
ఓటు వేసేందుకు వస్తున్న జాన్సన్, కార్బిన్
లండన్: బ్రిటన్ ప్రతినిధుల సభకు గురువారం ఎన్నికలు జరిగాయి. ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంగ్లండ్, వేల్స్, స్కాట్లాండ్‌ల్లోని మొత్తం 650 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 3,322 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం ఏడు గంటల నుంచే పోలింగ్ ప్రారంభం కాగా, అప్పటి నుంచే ఓటర్లు పోలింగ్ బూత్‌ల ముందు బారులు తీరారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, ప్రతిపక్ష నేత జెరెమి కార్బిన్ ఉదయమే ఓటేశారు.
బ్రిటన్‌లో డిసెంబర్ నెలలో సార్వత్రిక ఎన్నికలు జరగడం దాదాపు ఒక శతాబ్దం అనంతరం ఇదే తొలిసారి. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదని, హంగ్ పార్లమెంట్ ఏర్పడనుందని ప్రీ పోల్ సర్వేలు వెల్లడించాయి. పోలింగ్ ముగియగానే కౌంటింగ్ ప్రారంభమైంది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయానికి ఫలితాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. 2017లో జరిగిన ఎన్నికల్లో భారతీయ సంతతికి చెందిన 12 మంది విజయం సాధించారు. ఈ సారి ఆ సంఖ్య మరింత పెరగొచ్చని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment