Conservative Party
-
యూకే ఎన్నికలు: సతీసమేతంగా ఓటేసిన సునాక్
బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7గం. పోలింగ్ ప్రారంభం కాగా.. ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం క్యూ కట్టారు. మరోవైపు భార్య అక్షతా మూర్తితో కలిసి ఓటేసిన ఆ దేశ ప్రధాని రిషి సునాక్.. ఆపై ఎక్స్ ద్వారా ఓటర్ల కోసం సందేశం ఇచ్చారు.పోలింగ్ ప్రారంభమైందని, లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక తరం మొత్తం పన్నుల మోతతో ఇబ్బంది ఎదుర్కుంటుందని, కాబట్టి కన్జర్వేటివ్పార్టీకి ఓటేసి గెలిపించాలని పిలుపు ఇచ్చారాయన.The polls are open. Vote Conservative to stop the Labour supermajority which would mean higher taxes for a generation. pic.twitter.com/NPH7lSeDFc— Rishi Sunak (@RishiSunak) July 4, 2024మరోవైపు దారి తప్పిన బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ గాడిన పడాలంటే లేబర్ పార్టీని గెలిపించాలని ఆ పార్టీ నేత కెయిర్ స్టార్మర్ కోరుతున్నారు. దేశవ్యాప్తంగా 40 వేల పోలింగ్ బూత్‌లలో 4.6 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంది. ఉదయం 7గం. నుంచి రాత్రి 10గం. దాకా పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ఆ తర్వాతే ఎగ్జిట్‌పోల్స్ వెలువడతాయి. మరో గంట వ్యవధి తర్వాత ఫలితాల లెక్కింపు మొదలవుతుంది. పూర్తి ఫలితాలు రేపు ఉదయం 6గం.30 కల్లా..(భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 11గం.కల్లా) వెలువడే ఛాన్స్ ఉంది.పార్లమెంటు దిగువ సభ అయిన హౌజ్ ఆఫ్ కామన్స్‌లోని 650 స్థానాలకు గురువారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగాల్సి ఉంది. యునైటెడ్ కింగ్ డమ్‌లో మొత్తం 392 రిజిస్టర్ పార్టీలు ఉన్నాయి. ప్రస్తుతం రెండు పార్టీల మధ్యే ప్రధానంగా పోటీ ఉండనుంది. కన్జర్వేటివ్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. గత 14 ఏళ్లలో అధికారంలో కొనసాగిన కన్జర్వేటివ్ పార్టీ.. ఐదుగురు ప్రధానుల్ని మార్చింది. భారత సంతతికి చెందిన 44 ఏళ్ల రిషి 2022 అక్టోబర్ 25న బ్రిటన్ ప్రధాని అయ్యారు. ఆ పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న వ్యక్తిగానే గాక తొలి హిందువుగా కూడా రికార్డు సృష్టించారు. కానీ వాగ్దానాలను నిలుపుకోవడంలో ఆయన విఫలమయ్యారన్న అసంతృప్తి ప్రజల్లో తీవ్రంగా ఉంది.మరోవైపు.. 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతే విపక్ష లేబర్ పార్టీకి ఈసారి అతి పెద్ద సానుకూలాంశంగా మారింది. ఆ పార్టీ నాయకుడు స్టార్మర్ (61) ‘పార్టీ కంటే దేశం ముందు’ నినాదంతో దూసుకెళ్లారు. ఆ నినాదం బ్రిటన్‌వాసులను విపరీతంగా ఆకట్టుకుంది. మరోవైపు ఒపీనియన్ పోల్స్ సైతం లేబర్ పార్టీకే అనుకూలంగా వచ్చాయి. ఇక.. 10 లక్షల మందికి పైగా భారతీయ మూలాలు ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉంటే.. ఈసారి ఏకంగా 107 మంది బ్రిటీష్ ఇండియన్లు బరిలో దిగుతుండటం విశేషం. 2019లో ఆ సంఖ్య 63 కాగా, అందులో 15 మంది గెలిచారు. -
UK general elections: ముందస్తు ఓటమే?!
సవాలక్ష సమస్యలతో సతమతమవుతున్న బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికలకు వేళైంది. హోరాహోరీ ప్రచారానికి బుధవారం సాయంత్రంతో తెర పడింది. పార్లమెంటు దిగువ సభ అయిన హౌజ్ ఆఫ్ కామన్స్‌లోని 650 స్థానాలకు గురువారం దేశవ్యాప్తంగా పోలింగ్ జరగనుంది. సాయంత్రం నుంచే ఫలితాల వెల్లడి మొదలవుతుంది. శుక్రవారం ఉదయానికల్లా పూర్తి ఫలితాలు వెలువడతాయి. కొత్త సభ జూలై 9న కొలువుదీరుతుంది. స్పీకర్ ఎన్నిక, సభ్యుల ప్రమాణ స్వీకారాల తర్వాత నూతన ప్రభుత్వం బాధ్యతలు స్వీకరిస్తుంది. విపక్ష నేత స్టార్మర్ నేతృత్వంలోని లేబర్ పార్టీ భారీ మెజారిటీతో 14 ఏళ్ల అనంతరం గద్దెనెక్కడం ఖాయమని ఒపీనియన్ పోల్స్ చెబుతున్నాయి. భారత మూలాలున్న ప్రధాని రిషి సునాక్ సారథ్యంలోని అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎదురీదుతోందని అప్పటికే స్పష్టం చేశాయి. సునాక్ కూడా బుధవారం ప్రచారాన్ని ముగిస్తూ, ‘లేబర్ పార్టీకి ఘనవిజయం దక్కకుండా అడ్డుకుందాం’ అని ప్రజలతో పాటు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలకు పిలుపునిచ్చారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. నిజానికి ఎన్నికలు డిసెంబర్లో జరగాల్సి ఉన్నా ప్రజల్లో తీవ్రంగా ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతను ముందే పసిగట్టి సునాక్ ముందస్తుకు వెళ్లారు. కానీ అది కూడా కలిసొచ్చేలా కని్పంచడం లేదు... బరిలో భారతీయం బ్రిటన్ ఎన్నికల బరిలో భారతీయుల జోరు పెరుగుతోంది. 2019లో 63 మంది బ్రిటిష్‌ఇండియన్లు పోటీ చేయగా 15 మంది విజయం సాధించారు. ఈసారి ఏకంగా 107 మంది బరిలో దిగుతుండటం విశేషం. ప్రధాన పార్టీలైన కన్జర్వేటివ్, లేబర్‌తో పాటు రిఫామ్ యూకే వంటి కొత్త పారీ్టల నుంచి కూడా ఇండియన్లు పోటీలో ఉన్నారు. పలు స్థానాల్లో బ్రిటిష్ ఇండియన్లే ప్రత్యర్థులుగా తలపడుతుండటం మరో విశేషం. హారో ఈస్ట్ స్థానం నుంచి ప్రిమేశ్ పటేల్ (లేబర్), రీతేంద్రనాథ్ బెనర్జీ (లిబరల్ డెమొక్రాట్స్), సారాజుల్హగ్ పర్వానీ (వర్కర్స్ పార్టీ ఆఫ్ బ్రిటన్) బరిలో ఉన్నారు. లీసెస్టర్ ఈస్ట్‌లో లండన్ మాజీ డిప్యూటీ మేయర్ రాజేశ్ అగర్వాల్ (లేబర్), శివానీ రాజా (కన్జర్వేటివ్) పోటీ చేస్తున్నారు. 37.3 లక్షల బ్రిటిష్ ఇండియన్లు బ్రిటన్‌లో భారత మూలాలున్న వారి సంఖ్య ఏకంగా 37.3 లక్షలు దాటేసింది! ఓటర్లలోనూ వారు 10 లక్షల మందికి పైగా ఉన్నట్టు సమాచారం. పాకిస్తాన్, బంగ్లాదేశ్ మూలాలున్న వారు కూడా భారీగానే ఉన్నారు. దాంతో వారిని ఆకట్టుకోవడానికి పారీ్టలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి. లేబర్ పార్టీ నేత స్టార్మర్ ఇటీవల బ్రిటిష్ బంగ్లాదేశీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలు, గాజా దుస్థితిపై ఆ పార్టీ వైఖరి కారణంగా ముస్లిం ఓటర్లు గుర్రుగా ఉన్నారు. దీన్ని వీలైనంతగా సొమ్ము చేసుకునేందుకు కన్జర్వేటివ్ నేతలు ప్రయతి్నస్తున్నారు. కన్జర్వేటివ్: ఏడుగురు సిట్టింగ్ ఎంపీలతో పాటు 23 మంది బ్రిటిష్ ఇండియన్లకు కొత్తగా టికెట్లిచ్చింది. వీరిలో ప్రధాని రిషి సునాక్, మాజీ మంత్రులు ప్రీతీ పటేల్, సుయెల్లా బ్రేవర్మన్‌తో పాటు చంద్ర కన్నెగంటి, నీల్ శాస్త్రి హర్‌స్సŠట్, నీల్ మహాపాత్ర, రేవ గుడి, నుపుర్ మజుందార్, ఎరిక్ సుకుమారన్ తదితరులున్నారు. లేబర్: ఏడుగురు సిట్టింగ్ ఎంపీలు కాగా 26 మంది కొత్తవారు. వీరిలో ఉదయ్ నాగరాజు, హజీరా ఫరానీ, రాజేశ్ అగర్వాల్, జీవన్ సంధెర్ తదితరులున్నారు.ఒపీనియన్ పోల్స్ ఏం చెబుతున్నాయ్.. లేబర్ పారీ్టకి కనీసం 41 శాతం ఓట్లు ఖాయమని అత్యధిక ఒపీనియన్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. అధికార కన్జర్వేటివ్ పార్టీకి 21 శాతానికి మించబోవని అవి జోస్యం చెప్పాయి. రిఫామ్ పారీ్టకి 16 శాతం, లిబరల్ డెమొక్రాట్లకు 12 శాతం రావచ్చని పేర్కొన్నాయి. అవే నిజమైతే లేబర్ పార్టీ ఘనవిజయం సాధించడం ఖాయమే. సునాక్ ఎదురీత వెనక... 44 ఏళ్ల రిషి 2022 అక్టోబర్ 25న బ్రిటన్ ప్రధాని అయ్యారు. ఆ పదవి చేపట్టిన తొలి భారత మూలాలున్న వ్యక్తిగానే గాక తొలి హిందువుగా కూడా రికార్డు సృష్టించారు. కానీ వాగ్దానాలను నిలుపుకోవడంలో ఆయన విఫలమయ్యారన్న అసంతృప్తి ప్రజల్లో తీవ్రంగా ఉంది. ఆర్థిక సంక్షోభం కొన్నేళ్లుగా బ్రిటన్‌కు చుక్కలు చూపుతోంది. ముఖ్యంగా నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. ఆర్థిక నిపుణుడై ఉండి కూడా పరిస్థితిని రిషి చక్కదిద్దలేదన్నది బ్రిటన్‌వాసుల ఫిర్యాదు. ప్రధానమైన హౌజింగ్ సంక్షోభాన్ని చక్కదిద్దడంలోనూ ఆయన విఫలమయ్యారని వారు భావిస్తున్నారు. దాంతో ఆర్థిక వ్యవస్థను పటిష్టపరుస్తామన్న తాజా హామీలను ఎవరూ నమ్మడం లేదు. యూగవ్ తాజా సర్వేలో 52 శాతం మంది ఆర్థిక సమస్యలనే ప్రముఖంగా ప్రస్తావించారు. ఆరోగ్య సమస్యలు తమను బాగా కుంగదీస్తున్నట్టు 50 శాతం చెప్పారు. కీలకమైన వలసదారులు, వారికి ఆశ్రయం విషయంలో కన్జర్వేటివ్ పార్టీ వైఖరిని 40 శాతం మంది తప్పుబడుతున్నారు. ఎలా చూసినా సునాక్ పాలనకు 20 నెలలకే తెర పడటం ఖాయమన్న అభిప్రాయం సర్వత్రా విని్పస్తోంది.స్టార్మర్‌కు కలిసొచ్చిన అంశాలు... ప్రధానంగా 14 ఏళ్ల కన్జర్వేటివ్ పార్టీ పాలనపై ప్రజల్లో నెలకొన్న తీవ్ర వ్యతిరేకతే విపక్ష లేబర్ పారీ్టకి ఈసారి అతి పెద్ద సానుకూలాంశంగా మారింది. ఆ పార్టీ నాయకుడు స్టార్మర్ (61) ‘పార్టీ కంటే దేశం ముందు’ నినాదంతో దూసుకెళ్లారు. ఆ నినాదం బ్రిటన్‌వాసులను విపరీతంగా ఆకట్టుకుంది. లేబర్ పార్టీకి ఓటేస్తే ఆర్థిక స్థిరత్వానికి వేసినట్టేనన్న ఆయన ప్రచారానికి విశేష స్పందన లభించింది. నిరుపేద కారి్మక కుటుంబం నుంచి వచి్చన తనకు సామాన్యుల కష్టనష్టాలు బాగా తెలుసునని, ధరాభారాన్ని తగ్గించి తీరతానని, సుపరిపాలన అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని హామీలిచి్చన స్టార్మర్ వైపు ప్రజలు స్పష్టమైన మొగ్గు చూపుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Britain general elections: సునాక్ ఎదురీత!
బ్రిటన్‌లో పద్నాలుగేళ్ల కన్జర్వేటివ్ పాలనకు తెరపడనుందా? భారత మూలాలున్న తొలి ప్రధానిగా చరిత్ర సృష్టించిన రిషి సునాక్ గద్దె దిగాల్సి వస్తుందా? అవుననే అంటున్నాయి ఒపీనియన్ పోల్స్. షెడ్యూల్ ప్రకారం ఏడాది చివరిదాకా ఆగితే తన ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి తారస్థాయికి చేరి ఓటమి ఖాయమనే భావనతో రిషి అనూహ్యంగా జూలై 4న ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. అయినా పెద్దగా ప్రయోజనమేమీ ఉండకపోవచ్చని సర్వేలంటున్నాయి. విపక్ష లేబర్ పార్టీ భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని పేర్కొంటున్నాయి. స్వయానా రిషీ కూడా ఎదురీదుతున్నారని, సొంత పార్లమెంట్ స్థానాన్ని కూడా కోల్పోవచ్చని సావంత పోల్ పేర్కొంది! అదే జరిగితే సొంత పార్లమెంటు స్థానంలో ఓడిన తొలి సిట్టింగ్ ప్రధానిగా బ్రిటన్ చరిత్రలో రిషి నిలిచిపోతారు...ముందస్తు ఎన్నికలకు వెళ్లడంతోనే కన్జర్వేటివ్ పార్టీ ఓటమి సగం ఖాయమైందన్నది రాజకీయ నిపుణుల అభిప్రాయం. బ్రిటన్‌లో కన్జర్వేటివ్ పార్టీది 190 ఏళ్ల చరిత్ర. ఇంత సుదీర్ఘ చరిత్రలో 1906లో వచి్చన 131 సీట్లే అత్యల్పం. ఈసారి ఆ రికార్డును అధిగమించవచ్చని సర్వేలంటున్నాయి. ‘‘సునాక్ ఉత్తర ఇంగ్లాండ్‌లోని కన్జర్వేటివ్‌ల కంచుకోటైన తన సొంత పార్లమెంటరీ స్థానాన్ని కూడా కోల్పోవచ్చు. ఆర్థిక మంత్రి జెరెమీ హంట్‌తో సహా పలువురు సీనియర్ మంత్రులకు ఓటమి తప్పదు’’ అని సావంత పోల్ పేర్కొంది. కన్జర్వేటివ్ పార్టీ చరిత్రలోనే అత్యంత ఘోర పరాజయం తప్పక పోవచ్చని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత సంతతికి చెందిన వారు ఈసారి కన్జర్వేటివ్ పారీ్టకి ఓటేయకపోవచ్చనేది పోల్స్టర్ల అంచనా. లేబర్ పారీ్టకి 425కు పైగా సీట్లు...! హౌజ్ ఆఫ్ కామన్స్‌లో 650 సీట్లకు గాను లేబర్ పార్టీ 425కు పైగా సాధించి భారీ మెజారిటీతో అధికారంలోకి వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. కన్జర్వేటివ్ పార్టీ 108 స్థానాలకు పరిమితమవుతుందని యూగవ్, కేవలం 53 స్థానాలకే పరిమితమవుతారని సావంత పోల్ పేర్కొన్నాయి. సావంత అయితే లేబర్ పార్టీకి దాని చరిత్రలోనే అత్యధికంగా 516 సీట్లు రావచ్చని అంచనా వేయడం విశేషం! కన్జర్వేటివ్‌లకు 72కు మించబోవని, లేబర్ పార్టీ 456 సీట్లు దాటుతుందని బెస్ట్ ఫర్ బ్రిటన్ సర్వే అంచనా వేసింది. 2019 ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ 43.6 శాతం ఓట్లతో 365 సీట్లు సాధించగా లేబర్ పార్టీకి 32.1 శాతం ఓట్లతో 202 స్థానాలు దక్కాయి. ఆకట్టుకుంటున్న కైర్ స్టార్మర్ ‘లెఫ్టీ లండన్ లాయర్’గా పేరు తెచ్చుకున్న కైర్ స్టార్మర్ లేబర్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. 14 ఏళ్లుగా విపక్షంలో ఉంటూ కుంగిపోయిన పారీ్టలో ఆయన జోష్ నింపుతున్నారు. ఇళ్ల సంక్షోభాన్ని పరిష్కరిస్తామని, పన్ను పెంపుదల లేకుండా మెరుగైన ప్రజా సేవలను అందిస్తామనే మామీలతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కన్జర్వేటివ్ పార్టీ ప్రధాన దాత అయిన బిలియనీర్ జాన్ కాడ్వెల్ కూడా ఈసారి లేబర్ పారీ్టకి మద్దతిస్తున్నారు. తాను లేబర్ పారీ్టకే ఓటేస్తానని బాహాటంగా చెబుతున్నారు. అందరూ అదే చేయాలని పిలుపునిస్తున్నారు.ప్రజల్లో వ్యతిరేకతకు కారణాలెన్నో... బ్రెగ్జిట్ పరిణామాల నేపథ్యంలో డేవిడ్ కామెరాన్ రాజీనామా అనంతరం చీటికీమాటికీ ప్రధానులు మారడం కన్జర్వేటివ్ పార్టీకి చేటు చేసింది. థెరిసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్, రిషి రూపంలో ఏకంగా నలుగురు ప్రధానులు మారారు. వీరిలో 45 రోజులే కొనసాగిన ట్రస్ పారీ్టకి గట్టి నష్టాన్ని కలిగించారని, దాన్ని సునాక్ పూడ్చలేకపోయారని అంటున్నారు.→ 2022 అక్టోబర్‌లో రిషి ప్రధాని అవుతూనే ద్రవ్యోల్బణాన్ని సగానికి తగ్గిస్తానని, ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని, రుణ భారాన్ని, నేషనల్ హెల్త్ సరీ్వస్ వెయిటింగ్ జాబితాను తగ్గిస్తానని, అక్రమ వలసలను అడ్డుకుంటానని హామీ ఇచ్చారు. ఇవేవీ చేయలేకపోగా సంప్రదాయ ఓటర్లనూ మెప్పించలేకపోయారని విమర్శ ఉంది.→ ఐదేళ్లలో బ్రిటన్ వాసుల జీవన ప్రమాణాలు బాగా పడిపోయాయి. వారిపై పన్ను భారమైతే గత 70 ఏళ్లలో అత్యధిక స్థాయిలో ఉంది. అక్రమ వలసలు పెరిగాయి. ప్రధానిగా సునాక్ నిర్ణయాలపై సొంత పార్టీ నేతల నుంచే విమర్శలొచ్చాయి. → వీటికి తోడు 14 ఏళ్లుగా అధికారంలో ఉండటంతో సహజంగానే ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉంది.→ రిఫార్మ్ యూకే పార్టీ పుంజుకోవడం కూడా కన్జర్వేటివ్‌లను దెబ్బ తీయనుంది. ఈ పారీ్టకి 15 శాతం ఓట్ల వాటా ఉంది. ఈసారి చాలా స్థానాల్లో కన్జర్వేటివ్ ఓటు బ్యాంకుకు భారీగా గండి పెడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌కు ఊహించని ఎదురుదెబ్బ!
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాన్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల వేళ.. స్థానిక ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి ఎదురైంది. గత 40 ఏళ్ల చరిత్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ఇంతలా ఓటమి చెందడం ఇదే మొదటిసారి అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.వివరాల ప్రకారం.. బ్రిటన్‌లో ఈ ఏడాది చివర్లలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఇలాంటి తరుణంలో ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఫలితాలు రిషి సునాక్ కన్జర్వేటివ్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి. కాగా, బ్రిటన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేనివిధంగా కన్జర్వేటివ్ పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దీంతో, ప్రధాని రిష్ సునాక్‌పై ఒత్తిడి అమాంతం పెరిగిపోయింది. అలాగే, ఈ ఫలితాలు ప్రధాని పీఠంపైనా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఇక, బ్రిటన్‌లో 107 కౌన్సిల్స్‌కు ఎన్నికల జరిగాయి. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ ముందంజలో కొననసాగుతోంది. Disaster for Tories. Love to see it. Now @RishiSunak call for general elections. pic.twitter.com/6Bj1ARAUbh— OppaGaymer 🇵🇸 (@RafLee84) May 3, 2024 కాగా, బ్లాక్పూల్ సౌత్‌లో కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి డేవిడ్ జోన్స్‌పై లేబర్ పార్టీ అభ్యర్థి క్రిస్ వెబ్ ఘన విజయం సాధించారు. టోరీల నుంచి లేబర్ పార్టీకి 26 శాతం ఓటు స్వింగ్ అయింది. 1945 తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో ఇదే అతి పెద్ద విజయం కావడం విశేషం. గత 40 సంవత్సరాలుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇదే దారుణ ఫలితమని, కన్జర్వేటివ్ ప్రభుత్వ పనితీరును అంతా గమనిస్తున్నారని ప్రొఫెసర్ జాన్ కర్టీస్ తెలిపారు. Local elections in England and Wales have delivered a blow to Prime Minister Rishi Sunak and his governing Conservative Party. The opposition Labour Party is on track to win the next general election which takes place later this year pic.twitter.com/iiHfbaqqUZ— TRT World (@trtworld) May 3, 2024 మరోవైపు.. బ్లాక్పూల్ సౌత్ ఉపఎన్నికలో టోరీ మెజారిటీ తారుమారైంది. ఇక్కడ ప్రతిపక్ష లేబర్ పార్టీ గణనీయ విజయాలను సాధించింది. బ్లాక్పూల్ సౌత్ ఉప ఎన్నికల్లో 26 శాతంతో తమ పార్టీ విజయం సాధిచడం కీలక పరిణామం అని లేబర్ పార్టీ నాయకుడు సర్ కీర్ స్టార్మర్ అన్నారు. ఇప్పటికే ప్రారంభమైన ఫలితాలు టోరీలు కౌన్సిల్ సీట్లలో సగం కోల్పోవచ్చని అంచనాలు వస్తున్నాయని తెలిపారు.ఇదిలా ఉండగా.. ఈ వారాంతంలో లండన్ మేయర్ ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. ఈ క్రమంలో లేబర్ పార్టీ లండన్ మేయర్ అభ్యర్థి సాదిక్ ఖాన్ మూడోసారి తిరిగి ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఇక, ప్రచారంలో తనకు సహకరించిన ప్రజలకు, తనను ఆదరించిన ఓటర్లకు ఆయన ప్రత్యర్థి బ్రిటీష్ భారతీయ వ్యాపారవేత్త తరుణ్ గులాటి కృతజ్ఞతలు తెలిపారు. తనకు భారత్ సహా ప్రపంచం నలుమూలల నుంచి మద్దతు లభిస్తోందని గులాటి వ్యాఖ్యలు చేశారు. -
UK Elections: చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమా?
లండన్: కన్జర్వేటివ్ పార్టీ.. బ్రిటన్‌లో దాదాపు పదిహేన్లపాటు అధికారంలో కొనసాగింది. అయితే వచ్చే ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని సర్వేలు తేల్చి చెబుతున్నాయి. గత రెండు మూడేళ్లుగా ఆ దేశ రాజకీయాల్లో కొనసాగుతున్న అనిశ్చితి(ప్రధాని, మంత్రుల రాజీనామాలు.. తొలగింపులు), మరీ ముఖ్యంగా భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలో ఆ పార్టీ ఇమేజ్ మరింత దిగజారిపోయిందని ఆ సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. వచ్చే ఏడాది ప్రారంభంలో యూకేలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో(తేదీలు ఖరారు కావాల్సి ఉంది) లేబర్ పార్టీ ప్రభంజనం దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. కన్జర్వేటివ పార్టీ గత ఐదేళ్లలో ఇచ్చిన హామీలీను నెరవేర్చకపోగా.. దేశాన్ని వరుస సంక్షోభాల్లోకి నెట్టేసిందన్న అభిప్రాయంలో ఉన్నారు అక్కడి ప్రజలు. పైగా కాస్ట్ ఆఫ్ లివింగ్ సైతం విపరీతంగా పెరిగిపోవడంతో ప్రభుత్వ వ్యతిరేకత తారాస్థాయికి చేరిందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా.. మార్చి 7వ తేదీ నుంచి 27 తేదీ మధ్య YouGov ఓ పబ్లిక్ సర్వే నిర్వహించింది. అందులో 18, 761 మంది పౌరులు పాల్గొన్నారు. వాళ్లలో మెజారిటీ పౌరులు.. లేబర్ పార్టీకే ఓటేస్తామని స్పష్టం చేశారు. మొత్తం 650 స్థానాలున్న యూకే పార్లమెంట్లో.. అధికారం చేపట్టాలంటే 326 స్థానాలు దక్కించుకోవాల్సి ఉంటుంది. అయితే యూజీవోవీ సర్వేలో లేబర్ పార్టీకి 403 స్థానాలు, కన్జర్వేటివ్ పార్టీ కేవలం 155 స్థానాలు దక్కించుకుంటాయని సదరు సర్వే తెలిపింది. ఈ ఏడాది జనవరిలో ఇదే సంస్థ జరిపిన సర్వేలో కన్జర్వేటివ్ పార్టీకి 169 స్థానాలు రావొచ్చని అంచనా వేయగా.. తాజా సర్వేలో ఆ స్థానాలు మరింత తగ్గడం గమనార్హం. పోల్ ఆఫ్ పోల్స్ పోలిటికో సైతం ఇలాంటి ట్రెండ్‌నే ప్రకటించింది. మార్చి 31వ తేదీన వెల్లడించిన సర్వేలో.. 44 శాతం లేబర్ పార్టీకి, 23 శాతం కన్జర్వేటివ్పార్టీకి సీట్లు దక్కవచ్చని వెల్లడించింది. భారత సంతతికి చెందిన రిషి సునాక్ అక్టోబర్ 24, 2022లో బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో ఆయన ముందు పెను సవాళ్లు ఉండగా.. ఆయన వాటిని అధిగమిస్తానని స్పష్టం చేశారు. అయితే.. అప్పటి నుంచి బ్రిటన్ సంక్షోభం మరింత ముదిరింది. ఈ మధ్యలో ఆయన పైనా విమర్శలు వెల్లువెత్తుతూ వస్తున్నాయి. ఇదిలా ఉంటే.. మే 2వ తేదీన యూకేలో మేయర్, లోకల్ కౌన్సిల్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలను వాయిదా వేయించాలని కన్జర్వేటివ్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ, కోర్టులు అందుకు అంగీకరించలేదు. ఇక ఈ ఎన్నికల్లోనూ కన్జర్వేటివ్ పార్టీ ఓటమి తప్పదంటూ ఇప్పటికే పలు సర్వేలు తేల్చేశాయి. -
రిషి సునాక్‌పై తీవ్ర విమర్శలు చేసిన బ్రిటన్ ఎంపీ
లండన్: బ్రిటిష్ మాజీ కల్చర్ సెక్రెటరీ నాడైన్ డోరీస్ తన పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేస్తూ రాసిన లేఖలో ప్రధాని రిషి సునాక్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. బోరిస్ జాన్సన్ ఎంపీగా రాజీనామా చేసినప్పుడే ఆమె కూడా రాజీనామా చేయాల్సి ఉంది కానీ అప్పుడు ఆమె రాజీనామా చేయనందుకు తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. ఎట్టకేలకు రాజీనామా చేసిన ఆమె రిషి సునాక్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ భారీ లేఖను రాశారు. బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు అత్యంత సన్నిహితురాలైన కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ నాడైన్ డోరీస్ చాలా కాలంగా రిషి సునాక్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారు. పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ప్రధాని జాంబీల ప్రభుత్వాన్ని నడుపుతున్నారని ఆయనకు ఎటువంటి రాజకీయ ముందుచూపు లేదన్నారు. రిషి సునాక్ తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమి సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు. ఆర్ధిక పరమైన కుంభకోణాలతో పాటు మరికొన్ని కుంభకోణాల కారణంగా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ తన పదవి నుండి తప్పుకున్నారు. మాజీ ఆర్ధిక మంత్రి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ అయిన రిషి సునాక్ పార్టీ నాయకత్వ పోటీలో నామినేట్ చేయబడిన ఏకైక అభ్యర్థి కావడంతో ప్రధానిగా నియమితులయ్యారు. ఎంపీ రాసిన రాజీనామా లేఖ సంగతి అటుంచితే రిషి సునాక్ ప్రభుత్వం ప్రస్తుతానికైతే వెంటిలేటర్‌పైనే ఉండాలి చెప్పాలి. కొద్దీ రోజుల క్రితం ఖాళీ అయిన పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ రెండు స్థానాలను కోల్పోగా బోరిస్ జాన్సన్ రాజీనామా చేసిన చోట మాత్రం గెలిచింది. ప్రధాని రిషి సునక్ తన సాంకేతిక నాయకత్వాన్ని ఉపయోగించుకుని పార్టీ విశ్వసనీయతను కాపాడుకంటూ వస్తున్నారు. కానీ అధిక ద్రవ్యోల్బణం, ఆర్థిక స్తబ్దత, పారిశ్రామిక అస్థిరత ప్రభుత్వ ఆరోగ్య సేవల్లో జాప్యం వంటి కారణాలు వారిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఈ కారణాల వల్లనే వచ్చే ఎన్నికల్లో కన్జర్వేటివ్ పార్టీ ప్రత్యర్థి లేబర్ పార్టీ కంటే చాలా వెనుకబడి ఉన్నారని అక్కడి మీడియా వర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: బాస్మతి బియ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు.. -
అమెరికా అధ్యక్షుడి రేసులో రిపబ్లికన్ పార్టీ తరపున మరో భారతీయుడు
వాషింగ్టన్: 2024లో జరగనున్న అమెరికా అధ్యక్షుడి ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున ప్రెసిడెన్షియల్ అభ్యర్థిగా మరో భారతీయుడు ఎంట్రీ ఇచ్చారు. ఇండో అమెరికన్ ఇంజినీర్ అయిన హిర్ష్ వర్ధన్ సింగ్(38) ఈ మేరకు మూడు నిముషాల నిడివి ఉన్న ఒక వీడియో సందేశం ద్వారా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. హిర్ష్ వర్ధన్ సింగ్ కంటే ముందు రిపబ్లికన్ పార్టీ తరపున సౌత్ కరోలినా గవర్నర్ నిక్కీ హాలీ(51), మిలియనీర్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి(37) అమెరికా అధ్యక్ష పదవికి తమ అభ్యర్థిత్వాన్ని ప్రకటించగా హిర్ష్ వర్ధన్ సింగ్ ఈ రేసులో నిలిచిన మూడో భారతీయ సంతతి వారిగా నిలిచారు. వీడియో సందేశంలో సింగ్ మాట్లాడుతూ.. నేను జీవితకాలం రిపబ్లికన్ గా ఉంటానని, న్యూ జెర్సీ రిపబ్లికన్ పార్టీ కన్జర్వేటివ్ విభాగాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించిన మొట్టమొదటి అమెరికన్ ను నేనేనన్నారు.. గత కొన్నేళ్లుగా వచ్చిన మార్పులను యధాస్థితికి తీసుకొచ్చి అమెరికా విలువలను కాపాడేందుకు బలమైన నాయకత్వం అవసరముందన్నారు. నాది స్వచ్ఛమైన రక్తం.. కోవిడ్ సమయంలో కూడా ఎటువంటి వ్యాక్సినేషన్ల జోలికి వెళ్ళలేదని.. అందుకే నేను రిపబ్లికన్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష రేసులో నిలవాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఈ మేరకు గురువారమే ఫెడరల్ ఎలెక్షన్ కమిషన్ లో తన అభ్యర్థిత్వాన్ని దాఖలు చేశారు హిర్ష్ వర్ధన్ సింగ్. హిర్ష్ వర్ధన్ సింగ్ గతంలో న్యూజెర్సీ తరపున 2017,2021లో గవర్నర్ గాను, 2018లో హౌస్ సీటు కోసం, 2020లో సెనేటర్ గాను ప్రయత్నించారు. కానీ రిపబ్లికన్ పార్టీ నామినేషన్ దక్కించుకోవడంలో విఫలమయ్యారు. ఇటీవలి కాలంలో కూడా గవర్నర్ గా క్యాంపెయిన్ చేస్తూ డోనాల్డ్ ట్రంప్ తో పోటీపడ్డారు. కానీ నామినేషన్లలో మూడో స్థానంలో నిలిచారు. మొత్తంగా రిపబ్లికన్ పార్టీ తరపున ఈసారి ముగ్గురు భారత సంతతి వారు అధ్యక్ష పదవి కోసం నామినేషన్లలో పోటీ పడుతున్నారు. ఇదే పార్టీ తరపున అధ్యక్ష పదవికి నామినేషన్ రేసులో డోనాల్డ్ ట్రంప్ మొదటి వరుసలో ఉన్నారు. కానీ ఆయనపై నేర అభియోగాలున్న నేపథ్యంలో తర్వాతి వరుస వారిని అదృష్టం వరించినా వరించొచ్చు. అధ్యక్షుడి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు వచ్చే ఏడాది జులై 15-18 వరకు మిల్వాకీ, విస్కాన్సిన్ లో రిపబ్లికన్లు సమావేశం కానున్నారు. I'm entering the race for President.https://t.co/OEHCSYOdvK pic.twitter.com/RyxW4sKMSW — Hirsh Vardhan Singh (@HirshSingh) July 27, 2023 ఇది కూడా చదవండి: గాల్లో ఆగిపోయిన రోలర్ కోస్టర్.. బిక్కుబిక్కుమంటూ పర్యాటకులు -
రిషి సునాక్ ప్రభుత్వానికి షాక్.. ఉప ఎన్నికల్లో ఎదురుదెబ్బ..
లండన్: బ్రిటన్ లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ త్రుటిలో చావు దెబ్బ తప్పించుకుంది. మొత్తం మూడు స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఒక్క సీటు గెలుచుకుని మిగిలిన రెండు చోట్ల ఓటమిపాలైంది. అసలే సార్వత్రిక ఎన్నికల్లో సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల ఫలితాలు చాలా కీలకంగా నిలిచాయి. మొత్తం మూడు స్థానాలకుగాను జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ స్థానాన్ని మాత్రం స్వల్ప మెజారిటీతో తిరిగి దక్కించుకుంది. ఒకవేళ ఆ స్థానాన్ని కూడా కోల్పోయి ఉంటే ఒకే రోజు మూడు సీట్లు కోల్పోయిన ప్రధానిగా రిషి సునాక్ చరిత్రలో నిలిచిపోయేవారు. అదృష్టవశాత్తు ఉక్స్ రిడ్జ్, సౌత్ రూస్లిప్ పరిధిలోని వెస్ట్ లండన్ లో గెలిచి ఆయన ఈ ఘోర అవమానం నుండి తప్పించుకున్నారు. మిగిలిన రెండు స్థానాల్లో సోమర్టన్, ఫ్రోమ్ సీట్ లో 19 వేలు, సెల్బీ.ఎయిన్స్టీ నియోజకవర్గంలో 20 వేలు మెజార్టీతో లేబర్ పార్టీ చేతిలో ఓడిపోయింది కన్జర్వేటివ్ పార్టీ. సెల్బీ, ఎయిన్స్టీలో గెలిచిన అభ్యర్థి కెయిర్ మాథెర్(25) మాట్లాడుతూ.. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి ఇక్కడివారు అసంతృప్తితో ఇచ్చిన తీర్పు ఇదని అన్నారు. సోమర్టన్, ఫ్రోమ్ లో గెలిచిన లేబర్ పార్టీ అభ్యర్థి సారా డైక్ మాట్లాడుతూ.. ఇది చారిత్రిక విజయం. ఈ ప్రభుత్వం చేతకానితనంతో సర్కస్ చేస్తోందని ప్రజలకు అర్ధమైపోయిందన్నారు. అసలే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఉపఎన్నికల ఫలితాలు రిషి సునాక్ ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ గా మారాయి. గతేడాది మార్చ్ నుంచి జరిగిన ఉప ఎన్నికల్లో ఆరు స్థానాలను లేబర్ పార్టీ గెలుచుకోవడం ఆందోళనకరమని చెబుతున్నాయి కన్జర్వేటివ్ పార్టీ వర్గాలు. గడిచిన 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వడ్డీ రేట్లు పెరగడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అందుకే జనం ప్రభుత్వ విధానాలపై కొంత అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు స్థానికులు. ఇది కూడా చదవండి: 40 ఏళ్లుగా ప్రధాని.. మళ్ళీ ఆయనే.. -
Rishi Sunak: ఓటమి భయంతో..
లండన్: బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌పై అధికార కన్జర్వేటివ్ పార్టీలో నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆయన అధినాయకత్వంలో తిరిగి గెలుస్తామన్న ధీమా లేకపోవడంతో.. చట్ట సభ్యులంతా ఆందోళనతో గందరగోళానికి తెర తీస్తున్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి చెందుతామనే ఆందోళనలో కూరుకుపోయారు కన్జర్వేటివ్ సభ్యులు చాలామంది. ఈ నేపథ్యంలో పోటీకి దూరంగా ఉండాలనే ఆలోచనతో ఉన్నారట చాలామంది. అంతేకాదు.. మరికొందరైతే వేరే చోట్ల పోటీ చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పావులు కదుపుతున్నట్లు సమాచారం. రిషి సునాక్ నేతృత్వంలో ఎన్నికల్లో పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుందనే నమ్మకం చాలా కొద్ది మందిలోనే నెలకొన్నట్లు పార్టీ అంతర్గత సమావేశాలు, పోల్స్ ద్వారా తెలుస్తోంది. ఈ పరిణామాలపై కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత స్పందిస్తూ.. బహుశా ఎంపీలు హెలికాప్టర్లలో తమ తమ నియోజకవర్గాలను వెతుక్కుంటే బావుంటేదేమో అంటూ చమత్కరించారు. 90వ దశకంలో టోనీ బ్లేయర్ నేతృత్వంలోని ప్రతిపక్ష లేబర్ పార్టీ.. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఓడిపోకుండా ఉండేందుకు సురక్షితమైన స్థానాల్లో పోటీ కోసం చేసిన ప్రయత్నాలను చికెన్ రన్‌గా అభివర్ణించాయి. అంటే కోళ్లు పరిగెత్తినట్లు హడావుడిగా తమ తమ సురక్షిత స్థానాల కోసం ఎంపీలు పరుగులు పెట్టారని ఎద్దేవా చేసింది. అప్పటి నుంచి ఆ పదం అలా బ్రిటన్ రాజకీయాల్లో స్థిరపడిపోయింది. -
ఏపీ సంక్షేమ పథకాలకు లండన్ ఎంపీ కితాబు
సాక్షి, అనంతపురం: లండన్‌లో కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ బాబ్‌బ్లాక్‌మెన్‌ను అనంతపురం మేయర్ వసీం శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. నాలుగుసార్లు ఎంపీగా గెలిచినా ఆయన చాలా నిరాడంబరంగా తనతో గంటపాటు ముచ్చటించారని మేయర్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల బ్రోచర్‌ను అందించి వివరించానన్నారు. సచివాలయ – వలంటీర్ వ్యవస్థ, అమ్మ ఒడి తదితర సంక్షేమ పథకాలు భవిష్యత్తు తరాలను తీర్చిదిద్దేందుకు ఎంతో దోహదం చేస్తాయని ఆయన కితాబునిచ్చారన్నారు. ప్రజల కోసం ఆలోచించే వ్యక్తులు ఎప్పటికీ మహోన్నతులుగానే ఉంటారని ప్రశంసించారన్నారు. లండన్‌లోని కట్టడాలు, కొత్త ఆలోచనలను అనంతపురం నగరపాలక సంస్థలో అమలు పరిచేందుకు చర్యలు తీసుకుంటామని మేయర్ తెలిపారు. చదవండి: (అమ్మ ఇక లేదు.. ప్రేమ పెళ్లి విషాదాంతం) -
భారత్‌తో సాధ్యమైనంత త్వరగా ఎఫ్‌టీఏ: రిషి సునాక్
లండన్: భారత్‌తో సాధ్యమైనంత త్వరగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ) కుదుర్చొనేందుకు కృత నిశ్చయంతో ఉన్నామని యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి రిషి సునాక్ చెప్పారు. ఈ ఒప్పందంపై చర్చలను త్వరలోనే విజయవంతంగా ముగించాలని భావిస్తున్నామని తెలిపారు. రిషి సునాక్ తాజాగా యూకే పార్లమెంట్ దిగువ సభలో మాట్లాడారు. ఇండోనేషియాలో జీ–20 సదస్సు సందర్భంగా భారత ప్రధాని మోదీతో జరిగిన భేటీలో ఎఫ్‌టీఏ పురోగతిపై సమీక్షించానని వెల్లడించారు. భారత్‌తో ఒప్పందాన్ని ఎప్పటిలోగా కుదుర్చుకుంటారో చెప్పాలని ప్రతిపక్ష లేబర్ పార్టీతోపాటు అధికార కన్జర్వేటివ్ ఎంపీలు కోరారు. ఒప్పందంపై ప్రధాని మోదీతో ఇప్పటికే మాట్లాడానని, ఈ విషయంలో భారత్–యూకే మధ్య చర్చలకు సాధ్యమైనంత త్వరగా విజయవంతమైన ముగింపు పలకాలన్నదే తమ ఉద్దేశమని వివరించారు. వాస్తవానికి అక్టోబర్ ఆఖరులోనే ఇరు దేశాల చర్చలు ముగింపు దశకు చేరుకున్నాయని తెలిపారు. కొన్ని అంశాలపై సందేహాలను నివృత్తి చేసుకోవాల్సి ఉందని, పరస్పరం సంతృప్తికరమైన పరిష్కారం కనుక్కొంటామన్నారు. భారత్–యూకే బంధం వాణిజ్యానికి పరిమితమైందని కాదని, అంతకంటే విస్తృతమైనదని సునాక్ తేల్చిచెప్పారు. -
Rishi Sunak: రిషి సునాక్.. ఇది తగునా?
లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి రిషి సునాక్ తీరుపై కన్జర్వేటివ్ పార్టీ సీనియర్లలో అసంతృప్తి పెల్లుబిక్కుతోంది. వివాదాల్లో నిలిచిన వ్యక్తులను కేబినెట్లోకి తీసుకోవడం.. పైగా వాళ్లను వెనకేసుకొస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిన్నగాక మొన్న సువెల్లా బ్రేవర్మన్ను తిరిగి మంత్రిగా నియమించడంపై విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆ వేడి చల్లారకముందే తప్పు చేసిన మరో మంత్రిని వెనకేసుకు రావడం ద్వారా ఆయన మరోసారి విమర్శలపాలవుతున్నారు. సండేటైమ్స్ కథనం ప్రకారం.. మంత్రి గేవిన్ విలియమ్సన్.. మాజీ పార్టీ విప్, వెంటీ మోర్టన్కు ఫోన్ ద్వారా అసభ్యమైన సందేశాలు పంపారు. ఈ విషయాన్ని మరో మంత్రి ఒలీవర్ డౌడెన్ తాజాగా మీడియాకు వెల్లడించారు. వర్ణించలేని రీతిలో గేవిన్, ఆమెను తిట్టినట్లు తెలుస్తోంది. క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియల సమయంలో ఆహ్వానం అందకపోవడంపై రగిలిపోతూ వెంటీకి అలా మెసేజ్‌లు చేశాడట. అయితే.. ఈ వ్యవహారాన్ని ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే సునాక్ దృష్టికి తీసుకెళ్లారు పార్టీ మాజీ చైర్మన్ సర్ జేక్ బెర్రీ. ఫోన్ సంభాషణలను మీడియాకు చూపిస్తున్న డౌడెన్ మరోవైపు కన్జర్వేటివ్ పార్టీ గవర్నింగ్ బాడీకి ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. గేవిన్-వెంటీ మధ్య వైరం సంగతి రిషి సునాక్‌కు ముందు నుంచే తెలుసని, అయినప్పటికీ గేవిన్ను సునాక్ వెనుకేసుకొస్తున్నారని డౌడెన్ ఆరోపించారు. ఇక తీవ్ర విమర్శల నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ స్పందించారు. గేవిన్ చర్యలు సరికాదని, ఆమోదయోగ్యం ఎంతమాత్రం కాదని అన్నారు. అలాగే ఈ వ్యవహారంలో ఎవరికీ వెనుకేసుకు రావాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఫిర్యాదు నేపథ్యంలో.. ఈ ఘటనపై దర్యాప్తు జరుగుతుందని ఆయన చెప్పారు. అంతకు ముందు సువెల్లా బ్రేవర్మన్ నియామకాన్ని ఆయన సమర్థించుకున్న సంగతి తెలిసిందే!. ఇదీ చదవండి: మూలాలపై రిషి సునాక్ ఆసక్తికర వ్యాఖ్యలు -
పాలించడమెలాగోచూపిస్తా
లండన్: ఆర్థిక, రాజకీయ సంక్షోభాలతో సతమతమవుతున్న బ్రిటన్‌కు స్థిరత్వం, ప్రజలకు విశ్వాసం కలిగించడమే తమ ప్రభుత్వ అజెండాలో ప్రధానాంశమని నూతన ప్రధాని రిషి సునాక్ ప్రకటించారు. తాజా మాజీ ప్రధాని లిజ్ ట్రస్ చేసిన ఆర్థిక తప్పిదాలను సరిచేసేందుకే కన్జర్వేటివ్ ఎంపీలు తనను సారథిగా ఎన్నుకున్నారని అభిప్రాయపడ్డారు. ‘‘మార్పు కోసం ట్రస్ చేసిన ప్రయత్నాన్ని అభినందిస్తున్నా. ఆమె ఉద్దేశాలు మంచివే. కాకపోతే తీసుకున్న నిర్ణయాల్లో, వాటి అమల్లోనే తప్పిదాలు దొర్లాయి’’ అన్నారు. మంగళవారం ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అధికార నివాసం 10, డౌనింగ్ స్ట్రీట్ నుంచి జాతినుద్దేశించి ఆయన తొలి ప్రసంగం చేశారు. దేశం చరిత్రలోనే అతి పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే, ‘‘తొలుత కరోనా, తర్వాత రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మన పాలిట పెను సమస్యలుగా మారాయి. పరిస్థితిని దీటుగా ఎదుర్కొంటాం. కరోనా, దానివల్ల తలెత్తిన ఆర్థిక సమస్యలను ఆర్థిక మంత్రిగా ఎంత సమర్థంగా నిభాయించుకొచ్చానో అందరికీ తెలుసు. ప్రజలను, వ్యాపార వాణిజ్యాలను పరిరక్షించేందుకు అన్ని చర్యలూ తీసుకున్నా. అదే స్ఫూర్తితో ఇప్పుడూ సమస్యలను అధిగమిస్తాం. సమస్యను చూసి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. పూర్తి జవాబుదారీతనం, సమగ్రత, పక్కా ప్రొఫెషనలిజంతో కూడిన పాలన ఎలా ఉంటుందో చూపిస్తా. మాటలతో కాకుండా చేతల్లో దేశాన్ని ఐక్యం చేసి చూపిస్తా’’ అని చెప్పారు. ‘‘మనం చెల్లించలేనంత భారీ అప్పులను ముందు తరాలపై రుద్దే ప్రసక్తే లేదు. సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరిస్తా’’ అని స్పష్టం చేశారు. అదే సమయంలో పౌరుల సంక్షేమం పట్ల సహానుభూతితో వ్యవహరిస్తామన్నారు. ‘‘మేం పూర్తి స్పష్టతతో రంగంలోకి దిగాం. ఈ క్షణం నుంచే మా పని మొదలైంది. దేశ సంక్షేమం కోసం అహోరాత్రాలూ కష్టపడతాను’’ అని ప్రకటించారు. ‘‘మనమంతా కలిసి పని చేస్తే అద్భుతాలు చేసి చూపించొచ్చు’’ అంటూ ఆత్మవిశ్వాసం వెలిబుచ్చారు. అందరి ఆకాంక్షలకు అనుగుణంగానే తన పాలన ఉంటుందని ఆశాభావం వెలిబుచ్చారు. ఆ క్రమంలో తాను పలు కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు స్పష్టమైన సంకేతాలిచ్చారు. ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేస్తున్న విపక్షాలపై రిషి విమర్శలు ఎక్కుపెట్టారు. భార్య అక్షత, కుమార్తెలు కృష్ణ, అనౌష్కలతో కలిసి మాట్లాడతారని అంతా భావించగా రిషి ఒంటరిగానే దాదాపు 6 నిమిషాల పాటు మాట్లాడారు. బ్రిటన్ చరిత్రలో ఓ కొత్త ప్రధాని చేసిన అతి సుదీర్ఘ తొలి ప్రసంగాల్లో ఇదొకటని చెబుతున్నారు. బోరిస్ జాన్సన్ మాత్రం 2019లో బాధ్యతలు చేపట్టాక ఏకంగా 11 నిమిషాల 13 సెకన్లు మాట్లాడారు! తాజా మాజీ ప్రధాని ట్రస్ తన తొలి ప్రసంగాన్ని 4 నిమిషాల్లో ముగించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బ్రిటన్ ప్రధాని పోటీలో ఉన్నా.. అధికారికంగా ప్రకటించిన రిషి సునాక్..
లండన్: భారత సంతతికి చెందిన రిషి సునాక్ తాను మరోసారి బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్నట్లు ఆదివారం అధికారికంగా ప్రకటించారు. అత్యంత గొప్ప దేశమైన బ్రిటన్.. ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుందని పేర్కొన్నారు. తాను ప్రధాని అయి పరిస్థితిని చక్కదిద్దుతానని, పార్టీని ఏకం చేసి అందరి మద్దతుతో దేశాన్ని ముందుకు నడిపిస్తానని చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. గతంలో తాను ఆర్థిక మంత్రిగా పని చేసిన విషయాన్ని రిషి సునాక్ గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆ అనుభవం ఉపయోగపడుతుందన్నారు. అయితే అందరూ అనుకున్న దానికంటే కఠిన సవాళ్లను అధిగమించాల్సి ఉందన్నారు. అందుకే ఇప్పుడు కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు తీసుకునే నిర్ణయం భవిష్యత్ తరాలకు మనకంటే ఎక్కువ అవకాశాలు తెచ్చిపెట్టేలా ఉండాలన్నారు. తాను పార్టీ నాయకుడిగా, ప్రధానిగా బాధ్యతలు చేపట్టి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. The United Kingdom is a great country but we face a profound economic crisis. That’s why I am standing to be Leader of the Conservative Party and your next Prime Minister. I want to fix our economy, unite our Party and deliver for our country. pic.twitter.com/BppG9CytAK — Rishi Sunak (@RishiSunak) October 23, 2022 రిషి సునాక్ ప్రధాని పదవికి పోటీ చేసి రెండు నెలలు కూడా గడవలేదు. లిజ్ ట్రస్‌తో పోటీ పడిన ఆయనకు సొంత ఎంపీల మద్దతు లభించినా.. పార్టీ సభ్యుల నుంచి మాత్రం ఓట్లు రాలేదు. దీంతో ఓటమి పాలయ్యారు. అయితే ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ట్రస్ ఘోరంగా విఫలం కావడంతో 45 రోజులకే ఆమె పదవికి రాజీనామా చేశారు. దీంతో రెండు నెలల వ్యవధిలోనే మరోసారి కొత్త ప్రధాని ఎంపిక అనివార్యమైంది. అయితే ఈసారి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా పోటీలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు కూడా 100మందికిపైగా కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల మద్దతు ఉన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. అయితే బోరిస్ తన అభ్యర్థిత్వాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరి ఈసారైనా రిషి ప్రధాని అవుతారో లేదో చూడాలి. చదవండి: రిషి, బోరిస్ నువ్వా, నేనా? -
UK Political Crisis: ఎంపీలే కీలకం
బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్ రాజీనామాతో ఆమె వారసుడెవరన్న దానిపై అంతటా ఆసక్తి నెలకొంది. భారత సంతతికి చెందిన మాజీ ఆర్థిక మంత్రి రిషి సునాక్, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ సహా పలువురు రేసులో ఉన్నారు. ఈసారి ఎన్నికల ప్రక్రియలో కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల కంటే ఎంపీల మద్దతే కీలకంగా మారింది. అభ్యర్థిగా బరిలో దిగాలంటే కనీసం 100 మంది ఎంపీల మద్దతు అవసరం. గతంలో 20గా ఉండేది. ఎన్నిక ప్రక్రియ ఇలా... ఈసారి ఎన్నిక ప్రక్రియ కూడా గతంలో కంటే భిన్నంగా ఉంటుంది. 1922 కమిటీ నిబంధనల మేరకు 100 మంది ఎంపీల మద్దతున్నవారికే పోటీకి చాన్సుంటుంది. పార్లమెంటులో 357 మంది ఎంపీలున్నందున అత్యధికంగా ముగ్గురు బరిలో దిగొచ్చు. ► నామినేషన్‌కు ఈ నెల 24తో గడువు ముగుస్తుంది. అప్పటికల్లా ఇద్దరి కంటే ఎక్కువ మంది 100 ఎంపీల మద్దతు సాధిస్తే వారి నుంచి ఇద్దరిని ఎంపీలే అప్పటికప్పుడు ఎన్నుకుంటారు. అంటే అత్యధిక ఓట్లు పొందిన ఇద్దరు బరిలో మిగులుతారు. ► ఆ ఇద్దరిలో ఒకరిని టోరీ సభ్యులు ఆన్లైన్లో తమ నాయకుడిగా ఎన్నుకుంటారు. అక్టోబర్ 28న ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాత కింగ్ చార్లెస్ –3 లాంఛనంగా కొత్త ప్రధానిని నియమిస్తారు. ► ఒకవేళ గడువులోగా 100 మంది ఎంపీల మద్దతు ఒక్కరికే లభిస్తే తదుపరి ప్రక్రియతో పని లేకుండా వారే నేరుగా ప్రధాని అవుతారు. ► ఒక ప్రధాని రాజీనామా చేసి మరొకరు పదవి చేపట్టే సమయంలో ఎన్నిక ప్రక్రియ సర్వసాధారణంగా టోరీ సభ్యుల వరకు వెళ్లదు. ఇద్దరు సభ్యులు చివర్లో మిగిలితే తక్కువ మంది ఎంపీల మద్దతున్న వారు తప్పుకుంటారు. 2016లో థెరిసా మే ప్రధాని అయినప్పుడు ప్రత్యర్థి అండ్రూ లీడ్సమ్ ఇలాగే బరి నుంచి తప్పుకున్నారు. ► అందుకే ఈ సారి ఎన్నికలో టోరీ సభ్యులు కంటే ఎంపీలే కీలకంగా ఉన్నారు. రేసులో వీరే... రిషి సునాక్: భారత సంతతికి చెందిన రిషి ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అల్లుడు. గత ఎన్నికలో ట్రస్‌కు గట్టి పోటీ ఇచ్చారు. అత్యధిక ఎంపీల మద్దతు ఆయనకే ఉన్నా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టగలనని సభ్యుల్లో విశ్వాసం కలిగించలేక 21 వేల ఓట్లతో ఓటమి పాలయ్యారు. ట్రస్ పన్ను రాయితీలు దేశాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెడతాయని మొదట్నుంచి హెచ్చరిస్తూ వచ్చిన సునాక్‌కు ఈసారి ఎంపీల మద్దతు లభించే అవకాశముంది. బోరిస్ జాన్సన్: తాను ప్రధాని పదవి నుంచి తప్పుకోవాల్సి రావడానికి రిషియే కారణమన్న ఆగ్రహంతో ఉన్న జాన్సన్ మరోసారి పీఠమెక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. సొంత పార్టీ ఎంపీలు, మంత్రుల తిరుగుబాటు కారణంగా మరో దారి లేక ప్రధానిగా రాజీనామా చేసినా, జాన్సన్‌కు ఇప్పటికీ పార్టీపై పట్టుంది. ట్రస్ చేతిలో రిషి ఓటమికి జాన్సన్ తెర వెనుక మంత్రాంగమే ప్రధాన కారణమన్న ఆరోపణలున్నాయి. కరోనా సమయంలో పార్టీలు చేసుకున్న వ్యక్తిగా అప్రతిష్ట మూటగట్టుకున్న ఆయనకు ఈసారి కూడా ఎంపీలు మద్దతుగా నిలవకపోయినా సునాక్‌ని ఓడించడానికైతే ప్రయత్నిస్తారన్న వార్తలు విన్పిస్తున్నాయి. పెన్నీ మోర్డంట్: బ్రిటన్ తొలి మహిళా రక్షణ మంత్రి. గత ఎన్నికల్లో ఎంపీల మద్దతు బాగా సంపాదించినా తుది ఇద్దరు అభ్యర్థుల్లో స్థానం దక్కించుకోలేకపోయారు. మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ట్రస్‌కు మద్దతుగా నిలిచి ఆమె ప్రధాని అయ్యాక హౌస్ ఆఫ్ కామన్స్ అండ్ లార్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ప్రైవీ కౌన్సిల్‌కి నాయకురాలయ్యారు. ట్రస్‌పై ఎంపీల్లో వ్యతిరేకత ఉండడంతో ఆమె సన్నిహితురాలైన పెన్నీకి ఎంతవరకు మద్దతునిస్తారన్న అనుమానాలున్నాయి. వీరే కాకుండా మంత్రులుగా అనుభవమున్న కెమీ బాదెనోచ్, సుయెల్లా బ్రేవర్మన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఆర్థిక మంత్రిగా గొప్ప పనితీరుతో ఆకట్టుకున్న రిషి, బోరిస్ మధ్యే ప్రధాన పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Liz Truss: యూకే ప్రధాని ట్రస్ రాజీనామా
లండన్: సొంత పార్టీ సభ్యుల నుంచే అసమ్మతి సెగ ఎదుర్కొంటున్న యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రి లిజ్ ట్రస్(47) గురువారం పదవికి రాజీనామా చేశారు. ఆర్థికంగా పెను సవాళ్లు ఎదురవ్వడం, మినీ బడ్జెట్‌తో పరిస్థితి మరింత దిగజారడం, రష్యా నుంచి గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఖజానాపై విద్యుత్ బిల్లుల భారం పెరిగిపోవడం, ధనవంతులకు పన్ను మినహాయింపుల పట్ల ఆరోపణలు రావడం, డాలర్‌తో పోలిస్తే పౌండు విలువ దారుణంగా పడిపోవడం, వ్యక్తిగత ప్రతిష్ట దెబ్బతినడం వంటి అంశాలు ఆమెపై విపరీతమైన ఒత్తిడిని పెంచాయి. మరోవైపు సొంత పార్టీ ఎంపీలు తనపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధపడడంతో రాజీనామాకే ట్రస్ మొగ్గుచూపారు. కన్జర్వేటివ్ నాయకురాలి పదవి నుంచి తప్పుకున్నారు. అనూహ్య రీతిలో కేవలం 45 రోజుల్లో తన భర్తతో కలిసి ‘10 డౌనింగ్ స్ట్రీట్’ నుంచి భారంగా నిష్క్రమించారు. పార్టీ నాయకత్వం తనకు కట్టబెట్టిన బాధ్యతను నెరవేర్చలేకపోయాయని, ఆర్థిక అజెండాను అమలు చేయలేకపోయానని, అందుకే పదవికి రాజీనామా చేశానని చెప్పారు. కొత్త ప్రధానమంత్రి ఎన్నికయ్యే దాకా ప్రధానిగా ట్రస్ కొనసాగుతారు. నూతన ప్రధాని ఎవరన్నది వారం రోజుల్లోగా తేలిపోనుంది. పార్టీ, ప్రజల విశ్వాసం పొందలేక లిజ్ ట్రస్ గత నెల 6వ తేదీన యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. మార్గరెట్ థాచర్, థెరెసా మే తర్వాత మూడో మహిళా ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. కానీ, సొంత పార్టీ ఎంపీలతోపాటు యూకే ప్రజల విశ్వాసాన్ని పొందలేకపోయారు. కేవలం 45 రోజులపాటు అధికారంలో కొనసాగారు. యునైటెడ్ కింగ్డమ్ చరిత్రలో అతితక్కువ కాలం అధికారంలో ఉన్న ప్రధానమంత్రిగా మరో రికార్డును లిజ్ ట్రస్ నెలకొల్పారు. తెరపైకి పలువురి పేర్లు లిజ్ ట్రస్ తాజా మాజీ ప్రత్యర్థి, భారత సంతతికి చెందిన అధికార కన్జర్వేటివ్ పార్టీ ఎంపీ రిషి సునాక్ తదుపరి ప్రధానమంత్రి రేసులో ముందంజలో ఉన్నారు. ఆయనను కొత్త ప్రధానమంత్రిగా ఎన్నుకొనే విషయంలో కన్జర్వేటివ్ పార్టీ అంతరంగం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు. పార్టీలోని కొందరు సభ్యులు ఆయన పట్ల విముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే పార్టీలో ఏకాభిప్రాయం లేదని స్పష్టంగా చెప్పొచ్చు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పేరు తెరపైకి వస్తుండడం గమనార్హం. జాన్సన్‌ను మళ్లీ ప్రధానిని చేయాల్సిందేనని ఆయన మద్దతుదారులు గొంతు విప్పుతున్నారు. అలాగే గతంలో ఈ పదవికి పోటీ పడిన పెన్నీ మోర్డాంట్, భారత సంతతికి చెందిన సుయెల్లా బ్రేవర్మన్, రక్షణ శాఖ మంత్రి బెన్ వాలెస్ పేర్లు గట్టిగా వినిపిస్తున్నాయి. సుయెల్లా బ్రేవర్మన్ దేశ హోం శాఖ మంత్రి పదవికి బుధవారమే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దేశంలో అస్తవ్యస్త ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాన్ని రద్దు చేసి, తక్షణమే సాధారణ ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపక్ష లేబర్ పార్టీ డిమాండ్ చేస్తుండడం ఆసక్తికరంగా మారింది. అనిశ్చితికి తెరపడాలంటే ఎన్నికలు నిర్వహించడం ఒక్కటే మార్గమని లేబర్ పార్టీ నేత సర్ కీర్ స్టార్మర్ చెప్పారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ గత 12 ఏళ్లుగా వైఫల్యాల బాటలో కొనసాగుతోందని అన్నారు. అవన్నీ ఇప్పుడు తారస్థాయికి చేరాయని ఆక్షేపించారు. జీవించి ఉన్న ఏడుగురు మాజీలు ఆధునిక చరిత్రలో యూకేలో ఏడుగురు మాజీ ప్రధానమంత్రులు జీవించి ఉండడం ఇదే మొదటిసారి. ఒకరకంగా చెప్పాలంటే మాజీ ప్రధానుల జాబితా పెరుగుతోంది. బోరిస్ జాన్సన్, థెరెసా మే, డేవిడ్ కామెరూన్, గోర్డాన్ బ్రౌన్, సర్ టోనీ బ్లెయిర్, సర్ జాన్ మేయర్ సరసన ఇప్పుడు ట్రస్ చేరారు. 45 రోజుల ప్రధానమంత్రి యూకేలో పలువురు ప్రధానమంత్రులు ఏడాది కంటే తక్కువ కాలమే అధికారంలో కొనసాగారు. పదవిలో ఉండగానే మరణించడం లేదా రాజీనామా వంటివి ఇందుకు కారణాలు. తాజాగా 45 రోజుల ప్రధానిగా ట్రస్ రికార్డు సృష్టించారు. బాధ్యత నెరవేర్చలేకపోయా దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతానన్న నమ్మకంతో తనను ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారని, ఆ బాధ్యతను నెరవేర్చడంలో విఫలమయ్యానని లిజ్ ట్రస్ పేర్కొన్నారు. అందుకే పదవి నుంచి తప్పుకుంటున్నానని స్పష్టం చేశారు. గురువారం రాజీనామా అనంతరం ఆమె లండన్‌లోని డౌనింగ్ స్ట్రీట్‌లో మీడియాతో మాట్లాడారు. రాజీనామాకు దారితీసిన కారణాలను వెల్లడించారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకురాలి పదవికి రాజీనామా చేశానంటూ రాజు చార్లెస్‌కు తెలియజేశానని అన్నారు. అస్థిరమైన ఆర్థిక వ్యవస్థ, ప్రతికూల అంతర్జాతీయ పరిస్థితుల నడుమ యునైటెడ్ కింగ్డమ్(యూకే) ప్రధానమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టానని గుర్తుచేశారు. లిజ్ ట్రస్ ఇంకా ఏం చెప్పారంటే.. ‘‘బిల్లులు చెల్లించలేక ప్రజలు, వ్యాపారవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఆదాయాలు లేకపోవడంతో బిల్లులు ఎలా కట్టాలో తెలియని పరిస్థితి నెలకొంది. ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రారంభించిన చట్టవిరుద్ధమైన యుద్ధం మన భద్రతకు ముప్పుగా మారింది. ఆర్థిక వృద్ధి క్రమంగా పడిపోతోంది. మన దేశం వెనుకంజ వేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలాంటి తరుణంలో ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టి, దేశాన్ని ముందుకు నడిపిస్తానన్న విశ్వాసంతో కన్జర్వేటివ్ పార్టీ నన్ను ప్రధానమంత్రిగా ఎన్నుకుంది. ఇంధన బిల్లులు, జాతీయ ఇన్సూరెన్స్‌లో కోత వంటి అంశాల్లో కార్యాచరణ ప్రారంభించాం. తక్కువ పన్నులు, ఎక్కువ ఆర్థిక వృద్ధిని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. బ్రెగ్జిట్ వల్ల లభించిన స్వేచ్ఛను వాడుకోవాలన్నదే మన ఉద్దేశం. కానీ, వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకున్నా. పార్టీ నాకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చడంలో విఫలమయ్యానని గుర్తించా. రాజు చార్లెస్‌తో మాట్లాడా. కన్జర్వేటివ్ పార్టీ నేత పదవికి రాజీనామా చేశానని తెలియజేశా. ఈ రోజు ఉదయమే ‘1922 కమిటీ’ చైర్మన్ సర్ గ్రాహం బ్రాడీతో సమావేశమయ్యా. వారం రోజుల్లోగా నూతన నాయకుడి (ప్రధానమంత్రి) ఎన్నిక ప్రక్రియను పూర్తిచేయాలని మేము ఒక నిర్ణయానికొచ్చాం. మనం అనుకున్న ప్రణాళికలను సక్రమంగా అమలు చేయడానికి, మన దేశ ఆర్థిక రంగంలో స్థిరత్వాన్ని సాధించడానికి, దేశంలో భద్రత కొనసాగించడానికి నూతన ప్రధానమంత్రి ఎన్నిక దోహదపడుతుందని భావిస్తున్నా. నా వారసుడు(కొత్త ప్రధాని) ఎన్నికయ్యే దాకా పదవిలో కొనసాగుతా’’. చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరా ఇదే.. మెగాపిక్సెల్ ఎంతంటే? -
డోంట్ కేర్.. ట్రస్‌పై అవిశ్వాసానికి రంగం సిద్ధం!
లండన్: బ్రిటన్ ప్రధాన మంత్రి లిజ్ ట్రస్‌ను గద్దె దించేందుకు ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి!. ఈ మేరకు వందకు పైగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు.. పార్టీ కమిటీ హెడ్ గ్రాహం బ్రాడీని కలిసి ట్రస్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి లేఖలు సమర్పించనున్నట్లు డెయిలీ మెయిల్ ఒక కథనం ప్రచురించింది. ప్రధాని లిజ్ ట్రస్‌ను తొలగించే ప్రయత్నాలు మంచివి కాదని.. దాని వల్ల ఎన్నికలకు వెళ్లాల్సి వస్తుందని డౌనింగ్ స్ట్రీట్(ప్రధాని కార్యాలయం) చేసిన హెచ్చరికలను కన్జర్వేటివ్ చట్టసభ్యులు బేఖాతరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ డెయిలీ మెయిల్ తన కథనంలో పేర్కొంది. ఈ వారంలోనే ట్రస్‌ను గద్దె దించే ప్రయత్నాలు ఊపందుకోనున్నట్లు తెలిపిన ఆ కథనం.. దానికి ఆధారం ఏంటన్న విషయం మాత్రం వెల్లడించలేదు. ఆమె సమయం ముగిసింది అని ట్రస్‌కు చెప్పాలని, లేదంటే.. ఆమె నాయకత్వంపై విశ్వాస పరీక్షను తక్షణమే నిర్వహించాలని, ఇందుకోసం రాజకీయ పార్టీ నియమాలను మార్చమని బ్రాడీని ఒత్తిడి తెచ్చేందుకు కన్జర్వేటివ్ ఎంపీలు ప్రయత్నించబోతున్నట్లు డెయిలీ మెయిల్ కథనం పేర్కొంది. యూకే చట్టాల ప్రకారం.. సాంకేతికపరంగా లిజ్ ట్రస్ ప్రధాని పదవికి ఏడాదిపాటు ఎలాంటి ఢోకా ఉండదు. అయితే.. 1922 బ్యాక్‌బెంచ్ ఎంపీల కమిటీ తన రూల్స్ మారిస్తే గనుక ట్రస్‌కు సవాల్ ఎదురుకావొచ్చు. ఒకవేళ తిరుగుబాటు-అవిశ్వాస ప్రయత్నాలే జరిగితే గనుక.. అక్టోబర్ 31వ తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్, తదనంతర పరిణామాల దాకా ఓపిక పట్టాలని గ్రాహం బ్రాడీ, ఎంపీలను కోరే అవకాశం కనిపిస్తోంది. 2016లో యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చాక.. బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. ఈ గ్యాప్‌లో ఏకంగా ముగ్గురు ప్రధానులు గద్దె దిగాల్సి వచ్చింది. ఈ మధ్యే ప్రధాని పగ్గాలు చేపట్టిన లిజ్ ట్రస్.. కిందటి నెలలో ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్‌తో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలై గందరగోళానికి దారి తీసింది. ఈ బడ్జెట్‌తో దేశంలో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న ఆందోళనలు అధికమయ్యాయి. ఊహించని ఈ పరిణామాలతో ఏకంగా తన మద్దతుదారు, ఆర్థిక మంత్రి అయిన క్వాసీని పదవి నుంచి తప్పించి.. ఆ స్థానంలో జెరెమీ హంట్‌ను కొత్త ఆర్థిక మంత్రిగా నియమించారామె. ఈ తరుణంలో ట్రస్-జెరెమీ హంట్ ప్రవేశపెట్టబోయే బడ్జెట్ దాకా ఆగాలని గ్రాహం బ్రాడీ కోరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు ది టైమ్స్ సైతం కన్జర్వేటివ్ రెబల్స్.. ట్రస్‌ను తప్పించి ఆ స్థానే మరో నేతను ఎన్నుకునే ప్రయత్నంలో ఉన్నట్లు ఓ కథనం ప్రచురించింది. ఇదీ చదవండి: బైడెన్ వ్యాఖ్యలతో పాక్ గుస్సా! -
ఆర్థిక విధానంపై అప్పుడే యూ టర్న్.. చిక్కుల్లో బ్రిటన్ ప్రధాని
దాదాపు నెలన్నర క్రితం సంగతి. సెప్టెంబర్ 5న భారత సంతతికి చెందిన మాజీ మంత్రి రిషి సునాక్‌ను ఓడించి లిజ్ ట్రస్ బ్రిటన్ ప్రధాని పీఠమెక్కారు. అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయిన జీవన వ్యయాన్ని తగ్గిస్తానని, చుక్కలనంటుతున్న ఇంధన ధరలకు ముకుతాడు వేస్తానని, కట్టు తప్పుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతానని ప్రకటించారు. ‘చేసి చూపిస్తా’మంటూ ప్రతిజ్ఞ చేశారు. కానీ నెల రోజుల్లోనే అన్నివైపుల నుంచీ ఆమెకు గట్టిగా సెగ తగులుతోంది. ఆర్థిక వ్యవస్థను పట్టాలకెక్కించేందుకు ఆమె ప్రతిపాదించిన విధానాలన్నీ ద్రవ్యోల్బణ కట్టడిలో ఒక్కొక్కటిగా విఫలమవుతున్నాయి. ట్రస్ తొలి మినీ బడ్జెట్ అన్ని వర్గాల్లోనూ తీవ్ర విమర్శల పాలైంది. ప్రధానంగా కార్పొరేషన్ ట్యాక్స్‌ను 19 శాతానికి తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని దాన్ని ఎప్పట్లా 25 శాతంగానే కొనసాగిస్తామంటూ యూ టర్న్ తీసుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలన్నీ కన్జర్వేటివ్ నేతలు, ఎంపీలను బాగా కలవరపెడుతున్నాయి. వారిలో ట్రస్‌పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని బ్రిటిష్ మీడియా పేర్కొంటోంది. ఆర్థిక మంత్రిపై ఇప్పటికే వేటు పడింది. ప్రధాని మార్పు కూడా అనివార్యమని ఎంపీల్లో అత్యధికులు భావిస్తున్నారని చెబుతోంది. సమస్యలను చక్కదిద్దడంలో, సొంత పార్టీ నేతల విశ్వాసాన్ని నిలుపుకోవడంలో విఫలమవుతున్న ట్రస్ ఏ క్షణమైనా తప్పుకోవాల్సి రావచ్చంటున్నారు! ఆమె రాజీనామాకు టోరీ ఎంపీలు త్వరలో బహిరంగ పిలుపు ఇచ్చే అవకాశముందని బ్రిటిష్ మీడియాలో వార్తలొస్తున్నాయి!! ఆరేళ్లు, నలుగురు ప్రధానులు ఆరేళ్లుగా అధికార కన్జర్వేటివ్ పార్టీకి అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగడంపై 2016లో బ్రెగ్జిట్ రిఫరెండం నిర్వహించినప్పటి నుంచి ఏకంగా నలుగురు ప్రధానులు మారారు! 2016లో డేవిడ్ కామెరాన్ తప్పుకుని థెరెసా మే ప్రధాని అయ్యారు. కానీ బ్రెగ్జిట్ ఒప్పందంపై ప్రతిష్టంభన ఆమె పీఠానికి ఎసరు పెట్టింది. 2019లో బోరిస్ జాన్సన్ పగ్గాలు చేపట్టారు. మూడేళ్లయినా నిండకుండానే ఆయనా అనేకానేక వివాదాల్లో చిక్కుకున్నారు. దాంతో అయిష్టంగానే గత జూలైలో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇప్పుడిక ట్రస్ వంతు కూడా వచ్చినట్టేనంటూ ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఆర్థిక విధానాలపై యూ టర్న్ తీసుకోవడం ఆమెకు అప్రతిష్ట తెచ్చిపెట్టిందంటున్నారు. ఇవీ ‘తప్పు’టడుగులు... ► ఆర్థిక మంత్రిగా తొలిసారిగా నల్ల జాతీయుడైన క్వాసీ క్వార్టెంగ్ను ట్రస్ ఎంచుకున్నారు. పౌరుల నివాస పన్నులు, ఇంధన ఖర్చులను తగ్గించడంతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రతిష్టంభనను వదిలించేందుకు ఆయన ప్రకటించిన మినీ బడ్జెట్ పూర్తిగా బెడిసికొట్టింది. ఏకంగా 4,500 కోట్ల పౌండ్ల మేరకు పన్ను తగ్గింపులను ప్రకటించారు. ద్రవ్యోల్బణం చుక్కలనంటుతున్న వేళ ఇది ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తుందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. బ్రిటన్ కరెన్సీ పౌండ్ విలువ రికార్డు స్థాయిలో పడిపోయింది. ► తొలుత ఆర్థిక మంత్రి నిర్ణయాన్ని సమర్థించిన ట్రస్, కొద్ది రోజులకే యూ టర్న్ తీసుకుంటూ అత్యధిక స్థాయి ఆదాయ పన్ను రేటు తగ్గింపును రద్దు చేయడం వివాదానికి దారితీసింది. పైగా ఇది సొంత పార్టీలోనూ ఆమెపై తీవ్ర అసంతృప్తికి దారి తీయడంతో ఎటూ పాలుపోక క్వాసీని తప్పించి జెరెమీ హంట్‌కు ఆర్థిక శాఖ అప్పగించారు. రిషి పన్నుల పెంపు ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించిన ఆమె, ఇప్పుడు ఆయన బాటలోనే నడవడాన్ని అసమర్థతగానే అంతా భావిస్తున్నారు. రిషివైపే టోరీ ఎంపీల మొగ్గు? ట్రస్ తప్పుకుంటే తదుపరి ప్రధానిగా రిషి పేరే ప్రముఖంగా విన్పిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయనే సమర్థ ప్రత్యామ్నాయమని కన్జర్వేటివ్ ఎంపీలు భావిస్తున్నట్టు బ్రిటిష్ మీడియా చెబుతోంది. రిషీని ప్రధానిగా, పెన్నీ మోర్డంట్ను ఆయనకు డిప్యూటీగా నియమించే ఆలోచన సాగుతోందంటున్నారు. లేదంటే మోర్డంట్ ప్రధానిగా, రిషి ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టొచ్చని ఊహాగానాలు విన్పిస్తున్నాయి. చివరికి మళ్లీ బోరిస్ జాన్సనే తిరిగొచ్చినా ఆశ్చర్యం లేదంటున్న వాళ్లూ ఉన్నారు! – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఈ ఓటమి స్వయంకృతమే!
బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎన్నికలో భారత సంతతికి చెందిన రిషీ సునాక్ తన ప్రత్యర్థి లిజ్ ట్రస్ చేతిలో హోరాహోరీ పోరులో ఓడిపోయారు. ఆయన ఓటమిలో జాతి, మతం కూడా తమ వంతు పాత్ర పోషించాయని కొందరు అంటున్నారు (తాను హిందువును అని సునాక్ చెప్పుకొన్నారు). కానీ బ్రిటన్ ఇప్పుడు చాలా మారిపోయింది. ఆసియన్లనూ, నల్లజాతి ప్రజలనూ శ్వేతేతరులు అనీ, బుర్రతక్కువ వాళ్లు అనీ కొట్టిపడేసే రోజులు గతించిపోయాయి. పన్నుల విధింపుపై సునాక్ వైఖరిలోనే ఆయన ఓటమికి ముఖ్యమైన కారణం కనబడుతుంది. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసిన తర్వాతే పన్నులను తగ్గిస్తానని ఆయన ప్రచారం చేశారు. ఇది కన్జర్వేటివ్ పార్టీ ధోరణికి భిన్నం. అలాగే బోరిస్ జాన్సన్ గద్దె దిగిపోయేలా సునాక్ మొట్టమొదట రాజీనామా చేయడం కూడా జాన్సన్ మద్దతుదారుల్లో వ్యతిరేకతకు కారణమైంది. అదే సమయంలో లిజ్ ట్రస్ చివరిదాకా జాన్సన్‌కు మద్దతిచ్చారు. పార్టీ సభ్యులు ఏం కోరుకుంటున్నారో అవి ఇవ్వడానికి ఇష్టపడకపోవడమే సునాక్ ఓటమికి కారణం. బ్రిటిష్ కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ ఎన్నికలో రిషీ సునాక్ ఓడిపోవడానికి జాతి, మతం కూడా తమదైన పాత్ర పోషిం చాయా అంటే మనకు ఎన్నటికీ కచ్చితంగా తెలీకపోవచ్చు. రిషి ఓటమికి ఇవి కూడా పనిచేశాయని నొక్కి చెప్పేవారు, ఇవి కారణాలు కావు అని చెబితే సమాధానపడరు. అయితే ఆయన ఓటమికి ఇవి కారణాలు కావు అని చెప్పేవారు దాన్ని నిరూ పించలేరు. నా ఊహ ఏమిటంటే, తన ఓటమికి జాతి, మతం కూడా కారణాలు అయివుండవచ్చు కానీ వాటికి అంత ప్రాధాన్యం ఉండకపోవచ్చు. లేదా రిషి ఓడిపోవడానికి అవే ప్రధాన కారణం కావచ్చు కూడా! అయితే నిజం ఏమిటంటే, చాలామంది ప్రజలు నమ్ము తున్నట్లుగానే బ్రిటన్ ప్రస్తుతం చాలా విభిన్నమైన దేశంగా మారి పోయింది. ఆసియన్లనూ, నల్లజాతి ప్రజలనూ శ్వేతే తరులు అనీ, బుర్రతక్కువ వాళ్లు అనీ కొట్టిపడేసే రోజులు గతించిపోయాయి. ఈ విషయం అర్థం కావడానికి మీరు థెరెసా మే, బోరిస్ జాన్సన్, లిజ్ ట్రస్ మంత్రివర్గాలను చూడండి. అలాగే ఈ వాస్తవాన్ని అర్థం చేసుకోవడానికి ‘బీబీసీ’ ఛానల్లో మనకు కనబడే ముఖాలను చూడండి. తర్వాత ‘డచెస్ ఆఫ్ ససెక్స్’ కూడా ఒక ఉదాహరణగా నిలుస్తారు. (అమెరికన్ యువతి మేఘన్ మెర్కెల్ బ్రిటిష్ రాజవంశంలోని ప్రిన్స్ హ్యారీని పెళ్లాడిన తర్వాత బ్రిటిష్ రాణి రెండో ఎలిజబెత్ సంప్రదాయాలను పక్కనపెట్టి ఆమెను ససెక్స్ యువ రాణిగా ప్రకటించారంటే బ్రిటిష్ సమాజంలో వచ్చిన మార్పునకు ఇది నిదర్శనం అన్నమాట.) అందుకనే రిషీ సునాక్ ఓటమికి కారణాలు అనేకం అని నేను నమ్ముతున్నాను. ఆర్థికమంత్రిగా రిషి ట్రాక్ రికార్డులో గానీ, బహుశా ఎన్నికల ప్రచారంలో ఆయన ప్రదర్శించిన వ్యక్తిత్వంలో గానీ, మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ వంటి ప్రజాదరణ కలిగిన నేత దిగ్భ్రాంతి కరమైన పతనానికి దారితీసేలా తన మంత్రిపదవికి ఇచ్చిన రాజీ నామాలో గానీ మనం రిషి శైలినీ, మూర్తిమత్వాన్నీ చూడవచ్చు. రిషికి అదృష్టం ముఖం చాటేసిందని చెప్పడం కంటే బహుశా ఆయనదే తప్పు అయివుండొచ్చు. బ్రిటన్ ప్రజలు ఏం కోరుకుంటున్నారో అవి ఇవ్వడానికి రిషి ఇష్టపడకపోవడమే ఆయన తప్పు కావచ్చు. ప్రధానంగా పన్నుల విధింపుపై సునాక్ వైఖరిలోనే ఆయన ఓటమికి ముఖ్యమైన కారణం కనబడుతుంది. కన్జర్వేటివ్ పార్టీని సాధారణంగా పన్నులు తక్కువగా విధించే పార్టీగా చెబుతుంటారు. ఇది వారికి ఒక పవిత్ర విశ్వాసం లాంటిది. కానీ ఆర్థిక మంత్రిగా సునాక్ పన్నులను గణనీయంగా పెంచారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేసిన తర్వాతే పన్నులను తగ్గిస్తానని మాత్రమే ఆయన మాట్లాడుతూ వచ్చారు. మరోవైపున ఆయన ప్రత్యర్థి ట్రస్ మాత్రం తన ప్రచార తొలిదశలోనే పన్నులను బాగా తగ్గిస్తానని హామీ ఇచ్చారు. సునాక్ చెప్పింది సరైనదేనని చాలామంది ఆర్థికవేత్తలు, పారిశ్రా మికవేత్తలు నమ్ముతున్నారు. లండన్ ప్రజలు కూడా సునాక్ వాదనను సమర్థించారని ‘వెంబ్లే ర్యాలీ’ సూచిస్తోంది. ఇప్పుడు ఇది జాతీయ ఎన్నికల ప్రచారం అయినట్లయితే సునాక్ సులువుగా గెలిచేవారు. ఆయన వైఖరిని దేశం అంగీకరించేది. కానీ ఇది జాతీయ ఎన్నిక కాదు. కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు మాత్రమే పాల్గొన్న ఎన్నిక. వీరు బ్రిటన్ లోని జిల్లా కేంద్రాల్లో నివసిస్తుంటారు. వీరిలో ఎక్కువమంది ముసలి వారు. వీరు చాలా భిన్నంగా వ్యవహరిస్తారు. అందుకే లిజ్ ట్రస్ ఇచ్చిన సందేశం వీరిని నేరుగా తాకింది. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే కన్జర్వేటివ్ పార్టీ తరఫున ప్రధాని ఎన్నికలో వీరే ముఖ్యమైన ఓటర్లు మరి. మరొక కారణం ఏమిటంటే, బోరిస్ జాన్సన్‌కు విశ్వసనీయమైన మద్దతుదారులు సునాక్‌కు వ్యతిరేకంగా ఓటేశారు. ఎందుకంటే తమ మనిషిని, తమ నాయకుడిని గద్దె దింపిన ఘటనలకు రిషీనే బాధ్యు డని వీరు నమ్మారు. టోరీ(కన్జర్వేటివ్ పార్టీ) సభ్యులలో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడు బోరిస్ జాన్సనే అని పోల్స్ సూచి స్తున్నాయి. సునాక్ కానీ, ట్రస్ కానీ ఈయనతో పోలిస్తే ప్రజాదరణ విషయంలో ఎంతో వెనుకబడి ఉన్నారు. పైగా మరోసారి పోటీపడి గెలిచి ప్రధాని పదవి చేపట్టాలని జాన్సన్ భావిస్తున్నట్లు ‘ద టైమ్స్’ పత్రిక కూడా సూచిస్తోంది. కాబట్టి బోరిస్ జాన్సన్ మంత్రివర్గం నుంచి మొట్టమొదట రాజీనామా చేసినదానికి రిషి ఫలితం అనుభవించినట్లు కనిపిస్తోంది. మరోవైపున లిజ్ ట్రస్ తన నాయకుడు జాన్సన్ పట్ల చివరివరకూ విశ్వాసం ప్రకటించారు. అలా బహుశా ప్రయోజనం పొందివుంటారు. మూడో కారణం సునాక్ శైలి, వ్యక్తిత్వంలో దాగి ఉంది. చిన్నచిన్న అంశాలలో కూడా ఇది ఒక సమస్యగా మారింది. కానీ ఇది మరో ఆందోళనకు దారితీసింది. ఉదాహరణకు, మొట్టమొదటి చర్చలో రిషిని అహంభావిగా టోరీ ఓటర్లు భావించారు. తాను చెబుతున్నదే సరైనది అని భావిస్తున్నాడని రిషి గురించి అనేకమంది ఆరోపించారు. పైగా గత ఆరు వారా లుగా రిషి ఆరోగ్యం గురించి అనేకమంది ప్రశ్నలు సంధిం చారు. నిస్సందేహంగా ఆయన ఆ ప్రశ్నలకు సమర్థంగా జవాబి చ్చారు. కానీ ఓటర్ల సందేహాలు సమసిపోలేదు. ప్రత్యేకించి సునాక్ శైలి, వ్యక్తిత్వం తన సొంత టీమ్‌లోనే భయాందోళనలు కలిగించినట్లుందని ‘ద డైలీ టెలిగ్రాఫ్’ పత్రిక నివే దించింది. ఈ పత్రిక ప్రకారం తన ప్రచారం తొలి దశలో రిషీ సునాక్ పదేపదే క్యాలిఫోర్నియా గురించి ప్రస్తావించడంతో పరిస్థితులు తప్పు దోవ పడుతున్నాయని ఆయన సొంత టీమ్‌లోనే భయం పుట్టు కొచ్చింది. క్యాలిఫోర్నియా తరహా వాణిజ్య సంస్కృతి పట్ల తన ఆరా ధనను రిషి ఏమాత్రం దాచుకోలేదు. దీంతో క్షేత్రస్థాయి టోరీ పార్టీ సభ్యులకు ఆయన దూరమైపోయాడని చెబుతున్నారు. కాబట్టి సునాక్ జాతి మూలం ఆందోళన కలిగిస్తున్నట్లయితే, అది అంత ప్రాధాన్యం కలిగిన విషయమా అని నేను సందేహ పడుతున్నాను. దాదాపుగా ఇది ప్రతి ఒక్కరికీ వర్తించవచ్చు కూడా! ఇప్పుడు, ఆశ్చర్యపడాల్సిన అవసరం లేకుండా, లిజ్ ట్రస్ ఎలా పనిచేస్తారనే అంశంపైనే రిషీ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. లిజ్ గెలిచినప్పటికీ, ఆమె ప్రధాన మంత్రిగా తగినంత ఆత్మవిశ్వాసంతో లేరని పోల్స్ సూచించాయి. ఇలాగే కొనసాగితే 2024లో ఆమె లేబర్ పార్టీకి చెందిన కైర్ స్టార్మర్‌కు తన పదవిని కోల్పోవచ్చని చెబుతున్నారు. అదే జరిగితే సునాక్ మళ్లీ పోటీ చేయడానికి దారి దొరుకుతుందని చెప్పవచ్చు. రిషీ సునాక్‌కు ఇప్పుడు 42 సంవత్సరాలు. 2029 వరకు ఆయన వేచి ఉండాల్సి వస్తే అప్పటికి కూడా తాను 50 ఏళ్ల వయసు లోపే ఉంటారు. వెనుక బెంచీల్లో కూర్చోవాలని రిషి తీసుకున్న నిర్ణయం తన భవిష్యత్తుపై అతడు ఒక కన్నేసి ఉంచాడనేందుకు సంకేతంగా కనిపిస్తోంది. కరణ్ థాపర్ (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు) -
లిజ్ ట్రస్‌కు ఇది ముళ్ళకిరీటమే!
బ్రిటన్‌లో తొలి మహిళా లార్డ్ ఛాన్సలర్ ఆమే. రెండో మహిళా విదేశాంగ మంత్రీ ఆవిడే. ఇప్పుడు థాచర్, థెరెసా మే తర్వాత ఆ దేశానికి ముచ్చటగా మూడో మహిళా ప్రధానీ ఆమే. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వ మార్పులో భాగంగా బోరిస్ జాన్సన్‌కు వారసురాలిగా సోమవారం ఎన్నికైన 47 ఏళ్ళ లిజ్ ట్రస్‌కు ఇలాంటి ఘనతలు చాలానే ఉన్నాయి. క్వీన్ ఎలిజబెత్2ను లాంఛనంగా కలసి, 96 ఏళ్ళ రాణిగారి సాంప్రదాయిక నియామకంతో బ్రిటన్ కొత్త ప్రధానిగా మంగళవారం బాధ్యతలు చేపట్టిన లిజ్ ఇప్పుడు ఆ ఘనతలు నిలబెట్టుకోవడానికి శ్రమించక తప్పదు. వరుస వివాదాలతో రెండు నెలల క్రితం జాన్సన్ బ్రిటీష్ ప్రధానిగా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించినప్పటి నుంచి లిజ్ ప్రయాణం మలుపు తిరిగింది. జాన్సన్ హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన ఆమె మాజీ ఆర్థిక మంత్రి రిషీ సునాక్‌ను అధిగమించి, పీఠం దక్కించుకున్నారు. కొత్త నేతగా పీఠమెక్కడానికి కన్జర్వేటివ్ పార్టీలో ఆరుగురు ఉత్సాహపడితే, ఆఖరికి బరిలో మిగిలింది – లిజ్, భారతీయ మూలాలున్న రిషీ సునాక్. ‘ఇన్ఫోసిస్’ సుధ – నారాయణమూర్తి దంపతుల అల్లుడైన రిషి సోమవారం ఓటమి పాలయ్యారు. అయితేనేం, లక్షా 70 వేల పైగా కన్జర్వేటివ్ పార్టీ సభ్యులు ఎన్నుకొనే పదవికి చివరి దాకా పోటీపడి, 60 వేలకు పైగా ఓట్లు సంపాదించడం విశేషమే. నిలబెట్టుకోలేని వాగ్దానాలు ఇవ్వలేనన్న రిషికి భిన్నంగా లిజ్ వ్యవహ రించడం గమనార్హం. బ్రిటీష్ ప్రజాస్వామ్య వ్యవస్థలోని రాజకీయ పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యా నికి ప్రతీకగా నిలిచిన ఎన్నికల ప్రక్రియ ముగిసింది. పరిష్కారాల మాట దేవుడెరుగు, కనీసం దేశం ఆర్థికంగా క్లిష్టపరిస్థితుల్లో ఉన్నట్టు తన ప్రచారంలో ప్రస్తావించకుండా వాస్తవాన్ని చూడ నిరాక రించిన లిజ్ ఇప్పుడు కళ్ళెదుటి సంక్షోభం నుంచి దేశాన్ని ఎలా గట్టెక్కిస్తారన్నది ఆసక్తికరం. వామపక్ష భావజాల కుటుంబంలో పుట్టి, తల్లితండ్రుల రాజకీయ పొత్తిళ్ళ నుంచి బయటపడి, ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకొనే రోజుల్లో ఉదారవాద ప్రజాస్వామ్య రాజకీయాల వైపు మొగ్గి, యువ ఉద్యోగినిగా కన్జర్వేటివ్ పార్టీలో చేరిన గమ్మల్తైన ప్రయాణం లిజ్ది. ముగ్గురు కన్జర్వేటివ్ పార్టీ ప్రధానమంత్రుల వద్ద ఆరు మంత్రి పదవులు నిర్వహించిన ఆమె ఇప్పుడు సరాసరి లండన్‌లోని 10 డౌనింగ్ స్ట్రీట్ నివాసి అయ్యారు. ఈ ప్రధానమంత్రి పీఠంపై ఆమెకు మొదటి రోజు నుంచీ అనేక సవాళ్ళు ఎదురుకానున్నాయి. అంతకంతకూ పెరుగుతున్న ఇంధన ధరలు, కరెంట్ కోతల ముప్పు, గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా రెండంకెల ద్రవ్యోల్బణం, పొంచి ఉన్న దీర్ఘకాలిక ఆర్థిక మాంద్యం, పెరుగుతున్న తనఖా రేట్లు... వెరసి అలవి కాని జీవన వ్యయం – ఇలా సమస్యలెన్నో. దేశంలో వివిధ ఉద్యోగ సంఘాలు ఇప్పటికే సమ్మె సైరన్ మోగించాయి. ఉక్రెయిన్‌లో యుద్ధం, బ్రెగ్జిట్ పర్యవసానాల లాంటి విదేశాంగ విధానపు తలనొప్పులు సరేసరి. పదవికి పోటీలో లిజ్ చేసిన వాగ్దానాలూ చిన్నవేమీ కావు. పన్నులను తగ్గిస్తాననీ, ప్రజా వ్యయాన్ని పెంచుతాననీ బాస చేశారు. దేశం ఇప్పుడున్న ఇక్కట్లలో ఇచ్చిన హామీలు నెరవేర్చా లంటే, ఆమె ఇంట్లో కల్పవృక్షమో, కామధేనువో ఉంటే కానీ సాధ్యం కాదని ఓ జోక్. బ్రిటన్ తాజా మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ లానే లిజ్కూ మాటల్లో ఘనత చాటుకొనే లక్షణం ఉంది. కానీ, ఆయనకున్న జనాకర్షణ, అవతలివారి అంగీకారం పొందే నేర్పు ఆమెకు లేవని విమర్శకుల మాట. ఒకప్పటి మార్గరెట్ థాచర్‌ను లిజ్లో ఆశించలేమని వారి విశ్లేషణ. అయితే ఎదగాలనే ఆకాంక్ష బలంగా ఉన్న ఈ దృఢచిత్తురాలికి స్వతఃసిద్ధ పోరాటగుణమే పెట్టనికోట. సమయానికి తగ్గట్టు అభిప్రాయాలు మార్చుకొనే దృక్పథం కలిసొచ్చే అంశం. 2016లో బ్రెగ్జిట్ విధానానికి తీవ్ర వ్యతిరేకిగా ఉన్న లిజ్, ఆపై బ్రెగ్జిట్‌కు పూర్తి అనుకూలంగా మారడం, 2019 నాటికి జాన్సన్ హయాంలో బ్రెగ్జిట్ అనంతరకాల వాణిజ్య మంత్రిగా వ్యవహరించడమే అందుకు ఉదాహరణ. మాటల గారడీ జాన్సన్ హయాంలో వెనుకబడ్డ బ్రిటన్‌కు ఇప్పుడు చిత్తశుద్ధితో కూడిన స్థిర మైన, బలమైన నాయకత్వం అవసరం. రిషిని వెన్నుపోటుదారుగా భావిస్తూ, అతనికి తప్ప ఎవరి కైనా ఓటేయమన్న జాన్సన్ మాటలతో ఆయన అనుకూలుర మద్దతు లిజ్‌ను గెలిపించింది. అలా జాన్సన్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న లిజ్ పాత ప్రభుత్వ తప్పుడు విధానాల నుంచి ఎంత త్వరగా బయటకొస్తే, బ్రిటన్‌కు అంత మంచిది. ఇక, ఆప్తురాలైన లిజ్ ఎన్నిక భారత్‌కు శుభవార్తే. విదేశాంగ మంత్రిగా చైనాతో కయ్యానికి కాలుదువ్వుతూ, రష్యాపై కఠినవైఖరిని అనుసరించిన ఆమె ఇప్పటికి 3 సార్లు క్యాబినెట్ మంత్రిగా భారత్‌లో పర్యటించారు. ఇరుదేశాల పాత అనుబంధంతో మెతకగానే ఉన్నారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల చర్చలూ అక్టోబర్‌లో కొలిక్కిరానున్నాయి. ఏప్రిల్‌లో కుదుర్చుకున్న రక్షణ సహకార ఒప్పందం సహా అన్నీ సజావుగా సాగుతాయని అంచనా. అయితే, బ్రిటన్ సమస్యల సుడిగుండంలోకి ప్రయాణిస్తోందన్న ఆలోచననే ఇన్నాళ్ళూ ‘క్షీణ వాద ప్రసంగం’గా కొట్టిపారేస్తూ వచ్చిన లిజ్ వాస్తవంలోకి రాక తప్పదు. సమస్యల పరిష్కారంలో జయాపజయాలను బట్టే చరిత్రలో ప్రధానిగా ఆమె అధ్యాయం లిఖితమవుతుంది. మరోపక్క దీర్ఘ కాలంగా అధికారంలో ఉన్న కన్జర్వేటివ్ పార్టీ అంతర్గత సమస్యలు, పరస్పర విరుద్ధ ఆలోచనల వర్గా లతో సతమతమవుతోంది. ఆ పార్టీ, దాని సారథిగా ఈ ఇద్దరు టీనేజ్ కుమార్తెల తల్లి కొద్దిగా తడ బడినా, కొన్నేళ్ళుగా అధికారానికి దూరమైన ప్రతిపక్ష లేబర్పార్టీకి 2024 ఎన్నికల్లో సందు చిక్కినట్టే! ఇదీ చదవండి: Indian Economy: త్వరపడితేనే... నిలబడతాం! -
ప్రతి ఓటు కోసం చివరిదాకా పోరు: రిషి సునాక్
లండన్: అధికార కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నికకు మరో రెండు వారాల గడువే ఉండటం, ప్రధాన ప్రత్యర్థి లిజ్ ట్రస్ కంటే వెనుకబడి ఉన్న నేపథ్యంలో రిషి సునాక్ వర్గం కొత్త తరహా ప్రచారాన్ని ప్రకటించింది. శుక్రవారం రాత్రి మాంచెస్టర్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో రిషి పాల్గొన్నారు. ‘చివరి రోజు వరకు ప్రతి ఓటు కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటా’అంటూ రిషి సునాక్ ట్వీట్ చేస్తూ మాంచెస్టర్ ప్రచార వీడియోను విడుదల చేశారు. అందులో ‘అండర్ డాగ్‌తో జాగ్రత్త అంటున్నారు. ఎందుకంటే ఓటమి అంచున ఉన్న వాళ్లు పోగొట్టుకునేదేమీ ఉండదు. ఉన్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటారు. వారు కష్టపడి పని చేస్తారు, ఎక్కువసేపు ఉంటారు, తెలివిగా ఆలోచిస్తారు. అండర్ డాగ్‌లు అవకాశాన్ని వదులుకోరు. కష్టపడి పని చేస్తూ.. ఎప్పుడూ ఆత్మసంతృప్తి చెందరు’’ అని వాయస్ ఓవర్ వినిపిస్తుంటుంది ఆ వీడియోలో. 🗓️ 30 days 💯 100 events 🫂 16,000 members 💪 and counting... I'll keep fighting for every vote until the final day.#Ready4Rishi 👇 pic.twitter.com/7GXaOOaUwm — Rishi Sunak (@RishiSunak) August 19, 2022 ఇదీ చదవండి: రిషి గెలుపు కోసం.. ప్రవాసుల ప్రయత్నాలు -
Rishi Sunak: బ్రిటన్ ప్రధాని రేసులో జాతివివక్షా..?
