లండన్: తనని పదవి నుంచి తొలగిస్తే యూరోపియన్ యూనియన్(ఈయూ)తో బ్రెగ్జిట్ చర్చలు క్లిష్టతరమవుతాయని బ్రిటన్ ప్రధాని థెరిసా మే తన పార్టీ ఎంపీలను హెచ్చరించారు. భవిష్యత్‌లో బ్రిటన్–ఈయూ సంబంధాలపై కూడా ప్రభావం పడుతుందని పేర్కొన్నారు. ఈయూ నుంచి బ్రిటన్ నిష్క్రమించేందుకు కుదుర్చుకున్న ఒప్పందం ముసాయిదా విషయంలో ప్రధానితో అధికార కన్జర్వేటివ్ ఎంపీలు పలువురు విభేదించిన సంగతి తెలిసిందే. వచ్చే వారం రోజులు బ్రిటన్‌కు కీలకమని, ఈయూ నాయకులతో సమావేశమై మరిన్ని చర్చలు జరుపుతానని చెప్పారు. అవిశ్వాస తీర్మానానికి అవసరమైన 48 మంది సభ్యుల మద్దతును రెబెల్ ఎంపీలు కూడగట్టారా? అని ప్రశ్నించగా..ఇప్పటి వరకైతే లేదని బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment