దాంట్లో ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి హస్తం ఉంది: యూకే మాజీ ప్రధాని.. | Boris Johnson believed Narayana Murthy was helping Rishi Sunak to become UK PM | Sakshi
Sakshi News home page

దాంట్లో ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి హస్తం ఉంది: యూకే మాజీ ప్రధాని..

Sep 16 2023 10:23 PM | Updated on Sep 17 2023 12:47 PM

Boris Johnson believed Narayana Murthy was helping Rishi Sunak to become UK PM - Sakshi

రిషి సునక్‌ (Rishi Sunak) యూకే ప్రధాన మంత్రి కావడంలో భారతీయ బిలియనీర్‌, ఇన్ఫోసిస్‌ ఫౌండర్‌ నారాయణమూర్తి (Narayana Murthy) పాత్ర ఉందని ఆ దేశ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ (Boris Johnson) నమ్ముతున్నారని ఇటీవల విడుదలైన ఓ పుస్తకంలో పేర్కొన్నారు. 

'ది రైట్ టు రూల్' అనే ఈ పుస్తకాన్ని ది టెలిగ్రాఫ్‌ వార్తాపత్రికకి పొలిటికల్ ఎడిటర్ అయిన బెన్ రిలే-స్మిత్ రచించారు. మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు సంబంధించిన పలు విషయాలను ఇందులో ప్రస్తావించారు. 

పార్టీగేట్ కుంభకోణం గురించి స్యూ గ్రే ప్రాథమిక దర్యాప్తు ఫలితాలు ప్రధాని జాన్సన్ తన అధికారిక నివాసంలో పార్టీలకు ఆతిథ్యం ఇవ్వడానికి కోవిడ్ ఆంక్షలను ఉల్లంఘించినట్లు ఆరోపించినప్పుడు 2023 ఫిబ్రవరి కంటే ముందే రిషి సునక్ తన ప్రధాని పదవి కోసం రంగం సిద్ధం చేయడం ప్రారంభించాడని రచయిత పుస్తకంలో పేర్కొన్నారు. 

(Unemployment Fraud: వామ్మో రూ. 11 లక్షల కోట్లా..? అత్యంత భారీ నిరుద్యోగ మోసమిది!)

బోరిస్ జాన్సన్ రాజకీయ కుట్రలను నమ్మేవారని 'ది రైట్ టు రూల్' పుస్తకం పేర్కొంది. బోరిస్‌ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు ముఖ్య సలహాదారుగా పనిచేసిన బ్రిటిష్ రాజకీయ వ్యూహకర్తను ప్రస్తావిస్తూ, "సునక్ మామ, భారతీయ బిలియనీర్ నారాయణ మూర్తి.. డొమినిక్ కమ్మింగ్స్‌ను తన పక్కన పెట్టుకున్నట్లు పుకారును బోరిస్‌ వినిపించేవారని పుస్తకంలో రాశారు.

పార్టీగేట్ తిరుగుబాటు కాలంలో కమ్మింగ్స్ డౌనింగ్ స్ట్రీట్‌లో ఎలాంటి అధికారిక పాత్రను పోషించలేదు. 2020 నవంబర్‌లోనే ఆయన రాజీనామా చేశారు. జాన్సన్ తన మాజీ రాజకీయ సహాయకుడు, అతనితో విభేదాలు ఉన్నందున, ఇప్పుడు సునక్ రాజకీయ అదృష్టాన్ని పెంచడానికి కృషి చేస్తున్నాడని నమ్మినట్లుగా పుస్తకంలో రాసుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement