లండన్: బ్రిటన్ లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీ త్రుటిలో చావు దెబ్బ తప్పించుకుంది. మొత్తం మూడు స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఒక్క సీటు గెలుచుకుని మిగిలిన రెండు చోట్ల ఓటమిపాలైంది. అసలే సార్వత్రిక ఎన్నికల్లో సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల ఫలితాలు చాలా కీలకంగా నిలిచాయి.
మొత్తం మూడు స్థానాలకుగాను జరిగిన ఉప ఎన్నికల్లో రెండు స్థానాల్లో రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ ఓటమిపాలైంది. ఇంగ్లాండ్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ స్థానాన్ని మాత్రం స్వల్ప మెజారిటీతో తిరిగి దక్కించుకుంది. ఒకవేళ ఆ స్థానాన్ని కూడా కోల్పోయి ఉంటే ఒకే రోజు మూడు సీట్లు కోల్పోయిన ప్రధానిగా రిషి సునాక్ చరిత్రలో నిలిచిపోయేవారు.
అదృష్టవశాత్తు ఉక్స్ రిడ్జ్, సౌత్ రూస్లిప్ పరిధిలోని వెస్ట్ లండన్ లో గెలిచి ఆయన ఈ ఘోర అవమానం నుండి తప్పించుకున్నారు. మిగిలిన రెండు స్థానాల్లో సోమర్టన్, ఫ్రోమ్ సీట్ లో 19 వేలు, సెల్బీ.ఎయిన్స్టీ నియోజకవర్గంలో 20 వేలు మెజార్టీతో లేబర్ పార్టీ చేతిలో ఓడిపోయింది కన్జర్వేటివ్ పార్టీ.
సెల్బీ, ఎయిన్స్టీలో గెలిచిన అభ్యర్థి కెయిర్ మాథెర్(25) మాట్లాడుతూ.. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరికి ఇక్కడివారు అసంతృప్తితో ఇచ్చిన తీర్పు ఇదని అన్నారు. సోమర్టన్, ఫ్రోమ్ లో గెలిచిన లేబర్ పార్టీ అభ్యర్థి సారా డైక్ మాట్లాడుతూ.. ఇది చారిత్రిక విజయం. ఈ ప్రభుత్వం చేతకానితనంతో సర్కస్ చేస్తోందని ప్రజలకు అర్ధమైపోయిందన్నారు.
అసలే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఉపఎన్నికల ఫలితాలు రిషి సునాక్ ప్రభుత్వానికి డేంజర్ బెల్స్ గా మారాయి. గతేడాది మార్చ్ నుంచి జరిగిన ఉప ఎన్నికల్లో ఆరు స్థానాలను లేబర్ పార్టీ గెలుచుకోవడం ఆందోళనకరమని చెబుతున్నాయి కన్జర్వేటివ్ పార్టీ వర్గాలు. గడిచిన 15 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా వడ్డీ రేట్లు పెరగడంతో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అందుకే జనం ప్రభుత్వ విధానాలపై కొంత అసంతృప్తితో ఉన్నారని చెబుతున్నారు స్థానికులు.
ఇది కూడా చదవండి: 40 ఏళ్లుగా ప్రధాని.. మళ్ళీ ఆయనే..
Comments
Please login to add a commentAdd a comment