాయి దేశాలవారిని ఉద్యోగాల్లో నియమించుకునే సంస్కృతిని సాగనివ్వబోనని అప్పట్లో ట్రంప్ చెప్పేవారు. తమ ఉద్యోగాలన్నీ బయటి దేశాల పౌరులు తన్నుకుపోతున్నారని ఆగ్రహంతో ఊగిపోయిన శ్వేతజాతి అమెరికన్లు ఆయనకు ఎగబడి ఓట్లేశారు. ట్రంప్ ప్రసంగాల రచయిత మిల్లరే. ఈ దఫా సైతం ఆయన ట్రంప్ ఆంతరంగిక బృందంలో ముఖ్యుడిగా ఉండబోతున్నారు. వలసల విషయంలో ట్రంప్ అనుచరగణంలో స్పష్టత లోపించిందన్న సంగతి ప్రచార సమయంలోనే బట్టబయలైంది. అక్రమ వలసదారులే పెద్ద సమస్యని ట్రంప్ సన్నిహితుడు వివేక్ రామస్వామి అభిప్రాయపడుతున్నారు. ఆయన్ను ఈమధ్యే ప్రభుత్వ సిబ్బందిలో అత్యధికుల్ని సాగనంపేందుకు ఏర్పాటైన ప్రభుత్వ సామర్థ్య విభాగానికి ట్రంప్ ఎంపికచేశారు. ఆ విభాగంలో ఆయనతోపాటు పనిచేయబోయే మస్క్ సైతం వివేక్ అభిప్రాయాన్ని సమర్థిస్తున్నారు. కానీ మిల్లర్‌తోపాటు, తీవ్ర మితవాది అయిన లారా లూమర్, స్టీవ్ బానన్ వంటివారు దీన్ని అంగీకరించటం లేదు. అసలు హెచ్1బి వీసా విధానాన్నే పూర్తిగా ఎత్తేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికన్ సంస్కృతి, జీవన విధానం వైపు చర్చ మళ్లడం దీని తీవ్రతను తెలియజేస్తోంది. అమెరికన్లలో అనేకులు సమర్థత నుంచి నాసిరకం సంస్కృతికి మళ్లి చాన్నాళ్లవుతోందని వివేక్ రామస్వామి వ్యాఖ్యానిస్తే... అమెరికన్లు తెగువ, ఆత్మవిశ్వాసం దండిగా ఉన్నవారంటూ 2020లో ట్రంప్ చేసిన ప్రసంగం వీడియోను మిల్లర్ ఎక్స్ వేదికపై వదిలారు. ఇంతకూ ట్రంప్ ఏమనుకుంటున్నారు? మాకు చురుకైనవాళ్లు, సమర్థులు కావాలని నూతన సంవత్సర వేడుకల సమావేశంలో ట్రంప్ చెప్పడం సహజంగానే అందరినీ ఆశ్చర్యపరిచింది. తానెప్పుడూ హెచ్1బి వీసాల విధానాన్ని వ్యతిరేకించలేదని అనటం అర్ధ సత్యమే అయినా ట్రంప్ వైఖరి మారిందని, ఆయనపై మస్క్ ప్రభావం బలంగా ఉన్నదని రిపబ్లికన్లలో బలమైన మితవాద వర్గం గుసగుసలు పోతోంది. ఎవరెలా అనుకున్నా హెచ్1బి వీసాల సంగతలా వుంచి అక్రమ వలసదారుల్ని గెంటేయటం అంత తేలిక కాదు. వారిపై ముందు వలస వ్యవహారాల న్యాయ స్థానంలో కేసు దాఖలు చేయాలి. వారు రకరకాల వాదనలతో ముందుకొస్తారు. విచారణ వాయి దాల్లో నడుస్తుంటుంది. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న కేసులు తేలాలంటేనే 2029 చివరివరకూ పడుతుందని గణాంకాలు చెబుతున్నాయి. కొత్తవారిని గుర్తించి కేసులు పెడితే ఆ భారం మరింత పెరుగుతుంది. చట్టాన్ని సవరిస్తే తప్ప ఇది అంత సులభంగా తేలదు. దానికితోడు అక్రమ వలస దారులను గుర్తించే ఐసీఈ ఏజెంట్లు 6,000 మందికి మించిలేరు. దానికి కేటాయించే నిధులు సైతం ఏ సమయంలోనూ 40,000 మందిని మించి నిర్బంధించేందుకు సరిపోవు. ఒకవేళ అక్రమ వలస దారులందరినీ సాగనంపడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినా, లక్షలమంది తరలింపునకు విమానాలు సమకూర్చడం అసాధ్యం. ఇక డెమాక్రాట్ల ఏలుబడిలో ఉన్న న్యూయార్క్, షికాగో, లాస్ఏంజెలస్, డెన్వర్ వంటి నగరాలు అక్రమ వలసదారుల ఏరివేతకు సహకరించవు. అక్రమ వలసదారుల్ని వెనక్కిపంపిన గతకాలపు అధ్యక్షుడు ఐసెన్ హోవర్ తనకు ఆదర్శమని ట్రంప్ అంటున్నారు. కానీ ఆకాలంలో మెక్సికో మినహా మరే దేశంనుంచీ పెద్దగా వలసలు లేవు. ఇప్పుడలా కాదు... చైనా, భారత్, మారుటేనియా, ఉజ్బెకిస్తాన్ దేశాలనుంచి రికార్డు స్థాయి అక్రమ వలసలున్నాయి. ఇందులో ఎన్ని దేశాలు ట్రంప్‌కు సహకరిస్తాయన్నది ప్రశ్న. సమస్యలు సృష్టించటం సులభం. కానీ వాటి పరిష్కారం అన్ని సందర్భాల్లోనూ అంత తేలిక కాదు. తగిన అర్హతలున్నవారు స్థానికంగా దొరక్కపోతే బయటి దేశాలనుంచి ఆ నైపుణ్యం ఉన్న వారిని తీసుకురావటం కోసం రూపొందించిన హెచ్1బి వీసాను బడా సంస్థలు ఖర్చు తగ్గించు కోవటానికి వాడుకుంటున్న మాట వాస్తవం. దాన్ని ట్రంప్ తనకు అనుకూలంగా సొమ్ము చేసు కోవటం సైతం నిజం. కానీ ఆ సమస్యే పార్టీలో చిచ్చుపెడుతుందని ఆయన ఊహించి వుండరు.ఇంతకూ ఆయన ఎవరి పక్షమన్న విషయంలో వైరి వర్గాల్లో ఎవరికీ స్పష్టత లేదు. ఎందుకంటే వివేక్, మస్క్, శ్రీరాం కృష్ణన్వంటి గతకాలపు వలసదారుల్ని తీసుకున్న ట్రంప్ మరోపక్క వలసలకు పక్కా వ్యతిరేకి అయిన స్టీఫెన్ మిల్లర్‌తోపాటు ఆయన భార్య కేటీ మిల్లర్‌ను సైతం తన బృందంలో చేర్చు కున్నారు. ఏదేమైనా హెచ్1బి వీసాలు పొందినవారిలో అత్యధికులు మనవాళ్లే కనుక వారి మెడపై కత్తి వేలాడుతూనే ఉంటుంది. అలాగే ట్రంప్‌ను మించిన శ్వేతజాతి చాంపియన్ అమెరికా రాజకీయాల్లో ఆవిర్భవించే అవకాశం కూడా లేకపోలేదు. -
US Election Results 2024: ట్రంప్‌కు 50.8 శాతం, హారిస్‌కు 47.5 శాతం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజేతగా నిలిచిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన మెజారిటీని మరింతగా పెంచుకునే దిశగా సాగుతున్నారు. విజయానికి 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం కాగా ఆయనకు ఇప్పటికే 295 ఓట్లు సాధించారు. ఆయన ప్రత్యర్థి, డెమొక్రాట్ అభ్యర్థి కమలా హారిస్ 226 ఓట్లు సాధించారు. మొత్తం 50 రాష్ట్రాల్లోనూ ఇంకా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నా 48 రాష్ట్రాల్లో ఇప్పటికే ఫలితం తేలింది. అరిజోనా, నెవడాల్లో మాత్రమే తేలాల్సి ఉంది. ఆ రెండు రాష్ట్రాల్లో కూడా ట్రంపే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. వాటిలోని 17 ఎలక్టోరల్ ఓట్లు కూడా ఆయన ఖాతాలోనే పడితే ఆయన మొత్తం 312 ఓట్లు సాధిస్తారు. ఇది 2016లో తొలిసారి అధ్యక్షునిగా నెగ్గినప్పుడు సాధించిన ఓట్ల కంటే (304) అధికం. ట్రంప్‌కు ఇప్పటిదాకా 50.8 శాతం, హారిస్‌కు 47.5 శాతం ఓట్లొచ్చాయి. ఆయన 7,27,34,149 ఓట్లు, హారిస్ 6,80,49,758 ఓట్లు సాధించారు. కాంగ్రెస్‌లో... అధ్యక్షునితో పాటు కాంగ్రెస్‌కు కూడా ఎన్నికలు జరిగాయి. సెనేట్‌లోని 100 స్థానాల్లో 34 సీట్లకు, ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటితో పాటు 11 రాష్ట్రాల గవర్నర్ పదవులకు, పలు రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు కూడా ఎన్నికలు జరిగాయి. బిల్లుల ఆమోదంలో అత్యంత కీలక పాత్ర పోషించే సెనేట్‌లో నాలుగేళ్ల అనంతరం రిపబ్లికన్లు మెజారిటీ సాధించారు. ఇప్పటిదాకా వెల్లడైన ఫలితాల్లో వారి స్థానాల సంఖ్య మెజారిటీ మార్కును దాటి 52కు చేరింది. డెమొక్రాట్లకు 45 స్థానాలకు పరిమితమయ్యారు. డెమొక్రాట్లు ఇప్పటికే 3 సీట్లను రిపబ్లికన్లకు కోల్పోయారు. ప్రతినిధుల సభలో కూడా రిపబ్లికన్ల హవాయే సాగుతోంది. మెజారిటీకి 218 సీట్లు కావాల్సి ఉండగా వారికిప్పటికే 206 సీట్లు దక్కాయి. డెమొక్రాట్లు 192 సీట్లే గెలుచుకున్నారు. వారిప్పటికే 4 సీట్లను రిపబ్లికన్లకు కోల్పోయారు. మరో 37 స్థానాల్లో ఫలితాలు రావాల్సి ఉంది. -
స్థిరత్వం లేని ట్రంప్‌ను ఓడించండి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రచారం వేడెక్కుతోంది. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ తన ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. ట్రంప్ ఏమాత్రం స్థిరత్వం లేని మనిషి, ప్రతీకారమే అతడి విధానమని మండిపడ్డారు. విభజనవాది, గందరగోళానికి మారుపేరైన ట్రంప్‌ను చిత్తుచిత్తుగా ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాజాగా డెమొక్రటిక్ ఎన్నికల ప్రచార సభలో కమలా హారిస్ మాట్లాడారు. అమెరికా పౌరులపైకి అమెరికా సైన్యాన్ని ప్రయోగించాలనుకుంటున్న ట్రంప్‌కు బుద్ధి చెప్పాలని సూచించారు. వ్యతిరేకులను బల ప్రయోగంతో అణచివేయాలన్నదే ఆయన ఆలోచన అని ఆరోపించారు. ప్రజలను శత్రువులుగా భావిస్తున్న ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎంతమాత్రం పనికిరారని తేల్చిచెప్పారు. ప్రజలు కోరుకుంటున్న కొత్త తరం నాయకత్వాన్ని పరిచయం చేస్తానని, అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లకు కమలా హారిస్ విజ్ఞప్తి చేశారు. ప్రజలకు మేలు చేయడమే తన లక్ష్యమని, అందుకోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టంచేశారు. దుష్ట స్వభావం కలిగిన వ్యక్తులపై, స్వప్రయోజనాల కోసం పాకులాడే శక్తులపై కఠినమైన పోరాటానికి భయపడబోనని చెప్పారు. తన తల్లి తనకు ధైర్యసాహసాలు నూరిపోశారని వ్యాఖ్యానించారు. కష్టపడి పనిచేసే నిజాయతీపరులైన ప్రజలను స్వార్థ శక్తుల నుంచి కాపాడుతానని హామీ ఇచ్చారు. అధికారికంలోకి వచ్చాక రాజకీయాలకు అతీతంగా అందరి బాగు కోసం కృషి చేస్తానని ప్రకటించారు. అన్ని పార్టీలతో కలిసి పని చేస్తానన్నారు. అమెరికా అధ్యక్షురాలిగా తాను భిన్నమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని కమలా హారిస్ ఉద్ఘాటించారు. ఆకాశాన్నంటున్న ధరలే తన ముందున్న అతిపెద్ద సవాలు అని చెప్పారు. ధరలు తగ్గించడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తానని వెల్లడించారు. నాకు ఓటేయని వారికీ ప్రతినిధినే: హారిస్బైడెన్ వివాదం నేపథ్యంలో వ్యాఖ్యలువాషింగ్టన్: ‘‘నేను అమెరికన్లందరికీ ప్రాతినిధ్యం వహిస్తా. అధ్యక్ష ఎన్నికల్లో నాకు ఓటేయని వారు కూడా అందులో భాగమే’’ అని హారిస్ స్పష్టం చేశారు. ట్రంప్ మద్దతుదారులను ‘చెత్త’గా అభివర్ణిస్తూ అధ్యక్షుడు జో బైడెన్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయడం తెలిసిందే. వాటిపై హారిస్ ఇలా స్పందించారు. ఎవరికి ఓటేస్తారన్న దాని ఆధారంగా వ్యక్తులపై విమర్శలు చేయడాన్ని తాను అంగీకరించబోనని స్పష్టం చేశారు. -
USA Presidential Elections 2024: హారిస్‌కు మొగ్గు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సర్వేల్లో డెమొక్రాట్ల అభ్యర్థి కమలా హారిస్ మరోసారి స్వల్ప ఆధిక్యంలోకి దూసుకెళ్లారు. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో పోలిస్తే ఆమెకు ఒక శాతం మొగ్గున్నట్టు మంగళవారం వెలువడ్డ రాయిటర్స్/ఇప్సోస్ తాజా సర్వేలో తేలింది. శుక్రవారం నుంచి ఆదివారం దాకా జరిపిన ఈ మూడు రోజులు హారిస్‌కు 44 శాతం, ట్రంప్‌కు 43 శాతం మంది మద్దతిచ్చారు. 975 మంది నమోదైన ఓటర్లతో కలిపి మొత్తం 1,150 మంది అమెరికా పౌరులు ఈ సర్వేలో పాల్గొన్నారు. అయితే ఎకానమీ, నిరుద్యోగం, ఉపాధి వంటి అతి కీలకమైన అంశాల్లో ఏకంగా 47 శాతం మంది ట్రంప్‌కే ఓటేశారు. హారిస్‌కు మద్దతిచ్చిన వారు కేవలం 37 శాతం మాత్రమే. మరో కీలకాంశమైన వలసల విషయంలో కూడా ట్రంప్ 48 శాతం మంది వైఖరిని సమర్థిస్తే హారిస్‌ను 33 శాతం మందే సమర్థించారు. కచ్చితంగా ఓటేస్తామన్న వారిలో 47 శాతం హారిస్‌ను, 46 శాతం ట్రంప్‌ను బలపరిచారు. హారిస్ అధ్యక్ష రేసులోకి వచ్చినప్పటి నుంచి సర్వేలన్నీ ఆమెకే మొగ్గున్నట్టు తేల్చడం విశేషం. -
USA Presidential Elections 2024: ఊరిస్తున్న ఊయల సేవ
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు కురుక్షేత్రాన్ని తలపిస్తూ అత్యంత హోరాహోరీగా సాగుతోంది. రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ ప్రత్యర్థి కమలా హారిస్ నువ్వా నేనా అన్నట్టుగా తలపడుతున్నారు. ఎన్నికలు మొత్తం 50 రాష్ట్రాల్లోనూ జరుగుతున్నా వాటిలో ఏడు రాష్ట్రాలు విజేతను తేల్చడంలో అతి కీలకంగా మారాయి. స్వింగ్ స్టేట్స్‌గా పిలిచే ఆ ఏడింటిపైనే అందరి దృష్టీ కేంద్రీకృతమైంది. వాటిలో మెజారిటీ రాష్ట్రాలను నెగ్గిన వారే అధ్యక్షుడు కావడం ఖాయంగా కన్పిస్తోంది. అయితే అన్ని పోల్స్‌లోనూ ఆ ఏడు రాష్ట్రాల్లో కూడా ట్రంప్, హారిస్ దాదాపుగా సమవుజ్జీలుగా నిలుస్తుండటం విశేషం. దాంతో ఈ ఎన్నికలు అత్యంత ఆసక్తికరంగా మారిపోయాయి. స్వింగ్ స్టేట్స్ అంటే...?అమెరికాలోని 50 రాష్ట్రాల్లో చాలావరకు డెమొక్రాట్, రిపబ్లికన్ పార్టీల్లో ఏదో ఒకదానివైపు స్పష్టంగా మొగ్గేవే ఉంటాయి. వాటిని సేఫ్ స్టేట్స్‌గా పిలుస్తారు. పారీ్టల జెండా రంగుపరంగా వీటిని బ్లూ (డెమొక్రాట్), రెడ్ (రిపబ్లికన్) స్టేట్స్‌గా పేర్కొంటారు. కొన్ని రాష్ట్రాలు మాత్రం ఒక ఎన్నికలో డెమొక్రాట్లకు జై కొడితే మరో ఎన్నికలో రిపబ్లికన్ అభ్యరి్థని గెలిపిస్తుంటాయి. వీటినే స్వింగ్ స్టేట్స్, బ్యాటిల్‌గ్రౌండ్ స్టేట్స్, పర్పుల్ స్టేట్స్ (డెమొక్రాట్, రిపబ్లికన్ పారీ్టల్లో ఎటైనా మొగ్గవచ్చనే అనే అర్థంలో) అని పిలుస్తుంటారు. అభ్యర్థులు సేఫ్ స్టేట్స్పై పెద్దగా దృష్టి పెట్టరు. ఈ స్వింగ్ స్టేట్స్ను తమవైపు తిప్పుకోవడం, లేదా అవి ప్రత్యరి్థకి జై కొట్టకుండా చూడటంపైనే శక్తియుక్తులన్నింటినీ కేంద్రీకరిస్తారు. దాంతో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ హోరాహోరీ ప్రచారం సాగుతుంటుంది. మీడియాలోనూ, బయటా భారీగా ఎన్నికల ప్రకటనలు ఇతరత్రా హడావుడి కూడా స్వింగ్ స్టేట్స్లోనే ఎక్కువ. ఆ 7 రాష్ట్రాలివే... ఈ ఎన్నికల్లో 7 రాష్ట్రాలు స్వింగ్ స్టేట్లుగా అందరి దృష్టినీ తమవైపు తిప్పుకుంటున్నాయి. అవి... పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియా, అరిజోనా, మిషిగన్, నెవడా, విస్కాన్సిన్పెన్సిల్వేనియా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 19 రాష్ట్ర జనాభా 1.3 కోట్లు 2020లో విజేత బైడెన్ (82 వేల ఓట్ల మెజారిటీ) ఏడు స్వింగ్ స్టేట్లలో అత్యధిక ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్న రాష్ట్రం. దాంతో సహజంగానే ఇక్కడ గెలుపు అభ్యర్థులకు అత్యంత కీలకం. ట్రంప్‌పై గత జూలైలో హత్యాయత్నం జరిగింది పెన్సిల్వేనియాలోనే. ఇది బైడెన్ సొంత రాష్ట్రం కూడా. ఆర్థిక పరిస్థితులు ఈసారి ఇక్కడ కీలక ఎన్నికల అంశంగా మారాయి. ధరాభారంతో పెన్సిల్వేనియావాసులు నానా కష్టాలు పడుతున్నారు. అమెరికా అంతటినీ అతలాకుతలం చేస్తున్న జీవన వ్యయం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇక్కడ మరీ ఎక్కువగా పెరిగిందని మార్కెట్ సర్వే సంస్థ డేటాసెంబ్లీ సర్వేలో తేలింది. కనీవిని ఎరగని రీతిలో రాష్ట్రంలో ప్రతి పదిమందిలో ఏకంగా ఎనిమిది మంది ఆహార అభద్రతను ఎదుర్కొంటున్నట్టు ఆ సర్వే తేలి్చంది! ఇది హారిస్‌కు బాగా ప్రతికూలంగా మారవచ్చంటున్నారు. తాజా పరిస్థితి తాజా పోల్ ఆఫ్ పోల్స్‌లో హారిస్ 0.9 శాతం ఆధిక్యంలో ఉన్నారునార్త్ కరోలినా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 16 రాష్ట్ర జనాభా 10.8 కోట్లు 2020లో విజేత ట్రంప్ (74 వేల ఓట్ల మెజారిటీ) గత ఎన్నికల్లో ట్రంప్ గెలిచిన ఏకైక స్వింగ్ స్టేట్ ఇదే. ఈసారి కూడా బైడెన్ ప్రత్యరి్థగా ఉన్నన్ని రోజులూ ట్రంప్ హవాయే నడిచింది. ఆయన తప్పుకుని హారిస్ తెరపైకి రావడంతో పరిస్థితి మారుతూ వచి్చంది. దాంతో ఈ రాష్ట్రాన్ని నిలబెట్టుకోవడం ట్రంప్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ విషయాన్ని ఆయన కూడా అంగీకరించారు. అందుకే ఇక్కడ వీలైనన్ని ఎక్కువ ఎన్నికల ర్యాలీలు నిర్వహించారు. తాజా పరిస్థితి ట్రంప్ 0.9 శాతం ఆధిక్యంలో ఉన్నారుమిషిగన్ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 15 రాష్ట్ర జనాభా కోటి 2020లో విజేత బైడెన్ (1.5 లక్షల ఓట్ల మెజారిటీ) గత ఎన్నికల్లో బైడెన్‌కు మంచి మెజారిటీ కట్టబెట్టిన రాష్ట్రమిది. కానీ రాష్ట్రంలో ప్రబల శక్తిగా ఉన్న అరబ్ అమెరికన్లు హారిస్ పట్ల చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఆమె ఇజ్రాయెల్‌కు మద్దతిస్తుండటం బాగా ప్రతికూలంగా మారేలా కని్పస్తోంది. దీన్ని గమనించి కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ విషయంలో హారిస్ కాస్త విమర్శనాత్మక వైఖరి అవలంబిస్తూ వస్తున్నారు. అది ఇక్కడ అరబ్ ఓటర్ల ఆగ్రహాన్ని ఏ మేరకు చల్లార్చిందన్నది ఫలితాలొస్తే గానీ తేలదు. తాజా పరిస్థితి కమలా హారిస్ 0.8 శాతం ఆధిక్యంలో ఉన్నారుజార్జియా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 16 రాష్ట్ర జనాభా 1.1 కోట్లు 2020లో విజేత బైడెన్ (13 వేల ఓట్ల మెజారిటీ)గత ఎన్నికల్లో అత్యంత వివాదాస్పదంగా నిలిచిన ఫలితం జార్జియాదే. ఇక్కడి ఓటమిని ఒప్పుకునేది లేదంటూ ట్రంప్ భీషి్మంచారు. ఏకంగా ఫలితాలనే మార్చేసేందుకు ప్రయతి్నంచి భంగపాటుకు గురయ్యారు. దీనికి సంబంధించి నాలుగు కేసులను కూడా ఎదుర్కొంటున్నారు. ఒకదాంట్లో ట్రంప్ ఇప్పటికే దోషిగా తేలగా మూడింట్లో విచారణ కొనసాగుతోంది. జార్జియా జనాభాలో ఏకంగా మూడో వంతు ఆఫ్రికా మూలాలున్నవారే. 2020లో బైడెన్‌ను గెలిపించినా, ఆయన నాలుగేళ్ల పాలనపై వారంతా పెదవి విరుస్తున్నారు. ఇది హారిస్‌కు ప్రతికూలంగా మారేలా కని్పస్తోంది. కానీ ఇక్కడ నిర్వహించిన ముమ్మర ప్రచారం పరిస్థితిని ఆమెకు కాస్త అనుకూలంగా మార్చిందంటున్నారు. తాజా పరిస్థితి ట్రంప్ ఏకంగా దాదాపు 2 శాతం ఆధిక్యం కనబరుస్తున్నారుఅరిజోనా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 11 రాష్ట్ర జనాభా 74 లక్షలు 2020లో విజేత బైడెన్ (10 వేల ఓట్ల మెజారిటీ) 2020 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రాట్ల విజయంలో ఈ రాష్ట్రానిదే కీలక పాత్ర. ఇక్కడ డెమొక్రాట్ అభ్యర్థి గెలవడం 1990ల తర్వాత అదే తొలిసారి కావడం విశేషం. మెక్సికోతో అరిజోనా వందలాది కిలోమీటర్ల మేరకు సరిహద్దులను పంచుకుంటుంది. దాంతో సహజంగానే వలసలు ఇక్కడ కీలక ఎన్నికల అంశంగా మారాయి. తాను గెలిస్తే ఏకంగా 10 లక్షల మంది అక్రమ వలసదారులను వెనక్కు పంపుతానన్న ట్రంప్ ప్రకటన అరిజోనావాసులను బాగా ఆకట్టుకుంటోంది. వలసలపై హారిస్ విధానాల పట్ల వారు పెదవి విరుస్తున్నారు. అయితే అబార్షన్లపై ట్రంప్ స్పష్టమైన వైఖరంటూ ప్రకటించకపోవడంపై ఆయనకు కాస్త మైనస్‌గా మారే ఆస్కారముంది. మహిళా ఓటర్లలో హారిస్ పట్ల స్పష్టమైన మొగ్గు కనిపిస్తుండటం కూడా డెమొక్రాట్లకు సానుకూలాంశమే. తాజా పరిస్థితి ట్రంప్ ఏకంగా దాదాపు 3 శాతం ఆధిక్యం కనబరుస్తున్నారువిస్కాన్సిన్ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 10 రాష్ట్ర జనాభా 59 లక్షలు 2020లో విజేత బైడెన్ (21 వేల ఓట్ల మెజారిటీ) స్వతంత్ర అభ్యరి్థగా తొలుత బరిలో ఉన్న మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనెడీ మేనల్లుడు రాబర్ట్ ఎఫ్.కెనెడీకి విస్కాన్సిన్లో భారీ జనాదరణ దక్కింది. ఆగస్టు చివర్లో ఆయన బరి నుంచి తప్పుకుని ట్రంప్‌కు మద్దతు పలకడం రిపబ్లికన్లకు బాగా కలిసొచ్చేలా ఉంది. దీనికి తోడు గ్రీన్ పార్టీ అభ్యర్థి జిల్ స్టెయిన్ ఇక్కడ డెమొక్రాట్ల అవకాశాలకు మరింత గండి కొట్టేలా కని్పస్తున్నారు. ఆయన్ను ఎలాగైనా బరిలోంచి తప్పించాలని డెమొక్రాట్లు చివరిదాకా ప్రయతి్నంచినా కుదర్లేదు. తాజా పరిస్థితి హారిస్ ఒక్క శాతం కంటే తక్కువ ఆధిక్యంలో ఉన్నారునెవడా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు 6 రాష్ట్ర జనాభా 32 లక్షలు 2020లో విజేత బైడెన్ (34 వేల ఓట్ల మెజారిటీ) కొద్ది ఎన్నికలుగా వరుసగా డెమొక్రాట్లకే జై కొడుతూ వస్తున్న రాష్ట్రమిది. కానీ ఈసారి మాత్రం ట్రంప్ ఖాతాలో పడే సూచనలు గట్టిగానే కని్పస్తున్నాయి. పోల్ ట్రాకింగ్ సంస్థ 538 తాజా గణాంకాల ప్రకారం ట్రంప్‌కు ఈ రాష్ట్రంలో ఆదరణ బాగా పెరిగింది. హారిస్ రంగప్రవేశంతో పరిస్థితి కాస్త మారినా ఇప్పటికీ ఇక్కడ ట్రంప్‌దే పై చేయిగా కన్పిస్తోంది. అమెరికాలోకెల్లా నిరుద్యోగం అతి ఎక్కువగా (5.1 శాతం)ఉన్న రాష్ట్రం నెవడానే. ఇక్కడ లాటిన్ అమెరికన్లు చాలా ఎక్కువ. వారంతా చాలీచాలని వేతనాలతో సతమతమవుతున్నారు. వారిలో హోటళ్లలో వెయిటర్లు తదితర పనులు చేసేవాళ్లే ఎక్కువ. టిప్పులపై పన్ను ఎత్తేస్తామన్న ట్రంప్ హామీ వారిని బాగా ఆకట్టుకుంది. దాన్ని గమనించిన హారిస్ తాను కూడా ఈ మేరకు గత ఆగస్టులోనే హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రం వారిలో ఎవరికి దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది. తాజా పరిస్థితి హారిస్ ఒక్క శాతం కంటే తక్కువ ఆధిక్యంలో ఉన్నారు – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘టారిఫ్’పై ట్రంప్‌కే ఓటు
వాషింగ్టన్: అగ్రరాజ్యాన్నీ అప్పుల భారం వెన్నాడుతోంది. దాంతో దేశ అప్పుల భారాన్ని తగ్గించే నేతకు అమెరికా ఓటర్లు జై కొడుతున్నారు. డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్‌తో పోలిస్తే విదేశీ వస్తువులపై అధిక పన్నులు వేసి అమెరికా రుణ భారాన్ని తగ్గిస్తానన్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌కు ఎక్కువ మంది ఓటర్లు మద్దతు పలుకుతున్నట్లు తాజాగా రాయిటర్స్/ఇప్సోస్ పోల్ సర్వేలో వెల్లడైంది. ఇప్పటికే దేశ అప్పు ఏకంగా 35 లక్షల కోట్ల డాలర్లు దాటిపోయింది. పన్నులు పెంచుకుంటే ప్రభుత్వానికి ఆదాయం పెరిగి పాత అప్పులను తీర్చుతుందనే భావనతో ఓటర్లు ట్రంప్ వైపు మొగ్గుచూపుతన్నారని సర్వే పేర్కొంది. ‘‘ఎగుమతులపై 10 శాతం పన్నులు విధిస్తానని, చైనా ఉత్పత్తులపై 60 శాతం దిగుమతి పన్ను విధిస్తానని హామీ ఇచి్చన ట్రంప్‌కు 56 శాతం మంది ఓటర్లు మద్దతు పలికారు. ఈ విషయంలో హారిస్ వైపు నిల్చున్న ఓటర్లు కేవలం 41 శాతం’’ అని సర్వే పేర్కొంది. పలు సర్వేల్లో హారిస్ ఆధిక్యతలో ఉన్నా ఏడు స్వింగ్ రాష్ట్రాలే విజేతను నిర్ణయిస్తాయని సర్వే అభిప్రాయపడింది. -
ట్రంప్, హారిస్ హోరాహోరీ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య పోరు హోరాహోరీగా కొనసాగుతోందని ఆదివారం విడుదలైన న్యూయార్క్ టైమ్స్, సియానా సర్వేలో వెల్లడైంది. ఆస్తులను ఎక్కువ చేసి చూపి రుణాలు పొందడం, పార్లమెంట్‌పైకి తన మద్దతుదారులను ఉసిగొల్పిన ఘటనల్లో నిందితుడిగా ఉన్నాసరే సగం ఓటర్లు ట్రంప్‌కు మద్దతు పలుకుతున్నట్లు సర్వే పేర్కొంది. దేశవ్యాప్తంగా చూస్తే దాదాపు 48 శాతం మంది ట్రంప్‌కు మద్దతు పలికారు. కమలా హారిస్ విస్కాన్సిన్, మిషిగన్, పెన్సిల్వేనియా రాష్ట్రాల్లో ఆధిక్యత చూపారు. నెవడా, జార్జియా, నార్త్ కరోలినా, అరిజోనాలో ఇద్దరికీ గట్టి పోటీ ఉంది. మిషిగన్, విస్కాన్సిన్లో హారిస్ ఒక శాతం ఆధిక్యం కనబరిచారని, పెన్సిల్వేనియాలో గట్టి పోటీ నెలకొందని సీబీఎస్ న్యూస్, యూగౌ సర్వేలో తేలింది. బిగ్ డిబేట్‌కు వేళాయే!వాషింగ్టన్: డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య అధ్యక్ష చర్చ మంగళవారం జరగనుంది. పలు అంశాలపై తమ వైఖరిని తెలుపుతూ అమెరికన్లను మెప్పించడానికి అధ్యక్ష అభ్యర్థులు సిద్ధమయ్యారు. ఏబీసీ న్యూస్ ఛానెల్లో ఈ బిగ్ డిబేట్ మంగళవారం రాత్రి 9 గంటలకు (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 6:30 గంటలకు) జరగనుంది. ఫిలడెలి్ఫయాలోని నేషనల్ కాస్టిట్యూషన్ సెంటర్లో ఏబీసీ న్యూస్ యాంకర్లు డేవిడ్ ముయిర్, లిన్సే డేవిస్ దీన్ని నిర్వహిస్తారు. 90 నిమిషాల పాటు ఈ చర్చ ఉంటుంది. అధ్యక్ష చర్చ నిర్వహించే యాంకర్లు మాత్రమే ప్రశ్నలు అడుగుతారు. -
గెలిపిస్తే టిక్‌టాక్‌ను కాపాడుతా: ట్రంప్
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపిస్తే చైనాకు చెందిన సోషల్ మీడియా వేదిక ‘టిక్‌టాక్’ను కాపాడుతానని అమెరికా ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలో టిక్‌టాక్‌కు తాను రక్షకుడిని అవుతానని ఉద్ఘాటించారు. టిక్‌టాక్ కావాలని కోరుకునేవారంతా అధ్యక్ష ఎన్నికల్లో తనకు ఓటు వేయాలని కోరారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశారు. అమెరికాలో తన ప్రత్యర్థి వర్గం టిక్‌టాక్‌ను మూసివేయడానికి కుట్ర పన్నుతోందని పరోక్షంగా అధ్యక్షుడు జో బైడెన్‌పై ఆరోపణలు గుప్పించారు. టిక్‌టాక్‌ను అమెరికా కంపెనీకి విక్రయిండానికి దాని మాతృ సంస్థపై ఒత్తిడి పెంచేలా లేదా అమెరికాలో టిక్‌టాక్‌ను నిషేధించేలా జో బైడెన్ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో ఓ బిల్లుపై సంతకం చేసింది. నిజానికి ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2020లో టిక్‌టాక్‌పై నిషేధం విధించడం గమనార్హం. -
USA Presidential Elections 2024: భిన్న ధ్రువాలు.. విభిన్న వైఖరులు
అగ్రరాజ్యం. అమెరికా ప్రపంచ పెద్దన్నగా కొనసాగాలంటే అధ్యక్షపీఠంపై ఆసీనులై పరిపాలించే నేత తీసుకునే నిర్ణయాలు తిరుగులేనివై ఉండాలి. దేశ అంతర్గత భద్రత, ప్రజా సంక్షేమం, అభివృద్ధి, ధరలుసహా యుద్ధాలు, వాతావరణ మార్పు వంటి అంతర్జాతీయ అంశాలపై పట్టుండాలి. అంతర్యుద్ధాలు, సంక్షోభాలు, అంతర్జాతీయ సమస్యలపై మిత్ర దేశాలతోపాటు శత్రుదేశాలనూ ఒప్పించగల నేర్పు తప్పనిసరి. నవంబర్‌లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్న డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌లు తాము గెలిస్తే ఎలాంటి పాలన అందిస్తారన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత నాలుగేళ్లుగా జో బైడెన్ అమలుచేసిన అభివృద్ధి పథకాలను కొనసాగిస్తానని హారిస్ చెబుతుండగా అక్రమ వలసలను నిలువరించి బహిష్కరణ పర్వానికి తెరలేపుతానని, విప్లవాత్మక విధానాలను అమలుచేస్తానని ట్రంప్ భీష్మ ప్రతిజ్ఞచేశారు. ‘‘అధ్యక్షురాలిగా గెలవగానే శ్రామిక కుటుంబాల కోసం పాటుపడతా. కనీస వేతనాన్ని పెంచుతా. సేవలు, ఆతిథ్యరంగంలోని సిబ్బందికి అందే టిప్పులపై వసూలుచేస్తున్న పన్నులను రద్దుచేస్తా’ అని హారిస్ అన్నారు. జూన్‌లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సైతం ఇదే హామీ ఇవ్వడం విశేషం. ఈ నేపథ్యంలో పలు కీలక అంశాలపై ఇప్పటికే ట్రంప్, హారిస్ వెల్లడించిన అభిప్రాయాలు వారి పాలనాపంథాపై స్పష్టత తీసుకొస్తున్నాయి. వాటిని ఒకసారి తరచి చూస్తే..అబార్షన్హారిస్: సురక్షితమైన, చట్టబద్ధమైన అబార్షన్‌కు కమలా హారిస్ మద్దతు పలుకుతున్నారు. రిపబ్లిక్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అబార్షన్లపై నిషేధం విధించడాన్ని ఆమె ఇప్పటికే పలుమార్లు తప్పుబట్టారు. తాము అధికారంలోకి వస్తే చట్టబద్ధ అబార్షన్‌కు అనుమతిస్తూ పార్లమెంట్లో చట్టం తెచ్చేందుకు కృషిచేస్తానని చెప్పారు. ట్రంప్: కొన్ని రాష్ట్రాల్లో అబార్షన్‌పై నిషేధం అమలవుతుండగా కొన్ని రాష్ట్రాల్లో షరతుల మేరకు అనుమతిస్తున్నారు. దీంతో అబార్షన్‌పై ఎప్పుడు ప్రశ్నించినా ట్రంప్ సమాధానం దాటవేశారు. అబార్షన్‌పై జాతీయస్థాయి విధానాన్ని ప్రకటించలేదు. రాష్ట్రాలకే ఆ నిర్ణయం వదిలేస్తే మంచిది అన్నట్లు గతంలో వ్యాఖ్యానించారు.చట్టాల అమలు/ ప్రజాస్వామ్యంహారిస్: హారిస్ గెలిస్తే ట్రంప్‌పై కేసులపై దృష్టిపెట్టే అవకాశముంది. గత అధ్యక్ష ఫలితాలను తప్పుబడుతూ, పార్లమెంట్ భవంతి మీదకు రిపబ్లికన్ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులను ట్రంప్ ఉసిగొల్పడం, నీలితారకు అనైతిక నగదు చెల్లింపులు, ఆస్తిగా ఎక్కువగా చూపు రుణాల పొందటం వంటి కేసుల్లో తీర్పులు త్వరగా వచ్చేలా హారిస్ ఒత్తిడి తేవచ్చు. ప్రజాస్వామ్యయుత పాలనకు కట్టుబడతానని హారిస్ గతంలో అన్నారు. ట్రంప్: బైడెన్ చేతిలో ఓడినపుడు అధ్యక్ష ఫలితాలను ట్రంప్ అంగీకరించలేదు. ఈసారి కూడా ఓడిపోతే ఓటమిని ట్రంప్ ఒప్పుకోకపోవచ్చు. నాటి పార్లమెంట్‌పై దాడి, అక్కడి పోలీసులను గాయపరిచిన నిందితులకు క్షమాభిక్ష పెడతానని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎఫ్బీఐను ప్రక్షాళిస్తానని చెప్పారు. బైడెన్ పాలనలో అవినీతిపై ప్రత్యేక ప్రాసిక్యూటర్‌తో విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు.వాతావరణ మార్పులు/ఇంథనంహారిస్: అమెరికాలో కర్భన ఉద్గారాల విడుదల తగ్గిస్తానని ఉపాధ్యక్షురాలి హోదాలో హారిస్ గతంలో చెప్పారు. హరిత ఇంథనానికి జై కొట్టారు. సముద్రగర్భంలో చమురు వెలికితీతను వ్యతిరేకించారు. విద్యుత్ వినియోగం ఆదాతోపాటు పర్యావరణ అనుకూల పథకాలను ప్రోత్సహించారు. ట్రంప్: వాతావరణ మార్పుల అంశాన్ని గాలి కొదిలేశారు. పారిస్ ఒప్పందం నుంచి వైదొలిగారు. ప్రభుత్వ భూముల్లో విచ్చలవిడిగా చమురు తవ్వకాలకు పచ్చజెండా ఊపారు. బైడెన్ ప్రభుత్వం వచ్చాక పారిస్ ఒప్పందంలో అమెరికా చేరింది. అయితే ఈసారి తాను గెలిస్తే పారిస్ ఒప్పందానికి మళ్లీ కటీఫ్ చేప్తానని ట్రంప్ అన్నారు.ఇజ్రాయెల్/ ఉక్రెయిన్యుద్ధాలుహారిస్: గాజా స్ట్రిప్‌లో హమాస్‌పై ఇజ్రాయెల్ దాడులను సమర్థిస్తూనే పాలస్తీనియన్ల ప్రాణాలూ ముఖ్యమేనని హారిస్ చెప్పారు. త్వరగా యుద్ధాన్ని ముగించాలని ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూను కోరారు. కాల్పుల విరమణ ఒప్పందానికి, సంధికి మొగ్గుచూపారు. ఈజిప్ట్, ఖతార్‌లతో కలసి మధ్యవర్తిత్వానికి ఓటేశారు. ఈమె గెలిస్తే గాజా యుద్ధం త్వరగా ముగిసే వీలుంది. ఉక్రెయిన్ యుద్ధంపై ఆమె ఇంకా ఎలాంటి స్పష్టమైన విధానాలు ప్రకటించలేదు.ట్రంప్: హమాస్ అంతమయ్యేదాకా ఇజ్రాయెల్‌కు మద్దతు పలుకుతానని ట్రంప్ గతంలో అన్నారు. అయితే మరింత మారణహోమం జరక్కుండా త్వరగా యుద్ధం ముగించి గాజాలో శాంతి నెలకొల్పాలని ఆయన కోరుతున్నారు. జనావాసాలపై ఇజ్రాయెల్ దాడులనూ ట్రంప్ సైతం ఖండించారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధాన్ని త్వరగా ముగించే సత్తా తనకుందని ట్రంప్ గతంలో అన్నారు.ప్రభుత్వపాలనహారిస్: ప్రభుత్వ ఉద్యోగులను హఠాత్తుగా తొలగించే వివాదాస్పద ‘ప్రాజెక్ట్ 2025’ సిద్ధాంతాన్ని హారిస్ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులను సులభంగా తీసేసేందుకు వీలు కల్పించేలా 2020లో ట్రంప్ ఇచ్చిన షెడ్యూల్–ఎఫ్ ఉత్తర్వును హారిస్ వ్యతిరేస్తున్నారు. సిబ్బంది ఉద్యోగ భద్రతకు పాటుపడతానని ఆమె మాటిచ్చారు. అక్రమ వలసలను తగ్గిస్తానని చెప్పారు. ఆహార ఉత్పత్తుల ధరను తగ్గిస్తానని హామీ ఇచ్చారు. కార్మికుల టిప్‌లపై పన్నును తొలగిస్తానన్నారు. కార్మికుల కనీస వేతనం పెంచుతానని, పౌరులు కొనే అధునాతన ఆయుధాలపై నిషేధం విధిస్తానని చెప్పారు.ట్రంప్: తన హయాంలో అమలు చేయాలని ప్రయత్నించిన ‘ప్రాజెక్ట్ 2025’ సిద్ధాంతం గురించి ట్రంప్ ఎక్కడా మాట్లాడట్లేదు. అయితే అధ్యక్ష కేంద్రంగా కేంద్రీకృత ప్రభుత్వానికి బాటలువేసే ఈ సిద్ధాంతాన్ని తాను గెలిస్తే అమలుచేయాలని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. తనపై పలు కేసులకు కారకులైన న్యాయశాఖ సిబ్బందిపై వేటు వేయడానికి ట్రంప్ సిద్దంగా ఉన్నాడని వార్తలొచ్చాయి. విద్యాశాఖను రద్దుచేస్తానని, ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ వంటి సంస్థలను ప్రక్షాళిస్తానని చెప్పారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
USA Presidential Elections 2024: కమలా హారిస్‌పై తులసి అస్త్రం!
వాషింగ్టన్: ఒక డిబేట్‌తో బైడెన్‌ను అధ్యక్ష రేసు నుంచే వైదొలిగేలా చేసిన రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ కొత్త ప్రత్యరి్థపై పైచేయి సాధించేందుకు పెద్ద కసరత్తే చేస్తున్నారు. సెపె్టంబరు 10న ట్రంప్, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ మధ్య ఏబీసీ ఛానల్లో అధ్యక్ష చర్చ జరగనున్న విషయం తెలిసిందే. దీంట్లో కమలను ఏయే అంశాల్లో ఇరుకున పెట్టొచ్చనే అంశంలో తనకు మార్గనిర్దేశనం చేయడానికి మాజీ డెమొక్రాట్ (ప్రతినిధుల సభ మాజీ సభ్యురాలు), హిందూ– అమెరికన్ తులసి గబార్డ్ సహాయం తీసుకుంటున్నారు ట్రంప్. ఫ్లోరిడాలోని ట్రంప్‌కు చెందిన గోల్ఫ్ రిసార్ట్స్‌లో తులసి ఆయనకు సహాయపడుతున్నారు. ‘రాజకీయ చరిత్రలోనే మంచి డిబేటర్లలో ఒకరిగా ట్రంప్ పేరుగాంచారు. జో బైడెన్‌ను నాకౌట్ చేశారు. చర్చకు సన్నద్ధం కావాల్సిన అవసరం ట్రంప్‌కు లేదు. అయితే విధానపరమైన సలహాదారులను, తులసి గబార్డ్ లాంటి సమర్థులైన వక్తలను కలుస్తూనే ఉంటారు’ అని ట్రంప్ ప్రతినిధి కరోలిన్ లీవిట్ తెలిపారు. అయితే 2016, 2020ల కంటే ఈసారి డిబేట్లకు సిద్ధమవడానికి ట్రంప్ అధిక సమయం వెచి్చస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ పత్రిక తెలిపింది. 2020 డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యరి్థత్వానికి బైడెన్‌తో పోటీపడిన వాళ్లలో కమలా హారిస్, తులసి గబార్డ్లు కూడా ఉన్నారు. ప్రైమరీల్లో భాగంగా 2019 జూలైలో హారిస్, తులసిల మధ్య డిబేట్ జరిగింది. దీంట్లో కమలా హారిస్‌ను తులసి తీవ్రంగా ఇరుకునపెట్టి పైచేయి సాధించారు. -
USA Presidential Elections 2024: సర్వేలో ముందంజలో కమలా హారిస్
వాషింగ్టన్: బైడెన్ అభ్యర్థిత్వం వేళ దాదాపు ఏకపక్షంగా కనిపించిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సరళిలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి. రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌తో ధీటుగా మాట్లాడలేక తడబడి, చివరకు తప్పుకున్న బైడెన్ అభ్యర్థిగా ఉన్నంతకాలం ట్రంప్ ముందంజలో ఉండటం తెల్సిందే. తాజా డెమొక్రటిక్ పార్టీ తరఫున కమలా హారిస్ రంగంలోకి దిగాక పోరు హోరాహోరీగా సాగుతోందని విశ్లేషణలు వెలువడ్డాయి. వీటికి బలం చేకూరుస్తూ తాజా సర్వేలో ట్రంప్ కంటే కమల హారిస్‌కే ఆదరణ ఒక శాతం ఎక్కువగా ఉందని తేలింది. తాజాగా ఆదివారం సీబీఎస్ న్యూస్/యూగవ్ సంస్థ చేపట్టిన సర్వేలో కమల ఆధిక్యం కనబరిచారు. ట్రంప్ అధ్యక్ష పదవిలో మానసికంగా స్థిమితంగా ఆలోచించగలరని 51 శాతం మంది, కమల మెరుగ్గా పరిపాలించగలరని 64 శాతం చెప్పారు. -
సొంత పార్టీ కుట్రకే బైడెన్ బలి
వాషింగ్టన్: సొంత డెమొక్రాటిక్ పార్టీ నేతల కుట్రలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బలయ్యారని రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ఆయన్ను తొలుత బ్రతిమాలి, చివరకు భయపెట్టి అధ్యక్ష బరి నుంచి తప్పించారన్నారు. శనివారం మిన్నెసోటాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ మాట్లాడారు. ‘‘బైడెన్‌కు 1.4 కోట్ల మంది ఓటర్ల అండ ఉంది. పోటీలో కొనసాగాలని కృతనిశ్చయంతో కన్పించారు. అలాంటి బలమైన నేతను బెదిరించి తప్పించారు. ‘మర్యాదగా తప్పుకుంటే మంచిది. లేదంటే అవమానభారంతో పంపిస్తాం. అధ్యక్షుడు మరణించినా, బాధ్యతలు నిర్వర్తించలేని స్థితిలో ఉన్నా 25వ రాజ్యాంగ సవరణ ద్వారా తప్పించగలమని బెదిరించారు. అలా ఇంటిదారి పట్టించారు. చేసేదేమీ లేక బైడెన్ తప్పుకున్నారన్నది వాస్తవం. కానీ మీడియాలో మాత్రం తప్పుడు కథనాలొచ్చాయి. ఆయన ధైర్యంగా ని్రష్కమించారంటూ అంతా ఆయనను పొగుడుతూ ఆకాశానికి ఎత్తేశారు. వాస్తవానికి ఆయనను బలవంతంగా పక్కకు నెట్టేశారు’’ అన్నారు. కమలపై తిట్ల దండకం డెమొక్రటిక్ పార్టీ నుంచి తన ప్రత్యరి్థగా దాదాపుగా ఖాయమైన కమలా హారిస్‌పై ట్రంప్ తిట్ల దండకానికి దిగారు. ‘‘ఆమె మితిమీరిన ఉదారవాది. స్థిరచిత్తం లేని నాయకురాలు. మతిలేని వామపక్షవాది. అమెరికా చరిత్రలోనే అత్యంత అసమర్థ ఉపాధ్యక్షురాలు. గతంలో మార్కిస్ట్ జిల్లా అటార్నీగా శాన్ఫ్రాన్సిస్కోను నాశనం చేశారు. ఇలాంటి నేత అమెరికా చరిత్రలో ఎన్నడూ అధ్యక్ష పోటీలో నిలబడలేదు. హారిస్ పొరపాటున దేశాధ్యక్షురాలైతే దేశంలో హింస, కల్లోలం నిత్యకృత్యాలవుతాయి. ఆమె పరిపాలనలో అమెరికా అంతటా అతివాదం, వైఫల్యాలు, ఉద్రిక్త పరిస్థితులు.. చివరకు మూడో ప్రపంచ యుద్ధమే రావొచ్చు. అందుకే ఈ ఎన్నికల్లో ఆమెను మనం గెలవకుండా అడ్డుకుందాం. ఆమె అమెరికాకు కాకుండా నేరగాళ్లకు అధ్యక్షురాలిగా మసులుకుంటారు. ఆమె గెలిస్తే గాజా నుంచి కూడా శరణార్థులు అమెరికాకు వచ్చి తిష్టవేస్తారు’ అని ట్రంప్ ఆరోపించారు. ‘నేను గెలిచి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే తొలి రోజే బైడెన్–హారిస్ హయాంలో తీసుకున్న సరిహద్దు విధానాలన్నింటినీ చెత్తబుట్టలో పడేస్తా. సరిహద్దును మూసేసి అక్రమ వలసలను అడ్డుకుంటా’ అని అన్నారు. అధికారంలోకి వస్తే క్రిప్టోకరెన్సీని సూపర్‌పవర్‌గా మలుస్తానని చెప్పారు. -
Kamala Harris: మోసగాళ్లను ఓడించాలి
వాషింగ్టన్: ట్రంప్ లాంటి అవినీతిపరులను, ద్రోహులను ఎన్నికల పోరాటంలో మట్టికరిపించడమే తన ధ్యేయమని రిపబ్లికన్ అభ్యర్థిగా దాదాపు ఖరారైన కమలా హారిస్ ఉద్ఘాటించారు. మంగళవారం విస్కాన్సిన్ రాష్ట్రంలో డెమోక్రటిక్ పార్టీ సమావేశంలో ఆమె తన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. అభ్యర్థిత్వానికి సరిపడా మద్దతు కూడగట్టుకున్నాక కమల మాట్లాడిన మొదటి సమావేశం ఇదే. గతంలో కాలిఫోరి్నయా ప్రాసిక్యూటర్‌గా పనిచేశానని, తన రికార్డు ఏమిటో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. మహిళలను వేధించిన దుర్మార్గులను, అమాయక ప్రజలను దగా చేసిన మోసగాళ్లను, సొంత లాభం కోసం నిబంధనలు అతిక్రమించిన దుషు్టలను ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కాగా, డెమొక్రటిక్ అభ్యర్థిగా తొలుత బరిలోకి దిగిన బైడెన్‌కు ప్రజల నుంచి వచి్చన విరాళాలను హారిస్‌కు బదిలీ చేయడం ఆపాలని ట్రంప్ ప్రచార బృందం కోరింది. ఈ మేరకు ఫెడరల్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.సర్వేల్లో హారిస్‌దే పైచేయిలేటుగా వచ్చినా, లేటెస్ట్గా వచ్చారన్న నానుడిని హారిస్ నిజం చేస్తున్నారు. అధ్యక్ష రేసులో బైడెన్‌పై ఆద్యంతం ఆధిపత్యం ప్రదర్శించిన ట్రంప్ జోరుకు ఆమె వచ్చీ రాగానే కళ్లెం వేశారు. మానసిక చురుకుదనం, సవాళ్లను దీటుగా ఎదుర్కోగల సత్తా విషయంలో ట్రంప్ కంటే హారిస్‌కే అమెరికన్లు జైకొట్టడం విశేషం! ఈ విషయమై రాయిటర్స్/ఇప్సోస్ చేసిన తాజా సర్వేలో 56 శాతం మంది హారిస్‌కు ఓటేయగా ట్రంప్‌కు 49 శాతమే దక్కాయి. తాజాగా సోమ, మంగళవారాల్లో సీఎన్ఎన్ జరిపిన దేశవ్యాప్త సర్వేలో కూడా ట్రంప్‌కు 49 శాతం రాగా, హారిస్ 46 శాతం ఓట్లు సాధించారు. -
Donald Trump: దేవుడు నా వైపే.. గెలుపు నాదే
మిల్వాకీ: హత్యాయత్నం నుంచి తృటిలో తప్పించుకున్న అమెరికా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్(78) సమరోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. భగవంతుడు తనవైపు ఉండడం వల్లే పెద్ద ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డానని చెప్పారు. భగవంతుడి దయతోనే మళ్లీ జనం ముందుకు వచ్చానని పేర్కొన్నారు. మరో నాలుగు నెలల్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. హత్యాయత్నం ఘటన తర్వాత తొలిసారిగా మిల్వాకీలో గురువారం రాత్రి జరిగిన రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో ట్రంప్ భావోద్వేగంతో ప్రసంగించారు. రిపబ్లికన్ అభ్యరి్థగా తన నామినేషన్‌ను లాంఛనంగా ఆమోదించారు. తూటాల దాడి జరిగినా తన సంకల్పం చెక్కుచెదరలేదని, అమెరికా ప్రజలకు సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. దేశాన్ని కాపాడాలన్న నా తపనను ఏ ప్రమాదం, ఏ అవరోధం అడ్డుకోలేవని తేలి్చచెప్పారు. హత్యాయత్నం తర్వాత తనపై ప్రేమాభిమానాలు కురిపించి, మద్దతు ప్రకటించిన ప్రజలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఆత్మవిశ్వాసం, ఆశ, బలం అనే సందేశాన్ని మోసుకొని ఈరోజు అమెరికన్ల ముందుకు సగర్వంగా వచ్చానని అన్నారు. పార్టీ సదస్సులో ట్రంప్ ఇంకా ఏం మాట్లాడారంటే... నూతన యుగానికి ఆరంభం ‘‘మరో నాలుగు నెలల్లో మనం అద్భుతమైన విజయం సొంతం చేసుకోబోతున్నాం. అమెరికా చరిత్రలో నాలుగు అతిగొప్ప సంవత్సరాలకు శ్రీకారం చుట్టబోతున్నాం. మతం, రంగు, జాతితో సంబంధం లేకుండా ప్రజలందరికీ భద్రత, సౌభాగ్యం, స్వేచ్ఛ కలి్పంచే నూతన యుగాన్ని మనమంతా కలిసికట్టుగా ఆరంభిద్దాం. మన సమాజంలో ప్రజల మధ్య అడ్డుగోలకు తావు లేకుండా చేద్దాం. అమెరికన్లుగా మనది ఒకేబాట, ఒకేమాట. మనం ఐక్యమత్యంగా ఉండాలి. అందరం కలిసి పైకి ఎదగాలి. కలిసి ఉండలేకపోతే నష్టపోతాం. సగం అమెరికాకు కాదు, మొత్తం అమెరికాకు అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు బరిలో నిల్చున్నా. మనం ఒకే దేశం బిడ్డలం నాపై హత్యాయత్నం జరిగిన సంగతి అందరికీ తెలుసు. అసలేం జరిగిందని చాలామంది అడుగుతున్నారు. నా శరీరం నుంచి అంగుళంలో మూడోవంతు దూరంలో తుపాకీ తూటా దూసుకెళ్లింది. నా తల రక్తంతో తడిసిపోయింది. దేవుడి దయతో ప్రాణాలతో బయటపడ్డా. ఈ విషయం మరోసారి నేను పంచుకోలేను. ఎందుకంటే అది చాలా బాధాకరమైన అనుభవం. మాటల్లో చెప్పలేనిది. నాపై క్రూరమైన దాడి జరిగిన తర్వాత మన ఐక్యత మరింత పెరిగింది. మన సంకల్పం, ఉద్దేశం ఏమాత్రం మారలేదు. అమెరికాను మరోసారి గెలిపించాలి. అమెరికాను మళ్లీ సురక్షితమైన, స్వేచ్ఛాయుతమైన గొప్పదేశంగా మార్చాలి. మనం ఒకే దేశం బిడ్డలం. రాజకీయపరమైన అంశాలు మన మధ్య విభజన రేఖలు గీయకూడదు.ఈ ఎన్నికలు అత్యంత కీలకం యావత్తూ దేశానికి ఒక దార్శనికతను నిర్దేశించడానికి ఇక్కడికి వచ్చా. ఈ సందర్భంగా దేశంలో ప్రతి పౌరుడికీ స్నేహ హస్తం అందిస్తున్నా. వారికి విధేయత ప్రకటిస్తున్నా. ప్రపంచం ఎన్నడూ చూడని విధంగా అమెరికాను నూతన శిఖరాల వైపు నడిపిద్దాం. నా నాయకత్వంలో అమెరికా మళ్లీ గౌరవం పొందుతున్న విశ్వాసం ఉంది. మన బల సంపన్నతను ఏ దేశమూ ప్రశ్నించలేదు. మన శక్తి సామర్థ్యాలను ఏ శత్రువూ అనుమానించలేరు. మన సరిహద్దులు భద్రంగా ఉంటాయి. మన ఆర్థిక వ్యవస్థ ఉజ్వలంగా మారుతుంది. మన భవిష్యత్తు లక్ష్యాలను చేరుకోవాలంటే విఫలమైన నాయకత్వం నుంచి దేశాన్ని తొలుత రక్షించుకోవాలి. అమెరికా చరిత్రలో ఈ ఎన్నికలు అత్యంత కీలకం. శత్రుదుర్భేద్యంగా మారుస్తాఅక్రమ వలసలు అమెరికాకు పెద్ద సమస్యగా మారాయి. దక్షిణ సరిహద్దు నుంచి పోటెత్తుతున్న వలసలు, చొరబాట్లు దేశమంతటా కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. అక్రమ వలసల కారణంగా నేరాలు, పేదరికం, వ్యాధులు, విధ్వంసం పెరుగుతున్నాయి. ప్రపంచమంతటా ఇలాంటి వలసల సంక్షోభం కనిపిస్తోంది. మరోవైపు యూరప్, మధ్యప్రాచ్యంలో యుద్ధాలు కొనసాగుతున్నాయి. తైవాన్, కొరియా, ఫిలిప్పైన్స్‌లో యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. కేవలం ఆసియా ఖండమే కాదు, మొత్తం భూగోళం నేడు మూడో ప్రపంచ యుద్ధం అనే అంచుపై ఉందని చెప్పక తప్పదు. ఈ పరిస్థితి మారాలన్నదే నా ఆశ. తైవాన్ను చైనా చుట్టుముడుతోంది. అమెరికా సమీపంలో రష్యా యుద్ధ నౌకలు, అణు జలాంతర్గాములు చెక్కర్లు కొడుతున్నారు. ఈ విషయాలు ప్రస్తావించేందుకు మీడియా ఇష్టపడడం లేదు. నేను అధికారం చేపట్టిన తర్వాత మన భూభాగాలను శత్రు దుర్భేద్యంగా మారుస్తా.మార్పునకు సమయమిదే అమెరికాలో మార్పునకు సమయం ఆసన్నమైంది. ఇప్పుడున్న పరిపాలనను మరో నాలుగేళ్లు మనం భరించలేం. అందుకే మార్పునకు పట్టం కట్టాలి. అమెరికా పౌరుల ఎదుట ఈ క్షణాన ప్రతిజ్ఞ చేస్తున్నా. ద్రవ్యోల్బణ సంక్షోభాన్ని అంతం చేస్తా. వడ్డీ రేట్లను తగ్గిస్తా. మన సరిహద్దును మూసివేస్తా. గోడ నిర్మాణం పూర్తిచేస్తా. అక్రమ వలసలకు పూర్తిగా అడ్డుకట్ట వేస్తా. ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ఇజ్రాయెల్–హమాస్ యుద్ధానికి శుభం కార్డు వేసేస్తాం. నేను అధికారంలో ఉండి ఉంటే ఈ యుద్ధాలు అసలు జరిగేవే కాదు. నవంబర్ 5న జరిగే ఎన్నికల్లో నా విజయానికి సహరించాలని అందరినీ సవినయంగా కోరుతున్నా. మిమ్మల్ని తలెత్తుకొనేలా, గర్వపడేలా చేయడమే నా ధ్యేయం. -
అమెరికా ఉపాధ్యక్ష అభ్యర్థి.. మన తెలుగింటి అల్లుడే! ఎవరీ ఉషా చిలుకూరి (ఫొటోలు)
-
USA Presidential Elections 2024: ట్రంప్‌పై హత్యాయత్నం
పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తుండగా దుండగుడు కాల్పులకు తెగబడటంతో ట్రంప్ తల వెనుకగా దూసుకెళ్తున్న తూటా. ఆయనపై మొత్తం నాలుగైదు రౌండ్లకు పైగా కాల్పులు జరిగాయి.షికాగో/వాషింగ్టన్: అమెరికా చరిత్రపై మరో రక్తపు మరక. ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (78)పై హత్యా యత్నం జరిగింది. నవంబర్‌లో జరగనున్న ఎన్నికల్లో గెలిచి మరోసారి అధ్యక్ష పదవి చేపట్టేందుకు రిపబ్లికన్ల అభ్యరి్థగా సర్వశక్తులూ ఒడ్డుతున్న ఆయన ఈ ప్రాణాంతక దాడి నుంచి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం పెన్సిల్వేనియాలోని బట్లర్ టౌన్లో ఔట్‌డోర్ ఎన్నికల ర్యాలీలో ఉండగా ఈ ఘోరం జరిగింది. భారీగా హాజరైన మద్దతుదారులు, అభిమానులను ఉద్దేశించి సాయంత్రం ఆరు గంటలకు ట్రంప్ ప్రసంగం మొదలు పెట్టారు. అప్పటికే సమీప గోడౌన్‌పై నక్కిన ఓ దుండగుడు ఏఆర్ శ్రేణి ఆటోమేటిక్ అసాల్ట్ రైఫిల్‌తో ట్రంప్‌పైకి కనీసం ఐదు రౌండ్లకు పైగా కాల్పులు జరిపాడు. దాంతో ఒక్కసారిగా గందరగోళం చెలరేగింది. అరుపులు, కేకలు, ఆక్రందనలు, పారిపోతున్న జనాలతో పరిస్థితి గందరగోళంగా మారింది. ఒక తూటా ట్రంప్ కుడి చెవి పై భాగాన్ని గాయపరిచింది. మరిన్ని తూటాలు ఆయన తలకు అతి సమీపం నుంచి దూసుకెళ్లాయి. ట్రంప్ బాధతో తన చెవిని చేత్తో పట్టుకుంటూనే తూటాల నుంచి తప్పించుకునేందుకు వెంటనే డయాస్ కిందకు వంగారు. ఆలోపే సీక్రెట్ సరీ్వస్ సిబ్బంది టంప్ర్ను చుట్టుముట్టి రక్షణ కవచంలా నిలిచారు. చెవి నుంచి కుడి చెంప మీదుగా రక్తమోడుతున్న ట్రంప్‌ను హుటాహుటిన వేదిక నుంచి తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టి సురక్షితంగా తరలించారు. వేదికను వీడుతూ ట్రంప్ పిడికిలి బిగించి పైకెత్తి, సభికులనుద్దేశించి ‘ఫైట్’ అని పదేపదే భావోద్వేగంతో బిగ్గరగా నినాదాలు చేశారు. వారు కూడా తమ నేతకు మద్దతుగా ఫైట్ అంటూ పెద్దపెట్టున ప్రతి నినాదాలు చేశారు. అక్కణ్నుంచి ట్రంప్‌ను హుటాహుటిన పిట్స్బర్గ్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కారెక్కే ముందు కూడా ట్రంప్ మరోసారి పిడికిలి బిగించి నినాదాలు చేశారు. ఈ మొత్తం ఉదంతానికి సంబంధించిన వీడియో ప్రపంచమంతటా వైరలవుతోంది. ట్రంప్ క్షేమంగా ఉన్నట్టు అనంతరం ఆయన ప్రచార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. దుండగుని కాల్పుల్లో సభికుల్లో ఒకరు దుర్మరణం పాలయ్యారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమీప భవనాలపై మోహరించి ఉన్న సీక్రెట్ సరీ్వస్ స్నైపర్లు తక్షణం స్పందించి దుండగున్ని కాల్చి చంపారు. అతన్ని 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకునిగా గుర్తించారు. అతను కాల్పులకు తెగబడేందుకు కారణం తెలియాల్సి ఉంది. అమెరికా వంటి అగ్ర రాజ్యంలో మాజీ అధ్యక్షుని స్థాయి నేతపై ఇంత సమీపం నుంచి కాల్పులు జరగడం ఘోర భద్రతా వైఫల్యమేనంటున్నారు. ఈ ఘటనపై ఎఫ్‌బీఐ పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతోంది. ట్రంప్‌పై దాడితో ప్రపంచం నివ్వెరపోయింది. హత్యా యత్నాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ప్రధాని నరేంద్ర మోదీతో సహా దేశాధినేతలంతా ఈ ఘటనను ఖండించారు.దేవుడే కాపాడాడు: ట్రంప్ ప్రాణాంతక దాడి నుంచి తనను భగవంతుడే రక్షించాడని ట్రంప్ అన్నారు. కాల్పుల ఘటనపై తన సొంత సోషల్ మీడియా ‘ట్రూత్’లో ఆయన స్పందించారు. కాల్పుల్లో మరణించిన, గాయపడ్డ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ‘‘నిర్భయంగా ముందుకెళ్దాం. ఈ సమయంలో అమెరికన్లమంతా మరింత సమైక్యంగా నిలబడాల్సిన అవసరముంది. అమెరికన్లుగా మన వ్యక్తిత్వాన్ని చాటాల్సిన, దుష్టశక్తి గెలవకుండా అడ్డుకోవాల్సిన సమయమిది. మిమ్మలి్న, మన దేశాన్ని నేను త్రికరణశుద్ధిగా ప్రేమిస్తున్నా. త్వరలో విస్కాన్సిన్ సభ ద్వారా మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’’ అని రిపబ్లికన్ పార్టీ మూడు రోజుల సదస్సును ఉద్దేశించి అన్నారు. ఈ సదస్సులో అధ్యక్ష అభ్యరి్థని అధికారికంగా ప్రకటించనుండటం తెలిసిందే.120 మీటర్ల నుంచే కాల్పులు ట్రంప్‌పై కాల్పుల ఘటనపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. కేవలం 120 నుంచి 150 మీటర్ల దూరం నుంచి కాల్పులు జరిగినట్టు ప్రాథమికంగా తేలింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయంలో ఉండే అమెరికా మాజీ అధ్యక్షునిపైకి ఇంత సమీపం నుంచి కాల్పులు జరపడం నమ్మకశ్యం కాని విషయమని ఎఫ్‌బీఐ స్పెషల్ ఏజెంట్ కెవిన్ రోజెక్ అన్నారు. అంతమంది భద్రతా సిబ్బంది రక్షణలో ఉన్న ట్రంప్‌పైకి దుండగుడు అన్ని రౌండ్ల పాటు కాల్పులు జరపగలగడం వింతగా ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘దుండగుడు అంత సమీపానికి ఎలా రాగలిగాడు, ఎవరు సహకరించారు వంటి కోణాల్లోనూ దర్యాప్తు జరుగుతుంది’’ అని చెప్పారు.దుండగుడు రిపబ్లికన్ ఓటరే ట్రంప్‌పై కాల్పులకు తెగబడ్డ థామస్ మాథ్యూ క్రూక్స్ రిపబ్లికన్ పార్టీ ఓటరుగా నమోదు చేసుకున్నట్టు తేలడం విశేషం. అయితే 2021లో డెమొక్రటిక్ పార్టీ అనుబంధ విభాగానికి 15 డాలర్ల విరాళం ఇచి్చనట్టు కూడా వెల్లడైంది. కొద్ది రోజుల ముందే ట్రంప్‌ను ద్వేషిస్తూ, రిపబ్లికన్ పార్టీని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడట. క్రూక్స్ది పెన్సిల్వేనియాలో పిట్స్బర్గ్ శివార్లలోని బెథెల్ పార్క్ అని తేలింది. బతికుంటే ఈ నవంబర్‌లో అతను తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునేవాడు. మృతదేహం వద్ద గుర్తింపు కార్డుల వంటివేవీ లభించకపోవడంతో అతన్ని గుర్తించడం ఏజెంట్లకు కష్టంగా మారింది. దాంతో చివరికి డీఎన్ఏ పరీక్ష చేసి గుర్తించారు.దుండగుని ముందస్తు ఏర్పాట్లు! ట్రంప్‌పై కాల్పులకు తెగబడేందుకు దుండగుడు ముందుగానే పక్కాగా ఏర్పాట్లు చేసుకున్నట్టు భావిస్తున్నారు. దాడికి పాల్పడ్డ గోడౌన్ వంటి భవనం ర్యాలీకి అతి సమీపంలో ఉంది. దానిపైకి చేరుకునేందుకు ఒక నిచ్చెన కూడా ఏర్పాటు చేసి ఉంది. అతని మృతదేహం పక్కన పలు రకాలైన ప్యాకేజీలను పోలీసులు గుర్తించారు. వాటిలో పేలుడు పదార్థాలు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. భీతావహంగా ఘటనా స్థలి ట్రంప్‌పై హత్యా యత్నం జరిగిన బట్లర్ కేవలం 13 వేల జనాభా ఉండే చిన్న పట్టణం. పశి్చమ పెన్సిల్వేనియాలో పిట్స్బర్గ్కు 33 మైళ్ల దూరంలో ఉంటుంది. ఆరుబయట మైదాన ప్రదేశంలో ర్యాలీ జరిగింది. తన మార్కు ఎర్ర టోపీ, నల్ల సూటులో ట్రంప్ వేదికపైకి చేరుకుని ప్రసంగం మొదలు పెట్టారు. అమెరికాలోకి అక్రమ వలసలు పెరిగిపోయాయంటూ చార్ట్ సాయంతో వివరిస్తుండగా కాల్పులు మొదలయ్యాయి. దాంతో అంతా ప్రాణభయంతో కేకలు వేశారు. తూటాలను తప్పించుకునేందుకు నేలపై పడుకుండిపోయారు. ఆ ప్రదేశమంతా భీతావహంగా మారింది. ట్రంప్‌ను సురక్షితంగా తరలించాక కూడా చాలాసేపటిదాకా జనం నేలపై పడుకునే కని్పంచారు. అనంతరం భద్రతా సిబ్బంది రంగప్రవేశం చేసి ర్యాలీ వేదికను అదుపులోకి తీసుకున్నారు.ముందే చూసిన జనం...! ట్రంప్‌పై కాల్పులకు దిగిన దుండగుడు క్రూక్స్‌ను తాము ముందే చూసినట్టు సభికుల్లో పలువురు వెల్లడించారు. అతడు గోడౌన్‌పై నెమ్మదిగా కదులుతూ ట్రంప్‌కు వీలైనంత సమీపంగా వచి్చనట్టు ఇద్దరు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కాల్పులకు ముందే క్రూక్స్ చేతిలో తుపాకీని స్పష్టంగా చూసినట్టు మరో ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. ‘‘దేవుడా! అతని చేతిలో తుపాకీ ఉందంటూ అరిచా. అంతలోనే కాల్పులకు తెగబడటంతో వెంటనే నేలపై పడుకుని తలెత్తి చూశా. ఏజెంట్ల తూటాలకు అతని తల పేలిపోవడాన్ని కళ్లారా చూశా’’ అని చెప్పుకొచ్చాడు. పెరిగిన ట్రంప్ విజయావకాశాలు! అధ్యక్ష ఎన్నికల రేసులో ఇప్పటికే దూసుకుపోతున్న ట్రంప్ విజయావకాశాలు కాల్పుల ఉదంతం నేపథ్యంలో మరింతగా పెరిగినట్టు చెబుతున్నారు. ఆయన విజయావకాశాలు గత 24 గంటల్లోనే 8 శాతం పెరిగి ఏకంగా 70 శాతానికి చేరినట్టు రాజకీయ అంచనాల వేదిక పాలీమార్కెట్ పేర్కొంది. అంతటి ప్రాణాపాయ పరిస్థితిలోనూ ట్రంప్ అత్యంత వీరోచితంగా వ్యవహరించారంటూ అన్నివైపుల నుంచీ ప్రశంసల వర్షం కురుస్తోంది. ‘‘తల పక్కనుంచి తూటాలు దూసుకెళ్లాయి. ఒకటి చెవిని ఛిద్రం చేసింది. అయినా ట్రంప్ అస్సలు భయపడలేదు. ప్రాణాలు కాపాడుకోవడానికి మోకాళ్లపై పాక్కుంటూ పోవడం వంటివేవీ చేయలేదు. ఏ మాత్రం వెరవకుండా తిరిగి లేచి నుంచున్నారు. భద్రతా సిబ్బందిని నిలువరించి మరీ పిడికిలి బిగించి పోరాట నినాదాలు చేశారు’’ అంటూ పలువురు మద్దతుదారులు ప్రశంసిస్తున్నారు.ట్రంప్‌తో మాట్లాడిన బైడెన్ హత్యా యత్నంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ విస్మయం వెలిబుచ్చారు. ఈ దారుణ ఘటనను అంతా తీవ్రంగా ఖండించాల్సిన అవసరముందన్నారు. ట్రంప్ క్షేమంగా ఉండటం పట్ల హర్షం వెలిబుచ్చారు. ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. అనంతరం బైడెన్ ప్రజలనుద్దేశించి కూడా మాట్లాడారు. ఇలాంటి హింసకు అమెరికాలో తావు లేదన్నారు. షెడ్యూల్ ప్రకారం వారాంతాన్ని గడిపేందుకు బైడెన్ డెలావెర్ వెళ్లాల్సి ఉన్నా పర్యటన రద్దు చేసుకుని వైట్‌హౌస్‌కు తిరిగొచ్చారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో పాటు మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, బిల్ క్లింటన్, జార్జి బుష్, డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీ నేతలు తదితరులు కూడా దాడిని తీవ్రంగా ఖండించారు.మోదీ ఖండన ట్రంప్‌పై హత్యా యత్రాన్ని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో హింసకు తావు లేదని స్పష్టం చేశారు. ‘‘నా మిత్రుడు ట్రంప్‌పై దాడి పట్ల తీవ్రంగా ఆందోళన చెందా. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’’ అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దేశాధినేతలు మాక్రాన్ (ఫ్రాన్స్), స్టార్మర్ (బ్రిటన్), ఆల్బనీస్ (ఆస్ట్రేలియా), మెలోనీ (ఇటలీ), కిషిడా (జపాన్), ట్రూడో (కెనడా), జెలెన్స్కీ (ఉక్రెయిన్), నెతన్యాహూ (ఇజ్రాయెల్) తదితరులు కూడా దాడిని తీవ్రంగా ఖండించారు.ఎప్పుడు ఏమి జరిగిందంటేఅమెరికా స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఆరింటికి ర్యాలీని ఉద్దేశించి ట్రంప్ ప్రసంగం మొదలైంది. తర్వాతేం జరిగిందంటే... 6:11:33 – ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. ఒక తూటా కుడి చెవికి తాకడంతో బాధతో ముఖాన్ని తడుముకున్నారు 6:11:35 – తూటాల నుంచి తప్పించుకునేందుకు డయాస్ కిందికి వంగారు. ‘గెట్ డౌన్’ అని అరుస్తూ భద్రతా సిబ్బంది పోడియంపైకి దూసుకొచ్చారు. రక్షణ కవచంలా ట్రంప్‌ను చుట్టుముట్టారు. అంతలో మరిన్ని తూటాలు దూసుకొచ్చాయి. 6:11:41 – ‘ఏం చేస్తున్నాం మనం? ఏం జరుగుతోంది?’ అంటూ మహిళా ఏజెంట్ కేకలు. జనం కేకలు, అరుపులు. అంతటా గందరగోళం 6:11:50 – మళ్లీ కాల్పుల చప్పుడు. ఒక మహిళ ఆక్రందన 6:11:58 – ‘‘స్పేర్ (కారు) దగ్గరికి కదలండి’’ అంటూ ట్రంప్ భద్రతా ఏజెంట్ల పరస్పర హెచ్చరికలు 6:12:06 – ‘హాక్ఐ (కౌంటర్ అటాక్ టీం) వచ్చేసింది, కారు వైపు వెళ్దాం’ అన్న భద్రతా సిబ్బంది6:12:09 – సిద్ధంగా ఉండాలంటూ కార్లోని సిబ్బందికి సూచనలు6:12:21 – షూటర్ చనిపోయాడని నిర్ధారించుకున్న ట్రంప్ భద్రతా సిబ్బంది6:12:22 – కారువైపు కదిలేందుకు సేఫేనా అంటూ ఏజెంట్ల ఆరా6:12:23 – ‘అంతా సేఫ్, కారువైపు పదండి’ అన్న మరో ఏజెంట్. ట్రంప్‌ను పైకి లేపిన సిబ్బంది.6:12:35 – అంతా ఓకే అని ట్రంప్‌కు చెప్పిన ఏజెంట్లు6:12:36 – తన షూ వేసుకోనివ్వాలన్న ట్రంప్6:12:37 – ‘ఆగండి సర్. మీ తలంతా రక్తం’ అని ట్రంప్‌తో ఓ ఏజెంట్6:12:39 – ‘సర్, మనం కారువైపు కదలాలి’ అన్న మరో ఏజెంట్ 6:12:47 – ‘ఆగండి, ఆగండి’ అంటూ భద్రతా సిబ్బందిని నిలువరించిన ట్రంప్. జనంకేసి చూస్తూ పిడికిలి బిగించి ‘ఫైట్’ అంటూ బిగ్గరగా నినాదాలు. అంతే బిగ్గరగా బదులిచి్చన జనం 6:12:54 – ‘మనమిక వెళ్లాలి’ అంటూ ట్రంప్‌ను కారుకేసి తీసుకెళ్లిన భద్రతా సిబ్బంది. మరోసారి నినాదాలు చేస్తూ కార్లో కూర్చున్న ట్రంప్జుయ్మంటూ తూటాలు దూసుకెళ్తున్న శబ్దాలు స్పష్టంగా విని్పంచాయి. ఏదో జరుగుతోందని అనుకునేంతలో ఓ తూటా నా కుడి చెవి పై భాగాన్ని ఛిద్రం చేసింది. చర్మం తెగిపోయింది. విపరీతంగా రక్తం కారింది. ఏం జరుగుతోందో అప్పటికి నాకర్థమైంది. అమెరికా వంటి దేశంలో ఇలాంటి చర్య జరగడం అనూహ్యం. గాడ్ బ్లెస్ అమెరికా– తనపై కాల్పులను ఉద్దేశించి సొంత సోషల్ మీడియా ‘ట్రూత్’లో డొనాల్డ్ ట్రంప్ -
USA Presidential Elections 2024: తప్పుకోవాలంటూ బైడెన్‌పై ఒత్తిళ్లు
వాషింగ్టన్: అట్లాంటాలో టీవీలో ముఖాముఖి చర్చలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ధాటికి చేతులెత్తేసిన డెమొక్రటిక్ అభ్యర్థి, అధ్యక్షుడు జో బైడెన్‌పై సొంత పారీ్టలోనే వ్యతిరేకత ఎక్కువవుతోంది. 81 ఏళ్ల వయసున్న ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆయన మాత్రం తాను తప్పుకునే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు! ట్రంప్‌తో చర్చలో బైడెన్ పేలవ ప్రదర్శనను పలు మీడియా సంస్థలు సంపాదకీయాల్లో ఏకిపారేశాయి. సోషల్ మీడియాలో మీమ్స్‌కు కొదువే లేదు. ఈ విమర్శలపై బైడెన్ స్పందించారు. ‘‘బరాక్ ఒబామా మాదిరి ప్రత్యర్థిని నేను వాగ్ధాటితో ఇరుకున పెట్టలేకపోయిన మాట వాస్తవమే. దీనిపై నా మద్దతుదారులు, పారీ్టలోనూ కొంత అసంతృప్తి నెలకొందని తెలుసు. కానీ ట్రంప్‌పై మరింతగా పోరాడతా’ అని అన్నారు. డెమొక్రటిక్ ముఖ్యుల్లో పెరిగిన అసంతృప్తి ట్రంప్‌తో డిబేట్ తర్వాత బైడెన్ అభ్యరి్థత్వంపై చాలా మంది డెమొక్రటిక్ నేషనల్ కమిటీ(డీఎన్సీ) సభ్యుల్లో అసమ్మతి పెరిగింది. యువనేతకు అవకాశమిశ్వాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. షికాగోలో ఆగస్ట్ 19న జరిగే డెలిగేట్ల భేటీలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాల కథనం. -
Presidential Debate: ట్రంప్ జోరు బైడెన్ బేజారు
అట్లాంటా: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (78) దూకుడు పెంచారు. దేశాధ్యక్షుడు, డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్‌తో తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్లో స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు. శుక్రవారం (భారత కాలమానం ప్రకారం) సీఎన్ఎన్ చానల్లో దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన వాదనలో బైడెన్ సర్వశక్తులూ ఒడ్డారు. తన వయసుపై విమర్శలు, అధ్యక్ష బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంపై అమెరికన్లలో నానాటికీ పెరుగుతున్న అనుమానాలను కొట్టిపారేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. ట్రంప్ తనకంటే కేవలం మూడేళ్లే చిన్నవాడని పదేపదే చెప్పుకున్నారు. కానీ డిబేట్ పొడవునా బైడెన్ పదేపదే తడబడ్డారు. ప్రసంగం మధ్యలో ఉన్నట్టుండి మౌనాన్ని ఆశ్రయించారు. మాటల కోసం తడుముకున్నారు. తనలో తానే గొణుక్కుంటూ కన్పించారు. మాట్లాడుతున్న అంశాన్ని అర్ధంతరంగా వదిలేసి మరో విషయం ఎత్తుకుని ఆశ్చర్యపరిచారు. కొన్నిసార్లు బైడెన్ ఏం చెప్తున్నదీ ఎవరికీ అర్థం కూడా కాలేదు. పలు అంశాలపై ట్రంప్ పచ్చి అబద్ధాలు చెప్పినా వాటిని ఎత్తిచూపడంలో, సొమ్ము చేసుకోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. తనకు అనుకూలమైన గణాంకాలను సమయానుకూలంగా ప్రస్తావించడంలో కూడా చతికిలపడ్డారు. డిబేట్లో ట్రంపే నెగ్గారని సీఎన్ఎన్ పోలింగ్‌లో ఏకంగా 67 శాతం మంది ఓటర్లు పేర్కొన్నారు. బైడెన్‌కు 33 శాతం ఓట్లే లభించాయి. న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రఖ్యాత వార్తా పత్రికలు కూడా తొలి డిబేట్ ట్రంప్‌దేనని పేర్కొన్నాయి. ‘‘బైడెన్‌పై వయోభారం కొట్టొచ్చినట్టు కని్పస్తోంది. ఆయన మాటతీరులోనూ అది స్పష్టంగా ప్రతిఫలించింది. ఆయన చెబుతున్న విషయాల్లో పొందికే లేకుండా పోయింది’’ అంటూ విమర్శలు గుప్పించాయి. దూకుడుకు మారుపేరైన ట్రంప్‌కు 81 ఏళ్ల బైడెన్ ఏ మేరకు పోటీ ఇవ్వగలరోనంటూ డెమొక్రాట్లలో ఇప్పటికే గట్టిగా ఉన్న అనుమానాలు కాస్తా తాజా డిబేట్ నేపథ్యంలో ఆందోళనగా మారాయి. వాదనలో బైడెన్ తొలుత కాస్త వెనకబడ్డారని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా అంగీకరించారు. అయితే క్రమంగా పుంజుకుని సమర్థంగా ముగించారని చెప్పుకొచ్చారు. బైడెన్ భార్య జిల్ మాత్రం తన భర్త భలే బాగా మాట్లాడారంటూ ప్రశంసించారు! ‘‘ప్రతి ప్రశ్నకూ చక్కగా బదులిచ్చావు. అన్ని సమాధానాలూ తెలుసు నీకు!’’ అంటూ ఆయన్ను మెచ్చుకున్నారు. కానీ ఈ డిబేట్ నేపథ్యంలో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలంటున్న వారి సంఖ్య డెమొక్రాట్లలో క్రమంగా పెరుగుతోంది. ట్రంప్, బైడెన్‌లను అధ్యక్ష అభ్యర్థులుగా ఇంకా లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. జూలై 15–18 మధ్య జరిగే సదస్సులో రిపబ్లికన్లు, ఆగస్టు 19న సదస్సులో డెమొక్రాట్లు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. పరస్పర విమర్శల వర్షం... అమెరికా ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ చట్టం, విదేశీ వ్యవహారాలు, వలసల వంటి పలు అంశాలపై ట్రంప్, బైడెన్ మధ్య వాడివేడి వాదనలు సాగాయి. ఆ క్రమంలో నేతలిద్దరూ తిట్ల పర్వానికి దిగారు. ‘‘నువ్వే అబద్ధాలకోరు. అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త ప్రెసిడెంట్ కూడా నువ్వే’’ అంటూ పరస్పరం దుయ్యబట్టుకున్నారు. పలు రకాల విమర్శలు చేసుకున్నారు. హష్ మనీ కేసు దోషి అంటూ ట్రంప్‌కు బైడెన్ చురకలు వేశారు. ‘‘జరిమానాలుగా నువ్వు ఎన్ని బిలియన్ డాలర్లు కట్టాలో గుర్తుందా? భార్య గర్భవతిగా ఉండగా నీలి చిత్రాల తారతో గడిపావు. నైతికత విషయంలో వీధుల్లో విచ్చలవిడిగా తిరిగే పిల్లి కంటే కూడా హీనం’’ అంటూ విమర్శల వర్షం కురిపించారు. బైడెన్‌తో పాటు ఆయన కుమారుడు హంటర్ కూడా క్రిమినలేనంటూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా విరుచుకుపడ్డారు. అస్తవ్యస్తమైన వలసల విధానంతో దేశ భవితవ్యాన్నే బైడెన్ ప్రమాదంలోకి నెట్టారంటూ దుయ్యబట్టారు. డిబేట్ ఆరంభం నుంచే ట్రంప్ పై చేయి కనబరిచారు. ఆయనను ఇరుకున పెట్టేందుకు బైడెన్ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. -
USA Presidential Elections 2024: బైడెన్, ట్రంప్ రె‘ఢీ’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇరు పారీ్టల అభ్యర్థులు వాదనలతో ఎదురెదురుగా బలాబలాలు తేల్చుకునే ‘చర్చల’ అంకానికి డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెరలేపారు. సీఎన్ఎన్ టీవీ ఛానల్లో జూన్ 27వ తేదీన, ఏబీసీ ఛానల్లో సెప్టెంబర్ పదో తేదీన ఈ డిబేట్లు ఉంటాయి. మూడు దశాబ్దాలుగా డిబేట్లు నిర్వహించే ‘కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్’ను కాదని ఈసారి మీడియాసంస్థల ఆధ్వర్యంలో టీవీ ఛానళ్లలో డిబేట్‌కు బైడెన్ ప్రచార బృందం ఓకే చెప్పింది. ‘‘అట్లాంటా స్టూడియోలో ఈ డిబేట్‌ను నిర్వహిస్తాం’ అని సీఎన్ఎన్ తెలిపింది. జనం మధ్యలో డిబేట్ జరిపితే బాగుంటుందని ట్రంప్ అన్నారు. -
అధ్యక్ష రేసులో ట్రంప్ తొలి విజయం
వాషింగ్టన్: అధ్యక్ష రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ తొలి విజయాన్ని అందుకున్నారు. అయోవాలో సోమవారం జరిగిన పోలింగ్‌లో ట్రంప్ మెజారిటీ ఓట్లను సాధించారు. దీంతో రిపబ్లికన్ పార్టీ రెండో అభ్యర్థి స్థానం కోసం నిక్కీ హైలీ, ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్‌ల మధ్య పోటీ నెలకొంది. తొలి పోలింగ్‌లోనే ట్రంప్ ఘన విజయంతో.. రిపబ్లికన్ పార్టీపై ఆయన ఏ మాత్రం పట్టు కోల్పోలేదని స్పష్టమవుతోంది. రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు కొన్ని నెలల పాటు ప్రైమరీ ఎన్నికలు జరగనున్నాయి. అయోవాలో నిన్న జరిగిన పోలింగ్.. రిపబ్లికన్ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియలో మొదటిది ఎన్నిక. తీవ్ర స్థాయిలో మంచు కురుస్తున్నప్పటికీ ఈ ఎన్నికల్లో భారీ స్థాయిలో ప్రజలు పాల్గొన్నారు. అయోవాలో విజయం పట్ల విశ్వాసం వ్యక్తం చేసిన ట్రంప్‌కు ఈ ఫలితం శుభసూచకంగా మారింది. అమెరికా అధ్యక్షున్ని ఎన్నికునే ప్రక్రియలో అయోవాకు రెండు శాతం కంటే తక్కువ ఓటింగ్ ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో జరిగే ఓటింగ్‌పైనే పూర్తి విజయం ఆధారపడి ఉంటుంది. న్యూ హాంప్‌షైర్, నెవాడా, సౌత్ కరోలినాలో ట్రంప్‌కు విజయం తప్పకుండా అవసరమైతుంది. ప్రైమరీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ట్రంప్‌పై కొలరాడో, మైన్ రాష్ట్రాలు ఆయనను నిషేధించాయి. దీనిపై ఆయన అమెరికా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి ట్రంప్ పోటీ పడుతుండటం వరుసగా ఇది మూడోసారి. ఇదీ చదవండి: పుతిన్, మోదీ కీలక చర్చలు.. రష్యాకు విషెస్ చెప్పిన ప్రధాని -
US Elections: వివేక్ రామస్వామి కీలక నిర్ణయం
న్యూయార్క్: అమెరికా అధ్యక్ష పదవికి పోటీ చేసే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకునే ప్రక్రియ వచ్చే నెల ప్రారంభం కానుంది. జనవరిలో అయోవా (iowa) రాష్ట్రంలో తొలి బ్యాలెట్ జరగనుంది. అయితే అయోవా ఓటింగ్‌కు మరికొద్ది రోజులే మిగిలి ఉండగా అధ్యక్ష పదవి అభ్యర్థిత్వానికి పోటీపడుతున్న భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘ఎన్నికల ప్రచారంలో ఇక నుంచి టీవీ చానళ్లకు ప్రకటనలు ఇవ్వకూడదని నిర్ణయించాం. అలాగని మొత్తం ప్రకటనల బడ్జెట్‌ను తగ్గించ లేదు. సంప్రదాయ టీవీ కాకుండా వేరే మార్గాల్లో ఓటర్లను రీచ్ అవుతాం. టీవీ ప్రకటనలపై ఖర్చు పెడితే పెద్దగా ఉపయోగం ఉండటం లేదు’ అని వివేక్ రామస్వామి క్యాంపెయిన్ మేనేజర్ ట్రిసియా మెక్ లాలిన్ తెలిపారు. అయితే తాను ఇప్పటికే క్యాంపెయినింగ్ కోసం 20 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు రామస్వామి స్వయంగా మీడియాకు తెలిపారు. ఇంత ఖర్చు చేసినప్పటికీ అయోవాలో రామస్వామివైపు రిపబ్లికన్లు పెద్దగా మొగ్గు చూపడం లేదని తెలుస్తోంది. అయోవాలో 10 శాతం రిపబ్లికన్ల ఓట్లు కూడా రామస్వామికి వచ్చే పరిస్థితులు లేవని సమాచారం. ఇక దేశవ్యాప్తంగా కూడా రామస్వామి గ్రాఫ్ రోజురోజుకు పడిపోతున్నట్లు తెలుస్తోంది. కాగా, రిపబ్లికన్ల తరపున ప్రధాని అభ్యర్థిత్వానికి పోటీలో ఉన్న వారిలో మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే హాట్ ఫేవరెట్‌గా దూసుకెళుతుండడం విశేషం. ఇదీచదవండి..భారత్‌లో ఉన్న పౌరులకు ఇజ్రాయెల్ అడ్వైజరీ -
అరబ్ దేశాలపై నిక్కి హేలి ఫైర్
న్యూయార్క్ అరబ్ దేశాలపై రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి నిక్కి హేలి ఫైరయ్యారు. గాజాపై ఇజ్రాయెల్ దాడులను విమర్శిస్తున్న అరబ్ దేశాలు.. పాలస్తీనియన్లను ఎందుకు ఆహ్వానించట్లేదని మండిపడ్డారు. ఇరాన్ న్యూక్లియర్ డీల్‌పై మాజీ అధ్యక్షుడు బరాక్ బామా, జో బైడెన్‌ను విమర్శించారు. హమాస్, హెజ్బొల్లాను పెంచి పోషిస్తున్నారని ఇరాన్‌ను దూషించారు. 'పాలస్తీనా అమాయక ప్రజలను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. కానీ అరబ్ దేశాలు ఏం చేస్తున్నాయి? ఖతార్, లెబనాన్, జోర్డాన్, ఈజిప్టు దేశాల పాత్ర ఎంటి? ఈజిప్టుకు ఏడాదికి బిలియన్లు కొద్ది అమెరికా డబ్బుల్ని ఇస్తోంది. పాలస్తీనియన్ల కోసం గేట్లు తెరవలేరా..?' అని నిక్కి హేలి అన్నారు. 'పాలస్తీనియన్లు వారికి వద్దు. వారి పక్కనే హమాస్ ఉంచుకోవాలనుకోరు. మరి ఇజ్రాయెల్ ఎందుకు వారిని ఉంచుకుంటుంది? పాలస్తీనియన్లను అరబ్ దేశాలు రక్షించాలనుకోరు. వారిని తమ దేశాల్లో ఉంచుకోవాలనుకోరు. కానీ అమెరికా, ఇజ్రాయెల్‌ను నిందిస్తుంటారు. పశ్చిమాసియా సమస్యలను పరిష్కరించగల సత్తా వారికి ఉంది. కానీ చేయరు. హమాస్‌తో నిత్యం కలిసి పనిచేస్తుంటారు. వారికి నిధులను సమకూరుస్తారు. ఇజ్రాయెల్ దాడులపైనే మాట్లాడుతున్నారు. హమాస్ ఏం చేసిందో మాట్లాడరు. హమాస్ అరాచకాలపై పెదవి విప్పరు.' అని నిక్కి హేలి మండిపడ్డారు. ఇదీ చదవండి ఇజ్రాయెల్ నుంచి స్వదేశానికి మరో 471 మంది.. -
హద్దులు మీరిన చర్చ.. వేళ్లు చూపుతూ..
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీ కోసం జరుగుతున్న రిపబ్లికన్ పార్టీ డిబేట్లో ఇద్దరు భారతీయ మూలాలున్న అభ్యర్థుల మధ్య చర్చ స్థాయిని మించి వాడీవేడిగా సాగింది. సంయమనం కోల్పోయి ఒకరిపై మరొకరు మాటల శస్త్రాలతో దాడికి దిగారు. ఆక్రోశంతో అరుస్తూ.. వేళ్లు చూపారు. అధ్యక్ష ఎన్నికలో ప్రాథమిక చర్చ సందర్భంగా భారతీయ సంతతికి చెందిన ఇద్దరు వ్యక్తులు ముఖాముఖిగా రావడం ఇదే ప్రథమం. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఇద్దరు భారతీయ-అమెరికన్ ఆశావహులు రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష స్థానం కోసం పోటీ పడ్డారు. విదేశాంగ విధాన సమస్యలపై జరిగిన రిపబ్లికన్ పార్టీ ప్రైమరీ డిబేట్లో మాటల శస్త్రాలతో హద్దులు మీరారు. ఉక్రెయన్, రష్యా యుద్ధం అంశంపై చర్చ తారాస్థాయికి చేరింది. అమెరికా అనుసరిస్తున్న విధానాలపై ఇద్దరు అభ్యర్థులు విభేదించుకున్నారు. ఉక్రెయిన్ పట్ల అమెరికా అనుసరిస్తున్న విధానంపై రామస్వామికి సరైన అవగాహన లేదని నిక్కి హేలీ ఆరోపించారు. అమెరికా భద్రతకు ఇలాంటి అభ్యర్థులతో ముప్పు అని దుయ్యబట్టారు. అమెరికా శత్రువులకు మద్దతు పలుకుతున్నారని అన్నారు. ఉక్రెయిన్ను రష్యాకు అప్పగించాలనేదే వారి అభిప్రాయమా..? అంటూ ప్రశ్నించారు. రష్యా , పుతిన్ పట్ల సానుకూల వైఖరి పనికిరాదని అన్నారు. నిక్కీ హేలి మాట్లాడుతుండగా.. తరుచూ కలుగజేసుకున్న రామస్వామి.. చెప్పేదంతా అబద్ధం అని అన్నారు. నిక్కీ హేలికి విదేశీ విధానాలపై సరైన అవగాహన లేదని అన్నారు. అమెరికా విదేశాలకు కేటాయిస్తున్న మిలిటరీ ఫోర్స్‌ను ఏమాత్రం వినియోగించినా.. దక్షిణ ప్రాంతం నుంచి ఎదురైతున్న తిరుగుబాటును అంతం చేయొచ్చని అన్నారు. ఈ క్రమంలో చర్చ వాడీవేడీగా సాగింది. అరుస్తూ వేళ్లు చూపించుకునే స్థాయికి చేరింది. ఇదీ చదవండి: Wagner Chief Plane Crash Video: అంతా 30 సెకన్లలోనే.. వాగ్నర్ చీఫ్ విమానం పేలుడు.. వీడియో వైరల్ -
డిబేట్లతో పనిలేదు.. ప్రజలకు నేనేంటో తెలుసు.. ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా పూర్తి పదవీకాలం పనిచేసిన తన గురించి దేశ ప్రజలకు పూర్తిగా తెలుసని తాను మళ్ళీ అధ్యక్ష పదవి కోసం అభ్యర్థిత్వాన్ని బలపరచుకోవాల్సిన అవసరసం లేదని అన్నారు మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రాంప్. వచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రధాన అభ్యర్థిగా రేసులో ఉన్న డోనాల్డ్ ట్రంప్ తన అభ్యర్థిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం లేదని ఈసారి జరగబోయే డిబేట్లలో తాను పాల్గొనడం లేదని ప్రకటించారు. రిపబ్లికన్ పార్టీ తరపు అభ్యర్థులు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్లుగా తమను తాము నిరూపించుకోవడానికి డిబేట్లలో పాల్గొనాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా బుధవారం విస్కాన్సిన్లోని మిల్వాకీలో మొదట డిబేట్ జరగనుండగా ఈ డిబేట్ కార్యక్రమానికి ట్రంప్ రావడం లేదని 62 శాతం బలంతో తాను ఎవ్వరికీ అందనంత ఎత్తులో ఉన్నానని అందుకే ఈ డిబేట్లో పాల్గొనడంలేదన్నారు డోనాల్డ్ ట్రాంప్. రిపబ్లికన్ పార్టీ అధ్యక్షుడి రేసులో ట్రంప్ తర్వాత 16 శాతం బలంతో ఫ్లోరిడా గవర్నర్ రోన్ డీసాంటిస్ ఉన్నారు. ఇక భారత సంతతి అభ్యర్థి వివేక్ రామస్వామి సింగిల్ డిజిట్ బలంతో కొనసాగుతున్నారు. గత పర్యాయం ఎన్నికలు ముగిసిన తర్వాత ఫలితాలను తారుమారు చేసే ప్రయత్నం చేసినందుకు ట్రంప్ పై ఇప్పటికే నాలుగు అభియోగాలు నమోదు కాగా అవి ఇంకా విచారణ దశలో ఉన్నాయి. వాటిలో ఏమైనా నిరూపితమైతే ట్రంప్ అభ్యర్థిత్వం ప్రశ్నార్థకమవుతుంది. అప్పటివరకు ఆయన అభ్యర్థిత్వానికి ఎలాంటి ఢోకా లేదు. ఇది కూడా చదవండి: యూపీఐ పేమెంట్స్‌పై జర్మన్ మంత్రి ఫిదా..! -
అమెరికా అధ్యక్షుడి రేసులోని భారతీయ అభ్యర్థికి ఎలాన్ మస్క్ ప్రశంస
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి పదవి కోసం పోటీ పడుతున్న భారతీయ సంతతికి చెందిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వివేక్ రామస్వామి చాలా నమ్మకమైన నాయకుడంటూ 'X' సీఈవో ఎలాన్ మస్క్ తన అఫీషియల్ ఖాతాలో పోస్ట్ చేసారు. త్వరలో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో మొతం ముగ్గురు భారతీయులు రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ పడుతున్నారు. వారిలో వివేక్ రామస్వామి అందరి కంటే చిన్నవారు. ఆయన తోపాటు నిక్కీ హాలే, హిర్ష్ వర్ధన్ సింగ్ అనే మరో ఇద్దరు భారత సంతతి వారు కూడా రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్ధి రేసులో ఉన్నారు. అయితే వీరందరి కంటే మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధ్యక్ష అభ్యర్థిగా రేసులో ముందు వరసలో ఉన్నారు. ఎన్నికల నేపథ్యంలో వివేక్ రామస్వామి అత్యంత దూకుడుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఎదో ఒక కార్యక్రమం ద్వారా ఆయన నిత్యం ప్రజల మధ్యే ఉంటున్నారు. వీలు చిక్కినప్పుడల్లా పలు న్యూస్ చానళ్లకు ఇంటర్వ్యూలిస్తూ తన అభ్యర్థిత్వాన్ని బలపరచుకుంటున్నారు. ఇదిలా ఉండగా టక్కర్ కార్ల్సన్ షోలో పాల్గొన్న వివేక్ ప్రపంచంలోని బడా వ్యాపారవేత్తలు చైనా వెంటపడటాన్ని గుర్తు చేస్తూ వారంతా తిరిగి అమెరికా వెంట నడిచేలా చేస్తానని అన్నారు. He is a very promising candidate https://t.co/bEQU8L21nd — Elon Musk (@elonmusk) August 17, 2023 ప్రఖ్యాత వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ చైనా పర్యటన సందర్బంగా ఆ దేశ విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారు. త్వరలోనే తమ వ్యాపార సామ్రాజ్యాన్ని చైనాలో కూడా విస్తరించడానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంటూ చైనాలో నమ్మకమైన, అనువైన పరిస్థితులున్న కారణంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఆయన తెలిపారు. చైనా పర్యటనలో ఉన్న ఎలాన్ మస్క్ ను ఉద్దేశించి వివేక్ మాట్లాడుతూ చైనా, అమెరికాలు రెండూ అవిభక్త కవలలని వర్ణించారు. వివేక్ రామస్వామి వ్యాఖ్యలకు స్పందిస్తూ ఎలాన్ మస్క్ ఈ ఎన్నికల్లో వివేక్ రామస్వామి నమ్మదగిన అభ్యర్థి అని తన 'X' సోషల్ మీడియా అకౌంట్లో రాశాడు. I’m breaking an unspoken rule in the GOP, but I call it like I see it: it’s deeply concerning that @elonmusk met with China’s foreign minister yesterday to oppose decoupling and referred to the U.S. & Communist China as “conjoined twins.” Tesla’s VP in China reposted that… pic.twitter.com/UD26pweilX — Vivek Ramaswamy (@VivekGRamaswamy) May 31, 2023 ఇది కూడా చదవండి: Malaysia Plane Crash: హైవేపై కుప్పకూలిన విమానం.. వైరల్ వీడియో -
అమెరికా అధ్యక్షుడి రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున మరో భారతీయుడు
వాషింగ్టన్: 2024లో జరగనున్న అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా మరో భారతీయుడు ఎంట్రీ ఇచ్చారు. ఇండో అమెరికన్ ఇంజినీర్ అయిన హిర్ష్ వర్ధన్ సింగ్(38) ఈ మేరకు మూడు నిముషాల నిడివి ఉన్న ఒక వీడియో సందేశం ద్వారా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. హిర్ష్ వర్ధన్ సింగ్ కంటే ముందు రిపబ్లికన్ పార్టీ తరపున సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హాలీ(51), మిలియనీర్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి(37) అమెరికా అధ్యక్ష పదవికి తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగా హిర్ష్ వర్ధన్ సింగ్ ఈ రేసులో నిలిచిన మూడో భారతీయ సంతతి వారిగా నిలిచారు. వీడియో సందేశంలో సింగ్ మాట్లాడుతూ.. నేను జీవితకాలం రిపబ్లికన్ గా ఉంటానని, న్యూ జెర్సీ రిపబ్లికన్ పార్టీ కన్జర్వేటివ్ విభాగాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించిన మొట్టమొదటి అమెరికన్ ను నేనేనన్నారు.. గత కొన్నేళ్లుగా వచ్చిన మార్పులను యధాస్థితికి తీసుకొచ్చి అమెరికా విలువలను కాపాడేందుకు బలమైన నాయకత్వం అవసరముందన్నారు. నాది స్వచ్ఛమైన రక్తం.. కోవిడ్ సమయంలో కూడా ఎటువంటి వ్యాక్సినేషన్ల జోలికి వెళ్ళలేదని.. అందుకే నేను రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష రేసులో నిలవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఈ మేరకు గురువారమే ఫెడరల్ ఎలెక్షన్ కమిషన్ లో తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశారు హిర్ష్ వర్ధన్ సింగ్. హిర్ష్ వర్ధన్ సింగ్ గతంలో న్యూజెర్సీ తరపున 2017,2021లో గవర్నర్ గాను, 2018లో హౌస్ సీటు కోసం, 2020లో సెనేటర్ గాను ప్రయత్నించారు. కానీ రిపబ్లికన్ పార్టీ నామినేషన్ దక్కించుకోవడంలో విఫలమయ్యారు. ఇటీవలి కాలంలో కూడా గవర్నర్ గా క్యాంపెయిన్ చేస్తూ డోనాల్డ్ ట్రంప్ తో పోటీపడ్డారు. కానీ నామినేషన్లలో మూడో స్థానంలో నిలిచారు. మొత్తంగా రిపబ్లికన్ పార్టీ తరపున ఈసారి ముగ్గురు భారత సంతతి వారు అధ్యక్ష పదవి కోసం నామినేషన్లలో పోటీ పడుతున్నారు. ఇదే పార్టీ తరపున అధ్యక్ష పదవికి నామినేషన్ రేసులో డోనాల్డ్ ట్రంప్ మొదటి వరుసలో ఉన్నారు. కానీ ఆయనపై నేర అభియోగాలున్న నేపథ్యంలో తర్వాతి వరుస వారిని అదృష్టం వరించినా వరించొచ్చు. అధ్యక్షుడి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు వచ్చే ఏడాది జులై 15-18 వరకు మిల్వాకీ, విస్కాన్సిన్ లో రిపబ్లికన్లు సమావేశం కానున్నారు. I'm entering the race for President.https://t.co/OEHCSYOdvK pic.twitter.com/RyxW4sKMSW — Hirsh Vardhan Singh (@HirshSingh) July 27, 2023 ఇది కూడా చదవండి: గాల్లో ఆగిపోయిన రోలర్ కోస్టర్.. బిక్కుబిక్కుమంటూ పర్యాటకులు -
వివేక్ రామస్వామికి ఓటు వేయొద్దంటూ మత ప్రచారకుడి ప్రచారం..
వాషింగ్టన్: త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్షఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న వివేక్ రామస్వామి హిందువు అని ఆయనకు ఓటు వేయొద్దంటూ మత ప్రచారకుడు కున్నేమాన్ ప్రసంగం చేసిన వీడియో పెద్ద దుమారాన్నే రేపింది. ఈ నేపథ్యంలో ఇండో అమెరికన్ కాంగ్రెస్ కు చెందిన ఇద్దరు అభ్యర్థులు ఆయనకు మద్దతుగా నిలిచారు. నెబ్రాస్కాలోని నాన్-డినామినేషనల్ లార్డ్ ఆఫ్ హోస్ట్స్ లో పనిచేస్తున్న హాంక్ కున్నేమాన్ ఇటీవల చేసిన ప్రసంగంలో.. రామస్వామి ఒక హిందువు అని ఆయనకు అండగా నిలిచినవారు దేవుని ఆగ్రహానికి గురవుతారని అన్నారు. ఈ వ్యాఖ్యలకు స్పందిస్తూ మతప్రచారకుడు కున్నేమాన్ మతోన్మాద వ్యాఖ్యలు విచారకరమని కాంగ్రెస్‌కు చెందిన రాజా కృష్ణమూర్తి, ఆర్ఓ ఖన్నా తీవ్రంగా ఖండించారు. వీరిద్దరూ కూడా రాజకీయంగా వివేక్ రామస్వామితో ఏకీభవించకపోయినా ఆయనపై కున్నేమాన్ చేసిన వ్యాఖ్యలను మాత్రం తప్పుబట్టారు. ట్విట్టర్ వేదికగా వారి అభిప్రాయాలను వెల్లడించారు. రాజా కృష్ణమూర్తి రాస్తూ.. నేను వివేక్ కృష్ణమూర్తితో రాజకీయంగా ఏకీభవించను కానీ, ఒక్కటి మాత్రం చెప్పాలి అమెరికాలోని అన్ని రాజకీయ పార్టీలు హిందువులతో సహా ఏ మతానికి చెందిన వారినైనా స్వాగతించాలి. రామస్వామిపై చేసిన మతోన్మాద వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రిపబ్లికన్ ప్రతినిధులంతా ఈ సామరస్యాన్ని ఆచరిస్తారని అనుకుంటున్నాను. I don’t agree with @VivekGRamaswamy on much, but one thing is certain: all political parties in America should welcome individuals of all faiths, including Hindus. I condemn the bigoted remarks directed toward Ramaswamy, and I hope that Republican electeds and others do the same. https://t.co/OI9CsOhBlU — Congressman Raja Krishnamoorthi (@CongressmanRaja) July 25, 2023 ఆర్ ఓ ఖన్నా స్పందిస్తూ.. వివేక్ రామస్వామికి నాకూ ఆత్మీయ విభేదాలున్న మాట వాస్తవం. కానీ ఆయన మతవిశ్వాసంపై చేసిన దాడి అసహ్యకరమైనది. అనేక మతాలకు చెందిన వారమైనా మనమంతా ఒక్కటే. అమెరికా రిపబ్లిక్షన్లు చాలా మంది రామస్వామి ఆదర్శాలకు అండగా నిలుస్తున్నారని.. అది వాస్తవమని రాశారు. I have had spirited disagreements with @VivekGRamaswamy. But this is a disgusting and anti-American attack on his faith. We are a nation of many faiths, & the fact that so many Christian American Republicans are willing to support Vivek speaks to that ideal. https://t.co/ebfrvpuIwU — Ro Khanna (@RoKhanna) July 25, 2023 వివాదాస్పదమైన కున్నేమాన్ వీడియో ప్రసంగం.. అందరూ నా మాటలు జాగ్రత్తగా వినండి.. మన సిద్ధాంతాలకు వ్యతిరేకమైన రామస్వామికి మీరు అండగా ఉంటే మీరు దేవుడి ఆగ్రహానికి గురవుతారు. గతంలో కూడా డోనాల్డ్ ట్రంప్ ఇదే విధంగా దేవుడి ఆగ్రహానికి గురై 2020లో పదవిని కోల్పోయారని ఇప్పుడు రామస్వామి విషయంలోనూ అదే జరుగుతుందని అన్నారు. రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ అభ్యర్థి రామస్వామి మాత్రం తన ప్రచార కార్యక్రమాలలో నేను వారి సంప్రదాయానికి చెందకపోయినా వారి విలువలను మాత్రం చాల గౌరవిస్తానని అన్నారు. ఇది కూడా చదవండి: ఎంతకాలం అడుక్కుంటాం.. ముందు చేతిలో చిప్ప విసిరేయాలి -
ప్రతినిధుల సభ స్పీకర్‌గా మెక్‌కార్తీ.. 15వ రౌండ్లో తేలిన ఫలితం
వాషింగ్టన్: అమెరికా కాంగ్రెస్(పార్లమెంట్)లోని ప్రతినిధుల సభ నూతన స్పీకర్‌గా రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి కెవిన్ మెక్‌కార్తీని ఎన్నికయ్యారు. గత మూడు రోజులుగా కొనసాగుతున్న అనిశ్చితికి ముగింపు పలుకుతూ మెక్‌కార్తీకి మద్దతు తెలిపారు నేతలు. రిపబ్లికన్ పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలతో 15 రౌండ్ల హైడ్రామా తర్వాత స్పీకర్‌ను ఎన్నుకున్నారు. ప్రతినిధుల సభ స్పీకర్‌గా ఎన్నికయ్యేందుకు ఈ 57 ఏళ్ల కాలిఫోర్నియన్ నేత మెక్‌కార్తీకి మొదటి రౌండ్లోనే సులభంగా మెజారిటీ రావాల్సింది. కానీ, పార్టీలో అంతర్గతంగా నెలకొన్న విభేదాల కారణంగా కొంత మంది నేతలను ఆయనను వ్యతిరేకిస్తూ వచ్చారు. అమెరికా కాంగ్రెస్ 160 ఏళ్ల చరిత్రలో ఇదే అత్యంత సుదీర్ఘ కాలం సాగిన స్పీకర్ ఎన్నికగా నిలించింది. మెక్‌కార్తీని స్పీకర్‌గా ఎన్నుకునేందుకు రిపబ్లికన్ నేతలు 15 రౌండ్ల ఓటింగ్ వరకు తీసుకెళ్లారు. ఇదీ చదవండి: స్పీకర్ పదవికి పోటీలో డొనాల్డ్ ట్రంప్.. వచ్చింది ఒకే ఒక్క ఓటు -
US midterm elections 2022: లాస్ ఏంజెలిస్ మేయర్‌గా నల్లజాతి మహిళ
లాస్ ఏంజెలిస్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భాగంగా జరిగిన లాస్ ఏంజెలిస్ మేయర్ పదవిని మొట్టమొదటిసారిగా ఒక నల్లజాతి మహిళ కైవసం చేసుకుంది. లాస్ ఏంజెలిస్‌కు ఒక మహిళ మేయర్ కావడం ఇదే తొలిసారి. 40 లక్షల జనాభా ఉన్న లాస్ఏంజెలిస్ను పలు సమస్యలు చుట్టుముట్టిన వేళ రిపబ్లికన్ అభ్యర్థి, కుబేరుడు రిక్ కరుసోపై డెమొక్రటిక్ మహిళా అభ్యర్థి కరీన్ బాస్ దాదాపు 47,000 ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 70 శాతానికిపైగా ఓట్ల లెక్కింపు పూర్తవడంతో కరీన్ బాస్ గెలుపు దాదాపు ఖరారైనట్లే. రెండేళ్లక్రితం అధ్యక్ష ఎన్నికల వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చెందిన ఉపాధ్యక్ష అభ్యర్థుల షార్ట్ లిస్ట్‌లోనూ కరీన్ పేరు ఉండటం గమనార్హం. లాస్ ఏంజెలిస్ మేయర్ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా రిక్ కరుసో ఏకంగా దాదాపు రూ.817 కోట్లకుపైగా ఖర్చుపెట్టినట్లు వార్తలొచ్చాయి. ‘ ఈ ఎన్నికలు మనీకి సంబంధించినవి కాదు. మనుషులకు సంబంధించినవి’ అని ప్రచారం సందర్భంగా కరీన్ బాస్ వ్యాఖ్యానించడం ప్రస్తావనార్హం. -
Donald Trump: సంచలన ప్రకటనకు సిద్ధమైన ట్రంప్
అమెరికా వ్యాపార దిగ్గజం, ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటనకు సిద్ధమయ్యారు. ఈ మేరకు వచ్చే వారం భారీ ప్రకటనే చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. అమెరికా మధ్యంతర ఎన్నికల వేళ.. సోమవారం ఒహియోలో అభిమానుల కోలాహలం నడుమ ఆయన ప్రసంగించారు. ‘‘రేపు అనేది చాలా ముఖ్యమైంది. అందులో కీలకమైంది ఎన్నికలు. దాని నుంచి తప్పుకోకుండా.. అంటూ అసంపూర్తిగా ముగించి.. ఆపై నవంబర్ 15, మంగళవారం, ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లోని మార్-ఎ-లాగోలో చాలా పెద్ద ప్రకటన చేయబోతున్నా’’ అంటూ పేర్కొన్నారు. దీంతో ట్రంప్ ఏం ప్రకటన చేయబోతున్నాడో అనే చర్చ జోరందుకుంది. మరోవైపు 2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైనే ఆయన ప్రకటన చేయబోతున్నారంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. 2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి పాలైన ట్రంప్.. తన ఓటమిని ఏనాడూ అంగీకరించలేదు. అదీగాక.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి తీరతానంటూ గత కొన్నినెలలుగా ధీమా వ్యక్తం చేస్తున్నారు కూడా. ఇదీ చదవండి: చరిత్రలోనే అత్యంత వేడి.. 15వేల మంది మృతి -
అమెరికాలో ప్రారంభమైన ఎలక్టోరల్ ఓటింగ్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలకు సంబంధించి మరో ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 538 మంది ఎలక్టర్లు సోమవారం తమ తమ రాష్ట్రాల రాజధానుల్లో సమావేశమై అధ్యక్ష అభ్యర్థులకు ఓట్లు వేస్తున్నారు. మీడియా కథనాల ప్రకారం తుది సమాచారం అందేవరకు డెమొక్రట్ అభ్యర్థి బైడెన్‌కు 156, ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (రిపబ్లికన్ పార్టీ)కు 106 ఎలక్టోరల్ ఓట్లు వచ్చాయి. మొత్తం బ్యాలెట్లు డిసెంబర్ 23వ తేదీ నాటికి వాషింగ్టన్ చేరుకుంటాయి. జనవరి 6వ తేదీన అమెరికా పార్లమెంటు ఉభయసభలు సంయుక్తంగా సమావేశమై ఆ బ్యాలెట్లను లెక్కిస్తాయి. కొత్త అధ్యక్షుడిగా బైడెన్ ఎన్నిక లాంఛనమే. అమెరికాలో రాష్ట్రాల వారీగా ఎలక్టోరల్ ఓట్లు ఉంటాయన్న విషయం తెలి సిందే. -
ప్రపంచానికి పెద్దన్న: నువ్వా... నేనా..?
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. వైట్‌హౌజ్ లక్ష్యంగా సాగుతున్న రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ల మధ్య విజయం దోబూచులాడుతోంది. ఫలితాల సరళి క్షణక్షణం మారుతూ, అభ్యర్థులు, అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఉత్కంఠకు గురి చేస్తోంది. పోలింగ్ బూత్‌ల్లో మంగళవారం నమోదైన ఓట్ల లెక్కింపు పూర్తయినా.. ఫలితాలను ప్రకటించే అవకాశం కనపించడం లేదు. ఈ సారి పెద్ద సంఖ్యలో నమోదైన ‘మెయిల్ ఇన్(పోస్టల్)’ బ్యాలెట్లను లెక్కించేందుకు కొన్ని రాష్ట్రాల్లో మరింత సమయం పట్టనుండటమే అందుకు కారణం. కౌంటింగ్ కొనసాగుతుండగానే, కీలక రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడకముందే, విజయం సాధించేశానని ట్రంప్ ప్రకటించారు. మరోవైపు, కౌంటింగ్‌లో అక్రమాలు జరుగుతున్నాయని, కౌంటింగ్‌ను నిలిపేసేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని హెచ్చరించారు. జో బైడెన్ కూడా విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. మొత్తం 538 ఎలక్టోరల్ ఓట్లలో విజేత 270 ఓట్లు సాధించాల్సి ఉంటుంది. బుధవారం రాత్రి(భారత కాలమానం) వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. 237 ఎలక్టోరల్ ఓట్లతో బైడెన్ ముందంజలో ఉండగా.. 213 ఎలక్టోరల్ ఓట్లు సాధించి ట్రంప్ బైడెన్‌కు దగ్గరగా నిలిచారు. అయితే, ఈ ఫలితాలను పలు మీడియా సంస్థలు పలు విధాలుగా వెల్లడిస్తున్నాయి. ట్రంప్‌నకు ఇష్టమైన మీడియా సంస్థ ‘ఫాక్స్ న్యూస్’ కూడా ట్రంప్ ఇప్పటివరకు 213 సీట్లే గెలుచుకున్నారని, బైడెన్ 238 స్థానాల్లో విజయం సాధించారని ప్రకటించింది. మొత్తం నమోదైన ఓట్లలో బైడెన్ 50% ఓట్లను బైడెన్, 48.4% ఓట్లను ట్రంప్ సాధించారని పేర్కొంది. బైడెన్ 224 ఎలక్టోరల్ ఓట్లు, ట్రంప్ 213 ఎలక్టోరల్ ఓట్లు సాధించారని ‘న్యూయార్క్ టైమ్స్’ తెలిపింది. బైడెన్ 220 ఓట్లను, ట్రంప్ 213 ఓట్లను సాధించారని ‘సీఎన్ఎన్’ వెల్లడించింది. ప్రస్తుతం, మిషిగన్, పెన్సిల్వేనియా, జార్జియా, ఆరిజోనా రాష్ట్రాల ఫలితాలు విజేతను నిర్ధారించే పరిస్థితి నెలకొంది. వీటిలో మిషిగన్, పెన్సిల్వేనియాల్లో ట్రంప్ ముందంజలో ఉన్నారు. మరోవైపు, పెన్సిల్వేనియాలో దాదాపు 14 లక్షల పోస్టల్ బ్యాలెట్లను లెక్కించాల్సి ఉంది. మిషిగన్‌లోని ప్రధాన పట్టణాల కౌంటింగ్ కూడా ఇంకా పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాల్లో చివరకు మొగ్గు బైడెన్ వైపే ఉండొచ్చని డెమొక్రట్లు ఆశిస్తున్నారు. పెన్సిల్వేనియాలో 20 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. ఈ ఫలితాల ప్రక్రియతో అమెరికా ప్రజలను మోసం చేస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు. తానే విజయం సాధించానని స్పష్టంగా తెలుస్తోందన్నారు. దేశ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారని ఆరోపించారు. అయితే, ఎన్నికల ఫలితాల్లో మోసానికి సంబంధించి ఎలాంటి ఆధారాలను ఆయన చూపలేదు. ట్రంప్ వ్యాఖ్యలను బైడెన్ ప్రచార బృందం గట్టిగా తిప్పికొట్టింది. అవి అహంకారపూరిత, తప్పుడు వ్యాఖ్యలని విమర్శించింది. అమెరికన్ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను తొలగించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ట్రంప్ సుప్రీంకోర్టుకు వెళితే.. వారి ఆరోపణలను ఎదుర్కొనేందుకు తమ లీగల్ టీమ్స్ కూడా సిద్ధంగానే ఉన్నాయని బైడెన్ ప్రచార మేనేజర్ జెన్‌ఓ మాలీ డిలాన్ పేర్కొన్నారు. కౌంటింగ్‌ను నిలిపేయాలని కోరే హక్కు ఏ నేతకు ఉండదని, కౌంటింగ్‌ను నిలిపేయాలని కోరుతూ ట్రంప్ కోర్టుకు వెళ్తామనడం ఎన్నికల ప్రక్రియను హైజాక్ చేసే నిర్లక్ష్యపూరిత ప్రయత్నమని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక పేర్కొంది. మరోవైపు, డెలావర్‌లో మద్దతుదారులను ఉద్దేశించి బైడెన్ ప్రసంగిస్తూ.. విజయం తమదేనని, ఫలితాలను ప్రకటించేవరకు ఓపికగా ఉండాలని వారిని కోరారు. అమెరికా మీడియా ఏం చెబుతోందంటే..! అమెరికాలో ప్రధాన మీడియా ఎన్నికల ఫలితాలు తేలడానికి మరి కొద్ది రోజులు పడుతుందని అంచనా వేస్తోంది. ‘‘అమెరికా ఎన్నికల్లో అనిశ్చితి నెలకొంది. రాజకీయంగా ప్రజలు రెండుగా విడిపోయారు. వారి మనసుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి’’ అని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది. ‘‘అమెరికా ఎన్నికల చరిత్రలో ఇంత గందరగోళం, అనిశ్చితి ఎప్పుడూ చూడలేదు. బుధవారం ఉదయం లేస్తూనే అందరికీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కనిపించింది. కీలక రాష్ట్రాల్లో స్వల్ప ఆధిక్యాలే నమోదు కావడంతో తుది ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది’’ అని న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది. అమెరికా ప్రజలు ఒక అనిశ్చితితో నిద్రలేచారు, అదెప్పటికి వీడుతుందో చెప్పలేకుండా ఉన్నామని వాషింగ్టన్ పోస్టు పత్రిక వ్యాఖ్యానించింది. బైడెన్ ఆచితూచి వ్యవహరిస్తూ సహనం పాటించాలని తన సహచరులకు పిలుపునిచ్చారని ఆ పత్రిక పేర్కొంది. అయితే డెమొక్రాట్లు కూడా కొన్ని రాష్ట్రాల్లో ఊహించలేని పరాజయాలు మూట కట్టుకున్నారని వాషింగ్టన్ పోస్టు వెల్లడించింది. ‘కీ’లకం, ఫలితం తేలని రాష్ట్రాలు 6 ఈ రాష్ట్రాలే అమెరికాకాబోయే అధ్యక్షుడిని నిర్ణయించనున్నాయి. ►పెన్సిల్వేనియా 20 ఎలక్టోరల్ ఓట్లు ట్రంప్ దాదాపు 8.1% ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బైడెన్ కంటే 4.61 లక్షల ఓట్లు అధికంగా ఉన్నాయి. అయితే ఇక్కడ 80% ఓట్ల లెక్కింపే పూర్తయింది. ఇంకా లెక్కించాల్సినవి 10 లక్షలదాకా మెయిల్ ఇన్ ఓట్లున్నాయి. డెమొక్రాట్ మద్దతుదారులు ఎక్కువగా పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్నారు. 4.61 లక్షల మెజారిటీని అధిగమించి బైడెన్ ముందుకు దూసుకెళ్లడం ఆషామాషీ వ్యవహారమేమీ కాదు. అయితే విస్కాన్సిన్, మిషిగాన్లలో మెయిల్ ఇన్ ఓట్లలో 70–75% బైడెన్‌కే పడ్డాయి. పెన్సిల్వేనియాలోనూ అదే ఒరవడి కొనసాగితే... బైడెన్‌కు ఇక్కడ విజయావకాశాలు ఉంటాయి. డెమొక్రాట్లు ఇదే ఆశాభావంతో ఉన్నారు. ఇక్కడ 6వ తేదీకి ఓట్ల లెక్కింపు పూర్తికావొచ్చని అధికారులు చెబుతున్నారు. ►అరిజోనా 11 బైడెన్ 51శాతంతో ఆధిక్యంలో ఉన్నారు. ట్రంప్‌కు 47.6% ఓట్లు వచ్చాయి. 86% కౌంటింగ్ పూర్తయింది. మరికోపా కౌంటీ ఓట్ల లెక్కింపు ఇంకా జర గాల్సి ఉంది. ఈ కౌంటీలోనే ఫినిక్స్ నగరం ఉంది. ఈ సిటీలో సర్వేల్లో బైడెన్‌కు ఆరుపాయింట్ల అధిక్యం కనపడింది కాబట్టి అరిజోనాలో ఆయన ఆధిక్యం నిలుస్తుందని అంచనా. భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయానికి కౌంటింగ్ పూర్తికానుంది. ►జార్జియా 16 93% ఓట్ల కౌంటింగ్ పూర్తయ్యేసరికి ట్రంప్ 50.3 శాతం, బైడెన్ 48.5 శాతం ఓట్లు సాధించారు. డెకాబ్ కౌంటీ, అట్లాంటా నగర శివార్లలోని కౌంటీల్లో అధికభాగం ఓట్లు ఇంకా లెక్కించాల్సి ఉంది. ఈ ప్రాంతాల్లో బైడెన్‌కు మొగ్గు కనపడింది. అర్ధరాత్రి దాటాక ఫలితం వెలువడే అవకాశాలున్నాయి. ►మిషిగాన్ 16 94% ఓట్ల లెక్కింపు పూర్తయిన మిషిగాన్‌లో హోరాహోరీ కొనసాగుతోంది. బైడెన్ 0.9% స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఇప్పటిదాకా బైడెన్ 49.6%, ట్రంప్ 48.7% ఓట్లు సాధించారు. డెమొక్రాట్ల కంచుకోటగా భావించే వేన్ కౌంటీ (ఇందులోనే డెట్రాయిట్ నగరం ఉంది)లో ఇంకా 25% ఓట్లను లెక్కించాలి. అందుకే మిషిగాన్ తమదేననే ఆశాభావంతో డెమొక్రాట్లు ఉన్నారు. ►నెవెడా 6 86% కౌంటింగ్ పూర్తికాగా.. బైడెన్ 0.6%తో ఆధిక్యంలో ఉన్నారు. లెక్కించిన ఓట్లలో బైడెన్ 49.3%, ట్రంప్ 48.7% సాధించారు. ఇంకా లెక్కించాల్సిన వాటిలో... ఎన్నికల తేదీన, తర్వాత అందిన మెయిల్ ఇన్ బ్యాలెట్లు ఉండటంతో ఆధిక్యాన్ని కొనసాగిస్తామన్న ధీమా డెమొక్రాట్లలో ఉంది. ►నార్త్ కరోలినా 15 లెక్కించిన ఓట్లలో ట్రంప్ 50.1% , బైడెన్ 48.7% సాధించారు. 95% కౌంటింగ్ పూర్తయింది. మిగిలిన 5% ఓట్లలో మూడింట రెండొంతులు సాధిస్తేనే బైడెన్‌కు విజయావకాశాలు ఉంటాయి. లేకపోతే నార్త్ కరోలినా రిపబ్లికన్ల ఖాతాలో చేరిపోతుంది. ►బైడెన్ ఖాతాలో విస్కాన్సిన్ బైడెన్ 0.6% ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విస్కాన్సిన్ (10 ఎలక్టోరల్ ఓట్లు) ను దక్కించుకున్నారు. బైడెన్‌కు 49.4%, ట్రంప్‌కు 48.8% ఓట్లు వచ్చాయి. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక విస్కాన్సిన్ ఫలితం వెలువడింది. ఈ ఎన్నికల్లో నాకు మద్దతుగా నిలిచిన కోట్లాది మందికి ధన్యవాదాలు. విజయోత్సవాలను జరుపుకోవడానికి అందరూ సిద్ధంగా ఉండండి. ఏ మాత్రం ఊహించని రాష్ట్రాల్లోనూ విజయ ఢంకా మోగిస్తున్నాం. ప్రతీ ఒక్కరూ రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకోండి. ఫ్లోరిడా, ఓహియో, టెక్సాస్, జార్జియా, పెన్సిల్వేనియాలో గెలవడం ఎనలేని ఆనందాన్నిచ్చింది. – ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ఫలితాలు ఎప్పటికి వస్తాయో తెలీదు. రేపే రావొచ్చు. ఇంకా ఆలస్యం కావొచ్చు. మెయిల్ ఇన్ ఓటింగ్ కారణంగా ఈ సారి కౌంటింగ్ ఆలస్యమవుతుంది. అయినప్పటికీ ప్రతీ ఓటుని లెక్కపెట్టి తీరాలి. కానీ అంతిమ ఫలితం మనకే అనుకూలంగా ఉంటుంది. నమ్మకం ఉంచండి మనమే గెలవబోతున్నాం. ఎన్నికల్లో ఎవరు గెలిచారో చెప్పాల్సింది ట్రంపో, బైడెనో కాదు.. ప్రజలు చెప్పాలి. –డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఫ్లోరిడాలో ట్రంప్ అభిమానుల ఆనందహేల ఫ్లోరిడాలో ఫలితాల్ని ఆసక్తిగా గమనిస్తున్న డెమొక్రటిక్ పార్టీ అభిమాని -
అమెరికా ఎన్నికలు: ‘పెద్దన్న’ ఎవరో?!