లండన్: బ్రిటన్ ప్రధాని రేసులో జాతివివక్షకు తావే లేదని అభిప్రాయపడ్డారు భారత సంతతికి చెందిన రిషి సునాక్. కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల్లో ఏ ఒక్కరు కూడా లింగం, జాతిని చూసి ఓటు వేయరని తాను భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరు సరైన అభ్యర్థి అని నిర్ణయించుకునేందుకు ఇది కారణంగా ఉండదన్నారు. ది డైలీ టెలిగ్రాఫ్‌కు ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈమేరకు తెలిపారు. ప్రధాని ఎన్నికల్లో రిషి సునాక్ ఒకవేళ ఓడిపోతే బ్రిటన్‌లో జాతివివక్ష ఉందని అందరూ అనుకుంటారని భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త రామి రేంజర్ గతవారం ఓ వీడియోలో వ్యాఖ్యానించారు. రిషి దీనిపైనే స్పందిస్తూ.. అసలు జాతివివక్షకు అవకాశమే లేదన్నారు. రిచ్మాండ్ నుంచి టోరీ సభ్యులే తనను ఎంపీగా గెలిపించారని, ప్రధాని రేసులో ఎక్కువ మంది ఎంపీలు తనకే మద్దతుగా నిలిచారని రిషి గుర్తు చేశారు. అలాంటప్పుడు జాతివివక్షకు ఆస్కారం ఎలా ఉంటుందన్నారు. బ్రిటన్ ప్రధాని పదవికి ఎవరు సమర్థవంతులు అనే విషయం గురించి చర్చించే క్రమంలో ఇలాంటి ప్రశ్నలు వచ్చి ఉంటాయన్నారు. బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్, రిషి సునాక్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. 1.75లక్షల మందికిపైగా టోరీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొని వీరిద్దరిలో ఒకరిని ప్రధానిగా ఎన్నుకోనున్నారు. సెప్టెంబర్ 5 వరకు ఈ బ్యాలెట్ ఓటింగ్ జరుగుతుంది. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. అయితే ఇప్పటివరకు నిర్వహించిన సర్వేల్లో లిజ్ ట్రస్‌కే విజయావకాశాలు ఎక్కువని తేలింది. 90 శాతం ఆమే గెలుస్తుందని, రిషి సునాక్‌కు 10శాతమే అవకాశాలున్నాయని ప్రీ పోల్ సర్వేలు అంచనా వేశాయి. రిషి కూడా తాను రేసులో వెనుకంజలో ఉన్నట్లు అంగీకరించారు. అయినా చివరి ఓటు వరకు పోరాడుతానని స్పష్టం చేశారు. చదవండి: బోరిస్‌కు ఎందుకు వెన్నుపోటు పొడిచారు? రిషికి ఇబ్బందికర ప్రశ్నలు -
లిజ్ ట్రసే బ్రిటన్ కొత్త ప్రధాని.. రిషికి 10 శాతమే ఛాన్స్!
లండన్: బ్రిటన్ ప్రధాని రేసు తుది దశకు చేరుకుంది. లిజ్ ట్రస్, రిషి సునాక్‌లలో బోరిస్ జాన్సన్ వారసులెవరో కొద్ది రోజుల్లో తేలిపోనుంది. అయితే బ్రిటన్‌కు చెందిన బెట్టింగ్ సంస్థ స్మార్కెట్స్ మాత్రం తదుపరి ప్రధాని లిజ్ ట్రస్ కావడం దాదాపు ఖాయం అని చెబుతోంది. టోరీ పార్టీ సభ్యుల్లో ఎక్కువ మంది ఆమెకే మద్దతుగా నిలుస్తారని పేర్కొంది. రిషి కంటే ట్రస్‌కు ప్రధాని అయ్యే అవకాశాలు ఏకంగా 90 శాతం ఎక్కువ ఉన్నాయని చెబుతోంది. బ్రిటన్ ప్రధాని రేసులో లిజ్ ట్రస్, రిషి సునాక్ మధ్య గట్టి పోటీ ఉంటుందని తొలుత భావించారు. కన్జర్వేటివ్ పార్టీ ఎంపీల్లో ఎక్కువమంది రిషికే మద్దతుగా నిలిచినా.. పార్టీ సభ్యులు మాత్రం లిజ్ ట్రస్‌కు జై కొడుతున్నారు. కొద్ది రోజుల క్రితం ట్రస్‌కు 60శాతం, రిషికి 40 శాతం విజయావకాశాలు ఉంటాయని అంచనాలు వేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. టోరీ సభ్యులతో సమావేశాలు మొదలుపెట్టాక రిషి విజయావకాశాలు దారుణంగా 10 శాతానికి పడిపోయాయి. అయితే రేసులో తాను వెనుకబడి ఉన్నాననే విషయాన్ని రిషి సునాక్ అంగీకరించారు. అయినప్పటికీ చివరి వరకు పోరాడుతానని, ప్రతి ఓటు కోసం ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. బ్రిటన్ కొత్త ప్రధానిని ఎన్నుకునేందుకు 1.75లక్షల మంది టోరీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొననున్నారు. సెప్టెంబర్ 5న నూతన ప్రధాని ఎవరో అధికారికంగా ప్రకటిస్తారు. చదవండి: రిషి సునాక్‌కు ఇబ్బందికర ప్రశ్నలు.. ఎందుకు వెన్నుపోటు పొడిచారని అడిగిన టోరీ సభ్యులు -
బోరిస్‌కు ఎందుకు వెన్నుపోటు పొడిచారు? రిషికి ఇబ్బందికర ప్రశ్నలు
లండన్: బ్రిటన్ ప్రధాని పదవికి పోటీ పడుతున్న రిషి సునాక్, లిజ్ ట్రస్ తొలిసారి కన్జర్వేటివ్ పార్టీ సభ్యులతో నేరుగా సమావేశమయ్యారు. ఎప్పటిలాగే ఆర్థికవ్యవస్థ, జీవన వ్యయం వంటి అంశాలపైనే ఇద్దరు తమ విధానాల గురించి వివరించారు. నార్త్ యార్క్‌షైర్ లీడ్స్‌లో వేదికగా జరిగిన ఈ కర్యక్రమంలో టోరీ సభ్యుల నుంచి రిషి సునాక్‌కు ఇబ్బందికర ప్రశ్నలు ఎదురయ్యాయి. వారంతా ప్రధాని బోరిస్ జాన్సన్ పట్ల తమ విధేయతను చాటుకుంటూ రిషిని ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు సంధించారు. దానికి ఆయన కూడా తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. 'మీరు మంచి సేల్స్‌మన్, బలమైన వ్యక్తి. కష్ట సమయంలో స్థిరంగా పాలన సాగించిన బోరిస్‌కు అందరూ మద్దతుగా నిలిచారు. కానీ మీరు మాత్రం వెన్నుపోటు పొడిచారని చాలా మంది అనుకుంటున్నారు. మిమ్మల్ని సీనియర్ పొలిటీషియన్‌ను చేసింది బోరిసే' అని ఓ టోరీ సభ్యుడు రిషి సునాక్‌ను ప్రశ్నించారు. అయితే రిషి ఈ ప్రశ్నకు స్పందిస్తూ.. గత్యంతరం లేకే తాను ఆర్థికమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు వివరించారు. కరోనా కష్ట సమయంలో ఆర్థిక విధానాలపై ఇద్దరి మధ్య విభేదాలు వచ్చినందుకే అలా చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. అలాగే తాను అధికారంలోకి వస్తే పన్ను రాయితీ ఇస్తానని ప్రకటించిన లిజ్ ట్రస్ ఆర్థిక విధానాలపైనా రిషి విమర్శలు గుప్పించారు. తాత్కాలిక ఉపశమనం కోసం పన్నుల్లో కోత విధించి తర్వాతి తరాల పిల్లల భవిష్యత్తును తాకట్టుపెట్టలేనని స్పష్టం చేశారు. చదవండి: లైవ్ ప్రోగ్రామ్‌లో కుప్పకూలిన యాంకర్.. సాయం చేసిన రిషి సునాక్ -
సీన్ రివర్స్.. బ్రిటన్ ప్రధాని రేసులో రిషి సునాక్‌ను వెనక్కినెట్టిన ట్రస్!
లండన్: బ్రిటన్ ప్రధాని రేసులో మొదటి ఐదు రౌండ్లలో రిషి సునాక్ తిరుగులేని విజయం సాధించిన విషయం తెలిసిందే. అత్యధికంగా 137 మంది కన్జర్వేటివ్ పార్టీ ఎంపీలు ఆయనకే మద్దతుగా నిలిచారు. దీంతో రిషి సునాక్ ప్రధాని అవ్వడం ఖాయం అని అంతా భావించారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయినట్లు బ్రిటన్ 'యూగోవ్' సంస్థ సర్వే చెబుతోంది. ఇది బ్రిటన్‌లో ప్రముఖ ఇంటర్నెట్ మార్కెట్ రీసెర్చ్, ఎనలిటిక్స్ సంస్థ. కన్జర్వేటివ్ పార్టీ (టోరీ) సభ్యులు రిషి, లిజ్ ట్రస్‌లలో ఎవరికి మద్దతుగా ఉన్నారు అనే విషయంపై యూగోవ్ బుధ, గురువారాల్లో సర్వే నిర్వహించింది. ఇందులో 730 మంది టోరీ సభ్యులు పాల్గొనగా.. 62 శాతం మంది లిజ్ ట్రస్‌కే తమ ఓటు అని చెప్పారు. 38 శాతం మంది రిషి సునాక్‌కు మద్దతుగా నిలిచారు. సర్వేల్లో గతవారం వరకు రిషి సునాక్‌పై 19 శాతం పాయింట్లు లీడ్ సాధించిన ట్రస్ ఇప్పుడు 24శాతం పాయింట్ల లీడ్‌కు ఎగబాకడం గమనార్హం. దీంతో కన్జర్వేటివ్ పార్టీలో ఎక్కువ మంది ఎంపీలు రిషికి మద్దతుగా నిలిచినప్పటికీ.. పార్టీ సభ్యుల్లో మాత్రం ట్రస్‌కే ఎక్కువ ఆదరణ ఉన్నట్లు స్పష్టమవుతోంది. పార్టీలో ఆమెకు మంచి గుర్తింపు ఉండటమే ఇందుకు కారణం. అంతేగాక కొద్ది రోజుల్లో సమ్మర్ క్యాంపెయిన్ ప్రారంభవుతుంది. రిషి, ట్రస్ టోరీ సభ్యులను కలిసి తమకు మద్దతు తెలపాలని జోరుగా ప్రచారం నిర్వహించనున్నారు. ఆ తర్వాత ట్రస్‌కు లభించే మద్దతు ఇంకా పెరుగుతుందని సర్వేలు అంచనా వేస్తున్నాయి. బ్రిటన్‌లోని బెట్టింగ్ రాయుళ్లు కూడా ట్రసే తమ ఫేవరెట్ అంటున్నారు. బ్రిటన్ తదుపరి ప్రధానిని ఎన్నుకునేందుకు కన్జర్వేటివ్ పార్టీ సభ్యుల బ్యాలెట్ ఓటింగ్ ఆగస్టు 4 నుంచి సెప్టెంబర్ 5 వరకు జరగనుంది. 1.60 లక్ష మందికిపైగా ఈ ఓటింగ్‌లో పాల్గొంటారని అంచనా. మహిళలు, పురుషులతో పాటు బ్రెగ్జిట్‌కు అనుకూలంగా ఓటు వేసే వారిలో మెజార్టీ ఓటర్లు లిజ్ ట్రస్‌కే జై కొడుతున్నట్లు స్కై న్యూస్ సర్వే తెలిపింది. బ్రిటన్ ప్రధాని రేసులో భాగంగా జరిగిన ఐదో రౌండ్ ఓటింగ్‌లో రిషికి 137 మంది ఎంపీలు ఓటు వేయగా.. ట్రస్‌కు 113 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ టోరీ సభ్యుల విషయానికి వచ్చేసరికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చదవండి: రష్యాను చావుదెబ్బ కొట్టేందుకు ఉక్రెయిన్‌కు గోల్డెన్ ఛాన్స్!