వాషింగ్టన్: 2024లో జరగనున్న అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా మరో భారతీయుడు ఎంట్రీ ఇచ్చారు. ఇండో అమెరికన్ ఇంజినీర్ అయిన హిర్ష్ వర్ధన్ సింగ్(38) ఈ మేరకు మూడు నిముషాల నిడివి ఉన్న ఒక వీడియో సందేశం ద్వారా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు.
హిర్ష్ వర్ధన్ సింగ్ కంటే ముందు రిపబ్లికన్ పార్టీ తరపున సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హాలీ(51), మిలియనీర్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి(37) అమెరికా అధ్యక్ష పదవికి తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగా హిర్ష్ వర్ధన్ సింగ్ ఈ రేసులో నిలిచిన మూడో భారతీయ సంతతి వారిగా నిలిచారు.
వీడియో సందేశంలో సింగ్ మాట్లాడుతూ.. నేను జీవితకాలం రిపబ్లికన్ గా ఉంటానని, న్యూ జెర్సీ రిపబ్లికన్ పార్టీ కన్జర్వేటివ్ విభాగాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించిన మొట్టమొదటి అమెరికన్ ను నేనేనన్నారు.. గత కొన్నేళ్లుగా వచ్చిన మార్పులను యధాస్థితికి తీసుకొచ్చి అమెరికా విలువలను కాపాడేందుకు బలమైన నాయకత్వం అవసరముందన్నారు. నాది స్వచ్ఛమైన రక్తం.. కోవిడ్ సమయంలో కూడా ఎటువంటి వ్యాక్సినేషన్ల జోలికి వెళ్ళలేదని.. అందుకే నేను రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష రేసులో నిలవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఈ మేరకు గురువారమే ఫెడరల్ ఎలెక్షన్ కమిషన్ లో తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశారు హిర్ష్ వర్ధన్ సింగ్.
హిర్ష్ వర్ధన్ సింగ్ గతంలో న్యూజెర్సీ తరపున 2017,2021లో గవర్నర్ గాను, 2018లో హౌస్ సీటు కోసం, 2020లో సెనేటర్ గాను ప్రయత్నించారు. కానీ రిపబ్లికన్ పార్టీ నామినేషన్ దక్కించుకోవడంలో విఫలమయ్యారు. ఇటీవలి కాలంలో కూడా గవర్నర్ గా క్యాంపెయిన్ చేస్తూ డోనాల్డ్ ట్రంప్ తో పోటీపడ్డారు. కానీ నామినేషన్లలో మూడో స్థానంలో నిలిచారు.
మొత్తంగా రిపబ్లికన్ పార్టీ తరపున ఈసారి ముగ్గురు భారత సంతతి వారు అధ్యక్ష పదవి కోసం నామినేషన్లలో పోటీ పడుతున్నారు. ఇదే పార్టీ తరపున అధ్యక్ష పదవికి నామినేషన్ రేసులో డోనాల్డ్ ట్రంప్ మొదటి వరుసలో ఉన్నారు. కానీ ఆయనపై నేర అభియోగాలున్న నేపథ్యంలో తర్వాతి వరుస వారిని అదృష్టం వరించినా వరించొచ్చు. అధ్యక్షుడి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు వచ్చే ఏడాది జులై 15-18 వరకు మిల్వాకీ, విస్కాన్సిన్ లో రిపబ్లికన్లు సమావేశం కానున్నారు.
I'm entering the race for President.https://t.co/OEHCSYOdvK pic.twitter.com/RyxW4sKMSW
— Hirsh Vardhan Singh (@HirshSingh) July 27, 2023
ఇది కూడా చదవండి: గాల్లో ఆగిపోయిన రోలర్ కోస్టర్.. బిక్కుబిక్కుమంటూ పర్యాటకులు
Comments
Please login to add a commentAdd a comment