అగ్రరాజ్యం అమెరికాలో మరికొద్ది గంటల్లో ఎన్నికలు!.. నాలుగేళ్ల అధ్యక్ష అనుభవంతో రిపబ్లికన్ల అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. ఒబామా హయాంలో ఉపాధ్యక్షుడు, 40 ఏళ్ల రాజకీయ అనుభవంతో డెమొక్రాట్ పార్టీ తరఫున జో బైడెన్ మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది! విజేత ఎవరో తెలిసేందుకు ఇంకా సమయమున్నా.. కొన్ని నెలలుగా దేశం మొత్తమ్మీద వేర్వేరు సంస్థలు నిర్వహిస్తున్న ఒపీనియన్ పోల్స్ గెలిచేదెవరో చూచాయగా చెప్పేస్తున్నాయి. ఒపీనియన్ పోల్స్ తారుమారైన చరిత్ర ఉన్న నేపథ్యంలో ఈనెల 3న జరిగే ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఒపీనియన్ పోల్స్‌లో ‘జై’డెన్ ఎన్నికల గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో అమెరికాలోని పలు సంస్థలు అభిప్రాయ సేకరణ చేపడుతున్నాయి. యూనివర్సిటీలు, ప్రైవేట్ సంస్థలు నిర్వహించిన ఈ పోల్స్ అన్నింటి సారాంశం రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ గెలుపు వాకిట్లో ఉన్నారని!. అయితే ఎన్నికల ఫలితాలను కచ్చితంగా తేల్చేందుకు ఇవి పెద్దగా ఉపయోగపడవు. 2016లో హిల్లరీ క్లింటన్ దాదాపు అన్ని నేషనల్ ఒపీనియన్ పోల్స్‌లో కలిపి ట్రంప్ కంటే దాదాపు 30 లక్షల ఓట్లు అధికంగా సాధించినా అసలు ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు. ఎలక్టోరల్ కాలేజీ వ్యవస్థ దీనికి కారణం. ఇక, అక్టోబర్ 29న మూడు సంస్థలు నిర్వహించిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం కూడా జో బైడెన్‌దే పైచేయిగా తేలింది. ఇప్పటివరకు నిర్వహించిన అన్ని ఒపీనియన్ పోల్స్ సగటు తీసుకుంటే బైడెన్ (52%), ట్రంప్ (43%) మధ్య తొమ్మిది శాతం ఓట్ల అంతరం ఉంది. గత ఎన్నికల్లో ఈ అంతరం ఒకట్రెండు శాతానికి మించలేదు. ఈ రాష్ట్రాలు ఎటు మొగ్గితే వారే విజేత! అమెరికా ఎన్నికల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయన్నది కాకుండా.. ఎవరికి ఎన్ని ఓట్లు ఏయే రాష్ట్రాల్లో పడ్డాయన్నదే కీలకం. ఉదాహరణకు 2016లో హిల్లరీ క్లింటన్‌కు పాపులర్ ఓట్లు ఎక్కువగా పోలైనా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు తక్కువగా పడ్డాయి. ట్రంప్‌కు 303 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు పడటంతో విజేతగా నిలిచారు. సంప్రదాయకంగా అమెరికన్ రాష్ట్రాల్లో ఓటింగ్ సరళి దాదాపుగా ఒకేలా ఉంటుంది. మొత్తం 50 రాష్ట్రాల్లో రిపబ్లికన్లకు కొన్ని, డెమొక్రాట్లకు మాత్రమే ఓటేసే రాష్ట్రాలు కొన్ని ఉంటాయి. వీటిని మినహాయిస్తే మిగిలిన కొన్ని రాష్ట్రాలు ఒక్కోసారి ఒక్కోలా స్పందిస్తుంటాయి. ఈ బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాలే అధ్యక్ష ఎన్నికల విజేతను నిర్ణయిస్తుంటాయి. 2020 ఎన్నికల విషయా నికొస్తే.. ఈసారి 38 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లున్న టెక్సాస్ బ్యాటిల్‌గ్రౌండ్ రాష్ట్రాల్లో అతి పెద్దది. కేవ లం 4 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉన్న న్యూహ్యాంప్‌షైర్ అతిచిన్నది. అమెరికా మొత్తమ్మీద 538 ఎలక్టోరల్ ఓట్లు అందుబాటులో ఉండగా, 270 ఓట్లు సాధించిన పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తాడు. బ్యాటిల్ గ్రౌండ్ రాష్ట్రాల్లో జరిగిన ఒపీనియన్ పోల్స్ ప్రకారం జో బైడెన్ అధ్యక్షుడు ట్రంప్ కంటే ఆధిక్యంలో ఉన్నారు. హాట్‌హాట్‌గా డిబేట్ అమెరికా ఎన్నికల్లో ఒపీనియన్ పోల్స్, బ్యాటిల్‌గ్రౌండ్ రాష్ట్రాల పరిస్థితి ఎంత ముఖ్యమో.. అధ్యక్ష స్థానానికి పోటీచేస్తున్న అభ్యర్థుల ముఖాముఖి చర్చలూ అంతే ముఖ్యం. సెప్టెంబర్ 29న జరిగిన తొలి ముఖాముఖి చర్చపై సీబీఎస్ న్యూస్/యూగవ్ సంస్థలు బ్యాటిల్‌గ్రౌండ్ రాష్ట్రాల్లో సర్వే నిర్వహించాయి. టెలివిజన్ చానళ్లలో చర్చను వీక్షించిన వారిలో 48% మంది బైడెన్‌కు, 41% మంది ట్రంప్‌కు ఓటేశారు. సీఎన్ఎన్ ఆకస్మిక పోలింగ్‌లో బైడెన్ ఏకంగా 60 శాతం మంది మద్దతు కూడగట్టగలిగారు. అక్టోబర్ 22న జరిగిన మూడో డిబేట్‌పై సీఎన్ఎన్, యూగవ్ నిర్వహించిన పోల్‌లోనూ బైడెన్ వైపు ఎక్కువ మంది మొగ్గు చూపారు. శతాబ్దపు రికార్డు... ముందస్తు ఓటింగ్ అధ్యక్ష ఎన్నికలలో 2020 అక్టోబర్ 29వ తేదీ నాటికి అత్యధికంగా 8.63 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది ఈ శతాబ్దపు రికార్డుగా భావిస్తున్నారు. దేశమంతటా కోవిడ్ సమస్య ఉండటంతో ఓటర్లు ఎవరికి వారు వీలుని బట్టి ఓటు వేస్తున్నారు. ఓటర్లలో చైతన్యం పెరిగిందనీ, మొదటిసారి ఓటేస్తున్న యువత, ఓటు హక్కు కొత్తగా వచ్చిన విదేశీయులు కూడా ముందస్తు ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొంటున్నారని అంటున్నారు. దాదాపు దేశమంతా ముందస్తు ఓటింగ్ రికార్డు స్థాయిలో పెరిగింది. ముందస్తు ఓటర్లలో ఆఫ్రికన్ అమెరికన్ల సంఖ్య మామూలుగానే ఉందని తెలుస్తోంది. ముందుగానే ఓటు హక్కు వినియోగించుకున్న వారిలో 27 శాతం మంది కొత్త ఓటర్లని తేలింది. 2016లో 10% ముందస్తు ఓటు వేసిన ఈ వర్గం వారిలో ఇప్పటికి 9% మంది ఓటేశారు. మంగళవారం కూడా ఎక్కువ శాతం పోలింగ్ జరిగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ట్రంప్ ర్యాలీలతో 30వేల మందికి కోవిడ్ డొనాల్డ్ ట్రంప్ జూన్ 20 నుంచి సెప్టెంబర్ 22 వరకు నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల ద్వారా 30 వేల మందికి పైగా కరోనా సోకిందని, వారిలో 700 మంది చనిపోయారని స్టాన్ఫోర్డ్ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. ట్రంప్ ఎన్నికల ర్యాలీలలో పాల్గొన్న ప్రజలు వ్యాధుల రూపంలో, మరణాల రూపంలో తీవ్రంగా నష్టపోయినట్టు చెప్పారు. ‘ది ఎఫెక్ట్స్ ఆఫ్ లార్జ్ గ్రూప్ మీటింగ్స్ ఆన్ ది స్ప్రెడ్ ఆఫ్ కోవిడ్ 19 : ద కేస్ ఆఫ్ ట్రంప్ ర్యాలీస్’ పేరుతో స్టాన్ఫోర్డ్ వర్సిటీ ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. భారీ సభల ద్వారా కోవిడ్ విజృంభించే ప్రమాదం ఉంటుందని, అధికారులు చేసిన హెచ్చరికలను, సిఫార్సులను తమ విశ్లేషణ బలపరుస్తోందని వారు తెలిపారు. ‘‘ట్రంప్ మీ గురించి పట్టించుకోడు. తన సొంత మద్దతుదారులనూ పట్టించుకోడు’’ అని డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్ ఈ అధ్యయనంపై స్పందిస్తూ ట్వీట్ చేశారు. మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా హాజరయ్యే వ్యక్తిగత సభలు కోవిడ్ వ్యాప్తికి అవకాశం కల్పిస్తాయని ది సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సూచించింది. -
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో హోరాహోరీ
వాషింగ్టన్: కరోనా వైరస్‌కి వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారి పీడ ఎప్పటికి విరగడ అవుతుంది? ఈ ప్ర«శ్నలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మరో ప్రశ్న అందరినీ వేధిస్తోంది. అదే ప్రపంచానికి పెద్దన్న ఎవరు కాబోతున్నారు? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపెవరిది? రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. దీంతో స్వింగ్ స్టేట్స్ ఎటువైపు మొగ్గు చూపిస్తాయన్నది కీలకంగా మారింది. నవంబర్ 3న జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల పైనే అందరి దృష్టి నెలకొని ఉంది. ఎన్నికల ప్రచారం జోరందుకున్న నేపథ్యంలో స్వింగ్ స్టేట్స్ (ఆఖరి నిమిషం వరకు ఏ పార్టీ వైపు ఉంటారో అంచనా వేయలేని రాష్ట్రాలు) ఎటు వైపు మొగ్గుతాయన్న ఉత్కంఠ రేగుతోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ప్రజాదరణ ఓట్లు సాధించిన వారే పీఠాన్ని దక్కించుకుంటారని చెప్పలేం. గత ఎన్నికల్లో ట్రంప్ కంటే పాపులర్ ఓట్లు 30 లక్షలు అధికంగా హిల్లరీ క్లింటన్ సాధించినప్పటికీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ట్రంప్‌కి ఎక్కువ రావడంతో ఆయన అ«ధ్యక్ష పీఠాన్ని దక్కించుకున్నారు. నవంబర్ 3న జరిగే ఎన్నికల్లో ప్రజలు తమకు నచ్చిన అభ్యర్థి పార్టీకి ఓటు వేస్తారు. ఆ ఓటింగ్ రాష్ట్రాల స్థాయిలోనే ఉంటుంది. అక్కడ ఎన్నిౖకైన ప్రతినిధులంతా కలిసి అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. దేశం మొత్తమ్మీద 50 రాష్ట్రాలు, డిస్ట్రిక్ట్ కొలంబియాలో జనాభా ప్రాతిపదికన ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉంటాయి. దేశవ్యాప్తంగా 538 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లకిగాను 270 ఓట్లు సాధించిన వారే అధ్యక్షుడిగా ఎన్నికవుతారు. స్వింగ్ రాష్ట్రాలు ఇవే ఈసారి ఎన్నికల్లో మొత్తం 14 రాష్ట్రాల్లో ఎవరి వైపు ప్రజలు మొగ్గు చూపుతారో తెలీని పరిస్థితి నెలకొంది. ఇప్పటివరకు అమెరికా ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో జనం నాడి తెలియకుండా ఎప్పుడూ లేదు. టెక్సాస్ (38 ఎలక్టోరల్ ఓట్లు), ఫ్లోరిడా (29 ), పెన్సిల్వేనియా (20), ఒహియో (18), మిషిగాన్ (16), జార్జియా (16 ), నార్త్ కరోలినా (15), వర్జీనియా (13), అరిజోనా (11), విస్కాన్సన్ (10), మిన్నెసోటా (10), నెవడా (6), అయోవా (6) న్యూ హ్యాంప్‌షైర్ (4) రాష్ట్రాల్లో ప్రతీ నెల జనం మూడ్ మారిపోతున్నట్టుగా సర్వేలు చెబుతున్నాయి. తాజా సర్వేల్లో జార్జియా, అయోవా, టెక్సాస్ రాష్ట్రాల్లో ట్రంప్‌కి మొగ్గు కనిపిస్తూ ఉంటే, మిగిలిన స్వింగ్ స్టేట్స్లో బైడెన్ దూసుకుపోయే అవకాశాలున్నట్టుగా రియల్ క్లియర్ పాలిటిక్స్ సర్వే అంచనా వేస్తోంది. టెక్సాస్, జార్జియా రాష్ట్రాలు ఎప్పుడూ రిపబ్లికన్ల వైపు ఉంటాయి. ఈసారి కూడా ట్రంప్‌వైపే ఉన్నప్పటికీ మొగ్గు చాలా స్వల్పంగా ఉందని అంచనా. అందుకే టెక్సాస్, జార్జియా రాష్ట్రాల్లో ఎలాగైనా పాగా వెయ్యాలని బైడెన్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ రాష్ట్రాల్లో ప్రచారం కోసం డాలర్ల వరద పారిస్తున్నారు. జాతీయ స్థాయిలో చూసుకుంటే ట్రంప్ కంటే బైడెన్‌కు 10 పాయింట్లు అధికంగా ఉన్నాయి. ఫ్లోరిడా ఫ్యాక్టర్ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో 1964 నుంచి ఫ్లోరిడాలో నెగ్గిన వారికే అధ్యక్ష పదవి దక్కుతూ వస్తోంది. 1992 ఎన్నికలు మాత్రం దీనికి మినహాయింపుగా ఉన్నాయి. గత ఎన్నికల్లో ట్రంప్‌కి 48.6% ఓట్లు వస్తే, హిల్లరీకి 47.4% ఓట్లు వచ్చాయి. అంతకు ముందు ఎన్నికల్లో బరాక్ ఒబామా 51% ఓట్లను సాధించి అవలీలగా అధ్యక్ష పదవిని అందుకున్నారు. ఈ రాష్ట్రంలో ప్రజల ఆలోచనా ధోరణి వినూత్నంగా ఉంటుంది. యువ ఓటర్లు ఎక్కువ మంది ఉన్నారు. ఇక్కడ ఓటర్లు అధ్యక్ష అభ్యర్థుల మధ్య జరిగే డిబేట్లను విన్నాక ఓటుపై నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికలకి ముందు మూడు సార్లు సెప్టెంబర్ 29, అక్టోబర్ 7, అక్టోబర్ 15న అధ్యక్ష అభ్యర్థుల మధ్య బిగ్ డిబేట్స్ జరుగుతాయి. ఈ డిబేట్స్‌లో ట్రంప్, బైడెన్ తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తారో వివరిస్తారు. ఆ డిబేట్స్ తర్వాత పరిస్థితులన్నీ మారే అవకాశాలైతే ఉన్నాయి. ఈ డిబేట్స్‌లో ట్రంప్ నెగ్గుతారని 47% మంది అమెరికన్లు భావిస్తూ ఉంటే, బైడెన్ వైపు 41% మంది మాత్రమే ఉన్నారు. కరోనా ఎఫెక్ట్ ఈసారి ఎన్నికల్లో కరోనా వైరస్ నంబర్ గేమ్‌ని మార్చేస్తుందని అంచనాలున్నాయి. కరోనా కట్టడిలో ట్రంప్ వైఫల్యంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అగ్రరాజ్యంలో ఎన్నికల నాటికి వైరస్ కారణంగా 2 లక్షల 60 వేల వరకు మరణాలు నమోదవుతాయని అంచనాలున్నాయి. ట్రంప్ చెబుతున్నట్టుగా అక్టోబర్ సర్ప్రైజ్ సాకారమై పోలింగ్ తేదీలోగా వ్యాక్సిన్ వస్తే ఆయనకి మళ్లీ అనుకూలంగా పరిస్థితులు మారే అవకాశాలున్నాయి. ఆర్థిక మాంద్యం, పెరిగిపోతున్న నిరుద్యోగం, జాతివివక్ష, వలసవిధానం, వాతావరణంలో మార్పులు వంటి అంశాలు కూడా ఎన్నికల్లో ప్రధాన అంశాలు కానున్నాయి. -
బైడెన్‌కు అధికారమిస్తే కలలన్నీ నాశనం: ట్రంప్
వాషింగ్టన్: డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు అధికారాన్ని అప్పగిస్తే అమెరికా కన్న కలలన్నీ సర్వనాశనం అవుతాయని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమెరికా గొప్పతనాన్ని నాశనం చేయడంతో పాటుగా ప్రజలకెవరికీ ఉద్యోగాలు ఉండవన్నారు. కరోనా సంక్షోభం నుంచి బయట పడడానికి ఈ ఏడాది చివరిలోగా వ్యాక్సిన్ తీసుకువస్తానని హామీ ఇచ్చారు. రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా రెండోసారి నామినేషన్‌ను ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకొని గురువా రం ట్రంప్ పార్టీ సదస్సులో మాట్లాడారు. అందరి చూపు మెలానియా,ఇవాంక పైనే సదస్సు వేదికపై మెలానియా ట్రంప్, ట్రంప్ మొదటి భార్య కుమార్తె ఇవాంకా ఒకరికొకరు ఎదురుపడిన వీడియో ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. తన తండ్రిని అధ్యక్ష అభ్యర్థిగా పరిచయం చేసి వేదిక దిగి వస్తుండగా ఎదురపడిన మెలానియా ఇవాంకను చూసి చిరునవ్వుతో పలకరించారు. ఇవాంక కాస్త ముందుకు వెళ్లగానే మెలానియా ముఖంలో రంగులు మారాయి. -
ట్రంపే గెలుస్తాడు!: ఎన్నికల నిపుణుడి జోస్యం
న్యూయార్క్: వచ్చె నెల్లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధిస్తారని.. యూఎస్ ప్రఖ్యాత ఎన్నికల నిపుణుడు హెల్మట్ నార్పోత్ స్పష్టం చేశారు. ఈయన మోడల్ ప్రకారం ప్రైమరీలు, కాకసెస్ (ఆ పార్టీలోని ఎన్నికైన సభ్యులు)లో మెజారిటీ సంపాదించిన బలమైన నేత శ్వేతసౌధానికి ఎంపికవుతారు. ఈ మోడల్‌కు మారుతున్న రాజకీయ, అంతర్జాతీయ పరిస్థితులతో సంబంధం ఉండదు. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్ ప్రైమరీలు, కాకసెస్‌లో పార్టీపరంగా బలమైన నేతగా ఎదిగారు. ఆ తర్వాత పార్టీలో వ్యతిరేకత ఎదురైనా ఇది ట్రంప్ విజయంపై ప్రభావం చూపదని హెల్మట్ తెలిపారు. ఈ మోడల్ ప్రకారం 1912 నుంచి ఒబామా వరకు (2000లో తప్ప) అన్ని అంచనాలు నిజమయ్యాయి. -
సగానికి తగ్గిన హిల్లరీ ఆధిక్యం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచిన డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఆధిక్యం తన ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌పై నెల రోజుల వ్యవధిలో సగానికి తగ్గిందని తాజా సర్వేలో తేలింది. అయినా ఆమె కొన్ని కీలక ప్రాంతాల్లో ఆధిపత్యం కొనసాగిస్తున్నారని మరో సర్వేలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా జరిగిన 5 టెలిఫోన్ ఆధారిత సర్వేల్లో క్లింటన్ సగటున 42 శాతం మంది మద్దతును, ట్రంప్ 37 శాతం మద్దతును కూడగట్టారని సీఎన్ఎన్ పేర్కొంది. రెండు వరస కన్వెన్షన్ల తరువాత ‘పోల్ ఆఫ్ పోల్స్’ జరిపిన సర్వేలో క్లింటన్ 49 శాతం పాయింట్లతో, ట్రంప్ 39 శాతం పాయింట్లతో ఉన్నారని తెలిసింది. క్లింటన్ ఆధిక్యం ట్రంప్‌పై సగటున 4.1 శాతం తగ్గిందని ప్రముఖ సర్వే సంస్థ రియల్ క్లియర్ పాలిటిక్స్ ప్రకటించింది. దీంతో శ్వేతసౌధానికి పోటీ తీవ్రతరం అవుతోందని అంచనా వేసింది. ఫ్లోరిడా, పెన్సిల్వేనియా, ఓహియో, నెవడా, న్యూ హాంప్‌షైర్, నార్త్ కరోలినా, మిచిగాన్, విస్కాన్సిన్, కొలరాడో, వర్జీనియా, జార్జియాలో క్లింటన్ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతున్నారని తెలిపింది. -
ట్రంప్‌కు వ్యతిరేకంగా మహిళల నగ్న నిరసన
అమెరికన్లకు ఆగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా పట్టలేం. క్లీవ్‌లాండ్‌లో వందమందికి పైగా మహిళలు దుస్తులన్నీ విప్పేసి అద్దాలు పట్టుకుని తమ నిరసన వ్యక్తం చేశారు. వైట్‌హౌస్‌లోకి వెళ్లడానికి డోనాల్డ్ ట్రంప్‌కు ఏమాత్రం అర్హత లేదంటూ వాళ్లీ నిరసన కార్యక్రమం చేపట్టారు. రిపబ్లికన్ పార్టీ తమ అభ్యర్థిగా ట్రంప్‌ను ప్రకటించే కార్యక్రమం జరగనున్న రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ సభా వేదిక వద్ద వీళ్లంతా చేరి.. ఇలా ప్రదర్శన జరిపారు. స్పెన్సర్ టునిక్ అనే ఫొటోగ్రాఫర్ ఇచ్చిన పిలుపు మేరకు ఇదంతా జరిగింది. సుమారు 130 మంది పాల్గొన్న ఈ నిరసనలో టునిక్ వాళ్లందరినీ ఫొటో షూట్ కూడా చేశాడు. నవంబర్ 8వ తేదీన జరిగే ఎన్నికలకు ముందు వీళ్ల నగ్న నిరసన ఫొటోలను విడుదల చేస్తారు. నగ్న ప్రదర్శన చేసేందుకు తాము అనుమతి కూడా తీసుకున్నామని టునిక్ చెప్పారు. బహిరంగంగా నగ్న ప్రదర్శన చేయడం క్లీవ్‌లాండ్ చట్టాల ప్రకారం నేరమే అయినా.. పోలీసులు జోక్యం చేసుకోడానికి కుదరలేదు. నగ్నఫొటోల చిత్రీకరణలో టునిక్ సుప్రసిద్ధుడు. అయితే తాను ఇంతవరకు రాజకీయాలకు సంబంధించి ఏమీ చేయలేదని.. ఇదే చాలా పెద్ద ఎత్తున చేసిన రాజకీయ ఫొటో షూట్ అని ఆయన అంటున్నాడు. తాను తప్పనిసరిగా ఈ షూట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నాడు. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేసినంత మాత్రాన సరిపోదని, ఇలా నిరసన కూడా తెలపాల్సిందేనని అన్నాడు. తనకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారని.. రిపబ్లికన్ పార్టీ పాలనలో మహిళలు, మైనారిటీల మీద జరిగే ఘోరాలను తాను సహించలేనని చెప్పాడు. టునిక్ చర్యలు తనకు నచ్చడం వల్లే ఈ ప్రదర్శనలో పాల్గొన్నట్లు ఆర్ట్ ప్రొఫెసర్, ఆర్టిస్ట్ అయిన మాపో కినార్డ్ (55) అనే మహిళ చెప్పారు. పూర్తి నగ్నంగా రోడ్డుమీద నిలబడటానికి కూడా భయం లేకుండా ఉండటమే తమకు కావాలని ఆమె వివరించారు. -
'డిక్టేటర్'ను తక్కువగా అంచనా వేయొద్దు...
కాలిఫోర్నియా: నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తాడంటూ ప్రపంచదేశాలు ఆ నేతపై మండిపడుతున్నప్పటికీ.. డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ ను తక్కువగా అంచనా వేయొద్దని వ్యాఖ్యానించారు. ఆయన అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీలో ముందు వరుసలో ఉన్న విషయం తెలిసిందే. సంచలనవ్యాఖ్యలు చేసే ట్రంప్ మరోసారి వివాదానికి తెరతీశారు. చిన్న వయసులోనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకున్నాడంటూ నార్త్ కొరియా 'డిక్టేటర్' ను తెగ పొగిడేశాడు. గత నెలలో అతి ప్రమాదకరమైన హైడ్రోజన్ బాంబును పరీక్షించి సక్సెస్ అయ్యామని ఆ దేశం ప్రకటించడంపై ప్రపంచదేశాల నుంచి కిమ్ జాంగ్ ఉన్ తీవ్ర విమర్శల పాలయ్యాడు. దక్షిణ కాలిఫోర్నియా, ఫ్లోరెన్స్ లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ... కిమ్ జాంగ్ ఉన్ టాలెంట్ ను తక్కువగా అంచనా వేయొద్దని.. తండ్రి కిమ్ జాంగ్ ఇల్ మృతిచెందిన తర్వాత దేశాన్ని చాలా సులువుగా నియంత్రణలోకి తెచ్చుకున్నాడంటూ ప్రశంసించాడు. నార్త్ కొరియా నియంతగా పిలువబడే కిమ్ జాంగ్ ఉన్ ను ట్రంప్ పొగడటం ఇది రెండోసారి. సుదీర్ఘ దూరాలలోని లక్ష్యాలను చేధించగల క్షిపణిని ప్రయోగించామని నార్త్ కొరియా ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఆయనను మరోసారి దెబ్బతీసే అవకాశాలు లేకపోలేదు. గతనెలలో లోవాలో ఇలాంటి వ్యాఖ్యలే చేయగా.. ఆ ప్రాంతంలో ఇటీవల జరిగిన పోలింగ్‌లో చాలా తక్కువ ఓట్లు సాధించి ట్రంప్ ఓటమి పాలైన విషయం విదితమే.