Underdogs Do Not Give Up, Keep Fighting Says Rishi Sunak In His Campaign Video - Sakshi
Sakshi News home page

అండర్‌డాగ్స్‌ ఓటమికి వెన్నుచూపరు.. ప్రతీ ఓటు కోసం చివరిదాకా పోరు

Published Mon, Aug 22 2022 7:53 AM | Last Updated on Mon, Aug 22 2022 8:11 AM

Underdogs Do Not Give up Keep Fighting Says Rishi Sunak - Sakshi

లండన్‌: అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నేత ఎన్నికకు మరో రెండు వారాల గడువే ఉండటం, ప్రధాన ప్రత్యర్థి లిజ్‌ ట్రస్‌ కంటే వెనుకబడి ఉన్న నేపథ్యంలో రిషి సునాక్‌ వర్గం కొత్త తరహా ప్రచారాన్ని ప్రకటించింది. శుక్రవారం రాత్రి మాంచెస్టర్‌లో జరిగిన ప్రచార కార్యక్రమంలో రిషి పాల్గొన్నారు.

‘చివరి రోజు వరకు ప్రతి ఓటు కోసం పోరాటం కొనసాగిస్తూనే ఉంటా’అంటూ రిషి సునాక్‌ ట్వీట్‌ చేస్తూ మాంచెస్టర్‌ ప్రచార వీడియోను విడుదల చేశారు. అందులో ‘అండర్‌ డాగ్‌తో జాగ్రత్త అంటున్నారు. ఎందుకంటే ఓటమి అంచున ఉన్న వాళ్లు పోగొట్టుకునేదేమీ ఉండదు. ఉన్న ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటారు. 

వారు కష్టపడి పని చేస్తారు, ఎక్కువసేపు ఉంటారు, తెలివిగా ఆలోచిస్తారు. అండర్ డాగ్‌లు అవకాశాన్ని వదులుకోరు. కష్టపడి పని చేస్తూ..  ఎప్పుడూ ఆత్మసంతృప్తి చెందరు’’ అని వాయస్‌ ఓవర్‌ వినిపిస్తుంటుంది ఆ వీడియోలో.

ఇదీ చదవండి: రిషి గెలుపు కోసం.. ప్రవాసుల ప్రయత్నాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement